Kevin
-
బిగ్‌బాస్ షోతో స్టార్డమ్.. రోడ్డుపై భిక్షాటన.. రూ.20 రావడంతో..
సీరియల్స్ నుంచి సినిమాలవైపు అడుగులు వేశాడు హీరో కెవిన్. తమిళ బిగ్‌బాస్ మూడో సీజన్లో పాల్గొని రూ.5 లక్షలతో షో నుంచి బయటకు వచ్చేశాడు. ఈ రియాలిటీ షో తర్వాత కెవిన్‌కు బోలెడంత పాపులారిటీ వచ్చింది. అప్పటిదాకా నటుడిగా చిన్నాచితకా పాత్రలు చేసిన ఇతడు ఒక్కసారిగా హీరో అయ్యాడు.యాచకుడిగా మారిన హీరోనాట్పున ఎన్నను తెరియుమా, లిఫ్ట్, దాదా, స్టార్ వంటి చిత్రాలు చేశాడు. ప్రస్తుతం ఇతడు నటించిన బ్లడీ బెగ్గర్స్ మూవీ దీపావళికి రెడీ అవుతోంది. శివబాలన్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రాన్ని జైలర్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్‌కుమార్ నిర్మిస్తున్నారు. తాజాగా కెవిన్ ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాన్ని బయటపెట్టాడు. బ్లడీ బెగ్గర్ సినిమా కోసం నిజంగానే యాచకుడిగా మారాడు.దానం చేసిన యువతికెవిన్ మాట్లాడుతూ.. నేను భిక్షగాడి గెటప్ వేసుకుని రోడ్డుపైకి వెళ్లాను. నన్నెవరైనా గుర్తుపడతారా? లేదా? యాచకుడినే అని నమ్ముతారా? అనుమానిస్తారా? టెస్ట్ చేద్దామనుకున్నాను. కానీ ఒకమ్మాయి నాకు రూ.20 దానం చేసింది. అప్పుడు నా లుక్‌పై నమ్మకం పెరిగింది. అలా ఈ మూవీ షూటింగ్ ప్రారంభించాము అని చెప్పుకొచ్చాడు.చదవండి: ప్రేరణపై పగబట్టిన పృథ్వీ.. నామినేషన్స్‌లో తనూ ఉండాల్సిందేనంటూ.. -
మరో ప్రేమకథ ఆరంభం
ఇప్పటివరకూ పలు ప్రేమకథా చిత్రాల్లో నటించారు నయనతార. తాజాగా సిల్వర్ స్క్రీన్‌పై మరో రొమాంటిక్ లవ్ స్టోరీకి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారీ బ్యూటీ. తమిళ దర్శకుడు లోకేశ్ కనగరాజ్ దగ్గర అసిస్టెంట్‌గా చేసిన విష్ణు ఎడవన్ ఈ న్యూ ఏజ్ రొమాంటిక్ లవ్‌స్టోరీ మూవీతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.మధ్య వయస్కురాలైన ఓ మహిళ, ఓ కుర్రాడి మధ్య ఉన్న ప్రేమ బంధాన్ని నేటి సమాజం ఎలా చూస్తుంది? అనేది ఈ చిత్రం ప్రధానాంశమని కోలీవుడ్ సమాచారం. మధ్యవయస్కురాలిపాత్రలో నయనతార, కుర్రాడిపాత్రలో కెవిన్ కనిపిస్తారు. ప్రస్తుతం నయనతార, కెవిన్పాల్గొంటుండగా కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు దర్శకుడు విష్ణు. లలిత్ నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కానుంది. -
ఫిక్కీ మీడియా కమిటీ చైర్మన్‌గా కెవిన్
న్యూఢిల్లీ: పరిశ్రమల సమాఖ్య ఫిక్కీ మీడియా, ఎంటర్టైన్మెంట్ కమిటీ చైర్మన్‌గా కెవిన్ వాజ్ నియమితులయ్యారు. ఆయన ప్రస్తుతం వయాకామ్18లో బ్రాడ్కాస్ట్ ఎంటర్టైన్మెంట్ విభాగం సీఈవోగా ఉన్నారు. వాజ్‌కు మీడియా, వినోద రంగంలో దాదాపు మూడు దశాబ్దాల అనుభవం ఉంది. ఈ కమిటీలో టీవీ, రేడియో, ప్రింట్, ఫిలిం ప్రొడక్షన్ తదితర విభాగాలకు సంబంధించిన ప్రమోటర్లు, సీఈవోలు.. సభ్యులుగా ఉన్నారు. -
ప్రతినిధుల సభ స్పీకర్‌గా మెక్‌కార్తీ.. 15వ రౌండ్లో తేలిన ఫలితం
వాషింగ్టన్: అమెరికా కాంగ్రెస్(పార్లమెంట్)లోని ప్రతినిధుల సభ నూతన స్పీకర్‌గా రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి కెవిన్ మెక్‌కార్తీని ఎన్నికయ్యారు. గత మూడు రోజులుగా కొనసాగుతున్న అనిశ్చితికి ముగింపు పలుకుతూ మెక్‌కార్తీకి మద్దతు తెలిపారు నేతలు. రిపబ్లికన్ పార్టీ నేతల మధ్య అంతర్గత కలహాలతో 15 రౌండ్ల హైడ్రామా తర్వాత స్పీకర్‌ను ఎన్నుకున్నారు. ప్రతినిధుల సభ స్పీకర్‌గా ఎన్నికయ్యేందుకు ఈ 57 ఏళ్ల కాలిఫోర్నియన్ నేత మెక్‌కార్తీకి మొదటి రౌండ్లోనే సులభంగా మెజారిటీ రావాల్సింది. కానీ, పార్టీలో అంతర్గతంగా నెలకొన్న విభేదాల కారణంగా కొంత మంది నేతలను ఆయనను వ్యతిరేకిస్తూ వచ్చారు. అమెరికా కాంగ్రెస్ 160 ఏళ్ల చరిత్రలో ఇదే అత్యంత సుదీర్ఘ కాలం సాగిన స్పీకర్ ఎన్నికగా నిలించింది. మెక్‌కార్తీని స్పీకర్‌గా ఎన్నుకునేందుకు రిపబ్లికన్ నేతలు 15 రౌండ్ల ఓటింగ్ వరకు తీసుకెళ్లారు. ఇదీ చదవండి: స్పీకర్ పదవికి పోటీలో డొనాల్డ్ ట్రంప్.. వచ్చింది ఒకే ఒక్క ఓటు -
రిపబ్లికన్ అభ్యర్థి మెక్‌కార్తీకి ఎదురుదెబ్బ
వాషింగ్టన్: అమెరికా కాంగ్రెస్(పార్లమెంట్)లో దిగువ సభ అయిన ప్రతినిధుల సభ(హౌజ్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్)లో ప్రతిపక్ష రిపబ్లికన్ పార్టీదే మెజార్టీ. అయినప్పటికీ స్పీకర్ ఎన్నికలో ఆ పార్టీ అభ్యర్థి నెగ్గలేకపోయారు. నూతన సభ మంగళవారం కొలువుదీరింది. తొలిరోజు సభాపతి (స్పీకర్) ఎన్నిక నిర్వహించారు. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా పోటీకి దిగిన కెవిన్ మెక్‌కార్తీ మెజార్టీ ఓట్లు కూడగట్టడంలో విఫలమమ్యారు. మంగళవారం రాత్రంతా సభలో హైడ్రామా చోటుచేసుకుంది. మూడు రౌండ్లు ఓటింగ్ నిర్వహించారు. స్పీకర్‌గా నెగ్గడానికి 218 ఓట్లు అవసరం కాగా, మెక్‌కార్తీకి తొలి రెండు రౌండ్లలో 203 ఓట్ల చొప్పున, మూడో రౌండ్లో 202 ఓట్లు వచ్చాయి. దీంతో తదుపరి ఓటింగ్‌ను స్థానిక కాలమానం ప్రకారం బుధవారం మధ్యాహ్నానికి వాయిదా వేశారు. స్పీకర్ లేకుండానే సభ వాయిదా పడింది. అమెరికా చరిత్రలో 1923 నుంచి చూస్తే ప్రతినిధుల సభలో తొలి రోజు స్పీకర్‌ను ఎన్నుకోలేకపోవడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. మెక్‌కార్తీ ఇక ఏం చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. కొత్త స్పీకర్ ఎన్నికయ్యే దాకా సభలో ఓటింగ్ నిర్వహిస్తారు. మెక్‌కార్తీకి వ్యక్తిగతంగా, రాజకీయంగా చాలామంది ప్రత్యర్థులు ఉన్నారని రిపబ్లికన్ ముఖ్యనేత ఒకరు చెప్పారు. ఆయన స్పీకర్‌గా ఎన్నిక కావడం సొంత పార్టీలోనే కొందరికి ఇష్టం లేదన్నారు. మెక్‌కార్తీ స్పీకర్ కావడం కష్టమేనని రిపబ్లికన్ సభ్యుడు బాబ్గుడ్ వ్యాఖ్యానించారు. స్పీకర్ లేకుండా సభ సంపూర్ణం కాదు. నూతన సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించడం, కమిటీలకు చైర్మన్లను నియమించడం, సభా కార్యకలాపాలు నిర్వహించడం వంటివి స్పీకర్ బాధ్యతలే. మెజారిటీ ఉన్నా సొంత పార్టీ అభ్యర్థి స్పీకర్‌గా నెగ్గకపోవడం విపక్షానికి చేదు అనుభవమేనని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. -
అదిగదిగో మరో భూమి!
ఉండే ఇల్లు సరిపోకపోతే కొత్త ఇల్లు వెతుకుంటాం! పెరిగిపోతున్న జనాభాను మనం నివసించే ఈభూమి తట్టుకోలేదని భావిస్తున్న సైంటిస్టులు మరో ఆవాసం కోసం ఎన్నాళ్లుగానో వెతుకుతున్నారు. తాజాగా వారి ఆశలు చిగురించేలా సూపర్ ఎర్త్ ఒకటి కనిపించింది. ఇప్పటివరకు సైంటిస్టులు సుదూర నక్షత్రాల చుట్టూ పరిభ్రమించే గ్రహాల్లో భూమిలాంటి గ్రహం ఉంటుందని భావించడమే జరిగింది. తాజా పరిశోధనలో సూపర్ ఎర్త్‌ను ఫొటోలు తీయడం కూడా జరిగింది. మన పొరుగునే ఉన్న ఆల్ఫాసెంచురీ నక్షత్రం చుట్టూ మన కొత్త భూమి తిరుగుతోంది. ఇలాంటి గ్రహాలను ఫొటో తీయడానికి ఇంకా పూర్తిస్థాయి సూపర్ టెలిస్కోపులు రెడీ కాలేదు. కానీ కెవిన్ వాగ్నర్ నేతత్వంలోని బృందం మాత్రం ఒక కొత్త టెక్నిక్‌తో కొత్త భూమిని ఫొటో తీశామని చెబుతోంది. నెప్ట్యూన్ కన్నా చిన్నది, భూమి కన్నా పెద్దదైన ఈ గ్రహాన్ని ఇన్ఫ్రారెడ్ మెథడ్‌లో ఫొటో తీశారు. ఇందుకోసం ఎన్ఈఏఆర్ పరికరాన్ని వాడారు. దాదాపు వంద గంటలు పరిశీలించి, పరిశోధిస్తే చివరకు ఈ గ్రహం ఉనికిని పసిగట్టగలిగారు. దీనికి సీ1 అని పేరుపెట్టారు. నిజానికి పలు నక్షత్రాల చుట్టూ పలు గ్రహాలను మనిషి గుర్తించాడు. కానీ వీటిలో అధిక శాతం గ్రహాలు వాయుగ్రహాలు అంటే మన జూపిటర్, సాటరన్ లాంటివి. మనిషి జీవించాలంటే ఇలాంటి గ్రహాలు పనికి రావు. జీవి మనుగడకు వాయు గ్రహాల(గాసియస్ ప్లానెట్స్) కన్నా మాస్ ప్లానెట్స్ ఉపయుక్తమైనవి. ఇప్పుడు కనుగొన్న సీ1 గ్రహం గురించి మరిన్ని వివరాలకోసం సైంటిస్టులు పరిశోధిస్తున్నారు. వీరి ప్రయోగాలు, పరిశోధనలు నిజమైతే రాబోయే తరాల్లో మనిషి సీ1పై నివాసం ఏర్పాటు చేయవచ్చు. అయితే ఇప్పటికే ఈ గ్రహంపై జీవం ఉంటే? మనకన్నా బుద్ధిజీవులుంటే? చూద్దాం! -
అమెరికాను గడగడలాడించిన హ్యాకర్?
