Ajay Gnanamuthu
-
కోబ్రా ఎందుకు ఫ్లాప్ అయిందో అర్థం కాలే: దర్శకుడు
డీమాంటి కాలనీ చిత్రంతో దర్శకుడుగా పరిచయమయ్యాడు అజయ్ జ్ఞానముత్తు. ఈ సినిమా సక్సెస్‌తో చిత్త పరిశ్రమ దృష్టిని తనవైపు మరల్చుకున్నాడు. ఆ తర్వాత నయనతార- విజయ్ సేతుపతిలను హీరోహీరోయిన్లుగా పెట్టి తీసిన ఇమైకా నొడిగల్ సినిమా సూపర్ సక్సెస్ అయింది. అయితే ఆ తర్వాత విక్రమ్ కథానాయకుడిగా నటించిన కోబ్రా చిత్రం డిజాస్టర్‌గా మారింది. తాజాగా ఈయన డీమాంటి కాలనీ – 2 సినిమాను డైరెక్ట్ చేశాడు. ఇది ఆయన తొలిసారిగా దర్శకత్వం వహించిన డీమాంటి కాలనీకి సీక్వెల్ కావడం గమనార్హం. బీటీజీ యూనివర్సల్ సంస్థ అధినేత బాబి బాలచంద్రన్ సమర్పణలో జ్ఞానముత్తు పట్టరై, వైట్ నైట్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థలు నిర్మించిన ఈ చిత్రంలో అరుళ్‌నిధి, ప్రియా భవాని శంకర్ జంటగా నటించిన ఇందులో నటుడు అరుణ్ పాండియన్, నటి మీనాక్షి గోవిందరాజన్, ముత్తుకుమార్ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. శ్యామ్ సీఎస్ సంగీతాన్ని అందించిన ఈ హారర్, థ్రిల్లర్ కథా చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని త్వరలో తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. ఈ సందర్భంగా చిత్ర ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని శనివారం సాయంత్రం చైన్నెలోని వీఆర్ మాల్లో నిర్వహించారు. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు అజయ్ జ్ఞానముత్తు మాట్లాడుతూ.. తన గత చిత్రం కోబ్రా ప్లాప్ అయిందని, అయితే ఎందుకది ఫ్లాప్ అయిందో అర్థం కాక నిరాశతో ఉన్నప్పుడు నటుడు అరుళ్ నిధి వచ్చి జరిగినదాన్ని మర్చిపోండి మనం మళ్లీ సినిమా చేద్దామని భుజం తట్టి ప్రోత్సహించారన్నాడు. అప్పటి నుంచి నేటి వరకు ఆయన తన వెన్నంటే ఉన్నారన్నాడు. ఇలాంటి మంచి వ్యక్తులు తన చుట్టూ ఉండటం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపాడు. ఈ చిత్రం ద్వారా తన తండ్రిని నిర్మాతను చేయాలన్న కోరిక నెరవేరిందన్నాడు. చదవండి: బిగ్‌బాస్ 7 టైటిల్ ముద్దాడిన రైతుబిడ్డ.. ఆ బలమైన కారణాల వల్లే విజయం.. -
'కోబ్రా' కాంబో మరోసారి.. ఆ హీరో-దర్శకుడు మరో ప్రాజెక్ట్!
విభిన్న సినిమాలు చేస్తూ గుర్తింపు తెచ్చుకున్న హీరోల్లో విక్రమ్ కచ్చితంగా ఉంటాడు. హిట్టా ఫ్లాప్ అనేది పక్కనబెడితే ప్రయోగాలు చేయడం మాత్రం ఆపడు. అలా గతేడాది 'కోబ్రా' మూవీతో ప్రేక్షకుల్ని పలకరించాడు. కానీ హిట్ అనిపించుకోలకపోయింది. అయితేనేం ఈ చిత్రం దర్శకుడితో మరోసారి కలిసి పనిచేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. (ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి 17 సినిమాలు.. మొత్తంగా 33 రిలీజ్!) గతంలో 'డిమాంటీ కాలనీ', 'ఇమైకా నోడిగల్' లాంటి సినిమాలు తీసిన అజయ్ జ్ఞానముత్తు.. 'కోబ్రా' తీశారు. కాగా విక్రమ్ తన 63వ చిత్రానికి రెడీ అవుతున్నాడు. ఈ ప్రాజెక్టుకే అజయ్ దర్శకత్వం వహించనున్నట్లు తెలిసింది. అయితే కోబ్రా చిత్రం చేదు అనుభవాన్ని మరచి పోలేని విక్రమ్ అభిమానులు మళ్లీ అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలోనా? అంటూ పెదవి విరుస్తున్నారు. కాగా దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉందన్నది గమనార్హం. (ఇదీ చదవండి: రెండు వారాల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తున్న స్టార్ హీరో హిట్ సినిమా) -
సూపర్ హిట్ హారర్ మూవీ.. సీక్వెల్ వచ్చేస్తోంది!
దర్శకుడు అజయ్ జ్ఞానముత్తు ఇంతకుముందు తెరకెక్కించిన చిత్రం 'డిమాంటీ కాలనీ'. అరుళ్ నిధి కథానాయకుడిగా నటించిన ఈ హార్రర్ చిత్రం అనూహ్య విజయాన్ని సాధించింది. తాజాగా అదే దర్శకుడు దానికి సీక్వెల్‌గా డిమాంటీ కాలనీ– 2 చిత్రాన్ని స్వీయ నిర్మాణంలో రూపొందిస్తున్నారు. ఇందులోనూ అరుళ్ నిధి కథానాయకుడిగా నటిస్తున్నారు. నటి ప్రియా భవానీ శంకర్ నాయక్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రానికి శ్యామ్ సీఎస్ సంగీతాన్ని, హరీష్ కన్నన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. (ఇది చదవండి: ఓ ఇంటివాడు కాబోతున్న యంగ్ హీరో, పెళ్లికి ముహూర్తం ఫిక్స్!) కాగా ఇప్పుడు ఈ చిత్ర నిర్మాణంలో సాఫ్ట్ వేర్ సంస్థ అధినేత బాబీ బాలచందర్ భాగస్వామిగా చేరారు. ఈయన తాజాగా చిత్రం నిర్మాణ రంగంలోకి ప్రవేశించి ప్రపంచస్థాయిలో చిత్రాలను నిర్మించడానికి సిద్ధమయ్యారు. అందులో భాగంగా డిమాంటీ కాలనీ –2 చిత్ర నిర్మాతలు నైట్ నైట్ ఎంటర్టైన్మెంట్ అధినేత విజయ్ సుబ్రహ్మణిన్, జ్ఞానముత్తు పట్టరై సంస్థ అధినేత ఆర్సీ రాజ్ కుమార్‌తో భాగస్వామి అయ్యారు. దీనిపై మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో చిత్ర దర్శకుడు అజయ్ జ్ఞానముత్తు మాట్లాడుతూ.. బాబి బాలచంద్రన్ తమ చిత్రానికి భాగస్వామి కావడం గౌరవంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. సాఫ్ట్ వేర్ రంగంలో టైకూన్ బిజినెస్ మెన్ అయినా ఆయన చిత్ర నిర్మాణ రంగంపై గౌరవంతో దీన్ని అదనపు వ్యాపారంగా భావించడం స్వాగతించదగ్గ విషయమన్నారు. ఎందుకు స్ఫూర్తిదాయకమైన ఆయన తమ చిత్రానికి భాగస్వామి కావడం సంతోషంగా ఉందని, దీంతో డిమాంటీ కాలనీ– 2 చిత్రం గ్లోబస్ స్థాయికి చేరుకుంటుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. (ఇది చదవండి: ఇకపై నరేశ్ ఇంట్లోకి రమ్య రఘుపతికి నో ఎంట్రీ.. కోర్టు తీర్పు) -
