Producers Council
-
నిర్మాతల సంఘం సహకారించ లేదు
జగద్గురువు రామానుజర్ గురించి తెలియని వారు ఉండరు. విష్ణుభక్తుడు. హిందూ మత పరిరక్షకుడు. కులమతాలకతీతంగా జనోద్ధరణకు పాటుపడిన మహానుభావుడు రామానుజన్ జీవిత చరిత్ర గురించి ఇప్పటికే పలు భాషల్లో చిత్రాలు రూపొందాయి. తమిళంలోనూ ఆయన జీవిత చరిత్రతో సీరియల్ రూపొందింది. తాజాగా శ్రీ రామనుజన్ బయోపిక్‌ను శ్రీకృష్ణన్ తన హయగ్రీవ సినీ ఆర్ట్స్ పతాకంపై నిర్మించి టైటిల్ పాత్రను పోషించారు. ఆయనతో పాటు నటుడు రాధారవి, కోట శ్రీనివాసరావు, వైజీ మహేంద్రన్, శ్రీమాన్, నిళల్గళ్ రవి, సిమ్రాన్, గాయత్రి ముఖ్యపాత్రలు పోషించారు. ఇరవి చందర్ వరద నారాయణన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి ఇళయరాజా సంగీతాన్ని అందించారు. ఈ చిత్రంలో త్వరలో రావడానికి ముస్తాబవుతోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ శనివారం సాయంత్రం ఒక నక్షత్ర హోటల్లో చిత్రం సింగిల్ సాంగ్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. రామానుజన్ జీవిత చరిత్రతో రూపొందిన ఈ చిత్రం ఒక మహా కావ్యంగా పేర్కొన్నారు. దీనిని రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలలు, కళాశాలల్లో ప్రదర్శించే విధంగా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం చిత్ర నిర్మాత కథానాయకుడు శ్రీకృష్ణన్ మాట్లాడుతూ ఈ చిత్ర నిర్మాణానికి చాలా శ్రమించినట్లు చెప్పారు. తమకు తమిళ నిర్మాతల సంఘం ఏ విధంగానూ సహకరించలేదని, అది ఉన్నా లేనట్టేననే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అయితే రామానుజర్ చిత్రం బాగా వచ్చిందని దీనికి ఇళయరాజా అద్భుతమైన సంగీతాన్ని అందించారని పేర్కొన్నారు. ఈ చిత్ర సింగిల్ సాంగ్ మిలియన్‌కు పైగా ప్రేక్షకులు చూశారని చెప్పారు. చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం భారీ ఎత్తున నిర్వహించినట్లు ఆ వేదికపై ఇళయరాజా చిత్రంలోని ఐదు పాటలను లైవ్‌లో పాడి సంగీత ప్రియులను అలరింపచేస్తారని చెప్పారు. చిత్రం విజయం ఖాయమని, దానిని ఎలా ప్రమోట్ చేయాలన్నది తనకు తెలుసని శ్రీకృష్ణన్ పేర్కొన్నారు. -
నిర్మాతల సంఘానికి లైకా ప్రొడక్షన్స్ అధినేత భారీ విరాళం
భారీ కథా చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన లైకా ప్రొడక్షన్స్ సంస్థ అధినేత సుభాస్కరన్ ఇటీవల మణిరత్నం మద్రాస్ టాకీస్ సంస్థతో కలిసి పొన్నియిన్ సెల్వన్ వంటి విజయవంతమైన చిత్రాన్ని నిర్మించిన విషయం తెలిసిందే. తాజాగా పొన్నియిన్ సెల్వన్– 2 చిత్రాన్ని ఏప్రిల్ 28వ తేదీన పాన్ ఇండియా స్థాయిలో విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. అదే విధంగా కమలహాసన్ కథానాయకుడిగా శంకర్ దర్శకత్వంలో ఇండియన్– 2 చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవానీ శంకర్ మొదలగు ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్ తుది దశకు చేరుకుంది. వీటితో పాటు మరిన్ని చిత్రాలు నిర్మాణంలో ఉన్నాయి. కాగా మణిరత్నం దర్శకత్వంలో ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందించిన పొన్నియిన్ సెల్వన్– 2 చిత్రం ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం బుధవారం చెన్నైలోని నెహ్రూ ఇండోర్ స్టేడియంలో భారీ ఎత్తున నిర్వహించారు. ఈ సందర్భంగా మంగళవారం లైకా ప్రొడక్షన్స్ సంస్థ తరపున తమిళ నిర్మాతల సంఘానికి రూ.50 లక్షలు విరాళం ఇచ్చారు. ఆ చెక్కును లైకా సంస్థ అధినేత సుభాస్కరన్ నిర్మాతల సంఘం అధ్యక్షుడు మురళి రామస్వామికి అందించారు. -
ఆ మాఫియా వల్ల సినీపరిశ్రమ నాశనమవుతోంది
‘‘నిర్మాతల మండలిలో 1200 మంది సభ్యులు ఉన్నారు. కానీప్రొడ్యూసర్స్ గిల్డ్‌లో 27 మంది సభ్యులు ఉన్నారు.ప్రొడ్యూసర్స్ గిల్డ్ మాఫియాగా మారింది. గుత్తాధిపత్యం వల్ల పరిశ్రమ నాశనమవుతోంది’’ అని నిర్మాత సి. కల్యాణ్ ఆరోపణలు చేశారు. నేడు నిర్మాతల మండలి ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుత నిర్మాతల మండలి అధ్యక్షడు సి. కల్యాణ్ శనివారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ – ‘‘అందరూ ఒకే తాటిపై ఉండాలని ఆరంభం అయిన ఆర్గనైజేషన్ చిన్నగా ఎల్ఎల్పీగా మారి అది కాస్తా ‘గిల్డ్’గా మారింది. గిల్డ్ ఏంటి?ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఏంటి? రెండింటినీ కలిపేయొచ్చు కదా అని చాలామంది అంటున్నారు. కలపడానికి మేం చేస్తున్న ప్రయత్నాన్ని కొందరు అడ్డుకుంటున్నారు. ఇక్కడంతా మోనోపలి అయ్యింది. వారే హీరోలు, వారే డిస్ట్రిబ్యూటర్స్, వారివే థియేటర్స్.. ఇలా ఇండస్ట్రీని శాసిస్తున్నారు. కల్యాణ్ లీడ్ చేస్తే మంచే జరుగుతుంది అనే నమ్మకం కలిగితే మా ఫ్యానల్‌కు ఓటు వెయ్యండి’’ అన్నారు. కాగా ఈ ఎన్నికల్లో కల్యాణ్ పోటీపడటంలేదు. నిర్మాతల మండలి తరఫున అధ్యక్ష పదవికి పి. కిరణ్ పోటీలో ఉన్నారు.ఈ ఎన్నికలపై ‘దిల్’ రాజు స్పందిస్తూ – ‘‘ప్రస్తుతం రన్నింగ్‌లో ఉన్న నిర్మాతలు ఉన్న ప్రోగ్రెసివ్ ప్రొడ్యూసర్స్ ప్యానెల్’ని గెలిపించాలని కోరుతున్నాను’’ అన్నారు. ఈ ఫ్యానెల్ తరఫున అధ్యక్షుడిగా దామోదర ప్రసాద్ పోటీ చేస్తున్నారు. -
దిల్రాజును తప్పుదారి పట్టించారు, దుష్ప్రచారం చేస్తున్నారు : సి. కల్యాణ్
సినిమా షూటింగ్స్ నిలిపివేయడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు జరగలేదని నిర్మాతల మండలి అధ్యక్షుడు సి.కల్యాణ్ అన్నారు. దిల్‌రాజు, సి. కల్యాణ్ ప్యానెల్ వేరు వేరే కాదని, నిర్మాతలు కొంతమంది దిల్ రాజును తప్పుదారి పట్టించారని ఆరోపించారు. దిల్ రాజుతో తనను పోలుస్తూ కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తాను ఇప్పటివరకు సుమారు 80 చిన్న సినిమాలు తీశానని, ఎవరిని మోసం చేయలేదని పేర్కొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. చిన్న సినిమా లేకపోతే సినీ పరిశ్రమ మూతపడుతుంది. మోనోపలి వల్ల పరిశ్రమ నాశనం అవుతుంది. ప్రొడ్యూసర్ గిల్ట్ మాఫియా వల్ల మొత్తం నాశనం అవుతుంది. గిల్డ్‌లో 27 మంది సభ్యులున్నారు. నిర్మాతల మండలిలో 1200 మంది సభ్యులున్నారు. గిల్డ్ సభ్యుల సమస్యలనే నిర్మాతల మండలి పరిష్కరించింది. 2019లో మేం వచ్చిన దగ్గరి నుంచి ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నాం. ఎవరు సంస్థకు న్యాయం చేస్తారో వారిని గెలిపించుకోండి. నేను ఈ ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. కానీ 30 సంవత్సరాల అనుబంధంతో నిర్మాతల మండలిని కాపాడుకోవాలనే ఉద్దేశంతో ముందుకొచ్చా. ప్రొడ్యూసర్ గిల్డ్ , నిర్మాతల మండలిని కలిపేందుకు ప్రయత్నం చేశా. అధ్యక్ష పదవి మోజులో నా ప్రయత్నాన్ని నీరుగార్చారు అంటూ చెప్పుకొచ్చారు. కాగా రేపు(ఫిబ్రవరి 19)న తెలుగు నిర్మాతల మండలి ఎలక్షన్స్ జరగనున్నా సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సి. కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా మారాయి. -
నిర్మాతల మండలి అధ్యక్షుడు సి.కళ్యాణ్ పై సభ్యుల ఆగ్రహం
తెలుగు నిర్మాతల మండలి సర్వసభ్య సమావేశం రసాభాసగా మారింది. నిర్మాత మండలి అధ్యక్షుడు సి. కల్యాణ్‌పై సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పదవీకాలం ముగిసినా నిర్మాత మండలి ఎన్నికలు నిర్వహించడం లేదని ఆందోళనకు దిగారు. ఈ మొత్తం వ్యవహారాన్ని ఒక సభ్యుడు వీడియో తీయగా..అతనిపై అధ్యక్షుడు సీ కల్యాణ్ అసహనం వ్యక్తం చేశాడు. దీంతో వీరిద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. -
నిర్మాతపై దుష్పచారం, నటుడు యోగిబాబుపై నిర్మాతల మండలిలో ఫిర్యాదు
చిన్న పాత్రల నుంచి కామెడీ స్టార్ ఇమేజ్ సొంతం చేసుకుని ఇప్పుడు కథానాయడిగా మారిన నటుడు యోగిబాబు. అయితే తన ప్రవర్తనతో సమస్యలను కొని తెచ్చుకుంటున్నారని చెప్పవచ్చు. కోలీవుడ్‌లో కొందరు దర్శక-నిర్మాతలు ఈయనపై గుర్రుగా ఉన్నారు. తాజాగా మరో నిర్మాత యోగిబాబుపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎనీ టైం మనీ ఫిలిమ్స్ పతాకంపై గిన్నిస్ కిషోర్ కథ, కథనం, మాటలు, దర్శకత్వం బాధ్యతలను నిర్వహించి నిర్మించిన చిత్రం దాదా. ఇందులో యోగి బాబు, నితిన్ సత్య కథానాయకులుగా, గాయత్రి నాయకిగా నటించారు. మనోబాలా, నాజర్, సింగం ముత్తు, భువనేశ్వరి, ఉమా తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి ఆర్‌హెచ్ అశోక్ చాయాగ్రహణను, కార్తీక్ కృష్ణ సంగీతాన్ని అందించారు. వినోదమే