మరో ప్రేమకథ ఆరంభం | Nayanthara and Kavin next film Update | Sakshi
Sakshi News home page

మరో ప్రేమకథ ఆరంభం

Published Wed, Jul 24 2024 12:43 AM | Last Updated on Wed, Jul 24 2024 12:43 AM

Nayanthara and Kavin next film Update

ఇప్పటివరకూ పలు ప్రేమకథా చిత్రాల్లో నటించారు నయనతార. తాజాగా సిల్వర్‌ స్క్రీన్‌పై మరో రొమాంటిక్‌ లవ్‌ స్టోరీకి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారీ బ్యూటీ. తమిళ దర్శకుడు లోకేశ్‌ కనగరాజ్‌ దగ్గర అసిస్టెంట్‌గా చేసిన విష్ణు ఎడవన్‌ ఈ న్యూ ఏజ్‌ రొమాంటిక్‌ లవ్‌స్టోరీ మూవీతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.

మధ్య వయస్కురాలైన ఓ మహిళ, ఓ కుర్రాడి మధ్య ఉన్న ప్రేమ బంధాన్ని నేటి సమాజం ఎలా చూస్తుంది? అనేది ఈ చిత్రం ప్రధానాంశమని కోలీవుడ్‌ సమాచారం.  మధ్యవయస్కురాలిపాత్రలో నయనతార, కుర్రాడిపాత్రలో కెవిన్‌ కనిపిస్తారు. ప్రస్తుతం నయనతార, కెవిన్‌పాల్గొంటుండగా కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు దర్శకుడు విష్ణు. లలిత్‌ నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కానుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement