అప్పట్లో సినిమాలు చేసి పూర్తిగా టాలీవుడ్‌కి దూరమైపోయిన శివాజీ.. బిగ్‌బాస్ గత సీజన్‌లో పాల్గొని గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ మధ్య ఓ వెబ్ సిరీస్‌తో నటుడిగా కమ్ బ్యాక్ ఇచ్చాడు. ప్రస్తుతం తనే నిర్మాతగా మారి ఓ సినిమా చేస్తున్నాడు. క్రైమ్ కామెడీ థ్రిల్లర్ కథతో తీస్తున్నారు. ఇందులో శివాజీకి జోడిగా లయ నటిస్తోంది. తాజాగా ఈ చిత్రం పూజతో లాంఛనంగా ప్రారంభమైంది.
(ఇదీ చదవండి: చిరంజీవి సినిమాని శ్రీలీల రిజెక్ట్ చేసిందా?)
హైదరాబాద్‌లో జరిగిన ఈ సినిమా ప్రారంభోత్సవానికి దిల్ రాజు, బోయపాటి శ్రీను, నిర్మాత బెక్కం వేణు గోపాల్ తదితరులు హాజరయ్యారు. ఇకపోతే ఈ సినిమాతో సుధీర్ శ్రీరామ్ అనే కుర్రాడు దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు.
గతంలో శివాజీ, లయ జంటగా పలు తెలుగు సినిమాల్లో హీరోహీరోయిన్లుగా చేశారు. 'మిస్సమ్మ', 'టాటా బిర్లా మధ్యలో లైలా', 'అదిరిందయ్యా చంద్రం' తదితర మూవీస్ ప్రేక్షకుల్ని అలరించాయి. మళ్లీ ఇన్నాళ్ల తర్వాత ఈ కాంబోలో సినిమా రావడం విశేషం. ఈ నెల 20 నుంచి షూటింగ్ ప్రారంభించబోతున్నారు. త్వరలో మిగతా వివరాలు వెల్లడిస్తారు.
(ఇదీ చదవండి: అస్వస్థత.. ఆస్పత్రిలో చేరిన హీరో మోహన్ లాల్!)
Comments
Please login to add a commentAdd a comment