Vikram
-
జాతీయ అవార్డ్ విన్నింగ్ హీరో సినిమాకు నో చెప్పిన సాయిపల్లవి
నటి సాయి పల్లవి సినిమా రంగంలో సంపాదించుకున్న పేరు మామూలుగా లేదు. ముఖ్యంగా గ్లామర్‌కు దూరంగా సహజ నటిగా ముద్ర వేసుకున్న ఈ బ్యూటీ మలయాళ చిత్రం ప్రేమమ్‌తో కథానాయకిగా పరిచయమైంది. అయితే, సాయి పల్లవి తన తొలి చిత్రంతోనే నటనలో తనదైన ముద్ర వేసుకుంది. దీంతో వెంటనే టాలీవుడ్ నుంచి పిలుపు వచ్చింది. ఇక్కడ పలు చిత్రాల్లో నటించి సక్సెస్ ఫుల్ కథానాయకిగా రాణిస్తోంది. అదేవిధంగా కోలీవుడ్ లోనూ నటిస్తూ దక్షిణాదిలో ప్రముఖ నటిగా గుర్తింపు పొందిన సాయి పల్లవి ఇటీవల శివకార్తికేయన్‌కు జంటగా అమరన్ చిత్రంలో నటించి మరోసారి నటిగా తన సత్తా చాటుకుంది. కథలోని తన పాత్ర నచ్చితేనే నటించడానికి సమ్మతించే ఈమె పాత్రకు ప్రాధాన్యత లేకపోతే ఎలాంటి అవకాశం అయినా తిరస్కరిస్తుంది. అయితే తాజాగా అందుకు భిన్నంగా ఒక అవకాశాన్ని చేజార్చుకుందనే ప్రచారం సామాజిక మాధ్యమాల్లో జోరందుకుంది. అదే నటుడు విక్రమ్ సరసన నటించే అవకాశం అని సమాచారం. తంగలాన్ చిత్రంలో తన నట విశ్వరూపాన్ని ప్రదర్శించిన నటుడు విక్రమ్ ప్రస్తుతం వీర వీర సూరన్ చిత్రంలో నటిస్తున్నారు. ఎస్.అరుణ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు చివరి దశకు చేరుకున్నాయి. కాగా తదుపరి మడోన్ అశ్విన్ దర్శకత్వంలో నటించడానికి సిద్ధమవుతున్నారు ఈ దర్శకుడు ఇంతకుముందు యోగిబాబు కథానాయకుడిగా మండేలా, శివ కార్తికేయన్ హీరోగా మావీరన్ వంటి విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించారు. కాగా విక్రమ్ హీరోగా ఈయన దర్శకత్వం వహించనున్న చిత్ర షూటింగ్ త్వరలో ప్రారంభం కానున్నట్లు తెలిసింది. కాగా ఇందులో విక్రమ్ సరసన నటి సాయిపల్లవి నటింపజేసే ప్రయత్నాలు జరిగినట్లు సమాచారం. అయితే కాల్షీట్స్ సమస్య కారణంగా ఆమె ఈ చిత్రంలో నటించే అవకాశాన్ని చేజార్చుకున్నట్లు ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఆరు ఫిలిం ఫేర్ అవార్డ్స్ అందుకున్న సాయిపల్లవి ఉత్తమ నటుడిగా నేషనల్ అవార్డ్ అందుకున్న విక్రమ్‌తో కలిసి ఒక సినిమా చేస్తే అంచనాలు భారీగానే ఉంటాయి. వీరిద్దరి కాంబినేషన్లో సినిమా అనేది ఎంతవరకు నిజమో అన్నది తెలియాల్సి ఉంది. అదేవిధంగా విక్రమ్ దర్శకుడు మండోన్ అశ్విన్ కాంబోలో రూపొందనున్న ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే. -
సరికొత్త లుక్‌లో...
హీరో విక్రమ్ 63వ చిత్రం షురూ అయింది. ‘చియాన్ 63’ అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ చిత్రాన్ని ప్రకటించారు మేకర్స్. ‘మండేలా, మావీరన్’ (తెలుగులో ‘మహావీరుడు’) వంటి చిత్రాలతో ప్రశంసలు అందుకున్న దర్శకుడు మడోన్ అశ్విన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. శాంతి టాకీస్‌పై అరుణ్ విశ్వ నిర్మించనున్నారు. ఈ సందర్భంగా అరుణ్ విశ్వ మాట్లాడుతూ– ‘‘దేశంలోని అత్యుత్తమ నటుల్లో ఒకరైన విక్రమ్‌తో కలిసి మా ప్రోడక్షన్ నంబర్ 3ని ప్రకటించడం చాలా సంతోషంగా ఉంది. ఆయన ప్రయాణం ఎందరికో స్ఫూర్తినిస్తుంది. మనకు ఎన్నో చిరస్మరణీయమైనపాత్రలు, సంచలనాత్మక చిత్రాలను అందించిన విక్రమ్‌గారితో సినిమా నిర్మించనుండటం మాకు గౌరవం. మడోన్ అశ్విన్‌తో రెండో సినిమా చేయనుండటం చాలా ఆనందంగా ఉంది. విక్రమ్‌గారికి కరెక్టుగా సరిపోయే కథతో ఆయన్ని సరికొత్త లుక్‌లో చూపించబోతున్నారు మడోన్ అశ్విన్. ఈ చిత్రానికి సంబంధించిన ఇతర వివరాలను త్వరలో తెలియజేస్తాం’’ అని చెప్పారు. -
సడెన్‌గా ఓటీటీలో 'తంగలాన్' సినిమా
విక్రమ్- పా.రంజిత్ కాంబినేషన్లో తెరకెక్కిన సినిమా తంగలాన్. ఎలాంటి ప్రకటన లేకుండానే సైలెంట్‌గా ఈ చిత్రం ఓటీటీలోకి వచ్చేసింది. ఈ ఏడాది ఆగష్టు 15న విడుదల అయిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అందుకుంది. అయితే, తంగలాన్ ఓటీటీ ఎంట్రీ కోసం అభిమానులు ఆసక్తిగా చాలారోజుల నుంచి ఎదురుచూస్తున్నారు. అయితే, సడెన్‌గా నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో తంగలాన్ చిత్రం స్ట్రీమింగ్ అవుతుండటంతో ఫ్యాన్స్ ఫుల్ జోష్‌లో ఉన్నారు.తంగలాన్ సినిమా ఎలాంటి ప్రకటన లేకుండానే నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగుతో పాటు తమిల్,మలయాళం,కన్నడలో ఈ చిత్రం తాజాగా విడుదలైంది. తంగలాన్ సినిమాను ఓటీటీలో విడుదల చేయవద్దని తిరువళ్లూరుకు చెందిన పోర్కోడి మద్రాసు హైకోర్టులో ప్రజా ప్రయోజన పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో వైష్ణవులను అవమానించేలా చాలా సన్నివేశాలు ఉన్నాయని ఆయన పిటీషన్ వేశారు. అంతేకాకుండా బౌద్ధమతం గురించి చాలా పవిత్రంగా చూపించిన దర్శకుడు వైష్ణవులను మాత్రం కించపరిచేలా తెరకెక్కించారని పిటీషన్లో పేర్కొన్నారు. ఇప్పుడు ఓటీటీలో విడుదలైతే ఇరువర్గాల మధ్య మత ఘర్షణలు జరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. కేసు విచారణ అనంతరం ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలో విడుదలైంది.కథేంటి..?గోల్డ్ హంట్ నేపథ్యంలో తంగలాన్ను తెరకెక్కించారు పా. రంజిత్. 1850లో బ్రిటీషర్లు మన దేశాన్ని పాలిస్తున్న సమయంలో జరిగిన కాన్సెప్ట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. వెప్పూర్ అనే ఊరిలో తంగలాన్ (విక్రమ్).. తన కుటుంబంతో కలిసి బతుకుతుంటాడు. అనుకోని పరిస్థితుల్లో బంగారం వెతకడం కోసం క్లెమెంట్ అనే ఇంగ్లీష్ దొరతో కలిసి తంగలాన్ వెళ్లాల్సి వస్తుంది. ఈ ప్రయాణంలో వింత వింత అనుభవాలు ఎదురవుతాయి. మరి తంగలాన్ చివరకు బంగారం కనిపెట్టాడా? అరణ్య, ఆరతితో ఇతడికి ఉన్న సంబంధమేంటి అనేదే మెయిన్ స్టోరీ. ఈ మూవీకి సీక్వెల్ తంగలాన్ 2 ఉంటుందని విక్రమ్ వెల్లడించారు. -
'వీర ధీర శూరన్'గా విక్రమ్.. టీజర్ ఎలా ఉంది..?
విక్రమ్ హీరోగా రూపొందిన తాజా చిత్రం ‘వీర ధీర శూరన్ పార్ట్ 2’. ఎస్యు అరుణ్ కుమార్ దర్శకత్వం వహించారు. ఎస్జే సూర్య, సూరజ్ వెంజరమూడు, దుషారా విజయన్ ఇతర పాత్రల్లో నటించారు. హెచ్ఆర్ పిక్చర్స్‌పై రియా శిబు నిర్మించిన ఈ చిత్రం టీజర్‌ను సోమవారం విడుదల చేశారు. ‘‘వీర ధీర శూరన్ పార్ట్ 2’ చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రోడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ చేసిన గ్లింప్స్ అందర్నీ ఆకట్టుకోవడంతో యూట్యూబ్‌లో 14 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. తాజాగా విడుదల చేసిన టీజర్లో విక్రమ్ నటన, యాక్షన్ సీక్వెన్సులు, విజువల్స్, నేపథ్య సంగీతం వంటివి అభిమానుల అంచనాలను మించిపోయాయి. విక్రమ్ డిఫరెంట్ లుక్స్, యాక్టింగ్, పోలీస్ ఆఫీసర్‌గా ఎస్జే సూర్య పెర్ఫామెన్స్ ఆడియన్స్‌ని ఆకట్టుకుంటాయి. ఈ జనవరిలో తమిళ, తెలుగు, హిందీ భాషల్లో ఈ సినిమాని విడుదల చేస్తాం’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ సినిమాకి కెమెరా: తేని ఈశ్వర్, సంగీతం: జీవీ ప్రకాశ్‌కుమార్. -
ఎవరీ విక్రమ్‌గౌడ?
విక్రమ్‌గౌడ కుదురేముఖ్ జాతీయ ఉద్యానవనం వ్యతిరేక పోరాటంలో చురుగ్గా పాల్గొన్నారు. కరావళి ప్రాంతంలో విక్రమ్‌గౌడ, మలెనాడు ప్రాంతంలో ముండగారు లతా బృందం చురుకుగా ఉండేవి. విక్రమ్‌గౌడ ఉడుపి జిల్లా హెబ్రి తాలూకా కూడ్లు నాడ్వాలు గ్రామ నివాసి. మొదట కార్మిక సంఘంలో పనిచేసిన విక్రమ్‌గౌడ ఆ తరువాత నక్సలైట్లలో చేరి అగ్రశ్రేణి నక్సల్‌గా ఎదిగారు. మూడుసార్లు కర్ణాటక పోలీసుల నుంచి తప్పించుకున్నారు. 2016 నుంచి కేరళ అటవీ ప్రాంతాల నుంచి కార్యకలాపాలను నడుపుతున్నారు. ఆయన మృతితో నక్సలైట్ నేతల సంఖ్య తగ్గింది. గతంలో పలువురి అరెస్టులు, లొంగుబాట్లు జరిగాయి.బనశంకరి: కర్ణాటక, కేరళ, తమిళనాడు పోలీసులకు మోస్ట్‌వాటెండ్ నక్సలైట్‌గా ఉన్న విక్రమ్ గౌడ ఎన్కౌంటర్లో చనిపోయారు. కర్ణాటకకు చెందిన నక్సల్స్ వ్యతిరేక దళం(ఏఎన్ఎఫ్) పోలీసులు సోమవారం రాత్రి ఉడుపి జిల్లాలో కబ్బినాలే అటవీ ప్రదేశంలో కూంబింగ్‌లో మట్టుబెట్టారు.ఎదురు కాల్పులు...విక్రమ్‌గౌడ, కర్ణాటక, కేరళ, తమిళనాడులో 50 కి పైగా నేరాల్లో మోస్ట్ వాటెండ్‌గా ఉన్నారు. కొద్దిరోజులుగా ఉడుపి ప్రాంతంలో నక్సల్స్ కార్యకలాపాలు జరుగుతున్నాయి. దీంతో ఏఎన్ఎఫ్ పోలీసులు విస్తృతంగా కూంబింగ్ జరుపుతున్నారు. ఐదుమంది నక్సలైట్లు నిత్యావసర వస్తువులను కొనడానికి కబ్బినాలెకు వచ్చినట్లు తెలిసి చుట్టుముట్టారు. ఇరువర్గాల మధ్య కాల్పులు జరిగాయి, ఇందులో విక్రమ్‌గౌడ (46) మరణించగా, మిగిలిన నక్సల్స్ పారిపోయినట్లు పోలీసు అధికారులు చెప్పారు.రూ.5 లక్షల రివార్డువిక్రమ్గౌడ, ముండగారు లతా, జయణ్ణ, వనజాక్షి, సుందరి అనేవారు నక్సల్ నేతలు కాగా, వారిపైన ప్రభుత్వం రూ.5 లక్షల చొప్పున బహుమానం ప్రకటించింది. గత 20 ఏళ్లు నుంచి నక్సల్ కార్యకలాపాల్లో విక్రమ్‌గౌడ పాల్గొంటున్నాడు. ఆయనపై చిక్కమగళూరు జిల్లాలో 13 కేసులు నమోదయ్యాయి. కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో 50 కి పైగా దాడులు, విధ్వంసం కేసులు ఉన్నాయి.కేరళ నుంచి వచ్చి తూటాలకు చిక్కికేరళలో నక్సల్స్ కార్యకలాపాలు హెచ్చుమీరడంతో అక్కడ పోలీసులు నియంత్రణ చర్యలు చేపట్టారు. దీంతో చాలామంది నక్సల్స్ పొరుగునే ఉన్న ఉడుపి, మంగళూరు జిల్లాల్లోకి వచ్చారు. పశ్చిమ కనుమల్లోని అటవీ గ్రామాల పరిసరాల్లో తలదాచుకున్నారు. ఇటీవల కస్తూరిరంగన్ నివేదిక అమలు, అటవీ ప్రాంతం ఆక్రమణల తొలగింపు అంశాలపై ప్రజలతో సమావేశాలు జరిపారు. ఇది తెలిసి పెద్ద సంఖ్యలో పోలీసులు అడవుల్లో గాలింపు ప్రారంభించారు. విక్రమ్‌గౌడ మృతదేహాన్ని మంగళూరు ఆస్పత్రికి తరలించారు.లొంగిపోవాలని చెప్పాంబనశంకరి: ఎన్కౌంటర్ స్థలాన్ని మంగళవారం రాష్ట్ర ఆంతరిక భద్రతా విభాగం డీఐజీ రూపా మౌద్గిల్ పరిశీలించి మీడియాతో మాట్లాడారు. నక్సల్స్ కదలికల గురించి తెలిసి గాలింపు మొదలైంది, నక్సల్స్ ఎదురుపడ్డారు, లొంగిపోవాలని సూచించినప్పటికీ కాల్పులకు దిగారు. ఈ సమయంలో ఏఎన్ఎఫ్ బలగాలు ఎదురు కాల్పులు జరపడంతో విక్రమ్‌గౌడ మృతిచెందారు. ఇతడిపై హత్య, దోపిడీలు, దొంగతనాలు తో పాటు 60 కి పైగా కేసులు ఉన్నాయి అని రూపా మౌద్గిల్ చెప్పారు. 10 రోజుల నుంచి గాలింపు జరుగుతోందని ఆమె చెప్పారు. -
బ్లాక్ బస్టర్ కోసం ఎదురు చూస్తున్న సూర్య, విక్రమ్
-
తంగలాన్ తర్వాత 'వీర ధీర సూరన్'గా విక్రమ్
నటుడు చియాన్ విక్రమ్ ఇటీవల నటించిన తంగలాన్ చిత్రం మంచి విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. దాని తరువాత విక్రమ్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం వీర ధీర సూరన్. తంగలాన్ చిత్రానికి పూర్తి భిన్నమైన కథ, కథనాలతో రూపొందుతున్న చిత్రం ఇది. హెచ్ఆర్. పిక్చర్స్ పతాకంపై రియాశిబు నిర్మిస్తున్న ఈ భారీ యాక్షన్ ఎంటర్టెయినర్ కథా చిత్రానికి ఎస్‌యూ. అరుణ్‌కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. కోలీవుడ్‌లో పన్నైయారుమ్ పద్మినియుమ్ , సేతుపతి, చిత్తా (చిన్నా) వంటి విజయవంతమైన చిత్రాలను అరుణ్‌కుమార్ తెరకెక్కించారు. నటి దుషారా విజయన్ నాయకిగా నటిస్తున్న ఇందులో నటుడు ఎస్జే.సూర్య, సురాజ్ వెంజరమూడు, సిద్ధిక్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. జీవీ.ప్రకాశ్‌కుమార్ సంగీతాన్ని, తేనీ ఈశ్వర్ ఛాయాగ్రహణాన్ని అందిస్తున్న ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటూ చివరి దశకు చేరింది. ఇందులో విక్రమ్ కాళీ అనే మాస్ పాత్రలో నటిస్తున్నారు. చిత్ర ఫస్ట్‌లుక్ పోస్లర్ను విడుదల చేయగా చాలా మంచి రెస్పాన్స్‌ను తెచ్చుకుంది. ఇది రెండు భాగాలుగా తెరకెక్కనున్నట్లు సమాచారం. విశేషం ఏమిటంటే రెండో భాగాన్ని ముందు విడుదల చేయనున్నారని తెలిసింది. కాగా ఈ చిత్ర తమిళనాడు విడుదల హక్కులను ఫైవ్‌స్టార్ కే. సెంథిల్ పొందారని యూనిట్ వర్గాలు అధికారికంగా ప్రకటించారు. కాగా వీర ధీర సూరన్ చిత్రాన్ని వచ్చే ఏడాది పొంగల్‌కు రిలీజ్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నట్టు తాజా సమాచారం. దీంతో ఇక నుంచి చియాన్ విక్రమ్ హవా కొనసాగుతుందని ఆయన అభిమానులు సంబరపడుతున్నారు. -
'తంగలాన్' ఓటీటీ విషయంలో తీర్పు వెల్లడించిన కోర్టు
విక్రమ్ హీరోగా పా.రంజిత్ తెరకెక్కించిన చిత్రం 'తంగలాన్'. ఆగస్టు 15న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం ఓటీటీ విడుదల విషయంలో కాస్త జాప్యం ఎదురైంది. సినిమా రిలీజ్ అయి రెండు నెలలు దాటిని ఈ చిత్రం ఓటీటీలోకి అందుబాటులోకి రాలేదు. అయితే, తంగలాన్ ఓటీటీ అంశంపై మద్రాస్ ప్రధాన న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. ఇప్పటికే పలు తేదీలలో స్ట్రీమింగ్ కానుందంటూ సోషల్‌మీడియాలో ప్రచారం జరిగింది. కానీ, అవన్నీ రూమర్స్‌గానే మిగిలిపోయాయి. మాళవిక మోహనన్, పార్వతీ తిరువోతు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు.తంగలాన్ సినిమాను ఓటీటీలో విడుదల చేయవద్దని తిరువళ్లూరుకు చెందిన పోర్కోడి మద్రాసు హైకోర్టులో ప్రజా ప్రయోజన పిటిషన్ దాఖలు చేశారు. ఈ సినిమాలో వైష్ణవులను అవమానించేలా చాలా సన్నివేశాలు ఉన్నాయని ఆయన పిటీషన్ వేశారు. అంతేకాకుండా బౌద్ధమతం గురించి చాలా పవిత్రంగా చూపించిన దర్శకుడు వైష్ణవులను మాత్రం కించపరిచేలా తెరకెక్కించారని పిటీషన్లో పేర్కొన్నారు. ఇప్పుడు ఓటీటీలో విడుదలైతే ఇరువర్గాల మధ్య మత ఘర్షణలు జరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. కాబట్టి ఓటీటీలో తంగలాన్ సినిమా విడుదలను నిషేధించాలని పిటిషన్లో తెలిపారు.తంగలాన్ ఓటీటీ వివాదం పిటిషన్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కేఆర్ శ్రీరామ్, జస్టిస్ సెంథిల్ కుమార్ రామ్మూర్తిలతో కూడిన ధర్మాసనం ముందు విచారణకు వచ్చింది. దానిని పరిశీలించిన న్యాయమూర్తులు మాట్లాడుతూ.. 'తంగళన్ సినిమా ప్రభుత్వ నింబధనల మేరకు సెన్సార్ సర్టిఫికెట్ పొంది థియేటర్లలో విడుదలైంది కాబట్టి అలాంటి నిర్ణయం తీసుకోలేమని కోర్టు తెలిపింది. తంగలాన్ సినిమాను ఓటీటీ ప్లాట్ఫామ్లో విడుదల చేయడానికి ఎలాంటి అడ్డంకి లేదని ఆదేశిస్తూ ఈ కేసును న్యాయస్థానం కొట్టివేసింది. స్టూడియో గ్రీన్ కెఇ జ్ఞానవేల్ రాజా నిర్మించిన ఈ చిత్రానికి జి.వి ప్రకాష్ సంగీతం సమకూర్చారు. తమిళం, తెలుగు, మలయాళం, హిందీ భాషల్లో విడుదలైన తంగలాన్ బాక్సాఫీస్ వద్ద సుమారు రూ. 110 కోట్లు రాబట్టింది. కోర్టు తీర్పుతో దీపావళి కానుకగ తంగలాన్ ఓటీటీలోకి వచ్చే ఛాన్స్ ఉంది. ఈ సినిమా డిజిటల్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ దక్కించుకుంది. -
సల్మాన్ ఖాన్ సోదరుడితో విడాకులు.. ఇప్పుడేమో మాజీ భాయ్‌ఫ్రెండ్‌తో!
ప్రముఖ బాలీవుడ్ ఫ్యాషన్ డిజైనర్, సల్మాన్ ఖాన్ తమ్ముడి భార్య సీమా సజ్దేహ్ ఓ షోలో మెరిసింది. నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారమవుతున్న ఫ్యాబులస్ లైవ్స్ ఆఫ్ బాలీవుడ్ వైవ్స్ సీజన్-3లో కనిపించింది. ఈ షోలో పాల్గొన్న సీమా సజ్దేహ్ తన వివాహా జీవితం గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది. సోహైల్ ఖాన్‌తో పెళ్లికి ముందే ప్రముఖ రచయిత విక్రమ్ అహుజాతో ఎంగేజ్మెంట్ చేసుకుంది. అయితే 1998లో సల్మాన్ ఖాన్ సోదరుడు సోహైల్‌ను పెళ్లాడింది. వీరిద్దరు 2022లో విడాకులు తీసుకున్నారు.తాజాహా నెట్‌ఫ్లిక్స్ షోలో కనిపించిన సీమా.. తన డేటింగ్ గురించి నోరు విప్పింది. సోహైల్‌తో డివోర్స్ తర్వాత విక్రమ్ అహుజాతో డేటింగ్లో ఉన్నట్లు సీమా వెల్లడించింది. ప్రస్తుతం అతనితో డేటింగ్లో ఉన్నానని షాకింగ్ కామెంట్స్ చేసింది. తాను ముంబయిలోని వర్లీ నుంచి బాంద్రాకు మారినప్పుడు తన ఇంటికోసం సాయం చేశాడని సీమా తెలిపింది. తన గురించి నాకంటే అతనికే ఎక్కువగా తెలుసని చెప్పింది. అతనితో మళ్లీ ప్రేమలో పడినందుకు సంతోషంగా ఉందని తెలిపింది.కాగా.. విక్రమ్ అహుజా ఒక వ్యాపారవేత్త. మల్టీ మిలియనీర్ దేవేంద్ర అహుజా కుమారుడు. అతను సెంచూరియన్ బ్యాంక్ ప్రమోటర్‌గా పనిచేశాడు. గతంలో సీమా, విక్రమ్ 1990 నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. అయితే ఊహించని కారణాలతో వాళ్లిద్దరు విడిపోయారు. ఆ తర్వాత సీమా.. సల్మాన్ ఖాన్ సోదరుడు సోహైల్ ఖాన్‌ను వివాహం చేసుకుంది. ఈ జంటకు ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు. కానీ వీరిద్దరు రెండేళ్ల క్రితమే విడాకులు తీసుకున్నారు. దీంతో తాజాగా సీమా తన మాజీ బాయ్‌ఫ్రెండ్ విక్రమ్ అహుజాతో డేటింగ్ చేస్తున్నట్లు తెలిపింది. నెట్‌ఫ్లిక్స్ షో ఫ్యాబులస్ లైవ్స్ ఆఫ్ బాలీవుడ్ వైవ్స్ షోలో ఈ విషయాన్ని వెల్లడించింది. -
తంగలాన్ ఓటీటీ విడుదలపై ప్రకటన చేసిన నిర్మాత
విక్రమ్- పా.రంజిత్ కాంబినేషన్లో తెరకెక్కిన సినిమా తంగలాన్. బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అందుకున్న ఈ మూవీ ఆగష్టు 15న విడుదల అయింది. అయితే, తంగలాన్ ఓటీటీ ఎంట్రీ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. థియేటర్లలో తంగలాన్ వేట కొనసాగించి ఇప్పటికే రెండు నెలలు పూర్తి అయింది. బాలీవుడ్లో కూడా విడుదలైన ఈ మూవీ అక్కడ కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా ఈ సినిమా ఓటీటీ విడుదల గురించి చిత్ర నిర్మాత ప్రకటన చేశారు.డైరెక్టర్ పా రంజిత్ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని నిర్మాత జ్ఞానవేల్ రాజా నిర్మించారు. అయితే, తంగలాన్ ఓటీటీ హక్కులను నెట్‌ఫ్లిక్స్ దక్కించుకుంది. కానీ, స్ట్రీమింగ్ విషయంలో మేకర్స్ నుంచి పలు అడ్డంకులు రావడంతో ఈ చిత్రాన్ని నెట్‌ఫ్లిక్స్ రిలీజ్ చేయలేదని ఊహాగానాలు వినిపించాయి. ఈ విషయంపై తాజాగా జ్ఞానవేల్ రాజా క్లారిటీ ఇచ్చారు. 'దీపావళికి తంగలాన్ సినిమాను విడుదల చేయాలని వారు (నెట్‌ఫ్లిక్స్) నిర్ణయించారు. తంగలన్ పెద్ద సినిమా కాబట్టి పండుగ నాడు విడుదల చేస్తే బాగుంటదని తెలిపారు. అయితే, తంగలాన్ ఓటీటీ విడుదల విషయంలో కొన్ని సమస్యలు ఉన్నాయని వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు. వాస్తవానికి సమస్య లేకున్నా కూడా.. సమస్య ఉందని చెప్పుకునే నేర్పు నేటి సోషల్‌మీడియా వార్తలకు ఉంది.' అని ఆయన తెలిపారు. అక్టోబర్ 31 లేదా నవంబర్ 1న తంగలాన్ నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కావడం ఖాయమని చిత్ర నిర్మాత పేర్కొన్నారు.కథేంటి..?గోల్డ్ హంట్ నేపథ్యంలో తంగలాన్ను తెరకెక్కించారు పా. రంజిత్. 1850లో బ్రిటీషర్లు మన దేశాన్ని పాలిస్తున్న సమయంలో జరిగిన కాన్సెప్ట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. వెప్పూర్ అనే ఊరిలో తంగలాన్ (విక్రమ్).. తన కుటుంబంతో కలిసి బతుకుతుంటాడు. అనుకోని పరిస్థితుల్లో బంగారం వెతకడం కోసం క్లెమెంట్ అనే ఇంగ్లీష్ దొరతో కలిసి తంగలాన్ వెళ్లాల్సి వస్తుంది. ఈ ప్రయాణంలో వింత వింత అనుభవాలు ఎదురవుతాయి. మరి తంగలాన్ చివరకు బంగారం కనిపెట్టాడా? అరణ్య, ఆరతితో ఇతడికి ఉన్న సంబంధమేంటి అనేదే మెయిన్ స్టోరీ. ఈ మూవీకి సీక్వెల్ తంగలాన్ 2 ఉంటుందని విక్రమ్ వెల్లడించారు. -
ఓటీటీకి రాని తంగలాన్.. అసలు సమస్య ఇదేనా?
