Tamil Movie
-
విక్రమ్ మాస్ అవతార్.. 'వీరశురధీర' టీజర్ రిలీజ్
తమిళ హీరో విక్రమ్ అనగానే ప్రయోగాత్మక సినిమాలే గుర్తొస్తాయి. గత కొన్నాళ్లుగా సరైన హిట్ పడక చాలా వెనకబడిపోయిన ఈ హీరోని ఇప్పటి జనరేషన్ ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోవట్లేదు. దీంతో కమర్షియల్ కథతో మూవీ చేశాడు. అదే 'వీర ధీర శూర'. మార్చి 27న తెలుగు-తమిళ భాషల్లో రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే టీజర్ రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: కుడుంబస్థాన్ సినిమా రివ్యూ (ఓటీటీ))టీజర్ బట్టి చూస్తే.. హీరో కిరాణా కొట్టు నడుపుతూ ఉంటాడు. ఓ హీరోయిన్ తో ప్రేమలోనూ ఉంటాడు. కట్ చేస్తే సింపుగా కనిపించే హీరోకి భాషా రేంజ్ ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. ఇంతకీ అదేంటనేదే సినిమా కథలా అనిపిస్తుంది.విక్రమ్ సరసన దుషారా విజయన్ నటించిది. ఎస్జే సూర్య, సూరజ్ వెంజుమోడు లాంటి స్టార్స్ నటించారు. ఎస్ఏ అరుణ్ కుమార్ దర్శకుడు. నేరుగా ఈ సినిమా పార్ట్-2 రిలీజ్ చేస్తున్నారు. అంటే ఇది హిట్ అయితే 'కాంతార' టైపులో ప్రీక్వెల్ తీస్తారేమో?(ఇదీ చదవండి: థియేటర్లలో రిలీజైన వారానికే ఓటీటీలోకి హిట్ సినిమా) -
ఓటీటీలోకి వచ్చేసిన లేటెస్ట్ తెలుగు సినిమా
మరో కొత్త సినిమా పెద్దగా హడావుడి లేకుండానే ఓటీటీలోకి వచ్చేసింది. గత నెల మొదటి వారంలో థియేటర్లలో రిలీజైన డబ్బింగ్ మూవీ 'పట్టుదల'.. ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది. ఇంతకీ ఎందులోకి వచ్చింది? దీని సంగతేంటి?తమిళ స్టార్ హీరో అజిత్, త్రిష హీరోహీరోయిన్లుగా నటించగా.. అర్జున్, రెజీనా కీలక పాత్రలు పోషించిన మూవీ 'విడామయూర్చి'. తెలుగులో 'పట్టుదల' పేరుతో ఫిబ్రవరి 6న థియేటర్లలో రిలీజ్ చేశారు. అయితే తమిళంలో పాజిటివ్ టాక్ వచ్చింది కానీ తెలుగులో ఎవరూ పట్టించుకోలేదు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 11 సినిమాలు.. మరి థియేటర్లలో?)రోడ్ యాక్షన్ థ్రిల్లర్ కావడం, కంటెంట్ పెద్దగా కనెక్ట్ అయ్యేలా లేకపోవడంతో ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్ రాలేదు. కానీ హీరో అజిత్ కావడంతో కలెక్షన్స్ రూ.100 కోట్లు పైనే వచ్చాయి. ఇకపోతే ఈ మూవీ ఇప్పుడు ఐదు భాషల్లో స్ట్రీమింగ్ లోకి వచ్చేసింది. ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంది. టైమ్ పాస్ చేద్దామనుకుంటే ఓ లుక్కేసేయండి.'పట్టుదల' కథ విషయానికొస్తే. అర్జున్ (అజిత్), కాయల్ (త్రిష) భార్యాభర్తలు. అజర్బైజాన్లో ఉంటారు. పిల్లలు లేరు, మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకుందామని అనుకుంటారు. విడిపోయే ముందు ఓ ఆఖరి రోడ్ ట్రిప్ కి రమ్మని అర్జున్, కాయల్ ని అడుగుతాడు. ఆ ప్రయాణంలో వాళ్లకి ప్రమాదాలు ఎదురవుతాయి. కాయల్ ని కిడ్నాప్ చేస్తారు. చివరికి ఏమయ్యిందనేది మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: ఓటీటీలో సంక్రాంతికి వస్తున్నాం.. జీ5 చరిత్రలోనే రికార్డు) -
ఓటీటీలో 'మద్రాస్కారణ్' తెలుగు వర్షన్.. రొమాంటిక్ సాంగ్‌లో నిహారిక
మెగా డాటర్ నిహారిక కొణిదెల తమిళ సినిమా తెలుగులో ఓటీటీ వేదికగా విడుదల కానుంది. ఈ మేరకు అధికారికంగా ప్రకటన కూడా వచ్చేసింది. సంక్రాంతి కానుకగా జనవరి 10న 'మద్రాస్కారణ్' చిత్రం కోలీవుడ్‌లో విడుదలైంది. ఈ మూవీలో షేన్ నిగమ్, కలైయరాసన్ హీరోలుగా నటించారు. థియేటర్లలోకి వచ్చి నెల రోజులు కూడా గడవకముందే తమిళ్ వర్షన్ ఓటీటీలో స్ట్రీమింగ్కు వచ్చేసింది. ఇప్పుడు తెలుగు వర్షన్‌ను మేకర్స్ విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు.వాలిమోహన్ దాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఎస్ఆర్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై బి.జగదీష్ నిర్మించారు. తమిళ్లో ఈ సినిమాకు మిశ్రమ స్పందన లభించింది. విశాల్ మదగజరాజ మూవీ హిట్ టాక్ రావడంతో ఈ సినిమాకు కాస్త క్రేజ్ తగ్గింది. శివరాత్రి పండుగ కానుకగా ఫిబ్రవరి 26న 'ఆహా'లో 'మద్రాస్కారణ్' సినిమా స్ట్రీమింగ్ కానుంది. ఈ మూవీ కోసం సుమారు రూ. 5 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించారు. అయితే, కోటి లోపే వసూళ్లను రాబట్టడంతో నిర్మాతలకు భారీ నష్టాలను తెచ్చిపెట్టింది.ఏడేళ్ల తర్వాత రొమాంటిక్ పాత్రతో రీఎంట్రీసుమారు ఏడేళ్ల తర్వాత 'మద్రాస్కారణ్' సినిమాతో తమిళ్లో నిహారిక రీఎంట్రీ ఇచ్చింది. 2018లో విజయ్ సేతుపతి నటించిన ఒక సినిమాతో ఆమె కోలీవుడ్‌కు పరిచయం అయింది. అయితే, ఆమెకు పెద్దగా గుర్తింపు దక్కలేదు. ఇప్పుడు మద్రాస్కారణ్ మూవీలో మీరా అనే యువతిగా గ్లామర్ రోల్లో నిహారిక కనిపించింది. ఒక రొమాంటిక్ సాంగ్‌లో కూడా ఆమె నటించింది. ఈ పాటలో అటు రొమాన్స్, ఇటు డ్యాన్సులో నిహారిక రెచ్చిపోయిందని చెప్పొచ్చు. తెలుగులో సినిమాల్లో నటించింది కానీ ఈ తరహా యాక్టింగ్ మాత్రం ఎప్పుడూ చేయలేదు. ఇందులోని సాంగ్ చూసి మెగా ఫ్యాన్స్ స్టన్ అయిపోయారు. ఎందుకంటే రొమాన్స్ .. ఆ రేంజులో ఉంది మరి! ఈ సినిమాతో హీరోయిన్గా హిట్టు కొట్టాలని నిహారిక ప్లాన్ చేసుకుంది. కానీ, ఫలితం మరోలా వచ్చింది. -
నెలలోపే ఓటీటీలోకి కొత్త సినిమా.. అధికారిక ప్రకటన
తమిళ స్టార్ హీరోల్లో అజిత్ ఒకడు. రీసెంట్ టైంలో ఇతడి సినిమాలు తమిళంతో పాటు తెలుగులోనూ రిలీజ్ అవుతున్నాయి. అలా ఈ నెల తొలివారంలో విడుదలైన మూవీ 'విడామయూర్చి'. తెలుగులో దీన్ని పట్టుదల పేరుతో రిలీజ్ చేశారు. ఇప్పుడు దీని ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్సయింది.ఫిబ్రవరి 6న తెలుగు-తమిళంలో రిలీజైన ఈ చిత్రానికి తొలిరోజే నెగిటివ్ టాక్ వచ్చింది. కాన్సెప్ట్ ఓకే అనుకున్నప్పటికీ ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే కథ లేకపోవడంతో జనాలు పెద్దగా ఆసక్తి చూపించలేదు. కానీ కలెక్షన్స్ రూ.100 కోట్లకు పైనే వచ్చాయి.(ఇదీ చదవండి: ఓటీటీలోకి 'సంక్రాంతి' హిట్ సినిమా.. డేట్ ఫిక్సయిందా?)ఈ సినిమా డిజిటల్ హక్కులు దక్కించుకున్న నెట్ ఫ్లిక్స్.. నెలలోనే ఓటీటీలోకి తీసుకొచ్చేందుకు సిద్ధమైంది. ఫిబ్రవరి 6న మూవీ థియేటర్లలో రిలీజ్ కాగా.. మార్చి 3 అంటే వచ్చే సోమవారం నుంచే ఇది ఓటీటీలో అందుబాటులోకి రానుంది. ఐదు భాషల్లో స్ట్రీమింగ్ అవ్వనున్నట్లు ప్రకటించారు.సినిమా కథ విషయానికొస్తే.. అర్జున్ (అజిత్), కాయల్ (త్రిష) భార్యాభర్తలు. అజర్బైజాన్లో ఉంటారు. మనస్పర్థల కారణంగా విడిపోదామని నిర్ణయం తీసుకుంటారు. విడిపోయే ముందు భార్యని.. చివరగా రోడ్ ట్రిప్ వేద్దామని అర్జున్ అడుగుతాడు. దీంతో ఆమె ఒప్పుకొంటుంది. ఆ ప్రయాణంలో ఏం జరిగిందనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి వచ్చే సినిమాలు ఏంటంటే?)Muyarchi thiruvinai aakum. Vidaamuyarchi ulagai vellum 💪🔥Watch Vidaamuyarchi on Netflix, out 3 March in Tamil, Hindi, Telugu, Kannada & Malayalam!#VidaamuyarchiOnNetflix pic.twitter.com/21OiHpF8AB— Netflix India South (@Netflix_INSouth) February 24, 2025 -
కాళీ వస్తున్నాడు
విక్రమ్ హీరోగా రూపొందిన తమిళ చిత్రం ‘వీర ధీర సూరన్ పార్ట్ 2’. ఈ సినిమాలో ఆయన ఓ కిరాణా కొట్టు యజమాని. పేరు కాళీ. మంచి ఫ్యామిలీ మేన్. అయితే ఒక భయంకర మైన క్రైమ్ నెట్‌వర్క్‌తో ఈ కాళీకి సంబంధం ఉంటుంది. మరి... కాళీ సీక్రెట్ మిషన్ ఏంటి? అనే కథాంశంతో ఈ చిత్రం రూపొందిందని సమాచారం. ఎస్.యు. అరుణ్ కుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో ఎస్.జె. సూర్య, సూరజ్ వెంజరాముడు, దుషారా విజయన్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రం మార్చి 27న తమిళ, తెలుగు, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. తెలుగులో ఎన్వీఆర్ సినిమాస్ విడుదల చేయనుంది. ‘‘పవర్ఫుల్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రం అందర్నీ అలరించేలా ఉంటుంది’’ అని మేకర్స్ పేర్కొన్నారు. -
నాన్న చేసిన పనికి అమ్మ ఏడుస్తూ... ఈ బతుకే వద్దనుకున్నా!
వైవిధ్యభరిత కథాచిత్రాలకు కేరాఫ్ అడ్రస్ పా.రంజిత్. చుట్టూ ఉన్న సామాజిక అంశాలనే కథావస్తువులుగా తీసుకుని సినిమా అనే శిల్పంగా చెక్కుతుంటాడు. ఈయన సినిమాలు డైరెక్ట్ చేయడంతో పాటు పలు సినిమాలను నిర్మిస్తూ ఉంటాడు. ఈ క్రమంలో నీలం ప్రొడక్షన్స్ బ్యానర్లో బాటిల్ రాధ అనే సినిమా నిర్మిస్తున్నాడు. తాగుడుకు బానిసైన వ్యక్తి దాన్నుంచి ఎలా బయటపడ్డాడన్నదే కథ.పా.రంజిత్ ఎమోషనల్ఈ మూవీ ట్రైలర్ లాంచ్‌లో పా.రంజిత్ (Pa. Ranjith) తన గతాన్ని తలుచుకుని భావోద్వేగానికి లోనయ్యాడు. ఆయన మాట్లాడుతూ.. ఈ చిత్ర ట్రైలర్ చూస్తుంటే నాకు మా అమ్మే గుర్తొస్తోంది. తినే తిండి కోసం మనం ఎవరిపైనా ఆధారపడకూడదు. మా నాన్న కూడా ఎప్పుడూ అలాంటి పరిస్థితి రానివ్వలేదు. ఏనాడూ మమ్మల్ని పస్తులుంచలేదు. మేము మంచి బట్టలు వేసుకోవాలని, బాగా చదువుకోవాలని చెప్తుండేవాడు. అందుకోసం ఎంతో కష్టపడేవాడు.(చదవండి: పిల్లలతో ఇదేం పని? టీఆర్పీ కోసం ఏదైనా చేయిస్తారా?)పండగరోజు అమ్మ ఏడుస్తూ..కానీ ఎప్పుడైతే తాగడం మొదలుపెట్టాడో తనను తానే కోల్పోయాడు. నాకు బాగా గుర్తుంది.. ఓ పండగరోజు ఊర్లోని అందరూ సంతోషంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. కానీ మా ఇంట్లో మాత్రం పరిస్థితి వేరేలా ఉంది. అమ్మ ఏడుస్తూ కూర్చుంది. అప్పుడు నేను పన్నెండవ తరగతి చదువుతున్నాను. మా అమ్మ అలా నిత్యం ఏడుస్తుంటే చూడలేకపోయాను. తన బాధ భరించలేకపోయాను. చచ్చిపోదామనుకున్నాను. మా నాన్నతో మందు మాన్పించాలని అమ్మతో పాటు నా సోదరులు కూడా చాలా ప్రయత్నించారు.మద్యానికి బానిసై చనిపోయాడుచివరకు ఆస్పత్రిపాలయ్యాడు. ఆరు నెలలకంటే ఎక్కువ బతకడని చెప్పారు. కానీ వారం రోజుల్లోనే కన్నుమూశాడు. నాన్న.. మా అమ్మను కష్టపెట్టినట్లుగా నేను నా భార్యాపిల్లల్ని బాధ పెట్టకూడదని ఆరోజే నిర్ణయించుకున్నాను అని చెప్పాడు. బాటిల్ రాధ సినిమా (Bottle Radha Movie) విషయానికి వస్తే.. దినకరణ్ శివలింగం డైరెక్ట్ చేసిన ఈ మూవీలో గురు సోమసుందరం, సంచన నటరాజన్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ మూవీ జనవరి 24న విడుదల కానుంది.విభిన్న సినిమాల డైరెక్టర్పా.రంజిత్ విషయానికి వస్తే.. అట్టకత్తి సినిమాతో దర్శకుడిగా కెరీర్ ఆరంభించాడు. కార్తీతో మద్రాస్ మూవీ చేశాడు. రజనీకాంత్‌తో కబాలి, కాలా సినిమాలు చేశాడు. సార్పట్ట పరంపరై, నచ్చత్రం నగర్గిరదు మూవీస్ తెరకెక్కించిన ఈయన చివరగా తంగలాన్ చేశాడు. హిందీలోనూ నేరుగా ఓ సినిమా చేస్తానని గతేడాది ప్రకటించాడు. దీనికి బిర్సా ముండా అనే టైటిల్‌ను కూడా ఫిక్స్ చేశాడు. ఎవరీ బిర్సా ముండాబిర్సా ముండా ఆదివాసీ నాయకుడు. 19వ శతాబ్దంలో జార్ఖండ్ రాష్ట్రంలో బ్రిటిష్, స్వదేశీ భూస్వాములచే బానిసలుగా ఉన్న గిరిజన ప్రజల కోసం పోరాడారు. భారతీయ అటవీ జాతుల స్వాతంత్ర్య సమరయోధుడిగా ఆయనకు గుర్తింపు ఉంది. 22 ఏళ్ల వయసులోనే బ్రిటీషర్లపై యుద్ధం ప్రకటించారు. ఇతడి గౌరవార్థం భారత పార్లమెంటులోని సెంట్రల్ హాల్లో ఈయన చిత్రపటం ఉంది. ఆయన గుర్తుగా రాంచీలోని విమానాశ్రయానికి బిర్సా ముండా విమానాశ్రయంగా నామకరణం చేశారు.ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com చదవండి: సంక్రాంతికి వస్తున్నాం: ఐశ్వర్య కాకపోతే ఆ హీరోయిన్.. మీనాక్షికి బదులుగా! -
ఓటీటీలోకి వచ్చేస్తున్న థ్రిల్లర్ మూవీ.. ఎక్కడంటే?
ఓటీటీలో ఎప్పటికప్పుడు బోలెడన్ని సినిమాలు వస్తూనే ఉన్నాయి. ఈ ఏడాదికి ముగింపు పలుకుతూ మరో కొత్త సినిమా కూడా రిలీజ్‌కు రెడీ అయింది. తమిళ క్రైమ్ థ్రిల్లర్ సొర్గవాసల్ మూవీ ఓటీటీలోకి వస్తున్నట్లు అధికారిక ప్రకటన వెలువడింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ డిసెంబర్ 27 నుంచి సొర్గవాసల్ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. సిద్దార్థ్ విశ్వనాథ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఆర్జే బాలాజీ, సానియా ఇయప్పన్, సెల్వరాఘవన్ ప్రధాన పాత్రలు పోషించారు. నవంబర్ 29న థియేటర్లలో విడుదలైంది. జైలు బ్యాక్ డ్రాప్‌తో సస్పెన్స్ థ్రిల్లర్‌గా ఆకట్టుకుందని సినిమాకు పాజిటివ్ రివ్యూలు వచ్చాయి. కథేంటంటే.. హీరో రోడ్డు పక్కన ఫుడ్‌స్టాల్ పెట్టుకుని జీవనం సాగిస్తుంటాడు. అక్కడికి ఓ ఐఏఎస్ ఆఫీసర్ నిత్యం వస్తుంటాడు. అలా వీరిద్దరి మధ్య స్నేహం ఏర్పడుతుంది. ఆ చొరవతో తనకు లోన్ ఇప్పించమని కోరుతాడు. అలా లోన్ సాంక్షన్ లెటర్ తీసుకునేందుకు ఆఫీసర్ దగ్గరకు వెళ్తాడు. ఆ సమయంలో అధికారి హత్య జరగ్గా అందుకు హీరోను నిందితుడిగా భావించి జైల్లో వేస్తారు. ఆ అధికారిని ఎవరు చంపారు? హీరోను కావాలని జైలుకు పంపించిందెవరు? తర్వాత ఎలా బయటకు వచ్చాడు? అనేది తెలియాలంటే ఓటీటీలో సినిమా చూడాల్సిందే! View this post on Instagram A post shared by Netflix India (@netflix_in)చదవండి: రూ.100 కోట్లిచ్చినా ఆ పాత్ర చేయను: హీరోయిన్ -
ఓటీటీలో తమిళ హిట్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్
ఓటీటీలోకి మరో క్రేజీ సినిమా రాబోతుంది. ఈ మేరకు స్ట్రీమింగ్ తేదీని ఫిక్స్ చేశారు. గత నెల చివరలో తమిళంలో రిలీజైన క్రైమ్ డ్రామా ప్రశంసలు అందుకుంది.1999లో మద్రాస్ సెంట్రల్ జైలు అల్లర బ్యాక్ డ్రాప్ స్టోరీతో దీన్ని తెరకెక్కించారు. ఇప్పుడు తెలుగులోనూ ఓటీటీలో రిలీజ్ కానుంది. ఇంతకీ ఎప్పుడు ఎక్కడ స్ట్రీమింగ్ కానుందంటే?(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 30 సినిమాలు)రేడియో జాకీ నుంచి హీరో, దర్శకుడిగా మారిన ఆర్జే బాలాజీ.. రీసెంట్గా 'సొర్గవాసల్' సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఓ మిడిల్ క్లాస్ కుర్రాడు.. చేయని నేరానికి జైలుకెళ్తాడు. ఆ తర్వాత ఏమైంది? జైలులో ఎలాంటి రాజకీయాలు నడుస్తున్నాయి? అసలు అల్లర్లు జరగడానికి కారణమేంటి? అనేవి తెలియాలంటే సినిమా చూడాల్సిందే.నవంబర్ 29న థియేటర్లలో రిలీజైన ఈ సినిమాకు మంచి రివ్యూస్ వచ్చాయి. సరిగ్గా నాలుగు వారాల తర్వాత అంటే డిసెంబర్ 27న ఇది నెట్‌ఫ్లిక్స్‌లోకి రానుంది. ఈ మేరకు అధికారిక ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తమిళంతో పాటు తెలుగులోనూ స్ట్రీమింగ్ కానుంది. జైలు బ్యాక్ డ్రాప్లో నడిచే క్రైమ్ డ్రామా మూవీస్ అంటే ఇష్టముంటే మాత్రం దీన్ని మిస్ కాకండి. 'సొర్గవాసల్' అంటే స్వర్గద్వారం అని అర్థం!(ఇదీ చదవండి: 'వరుడు' హీరోయిన్ భానుశ్రీ ఇంట్లో విషాదం) -
నేరుగా ఓటీటీలో రిలీజైన తెలుగు డబ్బింగ్ సినిమా
టాలీవుడ్ బ్యూటీ ప్రియాంక మోహన్.. తమిళంలోనూ హీరోయిన్గా పలు సినిమాలు చేస్తోంది. అలా చేసిన లేటెస్ట్ మూవీ 'బ్రదర్'. జయం రవి హీరో. కొన్నిరోజుల క్రితం తమిళ వెర్షన్ ఓటీటీలో రిలీజ్ కాగా.. ఇప్పుడు తెలుగు డబ్బింగ్ ఎలాంటి హడావుడి లేకుండానే అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇంతకీ 'బ్రదర్' సంగతేంటి? ఏ ఓటీటీలో ఉంది?అక్కా తమ్ముళ్ల ఫ్యామిలీ డ్రామా స్టోరీలతో ఇదివరకే చాలా సినిమాలు వచ్చాయి. అలాంటి ఓ మూవీనే 'బ్రదర్'. రూ.30 కోట్ల బడ్జెట్ పెడితే.. రూ.5 కోట్ల కలెక్షన్స్ మాత్రమే వచ్చాయి. కంటెంట్ మరీ రొటీన్‌గా ఉండటమే దీనికి కారణం. స్టార్ యాక్టర్స్ బోలెడంతమంది ఉన్నాసరే సినిమా బాక్సాఫీస్ దగ్గర నిలబడలేకపోయింది.(ఇదీ చదవండి: బిగ్‌బాస్ 8: రోహిణి ఎలిమినేట్.. ఎన్ని లక్షలు సంపాదించింది?)దీన్ని తెలుగులోనూ థియేటర్లలో రిలీజ్ చేయాలని అనుకున్నారు కానీ తమిళ రిజల్ట్ చూసి నేరుగా ఓటీటీలో రిలీజ్ చేశారు. జీ5లో ప్రస్తుతం తెలుగు, తమిళ వెర్షన్స్ అందుబాటులో ఉన్నాయి. ఫ్యామిలీ డ్రామాస్ అంటే ఇష్టముంటే దీనిపై లుక్కేయొచ్చు.'బ్రదర్' విషయానికొస్తే.. అన్యాయాన్ని తట్టుకోలేని కార్తి (జయం రవి), తనతో పాటు కుటుంబాన్ని కూడా తలనొప్పిగా మారతాడు. న్యాయం కావాలని గొడవలు పడే ఇతడితో.. లా డిగ్రీ చేయిస్తే అయినా సరే బాగుపడతాడేమోనని తండ్రి భావిస్తాడు. కానీ అక్కడా నిరాశే. కనీసం అక్క ఆనంది(భూమిక) దగ్గరకు పంపిస్తే బాగుపడతాడేమోనని ఆశపడతారు. కానీ కార్తి వల్ల వాళ్ల కుటుంబం చిక్కుల్లో పడుతుంది. చివరకు వీటిని కార్తి ఎలా పరిష్కరించాడన్నది మిగతా కథ.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన సూర్య 'కంగువ') -
'బ్లాక్' సినిమా రివ్యూ (ఓటీటీ)
థియేటర్ అంటే భారీ బడ్జెట్ సినిమాలు.. ఓటీటీ అంటే థ్రిల్లర్ మూవీస్ అనేది ప్రస్తుతం ట్రెండ్. అందుకు తగ్గట్లే డిఫరెంట్ కథలతో తీస్తున్న థ్రిల్లర్స్.. భాషతో సంబంధం లేకుండా ఓటీటీల్లోకి వచ్చేస్తున్నాయి. అలా కొన్నిరోజుల క్రితం స్ట్రీమింగ్‌లోకి వచ్చిన సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ మూవీ 'బ్లాక్'. అమెజాన్ ప్రైమ్‌లో ఉన్న ఈ మూవీ ఎలా ఉంది? ఏంటనేది ఇప్పుడు రివ్యూలో చూద్దాం.(ఇదీ చదవండి: 'పుష్ప 3'.. అసలు ఉన్నట్టా? లేనట్టా?)కథేంటి?వసంత్ (జీవా), అరణ్య (ప్రియా భవానీ శంకర్) భార్యభర్తలు. వీకెండ్ సరదాగా గడుపుదామని బీచ్ పక్కన తాము కొన్న కొత్త విల్లాలోకి వెళ్తారు. ఆ గేటెడ్ కమ్యూనిటీలో ఇంకా పూర్తిగా పనులు జరగకపోవడం వల్ల వీళ్లు తప్పితే మరెవరు అక్కడ ఉండరు. పగలంతా బాగానే ఉంటుంది కానీ ఎప్పుడైతే రాత్రి అవుతుందో విచిత్రమైన సంఘటనలన్నీ జరుగుతుంటాయి. భయపడి పారిపోదామని ఎంత ప్రయత్నించినా.. తిరిగి తిరిగి అక్కడికి వస్తుంటారు. మరోవైపు తమ ఎదురుగా ఉన్న విల్లాలో ఎవరో ఉన్నారని అనిపిస్తుంది. వెళ్లి చూస్తే అచ్చుగుద్దినట్లు తమలాంటి ఇద్దరు వ్యక్తులే కనిపిస్తారు. ఇంతకీ వాళ్లెవరు? ఇలా జరగడానికి కారణమేంటి అనేదే మిగతా స్టోరీ.ఎలా ఉందంటే?రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు కాకుండా ఏదైనా డిఫరెంట్ కాన్సెప్ట్ ఉంటే మూవీస్ చూద్దామనుకునే వాళ్లకు 'బ్లాక్' నచ్చేస్తుంది. 1964లో సినిమా ఓపెన్ అవుతుంది. తన ఫ్రెండ్, అతడి ప్రేయసికి మనోహర్ (వివేక్ ప్రసన్న).. బీచ్ దగ్గర్లోని తన విల్లాలో ఉంచి, తర్వాతి రోజు ఉదయం పెళ్లి చేయాలనుకుంటాడు. కానీ అనుకోని కొన్ని సంఘటనల వల్ల వాళ్లిద్దరినీ ఎవరో చంపేస్తారు. కట్ చేస్తే స్టోరీ 60 ఏళ్ల తర్వాత అంటే ప్రస్తుతానికి వస్తుంది.వసంత్, ఆరణ్య.. వాళ్లిద్దరి ప్రవర్తన, మనస్తత్వాలు ఇలా సీన్స్ వెళ్తుంటాయి. కాకపోతే ఇవి రొటీన్‌గా ఉంటాయి. ఎప్పుడైతే వీళ్లిద్దరూ విల్లాలోకి అడుగుపెడతారో విచిత్రమైన సంఘటనలన్నీ జరుగుతుంటాయి. తమలాంటి ఇద్దరు వ్యకులు వీళ్లకు కనిపించడంతో సస్పెన్స్ క్రియేట్ అవుతుంది. అలా హారర్, సూపర్ నేచురల్ ఎలిమెంట్ ఏదో ఉందనే ఉత్కంఠ కలుగుతుంది. చీకటి ప్రదేశం కారణంగా ప్రతిసారీ తాము వివిధ కాలాల్లోకి (టైమ్ లైన్) ముందుకు వెనక్కి వెళుతున్నామని వసంత్ తెలుసుకోవడం, చీకటి ప్రదేశం కారణంగానే వసంత్-ఆర్యం ఒకరికొకరు దూరమవడం.. చివరకు ఎలా కలుసుకున్నారనేది సినిమా.(ఇదీ చదవండి: కవలలకి జన్మనిచ్చిన టాలీవుడ్ హీరోయిన్)సినిమా చూస్తున్నంతసేపు థ్రిల్లింగ్‌గా ఉంటుంది. కాకపోతే అలా జరగడానికి వెనకున్న కారణాన్ని బయటపెట్టే సీన్ మాత్రం పేలవంగా ఉంటుంది. ఏదో ఫిజిక్స్ క్లాస్ చెబుతున్నట్లు వేగంగా చూపించేశారు. దీంతో సగటు ప్రేక్షకుడికి సరిగా అర్థం కాదు. క్లైమాక్స్ కూడా ఏదో హడావుడిగా ముగించేసిన ఫీలింగ్ కలుగుతుంది. సినిమా రెండు గంటల్లోపే ఉండటం ప్లస్ పాయింట్.ఎవరెలా చేశారు?సినిమాలో జీవా, ప్రియా భవానీ శంకర్ పాత్రలు మాత్రమే కనిపిస్తాయి. వీళ్లిద్దరూ ఆయా పాత్రల్లో ఆకట్టుకున్నారు. వాస్తవానికి, ఊహలకు మధ్య నలిగిపోయే వ్యక్తిగా జీవా వేరియషన్స్ చూపించాడు. వివేక్ ప్రసన్నతో పాటు మిగిలిన వాళ్లది అతిథి పాత్రలే. టెక్నికల్ విషయాలకొస్తే డైరెక్టర్ కేజీ సుబ్రమణి తీసుకున్న కాన్సెప్ట్ బాగుంది. కాకపోతే స్క్రిప్ట్‌లో లాజిక్స్ సరిగా ఎష్టాబ్లిష్ చేసుంటే బాగుండేది అనిపించింది. శామ్ సీఎస్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకు చాలా పెద్ద ప్లస్. కొన్ని సీన్లను బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బాగా ఎలివేట్ చేసింది. మిగిలిన డిపార్ట్మెంట్స్ తమ వంతు న్యాయం చేశారు. ఓవరాల్‌గా చూసుకుంటే ఓటీటీలో థ్రిల్లర్ మూవీ ఏదైనా చూద్దామనుకుంటే 'బ్లాక్' ట్రై చేయొచ్చు. ప్రస్తుతానికి తమిళ ఆడియో మాత్రమే అందుబాటులో ఉంది. సబ్ టైటిల్స్ ఉన్నాయి.-చందు డొంకాన(ఇదీ చదవండి: 'బిగ్‌బాస్' హౌస్‌లో ఉండలేనంటూ కన్నీళ్లతో బయటకొచ్చిన శోభా శెట్టి) -
OTT: తమిళ్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ‘సట్టమ్ ఎన్ కైయిల్’ రివ్యూ
చట్టమనేది ఎవ్వరి చుట్టమూ కాదు. అదే చట్టాన్ని వ్యక్తిగతంగా ఎవ్వరూ తమ చేతుల్లోకి తీసుకోకూడదు. కాని దీనికి విరుద్ధంగా ఓ తమిళ సినిమా పేరు వచ్చింది. అదే సట్టమ్ ఎన్ కైయిల్. అంటే చట్టం నా చేతుల్లో అని అర్ధం. సెన్సార్ వాళ్ళు ఈ పేరును ఎలా ఓకే చేశారో కాని సినిమా మాత్రం ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ప్రైమ్ వీడియో ఓటిటి వేదికగా స్ట్రీమ్ అవుతున్న ఈ తమిళ సినిమాకి చాచి దర్శకుడు. సినిమా ప్రధాన పాత్రైన గౌతమ్ పాత్రలో ప్రముఖ తమిళ నటుడు సతీష్ నటించడం విశేషం. మామూలుగా హాస్య పాత్రలతో ఇప్పటిదాకా అలరించిన సతీష్ ఈ సినిమాలో సీరియస్ పాత్రతో ప్రేక్షకులను అలరించాడనే చెప్పాలి.ఇక సట్టమ్ ఎన్ కైయిల్ కథాంశానికొస్తే తమిళనాడు లోని మారుమూల ప్రాంతమైన ఏర్కాడ్ పోలీస్ స్టేషన్ కి తన బిడ్డ మృతికి కారణమైన హాస్పిటల్ సిబ్బంది మీద కంప్లైంట్ ఇవ్వడానికి ఓ వ్యక్తి రావడంతో సినిమా ప్రారంభమవుతుంది. నిజానికి ఈ సన్నివేశం ఏర్కాడ్ పోలీస్ స్టేషన్ సబ్ ఇన్సపెక్టర్ బాషా అవినీతిని చూపించడం కోసం రూపొందించారు. దాని తరువాత గౌతమ్ తన కారులో ప్రయాణిస్తూ ఓ వ్యక్తిని ఢీ కొడతాడు. ఈ యాక్సిడెంట్ లో తాను ఢీ కొట్టిన వ్యక్తి చనిపోవడంతో తన కారు డిక్కీలో ఆ వ్యక్తి బాడీని పెట్టుకుని తిరిగి ప్రయాణిస్తుంటాడు. ఇంతలో పోలీస్ చెక్ పోస్టులో అనూహ్యంగా పోలీసులకు కారుతో సహా చిక్కి ఏర్కాడ్ పోలీస్ స్టేషన్ కు చేరుకుంటాడు గౌతమ్. తన పై పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు పెట్టి స్టేషన్ కి తీసుకువస్తారు. కాని తన కారులో ఉన్న శవం గురించి పోలీసులకు తెలియదు. ఇక అక్కడినుండి కథ అనేక అనూహ్య మలుపులు తిరిగి ఉత్కంఠభరితంగా నడుస్తుంది సినిమా. ముఖ్యంగా ఆఖరి సన్నివేశం సినిమా మొత్తానికే హైలైట్. క్రైమ్ థ్రిల్లర్ జానర్ ఇష్టపడే వాళ్ళకి ఈ సినిమా ఎలాగూ నచ్చుతుంది, అలాగే మామూలు వాళ్ళకి కూడా ఒక్కసారి కథలోకి లీనమైతే సినిమాలో వచ్చే ట్విస్టులకు వీస్తూ పోతూ కుర్చీలకు అతుక్కుపోతారు. సట్టమ్ ఎన్ కైయిల్ మాత్రం రొటీన్ థ్రిల్లర్ అయితే కాదు. వర్త్ టు వాచిట్. (ప్రముఖ ఓటీటీ అమెజాన్ ఫ్రైమ్ వీడియోలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది)-ఇంటూరు హరికృష్ణ -
ప్రభాస్ 'రాజాసాబ్'కి పోటీగా 'ఇడ్లీ' సినిమా
సాధారణంగా ప్రభాస్ సినిమా వస్తుందంటే మిగతా ఏ ఇండస్ట్రీల్లోనూ ఆ టైమ్‌కి వేరే పెద్ద హీరోల చిత్రాలు రిలీజ్‌కి పెట్టుకోరు. ఒకవేళ అలా కాదనుకుంటే షారుక్ 'డంకీ' మూవీకి అయినట్లు కలెక్షన్స్ డ్యామేజ్ అవ్వొచ్చు. కానీ తమిళ హీరో ధనుష్ మాత్రం తన కొత్త మూవీని 'రాజాసాబ్'కి పోటీగా బరిలో నిలబెట్టాడు.సలార్, కల్కి 2898ఏడీ లాంటి బ్లాక్ బస్టర్ హిట్స్ తర్వాత ప్రభాస్ చేస్తున్న సినిమా 'రాజాసాబ్'. హారర్ కామెడీ బ్యాక్ డ్రాప్ స్టోరీతో తీస్తున్న ఈ మూవీకి మారుతి దర్శకుడు. చాలావరకు షూటింగ్ పూర్తయింది. వచ్చే ఏడాది ఏప్రిల్ 10న రిలీజ్ అని చాన్నాళ్ల క్రితమే ప్రకటించారు. ఇందులో ఏ మార్పు ఉండకపోవచ్చు.(ఇదీ చదవండి: 'బ్లడీ బెగ్గర్' సినిమా రివ్యూ)ఇకపోతే ధనుష్ నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న తమిళ సినిమా 'ఇడ్లీ కడై' (ఇడ్లీ మాత్రమే). ఇప్పుడు ఈ సినిమాని కూడా వచ్చే ఏడాది ఏప్రిల్ 10నే థియేటర్లలో రిలీజ్ చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ధనుష్ మూవీ అంటే తెలుగులోనూ రిలీజ్ అవుతుంది. కాకపోతే ఇక్కడ ప్రభాస్ మూవీ ఉంది కాబట్టి పెద్దగా ఎఫెక్ట్ చూపించకపోవచ్చు. తమిళంలో మాత్రం థియేటర్ల, కలెక్షన్ దగ్గర 'రాజాసాబ్'కి ఇడ్లీ మూవీ వల్ల ఇబ్బంది ఉండొచ్చు.ధనుష్ అదే తేదీన తన మూవీ రిలీజ్ చేయడానికి కారణముందనే అనిపిస్తుంది. ఎందుకంటే మనకు ఉగాది ఉన్నట్లే తమిళ న్యూ ఇయర్.. వచ్చే ఏడాది ఏప్రిల్ 14న ఉంది. దీంతో ఆ లాంగ్ వీకెండే ధనుష్ టార్గెట్. ఇదంతా చూస్తుంటే 'రాజాసాబ్' రిలీజ్‌తోపాటు ధనుష్ మూవీ రిలీజ్ విషయంలోనూ మార్పు ఉండకపోయే అవకాశాలే ఎక్కువ.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన నాలుగు హిట్ సినిమాలు.. ఏది ఎందులో?) -
'బ్లడీ బెగ్గర్' సినిమా రివ్యూ
'స్టార్', 'దాదా' లాంటి డబ్బింగ్ సినిమాలతో తెలుగులోనూ మోస్తరు గుర్తింపు తెచ్చుకున్న తమిళ నటుడు కవిన్. ఇతడు బిచ్చగాడు పాత్రలో నటించిన మూవీ 'బ్లడీ బెగ్గర్'. దీపావళి సందర్భంగా తమిళంలో రిలీజైంది. వారం తర్వాత అంటే ఇప్పుడు (నవంబర్ 7) తెలుగులోనూ థియేటర్లలోకి వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉందనేది రివ్యూలో చూద్దాం.కథేంటి?కళ్లు లేని కబోదిని బాబు, నడవలేని అభాగ్యుడిని బాబు.. అని మాయమాటలు చెప్పి డబ్బులు అడుక్కునే ఓ బిచ్చగాడు (కవిన్). వచ్చిన డబ్బులతో లైఫ్ జాలీగా గడిపేస్తుంటాడు. ఓ రోజు దినం భోజనాల కోసమని చాలామంది బిచ్చగాళ్లతో పాటు ఓ పెద్ద బంగ్లాకి వెళ్తాడు. భోజనాలు అన్నీ పూర్తయిన తర్వాత తిరిగి ఇంటికి వెళ్లిపోకుండా దొంగచాటుగా బంగ్లాలోకి వెళ్తాడు. కాసేపటివరకు బాగానే ఎంజాయ్ చేస్తాడు. కానీ ఊహించని పరిస్థితుల వల్ల లోపల ఇరుక్కుపోతాడు. ఆ తర్వాత ఏమైంది? బంగ్లా యజమానులు బిచ్చగాడిని ఎందుకు చంపాలనుకున్నారు? చివరకు బతికి బయటపడ్డాడా లేదా అనేదే స్టోరీ?(ఇదీ చదవండి: Amaran Review: ‘అమరన్’ మూవీ రివ్యూ)ఎలా ఉందంటే?సినిమాల్లో ఏదైనా పాత్ర చనిపోతే మనం బాధపడతాం. అది ఎప్పుడూ జరిగేదే. కానీ ఓ పాత్ర చనిపోయినప్పుడు కూడా మనకు నవ్వొచ్చింది అంటే అది డార్క్ కామెడీ సినిమా అని అర్థం. 'బ్లడీ బెగ్గర్' కూడా అలాంటి బ్లాక్ లేదా డార్క్ కామెడీ మూవీ అని చెప్పొచ్చు.ఓ పిల్లాడిని.. బర్త్ డే బంప్స్ పేరుతో మరో నలుగురు పిల్లలు కొట్టి చంపే సీన్‌తో సినిమా మొదలవుతుంది. కట్ చేస్తే బిచ్చగాడిని చూపిస్తారు. మాయమాటలు చెప్పి జనాల్ని ఎలా మోసం చేస్తున్నాడు? వచ్చిన డబ్బుతో జాలీగా ఎలా ఎంజాయ్ చేస్తున్నాడు అనేది చూపించారు. ఈ బిచ్చగాడు.. ఓ పెద్ద భవంతిలోకి వెళ్లిన తర్వాత అసలు కథ మొదలవుతుంది.కొన్నాళ్ల క్రితం చనిపోయిన చంద్రబోస్ అనే స్టార్ హీరోది ఆ బంగ్లా. ఈయనకు కోట్ల ఆస్తి ఉంటుంది. నలుగురు పిల్లలు. డబ్బు, ఈగోలకు పోయి చంపడానికైనా సరే వెనకాడరు. ఆస్తి దక్కుతుందని బంగ్లాకు వచ్చిన వీళ్లకు.. తండ్రి తన సవతి కొడుకు పేరు మీద ఆస్తి అంతా రాసేశారని తెలిసి షాకవుతారు. ఆ సవతి కొడుకుని అప్పటికే లాయర్ చంపేసుంటాడు. వాడి స్థానంలో బిచ్చగాడిని ఇరికిస్తారు. ఆ తర్వాత డబ్బు కోసం ఒకరిని ఒకరు ఎలా చంపుకొన్నారనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: 'లక్కీ భాస్కర్' సినిమా రివ్యూ)రెగ్యులర్, రొటీన్ సినిమాలతో పోలిస్తే ఇదో డిఫరెంట్ కథ. బిచ్చగాడి చేతిలో డబ్బునోళ్లు కుక్క చావు చావడం అనే కాన్సెప్టే వింతగా ఉంటుంది. ఒక్కో పాత్ర తమ తోటి వాళ్లనే దారుణంగా చంపేస్తుంటారు. కాకపోతే ఆ సీన్స్‌లో మనం భయపడాల్సింది పోయి నవ్వుతాం. అంత వెరైటీగా ఉంటాయి. బిచ్చగాడు.. బంగ్లాలోకి ఎంటర్ అయిన తర్వాత కాసేపు బోర్ కొడుతుంది. కానీ సెకండాఫ్ మొదలైన తర్వాత మాత్రం ఊహించని ట్విస్టులు.. ఇదెక్కడి మాస్ రా మావ అనిపిస్తాయి.భారీకాయంతో ఉండే మహిళ, జావెలిన్ త్రో విసిరే భర్త, వీళ్లకు పుట్టిన పిల్లాడు.. ఈ ముగ్గురు ఒక్కో వ్యక్తుల్ని చంపే సీన్స్ ఉంటాయి. ఇవైతే సర్ప్రైజ్ చేస్తాయి. ప్రారంభం నుంచి చూపించిన సన్నివేశాలు, వస్తువులు, ఉండే మనుషులు.. చెప్పాలంటే ప్రతి చిన్న పాయింట్‌ని దర్శకుడు మొదలుపెట్టిన తీరు.. ముగించిన విధానం అరె భలే తీశాడ్రా అనిపిస్తుంది. అలానే మనకు ఎంత డబ్బున్నా సరే కర్మ ఎప్పటికీ వదిలిపెట్టదనే విషయాన్ని కూడా ఇంట్రెస్టింగ్గా చూపించారు.ఎవరెలా చేశాడు?బిచ్చగాడి పాత్రలో కనిపించిన కవిన్ అదరగొట్టేశాడు. ప్రారంభంలో పది నిమిషాల్లోనే బిచ్చగాడు పాత్ర రూపు మారుతుంది. మరికాసేపు బిచ్చగాడి సీన్స్ ఉండుంటే బాగుండు అనిపిస్తుంది. అంత ఎంటర్టైనింగ్గా ఉంటాయి. చనిపోయిన నటుడి కొడుకు-కూతుళ్లు, మనవడు-మనవరాళ్లుగా చేసిన పాత్రధారులు ఎవరికి వాళ్లు అదరగొట్టేశారు. కన్నింగ్ లాయర్‌గా చేసిన సునీల్ సుకంద అయితే నచ్చేస్తాడు.టెక్నికల్ విషయాలకొస్తే దర్శకుడు శివబాలన్ ముత్తుకుమార్ తీసుకున్న పాయింట్ డిఫరెంట్. దాన్ని ప్రెజంట్ చేసిన విధానం అంతే డిఫరెంట్. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పర్లేదు. సినిమాటోగ్రఫీ-ఎడిటింగ్ బాగున్నాయి. సినిమా అంతా బంగ్లాలోనే జరుగుతుంది. కాబట్టి దానికి తగ్గట్లే నిర్మాణ విలువలు ఉన్నాయి. ఫైనల్‌గా చెప్పాలంటే ఇది అందరికీ నచ్చే సినిమా అయితే కాదు. డార్క్ కామెడీ జానర్ నచ్చేవాళ్లకు మాత్రం ఎక్కుతుంది.-చందు డొంకాన(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన దేవర, వేట్టయన్, జనక అయితే గనక.. ఏది ఎందులో?) -
స్టైల్ మార్చిన మణిరత్నం.. కమల్ 'థగ్ లైఫ్' రిలీజ్ ఫిక్స్
మణిరత్నం సినిమాలంటే క్లాస్, కూల్‌గా ఉంటాయి. చివరగా తీసిన 'పొన్నియిన్ సెల్వన్' సినిమాలు మాత్రం పీరియాడికల్ గ్రాండియర్స్. కాకపోతే వీటికి తమిళంలో తప్పితే మిగతా ఏ భాషలోనూ పెద్దగా ఆదరణ దక్కలేదు. ప్రస్తుతం ఈ దర్శకుడు 'థగ్ లైఫ్' మూవీ చేస్తున్నాడు. తాజాగా కమల్ హాసన్ పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ డేట్ ప్రకటించారు.(ఇదీ చదవండి: 'దేవర'తో పాటు ఈ శుక్రవారం ఓటీటీల్లోకి 15 సినిమాలు)విడుదల తేదీ ప్రకటిస్తూ ఓ టీజర్ రిలీజ్ చేశారు. ఇందులో కమల్ హాసన్‌తో పాటు శింబుని కూడా చూపించారు. ఇంట్రెస్టింగ్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్‌కి తోడు యాక్షన్ కట్ వచ్చేలా చూపించారు. విజువల్స్ చూస్తుంటే మణిరత్నం ఈసారి ఫుల్ ఆన్ యాక్షన్ ఎంటర్ టైన్ తెరకెక్కించినట్లు కనిపిస్తుంది. వచ్చే ఏడాది జూన్ 5న థియేటర్లలో మూవీ రిలీజ్ కానుంది. ఇందులో కమల్‌తో పాటు శింబు, త్రిష, అశోక్ సెల్వన్, ఐశ్వర్య లక్ష్మీ, జోజు జార్జ్, అభిరామి, నాజర్ తదితరులు కీ రోల్స్ చేస్తున్నారు.(ఇదీ చదవండి: 'పుష్ప 2' కోసం తమన్.. 'కాంతార' మ్యూజిక్ డైరెక్టర్ కూడా?) -
ఓటీటీలోకి వచ్చేసిన చిన్న సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్
ఓటీటీలోకి ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి. ఈ వారం కూడా 'దేవర', 'వేట్టయన్' సినిమాలతో పాటు సమంత 'సిటాడెల్' వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. వీటికోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఇవి కాదన్నట్లు డబ్బింగ్ మూవీస్ కూడా ఉన్నాయి. ఇవి అలా ఉండగానే సైలెంట్‌గా ఓ తమిళ విలేజ్ బ్యాక్ డ్రాప్ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది.(ఇదీ చదవండి: డబ్బు లాక్కొని హీరోయిన్ని భయపెట్టిన బిచ్చగాడు)ప్రముఖ కమెడియన్ యోగిబాబు, యువ నటి బ్రిగిడ తదితరులు కీలక పాత్రలు పోషించిన సినిమా 'కొళిపన్నై చెల్లదురై'. సెప్టెంబరు 20న థియేటర్లలో రిలీజైన ఈ చిత్రానికి పర్లేదనిపించే టాక్ వచ్చింది. ఇప్పుడు ఇది ఎలాంటి ప్రకటన లేకుండా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి వచ్చేసింది. తమిళంతో పాటు తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోంది. టైమ్ పాస్ కావాలంటే ఈ మూవీపై ఓ లుక్కేయండి.(ఇదీ చదవండి: షోలో కన్నీళ్లు పెట్టుకున్న హీరో సూర్య) -
'విడుదల 2' తెలుగు హక్కులు నిర్మాత చింతపల్లి రామారావుకే
వెట్రిమారన్ 'విడుదల' సినిమా గతేడాది రిలీజైంది. తెలుగు, తమిళ భాషల్లో మంచి ఆదరణ దక్కించుకుంది. విజయ్ సేతుపతి కీలక పాత్రలో నటించిన ఈ చిత్ర సీక్వెల్‌ని త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ చిత్ర తెలుగు థియేటర్ హక్కుల్ని ప్రముఖ నిర్మాత చింతపల్లి రామారావు దక్కించుకున్నారు. ఈ మేరకు మూవీ టీమ్‌ని కలిశారు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 23 సినిమాలు.. ఐదు స్పెషల్)నిర్మాత చింతపల్లి రామారావు మాట్లాడుతూ.. 'విడుదల 2' సినిమాని తెలుగు ప్రేక్షకులకు అందించబోతున్నందుకు సంతోషంగా ఉంది. విజయ్ సేతుపతి, సూరి నటన హైలైట్‌గా ఉండనుందని చెప్పుకొచ్చారు.(ఇదీ చదవండి: Bigg Boss 8: గౌతమ్‌కి 'అమ్మతోడు' సవాలు.. ఈసారి నామినేషన్స్‌లో ఎవరెవరు?) -
నటి వనిత నాలుగో పెళ్లి.. అసలు నిజం ఇది
తమిళ ప్రముఖ నటి వనితా విజయ్ కుమార్ నాలుగో పెళ్లి అని న్యూస్. గత కొన్నాళ్లుగా రిలేషన్లో ఉన్న కొరియోగ్రాఫర్ రాబర్ట్‌తోనే ఏడడుగులు వేయనుందని అందరూ అనుకున్నారు. కానీ ఇది నిజం కాదని స్వయంగా ఇప్పుడు ఈమెనే తేల్చేసింది. ఎందుకంటే ఇదంతా తమ కొత్త మూవీ కోసం చేసిన ప్రమోషనల్ స్టంట్. దీంతో అందరూ ఫూల్ అయ్యారని చెప్పొచ్చు.(ఇదీ చదవండి: తల్లిదండ్రులైన రాకింగ్ రాకేష్, సుజాత దంపతులు)రెండు మూడు రోజుల క్రితం రాబర్ట్‌కి ప్రపోజ్ చేస్తున్నట్లు ఉన్న ఫొటోని నటి వనితా విజయ్ కుమార్ ఇన్ స్టా స్టోరీలో పోస్ట్ చేసింది. అక్టోబరు 5వ తేదీని గుర్తుంచుకోండి అని రాసుకొచ్చింది. ఇది చూసిన అందరూ నాలుగో పెళ్లికి రెడీ అయిందని ఫిక్స్ అయ్యారు. రాబర్ట్‌తో ఈమె రిలేషన్లో ఉన్నట్లు గత కొన్నాళ్లుగా రూమర్స్ వచ్చాయి. దీంతో అందరూ పెళ్లి వార్త నిజమే అనుకున్నారు. కానీ ఇదంతా 'మిసెస్ & మిస్టర్' కోసమని ఇప్పుడు బయటపెట్టారు.ఈ సినిమాలో వనితా విజయ్ కుమార్, రాబర్ట్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. వనితనే దర్శకత్వం వహించింది. ఈమె కూతురు జోవికా నిర్మాతగా వ్యవహరించింది. ఇలానే గతంలో తెలుగులో నరేశ్-పవిత్ర కూడా తొలుత పెళ్లి అన్నట్లు హడావుడి చేశారు. తీరా చూస్తే 'మళ్లీ పెళ్లి' సినిమా కోసం చేసిన ప్రమోషనల్ స్టంట్ అని తేలడంతో అందరూ అవాక్కయ్యారు. ఈ ఐడియానే వనిత కాపీ కొట్టేశారా అనిపించింది. కాగా వనిత విజయ్‌కుమార్ తమిళ బిగ్‌బాస్ మూడో సీజన్, బిగ్‌బాస్ అల్టిమేట్ మొదటి (ఓటీటీ) సీజన్లో పాల్గొంది.(ఇదీ చదవండి: పరారీలో హర్షసాయి.. లుక్అవుట్ నోటీసులు జారీ) View this post on Instagram A post shared by Vanitha (@vanithavijaykumar) -
ఓటీటీలోనే విచిత్రమైన సినిమా.. 'కొట్టుక్కాళి' రివ్యూ
ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు సినిమా తీసే పద్ధతి, చూసే విధానం చాలా మారిపోయింది. కొత్తతరం దర్శకులు ఎలాంటి ప్రయోగాలకైనా వెనకాడటం లేదు. తెలుగులో తక్కువ గానీ తమిళ, మలయాళంలో డిఫరెంట్ కథలు వస్తుంటాయి. అలాంటి ఓ తమిళ మూవీనే 'కొట్టుక్కాళి'. తాజాగా ఇది ఓటీటీలోకి వచ్చేసింది. ఇంతకీ ఇది ఎలా ఉంది? ఏంటనేది రివ్యూలో చూద్దాం.కథేంటి?మీనా (అన్నా బెన్) ఓ సాధారణ అమ్మాయి. ఈమె బావ పేరు పాండి (సూరి). వీళ్లిద్దరికీ పెళ్లి చేస్తామని తల్లిదండ్రులు అంటే చదువుకుంటానని మీనా చెబుతుంది. దీంతో కాలేజీలో చేర్పిస్తారు. అక్కడే మరో కులానికి చెందిన అబ్బాయితో ప్రేమలో పడుతుంది. ఇది మీనా ఇంట్లో తెలిసి ఆమెపై పెద్దోళ్లు కోప్పడతారు. దీంతో పూర్తిగా సైలెంట్ అయిపోతుంది. ప్రేమించిన అబ్బాయి.. తమ కూతురిపై చేతబడి చేశాడని ఈమె తల్లిదండ్రులు భావిస్తారు. ఈమెకు పట్టిన దెయ్యాన్ని వదిలించాలని కుటుంబమంతా కలిసి ఓ చోటుకు వెళ్తారు. ఈ ప్రయాణంలో ఏం జరిగింది? చివరకు ఏమైందనేదే స్టోరీ.ఎలా ఉందంటే?'కొట్టుక్కాళి' అంటే తమిళంలో మొండి అమ్మాయి అని అర్థం. మలయాళ నటి అన్నా బెన్ లీడ్ రోల్ చేసింది. ఈ సినిమా కథ చాలా సింపుల్. దెయ్యం పట్టిందనుకున్న ఓ అమ్మాయిని తీసుకుని, ఈమె కుటుంబం ఓ స్వామి దగ్గరకు వెళ్తారు. ఈ ప్రయాణంలో ఒక్కక్కరు ఎలా ప్రవర్తించారు. అసలు దర్శకుడు మనకు ఏం చెప్పాలనుకున్నాడనేదే తెలియాలంటే మూవీ చూడాలి.సాధారణంగా సినిమా అంటే పాటలు, ఫైట్స్, హోరెత్తిపోయే బీజీఎం.. ఇలా బోలెడంత హంగామా. కానీ 'కొట్టుక్కాళి'లో ఇవేం ఉండవు. ఇంకా చెప్పాలంటే దాదాపు గంటన్నర పాటు ఉండే ఈ మూవీలో హీరోయిన్‌కి ఒక్కటే డైలాగ్. అది కూడా జస్ట్ ఐదే సెకన్లు మాట్లాడుతుంది. అంతే. కోడిపుంజుని తాడుతో బంధించినట్లే.. ఫ్యామిలీ అనే ఎమోషన్స్‌కి తలొగ్గి హీరోయిన్ బంధి అయిపోయి ఉంటుంది. సినిమా చూస్తే ఈ పాయింట్ అర్థమవుతుంది.అలానే పురుషాధిక్యం, దెయ్యాల్ని వదిలించే పేరుతో కొందరు వ్యక్తులు మహిళల్ని అసభ్యకరంగా తాకుతూ ఎలా ప్రవర్తిస్తున్నారనే విషయాల్ని ఇందులో చూపించారు. ఈ సినిమాకు క్లైమాక్స్ ఓపెన్ ఎండింగ్‌తో వదిలేశారు. అంటే ఎవరికి ఏమనిపిస్తే అదే క్లైమాక్స్ అనమాట.ఎవరెలా చేశారు?ప్రధాన పాత్రలు చేసిన సూరి, అన్నా బెన్ తమ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. మిగిలిన పాత్రల్లో నటించిన వాళ్లందరూ చాలా నేచురల్‌గా ఉంటారు. సినిమాటోగ్రఫీ బాగుంది. సినిమా చూస్తున్నంతసేపు పల్లెటూరిలో ఉన్నామా అనే ఫీలింగ్ వస్తుంది. పాండి, మీనా క్యారెక్టర్స్‌తో పాటు అలా ట్రావెల్ అయిపోతాం. దొంగ స్వామిజీల గురించి దర్శకుడు ఏదో మెసేజ్ ఇద్దామనుకున్నాడు. కానీ అందరినీ ఆకట్టుకునేలా తీయలేకపోయాడు.ఇకపోతే 'కొట్టుక్కాళి' సినిమా అమెజాన్ ప్రైమ్‌లో తమిళంలో స్ట్రీమింగ్ అవుతుంది. కాస్త ఓపిక ఉండి, డిఫరెంట్ సినిమాలు చూద్దామనుకుంటే దీన్ని ట్రై చేయండి.- చందు డొంకాన -
తమిళ స్టార్ హీరోలు.. కార్తీని చూసి కాస్త నేర్చుకోండి!
