new movie
-
మ్యాడ్ లాంటి సినిమాలు ఆరోగ్యానికి మంచిది- నాగచైతన్య
‘మ్యాడ్ స్క్వేర్’ మూవీ ట్రైలర్ బాగుంది. నేను ‘మ్యాడ్’ సినిమాలోని కామెడీ సీన్స్ చూస్తూ ఒత్తిడిని దూరం చేసుకుంటుంటాను. ఇలాంటి సినిమాలు ఆరోగ్యానికి చాలా మంచిది. డల్‌గా ఉన్నప్పుడు ‘మ్యాడ్’ లాంటి సినిమా చూడమని డాక్టర్లు కూడా సూచించాలనేది నా అభిప్రాయం’’ అని హీరో అక్కినేని నాగచైతన్య చెప్పారు. నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ హీరోలుగా నటించిన చిత్రం ‘మ్యాడ్ స్క్వేర్’. కల్యాణ్ శంకర్ దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ సమర్పణలో హారిక సూర్యదేవర, సాయి సౌజన్య నిర్మించిన ఈ చిత్రం నేడు రిలీజ్ అవుతోంది. హైదరాబాద్‌లో నిర్వహించిన ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి ముఖ్య అతిథిగా హాజరైన అక్కినేని నాగచైతన్య మాట్లాడుతూ– ‘‘మ్యాడ్ స్క్వేర్’ లాంటి సినిమాలు ఫ్రెండ్స్, ఫ్యామిలీతో కలిసి సరదాగా గడిపేలా చేస్తాయి. ఫ్రెండ్షిప్ని స్ట్రాంగ్ చేస్తాయి. కొత్త ఫ్రెండ్స్‌ని పరిచయం చేస్తాయి. కామెడీ చేయడం అనేది చాలా కష్టం. నార్నే నితిన్, రామ్, సంగీత్‌లలో ఆ టాలెంట్ ఉంది కాబట్టే ఇంత నవ్వించగలిగారు. నాగవంశీ, నా ప్రయాణం ‘ప్రేమమ్’ సినిమాతో మొదలైంది. దర్శకులకు, నటులకు ఎంతో ధైర్యాన్నిస్తూ వరుస విజయాలు అందుకుంటున్నారు వంశీ. ఈ మూవీ బ్లాక్ బస్టర్ అవుతుంది. ‘మ్యాడ్ 2’ మాత్రమే కాదు.. ‘మ్యాడ్ 100’ కూడా రావాలని కోరుకుంటున్నాను’’ అన్నారు. -
వేసవిలో సోదరా
సంపూర్ణేష్ బాబు, సంజోష్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘సోదరా’. ప్రాచీ బంసాల్, ఆరతి గుప్తా, బాబా భాస్కర్ ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. మోహన్ మేనంపల్లి దర్శకత్వంలో చంద్ర చగంలా నిర్మించారు. ఈ సినిమాను ఏప్రిల్ 11న విడుదల చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఈ సందర్భంగా మోహన్ మాట్లాడుతూ– ‘‘అన్నదమ్ముల అనుబంధం ఎంత గొప్పదో అందరికీ తెలుసు. అలాంటి అన్నదమ్ముల అనుబంధాన్ని వెండితెరపై ఆవిష్కరించనున్న సినిమాయే ‘సోదరా’. ఈ వేసవికి ఈ సినిమా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. ‘‘సంపూర్ణేష్‌బాబు నుంచి ప్రేక్షకులు ఆశిస్తున్న ఎంటర్టైన్మెంట్తో పాటు ఆయనలోని మరో కోణాన్ని ప్రేక్షకులు ఈ చిత్రంలో చూడబోతున్నారు’’ అని తెలిపారు చంద్ర చగంలా. ఈ సినిమాకు సంగీతం: సునీల్ కశ్యప్. -
రెట్టింపు వినోదంతో...
‘‘మ్యాడ్ స్క్వేర్’ సినిమా చాలా బాగా వచ్చింది. ప్రేక్షకులు మనస్ఫూర్తిగా నవ్వుకుంటారు. థియేటర్స్‌కి వచ్చిన ప్రతి ఒక్కరూ తాము టిక్కెట్ కోసం పెట్టిన ప్రతి రూపాయికి న్యాయం జరిగిందని భావిస్తారు’’ అని నిర్మాత సూర్యదేవర నాగవంశీ పేర్కొన్నారు. నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ హీరోలుగా నటించిన చిత్రం ‘మ్యాడ్ స్క్వేర్’. కల్యాణ్ శంకర్ దర్శకత్వం వహించారు. సూర్యదేవర నాగవంశీ సమర్పణలో హారిక సూర్యదేవర, సాయి సౌజన్య నిర్మించిన ఈ చిత్రం రేపు (శుక్రవారం) రిలీజ్ కానుంది. బుధవారం నిర్వహించిన ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో హారిక సూర్యదేవర మాట్లాడుతూ– ‘‘కుటుంబమంతా కలిసి చూడదగ్గ చిత్రమిది’’ అన్నారు. నార్నే నితిన్ మాట్లాడుతూ– ‘‘మ్యాడ్’ సినిమాని ఆదరించిన ప్రేక్షకులకు రుణపడి ఉంటాం. ఇప్పుడు ‘మ్యాడ్ స్క్వేర్’లో వినోదం రెట్టింపు ఉంటుంది. చూసి ఆనందించండి’’ అని తెలిపారు. ‘‘మా ట్రైలర్ అందరికీ నచ్చిందనుకుంటున్నాం. సినిమా కూడా కచ్చితంగా నచ్చుతుంది’’ అన్నారు సంగీత్ శోభన్, రామ్ నితిన్. -
ఫస్ట్ బాలీవుడ్ సినిమా 'జాట్' ట్రైలర్ విడుదల
-
అజిత్ నీ డైరెక్ట్ చేయబోతున్న ధనుష్
-
అల్లు అర్జున్.. హీరో కమ్ విలన్!?
అల్లు అర్జున్.. తమిళ దర్శకుడు అట్లీతో చేయడం దాదాపు ఖరారైపోయింది. ఎప్పుడు అధికారికంగా ప్రకటించనున్నారనేది కూడా రూమర్స్ వచ్చేస్తున్నాయి. అలానే స్టోరీ గురించి చిన్న హింట్ తో పాటు రెమ్యునరేషన్ డీటైల్స్ కూడా కొన్ని వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఏంటి విషయం?(ఇదీ చదవండి: అమ్మ చివరి కోరిక.. కొత్త ఇంట్లోకి తెలుగు యంగ్ హీరో)'పుష్ప 2' తర్వాత లెక్క ప్రకారం త్రివిక్రమ్ తో బన్నీ మూవీ చేయాలి. కానీ ఇది భారీ బడ్జెట్ తో తీసే మైథలాజికల్ కావడంతో ప్రీ ప్రొడక్షన్ కే చాలా సమయం పట్టే అవకాశముంది. దీంతో ఈ గ్యాప్ లో మరో మూవీ చేయాలని బన్నీ అనుకున్నాడట. ఈ క్రమంలోనే అట్లీ లైనులోకి వచ్చాడు. ఈ ప్రాజెక్టుని బన్నీ పుట్టినరోజు అంటే ఏప్రిల్ 8న అధికారికంగా ప్రకటించనున్నారట.మరోవైపు ఈ సినిమాలో అల్లు అర్జున్.. హీరో కమ్ విలన్ గా ద్విపాత్రాభినయం చేయబోతున్నాడని తెలుస్తోంది. అంటే అటు హీరోయిక్ ఎలివేషన్లతో పాటు విలన్ గానూ రచ్చ చేస్తాడేమో. ఇకపోతే ఈ మూవీ చేస్తున్నందుకు గానూ రూ.175 కోట్ల రెమ్యునరేషన్ తో పాటు లాభాల్లో 20 శాతం వాటా కూడా తీసుకోబోతున్నాడని అంటున్నారు. మరి వీటిలో నిజమెంతో తెలియాల్సి ఉంది.(ఇదీ చదవండి: 'గేమ్ ఛేంజర్'.. ఇప్పటికీ తెగని పంచాయితీ!) -
నిర్మాతగా సమంత తొలి సినిమా.. ఫోటోలు షేర్ చేసిన సామ్
-
ప్రభాస్ నెక్స్ట్ మూవీ కి కూడా ఆ డైరెక్టరే ?
-
కన్ఫ్యూజ్ చేస్తున్న రామ్ చరణ్?
-
చిరుకు జోడీగా హైదరాబాద్ బ్యూటీ ?
-
గురూజీని పక్కన పెట్టిన బన్నీ..! కన్ ఫ్యూజన్ లో త్రివిక్రమ్
-
యుద్ధం ఆరంభం
నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా, విజయశాంతి మరో ప్రధాన పాత్రలో నటిస్తున్న యాక్షన్–ప్యాక్డ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకాలపై అశోక్ వర్ధన్ ము΄్పా, సునీల్ బలుసు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ మూవీలో అర్జున్ పాత్రలో కల్యాణ్ రామ్, వైజయంతి పాత్రలో విజయశాంతి నటిస్తున్నారని తెలుస్తోంది. కాగా ‘అర్జున్ బ్యాటిల్ బిగిన్స్’ అంటూ ఈ నెల 14న ఈ సినిమా ప్రీ టీజర్‌ను రిలీజ్ చేస్తున్నట్లుగా మేకర్స్ ప్రకటించి, కల్యాణ్‌రామ్ కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ‘‘టాకీ పార్టు పూర్తయింది. మిగిలిన షూట్ కూడా పూర్తయ్యాక రిలీజ్ డేట్‌ని అనౌన్స్ చేస్తాం’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. కాగా ఇది తల్లీకొడుకుల బలమైన భావోద్వేగాల నేపథ్యంలో సాగే యాక్షన్ ఫిల్మ్ అని తెలుస్తోంది. సోహైల్ ఖాన్, సయీ మంజ్రేకర్, శ్రీకాంత్, ‘యానిమల్’ ఫేమ్ పృథ్వీరాజ్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు సంగీతం: అజనీష్ లోక్‌నాథ్. -
తారక్ బాటలో ప్రభాస్
-
మళ్లీ దిల్ - డీజే కాంబో
-
ఫిదా 2 లో నాని..!
-
చెర్రీ బర్త్‌డేకి బిగ్ ట్రీట్ రెడీ..! ఫ్యాన్స్ కి పండగే ఇక..!
-
శ్రీలీల బాలీవుడ్ ఎంట్రీ.. హీరోగా ఎవరంటే?
-
డార్లింగ్ కు జోడీగా సాయి పల్లవి..?
-
'పరాశక్తి' కోసం పోటీ పడుతున్న ఇద్దరు హీరోలు
శివ కార్తికేయన్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రానికి ‘పరాశక్తి’ అనే టైటిల్ ఖరారు చేశారు. మరోవైపు విజయ్ ఆంటోనీ హీరోగా నటించిన సినిమాకి కూడా ‘పరాశక్తి’ టైటిల్ ఖరారు చేయడం విశేషం. శివ కార్తికేయన్ హీరోగా రూపొందుతోన్న ‘పరాశక్తి’కి సుధ కొంగర దర్శకత్వం వహిస్తున్నారు. రవి మోహన్, అథర్వ, శ్రీలీల ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఆకాశ్ భాస్కరణ్ నిర్మిస్తున్న ఈ సినిమా తెలుగు టీజర్‌ని విడుదల చేశారు. ‘సైన్యమై కదిలిరా... పెను సైన్యమై కదిలిరా...’ అంటూ శివ కార్తికేయన్ చెప్పే డైలాగులు టీజర్లో ఉన్నాయి. ఈ సినిమాలో ఆయన విద్యార్థి సంఘం నాయకుడుగా కనిపించనున్నారని తెలుస్తోంది. → విజయ్ ఆంటోనీ హీరోగా నటించిన ‘పరాశక్తి’ చిత్రానికి అరుణ్ ప్రభు దర్శకత్వం వహించారు. మీరా విజయ్ ఆంటోనీ సమర్పణలో విజయ్ ఆంటోనీ ఫిల్మ్స్ కార్పొరేషన్ పై ‘పరాశక్తి’రూపొందింది. ప్రస్తుతం పోస్ట్‌ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా వేసవిలో విడుదల కానుంది. ‘‘విభిన్నమైన కథతో రూపొందిన ఈ సినిమా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచుతుంది’’ అని చిత్రబృందం పేర్కొంది. -
‘ప్రేమంటే?’ సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)
-
ఏకంగా కరణ్ జోహర్ బ్యానర్ లో సినిమా..
-
కొంచెం క్రాక్
‘డీజే టిల్లు, టిల్లు స్క్వేర్’ వంటి హిట్ చిత్రాల తర్వాత సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం ‘జాక్ – కొంచెం క్రాక్’. ‘బొమ్మరిల్లు’ మూవీ ఫేమ్ భాస్కర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ‘బేబి’ మూవీ ఫేమ్ వైష్ణవీ చైతన్య హీరోయిన్గా నటిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 10న విడుదల కానుంది. కాగా నూతన సంవత్సరం సందర్భంగా ఈ చిత్రం కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ‘‘సరికొత్త జోనర్లో ‘జాక్– కొంచెం క్రాక్’ మూవీ రూపొందుతోంది. ఫన్ రైడర్‌లా అందర్నీ మెప్పించే కథాంశంతో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. క్రాక్గాడిగా కనిపించే జాక్ పాత్రలో సిద్ధు జొన్నలగడ్డ ప్రేక్షకులను మెప్పించటం ఖాయం. ఈ సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: అచ్చు రాజమణి. -
New Year 2025 : న్యూ ఇయర్ విషెస్ సినీ పోస్టర్స్ (ఫోటోలు)
-
అమీర్ ఖాన్ తో టాలీవుడ్ డైరెక్టర్.. ఫిక్స్ అయినట్లేనా?
-
ఫాన్స్ షాక్ ఇచ్చిన పూజ హెగ్డే.. సూర్యతో డీ గ్లామర్ లుక్
-
నవీన్ తో జోడి కడుతున్న మీనాక్షి..
-
ఆటిట్యూడ్ స్టార్ కొత్త సినిమా.. రిలీజైన టీజర్
ఆటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ కొత్త సినిమా 'బరాబర్ ప్రేమిస్తా'. సంపత్ రుద్ర దర్శకత్వం వహించిన ఈ చిత్ర టీజర్‌ని తాజాగా రిలీజ్ చేశారు. ప్రముఖ దర్శకుడు వివి వినాయక్ చేతుల మీదుగా దీన్ని లాంచ్ చేశారు. గెడా చందు, గాయత్రి చిన్ని, ఎవిఆర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మిస్ ఇండియా ఫైనలిస్ట్ మేఘనా ముఖర్జీ హీరోయిన్గా నటిస్తోంది. త్వరలోనే సినిమాని థియేటర్లలో రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు.(ఇదీ చదవండి: పెళ్లి చేసుకున్న 'బిగ్‌బాస్ 8' సోనియా.. ఫొటోలు వైరల్)తెలంగాణలోని రుద్రారం అనే ఊరి నేపథ్యంగా సినిమా ఉండనుంది. పరస్పరం గొడవలు పడే ఊరిలో లవ్ స్టోరీని చూపించబోతున్నట్లు టీజర్ చూస్తే అర్థమవుతోంది. లవ్, యాక్షన్, ఎమోషనల్ ఎలిమెంట్స్ ఉన్నాయి. నా రీసెంట్ మూవీ రామ్ నగర్ బన్నీ ఆడియెన్స్ కు బాగా రీచ్ అయ్యింది. నేను నా నెక్ట్స్ మూవీ ఎలా ఉండాలని అనుకున్నానో అలాంటి సినిమా 'బరాబర్ ప్రేమిస్తా'. దీనికి మీ సపోర్ట్ ఉండాలని కోరుకుంటున్నా అని చంద్రహాస్ చెప్పాడు.(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 22 సినిమాలు) -
సుమ కనకాల తనయుడి కొత్త చిత్రం.. హీరోయిన్ ఎవరో తెలుసా? (ఫొటోలు)
-
అనూహ్య మలుపులతో.. ఇరవిల్ విళిగల్
తమిళసినిమా: సైకో థ్రిల్లర్ కథా చిత్రాలు ఇప్పటికే చాలా వచ్చాయి. అయినప్పటికీ ఆ తరహా చిత్రాలకు ప్రేక్షకుల ఆదరణ లభిస్తూ నే ఉంటుంది. ఆ తరహాలో రూపొందుతున్న మరో చిత్రం ఇరవిల్ విళిగల్. జాతీయ ఉత్తమ నటి అవార్డు గ్రహీత రీమా రే ప్రధాన పాత్రను పోషిస్తున్న ఈ చిత్రంలో మహేంద్ర కథానాయకుడిగా నటిస్తున్నారు. ఈమె బంగారా అనే కన్నడ చిత్రంలో నటించడానికి గానూ ఉత్తమ కథానాయకి అవార్డును పొందారు. దర్శకుడు సిక్కల్ రాజేష్ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. నిళల్ గల్ రవి, మస్కార అస్మిత, కుందాజ్, చరణ్ రాజ్, సిజర్ మనోహర్, ఈశ్వర్ చంద్రబాబు,కిళి రామచంద్రన్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. మహేంద్ర ఫిలిం ఫ్యాక్టరీ పతాకంపై మహేంద్ర నిర్మిస్తున్న ఈ చిత్రానికి సిక్కల్ రాజేష్ దర్శకత్వం వహిస్తున్నారు. చిత్ర వివరాలను ఆయన తెలుపుతూ ఇది సైకో థ్రిల్లర్ నేపథ్యంలో సాగే కథా చిత్రం అని చెప్పారు. సైకోగా మారడానికి ఒక్కొక్కరికి ఒక్కో వ్యక్తి గత కారణం ఉంటుందని, అలా ఈ చిత్రంలో ఒక వ్యక్తి సైకోగా మారడానికి సమాజంపై కోపం, ఒక విషయం కారణం అవుతాయన్నారు. అవేమిటన్న విషయాన్ని ఆసక్తికరంగా తెరపై ఆవిష్కరిస్తున్న చిత్రం ఇదన్నారు. చిత్ర షూటింగ్‌ను అధిక భాగం ఏర్కాడు సమీపంలోని వెళ్లిమలై ప్రాంతంలో నిర్వహించినట్లు చెప్పారు. కొంత భాగాన్ని పాండిచ్చేరి, మరక్కాణం పరిసర ప్రాంతాలలో చిత్రీకరించి మొత్తం 50 రోజుల్లో షూటింగ్‌ను పూర్తి చేసినట్లు చెప్పారు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలిపారు. దీనికి ఎంఎం.అజార్ సంగీతాన్ని, భాస్కర్ ఛాయాగ్రహణం అందిస్తున్నట్లు దర్శకుడు చెప్పారు. -
బాహుబలి సెంటిమెంట్ తో మహేష్, రాజమౌళి సినిమా..
-
శివ కార్తికేయన్ తో జోడి కట్టనున్న శ్రీలీల..
-
రెండు దశాబ్దాల తర్వాత...
మహేశ్‌బాబు హీరోగా గుణశేఖర్ దర్శకత్వం వహించిన ‘ఒక్కడు’ (2003) సినిమా సూపర్‌హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో హీరోయిన్గా నటించారు భూమిక. కాగా 20 ఏళ్ల తర్వాత మళ్లీ గుణశేఖర్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు భూమిక. ప్రస్తుతం గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘యుఫోరియా’ చిత్రంలో భూమిక ఓ పవర్ఫుల్ రోల్ చేస్తున్నారు. రాగిణి గుణ సమర్పణలో నీలిమ గుణ నిర్మిస్తున్న ఈ చిత్రం సెకండ్ షెడ్యూల్ప్రారంభమైంది. ఈ సందర్భంగా సెట్స్ నుంచి ఓ వీడియోను విడుదల చేశారు. ‘‘వైవిధ్యమైన, హిట్ సినిమాలకు పెట్టింది పేరైన గుణశేఖర్ ప్రస్తుతం యూత్‌ఫుల్ సోషల్ డ్రామాగా ‘యుఫోరియా’ను తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న దురాగతాలపై ఈ చిత్రం రూపొందుతోంది. భూమిక కోసం గుణశేఖర్ ఓ పవర్ఫుల్ పాత్రను సృష్టించారు. ఇటీవలే ఫస్ట్ షెడ్యూల్ పూర్తయింది’’ అని యూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి కెమెరా: ప్రవీణ్ కె. పోతన్, సంగీతం: కాల భైరవ. -
సూర్య @ 45
హీరో సూర్య 45వ చిత్రం బుధవారం ఉదయం పొల్లాచ్చి సమీపంలోని ఆనైమలై ప్రాంతంలో గల ప్రసిద్ధి చెందిన మాసానీ అమ్మన్ ఆలయంలో పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయ్యింది. ఇందులో నటి త్రిష హీరోయిన్గా నటించనున్నారు. నటుడు ఆర్జే బాలాజీ దర్శకత్వంలో డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై ఎస్ఆర్. ప్రకాశ్‌బాబు, ఎస్ఆర్. ప్రభు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ప్రారంభోత్సవంలో నటుడు సూర్య, దర్శకుడు ఆర్జే బాలాజీల కుటుంబ సభ్యులు, నిర్మాత ఎస్ఆర్ ప్రభు తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ఇతర వివరాలు తెలియాల్సి ఉంది.– సాక్షి, తమిళ సినిమా -
సుకుమార్ నిర్మాతగా చైతూ 'మిథికల్ థ్రిల్లర్'
నాగచైతన్య పుట్టినరోజున కొత్త సినిమాని ప్రకటించాడు. ప్రస్తుతం 'తండేల్' చేస్తున్న ఈ అక్కినేని హీరో.. ఇప్పుడు 'విరూపాక్ష' దర్శకుడితో కొత్త ప్రాజెక్ట్ చేయబోతున్నాడు. మిథికల్ థ్రిల్లర్ అంటే.. మైథలాజికల్ ప్లస్ థ్రిల్లర్ కాన్సెప్ట్ మూవీ ఇది. తాజాగా పోస్టర్ రిలీజ్ చేసి అధికారికంగా ఈ ప్రాజెక్ట్‌ని ప్రకటించారు.(ఇదీ చదవండి: భార్య పుట్టినరోజు.. ఖరీదైన కారు గిఫ్ట్ ఇచ్చిన స్టార్ హీరో అజిత్)నాగచైతన్య హీరోగా నటిస్తుండగా.. 'విరూపాక్ష' ఫేమ్ కార్తీక్ వర్మ దర్శకత్వం వహిస్తున్నాడు. సుకుమార్, బీవీఎస్ఎన్ ప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమా కోసం దాదాపు రూ.100 కోట్లకు పైగా బడ్జెట్ అనుకుంటున్నారని తెలుస్తోంది. డిసెంబర్ నుంచే షూటింగ్ మొదలుపెట్టబోతున్నారు. తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్లో ఓ కన్ను.. అందులో నాగచైతన్య పర్వతంపై నిలబడ్డ ప్రతిబింబం రావడాన్ని చూపించారు.'కాంతార', 'విరూపాక్ష', 'మంగళవారం' చిత్రాలతో పాటు 'పుష్ప 2'కి కూడా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇస్తున్న అజనీష్ లోక్‌నాథ్ ఈ థ్రిల్లర్‌కు సంగీతం అందించబోతున్నాడు. హీరోయిన్లుగా మీనాక్షిని ఎంచుకున్నారు. కానీ ఆ డీటైల్స్ త్వరలో బయటపెడతారు. అలానే మిగతా విషయాలు కూడా త్వరలో ప్రకటిస్తామని పేర్కొన్నారు.(ఇదీ చదవండి: నిశ్చితార్థం చేసుకున్న 'బిగ్‌బాస్ 8' సోనియా.. పెళ్లెప్పుడంటే?) -
గోవా ఫిల్మ్ ఫెస్టివల్లో...
జో శర్మ, సంబీత్ ఆచార్య లీడ్ రోల్స్‌లో నటించిన చిత్రం ‘ఎమ్ 4 ఎమ్’ (మోటివ్ ఫర్ మర్డర్). మోహన్ వడ్లపట్ల దర్శకత్వం వహించారు. మోహన్ మీడియా క్రియేషన్స్, జో శర్మ మెక్విన్ గ్రూప్ (యూఎస్ఏ) బ్యానర్‌పై ఈ సినిమా రూపొందింది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో రూపొందిన ఈ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రం హిందీ ట్రైలర్‌ని ఈ నెల 23న గోవా ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్లో విడుదల చేయనున్నారు. -
ఎవరు తాతా ఇతను!
సత్యరాజ్, వశిష్ట ఎన్. సింహా, సాంచి రాయ్, ‘సత్యం’ రాజేష్ లీడ్ రోల్స్‌లో నటించిన సినిమా ‘త్రిబాణధారి బార్బరిక్’. మారుతీ టీమ్ ప్రోడక్ట్ సమర్పణలో మోహన్ శ్రీవత్స దర్శకత్వంలో విజయపాల్ రెడ్డి ఆదిదల నిర్మించారు. ఈ సినిమా మోషన్ పోస్టర్ వీడియోను రిలీజ్ చేసింది చిత్రయూనిట్. ‘తాతా.. ఎవరు తాతా ఇతను’, ‘ప్రపంచం గుర్తించని గొప్ప యోధుడమ్మా..’, ‘భీష్ముడా తాతా.. కాదమ్మ...’, ‘మాధవ.. వెయ్యి ఏనుగుల బలశాలి భీముడికి మనవణ్ణి, ఘటోత్కచుడికి కొడుకుని’ వంటి డైలాగ్స్ ఈ వీడియోలో ఉన్నాయి. ఈ చిత్రానికి కెమెరా: కుశేందర్ రమేశ్ రెడ్డి, సంగీతం: ఇన్ఫ్యూషన్ బాండ్. -
అప్పుడు 'దసరా'.. ఇప్పుడు 'ది ప్యారడైజ్'
‘దసరా’ వంటి బ్లాక్‌బస్టర్ ఫిల్మ్ తర్వాత హీరో నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల, నిర్మాత సుధాకర్ చెరుకూరి కాంబినేషన్లో మరో సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు ‘ది ప్యారడైజ్’ అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లు వెల్లడించి, టైటిల్ లోగోను ‘ఎక్స్’లో షేర్ చేశారు నాని. పీరియాడికల్ పవర్ఫుల్ యాక్షన్ డ్రామాగా ఈ చిత్రం రూపుదిద్దుకోనుందని, ఇందులో సికింద్రాబాద్ కుర్రాడిగా నాని నటిస్తారని టాక్. హీరోయిన్ గా జాన్వీకపూర్ లేదా శ్రద్ధాకపూర్ నటిస్తారనే ప్రచారం ఫిల్మ్‌నగర్‌లో వినిపిస్తోంది. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. మరోవైపు నాని ‘హిట్ 3’ చిత్రం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ రాజస్థాన్ లో జరుగుతోంది. 2025 మే 1న ‘హిట్ 3’ రిలీజ్ కానుంది. View this post on Instagram A post shared by Nani (@nameisnani) -
జితేందర్ రెడ్డి మూవీ టీమ్ తో స్పెషల్ చిట్ చాట్
-
పూరితో అఖిల్ మూవీ ఫిక్స్..
-
తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో వస్తోన్న ఫీల్ గుడ్ మూవీ
తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో సరికొత్త ఫీల్ గుడ్ ఎంటర్టైనర్ రానుంది. ఈ సినిమాకు డైరెక్టర్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. మాతంగి మీడియా వర్క్స్ బ్యానర్, దీప విజయ లక్ష్మి నాయుడు క్రియేషన్స్ బ్యానర్లపై ఆకుల విజయ లక్ష్మి, సరస్వతి మౌనిక ప్రోడక్షన్ నంబర్ -1 గా నిర్మిస్తున్నారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. విజయదశమి పర్వదిన సందర్బంగా మా సినిమాను స్టార్ట్ చేయడం చాలా ఆనందంగా ఉంది. సినిమా అభిమానులతో పాటు, ఆ ఆధిపరాశక్తి దుర్గామాత అమ్మవారి ఆశీస్సులు కూడా మా చిత్ర యూనిట్‌కి దక్కుతాయని భావిస్తున్నాం అని తెలిపారు.కాగా.. ఈ సినిమాను తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిస్తున్నట్లు తెలిపారు. ఈ సినిమాలో నటీనటులు వివరాలు త్వరలో తెలియజేస్తామని మేకర్స్ వెల్లడించారు. ఈ సినిమాకు వెంకట్ గౌడ్ కథ అందించగా.. కర్రా నరేంద్ర రెడ్డి డైలాగ్స్ సమకూరుస్తున్నారు. -
దసరాకు రిలీజ్ కానున్న మూవీస్ ఇవే (ఫొటోలు)
-
బ్లాక్ బస్టర్ సీక్వెల్ కు వెంకీ గ్రీన్ సిగ్నల్..
-
టాక్సిక్ ఆగిపోయిందా..? రాకీ భాయ్ ఫ్యాన్స్ కు టెన్షన్..
-
మా మనవడ్ని ఆదరించాలని కోరుకుంటున్నాం
ప్రముఖ రచయిత పరుచూరి వెంకటేశ్వరరావు మనవడు పరుచూరి సుదర్శన్ హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘మిస్టర్ సెలెబ్రిటీ’. చందిన రవికిశోర్ దర్శకత్వంలో చిన్న రెడ్డయ్య, ఎన్.పాండు రంగారావు నిర్మించిన ఈ చిత్రం అక్టోబరు 4న విడుదల కానుంది. ఈ సందర్భంగా రిలీజ్ డేట్ పోస్టర్‌ను ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ విడుదల చేసి, మాట్లాడుతూ– ‘‘మమ్మల్ని ఆదరించినట్టుగానే మా మనవడు సుదర్శన్‌ని కూడా ఆదరించాలని కోరుకుంటున్నాను. రవికిశోర్ కొత్త దర్శకుడైనా సినిమాను బాగా తీశారు. ఈ చిత్రం అందరినీ ఆకట్టుకునేలా ఉంటుంది’’ అన్నారు. ‘‘నలభై ఏళ్లుగా మమ్మల్ని ఆదరిస్తూనే ఉన్నారు. రాజీపడకుండా నిర్మించిన నిర్మాతలను, అద్భుతంగా తెరకెక్కించిన దర్శకుడ్ని, తొలిసారి వెండితెరపై కనిపించనున్న మా మనవడ్ని ఆదరించి ఈ సినిమాకి విజయం చేకూర్చాలని కోరుకుంటున్నాను’’ అని పరుచూరి వెంకటేశ్వరరావు అన్నారు. -
సుధీర్ బాబు 'జటాధర'.. మరో ఇంట్రెస్టింగ్ లుక్
సుధీర్ బాబు హీరోగా నటిస్తూ నిర్మిస్తున్న సినిమా 'జటాధర'. గతంలో ఈ సినిమాకు సంబంధించిన లుక్ రిలీజ్ చేశారు. ఇప్పుడు మరో పోస్ట్ రిలీజ్ చేశారు. సూపర్ నేచురల్ థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో తీస్తున్న ఈ చిత్ర షూటింగ్ త్వరలో మొదలుకానుందని ప్రకటించారు.(ఇదీ చదవండి: బిగ్‌బాస్ 8: అభయ్ ఎలిమినేట్ అయ్యాడుగా.. కొత్త చీఫ్ ఎవరంటే?)వచ్చే ఏడాది శివరాత్రికి థియేటర్లలో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. పౌరాణిక, ఫాంటసీ, డ్రామా అంశాల కాంబోలో దీన్ని తెరకెక్కిస్తున్నారు. కొత్త లుక్‌లో సుధీర్ బాబు సరికొత్తగా, శక్తివంతంగా కనిపిస్తున్నాడు. ప్రేరణ అరోరా సమర్పణలో సుధీర్ బాబు ప్రొడక్షన్ బ్యానర్‌పై దీన్ని నిర్మిస్తున్నారు. ఇక సుధీర్ బాబు హీరోగా నటించిన 'మా నాన్న సూపర్ హీరో'.. అక్టోబరు 11న థియేటర్లలోకి రానుంది.(ఇదీ చదవండి: ఆలియా కూతురి విషయంలో నెరవేరిన ఎన్టీఆర్ కోరిక!) -
తగ్ లైఫ్ తో తగ్గేదేలే అంటోన్న కమల్..!
-
దసరా పండక్కి అదే బిగ్ సర్ ప్రైజ్ అంటోన్న డైరెక్టర్..!
-
కోలీవుడ్ కి బిగ్ షాక్.. విజయ్ లాస్ట్ ఫిల్మ్ లాక్..
-
ఆర్జీవీ 'శారీ' సినిమా.. క్రేజీ అప్డేట్
కాంట్రవర్సీ టాపిక్స్, నిజ జీవిత సంఘటనల ఆధారంగా సినిమాలు తీసే దర్శకుడు రాంగోపాల్ వర్మ.. ప్రస్తుతం 'శారీ' మూవీ చేస్తున్నాడు. సోషల్ మీడియాలో శ్రీలక్ష్మీ సతీశ్ అనే అమ్మాయిని చూసి ఇందులో హీరోయిన్గా ఎంచుకున్నాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేయగా.. ఇప్పుడు టీజర్ గురించి క్రేజ్ అప్డేట్ వచ్చేసింది.(ఇదీ చదవండి: హీరో ఇంట్లో పనిమనిషిగా మంత్రి కూతురు.. ఏకంగా 20 రోజులు)ఈ సినిమా టీజర్‌ని సెప్టెంబరు 15న అంటే ఆదివారం ఉదయం 11 గంటలకు రిలీజ్ చేస్తున్నట్లు ఆర్జీవీ ట్వీట్ చేశారు. అలానే ఇది ఉత్తరప్రదేశ్‌లోని శారీ కిల్లర్‌కి సంబంధించిన కథ కాదని క్లారిటీ ఇచ్చారు. కాకపోతే నిజ జీవిత సంఘటనల ఆధారంగానే తెరకెక్కించినట్లు పేర్కొన్నారు.ఇకపోతే గిరి కృష్ణ కమల్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఆర్జీవీ డెన్ పతాకంపై వర్మ సమర్పిస్తుండగా రవి వర్మ నిర్మిస్తున్నారు. నవంబరులో ఈ చిత్రాన్ని థియేటర్లలోకి తీసుకురానున్నారు.(ఇదీ చదవండి: ఓటీటీ రిలీజ్‌కి ముందే 'తంగలాన్'కి దెబ్బ)Unlike some people are speculating , SAAREE film, is not based on the SAAREE killer of U P , but it’s based on several true life incidents #RGVsSAAREE pic.twitter.com/tDjmovrPNs— Ram Gopal Varma (@RGVzoomin) September 14, 2024 -
తమిళ సినిమాల కోసం.. తన సినిమాలను వదిలేస్తున్న నాగ్..
-
బాలయ్య మూవీతో.. పూరి పంజా విసిరేనా..
-
కెరీర్ లోనే పీక్ స్టేజ్ లో నాని..
-
మహేష్, రాజమౌళి మూవీ టైటిల్ ఇదే..?
-
శివాజీ-లయ.. చాన్నాళ్ల తర్వాత మళ్లీ జంటగా
అప్పట్లో సినిమాలు చేసి పూర్తిగా టాలీవుడ్‌కి దూరమైపోయిన శివాజీ.. బిగ్‌బాస్ గత సీజన్లో పాల్గొని గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ మధ్య ఓ వెబ్ సిరీస్‌తో నటుడిగా కమ్ బ్యాక్ ఇచ్చాడు. ప్రస్తుతం తనే నిర్మాతగా మారి ఓ సినిమా చేస్తున్నాడు. క్రైమ్ కామెడీ థ్రిల్లర్ కథతో తీస్తున్నారు. ఇందులో శివాజీకి జోడిగా లయ నటిస్తోంది. తాజాగా ఈ చిత్రం పూజతో లాంఛనంగా ప్రారంభమైంది.(ఇదీ చదవండి: చిరంజీవి సినిమాని శ్రీలీల రిజెక్ట్ చేసిందా?)హైదరాబాద్‌లో జరిగిన ఈ సినిమా ప్రారంభోత్సవానికి దిల్ రాజు, బోయపాటి శ్రీను, నిర్మాత బెక్కం వేణు గోపాల్ తదితరులు హాజరయ్యారు. ఇకపోతే ఈ సినిమాతో సుధీర్ శ్రీరామ్ అనే కుర్రాడు దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు.గతంలో శివాజీ, లయ జంటగా పలు తెలుగు సినిమాల్లో హీరోహీరోయిన్లుగా చేశారు. 'మిస్సమ్మ', 'టాటా బిర్లా మధ్యలో లైలా', 'అదిరిందయ్యా చంద్రం' తదితర మూవీస్ ప్రేక్షకుల్ని అలరించాయి. మళ్లీ ఇన్నాళ్ల తర్వాత ఈ కాంబోలో సినిమా రావడం విశేషం. ఈ నెల 20 నుంచి షూటింగ్ ప్రారంభించబోతున్నారు. త్వరలో మిగతా వివరాలు వెల్లడిస్తారు.(ఇదీ చదవండి: అస్వస్థత.. ఆస్పత్రిలో చేరిన హీరో మోహన్ లాల్!) -
వామ్మో ప్రభాస్ కొత్త సినిమా.. హీరోయిన్ మాములుగా లేదుగా..
-
ప్రభాస్‌కు జోడీగా ఈ ముద్దుగుమ్మ! ఇమాన్వీ ఎవరంటే..?
-
ప్రభాస్ మరో కొత్త సినిమా మొదలు
ప్రభాస్ మరో కొత్త సినిమా మొదలుపెట్టేశాడు. రీసెంట్గా 'కల్కి'తో వచ్చి రూ.1000 కోట్ల కొట్టేశాడు. ప్రస్తుతం 'రాజా సాబ్' చేస్తున్నాడు. ఇది కాకుండా సలార్ 2, కల్కి 2, స్పిరిట్ చేయాలి. ఇవి ఉండగానే 'సీతారామం' దర్శకుడు హను రాఘవపూడితో కొత్త ప్రాజెక్ట్ షురూ చేశాడు. హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ఈ మూవీ ప్రారంభమైంది.(ఇదీ చదవండి: డైరెక్టర్ పూరీ జగన్నాథ్ మారాల్సిన టైమ్ వచ్చిందేమో?)శనివారం జరిగిన ఈ వేడుకకు 'సలార్' డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌తో పాటు పలువురు సెలబ్రిటీలు హాజరయ్యారు. వచ్చే వారం అంటే ఆగస్టు 24 నుంచి షూటింగ్ కూడా మొదలు కానుందని అంటున్నారు. అలానే ఈ సాయంత్రం 4 గంటలకు పోస్టర్ కూడా రిలీజ్ చేయబోతున్నారు.మరోవైపు ప్రభాస్-హను రాఘవపూడి కాంబోలో తీస్తున్న సినిమాకు 'ఫౌజీ' అనే టైటిల్ ఫిక్స్ చేశారని, రెండో ప్రపంచ యుద్ధ నేపథ్యంలో సాగే చక్కటి ప్రేమకథని అంటున్నారు. వీటిన్నంటిపై క్లారిటీ రావాలంటే కొన్నిరోజులు ఆగితే సరిపోతుంది. అలానే హీరోయిన్, మ్యూజిక్ డైరెక్టర్ ఎవరనేది కూడా తెలియాల్సి ఉంది.(ఇదీ చదవండి: ప్రభాస్ 'కల్కి' ఓటీటీ రిలీజ్‌పై అధికారిక ప్రకటన) -
విశ్వక్సేన్ కొత్త సినిమా ప్రాజెక్ట్ ప్రారంభం (ఫొటోలు)
-
ఇస్మార్ట్ గా మారబోతున్న నాని..
-
పీకల్లోతు కష్టాల్లో జాన్వీ.. టాలీవుడ్ పైనే ఆశలు
-
లుక్ మార్చిన రౌడీ.. షేక్ అవుతున్న ఇండస్ట్రీ..
-
హీరో అశ్విన్ కొత్త సినిమా.. బర్త్ డే స్పెషల్ పోస్టర్
'శివం భజే' సినిమాతో థియేటర్లలోకి వచ్చిన అశ్విన్ పుట్టినరోజు ఈరోజే (ఆగస్టు 01). ఈ క్రమంలోనే ఇతడికి బర్త్ డే విషెస్ చెబుతూ మూవీ టీమ్ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. మెడికో థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అరుణ శ్రీ ఎంటర్టైన్మెంట్స్ ప్రొడక్షన్ నెంబర్ 3గా టి.గణపతి రెడ్డి నిర్మిస్తున్నారు.(ఇదీ చదవండి: సినిమా కోసం నిర్మాతలతో గొడవ పెట్టుకున్న మృణాల్!)ఈ సినిమాలో అశ్విన్ బాబుకి జోడిగా రియా సుమన్ నటిస్తోంది. అయేషా ఖాన్, మురళీ శర్మ, సచిన్ ఖేడ్కర్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. హైదరాబాద్, వైజాగ్, కొడైకెనాల్లో 75% షూటింగ్ పూర్తయింది. ఈ ఏడాది చివర్లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చెప్పారు. 'హనుమన్' ఫేమ్ హరి గౌర.. ఈ సినిమాకు సంగీతమందిస్తుండటం విశేషం.(ఇదీ చదవండి: కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ ఇంట విషాదం) -
దూసుకొస్తున్న రెబల్.. ఒకేసారి నాలుగు సినిమాలతో డార్లింగ్ వేట..
-
సామ్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్..
-
టిల్లుని పక్కకి పెట్టిన సిద్దూ.. ఇప్పట్లో కమ్ బ్యాక్ కష్టమే..
-
భవనమ్లో థ్రిల్
సప్తగిరి, ధనరాజ్, ‘షకలక’ శంకర్, అజయ్, మాళవికా సతీషన్, స్నేహా ఉల్లాల్ ముఖ్య తారలుగా రూ΄÷ందిన చిత్రం ‘భవనమ్’. బాలాచారి కూరెళ్ల దర్శకత్వంలో సూపర్ గుడ్ ఫిలిమ్స్ సమర్పణలో ఆర్బీ చౌదరి, వాకాడ అంజన్ కుమార్, వీరేంద్ర సీర్వి నిర్మించారు. ఈ చిత్రాన్ని ఆగస్ట్ 9న విడుదల చేయనున్నట్లు బుధవారం యూనిట్ ప్రకటించింది. ‘‘సస్పెన్స్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో రూ΄÷ందించిన ఈ చిత్రంలో మంచి వినోదం ఉంది. కీలక తారాగణం పండించే కామెడీ బాగుంటుంది. అన్ని వర్గాలవారూ ఎంజాయ్ చేసేలా ఆసక్తికరమైన కంటెంట్‌తో తెరకెక్కించిన ‘భవనమ్’ మంచి విజయాన్ని సొంతం చేసుకుంటుందనే నమ్మకం ఉంది’’ అని చిత్రబృందం పేర్కొంది. -
పేరుకు పెద్ద స్టార్ కలెక్షన్స్ మాత్రం నిల్..
-
తారాస్థాయికి చేరిన ప్రభాస్ రేంజ్
-
ప్రభాస్, హను రాఘవపూడి మూవీ... అదిరిపోయే అప్డేట్
-
కిరణ్ అబ్బవరం కొత్త సినిమా.. ఒక్క అక్షరంతో టైటిల్
టాలీవుడ్ యువహీరో కిరణ్ అబ్బవరం చాలారోజుల తర్వాత కొత్త మూవీని ప్రకటించారు. 'క' అనే ఒక్క అక్షరం మాత్రమే టైటిల్ పెట్టినట్లు చెబుతూ పోస్టర్ రిలీజ్ చేశాడు. పీరియాడికల్ థ్రిల్లర్ కథతో దీన్ని తెరకెక్కిస్తున్నట్లు పోస్టర్ చూస్తుంటే అర్థమవుతోంది.(ఇదీ చదవండి: 'కల్కి' ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్సయిందా? ఆ స్పెషల్ డే నుంచి స్ట్రీమింగ్!)దర్శక ద్వయం సుజీత్, సందీప్.. విలేజ్ బ్యాక్ డ్రాప్ యాక్షన్ థ్రిల్లర్ స్టోరీతో ఈ సినిమా తీస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తవగా.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతోంది. 2018 ఫేమ్ తన్వి రామ్ హీరోయిన్. ఇకపోతే ఈ సినిమాని తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ భాషల్లోనూ రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. మిగతా వివరాలు త్వరలో వెల్లడించనున్నారు.'రాజావారు రాణిగారు' మూవీతో హీరోగా పరిచయమైన కిరణ్ అబ్బవరం గుర్తింపు తెచ్చుకున్నాడు. 'ఎస్ఆర్ కల్యాణ మండపం'తో పర్వాలేదనిపించాడు. కానీ ఆ తర్వాతే వరస సినిమాలు చేశాడు గానీ ఒక్కటంటే ఒక్కటి కూడా సక్సెస్ కాలేదు. దీంతో కాస్త టైమ్ తీసుకుని ఇప్పుడు 'క' చిత్రాన్ని ప్రకటించాడు.(ఇదీ చదవండి: ప్రభాస్ కోట్లాది రూపాయల సాయం.. బయటపెట్టిన కాస్ట్యూమ్ మాస్టర్) -
డైరెక్టర్ వీఎన్ ఆదిత్య కొత్త సినిమా.. అమెరికాలో ఆడిషన్స్
సీనియర్ డైరెక్టర్ వీఎన్ ఆదిత్య గతంలో పలు తెలుగు సినిమాలు తీశారు. మనసంతా నువ్వే, శ్రీరామ్, నేనున్నాను తదితర చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్నారు. ఈయన తీసిన మూడు చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు కొత్త ప్రాజెక్ట్ గురించి అప్డేట్ ఇచ్చేశారు.(ఇదీ చదవండి: సాయిపల్లవి ఇకపై హీరోయిన్ కమ్ డాక్టర్.. వీడియో వైరల్)డాక్టర్ మీనాక్షి అనిపిండి నిర్మాత వ్యవహరిస్తున్న కొత్త సినిమా కోసం యూఎస్‌లోని డల్లాస్‌లో తాజాగా ఆడిషన్స్ జరిగాయి. ఇందులో ప్రవాస భారతీయులతో పాటు విదేశీయులు కూడా పలువురు పాల్గొన్నారు. సున్నితమైన భావోద్వేగాలతో ఈ సినిమా తీయబోతున్నారని తెలుస్తోంది. త్వరలో ఈ మూవీ నుంచి కొత్త అప్డేట్స్ రావొచ్చని తెలుస్తోంది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి సుధీర్ బాబు యాక్షన్ మూవీ... స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్) -
సాయి ధరమ్ తేజ్ కొత్త చిత్రం.. డైరెక్టర్ ఎవరంటే?
గతేడాది విరూపాక్ష, బ్రో సినిమాలతో అలరించిన సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్. విరూపాక్ష సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నారు. ఈ చిత్రంలో సంయుక్త మీనన్ అతనికి జంటగా నటించింది. తాజాగా మరో చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. పీరియాడిక్ హై యాక్షన్ మూవీతో అభిమానులను పలకరించేందుకు సిద్ధమయ్యారు. వర్కింగ్ టైటిల్ 'ఎస్డీటీ 18' పేరుతో పోస్టర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్.సాయి ధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కిస్తోన్న ఈ చిత్రం ద్వారా రోహిత్ కేపీ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ చిత్రాన్ని ప్రైమ్‌షో ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై కె. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన అనౌన్స్మెంట్ పోస్టర్‌ను నిర్మాతలు విడుదల చేశారు.ల్యాండ్ మైన్లతో చుట్టుముట్టబడిన ఎడారి భూమిలో పచ్చని చెట్టుతో ఉన్న పోస్టర్ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఈ పోస్టర్ చూస్తుంటే ఓ యూనివర్శల్ కాన్సెప్ట్‌తో ఈ చిత్రం రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది.ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ.. 'ఈ చిత్రం భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్నాం. పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా వస్తున్న ఈ చిత్రంలో సాయి దుర్గ తేజ్ పాత్ర చాలా శక్తివంతంగా వుంటుంది. ప్రస్తుతం ఓ భారీ సెట్లో ఈ చిత్రం తొలిషెడ్యూల్ జరుగుతోంది. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేస్తాం' అన్నారు. కాగా.. ఈ సినిమాను తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేయనున్నారు.MY NEXT #SDT18 ✊This one will be more than special.Need all your love & blessings 🙏🏼All the best to us @rohithkp_dir 🤗 Glad to be associating with @niran_reddy @chaitanyaniran & @Primeshowtweets pic.twitter.com/wFhvFAELZb— Sai Dharam Tej (@IamSaiDharamTej) June 21, 2024 -
యూత్ ఫుల్ మూవీస్ తో సీనియర్ డైరెక్టర్స్..
-
'ధమాకా' కాంబో రిపీట్.. రవితేజ 75వ సినిమా ప్రారంభం (ఫోటోలు)
-
'నేను-కీర్తన' సినిమా బ్లాక్ బస్టర్ అవ్వాలి: డైరెక్టర్ సాయి రాజేశ్
చిమటా రమేష్ బాబు హీరోగా నటిస్తూ స్వీయ దర్శకత్వంలో తీస్తున్న సినిమా 'నేను కీర్తన'. ఈ మూవీలోని 'సీతాకోకై ఎగిరింది మనసే' పాట్ లిరికల్ వీడియోని 'బేబి' దర్శకుడు సాయి రాజేశ్ రిలీజ్ చేశారు. అలానే ఈ సినిమా హిట్ అవ్వాలని కోరుకున్నారు. ఈ మూవీలో రిషిత, మేఘన హీరోయిన్లుగా నటించారు. చిమటా లక్ష్మికుమారి నిర్మాతగా వ్యవహరించారు.(ఇదీ చదవండి: ప్రముఖ నటుడిపై పోక్సో కేసు.. నాలుగేళ్ల పాపతో దారుణంగా!)"ఎంతో బిజీ షెడ్యూల్లోనూ సమయాన్ని కేటాయించిన సాయి రాజేష్‌కు కృతజ్ఞతలు. త్వరలోనే ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నాం" అని హీరో కమ్ డైరెక్టర్ చిమటా రమేష్ బాబు చెప్పారు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. అవి ఏంటంటే?) -
సిమ్రాన్, అవినాష్ హీరోగా కొత్త సినిమా ప్రారంభం
అవినాష్ తిరువీధుల, సిమ్రాన్ చౌదరి హీరోహీరోయిన్లుగా కొత్త సినిమా ప్రారంభమైంది. కార్తి దర్శకుడు కాగా... శాంత నూపతి, ఆలపాటి రాజా, అవినాష్ బుయాని, అంకిత్‌రెడ్డిలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సిల్వర్ స్క్రీన్ సినిమాస్ ఎల్ఎల్పీ ప్రొడక్షన్ నెం.1గా తీస్తున్న ఈ మూవీ.. హైదరాబాద్‌లోని సారధి స్టూడియోలో పూజా కార్యక్రమాలతో మొదలైంది. తొలి సన్నివేశానికి ప్రముఖ నిర్మాత టీజీ విశ్వప్రసాద్ కెమెరా స్విచ్ఛాన్ చేయగా, ప్రముఖ దర్శకుడు బాబీ ఫస్ట్ షాట్‌కు దర్శకత్వం వహించారు. హైదరాబాద్ సిటీ పోలీస్ కమీషనర్ శ్రీనివాసరెడ్డి క్లాప్ కొట్టారు.(ఇదీ చదవండి: నటి ఇంట్లో చోరీ.. 10 తులాల బంగారం, డబ్బు దొంగతనం)మంచి సినిమా తీయాలనే కోరికతో అమెరికా నుంచి వచ్చాము. దాదాపు 4 సంవత్సరాలకుపైగా ప్రయత్నం చేస్తున్నాం. మధ్యలో కరోనా వల్ల చాలా టైం వేస్ట్ అయ్యింది. దాదాపు 30 కథలు దాకా విన్నాము. మా రైటర్ విశ్వజిత్ చెప్పిన ఈ లైన్ బాగా నచ్చింది. దీనికి తోడు సాయిమాధవ్ బుర్రాగారు మా సినిమాకు డైలాగ్స్ రాయడం మరింత ప్లస్ అవుతుంది. మంచి హిట్ సినిమాకు కావాల్సినవి అన్నీ ఇందులో ఉన్నాయి. మంచి టెక్నీషియన్స్ కుదిరారు అన్నారు.(ఇదీ చదవండి: కోట్ల రూపాయల కారు గిఫ్ట్.. ఎలుకల వల్ల నష్టపోయానన్న హీరో!) -
మకాం మారుస్తున్న శ్రీలీల..
-
మహేష్ బాబును మార్చేస్తున్న రాజమౌళి..
-
సౌత్ సినిమాలో సల్మాన్ !.. ఏ హీరో సినిమాలో అంటే ?
-
భారీ ఎత్తున సెట్ నిర్మాణం.. సెట్ లో సినిమా మొత్తం..?
-
ఆ జానర్ వదిలేసిన గుణశేఖర్.. అలాంటి కథతో కొత్త మూవీ
గుణశేఖర్ పేరు చెప్పగానే పెద్ద సెట్స్‌తో తీసే భారీ సినిమాలే గుర్తొస్తాయి. ఈయన గత రెండు సినిమాలు ఇలాంటివే. వాటితో ఘోరమైన నష్టాల్ని చవిచూసిన ఈయన ఇప్పుడు రూట్ మార్చాడు. యూత్‌ఫుల్ సోషల్ డ్రామా కథతో కొత్త మూవీ అనౌన్స్ చేశాడు. దీనికి 'యుఫోరియా' అనే టైటిల్ ఫిక్స్ చేస్తూ ఓ వీడియో రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: ఆనంద్, నువ్వు నా ఫ్యామిలీ రా.. రష్మిక ఇంట్రెస్టింగ్ కామెంట్స్)'ఒక్కడు' లాంటి మూవీతో టాలీవుడ్లో సెన్సేషన్ క్రియేట్ చేసిన దర్శకుడు గుణశేఖర్.. ఆ తర్వాత ట్రెండ్‌కి తగ్గ సినిమాలు తీయడంలో పూర్తిగా తడబడ్డాడు. మహేశ్, అల్లు అర్జున్, రవితేజ లాంటి హీరోలు అవకాశాలు ఇచ్చినప్పటికీ వాటిని సరిగా వినియోగించుకోలేకపోయాడు. 2015లో 'రుద్రమదేవి' అనే పీరియాడికల్ మూవీతో పాస్ మార్కులు వేయించుకున్నారు. ఇదొచ్చిన ఏడేళ్ల తర్వాత అంటే గతేడాది 'శాకుంతలం'తో వచ్చారు. కానీ ఇది బాక్సాఫీస్ దగ్గర ఘోరమైన ఫలితం అందుకుంది.మధ్యలో రానాతో చేయాల్సిన 'హిరణ్యకశ్యప' వివాదంలో చిక్కుకుంది. ఇలా పలు సమస్యలు ఎదుర్కొన్న గుణశేఖర్.. ఇప్పుడు తనకు అలవాటైన భారీ బడ్జెట్ చిత్రాలు కాకుండా సింపుల్‌గా ఉండే యూత్‌ఫుల్ డ్రామా తీయాలని ఫిక్సయ్యారు. ఇందులో భాగంగానే 'యుఫోరియా' మూవీని ప్రకటించారు. త్వరలో షూటింగ్ ఉంటుందని చెప్పారు. ఇందులో ఎవరెవరు నటిస్తారనేది మాత్రం ఇంకా చెప్పలేదు. త్వరలో ఆ వివరాలు వెల్లడిస్తారు.(ఇదీ చదవండి: పెళ్లయిన మూడు నెలలకే ప్రముఖ నటి విడాకులు? అసలు విషయం ఇది) View this post on Instagram A post shared by Guna Handmade Films (@gunahandmadefilms) -
ఆనంద్ దేవరకొండ 'గం గం గణేశా' ట్రైలర్ చూశారా?
గతేడాది 'బేబి' సినిమాతో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న ఆనంద్ దేవరకొండ ఇప్పుడు రూట్ మార్చాడు. క్రైమ్ కామెడీ థ్రిల్లర్ మూవీ 'గం గం గణేశా'తో ఎంటర్టైన్ చేసేయడానికి వచ్చేస్తున్నాడు. మే 31న మూవీ థియేటర్లలోకి రానుంది. ఈ క్రమంలోనే తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇంతకీ ఇది ఎలా ఉందంటే?(ఇదీ చదవండి: నేనూ మనిషినే.. అలా అంటే తట్టుకోవడం కష్టం: యువ హీరోయిన్)హీరో ఓ దొంగ. ఫ్రెండ్‌తో కలిసి జాలీగా బతికేస్తుంటాడు. ఓ అమ్మాయిని చూసి ప్రేమలో పడతాడు. ఆ తర్వాత ఓ ఊరికి వెళ్తాడు. అక్కడ వినాయకుడి విగ్రహాం దొంగతనం జరుగుతుంది. హీరో కూడా ఊహించని విధంగా ఆ దొంగతనంలో ఇరుక్కుంటాడు. ఆ తర్వాత ఏం జరిగింది? చివరకు ఏమైందనేదే కథలా అనిపిస్తుంది. ఇప్పటివరకు కూల్‌గా ఉంటే క్యారెక్టర్స్ చేస్తూ వచ్చిన ఆనంద్.. ఈ చిత్రం కామెడీ కూడా చేశాడు. మరి అది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి?(ఇదీ చదవండి: బిడ్డకు జన్మనిచ్చిన టాలీవుడ్ హీరోయిన్.. పేరేంటో తెలుసా?) -
థ్రిల్లర్ మూవీలో హాట్ బ్యూటీ పాయల్.. ఫస్ట్ లుక్ చూశారా?
ఆర్ఎక్స్100, మంగళవారం లాంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న పాయల్ రాజ్ పుత్.. సరికొత్తగా అలరించేందుకు సిద్ధమైపోయింది. ఇప్పటివరకు గ్లామర్ పాత్రల్లో కనిపించిన ఈ బ్యూటీ.. ఇప్పుడు పోలీస్‌గా సందడి చేయనుంది. ఈ మేరకు పాయల్ నటిస్తున్న కొత్త మూవీకి 'రక్షణ' టైటిల్ ఫిక్స్ చేశారు. ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: ఏడాది తర్వాత ఓటీటీలోకి వస్తున్న రొమాంటిక్ హిట్ సినిమా)క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ కథతో తీస్తున్న ఈ సినిమాలో పాయల్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతుంది. ప్రస్తుతం షూటింగ్ జరుగుతున్న ఈ సినిమాకు ప్రణదీప్ ఠాకోర్ దర్శకత్వం వహిస్తూ నిర్మిస్తున్నాడు. త్వరలో విడుదల తేదీతో పాటు ఇతర వివరాల్ని వెల్లడించబోతున్నారు.(ఇదీ చదవండి: తెలుగు సీరియల్ నటి కన్నుమూత.. నటుడు ఎమోషనల్ పోస్ట్) -
రౌడీ హీరో బర్త్ డే అప్డేట్.. కొత్త మూవీకి డైరెక్టర్ ఎవరంటే?
టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ బర్త్ డే సందర్భంగా అభిమానులకు అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. రవికిరణ్ కోలా దర్శకత్వంలో సినిమా చేయనున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా సినిమాకు సంబంధించిన పోస్టర్‌ను ట్విటర్లో షేర్ చేశారు. ప్రముఖ నిర్మాణసంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు, శిరీష్ నిర్మించనున్నారు. ఈ బ్యానర్లో వస్తోన్న 59న చిత్రం ఇది నిలవనుంది.ఈ సినిమాను భారీస్థాయిలో పాన్ ఇండియా ప్రాజెక్ట్‌గా తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. 'రాజా వారు.. రాణి గారు' సినిమాతో ప్రతిభావంతమైన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న రవి కిరణ్ కోలా ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా రిలీజైన పోస్టర్ చూస్తే ఫుల్ మాస్ యాక్షన్ చిత్రంగా కనిపిస్తోంది. 'కత్తి నేనే.. నెత్తురు నాదే.. యుద్ధం నాతోనే..' అనే క్యాప్షన్ చూస్తేనే సినిమా కథంటే అర్థమవుతోంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన నటీనటుల వివరాలు ప్రకటించనున్నారు. “The blood on my hands is not of their death.. but of my own rebirth..“Ravi Kiran Kola X Vijay Deverakonda@SVC_official pic.twitter.com/xGXXiNbVQu— Vijay Deverakonda (@TheDeverakonda) May 9, 2024 -
రామ్ చరణ్ కు తాతయ్యగా అమితాబ్ ?
-
Director Sukumar: ఈ చిత్రకథ గొప్పగా ఉంది
‘‘జగడం’ సినిమా ద్వారా గణేశ్‌ని కొరియోగ్రాఫర్‌గా పరిచయం చేశాను. ఇప్పుడు ‘గౌడ్ సాబ్’తో తను దర్శకుడిగా మారడం హ్యాపీగా ఉంది. ఈ చిత్రకథ గొప్పగా ఉంది’’ అన్నారు డైరెక్టర్ సుకుమార్. దివంగత నటుడు రెబల్‌స్టార్ కృష్ణంరాజు బంధువు విరాట్ రాజ్ హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘గౌడ్ సాబ్’. కొరియోగ్రాఫర్ గణేశ్ దర్శకత్వంలో మల్లీశ్వరి సమర్పణలో రాజు, కల్వకోట వెంకటరమణ, కాటారి సాయికృష్ణ కార్తీక్ నిర్మిస్తున్న ఈ మూవీ హైదరాబాద్‌లో ఆరంభమైంది. ‘గౌడ్ సాబ్’ లోగోను సుకుమార్ లాంచ్ చేశారు. తొలి సీన్‌కి నృత్య దర్శకులు యాని, భాను, జానీ కెమెరా స్విచ్చాన్ చేయగా, గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ క్లాప్ కొట్టారు. ‘‘మా విరాట్ లాంచ్ కావడం హ్యాపీగా ఉంది’’ అన్నారు కృష్ణంరాజు సతీమణి శ్యామలా దేవి. ‘‘ఇది నా కెరీర్లో ఉత్తమ చిత్రంగా నిలిచిపోతుంది’’ అన్నారు విరాట్ రాజ్. ‘‘లవ్ స్టోరీతో ఈ చిత్రం తెరకెక్కుతోంది’’ అన్నారు గణేశ్. ‘‘మంచి యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ’’ అన్నారు నిర్మాతలు. -
MM Keeravani: డ్యాన్స్ చేశాం
‘‘లవ్ మీ’ సినిమాలో ‘ఆటగదరా శివ..’ అని ఓ టైటిల్ సాంగ్ రాశారు చంద్రబోస్‌గారు. ఈ సినిమాకు పని చేయడానికి మేం స్టూడియోలో డ్యాన్స్ చేశాం. చంద్రబోస్‌గారితో ఫైట్ కూడా చేశాం (నవ్వుతూ). ఈ చిత్రం విజయం సాధించాలి’’ అని సంగీతదర్శకుడు ఎంఎం కీరవాణి అన్నారు. ఆశిష్, వైష్ణవీ చైతన్య జంటగా అరుణ్ భీమవరపు దర్శకత్వం వహించిన చిత్రం ‘లవ్ మీ’. శిరీష్ సమర్పణలో దిల్ రాజు ప్రొడక్షన్స్‌పై హర్షిత్ రెడ్డి, హన్షిత, నాగ మల్లిడి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 25న రిలీజ్ కానుంది. ఎంఎం కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఈ సినిమా ఆడియో విడుదల వేడుకను హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ వేడుకలో నిర్మాత ‘దిల్’ రాజు మాట్లాడుతూ– ‘‘ఆడియో రిలీజ్ ఈవెంట్స్‌ని మర్చి΄ోయి చాలా రోజులైంది. ‘లవ్ మీ’తో మళ్లీ ఆ సంస్కృతిని తీసుకొస్తున్నాం’’ అన్నారు. ‘‘ఆడియో లాంచ్ ఈవెంట్ చూస్తుంటే సక్సెస్ మీట్‌లా అనిపిస్తోంది’’ అన్నారు అరుణ్ భీమవరపు. ‘‘మా సినిమా ప్రేక్షకులకు నచ్చుతుంది’’ అన్నారు ఆశిష్. ఈ కార్యక్రమంలో వైష్ణవీ చైతన్య, హన్షిత, శిరీష్, హర్షిత్ రెడ్డి, నాగ మల్లిడి, కెమెరామేన్ పీసీ శ్రీరామ్ తదితరులు ΄ాల్గొన్నారు. -
రజనీకాంత్ కళుగు?
రజనీకాంత్ హీరోగా లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ ఓ సినిమా నిర్మించనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా టైటిల్‌ను ఈ నెల 22న అధికారికంగా ప్రకటించనున్నారు మేకర్స్. అయితే తాజాగా ఈ సినిమా టైటిల్ ఇదేనంటూ పలు పేర్లు కోలీవుడ్‌లో వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ సినిమాకు ‘కళుగు’ (తెలుగులో ‘గద్ద’ అని అర్థం) అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారట. మరి... ఇదే టైటిల్ ఖరారు అవుతుందా? లేక మరో టైటిల్ ఫిక్స్ అవుతుందా అనేది తెలియాలంటే ఈ నెల 22 వరకు ఆగాల్సిందే. ఈ చిత్రం షూటింగ్ జూన్ చివర్లో లేదా జూలై మొదటి వారంలో ్ర΄ారంభం కానుందని తెలిసింది. గోల్డ్ స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందని టాక్. -
25 ఏళ్ల తర్వాత క్రేజీ కాంబో రిపీట్
-
డైరెక్షన్ పై లేడీ సూపర్ స్టార్ ఇంటరెస్ట్..?
-
Ashwatthama: The Saga Continues: బాలీవుడ్ అశ్వత్థామ
బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ హీరోగా నటించనున్న కొత్త సినిమాకు ‘అశ్వత్థామ: ది సాగా కంటిన్యూస్’ టైటిల్ ఖరారైంది. కన్నడ దర్శకుడు సచిన్ రవి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. వసు భగ్నాని, జాకీ భగ్నాని, దీప్షికా దేశ్‌ముఖ్ నిర్మిస్తున్న ఈ సినిమా అధికారిక ప్రకటన వెల్లడైంది. సచిన్ రవి మాట్లాడుతూ– ‘‘మహా భారతంలోని అశ్వత్థామ ఇప్పటికీ జీవించే ఉంటారని కొందరి నమ్మకం. మహాభారత కాలంనాటి ఓ అమరుడు ఇప్పటి ఆధునిక కాలానికి వస్తే ఏం జరుగుతుంది? అనే అంశాలను ఈ సినిమాలో చూపిస్తున్నాం’’ అన్నారు. ‘‘ప్రస్తుత పరిస్థితుల్లో లెజెండ్స్ యుద్ధం చేస్తే ఎలా ఉంటుంది? అనే కోణంలో ఈ సినిమా కథనం ఉంటుంది. త్వరలోనే మూవీ రిలీజ్ డేట్ వెల్లడిస్తాం’’ అని పేర్కొన్నారు జాకీ భగ్నాని. -
రామ్ చరణ్ నెక్స్ట్ సినిమా కాంబినేషన్..మెంటలెక్కిపోద్ది
-
ఆ దూరాన్ని వెయ్ దరువెయ్ తగ్గిస్తుంది
‘‘పూర్తి స్థాయి వినోదం, ఫ్యామిలీ డ్రామా, ఓ చిన్న సందేశం.. ఇలా అన్ని వాణిజ్య అంశాలతో ‘వెయ్ దరువెయ్’ సినిమా తెరకెక్కింది. ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుందని చెప్పగలను. నా కెరీర్లో ఈ మధ్య గ్యాప్ వచ్చింది. ఆ దూరాన్ని ‘వెయ్ దరువెయ్’ తగ్గిస్తుందనే నమ్మకం ఉంది’’ అని హీరో సాయిరామ్ శంకర్ అన్నారు. నవీన్ రెడ్డి దర్శకత్వంలో సాయిరామ్ శంకర్, యషా శివకుమార్ జంటగా నటించిన చిత్రం ‘వెయ్ దరువెయ్’. లక్ష్మీనారాయణ ΄పొత్తూరు సమర్పణలో సాయి తేజ ఎంటర్టైన్మెంట్స్పై దేవరాజు ΄పొత్తూరు నిర్మించిన ఈ సినిమా రేపు (శుక్రవారం) విడుదలవుతోంది. ఈ సందర్భంగా సాయిరామ్ శంకర్ మాట్లాడుతూ– ‘‘నవీన్ ‘వెయ్ దరువెయ్’ కథ చెప్పగానే నచ్చింది. ఇందులో నా పాత్ర చాలా సరదాగా ఉంటుంది. నాకు తప్పకుండా మంచి కమ్ బ్యాక్ మూవీ అవుతుందనిపించింది. ఈ సినిమాని 35 రోజుల్లోనే పూర్తి చేశామంటే ఆ క్రెడిట్ నిర్మాత, డైరెక్టర్, కెమెరామేన్లదే. పైగా నటీనటులందరూ అనుభవం ఉన్నవాళ్లు కావడం కూడా మరో కారణం. ఈ మూవీకి భీమ్స్‌గారి సంగీతం, నేపథ్య సంగీతం ప్లస్ అయింది. నా 20 ఏళ్ల సినీ ప్రయాణంలో విజయాలు, పరాజయాలూ ఉన్నాయి. ప్రస్తుతం ఆచితూచి మంచి కథలు ఎంచుకుంటున్నా. మా అన్నయ్య (పూరి జగన్నాథ్) దర్శకత్వంలో హీరోగా చేసే స్థాయికి నేనింకా చేరుకోలేదు. ఆ స్థాయి, ఆ స్టార్డమ్, నా మార్కెట్ పరిధి పెరిగినప్పుడు చేస్తాను. ప్రస్తుతం నేను నటించిన ‘ఒక పథకం ప్రకారం, రీ సౌండ్’ సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి’’ అన్నారు. -
స్పీడ్ పెంచిన తారక్.. ఇక బాక్సాఫీస్ బద్దలే..
-
Bhool Bhulaiyaa 3: ఆమె కళ్లు వేటాడతాయి!
బాలీవుడ్ హారర్ కామెడీ ఫ్రాంచైజీలో ‘భూల్ భూలయ్యా’ ఒకటి. 2007లో విడుదలైన ‘భూల్ భూలయ్యా’, 2022లో విడుదలైన ‘భూల్ భూలయ్యా 2’ చిత్రాలు ప్రేక్షకులను అలరించాయి. తాజాగా ‘భూల్ భూలయ్యా 3’ చిత్రీకరణ జరుగుతోంది. అనీస్ బాజ్మీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో కార్తీక్ ఆర్యన్, విద్యాబాలన్ ప్రధాన పాత్రలు చేస్తున్నారు. ‘భూల్ భూలయ్యా’ ఫ్యామిలీలో ‘యానిమల్’ ఫేమ్ త్రిప్తి దిమ్రీ చేరారు. ‘‘ఆమె నవ్వు భయం పుట్టిస్తుంది. ఆమె కళ్లు వేటాడతాయి... అలాగే !భయపెడతాయి. మిస్టరీ గాళ్’’ అంటూ ఈ సినిమాలో త్రిప్తి దిమ్రీ పాత్రను వివరించారు మేకర్స్. -
శరవేగంగా రణబీర్ కపూర్ రామాయణం..
-
పూజా అప్డేట్ కోసం ఫ్యాన్స్ వెయిటింగ్..!
-
హిట్ కోసం ట్రాక్ మార్చిన రౌడీ..
-
ఒకే ఫ్రేమ్ లో ప్రభాస్, రష్మిక..?
-
ప్రభాస్ ఫ్యాన్స్ కు కిక్కెక్కించే న్యూస్
-
శేఖర్ కమ్ములతో మూడో సినిమా ప్లాన్ చేస్తున్న ఆ మేకర్స్
డైరెక్టర్ శేఖర్ కమ్ముల, శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ కలయికలో మూడో సినిమా ప్రకటన వచ్చింది. శ్రీ నారాయణ్ దాస్ కె. నారంగ్ ఆశీస్సులతో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ (ఏషియన్ గ్రూప్ యూనిట్), అమిగోస్ క్రియేషన్స్‌పై సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్మోహన్ రావు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. గతంలో వీరి కలయికలో నాగచైతన్య, సాయిపల్లవి జంటగా వచ్చిన ‘లవ్ స్టోరీ’ చిత్రం సూపర్‌హిట్‌గా నిలిచింది. రెండో సినిమాగా ధనుష్, నాగార్జునలతో ఓ మల్టీ స్టారర్ మూవీ తెరకెక్కిస్తున్నారు శేఖర్ కమ్ముల. ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం తిరుపతిలో జరుగుతోంది. తాజాగా ఈ ప్రొడక్షన్ హౌస్ తమ కొత్త చిత్రాన్ని ప్రకటించింది. ‘‘శేఖర్ కమ్ములతో తీయబోయే మూడో చిత్రం లార్జర్ దెన్ లైఫ్‌గా ఉంటుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. హై బడ్జెట్, టాప్ క్లాస్ సాంకేతిక ప్రమాణాలతో భారీ స్థాయిలో ఈ మూవీ రూపొందనుంది. ధనుష్, నాగార్జునలతో శేఖర్ కమ్ముల తీస్తున్న మూవీ చిత్రీకరణ పూర్తయ్యాక ఈ మూవీ సెట్స్‌పైకి వెళుతుంది’’ అన్నారు మేకర్స్. ఈ చిత్రానికి సమర్పణ: సోనాలీ నారంగ్. -
రాజమౌళి సినిమాకి..మహేష్ బాబు రెమ్యూనరేషన్ తీసుకోవట్లేదా ?
-
బూట్‌కట్ బాలరాజు ట్రైలర్
-
అందమైన ప్రేమకథతో రానున్న ప్రభాస్..!
-
టాప్ డైరెక్టర్ తో రణబీర్ కపూర్ సినిమా..
-
ప్రభాస్ రాజాసాబ్ టైటిల్ వీడియో
-
Ajay Gadu OTT Release: ఓటీటీలో ఆకట్టుకుంటున్న తెలుగు సినిమా.. ఫ్రీగా చూసేయొచ్చు!
ఇప్పుడు సినిమా అనగానే అందరికీ గుర్తొచ్చేవి సంక్రాంతికి రిలీజైనవే. ఆ నాలుగింటికి ప్రేక్షకుల నుంచి ఆదరణ వస్తోంది. వీటి సంగతి పక్కనబెడితే ఓటీటీలో ఓ తెలుగు సినిమాకు కూడా మంచి వ్యూస్ వస్తున్నాయి. కరెక్ట్‌గా చెప్పాలంటే గత కొన్నిరోజుల నుంచి ట్రెండింగ్‌లో ఉంది. ఇంతకీ ఆ మూవీ ఏంటి? ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందనేది ఇప్పుడు చూద్దాం. (ఇదీ చదవండి: కన్నడలో సూపర్ హిట్.. ఓటీటీలో తెలుగు వెర్షన్.. రిలీజ్ అప్పుడేనా?) బిగ్‌బాస్ తెలుగు ఓటీటీ సీజన్లో పాల్గొని గుర్తింపు తెచ్చుకున్న అజయ్ కతుర్వర్.. పలు సినిమాల్లో సహాయ పాత్రలు చేస్తూనే హీరోగానూ గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నంలో ఉన్నాడు. అలా హీరోగా నటిస్తూ స్వీయ దర్శక నిర్మాణంలో తీసిన చిత్రం 'అజయ్ గాడు'. తొలుత దీన్ని థియేటర్లలోకి తీసుకురావాలనుకున్నారు. కానీ ఎందుకనో కుదర్లేదు. అలా సంక్రాంతి కానుకగా ఈ జనవరి 12న నేరుగా జీ5లో రిలీజ్ చేశారు. రిలీజ్ చేసిన దగ్గర నుంచి ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటూ ట్రెండ్ అవుతోందని చెప్పొచ్చు. అలానే దీన్ని ఫ్రీగానే చూసేయొచ్చు. ఇక కథ విషయానికొస్తే.. మధ్యతరగతి కుర్రాడు అజయ్. రోజురోజుకీ మారిపోతున్న ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి, డబ్బు, పేరు, ప్రేమ లాంటి వాటి గురించి తెలుసుకోవడానికి ఇబ్బంది పడుతుంటాడు. అలా ఓ సమయంలో శ్వేతని చూసి ప్రేమలో పడతాడు. ఆమె డ్రగ్స్‌కి బానిస అయిన మెడికో. అలాంటి ఆమెను సక్రమ మార్గంలో ఉంచటానికి చేసే ప్రయత్నాలు చేస్తూ.. బాహ్య ప్రపంచంతో అజయ్ ఎలాంటి యుద్ధం సాగించాడనేదే కథ. (ఇదీ చదవండి: Prasanth Varma: 'హనుమాన్' మూవీతో హిట్ కొట్టాడు.. ఇంతలోనే దర్శకుడికి షాక్!) -
చిరంజీవి కొత్త సినిమా టైటిల్ 'విశ్వంభర'.. ఇంతకీ దీని అర్థమేంటి?