ప్రేక్షకులకు క్షమాపణలు చెప్పిన ‘కోబ్రా’ డైరెక్టర్
చియాన్ విక్రమ్ నటించిన లేటెస్ట్ చిత్రం కోబ్రా. అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఆగస్ట్ 31న ప్రేక్షకులు ముందుకు వచ్చింది. తొలి షో నుంచి ఈ సినిమా పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ మూవీకి హిట్‌టాక్ వచ్చినప్పటికీ ప్రేక్షకుల నుంచి విమర్శలు కూడా వస్తున్నాయి. సినిమా నిడివి ఎక్కువ ఉందని, స్క్రీన్ ప్లే గందరగోళంగా ఉందంటూ సోషల్ మీడియా వేదికగా నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయి. అయితే తాజాగా వీటిపై డైరెక్టర్ స్పందిస్తూ ప్రేక్షకులకు క్షమాపణలు చెప్పాడు. తాజాగా ఇన్స్టాగ్రామ్ వేదికగా లైవ్‌చాట్‌లో నెటిజన్లతో ముచ్చటించాడు డైరెక్టర్ జ్ఞానముత్తు. చదవండి: జూ.ఎన్టీఆర్-కొరటాల చిత్రంలో అలనాటి లేడీ సూపర్ స్టార్? ఈ సందర్భంగా ఓ నెటిజన్ కథ, కథనం బాగున్నప్పటికీ క్లైమాక్స్ నిరాశ పరిచిందన్నాడు. దీనిపై ఆయన మాట్లాడుతూ.. ‘పోలీసుల నుంచి హీరో తప్పించుని విదేశాల్లో స్వేచ్చగా బతుకున్నట్లు క్లైమాక్స్ రాయొచ్చు. కానీ, అలాంటి నేరస్థుడికి ఎలాంటి శిక్ష పడకపోవడం న్యాయం కాదు కదా!’ అని వివరించాడు. కోబ్రా సినిమా నిడివిపై మరో నెటిజన్ ప్రశ్నించగా.. ఈ చిత్రంలోని ప్రతి కీలక విషయాన్ని ప్రేక్షకుడికి చూపించాలనుకున్నామన్నారు. అందుకే నిడివి గురించి ఆలోచించలేదని చెప్పిన జ్ఞానముత్తు ప్రేక్షకుల నుంచి వచ్చిన స్పందన మేరకు సినిమా నిడివిని 20 నిమిషాలు తగ్గించామని చెప్పాడు. చదవండి: వైరల్‌గా మోదీ, బీజేపీపై సమంత కామెంట్స్, మండిపడుతున్న నెటిజన్లు! ఇక స్క్రీన్‌ప్లే గందరగోళంగా ఉందని మరో నెటిజన్ అనగా.. ‘మిమ్మల్ని గందరగోళానికి గురి చేసినందుకు క్షమించండి. ప్రతిక్షణం ఉత్కంఠకు గురిచేసే సినిమా చూసేందుకు ఓ ప్రేక్షకుడిగా నేను ఇష్టపడతాను. అందుకే కోబ్రాను తెరకెక్కించాను. సాధ్యమైతే మరోసారి మా సినిమాను చూడండి. మీకు కచ్చితంగా నచ్చుతుంది’ అని చెప్పుకొచ్చాడు. కాగా 7 స్క్రీన్ పతాకంపై ఎస్ఎస్ లలిత్ కుమార్ భారీ ఎత్తున నిర్మించిన ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందించారు. ఇందులో విక్రమ్ సరసన ‘కేజీయఫ్’ బ్యూటీ శ్రీనిధి శెట్టి సందడి చేసింది. -
డిసెంబర్లో షురూ
విక్రమ్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘కోబ్రా’. అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో విక్రమ్ పలు గెటప్స్‌లో కనిపించనున్నారు. శ్రీనిధీ శెట్టి కథానాయిక. ప్రముఖ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ ఈ సినిమా ద్వారా నటుడిగా పరిచయం అవుతున్నారు. కోవిడ్ వల్ల ఈ సినిమా చిత్రీకరణకు బ్రేక్ పడింది. అయితే డిసెంబర్ నుంచి చిత్రీకరణను మళ్లీ ప్రారంభిస్తారట. సుమారు 25 రోజుల చిత్రీకరణ మిగిలి ఉందని తెలిసింది. ‘కోబ్రా’ చిత్రాన్ని చాలా వరకూ రష్యాలో షూట్ చేశారు. మిగిలి ఉన్న కొంత భాగాన్ని చెన్నైలో రష్య సెట్స్‌ను వేసి షూట్ చేస్తారన్నది తాజా సమాచారం. థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీత దర్శకుడు. -
‘కోబ్రా’ ఫస్ట్‌లుక్ : ఇర్ఫాన్ పాత్ర ఇదే!
భారత మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన అభిమానులకు దర్శకుడు అజయ్ జ్ఞానముతు సర్ప్రైజ్ ఇచ్చాడు. నిన్న(అక్టోబర్ 27)న ఇర్ఫాన్ 36వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా దర్శకుడు అజయ్ మంగళవారం ట్వీట్ చేస్తూ ఇర్ఫాన్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపాడు. అంతేగాక ఆయన దర్శకత్వం వహిస్తున్న ‘కోబ్రా’ చిత్రంలో ఇర్ఫాన్ పాత్ర పేరును వెల్లడించాడు. ఇందులో ఇర్ఫాన్ ఫస్ట్ లుక్‌ను విడుదల చేస్తూ.. ‘డియర్ ఇర్ఫాన్ సార్ మీకు పుట్టిన రోజు శుభాకాంక్షలు. మీరు ఇలాంటి సంతోషకరమైన పుట్టిన రోజులు ఎన్నో జరుపుకోవాలని ఆకాంక్షిస్తున్న. మీలాంటి గొప్ప వ్యక్తితో కలిసి పని చేయడంతో నాకు చాలా సంతోషంగా ఉంది. హ్యాపీ బర్త్‌డే అస్లాన్ యిల్మాజ్’ అంటూ ఆయన ట్వీట్ చేశాడు. ఈ పోస్టర్లో ఇర్ఫాన్ బ్లాక్ సూట్ ధరించి స్టైలిష్‌గా కనిపించాడు. ఇందులో ఆయన ఫ్రెంచ్ ఇంటర్ పోల్ ఆఫీసర్ అస్లాన్ యిల్మాజ్గా కనిపించనున్నట్లు దర్శకుడు అజయ్ వెల్లడించాడు. Wish you many more happy returns of the day dear @IrfanPathan sir ❤️❤️ Super happy to have met and worked with such a warm and a caring person like you.. Wishing you only the besttt in the year ahead 🤗🤗🤗 #Cobra 🐍🐍 #HBDIrfanpathan #AslanYilmaz pic.twitter.com/JBwIlbzGJM — Ajay Gnanamuthu (@AjayGnanamuthu) October 27, 2020 అయితే క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన ఇర్ఫాన్ తనకు నటన అంటే ఇష్టమని పలు ఇంటర్య్వులో వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అజయ్ జ్ఞానముతు దర్శకత్వం వహిస్తున్న ‘కోబ్రా’ చిత్రంలో నటించి కోలీవుడ్‌తో తన యాక్టింగ్ కేరీర్‌ను ప్రారంభిస్తున్నాడు. ఈ చిత్రంలో హీరోగా సియాన్ విక్రమ్ 20పైగా విభిన్న పాత్రలు పోషిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమలోని కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించేందుకు చిత్ర బృందం మార్చిలో రష్యాకు వెళ్లిన విషయం తెలిందే. కరోనా నేపథ్యంలో విధించిన లాక్డౌన్ కారణంగా చిత్ర బృందం ఇండియాకు తిరిగి వచ్చింది. భారత్‌తో కూడా షూటింగ్‌లపై నిషేధం విధించిన కేంద్రం ఇటీవల అనుమతించిన విషయం తెలిసిందే. దీంతో రష్యాలో చిత్రికరించాల్సిన కీలక సన్నివేశాలను చెన్నైలోనే రష్యాను పోలిన సెట్టింగ్‌లతోనే దర్శకుడు షూటింగ్‌ను పూర్తి చేయాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే ‘కోబ్రా’ షూటింగ్ ఈ ఏడాది చివరికి పూర్తి కానుంది. విక్రమ్ హరోగా, ఇర్ఫాన్ ఖాన్ ప్రతినాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రంలో కేఎస్ రవికుమార్, శ్రీనిధి శెట్టి, మృణాలిని, కనికా, పద్మప్రియ, బాబు ఆంటోనీలు ఇతర పాత్రలు పోషిస్తున్నారు. -
విక్రమ్‌తో కేజీఎఫ్ హీరోయిన్?
తమిళ సినిమా: కన్నడ సంచలన చిత్రం కేజీఎఫ్ హీరోయిన్ శ్రీనిధి శెట్టిని ఇప్పుడు కోలీవుడ్ పిలుస్తోంది. చియాన్ విక్రమ్‌తో జతకట్టే అవకాశం ఆమె ముంగిట వాలిందనేది తాజా సమాచారం. ప్రయోగాలకు బ్రాండ్అంబాసిడర్ నటుడు విక్రమ్ అన్నది ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. పాత్రల కోసం ఎంత వరకైనా వెళ్లే విక్రమ్ కడారం కొండాన్ చిత్రం తరువాత కొత్త చిత్రానికి రెడీ అయిపోయారు. ఈయన ఇమైకా నొడిగళ్ చిత్రం ఫేమ్ అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో నటిస్తున్నారు. సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ పతాకంపై నిర్మాత లలిత్‌కుమార్ వైకం 18 స్టూడియోస్ సంస్థతో కలిసి నిర్మిస్తున్న ఈ భారీ చిత్రం ఇటీవలే ప్రారంభమై సైలెంట్‌గా చిత్రీకరణ జరుపుకుంటోంది. కాగా ఈ చిత్రం పలు ప్రత్యేకతలను సంతరించుకుంటోంది. ఇందులో నటుడు విక్రమ్ పలు గెటప్‌లలో కనిపించనున్నారని సమాచారం. అదేవిధంగా దీనికి యువన్‌శంకర్‌రాజా సంగీతాన్ని అందిస్తున్నారు. ఇకపోతే ప్రముఖ క్రికెట్ క్రీడాకారుడు ఇర్ఫాన్ పఠాన్ ఈ చిత్రం ద్వారా నటుడిగా తెరరంగేట్రం చేస్తున్నారు. కాగా ఈ చిత్రంలో నటి ప్రియాభవానీశంకర్‌ను హీరోయిన్గా నటింపజేసే ప్రయత్నాలు జరుగుతున్నట్లు ఇంతకు ముందు ప్రచారం జరిగింది. అయితే ఆమె ఇండియన్–2లో కమల్ హాసన్‌తో, ఎస్జే.సూర్యకు జంటగా కొత్త చిత్రం అంటూ పలు చిత్రాలతో బిజీగా ఉంది. దీంతో ప్రియాభవానీశంకర్ విక్రమ్ చిత్రానికి కాల్షీట్స్ కేటాయించలేని పరిస్థితి అని తెలిసింది. దీంతో తాజాగా నటి శ్రీనిధిశెట్టిని విక్రమ్‌కు జంటగా నటింపజేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. ఈ బ్యూటీ కన్నడంలో ఆ మధ్య తెరపైకి వచ్చి సంచలన విజయాన్ని సాధించిన కేజీఎఫ్ చిత్రంలో నాయకిగా నటించిందన్నది గమనార్హం. కన్నడంలో మంచి స్టార్‌గా రాణిస్తున్న శ్రీనిధిశెట్టిని ఇప్పుడు కోలీవుడ్‌కు దిగుమతి చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. విక్రమ్‌కు జంటగా ఆమెను ఎంపిక చేయడానికి చర్చలు జరుగుతున్నట్లు తెలిసింది. కాగా ఇది నటుడు విక్రమ్‌కు 58వ చిత్రం అవుతుంది. దీనికి శివకుమార్ విజయన్ ఛాయాగ్రహణం అందిస్తున్నారు. -
గెటప్ చేంజ్
శివపుత్రుడు, అపరిచితుడు, ఐ.. ఇలా చేసే ప్రతి సినిమాలోనూ దాదాపు కొత్తగా కనిపిస్తారు విక్రమ్. ఇప్పుడు మళ్లీ కొత్త గెటప్‌లోకి మారే టైమ్ వచ్చింది. విక్రమ్ హీరోగా ‘డిమాంట్ కాలనీ, ఇమైక్క నొడిగళ్’ చిత్రాల ఫేమ్ ఆర్. అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమాలో విక్రమ్ పలు విభిన్నమైన గెటప్స్‌లో కనిపించనున్నారు. ఈ నెల 21న ఈ చిత్రం షూటింగ్ ఆరంభం కానుందని కోలీవుడ్ సమాచారం. తొలి షెడ్యూల్ చిత్రీకరణను చెన్నైలో ప్లాన్ చేశారని తెలిసింది. ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందించనున్నారు. -
యాక్షన్ థ్రిల్లర్
విభిన్నమైన పాత్రలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే హీరోల్లో విక్రమ్ ఒకరు. కెరీర్లో ఇప్పటికే ఎన్నో యాక్షన్ పాత్రలతో ప్రేక్షకులను మెప్పించిన ఆయన మరో యాక్షన్ చిత్రానికి పచ్చజెండా ఊపారు. ‘డిమాంట్ కాలనీ, ఇమైక్క నొడిగల్’ వంటి సినిమాలకు దర్శకత్వం వహించిన అజయ్ జ్ఞానముత్తు ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. 7 స్క్రీన్ స్టూడియోస్ పతాకంపై లలిత్ కుమారి నిర్మిస్తారు. వయాకామ్ 18 సంస్థ ఈ చిత్రానికి సహ–నిర్మాతగా వ్యవహరించనుంది. ఈ ఏడాది ఆగస్టులో ప్రారంభం కానున్న ఈ సినిమా తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కనుంది. వచ్చే ఏడాది సమ్మర్లో విడుదల చేయాలనుకుంటున్నారు. అలాగే కమల్‌హాసన్ ప్రొడక్షన్లో విక్రమ్ హీరోగా రూపొందిన ‘కడరమ్ కొండాన్’ చిత్రం రిలీజ్‌కు రెడీగా ఉంది. ఇందులో కమల్ రెండో కుమార్తె అక్షరా హాసన్ కథానాయిక. ఈ సినిమా కాకుండా ‘మహావీర్ కర్ణ, ధృవనక్షత్రం’ సినిమాలతో బిజీగా ఉన్నారు విక్రమ్. -
సంతోషంగా ఇంటికి వెళ్తారు
‘‘తమిళంలో ‘ఇమ్మైక్కా నొడిగల్’ చిత్రాన్ని తెరకెక్కించడానికి రెండేళ్లు పట్టింది. సినిమా సక్సెస్ అయ్యాక ఆ కష్టాన్ని మర్చిపోయాం. తెలుగులోనూ అదే రేంజ్ సక్సెస్ అవ్వాలని అనుకుంటున్నాను’’ అన్నారు దర్శకుడు అజయ్ జ్ఞానముత్తు. నయనతార లీడ్ రోల్లో రాశీఖన్నా, విజయ్‌సేతుపతి ముఖ్య పాత్రల్లో దర్శకుడు అజయ్ జ్ఞానముత్తు తెరకెక్కించిన తమిళ చిత్రం ‘ఇమ్మైక్కా నొడిగల్’. ‘అంజలి సీబీఐ’ టైటిల్‌తో సి.