సినీ డ్యాన్సర్ల నిరసన ర్యాలీ
శ్రీనగర్‌కాలనీ: తెలంగాణ ఫిలిం డ్యాన్సర్స్ అండ్ డ్యాన్స్ డెరైక్టర్స్ యూనియన్ సభ్యులతో గతవారం ఓ చిత్ర షూటింగ్‌లో చోటుచేసుకున్న వివాదానికి నిరసనగా యూనియన్ అధ్యక్షుడు కెవిన్ ఆధ్వర్యంలో సోమవారం బైక్‌ర్యాలీ నిర్వహించారు. సారధి స్టూడియో నుంచి ఫిలించాంబర్ వరకు నిర్వహించిన ఈ ర్యాలీలో సుమారు 200 మంది కళాకారులు పాల్గొన్నారు.
అనంతరం ఫిలించాంబర్‌లోని ప్రొడ్యూసర్స్ కౌన్సిల్‌తో సమావేశమయ్యారు. ఎన్నో సంవత్సరాలుగా డ్యాన్సర్లు ఎదుర్కొంటున్న సమస్యలను వారికి వివరించారు. గత వారం జరిగిన సంఘటన విషయాలను సైతం వారికి వివరించారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందించారు. తెలంగాణ డ్యాన్సర్స్ అసోసియేషన్ సభ్యులు యథావిధిగా అన్ని సినిమాలకు పనిచేసుకోవచ్చని, తమకు ఎలాంటి అభ్యంతరాలులేవని ఈసందర్భంగా నిర్మాతల మండలి సభ్యులు హామీ ఇచ్చారు.
కార్యక్రమంలో ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సభ్యులు ఎన్వీ ప్రసాద్, సురేష్‌బాబు, సుధాకర్ రెడ్డి, బండ్ల గణేష్, సి.కళ్యాణ్, తెలంగాణ రాష్ట్ర అసోసియేషన్లకు చెందిన పలువురు ప్రతినిధులు పాల్గొన్నారు. కాగా డ్యాన్సర్లకు తెలంగాణ అసోసియేషన్లు, తెలంగాణ ఫిలిం ప్రొడక్షన్ ఫోర్సు, ఓయూ జేఏసీ నేతలు మద్దతు పలికారు.