మెగాస్టార్ చిరంజీవి 156వ సినిమాకు టైటిల్ ఫిక్స్ చేశారు. గత కొన్నిరోజుల నుంచి అనుకుంటున్నట్లే 'విశ్వంభర' అనే పేరుని ఖరారు చేశారు. సంక్రాంతి కానుకగా టైటిల్ వెల్లడించడంతో పాటు కాన్సెప్ట్ వీడియోని విడుదల చేశారు. అసలు కథ ఏంటనేది కాస్త.. ఈ వీడియోలో రివీల్ చేశారు. అసలు 'విశ్వంభర' అంటే ఏంటి? ఈ సినిమా ఎప్పుడు థియేటర్లలోకి రానుంది? (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 45 సినిమాలు) గతేడాది సంక్రాంతికి 'వాల్తేరు వీరయ్య'తో హిట్ కొట్టిన చిరు.. ఆగస్టులో 'భోళా శంకర్' మూవీతో వచ్చి ఘోరమైన విమర్శలు ఎదుర్కొన్నారు. అప్పట్లో చిరుని వీర లెవల్లో ట్రోలింగ్ చేశారు. ఇప్పుడు వాటన్నింటికీ సమాధానమిచ్చేలా 'విశ్వంభర' మూవీ కాన్సెప్ట్ వీడియోని రిలీజ్ చేశారు. సోషియో ఫాంటసీ కథతో తీస్తున్న ఈ సినిమా మూడు నాలుగు లోకాల మధ్య ఉండనుందని.. ఈ వీడియోతో అర్థమైంది. రగ్బీ ఆకారం లాంటి ఓ వస్తువు.. పలు లోకాల్లో ప్రయాణించడాన్ని ఈ కాన్సెప్ట్ వీడియోలో చూపించారు. మరి ఈ వస్తువుతో చిరుకు ఏమైనా సంబంధం ఉంటుందా? లేదా అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. ప్రస్తుతం షూటింగ్ జరుగుతోంది. కీరవాణి సంగీతమందిస్తున్న ఈ చిత్రానికి 'బింబిసార' ఫేమ్ వశిష్ట దర్శకుడు. వచ్చే ఏడాది సంక్రాంతికి థియేటర్లలోకి సినిమాని తీసుకొస్తున్నట్లు ప్రకటించారు. ఇక 'విశ్వంభర' అంటే భూమి, ప్రపంచం అని అర్థం. అంటే ఇది పలు యూనివర్స్‌ల నడిచే కథ అని అనిపిస్తుంది. (ఇదీ చదవండి: మెగా సంక్రాంతి సెలబ్రేషన్స్.. ఈ విషయం గమనించారా? ) -
నానికు యాక్షన్ కట్ చెప్పేది ఎవరు..?
-
రొమాంటిక్ కామెడీ షురూ
నారా రోహిత్, విర్తీ వాఘని జంటగా వెంకటేశ్ నిమ్మలపూడి దర్శకత్వంలో రూపొందుతున్న రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ మూవీ శనివారం పూజా కార్యక్రమాలతో మొదలైంది. నారా రోహిత్ కెరీర్లో ఇది 20వ చిత్రం. ఈ సినిమాను సంతోష్ చిన్నపోళ్ల, గౌతమ్ రెడ్డి, రాకేష్ మహంకాళి నిర్మిస్తున్నారు. ముహూర్తపు సన్నివేశానికి ఎం. ప్రదీష్ వర్మ కెమెరా స్విచ్చాన్ చేయగా, గౌతమ్ రెడ్డి క్లాప్ ఇచ్చారు. విజయ్ కృష్ణ గౌరవ దర్శకత్వం వహించారు. శ్రీదేవీ విజయ్ కుమార్, నరేశ్ విజయకృష్ణ, వాసుకీ ఆనంద్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: లియోన్ జేమ్స్. -
కెప్టెన్ మిల్లర్ మూవీ ట్రైలర్ రిలీజ్
-
టైసన్ నాయుడి యాక్షన్
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రానికి ‘టైసన్ నాయుడు’ అనే టైటిల్‌ని ఖరారు చేశారు. సాగర్ కె. చంద్ర దర్శకత్వంలో 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీ ఆచంట ఈ సినిమా నిర్మిస్తున్నారు. బుధవారం (జనవరి 3న) సాయి శ్రీనివాస్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టైటిల్‌ని ‘టైసన్ నాయుడు’గా ఫిక్స్ చేసి, ఫస్ట్ లుక్ విడుదల చేశారు మేకర్స్. సాయి శ్రీనివాస్‌ను బాక్సింగ్ లెజెండ్ మైక్‌టైసన్ అభిమానిగా ఈ చిత్రం వీడియో గ్లింప్స్ ద్వారా పరిచయం చేశారు. నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘యునిక్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతోన్న చిత్రం ‘టైసన్ నాయుడు’. సాయి శ్రీనివాస్‌ను మునుపెన్నడూ చూడని మాస్, యాక్షన్ అవతార్‌లో చూపిస్తున్నారు సాగర్ కె. చంద్ర. హై బడ్జెట్‌తో ఈ సినిమా రూపొందుతోంది’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: భీమ్స్ సిసిరోలియో, కెమెరా: ముఖేష్ జ్ఞానేష్, ఎగ్జిక్యూటివ్ ్ర΄÷డ్యూసర్: హరీష్ కట్టా. -
బఘీరా మూవీ టీజర్
-
కొత్త ప్రయాణం ఆరంభం
రైలు ప్రయాణం మొదలు పెట్టారు విజయ్ సేతుపతి. ఆయనతో జర్నీ షేర్ చేసుకుంటున్నారు డింపుల్ హయతి. విజయ్ సేతుపతి హీరోగా డింపుల్ హయతి ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ ఫిల్మ్‌కు ‘ట్రైన్’ టైటిల్‌ను ఖరారు చేశారు. దర్శకుడు మిస్కిన్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ శుక్రవారం ప్రారంభమైంది. రైలు ప్రయాణం నేపథ్యంలో సాగే ఈ సినిమాలో విజయ్ సేతుపతి క్యారెక్టరైజేషన్, లుక్‌ను కొత్తగా డిజైన్ చేశారు మిస్కిన్. -
Allari Naresh: అల్లరి నరేశ్ కొత్త చిత్రం ప్రారంభం (ఫొటోలు)
-
రెండు ప్రపంచాలు
‘జార్జిరెడ్డి’, ‘పలాస’, ‘మసూద’ వంటి చిత్రాల్లో తనదైన నటనతో ప్రేక్షకులను మెప్పించిన నటుడు తిరువీర్ మరో కొత్త సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ద్రిష్టి తల్వార్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించనున్నారు. డార్క్ కామెడీ జానర్లో ఔట్ అండ్ ఔట్ ఎంటర్టైనర్గా తెరకెక్కనున్న ఈ సినిమాకు రాజ్ విరాట్ దర్శకత్వం వహించనున్నారు. ఏ మూన్ షైన్ పిక్చర్స్‌పై సాయి మహేష్ చందు, సాయి శశాంక్ నిర్మించనున్న ఈ సినిమా కాన్సెప్ట్ పోస్టర్‌ను విడుదల చేశారు. త్వరలోనే చిత్రీకరణ ప్రారంభం కానుంది. ‘‘రెండు వేర్వేరు ప్రపంచాల కలయికగా, యూనిక్ కాన్సెప్ట్‌తో ఈ సినిమా ఉంటుంది. వినోదాత్మక చిత్రంగా ప్రేక్షకులను అలరిస్తుంది’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ సినిమాకు సంగీతం: లియోన్ జేమ్స్. -
‘డాన్ 360’: మొబైల్ యాప్ తో రౌడీలను బుక్ చేసుకోవచ్చు !
భరత్‌కృష్ణ హీరోగా నటించి, దర్శకత్వం వహించిన యాక్షన్ చిత్రం ‘డాన్ 360’. ప్రియా హెగ్డే హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో శ్రీకాంత్ అయ్యంగార్, అర్చన అనంత్, సతీష్ సారిపల్లి కీలక పాత్రలు పోషించారు. ఉదయ రాజ్ వర్మ నిర్మిస్తున్నారు. ఓ మొబైల్ యాప్‌తో రౌడీలను బుక్ చేసుకోవచ్చనే ఓ కొత్త కాన్సెప్ట్‌తో ఈ చిత్రం తెరకెక్కింది. ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో భరత్ కృష్ణ మాట్లాడుతూ– ‘‘కొత్తదనం ఉంటే ఆ సినిమాను ప్రేక్షకులు ఆశీర్వదిస్తారు. ఈ కోవలో మా చిత్రాన్ని కూడా ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకం ఉంది’’ అన్నారు. ఈ కార్యక్రమంలో హీరోయిన్ ప్రియా హెగ్డే, సతీష్ సారిపల్లి మాట్లాడారు. -
ఎక్స్ట్రార్డినరీ సాంగ్
ఎక్స్ట్రార్డినరీ లెవల్లో డ్యాన్స్ చేశారు నితిన్. వక్కంతం వంశీ దర్శకత్వంలో నితిన్, శ్రీలీల జంటగా నటిస్తున్న చిత్రం ‘ఎక్స్ట్రా: ఆర్డినరీ మ్యాన్’. రాజశేఖర్ ఓ కీలక పాత్రధారి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ శివార్లలో జరుగుతోంది. ఓ భారీ సెట్లో 300 మందికి పైగా ఫారిన్ డ్యాన్సర్స్‌తో జానీ మాస్టర్ కొరియోగ్రఫీలో నితిన్, శ్రీలీలపై ఓ మాస్ సాంగ్‌ను చిత్రీకరిస్తున్నారు. ఈ పాటతో ఈ సినిమా చిత్రీకరణ పూర్తవు తుందని, మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయని యూనిట్ పేర్కొంది. శ్రేష్ఠ్ మూవీస్, ఆదిత్యా మూవీస్ అండ్ ఎంటర్టైన్మెంట్స్, రుచిర ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై ఎన్. సుధాకర్ రెడ్డి, నికితా రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం డిసెంబరు 8న విడుదల కానుంది. ఈ చిత్రానికి సంగీతం: హ్యారిస్ జైరాజ్. -
'మాధవే మధుసూదన' అందరినీ మెప్పిస్తుంది: సుమన్
టాలీవుడ్లో చిన్న సినిమాలు ఒక్కోసారి బ్లాక్‌బస్టర్ అవుతుంటాయి. కథ నచ్చితే తెలుగు ఆడియన్స్ తప్పకుండా బ్లాక్‌బస్టర్ ఇస్తారు. ఈ కోవలోనే 'మాధవే మధుసూదన' అనే చిత్రం రిలీజ్‌కు రెడీగా ఉంది. తేజ్ బొమ్మదేవర, రిషికి లొక్రే జంటగా నటించిన ఈ సినిమా నవంబర్ 24 విడుదల కానుంది. ఈ చిత్రాన్ని సాయి రత్న క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మించారు. బొమ్మదేవర రామచంద్ర రావు ఈ సినిమాకు దర్శకత్వం,నిర్మాతగా వ్యవహరించారు. ఈ మూవీని బొమ్మదేవర శ్రీదేవి సమర్పిస్తున్నారు. సినిమా విడుదల సందర్భంగా తాజాగా హైదరాబాద్ ఫిలింఛాంబర్లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ సినీ నటుడు సుమన్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో యాక్టర్ సుమన్ మాట్లాడుతూ.. 'మాధవే మధుసూదన' సినిమాను దర్శకుడు బొమ్మదేవర రామచంద్ర రావు చాలా క్లారిటీగా రూపొందించారు. ఆయనకు చాలా అనుభవం ఉంది. ఎంతోమంది దర్శకులను చూశారు. ప్రతి సీన్ తెరకెక్కించేటప్పుడు బొమ్మదేవర రామచంద్ర రావు అనుభవం నాకు కనిపించింది. కెమెరామెన్ వాసు ప్రతి ఫ్రేమ్‌ను చక్కగా పిక్చరైజ్ చేశారు. ఏ సినిమా బాగా రావాలన్నా అందుకు డైరెక్టర్, స్టోరీ, టెక్నీషియన్స్ కీలకం. ఈ సినిమాకు ఆ టీమ్ బాగా కుదిరింది. ఆర్టిస్టులు కూడా కొత్త వాళ్లు అయినప్పటికీ బాగా ప్రిపేర్ అయి నటించారు. ఈ సినిమాతో బొమ్మదేవర రామచంద్రరావు తన కొడుకు తేజ్‌ను హీరోగా పరిచయం చేస్తున్నాడు. అతను మంచి హీరో అవుతాడు. డ్యాన్సులు, ఫైట్స్, ఎమోషన్, కామెడీ అన్ని ఎలిమెంట్స్ బాగా చేస్తున్నాడు. అతనికి మీ అందరి బ్లెస్సింగ్స్ కావాలి. హీరో తేజ్ వర్క్ షాప్స్ చేసి తన క్యారెక్టర్ లోని మ్యానరిజమ్స్, డైలాగ్స్ ఇంప్రెసివ్‌గా చెప్పాడు. ఫాదర్ డైరెక్ట్ చేస్తున్నాడు అని కాకుండా ఒక డైరెక్టర్ దగ్గర వర్క్ చేస్తున్నట్లు ఎన్ని కరెక్షన్స్ చెప్పినా తేజ్ చేశాడు. హీరోయిన్ కూడా తన నటనతో ఆకట్టుకుంటుంది. రామచంద్రరావు గారు మిగతా హీరోలతో కూడా సినిమాలు చేయాలి. ఫ్యామిలీ అంతా కలిసి చూడాల్సిన సినిమా ఇది. థియేటర్స్ కు వెళ్లి చూడమని కోరుతున్నా.' అని సుమన్ అన్నారు. దర్శక, నిర్మాత బొమ్మదేవర రామచంద్రరావు మాట్లాడుతూ.. సినిమా ఇండస్ట్రీలో నాకు 45 ఏళ్ల అనుభవం ఉంది. టచప్ బాయ్ నుంచి మేకప్ మెన్‌గా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాను. అక్కినేని నాగార్జున గారి దగ్గర పనిచేస్తున్నప్పుడు అందరు స్టార్ డైరెక్టర్స్‌తో అనుబంధం ఏర్పడింది. వాళ్లు సీన్స్ ఎలా చేస్తున్నారు, ఏ షాట్ ఎలా పిక్చరైజ్ చేస్తున్నారు అనేది పరిశీలించేవాడిని. నాకు చిన్నప్పటి నుంచి డైరెక్షన్ చేయాలనే కోరిక ఉండటం ఇందుకు కారణం. నేను కూడా ఇలా ఏదో ఒకరోజు డైరెక్షన్ చేయాలని కోరుకున్నాను. మంచి కథ సిద్ధం చేసుకుని కొందరు హీరోలను అప్రోచ్ అయ్యాను. నేనే డైరెక్టర్, ప్రొడ్యూసర్‌గా చేస్తానని చెప్పడంతో వాళ్లలో ఏవైనా సందేహాలు కలిగి ఉండొచ్చు. లేదా రిస్క్ ఎందుకని అనుకోవచ్చు. వాళ్లు సినిమా చేసేందుకు ముందుకు రాలేదు. అప్పుడు మా అబ్బాయినే హీరోగా పెట్టి సినిమా చేయాలనుకున్నాను. నేను వెళ్లి మా అబ్బాయి తేజ్‌ను అడిగితే ..అతనికి కూడా మనసులో హీరో కావాలని ఉంది. కానీ నేను ఏమంటానో అని చెప్పడం లేదని తెలిసింది. అలా కాలేజ్ పూర్తయ్యాక ఏడాది పాటు ట్రైనింగ్ ఇచ్చి మా అబ్బాయి తేజ్ హీరోగా ఈ సినిమా స్టార్ట్ చేశాను.' అని ఆయన అన్నారు. -
బాలయ్య సినిమాలో స్టార్ హీరో..?
