
తమిళసినిమా: అగ్రనటి నయనతార మరోసారి శివకార్తికేయన్‌తో రొమాన్స్ చేయడానికి రెడీ అవుతోంది. సంచలన నటి నయనతార అరమ్ చిత్రం తరువాత లేడీ సూపర్‌స్టార్ పట్టంతో వెలిగిపోతున్న విషయం తెలిసిందే. అంతేకాదు తమిళం, తెలుగు అంటే చేతి నిండా చిత్రాలతో బిజీగా ఉంది. ఈ సంచలన నటి నటించిన కొలమావు కోకిల చిత్రం త్వరలో తెరపైకి రానుంది. ఆ తరువాత ఇమైకా నోడిగళ్ విడుదలకు సిద్ధం అవుతోంది. ప్రస్తుతం అజిత్‌కు జంటగా విశ్వాసం, తెలుగులో చిరంజీవి సరసన సైరా నరసింహారెడ్డి చిత్రాల్లో నటిస్తున్న నయనతార త్వరలో కమల్ సరసన ఇండియన్–2లో నటించనుంది. తాజా సమాచారం ఏమిటంటే వేలైక్కారన్ చిత్రం తరువాత శివకార్తికేయన్‌తో మరోసారి రొమాన్స్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
శివకార్తికేయన్ సీమరాజా చిత్రాన్ని పూర్తి చేశారు. ఇందులో సమంత నాయకి. ప్రస్తుతం రవికుమార్ దర్శకత్వంలో నటిస్తున్నారు. ఈ చిత్రంతో పాటు రాజేశ్.ఎం దర్శకత్వంలోనూ నటించనున్నారు. దీన్ని స్టూడియోగ్రీన్ పతాకంపై జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ప్రారంభోత్సవం ఇటీవల జరిగింది. ఇందులో నటి సాయిపల్లవిని కథానాయకిగా ఎంపిక చేశారు. అయితే శివకార్తికేయన్ సాయిపల్లవిని వద్దన్నట్లు, నయనతారే కావాలని పట్టు పట్టినట్లు సినీ వర్గాల టాక్. రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవా అన్న సామెతలా హీరో కోరితే అదీ వరుస విజయాలతో హైప్‌లో ఉన్న శివకార్తికేయన్ కోరితే జరిగి తీరాల్సిందే. అలా మొత్తం మీద నయనతారనే నిర్మాతలు ఎంపిక చేశారు.ఈ విషయాన్ని శివకార్తికేయన్‌తో రెమో, వేలైక్కారన్ వంటి విజయవంతమైన చిత్రాలను నిర్మించిన, ప్రస్తుతం ఆదే హీరోతో సీమరాజా చిత్రాన్ని నిర్మిస్తున్న నిర్మాత ఆర్‌డీ.రాజా తన ట్విట్టర్‌లో పేర్కొన్నారు. అందులో ఆయన శివ, రాజేశ్, సతీష్‌లకు శుభాకాంక్షలు అని పొందుపరిచారు.
Comments
Please login to add a commentAdd a comment