'కల్కి'లో విలన్‌గా హిట్ కొట్టిన కమల్ హాసన్.. రీసెంట్‌గా 'భారతీయుడు 2'గా ఘోరమైన డిజాస్టర్ అందుకున్నాడు. ఇప్పుడు నెలల గ్యాప్‌లో నిర్మాతగా యాక్షన్ మూవీతో ప్రేక్షకుల్ని పలకరించనున్నాడు. రాజ్‌కమల్ ఫిలిం ఇంటర్నేషనల్ పతాకంపై కమల్ నిర్మిస్తున్న లేటెస్ట్ మూవీ 'అమరన్'. శివకార్తికేయన్, సాయిపల్లవి జంటగా నటిస్తున్నారు. చాలా గ్యాప్ తరువాత సాయిపల్లవి చేస్తున్న తమిళ చిత్రమిది. రాజ్‌కుమార్ పెరియసామి దర్శకుడు. తాజాగా ఈ చిత్ర రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు.
(ఇదీ చదవండి: 'డార్లింగ్' సినిమా రివ్యూ)
ఇందులో శివకార్తికేయన్ ముకుందన్ అనే సైనికుడిగా పవర్‌పుల్ పాత్రలో కనిపించబోతున్నారు. మేజర్ ముకుంద్ వరదరాజన్ బయోపిక్‌గా దీన్ని తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని దీపావళి కానుకగా అక్టోబరు 31న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఇకపోతే విలన్‌గా హిట్ కొట్టి, హీరోగా ఫ్లాప్ అందుకున్న కమల్.. నిర్మాతగా మరి ఎలాంటి ఫలితం అందుకుంటాడనేది చూడాలి?
(ఇదీ చదవండి: బాలీవుడ్ మాఫియాకి దెబ్బ మీద దెబ్బ.. షాకిచ్చిన 'కల్కి' మేకర్స్!)
Comments
Please login to add a commentAdd a comment