తమిళ స్టార్ హీరో విక్రమ్ ఇటీవల నటించిన సినిమా 'తంగలాన్'. ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. అయినప్పటికీ భారీగానే కలెక్షన్స్ రాబట్టింది. పా.రంజిత్ డైరెక్షన్లో తెరకెక్కించిన ఈ మూవీని తెలుగు, తమిళంలో ఓకేసారి రిలీజ్ చేశారు.అయితే ఈ మూవీ రిలీజైన రెండు నెలల కావొస్తున్నా ఇప్పటికీ ఓటీటీకి రాలేదు. ఈ చిత్రం ఓటీటీలోకి ఎప్పుడొస్తుందా అని మూవీ లవర్స్ ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే తంగలాన్ డిజిటల్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను డిజిటల్ స్ట్రీమింగ్ చేయనున్నట్టు అధికారికంగా కూడా ప్రకటించారు. దీంతో ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం అవుతుందని ఓటీటీ ఆడియన్స్ వెయిట్ చేశారు. కానీ ఓటీటీలో స్ట్రీమింగ్ కాలేదు.తాజా సమాచారం మేరకు నెట్ ఫ్లిక్స్‌తో మేకర్స్‌కు సమస్యలు తలెత్తినట్లు తెలుస్తోంది. ఈ మూవీ డిజిటల్ రైట్స్ ఒప్పందాన్ని నెట్‌ఫ్లిక్స్ రద్దు చేసుకుంటున్నట్లు టాక్ వినిపిస్తోంది. దీంతో తంగలాన్ హక్కులు ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ కొనుగోలు చేసినట్లు లేటేస్ట్ టాక్. త్వరలోనే స్ట్రీమింగ్ కు తీసుకురానున్నట్లు సమాచారం.తంగలాన్ కథేంటంటే..'తంగలాన్' విషయానికొస్తే 1850లో చిత్తూరు ప్రాంతంలోని పల్లెటూరు. తంగలాన్ ఓ శ్రామికుడు. అతడికి భార్య ఐదుగురు పిల్లలు. ఓ రోజు పిల్లలతో.. ఏనుగు కొండ వెనకాల బంగారం కొండ ఉందని, దానికి ఓ రక్షకురాలు ఉందని ఏవో కథలు చెబుతాడు. కట్ చేస్తే తంగలాన్‌తోపాటు కొందరిని బ్రిటీష్ దొరలు బంగారం నిధుల కోసం కూలీలుగా తీసుకెళ్తారు. నిధి అన్వేషణ కోసం సాగించిన ప్రయాణంలో వీళ్లకు ఎదురైన సవాళ్లు ఏంటి? చివరకు ఏమైందనేదే కథ. -
రెండు దశాబ్దాల తర్వాత...
రెండు దశాబ్దాల తర్వాత హీరోలు విక్రమ్, సూర్య కలిసి నటించే అవకాశం కనిపిస్తోంది. తమిళ రచయిత ఎస్యు వెంకటేశన్ రాసిన ‘వీరయుగ నాయగన్ వేళ్‌పారీ’ నవల హక్కులు ప్రముఖ దర్శకుడు శంకర్ వద్ద ఉన్నాయి. ఈ నవల ఆధారంగా ఓ సినిమాను తెరకెక్కించాలనుకుంటున్నారట శంకర్. ఈ సినిమాను ఆయన రెండు భాగాలుగా తీయనున్నారని, ఇందులో విక్రమ్–సూర్య హీరోలుగా నటించనున్నారని కోలీవుడ్ టాక్.2003లో వచ్చిన ‘పితాగమన్’ (తెలుగులో ‘శివపుత్రుడు’) చిత్రం తర్వాత సూర్య, విక్రమ్ కలిసి నటించలేదు. మరి... 21ఏళ్ల తర్వాత శంకర్ సినిమా కోసం వీరిద్దరూ కలిసి మళ్లీ స్క్రీన్ షేర్ చేసుకుంటారా? లెట్స్ వెయిట్ అండ్ సీ. మరోవైపు దర్శకుడు శంకర్ ప్రస్తుతం రామ్‌చరణ్ ‘గేమ్ చేంజర్’ను రిలీజ్‌కు రెడీ చేస్తున్నారు. అలాగే ఆయన దర్శకత్వంలో కమల్‌హాసన్ హీరోగా నటించిన ‘ఇండియన్ 3’ విడుదలకు సిద్ధమవుతోంది. ఈ రెండు సినిమాల తర్వాతనే ‘వీరయుగ నాయగన్ వేళ్‌పారీ’ నవలను సినిమాగా తీసే పనులపై శంకర్ పూర్తి స్థాయి దృష్టి పెట్టాలనుకుంటున్నారని కోలీవుడ్ భోగట్టా. -
డైరెక్టర్ శంకర్ సినిమాలో ఇద్దరు స్టార్ హీరోలు
భారీ బడ్జెట్ చిత్రాలకు కేరాఫ్ దర్శకుడు శంకర్. తాజాగా విడుదలైన ఇండియన్– 2 చిత్రం వరకూ ఆయన తెరకెక్కించిన చిత్రాలన్నీ కూడా ఎక్కువ ఖర్చుతో కూడుకున్నవే.. అయితే ఇటీవల విడుదలై ఇండియన్– 2 చిత్రం పూర్తిగా నిరాశపరిచింది. కాగా ప్రస్తుతం స్టార్ హీరో రామ్‌చరణ్ కథానాయకుడిగా గేమ్ ఛేంజర్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంతో మళ్లీ సూపర్‌హిట్ బాట పట్టడానికి దర్శకుడు శంకర్ శ్రమిస్తున్నారు. ఈ చిత్రం డిసెంబర్లో తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. ఈ సినిమా తరువాత ఇండియన్– 3 చిత్రాన్ని పూర్తి చేయడానికి సిద్ధం అవుతున్నట్లు సమాచారం. ఇకపోతే మరో భారీ చారిత్రక కథా చిత్రాన్ని తెరకెక్కించే ప్రయత్నంలో దర్శకుడు శంకర్ ఉన్నారు. ఏల్పారి నవల హక్కులను పొందిన శంకర్ దీన్ని భారీ బడ్జెట్లో తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే దీన్నీ మల్టీస్టారర్ చిత్రంగా రూపొందించనున్నట్లు తెలిసింది. ఆ స్టార్ హీరోలెవరో కాదు చియాన్ విక్రమ్, సూర్య అని సామాజిక మాధ్యమాల్లో ప్రచారం సాగుతోంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాలంటే మరికొద్ది కాలం ఆగాల్సిందే. అయితే వీరిద్దరూ చాలా కాలం క్రితం నటించిన పితామగన్ అనే సంచలన విజయం సాధించింది. కాగా ఇప్పుడు నటుడు విక్రమ్, సూర్య కలిసి నటిస్తే వేల్పారి నవల మరో సంచలన చిత్రం అవుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. -
దుబాయ్ లో సైమా 2024 అవార్డ్స్ ప్రదానోత్సవం...తారల సందడి (ఫొటోలు)
-
ఓటీటీ రిలీజ్‌కి ముందే 'తంగలాన్'కి దెబ్బ
తమిళ స్టార్ హీరో విక్రమ్ లేటెస్ట్ సినిమా 'తంగలాన్'. ఆగస్టు 15న తెలుగు, తమిళంలో ఒకేసారి రిలీజైంది. మన దగ్గర మిశ్రమ స్పందన తెచ్చుకున్న ఈ చిత్రం ఓటీటీలోకి ఎప్పుడొస్తుందా అని మూవీ లవర్స్ ఎదురుచూస్తున్నారు. ఇంతలోనే ఊహించని మూవీ టీమ్ షాకయ్యే సంఘటన జరిగింది. తమిళ వెర్షన్ ప్రింట్ ఆన్లైన్లో లీక్ అయిపోయింది. దీంతో ఓటీటీ స్ట్రీమింగ్ విషయంలో ప్లాన్ మారినట్లు తెలుస్తోంది.విలక్షణ చిత్రాలు తీసే దర్శకుడు పా.రంజిత్.. 'తంగలాన్' సినిమా కోసం సరికొత్త ప్రపంచాన్ని సృష్టించాడు. 18వ శతాబ్దంలో మొదలయ్యే కథ 5వ శతాబ్దానికి వెళ్లి మరీ ఆగుతుంది. ఇందులో అందరూ డీ గ్లామర్ లుక్‌లో కనిపించి ఆశ్చర్యపరచగా.. కథ కూడా ఓ పట్టాన అర్థం కాదు. ఒకవేళ అర్థమైతే మాత్రం మైండ్ బ్లోయింగ్ అనిపిస్తుంది.(ఇదీ చదవండి: Bhargavi Nilayam Review: ఓ దెయ్యం పరిష్కరించుకున్న కథ!)లెక్క ప్రకారం ఆరు వారాల తర్వాత నెట్‌ఫ్లిక్స్‌లో 'తంగలాన్' స్ట్రీమింగ్ కావాలి. కానీ ఇప్పుడు ప్రింట్ లీక్ కావడంతో సెప్టెంబరు 20 నుంచే దక్షిణాది భాషల్లో ఓటీటీ రిలీజ్ కానుందని, 27వ తేదీ నుంచి హిందీ వెర్షన్ అందుబాటులోకి వస్తుందని సమాచారం. ఆన్లైన్లో ప్రింట్ లీక్ అయిపోయింది కాబట్టి బహుశా ఇదే జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.'తంగలాన్' విషయానికొస్తే 1850లో చిత్తూరు ప్రాంతంలోని పల్లెటూరు. తంగలాన్ ఓ శ్రామికుడు. అతడికి భార్య ఐదుగురు పిల్లలు. ఓ రోజు పిల్లలతో.. ఏనుగు కొండ వెనకాల బంగారం కొండ ఉందని, దానికి ఓ రక్షకురాలు ఉందని ఏవో కథలు చెబుతాడు. కట్ చేస్తే తంగలాన్‌తోపాటు కొందరిని బ్రిటీష్ దొరలు బంగారం నిధుల కోసం కూలీలుగా తీసుకెళ్తారు. నిధి అన్వేషణ కోసం సాగించిన ప్రయాణంలో వీళ్లకు ఎదురైన సవాళ్లు ఏంటి? చివరకు ఏమైందనేదే కథ.(ఇదీ చదవండి: రూ. 2 వేల కోట్ల భారీ స్కామ్‌లో సినీ నటి అరెస్ట్) -