ప్రస్తుతం ఇంటర్నెట్ ప్రపంచం మనం ఊహించని దానికంటే వేగంగా విస్తరిస్తుంది. దీంతో మనకు మేలు ఎంతో జరుగుతుందో అంతకంటే ఎక్కువ కీడు జరుగుతుంది అని చెప్పుకోవాలి. ప్రస్తుతం చాలా మంది నెటిజెన్స్ చిన్న చిన్న తప్పుల కారణంగా సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకుంటున్నారు. సైబర్ నేరగాళ్లకు ఇంకొక పేరు హ్యాకర్స్. వీరి పేరు చెబితే సాదారణ ప్రజల నుంచి ప్రభుత్వాలు, దిగ్గజ ఐటీ కంపెనీలు వరకు ఇలా అందరూ వణికిపోతున్నారు. అంతలా ఉంది వీరి ప్రభావం మన అందరిమీద. ఇప్పుడు క్రైమ్ కేసులలో ఎక్కువగా సైబర్ క్రైమ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి.(చదవండి: బిగ్ బ్యాటరీతో విడుదలైన పోకో ఎం3) ప్రస్తుతం మనం ఎంత ప్రమాదంలో ఉన్నామో అని దీన్ని బట్టి మనం అర్ధం చేసుకోవచ్చు. హ్యాకింగ్ చాలా ఏళ్ల క్రితం నుంచి ఉన్నప్పటికీ ఎక్కువగా మాత్రం మన 3జీ నెట్వర్క్ వచ్చినప్పటి నుంచే భాగా పెరిగి పోయింది. 3జీ రాకముందు హ్యాకర్స్ పెద్ద పెద్ద కంపెనీలను, ధనవంతులను, ప్రభుత్వాలను లక్ష్యంగా చేసుకొని ఎక్కువ శాతం వారి ఖాతాలను హ్యాక్ చేసేవారు. కానీ ఈ 3జీ, 4జీ వచ్చాక ఇప్పుడు సాదారణ ప్రజలు కూడా ఎక్కువ శాతం హ్యాకింగ్ భారీన పడుతున్నారు. అందుకే సైబర్ నిపుణులు ఆన్లైన్ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు సూచిస్తున్నారు. చాలా మంది హ్యాకర్స్ 2000 సంవత్సరం తర్వాత పుట్టుకొచ్చారు. కానీ ఒక హ్యాకర్ మాత్రం 1980 నుంచి 2000 వరకు ఈ ప్రపంచాన్ని వణికించాడు. ఇతను ప్రపంచంలోని ఐబీఎమ్, మోటోరోలా, నోకియా వంటి 40కి పైగా ఐటీ దిగ్గజ కంపెనీలను హ్యాక్ చేశాడు. అలాగే ప్రపంచాన్ని వణికించిన మాఫియా డాన్ లకు చుక్కలు చూపించాడు. అసలు అతని పేరు చెబితే అమెరికా ప్రభుత్వం వణికిపోయేది అంటే మనం అర్ధం చేసుకోవచ్చు. అతని ఎవరో కాదండీ కెవిన్ మిట్నిక్. మీరు ఇతని పేరు ఇప్పటి వరకు వినలేక పోవచ్చు. కెవిన్ మిట్నిక్ బాల్యం: కెవిన్ మిట్నిక్ కాలిఫోర్నియాలోని వన్ నుయ్స్(Van Nuys)లో 1963 ఆగస్టు 6న జన్మించాడు. ఇతను కాలిఫోర్నియాలోని లాస్ ఏంజిల్స్‌లోని జేమ్స్ మన్రో హైస్కూల్లో విద్యాభ్యాసం గడించాడు. ఆ సమయంలో అతను ఔత్సాహిక రేడియో ఆపరేటర్ అయ్యాడు. తర్వాత అతను లాస్ ఏంజిల్స్ పియర్స్ కాలేజీలో చేరాడు. కొంతకాలం, అతను స్టీఫెన్ ఎస్. వైజ్ టెంపుల్లో రిసెప్షనిస్ట్‌గా పనిచేశాడు.(చదవండి: మరోసారి మహిళను కాపాడిన యాపిల్ వాచ్!) కెవిన్ మిట్నిక్ మొదటి కంప్యూటర్ హ్యాకింగ్: కెవిన్ మిట్నిక్ 12 సంవత్సరాల వయస్సులో లాస్ ఏంజిల్స్ బస్సు వ్యవస్థలో ఉపయోగించే పంచ్ కార్డ్ వ్యవస్థను హ్యాక్ చేయడానికి సోషల్ ఇంజనీరింగ్, డంప్‌స్టర్ డైవింగ్ అనే టెక్నిక్ ఉపయోగించాడు. “స్కూల్ ప్రాజెక్ట్” కోసం తన సొంత టికెట్ పంచ్ ఎక్కడ కొనవచ్చో చెప్పమని ఒక బస్సు డ్రైవర్‌ను కోరాడు. ఇలా అతను బస్సు కంపెనీ పక్కన ఉన్న డంప్‌స్టర్‌లో దొరికిన ఉపయోగించని బదిలీ స్లిప్‌లను ఉపయోగించి లాస్ ఏంజిల్స్ ప్రాంతంలో ప్రయాణించేవాడు. ఇది అతని మొదటి హ్యాకింగ్ అనే చెప్పుకోవాలి. సోషల్ ఇంజనీరింగ్ టెక్నిక్ తో ఇతరుల పేర్లు, పాస్వర్డ్లు, మోడెమ్ ఫోన్ నంబర్లతో సహా సమాచారాన్ని పొందేవాడు. మిట్నిక్ మొట్టమొదట కంప్యూటర్ నెట్‌వర్క్‌కు సంబందించి 1979లో హ్యాక్ చేశాడు. తన 16 ఏళ్ళ వయసులో ఒక స్నేహితుడు కంప్యూటరు సహాయంతో ఆర్ఎస్టిఎస్/ఇ ఆపరేటింగ్ సిస్టమ్ సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేసే డిజిటల్ ఎక్విప్మెంట్ కార్పొరేషన్(డిఇసి) కంప్యూటర్ నెట్‌వర్క్‌లోకి ప్రవేశించి, కంపెనీ సాఫ్ట్‌వేర్‌ను కాపీ చేశాడు. ఈ నేరానికి గాను 1988లో12 నెలల జైలు శిక్ష అనుభవించాడు. అలాగే మూడు సంవత్సరాల పాటు పోలీసుల పర్యవేక్షణలో ఉన్నాడు. ఈ పోలీసుల పర్యవేక్షణలో ఉన్న కూడా మిట్నిక్ పసిఫిక్ బెల్ వాయిస్ మెయిల్ కంప్యూటర్లను హ్యాక్ చేశాడు. దీంతో మళ్లీ అతని మీద అరెస్టు వారెంట్ జారీ చేశారు. అయితే పోలీసులకు దొరకాకుండా రెండున్నర సంవత్సరాలు పరారీలో ఉన్నాడు.(చదవండి: 5జీతో మాట్లాడే ఏటిఎమ్ లు రాబోతున్నాయి!) అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్, పోలీసులకు కెవిన్ మిట్నిక్ ఒక పెద్ద తల నొప్పిగా మారిపోయాడు. మిట్నిక్ డజన్ల కొద్దీ కంప్యూటర్ నెట్‌వర్క్‌లలో ప్రవేశించేవాడు. అతను తన స్థానాన్ని కనిపెట్టకుండా ఉండటానికి క్లోన్ చేసిన సెల్యులార్ ఫోన్లను ఉపయోగించేవాడు. దేశంలోని అతిపెద్ద సెల్యులార్ టెలిఫోన్, కంప్యూటర్ కంపెనీల నుంచి విలువైన సమాచారాన్ని, సాఫ్ట్‌వేర్‌ను కాపీ చేశాడు. ఇతర కంప్యూటర్ నెట్‌వర్క్‌లను మార్చేవాడు, ప్రైవేట్ ఇ-మెయిల్లను రహస్యంగా చదివేవాడు. ఒకానొక సమయంలో ప్రపంచంలోని అతి పెద్ద డాన్ ల ఫోన్ లను హ్యాక్ చేసి వారికీ చుక్కలు చూపించాడు. కెవిన్ మిట్నిక్ అరెస్ట్, జైలు శిక్ష కెవిన్ మిట్నిక్ 1995లో అమెరికాలోని 40 అతిపెద్ద కంపెనీలను హ్యాకింగ్ చేశాడు. వీటిలో ఐబిఎం, నోకియా మరియు మోటరోలా ఉన్నాయి. ఇలా రోజు రోజుకి అమెరికా ప్రభుత్వానికి ఒక పెద్ద తలనొప్పిగా మారిపోయాడు. అతనిని ఎలాగైనా పట్టుకోవాలని అతని పట్టించిన వారికి భారీ బహుమతి అని అమెరికా ప్రభుత్వం ప్రకటించింది. ఫిబ్రవరి 15, 1995న ఎఫ్బిఐ నార్త్ కరోలినాలోని రాలీలోని తన అపార్ట్మెంట్ లో మిట్నిక్ ను అరెస్టు చేసింది. రెండున్నర సంవత్సరాల కంప్యూటర్ హ్యాకింగ్ కు సంబంధించిన అనేక నేరాలు అతని మీద ఉన్నాయి. అతను క్లోన్ చేసిన సెల్యులార్ ఫోన్లు, 100కి పైగా క్లోన్ సెల్యులార్ ఫోన్ కోడ్లు వంటివి అతనిని అరెస్టు చేసే సమయంలో కనుగొన్నారు.(చదవండి: రూ 1.8లక్షలు ఖరీదైన సోనీ మొబైల్ విడుదల) 1997 డిసెంబర్ లో యాహు! వెబ్సైట్ హ్యాక్ చేయబడింది క్రిస్మస్ దినోత్సవం నాటికి మిట్నిక్ విడుదల చేయాలి లేకపోతే ఇంటర్నెట్ “విపత్తు”ను సృష్టిస్తామని ఒక మెసేజ్ భాగా అప్పుడు వైరల్ అయ్యింది. యాహు! మాత్రం కేవలం ఇది ప్రజలను భయపెట్టడానికి మాత్రమే అని పేర్కొంది. మిట్నిక్పై వైర్ మోసం, ఎలక్ట్రానిక్ సమాచార మార్పిడి, ఫెడరల్ కంప్యూటర్ను హ్యాక్ చేయడం వంటి ఆరోపణలపై తనపై ఉన్నాయి. 