Nayanthara
-
Recap 2024: ఈ ఏడాది ఫ్యాన్స్‌ను నిరాశపరిచిన హీరోయిన్స్ వీళ్ళే..!
దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అన్నది సామెత. చిత్ర పరిశ్రమలో నటీనటులకు ఈ సామెత బాగా వర్తిస్తుంది. క్రేజ్ ఉన్నప్పుడే వరుసగా సినిమాలు చేసి అటు ప్రేక్షకుల మనసుల్లో సుస్థిర స్థానం సంపాదించడంతో పాటు ఇటు బ్యాంక్ బ్యాలెన్స్‌లు కూడా పెంచుకోవాలి. అయితే పలువురు హీరోయిన్లు 2024ని మిస్ అయ్యారు. వారు నటించిన ఒక్క సినిమా కూడా ఈ ఏడాది విడుదల కాకపోవడం విశేషం. ఈ ఏడాది వెండితెరపై కనిపించని హీరోయిన్ల జాబితా డజనుకుపైగానే ఉంది. నయనతార, సమంత, అనుష్క, తమన్నా, త్రిష, సాయి పల్లవి, కీర్తీ సురేష్, పూజా హెగ్డే, శ్రుతీహాసన్, నిత్యా మీనన్, సంయుక్తా మీనన్, రాశీ ఖన్నా, నిధీ అగర్వాల్, మెహరీన్... వంటి పలువురు హీరోయిన్లు 2024ని మిస్ అయ్యారు. ఆ వివరాల్లోకి... 202రెండు సినిమాలతో జేజెమ్మతెలుగు చిత్ర పరిశ్రమలో జేజమ్మగా ప్రేక్షకుల అభిమానం సొంతం చేసుకున్నారు అనుష్క. ఆ మధ్య వరుస సినిమాలు చేసిన అనుష్క నాలుగేళ్లుగా కాస్త నెమ్మదించారు. 2020లో వచ్చిన ‘నిశ్శబ్దం’ సినిమా తర్వాత మూడేళ్ల అనంతరం ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ (2023) చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చారు ఆమె. అయితే 2024ని మాత్రం పూర్తిగా మిస్ అయ్యారు అనుష్క. ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ తర్వాత తెలుగులో ఆమె కమిటైన చిత్రం ‘ఘాటీ’. ఈ మూవీకి క్రిష్ జాగర్లమూడి దర్శకుడు. గతంలో వీరి కాంబినేషన్లో వచ్చిన ‘వేదం’ (2010) మంచి హిట్‌గా నిలిచిన విషయం తెలిసిందే. ఈ కాంబినేషన్లోని ‘ఘాటీ’ని యూవీ క్రియేషన్స్ సమర్పణలో రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి నిర్మిస్తున్నారు. నవంబరు 7న అనుష్క పుట్టినరోజు సందర్భంగా ‘ఘాటీ’ సినిమా నుంచి విడుదల చేసిన ఆమె ఫస్ట్ లుక్‌కి మంచి స్పందన వచ్చింది. ఒడిశాలోని ఒక మహిళ జీవితంలో జరిగిన వాస్తవ ఘటనల నేపథ్యంలో యాక్షన్ థ్రిల్లర్ గా ఈ మూవీ రూ΄÷ందుతోంది. ఈ చిత్రం తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఏప్రిల్ 18న విడుదల కానుంది. ఇదిలా ఉంటే ‘కథనార్–ది వైల్డ్ సోర్సెరర్’ అనే సినిమా ద్వారా మలయాళ పరిశ్రమలో ఎంట్రీ ఇస్తున్నారు అనుష్క. ‘ఘాటీ’, ‘కథనార్–ది వైల్డ్ సోర్సెరర్’ సినిమాలు ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉన్నాయి. ఈ రెండు సినిమాలతో 2025లో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తారు అనుష్క. వచ్చే ఏడాదైనా... సౌత్‌లోని స్టార్ హీరోయిన్ల జాబితాలో సమంతది ప్రత్యేక స్థానం. అందం, అభినయంతో దక్షిణాదిలోనే కాదు... ఉత్తరాదిలోనూ తనకంటూ ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారామె. ఆ మధ్య వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న ఆమె ఈ మధ్య స్లో అయ్యారు. 2023లో ‘శాకుంతలం, ఖుషి’ వంటి సినిమాలతో ప్రేక్షకులను అలరించిన ఈ బ్యూటీ 2024లో మాత్రం వెండితెరపై కనిపించలేదు. అయితే ‘సిటాడెల్ హనీ–బన్నీ’ అనే వెబ్ సిరీస్ ద్వారా వెబ్ ప్రేక్షకులను మాత్రం అలరించారామె. విజయ్ దేవరకొండకి జోడీగా సమంత నటించిన ‘ఖుషి’ సినిమా తర్వాత ఆమె కమిటైన ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్ ‘మా ఇంటి బంగారం’. తన పుట్టినరోజు సందర్భంగా ఏప్రిల్ 28న ఈ సినిమాని ప్రకటించారు సమంత. అంతేకాదు... తన సొంత ప్రొడక్షన్ హౌస్ ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై ఈ సినిమాని నిర్మించనున్నట్లు ఆమె ప్రకటించడం విశేషం. బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేసిన ‘మా ఇంటి బంగారం’ చిత్రం పోస్టర్‌కి మంచి స్పందన వచ్చింది. మెడలో నల్లపూసలు, చీర కట్టు, పెద్ద బొట్టుతో ఉన్న సమంత లుక్ చూస్తే ఆమె గృహిణి పాత్రలో కనిపిస్తారని తెలుస్తోంది. అయితే ఆమె చేతిలో గన్, ముఖం మీద రక్తపు మరకలు, ఆమె వెనకాల టెడ్డీ బేర్, స్టవ్ మీద ప్రెజర్ కుక్కర్... ఇవన్నీ చూస్తే ఈ సినిమాలో మరొక కోణం కూడా ఉందని స్పష్టం అవుతోంది. అయితే ఈ సినిమాకి దర్శకుడు ఎవరు? ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను ప్రకటించలేదు. మరి 2025లో అయినా సమంత వెండితెర ప్రేక్షకులను అలరిస్తారా? లేదా అనేదానిపై స్పష్టత లేదు. ఇదిలా ఉంటే ప్రస్తుతం ‘రక్త్ బ్రహ్మాండ్: ది బ్లడీ కింగ్డమ్’ అనే హిందీ వెబ్ సిరీస్ చేస్తున్నారు సమంత. డాక్యుమెంటరీతో మాత్రమే... దక్షిణాదిలో లేడీ సూపర్ స్టార్ అనగానే నయనతార పేరును టక్కున చెబుతారు ఆమె అభిమానులు. ఓ వైపు హీరోలకి జోడీగా కమర్షియల్ సినిమాల్లో నటిస్తూనే, మరోవైపు లేడీ ఓరియంటెడ్ చిత్రాలు చేస్తూ ఫుల్ స్వింగ్‌లో దూసుకెళుతున్నారీ బ్యూటీ. ప్రస్తుతం ఆమె చేతిలో దాదాపు ఎనిమిది సినిమాలు ఉన్నాయి. వాటిల్లో ఐదు తమిళ, రెండు మలయాళ, ఒకటి కన్నడ చిత్రం ఉంది. కాగా చిరంజీవి హీరోగా మోహన్ రాజా దర్శకత్వం వహించిన ‘గాడ్ ఫాదర్’ (2022) సినిమాలో చిరంజీవి సోదరిగా నటించారు నయనతార. ఆ చిత్రం విడుదలై రెండేళ్లు దాటినా మరో తెలుగు సినిమా కమిట్ కాలేదామె. ఇతర భాషల్లో ఫుల్ బిజీగా ఉండటం వల్లనో లేకుంటే సరైన కథ కుదరకనో ఆమె తెలుగు సినిమాకి పచ్చజెండా ఊపలేదు. ఆ విధంగా దక్షిణాదిలోనే అగ్ర కథానాయికగా దూసుకెళుతున్న నయనతార కూడా 2024లో ప్రేక్షకులను పలకరించలేక΄ోయారు. ఆమె నటించిన ఏ సినిమా కూడా ఈ ఏడాది విడుదల కాక΄ోవడంతో ఆమె ఫ్యాన్స్‌కి నిరాశ తప్పలేదు. అయితే 2025లో మాత్రం దాదాపు అరడజనుకు పైగా సినిమాలతో ఆమె ప్రేక్షకులను అలరించే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే... ఓటీటీలో ప్రసారమవుతున్న ‘నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్’ డాక్యుమెంటరీతో ఈ ఏడాది నయనతార కనిపించడం ఆమె అభిమానులకు ఓ చిన్న ఊరట. ప్రత్యేక పాటతో... చిత్ర పరిశ్రమలో రెండు దశాబ్దాలకు పైగా ప్రయాణం త్రిషది. తమిళ, తెలుగు, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో నటించి, తనకంటూ స్టార్ హీరోయిన్ స్టేటస్‌ని సొంతం చేసుకున్నారామె. అందం, అభినయంలో ఇప్పటికీ నేటి తరం యువ హీరోయిన్లకు గట్టి ΄ోటీ ఇస్తున్నారు త్రిష. ఓ వైపు హీరోలకు జోడీగా నటిస్తూనే, మరోవైపు ఫీమేల్ సెంట్రిక్ ఫిల్మ్స్‌లోనూ నటిస్తూ బిజీగా దూసుకెళుతున్న ఆమె నటించిన ఏ చిత్రం కూడా ఈ ఏడాది విడుదల కాలేదు. అయితే విజయ్ హీరోగా రూ΄÷ందిన ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్‌టైమ్’ (గోట్) సినిమాలో మాత్రం ఓ ప్రత్యేక ΄ాటలో నటించారు త్రిష. అలాగే ‘బృంద’ అనే ఓ వెబ్ సిరీస్‌తో బుల్లితెర ప్రేక్షకులను పలకరించారామె. అవి మినహా 2024లో పూర్తి స్థాయిలో ఆమె ప్రేక్షకులను అలరించలేదు. అయితే వచ్చే ఏడాది పలు చిత్రాలతో తెరపై కనిపించనున్నారు. ప్రస్తుతం నాలుగు తమిళ చిత్రాలు, రెండు మలయాళ సినిమాలతో ΄ాటు తెలుగులో ‘విశ్వంభర’ సినిమా చేస్తున్నారు త్రిష. ‘స్టాలిన్’ (2006) సినిమా తర్వాత చిరంజీవి–త్రిష కలిసి నటిస్తున్న చిత్రం ‘విశ్వంభర’ కావడం విశేషం. ఇదిలా ఉంటే... 2025లో త్రిష నటించిన ఐదారు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రావడం పక్కా అని స్పష్టం అవుతోంది. 2023లో మూడు... ఈ ఏడాది నో నటి, గాయని, మ్యూజిక్ కం΄ోజర్... ఇలా బహుముఖ ప్రజ్ఞాశాలిగా పేరు సొంతం చేసుకున్నారు శ్రుతీహాసన్. తెలుగు, తమిళ, హిందీ సినిమాల్లో నటిస్తూ బిజీగా దూసుకెళుతున్నారామె. 2023లో తెలుగులో ఆమె నటించిన ‘వాల్తేరు వీరయ్య (చిరంజీవి), వీరసింహారెడ్డి (బాలకృష్ణ), సలార్: పార్ట్ 1– సీజ్ఫైర్ (ప్రభాస్) ’ వంటి సినిమాలు విడుదలయ్యాయి. ఆ మూడు సినిమాలతో గత ఏడాది హ్యాట్రిక్ హిట్స్ అందుకున్న ఈ బ్యూటీ 2024లో మాత్రం తన అభిమానులను నిరాశపరిచారు. ఈ ఏడాది ఆమె నటించిన ఒక్క సినిమా కూడా రిలీజ్ కాలేదు. రజనీకాంత్ హీరోగా లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్న ‘కూలీ’ చిత్రంలో నటిస్తున్నారు శ్రుతీహాసన్. అలాగే ‘చెన్నై స్టోరీ’లోనూ నటిస్తున్నారామె. ఫిలిప్ జాన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ రెండు సినిమాలు 2025లో ప్రేక్షకుల ముందుకు వస్తాయని తెలుస్తోంది.వచ్చే ఏడాది స్ట్రయిట్ సినిమాతో... 2021లో ‘లవ్ స్టోరీ, శ్యామ్ సింగరాయ్, ‘విరాట పర్వం’ చిత్రాలతో తెలుగు తెరపై కనిపించారు సాయి పల్లవి. ఆ తర్వాత తెలుగులో స్ట్రయిట్ సినిమా ఒప్పుకోలేదు. 2022లో ఆమె నటించిన తమిళ చిత్రం ‘గార్గీ’ తెలుగులోనూ విడుదలైంది. ఇక తమిళ చిత్రం ‘అమరన్’ తెలుగులోనూ విడుదల కావడంతో ఈ ఏడాది ఆ విధంగా తెలుగు ప్రేక్షకులను పలకరించారీ బ్యూటీ. సాయి పల్లవి నటిస్తున్న తాజా తెలుగు చిత్రం ‘తండేల్’ వచ్చే ఏడాది రిలీజ్ కానుంది. సో... 2025లో స్ట్రయిట్ తెలుగు చిత్రంలో కనిపిస్తారామె. నాగచైతన్య హీరోగా చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఫిబ్రవరి 7న విడుదల కానుంది. వచ్చే ఏడాది నాలుగు చిత్రాలతో... తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో గోపికమ్మా, బుట్ట బొమ్మగా స్థానం సం΄ాదించుకున్నారు పూజా హెగ్డే. నాగచైతన్య హీరోగా నటించిన ‘ఒక లైలా కోసం’ (2014) సినిమాతో టాలీవుడ్‌కి హీరోయిన్గా పరిచయమయ్యారామె. పదేళ్ల కెరీర్లో మహేశ్‌బాబు, అల్లు అర్జున్, ఎన్టీఆర్, రామ్‌చరణ్, వరుణ్ తేజ్, అఖిల్, బెల్లంకొండ సాయిశ్రీనివాస్ వంటి హీరోలకి జోడీగా నటించారు పూజా హెగ్డే. ‘ఆచార్య’ (2022) సినిమాలో రామ్‌చరణ్‌తో జతకట్టిన ఈ బ్యూటీ తర్వాత మరో తెలుగు సినిమా చేయలేదు. అయితే ‘ఎఫ్ 3’ చిత్రంలో ఓ ΄ాటలో నర్తించారు. 2023లో ఆమె నటించిన ఒకే ఒక హిందీ చిత్రం ‘కిసీ కా భాయ్ కిసీ కీ జాన్’ రిలీజైంది. అయితే ఈ ఏడాది మాత్రం పూజ నటించిన ఏ చిత్రం కూడా ప్రేక్షకుల ముందుకు రాలేదు. అయితే ప్రస్తుతం ఆమె చేతిలో మాత్రం రెండు హిందీ సినిమాలు, రెండు తమిళ చిత్రాలున్నాయి. 2024 గ్యాప్‌ని 2025లో భర్తీ చేయనున్నారు పూజ. వచ్చే ఏడాది నాలుగు చిత్రాల్లో పూజా హెగ్డే కనిపించే చాన్స్ ఉంది. ఇదిలా ఉంటే... తమన్నా, నిత్యా మీనన్, సంయుక్తా మీనన్, నిధీ అగర్వాల్, మెహరీన్ వంటి తారలు నటించిన ఏ భాషా చిత్రం కూడా 2024లో విడుదల కాలేదు. కీర్తీ సురేష్, రాశీ ఖన్నా, ప్రియమణి వంటి వారు 2024లో తెలుగు ప్రేక్షకులకు దూరమయ్యారు. కానీ, ఇతర భాషల ప్రేక్షకులను అలరించారు.– డేరంగుల జగన్ -
2024లో ప్రముఖ కంపెనీలలో ఇన్వెస్ట్ చేసిన సినిమా స్టార్స్
-
నయనతార భర్త.. ప్రభుత్వ భూమిపై కన్నేశాడా?
హీరోయిన్ నయనతార రీసెంట్ టైంలో చెప్పుకోదగ్గ సినిమాలేం చేయలేదు. కానీ ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తూనే ఉంది. దీనికి కారణం వివాదాలు. కొన్నాళ్ల క్రితం తమిళ స్టార్ హీరో ధనుష్‌తో పెద్ద గొడవే పెట్టుకుంది. ఇందులో నయన్ భర్త విఘ్నేశ్ కూడా ఉన్నాడు. ఇప్పుడు ఇతడిపై షాకింగ్ రూమర్స్ వచ్చాయి. ఏకంగా ప్రభుత్వ భూముల్నే కొనేందుకు ప్రయత్నిస్తున్నాడని అన్నారు. ఇప్పుడు దీనిపై స్వయంగా విఘ్నేశ్ క్లారిటీ ఇచ్చేశాడు.దర్శకుడు విఘ్నేశ్ శివన్.. ఈ మధ్య పుదుచ్చేరికి వెళ్లి ముఖ్యమంత్రి, పర్యాటక శాఖామంత్రిని కలిసి వచ్చాడు. అయితే పుదుచ్చేరి బీచ్ రోడ్లో ప్రభుత్వానికి చెందిన సీగల్ హోటల్ని కొనుగోలు చేసే ప్రయత్నాల్లో విఘ్నేశ్ ఉన్నాడని ప్రచారం మొదలైంది. అందుకే స్వయంగా సీఎంని కలిసి వచ్చాడనే పుకారు వచ్చింది. కానీ ప్రభుత్వ ఆస్తిని అమ్మడం కుదరదని పర్యాటక శాఖామంత్రి చెప్పడంతో విఘ్నేశ్ తిరిగొచ్చేశాడని మాట్లాడుకున్నారు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 30 సినిమాలు)అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో పుకార్ల అన్ని అబద్ధాలే అని విఘ్నేశ్ శివన్ పేర్కొన్నాడు. తన పాండిచ్చేరి పర్యటన వెనకున్న కారణాన్ని ఇప్పుడు బయటపెట్టాడు. 'నా సినిమా 'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ' షూటింగ్ అనుమతి తీసుకునేందుకు అక్కడికి వెళ్ళాను. గౌరవ మర్యాదలతో ముఖ్యమంత్రిని, పర్యాటక శాఖా మంత్రిని కలిశాను. అనుకోకుండా, నాతో పాటు వచ్చిన లోకల్ మేనేజర్.. నా మీటింగ్ తర్వాత దేని గురించో వాళ్ళతో మాట్లాడారు. దీంతో ఆ చర్చ నాకోసమే అని పొరబడుతున్నారు. వస్తున్న రూమర్స్ ఏవి నిజం కాదు' అని విఘ్నేష్ శివన్ ఇన్ స్టా స్టోరీలో రాసుకొచ్చాడు.'నానుమ్ రౌడీ దానే' సినిమాతో దర్శకుడిగా మారిన విఘ్నేశ్ శివన్.. తొలి మూవీతో అద్భుతమైన సక్సెస్ అందుకున్నాడు. కానీ తర్వాత సినిమాలైతే చేస్తున్నాడు గానీ ఒక్కటంటే ఒక్కటి కూడా హిట్ అవ్వడం లేదు. మధ్యలో నయన్‌ని ప్రేమించి పెళ్లి చేసుకునే విషయంలో మాత్రం సక్సెస్ అయ్యాడు. ప్రస్తుతం 'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ' మువీ చేస్తున్నాడు. ప్రదీప్ రంగనాథన్, కృతిశెట్టి హీరోహీరోయిన్లు.(ఇదీ చదవండి: 'వరుడు' హీరోయిన్ భానుశ్రీ ఇంట్లో విషాదం) -
విఘ్నేశ్‌తో జీవితం పంచుకోకుంటే బాగుండేది: నయనతార
విఘ్నేశ్ లేకపోతే నా జీవితం ఎలా ఉండేదో ఊహించుకోవడానికే కష్టంగా ఉందంటోంది నయనతార. కానీ తన వల్ల అతడు విమర్శలపాలవుతున్నాడని, అదే సహించలేకపోతున్నానని చెప్తోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో నయనతార మాట్లాడుతూ.. జీవితాన్ని కలిసి పంచుకోకపోయుంటే బాగుండేదేమో అని కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటుంది. తనను ఈ రిలేషన్‌షిప్‌లోకి లాగినందుకు గిల్టీగా అనిపిస్తుంది. ఇప్పటికీ అలాగే ఫీలవుతున్నాను. ప్రేమను పంచుకోవాలి కానీ..మా రిలేషన్లో నేనే మొదటి అడుగు వేశాను. నేనే గనక అతడి జీవితంలో లేకపోయుంటే అతడి ప్రతిభను గుర్తించేవారు. డైరెక్టర్‌గా, రచయితగా, గేయరచయితగా తనకు క్రెడిట్ ఇచ్చేవారు. విఘ్నేశ్ మంచి మనసున్న వ్యక్తి. నేను కూడా మంచిదాన్నే. కానీ తనంత మంతనమైతే నాలో లేదనుకుంటా! సక్సెస్ అయిన మనుషులు తమతో సమానంగా సక్సెస్ అయినవారినే పెళ్లి చేసుకోవాలని జనం ఆలోచిస్తారు. ఇక్కడ మీరు ప్రేమను ఎంచుకోవాలి తప్ప విజయాలను, డబ్బును, లగ్జరీని కాదు! అప్పుడే మీరు మరింత ప్రేమలో పడతారు.అందుకేనేమో..విఘ్నేశ్ నాకంటే ఆలస్యంగా కెరీర్ ప్రారంభించాడు. నేను అతడికంటే సీనియర్‌ను. అతడు వరుస బ్లాక్‌బస్టర్స్ ఇవ్వలేదనో, తన సినిమాలు ఆలస్యంగా వస్తున్నాయనో కానీ విఘ్నేశ్‌ను చాలామంది ట్రోల్ చేస్తుంటారు. నేను ఆల్రెడీ సక్సెస్ అయిపోయి, నాకంటూ ఓ స్థానాన్ని సంపాదించుకున్నాను. అతడు ఇంకా తన స్థానం సంపాదించుకునే పనిలోనే ఉన్నాడు. అందుకేనేమో అతడిపై ఎక్కువ ద్వేషం, చులకన! అని నయనతార చెప్పుకొచ్చింది.చదవండి: ట్రెండింగ్‌లో #JusticeforSangeetha.. అంతా త్రిష వల్లే? -
మేము శత్రువులం కాదు.. పదేళ్లలో అంతా మారిపోయింది: నయనతార
ఇండియన్ స్టార్స్‌గా వెలుగొందుతున్న తారలు నటుడు ధనుష్,నటి నయనతార. వీరిద్దరూ సంచలన తారలుగా ముద్ర పడిన వారే. అదేవిధంగా ఇటీవల ఈ ఇద్దరి మధ్య పెద్ద వివాదం సాగుతున్న విషయం తెలిసిందే. సమీప కాలంలో నటి నయనతార నటుడు ధనుష్‌ను విమర్శిస్తూ మీడియాకు బహిరంగ ప్రకటనను చేసి ప్రకంపనలు సృష్టించారు. అందుకు కారణం ఆమె జీవిత ఘటనలతో రూపొందిన నయనతార బిహైండ్ ది ఫెయిరీ టేల్ డాక్యుమెంటరీ చిత్రం కోసం నానుమ్ రౌడీ దాన్ చిత్రంలోని కొన్ని సీన్స్, పాటల సన్నివేశాలను ఉపయోగించడానికి అనుమతి కోరగా అందుకు ఆ చిత్ర నిర్మాత ధనుష్ నిరాకరించడమే. అయినా ఆ చిత్రంలోని మూడు నిమిషాల నిడివి గల సన్నివేశాలను నయనతార తన డాక్యుమెంటరీ చిత్రంలో వాడారు. దీంతో ధనుష్ నటి నయనతారపై రూ.10 కోట్లు నష్టపరిహారం కోరుతూ చైన్నె హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వీరి సమస్య ఇప్పుడు కోర్టు పరిధిలో ఉన్న విషయం విధితమే. ఇలాంటి పరిస్థితుల్లో నటి నయనతార ఓ భేటీలో ధనుష్ గురించి ప్రస్తావిస్తూ తాను, ధనుష్ బద్ధ శత్రువులు కాదన్నారు. ఇంకా చెప్పాలంటే కొంతకాలం క్రితం వరకూ మంచి మిత్రులుగా ఉన్నామని పేర్కొన్నారు. అలాంటిది 10 ఏళ్లలో అంతా మారిపోయిందన్నారు. అందుకు పలు కారణాలు ఉండవచ్చనని, వాటి గురించి ఇప్పుడు ప్రస్తావించలేనన్నారు. తనకు సరి అనిపిస్తే దాన్ని చేయడానికి తాను భయపడనన్నారు. తాను తప్పు చేస్తే కదా భయపడటానికి అన్నారు. అదే విధంగా పబ్లిసిటీ కోసమో, మరే విషయం కోసమో తాను ఎవరినీ అణగదొక్కాలని భావించనన్నారు. తన జీవితంలో ముఖ్యమైన చిత్రంలోని సన్నివేశాలను తన డాక్యుమెంటరీలో వాడుకోవడానికి ధనుష్ అనుమతి కోసం ఆయన మేనేజర్‌కు పలు సార్లు ఫోన్ చేశానని, ఆయన్ని ఫోన్ మాట్లాడమని కోరానని, అదీ జరగలేదన్నారు. ధనుష్ పాపులర్ నటుడిని ఆయనకు అశేష అభిమానులు ఉన్నారని, అందులో తాము ఉన్నామన్నారు. అయితే నానుమ్ రౌడీ దాన్ చిత్రంలోని కొన్ని సన్నివేశాలు తన వ్యక్తిగత జీవితానికి సంబంధం ఉండడం వల్లే వాటిని వాడుకోవడానికి అనుమతి కోరినట్లు నయనతార పేర్కొన్నారు. కాగా ఈమైపె నటుడు ధనుష్ వేసిన పిటిషన్ గురువారం న్యాయస్థానంలో విచారణకు వచ్చింది. ఈ పిటిషన్‌ను స్వీకరించిన న్యాయమూర్తి ఈ మేరకు వివరణ కోరుతూ.. నయనతార, విఘ్నేష్ శివన్ దంపతులకు, నెట్ ఫ్లిక్స్ సంస్థకు నోటీసులిచ్చారు. అనంతరం వచ్చే ఏడాది జనవరి 8కి వాయిదా వేశారు. -
ధనుశ్ - నయనతార వివాదం.. కోర్టు కీలక ఆదేశాలు!