ఓటీటీలో బంగారు వీరుడు 'తంగలాన్'
విక్రమ్- పా.రంజిత్ కాంబినేషన్లో తెరకెక్కిన సినిమా తంగలాన్. ఆగష్టు 15న విడుదల అయిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు రాబట్టింది. విక్రమ్ కెరియర్లో ఎప్పటికీ నిలిచిపోయే చిత్రంగా తంగలాన్ ఉంటుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. వాణిజ్యపరంగా కూడా సుమారు రూ. 110 కోట్లు రాబట్టిన తంగలాన్ బాలీవుడ్లో కూడా తాజాగా విడుదలైంది. అక్కడి సినీ అభిమానులు కూడా విక్రమ్ నటనకు ఫిదా అవుతున్నారు. అయితే, తాజాగా తంగలాన్ ఓటీటీ ప్రకటన గురించి ఒక వార్త వైరల్ అవుతుంది.తంగలాన్ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ దక్కించుకుంది. విక్రమ్ మీద నమ్మకంతో సినిమా విడుదలకు ముందే డీల్ సెట్ చేసుకుంది. సెప్టెంబర్ 20న ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుందని నెట్‌ఫ్లిక్స్ ప్రకటించినట్లు ఒక పోస్టర్ వైరల్ అవుతుంది. అయితే, అదే నిజమని ఇండస్ట్రీ వర్గాలు కూడా పేర్కొంటున్నాయి. కానీ, నెట్‌ఫ్లిక్స్ అధికారిక సోషల్‌మీడియాలో తంగలాన్ గురించి ఎలాంటి సమాచారం లేదు. సెప్టెంబర్ 20 తెలుగు,తమిళ్,కన్నడ,మలయాళంలో మాత్రమే తంగలాన్ విడుదల తప్పకుండా అవుతుందని సమాచారం. అయితే, హిందీ వర్షన్ మాత్రం ఒక వారం గ్యాప్‌తో రిలీజ్ కానున్నట్లు టాక్.కథేంటి..?గోల్డ్ హంట్ నేపథ్యంలో తంగలాన్ను తెరకెక్కించారు పా. రంజిత్. 1850లో బ్రిటీషర్లు మన దేశాన్ని పాలిస్తున్న సమయంలో జరిగిన కాన్సెప్ట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. వెప్పూర్ అనే ఊరిలో తంగలాన్ (విక్రమ్).. తన కుటుంబంతో కలిసి బతుకుతుంటాడు. అనుకోని పరిస్థితుల్లో బంగారం వెతకడం కోసం క్లెమెంట్ అనే ఇంగ్లీష్ దొరతో కలిసి తంగలాన్ వెళ్లాల్సి వస్తుంది. ఈ ప్రయాణంలో వింత వింత అనుభవాలు ఎదురవుతాయి. మరి తంగలాన్ చివరకు బంగారం కనిపెట్టాడా? అరణ్య, ఆరతితో ఇతడికి ఉన్న సంబంధమేంటి అనేదే మెయిన్ స్టోరీ. ఈ మూవీకి సీక్వెల్ తంగలాన్ 2 ఉంటుందని విక్రమ్ వెల్లడించారు. -
'మిమ్మల్ని ఎలా ట్రీట్ చేయాలో అర్థం కాదు'.. విక్రమ్‌కు వార్నింగ్!
కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ ఇటీవలే తంగలాన్ మూవీతో ప్రేక్షకులను అలరించాడు. పా రంజిత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో డిఫరెంట్ లుక్‌లో కనిపించి ఆకట్టుకున్నారు. ఆగస్టు 15న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ మూవీలో పార్వతి తిరువోతు, మాళవిక మోహనన్ హీరోయిన్లుగా నటించారు.అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన విక్రమ్ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. శంకర్ తెరకెక్కించిన ఐ మూవీ కోసం బరువు తగ్గినట్లు వెల్లడించారు. దాదాపు 86 కిలోల నుంచి ఏకంగా 52 కేజీలకు తగ్గానని తెలిపారు. అయితే తన శారీరక మార్పులతో తీవ్రమైన సమస్య నుంచి బయటపడ్డానని వివరించారు. 50 కంటే బరువు తగ్గితే మీ శరీరంలో అవయవాలు పనిచేయవని డాక్టర్ హెచ్చరించినట్లు తెలిపారు. ఆర్గాన్స్ ఫెయిల్ అయితే.. మిమ్మల్ని ఎలా ట్రీట్ చేయాలో కూడా మాకు అర్థం కాదంటూ వైద్యులు చెప్పారని గుర్తు చేసుకున్నారు. అంతేకాకుండా కాశీ అనే మూవీలో విక్రమ్ అంధుడి పాత్రలో నటించారు. ఈ పాత్ర కోసం విపరీతమైన శారీరక మార్పులకు ప్రయత్నించానని తెలిపారు. ఆ చిత్రంలో నటించాక దాదాపు మూడు నెలలపాటు సరిగా చూడలేకపోయానని విక్రమ్ వెల్లడించారు. ఆ మూవీలో అంధుడిగా కనిపించడానికి కళ్లు పైకెత్తి చూడాల్సి వచ్చేదని.. ఆ ఎఫెక్ట్ నా కంటి చూపుపై తీవ్ర ప్రభావం చూపిందని వివరించారు. దీంతో మెల్లకన్ను వచ్చే ప్రమాదం ఉందని డాక్టర్స్ వార్నింగ్ ఇచ్చారని గుర్తు చేసుకున్నారు. సినిమాల్లో పాత్రల కోసం తన ప్రాణాలనే రిస్క్‌లో పెడుతున్న విక్రమ్‌ను చూస్తుంటే ఆయన డెడికేషన్ ఏంటో అర్థమవుతోంది. కాగా.. ఇటీవల విడుదలైన 'తంగలాన్' కోసం కొంత బరువు తగ్గడంతో పాటు సగం తల గుండు చేయించుకున్నాడు. -
అభిమానులకు భోజనం వడ్డించిన స్టార్ హీరో.. వీడియో వైరల్!
కోలీవుడ్ సూపర్ స్టార్ చియాన్ విక్రమ్ నటించిన పీరియాడికల్ చిత్రం తంగలాన్. ఈ చిత్రంలో మాళవిక మోహనన్ హీరోయిన్గా నటించింది. భారీ అంచనాల మధ్య ఈ మూవీ ఆగస్టు 15న థియేటర్లలోకి వచ్చింది. రిలీజ్ రోజు నుంచే పాజిటివ్ టాక్ రావడంతో బాక్సాఫీస్ వద్ద బాగానే వసూళ్లు రాబట్టింది. పా రంజిత్ డైరెక్షన్లో ఈ మూవీని స్టూడియో గ్రీన్ పతాకంపై నిర్మించారు.భోజనం వడ్డించిన హీరో..బాక్సాఫీస్ వద్ద తంగలాన్ సూపర్ హిట్ కావడంతో మేకర్స్ సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ సందర్భంగా చిత్రయూనిట్ సభ్యులు, అభిమానులతో కలిసి సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవెంట్‌కు హాజరైన అభిమానులకు హీరో విక్రమ్ స్వయంగా భోజనం వడ్డించారు. స్టార్ హీరో అయి ఉండి సింపుల్‌గా కనిపించారు. తమిళ సంప్రదాయమైన పంచెకట్టులో కనిపించి సందడి చేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. #Thangalaan success meetA @chiyaan treat 🥳 pic.twitter.com/nFoFtL7FAA— Kalaiarasan 𝕏 (@ikalaiarasan) August 27, 2024 -
చరిత్ర కుహరాల నుంచి...
