
కోలీవుడ్ ప్రముఖ దర్శకుడు ఆర్. అజయ్ జ్ఞానముత్తు వివాహ బంధంలో అడుగుపెట్టాడు. తన చిరకాల ప్రేయసి షిమోనా రాజ్‌కుమార్‌తో వివాహ బంధంతో ఒక్కటయ్యారు

అందుకు సంబంధించిన ఫోటోలను అభిమానులతో పంచుకున్నారు

పెళ్లి వేడుకులో కేవలం ఇరువురి కుటుంబ సభ్యులు మాత్రమే పాల్గొన్నారు. ఎలాంటి ప్రచారం లేకుండా అతికొద్దిమంది సమక్షంలో ఘనంగా పెళ్లి జరిగింది

అయితే, ఆయన సతీమణి షిమోనా గురించి వివరాలు ప్రకటించలేదు. కొత్త దంపతులను స్టార్ హీరో విక్రమ్ ఆశీర్వదించారు

విభిన్నమైన హారర్ థ్రిల్లర్ కథాంశంతో ప్రేక్షకుల్ని మెప్పించిన ‘డిమోంటి కాలనీ’ చిత్రానికి ఆర్.అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వం వహించారు