ప్రధానంగా రూపొందించిన దాదా చిత్రం ఈనెల 9వ తేదీన విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా శనివారం సాయంత్రం చిత్ర యూనిట్ చెన్నై ప్రసాద్ ల్యాబ్‌లో ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించింది. చిత్ర దర్శక నిర్మాత గిన్నిస్ కిషోర్ మాట్లాడుతూ.. ఇందులో నటించిన యోగిబాబు చాలా ఇబ్బందులు పెట్టారని, చిత్రంలో తాను నటించింది 4 సన్నివేశాల్లోనే అంటూ, చిత్రాన్ని ఎవరు కొనుగోలు చేయవద్దని బయ్యర్లకు ఫోన్ చేసి మరి దుష్పచారం చేసి తన వ్యాపారానికి దెబ్బ కొట్టారని ఆరోపించారు. యోగిబాబు 4 సన్నివేశాలు నటించారో, 40 సన్నివేశాలు నటించారో చిత్రం చూసిన తర్వాత మీరే చెప్పాలన్నారు. అదే విధంగా చిత్రానికి డబ్బింగ్ చెప్పడానికి చాలా ఇబ్బందులు పెట్టారన్నారు. తన తదుపరి చిత్రంలో నటించడానికి యోగిబాబుకు అడ్వాన్స్ కూడా ఇచ్చానని, అయితే ఇప్పుడు చిత్రంలో నటించడానికి ఆయన నిరాకరిస్తున్నారని, దీనిపై తమిళ నిర్మాతల మండలిలో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. తన చిత్రంలో నటించకపోతే మరో చిత్రంలో నటించకుండా చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలిపారు. కాగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న పలువురు యోగిబాబు తీరును తప్పుబట్టారు. -
సినీ కార్మికుల వేతనాల పెంపుపై నిర్మాతల మండలి కీలక ప్రకటన
సినీ కార్మికుల వేతనాల పెంపుకు చలన చిత్ర నిర్మాతల మండలి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కార్మికుల డిమాండ్ మేరకు వేతనాలను 30 శాతం పెంచుతున్నట్లు తాజాగా ఫిలిం చాంబర్, నిర్మాతల మండలి, ఫలిం ఫెడరేషన్ సంయుక్తంగా అధికారిక ప్రకటన ఇచ్చింది. పెద్ద సినిమాలకు 30 శాతం, చిన్న సినిమాలకు 15 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్లు ఈ మేరకు అధికారిక ప్రకటన ఇచ్చాయి. ఇక ఏది చిన్న సినిమా, ఏది పెద్ద సినిమా అనేది ఫిలిం చాంబర్, ఫెడరేషన్ కలిసి నిర్ణయిస్తాయని పేర్కొన్నారు. ఈ తాజా వేతనాల పెంపు సవరణ అనేది 01-07-2022 నుంచి 30-06-2025 వరకు అమలవుందని నిర్మతల మండలి స్పష్టం చేసింది. కాగా ప్రతి మూడేళ్లకు ఒకసారి వేతనాలు పెంచాల్సి ఉండగా కరోనా కారణంగా నిర్మాతలు జాప్యం చేస్తూ వచ్చారని, ఈ సారి వేతనాలు సవరించి కార్మికులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తూ ఫిలిం ఫెడరేషన్ సెప్టెంబర్ 1న నిర్మాతల మండలికి నోటిసులు ఇచ్చింది. అంతేకాదు తమ డిమాండ్ నెరవేర్చకపోతే సెప్టెంబర్ 16న మరోసారి సమ్మెకు వెళతామని హెచ్చరించింది. దీంతో నిర్మాతల మండలి.. వేతన కమిటీ ప్రతిపాదనలను పరిగణలోకి తీసుకుని కార్మికుల వేతనాలను 30 శాతం విడతల వారిగా పెంచాలని నిర్ణయించింది. Telugu Film Industry PRESS NOTE#TFPC #TELUGUFILMPRODUCERSCOUNCIL #TFCC #TFI pic.twitter.com/7XBs9feYkp — Telugu Film Producers Council (@tfpcin) September 15, 2022 చదవండి: అషురెడ్డి బర్త్‌డే.. కాస్ట్లీ కారు బహుమతిగా ఇచ్చిన ఆమె తండ్రి సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ నటుడు రవి ప్రసాద్ మృతి -
సినీ కార్మికుల వేతనాల పెంపునకు నిర్మాతల మండలి గ్రీన్ సిగ్నల్..
వేతనాలు పెంచాలనే సినీ కార్మికుల డిమాండ్‌పై తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి సానుకూలంగా స్పందించింది. కార్మికుల డిమాండ్ మేరకు 30 శాతం వేతనాలు పెంచేందుకు నిర్మాతల మండలి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు ఫిలిం ఫెడరేషన్ నాయకులతో జరిగిన చర్చలు సఫలం కావడంతో నిర్మాతలు ఊపిరిపీల్చుకున్నారు. రెండు నెలలు క్రితం వేతనాలు పెంచాలంటూ సినీ కార్మికులు డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టిన సంగతి తెలిసిందే. చదవండి: మళ్లీ బుక్కైన తమన్.. ‘ఏంటమ్మా.. ఇది’ అంటూ మెగా ఫ్యాన్స్ ఫైర్ ప్రతి మూడేళ్లకు ఒకసారి వేతనాలు పెంచాల్సి ఉండగా కరోనా కారణంగా నిర్మాతలు జాప్యం చేస్తూ వచ్చారని, ఈ సారి వేతనాలు సవరించి కార్మికులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తూ ఫిలిం ఫేడరేషన్ సెప్టెంబర్ 1న నిర్మాతల మండలికి నోటిసులు ఇచ్చింది. అంతేకాదు తమ డిమాండ్ నెరవేర్చకపోతే సెప్టెంబర్ 16న మరోసారి సమ్మెకు వెళతామని హెచ్చరించింది. దీంతో నిర్మాతల మండలి.. వేతన కమిటీ ప్రతిపాదనలను పరిగణలోకి తీసుకుని కార్మికుల వేతనాలను 30 శాతం విడతల వారిగా పెంచాలని నిర్ణయించింది. ఇక దీనిపై రేపు (సెప్టెంబర్ 15) అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని ఫిలిం ఫేడరేషన్ నాయకులు భావిస్తున్నారు. చదవండి: రణ్వీర్ చెంప చెల్లుమనిపించిన బాడిగార్డ్! అసలేం జరిగిందంటే.. -