అణగారిన ప్రజలు తమకి ఓ గొప్ప పోరాట చరిత్ర ఉందని తెలిస్తే యధాతథ వాదాన్ని అంగీ కరించరు. వర్తమానంలో తమపై అమలయ్యే వివక్షను కచ్చితంగా ఎదిరిస్తారు. అది తమ తలరాత అని ఊరుకోకుండా తమపై రుద్దిన బానిసత్వంపై తిరగబడి తమదైన కొత్త సమాజాన్ని నిర్మించుకుంటా రని మహాత్మా జ్యోతిరావు ఫూలే ఎప్పుడో చెప్పాడు. ఫూలే చెప్పిన పోరాటాల చరిత్రను... ప్రాచీన భారత దేశ చరిత్ర అంతా బౌద్ధానికి– వైదిక హిందూ మతానికి మధ్య జరిగిన ఘర్షణ అని బాబాసాహెబ్ అంబేడ్కర్ విశదీ కరించాడు. ఇంతకాలం కట్టుకథలు, పిట్టకథలు చరిత్రగా చలామణి అయినట్లే మన సినిమాలు కూడా ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు మసిపూసి మారేడుకాయ చేస్తూ కొందరి జీవితాన్నే అందరి జీవితంగా కాకమ్మ కథలతో జనం కంట్లో కారం కొట్టి బతికేస్తున్నాయి.అయితే సింహాల నుంచి చరిత్రకారుడు పుట్టు కొచ్చాడు. వర్ణ అంధత్వంతో కునారిల్లిన నూరేళ్ళ వెండి తెరను బదబదాలుగా చించి పోగులు పెడుతూ సరికొత్త దారిని వేసుకుంటూ పోతున్నాడు పా. రంజిత్. అవును పా. రంజిత్ అసలైన చరిత్రను రక్తమాంసాలతో సిల్వర్ స్క్రీన్ మీద పరుస్తున్నాడు. తంగలాన్ ఈ దేశ మూలవాసుల అసలు చరిత్ర... చూసినవాళ్లకి కంటి మీద కునుకు పడ నీయని చరిత్ర! తంగలాన్ అందర్నీ తీవ్రంగా డిస్టర్బ్ చేస్తున్నాడు. కడుపులో చేయిపెట్టి దేవుతున్నాడు. కొందరు బాహాటంగానే వాంతులు చేసుకుంటున్నారు. మరికొందరికి రక్తం మరుగుతుంది, కళ్లలో నీళ్లు సుడులు తిరుగుతున్నాయి. చారెడు భూమి కోసం, కాసింత గౌరవం కోసం తమవాళ్ళు చేసిన హాహాకారాలు, కొండలు గుట్టలు దాటి నడిచిన యోజనాలు, కడచిన దారులు, చరిత్ర పొడవునా పారిన నెత్తురు కళ్ళముందు కదులుతూంటే గుండె చెరువవుతోంది.ఎవరు కాదని బుకాయించినా ఈ దేశ సాంస్కృతిక వారసత్వం బౌద్ధంలో ఉంది. నేటి దళితులు బౌద్ధ సాహి త్యంలో పేర్కొన్న నాగుల సంతతివారు. వారే బౌద్ధాన్ని అవలంబించి బుద్ధుని మార్గంలో నడి చిన శాంతి కాముకులు. కానీ బౌద్ధాన్ని చంపి, బౌద్ధులపై అంటరాని తనాన్ని రుద్దుతూ వారి మెడలో ముంతలు కట్టింది వైదిక బ్రాహ్మణ మతం. తర్వాత తన సంఖ్యా బలాన్ని పెంచుకోవడానికి దళితుల మెడలో ముంతను అంతే ఉంచి జంధ్యం వేసింది. వైష్ణవ మతంలోకి వెళ్ళిన దళితులను వెళ్లని వారి నెత్తిన కూర్చోబెట్టింది. ఈ చరిత్రను తంగలాన్‌లో పా. రంజిత్ కళ్ళకు కట్టించాడు.బౌద్ధంలో ‘హారీతి’ అనే దేవత ఉన్నట్టు తెలుగు శాస నాల్లో కూడా ఉంది. ఆమె ఒక ప్రకృతి దేవత. వజ్రయానంలో సిద్దులు చేసిన ప్రయోగాలు, సిద్దుల రసవాదం పక్కన పెట్టి వారిని ‘క్షుద్ర’ విద్యలు తెలిసిన మాంత్రి కులనీ, బుద్ధుడిని అశుభానికి గుర్తుగా ప్రచారం చేసింది పూజారి వర్గం. బౌద్ధాన్ని అవలంబించేవారిని ఉలిపి కట్టెలుగా, సమాజానికి కీడు చేసేవారిగా చిత్రించి వారిపట్ల ద్వేష భావం పెంచడాన్ని ఈ సినిమాలో సందర్భానుసారంగా చూపించాడు. తమిళనాడు నుంచి కోలార్ బంగారు గనులకు కూలికోసం గని తవ్వకం పనికి వెళ్లి అక్కడే స్థిరపడిన దళితులు 19వ శతాబ్దం చివరికి కేజీఎఫ్‌లో ఓ కొత్త సమాజాన్ని నిర్మించుకున్నారు. పండిత అయోతీదాసు కేజీఎఫ్ కేంద్రంగా ఆది ద్రావిడ ఉద్యమాన్ని నిర్మించాడు. దళితులు హిందువులు కాదు, ఆది బౌద్ధులని చెప్పి వారిలో ఆత్మగౌరవాన్ని నూరిపోసి ‘శాక్య బౌద్ధ సమాజాన్ని’ స్థాపించిన అయోతీదాసుకి కేజీఎఫ్ ఒక లిబరేటెడ్ లాండ్ (విముక్త భూమి). దీనికి కొనసాగింపుగా పెరియార్ 1932లో ద్రావిడ ఉద్యమాన్ని కేజీఎఫ్ నుంచే ప్రారంభించడం విశేషం.కేజీఎఫ్‌లో దళితులు ఇప్పటికీ కులానికీ, మత తత్వానికీ ఎదురు నిలుస్తూ ప్రత్యామ్నాయ రాజకీయాలు కూడా నిర్మిస్తున్నారు. దాని వెనుక ఉన్న త్యాగాల చరిత్రను పట్టుకున్నాడు పా. రంజిత్. తంగలాన్ దళిత సమస్య తాలూకు ప్రతి అంశాన్నీ తడిమిందని చెప్పాలి. దళిత స్త్రీలు ఒకప్పుడు పైవస్త్రం రవిక వేసుకునే వీలు లేదు. అది కొన్ని ప్రాంతాలలో నిషేధం అయితే మరికొన్ని చోట్ల తమ పేదరికం వలన కూడా వారికి అది దక్కేది కాదు. వారు రవిక ధరించడం తమ జనంలో ఓ గొప్ప ఉత్సవం. ఈ సినిమాలో అటువంటి సన్నివేశం ఒకటి అద్భుతంగా చిత్రించాడు పా. రంజిత్.అలాగే దళితుల ఆహారం! వారంతా గని తవ్వకం పనికి కోలార్ వెళ్లినాక కథానాయకుడు తంగలాన్‌తో అతని భార్య గంగమ్మ ‘మావా చింతపండు పులుసు పోసి నెత్తళ్ళ కూర వొండేదా?’ అంటే అతడు ‘కాదుమే, ఎండు తునకలు కూర చెయ్’ అంటాడు. వారు తిండిలేక అలమటిస్తున్నప్పుడు ఒక అడవి దున్న కనిపిస్తే దానిని నరికి మాంసం తిని తిరిగి శక్తి తెచ్చుకుని పని మెదలు పెట్టాలి అనుకుంటారు. ఇవన్నీ వారి జీవితాలలో సహజాతి సహజం. దళిత సమాజంలో స్త్రీ–పురుష సంబంధాలలో ఒకప్పుడు కనిపించే అరమరికలు లేనితనం, గుంపులో ఒకరిపట్ల మరొకరికి ఉండే కన్సర్న్, సామూహికత, చక్కటి సంభాషణలు తంగలాన్ సినిమాకు గొప్ప సౌందర్యాన్ని అద్దాయనవచ్చు.తెగిపడిన శాక్యముని తలని అతికించడం, చరిత్రలో కానరాకుండా పోయిన బంగారం లాంటి మూలవాసుల చరిత్రను వెలికితీయడం... అనే రెండు ముఖ్యమైన కర్తవ్యా లను తంగలాన్ శక్తిమంతంగా నిర్వహించింది. భూమి కోసం, భుక్తికోసం, ఆత్మగౌరవం కోసం చరిత్ర పొడవునా దళితులు వేసిన పొలికేకలు ఈ సినిమాలో మనకి అడుగ డుగునా వినిపిస్తాయి. చరిత్ర కళ్ళకు కట్టినట్టు వాస్తవికంగా కనిపించడం తంగలాన్ విజయం! నూరేళ్ళ వెండితెరపై మట్టి పాదాల్ని తన సంతకంగా ముద్రించిన సిసలైన తంగలాన్ పా. రంజిత్, తంగలాన్ పాత్రలో పూర్తిగా నిమగ్నమై గొప్పగా దానికి జీవం పోసిన హీరో విక్రమ్, అతని భార్యగా నటించిన పార్వతి, ప్రకృతి దేవత ‘ఆరతి’గా నటించిన మాళవిక, ఇతర నటీనటులు; ఒళ్ళు గగుర్పొడిచే సంగీతాన్ని అందించిన జీవీ ప్రకాష్, ‘అంటారానోళ్ల’ చరిత్రని సంగర్వంగా సమర్పించిన జ్ఞాన వేల్... అందరికీ జై భీమ్!'తమిళనాడు నుంచి కోలార్ బంగారు గనులకు కూలికోసం గని తవ్వకం పనికి వెళ్లి అక్కడే స్థిరపడిన దళితులు 19వ శతాబ్దం చివరికి కేజీఎఫ్‌లో ఓ కొత్త సమాజాన్ని నిర్మించుకున్నారు. పండిత అయోతీదాసు కేజీఎఫ్ కేంద్రంగా ఆది ద్రావిడ ఉద్యమాన్ని నిర్మించాడు. దళితులు హిందువులు కాదు, ఆది బౌద్ధులని చెప్పి వారిలో ఆత్మగౌరవాన్ని నూరిపోసి ‘శాక్య బౌద్ధ సమా జాన్ని’ స్థాపించిన అయోతీదాసుకి కేజీఎఫ్ ఒక లిబరేటెడ్ లాండ్ (విముక్త భూమి). దీనికి కొనసాగింపుగా పెరియార్ 1932లో ద్రావిడ ఉద్యమాన్ని కేజీఎఫ్ నుంచే ప్రారంభించడం విశేషం. కేజీఎఫ్‌లో దళితులు ఇప్పటికీ కులానికీ, మత తత్వానికీ ఎదురు నిలుస్తూ ప్రత్యామ్నాయ రాజకీయాలు కూడా నిర్మిస్తున్నారు. దాని వెనుక ఉన్న త్యాగాల చరిత్రను పట్టుకున్నాడు పా. రంజిత్'.– చల్లపల్లి స్వరూపరాణి, వ్యాసకర్త, ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపాల్ -
