సూపర్ హిట్‌ హారర్ మూవీ.. సీక్వెల్ వచ్చేస్తోంది! | Arulnithi and Ajay Gnanamuthu Ready For Sequel Demonte Colony 2 | Sakshi
Sakshi News home page

Demonte Colony 2: సూపర్ హిట్‌ హారర్ మూవీ.. సీక్వెల్ వచ్చేస్తోంది!

Published Wed, Aug 2 2023 3:30 PM | Last Updated on Wed, Aug 2 2023 3:36 PM

Arulnithi and Ajay Gnanamuthu Ready For Sequel Demonte Colony 2 - Sakshi

దర్శకుడు అజయ్‌ జ్ఞానముత్తు ఇంతకుముందు తెరకెక్కించిన చిత్రం 'డిమాంటీ కాలనీ'. అరుళ్‌ నిధి కథానాయకుడిగా నటించిన ఈ హార్రర్ చిత్రం అనూహ్య విజయాన్ని సాధించింది. తాజాగా అదే దర్శకుడు దానికి సీక్వెల్‌గా డిమాంటీ కాలనీ– 2 చిత్రాన్ని స్వీయ నిర్మాణంలో రూపొందిస్తున్నారు. ఇందులోనూ అరుళ్‌ నిధి కథానాయకుడిగా నటిస్తున్నారు. నటి ప్రియా భవానీ శంకర్‌ నాయక్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి శ్యామ్‌ సీఎస్‌ సంగీతాన్ని, హరీష్‌ కన్నన్‌ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. 

(ఇది చదవండి: ఓ ఇంటివాడు కాబోతున్న యంగ్‌ హీరో, పెళ్లికి ముహూర్తం ఫిక్స్‌!)

కాగా ఇప్పుడు ఈ చిత్ర నిర్మాణంలో సాఫ్ట్ వేర్ సంస్థ అధినేత బాబీ బాలచందర్‌ భాగస్వామిగా చేరారు. ఈయన తాజాగా చిత్రం నిర్మాణ రంగంలోకి ప్రవేశించి ప్రపంచస్థాయిలో చిత్రాలను నిర్మించడానికి సిద్ధమయ్యారు. అందులో భాగంగా డిమాంటీ కాలనీ –2 చిత్ర నిర్మాతలు నైట్‌ నైట్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ అధినేత విజయ్‌ సుబ్రహ్మణిన్‌, జ్ఞానముత్తు పట్టరై సంస్థ అధినేత ఆర్‌సీ రాజ్‌ కుమార్‌తో భాగస్వామి అయ్యారు.

దీనిపై మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో చిత్ర దర్శకుడు అజయ్ జ్ఞానముత్తు మాట్లాడుతూ.. బాబి బాలచంద్రన్‌ తమ చిత్రానికి భాగస్వామి కావడం గౌరవంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. సాఫ్ట్ వేర్ రంగంలో టైకూన్‌ బిజినెస్‌ మెన్‌ అయినా ఆయన చిత్ర నిర్మాణ రంగంపై గౌరవంతో దీన్ని అదనపు వ్యాపారంగా భావించడం స్వాగతించదగ్గ విషయమన్నారు. ఎందుకు స్ఫూర్తిదాయకమైన ఆయన తమ చిత్రానికి భాగస్వామి కావడం సంతోషంగా ఉందని, దీంతో డిమాంటీ కాలనీ– 2 చిత్రం గ్లోబస్‌ స్థాయికి చేరుకుంటుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. 

(ఇది చదవండి: ఇకపై నరేశ్‌ ఇంట్లోకి రమ్య రఘుపతికి నో ఎంట్రీ.. కోర్టు తీర్పు)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement