చిరంజీవి సినిమాని శ్రీలీల రిజెక్ట్ చేసిందా? | Sreeleela Rejected Chiranjeevi Vishwambhara Movie Offer | Sakshi
Sakshi News home page

Sreeleela: మెగాస్టార్ మూవీకి నో చెప్పిన శ్రీ లీల.. నిజమేనా?

Published Sun, Aug 18 2024 3:07 PM | Last Updated on Sun, Aug 18 2024 4:22 PM

Sreeleela Rejects Chiranjeevi Viswambhara Movie

టాలీవుడ్‌లోకి రాకెట్‌లా దూసుకొచ్చింది శ్రీలీల. తెలుగు మూలులున్నప్పటికీ కన్నడ సినిమాలతో నటిగా మారింది. 'పెళ్లి సందD'తో హీరోయిన్‌గా తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. గతేడాదిలో నెలకో మూవీతో ప్రేక్షకుల్ని పలకరించింది. అవన్నీ కూడా బాక్సాఫీస్ దగ్గర ఫెయిలయ్యాయి. దీంతో సైలెంట్ అయిపోయింది. అలాంటిది ఈమెకు మెగా ఛాన్స్ వస్తే నో చెప్పిందనే న్యూస్ ఇప్పుడు వైరల్ అవుతోంది.

(ఇదీ చదవండి: బిగ్‌బాస్‌ 8 తెలుగు షోలో టాలీవుడ్‌ హీరో?)

శ్రీలీల ప్రస్తుతం హిందీ, తెలుగులో తలో సినిమా చేస్తోంది. అయితే గతేడాది చేసిన సినిమాలన్నీ ఫెయిలవడంతో ఆలోచనలో పడిన శ్రీలీల.. ఈసారి ఆచితూచి మూవీస్ చేయాలని అనుకుంటోందట. అదలా ఉంచితే చిరంజీవి ప్రస్తుతం 'విశ్వంభర' అనే సోషియో ఫాంటసీ మూవీ చేస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి థియేటర్లలోకి రానుంది.

చిరుతో పాటు ఇందులో ఆషికా రంగనాథ్, సురభి, ఈషా చావ్లా తదితరులు హీరోయిన్లుగా నటిస్తున్నారు. అయితే ఇందులో ఓ ప్రత్యేక గీతంలో డ్యాన్స్ చేసేందుకు శ్రీలీలని సంప్రదించారట. కానీ ఈమె నో చెప్పిందట. రెమ్యునరేషన్ ఎక్కువ ఇస్తామని చెప్పినా సరే మొహమాటం లేకుండా రిజెక్ట్ చేసిందని టాక్ వినిపిస్తోంది.

(ఇదీ చదవండి: తంగలాన్‌ కోసం విక్రమ్‌ కష్టం.. మేకింగ్‌ వీడియో విడుదల)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement