Siva Karthikeyan
-
'పరాశక్తి' కోసం పోటీ పడుతున్న ఇద్దరు హీరోలు
శివ కార్తికేయన్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రానికి ‘పరాశక్తి’ అనే టైటిల్ ఖరారు చేశారు. మరోవైపు విజయ్ ఆంటోనీ హీరోగా నటించిన సినిమాకి కూడా ‘పరాశక్తి’ టైటిల్ ఖరారు చేయడం విశేషం. శివ కార్తికేయన్ హీరోగా రూపొందుతోన్న ‘పరాశక్తి’కి సుధ కొంగర దర్శకత్వం వహిస్తున్నారు. రవి మోహన్, అథర్వ, శ్రీలీల ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఆకాశ్ భాస్కరణ్ నిర్మిస్తున్న ఈ సినిమా తెలుగు టీజర్‌ని విడుదల చేశారు. ‘సైన్యమై కదిలిరా... పెను సైన్యమై కదిలిరా...’ అంటూ శివ కార్తికేయన్ చెప్పే డైలాగులు టీజర్లో ఉన్నాయి. ఈ సినిమాలో ఆయన విద్యార్థి సంఘం నాయకుడుగా కనిపించనున్నారని తెలుస్తోంది. → విజయ్ ఆంటోనీ హీరోగా నటించిన ‘పరాశక్తి’ చిత్రానికి అరుణ్ ప్రభు దర్శకత్వం వహించారు. మీరా విజయ్ ఆంటోనీ సమర్పణలో విజయ్ ఆంటోనీ ఫిల్మ్స్ కార్పొరేషన్ పై ‘పరాశక్తి’రూపొందింది. ప్రస్తుతం పోస్ట్‌ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా వేసవిలో విడుదల కానుంది. ‘‘విభిన్నమైన కథతో రూపొందిన ఈ సినిమా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచుతుంది’’ అని చిత్రబృందం పేర్కొంది. -
2024ని మంచి సినిమాతో ముగించాను: జాన్వీ కపూర్
‘‘అమరన్’ సినిమాని కాస్త ఆలస్యంగా చూశాను. అయితే 2024 సంవత్సరాన్ని ఇలాంటి ఒక అద్భుతమైన, ఒక మంచి సినిమా చూసి ముగించినందుకు చాలా సంతోషంగా ఉంది’’ అని హీరోయిన్ జాన్వీ కపూర్ అన్నారు. శివ కార్తికేయన్, సాయిపల్లవి జోడీగా నటించిన ద్విభాషా చిత్రం (తమిళ్, తెలుగు) ‘అమరన్’. రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వం వహించారు. 2014లో జమ్ము కశ్మీర్లో ఉగ్రవాదుల దాడిలో అసువులు బాసిన మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవిత కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. దీపావళి కానుకగా 2024 అక్టోబరు 31న విడుదలైంది. ఈ మూవీ తెలుగు, తమిళ భాషల్లో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. అంతేకాదు.. ఈ చిత్రంపై ఇప్పటికే ఎంతోమంది స్టార్స్ కూడా ప్రశంసలు కురిపించారు. తాజాగా జాన్వీ కపూర్ కూడా ‘అమరన్’ మూవీపై తన ఇన్‌స్ట్రాగామ్ ద్వారా ప్రశంసలు కురిపించారు. ‘‘అమరన్’ సినిమాని నేను చూడడం ఆలస్యమైంది. కానీ, ఎంతో అద్భుతమైన సినిమా. ప్రతి సన్నివేశం చాలా భావోద్వేగంతో నిండిపోయింది. ఈ ఏడాదికి ‘అమరన్’ బెస్ట్ మూవీ. ఈ చిత్రం నా హృదయాన్ని కదిలించింది. ఈ సినిమాలోని సన్నివేశాలు నా హృదయాన్ని బరువెక్కించాయి. ఓ ప్రేక్షకురాలిగా 2024ని ఇలాంటి ఒక మంచి సినిమాతో ముగించడం సంతోషంగా ఉంది’’ అని పోస్ట్ చేశారామె. కాగా ఎన్టీఆర్ ‘దేవర’ మూవీతో టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ప్రస్తుతం రామ్‌చరణ్‌కి జోడీగా నటిస్తున్నారు. -
ఓటీటీకి వచ్చేసిన రూ.300 కోట్ల మూవీ.. ఎక్కడ చూడాలంటే?
శివకార్తికేయన్, సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం అమరన్. దీపావళికి థియేటర్లలో సందడి చేసిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ను వద్ద సూపర్‌హిట్‌గా నిలిచింది. దాదాపు నెల రోజుల పాటు థియేటర్లలో రన్ అయింది. ఈ సినిమాకు రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వం వహించారు. మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్ అందుకున్న ఈ మూవీ ఏకంగా రూ.300 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది.అమరన్ ఈ రోజు నుంచే ఓటీటీ ప్రేక్షకులను అందుబాటులోకి వచ్చేసింది. నెట్‌ఫ్లిక్స్‌లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. సూపర్ హిట్ సినిమా కావడంతో ఓటీటీలోనూ అదరగొడుతుందేమో వేచి చూడాల్సిందే. కాగా.. ఆర్మీ మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవిత చరిత్ర ఆధారంగా ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ మూవీని కమల్ హాసన్, మహేంద్రన్, సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, గాడ్ బ్లెస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మించారు.కథేంటంటే...ఉగ్రవాదులతో పోరాడి వీరమరణం పొందిన ఇండియన్ ఆర్మీ ఆఫీసర్ ముకుంద్ వరదరాజన్ బయోపిక్ ఇది. ఇందులో ముకుంద్ వరదరాజన్‌గా శివకార్తికేయన్ నటించగా.. అతని భార్య ఇందు రెబక్క వర్గీస్ పాత్రను సాయి పల్లవి పోషించారు. 2014 ఏప్రిల్ 25న మేజర్ ముకుంద్ వరదరాజన్ దక్షిణ కాశ్మీర్‌లోని ఒక గ్రామంలో ఉగ్రవాదులతో జరిగిన ఎన్కౌంటర్లో వీరమరణం పొందారు. ఇది మాత్రమే బయటి ప్రపంచానికి తెలుసు. తమిళనాడుకు చెందిన ముకుంద్ వరదరాజన్ ఇండియన్ ఆర్మీలోకి ఎలా వచ్చాడు? కేరళ యువతి ఇందు(సాయి పల్లవి) తో ఎలా పరిచయం ఏర్పడింది? వీరిద్దరి పెళ్లికి ఎదురైన సమస్యలు ఏంటి? 44 రాష్ట్రీయ రైఫిల్స్ చీతా విభాగానికి కమాండర్‌గా ఆయన అందించిన సేవలు ఏంటి? ఉగ్రవాద ముఠా లీడర్లు అల్తాఫ్ బాబా, అసిఫ్ వాసీలను ఎలా మట్టుపెట్టాడు? దేశ రక్షణ కోసం తన ప్రాణాలను ఎలా పణంగా పెట్టాడు? అనేదే ఈ సినిమా కథ. -
ట్విటర్ వాడొద్దు.. శివ కార్తికేయన్ లాజికల్ కామెంట్స్
'అమరన్' సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన శివకార్తికేయన్.. ట్విటర్ వాడొద్దని సలహా ఇస్తున్నాడు. దాని వల్ల మంచి కంటే చెడు ఎక్కువగా ఉందని చెప్పాడు. ఇదేదో ఆషామాషీగా చెప్పకుండా లాజిక్‌తో సహా తన అభిప్రాయాన్ని బయటపెట్టాడు. గోవాలో ప్రస్తుతం ఫిల్మ్ ఫెస్టివల్ జరుగుతున్నాయి. ఇందులో భాగంగా మాట్లాడుతూ ఈ కామెంట్స్ చేశాడు.(ఇదీ చదవండి: 'పుష్ప' నటుడు శ్రీ తేజ్‌పై పోలీసు కేసు)'ఎలన్ మస్క్ నన్ను బ్లాక్ చేసినా సరే ఇది చెప్పకుండా ఉండలేకపోతున్నాను. సాధారణంగా ఏ సినిమా అయినా సరే ఫెయిల్ అయినప్పుడు సోషల్ మీడియాలో చూసి తప్పొప్పులు తెలుసుకునే వాడిని. అయితే ఇది ఫలితం ఇవ్వడం సంగతి అటుంచితే మరింత నెగిటివిటీ పెంచింది. నేను యాంకర్‌గా పనిచేసినప్పుడు టెక్నాలజీ లేదు కాబట్టి నిజంగా మనుషుల్ని అడిగి ఫీడ్ బ్యాక్ తీసుకునేవాడిని. తద్వారా తప్పుల్ని సరిదిద్దుకునేవాడిని. కానీ ట్విటర్(ఎక్స్)లో అలా సాధ్యం కాదు' అని శివకార్తికేయన్ చెప్పాడు.మూలాలని గుర్తుచేసుకోవడం వల్ల గత రెండేళ్లుగా మళ్లీ సక్సెస్ ట్రాక్‌లోకి వచ్చానని శివకార్తికేయన్ చెప్పాడు. ట్విటర్ (ఎక్స్) గురించి ఇతడు చెప్పిన దానిబట్టి చూస్తే ఏ సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్ తీసుకున్నా సరే ప్లస్సుల కంటే మైనస్సులే ఎక్కువైపోయాయి. ఫ్యాన్ వార్స్ చేసుకోవడం, అనవసరమైన వీడియోలపై కామెంట్స్ చేసి సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు చిక్కుల్లో ఇరుక్కోవడం లాంటివి మనం ఎప్పటికప్పుడు చూస్తూనే ఉన్నాంగా!(ఇదీ చదవండి: అమ్మాయిలకే 'సెకండ్ హ్యాండ్' లాంటి ట్యాగ్ ఎందుకు?: సమంత) -
అమరన్ సక్సెస్.. స్వయంగా బిర్యానీ వడ్డించిన హీరో!
కోలీవుడ్ స్టార్ శివకార్తికేయన్ నటించిన తాజా చిత్రం అమరన్. ఈ దీపావళి సందర్భంగా అక్టోబర్ 31న థియేటర్లలో రిలీజైంది. సాయిపల్లవి హీరోయిన్గా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. ఇప్పటికే రూ.300 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించింది. విడుదలై మూడు వారాలైనప్పటికీ కలెక్షన్స్ పరంగా రాణిస్తోంది. ఆర్మీ మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవితం ఆధారంగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.అయితే ప్రస్తుతం శివ కార్తికేయన్ మరో మూవీతో బిజీగా ఉన్నారు. ఎస్కే23 వర్కింగ్ టైటిల్లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సందర్భంగా అమరన్ సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహించారు. షూటింగ్ సెట్లోనే ఈ వేడుకలు చేసుకున్నారు.అనంతరం మూవీ సిబ్బందికి భోజనాలు ఏర్పాటు చేశారు. హీరో శివ కార్తికేయన్ స్వయంగా అందరికీ బిర్యానీ వడ్డించారు. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. కాగా.. అమరన్ చిత్రాన్ని రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్, సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా సంయుక్తంగా నిర్మించాయి. ఈ చిత్రంలో భువన్ అరోరా, రాహుల్ బోస్, లల్లు, శ్రీకుమార్, శ్యామ్ మోహన్, గీతా కైలాసం కీలక పాత్రలు పోషించారు. #Sivakarthikeyan served Biryani to #SK23 crew members on celebrating #Amaran Blockbuster success ❤️🔥❤️🔥pic.twitter.com/uAzB5PbXqh— AmuthaBharathi (@CinemaWithAB) November 19, 2024 -
'అమరన్' హిట్.. మ్యూజిక్ డైరెక్టర్‌కి ఖరీదైన గిఫ్ట్
గతవారం దీపావళి సందర్భంగా నాలుగు సినిమాలు రిలీజయ్యాయి. కిరణ్ అబ్బవరం 'క', దుల్కర్ 'లక్కీ భాస్కర్' లాంటి తెలుగు మూవీస్‌తో పాటు తమిళ డబ్బింగ్ చిత్రం 'అమరన్' కూడా హిట్‌గా నిలిచింది. పెద్దగా ప్రమోషన్ లేకుండా తెలుగులోనూ రిలీజైనప్పటికీ జనాలకు నచ్చేసింది.ఇప్పటికే 'అమరన్' మూవీకి రూ.100 కోట్లకు పైగా కలెక్షన్స్ వచ్చాయి. ఈ సినిమాలో శివకార్తికేయన్, సాయిపల్లవి తమదైన యాక్టింగ్‌తో కట్టిపడేశారు. కంటెంట్ కూడా అంతకు మించి అనేలా క్లిక్ అయింది. 'హే రంగులే' లాంటి పాటలు, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్‌తో సంగీత దర్శకుడు జీవీ ప్రకాశ్.. సినిమాని మరో స్థాయిలో నిలబెట్టాడు.(ఇదీ చదవండి: తమన్నా డిజాస్టర్ సినిమా.. ఏడాది తర్వాత ఓటీటీలోకి)సినిమా సక్సెస్‌లో కీలక పాత్ర పోషించిన జీవీ ప్రకాశ్ కుమార్‌కి హీరో శివకార్తికేయన్ ఖరీదైన బహుమతి ఇచ్చాడు. దాదాపు రూ.3 లక్షల విలువ చేసే టీఏజీ హ్యూయర్ మెన్స్ ఫార్ములా 1 బ్రాండ్‌కి చెందిన స్టెయిన్ లెస్ స్టీల్ స్టైలిష్ వాచీని తనకు ఇచ్చినట్లు జీవీ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ సందర్భంగా హీరోకి థ్యాంక్స్ చెప్పాడు.కశ్మీర్లో తీవ్రవాదులతో పోరాడుతూ వీరమరణం పొందిన ముకుందన్ వరదరాజన్ జీవితం ఆధారంగా 'అమరన్' సినిమా తీశారు. ట్రైలర్ రిలీజైనప్పుడు అడివి శేష్ 'మేజర్'తో పోల్చి చూశారు. కానీ మూవీ రిలీజైన తర్వాత అలాంటివేం వినిపించలేదు. (ఇదీ చదవండి: 'బ్లడీ బెగ్గర్' సినిమా రివ్యూ) -
'తెలుగు ఆడియన్స్ మాత్రమే అలా చేస్తారు'.. సాయిపల్లవి కామెంట్స్
కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తికేయన్, సాయిపల్లవి జంటగా నటించిన తాజా చిత్రం 'అమరన్'. ఆర్మీ మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవితం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. దీపావళి సందర్భంగా అక్టోబర్ 31న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. విడుదలైన ఆరు రోజుల్లోనే రూ.100 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ సినిమాకు రాజ్ కుమార్ పెరియస్వామి దర్శకత్వం వహించారు.తాజాగా ఈ మూవీ సక్సెస్ మీట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా హీరోయిన్ సాయి పల్లవి ఆసక్తికర కామెంట్స్ చేశారు. తెలుగు ఆడియన్స్‌పై ప్రశంసలు కురిపించారు. భాషతో సంబంధం లేకుండా ఆదరించేది కేవలం తెలుగు ప్రేక్షకులు మాత్రమేనన్నారు. గతంలో నన్ను భానుమతి, వెన్నెల అని పిలిచేవారు.. ఇప్పుడేమో ఇందు రెబెకా వర్గీస్ అని పిలుస్తున్నారు. సినిమాను గొప్పగా ప్రేమించే ఆడియన్స్ ఎవరైనా ఉన్నారంటే అది తెలుగువారు మాత్రమేనని సాయిపల్లవి కొనియాడారు. మీ ప్రేమ, ఎంకరేజ్మెంట్ చూసి నేను మరిన్ని మంచి సినిమాలు చేయాలని అనిపిస్తోందని అన్నారు. మీ అందరికీ చాలా థ్యాంక్స్ అంటూ సాయిపల్లవి మాట్లాడారు.కాగా.. ఈ చిత్రాన్ని మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవితం ఆధారంగా తెరకెక్కించారు. 2014లో కాశ్మీర్‌లోని షోపియాన్‌లో జరిగిన ఉగ్రదాడిలో మేజర్ ముకుంద్ అమరుడయ్యారు. ఆయన జీవితాన్ని అమరన్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ సినిమాను రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్, సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు. "Telugu audience andariki chala pedda thanks" ❤️ Heroine @Sai_Pallavi92 at #Amaran Success Meet ❤️🔥#AmaranMajorSuccess #MajorMukundVaradharajan #saipallavisenthamarai #SaiPallavi #YouWeMedia pic.twitter.com/YYbGoGHPNU— YouWe Media (@MediaYouwe) November 6, 2024 -
'ఇక నుంచి నువ్వు మా తెలుగు హీరో'.. నితిన్ కామెంట్స్
కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తికేయన్, సాయిపల్లవి జంటగా నటించిన తాజా చిత్రం 'అమరన్'. ఆర్మీ మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవితం ఆధారంగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. దీపావళి సందర్భంగా అక్టోబర్ 31న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. ఈ చిత్రానికి మొదటి రోజే పాజిటివ్ టాక్ రావడంతో వసూళ్ల పరంగా బెస్ట్ ఓపెనింగ్స్ నమోదు చేసింది. అమరన్ రిలీజైన ఆరు రోజుల్లోనే రూ.100 కోట్ల క్లబ్లో చేరింది. మొదటి రోజే రూ.21 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన ఈ చిత్రం ఆరు రోజుల్లో రూ.102 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది.తాజాగా ఈ మూవీ సక్సెస్ మీట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు టాలీవుడ్ హీరో నితిన్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా అమరన్ సినిమాపై ప్రశంసలు కురిపించారు. ఈ చిత్రానికి హీరోయిన్ సాయిపల్లవి బ్యాక్‌బోన్ అంటూ కొనియాడారు. మీ డ్యాన్స్ అంటే చాలా ఇష్టమని.. ఏదో ఒకరోజు మీతో డ్యాన్స్ చేయాలని ఉందని అన్నారు. త్వరలోనే ఆ రోజు రావాలని కోరుకుంటున్నానని నితిన్ తెలిపారు.శివ కార్తికేయన్‌తో నాకు ప్రత్యేక అనుబంధముందని హీరో నితిన్ అన్నారు. హైదరాబాద్‌లో ఉన్నప్పటికీ గత నాలుగేళ్లుగా మేము కలవడానికి కుదర్లేదన్నారు. చాలా రోజుల తర్వాత మేమిద్దరం కలిశామని సంతోషం వ్యక్తం చేశారు. అమరన్ సినిమాకు శివ కార్తికేయన్ చాలా కష్టపడ్డారని.. ఇక నుంచి మా తెలుగు హీరో, మా తెలుగబ్బాయి అయిపోయాడని నితిన్ అన్నారు. కాగా.. నితిన్ ప్రస్తుతం రాబిన్‌హుడ్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో శ్రీలీల, రష్మిక మందన్నా హీరోయిన్లుగా కనిపించనున్నారు. -
అమరన్ మూవీ.. ఆరు రోజుల్లోనే ఆ మార్కు దాటేసింది!
కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తికేయన్, సాయిపల్లవి జంటగా నటించిన చిత్రం అమరన్. ఆర్మీ మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవితం ఆధారంగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. దీపావళి సందర్భంగా అక్టోబర్ 31న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. ఈ చిత్రానికి మొదటి రోజే పాజిటివ్ టాక్ రావడంతో వసూళ్ల పరంగా బెస్ట్ ఓపెనింగ్స్ నమోదు చేసింది. అమరన్ కేవలం ఆరు రోజుల్లోనే రూ.100 కోట్ల క్లబ్లో చేరింది. కాగా.. ఈ చిత్రానికి రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వం వహించారు. మొదటి రోజే రూ.21 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన ఈ చిత్రం ఆరు రోజుల్లో రూ.102 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది.అమరన్‌లో మేజర్ ముకుంద్ పాత్రలో శివ కార్తికేయన్ కనిపించగా.. ఆయన భార్యగా ఇందు పాత్రలో సాయిపల్లవి నటించింది. దీపావళి సందర్భంగా అక్టోబర్ 31న థియేటర్లలోకి వచ్చిన అమరన్.. బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. ఇప్పటికే గ్రాస్ కలెక్షన్ల పరంగా ప్రపంచవ్యాప్తంగా రూ. 200 కోట్ల క్లబ్లో చేరేందుకు సిద్ధంగా ఉంది. ఈ వారంలో ఆ రికార్డ్‌ను అధిగమించే అవకాశముంది.కాగా.. ఈ చిత్రాన్ని మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవితం ఆధారంగా తెరకెక్కించారు. 2014లో కాశ్మీర్‌లోని షోపియాన్‌లో జరిగిన ఉగ్రదాడిలో మేజర్ ముకుంద్ అమరుడయ్యారు. ఆయన జీవితాన్ని అమరన్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ సినిమాను రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్, సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు. -
అమరన్ మూవీ.. మేజర్ కుటుంబ సభ్యుల కోరిక అదే: డైరెక్టర్
కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తికేయన్, సాయిపల్లవి జంటగా నటించిన చిత్రం అమరన్. ఆర్మీ మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవితం ఆధారంగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. దీపావళి సందర్భంగా అక్టోబర్ 31న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. ఈ చిత్రానికి మొదటి రోజే పాజిటివ్ టాక్ రావడంతో వసూళ్ల పరంగా బెస్ట్ ఓపెనింగ్స్ నమోదు చేసింది. ఆ విషయంపై వివాదం..అమరన్‌లో మేజర్ ముకుంద్ పాత్రలో శివ కార్తికేయన్ కనిపించగా.. ఆయన భార్యగా ఇందు పాత్రలో సాయిపల్లవి నటించింది. అయితే ఈ చిత్రంలో మేజర్ ముకుంద్ కులాన్ని ఎందుకు ప్రస్తావించలేదని ఓ వర్గం ప్రజలు ప్రశ్నించారు. తాజాగా చెన్నైలో నిర్వహించిన సక్సెస్ మీట్లో డైరెక్టర్ రాజ్‌కుమార్ పెరియసామి ఈ విషయంపై స్పందించారు. ఈ సినిమాలో మేజర్ కులాన్ని ఎందుకు చూపించలేదన్న అంశంపై రాజ్‌కుమార్ క్లారిటీ ఇచ్చారు.మేజర్ కుటుంబం అభ్యర్థన ఇదే..ముకుంద్ భార్య ఇందు, అతని తల్లిదండ్రులు సినిమా తీయడానికి ముందే కొన్ని అభ్యర్థనలు చేశారని డైరెక్టర్ వివరించారు. మేజర్ ముకుంద్ తమిళియన్ కావడంతో.. ఆ పాత్రలో కచ్చితంగా తమిళ మూలాలు ఉన్న వ్యక్తిని నన్ను నటింపజేయాలని ఆమె కోరిందని తెలిపారు. అది నాకు శివకార్తికేయన్‌లో కనిపించిందని దర్శకుడు అన్నారు. ఈ చిత్రానికి తమిళ గుర్తింపు కూడా ఉండాలని ఆమె కోరుకుందని వెల్లడించారు.అదేవిధంగా ముకుంద్ తల్లిదండ్రులు తమ కుమారుడిని భారతీయుడిగానే చూపించాలని కోరినట్లు రాజ్‌కుమార్ తెలిపారు. అంతేకాకుండా తన సర్టిఫికేట్లో కూడా భారతీయుడు, తమిళుడు తప్ప మరేలాంటి గుర్తింపు తమకు వద్దన్నారు. మేజర్ ముకుంద్‌ను ఆర్మీ మ్యాన్‌గా మాత్రమే గుర్తించాలని ఆయన తల్లిదండ్రులు నన్ను అభ్యర్థించారని వెల్లడించారు. అందుకే సినిమాలో ఎక్కడా కూడా ముకుంద్ కులాన్ని ప్రస్తావించలేదన్నారు. అలాగే మేజర్ కుటుంబం తనను ఎప్పుడూ కులం అడగలేదని.. అదే స్ఫూర్తితో అశోకచక్ర అవార్డు గ్రహీతకు బహుమతిగా ఈ చిత్రాన్ని రూపొందించినట్లు డైరెక్టర్ వెల్లడించారు.అమరన్ గురించి..కాగా.. అమరన్ చిత్రాన్ని 2014లో జరిగిన ఉగ్రవాద దాడి ఆధారంగా తెరకెక్కించారు. ఈ దాడుల్లో మేజర్ ముకుంద్ అమరుడయ్యారు. ఆయన జీవిత చరిత్రనే సినిమాగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. కాగా.. మేజర్ ముకుంద్ వరదరాజన్ 2009లో ఇందును వివాహం చేసుకోగా..2011లో వీరికి కుమార్తె అర్షే ముకుంద్ జన్మించింది. ఈ చిత్రాన్ని శివ్ అరూర్, రాహుల్ సింగ్ రచించిన ఇండియాస్ మోస్ట్ ఫియర్లెస్: ట్రూ స్టోరీస్ ఆఫ్ మోడరన్ మిలిటరీ హీరోస్ పుస్తకం ఆధారంగా రూపొందించారు. -
నటుడు కాకముందే పెళ్లి.. ఇప్పుడేమో స్టార్ హీరో.. ఇతడెవరంటే?
సినిమా ఇండస్ట్రీలో నిలబడాలంటే బ్యాక్ గ్రౌండ్ ఉండాలని చాలామంది అనుకుంటారు. కానీ అప్పుడప్పుడు ఎలాంటి అంచనాల్లేకుండా నటుడు అయినోళ్లు.. కష్టంతో పాటు అదృష్టం కలిసొచ్చి స్టార్స్ అవుతారు. ఇతడు కూడా సేమ్ అలాంటివాడే. టీవీ యాంకర్‌గా కెరీర్ మొదలుపెట్టి ఇప్పుడు ఏకంగా పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. పైన హీరో ఎవరో గుర్తుపట్టారా? మమ్మల్నే చెప్పేయమంటారా?పైన ఫొటోలో ఉన్నది 'అమరన్' ఫేమ్ శివకార్తికేయన్. ఏంటి అతడా? అని ఆశ్చర్యపోతున్నారా! ఇది సినిమాల్లోకి రాకముందు, పెళ్లి టైంలో తీసుకున్న ఫొటో ఇది. శివకార్తికేయన్ పక్కనున్న ఉన్నది ఇతడి భార్య ఆర్తి. 2010లో వివాహం జరిగింది. తమిళనాడులో పుట్టిపెరిగిన శివకార్తికేయన్‌కి చిన్నప్పటి నుంచే యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్. కానీ పూర్తిస్థాయి నటుడు కావడానికి ముందే ఆర్తిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీళ్లకు 2013లో పాప పుట్టింది. ఆమె పేరు ఆరాధన.(ఇదీ చదవండి: అక్కడ సౌండ్ చేస్తే చచ్చిపోతారు.. ఓటీటీలోనే క్రేజీ మూవీ)ఓసారి ఫ్రెండ్స్ బలవంతం చేయడంతో షోలో పాల్గొని విజేతగా నిలిచాడు. మరోవైపు యాంకర్‌గానూ పలు షోలు చేశాడు. ఇవి కాదన్నట్లు షార్ట్ ఫిల్మ్స్‌లోనూ నటించాడు. '3' సినిమాలో ధనుష్‌కి ఫ్రెండ్‌గా చేశాడు. 2013లో విడుదలైన 'కేడీ బిల్లా కిలాడీ రంగ' మూవీ హీరోగా శివ కార్తికేయన్‌కి ఇచ్చింది. అక్కడి నుంచి ఒక్కో మూవీతో తన రేంజ్ పెంచుకుంటూ వెళ్లాడు. 'డాక్టర్' మూవీతో రూ.100 కోట్ల క్లబ్లో చేరిపోయాడు. ఇదే సినిమాతో తెలుగులోనూ ఫ్యాన్స్ ఏర్పడ్డారు.'డాక్టర్' తర్వాత అయలాన్, మహావీరుడు, డాన్ తదితర చిత్రాలతో ఎంటర్టైన్ చేశాడు. కానీ రీసెంట్గా దీపావళికి రిలీజైన 'అమరన్' మూవీతో మాత్రం తనలోని అసలు సిసలు నటుడిని అందరికీ పరిచయం చేశాడు. ఇప్పటికే రూ.100 కోట్ల కలెక్షన్స్‌కి దగ్గర్లో ఉంది. ఈ మూవీ వల్ల అప్పుడెప్పుడో పెళ్లినాటి ఫొటోలు మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పైన ఫోటో అదే!(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీలోకి వచ్చేసిన 15 సినిమాలు) -
అమరన్‌కి ప్రశంసలు
శివ కార్తికేయన్ హీరోగా రూపొందిన చిత్రం ‘అమరన్’. ఈ చిత్రబృందాన్ని హీరో రజనీకాంత్ ప్రశంసించారు. రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్గా నటించారు. కమల్‌హాసన్, ఆర్. మహేంద్రన్ నిర్మించిన ఈ సినిమా అక్టోబరు 31న తమిళ, తెలుగు భాషల్లో విడుదలైంది. ఈ చిత్రాన్ని తెలుగులో శ్రేష్ఠ్ మూవీస్ పతాకంపై సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి రిలీజ్ చేశారు. కాగా సూపర్ స్టార్ రజనీకాంత్ ‘అమరన్’ చిత్రాన్ని ప్రత్యేకంగా వీక్షించారు. ఆ తర్వాత కమల్‌హాసన్‌కు ఫోన్ చేసి, అద్భుతమైన చిత్రాన్ని నిర్మించారని మెచ్చుకున్నారు. అలాగే హీరో శివ కార్తికేయన్, దర్శకుడు రాజ్‌కుమార్, నిర్మాత ఆర్. మహేంద్రన్, సినిమాటోగ్రాఫర్ సాయిలని ప్రత్యేకంగా అభినందించారు. చిత్రకథ, కథనం, నటీనటుల నటన అద్భుతంగా ఉన్నాయని రజనీకాంత్ ప్రశంసించారు. -
శివ కార్తికేయన్ అమరన్.. తొలి రోజే రజనీకాంత్ సినిమాను దాటేసింది!
కోలీవుడ్ స్టార్ హీరో శివకార్తికేయన్, సాయిపల్లవి జంటగా నటించిన చిత్రం 'అమరన్'. ఆర్మీ మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవితం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. దీపావళి సందర్భంగా అక్టోబర్ 31న అమరన్ థియేటర్లలో రిలీజైంది. మొదటి రోజే ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ రావడంతో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ రాబడుతోంది.తొలిరోజే దేశవ్యాప్తంగా రూ.21 కోట్లకు పైగా నెట్ వసూళ్లు సాధించింది. ఒక్క తమిళనాడులోనే ఏకంగా రూ.15 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. ఈ రోజు తమిళనాడులో సెలవుదినం కావడంతో రెండో రోజు వసూళ్లు మరింత పెరిగే అవకాశముంది. తమిళ వర్షన్లో మొదటి రోజు థియేటర్లలో 77.94 శాతం ఆక్యుపెన్సీని నమోదు చేసింది. (ఇది చదవండి: ఈ శుక్రవారం ఓటీటీలోకి వచ్చేసిన 15 సినిమాలు)రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వం వహించిన అమరన్ అంచనాలకు తగ్గట్టుగానే బాక్సాఫీస్ వద్ద రాణిస్తోంది. అయితే విజయ్ ది గోట్, రజనీకాంత్ వేట్టయాన్ చిత్రాల మొదటి రోజు కలెక్షన్లను మాత్రం అధిగమించలేకపోయింది. అయితే తమిళనాడులో కమల్ హాసన్ చిత్రం ఇండియన్ -2 ఓపెనింగ్ డే కలెక్షన్స్‌ను దాటేసింది. కాగా.. ఈ చిత్రాన్ని రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్, సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా సంయుక్తంగా నిర్మించాయి. ఈ సినిమాను ఇండియాస్ మోస్ట్ ఫియర్లెస్: ట్రూ స్టోరీస్ ఆఫ్ మోడరన్ మిలిటరీ హీరోస్ అనే పుస్తక ఆధారంగా తెరకెక్కించారు. -
'ఆ సమయంలో బాధను బయట పెట్టకూడదనుకున్నా': సాయిపల్లవి కామెంట్స్
టాలీవుడ్ నేచురల్ బ్యూటీ ఈ దీపావళికి అభిమానులను పలకరించనుంది. కోలీవుడ్ స్టార్ శివ కార్తికేయన్ హీరోగా తెరకెక్కించిన అమరన్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆర్మీ మేజర్ ముకుంద్ వరదరాజన్ రియల్ లైఫ్ స్టోరీనే రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వంలో తెరకెక్కించారు. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ కాగా.. ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది.అమరన్ ప్రమోషన్లతో బిజీగా ఉన్న సాయిపల్లవి ఇంటర్వ్యూలతో బిజీగా ఉన్నారు. ఈ సందర్భంగా అమరన్ చిత్ర విశేషాలను పంచుకున్నారు. మేజర్ ముకుంద్ కుటుంబాన్ని కలిసినట్లు ఆమె వెల్లడించారు. ఆ సమయంలో తన భావోద్వేగాలను బయట పెట్టకూడదని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. మేజర్ కుటుంబాన్ని కలిసినప్పుడు తాను ఏవిధంగా ఫీలయ్యిందో చెప్పుకొచ్చారు.సాయిపల్లవి మాట్లాడుతూ.. 'అమరన్ మూవీ భాగంగా మేజర్ ముకుంద్ వరదరాజన్ ఫ్యామిలీని కలిశా. ఆయన గురించి ఎన్నో విషయాలు అడిగి తెలుసుకున్నా. ఆయన జీవితం గురించి తెలిశాక బాధగా ఉన్నా కూడా కన్నీళ్లు పెట్టకూడదని డిసైడ్ అయ్యా. తమ బిడ్డ దేశం కోసం ప్రాణాలు అర్పించాడని వాళ్లు ఎంతో గర్వంగా చెప్పారు. ఇదే విషయాన్ని మేజర్ తండ్రి వరదరాజన్ ఎక్కడికెళ్లినా గర్వంగా చెబుతుంటారు. వాళ్లకి లోపల చాలా బాధ ఉన్నప్పటికీ బయటకు కనిపించరు. ఆ కుటుంబం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుందని' అన్నారు.పాత వీడియో వైరల్..అయితే గతంలో సాయిపల్లవి ఇండియన్ ఆర్మీని ఉద్దేశించి చేసిన కామెంట్స్ వివాదానికి దారితీసిన సంగతి తెలిసిందే. మన జవాన్లను టెర్రరిస్ట్‌లతో పోల్చిందంటూ నెటిజన్స్ ఆమెను తప్పు పడుతున్నారు. గతంలో ఆమె విరాటపర్వం సినిమా నాటి వీడియో.. తాజాగా అమరన్ రిలీజ్ సందర్భంగా నెట్టింట వైరలవుతున్న సంగతి తెలిసిందే.ఆ వీడియో సాయిపల్లవి మాట్లాడుతూ.. 'పాకిస్తాన్లో ఉన్న వాళ్లు.. మన జవాన్లు టెర్రరిస్ట్‌లు అని అనుకుంటారు. ఎందుకంటే మనం ఇక్కడ ఉన్నాం.. వాళ్లకు ఏమైనా హాని చేస్తామని భావిస్తారు. అదే సమయంలో మనకు కూడా వాళ్లు అలానే కనిపిస్తారు. ఈ రెండింటి మధ్య మనం చూసే విధానం మారిపోతుంది. ఇందులో ఎవరు రైట్..? ఎవరు రాంగ్..? అని నేను చెప్పలేను.’ అని ఆమె అన్నారు.కావాలనే చేస్తున్నారు..అయితే సాయిపల్లవి కామెంట్స్‌పై బాలీవుడ్ ఇండస్ట్రీ వాళ్లే కొందరు కావాలని అలా ప్రచారం చేస్తున్నారని మరో టాక్ వినిపిస్తోంది. అయితే సాయిపల్లవి బాలీవుడ్లో రణ్‌బీర్ కపూర్ సరసన రామాయణ చిత్రంతో ఎంట్రీ ఇస్తోన్న సంగతి తెలిసిందే. ఆర్మీపై ఆమె చేసిన కామెంట్స్ వల్ల సీత పాత్రలో సాయి పల్లవిని తొలగించాలంటూ కొందరు కావాలనే టార్గెట్ చేశారని మరికొందరు అంటున్నారు. -
అప్పుడు ప్రేక్షకులకు బోర్ కొడుతుంది!
నటనకు ప్రాధాన్యం ఉండే, మనసుని హత్తుకునే పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తుంటారు సాయిపల్లవి. దక్షిణాదిలో తనకంటూ ఎంతో గుర్తింపు, ఫ్యాన్ ఫాలోయింగ్‌ని సొంతం చేసుకున్న ఈ బ్యూటీ ‘రామాయణ’ సినిమాతో బాలీవుడ్‌కి ఎంట్రీ ఇస్తున్నారు. ఈ చిత్రంలో రాముడిగా రణ్‌బీర్ కపూర్, సీతగా సాయి పల్లవి నటిస్తున్నారు. కాగా శివ కార్తికేయన్ హీరోగా సాయిపల్లవి హీరోయిన్గా నటించిన ‘అమరన్’ తెలుగు, తమిళ భాషల్లో ఈ నెల 31న విడుదలవుతోంది.ఈ సినిమా ప్రమోషన్లో భాగంగా సాయి పల్లవి మాట్లాడుతూ... బాలీవుడ్ పీఆర్ ఏజెన్సీల గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘ఇటీవల బాలీవుడ్‌కు చెందిన ఒక వ్యక్తి నాకు ఫోన్ చేశారు. తరచూ వార్తల్లో నిలవడం కోసం మీరు పీఆర్ టీమ్‌ను నియమించుకుంటారా? అని అడిగారు. పీఆర్ టీమ్ వల్ల తరచుగా వార్తల్లో ఉండగలను... అందరూ నా గురించి మాట్లాడుకుంటారు. అది నాకు ఇష్టం లేదు. ఎందుకంటే నా సినిమాలు రిలీజైనప్పుడు ఎలాగూ నేను ఇంటర్వ్యూలు ఇస్తున్నాను. అప్పుడు ప్రేక్షకులు, ఫ్యాన్స్ నా గురించి మాట్లాడుకుంటారు. సినిమా రిలీజ్ తర్వాత కూడా నా పేరు వినిపిస్తూనే ఉండాల్సిన అవసరం ఏముంది? పైగా నిత్యం నా గురించి మాట్లాడితే ప్రేక్షకులకు బోర్ కొడుతుంది.. విసుగొస్తుంది.. అందుకే నేను పీఆర్ టీమ్ వద్దని చెప్పాను’’ అంటూ సాయి పల్లవి చెప్పారు. -
'ఆర్మీ జాబ్ కాదు.. నా లైఫ్'.. అమరన్ ట్రైలర్ వచ్చేసింది!
కోలీవుడ్ స్టార్ శివ కార్తికేయన్, సాయిపల్లవి జంటగా నటిస్తోన్న చిత్రం అమరన్. ఆర్మీ మేజర్ నిజ జీవితం ఆధారంగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ సినిమాకు రాజ్‌కుమార్ పెరియస్వామి దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ దీపావళి కానుకగా ఈ నెల 31న థియేటర్లలో సందడి చేయనుంది.తాజాగా అమరన్ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవితం ఆధారంగానే ఈ సినిమాను తెరకెక్కించారు. ట్రైలర్ చూస్తే ఆర్మీలో దేశం కోసం ఆయన చేసిన పోరాట సన్నివేశాలు ఆకట్టుకునేలా ఉన్నాయి. ట్రైలర్లో దేశ రక్షణ కోసం మేజర్ పోరాడిన సన్నివేశాలు, ఎమోషనల్ సీన్స్ చూస్తే మరో సీతారామం మూవీని గుర్తుకు వచ్చేలా ఉన్నాయి. కాగా.. ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతమందించారు. -
సాయిపల్లవి.. నన్ను అన్నయ్య అనేసరికి బాధపడ్డా: స్టార్ హీరో
సాయిపల్లవి.. ఓ స్టార్ హీరోని 'అన్న' అనేసింది. ఈ విషయాన్ని సదరు హీరోనే బయటపెట్టాడు. ఆమె అలా పిలిచినందుకు అప్పుడు చాలా బాధపడ్డాడని కూడా చెప్పాడు.'అమరన్' అనే తమిళ మూవీ ఆడియో లాంచ్ సందర్భంగా హీరో శివకార్తికేయన్ ఇదంతా చెప్పాడు.తమిళ స్టార్ హీరో శివకార్తికేయన్, సాయిపల్లవి లేటెస్ట్ మూవీ 'అమరన్'. ఆర్మీ మేజర్ ముకుంద్ వరదరాజన్ నిజ జీవిత కథతో ఈ మూవీ తీశారు. అక్టోబర్ 31న తెలుగు-తమిళ భాషల్లో రిలీజ్ కానుంది. యాంకర్‌గా కెరీర్ మొదలుపెట్టిన శివ కార్తికేయన్ ఇప్పుడు స్టార్ హీరో అయ్యేంతవరకు వచ్చాడు. తన కెరీర్ ప్రారంభంలో సాయిపల్లవితో జరిగిన ఫన్నీ సంఘటననే ఇప్పుడు బయటపెట్టాడు.(ఇదీ చదవండి: అరెస్ట్ న్యూస్.. వీడియో రిలీజ్ చేసిన బిగ్ బాస్ శేఖర్ భాషా)'గతంలో నేను టీవీ ఛానెల్లో పనిచేస్తున్నప్పుడు సాయిపల్లవిని మొదటిసారి కలిశాను. నేను హోస్ట్ చేసిన ఓ కార్యక్రమానికి ఆమె హాజరయ్యారు. ఆ తర్వాత 'ప్రేమమ్'లో ఈమె నటన నాకు తెగ నచ్చేసింది. దీంతో ఫోన్ చేసి అదే విషయాన్ని చెప్పాను. వెంటనే 'థ్యాంక్యూ అన్న' అనేసింది. నన్ను అన్నా అని పిలిచినందుకు అప్పుడు చాలా బాధపడ్డాను' అని శివకార్తికేయన్ చెప్పుకొచ్చాడు.ప్రస్తుతం సాయిపల్లవి తెలుగులో 'తండేల్' సినిమా చేస్తోంది. నాగచైతన్య హీరోగా నటిస్తున్న ఈ మూవీ కూడా నిజ జీవిత సంఘటనల ఆధారంగానే తీస్తున్నారు. కొందరు తెలుగు జాలర్లు.. పాకిస్థాన్ అధికారులకు చిక్కి, అక్కడి జైల్లో కొన్నాళ్లు గడిపారు. ఈ సినిమాని క్రిస్మస్ లేదా సంక్రాంతికి థియేటర్లలోకి తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ రెండు మూవీస్‌తో మరోసారి బౌన్స్ బ్యాక్ అవుతాననే సాయిపల్లవి ధీమాతో ఉంది.(ఇదీ చదవండి: సోషల్ మీడియా ట్రెండింగ్‌లో 'రియా'.. అసలు ఈమె ఎవరంటే?)Heart of #Amaran ♥️ @Sai_Pallavi92 at #AmaranAudioLaunch#AmaranDiwali #AmaranOctober31#Ulaganayagan #KamalHaasan #Sivakarthikeyan #SaiPallavi #RajkumarPeriasamyA Film By @Rajkumar_KP A @gvprakash Musical@ikamalhaasan @Siva_Kartikeyan #Mahendran @Sai_Pallavi92… pic.twitter.com/kRBCU7ADld— Raaj Kamal Films International (@RKFI) October 18, 2024 -
ఓటీటీలో స్టార్ హీరో తీసిన పిల్లల సినిమా.. తెలుగులో స్ట్రీమింగ్
వరస సినిమాలు చేసే తమిళ స్టార్ హీరోల్లో శివ కార్తికేయన్ ఒకడు. నిర్మాతగానూ డిఫరెంట్ సినిమాలు తీస్తుంటాడు. అలా తీసిన చిన్న పిల్లల చిత్రమే 'కురంగు పెడళ్'. మే తొలి వారంలో థియేటర్లలో రిలీజైంది. మంచి టాక్ తెచ్చుకుంది. నెల తర్వాత ఆహా, అమెజాన్ ప్రైమ్ ఓటీటీల్లోకి అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇప్పుడు తెలుగు వెర్షన్ నేరుగా రిలీజ్ చేసేశారు.(ఇదీ చదవండి: విమానం కొన్న హీరో సూర్య.. రేటు రూ.100 కోట్లు పైనే?)ప్రస్తుతం 'కురంగు పెడళ్' సినిమా తెలుగు వెర్షన్ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే సైలెంట్‌గా అందుబాటులోకి తీసుకొచ్చేశారు. 1980 బ్యాక్ డ్రాప్ స్టోరీతో చిన్నప్పటి జ్ఞాపకాల్ని గుర్తుచేసేలా ఈ సినిమా ఉంటుంది. కమల కన్నన్ దర్శకత్వం వహించగా.. జిబ్రాన్ సంగీతమందించాడు.'కురంగు పెడళ్' విషయానికొస్తే.. సైకిల్ నడపడం నేర్చుకోవాలని కలలు కన్న ఓ యువకుడు.. ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. సైకిల్ నడపడం రాని ఈ పిల్లాడి తండ్రి.. కొడుకు కోరికని ఎలా నెరవేర్చాడు అనే పాయింట్ చుట్టూ భావోద్వేగభరితంగా తీశారు. ఇఫితో పాటు పలు అంతర్జాతీయ చిత్రాత్సవాల్లో ఈ మూవీ స్క్రీనింగ్ కావడం విశేషం.(ఇదీ చదవండి: బోల్డ్ సీన్స్ వైరల్.. నన్ను జడ్జ్ చేయడం కరెక్ట్ కాదు: రుహానీ శర్మ) -
దీపావళి రేసులో కమల్ హాసన్.. కాకపోతే నిర్మాతగా!
'కల్కి'లో విలన్‌గా హిట్ కొట్టిన కమల్ హాసన్.. రీసెంట్గా 'భారతీయుడు 2'గా ఘోరమైన డిజాస్టర్ అందుకున్నాడు. ఇప్పుడు నెలల గ్యాప్‌లో నిర్మాతగా యాక్షన్ మూవీతో ప్రేక్షకుల్ని పలకరించనున్నాడు. రాజ్‌కమల్ ఫిలిం ఇంటర్నేషనల్ పతాకంపై కమల్ నిర్మిస్తున్న లేటెస్ట్ మూవీ 'అమరన్'. శివకార్తికేయన్, సాయిపల్లవి జంటగా నటిస్తున్నారు. చాలా గ్యాప్ తరువాత సాయిపల్లవి చేస్తున్న తమిళ చిత్రమిది. రాజ్‌కుమార్ పెరియసామి దర్శకుడు. తాజాగా ఈ చిత్ర రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు.(ఇదీ చదవండి: 'డార్లింగ్' సినిమా రివ్యూ)ఇందులో శివకార్తికేయన్ ముకుందన్ అనే సైనికుడిగా పవర్‌పుల్ పాత్రలో కనిపించబోతున్నారు. మేజర్ ముకుంద్ వరదరాజన్ బయోపిక్‌గా దీన్ని తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని దీపావళి కానుకగా అక్టోబరు 31న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఇకపోతే విలన్‌గా హిట్ కొట్టి, హీరోగా ఫ్లాప్ అందుకున్న కమల్.. నిర్మాతగా మరి ఎలాంటి ఫలితం అందుకుంటాడనేది చూడాలి?(ఇదీ చదవండి: బాలీవుడ్ మాఫియాకి దెబ్బ మీద దెబ్బ.. షాకిచ్చిన 'కల్కి' మేకర్స్!) -
మూడోసారి తండ్రయిన స్టార్ హీరో శివకార్తికేయన్
స్టార్ హీరో శివకార్తికేయన్ మూడోసారి తండ్రయ్యాడు. ఇతడి భార్య ఆర్తి.. పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. జూన్ 2నే బిడ్డ పుట్టినప్పటికీ ఒక రోజు లేటుగా శివకార్తికేయన్ ఈ విషయాన్ని బయటపెట్టాడు. తల్లిబిడ్డ క్షేమంగా ఉన్నారని చెప్పుకొచ్చాడు.(ఇదీ చదవండి: తమిళ యువ నిర్మాత అరెస్ట్.. ఓ అమ్మాయి జీవితాన్ని నాశనం చేసి)యాంకర్‌గా కెరీర్ మొదలుపెట్టిన శివకార్తికేయన్.. '3' సినిమాతో సహాయ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత సోలో హీరోగా మారి వరస హిట్స్ అందుకున్నాడు. రీసెంట్ టైంలో 'మహావీరుడు', 'అయలాన్' చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల్ని కూడా అలరించాడు.ఇకపోతే 2010లో తన బంధువుల అమ్మాయి ఆర్తిని పెళ్లి చేసుకున్నాడు. 2013లో ఈ జంటకు ఆరాధాన అనే అమ్మాయి, 2021లో గుగున్ అనే అబ్బాయి పుట్టారు. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి వీళ్లు తల్లిదండ్రులయ్యారు. ఈ క్రమంలోనే పలువురు శివకార్తికేయన్‌కి శుభాకాంక్షలు చెబుతున్నారు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 31 సినిమాలు.. అవి ఏంటంటే?)#BlessedWithBabyBoy ❤️❤️❤️ pic.twitter.com/LMEQc28bFY— Sivakarthikeyan (@Siva_Kartikeyan) June 3, 2024 -
కమెడియన్ అని చిన్నచూపు చూడొద్దు..
కమెడియన్‌గా కెరీర్ మొదలుపెట్టి ఇప్పుడు హీరోగా పేరు తెచ్చుకునేంత వరకు వెళ్లిన నటుడు సూరి. తమిళ ఇండస్ట్రీకి చెందిన ఇతడు గతేడాది 'విడుదలై' మూవీతో హీరోగా మారి హిట్ కొట్టాడు. ఇప్పుడు 'గరుడన్'గా రాబోతున్నాడు. ఉన్ని ముకుందన్, సముద్రఖని, రేవతీ తదితరులు ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని మే 31న థియేటర్లలోకి రాబోతుంది.(ఇదీ చదవండి: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన 'మైదాన్' సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?)స్టార్ డైరెక్టర్ వెట్రిమారన్ కథ అందించిన ఈ సినిమాకు దురై సెంథిల్ కుమార్ దర్శకుడు. యువన్ శంకర్ రాజా సంగీతమందించాడు. 'గరుడన్' ఆడియో ఈవెంట్ తాజాగా జరగ్గా దీనికి తమిళ స్టార్ హీరోలు విజయసేతుపతి, శివకార్తీకేయన్ అతిథులుగా హాజరయ్యారు. ఈ క్రమంలోనే శివకార్తికేయన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.'హాస్య నటులని చులకనగా చూడొద్దు. ఓ టైంలో హీరోగా చేయమని సూరికి సలహా ఇచ్చాను. కానీ ఆయన కాస్త భయపడ్డాడు. కొన్నాళ్ల తర్వాత ఫోన్ చేసి.. వెట్రిమారన్ తనని హీరోగా పెట్టి మూవీ చేస్తున్నానని, కానీ కాస్త దడ పుడుతోందని అన్నాడు. అయితే కామెడీ నటులు సీరియస్ పాత్రల్లో నటించగలరు గానీ సీరియస్ నటులు కామెడీ పాత్రలు చేయలేరు. అందుకు సూరినే ఓ ఉదాహరణ' అని శివకార్తికేయన్ చెప్పాడు. తనని హీరోగా మార్చిన వెట్రిమారన్‌కి జీవితాంతం రుణపడి ఉంటానని సూరి ఎమోషనల్ అయ్యాడు.(ఇదీ చదవండి: క్యార్‌వ్యాన్‌లోకి వచ్చి అతడలా చేసేసరికి భయపడ్డా: కాజల్ అగర్వాల్) -
Ayalaan OTT Release: ఓటీటీలోకి 'అయలాన్'
తమిళ హీరో శివకార్తికేయన్‌కు తెలుగులోనూ మంచి మార్కెట్ ఉంది. ఆయన తమిళ్లో నటించిన రెమో, డాక్టర్ వరుణ్, డాన్, ప్రిన్స్ చిత్రాలు తెలుగులో విడుదలై మంచి విజయాలను అందుకున్నాయి. ఈ క్రమంలో ఈ ఏడాది ప్రారంభంలో ‘అయలాన్’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన ఈ చిత్రం మంచి విజయం సాధించింది. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన ఈ చిత్రం..టాలీవుడ్లో తప్ప మిగతా అన్ని ప్రాంతాల్లో రిలీజైంది. సంక్రాంతికి గట్టిపోటీ ఉండటంతో అయలాన్ తెలుగు రిలీజ్ వాయిదా పడిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. ఈ చిత్రం ఇప్పటికే తమిళ్ వర్షన్ ఓటీటీలోకి వచ్చేసింది. భారీ ధరకు డిజిటల్ రైట్స్‌ను సొంతం చేసుకున్న సన్ నెక్ట్స్ ఫిబ్రవరిలోనే ప్రేక్షకులకు అందుబాటులోకి తెచ్చింది. ఇప్పుడు ఓటీటీలోకి 'అయలాన్' తెలుగు వర్షన్ రాబోతుందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. ఏప్రిల్ 19 నుంచి అయలాన్ స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. ఫాంటసీ సైన్స్ ఫిక్షన్ కథతో తెరకెక్కిన ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్గా నటించింది. ఆర్.రవికుమార్ దర్శకత్వం వహించారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించాడు. కేవలం తమిళ్ వర్షన్లో సుమారుగా రూ. 100 కోట్ల గ్రాస్‌ను ఈ సినిమా కలెక్ట్ చేసింది. -
సైలెంట్‌గా శివకార్తికేయన్ కొత్త మూవీ షూటింగ్
'మహావీరుడు', 'అయలాన్' సినిమాలతో హిట్స్ కొట్టిన తమిళ హీరో శివకార్తికేయన్.. ప్రస్తుతం రెండు సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. వీటిలో కమలహాసన్ నిర్మిస్తున్న 'అమరన్' ఒకటి. దీని షూటింగ్ చివరి దశకు చేరుకుంది. మరోవైపు స్టార్ డైరెక్టర్ ఏఆర్ మురగదాస్ తీస్తున్న మూవీ షూటింగ్ సైలెంట్‌గా జరుగుతోంది. (ఇదీ చదవండి: నా భర్త మొదటి విడాకులు.. కారణం నేను కాదు: స్టార్ హీరో మాజీ భార్య) ఈ సినిమాలో శివకార్తికేయన్ సరసన రుక్మిణి వసంత్ హీరోయిన్గా చేస్తోంది. పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్గా తీస్తున్న ఈ చిత్ర తొలి షెడ్యూల్ ఎలాంటి ఆర్భాటం లేకుండా అయిపోయింది. ప్రస్తుతం పుదుచ్చేరిలో రెండో షెడ్యూల్ జరుగుతోంది. అనిరుధ్ సంగీతమందిస్తుండగా.. త్వరలో ఇతర వివరాలు వెల్లడించనున్నారు. ఈ మూవీ తర్వాత మురగదాస్.. సల్మాన్ ఖాన్‌తో కలిసి పనిచేస్తారు. (ఇదీ చదవండి: స్టార్ హీరో సూర్య దంపతుల మొత్తం ఆస్తి అన్ని కోట్లా?) -
సందీప్ రెడ్డి సినిమాల కంటే ఆయనలో అదే నా ఫేవరెట్: స్టార్ హీరో
సందీప్ రెడ్డి వంగా.. ఈ పేరు చెప్పగానే 'అర్జున్ రెడ్డి', 'యానిమల్' సినిమాలే గుర్తొస్తాయి. డిఫరెంట్ హీరోయిజాన్ని ఇండస్ట్రీకి పరిచయం చేసిన ఇతడు.. పాన్ ఇండియా లెవల్లో సెన్సేషన్ సృష్టించాడు. అయితే ఇతడి లేటెస్ట్ మూవీ 'యానిమల్'ని ఎంతలా బాగుందని మెచ్చుకున్నారో అంతే ఘోరంగా విమర్శించారు. మరీ ముఖ్యంగా తమిళ సెలబ్రిటీలు అందరూ 'యానిమల్' చిత్రాన్ని, సందీప్ రెడ్డి వంగాపై దారుణమైన కామెంట్స్ చేశారు. స్టార్ హీరో శివ కార్తికేయన్ మాత్రం తాజాగా ఓ కార్యక్రమంలో వీళ్లందరితో పోలిస్తే భిన్నంగా మాట్లాడాడు. (ఇదీ చదవండి: సెట్లో ఎవరు అలా చేసిన బాలకృష్ణ తట్టుకోలేడు: ప్రముఖ తమిళ దర్శకుడు) రెండే సినిమాలతో పాన్ ఇండియా లెవల్లో గుర్తింపు తెచ్చుకున్న సందీప్ రెడ్డి వంగా.. ప్రస్తుతం పలు ఈవెంట్స్‌కి అతిథిగా హాజరవుతూ బిజీగా ఉన్నాడు. ఇలానే తమిళనాడులో తాజాగా జరిగిన ఓ అవార్డు వేడుకకు హాజరయ్యాడు. ఇందులో భాగంగా తమిళ స్టార్ హీరో శివకార్తికేయన్ పలు విషయాలు చెప్పుకొచ్చాడు. వీటిలో దర్శకుడు సందీప్ రెడ్డి వంగా గురించి మాట్లాడింది మాత్రం వెరీ ఇంట్రెస్టింగ్గా అనిపించింది. 'సందీప్ రెడ్డి వంగా క్రాఫ్ట్ నాకా చాలా నచ్చుతుంది. సినిమాలో ఆయన మ్యూజిక్‌ని ఉపయోగించుకునే విధానం అద్భుతంగా ఉంటుంది. 'యానిమల్' చూసేటప్పుడు నాకు థ్రిల్లింగ్‌గా అనిపించింది. ఆయన సినిమాల కంటే ఆయనిచ్చే ఇంటర్వ్యూలకే నేను అభిమానిని. సమాధానాలు చెప్పే విషయంలో చాలా ముక్కుసూటిగా ఉంటారు' అని శివకార్తికేయన్ స్టేజీపైనే చెప్పుకొచ్చాడు. దీంతో సందీప్‌పై విమర్శలు చేస్తున్న తమిళ సెలబ్రిటీలు అందరికీ చెప్పుతో కొట్టినట్లయింది. (ఇదీ చదవండి: పెళ్లికి రావాలంటే కోట్లు ఇవ్వాల్సిందే! స్టార్ హీరోయిన్ షాకింగ్ నిజాలు) #Sivakarthikeyan: Tamil actor Siva Karthikeyan expressed his love for Sandeep Reddy Vanga's work and music. Probably, the first actor outside telugu states to come front and appreciate the film, if I'm not wrong !pic.twitter.com/sycq7JxWwJ — Movies4u (@Movies4uOfficl) March 5, 2024 -
తమ్ముడు తరువాత అన్నయ్యతో అదితి
ప్రముఖ దర్శకుడు శంకర్ వారసురాలు అదితి శంకర్ విరుమాన్ చిత్రం ద్వారా కథానాయకిగా పరిచయం అయిన విషయం తెలిసిందే. నటుడు కార్తీతో జతకట్టిన ఆ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. దీంతో అదితి శంకర్‌కు అవకాశాలు వరుస కడుతున్నాయి. విరుమాన్ చిత్రం తర్వాత శివకార్తికేయన్ సరసన మావీరన్ చిత్రంలో నటించారు. ఆ చిత్రం విజయవంతం అయ్యింది. ప్రస్తుతం దివంగత నటుడు మురళి రెండో కొడుకు మురళీ ఆకాశ్‌తో జత కడుతున్నారు. విష్ణువర్ధన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం నిర్మాణ దశలో ఉంది. కాగా త్వరలో నటుడు సూర్య సరసన నటించడానికి సిద్ధం అవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. తొలుత కార్తీతో నటించిన అదితి శంకర్ తదుపరి ఆయన అన్నయ్యతో జత కట్టనున్నారన్నమాట. అయితే సూర్య సరసన నటించే విషయమై ఇంకా అధికారిక ప్రకటన రాలేదన్నది గమనార్హం. ఇలాంటి పరిస్థితుల్లో అదితి శంకర్‌ను తాజాగా మరో అవకాశం వరించింది. శ్రీవారి ఫిలిం పతాకంపై పి రంగనాథన్ నిర్మిస్తున్న చిత్రంలోని నటుడు అధర్వ మురళి కథానాయకుడుగా నటించనున్నారు. దీనికి ఎం రాజేష్ దర్శకత్వం వహించనున్నారు. ఇందులో అదితి శంకర్ కథానాయకిగా నటించనున్నట్లు చిత్రవర్గాలు అధికారికంగా ప్రకటించారు. దీని గురించి మీడియాతో నటుడు అధర్వ పేర్కొంటూ శ్రీవారి ప్రిలిమ్స్ సంస్థ అధినేత పి రంగనాథన్ చిత్ర పరిశ్రమలో ఎంతో అనుభవం గడించిన నిర్మాత, పంపిణీదారుడు అని అన్నారు. ప్రేక్షకులకు నచ్చేలా చిత్రాలను నిర్మించడంలో ఈయనకు అందేవేసిన చెయ్యి అని అన్నారు. అలాంటి నిర్మాత వద్ద పనిచేయడం సంతోషంగా ఉందన్నారు. మంచి జనరంజకమైన కథనం ఎంపిక చేసి, అందుకు అవసరమైన ఖర్చు పెట్టడంలో ఆయనకు ఆయనే సాటి అని పేర్కొన్నారు. దర్శకుడు ఎం రాజేష్ దర్శకత్వంలో పి రంగనాథన్ నిర్మిస్తున్న చిత్రంలో తాను నటించడం గర్వంగా భావిస్తున్నట్లు నటుడు అధర్వ మురళి పేర్కొన్నారు. మంచి ఎంటర్టైన్మెంట్ చిత్రాలను ఆశించే ప్రేక్షకులకు ఈ చిత్రం కచ్చితంగా నిరాశ పరచదనే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. లేకపోతే విష్ణువర్ధన్ దర్శకత్వంలో మురళీఆకాష్ సరసన నటిస్తున్న నటి అదితి శంకర్ ఇప్పుడు ఆయన అన్నయ్య అధర్వ మురళితో జతకట్టబోతున్నారన్నమాట. -
యాక్షన్ ఎంటర్టైనర్ షురూ
శివ కార్తికేయన్ హీరోగా ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో ఓ సినిమా షురూ అయింది. శ్రీ లక్ష్మీ మూవీస్ బ్యానర్‌పై తెలుగు, తమిళ భాషల్లో రూపొం దుతున్న ఈ చిత్రం షూటింగ్ప్రారంభమైంది. ఈ మూవీలో కన్నడ నటి రుక్మిణీ వసంత్ కథానాయిక. ‘‘యాక్షన్ ఎంటర్టైనర్గా పాన్ ఇండియా స్థాయిలో రూపొం దుతోన్న చిత్రమిది. మురుగదాస్‌గారు తన పాపులర్ స్టోరీ టెల్లింగ్ స్టయిల్లో ఈ చిత్రాన్ని రూపొం దించనున్నారు. వరుస బ్లాక్బస్టర్లను అందుకుంటున్న శివకార్తికేయన్ కెరీర్లో ఈ మూవీ బిగ్గెస్ట్, గ్రాండియస్ట్ చిత్రం కానుంది. గత సినిమాల్లో చూసినట్లు కాకుండా ఈ సినిమాలో పూర్తిగా ప్రత్యేకమైన, స్టైలిష్ లుక్‌లో కనిపిస్తారు శివ కార్తికేయన్. ఈ చిత్రం ప్రేక్షకులకు హై యాక్షన్–ప్యాక్డ్ అనుభూతిని అందిస్తుంది. నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలోనే తెలియజేస్తాం’’ అన్నారు మేకర్స్. ఈ చిత్రానికి సంగీతం: అనిరుధ్, కెమెరా: సుదీప్ ఎలామన్. -
స్టార్ హీరో సంక్రాంతి సినిమా.. డైరెక్ట్‌గా ఓటీటీకి వచ్చేస్తోంది!
కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తికేయన్, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటించిన సైన్స్ ఫిక్షన్ చిత్రం అయలాన్. సంక్రాంతి కానుకగా థియేటర్లలో రిలీజైన ఈ సినిమా తమిళంలో హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రాన్ని తెలుగులోనూ రిలీజ్ చేయాలని భావించారు. మొదట ఈ మూవీని జనవరి 26న టాలీవుడ్ ప్రేక్షకులను అందుబాటులోకి తీసుకు రావాలని ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా నిర్వహించారు. కానీ కానీ ఊహించని విధంగా తెలుగు బాక్సాఫీస్ బరి నుంచి తప్పుకుంది. (ఇది చదవండి: పవర్ఫుల్ పాత్రలో ఆదా శర్మ.. మరో కాంట్రవర్సీ అవుతుందా?) అయితే ఈ చిత్రం ఓటీటీలోనే డైరెక్ట్‌గా రిలీజ్ చేయనున్నారని కొద్ది రోజులుగా టాక్ వినిపిస్తోంది. అనుకున్నట్లుగానే తెలుగు ప్రేక్షకులకు అందుబాటులోకి వస్తోంది. ఈనెల 9 నుంచి సన్ నెక్ట్స్ వేదికగా స్ట్రీమింగ్ కానున్నట్లు ఆ సంస్థ ట్వీట్ చేసింది. తమిళం, తెలుగు భాషల్లో స్ట్రీమింగ్ కానున్నట్లు వెల్లడించింది. దీంతో తమ అభిమాన హీరో మూవీని డైరెక్ట్‌గా ఓటీటీలో చూసేందుకు ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కాగా.. ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతమందించారు. Thamizh and Tattoo are all set to meet you on February 9th 👽🔥#Ayalaan streaming worldwide exclusively on #SunNXT@Siva_Kartikeyan @rakulpreet @ravikumar_dir @arrahman#SivaKarthikeyan #ARRahman #AyalaanOnSunNXTFromFeb9 #AyalaanOnSunNXT #SunNXTExclusiveAyalaan pic.twitter.com/m3QgKBosa8 — SUN NXT (@sunnxt) February 6, 2024 -
స్టార్ హీరో కొత్త సినిమా.. తెలుగులో డైరెక్ట్‌గా ఓటీటీలోకి రానుందా?
సంక్రాంతి సినిమాల సందడి ఆల్మోస్ట్ అయిపోయింది. 'హనుమాన్' తప్పితే మిగతావన్నీ సైడ్ అయిపోయాయి. ఈ క్రమంలోనే రిపబ్లిక్ డే కానుకగా ఇతర భాషా, డబ్బింగ్ చిత్రాలు థియేటర్లలోకి వచ్చాయి. ఓ స్టార్ హీరో మూవీకి మాత్రం అడ్డంకులు ఎదురయ్యాయి. ఇప్పుడా చిత్రం నేరుగా ఓటీటీలోకి వచ్చేయబోతుందా అనే రూమర్స్ వినిపిస్తున్నాయి. ఇంతకీ ఏంటా సినిమా? ఏం జరుగుతోంది? తమిళనాడులోని థియేటర్లలో సంక్రాంతికి 'కెప్టెన్ మిల్లర్', 'అయలాన్' చిత్రాలు విడుదలయ్యాయి. పాజిటివ్ టాక్‌తో మంచి కలెక్షన్స్ దక్కించుకున్నాయి. తెలుగులోనూ పండగకే రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ థియేటర్ల దొరక్క జనవరి 26న విడుదల చేయాలని ప్లాన్ చేసుకున్నారు. ఇందులో భాగంగా నిన్న అంటే శుక్రవారం.. ధనుష్ 'కెప్టెన్ మిల్లర్' థియేటర్లలోకి వచ్చింది. ఏవో ఆర్థిక సమస్యల కారణంగా 'అయలాన్' వాయిదా పడింది. (ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు క్రైమ్ థ్రిల్లర్ సినిమా.. మీరు చూశారా?) అయితే 'అయలాన్' సినిమా తెలుగు వెర్షన్ విడుదలపై సందిగ్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇంతలోనే ఓటీటీ ప్రకటన వచ్చేసింది. ఈ మూవీ త్వరలో తమ ఓటీటీలో రిలీజ్ కానుందని సన్ నెక్స్ట్ ప్రకటించేసింది. అయితే ఫిబ్రవరి 16 నుంచి స్ట్రీమింగ్ అని అంటున్నారు. కానీ అంతకు ముందే వచ్చినా సరే ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. ఒకవేళ తెలుగులో వచ్చేవారం.. అంటే ఫిబ్రవరి 2న థియేటర్లలో ఈ సినిమా రిలీజైనా సరే వారం పదిరోజుల్లోనే ఓటీటీల్లోకి వచ్చేయొచ్చు. కాబట్టి తెలుగు వెర్షన్ విడుదల ఉంటుందా? లేదంటే శివకార్తికేయన్ 'అయలాన్' చిత్రం నేరుగా ఓటీటీలోకి వచ్చేస్తుందా అనేది ప్రస్తుతానికైతే సస్పెన్స్? చూడాలి మరి ఏం జరుగుతుందో? (ఇదీ చదవండి: చిరంజీవికి 'పద్మ విభూషణ్'.. ఈ అవార్డుతో పాటు ఏమేం ఇస్తారు?) #Ayalaan is all set to land worldwide exclusively on #SunNXT 👽 Wait for the updates 😉@Siva_Kartikeyan @Rakulpreet @Ravikumar_Dir @arrahman#SivaKarthikeyan #ARRahman #SunNXTExclusiveAyalaan pic.twitter.com/tRPGrNUW2K — SUN NXT (@sunnxt) January 27, 2024 -
రిలీజ్ రోజే స్టార్ హీరో సినిమా షోలన్నీ క్యాన్సిల్.. కారణం ఏంటంటే?
స్టార్ హీరో సినిమాకు చేదు అనుభవం ఎదురైంది. తెలుగులో రిలీజ్ వరకు అంతా సిద్ధం చేశారు. ప్రమోషన్స్ కూడా నిర్వహించడంతో కాస్తంత హైప్ వచ్చింది. కానీ చివరకొచ్చేసరికి మొత్తం సీన్ మారిపోయింది. తెలుగు రాష్ట్రాల్లో షోలన్నీ క్యాన్సిల్ చేసి పడేశారు. దీంతో ఎంతో ఆశతో థియేటర్లకు వెళ్లిన జనాలు షాకయ్యారు. పూర్తిగా డిసప్పాయింట్ అయ్యారు. ఇంతకీ అసలేం జరిగింది? ఎందుకు క్యాన్సిల్ చేశారు? (ఇదీ చదవండి: 'యానిమల్' ఓటీటీ రిలీజ్.. ఆ విషయంలో అభిమానులు అసంతృప్తి) ఈ సంక్రాంతి బరిలో తెలుగులో నాలుగు సినిమాలు రిలీజయ్యాయి. 'హనుమాన్'.. పండగ విజేతగా నిలిచింది. ఇకపోతే మహేశ్, నాగార్జున, వెంకటేశ్ సినిమాలు అనుకున్నంత రీతిలో జనాలకు నచ్చలేదు. మరోవైపు సంక్రాంతి బరిలోనే 'కెప్టెన్ మిల్లర్', 'అయలాన్' లాంటి డబ్బింగ్ చిత్రాలని కూడా తీసుకురావాలని ప్లాన్ చేశారు. కానీ థియేటర్ల సమస్య కారణంగా ఈ రెండు చిత్రాల్ని జనవరి 26కి వాయిదా వేసుకున్నారు. వీటిలో ధనుష్ నటించిన 'కెప్టెన్ మిల్లర్' తాజాగా థియేటర్లలోకి వచ్చేసింది. మరోవైపు శివకార్తికేయన్ 'అయలాన్' కూడా థియేటర్లలో రిలీజ్ ప్లాన్ చేసి, టికెట్లు అన్నీ కూడా సేల్ చేశారు. తీరా థియేటర్ల దగ్గరికి వెళ్తే.. షోలని క్యాన్సిల్ చేసినట్లు చావు కబురు చల్లగా చెప్పారు. అయితే ఏదో ఫైనాన్సిల్ ప్రాబ్లమ్ వల్లే ఇది జరిగినట్లు తెలుస్తోంది. ఈ రోజులో ఈ సమస్యని పరిష్కరిస్తారా? లేదా? అనేది తెలియాల్సి ఉంది. (ఇదీ చదవండి: 'నెరు' సినిమా తెలుగు రివ్యూ (ఓటీటీ)) -
SivaKarthikeyan: అయలాన్ని హాయిగా చూడొచ్చు
‘‘యూనివర్సల్ కాన్సెప్ట్‌తో రూపొందిన చిత్రం ‘అయలాన్’. సినిమాలా ఉండదు.. థీమ్ పార్క్‌లోకి వెళ్లినట్టు, జాలీ రైడ్‌లా ఉంటుంది. రెండున్నర గంటలు హాయిగా ఎంజాయ్ చేయొచ్చు. మా సినిమా తమిళనాడులో భారీ విజయం సాధించింది. తెలుగులోనూ సూపర్ హిట్టవుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు హీరో శివ కార్తికేయన్. ఆర్. రవికుమార్ దర్శకత్వంలో శివ కార్తికేయన్, రకుల్ ప్రీత్‌సింగ్ జంటగా నటించిన చిత్రం ‘అయలాన్’. కోటపాడి జె. రాజేష్ నిర్మించిన ఈ మూవీ ఈ నెల 12న తమిళంలో విడుదలైంది. తెలుగులో మహేశ్వర్ రెడ్డి ఈ నెల 26న రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో శివకార్తికేయన్ మాట్లాడుతూ– ‘‘అయలాన్’ షూటింగ్ కోవిడ్‌కి ముందే పూర్తి చేశాం. కరోనా వల్ల విజువల్ ఎఫెక్ట్స్ చేయడం కుదరలేదు. ‘రోబో, 2.ఓ’ సినిమాల్లో కన్నా ఎక్కువ విజువల్ ఎఫెక్ట్స్ ఉన్న చిత్రమిది. ‘అయలాన్’లో నేనో హీరో అయితే ఏలియన్ మరో హీరో. అయలాన్’ సీక్వెల్‌ని ఇంకా భారీగా చేస్తాం’’ అన్నారు. -
‘అలయాన్’కోసం ఐదేళ్లు వెయిట్ చేశా.. హీరో శివ కార్తికేయన్
సంక్రాంతికి తెలుగులో చాలా సినిమాలు ఉండటంతో మా సినిమా(అలయాన్)ను విడుదల చేయలేదు. రెండు వారాలు ఆలస్యంగా వచ్చినా విజయం సాధిస్తుందని నమ్మాను. 'లవ్ టుడే', 'విడుదలై', విశాల్ 'అభిమన్యుడు' సినిమాలు తమిళంలో విడుదలైన తర్వాత తెలుగులో విడుదలై హిట్ అయ్యాయి. కంటెంట్ బాగుంటే ఆడుతుంది. సినిమా కోసం ఐదేళ్లు వెయిట్ చేశా. రెండు వారాలు పెద్ద సమస్య కాదు’అని హీరో శివకార్తికేయన్ అన్నారు. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం ‘అయలాన్’. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్. ఆర్. రవికుమార్ దర్శకత్వం వహించారు. ఆస్కార్ పురస్కార గ్రహీత, లెజెండరీ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందించారు. ఈ నెల 12న సంక్రాంతి కానుకగా తమిళనాడులో విడుదలైన ఈ చిత్రం.. తెలుగులో రెండు వారాలు ఆలస్యంగా జనవరి 26న రిలీజ్ కాబోతుంది. ఈ నేపథ్యంలో శివకార్తికేయన్ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు.. ► 'అయలాన్' సినిమాలో ఇద్దరు హీరోలు ఉన్నారు. నేను ఓ హీరో అయితే... మరొక హీరో ఏలియన్. ఈ సినిమాలో 4500 వీఎఫెక్స్ షాట్స్ ఉన్నాయి. రోబో, 2.ఓ సినిమాల్లో కంటే ఎక్కువ విజువల్ ఎఫెక్ట్స్ ఉన్న చిత్రం ఇది. మా బడ్జెట్ తక్కువ. పరిమిత నిర్మాణ వ్యయంలో గనుక సినిమా తీయగలిగితే మరింత పెద్ద కలలు కనవచ్చు అని అనిపించింది. అందుకే ఎక్కువ రోజులు పట్టిన తప్పకుండా ఈ సినిమా చేయాలని నిర్ణయించుకున్నాను. ► యూనివర్సల్ కాన్సెప్ట్ ఉన్న చిత్రమిది. హ్యూమన్ ఏలియన్ మధ్య ఇంటరాక్షన్ అన్ని ప్రాంతాల ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుంది. మా సినిమా తమిళనాడులో భారీ విజయం సాధించింది. తెలుగులో కూడా సూపర్ హిట్ అవుతుందని నమ్మకం ఉంది. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ మా ప్రయత్నాన్ని అభినందిస్తారని చెప్పగలను. ► 'అయలాన్'లో 90 శాతం సన్నివేశాల్లో గ్రాఫిక్స్ ఉన్నాయి. 70 శాతం సినిమాలో ఏలియన్ ఉంది. మెజారిటీ సినిమా అంతా విజువల్స్ ఎఫెక్ట్స్ ఉంటాయి. 200, 300 కోట్ల బడ్జెట్ ఉంటే తప్ప ఇటువంటి సినిమా చేయలేం. సరైన టీమ్, ఐడియా ఉంటే తక్కువ బడ్జెట్ లో కూడా చేయవచ్చు. ఇది హిట్ అయితే ఎక్కువ బడ్జెట్ ఇవ్వడానికి నిర్మాతలు ముందుకు వస్తారు. అప్పుడు మేం ఇంకా పెద్ద కల కనొచ్చు. మమ్మల్ని మోటివేట్ చేసిన అంశం అదే. ► నేను రెహమాన్ గారికి పెద్ద ఫ్యాన్. ఆయన నా సినిమాకు సంగీతం అందించాలనేది బిగ్గెస్ట్ డ్రీం. ఈ సినిమాతో రవికుమార్ ఐడియా కారణంగా అది కుదిరింది. ఆయన మాకు ఎంతో మోటివేషన్ ఇచ్చారు. లాస్ట్ సెకండ్ వరకు వర్క్ చేశారు. నేను ఇక్కడ ఇంకా బాగా చేయాల్సిందని రెహమాన్ చెప్పారు. తెలుగులో విడుదలకు రెండు వారాలు టైమ్ ఉండటంతో మ్యూజిక్ పరంగా కొన్ని ఇంప్రవైజేషన్స్ చేశారు. ► 'అయలాన్' సీక్వెల్ ఐడియా ఉంది. ఏలియన్ క్రియేట్ చేయడానికి మేం చాలా రీసెర్చ్ చేశాం. ఎక్కువ టైమ్ స్పెండ్ చేశాం. సీక్వెల్ ఐడియా మాకు ముందు నుంచి ఉంది. సీక్వెల్ ఇంకా బిగ్గర్ స్కేల్ లో చేస్తాం. తమిళనాడులో సక్సెస్ మమ్మల్ని మోటివేట్ చేసింది. -
ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘అయలాన్’?
తమిళ హీరో శివకార్తికేయన్‌కు తెలుగులోనూ మంచి మార్కెట్ ఉంది. ఆయన తమిళ్లో నటించిన రెమో, డాక్టర్ వరుణ్, డాన్, ప్రిన్స్ చిత్రాలు తెలుగులో విడుదలైన మంచి విజయాలను అందుకున్నాయి. ఇక ఇటీవలే ‘అయలాన్’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన ఈ చిత్రం మంచి విజయం సాధించింది. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన ఈ చిత్రం..టాలీవుడ్లో తప్ప మిగతా అన్ని ప్రాంతాల్లో రిలీజైంది. సంక్రాంతికి గట్టిపోటీ ఉండటంతో అయలాన్ తెలుగు రిలీజ్ వాయిదా పడింది. రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26న తెలుగులో విడుదల కాబోతుంది. (చదవండి: అయోధ్యకు జూ ఎన్టీఆర్, ప్రభాస్ వెళ్లకపోవడానికి కారణం ఇదేనా?) ఇదిలా ఉంటే.. ఈ చిత్రం అప్పుడే ఓటీటీలోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ డిజిటల్ రైట్స్‌ను సొంతం చేసుకున్న ప్రముఖ ఓటీటీ సంస్థ సన్ నెక్స్ట్ త్వరలోనే స్ట్రీమింగ్ చేయనుందట. ఫిబ్రవరి 16 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతున్నట్లు నెట్టింట ఓ వార్త వైరల్ అవుతోంది. తమిళంతో పాటు తెలుగులో కూడా అదే రోజు రిలీజ్ కానున్నట్లు చెబుతున్నారు. ఫిబ్రవరి ఫస్ట్ వీక్‌లో అయలాన్ ఓటీటీ రిలీజ్ డేట్‌పై అఫీషియల్ అనౌన్స్మెంట్ రానున్నట్లు తెలిసింది. ఫాంటసీ సైన్స్ ఫిక్షన్ కథతో తెరకెక్కిన ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్గా నటించింది. ఆర్.రవికుమార్ దర్శకత్వం వహించారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించాడు. -
సంక్రాంతికి హిట్ కొట్టిన 'అయలాన్'.. తెలుగు వెర్షన్ రిలీజ్ డేట్ ఫిక్స్
తమిళ హీరో శివ కార్తికేయన్.. పలు డబ్బింగ్ సినిమాలతో తెలుగులోనూ క్రేజ్ సంపాదించాడు. ఇతడు హీరోగా నటించిన 'అయలాన్'.. సంక్రాంతి కానుకగా తమిళంలో రిలీజైంది. థియేటర్ల దొరక్క తెలుగు వెర్షన్ వాయిదా పడింది. ఇప్పుడు ఈ చిత్రానికి తెలుగు రిలీజ్ డేట్ తాజాగా ఫిక్స్ చేశారు. (ఇదీ చదవండి: కన్నడలో సూపర్ హిట్.. ఓటీటీలో తెలుగు వెర్షన్.. రిలీజ్ అప్పుడేనా?) అయలాన్ అంటే ఏలియన్. ఏలియన్ ఓ ప్రధాన పాత్రలో దక్షిణాది భాషల్లో సినిమా రావడం ఇదే తొలిసారి. రిపబ్లిక్ డే సందర్భంగా ఈ నెల 26న తెలుగులో విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. తమిళనాడులో హిట్ టాక్ తెచ్చుకున్న 'అయలాన్'.. నాలుగు రోజుల్లోనే రూ.50 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. లాంగ్ రన్లో రూ.100 కోట్లకు చేరువ కావొచ్చు. ఫాంటసీ సైన్స్ ఫిక్షన్ కథతో తీసిన 'అయలాన్'లో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్. ఆర్.రవికుమార్ దర్శకత్వం వహించారు. దిగ్గజ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందించారు. పేరుకే సైన్స్ ఫిక్షన్ మూవీ అయినప్పటికీ ఫ్యామిలీస్‌కి నచ్చే కామెడీ, ఎమోషన్స్ సినిమాలో చాలా ఉన్నాయని అంటున్నారు. మరి తెలుగులో ఎలాంటి మేజిక్ చేస్తుందో చూడాలి? (ఇదీ చదవండి: 'హనుమాన్' మూవీతో హిట్ కొట్టాడు.. ఇంతలోనే దర్శకుడికి షాక్!) -
Happy Pongal 2024: సంక్రాంతి వేడుకల్లో సందడి చేసిన సినీ తారలు (ఫోటోలు)
-
థియేటర్లలో ఏలియన్ మూవీ సందడి.. తొలిరోజు కలెక్షన్స్ ఎంతో తెలుసా?
తమిళ యంగ్ హీరో శివకార్తికేయన్ లేటెస్ట్ మూవీ 'అయలాన్'. జనవరి 12న థియేటర్లలోకి వచ్చింది. అయితే తెలుగు, తమిళంలో ఒకేసారి రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ థియేటర్ల సమస్య వల్ల తెలుగు వెర్షన్ విడుదల వాయిదా వేసుకున్నారు. అయితే విడుదలకు ముందు హీరో శివకార్తికేయన్ పలు ఆసక్తికర విషయాలు మాట్లాడాడు. అలానే తొలిరోజు బాక్సాఫీస్ దగ్గర ఈ మూవీ కలెక్షన్స్ బాగానే సాధించినట్లు తెలుస్తోంది. శివకార్తికేయన్, రకుల్ జంటగా నటించిన ఈ సినిమాకు రవికుమార్ దర్శకుడు. ఏఆర్ రెహమాన్ సంగీంతమందించాడు. ఈ క్రమంలోనే శివకార్తికేయన్ మాట్లాడుతూ..'అయలాన్ నా డ్రీమ్ ప్రాజెక్ట్ లాంటిది. ఇలాంటి సినిమాల్ని తీయాలంటే శంకర్, ఆ తర్వాత రవికుమారే అని చెప్పొచ్చు. అలాంటి దర్శకుడిని ప్రోత్సహించాలన్నారు. (ఇదీ చదవండి: ఇక్కడ ఎవరికి ఎవరూ శత్రువులు కాదు.. దిల్‌రాజు ఇంట్రెస్టింగ్ కామెంట్స్) 'అలానే 'అయలాన్' సినిమాకు కచ్చితంగా సీక్వెల్ కూడా ఉంటుందని శివకార్తికేయన్ చెప్పుకొచ్చాడు. ఇకపోతే తమిళంలో 'అయలాన్' సినిమాకు పాజిటివ్ రివ్యూలు వచ్చాయి. పిల్లలతో కలిసి ఫ్యామిలీ అంతా చూసేలా ఉందనే టాక్ వినిపిస్తుంది. ఈ క్రమంలోనే తొలిరోజు రూ.11 కోట్లకు పైగా గ్రాస్ వచ్చినట్లు సమాచారం. మరి తెలుగు వెర్షన్ రిలీజ్ ఎప్పుడనేది తెలియాల్సి ఉంది. ఆల్రెడీ తమిళంలో రిలీజైన ధనుష్ 'కెప్టెన్ మిల్లర్' సినిమాని.. తెలుగులో జనవరి 25న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. 'అయలాన్' కూడా అప్పుడే వస్తుందా లేదా అనేది క్లారిటీ రావాలి. (ఇదీ చదవండి: క్లీంకార తొలి సంక్రాంతి సెలబ్రేషన్స్.. మెగా ఫ్యామిలీ అంతా అక్కడికి షిఫ్ట్) -
సంక్రాంతికి తెలుగు బరి నుంచి తప్పుకొన్న ఆ క్రేజీ సినిమా
ఈసారి సంక్రాంతికి బోలెడన్ని సినిమాలు రాబోతున్నాయి. తెలుగులోనే ఏకంగా ఐదు సినిమాలు రెడీ చేశారు. కానీ నిర్మాతలు, గిల్డ్ మధ్య పలు చర్చలు జరిగిన తర్వాత రవితేజ మూవీ వాయిదా పడింది. సరేలే నాలుగు చిత్రాలు ఉన్నాయి. వీటికి థియేటర్లు ఎలా సర్దుబాటు చేయాలా అని అందరూ తలలు బాదుకుంటుంటే.. డబ్బింగ్ సినిమా ఒకటి కూడా రిలీజ్ చేస్తామని అన్నారు. ఇప్పుడు దాన్ని కూడా వాయిదా వేయక తప్పలేదు. ఈసారి సంక్రాంతి పండక్కి మహేశ్ 'గుంటూరు కారం'తో పాటు 'హను-మాన్', వెంకీ 'సైంధవ్', నాగ్ 'నా సామి రంగ' చిత్రాలు.. థియేటర్లలో విడుదల కానున్నాయి. అయితే వీటితో పాటు తమిళం నుంచి ధనుష్ 'కెప్టెన్ మిల్లర్', శివకార్తికేయన్ 'అయలాన్' కూడా తొలుత రిలీజ్ చేస్తామని ప్రకటించేశారు. కానీ పరిస్థితి అర్థమయ్యేసరికి ధనుష్ మూవీ తప్పుకొంది. ఇక శివకార్తికేయన్ చిత్రాన్ని మాత్రం కచ్చితంగా జనవరి 12నే తీసుకొచ్చేస్తున్నారని అన్నారు. (ఇదీ చదవండి: సంక్రాంతి సినిమాల గొడవ.. వాళ్లకు వార్నింగ్ ఇచ్చిన దిల్ రాజు!) ఈ డబ్బింగ్ సినిమా నైజాం, ఉత్తరాంధ్ర హక్కుల్ని దిల్‌రాజు కొనడంతో.. తెలుగు డబ్బింగ్ రిలీజ్ ఉందని అందరూ అనుకున్నారు. కానీ ఇప్పుడు దీన్ని వాయిదా వేసినట్లు స్వయంగా దిల్‌రాజు చెప్పుకొచ్చారు. సరిపడా థియేటర్లలు లేకపోవడమే దీనికి కారణమని తెలుస్తోంది. అయితే సంక్రాంతి బరి నుంచి తప్పుకొన్న ధనుష్, శివకార్తికేయన్.. జనవరి 19 లేదా 26న తమ చిత్రాల్ని తెలుగులో రిలీజ్ చేసే అవకాశముంది. 'అయలాన్' సినిమా విషయానికొస్తే.. ఓ ఏలియన్ పొరపాటున భూమ్మీదకు వస్తుంది. అనుకోని పరిస్థితుల్లో హీరోతో ఆ గ్రహాంతరవాసి స్నేహం చేస్తుంది. ఆ తర్వాత ఏమైంది? అనేదే మెయిన్ స్టోరీ. ట్రైలర్ చూస్తుంటే బాగానే ఉన్నట్లు అనిపిస్తుంది. అయితే తమిళంలో సంక్రాంతికి రిలీజ్ అవుతున్నాయి కాబట్టి టాక్ పాజిటివ్‌గా వస్తే పర్లేదు. అదే తేడా కొట్టేస్తే మాత్రం తెలుగు వెర్షన్ కూడా దెబ్బేసే ఛాన్స్ ఉంటుంది. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 29 సినిమాలు) -
సంక్రాంతి బరిలో ఏలియన్ సినిమా.. ట్రైలర్ చూశారా?
ఈసారి సంక్రాంతికి తెలుగులో ఏకంగా నాలుగు సినిమాలు థియేటర్లలో విడుదల కానున్నాయి. మహేశ్, నాగార్జున, వెంకటేశ్ లాంటి స్టార్ హీరోలతో పాటు తేజ సజ్జా కూడా సై అంటున్నారు. వీళ్లకే స్క్రీన్స్ సరిపోవట్లేదంటే ఏలియన్ స్టోరీతో తీసిన మూవీతో మరో హీరో పోటీకి రెడీ అంటున్నారు. తాజాగా ట్రైలర్ రిలీజ్ చేయగా.. అది ఇంట్రెస్టింగ్గా అనిపిస్తోంది. తెలుగులో సంక్రాంతికి నాలుగు స్ట్రెయిట్ మూవీస్ థియేటర్లలో రిలీజ్ కానున్నాయి. వీటితో పలు డబ్బింగ్ చిత్రాలు కూడా డేట్స్ ప్రకటించాయి. అలా జనవరి 12న 'అయలాన్' అనే సినిమా తమిళంలో రిలీజ్ కానుంది. తెలుగులో వస్తుందా లేదా అనేది క్లారిటీ లేదు. కానీ తాజాగా ట్రైలర్ మాత్రం రిలీజ్ చేశారు. ఇందులో శివకార్తికేయన్ హీరో కావడంతో కామెడీకి కొదవ ఉండదు, అలానే ఏలియన్తోనూ కామెడీ చేయడం వెరైటీగా ఉంది. (ఇదీ చదవండి: రెండు నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చిన ఆ తెలుగు సినిమా) ఇక కథ విషయానికొస్తే.. ఓ మారుమూల పల్లెటూరు. హ్యాపీగా ఉన్న యువకుడు (శివకార్తికేయన్) జీవితంలోకి ఓ ఏలియన్ అలియాస్ గ్రహాంతరవాసి అడుగుపెడుతుంది. అచ్చం మనిషిలా మాట్లాడుతూ ఉంటుంది. తొలుత భయపడినప్పటికీ.. ఆ తర్వాత సదరు యువకుడు, ఏలియన్‌తో స్నేహం చేస్తాడు. అయితే ఏలియన్ వచ్చింది.. ప్రపంచవినాశనానికి రెడీ అవుతున్న ఓ దుర్మార్గుడి అంతం కోసమని తెలిసి.. హీరో కూడా ఆ బాధ్యత తీసుకుంటాడు. ఆ తర్వాత ఏమైందనేదే 'అయలాన్' స్టోరీ. అయితే ట్రైలర్ చూస్తుంటే.. అప్పుడెప్పుడో వచ్చిన హృతిక్ రోషన్ 'కోయి మిల్ గయా' ఛాయలు కనిపిస్తున్నాయి. అది పక్కనబెడితే కామెడీ, గ్రాఫిక్స్ బాగున్నాయి. మరి అనుకున్నట్లే జనవరి 12నే ఒకేసారి రెండు భాషల్లో రిలీజ్ చేస్తారా? లేదంటే తెలుగు రిలీజ్ ఓ వారం వాయిదా వేసుకుంటారా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. (ఇదీ చదవండి: మరో వివాదంలో మహేశ్ 'గుంటూరు కారం' సినిమా?) -
Ayalaan: ఏలియన్ మూవీ.. ఏకంగా దుబాయిలో ట్రైలర్ లాంచ్ ఈవెంట్
తమిళ స్టార్ హీరో శివకార్తికేయన్ చేస్తున్న కొత్త సినిమా 'అయలాన్'. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్. కేసీఆర్ స్టూడియోస్, 24 ఏఎం స్టూడియోస్ సంస్థలు కలిసి నిర్మిస్తున్నాయి. సోషియో సైంటిఫిక్ కథతో తీసిన ఈ చిత్రానికి రవికుమార్ దర్శకుడు. ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రం 2018లోనే ప్రారంభమైంది. అనివార్య కారణాల వల్ల నిర్మాణంలో ఉంది. మొన్న దీపావళికే సినిమాని రిలీజ్ చేద్దామని ప్లాన్ చేశారు కానీ కుదర్లేదు. (ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన 'మంగళవారం' సినిమా.. స్ట్రీమింగ్ అందులోనే) అయితే గ్రాఫిక్స్ పూర్తి కాకపోవడంతో విడుదల తేదీని సంక్రాంతి/పొంగల్‌కి వాయిదా వేశారు. ఇప్పుడీ మూవీ జనవరిలోనైనా వస్తుందా అనే చర్చ జరుగుతోంది. ఈ ప్రచారంపై చిత్ర నిర్మాతలు ఇంకా స్పందించలేదు. కానీ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు. జనవరి 7న దుబాయిలో భారీ ఎత్తున చేయబోతున్నట్లు సమాచారం. (ఇదీ చదవండి: మెగా క్రిస్మస్ సెలబ్రేషన్స్.. ఒక్కటిగా కనిపించిన ఆ ఇద్దరు!) -
శివ కార్తికేయన్, సాయి పల్లవి సినిమా టైటిల్ రివీల్ ఎప్పుడంటే
కోలీవుడ్‌లో మడోనా అశ్విన్ దర్శకత్వంలో నటించిన మా వీరన్ చిత్రం విజయంతో మంచి ఖుషిలో ఉన్న నటుడు శివకార్తికేయన్ ప్రస్తుతం తన 21వ చిత్రంలో నటిస్తున్నారు. ఆయనకు జంటగా నటి సాయి పల్లవి నటిస్తున్న ఈ చిత్రానికి రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వం వహిస్తున్నారు. కాగా లోక నాయకుడు కమలహాసన్ ఈ చిత్రాన్ని తన రాజ్‌కమల్ ఫిలిం ఇంటర్నేషనల్ పతాకంపై నిర్మిస్తుండటం విశేషం. కాగా ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. ఇటీవల కాశ్మీర్లో భారీ షెడ్యూల్‌ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం చైన్నెలో చిత్రీకరణను జరుపుకుంటోంది. కాగా ఈ చిత్రానికి ఇంకా టైటిల్ వెల్లడించలేదు. తాజాగా దీనికి సంబంధించిన వివరాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. నటుడు శివకార్తికేయన్ ఈ చిత్రానికి ముందు నటించిన చిత్రం అయలాన్, నటి రకుల్ ప్రీత్ సింగ్ నాయకిగా నటించిన ఈ చిత్రం చాలా కాలంగా నిర్మాణంలో ఉంది. గత దీపావళికి విడుదల అవుతుందని ప్రకటించినా వీఎఫ్ ఎక్స్ కార్యక్రమాలు పూర్తి కాకపోవడంతో చిత్రాన్ని సంక్రాంతికి వాయిదా వేశారు. కాగా ఈ చిత్రం విడుదల రోజున శివకార్తికేయన్ 21 చిత్రం టైటిల్, పోస్టర్‌ను విడుదల చేయడానికి యూనిట్ వర్గాలు సిద్ధం అవుతున్నట్టు తాజా సమాచారం. నటుడు శివకార్తికేయన్ అభిమానులకు ఇది గుడ్‌న్యూసే అవుతుంది. కాగా ఈ రెండు చిత్రాల తరువాత ఏ ఆర్ మురుగదాస్ దర్శకత్వంలో నటించనున్న చిత్రం సెట్ పైకి వెళ్లనుంది. -
గుడ్ నైట్ సినిమా డైరెక్టర్‌కు గోల్డెన్ ఛాన్స్ ఇచ్చిన టాప్ హీరో
నటుడు శివకార్తికేయన్ గుడ్ నైట్ చిత్ర దర్శకుడితో చేతులు కలపనున్నారని సమాచారం. శివ కార్తికేయన్ ప్రతిభ కలిగిన యువ దర్శకులను ప్రోత్సహించడంలో ముందుంటున్నారు. అలా రామ్ కుమార్ దర్శకత్వంలో కథానాయకుడిగా నటించిన అయలాన్ చిత్రం సంక్రాంతి సందర్భంగా విడుదలకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం కమలహాసన్ తన రాజకమల్ ఫిలిం ఇంటర్నేషనల్ పతాకంపై నిర్మిస్తున్న చిత్రంలో నటిస్తున్నాను. రాజ్ కుమార్ పెరియసామి దర్శకత్వం వహిస్తున్న ఇందులో నటి సాయి పల్లవి కథానాయికగా నటిస్తున్నారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతాన్ని అందిస్తునానరు. ఇది శివకార్తికేయన్‌కు 21 చిత్రం. ఈ చిత్ర షూటింగ్ చివరి దశకు చేరుకుంది. దీంతో శివకార్తికేయన్ తదుపరి ఏఆర్.మురుగదాస్ దర్శకత్వంలో నటించడానికి సిద్ధమవుతున్నారు. ఇందులో బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాగూర్ నాయకిగా నటించబోతున్నారు. ఈ చిత్రం త్వరలో సెట్‌పైకి వెళ్లనుంది. తాజా సమాచారం ఏమిటంటే ఇటీవల గుడ్ నైట్ అనే చిన్న చిత్రంతో పెద్ద హిట్ కొట్టిన దర్శకుడు వినాయక్ చంద్రశేఖరన్. ఈయన తదుపరి దర్శకత్వం వహించనున్న చిత్రంలో శివ కార్తికేయన్ కథానాయకుడిగా నటించనున్నట్లు తెలిసింది. వినాయక్ చంద్రశేఖరన్ చెప్పిన కథ నచ్చడంతో అందులో నటించడానికి శివకార్తికేయన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. కాగా దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉంది. -
సంక్రాంతి బరిలో శివ కార్తికేయన్ సైంటిఫిక్ థ్రిల్లర్ సినిమా
కోలీవుడ్‌లో ఇండ్రు నేట్రు నైలై చిత్రంతో దర్శకుడిగా పరిచయమై అనూహ్య విజయాన్ని అందుకున్న దర్శకుడు రవికుమార్. ఈయన తాజాగా శివ కార్తికేయన్ కథానాయకుడిగా తెరకెక్కిస్తున్న చిత్రం అయలాన్. తెలుగులో కూడా ఇదే పేరుతో విడుదల కానుంది. తొలి చిత్రం తరహాలోనే సైంటిఫిక్ థ్రిల్లర్ కథాంశంతో రూపొందుతున్న చిత్రం ఇది. నటి రకుల్ ప్రీత్ సింగ్ నాయకిగా నటిస్తున్న ఈ చిత్రం 2018లోని ప్రారంభమైంది. 24 ఏఎం. స్టూడియోస్, కేజేఆర్ స్టూడియోస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందిస్తున్నారు. బాలీవుడ్ నటుడు శరత్ కేల్కర్ ప్రతి నాయకుడిగా నటిస్తున్న ఇందులో నటి భానుప్రియ, యోగి బాబు, కరుణాకర్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. నిజానికి ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని ఇప్పటికే విడుదల కావాల్సింది. అయితే గ్రాఫిక్స్ కార్యక్రమాలు పూర్తి కాకపోవడంతో ఆలస్యం జరుగుతోంది. ఎట్టకేలకు చిత్ర విడుదలకు తేదీ ఖరారైంది. 2024 పొంగల్ సందర్భంగా అయలాన్ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. జనవరి 15న ఈ సినిమా విడుదల కానుంది. కాగా ఈ చిత్ర దర్శకుడు రవికుమార్ తన తదుపరి చిత్రం కూడా శివకార్తికేయన్‌నే కథానాయకుడిగా నటించనున్నారని పేర్కొన్నారు. ఆయన ఇటీవల ఒక భేటీలో పేర్కొంటూ అయలాన్ చిత్రం విడుదల తర్వాత తన కొత్త చిత్రం పనులు ప్రారంభిస్తానన్నారు. ఇది కూడా సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో సాగే కథ చిత్రంగా ఉంటుందని ఆయన తెలిపారు. -
స్టార్ హీరో సినిమాలో ఏలియన్.. టీజర్ అదిరిపోయింది!
సినిమాల్లో ఎన్ని జానర్స్ ఉన్నా సైన్స్ ఫిక్షన్ అనేది మైండ్ బ్లోయింగ్ కాన్సెప్ట్. ఎందుకంటే ఈ తరహా చిత్రాల్ని కరెక్ట్‌గా తీస్తే ప్రేక్షకుల్ని నుంచి వేరే లెవల్ రెస్పాన్స్ వస్తుంది. ఈ జానర్ లో డిఫరెంట్ మూవీస్ తీసినప్పటికీ ఏలియన్ కాన్సెప్ట్ మాత్రం చాలా తక్కువ. ఇప్పుడు స్టార్ హీరో ఏలియన్ స్టోరీతో హిట్ కొట్టేందుకు రెడీ అయిపోయాడు. ఇంతకీ ఏ మూవీ? దీని సంగతేంటి? (ఇదీ చదవండి: 'మ్యాడ్' సినిమాలో కామెడీతో ఇచ్చిపడేశాడు.. ఈ కుర్రాడెవరో తెలుసా?) ఇప్పుడున్న హీరోల్లో శివకార్తికేయన్ సమ్‌థింగ్ డిఫరెంట్. చాలా సాధారణమైన స్టోరీల్ని కూడా తనదైన కామెడీతో హిట్ చేస్తున్నాడు. ఎప్పటికప్పుడు వైవిధ్యం చూపించే ఇతడు.. ఈ ఏడాది 'మహావీరుడు' చిత్రంతో హిట్ కొట్టాడు. ఇప్పుడు 'అయాలన్' అనే ఏలియన్ సినిమాతో అలరించేందుకు సిద్ధమైపోయాడు. సంక్రాంతికి థియేటర్లలోకి రాబోతున్న ఈ చిత్ర టీజర్‌ని తాజాగా రిలీజ్ చేశారు. ఓ పల్లెటూరిలో కుర్రాడు (శివకార్తికేయన్), అనుకోకుండా ఆ ఊరిలోకి వచ్చిన ఏలియన్ తో ఫ్రెండ్షిప్ చేయడం.. వీళ్లిద్దరూ కలిసి కామెడీ చేస్తూనే మరోవైపు ఓ సీరియస్ విషయాన్ని సాల్వ్ చేయడం లాంటి వాటిని టీజర్లో చూడొచ్చు. గ్రాఫిక్స్ కూడా బాగున్నాయి. మ్యూజిక్ కూడా క్రేజీగా ఉంది. టీజర్ చూస్తుంటే హిట్ పక్కా అనిపిస్తుంది. మరి తెలుగు ఆడియెన్స్‌కి ఎంతవరకు ఎక్కుతుందనేది తెలియాలంటే సంక్రాంతి వరకు వెయిట్ అండ్ సీ. (ఇదీ చదవండి: 'బిగ్‌బాస్ 7' ఎలిమినేషన్లో ట్విస్ట్.. ఐదోవారమూ అమ్మాయే!) -
సంక్రాంతికి అయలాన్
శివ కార్తికేయన్, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా ఆర్.రవికుమార్ దర్శకత్వంలో రూపొందిన సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్ ‘అయలాన్ ’. కోటపాడి జె.రాజేష్, ఆర్డీ రాజా నిర్మించిన ఈ సినిమాను సంక్రాతికి విడుదల చేస్తున్నట్లు నిర్మాతలు వెల్లడించారు. ‘‘అయలాన్ అంటే ఏలియన్ అని అర్థం. ఈ ప్రయాణంలో మాకు కొన్ని కష్టాలు ఎదురైనప్పటికీ ధైర్యం కోల్పోకుండా, పట్టుదలతో ఈ సినిమా చేశాం. నాణ్యతా ప్రమాణాల్లో రాజీ పడాలనుకోవడం లేదు. అందుకే సినిమా విడుదల కొంత ఆలస్యం అవుతోంది. మా మూవీలో 4500 సీజీ షాట్స్ ఉన్నాయి. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో మా మూవీ రిలీజ్ కానుంది’’ అని యూనిట్ పేర్కొంది. ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. -
స్టార్ హీరోతో ఛాన్స్ కొట్టేసిన సీతారామం బ్యూటీ..!
సీతారామం సినిమాతో ఒక్కసారిగా గుర్తింపు తెచ్చుకున్న నటి మృణాల్ ఠాకూర్. ఇటీవల తమన్నా, విజయ్ వర్మ కలిసి నటించిన లస్ట్ స్టోరీస్-2లోనూ మెరిసింది. అయితే ప్రస్తుతం తమిళ స్టార్ హీరోతో ఆమె జతకట్టనున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే మావీరన్(మహావీరుడు) చిత్రంతో హిట్ కొట్టిన శివ కార్తికేయన్‌కు జంటగా నటించేందుకు సిద్ధమవుతున్నట్లు తాజా సమాచారం. (ఇది చదవండి: నా రూమ్‌లో సీక్రెట్ కెమెరా పెట్టారు: స్టార్ హీరోయిన్) మావీరన్ సక్సెస్ తర్వాత శివ కార్తికేయన్ మరో చిత్రానికి ఓకే చెప్పేశారు. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో ఈయన నటించనున్నారు. ఈ చిత్రంలో అతని సరసన బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాగూర్ హీరోయిన్గా కనిపించనున్నట్లు తెలుస్తోంది. కాగా.. ఇప్పటికే శివ కార్తికేయన్ ప్రస్తుతం రాజ్‌కమల్ ఫిలిం ఇంటర్నేషనల్ పతాకంపై కమలహాసన్ నిర్మిస్తున్న చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో సాయిపల్లవి హీరోయిన్గా కనిపించనుంది. దీనికి రాజ్‌కుమార్ పెరియ సామి దర్శకత్వం వహిస్తుండగా.. ఇందులో మేజర్‌గా నటిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా.. ఈ చిత్రంలో శివ కార్తికేయన్ మరోసారి పోలీస్ అధికారిగా నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఈయన ఇంతకుముందు కాక్కీసట్టై చిత్రంలో పోలీస్ అధికారిగా నటించారు. అదేవిధంగా దర్శకుడు ఏఆర్ మురుగదాస్ చివరిగా దర్శకత్వం వహించిన చిత్రం దర్బార్. ఇందులో రజినీకాంత్ పోలీస్ అధికారిగా నటించిన విషయం తెలిసిందే. అయితే ఆ చిత్రం ఆశించిన విజయాన్ని అందుకోలేదు. (ఇది చదవండి: ఫోటోపై రియాక్ట్ అయిన రేణు దేశాయ్.. వెంటనే తొలగించేసిన రాఘవేంద్ర రావు) ఆ తర్వాత ఏఆర్.మురుగదాస్ చాలా గ్యాప్ తీసుకుని శివ కార్తికేయన్ హీరోగా మరోసారి పోలీస్ కథనే నమ్ముకుని చిత్రం చేయడానికి సిద్ధమవుతున్నారు. కాగా ఈ చిత్రాన్ని స్పైడర్ చిత్ర నిర్మాతలు నిర్మించనున్నట్లు తెలిసింది. దీనికి అనిరుధ్ సంగీతం అందించినట్లు, షూటింగ్ అక్టోబర్ లేదా నవంబర్ నెలలో ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. -
అతనికి మొహం చూపించలేకపోయా.. రవితేజకు స్పెషల్ థ్యాంక్స్: నిర్మాత
శివకార్తికేయన్, అదితిశంకర్ జంటగా నటించిన చిత్రం మావీరన్( మహావీరుడు). నటి సరిత, దర్శకుడు మిష్కిన్, యోగిబాబు ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని శాంతి టాకీస్ పతాకంపై అరుణ్ విశ్వ నిర్మించారు. గత 14న విడుదలైన ఈ చిత్రం విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ గురువారం ఉదయం చైన్నెలోని సత్యం థియేటర్లో థ్యాంక్స్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్మాత అరుణ్ విశ్వ మాట్లాడుతూ దర్శకుడు మడోన్ అశ్విన్ రైటింగ్, కన్వెన్షన్, క్లారిటి ఈ చిత్ర విజయానికి ముఖ్యకారణం అని నిర్మాత పేర్కొన్నారు. చిత్ర బాధ్యతంతా తన భుజాలపైనే మోశారు. తాను ఇంతకుముందు ప్రిన్స్ చిత్రానికి తాను సహ నిర్మాతగా వ్యవహరించానని, ఆమె చిత్రం సరిగ్గా ఆడలేదంది. దీంతో శివకార్తికేయన్ ఆ నష్టాన్ని భర్తీ చేశారన్నారు. ఆ తరువాత ఆయన్ని కలవడానికి తనకు ముఖం చెల్లలేదన్నారు. అలాంటి సమయంలో శివకార్తికేయనే ఫోన్ చేసి మావీరన్ చిత్రం చేద్దామని చెప్పి అన్నీ తానై ఈ చిత్రాన్ని చేశారన్నారు. ఈ చిత్రానికి వాయిస్ ఓవర్ చెప్పడానికి అంగీకరించిన విజయ్‌సేతుపతికి, అదేవిధంగా తెలుగు వెర్షన్‌కి వాయిస్ ఓవర్ ఇచ్చిన రవితేజకు థ్యాంక్స్ చెప్పుకుంటున్నానన్నారు. చిత్రం మంచి వసూళ్లు రాబడుతోందని, గురువారంతో బ్రేక్ ఈవెంట్ అవుతుందన్నారు. ఇకపై వచ్చేదంతా లాభమేనని నిర్మాత చెప్పారు. శివకార్తికేయన్ మాట్లాడుతూ మావీరన్ విజయం తనకు చాలా ప్రత్యేకం అన్నారు. తనకు మంచి యాక్టర్ అనిపించుకోవడం కంటే ఎంటర్టైనర్ అనిపించుకోవాలని కోరుకుంటానని, అది ఈ చిత్రంతో నెరవేరిందని అన్నారు. మడోన్ అశ్విన్ దర్శకత్వంలో మళ్లీ నటించడానికి తాను సిద్ధం అని చెప్పారు. జయాపజయాలు మామూలే అని అయితే అభిమానుల సంతోషం కోసం ప్రేమిస్తూనే ఉంటానని శివకార్తికేయన్ పేర్కొన్నారు. #MaaveeranThanksMeet happening now…😇💪🏼 #VeerameJeyam #Maaveeran #MaaveeranBlockBuster pic.twitter.com/5cYwLjs56c — Shanthi Talkies (@ShanthiTalkies) July 20, 2023 -
‘మహావీరుడు’ మూవీ రివ్యూ
టైటిల్: మహావీరుడు నటీనటులు: శివకార్తికేయన్, అదితి శంకర్, మిస్కిన్, సరిత, సునీల్, యోగిబాబు నిర్మాత:అరుణ్ విశ్వ దర్శకత్వం:మడోన్ అశ్విన్ సంగీతం: భరత్ శంకర్ సినిమాటోగ్రఫీ: విషు అయ్యన్న విడుదల తేది: జులై 14, 2023 మహావీరుడు కథేంటంటే.. సత్య(శివకార్తికేయన్) ఓ కార్టూనిస్ట్. మహావీరుడు పేరుతో కామిక్ కథలు రాస్తుంటాడు. నిజ జీవితంలో భయస్తుడు. కానీ తన కథలు మాత్రం సమాజం కోసం పోరాడే ఓ మహావీరుడి గురించే ఉంటాయి. తను ఉండే స్లమ్ ఏరియా నుంచి అందరిని వేరే ప్రాంతానికి తరలిస్తుంది ప్రభుత్వం. ఆ ఏరియా ప్రజలందరికి ఓ అపార్ట్మెంట్కి తరలిస్తారు. మంత్రి ఎమ్ ఎమ్ సూర్య(మిస్కిన్) మనుషులు నాసిరకం సిమెంట్‌తో ఆ అపార్ట్‌మెంట్‌ని నిర్మిస్తారు. పైకి అందంగా, అద్భుతంగా కనిపించినప్పటికీ.. ఇంట్లోకి వెళ్లిన తొలిరోజు నుంచి కిటికీలు పడిపోవడం, గోడలకు పగుళ్లు రావడం జరుగుతుంటాయి. ఇదేంటని ప్రశ్నిస్తే మంత్రి మనుషులు బెదిరిస్తారు. తన తల్లిని, సోదరిని అవమానించినా..సత్య ఎదురు తిరగడు. అయితే ఓ సందర్భంలో చనిపోవాలని అపార్ట్మెంట్ పైకి దూకేందుకు ప్రయత్నిస్తాడు సత్య. దెబ్బలు తగిలినా ప్రాణాలతో భయటపడతాడు. (చదవండి: ‘బేబీ’ మూవీ రివ్యూ) అప్పటి నుంచి అతనికి మాత్రమే ఓ అజ్ఞాత వ్యక్తి వాయిస్ వినిస్తుంది(హీరో రవితేజ వాయిస్ ఓవర్ ఇచ్చాడు). అతను సత్యని ఓ మహావీరుడిగా, మంత్రి సూర్యని యముడిగా వర్ణిస్తుంటాడు. అంతేకాదు మంత్రి నాసిరకంగా కట్టించిన ప్రజా భవనం కూలిపోతుందనే విషయాన్ని ఆ గొంతు అతనికి తెలియజేస్తుంది. అప్పుడు సత్య ఏం చేశాడు? ఆ అజ్ఞాత గొంతు కారణంగా సత్య జీవితంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి? అతని ప్రయాణంలో జర్నలిస్ట్ చంద్ర(అదితి శంకర్) పాత్ర ఏంటి? చివరకు మంత్రిని ఎదురించి ప్రజల ప్రాణాలకు ఎలా కాపాడాడు? అనేదే ‘మహావీరుడు’ కథ. ఎలా ఉందంటే.. ఓ రాజకీయ నాయకుడు ప్రజలను మోసం చేయడం.. హీరో వారికి అండగా నిలిచి, ఆ రాజకీయ నాయకుడి అవినీతిని భయటపెట్టడం, ప్రాణాలకు తెగించి ప్రజలను కాపాడడం.. ఇలాంటి కాన్సెప్ట్‌తో తెలుగులో చాలా సినిమాలు వచ్చాయి. మహావీరుడు కథ కూడా ఇదే. కానీ ఇక్కడ హీరో భయస్తుడు. ఓ పిరికివాడు ప్రజల కోసం ఎలా ధైర్యవంతుడిగా మారడనేదే ఈ మూవీ కథ. అయితే ఇదంతా సీరియస్ కాకుండా.. సెటిల్డ్ కామెడీతో ఎంటర్టైన్గా సాగుతుంది. రవితేజ వాయిస్ ఓవర్ సినిమాకు చాలా ప్లస్ అయింది. అలాగే యోగిబాబు కామెడీ కూడా బాగా వర్కౌట్ అయింది. హీరో క్యారెక్టర్, వాయిస్ ఓవర్.. కొన్ని చోట్ల మర్యాద రామన్న సినిమాను గుర్తు చేస్తుంది. అలాగే హీరో భయస్తుడు అని చెప్పించడానికి వచ్చే కొన్ని సన్నివేశాలు సాగదీతగా అనిపిస్తాయి. సినిమా ప్రారంభంలోనే హీరో క్యారెక్టర్ ఎలా ఉండబోతుందో చూపించాడు. హీరోకి అజ్ఞాత గొంతు వినిపించేంత వరకు కథంతా సోసోగా సాగుతుంది. ఆ తర్వాత సినిమా మొత్తం కామెడీ ట్రాక్ ఎక్కుతుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ ఆసక్తికరంగా ఉంటుంది. అయితే సెకండాఫ్ మాత్రం కథ సాగదీతగా అనిపిస్తుంది. హీరో విలన్ దగ్గరకి వెళ్లి లొంగిపోయిన తర్వాత వచ్చే సన్నివేశాలు బోర్ కొట్టిస్తాయి. అలాగే హీరో హీరోయిన్ల లవ్ ట్రాక్ కూడా అంతగా ఆకట్టుకోలేవు. సినిమా నిడివి కూడా ప్రేక్షకులకు ఇబ్బంది కలిగిస్తుంది. సింపుల్‌గా చెప్పాల్సిన విషయాలను కూడా డీటైల్డ్‌గా చూపించి నిడివి పెంచేశారు. అలాగే నాసిరకంగా కట్టించిన బిల్డింగుల కారణంగా ప్రజలు పడే ఇబ్బందులను కూడా బలంగా చూపించలేకపోయారు. వాటిని మరింత ఎమోషనల్‌గా తీర్చిదిద్దింటే బాగుండేది. ఫస్టాఫ్ మాదిరే సెకండాఫ్ కామెడీ కూడా వర్కౌట్ అయితే సినిమా ఫలితం మరోలా ఉండేది. ఎలాంటి అంచనాలు పెట్టుకోకుండా వెళితే ఈ మహావీరుడు కాస్త నవ్విస్తాడు. ఎవరెలా చేశారంటే.. మధ్యతరగతి కుటుంబానికి చెందిన సత్య పాత్రలో శివకార్తికేయన్ ఒదిగిపోయాడు. ఇలాంటి పాత్రలు చేయడం అతనికి కొత్తేమి కాదు. భయస్తుడిగా ఆయన చేసే కామెడీ నవ్వులు పూయిస్తుంది. జర్నలిస్ట్ చంద్రగా అదితి శంకర్ తన పాత్ర పరిధిమేర చక్కగా నటించింది. ఈ చిత్రంలో ఆమె నిడివి చాలా తక్కువనే చెప్పాలి. భవన కార్మికుడిగా యోగిబాబు చేసే కామెడీ సినిమాకు చాలా ప్లస్ అయింది. మంత్రిగా మిస్కిన్ , అతని సహాయకుడిగా సునీల్‌తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఇక సాంకేతిక విషయాలకొస్తే.. భరత్ శంకర్ సంగీతం జస్ట్ ఓకే. పాటలకు తెలుగు ప్రేక్షకులను నచ్చవు. నేపథ్య సంగీతం పర్వాలేదు. సినిమాటోగ్రాఫర్ పనితీరు బాగుంది. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. ముఖ్యంగా సెకండాఫ్‌లో కొన్ని సన్నివేశాలను మరింత క్రిస్పీగా కట్ చేయాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లుగా ఉన్నాయి. -
హీరోయిన్గా డైరెక్టర్ కూతురు.. మరీ ఇంత చీప్ రెమ్యునరేషనా?
అందం, తెలివి, చలాకీతనం ఉన్న నటి అదితిశంకర్. ప్రముఖ దర్శకుడు శంకర్ వారసురాలు, విద్యావంతురాలు, గాయని అన్నవి అదనపు అర్హతలు..ఈమె వైద్య వృతి చదివి నటిగా పరిచయం అయిన విషయం తెలిసిందే. విరుమాన్ చిత్రం ద్వారా కథానాయకిగా రంగప్రవేశం చేసి తొలి చిత్రంతోనే మంచి పేరు తెచ్చుకున్నారు. ప్రథమ చిత్రంతో పాస్ అయిన అదితిశంకర్ ఇప్పుడు ద్వితీయ విజ్ఞాన్ని అధికమించడానికి సిద్ధమయ్యారు. (ఇది చదవండి: ఆయన వల్లే కొత్త ప్రపంచాన్ని చూస్తున్నా.. కంటతడి పెట్టుకున్న హీరోయిన్) తాజాగా నటుడు శివకార్తికేయన్‌కు జంటగా నటించిన మావీరన్ చిత్రం రేపు తెరపైకి రానుంది. మండేలా చిత్రం ఫేమ్ మడోన్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శాంతి పిక్చర్స్ పతాకంపై అరుణ్ నిర్మించారు. ఇందులో నటి అదితి శంకర్ పాత్రికేయరాలిగా చురుకైన పాత్రలో నటించినట్లు ఇటీవల ఓ భేటీలో దర్శకుడు తెలిపారు. కాగా నటి అదితి శంకర్ గురించి మీడియాలో ఒక విషయం వైరల్ అవుతోంది. అదేమిటంటే ఈమెకు తన తండ్రి శంకర్ సిఫార్సుతోనే అవకాశాలు వస్తున్నాయని.. దీనిపై స్పందించిన అదితి శంకర్ ఆ ప్రచారంలో నిజం లేదన్నారు. ఇంత వరకూ నాన్న ద్వారా ఒక్క చిత్రం కూడా రాలేదని చెప్పారు. అదితి చేయగలదని భావించి కథలతో దర్శక నిర్మాతలు వస్తున్నారనీ.. తాను మొదట కథ విన్న తరువాత నాన్నకు చెబుతానన్నారు. ఆయన అనుమతితోనే ఆ చిత్రంలో నటించే విషయం గురించి నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. (ఇది చదవండి: క్రేజీ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్న రష్మిక.. ఛాన్స్ కొట్టేసిన యంగ్ హీరోయిన్!) తనకు నాన్న సపోర్టు ఉంటుందని పేర్కొన్నారు. మీ నాన్న పెద్ద దర్శకుడు ఆయన దర్శకత్వంలో నటిస్తారా? అన్న ప్రశ్నకు అలాంటి ఆశ తనకూ ఉందని చెప్పారు. దర్శకత్వం వహించే ఆలోచన ఉందా? అన్న ప్రశ్నకు లేదని స్పష్టం చేశారు. అయితే మ్యూజిక్ ఆల్బం చేయాలన్న ఆలోచన ఉందని చెప్పారు. కాగా ఈ బ్యూటీ తదుపరి విష్ణువర్థన్ దర్శకత్వంలో నటించనున్నట్లు చెప్పారు. అయితే ఆమె చిత్రానికి తీసుకుంటున్న పారితోషికం ఎంతో తెలుసా? కేవలం రూ. 25 లక్షలు మాత్రమేనట. దీనిపై కొందరు ఆమేకేంటి తండ్రి కోట్లు సంపాదిస్తున్నారు అంటూ కామెంట్లు చేస్తున్నారు. -
'మహావీరుడు'ని తెలుగువారు ఇష్టపడతారు: అడివి శేష్
'మహావీరుడు’ సినిమా ట్రైలర్, విజువల్స్ గొప్పగా ఉన్నాయి. ఈ మూవీలో గ్రేట్ వైబ్ కనిపిస్తోంది. సినిమా విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను' అని డైరెక్టర్ శేఖర్ కమ్ముల అన్నారు. శివ కార్తికేయన్ హీరోగా ‘మండేలా’ ఫేమ్ మడోన్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన తమిళ చిత్రం ‘మహావీరన్’. అదితీ శంకర్ హీరోయిన్. శాంతి టాకీస్ పతాకంపై అరుణ్ విశ్వ నిర్మించారు. ఈ సినిమాని ఏషియన్ సినిమాస్ ఈ నెల 14న తెలుగులో విడుదల చేస్తోంది. హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకకి హీరో అడివి శేష్, శేఖర్ కమ్ముల ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అడివి శేష్ మాట్లాడుతూ–'నా గురువు శేఖర్ కమ్ముల ముందు మాట్లాడటం గౌరవంగా ఉంది. శివ కార్తికేయన్‌తో పని చేయాలని ఉంది' అన్నారు. 'రెమో, వరుణ్ డాక్టర్, కాలేజ్ డాన్’ సినిమాల్లా ‘మహావీరుడు’ ని తెలుగువారు ఇష్టపడతారు' అన్నారు శివ కార్తికేయన్. ‘‘మహావీరుడు’ అందరికీ నచ్చుతుంది’’ అన్నారు మడోన్ అశ్విన్. ‘‘మా అమ్మగారి పేరుతో ఈ సంస్థ మొదలుపెట్టి, శివ కార్తికేయన్‌తో తొలి మూవీ చేయడం హ్యాపీ’’ అన్నారు అరుణ్ విశ్వ. -
ప్రమోషన్స్‌కు సిద్ధమైన మహా వీరుడు, అప్పుడే ఆడియో లాంచ్
శివ కార్తికేయన్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం మావీరన్. దర్శకుడు శంకర్ వారసురాలు ఆదితిశంకర్ హీరోయిన్గా నటిస్తున్న ఇందులో యోగిబాబు, దర్శకుడు మిష్కిన్, సరిత ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. జాతీయ ఉత్తమ దర్శకుడు అవార్డు గ్రహీత, మండేలా చిత్రం ఫేమ్ మడోనా అశ్విన్ కథ, కథనం, దర్శకత్వం బాధ్యతలను నిర్వర్తిస్తుండగా శాంతి టాకీస్ సంస్థ నిర్మిస్తోంది. ఈ చిత్రాన్ని తమిళం, తెలుగు భాషల్లో జూలై 14న విడుదల చేయనున్నట్లు నిర్మాత అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. తెలుగులో మహావీరుడు పేరుతో విడుదల కానుంది. ఈ చిత్రానికి డబ్బింగ్‌ను శివకార్తికేయన్ ఇటీవలే పూర్తి చేశారు. కాగా చిత్ర విడుదల హక్కులను ఉదయనిధి స్టాలిన్‌కు చెందిన రెడ్ జెయింట్ మూవీస్ సంస్థ పొందడం విశేషం. భరత్ శంకర్ సంగీతాన్ని అందించిన ఈ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని జూలై 2న భారీ ఎత్తున నిర్వహిస్తున్నట్లు సమాచారం. చైన్నెలోని సాయిరాం కాలేజీలో కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. నటుడు శివకార్తికేయన్ ఇంతకుముందు నటించిన రెండు చిత్రాల ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఇదే కాలేజీలో నిర్వహించారన్నది గమనార్హం. చదవండి: సీఎం జగన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు: పంచ్ ప్రసాద్ -
షాకింగ్ న్యూస్ చెప్పిన స్టార్ హీరో.. ట్వీట్ వైరల్
కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తికేయన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. తమిళంతో పాటు టాలీవుడ్‌లోనూ ఆయనకు మాంచి క్రేజ్ ఉంది. రెమో, డాక్టర్, డాన్ లాంటి డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. చదవండి: సూపర్ స్టార్ కృష్ణ 'మోసగాళ్లకు మోసగాడు' రీరిలీజ్ గతేడాది జాతిరత్నాలు డైరెక్టర్ అనుదీప్ దర్శకత్వంలో తెలుగులో ప్రిన్స్ అనే సినిమాను చేశారు. ప్రస్తుతం మహావీరన్ అనే సినిమాను కూడా తెలుగులో రిలీజ్ చేయనున్నారు. ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్న శివ కార్తికేయన్ ఓ షాకింగ్ న్యూస్ చెప్పాడు. ట్విటర్ నుంచి బ్రేక్ తీసుకుంటున్నట్లు ప్రకటించాడు. 'మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. నేను కొద్ది రోజుల పాటు సోషల్ మీడియా నుంచి బ్రేక్ తీసుకుంటున్నా. సినిమా అప్డేట్స్ నా టీమ్ షేర్ చేస్తుంది. త్వరలోనే తిరిగి వచ్చేస్తాను' అంటూ పేర్కొన్నారు. దీంతో ఈ ట్వీట్ ఇప్పుడు వైరల్‌గా మారింది. అయితే ఈ బ్రేక్ ఎందుకన్నది మాత్రం ఆయన రివీల్ చేయలేదు. చదవండి: చైతన్యకు అప్పు లేదు, ఇంకేదో జరిగింది.. డ్యాన్స్ మాస్టర్ మేనమామ My dear brothers and sisters, I am taking a break from twitter for a while. Take care, and i will be back soon 👍😊 P.S: All updates on the films will be shared here by my team. pic.twitter.com/Nf4fdqXRTy — Sivakarthikeyan (@Siva_Kartikeyan) April 30, 2023 -
టాలీవుడ్ డైరెక్టర్స్ కోసం కోలీవుడ్ స్టార్స్ క్యూ
ఈ మధ్య కాలంలో టాలీవుడ్ డైరెక్టర్స్ పాన్ ఇండియా స్థాయిలో రాణిస్తున్నారు. మన దర్శకుల కోసం ఇతర భాషల హీరోలు క్యూ కడుతున్నారు. ముఖ్యంగా కోలీవుడ్ స్టార్ హీరోలు తెలుగు దర్శకులతో సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కోలీవుడ్ హీరో-టాలీవుడ్ డైరెక్టర్ కాంబోలో ఇటీవల వచ్చిన సినిమాల్లో ‘ప్రిన్స్’ మొదటిది. తెలుగు దర్శకుడు అనుదీప్ డైరెక్షన్ లో... తమిళ హీరో శివ కార్తికేయన్ హీరోగా నటించిన ఈ సినిమా.. భారీ అంచనాల మధ్య రిలీజైన ఈ మూవీ, డిజాస్టర్ గా నిలిచింది. ఈ మూవీ తర్వాత కోలీవుడ్ లో టాలీవుడ్ డైరెక్టర్ తెరకెక్కించిన మూవీ - వారిసు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఇళయదళపతి విజయ్ ఈ సినిమాలో హీరోగా నటించాడు. సంక్రాంతి బరిలో దిగిన ఈ మూవీ కోలీవుడ్ లో 300 కోట్లు వసూళ్లు చేసింది. విజయ్ కెరీర్ లో అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన మూవీగా వారిసు రికార్డ్ క్రియేట్ చేసింది. ఇప్పుడు మరో తెలుగు డైరెక్టర్ వెంకీ అట్లూరి కోలీవుడ్ బాక్సాపీస్ దగ్గర సక్సెస్ అందుకునేందుకు రెడీ అయ్యాడు. తొలిప్రేమ, మజ్ను, రంగ్ దే సినిమాలతో ఆకట్టుకున్నఈ డైరెక్టర్.. కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తో ‘వాతి’ అనే మూవీ తెరకెక్కించాడు. ఈ సినిమా తెలుగులో సార్ పేరుతో ఈ నెల 17న రిలీజ్ చేయబోతున్నారు. ఎడ్యుకేషన్ మాఫీయా బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ సినిమాతో తెలుగు డైరెక్టర్ కోలీవుడ్‌లో ఏ రేంజ్ సక్సెస్ అందుకుంటాడో చూడాలి. ధనుష్.. వెంకీ అట్లూరి తోనే కాకుండా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో కూడా నటించబోతున్నాడు. -
శివ కార్తికేయన్, ఏఆర్ మురుగదాస్ కాంబినేషన్లో సినిమా?
తమిళ సినిమా: ఏ రంగంలోనైనా, ఎవరికైనా గ్యాప్ రావడం అనేది సహజం. అలాంటి వారు మళ్లీ టైం వచ్చే వరకు వేచి చూడాల్సిందే. దర్శకుడు ఏఆర్ మురుగదాస్ విషయంలోనూ ఇదే జరుగుతోంది. తొలి చిత్రంతో మంచి విజయం సాధించిన ఈ దర్శకుడు ఆ తర్వాత విజయకాంత్‌తో రమణ, సూర్య కథానాయకుడిగా గజిని వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలను తెరకెక్కించి స్టార్ డైరెక్టర్‌గా వెలుగొందారు. విజయ్ హీరోగా కత్తి, తుపాకీ, సర్కార్ వంటి విజయవంతమైన చిత్రాలకీ దర్శకత్వం వహాంచిన మురుగదాస్ చివరిగా రజనీకాంత్ కథానాయకుడిగా దర్బార్ చిత్రం చేశారు. అది ఆశించిన విజయాన్ని సాధించలేదు. అంతే మురుగదాస్ ఫేట్ ఒక్కసారిగా మారిపోయింది. విజయ్ 65వ చిత్రానికి ఈయన దర్శకత్వం వహించాల్సి ఉంది. అయితే ఏమైనా అది జరగలేదు దర్బార్ తర్వాత మురుగదాస్ ఇప్పటి వరకు ఏ చిత్రం చేయలేదు. ఇటీవల త్రిష కథానాయక నటించిన రాంకీ చిత్రానికి కథను అందించారు. ఈయన మళ్లీ ఎప్పుడు దర్శకత్వం వహిస్తారా..? అన్న ప్రశ్నకు తాజాగా సమాధానం వచ్చినట్లు కోలీవుడ్ వర్గాల తాజా సమాచారం. ఏఆర్ మురుగదాస్ నటుడు శివ కార్తికేయన్ కాంబోలో ఒక చిత్రం తెరకెక్కనుందనే ప్రచారం సాగుతోంది. దీన్ని లైట్ హౌస్ మూవీస్ సంస్థ నిర్మించినట్లు టాక్. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలుపడాల్సి ఉంది. కాగా ప్రస్తుతం అయిలాన్ చిత్రాన్ని పూరి చేసి మావీరన్ చిత్రంలో నటిస్తున్నారు. -
ప్రిన్స్ రివ్యూ: జాతిరత్నాలు డైరెక్టర్ నవ్వించాడా?
టైటిల్: ప్రిన్స్ తారాగణం: శివకార్తికేయన్, మరియా, సత్యరాజ్, ప్రేమ్‌జీ తదితరులు దర్శకుడు: అనుదీప్ కేవి సంగీతం: తమన్ సినిమాటోగ్రాఫర్: మనోజ్ పరమహంస నిర్మాతలు: సునీల్ నారంగ్, సురేశ్ బాబు, పుష్కర్ రామ్ మోహన్ రావు విడుదల తేదీ: అక్టోబర్ 21, 2022 ఒక సినిమా విజయం సాధించిందంటే ఆ డైరెక్టర్ బాధ్యత రెట్టింపు అవుతుంది. తర్వాతి సినిమా అంతకు మించి విజయాన్ని సాధించేలా తీయాల్సి ఉంటుంది. ప్రేక్షకులు కూడా నెక్స్ట్ ఎలాంటి మూవీ తీస్తారోనని ఉత్సుకతతో ఎదురుచూస్తుంటారు. అలాంటి పరిస్థితే ఎదురైంది దర్శకుడు కేవీ అనుదీప్‌కి. గతేడాది జాతిరత్నాలు మూవీతో ఊహించనంత సక్సెస్‌ను ఖాతాలో వేసుకున్న అనుదీప్ ఈసారి ప్రిన్స్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. శివకార్తికేయన్ హీరోగా నటించిన ఈ మూవీ తెలుగు, తమిళ భాషల్లో రిలీజైంది. మరి అనుదీప్ మరోసారి పొట్ట చెక్కలయ్యేలా నవ్వించాడా? ప్రిన్స్ మూవీ ఎలా ఉంది? ఓసారి చూసేద్దాం.. కథ: ఓ స్వతంత్ర సమరయోధుల కుటుంబానికి చెందిన వారసుడు ఆనంద్(శివకార్తికేయన్). ఇతడో స్కూలు టీచర్. హీరో తండ్రి విశ్వనాథ్(సత్యరాజ్) కులమతాలకు వ్యతిరేకి, అందరూ కలిసి ఉండాలనుకునే వ్యక్తి. ఇక హీరో తన స్కూల్లోనే మరో టీచర్(బ్రిటీష్ అమ్మాయి) అయిన జెస్సిక (మరియా ర్యాబోషప్కా)తో లవ్‌లో పడతాడు. ఇంగ్లండ్‌కు చెందిన జెస్సిక తండ్రికి ఇండియన్స్ అంటేనే గిట్టదు. దీంతో వారి ప్రేమకు అతడు రెడ్ సిగ్నల్ ఇస్తాడు. రానురానూ ఇద్దరి మధ్య లవ్‌స్టోరీ కాస్తా రెండు దేశాల మధ్య వార్‌లా మారుతుంది. మరి ఆనంద్ ప్రేమ సక్సెస్ అయిందా? అతడిని ఊరి నుంచి ఎందుకు గెంటేశారు? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే! విశ్లేషణ: ప్రిన్స్ సినిమాలో మూడు కోణాలు ఉన్నాయి. కామెడీ, లవ్ స్టోరీ, మానవత్వం అనే అంశాలను టచ్ చేశాడు డైరెక్టర్. అనుదీప్ అంటేనే కామెడీ కాబట్టి ఎక్కువగా కామెడీనే నమ్ముకున్నాడు. కానీ అక్కడక్కడా కామెడీ పండించే సీన్లను సాగదీయడం కొంత చిర్రెత్తిస్తుంది. ముఖ్యంగా బాటిల్ గార్డ్ ఎపిసోడ్ చూసిన జనాలకు అరె ఏంట్రా ఇది అనిపిస్తుంది. లవ్ సీన్స్ కొన్నిచోట్ల అమాయకత్వం ఉట్టిపడుతూ బాగుంటాయి. అనుదీప్ టేకింగ్, శివకార్తికేయన్ నటన రెండూ కరెక్ట్‌గా సరిపోయాయి. కానీ విలేజ్ బ్యాక్‌గ్రౌండ్‌లో వచ్చే కొన్ని కామెడీ సీన్లు మాత్రం రొటీన్ ఫార్మాట్లోనే వెళ్లినట్లు అనిపించక మానదు. ఫస్టాఫ్ అక్కడక్కడ బాగుంటుంది. కానీ సెకండాఫ్ మాత్రం తన ట్రేడ్ మార్క్ కామెడీతో కడుపుబ్బా నవ్వించాడు అనుదీప్. డైలాగ్స్ బాగున్నాయి. క్లైమాక్స్‌లో హీరో దేశభక్తి కంటే హ్యుమానిటీనే గొప్పదని చెప్పే స్పీచ్ బాగుంటుంది. అనుదీప్ ఎంచుకున్న కాన్సెప్ట్ సీరియస్‌గా కనిపించినా దాన్ని కూడా ఎంటర్టైన్మెంట్ పద్ధతిలోనే డీల్ చేశాడు. ఏం చేసినా ఏం రాసినా అంతా నవ్వించడం కోసమే అన్నట్లు ఉంటుందీ చిత్రం. మరీ జాతిరత్నాలు రేంజ్లో కాకపోయినా కామెడీ ఇష్టపడేవారికి ప్రిన్స్ నచ్చుతుంది. ఎవరెలా చేశారంటే? శివ కార్తికేయన్ అదిరిపోయే కామెడీ టైమింగ్‌తో ఆకట్టుకున్నాడు. సత్యరాజ్ పాత్ర సినిమాకే హైలెట్. ప్రేమ్ జీ పంచులతో ఎంటర్టైన్ చేశాడు. హీరోయిన్ మరియా లుక్, నటన ఫ్రెష్‌గా ఉంది. అనుదీప్ కామెడీ చేస్తూనే మనుషులంతా ఒక్కటేనని సింపుల్‌గా చెప్పాడు. ప్రధాన పాత్రల మాటలు ఫన్ క్రియేట్ చేస్తూనే ప్రేక్షకులను ఆలోచింపజేసేలా ఉంటాయి. తమన్ అందించిన సంగీతం కొంతవరకు ఆకట్టుకుంది. మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ బాగుంది. కొన్ని సీన్లు సాగదీయకుండా కట్ చేస్తే బాగుండేది. ఓవరాల్‌గా ప్రిన్స్.. నో లాజిక్.. ఓన్లీ కామెడీ మ్యాజిక్! చదవండి: సర్దార్ మూవీ రివ్యూ సౌత్ సినిమాలు చేయాలనుంది -
ఆ రోజు నాకు చాలా బాధేసింది: విజయ్ దేవరకొండ
‘‘మాకు సినిమాయే జీవితం.. ఎంత ప్రేమించి చేస్తామో మాకు తెలుసు. అలాంటిది ఓ రోజు ఓ సినిమా వేదికపై శివ కార్తికేయన్‌గారు ఏడుస్తూ మాట్లాడటంతో నాకు చాలా బాధేసింది. అప్పటి నుంచి ఆయన నాకు ఓ బ్రదర్ అనే ఫీలింగ్ కలిగింది’’ అని హీరో విజయ్ దేవరకొండ అన్నారు. శివ కార్తికేయన్, మారియా ర్యాబోషప్క జంటగా అనుదీప్ కేవీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ప్రిన్స్’. నారాయణ్ దాస్ నారంగ్ ఆశీస్సులతో సోనాలి నారంగ్ సమర్పణలో సునీల్ నారంగ్, డి.సురేష్ బాబు, పుస్కూర్ రామ్మోహన్ రావు నిర్మించారు. తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా ఈ నెల 21న విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన ప్రీ రిలీజ్ వేడుకలో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ–‘‘శివ కార్తికేయన్ అన్నని ఈ రోజే తొలిసారి కలిశాను. ఆయన ప్రయాణం నాకు నచ్చింది. ఎప్పుడైనా ఆయనకి నేను తోడుంటే బాగుంటుందనిపించింది.. ఆ అవకాశం ఇంత త్వరగా ‘ప్రిన్స్’ రూపంలో వచ్చింది. సురేశ్ ప్రొడక్షన్స్ (పెళ్లి చూపులు), ఏషియన్ సినిమాస్ (అర్జున్ రెడ్డి) నా కెరీర్లో చాలా ముఖ్యమైన పాత్ర పోషించాయి. ‘ప్రిన్స్’ ట్రైలర్ చూసి చాలా ఎంజాయ్ చేశాను. అందర్నీ నవ్వించే అనుదీప్‌కి ఈ సినిమా బిగ్ బ్లాక్‌బస్టర్ ఇవ్వాలి’’ అన్నారు. డైరెక్టర్ హరీష్ శంకర్ మాట్లాడుతూ–‘‘మధ్యతరగతి జీవితాలను అనుదీప్ క్షుణ్ణంగా చదివాడని ‘జాతిరత్నాలు’ చూసిన తర్వాత నాకు అనిపించింది. ముళ్లపూడి వెంకటరమణ, జంధ్యాల, బాపుగార్లు.. మిడిల్ క్లాస్ లైఫ్‌లను బాగా అర్థం చేసుకుని వినోదాన్ని పండించారు. అనుదీప్ కూడా సీరియస్‌గా ఉంటూ నవ్వులు పంచుతాడు. ఈ సినిమా బ్లాక్‌బస్టర్ కావాలి’’ అన్నారు. ‘‘ఈ కథ శివ కార్తికేయన్‌గారి కోసమే రాశా.. ఇప్పుడున్న పరిస్థితుల్లో అందరూ చూడాల్సిన సినిమా ఇది’’ అన్నారు అనుదీప్. కెమెరామేన్ మనోజ్ పరమహంస, సంగీత దర్శకుడు తమన్ తదితరులు పాల్గొన్నారు. -
అందుకే ఆ అమ్మాయిని లవ్ చేశా.. ఆసక్తికరంగా ‘ప్రిన్స్’ ట్రైలర్
డాక్టర్, డాన్ చిత్రాలతో వరుస విజయాలు అందుకున్న నటుడు శివకార్తికేయన్. శివ కార్తికేయన్, మరియా జంటగా తెరకెక్కిన చిత్రం ‘ప్రిన్స్’. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ విడుదల చేసింది చిత్రబృందం. ఈ సినిమా తెలుగు ట్రైలర్‌ను టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేశారు. తన అనువాద చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను అలరించిన శివకార్తికేయన్ ఈ చిత్రంతో నేరుగా వారి ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఈ ద్విభాషా చిత్రాన్ని జాతి రత్నాలు ఫేమ్ అనుదీప్ తెరకెక్కించారు. 'రేయ్ కులం, మతం కోసం ఇంకా కొట్టుకుంటున్నారేంట్రా.. మనందరిదీ ఒకే రక్తం రా' అన్న సత్యరాజ్ చెప్పే డైలాగ్‌తో ట్రైలర్ ప్రారంభమైంది. జెస్సికా అనే బ్రిటీష్ అమ్మాయిని శివ కార్తికేయన్ ప్రేమించే ఆసక్తికర కథాంశంతో చిత్రాన్ని తెరకెక్కించారు. అయితే ఈ సినిమాలో అతను తన ప్రేమ గెలిచాడా? అతను పడ్డ ఇబ్బందులు ఎంటీ? కథ ఎలాంటి ఆసక్తికర మలుపులు తిరిగిందో తెరపై చూడాల్సిందే. ట్రైలర్ చూస్తే కామెడీ ఫుల్ ఎంటర్టైనర్గా కనిపిస్తోంది. ఈ సినిమా అక్టోబర్ 21న దిపావళీకి థియేటర్లలో కనువిందు చేయనుంది. -
దీపావళికి థియేటర్లో ‘ప్రిన్స్’ సందడి
డాక్టర్, డాన్ చిత్రాలతో వరుస విజయాలు అందుకున్న నటుడు శివకార్తికేయన్. ఈయన తాజాగా నటిస్తున్న చిత్రం ప్రిన్స్. ఈ చిత్రంతో ఈయన దీపావళికి థియేటర్లలో సందడి చేయనున్నారు. విశేషం ఏమిటి ఇంతకుముందు తన అనువాద చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను అలరించిన శివకార్తికేయన్ ఈ చిత్రంతో నేరుగా వారి ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. అవును తమిళం, తెలుగు భాషలలో రూపొందుతున్న ఈ ద్విభాషా చిత్రాన్ని జాతి రత్నాలు చిత్రం ఫేమ్ అనుదీప్ తెరకెక్కిస్తున్నారు. చదవండి: పూజా ఆ బాడీ పార్ట్‌కి సర్జరీ చేయించుకుందా? ఆమె టీం క్లారిటీ ఈ చిత్రం ద్వారా ఉక్రెయిన్ దేశానికి చెందిన మరియా అనే నటి కథానాయకిగా పరిచయం అవుతోంది. నటుడు సత్యరాజ్, ప్రేమ్‌జీ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. తమన్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రంలోని పిపిలికా పిలాయ్ అనే పాటలు ఇటీవల విడుదల చేశారు. ఈ పాటలకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చిందని చిత్ర వర్గాలు తెలిపాయి. కాగా చిత్ర షూటింగ్ పూర్తి అయినట్లు ఆదివారం అధికారికపూర్వకంగా ప్రకటించారు. దీంతో పాటు చిత్ర పోస్టర్‌ను విడుదల చేస్తూ అక్టోబర్ 21,20200 దీపావళికి ప్రపంచవ్యాప్తంగా మూవీని విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. కాగా నటుడు శివకార్తికేయన్ ఈ చిత్రంలో టూరిస్ట్ గైడ్‌గా నటిస్తున్నట్లు సమాచారం. -
జర్నలిస్ట్‌గా అలరించబోతున్న అదితి శంకర్
ఇటీవల ఎక్కువగా వార్తల్లో ఉన్న నటి ఆదితి శంకర్. ప్రముఖ దర్శకుడు శంకర్ వారసురాలు. ఎప్పుడైతే గట్టిగా సినీ రంగ ప్రవేశం చేసిందో అప్పటి నుంచి ఈమె గురించి తెగ వార్తలు ప్రచారం అయ్యాయి. ఈమె తొలిసారిగా కార్తీతో విరువన్ చిత్రంతో కోలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఇటీవల విడుదలైన ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. అందులో గ్రామీణ యువతిగా దుమ్మురేపిన ఆదితి శంకర్ నటనకు ప్రశంసల వర్షం కురిసింది. అంతేకాకుండా ఆ చిత్ర విడుదలకు ముందే మరో చిత్రం ఈ బ్యటీని వరించింది. శివకార్తికేయన్‌కు జంటగా నటిస్తున్న ‘మా వీరన్’ చిత్రం. డాక్టర్, డాన్ చిత్రాల తరువాత శివకార్తికేయన్ నటిస్తున్న తాజా చిత్రం ఇది. చదవండి: ఉత్కంఠభరితంగా ‘పొన్నియన్ సెల్వన్’ ట్రైలర్ మండేలా చిత్రం ఫేమ్ మండేన్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంపై సినీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ఇందులో దర్శకుడు మిష్కిన్, యోగిబాబు తదితరులు ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. ఇటీవల ప్రారంభమైన ఈ చిత్ర షూటింగ్ ఇప్పటికే తొలి షెడ్యల్ పూర్తి చేసుకుంది. తాజాగా చెన్నై పరిసర ప్రాంతాలలో షెడ్యూల్ జరుపుకుంటోంది. కారణం ఈయన తొలి చిత్రం మండేలా పలు అవార్డులను గెలుచుకోవడమే. కాగా ఈ చిత్రంలో నటి ఆదితి శంకర్ ఒక పత్రిక కార్యాలయంలో పని చేసే పాత్రికేయురాలి పాత్రలో నటిస్తున్నట్లు తాజా సమాచారం. తొలి చిత్రంలో గ్రామీణ యువతిగా నటింన తాను రెండవ చిత్రంలోనే దానికి పూర్తి కాంట్రాస్ట్ పాత్రలో నటించడం సంతోషంగా ఉందని ఆదితి శంకర్ పేర్కొన్నారు. గ్లామరస్ పాత్రలో నటించడానికి వెనుకాడనని ముందే స్పష్టం చేసింది ఈ అమ్మడు. చదవండి: పుష్ప 2పై అప్డేట్ ఇచ్చిన రష్మిక, ‘అప్పుడే సెట్లో అడుగుపెడతా’ -
ఆ హీరోతో జోడి కట్టనున్న డైరెక్టర్ శంకర్ కుమార్తె
Sivakarthikeyan Aditi Shankar Maaveeran Goes On Floors In Chennai: వరుసగా హిట్ సినిమాలతో దూసుకుపోతున్నాడు కోలీవుడ్ హీరో శివ కార్తికేయన్. తాజాగా ఆయన నటిస్తున్న చిత్రం 'మావీరన్'. తెలుగులో 'మహవీరుడు'గా రాబోతుంది. తమిళ చిత్రం 'మండేలా' చిత్రానికి దర్శకత్వం వహించిన మడోనా అశ్విన్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. అంతేకాకుండా ఈ మూవీలో ప్రముఖ డైరెక్టర్ శంకర్ కుమార్తె అదితి శంకర్ హీరోయిన్గా నటిస్తోంది. అదితి ఇదివరకే కార్తీ హీరోగా నటించిన 'విరుమన్' చిత్రంతో హీరోయిన్గా తెరంగేట్రం చేసింది. ఈ సినిమా ఆగస్టు 12న విడుదల కానుంది. ఈ సినిమా షూటింగ్ శుక్రవారం (ఆగస్టు 5) చెన్నైలో ప్రారంభమైంది. ఈ వేడుకకు శంకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. యోగిబాబు, సరిత, దర్శకుడు మిస్కిన్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు భరత్ శంకర్ సంగీతం అందిస్తున్నారు. ఇక శివ కార్తికేయన్ నటిస్తున్న ద్విభాషా (తెలుగు, తమిళ్) చిత్రం ‘ప్రిన్స్’ ఈ ఏడాది దీపావళి సందర్భంగా విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ‘జాతి రత్నాలు’ ఫేమ్ కేవీ అనుదీప్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. -
ఉక్రెయిన్ బ్యూటీకి సుమతి శతకం బోధిస్తున్న శివ కార్తికేయన్
ఉక్రెయిన్ బ్యూటీ మరియ ర్యాబోషప్కకి సుమతీ శతకం బోధిస్తున్నారు హీరో శివ కార్తికేయన్. ‘జాతిరత్నాలు’ ఫేమ్ కేవీ అనుదీప్ దర్శకత్వంలో శివకార్తికేయన్, ర్యాబోషప్క జంటగా నటిస్తున్న చిత్రం ‘ప్రిన్స్’. సోనాలీ నారంగ్ సమర్పణలో సునీల్ నారంగ్, డి.సురేశ్‌బాబు, పుస్కూర్ రామ్మోహన్రావు నిర్మిస్తున్నారు. ఈ సినిమాలోని ర్యాబోషప్క ఫస్ట్‌లుక్‌ని రిలీజ్ చేసింది చిత్రయూనిట్. తన ప్రేయసి ర్యాబోషప్కకి ప్రిన్స్ హ్యాపీగా సుమతీ శతకం బోధిస్తున్నట్లుగా పోస్టర్ చూస్తే తెలుస్తోంది. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతోన్న ఈ సినిమాను వినాయక చవితి సందర్భంగా ఆగస్టు 31న థియేటర్స్‌లో రిలీజ్ చేయాలనుకుంటున్నారు. #Prince Second look ❤️👍 pic.twitter.com/A5mJh2cAAU — Sivakarthikeyan (@Siva_Kartikeyan) June 10, 2022 -
మరో క్రేజీ ప్రాజెక్టులో సాయిపల్లవి.. ఆ స్టార్ హీరోతో మూవీ
హీరోయిన్ సాయిపల్లవి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. అందంతో పాటు అభినయంతోనూ ఎంతో మంది అభిమానాన్ని సొంతం చేసుకుందీ భామ. ఇటీవలె శ్యామ్సింగరాయ్తో హిట్టు కొట్టిన సాయిపల్లవి త్వరలోనే విరాటపర్వం సినిమాతో ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతోంది. ఇదిలా ఉండగా సాయిపల్లవి తమిళంలో ఓ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. శివ కార్తికేయన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాను కమల్‌హాసన్ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి 'మావీరన్' అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. కమల్‌హాసన్ నిర్మిస్తున్న ప్రాజెక్ట్ కావడం, ఇందులో సాయిపల్లవి నటించనుండంతో ఇప్పటికే ఈ చిత్రంపై హైప్ క్రియేట్ అయ్యింది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
పవన్ కళ్యాణ్ ట్వీట్, మురిసిపోతున్న హీరో
పవర్ స్టార్ పవన్‌కల్యాణ్ తన పుట్టిన రోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు. పవన్‌కు శుభాకాంక్షలు తెలిపిన వారిలో తమిళహీరో శివకార్తికేయన్ కూడా ఉన్నారు. ‘హ్యాపీ బర్త్‌డే పవన్ కల్యాణ్ సార్’ అంటూ కార్తికేయన్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌కు పవన్ కల్యాణ్ రిప్లై ఇచ్చారు. ‘డియర్ తిరు శివ కార్తితీకేయన్ మీ ఆత్మీయ శుభాకాంక్షలకు నా ధన్యవాదాలు. మీరు జీవితంలో ఎన్నో విజయాలు సాధించాలని కోరుకుంటున్నాను. నాకు మీ సినిమాలోని ‘ఊదా కలర్ రిబ్బన్’ అనే పాట చాలా ఇష్టం. దానిని నేను లెక్కలేనన్ని సార్లు చూశాను’ అని రిప్లై ఇచ్చారు. Wish you a very happy birthday @PawanKalyan sir 🙏👍😊 — Sivakarthikeyan (@Siva_Kartikeyan) September 2, 2020 పవర్‌స్టార్ స్వయంగా రిప్లై ఇవ్వడంతో శివకార్తికేయన్ చాలా సంతోషంగా ఫీలవుతున్నట్లు తెలిపారు. సూపర్‌స్టార్ అయి ఉండి తన విలువైన సమయాన్ని వెచ్చించి తన పాటను చూసి ఆ విషయాన్ని ట్విటర్ ద్వారా తెలియజేసినందుకు పవర్ స్టార్‌కు ధన్యవాదాలు తెలిపారు. పవన్ కల్యాణ్ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలపడంతో సినీ పరిశ్రమలో ఈ విషయం గురించి చర్చించుకుంటున్నారు. ఊదారంగు రిబ్బన్ పాట శివకార్తికేయన్ నటించిన వరుతపదత వాలిబార్ సంగం చిత్రంలోనిది. Dear Sir extremely happy to see your reply sir😊😊Overwhelmed to know that you liked Oodha color ribbon sir..Big thanks for taking time and acknowledging the love and for your kind words sir 🙏😊 https://t.co/E19Q3nfGFr — Sivakarthikeyan (@Siva_Kartikeyan) September 3, 2020 చదవండి: వారందరికి ధన్యవాదాలు: పవన్ కళ్యాణ్ -
పవన్ సినిమా.. నన్నెవరూ కలవలేదు
పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘వకీల్ సాబ్’. శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్ర షూటింగ్ దాదాపు పూర్తి చేసుకుని రిలీజ్‌కు సిద్దంగా ఉంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈ సినిమా మే15న విడుదలై క్రిష్ పీరియాడికల్ చిత్ర షూటింగ్ ప్రారంభమయ్యేది. కానీ ప్రస్తుతం పరిస్థితులు అనుకూలంగా లేవు. దీంతో ఎక్కడి సినిమాలు అక్కడే ఆగిపోయాయి. అయితే ఈ అనూహ్యంగా దొరికిన ఖాళీ సమయాన్ని ప్రీ ప్రొడక్షన్ పనులకోసం వినియోగించుకుంటున్నారు. పవన్-క్రిష్ కాంబినేషన్లో రాబోతున్న ఈ పీరియాడిక్ యాక్షన్ మూవీలో ఓ పవర్ఫుల్ పాత్ర కోసం కోలీవుడ్ స్టార్ శివకార్తీకేయన్‌ను చిత్రబృందం సంప్రదించినట్లు అనేక వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలపై ఈ కోలీవుడ్ హీరో సన్నిహితులు స్పందించారు. పవన్ సినిమా గురించి శివకార్తీకేయన్‌ను ఎవరు స్పందించలేదని, ప్రస్తుతం వరుస తమిళ సినిమాలతో అతడు బిజీగా ఉన్నారని చెబుతున్నారు. అయితే ఈ విషయంపై స్పష్టతరావాలంటే మరికొంత కాలం వేచి చూడాల్సిందే. ఈ చిత్రంలో బందిపోటుగా పవన్ కనిపించనున్నారని లీకువీరులు పేర్కొంటున్నారు. అంతేకాకుండా ఈ సినిమాలో పవన్ పాత్ర పేరు వీరు అని అందుకే ‘విరూపాక్ష’ అనే సినిమా టైటిల్‌ను ఫిక్స్ చేయాలని క్రిష్ భావిస్తున్నారని మరో వార్త వినిపిస్తున్నారు. అంతేకాకుండా ఈ చిత్రంలో ఇద్దరి హీరోయిన్లు నటించే అవకాశం ఉందని తెలుస్తోంది. కీరవాణి సంగీతమందిస్తున్నట్లు సమాచారం. చదవండి: రాజమౌళికి రిక్వెస్ట్.. ఏం చేస్తారో చూడాలి భన్సాలీ చిత్రం.. ఎన్టీఆర్ బాలీవుడ్ ఎంట్రీ var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_881252745.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
సూపర్ హీరో శక్తి
తమిళ నటుడు శివ కార్తికేయన్, కల్యాణీ ప్రియదర్శన్ జంటగా తెరకెక్కిన తమిళ చిత్రం ‘హీరో’. ‘అభిమన్యుడు’ ఫేమ్ పీఎస్ మిత్రన్ దర్శకత్వంలో కోటపాడి రాజేష్ నిర్మించారు. బాలీవుడ్ నటుడు అభయ్ డియోల్ విలన్‌గా నటించారు. ఈ సినిమాను ‘శక్తి’ టైటిల్‌తో తెలుగులోకి విడుదల చేస్తున్నారు. ‘‘శక్తిమాన్ సీరియల్ చూస్తూ సూపర్ హీరో కావాలని కలలు కంటాడు హీరో. మరి సూపర్‌హీరో అయ్యాడా? సమాజంలో అతను తెచ్చిన మార్పు ఏంటి? అనే కథతో తెరకెక్కించాం. నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తయ్యాయి. త్వరలోనే రిలీజ్ చేస్తాం’’ అన్నారు చిత్రబృందం. ఈ చిత్రానికి యువన్ శంకర్‌రాజా స్వరకర్త. -
అప్పుడు అభిమన్యుడు.. ఇప్పుడు శక్తి
తమిళనాట మంచి మాస్ హీరోగా ఫాలోయింగ్ ఉన్న శివ కార్తికేయన్ కథానాయకుడిగా ‘ఇరుంబుదురై (అభిమన్యుడు)’ ఫేమ్ పీఎస్ మిత్రన్ దర్శకత్వం వహించిన తమిళ చిత్రం ‘హీరో’. కళ్యాణి ప్రియదర్శిని హీరోయిన్గా నటించిన ఈ చిత్రాన్ని కేజేఆర్ స్టూడియోస్, గంగా ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మించాయి. గతేడాది డిసెంబర్ 20న తమిళంలో విడుదలైన ఈ చిత్రం హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. అయితే అభిమన్యుడు చిత్రంతో డైరెక్టర్ మిత్రన్, కౌసల్య కృష్ణమూర్తి చిత్రంతో శివ కార్తికేయన్ తెలుగులో మంచి మార్కెట్ సంపాదించుకున్నారు. దీంతో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన హీరో చిత్రాన్ని తెలుగులో విడుదల చేయనున్నారు. ఈ తమిళ చిత్రాన్ని తెలుగులో శక్తి పేరిట విడుదల చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఇక యాక్షన్ కింగ్ అర్జున్ కీలక పాత్ర పోషించిన ఈ మూవీలో బాలీవుడ్ నటుడు అభయ్ డియోల్ తొలి సారి దక్షిణాదిచిత్రంలో కనిపించాడు. ఇక అభిమన్యుడు చిత్రంతో పీఎస్ మిత్రన్ తెలుగులో ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పటికే తెలుగు డబ్బింగ్ మొదలు పెట్టిన చిత్ర బృందం ఈ సినిమాను నెలాఖరులో విడుదల చేయాలని భావిస్తున్నారు. యువన్‌శంకర్ రాజా సంగీతమందించిన ఈ చిత్రానికి జార్జి.సి.విలియమ్స్ సినిమాటోగ్రఫీ అందించారు. ఇక అఖిల్ అక్కినేని హీరోగా పీఎస్ మిత్రన్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ చిత్రంతో అఖిల్, హీరో(శక్తి) చిత్రంతో మిత్రన్ బిజీగా ఉన్నారు. వారి వారి సినిమాలు పూర్తి చేసిన తర్వాత వీరిద్దరి కొత్త సినిమా మొదలవుతుందని తెలిసింది. -
నమ్మవీట్టు పిళ్లైకి గుమ్మడికాయ కొట్టారు!
నమ్మవీట్టు పిళ్లై చిత్రానికి గుమ్మడికాయ కొట్టారు. నటుడు శివకార్తికేయన్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం నమ్మవీట్టుపిళ్లై. నటి అనుఇమ్మాన్యువేల్ నాయకిగా నటిస్తున్న ఈ చిత్రానికి పాండిరాజ్ దర్శకుడు. సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాకు డీ.ఇమాన్ సంగీతాన్ని అందిస్తున్నారు. తాజాగా నమ్మవీట్టు పిళ్లై చిత్ర షూటింగ్‌ను పూర్తి చేశారు. ఈ విషయాన్ని ఆ చిత్ర హీరోయిన్ అనుఇమ్మాన్యువేల్ తన ఇస్స్ట్రాగామ్లో పేర్కొంది. కడైకుట్టిసింగం వంటి విజయవంతమైన చిత్రం తరువాత పాండిరాజ్ తెరకెక్కిస్తున్న చిత్రం నమ్మవీట్టు పిళ్లై ఈయన ఇంతకుముందు శివకార్తికేయన్ హీరోగా మెరినా, కేడీబిల్లా కిల్లాడిరంగా వంటి సక్సెస్ఫుల్ చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఈ నమ్మవీట్టు పిళ్లై చిత్రం వీరిద్దరి కాంబినేషన్లో తెరకెక్కుతున్న హ్యాట్రిక్ చిత్రం అవుతుంది. ఇకపోతే ఈ చిత్రం శివకార్తికేయన్‌కు, నటి అనుఇమ్మాన్యువేల్ల కెరీర్లకు కీలకంగా భావిస్తున్నారు. నటుడు శివకార్తికేయన్ సరైన హిట్ చూసి చాలాకాలమైంది. ఆయన నటించిన సీమదురై, మిస్టర్ లోకల్ వంటి చిత్రాలు చాలా నిరాశపరిచాయి. ఇక నటి అనుఇమ్మాన్యువేల్కు కోలీవుడ్‌లో చెప్పుకోతగ్గ చిత్రం లేదు. ఇంతకుముందు రెండు చిత్రాల్లో నటించినా గుర్తింపు రాలేదు. భారీ తారాగణంతో గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కుతున్న నమ్మవీట్టు పిళ్లై చిత్రంపై కోలీవుడ్‌లో మంచి అంచనాలే నెలకొన్నాయని చెప్పవచ్చు. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ సంస్థ ఈ నెలలోనే తెరపైకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తాజా సమాచారం. View this post on Instagram Wrap! for #nammaveettupillai See you in theatres very soon 🤗 A post shared by Anu Emmanuel (@anuemmanuel) on Sep 6, 2019 at 11:17pm PDT -
ఎంజీఆర్ టైటిల్‌తో శివకార్తికేయన్
తమిళసినిమా: నటుడు శివకార్తికేయన్ చిత్రానికి ఎంజీఆర్ చిత్ర టైటిల్‌ను నిర్ణయించినట్లు తాజా సమాచారం. శివకార్తికేయన్ ఇటీవల నటించిన మిస్టర్‌లోకల్ చిత్రం ఆయన్ని కాస్త నిరాశపరిచింది. అయితే నిర్మాతగా కనా, నెంజముండు నేర్మైయుండు ఓడు రాజా చిత్రాలు మంచి విజయాన్ని సాధించాయి. కాగా ప్రస్తుతం హీరోగా నటిస్తున్న చిత్రాలు మూడు ఉన్నాయి. అందులో ఒకటి శివకార్తికేయన్ 16 పేరుతో నిర్మాణంలో ఉంది. పాండిరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నటి అనూఇమ్మానువేల్ నటిస్తోంది. కాగా నటి ఐశ్వర్యరాజేశ్, దర్శకుడు భారతీరాజా, సముద్రకని, సూరి,యోగిబాబు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధిమారన్ నిర్మిస్తున్న ఈ భారీ చిత్రానికి నీరవ్‌షా ఛాయాగ్రహణం, డీ.ఇమాన్ సంగీతాన్ని అందిస్తున్నారు. తాజా సమాచారం ఏమిటంటే ఈ చిత్రానికి ఎంజీఆర్ నటించిన సూపర్‌హిట్ చిత్ర టైటిల్ ఎంగ వీట్టు పిళ్లైను నిర్ణయించినట్లు తెలిసింది. ఈ టైటిల్ ప్రముఖ నిర్మాణ సంస్థ విజయా ప్రొడక్షన్స్ వారికి చెందింది. కాగా ఆ సంస్థ శివకార్తికేయన్ చిత్రానికి ఇవ్వడానికి సుముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. కాగా శివకార్తికేయన్ ఈ చిత్రంతో పాటు ఆర్.రవికుమార్ దర్శకత్వంలో ఒక సైంటిఫిక్ చిత్రాన్ని, దర్శకుడు పీఎస్.మిత్రన్ దర్శకత్వంలో హీరో అనే చిత్రంలోనూ నటిస్తున్నారు. మరో ముఖ్య విషయం ఏమిటంటే తాజాగా ఈ యువ హీరో టాలీవుడ్‌కు పరిచయం కానున్నారు. ఆయన తమిళంలో సొంతంగా నిర్మించి, అతిథి పాత్రలో నటించిన కనా చిత్రం మంచి విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. కాగా ఈ చిత్రం ఇప్పుడు కన్నడం, తెలుగు భాషల్లోనూ రీమేక్ అవుతోంది. తమిళంలో కథానాయకిగా నటించిన నటి ఐశ్వర్యరాజేశ్‌నే తెలుగులోనూ నటిస్తుండగా, అతిథిపాత్రలో శివకార్తికేయనే నటిస్తున్నారు. -
‘హీరో’గా మారుతున్న శివకార్తికేయన్
హీరోగా మారుతున్న శివకార్తికేయన్ అనగానే ఆశ్చర్యపడుతున్నారా? ఆయన ఎప్పుడో స్టార్ హీరోగా అయితే ఇప్పుడు హీరో అవ్వడం ఏమిటి? అనే డౌట్ ఎవరికైనా వస్తుంది. అసలు విషయం ఏమిటంటే శివకార్తికేయన్ నటిస్తున్న తాజా చిత్రానికి హీరో అనే టైటిల్‌ను నిర్ణయించా రు. ఇందులో నటుడు అర్జున్ ప్రధాన పాత్రను పోషించనుండడం విశేషం. నటి కల్యాణి ప్రియదర్శన్ ఈ చిత్రం ద్వారా కోలీవుడ్‌కు ఎంట్రీ ఇస్తున్నారు. కేజేఆర్ ఫిలింస్ పతాకంపై కోటపాటి జే.రాజేశ్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఇరుంబుదురై ఫేం మిత్రన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ హీరో చిత్రం బుధవారం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత కోటపాటి జే. రాజేశ్ మాట్లాడుతూ కేజేఆర్ ఫిలింస్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మించడం సంతోషంగా ఉందన్నారు. ప్రతిభావంతులైన యూనిట్‌తో చిత్రం చేయడం మరింత ఆనందంగా ఉందన్నారు. నటుడు శివకార్తికేయన్ కమర్షియల్ అంశాలతో కూడిన వైవిధ్యభరిత కథా చిత్రాలను ఎంపిక చేసుకుని నటించడం వల్లే ఆయన నటుడిగా ఈ స్థాయికి చేరారన్నారు. అదే విధంగా ఈ హీరో చిత్రం కూడా అలాంటి కమర్శియల్ అంశాలతో కూడిన చిత్రంగా ఉంటుందన్నారు. ఇక యాక్షన్ కింగ్ అర్జున్‌తో చిత్రం చేయాలన్నది తన చిరకాల కోరిక ఈ చిత్రంతో నెరవేరడం సంతోషంగా ఉందన్నారు. ఇక నటి కల్యాణి ప్రియదర్శన్ వంటి ప్రతిభావంతులైన యువ నటీనటులు ఈ చిత్రానికి అదనపు మైలేజ్‌ను ఇస్తారని అన్నారు. దర్శకుడు మిత్రన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని, ఆయన తొలి చిత్రంతోనే అద్భుతమైన ప్రతిభను చాటుకున్నారని అన్నారు. ఆయన కథ చెప్పడానికి వచ్చినప్పుడు గత చిత్ర కథా ఛాయలేమైనా ఉంటాయేమోనని అనుకున్నానని, అలాంటి ఛాయలే లేకుండా పూర్తిగా భిన్నంగా చాలా కొత్త కోణంలో కథను చెప్పారని అన్నారు. ఈ సినిమాకు యువన్‌శంకర్‌రాజా సంగీతాన్ని, జార్జ్ సి.విలియమ్స్ ఛాయాగ్రహణం అందిస్తున్నారు. ఇకపోతే శివకార్తికేయన్ నయనతారతో కలిసి రాజేశ్.ఎం దర్శకత్వంలో స్టూడియోగ్రీన్ సంస్థ నిర్మిస్తున్న మిస్టర్ లోకల్ చిత్రాన్ని పూర్తి చేశారు. ఈ చిత్రం మేడే రోజున విడుదలకు ముస్తాబవుతోంది. ప్రస్తుతం తన 14వ చిత్రంగా రవికుమార్ దర్శకత్వంలో సోషియో ఫాంటసీ కథా చిత్రంలో నటిస్తున్నారు. ఆ చిత్రం పూర్తి అయిన తరువాత హీరో చిత్ర షూటింగ్లో పాల్గొంటారు. -
విజయ్ దేవరకొండకు టైటిల్ కష్టాలు
టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ తాజాగా ఓ కొత్త సినిమాను ప్రకటించాడు. తమిళ దర్శకుడు ఆనంద్ అన్నామలై దర్శకత్వంలో ఓ బహు భాషా చిత్రం చేస్తున్నట్టుగా ప్రకటించాడు విజయ్. తెలుగు, తమిళ, మళయాల, కన్నడ భాషల్లో ఒకేసారి తెరకెక్కనున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ భారీ చిత్రానికి హీరో అనే టైటిల్‌ను కూడా ప్రకటించారు. అయితే అదే ‘హీరో’ టైటిల్‌తో తమిళ హీరో శివకార్తికేయన్ బుధవారం ఓ సినిమాను ప్రారంభించారు. పీయస్ మిత్రన్ దర్శకత్వంలో శివకార్తికేయన్, కల్యాణీ ప్రియదర్శన్ హీరో హీరోయిన్లుగా ఈ సినిమా తెరకెక్కుతోంది. దీంతో విజయ్ సినిమాకు టైటిల్ సమస్య ఏర్పడింది. శివకార్తికేయన్ సినిమా యూనిట్ తమిళ నిర్మాతల మండలిలో టైటిల్ తాము రిజిస్టర్ చేసుకున్నట్టుగా సాక్ష్యాలను కూడా బయటపెట్టింది. షూటింగ్ ప్రారంభం కావటంతో ఆ సినిమానే ముందుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ పరిస్థితుల్లో విజయ్ తన సినిమా తమిళ వర్షన్ టైటిల్‌పై ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు అన్నది మాసక్తికరంగా మారింది. -
శివకార్తికేయన్‌తో ‘హలో’ బ్యూటీ
తమిళసినిమా: నటుడు శివకార్తీకేయన్‌తో ప్రముఖ దర్శకుడి వారసురాలు జత కట్టే అవకాశాన్ని దక్కించుకుందా? దీనికి అలాంటి అవకాశం ఉందనే ప్రచారం కోలీవుడ్‌లో జరుగుతోంది. నటుడు శివకార్తీకేయన్ వరుస విజయాలతోనే కాదు, చేతి నిండా చిత్రాలతోనూ బిజీగా ఉన్నారు. ఈయన ప్రస్తుతం నటిస్తున్న మిస్టర్ లోకల్ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు చివరి దశకు చేరుకున్నాయి. ఈ చిత్రం మే 1వ తేదీన విడుదల కానుంది. ఇది ఆయన 13వ చిత్రం. కాగా 14వ చిత్రంగా ఇండ్రు నేట్రు నాలై చిత్రం ఫేమ్ రవికుమార్ దర్శకత్వంలో నటించనున్నారు. ఇందులో నటి రకుల్‌ప్రీత్‌సింగ్ నాయకిగా నటించనుంది. దీని తరువాత ఇరుంబుతిరై చిత్రం ఫేమ్ పీఎస్.మిత్రన్ దర్శకత్వంలో నటించడానికి పచ్చజెండా ఊపారు. ఇది శివకార్తీకేయన్‌కు 15 చిత్రం అవుతుంది. ఇందులో వర్థమాన నటి కల్యాణికి హీరోయిన్ ఛాన్స్ వచ్చినట్లు సమాచారం. దీని గురించి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉందన్నది గమనార్హం. ఈమె ప్రముఖ దర్శకుడు ప్రియదర్శన్ కూతురన్నది గమనార్హం. ఇప్పటికే తెలుగులో అఖిల్ సరసన హలో అనే చిత్రంలో నటించిన ఈ బ్యూటీ మరో తెలుగు చిత్రంలో శర్వానంద్‌తో నటిస్తోంది. అదే విధంగా మలయాళంలో రెండు చిత్రాలు, తమిళంలో వాన్ అనే మరో చిత్రంలోనూ నటిస్తోంది. అయితే ఇంకా ఈ బ్యూటీ నటించిన ఒక్క చిత్రం కూడా తెరపైకి రాలేదు. -
నయన్ టైమ్!
నయనతార అగ్రనటి, లేడీ సూపర్‌స్టార్, ఇంకా చెప్పాలంటే సంచలన నటి కూడా. ఆమెలో మరో కోణం కూడా ఉంది. నయనతార తాను నటించిన చిత్రాల ప్రమోషన్‌కు కూడా రాదు గానీ, చిత్ర యూనిట్‌కు మాత్రం నయనతార అంటే చాలా సాఫ్ట్‌కార్నరే ఉంటుంది. అందుకు కారణం తను నటించే చిత్రం షూటింగ్ పూర్తి కాగానే యూనిట్‌లోని వారందరికీ మంచి కానుకలను అందించే సత్సంప్రదాయాన్ని నయనతార పాటిస్తుంది. ఇది సినీ వర్గాల్లో చాలా అరుదుగానే జరుగుతుంది. అప్పట్లో మహానటి సావిత్రి ఈ పని చేసేవారట. ఇక ఇటీవల నటుడు విజయ్ ఇలాంటి సంప్రదాయాన్ని కొనసాగిస్తుంటారు. అజిత్ అయితే మంచి బిరియానీ విందునిస్తుంటారు. ఆ మధ్య నటి మహానటి చిత్ర షూటింగ్ పూర్తి అయిన తరువాత నటి కీర్తీసురేశ్ కూడా చిత్ర యూనిట్‌కు కానుకలను అందించింది. నటి నయనతార తన ప్రతి చిత్రానికి ఇలాంటి ఏదో రకమైన కానుకలను యూనిట్ వారికి ఇచ్చి వారిని సంతృప్తి పరుస్తుంటుంది. తాజాగా ఈ బ్యూటీ శివకార్తి కేయన్కు జంటగా నటిస్తున్న మిస్టర్ లోకల్ చిత్ర షూటింగ్ గత నెల 6వ తేదీతో పూర్తి అయ్యింది. దీంతో నయనతార యూనిట్‌లోని వారందరికీ మంచి ఖరీదైన వాచ్‌లను కానుకగా అందించారట. దీంతో మిస్టర్ లోకల్ చిత్ర యూనిట్ అంతా ఆనందంలో పడిపోయారు. అలా ఆ రోజు నయనతార టైమ్‌గా మారింది. స్టూడియోగ్రీన్ స్టూడియో పతాకంపై కేఈ. జ్ఞానవేల్‌రాజా నిర్మిస్తున్న మిస్టర్ లోకల్ చిత్రం సమ్మర్ స్పెషల్‌గా తెరపైకి రావడానికి ముస్తాబుతోంది. -
‘సీమరాజా’ మూవీ స్టిల్స్
-
యంగ్ హీరో సరసన నయన్!
తమిళసినిమా: దసరా, దీపావళి, సంక్రాంతి మాదిరిగానే సమ్మ ర్ కూడా సినిమా వాళ్లకు పండగే. విద్యార్థులకు పాఠశాలలు, కళాశాలలు సెలవులు కావడంతో ఆ సమయాల్లో చిత్రాల విడుదలకు దర్శక, నిర్మాతలు పోటీ పడుతుంటా రు. అలా సమ్మర్‌కు బరిలోకి దిగడానికి శివకార్తీకేయన్ మిస్టర్‌లోకల్ చిత్రం రెడీ అవుతోంది. సీమరాజా చిత్రం తరువాత ఈ సక్సెస్ఫుల్ నటుడు నటిస్తున్న చిత్రానికి మిస్టర్‌లోకల్ అనే టైటిల్‌ను చిత్ర వర్గాలు అధికారికపూర్వంగా ఖరారు చేశారు. సాధారణంగా చిత్రాలకు టైటిల్స్ చాలా హెల్ప్ అవుతాయి. అందుకే అటు కథను నప్పేలా, అదే సమయంలో ప్రేక్షకుల్లోకి ఈజీగా వెళ్లేలా టైటిల్స్‌ను నిర్ణయించుకుంటారు. అయితే అవి అందరికీ, అన్నిసార్లు కరెక్ట్‌గా సరిపడేలా అమరవు. నటుడు శివకార్తీకేయన్‌కు మాత్రం ఇప్పటి వరకూ తన ఇమేజ్‌కు సరిపడేవి, కథకు నప్పేవే అమిరాయనే చెప్పాలి. అదే విధంగా దర్శకుడు రాజేశ్.ఎం చిత్రాల టైటిల్స్ చర్చనీయాంశంగా ఉంటాయి. ఇక స్టూడియోగ్రీన్ అధినేత కేఈ.జ్ఞానవేల్‌రాజా తన చిత్రాలకు జనాకర్షకమైన పేర్లను ఎంచుకుంటారన్న పేరు ఉంది. ఇప్పుడు ఈ ముగ్గురి కాంబినేషన్లో వస్తున్న చిత్రమే మిస్టర్ లోకల్. ఈ చిత్రం కోసం పలు పేర్లను పరిశీలించి చివరకు మిస్టర్ లోకల్ పేరును ఎంపిక చేశారు. ఈ చిత్ర ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ సోమవారం విడుదల చేశారు. నటుడు శివకార్తీకేయన్ తెరపై నటించే పవర్ఫుల్ నటన పాజిటివ్‌గా ఉంటుంది. అది చూసినప్పుడు దర్శకుడికి ఆయనతో పోటీ పడాలనే అసక్తి కలుగుతుంది అని అన్నారు దర్శకుడు రాజేశ్.ఎం. ఇక ఇందులో అదనపు ఆకర్షణ ఏమిటంటే అగ్రనటి నయనతార నాయకి కావడం. ఆమె తెరపై అద్భుతాలు చేస్తున్నారు. నిర్మాత జ్ఞానవేల్‌రాజా ప్రోత్సాహం యూనిట్‌కు ఎంతగానో సహకరిస్తోందని అన్నారు. ఫుల్ మాస్ ఎంటర్టెయినర్గా తెరకెక్కుతున్న ఈ చిత్ర షూటింగ్ చివరి దశకు చేరుకుంది. మరో పక్క పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. సమ్మర్ స్పెషల్‌గా మిస్టర్ లోకల్ చిత్రం ప్రేక్షకులను అలరించడానికి వస్తుందని దర్శకుడు తెలిపారు. -
‘సీమరాజా’ ట్రైలర్ విడుదల
రెమో సినిమాతో తెలుగుకు పరిచయమైన శివ కార్తీకేయన్.. సీమరాజాతో మరోసారి టాలీవుడ్‌ను పలకరించేందుకు రెడీ అయ్యాడు. తమిళనాటు స్టార్ హీరోగా ఎదుగుతున్న ఈ హీరో.. అక్కడ సీమరాజాతో మంచి హిట్‌ను కొట్టాడు. అదే పేరుతో ప్రస్తుతం తెలుగులోకి డబ్ చేసి విడుదల చేస్తున్నారు. సమంత, కీర్తి సురేష్‌లు కథానాయికలుగా నటిస్తుండటంతో ఈ చిత్రంపై అందరి దృష్టి నెలకొంది. ఈ మూవీ ట్రైలర్‌ను చిత్రబృందం ఈరోజు విడుదల చేసింది. ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంది. పొన్రామ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా.. ఇమ్మాన్ సంగీతాన్ని అందించారు. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 8న విడుదల చేస్తున్నారు. Telugu Trailer of #Seemaraja@Siva_Kartikeyan @24AMSTUDIOS #SaiKrishnaFilms #SaiKrishnaPendyala @immancomposer @Samanthaprabhu2@KeerthyOfficial @sooriofficial @balasubramaniem @vivekharshan #SeemaRajaOn8thFeb #SeemaRajaAudioLaunch pic.twitter.com/KV3F6aQfuG — BARaju (@baraju_SuperHit) February 3, 2019 -
‘సీమరాజా’ వస్తున్నాడు!
తమిళ నాట క్రేజీ హీరోగా మారుతున్నాడు శివ కార్తికేయన్. ‘రెమో’ సినిమాతో టాలీవుడ్‌ను పలకరించిన ఈ హీరో.. ఆ చిత్రంతో పర్వాలేదనిపించాడు. తమిళనాట ‘సీమరాజా’గా హిట్ కొట్టిన ఈ హీరో... ఇక్కడి ప్రేక్షకులను పలకరించేందుకు సిద్దమయ్యాడు. ‘సీమరాజా’గా ఈ చిత్రాన్ని తెలుగులో డబ్ చేసేందుకు రంగం సిద్దమైంది. ఫిబ్రవరి 3న ఆడియోను .. ఫిబ్రవరి 8న సినిమాను రిలీజ్ చేయబోతున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. కీర్తి సురేష్, సమంతలాంటి స్టార్ హీరోయిన్స్ ఉండటంతో ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. పొన్రాం దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి ఇమ్మాన్ సంగీతం అందించారు. -
దంగల్‌లా హిట్టవ్వాలి!
కోలీవుడ్ మూవీ కనా హిందీ చిత్రం దంగల్‌లా విజయం సాధించాలని కోరుకుంటున్నట్లు నటుడు సత్యరాజ్ అన్నారు. ప్రస్తుతం తమిళం, తెలుగు భాషల్లో ఏ చిత్రం చూసినా సత్యరాజ్ కనిపిస్తున్నారు. కథకు బలాన్ని చేకూర్చే పాత్రల్లో నటిస్తున్న సత్యరాజ్ తాజాగా కనా చిత్రంలో కీలక పాత్రను పోషించారు. నటుడు శివకార్తికేయన్ నిర్మాతగా మారి నిర్మిస్తున్న ఈ మూవీలో ఐశ్వర్యరాజేశ్ కథానాయకిగా నటించింది. మరో ముఖ్య పాత్రలో శివకార్తికేయన్ నటించిన ఈ చిత్రానికి అరుణ్రాజా కామరాజా దర్శకత్వం వహించారు. ఈ సినిమా మహిళా క్రికెట్ నేపథ్యంలో తెరకెక్కింది. వ్యవసాయానికి సంబంధించిన అంశం కూడా ప్రధానంగా ఉంటుంది. కనా చిత్రం ఈ నెల 21న తెరపైకి రానుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ శుక్రవారం సాయంత్రం చెన్నైలోని ప్రసాద్‌ల్యాబ్‌లో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నటుడు సత్యరాజ్ మాట్లాడుతూ చిత్రం బాగుంటే ప్రేక్షకులే విజయతీరాలకు చేరుస్తారన్నారు. క్రికెట్ గురించి తెలియకపోయినా నటి ఐశ్వర్యరాజేశ్ అందులో శిక్షణ తీసుకుని నటించడం సవాల్‌తో కూడిన విషయం అన్నారు. అందుకు ఆమె చాలా శ్రమించారని అన్నారు. క్రీడా నేపథ్యంతో కూడిన చిత్రాలు ఏ భాషలోనైనా విజయం సాధిస్తాయని, అలా ఈ కనా చిత్రం హిందీ చిత్రం దంగల్‌లా విజయం సాధించాలని కోరుకుంటున్నానని సత్యరాజ్ అన్నారు. ఆయన్ని తండ్రి స్థానంలో చూస్తున్నా.. చిత్ర కథానాయకి ఐశ్వర్యరాజేశ్ మాట్లాడుతూ అందరూ చెప్పినట్లు ప్రతి చిత్రానికి కఠినంగా శ్రమించాలనే కోరుకుంటానని అంది. అలా ఈ చిత్రంలో తాను శ్రమించి నటించడానికి దర్శకుడు అరుణ్రాజా కామరాజా, ఇతర యూనిట్ సహకారం అందించి ప్రోత్సహించారన్నారు. తన తండ్రి ఉండి ఉంటే నటుడు సత్యరాజ్ లాగే ప్రోత్సహించేవారని, అందుకే సత్యరాజ్‌ను తన తండ్రి స్థానంలో చూసుకుంటున్నానని పేర్కొంది. చిత్ర హీరో దర్శన్ అందరికీ నచ్చే నటుడిగా ఎదుగుతారని కితాబిచ్చింది. కనా చిత్రం కోలీవుడ్‌లో ఒక ముఖ్యమైన చిత్రంగా నిలిచిపోతుందనే అభిప్రాయాన్ని ఐశ్వర్యరాజేశ్ వ్యక్తం చేసింది. -
‘గెలిస్తేనే.. నీ గొంతు వినబడుతుంది’
కోలీవుడ్‌లో వరుస విజయాలతో దూసుకుపోతున్న యంగ్ హీరో శివ కార్తికేయన్ తొలిసారిగా నిర్మాతగా మారి తెరకెక్కిస్తున్న సినిమా ‘కనా’. మహిళా క్రికెటర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాతో అరున్ రాజ కామరాజ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఐశ్వర్యా రాజేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయ్యింది. ఓ గ్రామిణా ప్రాంతంలో పెరిగిన అమ్మాయి జాతీయ స్థాయి క్రికెటర్‌గా ఎలా ఎదిగింది. ఈ ప్రయాణంలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంది అన్న నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాను డిసెంబర్లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. -
ఎంత నమ్మకమో!
తమిళసినిమా: తక్కువ చిత్రాలతోనే ఎక్కువ పేరు తెచ్చుకున్న నటి సమంత. అంతే కాదు కన్న కలల్ని, కోరుకున్న వాటిని సాధించుకున్న నటి ఈ బ్యూటీ. సమంతలో ఆత్మ విశ్వాసం అధికం కావడానికి ఇవన్నీ కారణం కావచ్చు. చెన్నై పుట్టినిల్లు, హైదరాబాద్‌ను మెట్టినిల్లు చేసుకుని నటిగానూ, అర్థాంగిగానూ ఫుల్‌గా ఎంజాయ్ చేస్తున్న సమంత లాంటి వారు అరుదనే చెప్పాలి. వివాహానంతరం అగ్రనటిగా రాణిస్తున్న ఈ అమ్మడు వరుస విజయాలను అందుకుంటున్నారు. తెలుగుతో పాటు తమిళంలోనూ ఈ సుందరికి పిచ్చ పాపులారిటీ ఉంది. అందుకే తమిళం, తెలుగు భాషల్లో తెరకెక్కుతున్న యూ టర్న్ చిత్రంలో నటిస్తున్నారు. ఈమెను హీరోయిన్ ఓరియంటెడ్ చిత్రాల నాయకిగా ప్రమోట్ చేసిన చిత్రం ఇదే. కన్నడంలో సంచలన విజయాన్ని సాధించిన యూ టర్న్ చిత్రానికి ఇది రీమేక్. తమిళంలో శివకార్తికేయన్‌కు జంటగా సీమరాజా చిత్రంలోనూ సమంత నాయకిగా నటిస్తున్నారు. ఇంతకుముందు సమంత నటించిన నడిగైయార్ తిలగం (తెలుగులో మహానటి), విశాల్‌కు జంటగా నటించిన ఇరుంబుతిరై ఒకే రోజు విడుదలయ్యాయి. ఆ రెండు చిత్రాలు విశేష ప్రేక్షకాదరణను పొందాయి. తాజాగా అలాంటి పరిస్థితి రిపీట్ కానుంది. సమంత నటించిన యూ టర్న్, సీమరాజా చిత్రాలు రెండూ సెప్టెంబరు 13న తెరపైకి రానున్నాయి. యూటర్న్ చిత్రంలో సమంత పత్రికా విలేకరిగా నటించారు. సీమరాజా గ్రామీణ నేపథ్యంలో సాగే కథా చిత్రం. ఈ రెండు చిత్రాలు ఒకే రోజున తెరపైకి రానుండటం గురించి సమంత ఏమంటున్నారో చూద్దాం. యూ టర్న్, సీమరాజా రెండూ వేర్వేరు కథాంశాలతో కూడిన చిత్రాలు. యూ టర్న్ ఒక హత్య నేపథ్యంతో కూడిన కథా చిత్రం. సీమరాజా గ్రామీణ నేపథ్యంతో సాగే కథా చిత్రం. కాబట్టి రెండు చిత్రాలను ప్రేక్షకులు ఆదరిస్తారని పేర్కొన్నారు. ఈ రెండు చిత్రాలపై ఎంత నమ్మకం లేకపోతే సమంత అంతగా చెబుతారు. ఈ బ్యూటీ నమ్మకం వమ్ము కాకూడదని కోరుకుందాం. -
ఎస్–13కి యువ సంగీత దర్శకుడు
తమిళసినిమా: సినిమాకు కథ తరువాత సంగీతం అంత బలంగా మారిందన్నది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా పాటలు హిట్ అయితే సినిమా సగం హిట్ అయినట్టే. అందుకే సంగీతానికి ప్రాధాన్యత ఉంటుంది. ఇకపోతే వరుస విజయాలతో దూసుకుపోతున్న యువ నటుడు శివకార్తీకేయన్ సీమరాజా చిత్రాన్ని పూర్తి చేసి తాజా చిత్రానికి రెడీ అయ్యారు. ఇది ఆయన 13వ చిత్రం. అందుకే ఎస్కే– 13గా పేరుతో ఈ చిత్రాన్ని స్టూడియోగ్రీన్ పతాకంపై నిర్మాత కేఈ జ్ఞానవేల్‌రాజా నిర్మిస్తున్నారు. రాజేశ్ ఎం దర్శకత్వం విహిస్తున్న చిత్రంలో అగ్రనటి నయనతార నాయకిగా నటిస్తున్నారు. వేలైక్కారన్ వంటి విజయవంతమై చిత్రం తరువాత ఈ జంట కలిసి నటిస్తున్న రెండవ చిత్రం ఇది. కాగా ఇప్పుటికే చిత్రీకరణలో ఉన్న ఈ చిత్రానికి నటీనటులతో పాటు సాంకేతిక వర్గం ఎంపిక పూర్తైంది. సంగీత దర్శకుడిగా హిప్ హాప్ తమిళ సంగీత బాణీలు కడుతున్నారు. చిత్ర నిర్మాత కేఈ జ్ఞానవేల్‌రాజా మాట్లాడుతూ ఈ తరం యువ నాడి తెలిసిన సంగీత దర్శకుడిని ఎంపిక చేయాలన్న విషయంలో స్పష్టంగా ఉన్నామన్నారు. అందుకే హిప్ హాప్ తమిళాను ఎంపిక చేశామని చెప్పారు. హీరో, దర్శకత్వం, సంగీతం అంటూ బిజీగా ఉన్న ఆయన తమ చిత్రానికి సమయాన్ని కేటాయిస్తారా? అన్న సంశయంతోనే ఆయన్ని సంప్రదించామన్నారు. అయితే కథ విన్న వెంటనే హిప్ హాప్ తమిళా సంగీతాన్ని అంగీకరించారని తెలిపారు. శివకార్తీకేయన్, నయనతార జంటను కుటుంబ సమేతంగా చిత్రం చూసే ప్రేక్షకులు అధికం అన్నారు. వారికి హిప్హాప్ తమిళా జోడైతే చిత్ర విజయం తథ్యమన్నారు. అన్ని వర్గాల వారిని సంతృప్తి పరచే దర్శకుడు రాజేశ్ ఈ చిత్రానికి దర్శకుడు కావడంతో జనరంజక చిత్రం అవుతుందని కచ్చితంగా చెప్పగలనని నిర్మాత పేర్కొన్నారు. -
కాబోయే భర్త ఎలా ఉండాలంటే..
తమిళసినిమా: తనకు కాబోయే భర్త ఎలా ఉండాలంటే అంటూ మొదలెట్టింది నటి రకుల్‌ప్రీత్‌సింగ్. ఉత్తరాది నుంచి దక్షిణాదికి వచ్చి కథానాయకిగా రాణిస్తున్న భామల్లో ఈ బ్యూటీ ఒకరు. నిన్నటి వరకూ టాలీవుడ్లో అగ్ర నటిగా వెలిగిన ఈ అమ్మడు ఇప్పుడు పూర్తిగా కోలీవుడ్‌నే నమ్ముకుంది. కారణం తెలుగు చిత్ర పరిశ్రమ ఎందుకనో కాస్త దూరంగా పెట్టింది. అయితే మళ్లీ అక్కడ పుంజుకునే ప్రయత్నం చేస్తోందనుకోండి. ఎన్టీఆర్ బయోపిక్‌లో శ్రీదేవి పాత్రలో మెరవనుందనే ప్రచారం జోరందుకుంది. ఇకపోతే తమిళంలో ప్రస్తుతం చేతిలో మూడు చిత్రాలున్నాయి. వాటిలో సూర్యతో జతకట్టిన ఎన్జీకే చిత్ర షూటింగ్ పూర్తి అయ్యింది. దీపావళికి తెరపైకి రావడానికి రెడీ అవుతోంది. ప్రస్తుతం కార్తీకి జంటగా ఒక చిత్రం, శివకార్తికేయన్‌తో చేస్తున్న చిత్రాలు షూటింగ్ దశలో ఉన్నాయి. వీటితో పాటు ఒక హింది చిత్రంలోనూ నటిస్తోంది. ఇటీవల ఈ అమ్మడు ఒక భేటీలో మాట్లాడుతూ కొందరు నటీమణులు సినిమారంగంలో నటీమణులకు రక్షణ లేని పరిస్థితి అని అంటున్నారని, అయితే తాను మాత్రం అలా భావించడం లేదని అంది. తనతో అందరూ మంచి మిత్రులానే ప్రవర్తిస్తున్నారని చెప్పింది. అదే విధంగా పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు. ఎలాంటి భర్త కావాలని కోరుకుంటున్నారు అని చాలా మంది అడుగుతున్నారని అంది. నన్ను పెళ్లి చేసుకోబోయే వాడు పేదవాడైనా పర్వాలేదు గానీ, మంచి మనసున్నోడై ఉండాలని, నన్ను ప్రేమించేవాడై ఉండాలని చెప్పింది. ముఖ్యంగా తన ఎత్తు 5అడుగులని, అతను కనీసం 6 అడుగులవాడైనా అయి ఉండాలని రకుల్ పేర్కొంది. ఇంతకీ పెళ్లి ఎప్పుడన్న ప్రశ్నకు అయినప్పుడే అంటూ సమాధానాన్ని దాటేసింది. -
నయనతారే కావాలని పట్టు..
తమిళసినిమా: అగ్రనటి నయనతార మరోసారి శివకార్తికేయన్‌తో రొమాన్స్ చేయడానికి రెడీ అవుతోంది. సంచలన నటి నయనతార అరమ్ చిత్రం తరువాత లేడీ సూపర్‌స్టార్ పట్టంతో వెలిగిపోతున్న విషయం తెలిసిందే. అంతేకాదు తమిళం, తెలుగు అంటే చేతి నిండా చిత్రాలతో బిజీగా ఉంది. ఈ సంచలన నటి నటించిన కొలమావు కోకిల చిత్రం త్వరలో తెరపైకి రానుంది. ఆ తరువాత ఇమైకా నోడిగళ్ విడుదలకు సిద్ధం అవుతోంది. ప్రస్తుతం అజిత్‌కు జంటగా విశ్వాసం, తెలుగులో చిరంజీవి సరసన సైరా నరసింహారెడ్డి చిత్రాల్లో నటిస్తున్న నయనతార త్వరలో కమల్ సరసన ఇండియన్–2లో నటించనుంది. తాజా సమాచారం ఏమిటంటే వేలైక్కారన్ చిత్రం తరువాత శివకార్తికేయన్‌తో మరోసారి రొమాన్స్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. శివకార్తికేయన్ సీమరాజా చిత్రాన్ని పూర్తి చేశారు. ఇందులో సమంత నాయకి. ప్రస్తుతం రవికుమార్ దర్శకత్వంలో నటిస్తున్నారు. ఈ చిత్రంతో పాటు రాజేశ్.ఎం దర్శకత్వంలోనూ నటించనున్నారు. దీన్ని స్టూడియోగ్రీన్ పతాకంపై జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ప్రారంభోత్సవం ఇటీవల జరిగింది. ఇందులో నటి సాయిపల్లవిని కథానాయకిగా ఎంపిక చేశారు. అయితే శివకార్తికేయన్ సాయిపల్లవిని వద్దన్నట్లు, నయనతారే కావాలని పట్టు పట్టినట్లు సినీ వర్గాల టాక్. రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవా అన్న సామెతలా హీరో కోరితే అదీ వరుస విజయాలతో హైప్లో ఉన్న శివకార్తికేయన్ కోరితే జరిగి తీరాల్సిందే. అలా మొత్తం మీద నయనతారనే నిర్మాతలు ఎంపిక చేశారు.ఈ విషయాన్ని శివకార్తికేయన్‌తో రెమో, వేలైక్కారన్ వంటి విజయవంతమైన చిత్రాలను నిర్మించిన, ప్రస్తుతం ఆదే హీరోతో సీమరాజా చిత్రాన్ని నిర్మిస్తున్న నిర్మాత ఆర్డీ.రాజా తన ట్విట్టర్లో పేర్కొన్నారు. అందులో ఆయన శివ, రాజేశ్, సతీష్‌లకు శుభాకాంక్షలు అని పొందుపరిచారు.