బాలీవుడ్ వైపు తంగలాన్.. విడుదల తేదీ ప్రకటన
విక్రమ్- పా.రంజిత్ కాంబినేషన్లో తెరకెక్కిన సినిమా తంగలాన్. ఆగష్టు 15న విడుదల అయిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించడమే కాకుండా సినీ ప్రేక్షకులను ఫిదా చేస్తుంది. సుమారు రూ. 40 కోట్లకు పైగానే నెట్ కలెక్షన్లు రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. తెలుగు,తమిళ,కన్నడలో మాత్రమే విడుదలైన తంగలాన్ ఇప్పుడు హిందీలో కూడా విడుదల కానుంది. ఈమేరకు అధికారికంగా ప్రకటన కూడా వచ్చేసింది.గోల్డ్ హంట్ నేపథ్యంలో తంగలాన్ను తెరకెక్కించారు పా. రంజిత్. సౌత్ ఇండియా అభిమానులను మెప్పించిన ఈ సినిమా ఇప్పుడు బాలీవుడ్లో అడుగుపెట్టబోతుంది. తాజాగా డైరెక్టర్ పా.రంజిత్ తన ఇన్స్టాగ్రామ్ ద్వారా ఒక పోస్టర్‌తో ఈ విషయం తెలిపారు. 'బంగారు వీరుడు ఆగస్టు 30న ఉత్తర భారత దేశానికి వస్తున్నాడు. ఈ ఎపిక్ స్టోరీని చూసేందుకు సిద్ధంగా ఉండండి' అంటూ ఆయన చెప్పుకొచ్చాడు. కర్ణాటకలోని కోలార్ గోల్డ్ ఫీల్డ్ కార్మికుల జీవితాల ఆధారంగా దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.కథేంటి..?1850లో బ్రిటీషర్లు మన దేశాన్ని పాలిస్తున్న సమయంలో జరిగిన కాన్సెప్ట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. వెప్పూర్ అనే ఊరిలో తంగలాన్ (విక్రమ్).. తన కుటుంబంతో కలిసి బతుకుతుంటాడు. అనుకోని పరిస్థితుల్లో బంగారం వెతకడం కోసం క్లెమెంట్ అనే ఇంగ్లీష్ దొరతో కలిసి తంగలాన్ వెళ్లాల్సి వస్తుంది. ఈ ప్రయాణంలో వింత వింత అనుభవాలు ఎదురవుతాయి. మరి తంగలాన్ చివరకు బంగారం కనిపెట్టాడా? అరణ్య, ఆరతితో ఇతడికి ఉన్న సంబంధమేంటి అనేదే మెయిన్ స్టోరీ. -
'తంగలాన్' మరో కోణంలో చూస్తే.. సోషల్ మీడియా రివ్యూస్
ఆగస్టు 15న రిలీజైన డబ్బింగ్ సినిమా 'తంగలాన్'. ఓ మాదిరి అంచనాలతో థియేటర్లలోకొచ్చిన ఈ చిత్రానికి తొలిరోజు మిక్స్డ్ టాక్ వచ్చింది. కానీ తర్వాత తర్వాత మెల్లగా పికప్ అవుతోంది. 'మిస్టర్ బచ్చన్', 'డబుల్ ఇస్మార్ట్' ఫెయిలవడం కూడా దీనికి ప్లస్. రొటీన్ రెగ్యులర్ కమర్షియల్ మూవీస్‌లా కాకుండా కాస్త డిఫరెంట్‌గా ఉండటంతో కొందరు తెగ నచ్చేస్తే.. మరికొందరికి మాత్రం అస్సలు నచ్చలేదు. అయితే 'తంగలాన్'ని మరో కోణంలో చూసిన కొందరు సోషల్ మీడియాలో తమదైన రివ్యూలు ఇచ్చారు. అలాంటి వాటిలో కొన్ని మీకోసం..(ఇదీ చదవండి: 'పుష్ప 2'కి పోటీగా రష్మిక నుంచే మరో సినిమా)'ఆత్మగౌరవంతో ఎలా బ్రతకాలో చెప్పేదే 'తంగలాన్' సినిమా. అలాగే మన సంస్కృతి, జీవన విధానాన్ని తెలియపరిచేలా లోతుగా అర్థం అయ్యేలా చాటి చెప్పిన దర్శకుడు పా.రంజిత్. మహిళలకు రవికలు పంచగానే అవి వేసుకుని ఊరంతా సంబరాలు జరుపుకొనేలా వచ్చే పాట 'మనకి మనకి'.. మన అమ్మలు, నాయనమ్మలు చిన్నతనంలో రోళ్లలో వడ్లు పోసి, దంచుతూ పాడుకునేలా సంగీతాన్ని అందించిన జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం, తంగలాన్ బట్టలు వేసుకుంటే ఓర్వకుండా చింపిన మళ్ళీ సూది దారంతో కుట్టుకుని తిరిగి వేసుకోవడం ఇదే కదా ఆత్మ గౌరవంతో కూడిన చారిత్రక జీవన విధానం. -సతీశ్ పొనగంటి'తంగలాన్' సినిమా ఆలోచన నాకు చాలా నచ్చింది. దక్షిణాది భారతీయుల చరిత్రని చూపించాడు. అప్పటి పరిస్థితులని చాలా అద్భుతంగా చూపించాడు. అయితే కథలో వివరణ మొదలవగానే నాకెందుకో డిస్ కనెక్ట్ అయిపోయాను. తంగలాన్ చూస్తుంటే.. ఫిట్జ్ కరాల్డో సినిమా గుర్తొచ్చింది. ప్రస్తుతమున్న వాళ్లలో డేరింగ్ అండ్ ఇంపార్టెంట్ ఫిల్మ్ మేకర్ పా.రంజిత్. 'తంగలాన్' అస్సలు మిస్సవ్వొద్దు. -వెంకట సిద్ధారెడ్డి(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 18 సినిమాలు.. ఆ మూడు స్పెషల్)కటిక దరిద్రుల ఆకలి పోరాటం- తంగలాన్... వాళ్లు పేదవాళ్ళు, కూటికి గతి లేని వాళ్ళు, మూల వాసులు, దళితులు, ఎండుగడ్డి పోచలు, మొలకు గోచీల వాళ్ళు.. భార్యలతో బిడ్డలతో అరణ్యాల్లో నడుస్తూ బంగారం అనే అంతుచిక్కని ఐశ్వర్యం వేటకు బయల్దేరుతారు. అటు ఒక పసిడి భూతం ఈ దరిద్రులను వెన్నాడుతూ వుంటుంది. ఇది ఒక పురాతన జానపద గాథ. నెత్తురూ కన్నీళ్ళూ కలిసి ప్రవహించిన కథ. ఆధునిక కెమెరాలతో, ఉన్నత సాంకేతిక పరిజ్ఞానంతో వందల ఏళ్ళ క్రితం జరిగిన ఓ ఘాతుకాన్ని అంతే క్రూరంగా చూపించిన సాహసం పేరు 'తంగలాన్'. కొన్ని నిజజీవిత సంఘటనలు, కొంత కల్పన, పేదల వేదన కలిసిన తిరుగుబాటు సిద్ధాంతం- తంగలాన్.సర్పట్ట చూశారా? కాలా చూసే వుంటారు. ఇప్పుడు తంగలాన్! వీటిని తీసిన పా.రంజిత్ అనే వాడు మామూలు మనిషి కాదు. మహాదర్శకుడు. కన్నీటి కావ్యామృత రసావిష్కరణ తెలిసిన మాంత్రికుడు. మన కాలం వీరుడు. 'నేను అంబేద్కరిస్ట్ని' అని ప్రకటించుకున్న రంజిత్.. రొటీన్ రొడ్డకొట్టుడు చిల్లర ప్రచార సినిమాలు తీయడు. అతని ఆవేశానికో అర్థముంది. అతని ఆగ్రహానికో పద్ధతి ఉంది. అతని తిరుగుబాటుకో లక్ష్యముంది. తంగలాన్ తీయడం వెనుక వున్నది పరిశోధన, కమర్షియల్ ప్లాన్ మాత్రమే కాదు. అదో తపస్సు. చెక్కు చెదరని నిబద్ధత. ఓ సూపర్ హీరోకి గోచీ పెట్టి దుర్గమారణ్యాల్లో నడిపించిన దుస్సాహసం!కోలార్ బంగారు గనుల్ని మొట్టమొదట కనిపెట్టడానికి జరిగిన సాహస యాత్రలో చరిత్ర చూసిన కన్నీళ్ళనీ, రక్తపుటేర్లనీ, వీరుల చావునీ, ఆడవాళ్ళ నిస్సహాయతనీ ఒళ్ళు జలదరించేలా రికార్డు చేయడంలోని నిజాయితీ మనల్ని షాక్ చేస్తుంది. అటు అగ్రవర్ణ బ్రాహ్మణ దురహంకారం, ఇటు హృదయం లేని బ్రిటిష్ పాలకుల దౌర్జన్యం. దళిత బహుజనులకు వెనక తుపాకులూ, ముందు మొనదేలిన ఈటెలూ, బంగారం ఒక తీరని దాహం, దురాశ. ఇటు నిరుపేద తల్లుల బిడ్డల ఆకలి! ఇలాంటి ఒక మానవ మహావిషాదాన్ని డాక్యుమెంటరీగా తీస్తే చాలదు. నీరసంగా నడిచే కళాత్మక చిత్రంగా తీసినా కుదరదు. ఎఫెక్టివ్‌గా చెప్పాలంటే, కమర్షియల్ స్కీమ్తోనే కొట్టాలి. బలమైన బ్లాక్‌బస్టర్ టెక్నిక్‌తోనే చెలరేగిపోవాలి. ఆ ఎత్తుగడ ఫలించింది. పా.రంజిత్ గెలిచాడు. బీభత్సరస ప్రధానమైన ఓ చారిత్రక విషాదాన్ని మన కళ్ళముందు పరిచాడు. -తాడి ప్రకాష్ (ఇదీ చదవండి: ఆ దర్శకులపై లేని అటాక్ నా ఒక్కడి మీదే ఎందుకు?: హరీశ్ శంకర్) -
కేజీఎఫ్ బాటలో విక్రమ్ తంగలాన్
-
తంగలాన్ కోసం విక్రమ్ కష్టం.. మేకింగ్ వీడియో విడుదల
