తంగలాన్‌ కోసం విక్రమ్‌ కష్టం.. మేకింగ్‌ వీడియో విడుదల | Chiyaan Vikram Thangalaan Making Video Out Now | Sakshi
Sakshi News home page

తంగలాన్‌ కోసం విక్రమ్‌ కష్టం.. మేకింగ్‌ వీడియో విడుదల

Aug 18 2024 12:11 PM | Updated on Aug 18 2024 1:07 PM

Chiyaan Vikram  Thangalaan Making Video Out Now

విక్రమ్‌- పా.రంజిత్‌ కాంబినేషన్‌లో తెరకెక్కిన సినిమా తంగలాన్‌. ఆగష్టు 15న విడుదల అయిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద రాణిస్తుంది. మూడు రోజుల్లోనే బాక్సాఫీస్‌ వద్ద రూ. 40 కోట్లకు పైగానే కలెక్షన్లు రాబట్టింది. అయితే, ఈ సినిమా మేకింగ్‌ వీడియోను మేకర్స్‌ విడుదల చేశారు. ఎప్పుడూ కూడా ఆలోచనాత్మకత సినిమాలను డైరెక్ట్‌ చేసే పా. రంజిత్‌.. ఇప్పుడు కూడా విక్రమ్‌తో పెద్ద ప్రయోగమే చేశాడు. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ నేపథ్యంలో వచ్చి రికార్డులు బద్దలు కొట్టింది 'కేజీఎఫ్'.  మళ్లీ అదే గోల్డ్ హంట్ నేపథ్యంలో  తంగలాన్‌ను తెరకెక్కించారు పా. రంజిత్.

తంగలాన్‌ మేకింగ్‌ వీడియో చూసిని ప్రేక్షకులు విక్రమ్‌ను ప్రశంసిస్తున్నారు. ఈ సినిమా కోసం ఆయన ఎంత కష్టపడ్డారో కొంతమేరకు మాత్రమే మేకింగ్‌ వీడియోలో చూపించారు. వైవిధ్య పాత్రలతో ఎప్పుడూ మెప్పించే చియాన్ విక్రమ్ 'తంగలాన్' కోసం కొత్త మేకోవర్‌లో దుమ్మురేపాడు. కేవలం విక్రమ్‌ కోసమే ఈ సినిమా చూడొచ్చు అనేలా వెండితెరపైన విజృంభించాడు. తంగలాన్‌ యాక్షన్ సీక్వెన్స్‌లలో బరిసెలతో, ఈటెలతో ఫైట్ సీన్స్‌లో అద్భుతంగా ఆయన నటించారు.  ప్రేక్షకులను మెప్పించిన తంగలాన్‌ చిత్రానికి సీక్వెల్‌ ఉంటుందని తాజాగా విక్రమ్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా విడుదలైన ఈ సినిమా మేకింగ్‌ వీడియోను మీరూ  చూసేయండి.
 

Advertisement
 
Advertisement
Advertisement