-
వారాహి ఆలయం నేపథ్యంలో..
సుమంత్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రానికి ‘మహేంద్రగిరి వారాహి’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. జాగర్లపూడి సంతోష్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మీనాక్షీ గోసామి హీరోయిన్. కాలిపు మధు, ఎం. సుబ్బారెడ్డి నిర్మిస్తున్న ‘మహేంద్రగిరి వారాహి’ టైటిల్ లోగోను సుమంత్ రిలీజ్ చేశారు. ‘‘మహేంద్రగిరిలో కొలువుదీరిన వారాహి అమ్మవారి ఆలయం చుట్టూ తిరిగే కథతో ఈ సినిమాను రూపొందిస్తున్నాం’’ అని యూనిట్ పేర్కొంది. ‘వెన్నెల’ కిశోర్, ‘శుభలేఖ’ సుధాకర్, రాజీవ్ కనకాల తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: అనూప్ రూబెన్స్. -
భయపెట్టే అన్వేషి
విజయ్ ధరణ్, సిమ్రాన్ గుప్తా, అనన్యా నాగళ్ల హీరో హీరోయిన్లుగా నటించిన హారర్ అండ్ కామెడీ ఫిల్మ్ ‘అన్వేషి’. వీజే ఖన్నా దర్శకత్వంలో టి. గణపతి రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 17న విడుదల కానుంది. ఈ సందర్భంగా బుధవారం హైదరాబాద్‌లో జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు నటులు అశ్విన్‌బాబు, సోహైల్, చైతన్యారావు, సంపూర్ణేశ్ బాబు అతిథులుగా హాజరై, ఈ చిత్రం విజయం సాధించాలన్నారు. ఈ వేడుకలో హీరో విజయ్ ధరణ్ మాట్లాడుతూ– ‘‘హీరో కావాలని ఓ చిన్న పల్లెటూరు నుంచి మొదలైన నా ప్రయాణంలో అవమానాలు, బాధలు ఎదుర్కొన్నాను. ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నాను. ఈ మూవీ నిర్మాణంలోనూ కష్టాలు పడ్డాం. కొంతమంది సపోర్ట్ చేయడంతో బయటపడ్డాం. ఈ సినిమా బాగాలేకపోతే నేను గుండు కొట్టించుకుంటాను. వీజే ఖన్నా భవిష్యత్‌లో పెద్ద దర్శకుడు అవుతారు’’ అన్నారు. ‘‘అనన్యా నాగళ్ల పాత్ర చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుంది’’ అన్నారు వీజే ఖన్నా. ‘‘ప్రతి ఫ్యామిలీ చూడదగ్గ చిత్రం ఇది’’ అన్నారు గణపతి రెడ్డి. ‘అన్వేషి’ చిత్రం మెప్పిస్తుంది’’ అన్నారు సిమ్రాన్ గుప్తా. -
పాన్ ఇండియాని షేక్ చేయబోతున్న విక్రమ్
-
చిరంజీవి కొత్త సినిమాకు గేమ్ ఛేంజర్ కి లింక్..
-
హిట్ కాంబినేషన్ రిపీట్
‘సూరరై పోట్రు’ (తెలుగులో ‘ఆకాశం నీ హద్దురా!’) వంటి హిట్ ఫిల్మ్ తర్వాత హీరో సూర్య, దర్శకురాలు సుధా కొంగర కాంబినేషన్లో తెరకెక్కనున్న కొత్త సినిమా ప్రకటన గురువారం వెల్లడైంది. సూర్య కెరీర్లో 43వ సినిమాగా తెరకెక్కనున్న ఈ చిత్రంలో మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్, నటి నజ్రియా ఫాహద్, నటుడు విజయ్ వర్మ కీలక పాత్రల్లో నటించనున్నారు. 2డీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై జ్యోతిక, సూర్య, రాజశేఖర్, కర్పూర సుందరపాండియన్ ఈ సినిమాను నిర్మించనున్నారు. పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కనుంది. ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్ కుమార్ స్వరకర్త. అతనికి సంగీత దర్శకుడిగా ఇది నూరవ చిత్రం కావడం విశేషం. ఇదిలా ఉంటే.. 68వ జాతీయ అవార్డ్స్‌లో ఉత్తమ నటుడు, ఉత్తమ నేపథ్య సంగీతం, ఉత్తమ నటి, ఉత్తమ స్క్రీన్‌ప్లే, ఉత్తమ చిత్రం విభాగాల్లో ‘సూరరై పోట్రు’ సినిమా అవార్డులు సాధించింది. తాజా చిత్రంతో సూర్య–సుధల హిట్ కాంబో రిపీట్ అవుతోంది. -
వాస్తవ ఘటనల ఆధారంగా...
‘డాన్ శీను, బలుపు, క్రాక్’ చిత్రాల తర్వాత హీరో రవితేజ, దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబినేషన్లో మరో సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్‌తో మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ ఈ సినిమాను నిర్మించనున్నారు. వాస్తవ ఘటనల ఆధారంగా ఓ పవర్ఫుల్ కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది. కాగా ఈ సినిమాలోని కీలక పాత్రల్లో దర్శక–నటుడు సెల్వరాఘవన్, ఇందూజ రవిచంద్రన్ నటించనున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది. ఈ చిత్రానికి సంగీతం: తమన్, కెమెరా: జీకే విష్ణు. -
Nani's New Movie: హీరో నాని కొత్త చిత్రం షురూ (ఫొటోలు)
-
సరిపోదా శనివారం?
‘అంటే సుందరానికీ’ చిత్రం తర్వాత హీరో నాని, దర్శకుడు వివేక్ ఆత్రే కాంబినేషన్లో మరో సినిమా తెరకెక్కనుంది. ఈ చిత్రంలో ప్రియాంకా అరుళ్ మోహన్ హీరోయిన్. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్పై డీవీవీ దానయ్య, కల్యాణ్ దాసరి ఈ సినిమాను నిర్మించనున్నారు. ఈ చిత్రాన్ని శనివారం ప్రకటించారు. అలాగే ఈ నెల 23న ఓ అప్డేట్, 24న ఈ సినిమా ్ర΄ారంభోత్సవం జరపనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఈ చిత్రానికి ‘సరిపోదా శనివారం’ అనే టైటిల్ అనుకుంటున్నారని సమాచారం. -
కొత్త సినిమా షురూ
కల్యాణ్ రామ్ హీరోగా కొత్త సినిమాకి కొబ్బరికాయ కొట్టారు. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సయీ మంజ్రేకర్ హీరోయిన్గా నటిస్తున్నారు. నటి విజయశాంతి కీలక పాత్ర పోషిస్తున్నారు. ముప్పా వెంకయ్య చౌదరి సమర్పణలో అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్‌పై అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు నిర్మిస్తున్న ఈ సినిమా శుక్రవారం ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి మురళీ మోహన్ కెమెరా స్విచ్చాన్ చేయగా, విజయశాంతి క్లాప్ కొట్టారు. ముప్పా వెంకయ్య చౌదరి స్క్రిప్ట్‌ని దర్శకునికి అందించారు. ‘‘భారీ బడ్జెట్, అత్యున్నత సాంకేతిక విలువలతో రూ΄పొందుతున్న చిత్రమిది. కల్యాణ్ రామ్ పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుంది. ఆయన కెరీర్లో ఈ సినిమా ఓ మైలురాయిగా నిలిచిపోతుంది. త్వరలోనే ఇతర నటీనటులు, పూర్తి వివరాలను తెలియజేస్తాం’’ అన్నారు మేకర్స్. ఈ చిత్రానికి సంగీతం: బి. అజనీష్ లోక్‌నాథ్, కెమెరా: సి. రామ్ ప్రసాద్. -
ఆ గ్రామానికి ఓ వింత శాపం.. ఆసక్తికర కథాంశంతో వస్తోన్న చిత్రం !
తమిళ సీనియర్ దర్శకుడు ఎస్ఏ చంద్రశేఖర్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం మోహినీపట్టి. ఈ సినిమాకు ఆయన శిష్యుడు జయవీరన్ కామరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. బ్లూ మూన్ స్టూడియోస్ పతాకంపై జయభారతీ కామరాజ్ నిర్మించారు. ఇంజినీర్ అయిన ఈయన సినిమాపై ఆసక్తితో ఫిలిం ఇన్స్టిట్యూట్లో శిక్షణ పొందారు. తరువాత దర్శకుడు ఎస్ఏ చంద్రశేఖర్ వద్ద సహాయ దర్శకుడిగా చేరారు. పలు లఘు చిత్రాలకు దర్శకత్వం వహించారు. తొలిసారిగా మోహినీపట్టి చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రం గురించి దర్శకుడు మాట్లాడుతూ మోహినీపట్టి ఫాంటసీ, థ్రిల్లర్ కథా చిత్రమని తెలిపారు. (ఇది చదవండి: ఖరీదైన కారు కొన్న స్టార్ హీరోయిన్.. ధర ఎన్ని కోట్లంటే?) మోహినీపట్టి అనే ఒక కల్పిత గ్రామంలో జరిగే పలు ఆసక్తికరమైన సంఘటనలే ఈ చిత్రమన్నారు. ఆ గ్రామానికి ఒక శాపం ఉంటుందన్నారు. అది ఆ ఊరు ప్రజలకు మాత్రమే తెలుసని.. అక్కడ ఎవరూ ప్రేమించి పెళ్లి చేసుకోలేరన్నారు. అలాంటి పరిస్థితుల్లో ఒక యువ జంట ప్రేమించుకోవడంతో ఆ గ్రామ కట్టుబాటును, సంప్రదాయాన్ని ఎలా ఎదిరించారు? గ్రామ శాపానికి బలి అయ్యారా? దాని నుంచి బయట పడగలిగారా? అన్న ఆసక్తికరమైన అంశాలతో కూడిన చిత్రమని తెలిపారు. ఈ కాలంలో ఇలాంటి కథా అనే సందేహం రావచ్చు. కానీ ఒక్కో ఇంటికీ.. ఒక్కో ఊరుకు తెలియని రహస్యాలు ఉంటాయని, అలాంటి ఇక రహస్యంతో ఈ చిత్ర కథను రాసుకున్నట్లు చెప్పారు. ఇందులో సంగీత్, నిరంజన్ శివశంకర్, తౌవుపికా, జయశ్రీ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారని తెలిపారు. ఈ చిత్రాన్ని ఓటీటీలో స్ట్రీమింగ్ కోసం రూపొందిస్తున్నట్లు చెప్పారు. ఈ మూవీకి మనోజ్ కుమార్‌బాబు సంగీతాన్ని అందించారు. (ఇది చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి రాబోతున్న 29 సినిమాలు) #Mohinipatti #Webstories இயக்குநர் எஸ்.ஏ.சந்திரசேகரன் முக்கிய வேடத்தில் நடிக்கும் 'மோகினிப்பட்டி' பேண்டஸி திரில்லர் வெப் மூவி!https://t.co/4YCQR2rFy6இயக்குநர்-எஸ்-ஏ-சந்திரசே/@PROSakthiSaran pic.twitter.com/SbyjUy608r — KALAIPOONGA (@kalaipoongavij1) October 18, 2023 இயக்குனர் எஸ்.ஏ.சந்திரசேகர் நடிப்பில் உருவாகும் 'மோகினிப்பட்டி' மேலும் படிக்க :https://t.co/g3ETtqftZ1#mohinipatti #sachandrasekar #jeyaveerankamaraj #MMcinema #MMNews #Maalaimalar pic.twitter.com/nPXcO5R7ha — Maalai Malar தமிழ் (@maalaimalar) October 18, 2023 -
మహేష్ బాబుతో సినిమాపై క్లారిటీ ఇచ్చిన అనిల్ రావిపూడి
-
మరింత అందంకోసం సర్జరీ చేయించుకున్న అఖిల్ !
-
ఓ ఊరికి ఆత్మ ఉంటే ఏం జరుగుతుందనేదే ఈ సినిమా కథ: మల్లికార్జున్
శివ కంఠమనేని, క్యాథలిన్ గౌడ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘మధురపూడి గ్రామం అనే నేను’. మల్లికార్జున్ దర్శకత్వంలో ముప్పా వెంకయ్య చౌదరి సారథ్యంలో జి. రాంబాబు యాదవ్ సమర్పణలో కేఎస్ శంకర్ రావు, ఆర్ వెంకటేశ్వర రావు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 13న విడుదల కానుంది. ఈ సందర్భంగా బుధవారం జరిగిన విలేకర్ల సమావేశంలో మల్లికార్జున్ మాట్లాడుతూ – ‘‘ఓ మనిషికి ఆత్మ ఉంటుందన్నట్లుగానే.. ఓ ఊరికి ఆత్మ ఉంటే ఏం జరుగుతుందనే కల్పిత కథే ఈ చిత్రం. ఓ వ్యక్తి మరో వ్యక్తి తలను నరికి పోలీస్ స్టేషన్‌కు వెళ్లాడనే వార్తను నా చిన్నతనంలో చదివాను. ఆ విజువల్‌ను ఊహించుకుంటూ ఈ సినిమా కథను అల్లుకున్నాను. అయితే ఆ ఘటనకు, ఈ సినిమాకు ఏ మాత్రం సంబంధం లేదు. పోరాటం, స్నేహం, రాజకీయం... ఇలా అన్ని రకాల ఎమోషన్స్ ఉన్న రా అండ్ రస్టిక్ ఫిల్మ్. సూరి పాత్రలో హీరో శివ నా విజన్‌కి తగ్గట్లు నటించాడు. నిర్మాతలు బాగా సపోర్ట్ చేశారు. మణిశర్మగారి సంగీతం ఈ చిత్రానికి అదనపు బలం. కరోనా తర్వాత తెలుగు సినిమా మారిపోయింది. ఆరు ఫైట్లు.. ఆరు పాటలు అంటే ఆడియన్స్ చూడటం లేదు. కొత్తదనం కోరుకుంటున్నారు. అందుకే ఈ సినిమా తీశాను. ఇక ఫారెస్ట్ బ్యాక్‌డ్రాప్‌లో నా దగ్గర ఓ కథ ఉంది’’ అన్నారు. మవుతుంది. -
ఏలియన్ తో శివకార్తికేయన్..ప్రయోగం సక్సెస్ అవుతుందా..
-
ఎన్టీఆర్ తో ఐరన్ మ్యాన్ లాంటి సినిమా !
-
అట్లీతో అల్లు అర్జున్ న్యూ మూవీ..
-
సూపర్‌స్టార్ కొత్త సినిమా షురూ.. 32 ఏళ్ల తర్వాత మళ్లీ అలా!
కొన్నేళ్లుగా హిట్ లేక సూపర్‌స్టార్ రజనీకాంత్ క్రేజ్ చాలావరకు పడిపయింది. వయసు కూడా 70ల్లోకి వచ్చేసరికి ఇక రిటైర్మెంట్ తీసుకుంటే బెటర్ అనే కామెంట్స్ వినిపించాయి. ఇలాంటి సమయంలో 'జైలర్' మూవీతో అదిరిపోయే కమ్‌బ్యాక్ ఇచ్చారు. ఈ జోష్ లోనే ఇప్పుడు మరో కొత్త చిత్రాన్ని ప్రారంభించారు. తాజాగా షూటింగ్ మొదలైంది. అయితే ఈ సినిమాకి చాలా ప్రత్యేకతలు ఉన్నాయండోయ్. (ఇదీ చదవండి: 'దేవర' నుంచి సర్ప్రైజ్.. బాహుబలి, పుష్ప రూట్లోనే) 'జైలర్'తో బ్లాక్‌బస్టర్ సక్సెస్ అందుకున్న రజనీకాంత్.. ఇప్పుడు 'జై భీమ్' ఫేమ్ జ్ఞానవేల్ దర్శకత్వంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి ప్రస్తుతం 'తలైవర్ 170' అనే వర్కింగ్ టైటిల్ పెట్టారు. త్రివేండ్రంలో బుధవారం ఈ చిత్ర షూటింగ్ లాంఛనంగా ప్రారంభమైంది. అందుకు సంబంధించిన ఫొటోల్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. 'జైలర్'తో పోలిస్తే రజనీ లుక్ మొత్తం మారిపోయింది. ఇకపోతే ఈ సినిమాలో రజనీతో పాటు అమితాబ్ బచ్చన్, ఫహాగ్ ఫాజిల్, మంజు వారియర్, రానా, రితికా సింగ్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. అనిరుధ్ సంగీతమందిస్తున్నాడు. లైకా ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్‌తో దీన్ని నిర్మిస్తోంది. అయితే రజనీ-అమితాబ్.. దాదాపు 32 ఏళ్ల తర్వాత కలిసి నటించబోతుండటం విశేషం. అలానే ఈ సినిమా నిజ జీవిత సంఘటన ఆధారంగా తీస్తున్నట్లు సమాచారం. (ఇదీ చదవండి: హీరోయిన్ పూజాహెగ్డేకి గాయం.. ఆ ఫొటో వైరల్!) -
బాధలో కూడా ప్రమోషన్స్..
-
ఇక తగేదేలే అంటున్న పూజా హెగ్డే..
-
ఇక్కడి నుండి వెళ్ళిపో.. హీరో సిద్ధార్థ్ ను తరిమేసిన కన్నడ సంఘాలు
-
నవ్వించడంతో పాటు థ్రిల్ చేస్తానంటున్న రకుల్
రకుల్ ప్రీత్ సింగ్ నవ్వించడానికి, థ్రిల్ చేయడానికి రెడీ అయ్యారు. ఆమెతో పాటు నీనా గుప్తా కూడా చేతులు కలిపారు. ఈ ఇద్దరూ కలిసి చేసే కామెడీ, థ్రిల్‌ని వచ్చే ఏడాది వెండితెరపై చూడొచ్చు. రకుల్, నీనా గుప్తా లీడ్ రోల్స్‌లో ఓ చిత్రం రూపొందనుంది. కామెడీ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని దర్శకుడు ఆశిష్ ఆర్. శుక్లా తెరకెక్కించనున్నారు. ఈ చిత్రాన్ని సునీల్ కేతర్పాల్ నిర్మించనున్నారు. రకుల్ ఓ లీడ్ రోల్లో నటించిన ‘ఐ లవ్ యు’కి కూడా కేతర్పాల్నే నిర్మాత. ఈ ఏడాది జూన్‌లో ఈ చిత్రం ఓటీటీ ప్లాట్ఫామ్లో విడుదలైంది. అయితే తాజా చిత్రాన్ని మాత్రం థియేటర్స్‌లోనే విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ చిత్రం షూటింగ్‌ని అక్టోబర్‌లో ఆరంభించి, డిసెంబర్‌కల్లా పూర్తి చేయాలనుకుంటున్నారు. వచ్చే ఏడాది ఆరంభంలో ఈ చిత్రం విడుదలయ్యే చాన్స్ ఉంది. -
జోరు చూపిస్తున్న విజయ్ దేవరకొండ..
-
రాజమౌళి పరివేక్షణలో అఖిల్ సినిమా..
-
ఇంట్లో ఒప్పుకోలేదు, రెండు రోజులు ఏడ్చాను: హీరోయిన్
విరాట్ కర్ణ హీరోగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘పెదకాపు 1’. మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 29న రిలీజ్ కానుంది. ఈ చిత్రంలో హీరోయిన్గా నటించిన ప్రగతి శ్రీవాస్తవ విలేకరులతో మాట్లాడుతూ – ‘‘మను చరిత్ర’ సినిమా తర్వాత కోవిడ్ వల్ల గ్యాప్ రావడంతో ముంబై వెళ్లిపోయా. పెద కాపు 1’కి చాన్స్ రావడంతో, ఆడిషన్ ఇచ్చాను. సెలక్ట్ అయ్యాను. శ్రీకాంత్ అడ్డాలగారి గత సినిమాల్లో హీరోయిన్పాత్రలు బలంగా ఉంటాయి. అలా ఈ సినిమాలో నాపాత్ర కూడా చాలా బలంగా ఉంటుంది. ఇందులో నాది రూరల్ క్యారెక్టర్.. చాలెంజింగ్ రోల్. ఈపాత్రను బాగా చేయగలిగానంటే దానికి కారణం శ్రీకాంత్‌గారే. ఈ సినిమా మొదటి నుంచి చివరి వరకూ మంచి సస్పెన్స్‌తో ఆసక్తికరంగా ఉంటుంది. నిజానికి సినిమాల్లోకి వెళ్తానంటే ఫ్యామిలీ నుంచి మొదట్లో అస్సలు సపోర్ట్ లేదు. నేను లా, పబ్లిక్ పాలసీ చదివాను. చిన్నప్పటి నుంచీ ఇంట్లో సినిమా వాతావరణం లేదు. సినిమాల్లోకి వెళతానంటే వద్దే వద్దు అన్నారు. రెండు రోజులు ఏడ్చాను కూడా. చివరికి కాంట్రాక్ట్ సైన్ చేసేసానని నాన్నకి చెప్పాను. ‘సైన్ చేసిన తర్వాత ఏం చేస్తాం.. నీ మనసుకు నచ్చింది చెయ్’ అన్నారు. అయితే నటన కొనసాగిస్తూనే చదువుపైనా దృష్టి పెట్టాను. అటు నటన ఇటు చదువు రెండిటిని బ్యాలెన్స్ చేశాను. మంచి ర్యాంక్ వచ్చింది. అలాగే హోర్డింగ్స్‌పై నన్ను ఒక నటిగా చూసి ఇంట్లో వాళ్లు కూడా ఆనందపడ్డారు’’ అన్నారు. -
Peddakapu : ‘పెదకాపు’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
‘జోరుగా హుషారుగా’ విరాజ్ అశ్విన్
‘ఒక కలలా నువ్వలా నిజమయ్యావే నా బంగారు బొమ్మ’ అంటూ ‘జోరుగా హుషారుగా..’ చిత్రంలోని ‘యువరాణి’ పాట సాగుతుంది. విరాజ్ అశ్విన్, పూజితా పొన్నాడ జంటగా అనుప్రసాద్ దర్శకత్వంలో నిరీష్ తిరువీధుల ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రంలోని ‘యువరాణి యువరాణి నువ్వు..’ అంటూ సాగే పాట లిరికల్ వీడియోను హీరో శ్రీ విష్ణు రిలీజ్ చేసి, ‘‘ఈ సినిమా ఓ జెన్యూన్ లవ్‌స్టోరీలా అనిపిస్తోంది’’ అన్నారు. సంగీత దర్శకుడు ప్రణీత్ స్వరపరచిన ‘యువరాణి’ పాటను రామజోగయ్యశాస్త్రి రాయగా అమ్రాన్ మాలిక్, నవ్య సమీర పాడారు. ‘‘త్వరలో రిలీజ్ డేట్ ప్రకటిస్తాం’’ అన్నారు నిర్మాత. -
ప్రోత్సాహం ఉంటేనే ఉత్సాహం ఉంటుంది
విరాట్ కర్ణ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ‘పెదకాపు’. ఈ చిత్రంలో ప్రగతి శ్రీవాత్సవ హీరోయిన్ . శ్రీకాంత్ అడ్డాల నటించి, దర్శకత్వం వహించారు. మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా తొలి భాగం ‘పెదకాపు 1’ ఈ నెల 29న విడుదల కానుంది. ఈ సందర్భంగా శనివారం జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో అతిథిగా పాల్గొన్న ‘బింబిసార’ ఫేమ్ దర్శకుడు వశిష్ఠ మాట్లాడుతూ– ‘‘శ్రీకాంత్ అడ్డాలగారి సినిమాలు సాధారణంగా ప్రశాంతంగా ఉంటాయి. కానీ ఆయన జానర్ మార్చి షాక్ ఇచ్చారు. ఈ సినిమా బ్లాక్‌బస్టర్ కావాలి’’ అన్నారు. విరాట్ కర్ణ మాట్లాడుతూ– ‘‘ఇంత పెద్ద సినిమాను నాతో తీసిన నా బావగారికి రుణపడి ఉంటాను. ఓ నటుడిగా తొలి సినిమాకు ఉండాల్సిన జ్ఞాపకాలన్నీ నాకు ఈ సినిమాతో ఉన్నాయి’’ అన్నారు. శ్రీకాంత్ అడ్డాల మాట్లాడుతూ– ‘‘కొత్త హీరోతో పెద్ద స్క్రిప్ట్ చేస్తున్నప్పుడు రవీందర్‌లాంటి నిర్మాత తోడుగా ఉన్నప్పుడు...‘ఓ డైరెక్టర్ రా.. అందరి తరఫున నిలబడి ఓ సినిమా చేసుకోగలిగాడు’ అనే పేరు ఏదైతే ఉంటుందో దాన్ని ఎందుకు వదులుకోవాలి? అదే మనల్ని నడిపించేది. ఎప్పుడైనా ప్రోత్సాహం ఉంటేనే ఉత్సాహం ఉంటుంది. ఈ చాన్స్ ఇచ్చిన రవీందర్ రెడ్డికి థ్యాంక్స్. ‘లైఫ్ ఆఫ్ పెదకాపు’గా ఈ సినిమా ప్రేక్షకులను అలరిస్తుంది’’ అన్నారు. మిర్యాల రవీందర్ రెడ్డి మాట్లాడుతూ– ‘‘విరాట్ కోసమే ‘పెదకాపు’ కథ కుదరిందనుకుంటున్నాను. మనం అనుకున్నది సాధించాలంటే పోరాటం తప్ప మరొకటి లేదు. అదే ఈ చిత్రకథ. ‘పెదకాపు 1’ రిలీజ్ తర్వాత తెలుగు సినిమా వెట్రిమారన్ గా శ్రీకాంత్ అడ్డాలని చెప్పుకుంటారు. ఒక మనిషి.. ఒక కుటుంబం.. ఒక ప్రాంతం.. ఒక సమూహం.. ఇలా ఏదైనా కావొచ్చు.. నా అనుకునేవారి కోసం కాపు కాచుకుని ఉండే ప్రతి కాపుకు ఈ సినిమా అంకితం’’ అన్నారు. ‘‘ఆర్టిస్ట్‌గానూ శ్రీకాంత్ అడ్డాలగారికి పేరు రావాలని, విరాట్ పెద్ద హీరో కావాలని కోరుకుంటున్నా’’ అన్నారు రావు రమేష్. ‘‘నేను శిక్షణ ఇచ్చిన వారిలో 245 మంది యాక్టర్స్ అయ్యారు. వీరిలో 156 మంది హీరోలుగా చేశారు. విరాట్ కర్ణ 156వ హీరో. విరాట్‌ను చూడగానే ప్రభాస్ గుర్తొచ్చారు’’ అన్నారు సత్యానంద్. ఛోటా కె. నాయుడు, అనసూయ, బ్రిగిడ తదితరులు పాల్గొన్నారు. -
అందుకే పద్ధెనిమిది సినిమాలు వదులుకున్నా: తనికెళ్ల భరణి
‘‘నలభై ఏళ్ల సుధీర్ఘ కెరీర్లో 800 పైగా సినిమాలు చేశాను. వీటిలో 300 పైగా తండ్రి పాత్రలు ఉన్నాయి. దీంతో తండ్రి పాత్రలు చేయాలంటే విసుగొచ్చింది. ఈ ఏడాది 18 సినిమాల్లో తండ్రి పాత్రలు చేయమని అవకాశాలు రాగా, వదులుకున్నాను. కొత్త తరహా పాత్రలు చేయాలనుకుంటున్న నాకు ‘పెదకాపు–1’లో మంచి పాత్ర దొరికింది. నా కెరీర్లో నేను గుర్తుంచుకోదగ్గ పాత్రల్లో ‘పెదకాపు 1’ ఉంటుంది’’ అన్నారు నటుడు– దర్శకుడు తనికెళ్ల భరణి. విరాట్ కర్ణ హీరోగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ పెదకాపు 1’. మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 29న విడుదల కానుంది. ఈ సందర్భంగా శనివారం జరిగిన విలేకర్ల సమావేశంలో ఈ చిత్రంలో కీలక పాత్రలో నటించిన తనికెళ్ల భరణి పంచుకున్న విశేషాలు. ► ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’, ‘బ్రహ్మోత్సవం’ చిత్రాల తర్వాత శ్రీకాంత్ అడ్డాలతో నేను చేసిన చిత్రం ‘పెదకాపు 1’. ఈ చిత్రంలో సమాజంపై విసిగిపోయిన ఓ టీచర్ పాత్రలో కనిపిస్తాను. శ్రీకాంత్ అడ్డాల పోషించిన పాత్రను తప్పిస్తే ఈ సినిమాలో లీడ్ రోల్ చేసిన అందరితో నాకు కాంబినేషన్ సీన్స్ ఉన్నాయి. ‘మాతృ దేవో భవ, లేడీస్ టైలర్, శివ, మన్మథుడు, అతడు’.. ఇలా నిడివితో సంబంధం లేకుండా నా కెరీర్లో నేను గుర్తుపెట్టుకోదగ్గ పాత్రలు ముప్పై వరకు ఉంటాయి. ఈ జాబితాలో ‘పెదకాపు 1’ చేరుతుంది. చాలా గ్యాప్ తర్వాత ఈ సినిమాకి కెమెరామేన్ చోటా కె. నాయుడుతో వర్క్ చేయడం థ్రిల్‌గా అనిపించింది. విరాట్ కర్ణ కొత్తవాడైనా బాగా నటించాడు. మిక్కీ జే మేయర్ సంగీతం బాగుంటుంది. మిర్యాల రవీందర్‌రెడ్డిగారు ఈ సినిమాను భారీగా నిర్మించారు. ► ‘మిథునం’ తర్వాత నా దర్శకత్వంలో మరో చిత్రం రాలేదు. నేను కమర్షియల్ సినిమాలు తీయలేను. నా దగ్గర కొన్ని కథలు ఉన్నాయి. ఆర్ట్ ఫిల్మ్ తరహా చిత్రాలను నిర్మించే నిర్మాతలు దొరకడం లేదు. నా నలభై ఏళ్ల కెరీర్లో నేను అనుకున్నవన్నీ చేశాను. అయితే ఓ అంతర్జాతీయ సినిమా తీయాలనే ఆకాంక్ష మాత్రం మిగిలిపోయి ఉంది. ప్రస్తుతం శివరాజ్‌కుమార్, ప్రభుదేవా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమాలో కీలక పాత్ర చేస్తున్నాను. శేఖర్ అనే కొత్త దర్శకుడు తీస్తున్న సినిమాలో ఓ వైవిధ్యమైన పాత్ర చేస్తున్నాను. -
త్రిష వెంటపడుతున్న స్టార్ హీరోలు
-
అనిరుధ్ ని లాక్ చేసిన బన్నీ..