విక్రమ్- పా.రంజిత్ కాంబినేషన్లో తెరకెక్కిన సినిమా తంగలాన్. ఆగష్టు 15న విడుదల అయిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రాణిస్తుంది. మూడు రోజుల్లోనే బాక్సాఫీస్ వద్ద రూ. 40 కోట్లకు పైగానే కలెక్షన్లు రాబట్టింది. అయితే, ఈ సినిమా మేకింగ్ వీడియోను మేకర్స్ విడుదల చేశారు. ఎప్పుడూ కూడా ఆలోచనాత్మకత సినిమాలను డైరెక్ట్ చేసే పా. రంజిత్.. ఇప్పుడు కూడా విక్రమ్‌తో పెద్ద ప్రయోగమే చేశాడు. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ నేపథ్యంలో వచ్చి రికార్డులు బద్దలు కొట్టింది 'కేజీఎఫ్'. మళ్లీ అదే గోల్డ్ హంట్ నేపథ్యంలో తంగలాన్ను తెరకెక్కించారు పా. రంజిత్.తంగలాన్ మేకింగ్ వీడియో చూసిని ప్రేక్షకులు విక్రమ్‌ను ప్రశంసిస్తున్నారు. ఈ సినిమా కోసం ఆయన ఎంత కష్టపడ్డారో కొంతమేరకు మాత్రమే మేకింగ్ వీడియోలో చూపించారు. వైవిధ్య పాత్రలతో ఎప్పుడూ మెప్పించే చియాన్ విక్రమ్ 'తంగలాన్' కోసం కొత్త మేకోవర్‌లో దుమ్మురేపాడు. కేవలం విక్రమ్ కోసమే ఈ సినిమా చూడొచ్చు అనేలా వెండితెరపైన విజృంభించాడు. తంగలాన్ యాక్షన్ సీక్వెన్స్‌లలో బరిసెలతో, ఈటెలతో ఫైట్ సీన్స్‌లో అద్భుతంగా ఆయన నటించారు. ప్రేక్షకులను మెప్పించిన తంగలాన్ చిత్రానికి సీక్వెల్ ఉంటుందని తాజాగా విక్రమ్ ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా విడుదలైన ఈ సినిమా మేకింగ్ వీడియోను మీరూ చూసేయండి. -
'తంగలాన్' అభిమానులకు గుడ్‌న్యూస్ చెప్పిన విక్రమ్
విక్రమ్- పా.రంజిత్ కాంబినేషన్లో తెరకెక్కిన సినిమా తంగలాన్. ఆగష్టు 15న విడుదల అయిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రాణిస్తుంది. ప్రస్తుతం థియేటర్స్‌లలో రన్ అవుతున్న సినిమాల్లో తంగలాన్ కాస్త బెటర్ అంటూ నెటిజన్లు చెప్పుకొస్తున్నారు. ఎప్పుడూ కూడా ఆలోచనాత్మకత సినిమాలను డైరెక్ట్ చేసే పా. రంజిత్.. ఇప్పుడు కూడా విక్రమ్‌తో పెద్ద ప్రయోగమే చేశాడు. ప్రేక్షకులను మెప్పించిన తంగలాన్ చిత్రానికి సీక్వెల్ ఉంటుందని తాజాగా విక్రమ్ ప్రకటించారు.పాన్ ఇండియా రేంజ్లో కె.ఇ.జ్ఞానవేల్‌రాజా, జ్యోతి దేశ్ పాండే నిర్మించారు. పార్వతీ తిరువోతు, మాళవిక మోహనన్ ఇందులో కీలకమైన పాత్రలు పోషించారు. రెండురోజుల్లో బాక్సాఫీస్ వద్ద సుమారు రూ. 30 కోట్లకు వరకు కలెక్షన్స్ రాబట్టిన తంగలాన్ తాజాగా హైదరబాద్‌లో సక్సెస్‌మీట్ ఏర్సాటు చేశారు. అక్కడ విక్రమ్ ఇలా చెప్పుకొచ్చాడు. తంగలాన్ అనేది ఒక మట్టి సినిమా అని ఆయన పేర్కొన్నాడు. ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకుల నుంచి కూడా మంచి స్పందన వస్తుందని బలంగా నమ్మానని ఆయన అన్నాడు. ఈ క్రమంలోనే 'తంగలాన్ 2' కూడా తీసుకొస్తామని విక్రమ్ ప్రకటించాడు. ఇదే విషయం గురించి దర్శకుడు పా. రంజిత్, నిర్మాత జ్ఞానవేల్‌రాజాతో ఈ విషయంపై మాట్లాడుకున్నామని ఆయన అన్నాడు. పా రంజిత్ కాస్త రిలాక్స్ అయ్యాక అయ్యాక పార్-ట్ 2 ప్రారంభిస్తామని తెలిపాడు.1850ల్లో ఆంగ్లేయుల పాలనా కాలంలో జరిగే కథాంశంతో తెరకెక్కిన తంగలాన్ సినిమా మాస్టర్పీస్లా చరిత్రలో నిలిచిపోతుందని స్టూడియోగ్రీన్ ప్రొడక్షన్ హౌస్ సీఈవో ధనుంజేయన్ చెప్పారు. ఆస్కార్ అవార్డు రేంజ్ వరకు ఈ సినిమాను తీసుకెళ్లాలని ఇప్పటికే అభిమానుల నుంచి విన్నపం అందుతుందని ఆయన అన్నారు. -
మిస్టర్ బచ్చన్, డబుల్ ఇస్మార్ట్, తంగలాన్.. ఫస్ట్ డే కలెక్షన్స్
స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా టాలీవుడ్లో సినిమాల జాతర జరిగింది. ముఖ్యంగా మిస్టర్ బచ్చన్, డబుల్ ఇస్మార్ట్ చిత్రాల మధ్యే బిగ్ ఫైట్ నడిచింది. భారీ అంచనాలతో విడుదలైన ఈ రెండు సినిమాలకు కూడా మిక్సిడ్ టాక్ వచ్చింది. ఏమాత్రం ప్రేక్షకులను మెప్పించేలా లేవని నెటిజన్ల నుంచి విమర్శలు అందుకున్నాయి. కోలీవుడ్ సినిమా 'తంగలాన్' కాస్త బాగుంది అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. విక్రమ్ నటన కోసం అయినా సినిమా చూడాలంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.మిస్టర్ బచ్చన్ కలెక్షన్స్రవితేజ- హరీశ్ శంకర్ సినిమా మిస్టర్ బచ్చన్ బాక్సాఫీస్ వద్ద రూ.7.5 కోట్ల వసూళ్లు వచ్చినట్లు సమాచారం. ఈ కలెక్షన్లు అడ్వాన్స్ ప్రీమియర్ షోలతో కలిపి అని ట్రేడ్ వర్గాలు తెలుపుతున్నాయి. మొదటిరోజు సుమారు రూ. 10 కోట్లకు పైగానే కలెక్షన్స్ రాబడుతుందని అందరూ అంచనా వేశారు. కానీ మిస్టర్ బచ్చన్ ఆ మార్క్ అందుకోలేకపోయిందని తెలుస్తోంది. దాదాపు రూ. 35 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బరిలోకి దిగిన మిస్టర్ బచ్చన్ ఆ టార్గెట్ రీచ్ అవుతాడా..? అనే సందేహాలు వస్తున్నాయి. సినిమా పట్ల దారుణమైన నెగటివ్ టాక్ రావడంతో బయర్స్‌కు నష్టాలు తప్పవని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. పనోరమా స్టూడియోస్– టీ సిరీస్ సమర్పణలో టీజీ విశ్వ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు.డబుల్ ఇస్మార్ట్ కలెక్షన్స్యంగ్ హీరో రామ్ నటించిన ఇస్మార్ట్ శంకర్ మూవీకి సీక్వెల్‌గా డబుల్ ఇస్మార్ట్ చిత్రాన్ని డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కించాడు. దాదాపు రూ. 60 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో విడుదలైన ఈ సినిమా కూడా అనుకున్నంత స్థాయిలో కలెక్షన్లు రాబట్టలేదు. ఈ క్రమంలో మొదటిరోజు రూ. 12. 45 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టినట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే, ట్రేడ్ వర్గాలు మాత్రం రూ. 10.40 కోట్లు మాత్రమే కలెక్షన్లు వచ్చినట్లు పేర్కొన్నాయి. మొత్తానికి కలెక్షన్ల పరంగా మిస్టర్ బచ్చన్ కంటే ఇస్మార్ట్ శంకర్ కాస్త బెటర్ అని చెప్పవచ్చు. ఈ చిత్రాన్ని పూరీ జగన్నాథ్, చార్మీ కౌర్ నిర్మించారు.తంగలాన్ కలెక్షన్స్ప్రయోగాత్మక పాత్రలతో మెప్పించే విక్రమ్ తాజాగా తంగలాన్ సినిమాతో ప్రేక్షకులను అలరించాడు. పా. రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మొదటిరోజు రూ. 19.50 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. 1850ల్లో ఆంగ్లేయుల పాలనా కాలంలో జరిగే కథాంశంతో తెరకెక్కిన తంగలాన్ ఈ పోటీలో విజయం సాధించింది. సినిమా పట్ల పాజిటివ్ టాక్ రావడంతో కలెక్షన్లు మరింతగా పెరిగే అవకాశం ఉంది. అన్ని వర్గాల సినీప్రియులకు తంగలాన్ థ్రిల్ చేస్తాడు. చెన్నైలో మొత్తం 592 స్క్రీన్లలో తంగలాన్ ప్రదర్శించారు. 81 శాతం టికెట్లు అమ్ముడుపోయాయి. తంగలాన్ తెలుగు వర్షన్ రూ. 2 కోట్ల వరకు రాబట్టింది.