1999లో లాస్ ఏంజిల్స్‌లోని కాలిఫోర్నియా సెంట్రల్ డిస్ట్రిక్ట్ యునైటెడ్ స్టేట్స్ డిస్ట్రిక్ట్ కోర్ట్ ముందు చివరకు చట్టవిరుద్ధంగా చేసిన తప్పులను అంగీకరించాడు. గతంలో కంప్యూటర్ మోసానికి 1989లో పోలీసుల పర్యవేక్షణ నుంచి పారీపోయినందుకు 22 నెలల జైలు శిక్ష, తర్వాత చట్టవిరుద్దంగా చేసిన తప్పులకు అతని మీద 46 నెలల జైలు శిక్ష విధించబడింది. మిట్నిక్ ఐదు సంవత్సరాల జైలు శిక్ష అనుభవించాడు. టాప్ సెక్యూరిటీ కన్సల్టెంట్ జనవరి 21, 2003లో అతను పోలీసుల పర్యవేక్షణ నుంచి విడుదల అయ్యాడు. తన విడుదల అయ్యాక కూడా ఇంటర్నెట్ వాడకూడదు అనే నిబంధన ఉండేది. కమ్యూనికేషన్ కోసం కేవలం ల్యాండ్‌లైన్ టెలిఫోన్ వినియోగించాలని పోలీసులు ఆంక్షలు విధించారు. అయితే ఈ విషయంలో స్థానిక కొర్టులో కెవిన్ మిట్నిక్ పోరాడారు. చివరికి అతనికి అనుకూలంగా ఒక తీర్పును వచ్చిన తర్వాత ఇంటర్నెట్ను యాక్సెస్ వాడుకోవడానికి వీలు కల్పించారు. ప్రస్తుతం కెవిన్ మిట్నిక్ ప్రపంచంలోని గూగుల్, ఫేస్బుక్ వంటి అతిపెద్ద కంపెనీలకు టాప్ సెక్యూరిటీ కన్సల్టెంట్ గా పనిచేస్తున్నారు. దీనికి గాను అతను అత్యధిక పారితోషకం తీసుకుంటున్నారు. -
ఈ జింక చాలా తెలివైనది గురూ...
అటు ఒక్కటి కాదు రెండు కాదు... ఐదు చీతాలు.. ఇటేమో ఒక్కటే జింక. మామూలుగా అయితే ప్రాణాలపై ఆశలు వదిలేసుకోవాల్సిందే. ఎందుకంటే అక్కడ ఫ్యామిలీ మొత్తం వచ్చి మీద పడింది. అయితే.. ఈ జింక కాస్త తెలివైనది లాగుంది. టైమ్ కోసం వేచి చూసింది. చాన్స్ రాగానే...వెనక్కాళ్లతో డిష్యూం డిష్యూం అంటూ ఒక్కోదానికి జింతాత చితాచితా చేసి... రయ్యిమంటూ అక్కడ నుంచి పరుగులు తీసింది. కెన్యాలోని సలాయ్షో పార్కులో జరిగిన ఈ సన్నివేశాల్ని బ్రిటన్‌కు చెందిన ఫోటోగ్రాఫర్ కెవిన్ క్లిక్ మనిపించారు. -
భార్య ప్రియుడ్ని కోర్టు కీడ్చి..
వాషింగ్టన్ : తమ కాపురంలో నిప్పులు పోసి తన భార్యను తనకు కాకుండా చేశాడని ఆరోపిస్తూ ఆమె ప్రియుడ్ని కోర్టు కీడ్చి రూ 5 కోట్లు రాబట్టిన భర్త ఉదంతం వాషింగ్టన్లో వెలుగు చూసింది. ఎప్పుడు పనితో కార్యాలయంలో గడుపుతూ తనను నిర్లక్ష్యం చేస్తున్నావని తన భార్య తనతో తరచూ వాదించేదని కెవిన్ హోవార్డ్ చెప్పుకొస్తూ ఈ క్రమంలో తన భార్యకు ఆమె ఆఫీస్‌లో పనిచేసే కొలీగ్‌తో వివాహేతర బంధం బయటపడిందని తెలిపారు. నిత్యం ఆమె వెంట తాను ఉండటం లేదని ఫిర్యాదు చేస్తూ ఆమె తన నుంచి విడాకులు కోరుకుందని చెప్పారు. భార్య ప్రవర్తనపై అనుమానంతో తాను ప్రైవేట్ డిటెక్టివ్ ఏజెన్సీని ఆశ్రయించగా ఆమెకు తన కొలీగ్‌తో అక్రమ సంబంధం వ్యవహారం బయటపడిందని ఆందోళన వ్యక్తం చేశారు. భార్య ప్రియడు ఒకసారి తమ ఇంటికి వచ్చాడని, తమతో డిన్నర్ చేశాడని కెవిన్ గుర్తుచేసుకున్నారు. నిజం తెలిసిన తర్వాత గ్రీన్‌విల్లేలోని జడ్జ్ ఎదుట భార్య ప్రియుడిపై కెవిన్ దావా వేశారు. తమ వైవాహిక జీవితం బెడిసికొట్టేందుకు తన భార్య ప్రియుడే కారణమని ఆరోపించారు. కెవిన్ వాదనతో ఏకీభవించిన న్యాయస్ధానం బాధితుడికి రూ 5.3 కోట్ల పరిహారం చెల్లించాలని నిందితుడిని ఆదేశించింది. -
మొత్తం కథే మారిపోయింది!
కెవిన్ స్పేసీ.. హాలీవుడ్ సినిమా అభిమానికి పరిచయం అక్కర్లేని పేరు. అవార్డులు, రివార్డులు, గొప్ప సినిమాల్లో నటించిన పేరు, గొప్ప నటుడన్న ప్రశంసలు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు, దర్శకులు తమ సినిమాలో ఆయన ఉంటే దానికి ఒక స్థాయి వస్తుందనుకునేలా తెచ్చుకున్న గౌరవం.. ఒక్కసారే ఇవన్నీ ఆయనకు దూరమయ్యే పరిస్థితి వస్తుందంటే విచిత్రంగా కనిపిస్తుంది కానీ, చిత్రంగా అదే నిజం!! హాలీవుడ్లో కొన్ని నెలలుగా బయటపడుతోన్న సెక్స్ స్కాండల్స్‌లో కెవిన్ స్పేసీ పేరు కూడా ఉంది. అక్టోబర్ 30న నటి ఆంతోని రాప్ ఒక ఇంటర్వ్యూలో గతంలో కెవిన్ తనపై లైంగిక దాడికి పాల్పడ్డ విషయాన్ని చెప్పింది. ఆ రోజు నుంచే హాలీవుడ్ కెవిన్‌ను దూరం పెట్టడం మొదలుపెట్టింది. నెట్‌ఫ్లిక్స్‌లో ఆయన ప్రధాన పాత్రలో నటిస్తోన్న టీవీ సిరీస్ ‘హౌస్ ఆఫ్ కార్డ్స్’ను మధ్యలోనే ఆపేశారు. ఈ ఏడాది ఆయనకు ఇవ్వాల్సిన ఎమ్మీ అవార్డునూ ఈ ఉదంతంతో వెనక్కు తీసేసుకున్నారు. ఇక వీటన్నింటికంటే మించి, రిడ్లీ స్కాట్ తన ‘ఆల్ ది మనీ ఇన్ ద వరల్డ్’ సినిమాలో కెవిన్ నటించిన సన్నివేశాలన్నీ తీసేసి, క్రిస్టఫర్ ప్లమ్మర్ను అదే పాత్రకు తీసుకోవడం గురించి చెప్పుకోవాలి. క్రిస్మస్ కానుకగా సోమవారం విడుదల కానున్న ఈ సినిమాలో కెవిన్ స్పేసీ ఉన్నాడన్న పేరుతోనే మొదట ప్రచారం జరిగినా, చివరి నెలలో కెవిన్ సన్నివేశాలన్నీ తీసేసి, ప్లమ్మర్‌తో రీషూట్ చేశారు. ప్రీమియర్ షో నుంచే ఈ సినిమాకు మంచి టాక్ వస్తోంది. విశేషమేంటంటే ప్లమ్మర్‌కు సూపర్ రెస్పాన్స్ రావడం! కెవిన్ మిస్ చేసుకున్న పేరే కదూ!! ఒక ప్రముఖ నటుడు, అదీ అవార్డ్ విన్నింగ్ నటుడు, ఇలా ఒక సినిమాలో నటించడం, ఆ సన్నివేశాలు అద్భుతంగా వచ్చినా అవి తీసేసి వేరొక నటుడిని తీస్కోవడం.. పెద్ద అవమానమే! ఆ అవమానానికి కారణం స్వయంగా కెవినే! ఎంతటి నటుడైనా సెక్సువల్ హెరాస్‌మెంట్‌కు పాల్పడితే పట్టే గతి ఇదని కెవిన్ ఉదంతమే చెప్పేస్తోంది!! -
ఈ రోజు అమెరికాలో ఎవరు ఎవర్నైనా హగ్ చేసుకోవచ్చు!
నిన్నంతా అమెరికాలో ట్రంప్ హడావిడి. ప్రెసిడెంట్ గారి ప్రమాణం స్వీకారం కదా. అందుకు. అదే సందర్భంలో వైట్ హౌస్నుంచి వెళ్లిపోతున్న ఒబామాను చాలామంది హగ్ చేసుకున్నారు. ప్రమాణం స్వీకారంలో గాంభీర్యం ఉంటుంది. పదవీ విరమణలో ఉద్వేగం ఉంటుంది. ఏమైనా.. అమెరికాలో ఉద్వేగాలకన్నా, గాంభీర్యాలే ఎక్కువ. ఈ సంగతిని ఈసరికే చాలామంది అమెరికన్ పౌరులు కనిపెట్టే ఉంటారు కానీ.. కెవిన్ జబోర్ని అనే యువకుడు కనిపెట్టి ఊరుకోలేదు. ‘మనం ఎందుకు ఇలా ఉండాలి?’ అని ప్రశ్నించుకున్నాడు. ‘ఇలా’ అంటే.. విడివిడిగా, వేరువేరుగా, నువ్వో మనిషివి, నేనో మనిషిని అన్నట్టుగా, అసలు మనిషన్నవాడే పట్టనట్టుగా.. అని! కెవిన్‌కి చాలా ఆవేదన కలిగింది. అమెరికా అగ్రరాజ్యం అయితే అయివుండొచ్చు గానీ, అనుబంధాలలో ఇంత అల్పరాజ్యం అయిపోతే ఎలా అనుకున్నాడు. బాగా ఆలోచించి.. ‘నేషనల్ హగ్గింగ్ డే’ని ప్రచారంలోకి తెచ్చాడు. దానికి అమెరికన్ ప్రజల ఆమోదం కూడా పొందాడు. అప్పట్నుంచీ.. అంటే 1986 జనవరి 21 నుంచీ.. ఏటా అమెరికా ‘హగ్ డే’ని జరుపుకుంటోంది. ఇవాళ అక్కడ హగ్ డే. ఎవరు ఎవర్నైనా హగ్ చేసుకోవచ్చు. అయితే, చిన్న కండిషన్. అనుమతి తీసుకున్నాకే హగ్ చేసుకోవాలి. అనుమతి లేకుండా హగ్ చేసుకున్నామంటే ఆ హగ్ కాస్తా క్రైమ్ అయిపోతుంది. మరి జనవరి 21 నే ‘హగ్ డే’గా ఎందుకు జరుపుకుంటున్నట్లు? దానికో కారణం చెప్పాడు కెవిన్. క్రిస్మస్ నుంచి వాలెంటైన్స్ డే వరకు అంతా ఫెస్టివ్ మూడ్‌లో ఉంటారు కాబట్టి.. ఈ మధ్యలో.. ఏదైనా ఒకరోజును హగ్ డేగా డిసైడ్ చేసుకుంటే ఫెస్టివ్ ఫీల్ కంటిన్యూ అవుతుందని అనుకున్నాడట. కౌగిలింతల వల్ల ఆత్మీయతలు పెరుగుతాయని, అనుబంధాలలోనూ అమెరికా అగ్రరాజ్యంగా ఎదుకుతుందని కెవిన్ ఆశ. -
సినీ డ్యాన్సర్ల నిరసన ర్యాలీ
శ్రీనగర్‌కాలనీ: తెలంగాణ ఫిలిం డ్యాన్సర్స్ అండ్ డ్యాన్స్ డెరైక్టర్స్ యూనియన్ సభ్యులతో గతవారం ఓ చిత్ర షూటింగ్లో చోటుచేసుకున్న వివాదానికి నిరసనగా యూనియన్ అధ్యక్షుడు కెవిన్ ఆధ్వర్యంలో సోమవారం బైక్‌ర్యాలీ నిర్వహించారు. సారధి స్టూడియో నుంచి ఫిలించాంబర్ వరకు నిర్వహించిన ఈ ర్యాలీలో సుమారు 200 మంది కళాకారులు పాల్గొన్నారు. అనంతరం ఫిలించాంబర్‌లోని ప్రొడ్యూసర్స్ కౌన్సిల్‌తో సమావేశమయ్యారు. ఎన్నో సంవత్సరాలుగా డ్యాన్సర్లు ఎదుర్కొంటున్న సమస్యలను వారికి వివరించారు. గత వారం జరిగిన సంఘటన విషయాలను సైతం వారికి వివరించారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందించారు. తెలంగాణ డ్యాన్సర్స్ అసోసియేషన్ సభ్యులు యథావిధిగా అన్ని సినిమాలకు పనిచేసుకోవచ్చని, తమకు ఎలాంటి అభ్యంతరాలులేవని ఈసందర్భంగా నిర్మాతల మండలి సభ్యులు హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సభ్యులు ఎన్వీ ప్రసాద్, సురేష్‌బాబు, సుధాకర్ రెడ్డి, బండ్ల గణేష్, సి.కళ్యాణ్, తెలంగాణ రాష్ట్ర అసోసియేషన్లకు చెందిన పలువురు ప్రతినిధులు పాల్గొన్నారు. కాగా డ్యాన్సర్లకు తెలంగాణ అసోసియేషన్లు, తెలంగాణ ఫిలిం ప్రొడక్షన్ ఫోర్సు, ఓయూ జేఏసీ నేతలు మద్దతు పలికారు.