నయనతార- కోలీవుడ్ హీరో ధనుశ్ మధ్య వివాదం కీలక మలుపు తిరిగింది. ధనుశ్ ఇప్పటికే మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. తన సినిమాలోని ఓ క్లిప్‌ను అనుమతి లేకుండా వినియోగించారంటూ రూ.10 కోట్లు డిమాండ్ చేస్తూ కోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం హీరోయిన్ నయనతారకు నోటీసులు జారీ చేసింది. ఈ నెల 8వ తేదీలోగా వివరణ ఇవ్వాలంటూ నయన్‌కు నోటీసులిచ్చింది. ఈ వ్యవహరంలో మీ వైఖరి చెప్పాలంటూ నయన్ దంపతులతోపాటు నెట్‌ఫ్లిక్స్ బృందాన్ని కోర్టు ఆదేశించింది. అసలేంటి వివాదం?ఇటీవల నయనతార తన ప్రేమ పెళ్లిపై రూపొందించిన డాక్యుమెంటరీని విడుదల చేసింది. నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్ అనే పేరుతో రిలీజైన డాక్యుమెంటరీలో నానుమ్ రౌడీ దాన్ చిత్రంలోని మూడు సెకన్ల క్లిప్‌ను ఉపయోగించారు. దీంతో తన పర్మిషన్ లేకుండా తన సినిమాలోని క్లిప్‌ను వినియోగించారంటూ ధనుశ్ టీమ్ రూ.10 కోట్లకు దావా వేసింది. ఆ తర్వాత నయనతార ఈ వివాదంపై బహిరంగ లేఖ కూడా విడుదల చేశారు. -
ఏ తప్పు చేయలేదు.. ఎందుకు భయపడాలి: నయనతార
తప్పు చేయనప్పుడు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదంటోంది నయనతార. ధనుష్ విషయంలో తాను చేసిన పనిని సమర్థించుకుంటుంది. ఆయనతో మాట్లాడానికి చాలా ప్రయత్నించానని..కుదరకపోవడంతో లేఖ రాయాల్సి వచ్చిందని చెప్పింది. ‘నయనతార: బియాండ్ ది ఫెయిరీటేల్’ డాక్యూమెంటరీ విషయంలో ధనుష్, నయనతార మధ్య వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. నయనతార జీవితాన్ని ఆధారంగా చేసుకొని తెరకెక్కించిన ఈ డాక్యుమెంటరీ ఫిల్మ్‌లో తన పర్మిషన్ తీసుకోకుండా ‘నానుమ్ రౌడీ దాన్’లోని సీన్‌ను వాడుకున్నారంటూ చిత్ర నిర్మాత ధనుష్ లీగల్ నోటీసులు పంపించాడు. మూడు సెకన్ల క్లిప్‌నకు రూ.10 కోట్లు డిమాండ్ చేశారు. ఈ క్రమంలో నయనతార ధనుష్ క్యారెక్టర్ని తప్పుబడుతూ బహిరంగ లేఖను రాసింది. తాజాగా ఈ వివాదంపై నయనతార క్లారిటీ ఇచ్చింది. తాను లేఖను రాయడానికి గల కారణం ఏంటో తెలిపింది. (చదవండి: ఇక్కడితో ఆపేయండి..లేదంటే లీగల్ నోటీసులు పంపిస్తా.. సాయి పల్లవి మాస్ వార్నింగ్)ఓ ఇంటర్వ్యూలో ఆమె ఈ వివాదం గురించి మాట్లాడుతూ.. ‘ధనుష్ క్యారెక్టర్ని బయట ప్రపంచానికి తెలియజేయడానికే ఆ లేఖను రాశాను. ‘న్యాయమని నమ్మిన దాన్ని బయటపెట్టడానికి నేను ఎందుకు భయపడాలి? తప్పు చేస్తే భయపడాలి. పబ్లిసిటీ కోసం ఎదుటి వ్యక్తుల పేరు ప్రతిష్ఠలను దెబ్బతీసే మనిషిని కాదు నేను. నా డ్యాక్యుమెంటరీ ఫిల్మ్ పబ్లిసిటీ కోసమే ఇదంతా చేశారని చాలా మంది మాట్లాడుతుంటున్నారు. అందులో ఏమాత్రం నిజం లేదు. (చదవండి: పుష్పరాజ్ వసూళ్ల సునామీ.. ఆరు రోజుల్లోనే రప్ఫాడించాడు!)వీడియో క్లిప్స్‌కు సంబంధించిన ఎన్వోసీ కోసం ధనుష్‌ని కలిసేందుకు ప్రయత్నించాం. నేను, విఘ్నేష్ ఫోన్ చేశాం. కామన్ ఫ్రెండ్స్‌తో కూడా మాట్లాడించే ప్రయత్నం చేశాం. కానీ ధనుష్ స్పందించలేదు. ఆయన మమ్మల్ని ఎందుకు ద్వేషిస్తున్నారో తెలియదు. ముందు నుంచి మేమిద్దరం ఏమీ శత్రువులం కాదు. ఆయన నాకు మంచి స్నేహితుడే. ఈ పదేళ్లలో ఏం జరిగిందో తెలియదు. ఆయనకు మాపై ఎందుకు కోపం వచ్చిందనే విషయం కూడా మాకు అర్థం కావడం లేదు. పక్కవాళ్ల మాటలు విని మమ్మల్ని అపార్థం చేసుకున్నారా? ఇలాంటివి క్లియర్ చేసుకునేందుకు ఆయనతో మాట్లాడేందుకు ప్రయత్నించాను. అది కుదరలేదు’ అని నయనతార అన్నారు. -
అభిమానులకు నయనానందకరం
ఓటీటీలో ‘ఇది చూడొచ్చు’ అనేప్రాజెక్ట్స్ చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమ్ అవుతున్న వాటిలో హీరోయిన్ నయనతార జీవితంపై రూపొందిన ‘నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్’ డాక్యుమెంటరీ గురించి తెలుసుకుందాం.తెర మీద కనపడే తారలపై ప్రేక్షకులకు మక్కువ ఎక్కువ. మరీ ముఖ్యంగా సినీ ప్రేక్షకులు ఈ తారలపై అపరిమిత అభిమానాన్ని పెంచుకుంటూ వారి వ్యక్తిగత జీవితాలను గురించి కూడా తెలుసుకోవాలని ఆరాటపడతుంటారు. ప్రస్తుత వినోద రంగంలో వాణిజ్య విప్లవమైన ఓటీటీ వేదికలు అడపాదడపా కొంతమంది కళాకారుల వ్యక్తిగత జీవితాలను డాక్యుమెంటరీ రూపంలో ప్రేక్షకులకు అందుబాటులోకి తెస్తున్నాయి.వీటికి సదరు నటీనటులకు ఓటీటీ సంస్థలు భారీ మొత్తంలో పారితోషికం ముట్టజెప్పి డాక్యుమెంటరీలు రూపొందిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇటీవల నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ వేదికగా ప్రముఖ నటి నయనతార డాక్యుమెంటరీ ‘నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్’ రిలీజ్ అయింది. బెంగళూరు నగరంలో పుట్టిన నయనతార అనతి కాలంలోనే తన సినిమా కెరీర్లో అత్యున్నత స్థాయికి ఎదిగారని చెప్పవచ్చు. సౌత్ ఇండియా క్వీన్ అని ఫ్యాన్స్ పిలుచుకునే ఈ బ్యూటీ ప్రతిష్ఠాత్మక పత్రిక ఫోర్బ్స్‌లో ‘ఇండియాలో సెలబ్రిటీ 100 లిస్ట్’లో ప్రచురింపబడ్డ ఒకే ఒక్క దక్షిణాది నటి.అంతటి నటి డాక్యుమెంటరీ అంటే ఇక చెప్పేదేముంది అభిమానులకు పండగే. ఈ డాక్యుమెంటరీ మొత్తం నయనతార జీవితాన్ని చూసినట్టుగా కాదు, అనుభూతి పొందినట్టుగా ఉంటుంది. నయనతార పుట్టుక నుండి తన పెరుగుదల, చదువు ఆ తరువాత తన సినిమా ప్రస్థానం ఇవన్నీ ఎంతో చక్కగా చూపించారు. వీటితో పాటు నయనతార గురించి సినీ ప్రముఖులు, ఆమె ఆప్తుల అభిప్రాయాలతో కూడిన విశ్లేషణ ఇవ్వడం మరో హైలైట్. జీవితమంటే సాఫీగా సాగే ప్రయాణమే కాదు.ఒడిదుడుకులుంటాయి. సినిమా స్టార్ అయినా సాధారణ మనిషైనా ఎవ్వరికైనా జీవితం జీవితమే. అలాగే నయనతార ఎంత ఎత్తుకు ఎదిగినా తన జీవితంలో కూడా ఒడిదుడుకులు, ఎత్తుపల్లాలెన్నో ఉన్నాయి. అవన్నీ కూడా తానే వివరిస్తూ తన సినిమా జీవితాన్ని, వ్యక్తిగత జీవితాన్ని ప్రేక్షకులకు సవివరంగా వివరించారు. నయనతార గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే ఈ డాక్యుమెంటరీ చూడాల్సిందే. ఏదేమైనప్పటికీ టైటిల్లో ఉన్నట్లు ఈ డాక్యుమెంటరీ అంతకు మించి... అందుకే ఇది నయనానందకరం.– ఇంటూరు హరికృష్ణ -
అలాంటి వారికే నేనేంటో తెలుస్తుంది: ధనుష్
కోలీవుడ్‌లో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న నటుడు ధనుశ్. అంతేకాదు సక్సెస్ఫుల్ నిర్మాతగా పేరు తెచ్చుకున్నారు. అయితే ధనుశ్కు ఈ స్థాయి అంత సులభంగా వచ్చింది కాదు. తుళ్లువదో ఇళమై చిత్రంతో కథానాయకుడిగా తన తండ్రి కస్తూరి రాజా దర్శకత్వంలో ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. ఆ తర్వాత విడుదలకు ముందు ఎన్నో అవమానాలను, అవహేళనలను ఎదుర్కొన్నారు. అయితే ధనుష్‌కు తొలి చిత్రం మంచి విజయాన్ని అందించడంతో పలువురు దర్శక నిర్మాతలు ఆయన వెంట పరుగులు తీశారు.కెరీర్ ప్రారంభంలో ధనుశ్ విజయాలలో ఆయన సోదరుడు, దర్శకుడు సెల్వరాఘవన్ భాగమయ్యాడు. అయితే ధనుశ్‌పై విమర్శలు కూడా చాలానే ఉన్నాయి. ముఖ్యంగా నిర్మాతలకు సరిగా కాల్ షీట్స్ కేటాయించడం లేదనే ఆరోపణలున్నాయి. ఇకపోతే ఇటీవల మరో అగ్రనటి నయనతార కూడా ఆయన వ్యక్తిత్వంపై విమర్శలు చేసిన విషయం తెలిసిందే. అదేవిధంగా ఐశ్వర్య రజనీకాంత్‌తో ఈయన వివాహ బంధానికి కూడా ఎండ్ కార్డ్ వేశాడు. ఇటీవలే వీరిద్దరికి విడాకులు కూడా మంజూరయ్యాయి. యితే ఇవన్నీ ధనుశ్ కెరియర్‌కు ఎలాంటి ఇబ్బంది తీసుకురాలేదనే చెప్పాలి.తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ధనుశ్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. తనను అర్థం చేసుకోవడం నిజంగానే కొంచెం కష్టమని.. తనతో సన్నిహితంగా ఉండే వారికే తానేంటో తెలుస్తుందన్నారు. అయితే తాను ఎవరికీ అంత సులభంగా దగ్గర అవ్వనని.. అందుకు కొన్ని రోజుల సమయం పడుతుందని అన్నారు. తనతో సుదీర్ఘ పరిచయం ఉన్న వారే తనను అర్థం చేసుకోగలుగుతారని నటుడు ధనుశ్ పేర్కొన్నారు. దీంతో ఈయన ఎవరి గురించి ఇలా మాట్లాడారా అన్న చర్చ సినీ వర్గాల్లో జరుగుతోంది. కాగా ధనుష్ ప్రస్తుతం ఇడ్లీ కడై అనే చిత్రంలో నటిస్తూ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. ధనుష్ దర్శకత్వం వహించిన మరో చిత్రం నిలవుక్కు ఎన్ మేల్ ఎన్నడీ కోపం త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. -
మత్తెక్కించేలా చీరలో నయనతార సోయగాలు (ఫొటోలు)
-
ధనుష్‌తో వివాదం.. సోషల్ మీడియాలో విఘ్నేశ్ మిస్సింగ్!
తమిళ ఇండస్ట్రీలో ధనుష్-నయనతార మధ్య గత కొన్నిరోజులుగా వివాదం నడుస్తూనే ఉంది. ఈమె లైఫ్, పెళ్లి తదితర అంశాలతో డాక్యుమెంటరీ తీశారు. దాన్ని రీసెంట్గా రిలీజ్ చేశారు. అయితే ఇందులో తను నిర్మించిన 'నానుమ్ రౌడీదానే' మూవీ సీన్స్ ఉపయోగించడంపై ధనుష్ అభ్యంతరం చెప్పాడు. 3 సెకన్ల క్లిప్ వాడినందుకు రూ.10 కోట్ల దావా వేశాడు. దీంతో నయనతార పెద్ద పోస్ట్ పెట్టింది.ధనుష్‌ని చెడ్డవాడు అనేలా చిత్రీకరించడానికి నయనతార గట్టిగానే ట్రై చేసింది. లాజికల్‌గా చూసుకుంటే ఈమె చేసింది తప్పయినా సరే ధనుష్‌నే తప్పుబట్టాలని చూసింది. కొన్నిరోజులు ఊరుకున్న ధనుష్.. ఈ మధ్యే నయనతార-ఆమె భర్త విఘ్నేశ్ శివన్‌కి కోర్టు ద్వారా నోటీసులు జారీ చేయించాడు. పిటిషన్‌పై విచారించిన న్యాయమూర్తి.. దీనిపై వివరణ ఇవ్వాలని నయనతారని ఆదేశించారు.(ఇదీ చదవండి: బిగ్‌బాస్ 8: తేజ ఎలిమినేట్.. 8 వారాలకు ఎంత సంపాదించాడు?)గొడవ నయన-ధనుష్ మధ్య జరుగుతున్నప్పటికీ కొన్నిరోజుల క్రితం నయనతార భర్త విఘ్నేశ్.. ధనుష్ వీడియో ఒకటి ఇన్ స్టాలో పోస్ట్ చేశాడు. ధనుష్ ఫ్యాన్స్ ట్రోల్ చేసేసరికి దాన్ని డిలీట్ చేశాడు. రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాను హీరో అజిత్ సినిమా 'ఎన్నై అరిందాల్' మూవీ కోసం పాట రాశానని, అదే టైంలో తన తొలి మూవీ 'నానుమ్ రౌడీదానే' చూసి ఆయన మెచ్చుకున్నారని చెప్పాడు.అయితే 'నానుమ్ రౌడీదానే' రిలీజ్ కావడానికి 7 నెలల ముందు అజిత్ మూవీ రిలీజైందని.. అసలు థియేటర్లలోకి రావడానికి ముందు అజిత్ ఎలా సినిమా చూశారని, ఇలా అబద్ధాలు చెప్పడం సరికాదని ధనుష్ అభిమానులు విఘ్నేశ్ని విపరీతంగా ట్రోల్ చేశారు. అలానే ధనుష్ తొలి మూవీ చేసే ఛాన్స్ ఇచ్చారనే కనీస కృతజ్ఞత కూడా విఘ్నేశ్‌కి లేదని అంటున్నారు. దీంతో ఈ గోల భరించలేక విఘ్నేశ్ తన ట్విటర్ ఖాతాని డిలీట్ చేశాడు. (ఇదీ చదవండి: Prithvi: అహంకారంతో విర్రవీగాడు.. ఎలిమినేట్ అయ్యాడు!) -
మళ్లీ మొదటికి వచ్చిన ధనుష్.. నయనతారకు షాక్
-
వివరణ ఇవ్వాలి.. నయనతారకి హైకోర్టు నోటీసు
నటి నయనతార, ఆమె భర్త–దర్శకుడు విఘ్నేశ్ శివన్ లకు చెన్నై హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఆ వివరాల్లోకి వెళితే... నయనతార జీవితంలోని ముఖ్య సంఘటనల ఆధారంగా ‘నయనతార: బియాండ్ద ఫెయిరీ టేల్’ అనే డాక్యుమెంటరీ రూపొందిన విషయం తెలిసిందే. నయనతార పుట్టినరోజు సందర్భంగా ఈ నెల 18 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ఈ డాక్యుమెంటరీ స్ట్రీమ్ అవుతోంది. కాగా ఈ డాక్యుమెంటరీలో విజయ్ సేతుపతి, నయనతార జంటగా వండర్ బార్ ఫిలిమ్స్ పతాకంపై విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో ధనుష్ నిర్మించిన ‘నానుమ్ రౌడీదాన్ ’ చిత్రంలోని సన్నివేశాలను ఉపయోగించారు. అయితే ఇలా వినియోగించడానికి ధనుష్ అనుమతి ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో ధనుష్‌ని విమర్శిస్తూ నయనతార ఒక లేఖను విడుదల చేశారు. అది సినీ వర్గాల్లో చర్చకి దారి తీసింది. ఇక తన అనుమతి లేకుండా ‘నానుమ్ రౌడీదాన్ ’లోని క్లిప్పింగ్ వాడినందుకు నష్టపరిహారంగా రూ. 10 కోట్లు కోరుతూ నయనతారపై చెన్నై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ బుధవారం న్యాయస్థానంలో విచారణకు వచ్చింది. ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన న్యాయమూర్తి దీనిపై వివరణ ఇవ్వాల్సిందిగా నయనతార, విఘ్నేష్ శివన్ లకు నోటీసులు జారీ చేశారు. మరి... తదుపరి పరిణామాలేంటి? అనేది వేచి చూడాల్సిందే. – సాక్షి, తమిళ సినిమా -
నయనతార డాక్యుమెంటరీ.. మరింత ముదిరిన వివాదం..!
కోలీవుడ్‌లో వివాదం మరింత ముదురుతోంది. ఇటీవల లేడీ సూపర్ స్టార్ నయనతార డాక్యుమెంటరీ రిలీజ్ తర్వాత మొదలైన వివాదం సరికొత్త మలుపు తిరిగింది. ఇప్పటికే రూ.10 కోట్ల పరిహారం కోరుతూ నోటీసులు పంపించిన హీరో ధనుశ్.. తాజాగా కోర్టులో దావా వేశారు. నయనతారతో పాటు ఆమె భర్త విఘ్నేశ్ శివన్‌పై తాజాగా దావా వేశారు. గతంలో నయన్, ధనుశ్ జంటగా నటించిన నానుమ్ రౌడీ దాన్ మూవీలోని మూడు సెకన్ల క్లిప్‌ను అనుమతి లేకుండా వినియోగించారంటూ ధనుశ్ టీమ్ ఆరోపించింది. ఈ విషయంపై ఇప్పటికే నయనతారకు నోటీసులు కూడా పంపారు. అయితే తాజాగా ఆ మూవీ నిర్మాణసంస్థ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది. పిటిషన్ పరిశీలించిన న్యాయస్థానం విచారణకు అనుమతించింది. అయితే ఇటీవల ఓ పెళ్లి వేడుకలో కలిసిన వీరిద్దరు ఒకరిని ఒకరు అస్సలు పట్టించుకోలేదు. అసలేం జరిగిందంటే..ఇటీవల విడుదలైన నయనతార నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీ బియాండ్ ది ఫెయిరీ టేల్ ఈ వివాదానికి కారణమైంది. ఆ డాక్యుమెంటరీ నానుమ్ రౌడీ ధాన్ మూవీలోని మూడు సెకన్ల వీడియోను ఈ డాక్యుమెంటరీలో ఉపయోగించారు. అయితే తన అనుమతి లేకుండా ఇలా చేయడం సరికాదని ధనుష్ రూ. 10 కోట్ల నష్ట పరిహారం కోరుతూ లీగల్ నోటీసులు పంపించారు. ఈ వివాదం కాస్తా కోలీవుడ్‌లో మరింత చర్చకు దారితీసింది. కాగా.. నయనతార డాక్యుమెంటరీలో నాగార్జున, రానా దగ్గుబాటి, తమన్నా భాటియా, ఉపేంద్ర, విజయ్ సేతుపతి, అట్లీ, పార్వతి తిరువోతు లాంటి స్టార్స్ కూడా కనిపించారు. -
ప్రభాస్‌తో నయనతార ‘స్పెషల్’ స్టెప్పులు..?
స్పెషల్ సాంగ్.. బడా హీరోల సినిమాల్లో ఇది మరింత స్పెషల్ అయిపోయింది. సినిమాలో స్టార్ హీరోయిన్లు ఒకరిద్దరు ఉన్నపటికీ.. స్పెషల్ సాంగ్‌కి వచ్చేసరికి కచ్చితంగా మరో స్టార్ హీరోయిన్ని తీసుకొస్తున్నారు. మార్కెట్ లెక్కలేసి మరీ ఐటమ్ సాంగ్‌పై ప్రత్యేక దృష్టిపెడతున్నారు. హీరో రేంజ్‌కి తగ్గట్లుగా స్టార్ హీరోయిన్‌తో స్పెషల్ డ్యాన్స్ చేయిస్తున్నారు. ఇప్పటికే పుష్ప 2 సినిమాలో శ్రీలీల స్పెషల్ సాంగ్ చేస్తుండగా..ఇప్పుడు ప్రభాస్ కోసం మరో స్టార్ హీరోయిన్ ‘ప్రత్యేక’ స్టెప్పులేసేందుకు రెడీ అవుతోందట. ఆమే లేడీ సూపర్‌స్టార్ నయనతార.ప్రస్తుతం ప్రభాస్ మారుతి దర్శకత్వంతో ‘ది రాజాసాబ్’ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మాళవికా మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రభాస్ ఇప్పటి వరకు చేయని రొమాంటిక్ హారర్ జానర్లో ఈ సినిమాను తెరకెక్కుతోంది. మారుతి చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. క్యాస్టింగ్ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కావడం లేదు. ఇక ఈ సినిమాలో ఓ ఐటమ్ సాంగ్ కూడా ఉందట. దాని కోసం ఓ భారీ సెట్ కూడా ఏర్పాటు చేయబోతున్నారట. అయితే ఈ స్పెషల్ సాంగ్‌ని మరింత స్పెషల్ చేసేందుకు నయనతారని బరిలోకి దింపబోతున్నారట. ఇప్పటికే ఈ పాట కోసం మారుతి నయనతారని సంప్రదించినట్లు తెలుస్తోంది. ఈ పాట చేసేందుకు నయన్ కూడా ఒప్పుకున్నట్లు సమాచారం. గతంలో మారుతి తెరకెక్కించిన బాబు బంగారం సినిమాలో నయనతార నటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ పరిచయంతోనే రాజాసాబ్తో స్టెప్పులేసేందుకు నయనతార గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. కాగా, ప్రభాస్, నయన్ కలిసి గతంలో యోగి అనే సినిమాలో నటించారు. మళ్లీ చాలా కాలం తర్వాత ప్రభాస్‌తో స్క్రీన్ షేర్ చేసుకుంటుంది నయనతార. వీరిద్దరి కలయికలో రాబోతున్న స్పెషల్ సాంగ్ ఎలా ఉంటుందో చూడాలి. -
హీరోలకు తక్కువేం కాదు.. ట్రైనింగ్ తీసుకుని మరీ ఫైట్స్ చేస్తున్న హీరోయిన్లు
వెండితెరపై వీలైనప్పుడల్లా ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్స్ చేస్తుంటారు హీరోయిన్లు. కొన్ని చిత్రాల్లో ఫెరోషియస్ రోల్స్ చేస్తుంటారు. పూర్తి స్థాయి యాక్షన్ సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి, ట్రైనింగ్ తీసుకుని మరీ ఫైట్స్ చేస్తుంటారు. హీరోలా సినిమాని నడిపించేలా హీరోషియస్ రోల్స్ చేస్తున్న కొంతమంది హీరోయిన్స్‌పై కథనం.ప్రతీకారంపవర్ఫుల్ ఉమన్ రోల్స్ చేసే అగ్రశ్రేణి హీరోయిన్స్ జాబితాలో అనుష్కా శెట్టి ముందు వరసలో ఉంటారు. ‘అరుంధతి, భాగమతి’ వంటి బ్లాక్‌బస్టర్ మూవీస్‌లో అనుష్క చేసిన నెక్ట్స్ లెవల్ పెర్ఫార్మెన్స్ను ఆడియన్స్ అంత సులభంగా మర్చిలేరు. కొంత గ్యాప్ తర్వాత ఇలాంటి ఓ పవర్ఫుల్ రోల్‌నే ‘ఘాటి’ చిత్రంలో చేస్తున్నారు అనుష్క. క్రిష్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.ఇటీవల ‘ఘాటి’ సినిమా గ్లింప్స్ విడుదలైంది. ఈ వీడియోలో ఓ మనిషి తలను అతి క్రూరంగా కొడవలితో నరికిన మహిళగా అనుష్క కనిపించారు. ఈ విజువల్స్ ఆమె పాత్ర ఎంత పవర్‌ఫుల్‌గా ఉంటుందో స్పష్టం చేశాయి. ‘షూటి’ షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్‌ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. త్వరలోనే విడుదల తేదీపై స్పష్టత రానుంది.ఇక వ్యాపారంలో అత్యుత్తమంగా ఎదుగుతున్న ఓ మహిళను కొందరు దారుణంగా మోసం చేస్తారు. ఈ మోసంతో ఆ మహిళ మనసు విరిగిపోయి, కఠినంగా మారుతుంది. తనను మోసం చేసిన వారిపై ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటుంది. ఎక్కడైతే ఓడిపోయిందో అక్కడే గెలవాలనుకుంటుంది. ఆ మహిళ ఎలా గెలిచింది? అన్నదే ‘ఘాటి’ కథ అని సమాచారం. ఈ సంగతి ఇలా ఉంచితే... క్రిష్ దర్శకత్వంలో 2010లో వచ్చిన ‘వేదం’ సినిమాలో అనుష్క ఓ లీడ్ రోల్ చేసిన సంగతి గుర్తుండే ఉంటుంది.శివశక్తిదాదాపు ఇరవైఏళ్ల సినీ కెరీర్లో హీరోయిన్ తమన్నా డిఫరెంట్ రోల్స్ చేశారు. వీటిలో కొన్ని యాక్షన్ తరహా చిత్రాలూ ఉన్నాయి. అయితే ఈసారి కొంచెం కొత్తగా యాక్షన్‌తో కూడిన ఆధ్యాత్మిక పాత్ర నాగసాధువు శివశక్తిగా కనిపించనున్నారు తమన్నా. దర్శకుడు సంపత్ నంది కథతో అశోక్ తేజ దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఓదెల 2’ సినిమాలోనే నాగసాధువు శివశక్తిగా తమన్నా కనిపిస్తారు.మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్ వర్క్స్ పతాకాలపై డి. మధు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. హెబ్బా పటేల్, వశిష్ఠ ఎన్. సింహ, యువ, నాగమహేశ్ వంశీ, గగన్ విహారి, సురేందర్ రెడ్డి, భూపాల్, పూజా రెడ్డి ఈ సినిమాలోని ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ఓదెల మల్లన్న ఆలయం, ఆ గ్రామంలో జరిగే కొన్ని ఊహాతీత ఘటనల నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది.కూతురి కోసం...ఓ రాక్షసుడి నుంచి తన చిన్నారి కుమార్తెను కాపాడుకోవడానికి ఓ తల్లి రాక్షసిగా మారింది. ఈ రాక్షసుడిపై యుద్ధం ప్రకటించింది. ఈ యుద్ధంలో ఆ తల్లి ఎలా పోరాడింది? అనే ఇతివృత్తంతో తెరకెక్కుతున్న తమిళ సినిమా ‘రాక్కాయి’. నయనతార లీడ్ రోల్లో నటిస్తున్న తాజా చిత్రం ఇది. ఇందులో కూతురి రక్షణ కోసం ఎంతకైనా తెగించే తల్లి పాత్రలో నయనతార నటిస్తున్నారు. సెంథిల్ నల్లసామి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.ఇటీవల ఈ సినిమా టైటిల్ గ్లింప్స్‌ను రిలీజ్ చేశారు. ఓ చేతిలో బరిసె పట్టుకుని, ఆ బరిసెకు కొడవలి బిగించి, మరో చేతిలో మరో కొడవలిని పట్టుకుని ప్రత్యర్థులపై విరుచుకుపడుతున్న నయనతార విజువల్స్ ‘రాక్కాయి’ టైటిల్ గ్లింప్స్‌లో కనిపించాయి. ఇప్పటివరకు ‘డోరా, ఐరా, నెట్రిక్కన్’ వంటి హారర్ ఫిల్మ్స్, ‘కర్తవ్యం’ వంటి సామాజిక సందేశం ఉన్న సినిమాల్లోనే నయనతార ఎక్కువగా నటించారు. తొలిసారిగా ఆమె ‘రాక్కాయి’ వంటి పూర్తి స్థాయి యాక్షన్ సినిమా చేస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి.వంట గదిలో తుపాకీకిచెన్లో గరిటె పట్టుకునే గృహిణిగానే కాదు... అవసరమైతే అదే చేత్తో తుపాకీ కూడా పట్టుకోగలదు. ఇంతకీ ఆ గృహిణి పూర్తి కథ ఏంటో తెలుసుకోవాలంటే ‘మా ఇంటి బంగారం’ సినిమా థియేటర్స్‌లోకి వచ్చేంతవరకూ వేచి ఉండాలి. ఇందులో సమంత లీడ్ రోల్లో నటిస్తారు. ‘ట్రా లా లా’ పిక్చర్స్ పతాకంపై ఈ సినిమాను సమంతనే నిర్మిస్తుండటం విశేషం. ఈ ఏడాది సమంత బర్త్ డే సందర్భంగా ఏప్రిల్ 28న ఈ సినిమాను ప్రకటించారు.అయితే ఈ సినిమాలోని ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు, షూటింగ్ అప్డేట్స్ వంటి విషయాలపై అధికారిక సమాచారం రావాల్సి ఉంది. ‘సినిమా బండి’ ఫేమ్ ప్రవీణ్ కంద్రేగుల ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారని, షూట్ మొదలైందని సమాచారం. ఇక ‘ది ఫ్యామిలీ మేన్’ వెబ్ సిరీస్‌లో సమంత ఓ యాక్షన్ రోల్ చేసి, బుల్లితెరపై సూపర్‌హిట్ అయ్యారు. ఇప్పుడు వెండితెరపైనా ఈ రిజల్ట్‌ను రిపీట్ చేయాలనుకుని యాక్షన్ బేస్డ్ మూవీ ‘మా ఇంటి బంగారం’కి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారని టాక్.హ్యాండ్ బాగ్‌లో బాంబుఓ అమ్మాయి హ్యాండ్‌బ్యాగ్‌లో ఏముంటాయి? మేకప్ కిట్, మొబైల్ ఫోన్... వగైరా వస్తువులు ఉండటం కామన్. కానీ ఓ అమ్మాయి హ్యాండ్‌బ్యాగ్‌లో మాత్రం రక్తంతో తడిసిన కత్తి, ఓ తుపాకీ, బాంబు ఉన్నాయి. ఆ అమ్మాయి ఎవరు అంటే రివాల్వర్ రీటా. వెండితెరపై రివాల్వర్ రీటాగా చేస్తున్నారు కీర్తీ సురేష్. పవర్ఫుల్ ఉమన్ రోల్స్ చేయడంలో సిద్ధహస్తురాలైన హీరోయిన్స్‌లో ఒకరైన కీర్తీ సురేష్ ‘రివాల్వర్ రీటా’లో మరోసారి నటిగా తానేంటో చూపించనున్నారు. ఈ సినిమాను తమిళ దర్శకుడు కె. చంద్రు తెరకెక్కిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానున్న ఈ సినిమా రిలీజ్‌పై త్వరలోనే ఓ స్పష్టత రానుంది.గాంధారి గతంకిడ్నాప్కు గురైన తన కుమార్తెను రక్షించుకోవడం కోసం ఓ తల్లి చేసే సాహసాల నేపథ్యంలో రూపొందుతున్న చిత్రం ‘గాంధారి’. ఈ చిత్రంలో తల్లి పాత్రలో తాప్సీ నటిస్తున్నారు. ఈ ఫిల్మ్‌లోని కొన్ని యాక్షన్ సీక్వెన్స్‌లను ఆమె డూప్ లేకుండా చేశారు. దేవాశిశ్ మఖీజా దర్శకత్వంలో ఈ సినిమాను కనికా థిల్లాన్ నిర్మిస్తున్నారు. ఓ తల్లి గతం వల్ల ఆమె కూతురు ఎలాంటి ప్రమాదాలను ఎదుర్కోవాల్సి వస్తుంది? కూతుర్ని కాపాడుకోవడం కోసం ఆ తల్లి ఏం చేసింది? అనే అంశాలతో ‘గాంధారి’ చిత్రకథ ఉంటుందని సమాచారం.ఇలా యాక్షన్ రోల్స్ చేసే హీరోయిన్స్ మరికొంతమంది ఉన్నారు. : ముసిమి శివాంజనేయులు -
ఆ వ్యక్తి ప్రేమిస్తున్నట్లు నన్ను నమ్మించాడు : నయనతార
ప్రేమ విషయంలో తన ఊహాగానాలు తారుమారయ్యాయని హీరోయిన్ నయనతార భావోద్వేగానికి గురయ్యారు. ఇంతకీ విషయం ఏంటంటే... నయనతార వ్యక్తిగత జీవితం, సినీ జీవితం, పెళ్లి వంటి అంశాల ఆధారంగా ‘నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్’ డాక్యుమెంటరీ రూపొందిన సంగతి తెలిసిందే. నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లో ఈ డాక్యుమెంటరీ ఈ నెల 18 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. కాగా తన జీవితంలోని కొన్ని ఆసక్తికరమైన విషయాలను ఈ డాక్యుమెంటరీ వేదికగా నయనతార పంచుకున్నారు. సినిమా సెట్స్‌లో నయనతార మొబైల్ ఫోన్ మోగితే, ఆమె చాలా డల్ అయిపోయేవారు అంటూ నాగార్జున ఈ డాక్యుమెంటరీలో మాట్లాడారు. (చదవండి: ‘నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్’ రివ్యూ)ఈ విషయంపై నయనతార స్పందించారు. ‘‘నిజానికి ప్రేమ అనేది నమ్మకంపై ఆధారపడి ఉంటుంది. నేనొక వ్యక్తిని మనస్ఫూర్తిగా నమ్మాను. తను నన్ను ప్రేమిస్తున్నాడని అనుకున్నాను. నన్ను అలా నమ్మించాడు. రిలేషన్షిప్లో అబ్బాయి – అమ్మాయిల మధ్య ఏదైనా జరిగితే, ఎక్కువగా అమ్మాయిల గురించే మాట్లాడుకుంటారు. తప్పంతా అమ్మాయిలదే అన్నట్లు వార్తలు రాస్తారు. ఎవరూ మగాళ్లను అడగరు’’ అంటూ ఒకింత భావోద్వేగంతో మాట్లాడారు నయనతార. అయితే తనని నమ్మించిన వ్యక్తి పేరుని మాత్రం నయనతార వెల్లడించలేదు. -
మొన్నటి వరకు గొడవలు..! ఇప్పుడు పెళ్లి వేడుకకు హాజరు
-
స్టార్ జంటకు ఘోర అవమానం.. 30 నిమిషాలైనా ఎవరూ కూడా!
సినీతారలు రోడ్డు మీద కనపడితే చాలు సెల్ఫీల కోసం ఎగబడతారు. అంతేకాదు పోటీపడి మరీ వారితో ఫోటోలు దిగేందుకు వెనుకాడరు. సినీతారలకు ఉన్న క్రేజ్ అలాంటిది. బయట ఎక్కడైనా సినీ సెలబ్రిటీలు కనిపిస్తే ఇంకేముంది ఎంచక్కా వారితో సెల్ఫీ కోసం ఎగబడతాం. కానీ అందుకు భిన్నంగా ఓ విచిత్రమైన సంఘటన జరిగింది. అదేంటో మీరు చూసేయండి.దక్షిణాది స్టార్ జంటగా గుర్తింపు ఉన్న సెలబ్రిటీ కపుల్ నయనతార- విఘ్నేశ్ శివన్. ఇటీవల నయన్ తన భర్తతో కలిసి బర్త్ డే సెలబ్రేట్ చేసుకునేందుకు ఢిల్లీకి వెళ్లారు. ఓ హోటల్‌కు వెళ్లిన నయన్- విఘ్నేశ్ దాదాపు 30 నిమిషాల పాటు లైన్లోనే వెయిట్ చేసిన తర్వాత టేబుల్ దక్కించుకున్నారు. అయితే ఆ సమయంలో వీరిని అక్కడా ఎవరూ కూడా గుర్తు పట్టలేదు. అంతేకాదు వీళ్ల వైపు కనీసం కన్నెత్తి కూడా చూడలేదు. అదే మనమైతే పక్కన పెట్టి ఫోటోల కోసం పోటీ పడేవాళ్లేమో. దీనికి సంబంధించిన వీడియోను విఘ్నేశ్ శివన్ తన ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు.విఘ్నేశ్ శివన్ తన ఇన్‌స్టాలో రాస్తూ..'17 నవంబర్.. చాలా ఏళ్ల తర్వాత సింపుల్‌గా పుట్టినరోజు వేడుక జరుపుకున్నాం. ఇలా డిన్నర్ చేయడం చాలా సంతోషంగా అనిపించింది. దాదాపు 30 నిమిషాలు లైన్లో ఉన్నాం. చివరికీ ఒక మంచి టేబుల్ దొరికింది. ఈ వీడియో తీసిన వ్యక్తికి నా ధన్యవాదాలు' అంటూ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అంతకుముందు విఘ్నేష్, నయనతార తమ కుమారులతో కలిసి ఢిల్లీలోని కుతాబ్ మినార్ను సందర్శించారు. ఆ జంట రాజధానిలోని ఓ ఫేమస్ హోటల్‌కి వెళ్లారు. అక్కడ కూడా వారిని ఎవరూ గుర్తించలేదు.నయనతార ఇటీవల తన నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీ నయనతార: బియాండ్ ది ఫెయిరీటేల్ తర్వాత వివాదంలో చిక్కుకున్నారు. ధనుశ్ హీరోగా నటించిన నానుమ్ రౌడీ ధాన్ సెట్స్ ఓ క్లిప్‌ను ఉపయోగించినందుకు ఆమెకు రూ. 10 కోట్ల లీగల్ నోటీసు పంపారు. ఆ తర్వాత దీనిపై నయనతార ఓ బహిరంగ లేఖను కూడా విడుదల చేశారు. View this post on Instagram A post shared by Vignesh Shivan (@wikkiofficial) -
టాప్ ప్రొడ్యూసర్ పెళ్లిలో హైలైట్‌గా ధనుష్, నయన్, కానీ.. (ఫొటోలు)
-
ఎరుపు రంగు చీరలో లేడీ సూపర్ స్టార్ ..వైరల్‌గా పెళ్లినాటి పోటోలు
-
నయనతారతో డేటింగ్.. నన్ను ఆ జంతువుతో పోల్చారు: విఘ్నేశ్ శివన్
కోలీవుడ్ డైరెక్టర్ విఘ్నేశ్ శివన్ లేడీ సూపర్ స్టార్ నయనతారను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. కొన్నేళ్ల పాటు డేటింగ్లో ఉన్న వీరిద్దరు ఆ తర్వాత వివాహాబంధంలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత ఈ జంట సరోగసీ ద్వారా కవలలకు తల్లిదండ్రులయ్యారు. అయితే తాజాగా నయనతార తన జర్నీని డాక్యుమెంటరీ రూపంలో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది. నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్ తెరకెక్కించిన ఈ డాక్యుమెంటరీ ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.ఈ డాక్యుమెంటరీలో నయన్ భర్త విఘ్నేశ్ శివన్ ఓ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. నయనతారతో డేటింగ్ సమయంలో తాను ఎదుర్కొన్న ఇబ్బందులను ఇందులో వివరించారు. తాను నయన్‌తో డేటింగ్లో ఉన్నప్పుడు పబ్లిక్ రియాక్షన్ ఎలా ఉందో తనకు తెలుసన్నారు. ఒక మృగాన్ని అందమైన అమ్మాయి ఎంచుకుంటే దానిని ఎవరూ ఆపలేరంటూ.. నన్ను కుక్కతో పోల్చారని విఘ్నేశ్ శివన్ వెల్లడించారు. కుక్కకు బిర్యానీ తినిపిస్తున్నారని చేసిన మీమ్‌లో మా ఇద్దరి చిత్రాలు ఉన్నాయని విఘ్నేశ్ తెలిపారు.అయితే తాను నయనతారతో డేటింగ్ చేయడంలో తప్పు ఏంటని ట్రోలర్స్‌ను విఘ్నేశ్ ప్రశ్నించాడు. బస్ కండక్టర్ సూపర్ స్టార్ (రజినీకాంత్) అయ్యారు.. మన జీవితంలో ఒక గొప్ప స్థానానికి చేరుకోవడం అంత తేలిక కాదని అన్నారు. మేమిద్దరం లవ్‌లో ఉన్నప్పుడు చాలా ట్రోల్స్ వచ్చాయని తెలిపారు. వాటిని నేను తేలిగ్గా తీసుకున్నప్పటికీ.. నయనతార గిల్టీగా ఫీలయిందని పేర్కొన్నారు. కొన్నిసార్లు నేను తన జీవితంలో భాగం కాకపోతే.. ఆమె మరింత సంతోషంగా ఉండేదన్న భావనతో కలిగిందని విఘ్నేశ్ శివన్ తెలిపాడు.నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్ డాక్యుమెంటరీలో నయన్ తన ప్రేమ జీవితం, కెరీర్ ఆధారంగా తీసుకొచ్చారు. ఆమె తన అరంగేట్రం నుంచి సినీ ప్రయాణం చూపించారు. ఇందులో నాగార్జున, రానా దగ్గుబాటి, తాప్సీ పన్ను, రాధిక శరత్‌కుమార్, పార్వతి తిరువోతు లాంటి స్టార్స్ కూడా నటించారు. కాగా.. ఈ డాక్యుమెంటరీ రిలీజ్ తర్వాత ధనుశ్- నయనతార మధ్య వివాదం మొదలైంది. అనుమతి లేకుండా నానుమ్ రౌడీ ధాన్ మూవీ క్లిప్‌లను ఉపయోగించినందుకు నిర్మాతలకు లీగల్ నోటీసులు పంపారు ధనుశ్. -
వివాదంలో నయన్.. మహేశ్ బాబు పోస్ట్ వైరల్
గత రెండు మూడు రోజులుగా నయనతార-ధనుష్ వివాదం తమిళ ఇండస్ట్రీలో హాట్ టాపిక్. 3 సెకన్ల ఫుటేజీ కోసం రూ.10 కోట్లు డిమాండ్ చేయడం ఏంటా అని నయన్ అడగడంతో ధనుష్ ఫ్యాన్స్ రెచ్చిపోతున్నారు. మరోవైపు ఈమె అభిమానులు.. తామేం తక్కువ కాదన్నట్లు పాత విషయాల్ని తవ్వి తీస్తూ ఏందిరి ఈ పంచాయతీ అనేలా చేస్తున్నారు.ఈ కాంట్రవర్సీ అలా ఉంచితే నయనతార జీవితం, పెళ్లి గురించి తీసిన డాక్యుమెంటరీ 'నయనతార: బియాండ్ ద లైఫ్ స్టోరీ' నెట్‌ఫ్లిక్స్ సోమవారం రిలీజైంది. ఏదో అంతంత మాత్రంగానే ఉందనే రివ్యూస్ వచ్చాయి. అయితే ఈ డాక్యుమెంటరీ చూసిన మహేశ్ బాబు.. మూడు లవ్ ఏమోజీలతో ఇన్ స్టాలో స్టోరీ పెట్టాడు. దీంతో నెటిజన్లు ఫన్నీ సెటైర్లు వేస్తున్నారు.(ఇదీ చదవండి: అయ్యప్ప మాలలో చరణ్.. కానీ దర్గాకు ఎందుకు వెళ్లాడంటే?)నయన్ డాక్యుమెంటరీ మహేశ్‌కి అంత నచ్చేసిందా? షూటింగ్ లేకపోయేసరికి ఫుల్ ఖాళీగా ఉన్నట్లున్నాడు? అనే కామెంట్స్ సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. సినిమాలే కాకుండా డాక్యుమెంటరీలని కూడా వదలకుండా రివ్యూస్ ఇచ్చేస్తున్నాడుగా అనే ఫన్నీ సెటైర్లు నుంచి స్వయంగా అతడి అభిమానుల నుంచే వస్తున్నాయి.ప్రస్తుతం రాజమౌళి సినిమా మేకోవర్ అవుతున్న మహేశ్ బాబు.. మొన్నటివరకు గడ్డంతో కనిపించాడు. తాజాగా కీరవాణి కొడుకు ప్రీ వెడ్డింగ్‌లో క్లీన్ షేవ్‌తో దర్శనమిచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు వైరల్ అయ్యాయి.(ఇదీ చదవండి: రూమర్స్ కాదు నిజంగానే కీర్తి సురేశ్‌కి పెళ్లి సెట్!) -
నయన్- ధనుశ్ వివాదం.. ఆ విషయం తెలిసి షాకయ్యా: రాధిక శరత్ కుమార్
ధనుశ్- నయనతార వ్యవహారం కోలీవుడ్‌ను కుదిపేస్తోంది. ఇటీవల విడుదలైన నయనతార నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీ బియాండ్ ది ఫెయిరీ టేల్ ఈ వివాదానికి కారణమైంది. ఆ డాక్యుమెంటరీ నానుమ్ రౌడీ ధాన్ మూవీలోని మూడు సెకన్ల వీడియోను ఈ డాక్యుమెంటరీలో ఉపయోగించారు. అయితే తన అనుమతి లేకుండా ఇలా చేయడం సరికాదని ధనుష్ రూ. 10 కోట్ల నష్ట పరిహారం కోరుతూ లీగల్ నోటీసు పంపించారు. దీంతో ఈ వివాదం కాస్తా కోలీవుడ్‌లో మరింత చర్చకు దారితీసింది.అయితే తాజాగా ఈ వ్యవహారంపై సీనియర్ నటి రాధిక శరత్‌కుమార్ స్పందించారు. నానుమ్ రౌడీ ధాన్‌లో కీలక పాత్ర పోషించిన రాధిక ధనుశ్ ప్రవర్తనపై మాట్లాడారు. ఈ మూవీ సెట్స్‌లో నయనతార, విఘ్నేష్ శివన్‌ల ప్రేమ వ్యవహారం గురించి తనతో చెప్పాడని తెలిపింది. ఆ మూవీ షూటింగ్ టైమ్‌లో ధనుశ్ నాకు ఫోన్ చేసి ఈ విషయం చెప్పాడని వివరించింది. ధనుశ్ ఫోన్లో మాట్లాడుతూ అక్కా.. నీకు సిగ్గు లేదా? అని అడిగాడు. అతను ఏమి చెబుతున్నాడో నాకు అర్థం కాలేదు. 'ఏం జరుగుతుందో నీకు తెలియదా?, 'విక్కీ, నయన్‌లు డేటింగ్ చేస్తున్నారని ధనుశ్ నాతో అన్నాడని తాజాగా విడుదలైన డాక్యుమెంటరీలో రాధిక వివరించింది. ఆ తర్వాత వెంటనే 'ఏం మాట్లాడుతున్నావ్.. నాకేమీ తెలీదు' అని షాకింగ్‌కు గురైనట్లు డాక్యుమెంటరీలో చెప్పుకొచ్చింది.కాగా.. నయనతార డాక్యుమెంటరీలో నాగార్జున, రానా దగ్గుబాటి, తమన్నా భాటియా, ఉపేంద్ర, విజయ్ సేతుపతి, అట్లీ, పార్వతి తిరువోతు లాంటి స్టార్స్ కూడా కనిపించారు. కేవలం మూడు సెకన్ల ఫుటేజీని ఉపయోగించినందుకు ధనుశ్ లీగల్ నోటీసులు పంపడంతో ఈ వివాదం మరింత ముదిరింది. -
ధనుశ్- నయనతార వివాదం.. మంచి ఎంటర్టైనింగ్గా ఉందన్న నటుడు!
ప్రస్తుతం కోలీవుడ్‌లో ధనుశ్-నయనతార వివాదం హాట్ టాపిక్‌గా మారింది. ఇటీవల నయన్ తన నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీ నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్ రిలీజ్ తర్వాత వీరిద్దర మధ్య వార్ మొదలైంది. ఆ డాక్యుమెంటరీ నానుమ్ రౌడీ ధాన్ మూవీలోని మూడు సెకన్ల వీడియోను ఈ డాక్యుమెంటరీలో ఉపయోగించారు. అయితే తన అనుమతి లేకుండా ఇలా చేయడం తగదంటూ, ధనుష్ రూ. 10 కోట్ల నష్ట పరిహారం కోరుతూ లీగల్ నోటీసు పంపించారు. దీంతో ఈ వివాదం కాస్తా కోలీవుడ్‌లో మరింత చర్చకు దారితీసింది.అయితే తాజాగా ఈ వివాదంపై నానుమ్ రౌడీ ధాన్ నటుడు ఆర్జే బాలాజీ స్పందించారు. ఈ విషయం తనకు సోషల్ మీడియా ద్వారా తెలిసిందన్నారు. అయితే వీరి మధ్య జరుగుతున్న ఫైట్ ప్రేక్షకులకు మంచి ఎంటర్టైనర్గా మారిందని ఆయన అన్నారు. ఈ విషయంలో నేనేం చెప్పలేను.. దీనిపై మాట్లాడానికి నేను ఎవరినీ? అని వెల్లడించారు. ఆదివారం చెన్నైలో ఓ ఈవెంట్లో పాల్గొన్న ఆయన మీడియా అడిగిన ప్రశ్నకు పైవిధంగా స్పందించారు.(ఇది చదవండి: నయనతార- ధనుష్ వీడియో క్లిప్ వివాదం.. హీరో తండ్రి షాకింగ్ కామెంట్స్!)వాళ్లిద్దరూ కూడా సినీరంగంలో అనుభవమున్న వ్యక్తులనీ ఆర్జే బాలాజీ అన్నారు. ఈ వివాదాన్ని ఎలా పరిష్కరించుకోవాలో వారికి తెలుసన్నారు. ప్రస్తుతానికి నా దృష్టంతా సూర్య సర్‌తో చేయాల్సిన సినిమాపైనే ఉందని ఆయన తెలిపారు.