తమిళ దర్శకనిర్మాతలకు తెలుగు ప్రేక్షకులంటే మరీ అలుసు. బయటకు ఆహా ఓహో అని చెబుతారు. కానీ సినిమాల్లో కథ దగ్గర నుంచి టైటిల్ వరకు ప్రతి దానిలోనూ తమిళ ఫ్లేవర్ కనిపిస్తూనే ఉంటుంది. గతంలో ఇలా ఉండేది కాదు. సినిమాకు పెట్టే పేరు దగ్గర నుంచి డబ్బింగ్ వరకు చాలా జాగ్రత్తలు తీసుకునే వాళ్లు. కానీ రీసెంట్ టైంలో ఆ పద్ధతి పూర్తిగా తగ్గిపోయింది. మళ్లీ ఇన్నాళ్లకు కార్తీ తన కొత్త మూవీతో తెలుగు ఆడియెన్స్‌కి కాస్త గౌరవం ఇస్తున్నాడా అనిపిస్తుంది.రీసెంట్ టైంలో తమిళ డబ్బింగ్ చిత్రాలు తెలుగులోనే చాలానే రిలీజయ్యాయి. వీటిలో అయలాన్, బాక్, రాయన్, తంగలాన్ ఉన్నాయి. ఈ టైటిల్‌కి అర్థం ఏంటంటే ఒక్కడూ చెప్పలేడు. తమిళంలో ఏదైతే పెట్టారే దాన్ని యధాతథంగా అనువదించేశారు. ఏ పేరు పెట్టినా తెలుగు ప్రేక్షకుడు చూస్తాడులే అని అలుసు కావొచ్చు. త్వరలో రిలీజయ్యే రజనీకాంత్ 'వేట్టయాన్', సూర్య 'కంగువ' సినిమాలది కూడా ఇదే తీరు.(ఇదీ చదవండి: ఒకేరోజు ఓటీటీల్లోకి వచ్చేసిన 20 మూవీస్.. ఇవి డోంట్ మిస్)ఇకపోతే కార్తీ లేటెస్ట్ తమిళ మూవీ 'మైళగన్'. తమిళనాడులోని తంజావుర్‌లో ఓ రాత్రి ఇద్దరు వ్యక్తులు (బావ-బావమరిది) మధ్య జరిగిన స్టోరీతో దీన్ని తీశారు. తెలుగులోనూ దీన్ని రిలీజ్ చేస్తున్నారు. తమిళ పేరుని ఉన్నది ఉన్నట్లు కాకుండా 'సత్యం సుందరం' అని టైటిల్ పెట్టారు. ఉద్దండరాయుని పాలెం ఊరిలో కథని జరిగినట్లు చూపించారు. ఊరి పేర్లతో సహా బండి నంబర్ ప్లేట్ల విషయంలో టీమ్ కాస్త శ్రద్ధ తీసుకున్నారు. తాజాగా రిలీజ్ చేసిన టీజర్ చూస్తే ఇవన్నీ అర్థమవుతున్నాయి.అయితే ఈ సినిమా ఎన్టీఆర్ 'దేవర' సినిమా రిలీజైన ఒకరోజు తర్వాత అంటే సెప్టెంబరు 28న తెలుగులో రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. కార్తీ తీసే సినిమాలు అంతో ఇంతో తెలుగు ప్రేక్షకులకు నచ్చుతుంటాయి. అయితే 'దేవర'తో పోటీగా వస్తున్నాడు. ఏం చేస్తాడో చూడాలి? సరే ఇదంతా పక్కనబెడితే తమిళ స్టార్ హీరోలు, దర్శక నిర్మాతలు ఇప్పటికైనా కాస్త టైటిల్స్ విషయంలో శ్రద్ధ తీసుకుంటే బెటర్!(ఇదీ చదవండి: ఓటీటీలోకి తెలుగు లేటెస్ట్ కామెడీ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?) -
ఓటీటీలో స్టార్ హీరో తీసిన పిల్లల సినిమా.. తెలుగులో స్ట్రీమింగ్
వరస సినిమాలు చేసే తమిళ స్టార్ హీరోల్లో శివ కార్తికేయన్ ఒకడు. నిర్మాతగానూ డిఫరెంట్ సినిమాలు తీస్తుంటాడు. అలా తీసిన చిన్న పిల్లల చిత్రమే 'కురంగు పెడళ్'. మే తొలి వారంలో థియేటర్లలో రిలీజైంది. మంచి టాక్ తెచ్చుకుంది. నెల తర్వాత ఆహా, అమెజాన్ ప్రైమ్ ఓటీటీల్లోకి అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇప్పుడు తెలుగు వెర్షన్ నేరుగా రిలీజ్ చేసేశారు.(ఇదీ చదవండి: విమానం కొన్న హీరో సూర్య.. రేటు రూ.100 కోట్లు పైనే?)ప్రస్తుతం 'కురంగు పెడళ్' సినిమా తెలుగు వెర్షన్ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే సైలెంట్‌గా అందుబాటులోకి తీసుకొచ్చేశారు. 1980 బ్యాక్ డ్రాప్ స్టోరీతో చిన్నప్పటి జ్ఞాపకాల్ని గుర్తుచేసేలా ఈ సినిమా ఉంటుంది. కమల కన్నన్ దర్శకత్వం వహించగా.. జిబ్రాన్ సంగీతమందించాడు.'కురంగు పెడళ్' విషయానికొస్తే.. సైకిల్ నడపడం నేర్చుకోవాలని కలలు కన్న ఓ యువకుడు.. ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. సైకిల్ నడపడం రాని ఈ పిల్లాడి తండ్రి.. కొడుకు కోరికని ఎలా నెరవేర్చాడు అనే పాయింట్ చుట్టూ భావోద్వేగభరితంగా తీశారు. ఇఫితో పాటు పలు అంతర్జాతీయ చిత్రాత్సవాల్లో ఈ మూవీ స్క్రీనింగ్ కావడం విశేషం.(ఇదీ చదవండి: బోల్డ్ సీన్స్ వైరల్.. నన్ను జడ్జ్ చేయడం కరెక్ట్ కాదు: రుహానీ శర్మ) -
మ్యూజిక్ డైరెక్టర్ లేని సినిమా.. అంతా కోడి అరుపుతోనే
తెలుగులో కమర్షియల్ సినిమాలు వస్తుంటాయి. ఏదో అప్పుడప్పుడు ఒకటి అరా కంటెంట్ ఓరియెంట్ మూవీస్ వస్తుంటాయి. కానీ తమిళ, మలయాళంలో మాత్రం దర్శకులు ఎప్పుడో ఏదో కొత్తదనం ట్రై చేస్తుంటారు. అలా తీసిన తమిళ సినిమా 'కొట్టుకళి'. అసలు మ్యూజిక్ డైరెక్టర్ అవసరమే లేకుండా ఈ చిత్రాన్ని తీయడం విశేషం. తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: తల్లి పుట్టినరోజున తిరుమలలో జాన్వీ కపూర్)'కల్కి'లో కైరా పాత్రలో నటించింది మలయాళ నటి అన్నాబెన్. 'కొట్టుకళి'లో ఈమె ప్రధాన పాత్రధారి. సూరి హీరోగా చేశాడు. తమిళ స్టార్ హీరో శివకార్తికేయన్ నిర్మించాడు. గతంలో 'పెబ్బల్స్' అనే అవార్డ్ విన్నింగ్ మూవీ తీసిన పీఎస్ వినోద్ రాజ్ దీనికి దర్శకుడు. ఆగస్టు 23న థియేటర్లలో రిలీజ్ చేయబోతున్న సందర్భంగా తాజాగా ట్రైలర్ విడుదల చేశారు.కోడి పుంజు సీన్‌తో ట్రైలర్ మొదలవుతుంది. చుట్టూ ఉన్న సౌండ్స్‌తో పాటు కోడీ అరుపుతోనే ట్రైలర్ అంతా చూపించారు. దెయ్యం పట్టిన ఓ అమ్మాయిని దాన్ని వదిలించడానికి హీరో అండ్ గ్యాంగ్ తీసుకుపోవడం.. పల్లెటూరిలో జరిగే చిన్న చిన్న గొడవలు.. ఇలా ఏదో ఉంది అనేలా ట్రైలర్ చూపించారు. డిఫరెంట్ మూవీస్ చూద్దామనుకునే వాళ్లకు బహుశా ఇది నచ్చొచ్చేమో!(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన వెరైటీ థ్రిల్లర్ మూవీ.. తెలుగులోనూ) -
స్టార్ డైరెక్టర్-యంగ్ హీరోయిన్ పెళ్లి? షాక్‌లో ఫ్యాన్స్!
ఇండస్ట్రీలో ప్రేమించి పెళ్లి చేసుకోవడం కొత్తేం కాదు. ఏ భాషలో తీసుకున్నా సరే ఇలాంటి జంటలు చాలానే కనిపిస్తుంటాయి. నాలుగైదు రోజుల క్రితం కన్నడ హీరోయిన్ సోనాలి.. దర్శకుడు తరుణ్ సుధీర్‌తో పెళ్లికి రెడీ అయింది. ఆగస్టులో పెళ్లి ఉంటుందని చెబుతూ ఏకంగా ప్రీ వెడ్డింగ్ వీడియోనే పోస్ట్ చేసింది. ఇప్పుడు వీళ్లలానే తమిళ స్టార్ డైరెక్టర్-హీరోయిన్ పెళ్లి దుస్తుల్లో కనిపించడం అందరినీ షాక్‌కి గురిచేసింది.(ఇదీ చదవండి: 'ఈ-మెయిల్స్' వివాదంలో మంచు విష్ణు.. అసలేం జరిగిందంటే?)తమిళంలో 'అడియే', 'తిట్టం ఇరండు', 'హాట్ స్పాట్' సినిమాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న విఘ్నేశ్ కార్తీక్.. యంగ్ హీరోయిన్ బ్రిగిడ సాగాతో కలిసి సంప్రదాయ పెళ్లి దుస్తుల్లో కనిపించాడు. ఆ ఫొటోని ఇన్ స్టాలో పోస్ట్ చేశాడు. సడన్‌గా చూసి నిజంగానే ఈ డైరెక్టర్, హీరోయిన్ పెళ్లి చేసుకున్నారేమో అనుకున్నారు. కానీ ఇదంతా ఓ సినిమా కోసం జరిగిన షూట్.ఎందుకంటే ఇదివరకే దర్శకుడు విఘ్నేశ్ కార్తీక్‌కి పెళ్లయింది. మరోవైపు బ్రిగిడ.. తమిళ, తెలుగులో నటిగా గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నాల్లో ఉంది. అయితే వీళ్లిద్దరూ పెళ్లి డ్రస్సులో కనిపించేసరికి చాలామంది ఇది నిజమేనేమో అనుకున్నారు. అసలు విషయం తెలిసి తాపీగా నవ్వకున్నారు. ఏదేమైనా ఇలా సినిమా ప్రమోషన్ చేయడమంటే ఫస్ట్ షాకవుతారు. ఆ తర్వాత నవ్వుకుంటారు!(ఇదీ చదవండి: హీరో విశాల్‌ని టార్గెట్ చేసిన తమిళ నిర్మాతలు.. అసలేం జరుగుతోంది?) -
రోలెక్స్‌ని గుర్తుచేసిన సూర్య కొత్త సినిమా టీజర్
తమిళ స్టార్ హీరో సూర్యకి తెలుగులోనూ అద్భుతమైన ఫాలోయింగ్ ఉంది. ఈ క్రమంలోనే కొత్త సినిమా వస్తుందంటే చాలు, మనోళ్లు తెగ ఎగ్జైట్ అయిపోతుంటారు. ప్రస్తుతానికి 'కంగువ' చేస్తున్నాడు. దసరా కానుకగా అక్టోబరు 10న ఇది థియేటర్లలోకి రానుంది. ఇది కాకుండా స్టార్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్‌తో మూవీ చేస్తున్నాడు. సూర్య పుట్టినరోజు సందర్భంగా గ్లింప్స్ పేరిట ఓ వీడియో వదిలారు.(ఇదీ చదవండి: 'ఆర్ఆర్ఆర్' రికార్డ్ కూడా బ్రేక్ చేసిన 'కల్కి')'లవ్, లాఫర్, వార్.. ద వన్' ట్యాగ్ లైన్‌తో రిలీజ్ చేసిన సూర్య 44మూవీ గ్లింప్స్ వీడియో సింపుల్‌గా ఉంది. అదే టైంలో ఇంట్రెస్టింగ్గా అనిపించింది. ఎందుకంటే ఇందులోనూ సూర్య.. డాన్‌గా కనిపించబోతున్నాడని క్లారిటీ ఇచ్చేశారు. ఇదివరకు ఈ తరహా పాత్రల్లో సూర్య గతంలో ఒకటి రెండుసార్లు చేశారు. ఈ గ్లింప్స్‌లో సిగరెట్ తాగుతూ, గన్ పట్టుకుని, ఒంటిపై రక్తం మరకలతో నడిచి వస్తుంటే.. 'విక్రమ్' మూవీలో రోలెక్స్.. ఒక్క సెకను అలా వచ్చి వెళ్లిపోయాడా అనిపించింది. త్వరలోనే టీజర్ రిలీజ్ చేస్తామని ప్రకటించారు. బహుశా వచ్చే ఏడాది సంక్రాంతి సినిమాని రిలీజ్ చేస్తారేమో!(ఇదీ చదవండి: థియేటర్లలో ఉండగానే ఓటీటీలోకి హిట్ సినిమా)Happy Birthday @Suriya_offl Sir From Team #Suriya44 #HappyBirthdaySuriya #HBDTheOneSuriya pic.twitter.com/PuyM43y4rl— karthik subbaraj (@karthiksubbaraj) July 22, 2024 -
దీపావళి రేసులో కమల్ హాసన్.. కాకపోతే నిర్మాతగా!
'కల్కి'లో విలన్‌గా హిట్ కొట్టిన కమల్ హాసన్.. రీసెంట్గా 'భారతీయుడు 2'గా ఘోరమైన డిజాస్టర్ అందుకున్నాడు. ఇప్పుడు నెలల గ్యాప్‌లో నిర్మాతగా యాక్షన్ మూవీతో ప్రేక్షకుల్ని పలకరించనున్నాడు. రాజ్‌కమల్ ఫిలిం ఇంటర్నేషనల్ పతాకంపై కమల్ నిర్మిస్తున్న లేటెస్ట్ మూవీ 'అమరన్'. శివకార్తికేయన్, సాయిపల్లవి జంటగా నటిస్తున్నారు. చాలా గ్యాప్ తరువాత సాయిపల్లవి చేస్తున్న తమిళ చిత్రమిది. రాజ్‌కుమార్ పెరియసామి దర్శకుడు. తాజాగా ఈ చిత్ర రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు.(ఇదీ చదవండి: 'డార్లింగ్' సినిమా రివ్యూ)ఇందులో శివకార్తికేయన్ ముకుందన్ అనే సైనికుడిగా పవర్‌పుల్ పాత్రలో కనిపించబోతున్నారు. మేజర్ ముకుంద్ వరదరాజన్ బయోపిక్‌గా దీన్ని తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని దీపావళి కానుకగా అక్టోబరు 31న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఇకపోతే విలన్‌గా హిట్ కొట్టి, హీరోగా ఫ్లాప్ అందుకున్న కమల్.. నిర్మాతగా మరి ఎలాంటి ఫలితం అందుకుంటాడనేది చూడాలి?(ఇదీ చదవండి: బాలీవుడ్ మాఫియాకి దెబ్బ మీద దెబ్బ.. షాకిచ్చిన 'కల్కి' మేకర్స్!) -
విజయ్ సేతుపతి ఫ్రీగా నటించిన సినిమా.. ఇన్నాళ్లకు ఓటీటీలో రిలీజ్
విజయ్ సేతుపతి చాలా రోజుల తర్వాత హిట్ కొట్టాడు. 'మహారాజ' మూవీతో తెలుగు, తమిళంలో అద్భుతమైన వసూళ్లు సొంతం చేసుకుంటున్నాడు. మూవీ వచ్చిన రెండు వారాలైనప్పటికీ కలెక్షన్స్ స్టడీగా ఉన్నాయి. మరోవైపు ఇతడు రెమ్యునరేషన్ తీసుకోకుండా నటించిన ఓ తమిళ మూవీ తాజాగా ఓటీటీలోకి వచ్చేసింది. ఇంతకీ ఆ మూవీ సంగతేంటి? ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది?(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 21 సినిమాలు రిలీజ్.. అవి ఏంటంటే?)సేతుపతి అద్భుతమైన నటుడు. కాకపోతే సరైన హిట్ పడి చాలా కాలమైంది. రీసెంట్గా తన 50వ మూవీ 'మహారాజ'తో అద్భుతమైన సక్సెస్ అందుకున్నాడు. మరోవైపు ఇతడు అతిథి పాత్రలో నటించిన తమిళ మూవీ 'అళగియ కన్నె'.. గతేడాది జూన్ 23న థియేటర్లలోకి వచ్చింది. ఏమైందో ఏమో గానీ ఏడాది తర్వాత అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి వచ్చేసింది. వచ్చిందే లేటు అంటే మళ్లీ అద్దె విధానంలో అందుబాటులోకి తీసుకొచ్చారు.రొమాంటిక్ డ్రామా స్టోరీతో తీసిన ఈ సినిమాలో లియో శివకుమార్, సంచితా శెట్టి హీరోహీరోయిన్లుగా నటించారు. ఆర్ విజయ్ కుమార్ దర్శకుడు. ఈ మూవీ డైరెక్టర్‌పై ఉన్న అభిమానంతోనే విజయ్ సేతుపతి.. ఎలాంటి డబ్బులు తీసుకోకుండా నటించాడు. ఇందులో నిజ జీవిత పాత్రనే పోషించడం విశేషం. కాకపోతే సినిమా రొటీన్‌గా ఉండేసరికి జనాలు సినిమా పెద్దగా ఆడలేదు. దర్శకుడు కావాలనే ఓ కుర్రాడు.. నాటకాల్లో పరిచయమైన ఓ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. కానీ కులాల వేరు కావడంతో పెద్దలు ఇబ్బంది పెడుతుంటారు. అలాంటి ఈ కుర్రాడికి విజయ్ సేతుపతిని డైరెక్ట్ చేసే ఛాన్స్ ఎలా వచ్చింది? చివరకు ఏమైందనేదే మెయిన్ స్టోరీ.(ఇదీ చదవండి: ప్రభాస్ ఫ్యాన్స్‌కి సారీ చెప్పిన అమితాబ్.. ఎందుకంటే?) -
ఓటీటీలో స్పోర్ట్స్ డ్రామా చిత్రం.. సైలెంట్‌గా స్ట్రీమింగ్
కోలీవుడ్‌లో 'పీటీ సర్' సినిమా ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలయి మంచి విజయాన్ని అందుకుంది. ఈ చిత్రంలో హీరో, మ్యూజిక్ డైరెక్టర్ హిప్హాప్ తమిళన్, యంగ్ బ్యూటీ అనిఖా సురేంద్రన్ కీలక పాత్రల్లో నటించారు. స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం మే 24న విడుదలైంది. అయితే, తాజాగా ఎలాంటి ప్రకటన లేకుండానే సైలెంట్‌గా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి వచ్చేసింది.'పీటీ సర్' సినిమా ఒక వర్గం వారికి పెద్దగా కనెక్ట్ కాలేదని చెప్పవచ్చు. దీనికి ప్రధాన కారణం నెగటివ్ రివ్యూలు అని టాక్. కానీ, ఐఎమ్‌డీబీ సంస్థ మాత్రం పీటీ సర్ సినిమాకు 7.6 రేటింగ్ ఇచ్చింది. దీంతో సినిమా ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. ఓటీటీలో ఈ చిత్రం ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్న అభిమానులకు అమెజాన్ సర్ప్రైజ్ ఇచ్చింది. ఎలాంటి ప్రకటన లేకుండానే ఓటీటీలో 'పీటీ సర్' స్ట్రీమింగ్ అవుతుంది. అయితే, తమిళంలో మాత్రమే అందుబాటులో ఉంది. ఇంగ్లీష్ సబ్ టైటిల్స్‌తో ఈ చిత్రాన్ని చూడొచ్చు.వెల్స్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై కార్తీక్ వేణుగోపాలన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. రచన, దర్శకత్వం కూడా ఆయనే వ్యవహరించడం విశేషం. ఈ సినిమాకు హీరో అయిన హిప్హాప్ తమిళనే సంగీతం అందించారు. -
హీరోయిన్గా డైరెక్టర్ కూతురి ఎంట్రీ!
ఇండస్ట్రీలోకి వారసులు రావడం కొత్తేం కాదు. వీళ్లలో కొందరు సక్సెస్ అయి స్టార్స్ అయితే మరికొందరు మాత్రం అనామకంగా మిగిలిపోతుంటారు. తాజాగా మరో ఇద్దరు సెలబ్రిటీల వారసుల తెరంగేట్రానికి రెడీ అయ్యాడు. కాంట్రవర్సీలకు కేరాఫ్‌గా నిలిచే నటి వనితా విజయ కుమార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె మాజీ భర్త ఆకాశ్‌కు పుట్టిన కొడుకు విజయ్ శ్రీహరి... ఇప్పుడు హీరో అవుతున్నాడు. తమిళ దర్శకుడు ప్రభు సాల్మన్ కూతురు హేజల్ షైనీ ఇదే మూవీతో హీరోయిన్గా ఎంట్రీ ఇస్తోంది.(ఇదీ చదవండి: డైరెక్టర్‌తో ప్రేమలో ఉన్న యంగ్ హీరోయిన్.. వీడియో వైరల్)విజయ్ శ్రీహరి, హేజల్ షైనీ జంటగా ప్రభు సాల్మన్ ఓ సినిమా చేయడానికి సిద్ధమయ్యారని సమాచారం. ఈ దర్శకుడు ఇంతకు ముందు 'కొక్కీ' మూవీతో కరణ్‌ని, 'మైనా'తో అమలాపాల్, 'కుంకీ'తో విక్రమ్ ప్రభును హీరోగా పరిచయం చేశారు. ఈ మూడు చిత్రాలు మంచి విజయాన్ని సాధించాయి. 'కాయల్' సినిమాతో ఆనందికి కూడా మంచి పేరు వచ్చేలా చేశారు సాల్మన్. ఇలా చాలామందికి హిట్స్ ఇచ్చిన ప్రభు సాల్మన్ ఇప్పుడు తన కూతురికి కూడా అలానే ఇండస్ట్రీలోకి తీసుకురావాలని ఫిక్సయ్యారు.ఇది 'కుంకీ' తరహాలోనే అడవి బ్యాక్ డ్రాప్లో సాగే డిఫరెంట్ సినిమా అని, ఇందులో సింహాం ప్రధాన పాత్రధారిగా ఉంటుందని సమాచారం. ప్రస్తుతం ఈ చిత్ర ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుండగా, త్వరలోనే అధికారిక ప్రకటనతో పాటు ఇతర వివరాలు వెల్లడించే అవకాశముందని తెలుస్తోంది.(ఇదీ చదవండి: ఫాదర్స్ డే స్పెషల్.. ఓటీటీలో తెలుగు మూవీ డైరెక్ట్ రిలీజ్) -
ఓటీటీలోకి వచ్చేసిన తమిళ హిట్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్
మరో క్రేజీ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. థియేటర్లలో రిలీజై హిట్ కొట్టినప్పటికీ.. పెద్దగా టైమ్ తీసుకోకుండా ఓటీటీలోకి తీసుకొచ్చేశారు. నెలలోపే ఎలాంటి అనౌన్స్మెంట్ లేకుండా స్ట్రీమింగ్ చేసేస్తున్నారు. ఇది తమిళ మూవీ. కానీ తెలుగులో నేరుగా అందుబాటులోకి వచ్చేసింది. ఇంతకీ ఈ మూవీ ఏంటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందనేది చూద్దాం.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 31 సినిమాలు.. అవి ఏంటంటే?)తమిళ హీరో కవిన్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'స్టార్'. సినిమా హీరో అవ్వాలనుకునే ఓ యువకుడి కథతో దీన్ని తెరకెక్కించారు. మే 10న తమిళంలో రిలీజైన ఈ చిత్రం పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. దీని తెలుగు వెర్షన్ కూడా థియేటర్లలోకి తీసుకురావాలనుకున్నారు. కానీ ఎందుకో కుదర్లేదు. ఇప్పుడు అమెజాన్ ప్రైమ్‌లో నేరుగా విడుదల చేశారు. ప్రస్తుతం తమిళ, తెలుగు భాషల్లో 'స్టార్' స్ట్రీమింగ్ అవుతోంది.'స్టార్' కథ విషయానికొస్తే.. పాండియన్ (లాల్) ఓ ఫొటోగ్రాఫర్. కొడుకు కలై (కవిన్)ని సినిమా యాక్టర్ చేయాలని అనుకుంటాడు. తండ్రి ప్రోత్సాహం వల్ల చిన్నప్పటి నుంచే సినిమాలంటే పిచ్చితో కలై పెరుగుతాడు. పెరిగి పెద్దయిన తర్వాత ముంబైలో యాక్టింగ్ కోర్సు పూర్తి చేస్తాడు. హీరోగా అవకాశం వస్తుంది. కానీ ఓసారి యాక్సిడెంట్ అయి ముఖమంతా అందవికారంగా తయారవుతుంది. ఇలాంటి కలై.. చివరకు యాక్టర్ అయ్యాడా? లేదా? అనేదే తెలియాలంటే 'స్టార్' చూసేయాల్సిందే.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు మిస్టరీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?) -
మూడోసారి అలాంటి పాత్రలో కార్తీ.. హిట్ కొడతాడా?
తమిళ హీరో కార్తీ మరోసారి పోలీసుగా కనిపించబోతున్నాడు. 'ఖాకీ', 'సర్దార్' సినిమాల్లో పోలీస్‌గా ఆకట్టుకున్న ఇతడు ఇప్పుడు మరోసారి అలాంటి రోల్ చేయబోతున్నాడు. ఈ మూవీకి 'వా వాతియార్' అనే టైటిల్ ఫిక్స్ చేశారు. నలన్ కుమార స్వామి దర్శకత్వం వహిస్తున్నాడు. కృతి శెట్టి హీరోయిన్ కాగా సత్యరాజ్, రాజ్ కిరణ్ తదితరులు కీలక పాత్రధారులు.(ఇదీ చదవండి: నన్ను అలాంటి డ్రెస్సుల్లో ఎవరూ చూడొద్దనుకుంటాను.. కానీ!: జాన్వీ కపూర్)కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్న ఈ భారీ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతమందిస్తున్నాడు. కాగా ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. రీసెంట్గా కార్తీ పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. పోలీసు దుస్తుల్లో కార్తీ, కూలింగ్ కళ్లజోడు, ఆయన వెనక నిలబడ్డ ఎంజీఆర్ పాత్రలతో కూడిన పోస్టర్ ట్రెండీగా ఉంది.ఇకపోతే కార్తీ ఇంతకుముందు పోలీసుగా చేసిన రెండు సినిమాలు సూపర్ హిట్ కావడంతో ఇది కూడా మంచి విజయం సాధిస్తుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఈ క్రేజీ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడించనున్నారు.(ఇదీ చదవండి: ఫైనల్లీ 'కల్కి' షూటింగ్ పూర్తయింది.. వాళ్లందరికీ స్పెషల్ గిఫ్ట్స్) -
'96' దర్శకుడితో కార్తీ మూవీ.. మళ్లీ అలాంటి కాన్సెప్ట్
సూర్య తమ్ముడిగా పరిచయమైనప్పటికీ తనదైన యాక్టింగ్‌తో తెలుగులోనూ అద్భుతమైన ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నాడు కార్తీ. వరస సినిమాలతో అలరించే ఇతడు ప్రస్తుతం రెండు మూవీస్ చేస్తున్నాడు. తాజాగా ఇతజి పుట్టిన రోజు సందర్భంగా వాటి నుంచి అప్డేట్స్ వచ్చాయి. కార్తీ-'96' మూవీ ప్రేమ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న సినిమాకు 'మెయ్యళగన్' టైటిల్ ఫిక్స్ చేశారు. ఇందులో అరవింద స్వామి ప్రధాన పాత్రను పోషిస్తున్నాడు. సూర్య-జ్యోతిక నిర్మిస్తున్నారు.(ఇదీ చదవండి: ఆయన దుస్తులు లేకుండానే పక్కన వచ్చి కూర్చుంటాడు: స్టార్ హీరోయిన్)ఇక షూటింగ్‌ను పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకొంటోంది. తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్స్‌లో కార్తీ ఎద్దుతో ముచ్చటిస్తున్నట్లు ఒకటి ఉండగా, కార్తీ-అరవిందస్వామి సైకిల్లో వెళుతున్నట్లుగా మరో పోస్టర్ కనిపించింది. ఈ రెండింటిని చూస్తుంటే ఈ పోస్టర్లను చూస్తుంటే 'మెయ్యళగన్' గ్రామీణ నేపథ్యంలో సాగే వింటేజ్ మూవీ అనిపిస్తుంది. త్వరలో రిలీజ్ డేట్ ప్రకటించనున్నారు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి మలయాళ హిట్ సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?) -
మిగతా హీరోయిన్లకు నయనతారకు తేడా అదే.. అందుకే ఇన్నేళ్ల పాటు!
నయనతార వయసు 39 ఏళ్లు. ఇద్దరు పిల్లల తల్లి. కానీ ఇప్పటికీ వరసపెట్టి సినిమాలు చేస్తోంది. కాదు కాదు ఛాన్సులు వస్తున్నాయని చెప్పాలి. ఎందుకంటే చాలామంది హీరోయిన్లు.. తమకు స్టార్ హోదా రాగానే భూమ్మీద నిలబడరు. ఎక్కడికో వెళ్లిపోతారు. ఇలాంటి టైంలోనూ నయనతారకు అసలు ఇన్ని ఛాన్సులు ఎలా వస్తున్నాయి? అసలు ఆమె ఏం ఫాలో అవుతోంది?(ఇదీ చదవండి: Love Me If You Dare: ‘లవ్ మీ’మూవీ రివ్యూ)టాలీవుడ్ హీరోయిన్లనే తీసుకోండి. ఒక్కసారి స్టార్ హీరోయిన్ అయిపోతే ఇక చిన్న సినిమాలు చేయడానికి అస్సలు ఆసక్తి చూపించరు. మ్యునరేషన్ అమాంతం పెంచేస్తారు. నయన్ మాత్రం ఈ విషయంలో ఆచితూచి వ్యవహరిస్తోంది. 'జవాన్' లాంటి మూవీతో పాన్ ఇండియా వైడ్ హిట్ కొట్టినా సరే తమిళంలో లోకల్ మూవీస్, హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తుంది. హిట్, ఫ్లాప్ అనేది పక్కనబెడితే లోకల్ నిర్మాతలకు అందుబాటులో ఉంటుంది.కొన్నాళ్ల క్రితం అథర్వ అనే చిన్న హీరోతో కలిసి సినిమా చేసింది. ఇప్పుడు కవిన్ అని మరో యంగ్ హీరోతో కలిసి ఇప్పుడు నటించబోతుందట. లోకేశ్ కనగరాజ్ శిష్యుడు విష్ణు ఎడవన్.. ఈ ప్రాజెక్టుతో దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడట. త్వరలో దీనిపై అధికారిక ప్రకటన రాబోతుంది. అయితే మిగతా హీరోయిన్లతో పోలిస్తే అన్ని రకాల సినిమాలు చేస్తుండటమే ఈమె సక్సెస్ సీక్రెట్ అయ్యిండొచ్చు.(ఇదీ చదవండి: డ్రగ్స్ కేసు: హేమతో పాటు వారందరికీ నోటీసులు జారీ) -
నిర్మాత మోసం.. నిజాలు బయటపెట్టిన హీరోయిన్ నమిత
హీరోయిన్ల జీవితం బయటకు చూడటానికి బాగానే ఉంటుంది. కానీ లోపల మాత్రం వేరేగా ఉంటుంది. ఎంత కష్టమొచ్చినా సరే చాలామంది బ్యూటీస్ తమ బాధల్ని బయటకు చెప్పుకోరు. ఎందుకంటే కొత్త సినిమాలు రావేమోనని భయం. సందర్భం వచ్చినప్పుడు వాటిని బయటపెడుతుంటారు. ఇప్పుడు అలానే హీరోయిన్ నమిత.. తనకు కెరీర్లో ఎదురైన దారుణమైన మోసాల్ని రివీల్ చేసింది.(ఇదీ చదవండి: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన 'మైదాన్' సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?)'మూవీ పేరు చెప్పను కానీ ధనుష్ హీరోగా ప్రాజెక్ట్ చేస్తున్నాం అని చెప్పి ఓ నిర్మాత నా కాల్షీట్ తీసుకున్నారు. కానీ చివరకొచ్చేసరికి ఆయన కజిన్ హీరోగా నటించాడు. ఆ విషయం నాకు తెలియగానే చాలా బాధపడి సగంలోనే ప్రాజెక్ట్ నుంచి బయటకొచ్చేశా. ఆపై ఎలాగోలా సినిమా షూటింగ్ పూర్తి చేసి రిలీజ్ చేశారు. దీని గురించి అప్పట్లో నిర్మాతల మండలి, నటీనటుల మండలిలో ఫిర్యాదు కూడా చేశాను. అలానే మలయాళంలో పేరున్న నిర్మాత ఉన్నారు కదా అని ఓ ప్రాజెక్ట్ సైన్ చేశా. కానీ దాన్ని వేరే నిర్మాత తీసుకోవడంతో చాలా ఇబ్బందులు పడుతూనే ఆ మూవీ పూర్తి చేశాను' అని నమిత తనకెదురైన చేదు అనుభవాల్ని బయటపెట్టింది.గుజరాత్లో పుట్టి పెరిగిన నమిత.. 'సొంతం' అనే తెలుగు సినిమాతో హీరోయిన్ అయింది. ఆ తర్వాత తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో నటించింది. 2020లో చివరగా ఓ చిత్రంలో నటించిన ఈమె.. కొన్నాళ్ల క్రితం బీజేపీ పార్టీలో చేరింది. ఈ క్రమంలోనే తాజాగా పలు ఇంటర్వ్యూల్లో పాల్గొంటూ తన గురించి పలు విషయాల్ని బయటపెడుతోంది.(ఇదీ చదవండి: ఎన్టీఆర్‌తో ఉన్న ఈమెని గుర్తుపట్టారా? పాన్ ఇండియా డైరెక్టర్ భార్య) -
కమెడియన్ అని చిన్నచూపు చూడొద్దు..
కమెడియన్‌గా కెరీర్ మొదలుపెట్టి ఇప్పుడు హీరోగా పేరు తెచ్చుకునేంత వరకు వెళ్లిన నటుడు సూరి. తమిళ ఇండస్ట్రీకి చెందిన ఇతడు గతేడాది 'విడుదలై' మూవీతో హీరోగా మారి హిట్ కొట్టాడు. ఇప్పుడు 'గరుడన్'గా రాబోతున్నాడు. ఉన్ని ముకుందన్, సముద్రఖని, రేవతీ తదితరులు ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని మే 31న థియేటర్లలోకి రాబోతుంది.(ఇదీ చదవండి: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన 'మైదాన్' సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?)స్టార్ డైరెక్టర్ వెట్రిమారన్ కథ అందించిన ఈ సినిమాకు దురై సెంథిల్ కుమార్ దర్శకుడు. యువన్ శంకర్ రాజా సంగీతమందించాడు. 'గరుడన్' ఆడియో ఈవెంట్ తాజాగా జరగ్గా దీనికి తమిళ స్టార్ హీరోలు విజయసేతుపతి, శివకార్తీకేయన్ అతిథులుగా హాజరయ్యారు. ఈ క్రమంలోనే శివకార్తికేయన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.'హాస్య నటులని చులకనగా చూడొద్దు. ఓ టైంలో హీరోగా చేయమని సూరికి సలహా ఇచ్చాను. కానీ ఆయన కాస్త భయపడ్డాడు. కొన్నాళ్ల తర్వాత ఫోన్ చేసి.. వెట్రిమారన్ తనని హీరోగా పెట్టి మూవీ చేస్తున్నానని, కానీ కాస్త దడ పుడుతోందని అన్నాడు. అయితే కామెడీ నటులు సీరియస్ పాత్రల్లో నటించగలరు గానీ సీరియస్ నటులు కామెడీ పాత్రలు చేయలేరు. అందుకు సూరినే ఓ ఉదాహరణ' అని శివకార్తికేయన్ చెప్పాడు. తనని హీరోగా మార్చిన వెట్రిమారన్‌కి జీవితాంతం రుణపడి ఉంటానని సూరి ఎమోషనల్ అయ్యాడు.(ఇదీ చదవండి: క్యార్‌వ్యాన్‌లోకి వచ్చి అతడలా చేసేసరికి భయపడ్డా: కాజల్ అగర్వాల్) -
తొలిసారి ఆ ఇండస్ట్రీలోకి కియారా.. స్టార్ హీరోతో కలిసి?
రీసెంట్ టైంలో బాలీవుడ్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న వాళ్లలో కియారా అడ్వాణీ ఒకరు. హిందీ చిత్రాలతోనే ఇండస్ట్రీలోకి వచ్చింది కానీ తెలుగులోనూ రెండు మూవీస్ చేసి ఇక్కడ క్రేజ్ సంపాదించింది. ప్రస్తుతం చరణ్ 'గేమ్ ఛేంజర్'లో నటిస్తూ బిజీగా ఉంది. అలాంటిది ఇప్పుడు కియారాకు తమిళం నుంచి ఆఫర్స్ వస్తున్నట్లు తెలుస్తోంది.(ఇదీ చదవండి: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన హిట్ సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?)మిళ హీరోల్లో శింబు స్టైలే వేరు. దాదాపు కొన్నేళ్ల పాటు హిట్ లేక పూర్తిగా కనుమరుగైపోయిన ఇతడు.. కొన్నాళ్ల క్రితం 'మానాడు', 'వెందు తనిందడు' చిత్రాలతో హిట్స్ కొట్టాడు. గతేడాది వచ్చిన 'పత్తు తలా' మిక్స్ డ్ టాక్ తెచ్చుకుంది. ప్రస్తుతం ఇతడు కమల్ 'థగ్ లైఫ్'లో కీలక పాత్ర చేస్తున్నాడు. మరోవైపు కమల్ నిర్మిస్తున్న ఓ మూవీలో హీరోగా చేస్తున్నాడు.దేసింగ్ పెరియస్వామి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో శింబు ద్విపాత్రాభినయం చేయబోతున్నాడని.. ఇందులో ఇద్దరు హీరోయిన్లకు ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే కియారా అడ్వాణీ పేరు పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఒకవేళ ఇది నిజమైతే మాత్రం తమిళ చిత్రసీమలోకి కియారా ఎంట్రీ ఇచ్చినట్లు అవుతుంది. త్వరలో దీనిపై ఓ క్లారిటీ రావొచ్చు.(ఇదీ చదవండి: క్యార్‌వ్యాన్‌లోకి వచ్చి అతడలా చేసేసరికి భయపడ్డా: కాజల్ అగర్వాల్) -
'లవ్ టుడే' హీరో కొత్త సినిమా.. టైటిల్ ఏంటో తెలుసా?
'కోమాలి' సినిమాతో దర్శకుడిగా ఇండస్ట్రీలోకి వచ్చిన ప్రదీప్ రంగనాథన్.. తొలి చిత్రంతోనే విజయాన్ని అందుకున్నాడు. అయితే ఆ తర్వాత హీరోగా మారిపోయి 'లవ్ టుడే' అనే మూవీ తీశాడు. గతేడాది రిలీజైన ఈ చిత్రం ఊహించని సక్సెస్ అందుకుంది. దీంతో ప్రదీప్ రంగనాథన్‌కు క్రేజ్ పెరిగిపోయింది. ప్రస్తుతం డైరెక్టర్ విఘ్నేశ్ శివన్ తీస్తున్న 'ఎల్ఐసీ' చిత్రంలో హీరోగా చేస్తున్నాడు. ఇందులో నటి నయనతార ప్రధాన పాత్రను పోషిస్తున్నట్లు సమాచారం.(ఇదీ చదవండి: This Week In OTT: ఈ వారం ఓటీటీల్లో 17 సినిమాలు రిలీజ్.. ఏంటంటే?)కాగా ఈ సినిమా సెట్స్‌పై ఉండగానే మరో మూవీని మొదలుపెట్టేశాడు. 'ఓ మై కడవులే' ఫేమ్ అశ్వత్ మారిముత్తు దీనికి దర్శకుడు. ఈ చిత్రానికి సంబంధించిన వివరాలను నిర్మాతలు ఆదివారం ప్రకటించారు. 'డ్రాగన్' అనే డిఫరెంట్ టైటిల్ ఫిక్స్ చేశారు. అలానే పోస్టర్స్ కూడా రిలీజ్ చేశారు. త్వరలో నటీనటుల వివరాలతో పాటు మిగతా విషయాలు చెబుతామని క్లారిటీ ఇచ్చారు.(ఇదీ చదవండి: సమంత షాకింగ్ పోస్ట్.. పెట్టి డిలీట్ చేసిందా?)#PradeepAshwathCombo fire ah title ketta fire odave title kudukareengale 🤩! @Ags_production #KalpathiSAghoram #KalpathiSGanesh #KalpathiSSuresh are happy to present #DRAGON@pradeeponelife @Dir_Ashwath @archanakalpathi @aishkalpathi @venkat_manickam @malinavin @nikethbommi… pic.twitter.com/dOnTVhveZ1— Archana Kalpathi (@archanakalpathi) May 5, 2024 -
శ్రీలీలకి తెలుగులో ఛాన్సులు నిల్.. దీంతో ఏకంగా
డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యానని చాలామంది హీరోయిన్లు చెబుతుంటారు. కానీ డాక్టర్ కోర్స్ చదువుతూనే శ్రీలీల హీరోయిన్ అయిపోయింది. 'పెళ్లి సందడి' మూవీతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. సినిమా సక్సెస్ కానప్పటికీ వరస అవకాశాలు ఈమెని వరించాయి. రవితేజ 'ధమాకా'తో రూ.100 కోట్ల హిట్ అందుకుంది. మహేష్ బాబుతో 'గుంటూరు కారం'లోనూ నటించి ఆకట్టుకుంది.(ఇదీ చదవండి: సమంత షాకింగ్ పోస్ట్.. పెట్టి డిలీట్ చేసిందా?)అయితే తెలుగులో వరస ఫ్లాప్స్ దెబ్బకు ఈమెకు టాలీవుడ్లో ఛాన్సులు కరువయ్యాయి. లేదంటే ఈమె వద్దనుకుందో తెలియదు గానీ మన సినిమాలు ఇప్పట్లో చేసే సూచనలు కనిపించట్లేదు. అదే టైంలో తమిళంలో విజయ్, అజిత్ చిత్రాల్లో నటించే అవకాశం వరించిందనే వార్తలు తెగ వైరల్ అయ్యాయి.కాగా శ్రీలీలకు ఇప్పుడు మరో భారీ అవకాశం తలుపు తట్టినట్లు తెలిసింది. కార్తీ హీరోగా ప్రముఖ బాలీవుడ్ నిర్మాణ సంస్థ భారీ చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేస్తుందని, ఇందులో హీరోయిన్గా ఈమెని తీసుకోవాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఇది నిజమై, మూవీ హిట్ అయితే మాత్రం తమిళంలో శ్రీలీల క్రేజ్ పెరగడం ఖాయం.(ఇదీ చదవండి: సైబర్ మోసం.. తెలిసి మరీ లక్షలు పోగొట్టుకున్న నటుడి భార్య) -
కలల సాకారం కోసం పోరాడితేనే 'స్టార్'
'ప్రతి ఒక్కరూ కలలు కనాలి, వాటి సాకారం కోసం కృషి చేయాలి' అనే అబ్దుల్ కలాం సూక్తి ఆధారంగా తీసిన సినిమా 'స్టార్'. ఇలన్ దర్శకుడు. 'దాదా' ఫేమ్ కవిన్ హీరో. అతిథి పొహంగర్, కీర్తీ మురుగన్ హీరోయిన్స్. రైస్ ఈస్ట్ ఎంటర్టైన్మెంట్, శ్రీ వేంకటేశ్వర సినీ చిత్ర సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. యువన్ శంకర్ రాజా సంగీతమందించాడు. ఈ నెల 10న థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా తాజాగా చెన్నైలో ప్రెస్ మీట్ పెట్టి పలు విషయాలు పంచుకున్నారు.(ఇదీ చదవండి: సమ్మర్ స్పెషల్.. ఓటీటీలో 100 సినిమాలు/ సిరీస్‌లు)1980ల్లో మధురైకు చెందిన ఓ కుర్రాడు.. సినిమా నటుడు కావాలనే కలతో చెన్నైకి చేరుకుంటాడు. అతడు తన కల నెరవేర్చుకోవడానికి చేసే పోరాటమే 'స్టార్' సినిమా. ఇకపోతే దర్శకుడు తనకు కథ చెప్పిన విధానం నచ్చిందని హీరోగా చెప్పగా.. ఈ చిత్రంపై తనకు పూర్తి నమ్మకం ఉందని దర్శకుడు ఇలన్ ధీమా వ్యక్తం చేశాడు.(ఇదీ చదవండి: గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్) -
పెళ్లెప్పుడు అని ప్రశ్న.. హీరోయిన్ మాళవిక ఇంట్రెస్టింగ్ కామెంట్స్
ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్లు గ్లామర్‌నే నమ్ముకుని ఛాన్సులు కొట్టేస్తుంటారు. గతంలో అవసరం బట్టి సినిమాల్లో మాత్రం అందాల ఆరబోత ఉండేది. కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు హాట్ హాట్ ఫొటోలు పోస్ట్ చేస్తూనే ఉన్నారు. ఇలాంటి వారిలో మాళవిక మోహనన్ ఒకరు. అయితే అలా ఎందుకు చేస్తున్నారనే ప్రశ్న ఆమెకు ఎదురైంది. దీనికి మాళవిక ఆసక్తికర సమాధానమిచ్చింది.(ఇదీ చదవండి: మొటిమలకు సర్జరీ చేయించుకున్నారా? సాయిపల్లవి ఆన్సర్ ఇదే)తరచూ గ్లామరస్ దుస్తుల్లో స్పెషల్ ఫొటో షూట్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుండడం గురించి తనని అడుగుతున్నారని చెప్పిన మాళవిక.. గ్లామర్ అంటే ఇష్టమని, అందుకే అలాంటి దుస్తులు ధరిస్తున్నట్లు చెప్పారు. పెళ్లి ఎప్పుడు చేసుకుంటారని చాలామంది అడుగుతున్నారని.. తనను పెళ్లికూతురు దుస్తుల్లో చూడడానికి మీకెందుకో అంత ఆసక్తి అని నటి మాళవికా మోహన్ పేర్కొన్నారు.మలయాళ సినిమాలతో నటిగా కెరీర్ మొదలుపెట్టిన మాళవిక.. రజనీకాంత్ 'పేట' మూవీతో తమిళంలోకి ఎంట్రీ ఇచ్చింది. మాస్టర్, మారన్ తదితర చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం విక్రమ్ 'తంగలాన్'లో చేసింది. ఇది త్వరలో విడుదల కానుంది. అలానే తెలుగులో ప్రభాస్ సరసం 'రాజా సాబ్' మూవీలో ఓ హీరోయిన్గా చేస్తోంది.(ఇదీ చదవండి: పవన్ వల్ల కోటి 50 లక్షలు పోగొట్టుకున్నా.. జనసేన మాజీ నాయకురాలు సుభాషిణి) -
దివ్యాంగుల ఇతివృత్తంతో చిత్రం చేస్తా: రాఘవ లారెన్స్
ప్రముఖ నటుడు, కొరియోగ్రాఫర్ రాఘవలారెన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. చాలా కాలం నుంచి అనాథలు, దివ్యాంగులని ఆదుకునేందుకు ట్రస్టు ఏర్పాటు చేసి, దాని ద్వారా వారికి తగిన సాయం చేస్తూ వస్తున్నాడు. ఎందరికో ఎన్నో విధాలుగా సాయం చేస్తూ.. తన చిత్రాల్లో దివ్యాంగులను నటింపజేస్తూ వారిలోని ప్రతిభను ప్రోత్సహిస్తున్నారు. తాజాగా దివ్యాంగులకు కానిదేదీ లేదనేలా వారిని తమిళ పారంపర్య కళ అయిన మల్లర్ కంబం అనే విలువిద్యలో ప్రోత్సహిస్తున్నారు. కై కొడుక్కుమ్ కై అనే ఈయన నాయకత్వంలో దివ్యాంగుల బృందం ఇప్పటికే మల్లర్ కంబం అనే సాధారణ వ్యక్తులు కూడా చేయలేని సాహస కళను పలు వేదికలపై ప్రదర్శించి ప్రశంసలు అందుకున్నారు. కాగా ఈ బృందం సోమవారం రాఘవలారెన్స్ నేతృత్వంలో చైన్నెలోని ప్రసాద్ ల్యాబ్‌లో మల్లర్ కంబం అనే సాహస కళను ప్రదర్శించారు. వీరి కళను ప్రోత్సహించాల్సిందిగా ఈ సందర్భంగా రాఘవలారెన్స్ విజ్ఞప్తి చేశారు. వీరికి తాను తగినంత సాయం చేస్తున్నానని, తన చిత్రాల్లోనూ నటింపజేసే ప్రయత్నం చేస్తున్నానని చెప్పారు. అయితే కొందరు అన్ని చిత్రాల్లోనూ వీరిని ఎలా నటింపజేస్తామని అంటుంటారన్నారు. మీ ఇళ్లల్లోనో, ఇతరుల ఇళ్లల్లోనో జరిగే వేడుకల్లో ఇలాంటి టీమ్‌కు అవకాశం కల్పించి ప్రోత్సహించాలని కోరారు. తాను ఈ మల్లర్ కంబం కళ బృందంలోని ప్రతి ఒక్కరికీ ఒక స్యూటీని ఇవ్వనున్నానని చెప్పారు. అలాగే దివ్యాంగుల ఇతి వృత్తంతో ఒక చిత్రం చేయబోతున్నానని, అందులో తానూ దివ్యాంగుడి పాత్రలో నటించనున్నానని చెప్పా రు. ఈ చిత్రం ద్వారా వచ్చిన లాభాలతో వీరికి ఇళ్లు కట్టిస్తానని రాఘవ లారెన్స్ పేర్కొన్నారు. -
స్టార్ హీరో కట్టించిన గుడిలో మరో హీరో.. వీడియో వైరల్
దళపతి విజయ్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. అటు సినిమాలు, ఇటు సోషల్ మీడియాలో ట్రోల్స్ తో ఎప్పుడూ ట్రెండింగ్ లో ఉంటుంటాడు. అయితే విజయ్ తన సొంతూరు కొరట్టూర్ లో సాయిబాబా కట్టించున్నాడే విషయం చాలామందికి తెలియదు. ఇప్పుడు ఆ ఆలయాన్ని నటుడు-కొరియోగ్రాఫర్ లారెన్స్ దర్శించుకున్నాడు. (ఇదీ చదవండి: లిప్‌లాక్ సీన్స్ వద్దని మా నాన్న చెప్పారు: టాలీవుడ్ యంగ్ హీరోయిన్) సినిమాలు, రాజకీయాలతో బిజీగా ఉన్న విజయ్.. తన తల్లి శోభ కోరిక మేరకు ఈ ఆలయాన్ని నిర్మించాడు. ఇక్కడ మహా కుంభాభిషేకాన్ని ఇటీవల నిర్వహించారు. విజయ్ ఈ మధ్య ఆలయంలో విశేష పూజలు నిర్వహించిన ఫొటోలు బయటకు రావడంతోనే ఈ విషయం అందరికీ తెలిసింది. ఇప్పుడు ఈ ఆలయాన్ని రాఘవ లారెన్స్.. విజయ్ తల్లితో కలిసి సందర్శించాడు. తాను నిర్మించిన శ్రీ రాఘవేంద్ర స్వామి ఆలయాన్ని నటుడు విజయ్ తల్లి శోభ సందర్శించి, పాటలు కూడా పాడారన్నారు. ఇప్పుడు ఆయన నిర్మించిన సాయిబాబా ఆలయాన్ని తాను దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని లారెన్స్ చెప్పుకొచ్చాడు. విజయ్ ఈ ఆలయాన్ని అద్భుతంగా నిర్మించారని పేర్కొన్నాడు. (ఇదీ చదవండి: ఆ సినిమా వల్ల భారీగానే నష్టపోయాం: మెగాస్టార్ చిరంజీవి) Hi everyone, I visited Nanban Vijay’s Sai Baba Temple today along with his mother. When I built My Raghavendra Swamy temple, She sang a song in our temple and graced us with her presence. Today, I’m happy to visit their temple with her. My heartfelt wishes to Nanban Vijay… pic.twitter.com/sZvzFqC0LL — Raghava Lawrence (@offl_Lawrence) April 13, 2024 -
హీరో సూర్య భారీ బడ్జెట్ సినిమా ఆగిపోయిందా?
సూర్య పేరుకే తమిళ హీరో కానీ తెలుగులో మన బడా హీరోల రేంజులో ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం 'కంగువ' అనే పీరియాడికల్ పాన్ ఇండియా మూవీ చేస్తున్న ఇతడు.. దీని తర్వాత పలు చిత్రాలు చేయబోతున్నాడు. అయితే సూర్య చేయాల్సిన ఓ భారీ బడ్జెట్ మూవీ మాత్రం ఆగిపోయిందనే టాక్ నడుస్తోంది. ఇంతకీ ఏమైంది? (ఇదీ చదవండి: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన హీరో మంచు మనోజ్ భార్య.. పాపకు వెరైటీ పేరు) తమిళ దర్శకుల్లో వెట్రిమారన్ ది సెపరేట్ బ్రాండ్. రియాలిటీకి దగ్గరగా ఉండేలా అద్భుతమైన చిత్రాలు తీస్తుంటారు. ఇతడు సూర్యతో 'వడివాసల్' అనే మూవీ చేస్తానని ప్రకటించారు. ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా జరిగింది. జల్లికట్టు క్రీడ నేపథ్యంలో సాగే కథ అని దర్శక, నిర్మాతలు ప్రకటించారు కూడా. సినిమాలో పాత్ర కోసం సూర్య ఓ ఎద్దును కూడా పెంచాడు. కానీ షూటింగ్ అనుకున్నట్లు ప్రారంభమే కాలేదు. దీంతో ఈ చిత్రం ఆగిపోయిందనే రూమర్స్ ఎక్కువయ్యాయి. ఎందుకంటే సూర్య, వెట్రిమారన్ ఎవరికి వాళ్లు పలు సినిమాలతో బిజీగా ఉన్నారు. మరో 3-4 ఏళ్ల వరకు ఖాళీ లేనంత బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఇంటర్వూలో మాట్లాడిన వెట్రిమారన్.. తాను తీసే 'విడుదలై 2' ఎప్పుడు పూర్తి అవుతుందో తెలియదని, దీని తర్వాతే వాడివాసల్ షూటింగ్ మొదలవుతుందని చెప్పారు. దీనిబట్టి చూస్తే 'వడివాసల్' ఉంది కానీ ఇప్పట్లో కష్టమేనని విశ్లేషకులు అభిప్రాయం. (ఇదీ చదవండి: నేను అనుకున్న కలని అతడు నిజం చేశాడు: చిరంజీవి) -
నాలుగేళ్ల గొడవ క్లియర్.. హీరో-కమెడియన్ కలిసిపోయారు!
ఆ ఇద్దరూ సినిమా ఇండస్ట్రీకి చెందినవాళ్లే, కలిసి 7 సినిమాలు చేశారు. ఆ తరువాత ఓ విషయంలో ఒకరిని ఒకరు తీవ్రంగా విమర్శించుకున్నారు. కేసులు పెట్టుకున్నారు. అలాంటిది తాజాగా ఒకే ఫొటోలో నవ్వుతూ కనిపించారు. పైన చెప్పిన నటులెవరో కాదు. తమిళ ఇండస్ట్రీకి చెందిన విష్ణువిశాల్, హాస్య నటుడు సూరి. (ఇదీ చదవండి: సమంత, శ్రుతి హాసన్.. ఇద్దరూ ఆ ప్రాజెక్ట్ నుంచి ఔట్!) విష్ణువిశాల్ హీరోగా, సూరి హాస్య నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. కలిసి 7 సినిమాలు చేశారు. కానీ ఓ స్థలం విషయంలో ఇద్దరి మధ్య వివాదం చోటుచేసుకుంది. విష్ణువిశాల్, అతడి తండ్రి తనను మోసం చేశారని 2020లో నటుడు సూరి తీవ్ర ఆరోపణలు చేయడంతో పాటు పోలీస్‌స్టేషన్‌లో కేసు పెట్టాడు. ఈ వివాదం చాలాకాలం కొనసాగింది. నటుడు విష్ణువిశాల్ తండ్రి రమేష్.. మాజీ డీజీపీ. ఇటీవల లాల్ సలామ్ చిత్ర ప్రచార వేదికపై కూడా తమ మధ్య నెలకొన్న సమస్య గురించి తానూ, నటుడు సూరి చర్చించుకుంటున్నామని విష్ణు విశాల్ పేర్కొన్నారు. అలాంటిది ఇప్పుడు సడన్‌గా నటుడు విష్ణువిశాల్ ఆయన తండ్రి రమేష్, సూరితో కలిసి ఉన్న ఫొటోను తన ఎక్స్మీడియాలో పోస్ట్ చేశారు. అందులో టైమ్ అన్నింటికీ, అందరికీ బదులిస్తుంది. ఐలవ్ యూ నాన్న హీరో విష్ణు విశాల్ పేర్కొన్నారు. అలాగే నటుడు సూరి కూడా జరిగేవన్నీ మంచికే అని తన ఎక్స్ మీడియాలో పేర్కొన్నారు. దీంతో వీరి మధ్య సమస్య పరిష్కారం అయ్యిందని అందరూ అనుకుంటున్నారు. (ఇదీ చదవండి: స్టెప్పులతో అదరగొట్టిన రాజమౌళి.. వీడియో వైరల్!) TIME is the answer to everything and everyone.. Let the positivity flow @sooriofficial na.. Love u appa ..... pic.twitter.com/Yvn28SR31B — VISHNU VISHAL - VV (@TheVishnuVishal) April 9, 2024 -
యాక్షన్ మూవీలో యంగ్ హీరోయిన్.. పెద్ద ఆఫరే!
పేరుకే తెలుగమ్మాయి కానీ తమిళ చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం తమిళంలోనే వరస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంది. ఇప్పటివరకు హీరోయిన్ ఓరియెంటెడ్ కథల్లో నటించిన ఈ బ్యూటీ.. తొలిసారి ఓ యాక్షన్ మూవీలో నటిస్తున్నట్లు చెప్పుకొచ్చింది. (ఇదీ చదవండి: పుకార్లకు చెక్.. 'పుష్ప 2' తర్వాత బన్నీ సినిమా ఫిక్స్) డిఫరెంట్ పాత్రల్లో కనిపించిన నేను.. ఇప్పుడు యాక్షన్ ఓరియెంటెడ్ మూవీ చేస్తున్నాను. ఇది నా అదృష్టంగా భావిస్తున్నానని ఐశ్వర్యా రాజేశ్ చెప్పుకొచ్చింది. చైన్నెలోని ఆదివారం జరిగిన ఓ షాప్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఈ కామెంట్స్ చేసింది. ప్రతి సినిమాలో తన పాత్రకు ఉన్న ప్రాధాన్యతను తెలుసుకుని మరీ సినిమాలను ఎంపిక చేసుకుంటానని ఐశ్వర్యా రాజేశ్ చెప్పింది. సహజంగా నటించేందుకు నిత్యం ప్రయత్నిస్తుంటానని అందుకే ఈ మూవీ అవకాశం దక్కిందని తెలిపింది. (ఇదీ చదవండి: ఎన్నికల్లో తొలిసారి పోటీ.. కోట్లు విలువైన కారు కొన్న హీరోయిన్) -
సౌత్ సినిమాలపై కంగన ఇంట్రెస్ట్.. అదే కారణమా?
కంగనా రనౌత్ పేరు చెప్పగానే ఆమె సినిమాల కంటే వివాదాలే ఎక్కువగా గుర్తొస్తాయి. తెలుగులో ప్రభాస్ 'ఏక్ నిరంజన్', తమిళంలో పలు సినిమాలు చేసినప్పటికీ.. హిందీలో స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఈ మధ్య ఎందుకో ఈమెకి అస్సలు కలిసి రావడం లేదు. హిందీలో తీసిన ప్రతి సినిమా కూడా ఘోరమైన ఫ్లాప్స్‌గా నిలిచాయి. (ఇదీ చదవండి: రెండు ఓటీటీల్లోకి వచ్చేసిన హనుమాన్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?) మరోవైపు కంగన.. తమిళంలో తలైవి, చంద్రముఖి 2 లాంటి చిత్రాల్లో నటించింది. యాక్టింగ్ పరంగా మంచి పేరు వచ్చినప్పటికీ.. రిజల్ట్ తేడా కొట్టేసింది. ఇప్పుడు మరో తమిళ సినిమాకు కంగన గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్లు తెలుస్తోంది. గతంలో కంగనతో 'తలైవి' తీసిన డైరెక్టర్ ఏఎల్ విజయ్.. ఇప్పుడు తన కొత్త మూవీలోనూ కంగననే తీసుకున్నట్లు సమాచారం. మాధవన్ హీరోగా నటిస్తున్న ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే జరుగుతోందట. అలానే కంగన హీరోయిన్గా ఫిక్స్ అయిన విషయాన్ని త్వరలోనే అధికారికంగా ప్రకటిస్తారని తెలుస్తోంది. అయితే ఇప్పుడు హిందీ సినిమాలు పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. పాన్ ఇండియా మూవీస్ అన్నీ కూడా దక్షిణాది నుంచి వస్తున్నాయి. బహుశా కంగన కూడా హిందీ కంటే సౌత్ చిత్రాలు చేయడానికి అందుకే ఇంట్రెస్ట్ చూపిస్తుందా అనే సందేహం వస్తోంది. (ఇదీ చదవండి: 'సింపతీ స్టార్' బిరుదుపై స్పందించిన సమంత) -
సైలెంట్‌గా శివకార్తికేయన్ కొత్త మూవీ షూటింగ్
'మహావీరుడు', 'అయలాన్' సినిమాలతో హిట్స్ కొట్టిన తమిళ హీరో శివకార్తికేయన్.. ప్రస్తుతం రెండు సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. వీటిలో కమలహాసన్ నిర్మిస్తున్న 'అమరన్' ఒకటి. దీని షూటింగ్ చివరి దశకు చేరుకుంది. మరోవైపు స్టార్ డైరెక్టర్ ఏఆర్ మురగదాస్ తీస్తున్న మూవీ షూటింగ్ సైలెంట్‌గా జరుగుతోంది. (ఇదీ చదవండి: నా భర్త మొదటి విడాకులు.. కారణం నేను కాదు: స్టార్ హీరో మాజీ భార్య) ఈ సినిమాలో శివకార్తికేయన్ సరసన రుక్మిణి వసంత్ హీరోయిన్గా చేస్తోంది. పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్గా తీస్తున్న ఈ చిత్ర తొలి షెడ్యూల్ ఎలాంటి ఆర్భాటం లేకుండా అయిపోయింది. ప్రస్తుతం పుదుచ్చేరిలో రెండో షెడ్యూల్ జరుగుతోంది. అనిరుధ్ సంగీతమందిస్తుండగా.. త్వరలో ఇతర వివరాలు వెల్లడించనున్నారు. ఈ మూవీ తర్వాత మురగదాస్.. సల్మాన్ ఖాన్‌తో కలిసి పనిచేస్తారు. (ఇదీ చదవండి: స్టార్ హీరో సూర్య దంపతుల మొత్తం ఆస్తి అన్ని కోట్లా?) -
'ప్రేమలు' హీరోయిన్ కొత్త సినిమా.. రిలీజ్‌కి రెడీ
'ప్రేమలు' అనే సినిమాతో ఓవర్‌నైట్ స్టార్ అయిపోయిన మమిత బైజు.. ఇదే మూవీ డబ్బింగ్ వెర్షన్‌తో తెలుగు ప్రేక్షకుల్ని కూడా మాయలో పడేసింది. ఈమె హీరోయిన్గా నటించిన తమిళ సినిమా 'రెబల్'. ఇందులో జీవీ ప్రకాశ్ కుమార్ హీరో. మార్చి 22న థియేటర్లలో రిలీజ్ కానుంది. నికేశ్ దర్శకత్వం వహించాడు. ఈ సందర్భంగా తాజాగా ప్రెస్ మీట్ నిర్వహించారు. టీమ్ అంతా పలు ఆసక్తికర విషయాల్ని చెప్పారు. (ఇదీ చదవండి: ఓటీటీ డేట్ ఫిక్స్ చేసుకున్న 'లవర్'.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?) తమిళం గురించి బలంగా చెప్పే చిత్రం ఇది అని, దర్శకుడు నికేశ్ తన ఫ్యామిలీ ఫ్రెండ్ జీవితంలో జరిగిన యధార్థ సంఘటనల ఆధారంగా ఓ కథ రాసుకున్నాడని, అలా తీసిన సినిమానే 'రెబల్' అని హీరో జీవీ ప్రకాశ్ కుమార్ చెప్పారు. ఇందులో హీరోయిన్గా మమితా బైజూ చాలా చక్కగా నటించిందని చెప్పుకొచ్చాడు. (ఇదీ చదవండి: ఎట్టకేలకు బయటకొచ్చిన అనుష్క.. ఇంతలా మారిపోయిందేంటి!?) -
చాన్నాళ్ల తర్వాత మళ్లీ అలా రాబోతున్న ఆండ్రియా
ఎప్పటికప్పడు కాంట్రవర్సీల్లో ఉండే నటి ఆండ్రియా. ప్రస్తుతం ఈమె వయసు 42 ఏళ్లు. అయితే తనకు పెళ్లి ఆలోచన లేదని ఈ మధ్యే ఓ ఇంటర్వ్యూలో చెప్పి అందరూ అవాక్కయ్యేలా చేసింది. నటి, గాయని, గీత రచయితగా తనకంటూ గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఈమె హీరోగా చేసిన సినిమా రిలీజై రెండేళ్లకు పైగానే అయిపోతోంది. ఇప్పుడు మరోసారి కథానాయికగా ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమైందట. (ఇదీ చదవండి: ఓటీటీలోకి మెగాస్టార్ హిట్ సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?) 2022లో 'అణల్ మేల్ పణిత్తుళి' సినిమాతో వచ్చిన ఆండ్రియా.. ఈ సంక్రాంతికి తెలుగులో వచ్చిన వెంకటేశ్ 'సైంధవ్' అతిథి పాత్రలో కనిపించింది. మరోవైపు ఈమె నటిస్తున్న 'పిశాచి 2', 'నో ఎంట్రీ', 'కా' చిత్రాలు సెట్స్ మీద ఉన్నాయి. వీటిలో 'పిశాచి 2' చాలా కాలంగా వాయిదా పడుతూ వస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆండ్రియా నటించిన 'కా' విడుదల ఫిక్స్ చేసుకుందట. మార్చి 29న థియేటర్లలోకి తీసుకురాబోతున్నట్లు సమాచారం. ఆండ్రియా ఇందులో వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్‌గా నటించింది. వృత్తిలో భాగంగా దట్టమైన అడవిలోకి వెళ్లిన ఆమె.. ఎలాంటి సమస్యల్లో చిక్కుకుంది? ఇందులో నుంచి ఎలా బయటపడింది? అనేది స్టోరీ. నాంజిల్ దర్శకత్వం వహించగా.. సుందర్.సి, బాబు సంగీతమందించారు. ఏదేమైనా మళ్లీ దాదాపు రెండేళ్ల తర్వాత ఆండ్రియా తమిళ తెరపై కనిపించనుందనమాట. (ఇదీ చదవండి: హీరో బాలకృష్ణ నిజ స్వరూపాన్ని బయటపెట్టిన తమిళ స్టార్ డైరెక్టర్) -
నేను అలా అనలేదు.. అవాస్తవాలు ప్రచారం చేశారు: ప్రముఖ నటుడు
తన గురించి ఎన్నో కట్టుకథలు ప్రచారం చేశారని ప్రముఖ తమిళ నటుడు-నిర్మాత ఆర్కే.సురేశ్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఈయన హీరోగా నటించిన కొత్త సినిమా 'కాడు వెట్టి'. సోలై ఆరుముగం దర్శకుడు. త్వరలో ఈ మూవీ థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా ఆడియో లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. ఇందులోనే ఆర్కే సురేశ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. (ఇదీ చదవండి: అంబానీ ప్రీ వెడ్డింగ్‌లో చరణ్‌ని అవమానించిన షారుక్.. షాకింగ్ పోస్ట్) 'ఇప్పటివరకూ 100కి పైగా సినిమాల్ని పంపిణీ చేశాను. పలు చిత్రాలు నిర్మించాను. 40కి పైగా మూవీస్‌లో నటించాను. ఇండస్ట్రీలో 15 ఏళ్లుగా ఉన్నాను. అందరితోనూ నాకు సత్సంబంధాలు ఉన్నాయి. అలాంటి నాపై అవాస్తవాలు ప్రచారం చేశారు. ఇది జాతికి సంబంధించిన చిత్రం కాదు. నేను ఏ జాతిని కించపరచేలా మాట్లాడలేదు. జాతి అనేది ఒక భావన మాత్రమే' అని ఆర్కే సురేశ్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. (ఇదీ చదవండి: ఓటీటీలోకి హిట్ సినిమా.. అనుకున్న టైమ్ కంటే ముందే రానుందా?) -
హీరోయిన్ శ్రుతిహాసన్.. మళ్లీ ఒకప్పటి ప్రొఫెషన్లోకి
శృతిహాసన్ ఇప్పుడు పాన్ ఇండియా హీరోయిన్ అయిపోయింది. గతేడాది చిరు, బాలయ్యతో మొదలుపెట్టి.. చివర్లో ప్రభాస్ 'సలార్'తో హిట్ కొట్టి 2023ని ముగించింది. ప్రస్తుతానికైతే కొత్త మూవీస్ ఏం చేయట్లేదు. అలా అని ఖాళీగా లేదని చెప్పొచ్చు. అప్పుడెప్పుడో పక్కనబెట్టేసిన పాత ప్రొఫెషన్ని తిరిగి ఇప్పుడు మొదలుపెట్టేసింది. (ఇదీ చదవండి: శ్రీలీలని ఇలా ఎప్పుడూ చూసుండరు.. వీడియో వైరల్) విలక్షణ నటుడు కమల్ హాసన్ వారసురాలిగా శ్రుతిహాసన్ చాలామందికి తెలుసు. గాయనిగా కెరీర్ ప్రారంభించిన ఈమె.. హీరోయిన్ కాకముందు పలు ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్స్ చేసింది. తండ్రి కమల్ 'ఉన్నైపోల ఒరువన్' సినిమాతో సంగీత దర్శకురాలు అయింది. ఆ తర్వాత నటిగా మారడంతో పాడటాన్ని పక్కనబెట్టేసింది. తాజాగా ఇప్పుడు మరోసారి తనలోని సింగర్‌ని శ్రుతిహాసన్ బయటకు తీయబోతుంది. జయం రవి, నిత్యామేనన్ నటిస్తున్న ఓ తమిళ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతమందిస్తున్నారు. ఇందులో 'కాదలిక్క నేరమిల్లై' అనే పాటని శ్రుతిహాసన్ పాడనుంది. అలా యాక్టింగ్ పరంగా ఛాన్సులు రాకపోతేనేం.. మళ్లీ సింగర్‌గా బిజీ అయిపోతోంది. (ఇదీ చదవండి: ఓటీటీలోకి మలయాళ థ్రిల్లర్ మూవీ.. తెలుగు స్ట్రీమింగ్ ఎప్పుడంటే?) -
అభిమానితో దురుసు ప్రవర్తన? హీరో సూర్య తండ్రిపై విమర్శలు
తమిళ స్టార్ హీరో సూర్యకి తెలుగులోనూ కల్ట్ ఫ్యాన్స్ ఉన్నారు. అమ్మాయిల్లో క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సూర్య పెద్దగా వివాదాల జోలికి పోడు. తాజాగా ఈ హీరో తండ్రి మాత్రం ఓ అభిమానితో దురుసుగా ప్రవర్తించారని, తెచ్చిన శాలువా విసిరేశారని అంటూ ఓ వీడియో వైరల్ అయింది. దీంతో సూర్య తండ్రిపై విమర్శలు వచ్చాయి. దీంతో అసలేం జరిగింది? ఎందుకు అలా ప్రవర్తించాల్సి వచ్చిందని స్వయనా సూర్య తండ్రి క్లారిటీ ఇచ్చేశారు. ఏం జరిగింది? నటుడు, డబ్బింగ్ ఆర్టిస్టుగా గుర్తింపు శివకుమార్ తాజాగా చెన్నైలోని ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే ఈవెంట్ పూర్తయిన తర్వాత బయటకు వెళ్తున్న క్రమంలోనే ఓ వ్యక్తి, ఈయన కోసం శాలువా తీసుకొచ్చాడు. దాని ఒంటిపై కప్పబోతుంటే.. శివకుమార్ దాన్ని చేతిలోకి తీసుకుని కింద పడేశారు. అయితే శాలువా పట్టుకొచ్చిన వ్యక్తి శివకుమార్‌కి ఫ్రెండ్ మనవడే. దీంతో చనువు కొద్ది నాకెందుకురా అనే ఉద్దేశంతోనే విసిరేశారట. (ఇదీ చదవండి: నేను బతికే ఉన్నాను.. రూమర్స్‌పై యువనటి క్లారిటీ) 50 ఏళ్ల నుంచి బెస్ట్ ఫ్రెండ్స్ 'వీడియోలో ఉన్నది మా తాత కరీమ్. శివకుమార్, ఆయన గత 50 ఏళ్ల నుంచి బెస్ట్ ఫ్రెండ్స్. శాలువా ఇస్తున్నప్పుడు.. ఎందుకురా ఇవన్నీ అని జోక్ చేస్తూ దాన్ని విసిరేశారు. వెళ్దాం పద అని తాతతో పాటు కిందకు వెళ్లిపోయారు. శాలువా నీ దగ్గరే ఉండనివ్వు అని మా తాతతో అన్నారు. మా తాత కారైకుడీలో ఉంటారు. అక్కడ జరిగిన ఈవెంట్‌కే శివకుమార్ అతిథిగా వెళ్లారు. నిజమేంటో తెలియకుండా తప్పుడు ప్రచారం చేయొద్దు' అని కరీమ్ మనవడు రిఫాయ్ చెప్పుకొచ్చాడు. శివకుమార్ ఏం చెప్పారు? 'నేను, కరీమ్ చాలా క్లోజ్. కానీ కొత్తగా నా కోసం శాలువా తీసుకొచ్చాడు. కానీ ఇదంతా నచ్చక తిరిగిచ్చేశాను. అయితే ఆ రోజు సరిగా విశ్రాంతి లేకపోవడం వల్ల స్పీచే కష్టంగా ఇచ్చాను. అన్ని పూర్తి చేసుకుని బయటకొస్తుంటే శాలువా తీసుకొచ్చాడు. కానీ అది కిందపడేయడం నా తప్పే. దానికి నేను సారీ చెబుతున్నా' అని శివకుమార్ ఓ వీడియోలో చెప్పుకొచ్చారు. (ఇదీ చదవండి: సడన్‌గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సైకలాజికల్ థ్రిల్లర్ సినిమా) -
మూడు ఓటీటీల్లో ఒకేసారి హిట్ సినిమా రిలీజ్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఈ మధ్య సినిమాలన్నీ ఓటీటీల్లోకి అనుకున్న దానికంటే చాలా తర్వగానే వచ్చేస్తున్నాయి. హిట్, ఫ్లాప్‌తో సంబంధం లేకుండా స్ట్రీమింగ్ అయిపోతున్నాయి. ఇప్పుడు అలానే ఓ హిట్ సినిమా కూడా దాదాపు నెలలోనే రిలీజ్ కానుంది. అయితే ఒకేసారి మూడు ఓటీటీల్లో స్ట్రీమింగ్ కానుందనే విషయం ఆసక్తికరంగా మారిపోయింది. ఇంతకీ ఏంటా సినిమా? స్ట్రీమింగ్ ఎప్పుడు? (ఇదీ చదవండి: వీడియో: యంగ్ హీరో ఆశిష్ రిసెప్షన్లో విజయ్-రష్మిక) జనవరి 25న తమిళంలో రిలీజైన సినిమా 'బ్లూ స్టార్'. క్రికెట్ నేపథ్యం ప్లస్ కులాల మధ్య అంతరాలు అనే కాన్సెప్ట్‌తో ఈ చిత్రాన్ని తీశారు. అశోక్ సెల్వన్, శంతను, కీర్తి పాండియన్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. తక్కువ బడ్జెట్‌తో తీసిన ఈ మూవీ.. ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేయడంలో సక్సెస్ అయింది. కలెక్షన్స్ కూడా గట్టిగానే వచ్చాయి. ఇప్పుడీ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు. ఫిబ్రవరి 29 నుంచి ఓటీటీలో 'బ్లూ స్టార్' స్ట్రీమింగ్ కానుందని ప్రకటించారు. అయితే ఈ చిత్రం.. టెంట్ కోట్టా, సింప్లీ సౌత్, అమెజాన్ ప్రైమ్ ఓటీటీల్లో ఒకేసారి అందుబాటులోకి రానుంది. ఇలా ఓ సినిమా ఏకంగా మూడు ఓటీటీల్లో రిలీజ్ కావడం కాస్త ఇంట్రెస్టింగ్గా అనిపిస్తోంది. తెలుగు వెర్షన్ స్ట్రీమింగ్ కూడా ఉండొచ్చని టాక్. ఈ సినిమాలో నటించిన అశోక్ సెల్వన్, కీర్తి పాండియన్.. గతేడాది సెప్టెంబరులో పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు జంటగా తొలి మూవీతోనే హిట్ కొట్టేశారు. (ఇదీ చదవండి: ప్రభాస్ డూప్‌కి షాకింగ్ రెమ్యునరేషన్.. ఒక్కో సినిమాకు ఎంతంటే?) #Bluestar, the much-anticipated political cricket movie, streaming from Feb 29 on Tentkotta.💙⭐#BluestaronTentkotta@officialneelam @beemji @lemonleafcreat1@chejai007 @AshokSelvan @imKBRshanthnu@prithviactor @iKeerthiPandian @Lovekeegam@that_Cameraman… pic.twitter.com/0SI76GsOPN — Tentkotta (@Tentkotta) February 23, 2024 -
విజయ్‌కి నో చెప్పిన యంగ్ హీరోయిన్.. ఎందుకో తెలుసా?
సాధారణంగా స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్స్ వస్తే ఎవరైనా మరో ఆలోచన లేకుండా ఒప్పేసుకుంటారు. కొందరు మాత్రం నిరభ్యంతరంగా నో చెప్పేస్తుంటారు. తమిళ బ్యూటీ ఇవానా కూడా అలానే దళపతి విజయ్ మూవీకి నో చెప్పేసిందట. ఇప్పుడు ఈ విషయం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారిపోయింది. (ఇదీ చదవండి: ఓటీటీలోకి సూపర్‌స్టార్ సినిమా.. అనుకున్న టైమ్ కంటే ముందే!) దళపతి విజయ్ ప్రస్తుతం 'ద గోట్' (The GOAT) అనే సినిమా చేస్తున్నాడు. వెంకట్ ప్రభు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా సాగుతోంది. టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‌తో తీస్తున్న ఈ చిత్రంలో విజయ్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. తండ్రికి జరిగిన అన్యాయాన్ని టైమ్ ట్రావెల్ చేసి, హీరో ఎలా తీర్చుకుంటాడనే కథతో ఈ సినిమా తీస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే మూవీలో విజయ్‌తో పాటు ప్రభుదేవా, అజ్మల్, ప్రశాంత్ తదితరులు కీలక పాత్రలు పోషస్తున్నారు. విజయ్ చెల్లి పాత్ర కోసం 'లవ్ టుడే' ఫేమ్ హీరోయిన్ ఇవానాని అడిగారట. చెల్లి పాత్ర చేస్తే తనకు హీరోయిన్గా ఛాన్సులు తగ్గే ప్రమాదముందని, అందుకే నో చెప్పినట్లు ఈ బ్యూటీ చెప్పుకొచ్చింది. ఫలితంగా ఈమెకు బదులు నటి-మోడల్ అభియుక్తని ఆ పాత్ర కోసం ఎంపిక చేశారట. (ఇదీ చదవండి: పెళ్లి చేసుకున్న 'బిగ్‌బాస్' వాసంతి.. కుర్రాడు ఎవరంటే?) -
నిజమైన మాంత్రికులతో సినిమా.. కథ కూడా అలాంటిదే
దెయ్యాలు, మంత్రాలు, తంత్రాలు తదితర అంశాలతో ఈ మధ్య కాలంలో పలు సినిమాల వస్తూనే ఉన్నాయి. 'పొలిమేర 2', 'విరూపాక్ష' లాంటివి ఈ జానర్లోకే వస్తాయి. సరిగా తీయాలే గానీ వీటికి ప్రేక్షకుల్లో మంచి డిమాండ్ ఉంది. అయితే నిజమైన మాంత్రికులతోనే సినిమా తీసి, విడుదలకు సిద్ధం చేయడం హాట్ టాపిక్‌గా మారిపోయింది. (ఇదీ చదవండి: పార్టీ పేరు మార్చిన స్టార్ హీరో విజయ్.. ఎందుకంటే?) దెయ్యాలు, మంత్రాలు, తంత్రాలు గురించి పరిశోధించి తీసిన సినిమా 'డెవిల్ హంటర్స్'. రుద్రేశ్వర్ పతాకంపై ప్రజిత్ రవీంద్రన్ స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. మరణించిన వారి మూఢ నమ్మకాలని చర్చించే కథతో దీన్ని తెరకెక్కించారు. ఇప్పటివరకు హారర్ చిత్రాల్లో రానటువంటి ఎలిమెంట్స్‌తో దీన్ని తీశారట. 25 ఏళ్లుగా తంత్ర శాస్త్రాలను నిర్వహిస్తున్న దర్శకనిర్మాత.. పలు యదార్థ సంఘటనలను ఇందులో పొందుపరిచినట్లు చెప్పారు. ఇందులో నటించిన వారందరూ మాంత్రికం చేయగలిగిన వారేనని చెప్పడం అందర్ని అవాక్కయ్యేలా చేస్తోంది. త్వరలో విడుదల తేదీని ప్రకటిస్తామని చెప్పుకొచ్చారు. ఏదేమైనా నిజమైన మాంత్రికులతో సినిమా తీయడం ఏంట్రా బాబు అనిపిస్తోంది. (ఇదీ చదవండి: ఓటీటీలోకి 'హనుమాన్' సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?) -
ఇకపై ఆ పని చేయను.. పక్కన బెట్టేస్తున్నా: హీరో ఆకాశ్
'ఆనందం' లాంటి సినిమాతో తెలుగులోనూ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న ఆకాశ్.. ఆ తర్వాత కాలంలో సరైన మూవీస్ చేయకపోవడంతో అలా అలా టాలీవుడ్‌కి దూరమైపోయాడు. గత ఏడెనిమిదేళ్ల నుంచి తమిళంలో మాత్రమే చిత్రాలు చేస్తున్నాడు. నటనతో పాటు దర్శక నిర్మాతగానూ పనిచేస్తున్నాడు. (ఇదీ చదవండి: కాంగ్రెస్ పార్టీలోకి హీరో అల్లు అర్జున్ మామ.. త్వరలో ఎన్నికల్లో పోటీ?) అయితే చిన్న చిత్రాలకు థియేటర్ల దొరక్కపోవడంతో తనే సొంతంగా 'ఏ క్యూబ్ మూవీస్' అనే యాప్ లాంచ్ చేశాడు. తన సినిమాలతో పాటు పలు చిన్న చిత్రాల్ని ఇందులో రిలీజ్ చేస్తున్నాడు. జై ఆకాశ్.. గతేడాది 'జై విజయం' చిత్రంలో హీరోగా నటించి దర్శకత్వం వహించాడు. ఓటీటీలోనూ ఇది సక్సెస్ అయిన సందర్భంగా.. చిత్ర విజయోత్సవాన్ని స్థానిక వడపళనిలోని ఘనంగా నిర్వహించారు. తాను నటించిన 'అమైచర్ రిటర్న్', 'మామరం' వరుసగా విడుదలకు సిద్ధమవుతున్నాయని జై ఆకాశ్ చెప్పాడు. ప్రస్తుతం హీరోగా నటించడానికి నాలుగు సినిమాల్లో ఛాన్సులు వచ్చాయని.. ఈ క్రమంలోనే ఇకపై దర్శకత్వానికి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు నటుడు జై ఆకాష్ క్లారిటీ ఇచ్చేశాడు. (ఇదీ చదవండి: రష్మికతో పెళ్లి ఆగిపోవడంపై మాజీ ప్రియుడు ఇంట్రెస్టింగ్ కామెంట్స్) -
మృణాల్ అనుకుంటే రుక్మిణి బంపరాఫర్ పట్టేసింది!
సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు ఏం జరుగుతుందో? ఎవరి దశ తిరుగుతుందో అస్సలు చెప్పలేం. అలా కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ లక్ మారేలా కనిపిస్తుంది. ప్రస్తుతం ఆమె ప్లానింగ్ చూస్తుంటే అదే అనిపిస్తోంది. తాజాగా ఓ క్రేజీ డైరెక్టర్-హీరో కాంబోతో కలిసి నటించేందుకు ఓకే చెప్పడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. (ఇదీ చదవండి: రష్మికతో పెళ్లి ఆగిపోవడంపై మాజీ ప్రియుడు ఇంట్రెస్టింగ్ కామెంట్స్) 'సప్త సాగరాలు దాటి' సినిమాతో దర్శకనిర్మాతల దృష్టిని ఆకర్షించిన భామ రుక్మిణి వసంత్. గతేడాది రెండు పార్టులుగా రిలీజైన ఈ సినిమాలో రుక్మిణి యాక్టింగ్‌కి మంచి మార్కులు పడ్డాయి. ఆ వెంటనే తెలుగు నుంచి కూడా బోలెడన్ని ఆఫర్స్ వచ్చాయి. కానీ వేటికి ఓకే చెప్పకుండా ఒక్కో అడుగు ఆచితూచి వేస్తున్నట్లు కనిపిస్తుంది. తాజాగా శివకార్తికేయన్ కొత్త మూవీలో హీరోయిన్గా ఛాన్స్ కొట్టేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఎందుకంటే తొలుత ఈ సినిమాలో పూజాహెగ్డే లేదా మృణాల్ ఠాకుర్ హీరోయిన్లుగా నటిస్తారనే టాక్ వినిపించింది. ఇప్పుడు ఎవరూ ఊహించని విధంగా రుక్మిణి బంపరాఫర్ కొట్టేసింది. ఇప్పటికే తమిళంలో విజయ్ సేతుపతి సరసన ఈ బ్యూటీ ఓ సినిమా చేస్తోంది. తెలుగు నుంచి ఆఫర్స్ వస్తున్నా సరే ఏ మాత్రం తొందరపడకుండా మూవీస్ చేయాలని చూస్తోంది. ఈమె ప్లానింగ్ చూస్తున్న నెటిజన్స్.. మరో రష్మిక అవుతుందని మాట్లాడుకుంటున్నారు. (ఇదీ చదవండి: ‘ఊరు పేరు భైరవకోన’ మూవీ రివ్యూ) -
‘ఈగల్’తో మాకు పోటీ లేదు: నిర్మాత ఎస్కేఎన్
‘ట్రూ లవర్’అనేది చిన్న సినిమా. చిన్న రిలీజ్. ఈగిల్‌తో పోటీ పడే పెద్ద సినిమా కాదు. అయినా కూడా హంబుల్ గా అందరికీ ఆమోదయోగ్యంగా ఉన్న నిర్ణయాన్ని తీసుకుని ఈ నెల 10వ తేదీన రిలీజ్ చేస్తున్నాం’ అని అన్నారు నిర్మాత ఎస్కేఎన్. డైరెక్టర్ మారుతితో కలిసి తమిళ మూవీ లవర్ ను "ట్రూ లవర్" పేరుతో తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు ఎస్కేఎన్. మణికందన్, శ్రీ గౌరి ప్రియ, కన్న రవి కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని మిలియన్ డాలర్ స్టూడియోస్, ఎంఆర్ పీ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై నజేరత్ పసీలియన్, మగేష్ రాజ్ పసీలియన్, యువరాజ్ గణేషన్ నిర్మించారు. విభిన్న ప్రేమ కథతో దర్శకుడు ప్రభురామ్ వ్యాస్ రూపొందించారు. ఫిబ్రవరి 10న ఈ మూవీ విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఎస్కేఎన్ మీడియాతో ముచ్చటించాడు. ఆ విశేషాలు.. ► ఒక ఫ్రెండ్ ద్వారా "ట్రూ లవర్" సినిమా మా దృష్టికి వచ్చింది. ఆయన మారుతిని కలిసి సినిమా చూడమని అన్నాడు. మారుతి నాకు చెప్పి నువ్వూ రా ఇద్దరం మూవీ చూద్దాం అన్నాడు. మా ఇద్దరికీ మూవీ నచ్చింది. దాంతో తెలుగులో చేద్దామని నిర్ణయించాం. ట్రూలవర్ ను మా ప్రీవియస్ మూవీ బేబితో పోల్చలేం. రెండు వేర్వేరు తరహా మూవీస్. ఈ సినిమా చూస్తున్నంత సేపు ప్రేక్షకులు తమతో పోల్చుకుంటారు. ప్రేమలో ఉన్న యువతకు రీచ్ అయ్యే సబ్జెక్ట్ ఇది.లవర్స్ ఎదుర్కొంటున్న సమస్యలను ఈ సినిమాలో దర్శకుడు చూపించాడు. తను ఎంచుకున్న కథకు డైరెక్టర్ పూర్తి న్యాయం చేశాడు. ►ఏ రిలేషన్ లోనైనా నమ్మకం అనేది పునాదిగా ఉంటుంది. ఉండాలి. "ట్రూ లవర్" సినిమాలో మెయిన్ పాయింట్ అదే. ఈ సినిమాలో కొన్ని సీన్స్ చాలా స్ట్రైకింగ్ గా అనిపించాయి. అవి చూసే సినిమా సక్సెస్ ను బిలీవ్ చేశా. ►నాకు సహజంగా లవ్ స్టోరీస్, యూత్ ఫుల్ మూవీస్ ఇష్టం. నేను మారుతి గారితో కలిసి చేసిన ఈ రోజుల్లో కూడా యూత్ ఫుల్ మూవీ. పెద్ద స్టార్స్ తో సినిమాలు చేస్తే దాని బడ్జెట్ ఎక్కువ కాబట్టి మేకింగ్ కు మేము ప్రిపేర్ కావాలి. కొత్త వాళ్లతో మూవీ చేసినప్పుడు కంటెంట్ యూత్ ఫుల్ గా ఉంటే ఆ సినిమాల రీచ్ బాగుంటుంది. నెక్ట్ నేను చేస్తున్న నాలుగు సినిమాల్లో మూడు యూత్ ఫుల్ మూవీస్ ఉంటాయి. ఒకటి సైన్స్ ఫిక్షన్ తో ఔటాఫ్ ది బాక్స్ గా ఉంటుంది. ►బేబి సినిమాను హిందీలో రీమేక్ చేస్తున్నాం. మరో ఒకట్రెండు వారాల్లో అనౌన్స్ చేస్తాం. హిందీలో స్టార్ కిడ్స్ లేదా కొత్త వాళ్లతో బేబీ రీమేక్ చేయాలనుకుంటున్నాం. సాయి రాజేశ్ హిందీలో డైరెక్టర్ చేయబోతున్నారు. అర్జున్ రెడ్డి ఇక్కడి కంటే హిందీలో హ్యూజ్ గా కలెక్షన్స్ చేసింది. బేబి కూడా అలాగే బాలీవుడ్ లో వైడ్ రేంజ్ కలెక్షన్స్ తెచ్చుకుంటుందని ఆశిస్తున్నా. ► ప్రస్తుతం సంతోష్ శోభన్, ఆనంద్ దేవరకొండతో సినిమాలు చేస్తున్నాను. అలాగే ఓ సూపర్ న్యాచురల్ మూవీ చేయాలి. సందీప్ రాజ్ తో కూడా ఓ ప్రాజెక్ట్ అనుకుంటున్నాం. ప్రొడ్యూసర్ గా అప్పర్ ప్రైమరీ స్థాయిలో ఉన్నాను. కాలేజ్ స్థాయికి వచ్చాక అల్లు అర్జున్ తో సినిమా నిర్మిస్తా. -
హీరోగా రీఎంట్రీ ఇస్తున్న 'కిక్' సినిమా విలన్
ప్రముఖ నటుడు శామ్.. చిన్న గ్యాప్ తర్వాత హీరోగా మళ్లీ సినిమా చేస్తున్నాడు. తాజాగా ఈ సినిమాకు 'అస్త్రం' అనే టైటిల్ నిర్ణయించారు. బెస్ట్ మూవీస్ పతాకంపై ధన షణ్ముగ మణి నిర్మిస్తుండగా.. నటుడు అరవింద్ రాజగోపాల్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ప్రముఖ మోడల్ నిరంజని ఈ చిత్రంతోనే హీరోయిన్గా పరిచయమవుతోంది. (ఇదీ చదవండి: 'హనుమాన్' కోసం 70-75 సినిమాలు రిజెక్ట్ చేశా: హీరో తేజ) తాజాగా ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. సుందర మూర్తి సంగీతమందిస్తున్నారు. ఇది క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ స్టోరీతో ఉంటుందని దర్శకుడు చెప్పుకొచ్చాడు. కరోనా కాలంలో 30 నిమిషాల నిడివితో కథ అనుకున్నాను కానీ తర్వాత అది సినిమా స్టోరీగా మార్చినట్లు తెలిపాడు. సోషల్ మీడియా ద్వారా శామ్కు కథ చెప్పగా, ఆఫీస్‌కి పిలిపించుకుని ఓకే చెప్పి సినిమా చేయడానికి రెడీ అయినట్లు చెప్పాడు. ఇందులో శామ్ పోలీసు అధికారిగా నటిస్తున్నారు. కాగా చిత్ర ఫస్ట్‌లుక్ పోస్టర్ని 40 మంది సినీ ప్రముఖులు ఆన్లైన్ ద్వారా విడుదల చేయడం విశేషం. (ఇదీ చదవండి: క్యాన్సర్‌ని జయించిన భార్య.. స్టార్ హీరో ఇంట్రెస్టింగ్ పోస్ట్) View this post on Instagram A post shared by SHAAM (@actor_shaam) -
హిట్ కాంబో రిపీట్.. స్టార్ హీరోతో ఆ దర్శకుడు ఐదో సినిమా
దళపతి విజయ్, తలా అజిత్ అభిమానుల వైరం గురించి చాలామందికి తెలుసు. ఎందుకంటే తమ హీరో గొప్ప, తమ హీరో గొప్ప అని ఎప్పుడూ గొడవపడుతూనే ఉంటారు. అయితే తాజాగా విజయ్, రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించడంతో అజిత్ ఫ్యాన్స్ హ్యాపీగా ఫీలవుతున్నారు. అదే టైంలో అజిత్ వరస చిత్రాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుండటం హాట్ టాపిక్‌గా మారిపోయింది. అలా ఇప్పుడు తనకు నాలుగు హిట్స్ ఇచ్చిన దర్శకుడితో మరోసారి కలిసి పనిచేయబోతున్నట్లు న్యూస్ బయటకొచ్చింది. (ఇదీ చదవండి: మేనల్లుడిని హీరోగా పరిచయం చేస్తున్న ధనుష్) అజిత్ ప్రస్తుతం తన 62వ సినిమా చేస్తున్నాడు. లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి 'విడామయూర్చి' అనే టైటిల్ నిర్ణయించారు. మగిళ్ తిరుమేణి దర్శకుడు. షూటింగ్ చివరి దశకు చేరుకోగా.. మేలో విడుదల చేయాలని చూస్తున్నారు. కాగా అజిత్ తన 63వ మూవీ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో చేయబోతున్నారు. దీని తర్వాత వెట్రిమారన్‌తో మూవీ ఉంటుందని అంటున్నారు. కానీ అది జరిగేలా కనిపించట్లేదు. ఈ క్రమంలోనే దర్శకుడు శివ పేరు తెరపైకి వచ్చింది. అజిత్ తన 64వ సినిమాని శివకి అప్పగించాలని అనుకుంటున్నారట. గతంలో వీళ్ల కాంబోలో వీరం, వేదాళం, వివేకం, విశ్వాసం లాంటి నాలుగు సూపర్ హిట్ చిత్రాలు వచ్చాయి. ఇప్పుడు చేయబోయేది ఐదో చిత్రం కాబోతుంది. అయితే ఈ మూవీస్ అన్నీ కూడా తమిళంలో హిట్ అయ్యాయి కానీ తెలుగులో పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. (ఇదీ చదవండి: గుంటూరు కారం ఓటీటీ రిలీజ్ డేట్.. నెలరోజుల్లోనే ఓటీటీలోకి) -
మేనల్లుడిని హీరోగా పరిచయం చేస్తున్న ధనుష్
తమిళ హీరో ధనుష్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. హీరోగా చేస్తూనే నిర్మాత, దర్శకుడిగానూ ఆశ్చర్యపరుస్తున్నారు. గతేడాది తెలుగులో 'సార్' చిత్రంలో నటించి హిట్ కొట్టారు. రీసెంట్గా 'కెప్టెన్ మిల్లర్' అనే మూవీతో పలకరించారు. కానీ ఇది అనుకున్నంతగా ఆకట్టుకోలేకపోయింది. ప్రస్తుతం తెలుగు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నటిస్తున్న ధనుష్.. స్వీయ దర్శకత్వంలోనూ ఓ మూవీ చేస్తున్నారు. (ఇదీ చదవండి: గుంటూరు కారం ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది!) సన్ పిక్చర్స్ నిర్మాణ సంస్థ తీస్తున్న ఈ సినిమా షూటింగ్ తాజాగా పూర్తయింది. అనికా సురేంద్రన్, దుషారా విజయన్ ఇందులో హీరోయిన్లుగా నటించారు. ఇకపోతే ఈ మూవీకి 'రాయన్' అనే టైటిల్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ వేసవికి ఈ చిత్రం థియేటర్లలోకి వచ్చే అవకాశముంది. తాజాగా ధనుష్.. దర్శక నిర్మాతగా మరో సినిమా తీయబోతున్నట్లు సమాచారం. తన సోదరి కొడుకుని హీరోగా పరిచయం చేస్తూ ఈ మూవీ చేయబోతున్నారట. ఇందులో ధనుష్ అతిథి పాత్రలోనూ నటిస్తారని టాక్. ఈ ప్రాజెక్ట్ గురించి ఇతర వివరాలు తెలియాల్సి ఉంది. ప్రముఖ దర్శకుడు సెల్వరాఘవన్ హీరో ధనుష్‌కి తోడబుట్టిన అన్న. అలానే వీళ్లిద్దరికీ ఇద్దరు చెల్లెల్లు ఉన్నారు. వీళలో ఒకరి అబ్బాయినే ఇప్పుడు ధనుష్, హీరోగా పరిచయం చేయబోతున్నాడనమాట. (ఇదీ చదవండి: నిర్మాత దిల్ రాజు తమ్ముడి కొడుకు పెళ్లి.. కేసీఆర్‌కి ఆహ్వానం) -
కెరీర్ ఖతం అన్నారు.. కానీ ఎట్టకేలకు హీరోయిన్గా ఓ ఛాన్స్!
పూజా హెగ్డే.. అప్పట్లో వరస సినిమాలు చేసిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు పూర్తిగా సైలెంట్ అయిపోయింది. అరవింద సమేత, అల వైకుంఠపురములో తదితర చిత్రాలతో ఒక్కసారిగా టాప్ హీరోయిన్ అయిపోయిన ఈ భామ.. ఇప్పుడు మాత్రం ఛాన్సుల్లేక పూర్తిగా ఇంటికే పరిమితమైపోయింది. ఈమె కెరీర్ ఇక అయిపోయినట్లే అని అందరూ అనుకుంటున్నారు. (ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన అవార్డు విన్నింగ్ సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?) కానీ ఈమెకు ఇప్పుడు ఓ తమిళ సినిమాలో హీరోయిన్గా అవకాశం వచ్చింది. ప్రముఖ తమిళ హీరో శింబు ప్రస్తుతం దేసింగ్ పెరియసామి దర్శకత్వంలో నటిస్తున్నాడు. కమల్ హాసన్ తన సొంత బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. శింబు పుట్టినరోజు సందర్భంగా తాజాగా ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఇందులో ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు ఈ పోస్టర్‌తో క్లారిటీ వచ్చేసింది. ఈ సినిమా కోసమే శింబు.. లండన్‌కు వెళ్లి మరీ కరాటే, మార్షల్ ఆర్ట్స్‌లో ట్రైనింగ్ తీసుకున్నారు. అలానే ఈ మూవీలో హీరోయిన్లుగా దీపికా పదుకొనే, కీర్తీ సురేశ్ నటిస్తారని టాక్ నడిచింది. కానీ కీర్తి సురేశ్ ఓ హీరోయిన్ కాగా మరో కథానాయికగా పూజా హెగ్డేకి అవకాశం దక్కినట్లు తెలుస్తోంది. దేవిశ్రీప్రసాద్ సంగీతమందిస్తున్న ఈ చిత్రం.. ఈ ఏడాది థియేటర్లలోకి రానుంది. (ఇదీ చదవండి: ‘అంబాజీపేట మ్యారేజీ బ్యాండు’ మూవీ రివ్యూ) -
డైరెక్టర్‌తో వివాదం.. పరోక్షంగా క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్
హీరోయిన్ ఐశ్వర్య రాజేశ్‌కి ఓ దర్శకుడి మధ్య మాటల యుద్ధం. ఇండస్ట్రీలో ఇప్పుడిదే హాట్ టాపిక్‌గా మారిపోయింది. ఆయనేమో తను ఆమె దగ్గర సినిమా కోసం వెళ్తే చేయనని చెబుతోందని అంటున్నారు. ఐశ్వర్య ఏమో పూర్తిగా తెలుసుకుని మాట్లాడండని కౌంటర్స్ వేస్తోంది. దీంతో అసలేం జరిగిందిరా బాబు సినీ ప్రేమికులు తల గోక్కుంటున్నారు. ఇంతకీ అసలేంటి వివాదం? ఏం జరుగుతోంది? తెలుగమ్మాయి ఐశ్వర్య రాజేశ్.. తమిళ సినిమాలతో గుర్తింపు తెచ్చుకుంది. సహాయ నటిగా కెరీర్ ప్రారంభించి తర్వాత తర్వాత హీరోయిన్ అయ్యింది. లేడీ ఓరియెంటెడ్ మూవీస్‌కి కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయింది. తెలుగులో ఒకటి రెండు చిత్రాల్లో నటించినా సరే ఈమెకు పెద్దగా కలిసిరాలేదు. దీంతో పూర్తిగా తమిళం వరకు పరిమితమైపోయింది. అలాంటి ఈమెపై దర్శకుడు వీరపాండియన్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. (ఇదీ చదవండి: కుమారి ఆంటీ పుడ్ బిజినెస్ క్లోజ్.. సాయం చేస్తానంటున్న తెలుగు హీరో) 2011లో దర్శకుడు వీర పాండియన్.. 'అవర్గళుమ్ ఇవర్గళుమ్' అని ఓ సినిమా తీశాడు. ఇందులో ఐశ్వర్య రాజేశ్ ఓ హీరోయిన్. తాజాగా ఓ మీడియా ప్రకటన విడుదల చేసిన ఈ డైరెక్టర్.. 'ఐశ్వర్య రాజేశ్‌ని నేను ఇండస్ట్రీకి పరిచయం చేశా. ఈ విషయాన్ని ఆమె ఎప్పుడూ ఎక్కడా చెప్పలేదు. ఇప్పుడు స్టార్ హీరోయిన్ అయిన తర్వాత నా సినిమాలో నటించడానికి ఆసక్తి చూపించట్లేదు. ఆమె ఆర్థికంగా కష్టపడుతున్న సమయంలో ఆటో ఖర్చులకు కూడా నేనే డబ్బులు ఇచ్చాను' అని చెప్పుకొచ్చాడు. దీనిపై పరోక్షంగా స్పందించిన ఐశ్వర్య రాజేశ్.. దర్శకుడు వీరపాండియన్ పేరు చెప్పకుండా ట్వీట్ చేసింది. 'చాలా మంది ఓ అంశాన్ని మాత్రమే విని మాట్లాడుతున్నారు. అసలు విషయాలు తెలుసుకోకుండా ఓ నిర్ణయానికి వచ్చి జీవితంలోని అనుబంధాలను చెడగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరైనా సరే.. పూర్తిగా తెలుసుకుని ఆరోపణలు చేస్తే బాగుంటుంది' అని రాసుకొచ్చింది. దీంతో ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. (ఇదీ చదవండి: 'బిగ్‌బాస్' ఓటీటీ తెలుగు సీజన్ రద్దు? అదే అసలు కారణమా?) Thought of the Day 😊 pic.twitter.com/sisjRcZnQC — aishwarya rajesh (@aishu_dil) January 29, 2024 -
తాళిబొట్టుతో షాకిచ్చిన హీరోయిన్ అనుపమ.. ఇంతకీ ఏమైంది?
హీరోయిన్లు ఈ మధ్య వరసపెట్టి పెళ్లి చేసుకుంటున్నారు. తెలుగు సినిమాల్లో చేస్తున్న పలువురు ముద్దుగుమ్మలు నిశ్చితార్థం చేసుకుని వివాహానికి రెడీ అవుతున్నారు. సరిగ్గా ఇలాంటి టైంలో హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ తాళిబొట్టుతో ఉన్న కొన్ని ఫొటోల్ని పోస్ట్ చేసింది. ఇది చూసిన అభిమానులు తొలుత షాకయ్యారు. ఆ తర్వాత అసలు విషయం తెలుసుకున్నారు. అలా రిలాక్స్ అయిపోయారు. ఇంతకీ ఏం జరిగింది? (ఇదీ చదవండి: స్టార్ హీరోని పెళ్లి చేసుకోబోతున్న 'హనుమాన్' నటి?) మలయాళ కుట్టి అనుపమ.. సొంత భాషలో తీసిన 'ప్రేమమ్' సినిమాతో హీరోయిన్ అయ్యింది. 'అఆ' చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. వీటితోపాటు తమిళ, కన్నడ మూవీస్‌లోనూ యాక్ట్ చేసింది. ఒకప్పటితో పోలిస్తే ఈమె చేతిలో పెద్దగా ఛాన్సులైతే లేవు. అలానే గతంలో క్రికెటర్ బూమ్రాతో ప్రేమలో ఉందనే రూమర్స్ వచ్చాయి. కానీ అతడికి పెళ్లయిపోవడంతో ఆ తర్వాత అనుపమ పెళ్లి గురించి ఎలాంటి గాసిప్స్ ఏం రాలేదు. కానీ తాజాగా పెళ్లి చీరతో మెడలో తాళిబొట్టు ఉన్న ఫొటోల్ని అనుపమ.. తన ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. దీంతో ఎవరికీ చెప్పకుండా పెళ్లి చేసేసుకుందా అని అభిమానులు మాట్లాడుకుంటున్నారు. అయితే ఇది తమిళ సినిమా 'సైరన్'లోని ఓ పాట కోసం రెడీ చేసిన లుక్ అని క్లారిటీ వచ్చేసింది. అంతే తప్ప అనుపమ పెళ్లి ఏం చేసుకోలేదు. కావాలంటే దిగువన ఉన్న ఈ పాట చూస్తే మీకే క్లారిటీ వచ్చేస్తుంది. (ఇదీ చదవండి: నాలుగేళ్లుగా డేటింగ్.. రహస్యంగా నిశ్చితార్థం చేసుకున్న తెలుగు హీరోయిన్) -
సినిమా హీరోయిన్గా ఛాన్స్ కొట్టేసిన సీరియల్ బ్యూటీ
సీరియల్ బ్యూటీస్.. సినిమాల్లోకి రావడం కొత్తేం కాదు. తెలుగు లేదంటే తమిళం ఇలా ఏ భాషలో తీసుకున్నా సరే మూవీస్‌లో వీళ్లకు సహాయ పాత్రలు మాత్రమే దక్కుతుంటాయి. కానీ ప్రధాన పాత్రల్లో నటించే ఛాన్సులు దక్కేది చాలా తక్కువ. అలా ఇప్పుడు సీరియల్ కమ్ బిగ్‌బాస్ బ్యూటీ.. సినిమాలో కథానాయికగా అవకాశం దక్కించుకుంది. దీని గురించి చెబుతూ తన ఆనందాన్ని వ్యక్తం చేసింది. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 21 సినిమాలు రిలీజ్.. అవేంటో తెలుసా?) 'శరవణన్ మీనాక్షి' సీరియల్ ద్వారా నటి రచిత మహాలక్ష్మి బాగానే గుర్తింపు తెచ్చుకుంది. ఈమెకు ఇప్పుడు తమిళంలో తీస్తున్న 'ఎక్స్ట్రీమ్' చిత్రంలో హీరోయిన్ ఛాన్స్ దక్కింది. రాజవేల్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం లాంఛనంగా చైన్నెలోని ప్రసాద్ ల్యాబ్‌లో ప్రారంభమైంది. సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ కథతో తీస్తున్న ఈ మూవీ ఇతర నటీనటుల వివరాలు, విడుదల తేదీన త్వరలో వెల్లడించనున్నట్లు దర్శకుడు తెలియజేశాడు. (ఇదీ చదవండి: స్టార్ హీరోని పెళ్లి చేసుకోబోతున్న 'హనుమాన్' నటి?) View this post on Instagram A post shared by Rachitha Mahalakshmi (@rachitha_mahalakshmi_official) -
హీరోయిన్ శ్రుతిహాసన్ డేరింగ్ స్టెప్.. ఫైనల్‌గా ఇన్నాళ్లకు?
విలక్షణ నటుడు కమల్ హాసన్ వారసురాలిగా ఇండస్ట్రీలోకి వచ్చిన శ్రుతిహాసన్.. కెరీర్ ప్రారంభంలో చాలా ఎదురుదెబ్బలు ఫేస్ చేసింది. ఆ తర్వాత పలు సినిమాలతో హీరోయిన్గా మంచి పేరు సంపాదించింది. చెప్పాలంటే గతేడాది తెలుగులో ఈమె చేసిన సినిమాలన్నీ హిట్ అయ్యాయి. దీంతో లక్కీ హీరోయిన్ అయిపోయింది. సరిగ్గా ఇలాంటి సమయంలో కెరీర్ పరంగా డేరింగ్ స్టెప్ తీసుకునేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. (ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు క్రైమ్ థ్రిల్లర్ సినిమా.. మీరు చూశారా?) గతేడాది తెలుగులో 'వీరసింహారెడ్డి', 'వాల్తేరు వీరయ్య', 'సలార్', 'హాయ్ నాన్న' (గెస్ట్ రోల్) సినిమాల్లో శ్రుతిహాసన్ నటించింది. ఇవన్నీ హిట్ అయ్యాయి. తాజాగా రవితేజ కొత్త మూవీలో నటించబోతుందని టాక్. హాలీవుడ్లో 'ది ఐ' అనే వెబ్ సీరీస్‌లోనూ శ్రుతి ఛాన్స్ కొట్టేసిందట. ఇప్పుడు మరో హాలీవుడ్ చిత్రం ఈమె ఖాతాలో పడినట్లు తెలుస్తోంది. ఇవన్నీ పక్కనబెడితే సొంత భాషలో దాదాపు నాలుగేళ్ల తర్వాత శ్రుతిహాసన్ నటించబోతుందట. శ్రుతిహాసన్ తమిళ చిత్రాల్లో నటించి చాలా కాలమైంది. విజయ్‌సేతుపతి 'లాభం' చిత్రంలో ఈ బ్యుటీ నటించింది. 2021లో ఇది రిలీజైంది. అప్పటినుంచి సొంత భాషలో చేయని శ్రుతిని ఇప్పుడు ఓ క్రేజూ సినిమాలో ఆఫర్ కొట్టేసిందట. వేలు నాచ్చియార్ అనే వీరవనిత పాత్రని శ్రుతిహాసన్ చేయబోతుందట. స్వతంత్య్ర పోరాటంలో పాల్గొన్న తొలి తమిళ నారీమణి వేలు నాచ్చియార్. రాజేష్ ఎం.సెల్వా ఈ ప్రాజెక్ట్ తీయబోతున్నారు. ఎక్కువగా గ్లామర్ రోల్స్ చేసే శ్రుతిహాసన్.. ఈ పాత్రలో చేస్తే సినిమా వర్కౌట్ అవుతుందా అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. (ఇదీ చదవండి: స్టార్ హీరో కాపురంలో చిచ్చు.. హీరోయిన్‌కి వార్నింగ్ ఇచ్చిన భార్య?) -
మనసు మార్చుకున్న హీరోయిన్ టబు.. 24 ఏళ్ల తర్వాత ఇప్పుడు!
టబు గురించి ఇప్పటి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా తెలియకపోవచ్చు. కానీ కాస్త ముందు జనరేషన్‌ని అడిగితే ఆమె యాక్టింగ్ గురించి చెబుతారు. గత కొన్నేళ్ల నుంచి పూర్తిగా బాలీవుడ్‌కే పరిమితమైపోయిన ఈ బ్యూటీ.. మధ్యలో 'అల వైకుంఠపురములో' అనే తెలుగు సినిమాలో మాత్రమే నటించింది. తర్వాత మళ్లీ హిందీపైనే ఫోకస్ చేసింది. అలాంటిది ఇప్పుడు మరోసారి దక్షిణాదిలో నటించనుంది. (ఇదీ చదవండి: జ్యోతిక విడాకుల రూమర్స్.. ముంబైకి షిఫ్ట్.. అసలు కారణం ఇదేనా?) తమిళంలో అజిత్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వయసుకు తగ్గ పాత్రలు చేస్తూ అందరినీ ఎంటర్టైన్ చేస్తున్నాడు. ప్రస్తుతం 'విడాముయర్చి' సినిమాతో బిజీగా ఉన్నాడు. ఇందులో త్రిష హీరోయిన్ కాగా నటిస్తుండగా అర్జున్, రెజీనా ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. దీని తర్వాత అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో ఓ మూవీ చేయబోతున్నాడు. ఇందులో అజిత్ సరసన బాలీవుడ్ భామ టబు నటిస్తున్నట్లు తాజా సమాచారం. 2000లో టబు-అజిత్ జంటగా తమిళంలో 'కండు కొండేన్' అనే సినిమా వచ్చింది. 'ప్రియురాలు పిలిచింది' పేరుతో ఇది తెలుగులోనూ డబ్ అయింది. రాజీవ్ మేనన్ దర్శకుడు. అదే ఏడాది మరో తమిళ సినిమా చేసిన టబు.. 2013లో మరో తమిళ మూవీ చేసింది అంతే. మళ్లీ ఇన్నాళ్లకు మరో చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇకపోతే అజిత్‌తో అయితే ఏకంగా 24 ఏళ్ల తర్వాత కలిసి పనిచేయబోతుందనమాట. (ఇదీ చదవండి: అత్తారింట్లో కండీషన్స్? మెగా కోడలు లావణ్య త్రిపాఠి ఇంట్రెస్టింగ్ కామెంట్స్) -
పెళ్లి తర్వాత జంటగా తొలి సినిమా.. రెండు రోజుల్లో రిలీజ్
ఈ హీరోహీరోయిన్ గతేడాది సెప్టెంబరులో పెళ్లి చేసుకున్నారు. ఆ వెంటనే ఓ సినిమాలో కలిసి నటించారు. ఇప్పుడా ఆ చిత్రాన్ని థియేటర్లలోకి తీసుకొచ్చేందుకు రెడీ అయిపోయారు. ఈ గురువారం బిగ్ స్క్రీన్‌పై రిలీజ్ కాబోతున్న ఈ మూవీ సంగతులేంటి? అసలు ఈ హీరోహీరోయిన్ ఎవరనేది చూద్దాం. (ఇదీ చదవండి: జ్యోతిక విడాకుల రూమర్స్.. ముంబైకి షిఫ్ట్.. అసలు కారణం ఇదేనా?) క్రికెట్ నేపథ్య కథతో చాలా సినిమాలు వచ్చాయి. ఇప్పుడు ఆ లిస్టులోకి చేరబోతున్న తమిళ సినిమా 'బ్లూ స్టార్'. అశోక్ సెల్వన్, పృథ్వీ పాండియరాజన్, దివ్య దురైస్వామి, కీర్తి పాండియన్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. గోవింద వసంత సంగీతమందించారు. ఎస్. రాజ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం.. జనవరి 25న తమిళంలో విడుదల కానుంది. అయితే సినిమాలో జంటగా నటించిన అశోక్ సెల్వన్-కీర్తి పాండియన్.. నిజ జీవితంలో నాలుగు నెలల క్రితమే భార్యభర్తలయ్యారు. కాబట్టి ఈ సినిమా వీళ్లకు స్పెషల్ అని చెప్పొచ్చు. 1990లో తమిళనాడులోని కుంభకోణం ఊరిలో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా 'బ్లూ స్టార్' తీసినట్లు దర్శకనిర్మాతలు చెప్పారు. ఇందులో సమకాలిన రాజకీయాలతో పాటు ప్రేమ, వినోదం లాంటి కమర్షియల్ అంశాలకు కూడా చోటు ఉంటుందని చెప్పారు. చిన్న సినిమా కాబట్టి ఓటీటీలోకి వచ్చినప్పుడే తెలుగు వెర్షన్ రిలీజ్ కావొచ్చు. (ఇదీ చదవండి: చెల్లి ఎంగేజ్మెంట్.. డ్యాన్స్‌తో దుమ్మురేపిన సాయిపల్లవి!) -
డైరెక్టర్ కమ్ హీరో కొత్త మూవీ.. డిఫరెంట్ కథతో..
కోలీవుడ్‌లో ప్రయోగాత్మక కథా చిత్రాలకు కేరాఫ్‌గా అడ్రస్‌గా మారిన దర్శక నటుడు రాధాకృష్ణన్ పార్తీపన్. ఈయన ఇటీవల స్వీయ దర్శకత్వంలో హీరోగా నటించిన చిత్రం ఇరవిన్ నిళల్. బయోపిక్ డ్రీమ్స్ అండ్ అకీరా ప్రొడక్షన్స్ బ్యానర్లో నిర్మితమైన ఈ మూవీ ప్రేక్షకాదరణ పొందడంతో పాటు పలు జాతీయ, అంతర్జాతీయ అవార్డులను గెలుచుకుంది. ఈయన తాజాగా ఓ ప్రయోగాత్మక చిత్రానికి రెడీ అయ్యారు. అదే టీన్స్ మూవీ. థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని బయోపిక్ డ్రీమ్స్ ఎల్ ఎల్పీ అండ్ అకీరా ప్రొడక్షన్స్ సంస్థల అధినేతలు కాల్డ్ వెల్ వేల్ నంబి, డాక్టర్ స్వామినాథన్, డాక్టర్ పిన్చీ శ్రీనివాసన్, రంజిత్ దండపాణి, కీర్తన పార్తీపన్ అక్కినేని నిర్మిస్తున్నారు. దీనికి డి.ఇమ్మాన్ సంగీతాన్ని, గవెమిక్ ఆర్వీ ఛాయాగ్రహణం అందిస్తున్నారు. శనివారం నాడు ఈ మూవీ పోస్టర్లు విడుదల చేశారు. ఈ సందర్భంగా పార్తీపన్ మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో మాట్లాడుతూ.. గత 30 ఏళ్లుగా తన చిత్రాలను ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు. అదే విధంగా తాజాగా టిన్స్ చిత్రం ద్వారా మీ ముందుకు రాబోతున్నానని, ఇది సరికొత్త ప్రయోగాత్మక కథా చిత్రంగా ఉంటుందన్నారు. ఈ చిత్రం ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను సంగీత దర్శకుడు డి.ఇమ్మాన్, ఛాయాగ్రాహకుడు గవెమిక్ ఆర్వీలతో కలిసి ఈనెల 20వ తేదీన విడుదల చేసినట్లు వెల్లడించారు. చదవండి: ప్రత్యేక విమానంలో అయోధ్యకు వెళ్లిన చిరంజీవి, చరణ్.. -
హిట్ డైరెక్టర్‌తో కార్తీ.. కొత్త సినిమాకు క్రేజీ టైటిల్
'విరుమాన్', 'సర్దార్', 'పొన్నియిన్ సెల్వన్' సినిమాలతో వరస హిట్లు కొట్టిన కార్తీ.. 'జపాన్'తో ఘోరమైన ప్లాఫ్ తన ఖాతాలో వేసుకున్నాడు. అయినా సరే దీన్ని పట్టించుకోకుండా ప్రస్తుతం రెండు సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. ఇందులో డైరెక్టర్ నలన్ కుమారస్వామి తీస్తున్న మూవీ ఒకటి కాగా.. '96' ఫేమ్ ప్రేమ్‌కుమార్ దర్శత్వం వహిస్తున్న చిత్రం మరొకటి. (ఇదీ చదవండి: ఎక్స్పోజింగ్ పాత్రలు ఆయన వల్లే చేశా.. బయటకు రాలేకపోయా: మీనా) కార్తీ లేటెస్ట్ మూవీని ఇతడి అన్న సూర్యనే నిర్మిస్తున్నాడు. గతంలో రెండు చిత్రాలు చేశాడు. ఇది హ్యాట్రిక్ మూవీ. ఇకపోతే కార్తీ-ప్రేమ్ కుమార్ కాంబోలో తీస్తున్న సినిమాకు గోవింద్ వసంత సంగీతమందిస్తున్నారు. ఇది తంజావూర్ ప్రజల జీవన విధానాన్ని ఆవిష్కరించే కథా చిత్రంగా ఉంటుందని సమాచారం. ఇకపోతే ఈ సినిమాకు 'దమెయ్యళగన్' టైటిల్ నిర్ణయించినట్లు సమాచారం. (ఇదీ చదవండి: ఓటీటీలోకి 'గుంటూరు కారం'.. అదే ట్విస్ట్ ఇవ్వబోతున్నారా?) -
తూక్కుదురై మూవీ ట్రైలర్
-
హీరోగా స్టార్ కమెడియన్.. మరో మాస్ చిత్రం రెడీ
తెలుగులో తక్కువ గానీ తమిళంలో పలువురు కమెడియన్స్ కూడా హీరోలుగా రాణిస్తున్నారు. సంతానం.. ఇలా ఇప్పటికే పలు చిత్రాలు చేస్తూ బిజీగా మారిపోయాడు. తాజాగా కమెడియన్ సూరి కూడా డిఫరెంట్ మూవీస్ చేస్తూ ప్రేక్షకుల్ని అలరించడానికి సిద్ధమైపోతున్నాడు. గతేడాది 'విడుదలై' మూవీతో హీరోగా ఆకట్టుకున్న ఇతడు.. ఇప్పుడు 'గరుడన్'గా వచ్చేందుకు రెడీ అయిపోయాడు. (ఇదీ చదవండి: ఓటీటీలో తెలుగు ప్రేక్షకుల్ని ఏడిపించేస్తున్న సినిమా.. మీరు చూశారా?) ప్రముఖ తమిళ దర్శకుడు వెట్రిమారన్ రాసిన స్టోరీతో 'గరుడన్' మూవీ తీశారు. ఇందులో సూరితో పాటు శశి కుమార్, ఉన్ని ముకుందన్ ప్రధాన పాత్రల్లో నటించారు. తాజాగా రిలీజ్ చేసిన టీజర్లో యువన్ శంకర్ రాజా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సూపర్ ఉంది. అలానే హీరోని కుక్కతో పోల్చుతూ చెప్పిన డైలాగ్స్, విజువల్స్ కూడా సినిమాపై అంచనాల్ని పెంచుతున్నాయి. త్వరలో విడుదల తేదీతో పాటు ఇతర వివరాలు వెల్లడించనున్నారు. (ఇదీ చదవండి: రష్మికతో ఎంగేజ్మెంట్పై క్లారిటీ ఇచ్చేసిన విజయ్ దేవరకొండ) -
మరో క్రేజీ కాన్సెప్ట్ మూవీతో వస్తున్న విజయ్ ఆంటోని
'బిచ్చగాడు' సినిమాలతో చాలా గుర్తింపు తెచ్చుకున్న తమిళ హీరో విజయ్ ఆంటోని. ఆయన హీరోగా యాక్ట్ చేసిన లేటెస్ట్ మూవీ 'హిట్లర్'. చెందూర్ ఫిలిం ఇంటర్నేషనల్ పతాకంపై టీడీ రాజా, డీఆర్ సంజయ్‌కుమార్ నిర్మించారు. ఈ చిత్రానికి కథ, దర్శకత్వం బాధ్యతలను ధన నిర్వహించారు. మణిరత్నం శిష్యుడైన ఈయన.. 'వానం కొట్టం' సినిమాతో డైరెక్టర్‌గా పరిచయమయ్యారు. తొలి చిత్రంతోనే ప్రశంసలు అందుకున్న ధన.. ఇప్పుడు 'హిట్లర్'తో రాబోతున్నారు. (ఇదీ చదవండి: రష్మికతో ఎంగేజ్మెంట్పై క్లారిటీ ఇచ్చేసిన విజయ్ దేవరకొండ) ఈ సినిమాలో ప్రియా సుమన్ హీరోయిన్ కాగా.. గౌతమ్ మేనన్, రెడిన్ కింగ్స్లీ, వివేక్, ప్రసన్న తదితర ఇతర పాత్రలు పోషించారు. వివేక్, మెర్విన్ల ద్వయం సంగీతమందించారు. త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. శుక్రవారం సాయంత్రం మూవీ టీమ్.. చైన్నెలోని ప్రసాద్ ల్యాబ్‌లో ప్రెస్ మీట్ పెట్టి పలు విషయాలు పంచుకున్నారు. ధన ఇంతకుముందు తీసిన 'వానం కొట్టం' చిత్రానికి తాను చాలా పెద్ద అభిమానినని.. ఈ చిత్రాన్ని చాలా తక్కువ రోజుల్లో అద్భుతంగా తెరపై ఆవిష్కరించారని .. ఒక వ్యక్తి సర్వాధికారాన్ని ప్రశ్నించే కథా చిత్రంగా 'హిట్లర్' ఉంటుందని హీరో విజయ్ ఆంటోని చెప్పుకొచ్చారు. (ఇదీ చదవండి: ఓటీటీలో తెలుగు ప్రేక్షకుల్ని ఏడిపించేస్తున్న సినిమా.. మీరు చూశారా?) -
ఎవరి మనోభావాలను దెబ్బతీయలేదు: యంగ్ డైరెక్టర్
ప్రముఖ కమెడియన్ కమ్ హీరో సంతానం లేటెస్ట్ మూవీ 'ఉడక్కపట్టి రామస్వామి'. దర్శకుడు కార్తీక్ యోగి తీసిన ఈ సినిమా ఫిబ్రవరి 2న రిలీజ్ కానుంది. టాలీవుడ్ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. ఈ చిత్రంలో మేఘాఆకాష్ హీరోయిన్గా నటించింది. ఇక రిలీజ్ దగ్గర పడిన నేపథ్యంలో గురువారం మధ్యాహ్నం చైన్నెలో ప్రెస్ మీట ఏర్పాటు చేసి సినిమా గురించి పలు విషయాల్ని చెప్పుకొచ్చారు. (ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి ఏకంగా 21 సినిమాలు) 'ఇది 1974లో జరిగే కామెడీ మూవీ. సంతానం మట్టికుండల వ్యాపారిగా.. మేఘా ఆకాష్ మిలటరీ డాక్టర్‌గా నటించారు చెప్పారు. మద్రాస్ ఐ అనే అంటువ్యాధి కొత్తగా వ్యాపిస్తున్న సమయాన్ని హీరో ఎలా తనకు అనుకూలంగా వాడుకుంటాడు అనే విషయాన్ని కామెడీతో మిక్స్ చేసి సినిమా తీశాం. ఇది ఎవరి మనోభావాలకు దెబ్బతీయదు' అని దర్శకుడు కార్తీక్ యోగి చెప్పుకొచ్చాడు. (ఇదీ చదవండి: 'హనుమాన్' తెచ్చిన జోష్.. రాముడి పాత్రలో మెగాహీరో రామ్ చరణ్?) -
సినిమాకు పాజిటివ్ టాక్.. ఆదియోగి సందర్శనలో హీరోహీరోయిన్
తమిళ హీరో అరుణ్ విజయ్ లేటెస్ట్ మూవీ 'మిషన్ ఛాప్టర్ 1'. అమీ జాక్సన్ హీరోయిన్. ఏఎల్ విజయ్ దర్శకత్వం వహించారు. ఎం.రాజశేఖర్, ఎస్.స్వాతి నిర్మించారు. భారీ యాక్షన్ ఎమోషనల్ కథతో తీసిన ఈ సినిమాలో అరుణ్ విజయ్ జై దుర్గ అనే పాత్రలో.. అమీ జాక్సన్ లండన్‌లోని జైలు అధికారిగా నటించారు. (ఇదీ చదవండి: పెళ్లి చేసుకోబోతున్న హీరోయిన్ సాయిపల్లవి చెల్లి.. కుర్రాడు ఎవరంటే?) తన కుమార్తె వైద్య చికిత్స కోసం లండన్ వెళ్లిన అరుణ్ విజయ్.. అక్కడ జైలు పాలు అవడం, అక్కడ కొందరు పాకిస్తాన్‌కు చెందిన కరుడుగట్టిన నేరగాళ్లు జైలు నుంచి తప్పించుకునే ప్రయత్నం చేయడం, దాన్ని అరుణ్‌విజయ్ అడ్డుకోవడం, దాంతో ఆయన మరో పోరాటానికి సిద్ధం కావలసి రావడం వంటి పలు ఉత్కంఠ భరితమైన సన్నివేశాలతో సాగే కథనే ఈ సినిమా. లైకా ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ సినిమా.. సంక్రాంతి కానుకగా తమిళంలో ఈనెల 12న విడుదలైంది. అయితే చిత్రానికి పాజిటివ్ టాక్ రావడంతో హీరోహీరోయిన్లతో పాటు దర్శకుడు ఏఎల్ విజయ్.. ఆదియోగి విగ్రహ సందర్శనకు వెళ్లారు. ఈశా ఫౌండేషన్‌కు వెళ్లిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. (ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు రొమాంటిక్ సినిమా.. స్ట్రీమింగ్ అందులోనే?) View this post on Instagram A post shared by Arun Vijay (@arunvijayno1) -
యంగ్ హీరో కొత్త సినిమా... ఆ స్టార్ డైరెక్టర్‌తో కలిసి
తమిళ యంగ్ హీరో విష్ణు విశాల్ కొత్త సినిమాని ప్రకటించాడు. ప్రస్తుతం ఐశ్వర్యా రజనీకాంత్ దర్శకత్వంలో 'లాల్ సలామ్'లో హీరోగా నటించాడు. ఇది జనవరి చివరి వారంలో థియేటర్లలోకి రానుంది. దీనితో పాటు 'ఆర్యన్' అనే యాక్షన్ ఎంటర్టైనర్ కూడా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పుడు మరో స్టార్ డైరెక్టర్‌తో కొత్త మూవీ చేయడానికి రెడీ అయిపోయాడు. (ఇదీ చదవండి: ఆ ఫొటో పోస్ట్ చేసి గుడ్‌న్యూస్ చెప్పిన లావణ్య త్రిపాఠి) విష్ణు విశాల్ హీరోగా చేస్తూనే పలు సినిమాలని నిర్మించాడు కూడా. ఇప్పుడు కూడా డైరెక్టర్ గోకుల్‌తో చేయబోయే మూవీలో నటిస్తూ నిర్మిస్తున్నాడు. రౌద్రం, కాష్మోరా లాంటి చిత్రాలతో ఆకట్టుకున్న గోకుల్.. ఇప్పుడు విష్ణు విశాల్‌తో ఎలాంటి మూవీ తీస్తాడనేది ఆసక్తికరంగా మారింది. ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ ప్రారంభమైంది. త్వరలో ఇతర నటీనటులు, సాంకేతిక వర్గం వివరాలని వెల్లడించనున్నారు. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 29 సినిమాలు) Extremely happy to share the official announcement of my next - joining hands with @DirectorGokul for a BADASS entertainer ❤️ Got really excited on hearing this wacky, high octane action script based on a true story. Can't wait to get started soon. #VVStudioz10#RiseandShine… pic.twitter.com/Row3hgfE74 — VISHNU VISHAL - VV (@TheVishnuVishal) January 8, 2024 -
నా భర్త చెబితేనే బోల్డ్ సినిమాలో నటించా: హీరోయిన్
సాధారణంగా పెళ్లి తర్వాత హీరోయిన్లు సినిమాలకు దూరమవుతారు. ఒకవేళ సినిమాల్లో నటించినా.. అసభ్యకర సన్నివేశాలు..రొమాంటిక్ సీన్స్ లేకుండా జాగ్రత్త పడతారు. కానీ హీరోయిన్ ఆనంది మాత్రం ఇందుకు మినహాయింపు. పెళ్లి అయిన తర్వాత కూడా బోల్డ్ సినిమాలో నటించింది. అయితే అది మంచి సందేశాత్మక చిత్రం కావడం వల్లే తాను అలా నటించానని చెబుతోంది. అంతేకాదు ఆ సినిమాలో నటించాలని తన భర్త ప్రోత్సహించాడట. ఆ తమిళ సినిమా పేరు మంగై. మంగై అంటే తెలుగులో పడుచు పిల్ల అని అర్థం. మున్నార్ నుంచి చెన్నైకి ఒంటరిగా ప్రయాణిస్తున్న ఓ అమ్మాయి ఎలాంటి పరిస్థితులను ఫేస్ చేసింది. ఆమె అనుభవాలు ఏంటనేది ఈ సినిమా కథ. ఓ ఆడపిల్లను మగాడు చూసే కోణంలో ఈ సినిమా సాగుతుందని మేకర్స్ తెలిపారు. తాజాగా విడుదలైన ఫస్ట్‌లుక్ పోస్టర్ కూడా ఈ సినిమా కథనం ఎలా సాగుతుందో తెలియజేస్తుంది. అయితే ఈ సినిమా కథ విన్నప్పుడు ఆనంది నటించలేనని చెప్పిందట. మంచి సందేశాత్మక చిత్రమే అయినప్పటికీ.. బోల్డ్ సన్నివేశాలు, డైలాగ్స్ ఉన్నాయట. దీంతో తొలుత ఆనంది ఈ కథను రిజెక్ట్ చేసిందట. కానీ ఆమె భర్త మాత్రం ఓ నటిలాగా ఆలోచించమని చెప్పారట. ఆయన ప్రోత్సాహం వల్లే చాలా కంపర్ట్‌గా ఈ సినిమాలో నటించానని ఓ ఇంటర్వ్యూలో ఆనంది చెప్పింది. ఇక ఆనంది విషయానికొస్తే.. తమిళ సినిమాలతో బాగా పాపులర్ అయిన తెలుగమ్మాయి. ఈమె స్వస్థలం తెలంగాణాలోని వరంగల్ జిల్లా. తెలుగులో చాన్స్‌లు రాకపోవడంతో కోలీవుడ్‌కి వెళ్లి అక్కడ వరుస సినిమాలతో స్టార్ హీరోయిన్గా పేరు తెచ్చుకుంది. అసలు పేరు రక్షిత. అయితే సినిమాల్లోకి వచ్చిన తర్వాత తన పేరును హాసికగా మార్చుకున్నారు. ఆ పేరు కలిసి రాక ఆనందిగా మార్చుకుంది. 2021లో తమిళ కో డైరెక్టర్ సోక్రటీస్ ని పెళ్లి చేసుకుంది. తెలుగులో జాంబీరెడ్డి, ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం, శ్రీదేవి సోడా సెంటర్ లాంటి సినిమాల్లో నటించింది. -
రూట్ మార్చిన హాట్ బ్యూటీ.. ఏకంగా అలాంటి ఫొటోలతో
సినిమా హీరోహీరోయిన్ లైఫ్ అంటే జయాపజయాల మధ్య ఊగుతుంటుంది. హిట్‌వస్తే ఒకలా లేదంటే మరోలా ఉంటుంది. అయితే కొందరి విషయంలో హిట్స్ వచ్చినా అవకాశాలు రాకపోవడం జరుగుతోంది. అందుకోసం వాళ్లు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. ప్రముఖ తమిళ నటి రమ్య పాండియన్ పరిస్థితి ఇలానే తయారైంది. తొలుత పలు టీవీ సీరియల్స్‌లో నటించిన పాపులర్ అయిన ఈమె.. బిగ్‌బాస్, కుక్ విత్ కోమలి తదితర రియాల్టీ షోల్లో పాల్గొని ఫేమ్ తెచ్చుకుంది. (ఇదీ చదవండి: ఓటీటీలోకి 'యానిమల్'.. అనుకున్న టైమ్ కంటే ముందే స్ట్రీమింగ్?) ఇక ఫుల్ క్రేజ్ రావడంతో సినిమాల్లో అవకాశాలు తలుపుతట్టాయి. అలా 'డమ్మీ పటాస్' మూవీతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. ఇది పెద్దగా గుర్తింపు తీసుకురానప్పటికీ దీని తర్వాత 'జోకర్' హిట్ అయింది. ఇందులో రమ్య పాండియన్ గ్రామీణ యువతిగా నటించి ప్రశంసలు అందుకుంది. ఆ చిత్రం కూడా జాతీయ ఉత్తమ చిత్రంగా అవార్డును గెలుచుకుంది. అయితే హిట్ సినిమాలో నటించినప్పటికీ రమ్యకు అవకాశాలు రావడం చాలా కష్టమైపోతుంది. గతేడాది మమ్ముట్టి లాంటి స్టార్ హీరో సినిమాలో హీరోయిన్గా చేసిన ఫలితం లేకుండా పోయింది. దీంతో అవకాశాల కోసం రూట్ మార్చింది. అందాలు కనిపించేలా స్పెషల్ ఫొటోషూట్ చేయించి, ఆ ఫొటోల్ని ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. ఇవి చూసైనా సరే దర్శకనిర్మాతలు ఈమెకి ఛాన్సులు ఇస్తారేమో చూడాలి. (ఇదీ చదవండి: కేటుగాళ్ల దెబ్బకు మోసపోయిన అవార్డ్ విన్నింగ్ తెలుగు హీరోయిన్) View this post on Instagram A post shared by SriRamya Paandiyan (@actress_ramyapandian) View this post on Instagram A post shared by SriRamya Paandiyan (@actress_ramyapandian) -
ఈ-మెయిల్ మూవీ టీజర్
-
కొత్త సినిమా టీజర్.. యాక్షన్‌తో అదరగొట్టేసిన ఆ హీరోయిన్
ప్రముఖ కన్నడ నటి రాగిణి ద్వివేది ప్రధాన పాత్రలో నటించిన కొత్త మూవీ 'ఈ-మెయిల్'. మురుగ అశోకన్ హీరోగా చేశాడు. ఇందులో హిందీ, భోజ్‌పురి మూవీస్ ఫేమ్ ఆర్తి శ్రీ, ఆదవ్ బాలాజీ, అక్షయ్‌కుమార్, తదితరులు ఇతర పాత్రలు పోషించారు. ఎస్సార్ రాజన్ దర్శకత్వం వహించిన ఈ మూవీ త్వరలో థియేటర్లలోకి రానుంది. (ఇదీ చదవండి: 'గుంటూరు కారం' పాట.. కుర్చీ తాతకి రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?) ఈ క్రమంలోనే చిత్ర టీజర్‌ను ప్రముఖ తమిళ నటుడు విజయ్ సేతుపతి రిలీజ్ చేశారు. ఇక మూవీ గురించి మాట్లాడిన దర్శకుడు... ప్రస్తుతం ఎందరో ప్రాణాలను బలిగొంటున్న ఆన్లైన్ గేమ్స్ మోసాల కాన్సెప్ట్‌తో తీసిన మూవీ ఇదని అన్నాడు. యాక్షన్, సెంటిమెంట్, కామెడీ, సస్పెన్స్, థ్రిల్లర్.. అన్ని అంశాలను ఉంటాయని చెప్పుకొచ్చాడు. (ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన ఆ హిట్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్) -
హీరోగా కాంట్రవర్సీ నటుడు మన్సూర్.. అలాంటి సినిమాలో
నటుడు మన్సూర్ అలీఖాన్ పేరు ఈ మధ్య తెగ వినిపించింది. విలన్ పాత్రలతో గుర్తింపు తెచ్చుకున్న ఇతడు.. నిజ జీవితంలోనూ విలన్‌గా ప్రవర్తించాడు. 'లియో' మూవీలో ఓ సీన్లో హీరోయిన్ త్రిషని మానభంగం చేయాలని ఉందని మైండ్ పోయే కామెంట్స్ చేశాడు. ఈ మాటల వల్ల కోర్టు, కేసులని గొడవ చాలా దూరం పోయింది. ప్రస్తుతం దాని గురించి అందరూ మర్చిపోయారు. అయితే మన్సూర్ హీరోగా నటించిన ఓ సినిమా తాజాగా రిలీజైంది. (ఇదీ చదవండి: స్టార్ హీరోయిన్ మాజీ భర్తపై దాడి చేసిన యువకుడు) సరక్కు పేరుతో తమిళంలో మాత్రమే రిలీజైన ఈ సినిమాలో మన్సూర్ అలీఖాన్ న్యాయవాదిగా నటించాడు. మద్యానికి బానిసై, డబ్బు కోసం అందరినీ మోసం చేస్తూ, కుటుంబాన్ని కూడా సరిగా పట్టించుకోని వ్యక్తి పాత్రలో మన్సూర్ నటించాడు. ఇది చూస్తే మన్సూర్ నిజ జీవిత పాత్రలా అనిపించింది పలువురు ప్రేక్షకులు కామెంట్స్ చేస్తున్నారు. అయితే మన్సూర్ హీరో కావడం, మద్యం కాన్సెప్ట్ మూవీ కావడంతో ఇది కాస్త ఆసక్తికరంగా అనిపించింది. (ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన ఆ హిట్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్) -
స్టార్ హీరోయిన్ మాజీ భర్తపై దాడి చేసిన యువకుడు
హీరో విజయకాంత్ చనిపోవడంతో, ఆయనకు నివాళి అర్పించడానికి వెళ్లిన దళపతి విజయ్‌పై ఓ వ్యక్తి చెప్పుతో దాడి చేశారు. ఈ విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయిపోయింది. దీని గురించి అందరూ అనుకునేలోపే తాజాగా మరో సంఘటన వైరల్ అయింది. ప్రముఖ దర్శకుడు-స్టార్ హీరోయిన్ మాజీ భర్త కారుపై ఓ వ్యక్తి దాడి చేశాడు. రోడ్డుపై చాలా పెద్ద గొడవ పడ్డాడు. (ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన ఆ హిట్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్) 'నాన్న' సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న తమిళ దర్శకుడు ఏఎల్ విజయ్.. హీరోయిన్ అమలాపాల్‌ని 2014లో పెళ్లి చేసుకున్నాడు. కానీ మనస్పర్థల కారణంగా 2017లో విడిపోయారు. ఆ తర్వాత 2019లో ఐశ్వర్య అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్న విజయ్.. ప్రస్తుతం ఫ్యామిలీ లైఫ్, కెరీర్ పరంగా బిజీగా ఉన్నారు. ఈయన తీసిన 'మిషన్ చాప్టర్-1' సినిమా సంక్రాంతికి రిలీజ్ కానుంది. అయితే మూడు నాలుగు రోజుల ముందు చెన్నైలో వెళ్తుండగా, ఓ వ్యక్తి వచ్చిన ఏఎల్ విజయ్ కారుపై దాడి చేశాడు. ఆ సమయంలో కారులో డైరెక్టర్ విజయ్‌తోపాటు మేనేజర్ మణివర్మ, అసిస్టెంట్ డైరెక్టర్స్ ఉన్నారు. కారుకి అడ్డుగా వచ్చిన ఆ వ్యక్తి.. ఏఎల్ విజయ్‌తో వాగ్వాదానికి దిగాడు. హెల్మెట్‌తో పలుమార్లు కారుపై కొట్టాడు. ఈ దాడిలో మేనేజర్‌కి స్వల్ప గాయాలైనట్లు డైరెక్టర్ చెప్పాడు. ప్రస్తుతం ఆ వ్యక్తి.. పోలీసుల అదుపులోనే ఉన్నాడు. (ఇదీ చదవండి: Bubblegum Review: 'బబుల్ గమ్' సినిమా రివ్యూ) இயக்குனர் AL VIJAY-யிடம் மதுபோதையில் தகராறு செய்த நபர்.#ALVijay #Accident #Galatta pic.twitter.com/xuIP8J7RXJ — Galatta Media (@galattadotcom) December 27, 2023 -
ఓటీటీలోకి వచ్చేసిన ఆ హిట్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్
ఓటీటీలోకి మరో క్రేజీ మూవీ వచ్చేసింది. మనలో చాలామందికి తెలిసిన సమస్యని సినిమాగా తీశారు. తక్కువ బడ్జెట్‌తో చాలా సింపుల్ కాన్సెప్ట్‌తో తీసిన ఈ చిత్రం ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. హిట్ అయిపోయింది. ఇప్పుడీ సినిమానే నెలరోజుల్లో ఓటీటీలోకి తీసుకొచ్చేశారు. తాజాగా ఇది డిజిటల్ ఆడియెన్స్‌కి కూడా అందుబాటులోకి వచ్చేసింది. ఇంతకీ ఏంటా సినిమా? ఏ ఓటీటీలో రిలీజైంది? (ఇదీ చదవండి: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు థ్రిల్లర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?) ఓటీటీలో ఆ సినిమా జనాభా పెరిగిపోయింది. అందరి దగ్గర టూ-ఫోర్ వీలర్స్ ఉంటున్నాయి. వాడకం బాగానే ఉంది గానీ ప్రతి ఒక్కరికీ పార్కింగ్ ప్రాబ్లమ్ వస్తుంది. ఇప్పుడు ఇదే అంశాన్ని తీసుకుని తమిళంలో 'పార్కింగ్' పేరుతో ఓ మూవీ తీశారు. 'జెర్సీ'లో నాని కొడుకుగా చేసిన హరీశ్ కల్యాణ్.. ఇందులో హీరోగా చేశాడు. డిసెంబరు 1న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం ఇప్పుడు హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అయిపోతుంది. తెలుగు వెర్షన్ కూడా అందుబాటులో ఉంది. ఈ వీకెండ్ దీన్ని చూస్తూ టైమ్ పాస్ చేసేయొచ్చు. కథేంటి? సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేసే హీరో. ఓ ఇంట్లో అద్దెకు ఉంటాడు. పెళ్లయిన తర్వాత కొత్త కారు కొంటాడు. అయితే ఉంటున్న ఇంట్లో పార్కింగ్ సమస్య వస్తుంది. హౌస్ ఓనర్-హీరో ఒకరినొకరు రక్తాలొచ్చేలా కొట్టుకునేంతవరకు.. ఇంకా చెప్పాలంటే పోలీస్ కేసుల వరకు వెళ్తారు. మరి ఈ పార్కింగ్ సమస్యని వీరిద్దరూ ఎలా పరిష్కరించారు? చివరకు ఏమైందనేదే స్టోరీ. (ఇదీ చదవండి: అనుకున్న టైమ్ కంటే ముందే ఓటీటీలోకి 'హాయ్ నాన్న'.. స్ట్రీమింగ్ డేట్?) -
వేలాదిమంది ప్రాణాలు కాపాడిన డాక్టర్.. ఇప్పుడు హీరోగా!
కరోనా కాలంలో వేలాది మంది ప్రాణాలను తన ఉచిత సిద్ధ వైద్యంతో కాపాడిన డాక్టర్ వీరబాబు ఇప్పుడు చిత్ర రంగప్రవేశం చేశారు. ఈయన కథానాయకుడిగా నటించడంతో పాటు, స్వీయ దర్శకత్వంలో వయల్ మూవీస్ పతాకంపై నిర్మించిన చిత్రం 'ముడకరుత్తాన్'. నటి మహానా హీరోయిన్గా నటించిన ఇందులో సముద్రఖని, శ్యామ్, కాదల్ సుకుమార్ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈ నెల 29వ తేదీన తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. పైసా ఫీజు తీసుకోకుండా తిండి, వైద్యం ఈ సందర్భంగా సోమవారం సాయంత్రం చైన్నెలోని ప్రసాద్ ల్యాబ్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో రాజకీయ నాయకుడు తమళరువి మణియన్, దర్శక నటుడు సముద్రఖని, తంగర్ బచ్చన్ తదితర సినీ ప్రముఖులు అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా తమిళరువి మణియన్ మాట్లాడుతూ.. కరోనాకు గురైన తనను, తన భార్యను పైసా ఫీజు కూడా తీసుకోకుండా 28 రోజులు మూడు పూటలా భోజనం పెట్టి సంపూర్ణంగా కరోనా నుంచి విముక్తి చేసిన సిద్ధ వైద్యుడు వీరబాబు అని పేర్కొన్నారు. అలాంటి ఆయన ఈ సినిమా రంగంలోకి రావడం సరికాదనేది తన అభిప్రాయం అన్నారు. సినిమా సక్సెస్ అవ్వాలి అయినప్పటికీ ఆయన ఒక మంచి సందేశాన్ని ప్రేక్షకులకు అందించాలనే సదాశయంతో ఈ చిత్రాన్ని నిర్మించారు. కాబట్టి అది నెరవేరాలనీ, పెట్టిన పెట్టుబడి తిరిగి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. చిత్ర దర్శక నిర్మాత, కథానాయకుడు వీరబాబు మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రజలకు నెలకు వెయ్యి రూపాయలు ఇవ్వడం వల్ల ప్రయోజనం లేదన్నారు. మంచి వైద్యం వంటి కనీస సౌకర్యాలను కల్పించాలన్నారు. ముఖ్యంగా లక్షల ఖర్చుతో పేదలను పీడించే ఇంగ్లిష్ వైద్యం కంటే తమిళ (సిద్ద) వైద్యాన్ని ప్రోత్సహించాలని చెప్పే ప్రయత్నం ఈ చిత్రం ద్వారా చేసినట్లు చెప్పారు. చదవండి: 'సలార్' బ్యూటీ శృతిహాసన్ పెళ్లిగోల.. అతడు బయటపెట్టడంతో! -
హీరో అయిపోయిన యంగ్ డైరెక్టర్.. ఏకంగా అలాంటి సినిమా
తమిళ యంగ్ డైరెక్టర్ సంతోష్ పి.జయకుమార్ కొత్త సినిమాకు 'ద బాయ్స్' అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఓ వీడియోని కూడా రిలీజ్ చేశారు. ఈ దర్శకుడే ఇందులో హీరోగా నటిస్తుండటం విశేషం. డార్క్ రూమ్ పిక్చర్స్, నోవా ఫిలిం స్టూడియోస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఇందులో 'జైలర్' హర్షద్, యార్ వినోద్, సారా, యువరాజ్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. (ఇదీ చదవండి: Bigg Boss 7 విన్నర్ పల్లవి ప్రశాంత్ షాకింగ్ డెసిషన్.. వాళ్లపై రివేంజ్!?) అయితే ఈ సినిమాలో హీరో అంటూ ఎవరూ ఉండరని దర్శకుడు చెప్పాడు. ఇది ఐదుగురు బ్యాచిలర్స్ మధ్య జరిగే సంఘటనల ఆధారంగా తీసిన సినిమాని చెప్పుకొచ్చాడు. యుక్త వయసులో దురాలవాట్ల కారణంగా వారి భవిష్యత్తు ఎలా ఉంటుందని చెప్పే కథ ఇదని అన్నాడు. అరుణ్, గౌతమ్ కాంబో సంగీతాన్ని అందించారు. అయితే తాజాగా రిలీచ్ చేసిన టైటిల్ రివీల్ మంచి ఫన్నీగా ఉంది. రాబోయే ఫిబ్రవరిలో ఈ సినిమా థియేటర్లలోకి రానుంది. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 27 సినిమాలు రిలీజ్) -
ప్రముఖ నటుడి ఇంట్లో చోరీ.. నగదు, బంగారం మాయం!
ప్రముఖ టీవీ నటుడి ఇంట్లో చోరీ జరిగింది. తమిళనాడుకు చెందిన శబరినాథన్.. పలు సీరియల్స్‌లో నటిస్తున్నాడు. సేలం కోరిమేడు సమీపంలోని బృందావనం గార్డెన్ ఏరియాలో నివాసం ఉంటున్నాడు. గత నెల 23న చిన్నాన్న అంత్యక్రియలకు హాజరయ్యేందుకు శబరినాథన్ కుటుంబ సభ్యులు. ఇంటికి తాళం వేసి పనమరుత్తుపట్టికి వెళ్లారు. తిరిగి 24వ తేదీన అందరూ ఇంటికి వచ్చారు. అయితే శబరినాథన్ ఫ్యామిలీ తిరిగొచ్చే సమయానికి ఇంటి తాళం పగలగొట్టి, తలుపులు తెరిచి ఉన్నాయి. లోపలికి వెళ్లి పరిశీలించగా.. రూ.లక్ష నగదు, 5 గోల్డ్ కాయిన్స్, కొన్ని వెండి వస్తువులు చోరీకి గురైనట్లు గుర్తించారు. వెంటనే అలగాపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదుతో దర్యాప్తు చేపట్టగా దొంగ దొరికాడు. ధర్మపురికి చెందిన మణికంఠన్.. ఈ చోరీకి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. ఇతడిని అరెస్ట్ చేసి, సెంట్రల్ జైలుకి తరలించారు. -
స్టార్ డైరెక్టర్ కొత్త మూవీ.. ఎంట్రీ ఇస్తున్న స్టార్ హీరో కొడుకు
'పాలై పొళుదుమ్ ఉన్నోడు', 'సాలైయోరమ్' లాంటి అద్భుతమైన సినిమాలు తీసిన దర్శకుడు కే.మూర్తి కన్నన్ కొత్త సినిమాకు రెడీ అయ్యారు. ఈసారి పూర్తిస్థాయి కామెడీ స్టోరీని ఎంచుకున్నారు. స్మైలీ పిక్చర్స్ పతాకంపై ఎం.వసంతి, కె.కావ్య పెరుమాళ్ సంయుక్తంగా నిర్మించనున్నారు. ఈ చిత్రం గురించి మాట్లాడిన డైరెక్టర్.. ఒక ప్రముఖ నటుడి వారసుడిని హీరోగా పరిచయం చేస్తున్నట్లు చెప్పుకొచ్చాడు. (ఇదీ చదవండి: బిగ్‌బాస్ 7: స్ట్రాంగ్ కంటెస్టెంట్ అర్జున్ ఎలిమినేట్!) కూత్తుపట్రైలో శిక్షణ పొందిన ఎన్ టి.సెంథిల్ అనే మలేషియా తమిళుడిని ఈ చిత్రంలో ముఖ్యపాత్ర ద్వారా పరిచయం చేస్తున్నట్లు చెప్పారు. ఇప్పటివరకు తమిళ తెరపై రానటువంటి డిఫరెంట్ కామెడీ, థ్రిల్లర్ కథతో ఈ సినిమా తీయబోతున్నట్లు పేర్కొన్నారు. ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయని, త్వరలోనే షూటింగ్ ప్రారంభిస్తామని దర్శకుడు మూర్తి కన్నన్ తెలిపారు. (ఇదీ చదవండి: బిగ్‌బాస్: ప్రశాంత్‌కు బంపరాఫర్ ఇచ్చిన శ్రీముఖి) -
సినిమా నిర్మించి రూ.2 కోట్లు నష్టపోయా: యంగ్ హీరో
తమిళసినిమా: యువ నటుడు ఆదవా ఈశ్వరా కథనాయకుడిగా నటించి, కేఎస్ఆర్ ఫిలిండమ్ పతాకంపై నిర్మించిన చిత్రం భాయ్. నటి శ్రీఇనియా నాయకిగా నటించిన ఈ చిత్రానికి కమల్ నాథన్ భువన్ దర్శకత్వం వహించారు. నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఫిబ్రవరి నెలలో తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. ఈ సందర్భంగా బుధవారం ఉదయం చిత్ర ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని చైన్నెలోని ప్రసాద్ ల్యాబ్‌లో నిర్వహించారు. ఇందులో నిర్మాత, నటుడు కే.రాజన్, దర్శకుడు పేరరసు, నటుడు జీవా, తమిళనాడు పాత్రికేయుల సంఘం అధ్యక్షుడు సుభాష్ తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొని చిత్ర ట్రైలర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చిత్ర కథానాయకుడు, నిర్మాత ఆదవా ఈశ్వరా మాట్లాడుతూ తాను ఇంతకు ముందు రూ.2 కోట్లు ఖర్చుతో చిత్రాన్ని నిర్మించానన్నారు. అయితే అది ఇప్పటికీ విడుదల కాకపోవడంతో పెట్టిన పెట్టుబడి మొత్తాన్ని నష్టపోయానన్నారు. ఆ తరువాత హీరోగా నటించిన చిత్రం సరిగా ఆడలేదన్నారు. తాజాగా భాయ్ చిత్రాన్ని చేసినట్లు చెప్పారు. ఇక్కడ చిన్న చిత్రాలకు ప్రోత్సాహం, ఆదరణ లేవన్నారు. చిన్న చిత్రాలను ఆదరిస్తేనే మరి కొందరు కొత్త నిర్మాతలు వస్తారని అన్నారు. తనకు సినిమా మినహా వేరే వృత్తి తెలియదన్నారు. అందుకే నష్టపోయినా, మళ్లీ మళ్లీ చిత్రాలు చేస్తున్నట్లు చెప్పారు. తాను ఊటీలో రెండో క్లాస్ చదువుతున్న సమయంలో కోయంబత్తూర్‌లో బాంబ్ బ్లాస్ట్ సంఘటన జరిగిందన్నారు. అది తమ ఇంటి వెనుక భాగంలో జరగడంతో ఆందోళనకు గురయ్యానన్నారు. ఆ ఘటనకు తమ ఇళ్లు, డబ్బు అంతా నాశనం అయ్యిందన్నారు. అలాంటి బాంబ్ బ్లాస్టర్లు ఎందుకు జరుగుతున్నాయో తెలియదన్నారు. అయితే ఎందరో అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని చెప్పారు. అలాంటి ఇతి వృత్తంతో తెరకెక్కించిన చిత్రం భాయ్ అని చెప్పారు. ఇది మానవత్వం ప్రదానాంశంగా రూపొందించిన కథా చిత్రం అని ఆదవా ఈశ్వరా తెలిపారు.అయితే చిత్ర నిర్మాణంలో పలు సమస్యలను ఎదురొడ్డి పూర్తి చేసినట్లు ఆయన చెప్పారు. -
లవ్ టుడే హీరోయిన్ కొత్త సినిమా.. పోస్టర్ చూశారా?
జీఎస్ సినిమా ఇంటర్నేషనల్ పతాకంపై మంద్ర వీరపాండియన్ దర్శకత్వం వహించిన చిత్రం మదిమారన్. ఈయన ప్రముఖ దర్శకుడు బాల శిష్యుడు. హీరో వెంకట్ సెంగుట్టవన్, లవ్ టుడే హీరోయిన్ ఇవానా ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్ర ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను ఆదివారం విడుదల చేశారు. థ్రిల్లర్ జానర్లో రూపొందుతున్న ఈ సినిమా గురించి చిత్రయూనిట్ మాట్లాడుతూ.. డోంట్ జడ్జ్ ఎ బుక్ బై ఇట్స్ కవర్ (పుస్తకం కవర్ పేజ్‌ను చూసి దానికి వెల కట్టకూడదు) అనే సామెతను నేపథ్యంగా తీసుకుని రూపొందిస్తున్న కథా చిత్రం ఇదని పేర్కొంది. తనతో పాటు పుట్టిన (కవల పిల్లలుగా) సహోదరి కోసం వెతికే హీరో ఇతివృత్తమే ఈ చిత్రం అని తెలిపింది. ఈ సినిమా ప్రేక్షకులకు వినూత్న అనుభవాన్ని కలిగిస్తుందని నమ్మకం ఉందని ఆశాభావం వ్యక్తం చేసింది. నటి ఆరాధ్య, ఎంఎస్ భాస్కర్, ఆరుగళం నరేన్, బాబా చెల్లదురై, ప్రవీణ్‌కుమార్, సుదర్శన్, గోవింద్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. త్వరలోనే చిత్ర ట్రైలర్‌ను, ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు యూనిట్ సభ్యులు తెలిపారు. కాగా మదిమారన్ సినిమా తమిళనాడు విడుదల హక్కులను బాబిన్స్ స్టూడియోస్ సంస్థ చేజిక్కించుకున్నట్లు చెప్పారు. ఈ మూవీకి కార్తీక్ రాజా సంగీతాన్ని, ప్రవేశ్, కె ఛాయాగ్రహణం అందించారు. Ivana’s #Mathimaaran, A story like never before! Releasing in theaters this December pic.twitter.com/YitgFWokXS — Christopher Kanagaraj (@Chrissuccess) December 10, 2023 చదవండి: రూ. 2 వేల కోట్లకు పైగా మోసం కేసులో సినీ నటుడు -
అలాంటి వాళ్లు రాజకీయాల్లోకి రావాలి: యంగ్ హీరో
దళపతి విజయ్.. రాజకీయాల్లోకి రావడం తన వ్యక్తిగత కోరిక అని, ఎవరు వచ్చినా సుపరిపాలన అందిస్తే బాగుంటుందని.. అలాంటి వాళ్లే పాలిటిక్స్‌లోకి రావాలని యంగ్ హీరో హరీశ్ కల్యాణ్ అన్నాడు. తాజాగా 'పార్కింగ్' మూవీతో థియేటర్లలోకి వచ్చాడు. ఈ క్రమంలోనే తమిళనాడు వ్యాప్తంగా థియేటర్లని సందర్శిస్తున్నాడు. ఈరోడ్‌లోని అన్నా థియేటర్లో ప్రేక్షకులతో కలిసి హీరో హరీశ్ కల్యాణ్ తన మూవీ చూశాడు. తమిళ యాక్టర్స్.. వర్ష ప్రభావ బాధితులకు వీలైనంత సాయం చేస్తున్నారని చెప్పాడు. వరద బాధితుల కోసం ముఖ్యమంత్రి సహాయనిధికి తన వంతు సాయంగా లక్ష రూపాయలు, 'పార్కింగ్' మూవీ టీమ్ తరఫున రూ.2 లక్షలు ఇచ్చినట్టు హరీస్ చెప్పుకొచ్చాడు. (ఇదీ చదవండి: సెన్సార్ పూర్తి చేసుకున్న సలార్.. పిల్లలకు థియేటర్లలోకి నో ఎంట్రీ!) -
డాన్స్ డాన్ గురు స్టెప్స్ అవార్డుల వేడుక
1950 నుంచి 2023 వరకు ఇండియన్ సినిమాలో డ్యాన్స్, సాంగ్స్ లేని సినిమా లేదు. వీటికి సినిమాలో అంత ప్రాధాన్యం ఉంటుంది. అలా ఈ నృత్య రంగంలో ఎందరో ప్రతిభావంతులు విశేష సేవలు అందించారు. అలాంటి వారి గురించి ఈ డిజిటల్ యుగంలో చాలా మందికి తెలియదు. వారి గురించి వారి సేవల గురించి వివరించే విధంగా ఈ నెల 30వ తేదీన చైన్నెలో ప్రముఖ నృత్య దర్శకుడు, కలైమామణి శ్రీధర్ మాస్టర్ నేతృత్వంలో డాన్స్ డాన్ గురు స్టెప్స్ కోలీవుడ్ అవార్డ్స్ పేరుతో అవార్డుల ప్రధాన కార్యక్రమం బ్రహ్మాండంగా జరగనుంది. దీనికి సంబంధించిన వివరాలను తాజాగా చెన్నై మీడియా మీటింగ్ ఏర్పాటు చేశారు. (ఇదీ చదవండి: Bigg Boss 7: ప్రశాంత్ మోసాన్ని బయటపెట్టిన నాగ్.. శివాజీ వరస్ట్ బిహేవియర్!) ఇందులో మాస్టర్‌తో పాటు అక్షర శ్రీధర్, అశోక్, భాస్కర్, లలితమణి, కుమార్ శాంతి, వసంత, విమల, సంపత్, హరీష్ కుమార్, మాలిని, వీకేఎస్ బాబు తదితర నృత్య దర్శకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సినిమా ప్రారంభ కాలం నుంచి పలువురికి డాన్సులు శిక్షణ ఇచ్చిన నృత్య డాన్స్‌ల ప్రతిభ గురించి వారి చరిత్ర గురించి వివరించే విధంగా ఈ కార్యక్రమం ఉంటుందన్నారు. ఈ కళా రంగంలో మనకు ముందు సాధించిన కళాకారుల సాధన గౌరవించే విధంగా వారి చరిత్రను తెలియజేస్తూ స్మరించుకునే విధంగానూ, జిల్లాలోని విశ్రాంతి దర్శకులను ఈ కార్యక్రమంలో తగిన రీతిగా సత్కరించనున్నట్లు తెలిపారు. డిసెంబర్ 30వ తేదీన స్థానిక తేనాంపేటలోని కామరాజర్ ఆవరణంలో ఈ కార్యక్రమాన్ని భారీ ఎత్తున నిర్వహించినున్నట్లు తెలిపారు. కాగా ఈ సందర్భంగా ఆది గాంధారి సాంగ్ ఆల్బమ్‌ను ఆవిష్కరించారు. (ఇదీ చదవండి: సెన్సార్ పూర్తి చేసుకున్న సలార్.. పిల్లలకు థియేటర్లలోకి నో ఎంట్రీ!) -
ఇండస్ట్రీలో వారసత్వం.. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ కొడుకు కామెంట్స్
తెలుగు, తమిళంలో చాలా హిట్ సినిమాలకు సంగీతమందించి గుర్తింపు తెచ్చుకున్నారు విద్యాసాగర్. రజనీకాంత్ 'చంద్రముఖి'తో పాటు తమిళంలో పరవైగళ్ పలు విధం, పూమగళ్, జైహింద్, ధూల్ రన్, దిల్, తులసీ ఇలా ఎన్నో సూపర్ హిట్ చిత్రాలకు సంగీతాన్ని అందించారు. 'తిరుట్టుపయలే–2' తర్వాత మరో మూవీ చేయలేదు. అయితే విద్యాసాగర్ వారసుడు హర్షవర్ధన్ తండ్రి బాటలో పయనిస్తూ ఆయనలా ఎదిగే ప్రయత్నం చేస్తున్నారు. (ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి 17 సినిమాలు.. మొత్తంగా 33 రిలీజ్!) ప్రస్తుతం ఏఆర్ రెహమాన్, జీవీ ప్రకాష్‌కుమార్, తమన్.. తదితర సంగీత దర్శకుల దగ్గర విష్ణువర్దన్.. మ్యూజిక్ మేనేజ్మెంట్ చేస్తున్నారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ. తండ్రి విద్యాసాగర్‌కు చిత్రపరిశ్రమలోగానీ అభిమానుల్లో గానీ తగిన గుర్తింపు రాలేదని విష్ణువర్ధన్ అన్నారు. ఆయనలోని సంగీతాన్ని చిత్ర పరిశ్రమ సరిగా వాడుకోలేదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. తాను ఆయనలా పేరు తెచ్చుకోవడానికి కృషిచేస్తున్నానని అన్నారు. అలాగని ఎక్కడా తన తండ్రి పేరును వాడుకోవడం లేదన్నారు. సొంత ప్రతిభ కృషితోనే ఈ రంగంలో నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తున్నట్లు చెప్పారు. తన గురించి తెలిసిన వాళ్లు కొందరు విద్యాసాగర్ కుమారుడు అని ముందుగా ఎందుకు చెప్పలేదని అడుగుతుంటారన్నారు. అలా చెప్పుకోవడం ఇష్టం లేదని విష్ణువర్ధన్ చెప్పుకొచ్చారు. (ఇదీ చదవండి: శోభను ఎవడు పెళ్లి చేసుకుంటాడో అంటూ శివాజీ చిల్లర వ్యాఖ్యలు) -
'కోబ్రా' కాంబో మరోసారి.. ఆ హీరో-దర్శకుడు మరో ప్రాజెక్ట్!
విభిన్న సినిమాలు చేస్తూ గుర్తింపు తెచ్చుకున్న హీరోల్లో విక్రమ్ కచ్చితంగా ఉంటాడు. హిట్టా ఫ్లాప్ అనేది పక్కనబెడితే ప్రయోగాలు చేయడం మాత్రం ఆపడు. అలా గతేడాది 'కోబ్రా' మూవీతో ప్రేక్షకుల్ని పలకరించాడు. కానీ హిట్ అనిపించుకోలకపోయింది. అయితేనేం ఈ చిత్రం దర్శకుడితో మరోసారి కలిసి పనిచేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. (ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి 17 సినిమాలు.. మొత్తంగా 33 రిలీజ్!) గతంలో 'డిమాంటీ కాలనీ', 'ఇమైకా నోడిగల్' లాంటి సినిమాలు తీసిన అజయ్ జ్ఞానముత్తు.. 'కోబ్రా' తీశారు. కాగా విక్రమ్ తన 63వ చిత్రానికి రెడీ అవుతున్నాడు. ఈ ప్రాజెక్టుకే అజయ్ దర్శకత్వం వహించనున్నట్లు తెలిసింది. అయితే కోబ్రా చిత్రం చేదు అనుభవాన్ని మరచి పోలేని విక్రమ్ అభిమానులు మళ్లీ అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలోనా? అంటూ పెదవి విరుస్తున్నారు. కాగా దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉందన్నది గమనార్హం. (ఇదీ చదవండి: రెండు వారాల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తున్న స్టార్ హీరో హిట్ సినిమా) -
ఆ టాలెంట్ మళ్లీ చూపిస్తున్న స్టార్ హీరో
మాధవన్ నిజంగా అదృష్టవంతుడే. బహుభాషా నటుడు, దర్శకుడు, నిర్మాత. తాజాగా కథకుడిగానూ మారారు. రన్, ఆలైపాయుదే, ఆయుధ మిన్నలే, ఎళుత్తు, యావరుమ్ నలమ్ ఇలా పలు హిట్ చిత్రాల్లో నటించిన ఈయన.. హిందీ, ఇంగ్లీష్ చిత్రాలలోనూ నటించి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు సంపాదించాడు. ఇటీవల 'రాకెట్రీ' మూవీతో దర్శకుడిగాను సక్సెస్ అయ్యారు. తమిళ, హిందీ భాషల్లో తీసిన ఈ చిత్రానికి కథకుడు, నిర్మాత, హీరో ఇతడే కావడం విశేషం. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 32 సినిమాలు) మాధవన్ ప్రస్తుతం తమిళంలో 'టెస్ట్' చిత్రం చేస్తున్నాడు. మరో మూవీ షూటింగ్ ఇటీవలే ప్రారంభమైంది. ఇంతకు ముందు ధనుష్ హీరోగా 'తిరు' అనే సూపర్‌హిట్ తీసిన మిత్రన్ జవహర్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. దీనికి హీరో మాధవన్ కథ అందించడం విశేషం. కాగా ఈ చిత్రానికి 'అదృష్టశాలి' అనే టైటిల్ ఖరారు చేసినట్లు సమాచారం. ఇందులో కన్నడ బ్యూటీ షర్మిళ మంద్రే నైతిక హీరోయిన్. రాధిక శరత్ కుమార్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రస్తుతం విదేశాల్లో షూటింగ్ జరుగుతోంది. (ఇదీ చదవండి: హనీమూన్‌కి వెళ్లిన మెగా కపుల్ వరుణ్-లావణ్య?) -
ఇద్దరు స్టార్స్ కాంబినేషన్లో నా నా మూవీ.. రిలీజ్ అప్పుడే!
నటుడు శశికుమార్, శరత్‌కుమార్ ఇటీవల నటించిన చిత్రాలు విజయాలు సాధించడంతో మంచి జోష్‌లో ఉన్నారు. శశికుమార్.. అయోధి, శరత్‌కుమార్.. పొన్నియిన్‌సెల్వన్, పోర్ తొళిల్ వంటి విజయవంతమైన చిత్రాలలో నటించిన విషయం తెలిసిందే. తాజాగా వీరిద్దరూ కలిసి ననా అనే చిత్రంలో నటించారు. కల్పనా పిక్చర్స్ పతాకంపై పీకే రామ్ మోహన్ నిర్మించిన ఈ చిత్రానికి ఎన్వి నిర్మల్ కుమార్ దర్శకత్వం వహించారు. హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతాన్ని గణేష్ చంద్ర ఛాయాగ్రహణం అందించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమం పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత ననా చిత్రాన్ని ఈ నెల 15వ తేదీన విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. శశికుమార్, శరత్‌కుమార్ అద్భుత నటనను ప్రదర్శించారని, యాక్షన్, థ్రిల్లర్ ఎంటర్టైనర్గా రూపొందించిన ఈ చిత్రం అన్ని వర్గాల వారిని ఖచ్చితంగా అలరిస్తుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. చిత్ర కథ ఆది నుంచి చివరి వరకు ఉత్కంఠ భరితంగా సాగుతుందన్నారు. దీనికి భూపతి రాజా, ఎన్వీ నిర్మల్ కుమార్ కలిసి కథను సమకూర్చారు. భూపతి రాజా థాయమిది శివకుమార్, నైవేలి భరత్ కుమార్, సురులిపట్టి శివాజీ మొదలగు వారు సంభాషణలను రాయడం విశేషం. చదవండి: ఆలయాన వెలసిన కథలతో పూనకాలు తెప్పిస్తున్న స్టార్స్ -
'లియో' లోకేశ్ కనగరాజ్ కొత్త మూవీ టీజర్.. టైటిల్ తగ్గట్లు మొత్తం అవే!
లోకేశ్ కనగరాజ్ పేరు చెప్పగానే మూవీ లవర్స్ అలెర్ట్ అయిపోతారు. ఎందుకంటే తీసింది ఐదు సినిమాలే గానీ కల్ట్ స్టేటస్ సంపాదించాడు. రీసెంట్గా 'లియో' సినిమాతో ఆకట్టుకున్నాడు. మొన్ననే ఈ చిత్రం రిలీజైంది. ఇప్పుడు మరో కొత్త మూవీతో ప్రేక్షకుల్ని ఎంటర్ టైన్ చేసేందుకు రెడీ అయిపోయాడు. తాజాగా టీజర్ రిలీజ్ అది.. అంచనాల్ని పెంచేస్తోంది. ఖైదీ, విక్రమ్, లియో సినిమాలతో ఎక్కడలేని గుర్తింపు తెచ్చుకున్న లోకేశ్ కనగరాజ్.. ఇప్పుడు నిర్మాతగా మారాడు. జీ-స్క్వాడ్ పేరుతో నిర్మాణ సంస్థ స్థాపించాడు. ఇందులో భాగంగా తన ఫ్రెండ్స్, సహాయకులని ఎంకరేజ్ చేసేందుకు ఈ సంస్థ స్థాపించినట్లు చెప్పుకొచ్చాడు. అలానే 'ఫైట్ క్లబ్' పేరుతో విజయ్ కుమార్ హీరోగా ఓ తమిళ సినిమా తీశారు. (ఇదీ చదవండి: నయనతార 'అన్నపూరణి' సినిమా.. టాక్-రివ్యూ ఏంటంటే?) డిసెంబరు 15న థియేటర్లలో రిలీజ్ అవుతున్న ఈ చిత్ర టీజర్‌ని తాజాగా విడుదల చేశారు. 'ఫైట్ క్లబ్' అనే టైటిల్‌కి తగ్గట్లే టీజర్ అంతా యాక్షన్ సీన్స్ గట్టిగానే ఉన్నాయి. తెలుగు ప్రేక్షకులకు ఈ సినిమా హీరో విజయ్ కుమార్ పెద్దగా తెలియదు. ఉరయాడి, ఉరయాడి 2 సినిమాలతో నటుడిగా, దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న విజయ్.. సూర్య 'సూరరై పోట్రు' మూవీకి డైలాగ్స్ రాశాడు. ఇప్పుడు లోకేశ్ కనగరాజ్ నిర్మించిన 'ఫైట్ క్లబ్' సినిమాతో దాదాపు నాలుగేళ్ల తర్వాత ప్రేక్షకుల్ని పలకరిస్తున్నాడు. టీజర్ చూస్తుంటే యాక్షన్ డ్రామా అనిపిస్తుంది. ఇందులో లోకేశ్ కనగరాజ్ మార్క్ అక్కడక్కడా కనిపిస్తుంది. మరి దర్శకుడిగా వరస హిట్స్ కొడుతున్న లోకేశ్.. నిర్మాతగా ఎలాంటి రిజల్ట్ అందుకుంటాడో చూడాలి? (ఇదీ చదవండి: 'యానిమల్'లో రష్మిక కంటే హైలైట్ అయిన బ్యూటీ.. ఈమె ఎవరంటే?) -
అందరికీ ఉన్న సమస్యే.. ఏకంగా సినిమా తీసేశారు!
'జెర్సీ' ఫేమ్ హరీష్ కళ్యాణ్ హీరోగా నటించిన సినిమా 'పార్కింగ్'. ఇందూజ హీరోయిన్. రామ్ కుమార్ బాలకృష్ణన్ దర్శకత్వం వహించారు. ఫ్యాషన్ స్టూడియోస్, సోల్జర్స్ ఫ్యాక్టరీ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. నిర్మాణ కార్యక్రమాలు పూర్తిచేసుకుని డిసెంబర్ 1న థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా శుక్రవారం ప్రీ రిలీజ్ ఈవెంట్ చైన్నెలోని ప్రసాద్ ల్యాబ్‌లో నిర్వహించారు. (ఇదీ చదవండి: Bigg Boss 7: అశ్విని ఎలిమినేట్.. ఏడు వారాలకు రెమ్యునరేషన్ ఎంత తెలుసా?) ఈ కార్యక్రమంలో దర్శకుడు లోకేష్ కనకరాజ్, అరుణ్ రాజ్ కామరాజా, రవికుమార్, రతన్ కుమార్, రంజిత్ జయకొడి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఇక హీరో హరీష్ కల్యాణ్ మాట్లాడుతూ.. చిత్ర జయాపజయాలు ప్రేక్షకుల చేతుల్లోనే ఉంటాయని, 'పార్కింగ్' లాంటి మంచి కథని వదులుకుంటే కచ్చితంగా తాను బాధపడేవాడినని చెప్పుకొచ్చాడు. లోకేష్ మాట్లాడుతూ.. ఈ చిత్రాన్ని తాను ఇంతకుముందే చూశానని, పార్కింగ్ అనే పేరుతో ఒక పెద్ద సమస్యను ఈ చిత్రంలో చూపించారని దర్శకుడిని అభినందించారు. చిత్రంలో అందరూ చాలా బాగా నటించారని పేర్కొన్నారు. కథేంటి? ట్రైలర్ బట్టి చూస్తే.. సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేసే హీరో. ఓ ఇంట్లో అద్దెకు ఉంటాడు. పెళ్లయిన తర్వాత కొత్త కారు కొంటాడు. అయితే ఉంటున్న ఇంట్లో పార్కింగ్ సమస్య వస్తుంది. ఓనర్-హీరో ఒకరినొకరు రక్తాలొచ్చేలా కొట్టుకునేంతవరకు వెళ్తుంది. పోలీస్ కేసుల వరకు వెళ్తారు. మరి ఈ పార్కింగ్ సమస్యని ఎలా పరిష్కరించారు? చివరకు ఏమైందనేదే సినిమా స్టోరీ. (ఇదీ చదవండి: Bigg Boss 7: రైతుబిడ్డ వల్ల రెండోసారి రతిక ఎలిమినేట్.. వేరే లెవల్ రివేంజ్!)\ -
పిక్ టాక్: కొత్త అవతారం ఎత్తిన నయనతార!
తమిళసినిమా: అగ్ర కథానాయిక నయనతార కొత్త అవతారం ఎత్తనుందా అంటే ఆమె అభిమానులు అవుననే అంటున్నారు. ఎక్కడో కేరళ రాష్ట్రంలోని మారుమూల గ్రామంలో పుట్టిన డయానా కురియన్ అనే మలయాళ కుట్టి నయనతార నటిగా సినీ విశ్వరూపం దాల్చుతుందని ఆమె కూడా ఊహించి ఉండరు. నటిగా రంగప్రవేశం చేసి అగ్ర కథానాయకి స్థాయికి చేరుకుని ఆ తరువాత రౌడీ పిక్చర్స్ పేరుతో చిత్ర నిర్మాణ సంస్థను ప్రారంభించి నిర్మాతగా అవతారం ఎత్తారు. అంతటితో ఆగకుండా వ్యాపార రంగంలోకి ఎంట్రీ ఇచ్చి సక్సెస్ ఫుల్‌గా రాణిస్తున్నారు. మరో పక్క వాణిజ్య ప్రకటనల్లోనూ నటిస్తూ నాలుగు చేతులా ఆర్జిస్తున్నారు. ప్రస్తుతం తన కవల పిల్లలతో ముద్దు, మురిపాలు కురిపిస్తూనే మరో పక్క హీరోయిన్గా టాప్ లెవెల్లో సాగిపోతున్నారు. తాజాగా ఈమె కథానాయకి పాత్రకు ప్రాధాన్యత కలిగిన పాత్రలో నటించిన అన్నపూరణి చిత్రం డిసెంబర్ ఒకటో తేదీ తెరపైకి రానుంది. అదే విధంగా నయనతార నటిస్తున్న మరో చిత్రం మన్నాంగట్టి. ఈ చిత్రం నిర్మాణ దశలో ఉంది. ఈ సందర్భంగా ఈమె కెమెరా వెనుక నిలబడి చూస్తున్న ఫొటోను తన ఇన్‌స్ట్రాగామ్‌లో పోస్ట్ చేశారు. అందులో ఇది న్యూ అవతారం నమ్మండి అని పేర్కొన్నారు. దీంతో మెగా ఫోన్ పట్టడానికి రెడీ అవుతున్నారని ఆమె అభిమానులు సంబరపడుతున్నారు. అయితే ఇది పబ్లిసిటీ స్టంటా, లేక నయనతార భవిష్యత్తులో దర్శకత్వం వహించడానికి సిద్ధం అవుతున్నారా? అనే చర్చ సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. View this post on Instagram A post shared by N A Y A N T H A R A (@nayanthara) -
డిఫరెంట్ కాన్సెప్ట్‌తో 'పరారీ' మూవీ
దర్శకుడు రాజుమురుగన్ శిష్యుడు ఎళిల్ పెరియవెడి దర్శకుడిగా పరిచయమవుతున్న చిత్రం 'పరారీ'. ఎస్పీ సినిమాస్ సంస్థతో కలిసి దర్శకుడు రాజుమురుగన్ నిర్మిస్తున్నారు. 'తోళర్ వెంకటేశన్' ఫేమ్ హరిశంకర్ హీరోగా నటిస్తున్నారు. సంగీత కల్యాణ్ అనే అమ్మాయి హీరోయిన్గా పరిచయమవుతోంది. కాగా ఈ చిత్ర ఫస్ట్‌లుక్ పోస్టర్ని దర్శకుడు లోకేష్ రిలీజ్ చేశారు. (ఇదీ చదవండి: భర్తని పరిచయం చేసిన హీరోయిన్ ఇలియానా.. ఇతడెవరో తెలుసా?) తిరువణ్ణామలై చుట్టుపక్కల ప్రాంతాల్లోని ఒక చోటు నుంచి మరో చోటుకు వెళ్లి జీవించే ప్రజలు జీవన విధానాన్ని ఆవిష్కరించే కథా చిత్రం ఇది అని దర్శకుడు చెప్పుకొచ్చాడు. ఆ ప్రాంతలో ఉండే కుల, మత రాజకీయాల గురించి ఇందులో చూపించనున్నట్లు చెప్పాడు. చాలామంది కొత్త వాళ్లు ఇందులో నటించారని తెలిపాడు. ప్రస్తుతం నిర్మాణాంతరం కార్యక్రమాలు జరుగుతున్నట్లు పేర్కొన్నారు. ఈ మూవీకి షాన్ రోల్డన్ సంగీతాన్ని అందిస్తున్నారు. (ఇదీ చదవండి: పాతాళానికి పడిపోయిన శివాజీ గ్రాఫ్! మాట కోసం చస్తావా? పెద్ద జోక్..) -
ఓటీటీలో నవయుగ కన్నగి.. అప్పటినుంచే స్ట్రీమింగ్!
నాడు పాండియమన్నన్ అధర్మ తీర్పు కారణంగా కన్నగి తన భర్త కోవలన్నును కోల్పోయింది. ఆమె ప్రతీకారానికి మధురై దహనమైంది. అదే విధంగా ఇప్పుడు పరువు హత్యల కారణంగా తన ప్రేమికున్ని కోల్పోయిన స్వాతికి బలవంతంగా మరో పెళ్లి చేస్తే ఆ వివాహం తరువాత ఆమె ఎలాంటి ప్రతీకార చర్యలు తీసుకుందనే కాన్సెప్టే.. నవయుగ కన్నగి అని దర్శకుడు కిరణ్ దురైరాజ్ పేర్కొన్నారు. ఇంతకుముందు పలు షార్ట్ ఫిలిమ్స్ చేసిన ఈయన తొలిసారిగా స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ఇది. ఈ చిత్ర వివరాలను దర్శకుడు కిరణ్ దురైరాజ్ తెలుపుతూ ఇందులో నటించిన వారంతా రంగస్థల నటీనటులని చెప్పారు. ముఖ్యంగా బెంగళూరులో నివసించే తమిళులని తెలిపారు. ఇది పలు యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కించిన కథా చిత్రమని చెప్పారు. పరువు హత్యల గురించి ఇంతకుముందు కొన్ని సినిమాలు వచ్చినా, వాటికి భిన్నంగా ఈ చిత్ర కథ ఉంటుందన్నారు. ఇది ఏ కులాన్నో, మతాన్నో సమర్థిస్తూ రూపొందించిన కథా చిత్రం కాదని సమాజంలో జరుగుతున్న సంఘటనల వాస్తవ రూపమే నవయుగ కన్నగి అని చెప్పారు. కొందరి జాతి పిచ్చిని, వ్యతిరేకతను, వాటి వలన జరిగే హింసాత్మక సంఘటనలను పట్టించుకోని వారు తెలియని వారి మనస్తత్వాన్ని ప్రతిబింబించే కథా చిత్రంగా ఇది ఉంటుందన్నారు. చిత్రం షార్ట్ ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్ఫామ్లో డిసెంబర్లో స్ట్రీమింగ్ చేస్తున్నట్లు దర్శక, నిర్మాత కిరణ్ దురైరాజ్ చెప్పారు. చదవండి: ‘విక్రమ్ రాథోడ్’గా వస్తున్న విజయ్ ఆంటోనీ -
చిన్న సినిమా.. కానీ నలుగురు మ్యూజిక్ డైరెక్టర్స్!
కాళిదాస్ జయరాం హీరోగా నటించిన మూవీ 'అవళ్ పేర్ రజినీ'. తమిళ, మలయాళ భాషల్లో తీసిన ఈ చిత్రాన్ని నవరస ఫిలిమ్స్ పతాకంపై శ్రీజిత్ కేఎస్, జెస్సీ శ్రీజిత్ నిర్మించారు. వినీల్ స్కరియా వర్గీస్ దర్శకత్వం వహించగా.. నమిత ప్రమోద్, రెబా మోనికా జాన్ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. నలుగురు సంగీత దర్శకులు పని చేసిన ఈ మూవీకి పనిచేయడం విశేషం. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో రిలీజ్ కానున్న 24 సినిమాలు) ఈ చిత్ర ట్రైలర్ లాంచ్ ఈవెంట్ తాజాగా చెన్నైలో నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా 'లియో' డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ వచ్చారు. ట్రైలర్ బాగుందని, చిత్రం కూడా మంచి విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నట్లు లోకేశ్ చెప్పకొచ్చాడు. హీరో కాళిదాస్ జయరామ్ మాట్లాడుతూ.. ఇదే వేదికపైకి కమలహాసన్ తనని చేయిపట్టుకుని తీసుకొచ్చి పరిచయం చేశారని అన్నాడు. 'విక్రమ్'లో అవకాశమిచ్చినందుకు డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్‌కి ధన్యవాదాలు చెప్పాడు. కొత్త మూవీలో తాను ఇప్పటి వరకు చేయని పాత్రను ఇందులో పోషించినట్లు కాళిదాస్ చెప్పుకొచ్చాడు. (ఇదీ చదవండి: రెండు నెలల తర్వాత ఓటీటీలోకి ఆ తెలుగు సినిమా!) -
స్టార్ హీరో తొలి వెబ్ సిరీస్.. ఆ ఒక్కదానికే రెండేళ్లు టైమ్!
ఇప్పుడంతా ఓటీటీల ట్రెండ్ నడుస్తోంది. దీంతో సినిమా హీరోలు కూడా చాలామంది వెబ్ సిరీస్‌లతో డిజిటల్ ఎంట్రీ ఇస్తున్నారు. నాగచైతన్య త్వరలో 'దూత' అనే సిరీస్‌తో రాబోతున్నాడు. దీనికంటే ముందు తమిళ స్టార్ హీరో ఆర్య.. 'ద విలేజ్' అనే హారర్ వెబ్ సిరీస్‌తో ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తున్నాడు. తాజాగా ఈ సిరీస్ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ జరగ్గా.. పలు ఆసక్తికర విషయాలు బయటపడ్డాయ్. (ఇదీ చదవండి: వరల్డ్‌కప్ ఫైనల్.. పాత టాలెంట్ బయటకు తీసిన హీరో నాని!) 'ద విలేజ్' సిరీస్ నవంబరు 24 నుంచి అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. తాజాగా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరగ్గా.. ప్రైమ్ వీడియో ప్రెసిడెంట్ అపర్ణ పురోహిత్ హాజరయ్యారు. 'ది విలేజ్' వెబ్ సిరీస్‌తో ప్రేక్షకులని తాము నెక్ట్స్ లెవెల్‌కి తీసుకెళ్లనున్నట్లు చెప్పారు. ఈ సిరీస్ కోసం దాదాపు నాలుగేళ్లు జర్నీ చేసినట్లు పేర్కొన్నారు. ఇకపోతే ఈ స్ట్రిప్ట్ని రాసి చదవడానికే రెండేళ్లు పట్టిందన్నారు. అలానే నటుడు ఆర్య నటించడానికి అంగీకరించడంతో ఇది చాలా భారీ సిరీస్ అయిందనే అభిప్రాయాన్ని అపర్ణ పురోహిత్ వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా వేర్వేరు ప్రాంతాల్లో జరిగే పలు ఘటనలను ఒక చోటకు తీసుకురావడం ఎలా? అనే ఆసక్తికరమైన స్టోరీతో ఈ సిరీస్ తీసినట్లు నిర్మాత బీఎస్ రాధాకృష్ణ చెప్పారు. (ఇదీ చదవండి: పెళ్లి చేసుకున్న నాగచైతన్య ఫస్ట్ మూవీ హీరోయిన్) -
హీరోయిన్ కూతురు కొత్త మూవీ.. బడ్జెట్ జస్ట్ రూ.7 లక్షలే!
సినిమా అనేది ఇప్పుడు వందల కోట్ల వ్యవహారం అయిపోయింది. స్టార్ హీరోలు, పాన్ ఇండియా హీరోలు.. వందల కోట్లు అని పరుగెడుతుంటే.. మిడ్ రేంజ్, చిన్న హీరోలు ఏ మాత్రం తగ్గట్లేదు. తక్కువలో తక్కువ రూ.5 కోట్లు బడ్జెట్‌కి మించిన సినిమాల్లోనే నటిస్తున్నారు. తాజాగా ఓ హీరోయిన్ కూతురు హీరోయిన్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెడుతోంది. ఇప్పుడు ఈమె నటించిన ఈ చిత్రాన్ని కేవలం రూ.6-7 లక్షల్లో పూర్తి చేశారంటే మీరు నమ్ముతారా? అవును మేం చెప్పింది నిజమే. (ఇదీ చదవండి: హీరో ధనుష్ ఇంటికొచ్చిన పోలీసులు? కొడుకు ఆ తప్పు చేయడంతో!) ప్రముఖ తమిళ దర్శకుడు ఏఆర్ భారతి తీసిన లేటెస్ట్ మూవీ 'డ్రీమ్ గర్ల్'. చారులతా ఫిల్మ్స్ పతాకంపై కావేరి మాణిక్యం, ఆర్ గుణశేఖరన్, ఆధిత్యన్ కలిసి నిర్మించిన ఈ చిత్రంలో జీవా హీరో. సీనియర్ ఫైట్ మాస్టర్ జస్టిన్ మనవరాలు, నటి బబిత కూతురు హరిష్మిత హీరోయిన్గా పరిచయమవుతోంది. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రేమికుల రోజు కానుకగా ఫిబ్రవరి 12న థియేటర్లలో రిలీజ్ కానుంది. దర్శకుడు మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలు చెప్పాడు. ఈ చిత్రం పలు ఆసక్తికరమైన అంశాలతో సాగే ప్రేమకథ అని అన్నారు. కేవలం రూ. 6-7 లక్షల్లో దీన్ని పూర్తిచేసినట్లు చెప్పారు. తక్కువ బడ్జెట్ చిత్రాలకు ఇది ఓ మంచి ఉదాహరణ అని పేర్కొన్నారు. ప్రణాళిక ప్రకారం నటీనటులు, సాంకేతిక బృందం సంపూర్ణ సహకారం అందించడంతో ఇది సాధ్యం అయ్యిందని పేర్కొన్నారు. (ఇదీ చదవండి: Bigg Boss 7: ఈ వారం డబుల్ ఎలిమినేషన్.. ఆ ఇద్దరు ఔట్?) -
చిన్న సినిమాలను చులకన చేసిన విశాల్.. దర్శకుడి కౌంటర్..
దేవా సంగీత దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'వా వరలామ్ వా'. ఎస్ జీఎస్ క్రియేటివ్ మీడియా పతాకంపై ఎస్ పీఆర్ నిర్మించారు. ఇంతకు ముందు ఐందామ్ తలైమురై సిద్ధ వైద్య శిఖామణి, మిసిమి, నాన్ అవళై సందిత్తపోదు వంటి చిత్రాలను తెరకెక్కించిన ఎస్జీ.రవిచంద్రన్ కథ, కథనం, దర్శకత్వం బాధ్యతలు నిర్వర్తించారు. బిగ్ బాస్ రియాల్టీ గేమ్ షో ఫేమ్ బాలాజీ మురుగదాస్ హీరోగా పరిచయం అవుతున్నారు. కరుమేఘంగళ్ కరగిండ్రన చిత్రం ఫేమ్ మహానా సంజీవి హీరోయిన్గా నటించారు. విశాల్ వ్యాఖ్యలపై అసహనం నటుడు మైమ్ గోపి విలన్‌గా చేస్తున్నారు. నటి గాయత్రి, రెండా, రెడిన్ కింగ్స్ లీ, శరవణ సుబ్బయ్య, దీపా, వైయాపురి వాసు విక్రమ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. కార్తీక్ రాజా చాయాగ్రహణం అందించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈనెల 24వ తేదీ విడుదల కానుంది. ఈ సందర్భంగా గురువారం చైన్నెలోని ప్రసాద్ ల్యాబ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో దర్శకుడు ఆర్వీ ఉదయకుమార్, పేరరసు, మోహన్ జీ తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. రూ.2-3 కోట్లతో సినిమాలు చేసే నిర్మాతలు ఇండస్ట్రీకి రావద్దన్న విశాల్ వ్యాఖ్యలపై దర్శకుడు మోహన్.జీ తీవ్రంగానే స్పందించారు. చిన్న చిత్రాలు లాభాలు తెస్తున్నాయి మోహన్ జీ మాట్లాడుతూ.. విశాల్ ఏ ఉద్దేశంతో అలా అన్నారో గాని, నిజానికి చిన్న చిత్రాలు బాగానే లాభాలు తెచ్చి పెడుతున్నాయని తెలిపారు. తాను స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రాలన్నీ లో బడ్జెట్లో చేసినవేనన్నారు. అన్నీ మంచి లాభాలు తెచ్చి పెట్టాయని చెప్పారు. అయితే చిత్రాలకు కంటెంట్ చాలా ముఖ్యమని పేర్కొన్నారు. అలాంటి ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నానన్నారు. తాను ఇంతకు ముందు చేసిన చిత్రాలన్నింటిలో బెస్ట్ చిత్రంగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా ఓ ఇంటర్వ్యూలో విశాల్.. 'రూ.1- 4 కోట్లతో సినిమాలు తీద్దామనుకునేవారు ఇండస్ట్రీకి రావొద్దు. ఆ డబ్బుతో ఏదైనా భూమి కొనుకోండి. ఎందుకంటే అంత తక్కువ డబ్బుతో సినిమా తీస్తే మీకు ఏమీ వెనక్కు రాదు' అని కామెంట్స్ చేశాడు. చదవండి: ఫ్లాప్ హీరో.. కొత్త డైరెక్టర్.. రూ.100 బడ్జెట్‌తో ‘యూవీ’ ప్రయోగం! -
22 ఏళ్ల తర్వాత కమల్‌హాసన్ సినిమా రిలీజ్
లోకనాయకుడు కమలహాసన్ నట విశ్వరూపానికి ఒక మచ్చుతునక 'ఆళవందాన్'. నిర్మాత కలైపులి ఎస్.థాను నిర్మించిన భారీ చిత్రమిది. సురేష్‌కృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి కమలహాసన్ కథను అందించారు. ఇదే మూవీలో హీరో కమ్ విలన్‌గా కమల్ ద్విపాత్రాభినయం చేశారు. సైకలాజికల్ స్టోరీతో తీసిన ఈ చిత్రం.. 2001 నవంబర్ 12న విడుదలైంది. కొన్ని కారణాల వల్ల అప్పట్లో హిట్ కాలేదు. (ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి ఏకంగా 33 సినిమాలు) ఈ సినిమాలో అన్నదమ్ములుగా కమలహాసన్ నటనకు మంచి ప్రశంసలు దక్కాయి. బాలీవుడ్ బ్యూటీస్ మనీషాకొయిరాల, రవీనా టాండన్ హీరోయిన్లుగా నటించారు. 22 ఏళ్ల క్రితం విడుదలైన ఆళవందాన్ చిత్రాన్ని నిర్మాత భాను ఇప్పుడు మళ్లీ విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. తెలుగులో ఇది 'అభయ్' పేరుతో యూట్యూబ్ లో అందుబాటులో ఉంది. ఇప్పుడీ చిత్రాన్నే చిన్నచిన్న మార్పులు చేసి ప్రపంచవ్యాప్తంగా దాదాపు 1000 థియేటర్లలో విడుదల చేస్తున్నట్లు పేర్కొని పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ మధ్యే కమలహాసన్ 'వేట్టైయాడు విళైయాడు' చిత్రం ఇటీవల మళ్లీ విడుదలై మంచి వసూళ్లను రాబట్టింది. ఆ చిత్రానికంటే బెటర్‌గా ఆళవందాన్ చిత్రం కలెక్షన్లు రాబట్టే అవకాశం ఉంటుందని భావించవచ్చు. (ఇదీ చదవండి: ఫౌల్ గేమ్ ఆడి దొరికిపోయిన శివాజీ.. మళ్లీ శోభాశెట్టితో పనికిరాని గొడవ!) -
గుడి దగ్గర స్టార్ హీరో సినిమా షూటింగ్.. ఇబ్బందిపడ్డ భక్తులు
విశాల్ కొత్త సినిమా షూటింగ్ తమిళనాడులోని వేలూరు కోట మైదానంలోని జలకంఠేశ్వరాలయం సమీపంలో బుధవారం ఉదయం ప్రారంభమైంది. తొలిరోజు విశాల్‌తోపాటు హీరోయిన్ ప్రియాభవాని శంకర్, కమెడియన్ యోగిబాబు తదితరులు పాల్గొన్నారు. షూటింగ్ కోసం కోట ఆలయం సమీపంలో తాత్కాలిక వేలూరు సౌత్ పోలీస్‌స్టేషన్ సెట్‌ను ఏర్పాటు చేశారు. (ఇదీ చదవండి:హీరో మహేశ్‌బాబు మంచి మనసు.. నిజంగా శ్రీమంతుడే!) హీరోయిన్ బైక్‌పై వెళ్తుండగా పోలీసులు ఖైదీలని పోలీస్‌స్టేషన్‌కు తీసుకొస్తున్న సీన్స్ తీశారు. దర్శకుడు హరి నేతృత్వంలోని ఈ సన్నివేశాలు చిత్రీకరించారు. అయితే షూటింగ్ లొకేషన్ చుట్టూ జిమ్ బాయ్స్ బైటాయించి ఆలయానికి వచ్చే భక్తులు, పర్యాటకులను అడ్డుకోవడంతో వీళ్లందరూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. (ఇదీ చదవండి: బిగ్‌బాస్: ఆమెకు ప్రెగ్నెన్సీ టెస్ట్.. టెన్షన్లో ఆ కంటెస్టెంట్) -
నెల రోజుల్లో షూటింగ్ పూర్తి.. వాలంటైన్స్ డేకి రిలీజ్
అజయ్ అర్జున్ ప్రొడక్షన్స్ పతాకంపై డాక్టర్ అర్జున్ నిర్మిస్తున్న చిత్రం 'అజయన్ బాలావిన్ మైలాంజి'. ప్రముఖ రచయిత అజయన్ బాల కథ, మాటలు రాసి దర్శకుడిగా పరిచయమవుతున్నారు. నటుడు శ్రీరామ్ కార్తీక్ ,గిరీష కురూప్, సింగం పులి, మునీష్ కాంత్, తంగదరై తదితరులు ప్రధాన పాత్ర పోషించిన ఈ చిత్రం షూటింగ్ పూర్తి పూర్తి అయినట్లు ప్రకటించారు. (ఇదీ చదవండి: 'బిగ్‌బాస్' షోలో వివాదం.. లేడీ కంటెస్టెంట్‌పై పోలీస్ కేసు) ఇది కొండ పరిసర ప్రాంతాల్లో సాగే సరికొత్త ప్రేమకథ సినిమా అని దర్శకుడు చెప్పుకొచ్చాడు. పర్యాటక పరిరక్షణ గురించి తెలిపే చిత్రమని అన్నారు. షూటింగ్ అంతా నెలరోజుల్లో పూర్తి చేసినట్లు తెలిపారు. కాగా మైలాంజి అనే టైటిల్ తో ఇప్పటికే ఒక చిత్రం విడుదల కావడంతో తమ చిత్రానికి అజయన్ బాలావిన్ మైలాంజి అని పేరు మార్చినట్లు వివరించారు. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్పారు. ఈ చిత్ర కథను విన్న సంగీత దర్శకుడు ఇళయరాజా చాలా ఇంప్రెస్ అయ్యి చిత్రంలోని నాలుగు పాటలను ఆయనే రాసి సంగీతాన్ని అందించినట్లు దర్శకుడు చెప్పారు. కథను నమ్మి ప్రముఖ సాంకేతిక వర్గంతో రూపొందిస్తున్న చిత్రం ఇదని చెప్పారు. దీనికి చెళియన్ ఛాయాగ్రహణం, శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ బాధ్యతలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. చిత్రాన్ని 2024 ఫిబ్రవరి నెలలో ప్రేమికుల రోజు సందర్భంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు నిర్మాత తెలిపారు. (ఇదీ చదవండి: తెలుగు యంగ్ హీరోకి గాయం.. పట్టుజారి అలా పడిపోవడంతో!) -
సన్నీ-ప్రియమణి యాక్షన్ మూవీ.. రిలీజ్ డేట్ ఫిక్స్
ఫిల్మిటీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై గాయత్రి సురేష్, వివేకానందం కలిసి నిర్మించిన కొత్త సినిమా విడుదలకు సిద్ధమైంది. వివేక్ కుమార్ కర్నూల్ దర్శకత్వం వహించగా... ప్రియమణి, సన్నీలియోన్, సారా అర్జున్, గాయత్రి రెడ్డి తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. డ్రమ్స్ శివమణి సంగీతమందించారు. నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న 'కొటేషన్ గ్యాంగ్' అనే ఈ చిత్రం డిసెంబర్ రెండో వారంలో థియేటర్లలోకి రానుంది. (ఇదీ చదవండి: బిగ్‌బాస్ అశ్వినికి ఆల్రెడీ పెళ్లయిందా? మరి అలా!) చెన్నైలోని ఓ స్టూడియోలో శుక్రవారం సాయంత్రం నిర్వహించిన విలేకరుల సమావేశంలో దర్శక నిర్మాతలు పాల్గొన్నారు. ఆసక్తికర విషయాల్ని బయటపెట్టారు. కేరళలో కొటేష న్ గ్యాంగ్ ఉన్నారనే వార్త పేపర్లో చదివానని, దాన్ని బేస్ చేసుకుని తయారు చేసుకున్న కథతో ఈ సినిమా తీశానని డైరెక్టర్ వివేక్ చెప్పుకొచ్చారు. చెన్నై, ముంబై, కశ్మీర్లో జరిగే మూడు కథలు ముంబైలో కలుస్తాయని, డబ్బు కోసం ఎలాంటి పనైనా ఆలోచించకుండా చేసే కూలీ ముఠా ఇతివృత్తమే కొటేషన్ గ్యాంగ్ చిత్రమని దర్శక నిర్మాతలు చెప్పారు. ప్రియమణి చేసే ఫైట్స్ ఆకట్టుకుంటాయని చెప్పారు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు దర్శకుడు తెలిపారు. (ఇదీ చదవండి: హీరోగా ఛాన్స్ కొట్టేసిన 'బిగ్‌బాస్' కంటెస్టెంట్) -
దీపావళి మనసుని హత్తుకుంటుంది
‘‘ఇప్పుడు ప్రేక్షకులు పెద్ద చిత్రాలతో పాటు చిన్న సినిమాలు కూడా చూస్తున్నారు. మా ‘దీపావళి’ చిన్నదైనా అందమైన సినిమా. ఇందులోని భావోద్వేగాలు ప్రేక్షకుల మనసులను హత్తుకుంటాయి’’ అని నిర్మాత ‘స్రవంతి’ రవికిశోర్ అన్నారు. పూ రాము, కాళీ వెంకట్ ప్రధాన పాత్రల్లో ఆర్ఏ వెంకట్ దర్శకత్వం వహించిన తమిళ చిత్రం ‘కీడా’ (తెలుగులో ‘దీపావళి’). కృష్ణ చైతన్య సమర్పణలో ‘స్రవంతి’ రవికిశోర్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 11న తెలుగు, తమిళ భాషల్లో విడుదలవుతోంది. ఈ సందర్భంగా ‘స్రవంతి’ రవికిశోర్ మాట్లాడుతూ– ‘‘నిర్మాతగా 38 ఏళ్ల జర్నీలో దాదాపుగా నేను చేసిన సినిమాలన్నీ సంతృప్తినిచ్చాయి. నేను డబ్బుల గురించి ఆలోచించను. ప్రేక్షకులకు సినిమా కనెక్ట్ అవుతుందా? లేదా అని మాత్రమే ఆలోచిస్తా. కథ పూర్తయ్యాకే సినిమాని సెట్స్ మీదకు తీసుకెళతాను. ఓ సినిమా పూర్తయ్యాకే మరొకటి చేస్తాను. నేను తక్కువ సినిమాలు చేయడానికి కారణం అదే. ‘దీపావళి’ కథనిప్రాణం పెట్టి రాశాడు వెంకట్. చెప్పిన కథను చెప్పినట్లు స్క్రీన్ మీదకు తీసుకొచ్చాడు. మా సినిమా ఇండియన్ పనోరమాకి ఎంపికవడం గొప్ప అనుభూతి. చెన్నై ఫిల్మ్ ఫెస్టివల్లోనూ ప్రదర్శించడం సంతోషంగా ఉంది. ఇక రామ్ హీరోగా ఓ సినిమా చేసేందుకు స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. అలాగే రామ్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేయాలని ఉంది. ఇందుకు సరైన కథ కుదరాలి’’ అన్నారు. -
స్టార్ హీరోయిన్ ప్లేస్‌లో ఛాన్స్ కొట్టేసిన అయాలి నటి!
ఒకప్పుడు ప్రేమ కథా చిత్రాలకు కేరాఫ్‌గా మారిన నటుడు మోహన్. 16 ఏళ్ల తర్వాత మళ్లీ హీరోగా రీఎంట్రీ ఇస్తోన్న చిత్రం హరా. ఇంతకుముందు దాదా 87, పౌడర్ వంటి వైవిధ్యభరిత కథా చిత్రాలను తెరకెక్కించిన విజయ్శ్రీ తాజాగా దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. కోయంబత్తూర్ ఎస్పీ.మోహన్ రాజ్‌తో కలిసి జీ.మీడియా పతాకంపై జయశ్రీ విజయ్ నిర్మిస్తున్నారు. ఇంతకుముందే చిత్ర షూటింగ్ ప్రారంభం కాగా.. అయితే మధ్యలో దర్శకుడు విజయ్ ప్రమాదానికి గురికావడంతో షూటింగ్ వాయిదా పడింది. తాజాగా హరా చిత్రం షూటింగ్ మళ్లీ ప్రారంభమై ఇటీవలే పూర్తి చేసుకుంది. ఈ చిత్రంలో ఒక ప్రముఖ నటి కథానాయకిగా నటించాల్సి ఉండగా కాల్షీట్స్ సమస్య కారణంగా ఈ చిత్రం నుంచి వైదొలగింది. దీంతో ఆమె ప్లేస్‌లో అయాలి నటి అనుమోల్‌ను ఎంపిక చేసినట్లు దర్శకుడు విజయ్ తెలిపారు. ఆమె అయాలి వెబ్ సిరీస్‌లో మంచి నటనతో గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రేక్షకుల ఆదరణ దక్కించుకున్నారు. ప్రస్తుతం విజయ్ హీరోగా నటిస్తున్న ఆయన 68వ చిత్రంలోనూ అనుమోల్ ముఖ్యపాత్రను పోషిస్తున్నట్లు చెప్పారు. కాగా.. హరా చిత్రంలో ఆమె పాత్రకు మంచి పేరు తెచ్చిపెడుతుందనే నమ్మకాన్ని దర్శకుడు వ్యక్తం చేశారు. ఈ సినిమాలో యోగిబాబు, మొట్టై రాజేంద్రన్, సింగం పులి, దీప, మైమ్ గోపి, శ్యామ్స్, కౌశిక్, అనిత నాయర్, చారుహాసన్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి లియాండర్ లీ మార్టీ సంగీతాన్ని అందిస్తున్నారు. త్వరలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు చెప్పారు. -
హీరోయిన్లకు అది దక్కట్లేదు.. ప్రముఖ నటి షాకింగ్ కామెంట్స్
తెలుగులో అప్పట్లో 'రుద్రనేత', 'కొండపల్లి రాజా' సినిమాల్లో నటించిన రేఖ.. ఆ తర్వాత పూర్తిగా తమిళ, మలయాళ భాషలకే పరిమితమైంది. మరోవైపు సీరియల్, షోల్లో కనిపిస్తూ అలరిస్తోంది. ఈమె ప్రధాన పాత్రలో నటించిన తమిళ సినిమా 'మిరియం మా'. ఐర్లాండ్ కి చెందిన మాలతి నారాయణన్ దర్శకురాలు. ఆమెనే ఈ చిత్రానికి నిర్మాత కూడా. (ఇదీ చదవండి: బిగ్‌బాస్ 7లో ఈసారి షాకింగ్ ఎలిమినేషన్.. క్రేజీ కంటెస్టెంట్ ఔట్?) త్వరలో ఈ సినిమాని థియేటర్లలో విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా చైన్నెలోని ప్రసాద్ ల్యాబ్‌లో గురువారం ఓ ఈవెంట్ నిర్వహించారు. ఇందులో పాల్గొన్న రేఖ.. హీరోయిన్ల జీవితం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'నేను 35 ఏళ్లుగా నటిస్తున్నా. మొదట్లో హీరోయిన్గా, ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా రకరకాల పాత్రలు చేశాను. నేను చేసిన చిత్రాల్లోని పాత్రల పేర్లతో నన్ను పిలుస్తుండడం సంతోషంగా ఉంది' 'ప్రస్తుతం 40 ఏళ్లు దాటిన లేడీ యాక్టర్స్‌ని దర్శకులు పక్కన పెట్టేస్తున్నారు. కానీ నాలాంటి చాలామందికి మంచి పాత్రల్లో నటించాలనే కోరిక ఉంటుంది. నేను మాత్రం బతికున్నంత వరకు నటిస్తూనే ఉంటాను. ఒకప్పుడు హీరోయిన్లకు నటించడానికి ఛాన్స్ ఉండేది. ఇప్పుడు కమర్షియల్ చిత్రాల్లో హీరోయిన్లకు అసలు ప్రాధాన్యం లేకుండా పోయింది' అని రేఖ తన ఆవేదన చెప్పుకొచ్చారు. (ఇదీ చదవండి: తల్లి చివరి కోరిక తీర్చబోతున్న మహేశ్‌బాబు.. త్వరలో శుభకార్యం!) -
భావోద్వేగ దీపావళి
తాతా–మనవడి అనుబంధం నేపథ్యంలో తెరకెక్కిన తమిళ చిత్రం ‘కీడా’. పూ రాము, కాళీ వెంకట్ ముఖ్య తారలుగా దీపన్, పాండియమ్మ, విజయ, కమలి కీలక పాత్రల్లో నటించారు. ‘స్రవంతి’ రవికిశోర్ నిర్మించిన ఈ తమిళ చిత్రం తెలుగులో ‘దీపావళి’గా రిలీజ్ కానుంది. పలు జాతీయ, అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో ప్రశంసలు అందుకుంది. తెలుగు, తమిళ భాషల్లో నవంబరు 11న రిలీజ్ కానున్న ఈ సినిమా ట్రైలర్‌ను హీరో రామ్ షేర్ చేశారు. దీపావళి పండక్కి మనవడికి కొత్త డ్రెస్ కొనాలని ఓ మేకను అమ్మకానికి పెడతాడు తాత. కానీ అది మొక్కుబడి మేక కావడంతో ఊర్లో ఎవరూ కొనరు. చివరికి మటన్‌షాప్ పెట్టుకోవాలనుకునే వీరబాబు కొంటాడు. ఆ తర్వాత ఏం జరిగింది? అన్నదే ఈ చిత్రం ప్రధానాంశం. మేక పాత్ర అబ్బులుకు నటుడు సప్తగిరి వాయిస్ ఓవర్ ఇచ్చారు. ‘‘ఈ చిత్రంలో తాత– మనవడు–మేక మధ్య అనుబంధం, వారి భావోద్వేగాలు ప్రేక్షకుల హృదయాలను కదిలిస్తాయి’’ అని యూనిట్ పేర్కొంది. -
స్టార్ కమెడియన్ కొత్త సినిమా.. విచిత్రమైన టైటిల్
'డీడీ రిటర్న్స్' సినిమాతో ఫామ్‌లోకి వచ్చిన కమెడియన్ కమ్ హీరో సంతానం.. ఆ తర్వాత 'కిక్' చిత్రంతో ఫెయిలయ్యాడు. అయితేనేం హీరోగా ఫుల్ బిజీగా ఉన్నాడు. అతడు చేస్తున్న సినిమాల్లో 'బిల్డప్' ఒకటి. స్టూడియో గ్రీన్ పతాకంపై కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్న ఈ చిత్రానికి కల్యాణ్ దర్శకుడు. రాధిక ప్రీతి హీరోయిన్. దర్శకుడు కేఎస్ రవికుమార్, ఆనంద్‌రాజ్, మన్సూర్ అలీ ఖాన్, మొట్టై రాజేంద్రన్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. (ఇదీ చదవండి: రెండోసారి తండ్రి అయిన 'బలగం' డైరెక్టర్ వేణు) ఇది కామెడీ ఫాంటసీ విలేజ్ సినిమా అని డైరెక్టర్ చెప్పుకొచ్చాడు. 1980 టైంలో జరిగే సినిమా ఇదని చెప్పాడు. ఈ క్రమంలోనే షూటింగ్ లోకేషన్స్, కాస్ట్యూమ్స్ కోసం చాలా కష్టపడినట్లు దర్శకుడు చెప్పుకొచ్చాడు. మరో విషయం ఏంటంటే.. మనోబాల, మైల్సామి నటించిన చివరి చిత్రం ఇదేనని అన్నారు. త్వరలో ఇతర వివరాలు వెల్లడిస్తామని క్లారిటీ ఇచ్చాడు. (ఇదీ చదవండి: మెగాస్టార్ పాన్ ఇండియా సినిమా.. రెండు నెలల్లో పూర్తి) View this post on Instagram A post shared by Santhanam (@santa_santhanam) -
స్టార్ హీరో 25వ సినిమా.. 25 వేల మందికి అన్నదానం
యంగ్ హీరో కార్తీ చేస్తున్న కొత్త సినిమా 'జపాన్'. ఇది కార్తీ 25వ మూవీ. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని దీపావళికి థియేటర్లలోకి రానుంది. ఇక సినిమా రిలీజ్ త్వరలో ఉన్నందున ఆయన అఖిల భారత అభిమాన సంక్షేమ సంఘం.. కార్తీ నిర్వహిస్తున్న ఉళవన్ సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో 25 రోజులపాటు 25 వేల మందికి అన్నదానం కార్యక్రమాన్ని నిర్వహించడానికి సిద్ధమైపోయారు. (ఇదీ చదవండి: హీరో ప్రభాస్ పెళ్లి.. పెద్దమ్మ శ్యామలాదేవి ఇంట్రెస్టింగ్ కామెంట్స్) అన్నదానం కార్యక్రమానికి మంగళవారం ఉదయం స్థానిక టీ.నగర్ లోని కార్తీ అభిమాన సంఘం కార్యాలయంలో శ్రీకారం చుట్టారు. 'జపాన్' చిత్ర నిర్మాత ఎస్ ఆర్.ప్రభు, దర్శకుడు రాజు మురుగన్ విచ్చేసి అన్నదానం కార్యక్రమాన్ని ప్రారంభించారు. 25 వేల మందికి ఒకేసారి అన్నదానం చేయడం కంటే 25 రోజులు చైన్నెలోని ఒక్కో రోజు ఒక్కో ప్రాంతంలో ఆకలితో ఉన్న వారి ఆకలి తీర్చడం మంచిదని భావించినట్లు అభిమాన సంఘ అధ్యక్షుడు చెప్పుకొచ్చారు. (ఇదీ చదవండి: దేశంలో రిచెస్ట్ సింగర్.. వందల కోట్ల ఆస్తి.. ఈమె ఎవరో తెలుసా?) -
ఆ క్రేజీ డైరెక్టర్‌తో విజయ్ సేతుపతి మరోసారి
అప్పట్లో సినిమా ఛాన్సుల కోసం విజయ్ సేతుపతి తెగ తిరిగాడు. ఇప్పుడు తమ సినిమాల్లో నటించాలని దర్శకులు అతడి చుట్టూ తిరుగుతున్నారు. హీరో, విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్.. ఇలా డిఫరెంట్ పాత్రల్లో నటిస్తూ బోలెడంత గుర్తింపు తెచ్చుకున్నాడు. తెలుగు, తమిళ, హిందీల్లో నటిస్తూ 50 చిత్రాల మైలురాయిని టచ్ చేశాడు. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో ఏకంగా 40 సినిమాలు రిలీజ్) విజయ్ సేతుపతి హీరోగా నటించిన 'మహారాజా' సినిమా త్వరలో రిలీజ్ కానుంది. మరోవైపు మిస్కిన్ దర్శకత్వంలో 'పిశాచి 2'లోనూ విజయ్ లీడ్ రోల్ చేశాడు. ఇది కూడా విడుదల కావాల్సి ఉంది. ఇప్పుడు మరోసారి విజయ్‌తో సినిమా చేయాలని మిస్కిన్ ప్లాన్ చేస్తున్నాడు. త్వరలో ఈ ప్రాజెక్ట్ మొదలు కానుంది. (ఇదీ చదవండి: బిగ్‌బాస్ 7 ఎలిమినేషన్.. నయని పావని రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?) -
ఇండస్ట్రీలోకి మరో సంగీత వారసుడు (దర్శకుడు)
సినిమా ఇండస్ట్రీలో వారసులకు లెక్కేలేదు. సంగీత రంగంలోనూ ఈ ట్రెండ్ కొనసాగుతోంది. ఇప్పుడు ఆ లిస్టులో యువ సంగీత దర్శకుడు అమర్గీత్ చేరాడు. తమిళంలో పలు హిట్ సినిమాలకు మ్యూజిక్ అందించిన సౌందర్యన్ పేరు వినగానే చేరన్ పాండియన్, సింధూనదిపూ, గోపురం దీపం వంటి పలు సక్సెస్ఫుల్ చిత్రాలు గుర్తొస్తాయి. ఆయన వారసుడే అమర్గీత్. (ఇదీ చదవండి: బిగ్‌బాస్ చరిత్రలోనే తొలిసారి.. కంటెస్టెంట్ల చేతికి మొబైల్ ఫోన్స్!) అమర్గీత్ సంగీతమందించిన యానిమేషన్ చిత్రం గుండాన్ చట్టీ.. శుక్రవారం థియేటర్లలోకి వచ్చింది. ఈ సందర్భంగా యంగ్ మ్యూజిషీయన్ పలు ఆసక్తికర విషయాల్ని పంచుకున్నాడు. తన తండ్రి ఎలాంటి సలహాలు ఇవ్వకపోయినా ఆయన ద్వారా తాను చాలా నేర్చుకున్నానని చెప్పాడు. గుండాన్ చట్టీ విడుదలకు ముందే రెండు చిత్రాలు ఒప్పుకున్నట్లు చెప్పాడు. తన తొలి సినిమాకే ప్రముఖ గీత రచయిత వైరముత్తు రాసిన పాటకు బాణీలు కట్టడం మర్చిపోలేని అనుభవమని అమర్గీత్ చెప్పుకొచ్చాడు. తనకు ఈ రంగంలో ఏఆర్ రెహమాన్ స్పూర్తి అని, చిన్నప్పటి నుంచి అనిరుధ్ పాటలు వింటూ పెరగడంతో ఆయన సంగీతం అంటే ఇష్టమని చెప్పుకొచ్చాడు. (ఇదీ చదవండి: స్టార్ హీరోతో ప్రేమలో పడ్డ మృణాల్ ఠాకూర్!) -
అలాంటి కాన్సెప్ట్.. కొత్త సినిమా రిలీజ్‌కి రెడీ
సియోన్ రాజా దర్శకత్వం వహించిన కొత్త సినిమా 'సమూగ విరోధి'. జియోనా ఫిలిం ఫ్యాక్టరీ పతాకంపై నిర్మించారు. ప్రజన్ హీరోగా చేసిన ఈ చిత్రానికి జిజు సన్నీ సినిమాటోగ్రఫీ, మాలకి సంగీతమందించారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా చిత్ర ఫస్ట్‌లుక్ పోస్టర్, ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని సోమవారం చైన్నెలోని ప్రసాద్ ల్యాబ్‌లో నిర్వహించారు. (ఇదీ చదవండి: రెండు భాగాలుగా ఆర్జీవీ 'వ్యూహం', రిలీజ్ డేట్లు ఇవే!) ఈ కార్యక్రమంలో పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు పాల్గొన్నారు. చిత్ర దర్శక నిర్మాత సియోన్ రాజా మాట్లాడుతూ.. సమాజంలో ద్రోహులు ఎవరు? అలాంటి వారిని ఎవరు, ఎందుకు తయారు చేస్తున్నారు? అని తెలియజేసే ప్రయత్నమే ఈ చిత్రమని అన్నారు. ఇందులో నటించిన వారందరూ ఎంతగానో సహకరించారని పేర్కొన్నారు. (ఇదీ చదవండి: చై-సామ్ కలుస్తున్నారంటూ వార్తలు.. షాకిచ్చిన సమంత!) -
హిట్ జోడీ రిపీట్.. హాట్ బ్యూటీ మళ్లీ ఆ హీరోతో!
మ్యూజిక్ డైరెక్టర్ కమ్ హీరోగా చేస్తూ అలరిస్తున్న జీవీ ప్రకాష్ కుమార్.. ఈ మధ్యే 'అడియే' సినిమాతో హీరోగా మరో హిట్ కొట్టేశాడు. అంతకు ముందు 'బ్యాచిలర్' మూవీతో సక్సెస్ అందుకున్నాడు. అందులో జీవీ సరసన హాట్ బ్యూటీ దివ్యభారతి హీరోయిన్గా చేసింది. ఈ సినిమాలో ముద్దులు, రొమాన్స్ కి మించి యాక్టింగ్ తో ఈ కాంబో అదరగొట్టేసింది. ఇప్పుడు వీళ్లిద్దరో మరోసారి జోడీగా కనిపించనున్నారట. (ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేస్తున్న రూ.100 కోట్ల మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడే!) 'అడియే' తర్వాత జీవీ ప్రకాష్ హీరోగా నటిస్తున్న సినిమా 'కింగ్స్టన్'. జీవీ నటిస్తూ నిర్మిస్తున్న ఈ చిత్రానికి కమల్ ప్రకాష్ దర్శకత్వం వహిస్తున్నారు. ఫాంటసీ నేపథ్యంలో సాగే రొమాంటిక్ ఎంటర్టైనర్గా ఉండనుందని తెలుస్తోంది. ఇందులోనే దివ్యభారతి హీరోయిన్ అని తెలుస్తోంది. త్వరలో మరిన్ని వివరాలు వెల్లడించే అవకాశముంది. (ఇదీ చదవండి: యాంకర్ సుమ కొడుకు మూవీ టీజర్ చూశారా?) -
ఒక్క సినిమా.. ఏకంగా 15 పల్లె పాటలు
గ్రామీణ పాటలను సినిమాకు పరిచయం చేసింది కళైవానర్ ఎన్ఎస్ కృష్ణన్ అని ప్రఖ్యాత చర్చా వేదిక వ్యాఖ్యాత దిండిగల్ లియోనీ తెలిపారు. మరుదమ్ నాట్టుపుర సంస్థ నిర్వాహకుడు ఎస్.జగన్నాథం నిర్మించిన చిత్రం 'డప్పాంకుత్తు'. ఎస్టీ గుణశేఖర్ కథ, కథనం, మాటలు అందించగా.. ఆర్.ముత్తువీరా దర్శకత్వం వహించారు. శంకరపాండి హీరోగా నటించిన ఈ సినిమాలో దీప్తి, దుర్గ హీరోయిన్స్. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు రిలీజ్) 15 గ్రామీణ పాటలు ఉన్న ఈ సినిమాకు రాజా కె భక్తవత్సలం సినిమాటోగ్రఫీ, శరవణన్ సంగీతమందించారు. గ్రామీణ కళాకారుల జీవన విధానాన్ని ఆవిష్కరించే ఈ చిత్రం.. నిర్మాణ కార్యక్రమాలను పూర్తిచేసుకుని విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా శనివారం సాయంత్రం చైన్నెలోని ప్రసాద్ ల్యాబ్‌లో చిత్ర ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. (ఇదీ చదవండి: ఆ వార్తల వల్ల చాలా బాధపడ్డాను: మెగాస్టార్ చిరంజీవి) -
బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టిన తమిళ మూవీ!
హీరో విక్రమ్ ప్రభు, విదార్థ్, శ్రద్ధ శ్రీనాథ్, అపర్ణతి, సానియా అయ్యప్పన్ ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం ఇరుగప్పట్రు. యువరాజ్ దయాళ్ను దర్శకుడిగా పరిచయం చేస్తూ ఎస్సార్. ప్రభు తన పొటన్షియల్ స్టూడియోస్ పతాకంపై నిర్మించిన ఈ చిత్రం అక్టోబర్ 6న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సందర్భంగా నిర్మాత ప్రభు శనివారం మీడియాకు ఓ ప్రకటన విడుదల చేశారు. ఈతరం యువకులు కుటుంబ జీవితాల్లో ఎదుర్కొనే సమస్యలను వాటికి పరిష్కారాన్ని చక్కగా తెరపై ఆవిష్కరించిన చిత్రం ఇరుగప్పట్రు అని తెలిపారు. ఈ చిత్రం రెండవ రోజు నుంచి థియేటర్లలో ప్రదర్శన ఆటలను పెంచారని చెప్పారు. ఈ చిత్రానికి విశేష ఆదరణ లభించడం సంతోషంగా ఉందన్నారు. మంచి కథా చిత్రాలను ఎప్పు డూ ఆదరిస్తామని ప్రేక్షకులు మరోసారి ఈ చిత్రం ద్వారా నిరూపించారన్నారు. ఇరుగచుట్రు చిత్రం బ్లాక్ బస్టర్ అయిందని ఆయన పేర్కొన్నారు. చదవండి: బిగ్‌బాస్ బ్యూటీ శుభశ్రీ.. ఐదు వారాల్లో ఎంత వెనకేసిందంటే? -
రిలీజ్‌కి రెడీ అయిన సైంటిఫిక్ యాక్షన్ థ్రిల్లర్
రెహ్మాన్, భరత్ కలిసి నటించిన చిత్రం 'సమరా'. పీకాక్ ఆర్ట్ హౌస్ పతాకంపై ఎంకే.సుభాకరన్, అనూస్ వర్గీస్ విల్యాడత్ కలిసి నిర్మించిన ఈ చిత్రానికికి చార్లెస్ జోసెఫ్ దర్శకత్వం వహించారు. ఇందులో టామ్ కాడ్ బిజాల్ ప్రసన్న, కేనల్ మ్యాథ్వీ జార్జ్, సోనాలి సుడన్, టీనీజ్ విల్యా, శ్రీలా లక్ష్మి, శీను సిద్ధార్థ సంజన దీపు రాహుల్ ముఖ్యపాత్రలు పోషించారు. బజరంగీ భాయిజాన్ ఫేమ్ మీర్ సర్వార్ విలన్‌గా నటించాడు. (ఇదీ చదవండి: వరదల్లో గల్లంతైన టాలీవుడ్ సీనియర్ హీరోయిన్!) సైంటిఫిక్ యాక్షన్ థ్రిల్లర్ కథతో తీసిన ఈ సినిమాలో రెహ్మాన్ పాత్ర అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరిస్తుందని డైరెక్టర్ చెప్పాడు. ఈచిత్రానికి దీపక్ వారియర్ సంగీతాన్ని అందిస్తున్నాడు. తమిళం, మలయాళం, కన్నడం భాషల్లో ఏకకాలంలో నిర్మించినట్లు చెప్పారు. నిర్మాణ కార్యక్రమాలను ఈ చిత్రాన్ని ఈనెల 13న విడుదల చేస్తున్నట్లు చెప్పారు. (ఇదీ చదవండి: మెగా ఇంట మొదలైన పెళ్లి సందడి.. చిరంజీవి ట్వీట్ వైరల్!) -
ఈగో సమస్యలపై సినిమా.. హీరోయిన్గా 'జెర్సీ' బ్యూటీ
శ్రద్ధ శ్రీనాథ్.. ఈ పేరు చెబితే తెలియకపోవచ్చు గానీ నాని 'జెర్సీ' హీరోయిన్ అంటే టక్కున గుర్తుపట్టేస్తారు. 'విక్రమ్ వేద' మూవీతో హీరోయిన్గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత 'నేర్కొండ పార్వై' చిత్రంతో సత్తాచాటింది. తెలుగులోనూ మంచి క్రేజ్ తెచ్చుకున్న ఈ కన్నడ భామ.. తమిళంలో చేసిన కొత్త సినిమా 'ఇరుగపట్రు'. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 29 సినిమాలు) యువరాజ్ దయాళన్ దర్శకత్వంలో పొటెన్షియల్ స్టూడియోస్ పతాకంపై ఎస్ఆర్ ప్రభు నిర్మించిన ఈ చిత్రంలో విక్రమ్ ప్రభు, విధార్థ్, శ్రద్ధా శ్రీనాథ్, మహిమా నంబియార్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. నిర్మాణం పూర్తి చేసుకుని చిత్రం ఈ నెల 6వ తేదీన తెరపైకి రానుంది. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్రద్ధ శ్రీనాథ్.. సినిమా గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ప్రస్తుత జనరేషన్ ఈగో సమస్యల కాన్సెప్ట్‌తోనే 'ఇరుగపట్రు' తీశారని శ్రద్ధ శ్రీనాథ్ చెప్పింది. ఇందులో తన పాత్ర చాలా కొత్తగా ఉంటుందని క్లారిటీ ఇచ్చింది. (ఇదీ చదవండి: త్వరలో పెళ్లి చేసుకోబోతున్న మంగ్లీ? స్పందించిన సింగర్!) -
పేరుకే చిన్న సినిమా.. కానీ ఆరుగురు మ్యూజిక్ డైరెక్టర్స్!
రిచర్డ్ రిషి హీరోగా నటిస్తున్న సినిమా 'సిల నొడిగళిల్'. పున్నగై పూ గీత, యాషిక ఆనంద్ హీరోయిన్లుగా చేస్తున్నారు. వినయ్ భరద్వాజ్ దర్శకుడు. ఈయన సింగపుర్‌లో 12 ఏళ్లుగా బ్యాంక్ ఉద్యోగం చేసి ఆ తర్వాత.. సలాం నమస్తే సింగపూర్, స్టార్ టాక్ విత్ వినయ్ వంటి అంతర్జాతీయ టాక్ షోలకు వ్యాఖ్యాతగా చేశారు. పలు వెబ్ సిరీస్‌లకు దర్శకత్వం వహించారు. ఈనేపథ్యంలో ఆయన తొలిసారిగా డైరెక్షన్ చేస్తున్న తమిళ చిత్రం సిల నొడిగళిల్. (ఇదీ చదవండి: 'బిగ్‌బాస్' ఎలిమినేషన్ తర్వాత రతిక ఫస్ట్ రియాక్షన్) పున్నగై పూ గీత ఎస్క్వైర్ ప్రొడక్షనన్స్ యూకే సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం గురించి దర్శకుడు మాట్లాడుతూ.. ఇది మిస్టరీ సినిమా అన్నారు. పెళ్లయిన జంట బ్యాక్ డ్రాప్ స్టోరీతో సాగే ఈ చిత్రం లండన్ తీశామని చెప్పారు. ఇందులోని ఐదు పాటలకు మసాలా కేఫ్, స్టాకట్టో మ్యూజిక్ బ్యాండ్, బిజోర్న్ సుర్రావ్, దర్శన కేటీ, రోహిత్ లాంటి ఐదుగురు సంగీత దర్శకులు పనిచేశారని చెప్పారు. నేపథ్య సంగీతాన్ని ప్రముఖ బాలీవుడ్ సంగీత దర్శకుడు రోహిత్ కులకర్ణి అందించినట్లు క్లారిటీ ఇచ్చారు. ఇలా ఓ చిన్న సినిమా కోసం ఆరుగురు సంగీత దర్శకులు అంటే సాహసమనే చెప్పాలి. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 29 సినిమాలు) -
'శపథం' పూర్తి చేసిన స్టార్ హీరో
రంగస్థలం, నిన్నుకోరి తదితర చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకుల్ని అలరించిన నటుడు ఆది పినిశెట్టి. ఇతడు హీరోగా నటించిన కొత్త మూవీ శపథం. అరివళగన్ దర్శకుడు. ఇంతకుముందు వీళ్ల కాంబోలో 'ఈరం' చిత్రాన్ని తీశారు. అది హిట్ కావడంతో ఈ సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి. ఈ చిత్రాన్ని తెలుగులో 'శబ్దం' పేరుతో రిలీజ్ చేయనున్నారు. (ఇదీ చదవండి: ‘పెదకాపు 1’ మూవీ రివ్యూ) హరర్, థ్రిల్లర్ సినిమాలతో తీయడంలో ఎక్స్పర్ట్ అయిన అరివళగన్.. అదే తరహా నేపథ్యాన్ని ఎంచుకున్నాడు. సిమ్రాన్, లైలా, లక్ష్మీమేనన్, రెడిన్ కింగ్స్లీ తదితరులు నటించిన ఈ చిత్రానికి తమన్ సంగీతమందించాడు. కాగా శపథం షూటింగ్ పూర్తయినట్లు దర్శకుడు ప్రకటించాడు. ప్రస్తుతం నిర్మాణ కార్యక్రమాలు జరుగుతున్నాయని.. త్వరలో ఫస్ట్‌లుక్, ట్రైలర్ విడుదల చేస్తామని పేర్కొన్నారు. (ఇదీ చదవండి: రామ్ పోతినేని స్కంద.. ఫస్ట్ డే కలెక్షన్స్ ఎన్ని కోట్లంటే?) -
స్టార్ హీరో సిద్ధార్థ్‌కి నిరసన సెగ.. ఆ గొడవ వల్లే!
స్టార్ హీరో సిద్ధార్థ్‌కు నిరసన సెగ తగిలింది. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా బెంగళూరు వెళ్లిన ఇతడికి చేదు అనుభవం ఎదురైంది. నేరుగా ఈవెంట్ జరుగుతున్న చోటుకే వచ్చిన కొందరు వ్యక్తులు ప్రెస్‌మీట్‌ని అడ్డుకున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఇంతకీ ఏం జరిగింది? (ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి 37 సినిమాలు) హీరో సిద్ధార్థ్ నటించి నిర్మించిన కొత్త సినిమా 'చిత్తా'. దీన్ని తమిళంతో పాటు ఇతర భాషల్లోనూ రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. ఈ క్రమంలోనే బెంగళూరు వెళ్లి ప్రెస్ మీట్ లో పెట్టాడు. ప్రస్తుతం తమిళనాడు-కర్ణాటక రాష్ట్రాల మధ్య కావేరి నదీ జలాల వివాదం నడుస్తోంది. దీంతో అక్కడికి అకస్మాత్తుగా వచ్చిన కరవే కార్యకర్తలు.. సిద్ధార్థ్‌ని అక్కడి నుంచి వెళ్లిపోవాలని సూచించారు. ప్రమోషన్స్ కి ఇది సరైన టైమ్ కాదని, వేరే ఎప్పుడైనా చేసుకోవాలని చెప్పారు. దీంతో విషయం అర్థం చేసుకున్న సిద్ధార్థ్.. అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అయితే వెళ్తూ వెళ్తూ.. అందరూ తన సినిమా చూడాలంటూ చేతులు జోడించి మరీ స్టేజీ దిగి వెళ్లిపోయాడు. అయితే కరవే కార్యకర్తలు వచ్చినప్పుడు సిద్దార్థ్ కన్నడలో తన సినిమా గురించి మాట్లాడేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. దీంతో అతడి ప్రసంగాన్ని అడ్డుకున్న కరవే కార్యకర్తలు.. తమిళ సినిమా ఎవరూ ప్రోత్సాహించొద్దని డిమాండ్ చేశారు. ఇప్పుడు ఈ వీడియో తమిళ-కన్నడ ఇండస్ట్రీల్లో హాట్ టాపిక్‌గా మారింది. (ఇదీ చదవండి: 'బిగ్‌బాస్ 7' కోసం నాగార్జునకి అన్ని కోట్ల రెమ్యునరేషన్!?) Actor #Siddharth was forced to leave a press conference he was attending of #Tamil movie "#Chiththa" on #September 28, due to angry #protestors over the #Cauverywater dispute. pic.twitter.com/qviXRWcgLM — Madhuri Adnal (@madhuriadnal) September 28, 2023 -
భార్యకు బహుమతిగా ఆ సినిమా.. స్టార్ హీరో కామెంట్స్!
మానగరం, మాన్స్టర్, టాణాకారన్ లాంటి డిఫరెంట్ హిట్ సినిమాలని నిర్మించిన పొటాన్షియల్ స్టూడియోస్ సంస్థ తీసిన కొత్త మూవీ 'ఇరుగప్పట్రు'. విక్రమ్‌ప్రభు, విధార్థ్, శ్రీ, శ్రద్ధాశ్రీనాథ్, సానియా అయప్పన్, అపర్నది ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి 'ఎలి' ఫేమ్ యువరాజ్ దయాళన్ దర్శకత్వం వహించారు. జస్టిన్ ప్రభాకరన్ సంగీతమందించారు. అక్టోబర్ 6న థియేటర్లలోకి రానుంది. (ఇదీ చదవండి: అనుకోకుండా కిస్.. వాంతి చేసుకున్న 'కేజీఎఫ్' బ్యూటీ) రిలీజ్ దగ్గరపడిన సందర్భంగా చైన్నెలోని తాజాగా ప్రెస్ మీట్ నిర్వహించారు. ఇందులో శ్రద్ధా శ్రీనాథ్ టైలర్‌మేడ్ పాత్ర పోషించారని, ఈ మూవీ కోసం బరువు కూడా పెరిగారని చెప్పుకొచ్చారు. నటుడు విధార్ధ్ పారితోషికం లేకుండానే ఈ చిత్రంలో నటిస్తానని చెప్పారని తెలిపారు. నటుడు విక్రమ్ ప్రభు మాట్లాడుతూ.. అక్టోబరు తనకు చాలా ప్రత్యేకమైందని అన్నాడు. అక్టోబరు 6 తన తాతగారు శివాజీగణేశన్ పుట్టినరోజు అని, అలానే తన భార్య పుట్టినరోజు కూడా అని చెప్పాడు. అందుకే ఆ చిత్రాన్ని తన భార్యకు బహమతిగా ఇస్తానని చెప్పానని పేర్కొన్నాడు. (ఇదీ చదవండి: 'స్కంద' ఓటీటీ పార్ట్నర్ ఫిక్స్.. స్ట్రీమింగ్ అప్పుడే!) -
సిద్ధార్థ్ కొత్త సినిమా.. రెండేళ్లు కేవలం దానికోసమే!
సిద్ధార్థ్ హీరోగా నటించి నిర్మించిన సినిమా 'చిత్తా'. ఎస్.యం అరుణ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నిమిషా సజయన్, అంజలి నాయర్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ చిత్రం తెలుగు, తమిళ, మలయాళం, కన్నడలో గురువారం విడుదల కానుంది. (ఇదీ చదవండి: ఆస్కార్ బరిలో చిన్న సినిమా.. అవార్డ్ దక్కేనా?) ఈ సందర్భంగా సోమవారం చైన్నెలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిద్ధార్థ్ మాట్లాడుతూ ఇది నిర్మాతగా తన తొలి చిత్రం అని చెప్పాడు. నిర్మాతగా మారాలనుకున్నప్పుడు రాజీ పడకుండా సహజత్వంతో కూడిన మంచి కథ చిత్రం చేయాలని అనుకున్నాను. అలానే ప్రీ ప్రొడక్షన్ కోసమే సుమారు రెండేళ్లు టైమ్ తీసుకున్నట్లు చెప్పాడు. సినిమాలోని చాలా సన్నివేశాలని పళనిలో లైవ్‌గా చిత్రీకరించినట్లు సిద్ధార్థ్ చెప్పుకొచ్చాడు. 'చిత్తా' మూవీని చూసి తన యాక్టింగ్‌ని ప్రశంసించిన సినీ ప్రముఖులకు కృతజ్ఞతలు తెలియజేశారు. (ఇదీ చదవండి: Bigg Boss 7: పల్లవి ప్రశాంత్ తలకు గాయం.. కుప్పకూలిపోయిన రైతు బిడ్డ!) -
కపిల్ రిటన్స్.. దర్శకనిర్మాత, హీరో అన్నీ ఒక్కరే.. కాన్సెప్ట్ ఏంటంటే?
ధనలక్ష్మి క్రియేషన్స్ పతాకంపై శ్రీనీ సుందరరాజన్ స్వీయ దర్శకత్వంలో నిర్మించి కథానాయకుడిగా నటించిన చిత్రం కపిల్ రిటన్స్. నటి నిమిషా రియాజ్ ఖాన్, పరుత్తివీరన్ సరవణన్, వయాపురి మాస్టర్ భరత్, మాస్టర్ జాన్, బేబీ షర్షా ముఖ్యపాత్రలు పోషించారు. నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని త్వరలో విడుదలకు సిద్ధమవుతున్న ఈ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని స్థానిక సాలిగ్రామంలోని ప్రసాద్ ల్యాబ్‌లో నిర్వహించారు. ఇందులో ప్రముఖ రచయిత శుభ పాండియన్, దర్శకుడు ఆర్వీ. ఉదయ్ కుమార్, పేరరసు, గీత రచయిత స్నేహన్, నిర్మాత ఎన్. విజయ మురళి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు, నిర్మాత, నటుడు శ్రీనీ సుందర రాజన్ మాట్లాడుతూ ఇది ‘మీ కలలు నెరవేరాలంటే శ్వాస ఉన్నంతవరకు ప్రయత్నించు’ అనే ఇతివృత్తంతో రూపొందించిన కథా చిత్రం అని చెప్పారు. చిన్నారుల నుంచి వృద్ధుల వరకు అన్ని వర్గాలను అలరించే విధంగా చిత్రంలోని కథా సన్నివేశాలు చోటు చేసుకుంటాయన్నారు. దర్శకుడు పేరరసు మాట్లాడుతూ ఇది విద్యార్థులకు తల్లిదండ్రులకు మధ్య అవగాహనతో కూడిన అనుబంధాన్ని ఆవిష్కరించే కథాచిత్రంగా దీన్ని తెరకెక్కించారన్నారు. ఇది తల్లిదండ్రులు పిల్లలు కలిసి చూడాల్సిన ఓ అద్భుతమైన చిత్రమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఈ చిత్ర దర్శకుడికి అభినందనలు తెలిపారు. చదవండి: నా జీవితంలో ఆ ముగ్గుర్నీ ఎప్పుడూ మర్చిపోను -
హీరోయిన్ సాయిపల్లవి పెళ్లి రూమర్స్.. అసలేం జరిగింది?
హీరోయిన్ సాయిపల్లవి పేరు చెప్పగానే ప్రేమమ్, ఫిదా లాంటి అద్భుతమైన సినిమాలు గుర్తొస్తాయి. గతేడాది వేసవిలో ఓ రెండు సినిమాలతో అలరించిన ఈమె.. ఆ తర్వాత బయట ఎక్కడా కనిపించలేదు. దీంతో పెళ్లి కోసమే బ్రేక్ తీసుకుందని రూమర్స్ వచ్చాయి. ఇప్పుడు ఏకంగా మెడలో దండతో సాయిపల్లవి ఉన్న ఓ ఫొటో, సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. దీంతో ఆమెకు పెళ్లి అయిపోయిందా అనుకుంటున్నారు. ఇంతకీ నిజమేంటి? ఏం జరిగింది? 'ప్రేమమ్' అనే మలయాళ సినిమాతో హీరోయిన్గా మారిన సాయిపల్లవి.. 'ఫిదా'తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. మిడిల్ క్లాస్ అబ్బాయి, పడిపడి లేచే మనసు, లవ్ స్టోరీ, శ్యామ్ సింగరాయ్ లాంటి మూవీస్ చేసింది. గతేడాది చివరగా 'విరాటపర్వం' చిత్రంతో ప్రేక్షకుల్ని పలకరించింది. ఆ తర్వాత మరో తెలుగు సినిమా ఒప్పుకోలేదు. దీంతో నటన పక్కనబెట్టేసిందని, పెళ్లి చేసుకుబోతుందని రూమర్స్ వచ్చాయి. (ఇదీ చదవండి: ఆ సీన్ చేసినందుకు ఇప్పటికీ బాధపడుతున్నా: సదా) అది పెళ్లి ఫొటోనా? అయితే 'విరాటపర్వం', 'గార్గీ' చిత్రాల తర్వాత చిన్న బ్రేక్ తీసుకున్న సాయిపల్లవి.. ప్రస్తుతం తమిళంలో శివకార్తికేయన్, తెలుగులో నాగచైతన్యతో సినిమాలు చేస్తోంది. అయితే రీసెంట్గా సాయిపల్లవి, మరో వ్యక్తి దండలతో ఉన్న ఫొటో ఒకటి వైరల్ అయింది. అయితే అందరూ అనుకుంటున్నట్లు అది సాయిపల్లవి పెళ్లి ఫొటో కాదు, శివకార్తికేయన్ సినిమా పూజా కార్యక్రమంలోని ఫొటో. కానీ కొందరు ముందు వెనక చూడకుండా ఈమెకు పెళ్లయిపోయిందని కామెంట్స్ చేస్తున్నారు. డైరెక్టర్ క్లారిటీ 'విరాటపర్వం' దర్శకుడు వేణు ఊడుగుల కూడా.. సాయిపల్లవి పెళ్లి రూమర్‌పై పరోక్షంగా స్పందించాడు. అయితే ఈ విషయాన్ని ఎక్కడా ప్రస్తావించకుండా.. అసలు ఫొటో ఇదిగో అని చెప్పి, ఫుల్ ఫొటోని తన ఫేస్ బుక్ లో పోస్ట్ చేశాడు. దీంతో ఈమె ఫ్యాన్స్.. హమ్మయ్యా అని ఊపిరి పీల్చుకున్నారు. ఇదిలా ఉండగా నాగచైతన్య సినిమాలో ఈమెని హీరోయిన్గా సెలెక్ట్ చేసినట్లు అధికారికంగా ప్రకటించారు. (ఇదీ చదవండి: హీరోయిన్ త్రిషకు పెళ్లి? ఆ నిర్మాతతో ఏడడుగులు!) -
రూట్ మార్చిన స్టార్ హీరో.. అలాంటి మూవీలో
ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న నటుడు జయం రవి. ఈయన నయనతారతో కలిసి నటించిన 'ఇరైవన్' చిత్రం త్వరలో రిలీజ్ కానుంది. మరోపక్క 'సైరన్' మూవీ షూటింగ్ పూర్తి చేసుకుంది. ఇందులో కీర్తి సురేశ్ హీరోయిన్. తాజాగా జయం రవి 30వ సినిమా టైటిల్‌ని వినాయక చవితి సందర్భంగా విడుదల చేశారు. ఈ చిత్రానికి 'బ్రదర్' అనే టైటిల్ నిర్ణయించారు. ఇందులో ప్రియాంక మోహన్ హీరోయిన్గా నటిస్తోంది. ఎం.రాజేష్ దర్శకత్వం వహిస్తున్నారు. నటరాజన్, భూమిక, శరణ్య, గణేష్, రావు రమేష్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. హరీశ్ జయరాజ్ సంగీతాన్ని అందిస్తున్నాడు. అయితే ఈ మధ్య కాలంలో ఎక్కువగా యాక్షన్ సినిమాలు చేస్తున్న జయం రవి.. ఇప్పుడు రూట్ మార్తి కుటుంబ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో నటిస్తున్నాడు. చైన్నె, హైదరాబాద్, ఊటీ, కొడైక్కెనాల్ ప్రాంతాల్లో షూటింగ్ చేస్తామని దర్శకుడు చెప్పుకొచ్చాడు. (ఇదీ చదవండి: ఒక్క ఫైట్ సీన్.. ఆ హీరో జీవితాన్నే ముగించింది!) Excited to be a '#Brother,' a word that connects us all ♥️ Releasing worldwide in Tamil & Telugu !!! #BrotherMovie #BrotherFirstLook Happy #VinayagarChathurthi @rajeshmdirector @jharrisjayaraj @screensceneoffl @priyankaamohan @bhumikachawlat @vivekcinema@saranyaponvanan… pic.twitter.com/YvUQMHMJLl — Jayam Ravi (@actor_jayamravi) September 18, 2023 -
'కేజీఎఫ్' విలన్ కొత్త సినిమా.. ట్రైలర్ ఇంట్రెస్టింగ్
తమిళ నటుడు సూరి కొత్త సినిమా 'బడవ'. సంగీత దర్శకుడు జాన్ పీటర్ నిర్మాతగా మారి జే స్టూడియోస్ ఇంటర్నేషనల్ పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఆయనే సంగీతం అందిస్తున్నారు. కె.వి.నంద దర్శకుడు. శత హీరోయిన్గా నటిస్తున్న ఇందులో 'కేజీఎఫ్' ఫేమ్ రామ్ విలన్. దేవదర్శిని నమోనారాయణన్, వినోదిని, శరవణశక్తి, శ్యామ్ ముఖ్యపాత్రలు పోషిస్తున్న దీనికి వినోద్‌ఖన్నా ఛాయాగ్రహణం అందిస్తున్నారు. (ఇదీ చదవండి: నాగ్ ఇచ్చిపడేశాడు.. రైతుబిడ్డ ముఖం మాడిపోయింది!) ఈ చిత్ర ఆడియో ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని గురువారం స్థానిక వడపళనిలోని కమలా థియేటర్లో నిర్వహించారు. ఈ చిత్రంతో వీళ్లందరూ కచ్చితంగా మంచి స్థాయికి చేరుకుంటారనే నమ్మకం ఉందన్నారు. విమల్, సూరిలది మంచి కాంబినేషన్ అని, 'బడవ' హిట్ అవుతుందనే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇది మంచి మూవీ అవుతుందని దర్శకుడు పేరల్స్ ఆశాభావం వ్యక్తం చేశారు. (ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి 30 సినిమాలు) -
మా సినిమాలో నటించేందుకు ఏ హీరో ముందుకు రాలే.. అందుకే..
దర్శకుడు, నిర్మాత కథానాయకులుగా నటించిన చిత్రం ఎనక్కు ఎండే కిడైయాదు. హంగ్రీ ఎంటర్టైన్మెంట్ అండ్ ప్రొడక్షన్ ఎల్ఎల్పి పతాకంపై కార్తీక్ వెంకట్రామన్ నిర్మించి హీరోగా నటించిన చిత్రం ఇది. ఈ చిత్రం ద్వారా విక్రమ్ రమేష్ దర్శకుడిగా పరిచయం అవుతూ మరో హీరోగా నటించారు. నటి స్వయంశిత కథానాయికగా నటించిన ఇందులో శివకుమార్‌రాజు, పిచ్చైక్కారన్ చిత్రం ఫేమ్ మురళి శ్రీనివాసనన్, శక్తివేల్ ముఖ్యపాత్రలు పోషించారు. దళపతి రత్నం చాయాగ్రహణం, కళా చరణ్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తిచేసుకుని విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా చిత్రం నిర్మాత, కథానాయకుడు కార్తీక్ వెంకట్రామన్ చిత్ర వివరాలను తెలుపుతూ చెన్నై పరిసర ప్రాంతాల్లో షూటింగ్‌ను 35 రోజుల్లో పూర్తిచేసినట్లు చెప్పారు. ముందుగానే రిహార్సల్స్ చేసి షూటింగ్‌కు వెళ్లినట్లు తెలిపారు. అనవసర విషయాల్లో జోక్యం చేసుకుని సమస్యల్లో ఇరుక్కోకూడదు అని చెప్పే కథా చిత్రంగా ఇది ఉంటుందన్నారు. రెండు, మూడు చిత్రాల్లో నటించిన హీరోలు తమ చిత్రంలో నటించడానికి నిరాకరించడంతో తామే హీరోలుగా నటించినట్లు తెలిపారు. ఇది హిందీ చిత్రం హ్యాంగోవర్ తరహాలో ఉంటుందన్నారు. చిత్రం చూడడానికి థియేటర్లోకి వచ్చిన ప్రేక్షకులను ఐదు నిమిషాల్లోనే కథలో లీనమయ్యేలా చేస్తుందన్నారు. చిత్రాన్ని చూసిన సినీ ప్రముఖులు చాలా ఫ్రెష్‌గా ఉందని ప్రశంసించారని చెప్పారు. చిత్ర విడుదల హక్కులను యాక్షన్ రియాక్షన్ సంస్థ అధినేత జెనీష్ పొందారని, త్వరలోనే దీన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు చెప్పారు. చదవండి: గర్భం దాల్చాను.. అమ్మ అబార్షన్ చేయించింది.. ప్రియుడితో ఇప్పటికీ టచ్‌లో.. -
వెండితెరపై మరో సిల్క్ స్మిత.. తెగ వైరలవుతున్న ఫోటో!
తమిళ స్టార్ హీరో విశాల్ నటిస్తోన్న సైన్స్ ఫిక్షన్ చిత్రం 'మార్క్ ఆంటోని'. రీతూ వర్మ, అభినయ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇటీవలే హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించారు.ఈ చిత్రంలో ఎస్ జే.సూర్య ప్రతినాయకుడిగా నటించారు. విశాల్, ఎస్జే సూర్య ద్విపాత్రాభినయం చేయడం మరో విశేషం. మార్క్‌ఆంటోనీ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తిచేసుకుని ఈనెల 15న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. తమిళం, తెలుగు హిందీ భాషల్లో రిలీజ్ చేయనున్నారు. (ఇది చదవండి: ఒకే ఏడాదిలో రెండు విషాదాలు.. శోకసంద్రంలో మమ్ముట్టి కుటుంబం!) ఈ చిత్రానికి అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ కాగా.. ప్రేక్షకుల అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. ఈ ట్రైలర్ చూసిన అభిమానులు ఈ సినిమాలో దివంగత నటి సిల్క్ స్మితను చూసి షాక్ తిన్నారు. అయితే ఈ పాత్రను ఏఐ టెక్నాలజీ రూపొందించారని అందరూ భావించారు. అసలు మార్క్ ఆంటోనీ చిత్రంలో నిజంగానే సిల్క్ స్మిత పాత్ర కనిపించనుందా? ఆ ట్రైలర్లో ఉన్న నటి ఎవరు? అదేంటో తెలుసుకుందాం. 'మార్క్ ఆంటోని' ట్రైలర్లో నటి సిల్క్ స్మితను చూసి ప్రేక్షకులు షాక్ అవుతున్నారు. మొదటగా సిల్క్ స్మితను ఏఐ టెక్నాలజీ సాయంతో రీక్రియేట్ చేసినట్లు వార్తలొచ్చాయి. కానీ వాటిలో ఎలాంటి నిజం లేదని తెలిసింది. అచ్చం సిల్క్ స్మితను పోలి ఉండే మరో తమిళ నటి మన ముందుకు రాబోతోంది. ఆమెనే విష్ణుప్రియా గాంధీ. సిల్క్ పాత్రలో విష్ణుప్రియా గాంధీ అచ్చం ఆమె పోలికతో అందరి దృష్టిని ఆకర్షించింది. ఇది చూసిన నెటిజన్స్ మాత్రం అచ్చం సిల్క్ స్మిత సిస్టర్లా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు. (ఇది చదవండి: విశాల్ 'మార్క్ ఆంటోనీ' సినిమాపై బ్యాన్ విధించిన కోర్టు) ఈ నేపథ్యంలో దీనిపై మార్క్ ఆంటోని మేకప్ ఆర్టిస్ట్ కృష్ణవేణి బాబు సైతం సోషల్ మీడియా ద్వారా క్లారిటీ ఇచ్చారు. ఈ పాత్రకు సిల్క్ స్మితగా విష్ణుప్రియా గాంధీని తీర్చిదిద్దే అవకాశమిచ్చినందుకు సోషల్ మీడియా వేదికగా ధన్యవాదాలు తెలిపారు. గ్యాంగ్‌స్టర్ నేపథ్యంలో తెరకెక్కించిన ఈ చిత్రంలో సునీల్, సెల్వరాఘవన్ ప్రధాన పాత్రలు పోషిస్తుండగా.. జీవి ప్రకాశ్ సంగీతమందిస్తున్నారు. View this post on Instagram A post shared by Venu Chaithu (@venuchaithu28) View this post on Instagram A post shared by Venu Chaithu (@venuchaithu28) -
స్టార్ హీరో నెవ్వర్ బిఫోర్ లుక్.. గ్లింప్స్ అదిరింది!
తమిళ హీరో జయం రవి కొత్త సినిమా 'సైరన్'. మూవీ మేకర్స్ పతాకంపై సుజాత విజయకుమార్ నిర్మిస్తున్న ఈ భారీ చిత్రంతో ఆంటనీ భాగ్యరాజ్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఇంతకు ముందు ఈ డైరెక్టర్.. అభిమన్యుడు, విశ్వాసం, హీరో చిత్రాలకు కథ సహకారం అందించాడు. ఇకపోతే జయం రవి పుట్టినరోజు కానుకగా ఆదివారం 'సైరన్' ప్రీ ఫేస్ వీడియోని రిలీజ్ చేశారు. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 32 సినిమాలు) ఈ సినిమాలో జయం రవి సరసన కీర్తి సురేశ్, అనుపమ పరమేశ్వరన్ నటిస్తున్నారు. యోగిబాబు, సముద్రఖని ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. సాల్ట్ పెప్పర్ లుక్‌తో ఓ బల్లపై కూర్చుని టీ తాగుతున్న జయం రవి ఫొటోను పోస్టర్‌గా కాకుండా చిన్న వీడియోగా విడుదల చేశారు. భారీ బడ్జెట్‌తో తీస్తున్న 'సైరన్' సినిమాని యాక్షన్ కిల్లర్ బ్యాక్‌డ్రాప్ స్టోరీతో తెరకెక్కించారు. షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణ కార్యక్రమాలు జరుగుతున్నాయి. మిగతా వివరాలని త్వరలోనే వెల్లడిస్తామని చెప్పారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతమందిస్తున్నాడు. (ఇదీ చదవండి: 'పుష్ప 2' రిలీజ్ డేట్ ఫిక్స్.. పెద్ద ప్లానింగే) -
ఆ సినిమాలో ఏకంగా 24 పాటలు.. అది కూడా!
తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో తీస్తున్న సినిమా 'సికాడ'. సంగీత దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న శ్రీజిత్ ఎడవానా.. ఈ చిత్రంతో డైరెక్టర్‌గా పరిచయం అవుతున్నాడు. తొలి ప్రయత్నంలోనే నాలుగు భాషల్లో తెరకెక్కిస్తున్న ఈ మూవీ గురించి ఆయన పలు విషయాలు చెప్పారు. (ఇదీ చదవండి: స్టార్ క్రికెటర్ బయోపిక్.. ఐదేళ్ల క్రితమే మొదలైంది కానీ) ఈ సినిమా ఉత్కంఠ భరితంగా సాగే అడ్వంచర్ థ్రిల్లర్ అని డైరెక్టర్ శ్రీజిత్ చెప్పుకొచ్చాడు. నాలుగు భాషల్లో ఒకే టైటిల్లో ఒకేసారి తీస్తున్న ఈ చిత్రంలో 24 పాటలు ఉంటాయని అన్నారు. తీర్నా ఫిలిమ్స్ అండ్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై వందన మీనన్, పి.గోపకుమార్ కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రంలో రజిత్ సీఆర్ జాయ్స్ జోస్, గాయత్రి మయూర తదితరులు ప్రధాన పాత్రలు పోషించారని చెప్పారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని త్వరలో విడుదలకు సిద్ధమవుతున్న ఈ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను నటుడు విశాల్ చేతుల మీదుగా ఆవిష్కరించినట్లు చెప్పారు. టాలెంట్‌ని ప్రోత్సహించే విశాల్.. తమ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్ని చూసి యూనిట్‌ను అభినందించినట్లు చెప్పారు. ఈ చిత్రాన్ని త్వరలో విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు దర్శకుడు తెలిపారు. (ఇదీ చదవండి: ఓ ఇంటివాడు కాబోతున్న మానస్.. హల్దీ వేడుకలు షురూ) -
'రాజా రాణి' బ్యూటీ.. బంపరాఫర్ కొట్టేసింది!
మలయాళ బ్యూటీ నజ్రియా మరో బంపరాఫర్ కొట్టేసినట్లు అనిపిస్తుంది. నాని 'అంటే సుందరానికీ' మూవీతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. కానీ 'జవాన్' డైరెక్టర్ అట్లీ తీసిన 'రాజా రాణి'లో నజ్రియా ఓ హీరోయిన్ గా చేసింది. అప్పటి నుంచి ఈమెకు తెలుగులో బోలెడంత మంది అభిమానులు ఏర్పడ్డారు. ఏరికోరి సినిమాలు చేసే ఈమె.. ఇప్పుడు ఓ క్రేజీ ప్రాజెక్టులో భాగమైందట. (ఇదీ చదవండి: పెళ్లికి వెళ్లిన ఉపాసన.. ఆ ఫొటో బయటపెట్టడంతో) కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రస్తుతం 'కంగువ' అనే పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు. ఇప్పటికే సగం షూటింగ్ పూర్తయింది. దీని తర్వాత వెట్రిమారన్ దర్శకత్వంలో 'వడివాసల్' మూవీ చేస్తాడు. మరోవైపు 'ఆకాశమే హద్దురా'తో సూపర్ హిట్ ఇచ్చిన సుధా కొంగర దర్శకత్వంలో సూర్య నటించాల్సి ఉంది. ఇందులో హీరోయిన్ గా అదితి శంకర్ అన్నట్లు వార్తలొచ్చాయి. కానీ ఇప్పుడు నజ్రియా పేరు వినిపిస్తోంది. అయితే ఇందులో నజ్రియాని హీరోయిన్ పాత్ర కోసం సెలెక్ట్ చేశారా? లేదా స్పెషల్ రోల్ అనేది తెలియాల్సి ఉంది. ఇందులో దుల్కర్ సల్మాన్ కూడా గెస్ట్ రోల్ చేయబోతున్నాడనే ప్రచారం సాగుతోంది. ఇందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది. (ఇదీ చదవండి: బిగ్ బాస్ హౌసులో కొత్త గొడవలు.. లవ్‌బర్డ్స్ మధ్య మనస్పర్థలు!?)) -
'నూడిల్స్' మూవీ: అనుకోకుండా ఓ మనిషిని చంపేస్తే?
ఈ మధ్య కాలంలో 'లవ్‌టుడే', 'గుడ్‌నైట్', 'పొర్ తొళిల్' చిత్రాలు ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై తమిళంలో అనూహ్య విజయం సాధించాయి. మరోవైపు 'అరువి' మూవీతో గుర్తింపు తెచ్చుకున్న మదన్‌కుమార్ ఇప్పుడు దర్శకుడిగా మారిపోయాడు. 'నూడిల్స్' సినిమా తీశాడు. (ఇదీ చదవండి: Bigg Boss 7 రెండో రోజు హైలైట్స్: అందరితోనూ శోభా గొడవలు.. అడ్డంగా దొరికిపోయిన తేజ!) మదన్ కుమార్ పోలీసు అధికారిగా కీలక పాత్రలో నటించాడు. హరీష్ ఉత్తమన్, షీలారాజ్ కుమార్ హీరోహీరోయిన్లుగా నటించారు. ఈ నెల 8న రిలీజ్‌కి రెడీ అయింది. కథ విషయానికొస్తే.. ఓ రోజు రాత్రి ఓ ప్లాట్స్‌లో నివసిస్తున్న వారు మిద్దైపెన ఆడుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. ఆ సమయంలో పహారా కోసం వచ్చిన పోలీసులు వారితో దురుసుగా ప్రవర్తిస్తారు. దీంతో గొడవ జరుగుతుంది. మరోవైపు హీరో అనుకోని పరిస్థితుల్లో ఓ వ్యక్తిని చంపి, తన ఇంట్లో దాచిపెడతాడు. మరి చివరకు ఏమైందనేదే 'న్యూడిల్స్' స్టోరీ. అత్యంత సహజంగా తీసిన ఈ చిత్రాన్ని రోలింగ్ సౌండ్ పిక్చర్స్ పతాకంపై అరుణ్ ప్రకాష్ నిర్మించారు. కాగా చిత్రాన్ని చూసిన నిర్మాత సురేష్ కామాక్షి ఎంతో ఇంప్రెస్ అయ్యి తమిళనాడు విడుదల హక్కులను తీసుకున్నట్లు తెలిపారు. (ఇదీ చదవండి: దివ్యస్పందన మృతి అంటూ వార్తలు.. మండిపడ్డ నటి) -
10 ఏళ్ల తర్వాత అలా చేస్తున్న స్టార్ మ్యూజిక్ డైరెక్టర్
దక్షిణాది సినిమాల్లో జీవీ ప్రకాశ్ కుమార్‌కు ఒక బ్రాండ్ ఉంది. చిన్న వయస్సులోనే సంగీత దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చి, తన 25 ఏళ్లకే 25 చిత్రాలకు మ్యూజిక్ అందించి రికార్డు సాధించాడు. 'డార్లింగ్' మూవీతో హీరోగా మారాడు. అది హిట్ కావడంతో నటుడిగానూ సక్సెస్ అయ్యాడు. అలా మ్యూజిక్ డైరెక్టర్, యాక్టర్, సింగర్ గా సత్తా చాటుతున్న జీవీ ప్రకాశ్ కుమార్.. 2013లో నిర్మాతగా ఓ సినిమా తీశాడు. (ఇదీ చదవండి: సూపర్ స్టార్ రజనీకాంత్‌కు గవర్నర్ పదవి?) ఖదీర్-ఓవియా జంటగా విక్రమ్ సుకుమారన్ దర్శకత్వంలో 'మదయానై కూట్టం' అనే సినిమాని జీవీ ప్రకాశ్ కుమార్ నిర్మించాడు. కోటి రూపాయల బడ్జెట్ పెడితే.. రూ.15 కోట్ల కలెక్షన్స్ వచ్చాయి. అయినా మరో సినిమాని నిర్మించలేదు. అలాంటిది 10 ఏళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు కొత్త మూవీ నిర్మించడానికి సిద్ధమయ్యాడు. ఈ సినిమాని నిర్మిస్తున్న జీవీ ప్రకాశ్ కుమార్.. హీరోగానూ నటిస్తున్నాడు. దీనికి 'కింగ్స్టన్' టైటిల్ ఫిక్స్ చేశారు. ఇది జీవికి నటుడుగా 25వ చిత్రం. కమల్ ప్రకాష్ అనే వ్యక్తి ఈ చిత్రానికి దర్శకుడు.త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది. వచ్చే ఏడాది దీన్ని థియేటర్లలో రిలీజ్ చేయనున్నారు. పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తారు. (ఇదీ చదవండి: బిగ్‌బాస్ 7: నామినేషన్స్‌లో రైతు బిడ్డ.. ఇంకా ఎవరున్నారంటే?) -
అందుకే సంగీతానికి దూరం.. ప్రధాన కారణం అదే!: దర్శకుడు
సినీ రంగంలో దర్శకుడు టి.రాజేందర్‌ను అష్టావధాని అంటారు. తాను ఈయన తన చిత్రాలకు కథ, కథనం, మాటలు, పాటలు, సంగీతం, ఎడిటింగ్, దర్శకత్వం, నిర్మాణం, కథానాయకుడు ఇలా అన్ని బాధ్యతలను తనే నిర్వహిస్తుంటారు. అలా ఆయన చేసిన పలు చిత్రాలు ఘన విజయాన్ని సాధించాయి. కాగా తాజాగా నాన్ కడైసీ తమిళన్ అనే చిత్రానికి ఈయన పాటలు, సంగీతాన్ని అందిస్తున్నారు. సీఆర్టీ కంపెనీ పతాకంపై ఎంఏ రాజేంద్రన్ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న ఈ చిత్రం ఆదివారం ఉదయం చైన్నెలోని ప్రసాద్ ల్యాబ్‌లో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో దర్శకుడు టి.రాజేందర్, చిరు బడ్జెట్ చిత్ర నిర్మాతల సంఘం అధ్యక్షుడు అన్బు సెల్వన్ నటుడు ఇమాన్ అన్నాచ్చి, కరాటే రాజా తదితర సినీ ప్రముఖులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. అనంతరం దర్శకుడు టీ రాజేందర్ క్లాప్ కొట్టి యూనిట్ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాను సినిమాలకు సంగీతాన్ని అందించి చాలాకాలం అయిందన్నారు. అందుకు కారణం ఇటీవలి కాలంలో వస్తున్న చిత్రాల్లో పాటలకు తగ్గ బాణీలను కట్టకపోవడమేనన్నారు. అలాంటిది చాలా కాలం తర్వాత ఈ చిత్రానికి పాటలు, సంగీతాన్ని అందించడానికి కారణం 'నాన్ కడైసీ తమిళన్' అనే చిత్ర టైటిలేనన్నారు. చిత్ర దర్శక నిర్మాత ఎమ్ఏ రాజేందర్ మాట్లాడుతూ మిత్రుల ప్రోత్సాహంతో ఈ చిత్రాన్ని నిర్మించడానికి సిద్ధమయ్యానన్నారు. దీనికి టి. రాజేందర్ సంగీతాన్ని అందించటం సంతోషంగా ఉందన్నారు. విశేషం ఏంటంటే ఈ చిత్రాన్ని పలు భాషల్లో రూపొందిస్తున్నట్లు చెప్పారు. ఇందులో నటించే నటీనటులు, ఇతర సాంకేతిక వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు ఆయన చెప్పారు. చదవండి: రజనీకి గవర్నర్ పదవిపై ఆయన సోదరుడు కీలక వ్యాఖ్యలు -
క్రేజీ హారర్ థ్రిల్లర్.. కేక పుట్టిస్తున్న ట్రైలర్
'తనీ ఒరువన్' లాంటి హిట్ తర్వాత తమిళ స్టార్ హీరో జయం రవి, నయనతార జంటగా నటించిన సినిమా 'ఇరైవన్'. సుధన్ సుందరం, జయరామ్.జి కలిసి నిర్మించిన ఈ చిత్రానికి ఇంతకు ముందు 'ఎండ్రెండ్రుమ్ పున్నగై', 'మనిదన్' వంటి సక్సెస్ ఫుల్ మూవీస్ తీసిన అహ్మద్.. కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహించారు. యువన శంకర్ రాజా సంగీతాన్ని,హరి కె.వేదంత్ ఛాయాగ్రహణం అందించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈనెల 28వ తేదీన విడుదలకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు. దాదాపు రెండున్నర నిమిషాలున్న ఇది.. హీరో vs విలన్ అనే టెంప్లేట్‌కి ఫెర్ఫెక్ట్ ఎగ్జాంపుల్‌గా కనిపిస్తుంది. (ఇదీ చదవండి: అతడి పెళ్లిలో రష్మిక.. కొత్తజంట అలా చేయడంతో!) ట్రైలర్ ప్రకారం.. ఇందులో జయం రవి పోలీస్‌గా నటించాడు. 12 మంది అమ్మాయిలని చంపిన నర హంతకుడిగా రాహుల్ బోస్ యాక్ట్ చేశాడు. క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ స్టోరీతో తీసిన ఈ సినిమాలో హీరో విలన్ మధ్య రసవత్తర సన్నివేశాలు చూపించారు. ఇది మరో క్రేజీ హారర్ థ్రిల్లర్ గా ఉండబోతుందని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ఇరైవన్ అంటే భగవంతుడు అని అర్ధం. అయితే ఈ చిత్రంలో మనుషులను కిరాతకంగా చంపే విలన్ తనను దేవుడిగా భావించుకుంటాడా..? లేక ఆ నరహంతకుడిని అంతం చేసే కథానాయకుడు దేవుడా? అనేది చిత్రంలో చూడాల్సిందే. హీరోయిన్ నయనతారకు కూడా ఇందులో మంచి రోల్ చేసిందని దర్శకుడు చెప్పుకొచ్చాడు. (ఇదీ చదవండి: బిగ్‌బాస్ స్టేజీపై సమంత కోసం ఆరా తీసిన నాగార్జున) -
ఆ స్టార్ హీరోకి అభిమానిగా కార్తీ..
తమిళ నటుడు కార్తీ స్పీడ్ పెంచారనే చెప్పాలి. వరస సినిమాలతో హిట్స్ కొడుతున్న ఇతడు.. ఈ మధ్య కాలంలో విరుమాన్, పొన్నియిన్ సెల్వన్, సర్ధార్ లాంటి సక్సెస్ఫుల్ చిత్రాలలో ఆకట్టుకున్నారు. తాజాగా ఈయన హీరోగా నటిస్తున్న 25వ చిత్రం 'జపాన్' షూటింగ్ పూర్తయింది. చివరి పాటని ఇటీవలే కశ్మీర్లో కంప్లీట్ చేశారు. ఇప్పుడు కార్తీ కొత్త సినిమాకు సంబంధించిన క్రేజీ అప్డేట్ బయటకొచ్చింది. (ఇదీ చదవండి: చిరంజీవి పూజగదిలో ఆ ఇద్దరి ఫొటోలు..) కార్తీ ప్రస్తుతం నలన్ కుమారసామి దర్శకత్వంలో నటిస్తున్నాడు. ఇది కార్తీ 26వ చిత్రం. కృతిశెట్టి హీరోయిన్. స్టూడియో గ్రీన్ పతాకంపై కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ఇది. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా తీస్తున్నారు. ఇందులో కార్తీ, తమిళ దిగ్గజ నటుడు ఎంజీఆర్ వీరాభిమానిగా నటిస్తున్నట్లు సమాచారం. దీంతో ఈ చిత్రానికి 'వా వాద్ధియారే' అనే టైటిల్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. త్వరలో దీనిపై అధికారిక ప్రకటన రానుంది. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ షూటింగ్ చైన్నె పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. దీని తర్వాత కార్తీ.. '96' ఫేమ్ ప్రేమ్ కుమార్ దర్శకత్వంలో నటిస్తాడు. ఇందులో అరవిందస్వామి కీలకపాత్ర చేయబోతున్నాడు. గోవింద్ వసంత సంగీతం, పీసీ శ్రీరామ్ సినిమాటోగ్రఫీ అందిస్తారు. ఈ చిత్రాన్ని కార్తీ అన్న సూర్యకు చెందిన 2డీ ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మించనుంది. దీని తర్వాత సర్దార్ 2, ఖైదీ 2 చిత్రాల్లో కార్తీ నటించనున్నాడు. (ఇదీ చదవండి: ఈ తెలుగు హీరోయిన్ని గుర్తుపట్టారా? సుప్రీంకోర్టులో ఇప్పుడు లాయర్‌గా!) -
నా సినిమా కొనేందుకు ఎవరూ ముందుకు రాలేదు: దర్శకుడు
వైవిధ్య భరిత కథా చిత్రాల దర్శకుడు, ఛాయాగ్రాహకుడు తంగర్ బచ్చాన్ తాజాగా దర్శకత్వం వహించిన చిత్రం మేఘంగల్ కలైగిండ్రన, రిమోట్ మీడియా సంస్థ నిర్మించిన ఈ చిత్రంలో దర్శకుడు భారతీరాజా ప్రధాన పాత్రలో పోషించారు. దర్శకుడు గౌతమ్ మీనన్, నటి అతిథి బాలన్, యోగిబాబు తదితరులు ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రానికి జీవీ ప్రకాష్‌కుమార్ సంగీతాన్ని అందించారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం సెప్టెంబర్ ఒకటవ తేదీన తెరపైకి రానుంది. ఈ సందర్భంగా సోమవారంసాయంత్రం ఈ చిత్రం చైన్నెలోని ఒక ప్రివ్యూ థియేటర్లో చిత్రాన్ని మీడియాకు ప్రదర్శించారు. అనంతరం దర్శకుడు తంగర్ బచ్చన్ మాట్లాడుతూ మానవ సంబంధాలను, కుటుంబ భావోద్వేగాలను ఆవిష్కరించే ఈ చిత్రాన్ని మూడు రోజుల క్రితం తమిళనాడులోని 500 మంది సాధారణ ప్రేక్షకులను ఎంపిక చేసి మేఘంగల్ కలైగిండ్రన చిత్రాన్ని వారి కోసం ప్రత్యేకంగా ప్రదర్శించినట్లు చెప్పారు. మంచి చిత్రాలకు ప్రేక్షకుల ఆదరణ కచ్చితంగా ఉంటుందన్నారు. అందుకు ఉదాహరణ తాను ఇంతకుముందు దర్శకత్వం వహించిన అళగి చిత్రమేనని పేర్కొన్నారు. చిత్ర వ్యాపారం కోసం 100 ప్రదర్శనలు ఏర్పాటు చేశామని, అయినా చిత్రాన్ని కొనుగోలు చేయడానికి బయ్యర్లు ముందుకు రాలేదని చెప్పారు. అలాంటిది అళగి చిత్రం విడుదలై ఎంత సంచలన విజయాన్ని సాధించిందో తెలిసిందేనన్నారు. కాగా చిత్ర జయాపజయాలను నిర్ణయించేది ప్రేక్షకులేనని దర్శకుడు తంగర్ బచ్చాన్ పేర్కొన్నారు. కాబట్టి మేఘంగల్ కలైగిండ్రన చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకం తనకు ఉందన్నారు. -
మొన్ననే హీరో పెళ్లి.. ఇప్పుడు కొత్త సినిమా
'డాడా' లాంటి హిట్ సినిమాతో ప్రూవ్ చేసుకున్న నటుడు కవిన్.. మరో కొత్త సినిమా అనౌన్స్ చేశాడు. దీనికి 'స్టార్' అనే టైటిల్ ఫిక్స్ చేశారు. 'ప్యార్ ప్రేమ కాదల్' ఫేమ్ ఇళన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ఎళిల్ అరసు ఛాయాగ్రహణం, యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు. రైస్ ఈస్ట్ ఎంటర్టైన్మెంట్, 'విరూపాక్ష'తో హిట్ కొట్టిన శ్రీ వేంకటేశ్వర సినీ చిత్ర సంస్థ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. (ఇదీ చదవండి: బెస్ట్ ఫ్రెండ్‌ని పెళ్లి చేసుకున్న యంగ్ హీరోయిన్) ఇప్పటికే షూటింగ్ ప్రారంభించారు. చైన్నె, ముంబైలో తొలి షెడ్యూల్ పూర్తి చేసుకుందని దర్శకుడు మీడియాకు చెప్పుకొచ్చారు. ఇందులో ముంబై బ్యూటీ హీరోయిన్ కాగా, మలయాళ నటుడు కీలక పాత్ర చేస్తున్నట్లు చెప్పారు. యువన్ శంకర్ రాజా స్వరపరిచిన ఇంట్రో సాంగ్ కోసం భారీ సెట్‌ను వేసి వేసినట్లు చెప్పారు. యువన్ పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 31న 'స్టార్' స్పెషల్ పోస్టర్ విడుదల చేయనున్నట్లు చెప్పారు. ఇకపోతే కవిన్.. మొన్న పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు కొత్త సినిమా ప్రకటించాడు. (ఇదీ చదవండి: పబ్లిక్‌లో హీరోయిన్‌కి ముద్దుపెట్టిన తెలుగు డైరెక్టర్) View this post on Instagram A post shared by Kavin M (@kavin.0431) -
డైరెక్టర్‌గా ఎంట్రీ ఇస్తున్న స్టార్ హీరో కొడుకు
దళపతి విజయ్‌ని తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిందే ఏం లేదు. పలు డబ్బింగ్ సినిమాలతో, సోషల్ మీడియాలో ట్రోల్స్‌తో ఎప్పటికప్పుడు ట్రెండ్ అవుతూనే ఉంటాడు. అయితే ఇతడికి 23 ఏళ్ల కొడుకు ఉన్నాడు. అతడు హీరో అవుతాడనుకుని ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేశారు. ఇప్పుడు డైరెక్టర్‌గా తొలి ప్రాజెక్ట్ అనౌన్స్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. తమిళ హీరో దళపతి విజయ్‌కి ఇద్దరు పిల్లలు. అందులో కొడుకు జేసన్ సంజయ్ పెద్దోడు. ప్రస్తుతం అతడికి 23 ఏళ్లు. అయితే తండ్రిలానే హీరోగా ఎంట్రీ ఇస్తాడని చాలారోజుల నుంచి టాక్ నడుస్తోంది. 'ఉప్పెన' తమిళ రీమేక్‌తో నటుడిగా మారతాడని అప్పట్లో తెగ రూమర్స్ వచ్చాయి. ఇప్పుడు వాటన్నింటికీ చెక్ పెడుతూ.. జేసన్ దర్శకుడిగా ఎంట్రీ ఇస్తున్నాడు. గతంలో 'వెట్టైకారన్' సినిమాలో విజయ్-జేసన్ కలిసి నటించారు. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 22 సినిమాలు రిలీజ్.. కానీ?) తమిళంలో పలు భారీ బడ్జెట్ సినిమాలు తీస్తున్న ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్.. జేసన్ సంజయ్ ని దర్శకుడిగా పరిచయం చేస్తోంది. సోమవారం ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. కొన్ని ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో ఈ మేటర్ కాస్త బయటపడింది. విజయ్ హీరోగా నటించిన 'లియో' త్వరలో రిలీజ్ కానుంది. దీని తర్వాత వెంకట్ ప్రభుతో ఓ సినిమా చేస్తారు. అనంతరం సినిమాలకు రిటైర్మెంట్ ఇచ్చేసి, రాజకీయాల్లోకి వెళ్లిపోతారని మాట్లాడుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఇతడి వారసుడిగా జేసన్ వస్తాడని ఫ్యాన్స్ అనుకుంటే.. ఇప్పుడు డైరెక్టర్ గా మారి షాకిచ్చాడు. బహుశా భవిష్యత్తులో ఏమైనా హీరో అవుతాడేమో చూడాలి. (ఇదీ చదవండి: యూట్యూబర్‌ని పెళ్లి చేసుకున్న ప్రముఖ నటి) View this post on Instagram A post shared by Lyca Productions (@lycaproductions) -
బైక్ ర్యాలీలో స్టార్ హీరోయిన్.. అదే కారణమా?
మిలియన్ స్టూడియో పతాకంపై ఎంఎస్ మన్సూర్ నిర్మించిన చిత్రం 'వెపన్'. సత్యరాజ్, వసంత రవి, తాన్య హోప్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి గుహన్ చెన్నియప్పన్ దర్శకత్వం వహించారు. యాక్షన్ కిల్లర్ నేపథ్యంలో కొత్త టెక్నాలజీతో రూపొందిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 22 సినిమాలు రిలీజ్.. కానీ?) కాగా చిత్ర నిర్మాత ఆదివారం ఉదయం ప్రజా క్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని వాహనదారులకు అవగాహన కలిగించే విధంగా వేర్ హెల్మెట్ పేరుతో ర్యాలీని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వసంత రవి, తాన్య హోప్ తదితరులు పాల్గొన్నారు. నిర్మాత మన్సూర్ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. టూ వీలర్స్ హెల్మెట్లు ధరించాల్సిన ఆవశ్యకత, సురక్షితంగా వాహనాలను నడపడం గురించి అవగాహన కలిగించే విధంగా ఈ కార్యక్రమం ఉదయం 6 గంటలకు స్థానిక ఓఎంఆర్ రోడ్లో ప్రారంభమై తమిళనాడు టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ప్రాంతం వరకు సాగింది. (ఇదీ చదవండి: కేఏ పాల్ని కలిసిన నవీన్ పొలిశెట్టి.. ఏం మాట్లాడారు?) -
సారీ చెప్పిన హీరో లారెన్స్.. ఆ గొడవపై కామెంట్స్!
కొరియోగ్రాఫర్‌గా కెరీర్ మొదలుపెట్టి, ప్రస్తుతం హీరోగా బిజీ అయిపోయాడు రాఘవ లారెన్స్. ఇతడు చేసిన కొత్త సినిమా 'చంద్రముఖి 2'. గతంలో రజనీకాంత్ చిత్రానికి ఇది సీక్వెల్. సెప్టెంబరు 15న థియేటర్లలోకి రానుంది. ఈ క్రమంలోనే తాజాగా ఆడియో లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. అక్కడ ఓ గొడవ జరగ్గా, దానిపై ఇప్పుడు లారెన్స్ క్షమాపణలు చెప్పాడు. ఏం జరిగింది? సాధారణంగా ఇలాంటి ఆడియో లాంచ్, ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగినప్పుడు అభిమానులు కాస్త ఎక్కువగానే వస్తుంటారు. 'చంద్రముఖి 2' ఆడియో విడుదల కార్యక్రమంలోనూ అలాంటి ఓ సంఘటన జరిగింది. ఈవెంట్ చూడటానికి వచ్చిన ఓ స్టూడెంట్‌పై బౌన్సర్ దాడి చేశాడు. ఆ గొడవ ఆడిటోరియం బయట జరగ్గా, తాజాగా లారెన్స్ దృష్టికి రావడంతో సారీ చెప్పాడు. (ఇదీ చదవండి: బిగ్‌బాస్ 7 'ఉల్టా పల్టా' అసలు మీనింగ్ ఇదేనా!?) ట్వీట్లో ఏముంది? 'చంద్రముఖి 2 ఆడియో లాంచ్ ఈవెంట్లో ఓ స్టూడెంట్, బౌన్సర్ మధ్య జరిగిన గొడవ ఇప్పుడు నా దృష్టికి వచ్చింది. వేడుక జరుగుతున్నప్పుడు దాని బయట గొడవ జరగడంతో నాకు ఏం తెలియలేదు. ఇప్పుడే నా దృష్టికి వచ్చింది. విద్యార్థులంటే నాకు ఎంతిష్టమో, వాళ్ల వృద్ధి చెందాలని ఎంత కోరుకుంటానే మీకు తెలుసు. ఇలాంటి గొడవలు నాకు నచ్చవ్. కారణం ఏదైనా సరే స్టూడెంట్‌ని కొట్టడం తప్పు. ఇది జరగకుండా ఉండాల్సింది. క్షమాపణలు చెబుతున్నా. బౌన్సర్స్ ఇకపై ఇలాంటి దాడి చేయొద్దని రిక్వెస్ట్ చేస్తున్నా' అని లారెన్స్ ట్వీట్ చేశాడు. సినిమాపై బజ్ లేదు 'చంద్రముఖి' సినిమా అప్పట్లో భాషతో సంబంధం లేకుండా అందరినీ భయపెట్టింది. రజనీకాంత్, జ్యోతిక యాక్టింగ్ ఇప్పటికీ మన కళ్లముందే కదలాడుతూ ఉంది. ఇప్పుడు సీక్వెల్లో వెంకటపతిరాజుగా లారెన్స్, చంద్రముఖిగా బాలీవుడ్ బ్యూటీ కంగన రనౌత్ నటించారు. పోస్టర్, పాటలు రిలీజ్ చేసినప్పటికీ తెలుగులో అయితే పెద్దగా బజ్ లేదు. రిలీజ్‌కి ఇంకో 20 రోజులు ఉంది కాబట్టి అంచనాలు పెరుగుతాయేమో చూడాలి? (ఇదీ చదవండి: పెళ్లికి ముందే పూజలు తెగ చేస్తున్న ఆ హీరోయిన్) Hello everyone, I just came to know about the unfortunate incident which happened during our #Chandramukhi2 movie Audio Launch, where one of the Bouncers involved in a fist fight with a college student. First of all myself or the organisers were not aware of this incident as it… — Raghava Lawrence (@offl_Lawrence) August 27, 2023 -
'పుష్ప' లాంటి స్టోరీతో మరో సినిమా
ప్రముఖ నటుడు వెట్రి కొత్త సినిమా 'రెడ్ శాండిల్ వుడ్'. జేఎన్ సినిమాస్ పతాకంపై జే.పార్థసారథి నిర్మించిన విచిత్రానికి గురు రామానుజమ్ దర్శకత్వం వహించారు. నటుడు ఎంఎస్ భాస్కర్ గణేష్ వెంకట్రాం కేజీఎఫ్ ఫేమ్ రామ్ కబాలి విశ్వ ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈసందర్భంగా శుక్రవారం సాయంత్రం చిత్ర ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని చైన్నెలోని ప్రసాద్ ల్యాబ్‌లో నిర్వహించారు. (ఇదీ చదవండి: ఇండస్ట్రీలో ఉదయ్ కిరణ్ చెల్లెలు ఎవరో తెలుసా..?) ఇది ఎర్రచందనం స్మగ్లింగ్ ఆరోపణలు పేరుతో బలేనా అమాయకుల నేపథ్యంలో సాగే యథార్థ సంఘటనల ఇతివృత్తంతో కూడిన కథా చిత్రం అని దర్శకుడు తెలిపారు. 2015లో జరిగిన యదార్థ సంఘటన ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు ఆయన చెప్పారు. చిన్నపిల్లలు ఆడుకునే బొమ్మలను తయారు చేసి క్యాన్సర్ నివారణకు ఉపయోగపడే గంధపు చెక్కలను విదేశాలకు చేస్తూ చైనా నుంచి ప్లాస్టిక్ బొమ్మలను దిగుమతి చేసుకునే పరిస్థితి నెలకొందని చిత్ర కథానాయకుడు వెట్రి పేర్కొన్నారు. దర్శకుడు పేరరసు మాట్లాడుతూ.. ట్రైలర్ చూడగానే మనసు ద్రవించిందన్నారు. ఎక్కడ చూసినా సమస్యలు, అకారణంగా బాధింపునకు గురైన, శిక్షించబడిన వారే కనిపిస్తున్నారన్నారు. అలాంటి సంఘటన వెనుక ఎవరో ఉంటున్నారన్నారు. వారి వల్ల అమాయకపు తమిళ ప్రజలే బాధింపునకు గురవుతున్నారు అన్నారు. ఇప్పుడు పెద్ద హీరోలు నటించిన చిత్రాలు లేదా, సహజత్వంతో కూడిన చిత్రాలు మాత్రమే విజయాన్ని సాధిస్తున్నాయన్నారు. అలా ఈ చిత్రం జాతీయ అవార్డులు అందుకోవాలని కోరుకుంటున్నాను అని పేరరసు పేర్కొన్నారు. (ఇదీ చదవండి: విజయ్ క్యారెక్టర్‌పై సమంత ఇంట్రెస్టింగ్ కామెంట్స్) -
'జై భీమ్'కి జాతీయ అవార్డ్ అందుకే మిస్ అయిందా?
69వ జాతీయ అవార్డుల్లో తెలుగు సినిమా సత్తా చాటింది. తమిళ, మలయాళ, కన్నడ సినిమాలు కూడా మెరిశాయి. అయితే సూర్య 'జై భీమ్' చిత్రానికి అవార్డ్ రాకపోవడం మాత్రం చాలామందిని ప్రేక్షకుల్ని ఆశ్చర్యపరిచింది. కనీసం ఒక్కటైనా వచ్చుంటే బాగుండేదని వాళ్లు అభిప్రాయపడ్డారు. మరి 'జై భీమ్'కి అవార్డ్ ఎందుకు మిస్ అయింది? కారణాలు ఏంటి? (ఇదీ చదవండి: జాతీయ అవార్డుల్లో 'ఆర్ఆర్ఆర్' హవా.. ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్) సామాజిక రుగ్మతలు, అణగారిన వర్గాలపై జరుగుతున్న అన్యాయాన్ని.. నిజ జీవితంలో జరిగిన ఓ సంఘటనని స్పూర్తిగా తీసిన సినిమా 'జై భీమ్'. టీజే జ్ఞానవేల్ దర్శకత్వం వహించిన ఈ సినిమా నేరుగా ఓటీటీలో రిలీజైనప్పటికీ ప్రతి ఒక్కరి నుంచి ప్రశంసలు అందుకుంది. ఓ సాధారణ లాయర్ పాత్రలో సూర్య అదరగొట్టేశాడు. కానీ ఈ సినిమాకి ఇప్పుడు ఏ విభాగంలోనూ అవార్డ్ రాలేదు. జాతీయ ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ అవార్డు గెలవడం ఎవరికీ ఎలాంటి సందేహాలు లేవు. దానికి అతడి పూర్తి అర్హుడు. దీనికి సూర్య కూడా పోటీదారుడే కానీ కొద్దిలో మిస్ అయింది. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే.. 2020లో సూరరై పోట్రు (ఆకాశమే హద్దురా) సినిమాకుగానూ ఉత్తమ నటుడిగా సూర్య.. జాతీయ అవార్డు అందుకున్నాడు. (ఇదీ చదవండి: 'పుష్ప'కి జాతీయ అవార్డులు.. ఆ అంశాలే కలిసొచ్చాయా?) 'జై భీమ్' కూడా అదే సంస్థ నుంచి వచ్చింది. ఇన్నేళ్ల జాతీయ అవార్డుల చరిత్రలో.. ఏ హీరోకి వరసగా రెండుసార్లు పురస్కారం వరించలేదు. అలానే 'పుష్ప' మూవీకి దేశవ్యాప్తంగా వచ్చినంత పాపులారిటీ 'జై భీమ్'కి రాలేదనేది మీకు తెలుసు! ఇలా అనుకుంటేపోతే.. గతంలోనూ చాలావరకు మంచి మంచి సినిమాలకు కొద్దిలో జాతీయ అవార్డులు మిస్ అయ్యాయి. అంతమాత్రన వాటిని తక్కువ చేసినట్లు కాదు. అవార్డుల వచ్చింది లేనిది కొన్నిరోజుల్లో మర్చిపోతారేమో గానీ ఓ మంచి సినిమాని ఎప్పటికీ గుండెల్లో పెట్టుకుంటారు. 'జై భీమ్' ఈ లిస్టులో కచ్చితంగా ఉంటుంది. ఎంటర్టైన్ చేసే విషయంలో 'పుష్ప', మెసేజ్ ఇవ్వడంతోపాటు ఎమోషనల్ చేసే విషయంలో 'జై భీమ్'.. ఎప్పటికీ అలా నిలిచిపోతాయి అంతే! (ఇదీ చదవండి: ప్రేమ పేరుతో మోసం.. జబర్దస్త్ కమెడియన్ అరెస్ట్) -
ఇది సినిమా కాదు జీవితం: డైరెక్టర్ తంగర్ బచ్చాన్
సినిమాటోగ్రాఫర్, దర్శకుడు తంగర్ బచ్చాన్ లేటెస్ట్ గా తీసిన సినిమా 'కరుమేఘంగళ్ కలైగిండ్రన'. దర్శకుడు భారతీరాజా లీడ్ రోల్ పోషించిన ఇందులో దర్శకుడు గౌతమ్‌మీనన్, ఎస్ఏ.చంద్రశేఖర్, ఆర్వీ.ఉదయకుమార్, యోగిబాబు, అదితిబాలన్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. జీ.వీ.ప్రకాశ్‌కుమార్ సంగీతాన్ని అందించారు. చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని సెప్టెంబర్ 1వ తేదీన విడుదలకు సిద్ధం అవుతోంది. ఈ సందర్బంగా బుధవారం ఉదయం చిత్ర యూని ట్ చైన్నెలోని ప్రసాద్‌ల్యాబ్‌లో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. (ఇదీ చదవండి: 'చంద్రా’లు దిద్దిన కాపురం.. స్కెచ్ మాములుగా లేదు!) ఈ కార్యక్రమంలో దర్శ కుడు తంగర్బచ్చాన్ మాట్లాడుతూ.. ఇది చిత్రం కాదనీ, జీవితం అనీ పేర్కొన్నారు. ఇందులో న్యాయవాది రామనాథ్ పాత్రను భారతీతాజా కాకుండా వేరెవరూ నటించలేరని అన్నారు. 30 ఏళ్ల క్రితం రాసుకున్న నవలే ఈ చిత్రమని తెలిపారు. ఇటీవల వస్తున్న కొన్ని కమర్షియల్ చిత్రాలను ప్రేక్షకుల ఎందుకు ఆదరిస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. తుపాకులతో కాల్చుకోవడం, చంపుకోవడం వంటి చిత్రాలతో భవిష్యత్ తరాలకు మనం ఏం చెబుతున్నామో అర్థం చేసుకోవాలన్నారు. మంచి కథా చిత్రాలకు ప్రేక్షకుల నుంచి ఆదరణ రావడం లేదని తంగర్ బచ్చాన్ ఆవేదన వ్యక్తం చేశారు. కరుమేఘంగళ్ కలైగిండ్రన వంటి చిత్రాలను ఆదరిస్తే మరిన్ని మంచి చిత్రాలు వస్తాయనీ, చిత్ర పరిశ్రమ బాగుంటుందని అభిప్రాయపడ్డారు. ఇకపోతే ఈ సినిమాని ప్రేక్షకుల వరకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మీడియాపై ఉందని భారతీరాజా పేర్కొన్నారు. (ఇదీ చదవండి: 50 ఏళ్ల వయసులో 'మళ్లీ పెళ్లి'.. సీనియర్ నటి క్లారిటీ) -
'విక్రమ్' విలన్‌తో రాజశేఖర్ కూతురు కొత్త సినిమా
గేంబ్రియో పిక్చర్స్ పతాకంపై సుధా సుకుమార్ నిర్మిస్తున్న తొలి చిత్రం ఆదివారం చైన్నెలోని ప్రసాద్ ల్యాబ్‌లో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. నటుడు అర్జున్ దాస్, శివాత్మిక రాజశేఖర్ జంటగా నటిస్తున్న ఇందులో నాజర్, కాళీ వెంకట్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. విశాల్ వెంకట్ దర్శకుడు. (ఇదీ చదవండి: నా రూమ్‌లో సీక్రెట్ కెమెరా పెట్టారు: స్టార్ హీరోయిన్) ఈ చిత్ర విశేషాల గురించి మాట్లాడిన డైరెక్టర్.. చక్కని వినోదంతో కూడిన కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ డ్రామా ఇది అని అన్నాడు. ఈ చిత్రంలో మంచి విషయం ఉందని, నటుడు నాజర్ లాంటి సీనియర్స్‌తో కలిసి పనిచేయటం సంతోషంగా ఉందని అర్జున్ దాస్ ఆనందం వ్యక్తం చేశాడు. సంగీత దర్శకుడు డి.ఇమాన్‌కు తాను పెద్ద అభిమానినని, ఆయన సంగీతాన్ని అందిస్తున్న చిత్రంలో తాను నటించడం ఆనందంగా ఉందన్నాడు. తమిళంలో ఇప్పటికే రెండు మూవీస్ చేసిన శివాత్మిక.. తెలుగులో కంటే తమిళంలోనే బిజీ అవుతుందా అనిపిస్తుంది. (ఇదీ చదవండి: రెండో సినిమానే చిరంజీవితో.. ఈ డైరెక్టర్ అంత స్పెషలా?) -
ఐదేళ్ల తర్వాత ఆ పనిచేస్తున్న ధనుష్
కోలీవుడ్ నుంచి హాలీవుడ్ స్థాయికి ఎదిగిన నటుడు ధనుష్. నటుడు, లిరిక్ రైటర్, సింగర్, డైరెక్టర్, ప్రొడ్యూసర్ గా తన టాలెంట్ తో ఆకట్టుకుంటున్నాడు. ప్రస్తుతం హీరోగా ఫుల్ బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం 'కెప్టెన్ మిల్లర్' పూర్తిచేసి తన 50వ చిత్ర షూటింగ్ తో బిజీ. ఈ మూవీ డిసెంబర్ 15న థియేటర్లలోకి రానుంది. ఇందులో ధనుష్ గెటప్, ఇటీవల రిలీనైన టీజర్ భారీ అంచనాలను పెంచేస్తోంది. వార్ సన్నివేశాలు అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటాయట. (ఇదీ చదవండి: రామ్ చరణ్.. చిన్న బ్రేక్!) ధనుష్ స్వీయ దర్శకత్వంలో 50వ సినిమా చేస్తున్నాడు. దీని తర్వాత డైరెక్టర్ శేఖర్ కమ్ముల తీయబోయే ద్విభాషా సినిమాలో యాక్ట్ చేస్తారు. ఆర్.బాల్కీ దర్శకత్వంలో హిందీ మూవీ చేస్తారు. ఇకపోతే ధనుష్ నిర్మాతగా.. 3, ఎదుర్ నీచ్చల్, వేలై ఇల్లా పట్టాదారి, కాకి సాప్ట్, కాకాముట్టై, మారి, నానుమ్ రౌడీధాన్, విచారణై, కాలా, వడ చైన్నె వంటి విజయవంతమైన చిత్రాలు నిర్మించారు. చివరిగా 2018లో మారి 2 చిత్రాన్ని నిర్మించారు. ఆ తర్వాత చిత్ర నిర్మాణానికి దూరంగా ఉన్నారు. అలాంటిది ఐదేళ్ల గ్యాప్ తర్వాత మళ్లీ చిత్ర నిర్మాణానికి సిద్ధమవుతున్నారు. ధనుష్ ఇప్పటివరకు 14 చిత్రాలను నిర్మించారు. తన వండర్ బార్ ఫిలింస్ సంస్థలో 15వ చిత్రం మారి మారి సెల్వరాజ్ దర్శకత్వంలో ఓ సినిమా నిర్మించి, అందులో హీరోగా నటించనున్నట్లు ఇటీవలే వెల్లడించారు. కాగా ఆదివారం మరో చిత్ర ప్రకటన విడుదల చేశారు. 'కెప్టెన్ మిల్లర్' డైరెక్టర్ అరుణ్ మాతేశ్వరన్ తో వండర్ బాల్ ఫిలిమ్స్ సంస్థలో చిత్రం చేయనున్నట్లు ధనుష్ వెల్లడించారు. (ఇదీ చదవండి: శంకర్ కూతురు.. సూపర్ ఛాన్స్ కొట్టేసింది!) -
ఫ్రెండ్షిప్ నేఫథ్యంలో వస్తున్న కుంబారి.. ఆడియో రిలీజ్!
రాయల్ ఎంటర్ప్రైజెస్ పతాకంపై టి.కుమారదాస్ నిర్మిస్తున్న చిత్రం 'కుంబారి'. ఈ చిత్రంలో విజయ్ విశ్వ, నటి నలీఫ్ జియా, మహిళా సంజీవి నాయకిగానూ, జాన్ విజయ్ పరుత్తివీరన్ సరవణన్, శ్యామ్స్, మధుమిత, సెంథి, కాదల్ సుకుమార్ ప్రధాన పాత్రలు పోషించారు. కవి జోసెఫ్ కథ దర్శకత్వ వహిస్తున్నారు. ఈ చిత్రానికి జై ప్రకాష్ జై సన్, పృథ్వీ కలిసి సంగీతమందించారు. తాజాగా ఈ మూవీ ఆడియో లాంఛ్ కార్యక్రమాన్ని చెన్నైలోని ప్రసాద్ ల్యాబ్స్‌లో ఘనంగా నిర్వహించారు. దర్శకుడు కే భాగ్యరాజ్, ఆర్వీ ఉదయ్ కుమార్, ఎస్సార్ ప్రభాకరన్, శరవణ శక్తి, జీవ, అప్పుకుట్టి ముఖ్య అతిథులుగా పాల్గొని ఆడియోను రిలీజ్ చేశారు. (ఇది చదవండి: వెక్కి వెక్కి ఏడ్చిన అనసూయ.. ఇంత డిప్రెషన్లో ఉందా? ) ఈ సందర్భంగా నిర్మాత కుమార్ దాస్ మాట్లాడుతూ.. స్నేహం కథాంశంగా రూపొందించినట్లు తెలిపారు. ఇందులో ప్రేమ, వినోదం, అన్నాచెల్లెళ్ల సెంటిమెంట్‌తో పాటు మంచి జనరంజకమైన అంశాలు ఉన్నాయని తెలిపారు. సాధారణంగా చిన్న చిత్రాలని పక్కన పెట్టేస్తున్నారని, ఇలాంటి చిన్న చిత్రాల ద్వారానే ప్రముఖ స్టార్స్ తయారవుతున్నారని ఆయన అన్నారు. అప్పట్లో చిన్న చిత్రంలో నటించిన శివాజీరావు అనే వ్యక్తి ఇప్పుడు సూపర్ స్టార్‌గా రాణిస్తున్నారని పేర్కొన్నారు. చిత్ర కథానాయకుడు విజయ్ విశ్వ మాట్లాడుతూ.. కుంబారి చిత్ర షూటింగ్ చాలా వేగంగా పూర్తి చేసినట్లు చెప్పారు. నిర్మాత చిత్ర బడ్జెట్ గురించి ఆలోచించ వద్దని మొదట్లోనే చెప్పారన్నారు. చిత్రం బాగా వచ్చిందని ఆయన వెల్లడించారు. (ఇది చదవండి: భార్యతో విడాకులు తీసుకున్న బిగ్ బాస్ ఫేమ్!)