హెచ్. రాంబాబు, ఆచంట గోపీనాథ్ ఈ నెల 22న తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. హైదరాబాద్‌లో ఈ చిత్ర ఆడియో లాంచ్ జరిగింది. మిలింద్ రావ్ సీడీ విడుదల చేసి తుమ్మల ప్రసన్నకుమార్‌కు అందించారు. ‘‘ఇమ్మైకా నొడిగల్’ చూడగానే నచ్చి, ఫ్యాన్సీ రేట్‌తో హక్కులను తీసుకున్నాం’’ అన్నారు సిహెచ్ రాంబాబు. ‘‘రజనీకాంత్ కెరీర్లో ‘బాషా’ చిత్రంలా నయనతారకు ‘అంజలి సీబీఐ’ అలా నిలిచిపోతుంది. ప్రతి సీన్ థ్రిల్లింగ్‌గా ఉంటుంది. టికెట్ కొని సినిమాకు వచ్చే ప్రేక్షకుడి డబ్బులు వృథా కావు. సంతోషంగా ఇంటికి వెళ్తారు. ఇకపై వరుసగా సినిమాలు చేస్తాం’’ అన్నారు ఆచంట గోపీనాథ్. అమ్మిరాజు, శ్రీరామకృష్ణ పాల్గొన్నారు. ∙అమ్మిరాజు, గోపీనాథ్, ప్రసన్న కుమార్, అజయ్ జ్ఞానముత్తు -
రెప్పపాటు కాలంలో...!
ఇమేజ్ చట్రంలో ఇరుక్కున్న నటీనటులు ప్రయోగాత్మక చిత్రాలు, పాత్రలు చేయడానికి దాదాపు సాహసం చేయరు. కానీ, నయనతార లాంటి కొందరు ఆర్టిస్టులు మాత్రం పాత్రల ఎంపిక విషయంలో తెగువ చూపిస్తారు. ఒకవైపు రొటీన్ కమర్షియల్ సినిమాలు, మరోవైపు లేడీ ఓరియంటెడ్ మూవీస్ చేస్తున్నారు. అది మాత్రమే కాదు.. కథ నచ్చితే తమిళ నటుడు శివకార్తికేయన్ వంటి అప్‌కమింగ్ హీరోల సరసన నటిస్తున్నారు. అప్‌కమింగ్ డెరైక్టర్స్‌తో కూడా సినిమాలు చేయడానికి వెనకాడడం లేదు. ఇప్పటికే చేతిలో కథానాయిక ప్రాధాన్యంగా సాగే ‘దొర’ అనే సినిమా ఉంది. ఇప్పుడు మరో సినిమా ఒప్పుకున్నారు. ‘కన్ ఇమైక్క నొడిగళ్’ అనేది ఈ చిత్రం టైటిల్. అంటే.. రెప్పపాటు కాలం అని అర్థం. ‘డీమాంట్ కాలనీ’ అనే చిత్రం ద్వారా దర్శకునిగా పరిచయమైన ఆర్. అజయ్ జ్ఞానముత్తుకి ఇది రెండో సినిమా. అయినప్పటికీ అతను చెప్పిన కథ నచ్చి, నయన అంగీకరించేశారు. ఈ చిత్రకథ రాసుకున్న తర్వాత నయనతార అయితే బాగుంటుందని అజయ్ అనుకున్నారట. ఒప్పుకుంటారో లేదో అనే సందేహంతోనే కథ చెప్పారట. కథ విన్నాక ఈ సినిమా టైటిల్లా కళ్లు మూసి తెరిచే లోపు ఈ బ్యూటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారట. ఇప్పటివరకూ చేయని పాత్రను నయనతార ఇందులో చేస్తున్నారని దర్శకుడు పేర్కొన్నారు. కాగా, ఈ చిత్రంలో అథర్వ మురళి హీరోగా నటించనున్నారు. అతని సరసనే నయనతార నాయికగా నటిస్తారనే వార్త ప్రచారంలో ఉంది. అది నిజం కాదనీ, అథర్వ సరసన వేరే నాయికను తీసుకుంటామని దర్శకుడు స్పష్టం చేశారు.