ప్రొడ్యూసర్స్ గిల్డ్ కీలక నిర్ణయం, షూటింగ్స్ పున:ప్రారంభంపై ప్రకటన
‘‘చిత్రపరిశ్రమలోని సమస్యలు పరిష్కరించడానికి షూటింగ్స్ నిలిపివేసినప్పటి నుంచి పలు సమావేశాలు ఏర్పాటు చేసి, చర్చించాం. ఇందులో భాగంగా అందర్నీ సమన్వయ పరచడానికి ఎగ్జిబిటర్స్, నిర్మాతలు, డిస్టిబ్యూటర్స్‌తో పాటు 24 క్రాఫ్ట్స్‌కు చెందిన యూనియన్స్, కౌన్సిల్స్‌తో చర్చించాం. సెప్టెంబర్ 1నుంచి యథావిధిగా షూటింగ్స్ చేసుకోవచ్చనే నిర్ణయానికి వచ్చాం’’ అని ‘దిల్’ రాజు అన్నారు. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఆగస్ట్ 1నుంచి షూటింగ్‌లు నిలిపివేసిన విషయం విదితమే. సెప్టెంబర్ 1నుంచి షూటింగ్స్ పునః ప్రారంభించుకోవచ్చని మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో నిర్మాతలు వెల్లడించారు. ‘దిల్’ రాజు మాట్లాడుతూ– ‘‘తెలుగు రాష్ట్రాల్లో 1800 థియేటర్లు ఉన్నాయి. వీపీఎఫ్ చార్జీల విషయంలో క్యూబ్, యూఎఫ్‌ఓలతో సంప్రదించి, అగ్రిమెంట్ విధానంలో నిర్ణయాలను తీసుకున్నాం. అలాగే టికెట్స్, తినుబండారాలు వంటివాటి ధరలు ప్రేక్షకులకు అందుబాటులో ఉంటాయి. పెద్ద సినిమాలకు బడ్జెట్ బట్టి టికెట్ ధరలను పెంచుకునే వెసులుబాటు ఉంటుంది. మరికొన్ని క్రాఫ్ట్స్‌తో చర్చించి ఈ నెల 30న పూర్తి విషయాలను వెల్లడిస్తాం’’ అన్నారు. సి. కల్యాణ్ మాట్లాడుతూ– ‘‘ముందుగా షూటింగ్స్ ప్రారంభించాలనుకునేవారు ఫిల్మ్ చాంబర్‌ను సంప్రదిస్తే ఈ నెల 25 నుంచి అనుమతులు ఇస్తాం’’ అన్నారు. -
వ్యూస్ కోసం అలాంటి థంబ్‌నైల్స్ పెట్టడం కరెక్ట్ కాదు
‘‘డిజిటల్ టెక్నాలజీ పెరగడంతో తంబ్‌నైల్స్, పైరసీ సమస్యలు ఎదుర్కొంటున్నాం. ఆరోపణలు వచ్చినప్పుడు వాస్తవాలు తెలుసుకోవాలి. అంతేకానీ కొందరు లైక్‌లు, వ్యూయర్స్ కోసం నిర్మాతలు, నటులు, దర్శకులపై తంబ్‌నైల్స్ పెట్టి ఇబ్బంది పెట్టడం తగదు. యూట్యూబ్ తంబ్‌నైల్స్, పైరసీ చేసేవారిపై ఎలాంటి యాక్షన్ తీసుకోవాలో చర్చిస్తాం.. పైరసీ సెల్‌ను యాక్టివ్ చేస్తాం’’’ అని దర్శక–నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ అన్నారు. సినీ ఇండస్ట్రీవారిపై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాలు, పైరసీ వంటి విషయాలపై చర్చించేందుకు 24క్రాఫ్ట్స్ అధక్షులు, సెక్రటరీలు నిర్మాతల మండలి, ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో గురువారం సమావేశమయ్యారు. నిర్మాత ఆదిశేషగిరిరావు మాట్లాడుతూ– ‘‘ఓటీటీలపైనా సెన్సార్ ఉండాలి. ఓటీటీలో సినిమా వచ్చిన రోజు సాయంత్రానికల్లా సినిమా పైరసీ అవుతోంది. ఫిలిం చాంబర్ యాంటీ పైరసీ విభాగం డబ్బున్న వాళ్లకే పని చేస్తోంది.. పైరసీని అరికట్టడంలో ఫిలిం చాంబర్ పాత్ర శూన్యం’’ అన్నారు. ‘‘యూట్యూబ్‌కి కూడా సెన్సార్ విధానం తీసుకురావాలి’’ అని డైరెక్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కాశీ విశ్వనాథ్ అన్నారు. ‘‘మా కుటుంబంపై వచ్చే అసత్య వార్తల వల్ల 25ఏళ్లుగా ఇబ్బంది పడుతున్నాను. మా కష్టాలను అర్థం చేసుకోండి’’ అని నటి, దర్శకురాలు జీవితా రాజశేఖర్ అన్నారు. ‘‘సోషల్ మీడియాలో ఎడిటింగ్ డిపార్ట్మెంట్ ఉండదు.. వారికి ఇష్టమైంది రాసుకుంటున్నారు.. దీన్ని అరికట్టాలి’’ అన్నారు దర్శకుడు ఎన్. శంకర్. -
తెలుగు ఫిలిం చాంబర్‌పై నిర్మాత సంచలన వ్యాఖ్యలు
పైరసీని అరికట్టడంలో ఫిలిం చాంబర్ విఫలమైందని నిర్మాత ఆదిశేషగిరిరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కొంతమంది వ్యక్తుల చేతుల్లోకి వెళ్లిందన్నారు. అలాగే ఫిల్మ్ పైరసీని అరికట్టడంలో ఫిలించాంబర్ విఫలమైందని, సినిమాలు విడుదలైన మరుసటి రోజే ఆన్లైన్లో, యూట్యూబ్‌లో వస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఓటీటీ, అందులో వస్తున్న కంటెంట్‌పై స్పందించారు. చదవండి: ఓ ఇంటివాడైన హీరో ఆది, పెళ్లి ఫొటోలు వైరల్ ప్రస్తుతం ఓటీటీ సమస్యగా మారిందని, సెన్సార్ లేకుండా కంటెంట్ వస్తుందన్నారు. అనంతరం ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో నెగిటివ్ న్యూస్ బాగా వేస్తున్నారన్నారు. చివరగా టికెట్ల రెట్స్ పెంచడం మంచిది కాదని నిర్మాత దిల్ రాజు మాట్లాడారని, అలాంటప్పుడు ప్రభుత్వంను పెంచమని అడిగేటప్పుడే ఫ్లెక్సిబుల్ రెట్స్ గురించి తెలుసుకుని అడగాల్సిందన్నారు. అలా చేస్తే సమస్యలు వచ్చేవికావని ఆయన అభిప్రాపడ్డారు. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4491455922.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
నారాయణ్ దాస్ మంచి సలహాలిచ్చేవారు: నిర్మాత
‘‘నారాయణ్ దాస్‌గారు ఏ సమస్యని అయినా క్షుణ్ణంగా పరిశీలించి, ఆ సమస్య మళ్లీ రాకుండా పరిష్కరించేవారు. చాంబర్‌కు సంబంధించిన విషయాల్లో మంచి సలహాలూ సూచనలు ఇస్తూ అభివృద్ధి దిశగా ఎలా వెళ్లాలో చెబుతుండేవారు. ఆయన్నుంచి నేను చాలా విషయాలు నేర్చుకున్నాను’’ అన్నారు నిర్మాత దామోదర ప్రసాద్. ప్రముఖ డిస్ట్రిబ్యూటర్, ఫైనాన్షియర్, నిర్మాత నారాయణ్‌దాస్ నారంగ్ బుధవారం కన్నుమూసిన విషయం తెలిసిందే. చదవండి: శ్రీవిష్ణు ‘భళా తందనాన’ మూవీ రిలీజ్ డేట్ ప్రకటించిన మేకర్స్ తెలుగు, తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్, నిర్మాతల మండలి ఆధ్వర్యంలో ఆయనకు సంతాప సభ జరిగింది. ‘‘చిన్న సినిమాలకు మేం ఉన్నాం అనే భరోసా కల్పించారు నారాయణ్ దాస్‌గారు. ఏ రోజూ తాను చేసిన సేవలు బయటకు చెప్పుకోలేదు. మాట ఇస్తే వెనక్కి తగ్గే వ్యక్తి కాదు. అదే పద్దతి ఆయన తనయుడు సునీల్‌కు వచ్చింది’’ అని ప్రసన్నకుమార్ అన్నారు. ఇంకా దర్శకుడు వై.వి.యస్ చౌదరి, నిర్మాతలు చదలవాడ శ్రీనివాసరావు, డీఎస్ రావు, మోహన్ వడ్లపట్ల, పద్మినీ నాగులపల్లి తదితరులు పాల్గొన్నారు. చదవండి: సినీ నటి జీవితకు అరెస్ట్ వారెంట్ -
'టాలీవుడ్‌కు ఇవే పెద్ద దిక్కు, ప్రభుత్వాలు వీటితోనే చర్చ జరపాలి'
‘‘తెలుగు చిత్ర పరిశ్రమలో చాలా సమస్యలున్నాయి. ప్రొడ్యూసర్స్ కౌన్సిల్, 24 క్రాఫ్ట్స్ ఫెడరేషన్, ‘మా’(మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) కలిసి సమస్యల పరిష్కారం కోసం కలిసి కట్టుగా ముందుకు వెళతాం’’ అని ఫిల్మ్ చాంబర్ జనరల్ సెక్రటరీ, నిర్మాత దామోదర ప్రసాద్ అన్నారు. కోవిడ్ తర్వాత తెలుగు చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యల గురించి చర్చించేందుకు ‘తెలుగు ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్’ ఆధ్వర్యంలో నిర్మాత జి.ఆది శేషగిరిరావు అధ్యక్షతన సినీ ప్రముఖులు ఆదివారం హైదరాబాద్‌లో సమావేశమయ్యారు. సమావేశం అనంతరం దామోదర ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ– ‘‘చాంబర్ తరఫున సబ్ కమిటీ ఏర్పాటు చేసి అందరికీ ఆమోద యోగ్యమైన నిర్ణయాల కోసం ముందుకువెళతాం. మూడు నెలల తర్వాత మరోసారి సమావేశమై చర్చిస్తాం’’ అన్నారు. ‘‘టాలీవుడ్‌కి ఫిల్మ్ చాంబర్, నిర్మాతల మండలి పెద్ద దిక్కు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు సినిమాలకు సంబంధించి ఏ చర్చ అయినా వీటితోనే జరపాలి’’ అని నిర్మాతల మండలి సెక్రటరీ ప్రసన్నకుమార్ అన్నారు. సినిమా పరిశ్రమకు మేలు జరిగేందుకు ప్రభుత్వాలతో ఎవరు చర్చించినా అభ్యంతరం లేదు. కానీ, కలిసే ముందు ఫిల్మ్ చాంబర్, నిర్మాతల మండలిని సంప్రదించాలనే అభిప్రాయం సమావేశంలో వ్యక్తమయింది. కాగా ఈ సమావేశానికి 250మందిని ఆహ్వానించినా కేవలం 60–70 మంది మాత్రమే వచ్చారు. స్టార్ హీరోలెవరూ ఈ సమావేశానికి హాజరుకాకపోవడం గమనార్హం. దర్శకులు రాజమౌళి, కొరటాల శివ, నిర్మాతలు బీవీఎస్ఎన్ ప్రసాద్, తమ్మారెడ్డి భరద్వాజ, సి.కల్యాణ్, నవీన్ ఎర్నేని, చదలవాడ శ్రీనివాసరావు, నిరంజన్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, ఎన్.వి.ప్రసాద్, అశోక్ కుమార్, వై. రవి, అనిల్ సుంకర, నటులు మురళీ మోహన్, రాజేంద్రప్రసాద్ పాల్గొన్నారు. -
నిర్మాతలకు సంబంధం లేకపోయినా టాక్స్ చెల్లించాలా?
దేశవ్యాప్తంగా ఒకే టాక్స్ విధానం అమలు చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి తమిళనాడు సినీ నిర్మాతల మండలి ప్రధాన సలహాదారుడు టి.రాజేందర్ విజ్ఞప్తి చేశారు. సినిమాలకు వీపీఎఫ్ (వర్చువల్ ప్రిట్ ఫీ) తగ్గించాలని డిమాండ్ చేస్తూ తమిళనాడు సినీ నిర్మాతల మండలి తరఫున బుధవారం స్థానిక వళ్లువర్ కోట్టం వద్ద ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వీపీఎఫ్ టాక్స్ తగ్గించాలని గత రెండేళ్లుగా కోరుతున్నామన్నారు. అయితే ఇప్పటి వరకు పరిష్కారం లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తాము థియేటర్లకు వ్యతిరేకంగా మాట్లాడటం లేదని, అయితే వీపీఎఫ్ టాక్స్ అనేది క్యూబ్ సంస్థలకు, థియేటర్ల యాజమాన్యానికి సంబంధించిన విషయమన్నారు. ఇందులో నిర్మాతలకు సంబంధంలేదని అలాంటి వారిని టాక్స్ చెల్లించమనడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. అదేవిధంగా ఎల్బీటీ (లోకల్ బాడీ టాక్స్)ని కూడా ప్రభుత్వం రద్దు చేయాలని కోరారు. -
నిర్మాతలకు ఆర్థికసాయం కోసం విరాళాల సేకరణ
చెన్నై : తమిళ చిత్ర నిర్మాతల మండలి విరాళాలు సేకరిస్తోంది. స్థానిక అన్నాశాలైలో గురువారం మండలి కార్యాలయంలో కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో కార్యవర్గం కొన్ని తీర్మానాలను చేసింది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన స్టాలిన్‌కు అభినందనలు తెలిపారు. తొలిసారిగా శాసనసభ్యుడిగా గెలుపొందిన ఉదయనిధి స్టాలిన్‌కు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో నిర్మాతలను ఆర్థిక సాయంతో ఆదుకోవడానికి నిధిని సేకరించాలని నిర్ణయించారు. సేవ దృక్పథం కలిగిన వారు ఆర్థిక సాయం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. నిర్మాతల మండలి కోశాధికారి ఎస్. చంద్రప్రకాష్ జైన్ రూ.10 లక్షల సాయాన్ని అందించారు. విడుదలలో సమస్యలను ఎదుర్కొంటున్న చిత్రాలను ఓటీటీ ప్లాట్ ఫాంలో విడుదల చేయడానికి సహకరించాలని తీర్మానం చేశారు. -
ఆగస్టులో నిర్మాతల మండలి ఎన్నికలు?
తమిళ నిర్మాతల మండలి ఎన్నికలను ఆగస్టులో నిర్వహించే అవకాశమున్నట్లు తాజా సమాచారం. ఇంతకుముందు ఈ మండలికి అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించిన విశాల్‌పై పలు ఆరోపణలు వచ్చాయి. కొందరు నిర్మాతలు మండలి కార్యాలయంపై దాడి చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ మండలి వ్యవహారం కోర్టుకెక్కింది. న్యాయస్థానం తమిళ నిర్మాతల మండలికి ఒక ప్రత్యేక అధికారిని నియమిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. అదేవిధంగా జూన్ 30లోపు నిర్మాతల మండలి ఎన్నికలను నిర్వహించవలసిందిగా ఆదేశించింది. మేలో ఎన్నికలను నిర్వహించడానికి సన్నాహాలు జరిగాయి. కరోనా వ్యాధి ప్రబలడంతో ఎన్నికలను వాయిదా వేయాల్సిందిగా కొందరు నిర్మాతలు కోర్టు ను ఆశ్రయించారు. చదవండి: బాయ్‌కాట్ సల్మాన్ కోర్టు నిర్మాతల మండలి ఎన్నికలను సెప్టెంబర్ 30లోగా నిర్వహించాల ని ఆదేశించింది. తాజాగా మండలి ఎన్నికలను ఆగస్టులో నిర్వహించడానికి సన్నాహాలు జరు గుతున్నట్లు సమాచారం. ఈ ఎన్నికలకు హైకో ర్టు పూర్వ న్యాయమూర్తి జయచంద్రన్‌ను ఎన్నికల అధికారిగా నియమించిన విషయం తెలిసిందే. ఈ సారి నిర్మాతల మండలి అధ్యక్ష పదవికి నిర్మాత మురళి, టి శివ పోటీ పడుతున్నారు. వీరిద్దరూ ఇప్పటికే తమ జట్లను ప్రకటించారు. వీరితో పాటు తాజాగా నిర్మాత కలైపులి దాను, టీ జీ.త్యాగరాజన్, నటుడు విశాల్ కూడా పోటీ చేసే అవాశం ఉందనేది కోలీవుడ్ వర్గాల సమాచారం. ఈ ఎన్నికలకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడయ్యే అవకాశం ఉంది. చదవండి: సుశాంత్ మామూ బతికే ఉన్నాడు! -
స్క్రీన్ ఉంది.. సీన్ లేదు
ఒకప్పుడు ‘నేడే చూడండి... మీ అభిమాన హీరో సినిమా’ అంటూ రిక్షాల్లో తిరుగుతూ మైకుల్లో చెప్పేవారు. రిక్షా వెనకాల పిల్లలు పరిగెత్తుతూ సందడి సందడి చేసేవారు. ఇప్పుడు టీవీ, రేడియా, సోషల్ మీడియా ఇలా సినిమా ప్రమోషన్‌కి చాలా ఉన్నాయి. థియేటర్ ముందు అయితే భారీ కటౌట్లు, గజమాలలు, పాలాభిషేకాలతో ఫ్యాన్స్ సందడి సందడి చేస్తుంటారు. ఇప్పుడు కరోనా ప్రభావంతో థియేటర్ల ముందు సందడి లేదు. వెండితెర వెలవెలబోతోంది. ‘స్క్రీన్ ఉంది.. సీన్ లేదు’. ‘‘సినిమా చరిత్రలో ఇలా పదీ పదిహేను రోజులు ‘థియేటర్లు బంద్’ కావడం నాకు తెలిసి ఇదే ఫస్ట్ టైమ్ అని’’ నైజాం ప్రముఖ పంపిణీదారుడు చారి పేర్కొన్నారు. దాదాపు పది రోజులు థియేటర్లు మూసివేయడం ద్వారా ‘సింగిల్ థియేటర్’కి ఏర్పడే నష్టం ఐదారు లక్షలు ఉంటుందని, మల్టీప్లెక్స్‌కి ఇంకా ఎక్కువ ఉంటుందని ఓ పంపిణీదారుడు తెలిపారు. అయితే సినిమా ఆడినప్పుడు సింగిల్ థియేటర్‌తో పోల్చితే మల్టీప్లెక్స్‌కి రాబడి ఎక్కువ ఉంటుందని మరో పంపిణీదారుడు అన్నారు. థియేటర్ల నిర్వహణ గురించి కొందరు ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు ఇచ్చిన సమాచారంలోకి వెళదాం... ► ఈ మధ్య ‘సింగిల్ థియేటర్’కి అన్నీ నష్టాలే. ఎందుకంటే సినిమా రిలీజులు పెద్దగా లేవు. చిన్న సినిమాలు మంచి టాక్ తెచ్చుకుని ఓ మూడు నాలుగు వారాలు ఆడితే అప్పుడు లాభాలు చూడొచ్చు. ఇక పెద్ద హీరోల సినిమాలను ఎక్కువ థియేటర్లలో రిలీజ్ చేస్తారు. దాంతో ఫస్ట్ వీక్, సెకండ్ వీక్ మంచి వసూళ్లతో థియేటర్ నడుస్తుంది. థర్డ్ వీక్ నుంచి వసూళ్లు పడిపోతుంటాయి. ► మల్టీప్లెక్స్‌లో అయితే ఉన్న మూడు నాలుగు స్క్రీన్స్‌లోనూ పెద్ద సినిమాని ప్రదర్శిస్తారు. వాళ్లకు పర్సంటేజ్ సిస్టమ్ ఉంటుంది. మొదటి వారం వచ్చే వసూళ్లలో డిస్ట్రిబ్యూటర్ 55 శాతం, ఎగ్జిబిటర్ 45 శాతం తీసుకుం టారు. రెండో వారానికి రివర్శ్. 55 ఎగ్జిబిటర్ (సినిమా ప్రదర్శించేవాళ్లు), 45 శాతం డిస్ట్రిబ్యూటర్ తీసుకుంటారు. అలా చివర్లో డిస్ట్రిబ్యూర్ 30, ఎగ్జిబిటర్ 70 శాతం తీసుకుంటారు. ► సింగిల్ థియేటర్ అయితే సినిమాని పర్సంటేజ్ పద్ధతిలో కాకుండా రెంటల్ సిస్టమ్‌కి ఇస్తారు. ఏరియాని బట్టి వారానికి నాలుగు లక్షలు రెంట్ ఉంటుంది. ఒకవేళ వసూళ్లు నామమాత్రంగా ఉంటే అప్పుడు డిస్ట్రిబ్యూటర్లు రెంటల్ విధానంలో కాకుండా పర్సంటేజ్ విధానంలో ఎగ్జిబిటర్ నుంచి డబ్బు తీసుకుంటారు. అది ఎప్పుడూ అంటే ఒక షోకి 50 వేలు వసూలు అయితే.. వారానికి సుమారు 10 లక్షలు కలెక్ట్ అవుతాయి. అప్పుడు డిస్ట్రిబ్యూటర్ 2 లక్షలు రెంట్ ఇచ్చేసి, మిగతా 8 లక్షలు తీసుకుంటారు. అదే వారం మొత్తం 2 లక్షలే వస్తే... ఎగ్జిబిటర్‌కి మొత్తం 2 లక్షలు రెంట్ ఇవ్వకుండా వచ్చిన వసూళ్లలో సగం తీసుకుంటారట పంపిణీదారుడు. అదే మల్టీప్లెక్స్ అయితే పర్సంటేజ్ సిస్టమే. ► అసలు ఒక థియేటర్ నెల మెయింటెనెన్స్ ఎంత అవుతుంది? అంటే.. బాగా నీట్‌గా మెయింటైన్ చేసే సింగిల్ థియేటర్‌కి ఐదున్నర నుంచి ఆరు లక్షలవుతుందట. ప్రొజెక్టర్ ఖర్చు, ప్రొజెక్టర్ బల్బ్, టాయ్‌లెట్, ఫ్లోర్ క్లీనింగ్, సీట్స్, కరెంట్ బిల్... ఇలాంటివన్నీ ఈ ఆరు లక్షల్లో ఉంటాయి. ప్రొజెక్టర్ నెల రెంట్ 30 వేలు అయితే, బల్బ్ దర 90 వేల నుంచి లక్ష వరకూ ఉంటుంది. రెండు మూడు నెలలకోసారి కొత్త బల్బ్ మార్చాల్సి ఉంటుంది. ఇది సింగిల్ థియేటర్ ఖర్చు. మల్టీప్లెక్స్‌కి వేరే విధంగా ఉంటుంది. అయితే సింగిల్ థియేటర్లో మూడు టికెట్ కౌంటర్లు ఉంటే.. మల్టీప్లెక్స్‌లోనూ దాదాపు అన్నే ఉంటాయని ఓ ఎగ్జిబిటర్ అన్నారు. కాకపోతే మల్టీప్లెక్స్‌లో స్టాఫ్ తక్కువ.. స్క్రీన్లు ఎక్కువ ఉంటాయి. అలాగే సింగిల్ థియేటర్లో సినిమా బాగా ఆడకపోతే క్యాంటీన్ రెవెన్యూ కూడా తగ్గుతుంది. కానీ మల్టీప్లెక్స్‌లో వేరే వేరే సినిమాలు స్క్రీనింగ్ చేసుకోవచ్చు కాబట్టి క్యాంటీన్ రన్ బాగానే ఉంటుంది. బాగున్న సినిమాని రెండు మూడు స్క్రీన్స్‌లో ప్రదర్శించే వీలు మల్టీప్లెక్స్‌కి ఉంటుంది. అయితే మల్టీప్లెక్స్వాళ్లకు ఉండే కష్టాలు వాళ్లకూ ఉంటాయి కానీ సింగిల్ థియేటర్స్‌కే నష్టం ఎక్కువ అని లెక్కలు చెబుతున్నారు కొందరు ఎగ్జిబిటర్లు. ► మరి ఈ పరిస్థితిలో థియేటర్ని ఎందుకు కంటిన్యూ చేయడం అంటే.. ఎప్పుడో థియేటర్స్ కట్టి ఉన్నాయి. వాటిని ఏం చేయాలన్నా కోట్లు పెట్టుబడి పెట్టాలి. ఉమ్మడి ప్రాపర్టీ అయితే పెట్టుబడి ఎవరు పెట్టాలి? అనే విషయంలో వివాదం వచ్చే అవకాశం ఉంది. ఇక పిల్లలు విదేశాల్లో సెటిల్ అయితే ఇక్కడున్న ప్రాపర్టీ మీద పెద్దగా దృష్టి పెట్టరు. అందుకని ఎలాగూ ఉన్నాయి కదా అని థియేటర్స్‌ని నడుపుతున్న ఎగ్జిబిటర్లే ఎక్కువ శాతం ఉన్నారని చారి పేర్కొన్నారు. ► ఇంతకీ పది రోజులు థియేటర్లు మూసేస్తే వచ్చే నష్టం ఎంతా అంటే ‘మినిమమ్ ఐదారు లక్షలు’ అంటున్నారు. ఏరియాని బట్టి ఈ లెక్కలో హెచ్చు తగ్గులుంటాయి. పైగా మార్కెట్లో దొరికే వస్తువులు ఇవాళ కాకపోతే రేపు అమ్ముడవుతాయి. కానీ ఆ రోజు సినిమా చూడాలనుకున్న ప్రేక్షకులు థియేటర్‌కి రాకపోతే ఆ మర్నాడు వస్తారన్న గ్యారంటీ లేదు. ఓ వారం తర్వాత ఆ సినిమా థియేటర్లో ఉంటుందన్న గ్యారంటీ కూడా లేదు. గత శుక్రవారం అర్జున, ప్రేమ పిపాసి’, 302, యురేక, మేద వంటి సినిమాలు విడుదలయ్యాయి. ఆ మర్నాటి నుంచే థియేటర్ల మూతను ప్రభుత్వం ప్రకటించింది. దీనివల్ల నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు నష్టపోయే అవకాశం ఉంది. అయితే బాగా వినిపిస్తున్న మాట ఏంటంటే... కరోనా కారణంగా ప్రేక్షకులు పెద్దగా థియేటర్లకు రావడంలేదు. అందుకని ఇప్పుడు థియేటర్లు మూసినా పెద్దగా నష్టం వాటిల్లదనే చెబుతున్నారు. దానికి ఓ ఉదాహరణ చెప్పాలంటే... ఓ మల్టీప్లెక్స్ థియేటర్లో 3600 టికెట్లు బుక్ అయితే.. 600 మంది ప్రేక్షకులు అసలు థియేటర్‌కి రాలేదట. బుక్ చేసుకుని మరీ రాలేదంటే కరోనా ఎంత భయపెడుతోందో ఊహించుకోవచ్చు. షూటింగ్ బంద్ కరో కరోనా వైరస్ ప్రభావం అన్ని రాష్ట్రాల చిత్ర పరిశ్రమలపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతోంది. తాజాగా తెలుగు రాష్ట్రాల్లో సినిమాల చిత్రీకరణలను నిలిపివేస్తున్నట్లు తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి, నటీనటుల సంఘం, నిర్మాతల మండలి సంయుక్తంగా ప్రకటించాయి. ఈ సందర్భంగా ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో తెలుగు ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు నారాయణదాస్ నారంగ్ మాట్లాడుతూ – ‘‘ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో షూటింగ్స్‌ను నిలిపి వేయాలని తెలుగు ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ నిర్ణయం తీసుకుంది. కరోనా కారణంగానే ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది’’ అన్నారు. ‘‘తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లు సంయుక్తంగా చిత్రీకరణలను నిలిపివేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. కొందరు నిర్మాతలకు ఇబ్బందిగా ఉన్నా సరే మా ఈ నిర్ణయానికి అందరూ సహకరించాలని కోరుతున్నాం. కరోనా కారణంగా తెలంగాణలో ఎక్కడా షూటింగ్స్ జరగవు’’ అన్నారు ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్రటరీ దామోదర్ ప్రసాద్. ‘‘కరోనా వైరస్ చాలా భయంకరమైనది కాబట్టి తెలంగాణ ప్రభుత్వం థియేటర్స్, మాల్స్ బంద్ ప్రకటించడం జరిగింది. అదే విధంగా షూటింగ్ నిలిపివేయాలని నిర్మాతల మండలి నిర్ణయం తీసుకుంది’’ అన్నారు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ యాక్టింగ్ ప్రెసిడెంట్ బెనర్జీ. ‘‘తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మేము స్వాగతిస్తున్నాం. ఎవ్వరికీ ఇబ్బంది లేకుండా తీసుకున్న నిర్ణయం ఇది. థియేటర్స్ బంద్‌తోపాటు షూటింగ్స్ కూడా నిలిపివేయాలనేది అందరూ మాట్లాడుకుని తీసుకున్న నిర్ణయం. ప్రస్తుతం తెలంగాణలో జరుగుతున్న చిత్రీకరణలు ఒక్కొక్కటిగా ఆగిపోతున్నాయి. అభ్యంతరం లేని ఆంధ్రా ప్రాంతాల్లో షూటింగ్స్ జరుగుతున్నాయి’’ అన్నారు ప్రొడ్యూసర్ కౌన్సిల్ అధ్యక్షుడు సి. కల్యాణ్. ‘‘షూటింగ్స్‌లో వందలమంది పాల్గొంటుంటారు. వారి ఆరోగ్య దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. సామాజిక బాధ్యతతో తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇది. అందరం దీన్ని సమర్థిస్తున్నాం’’ అన్నారు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సెక్రటరీ జీవితా రాజశేఖర్. ‘‘ప్రభుత్వం మళ్లీ షూటింగ్స్ జరుపుకోవచ్చని తెలియజేసినప్పుడు చిత్రీకరణలు పునరావృతం అవుతాయి. ఈ నిర్ణయాన్ని నిర్మాతలందరూ స్వాగతించాలి’’ అన్నారు ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్రటరీ ప్రసన్నకుమార్. ఈ సమావేశంలో నిర్మాతలు శ్యామ్ ప్రసాద్, ఠాగూర్ మధు, నట్టికుమార్, రామసత్యానారాయణ, సురేందర్‌రెడ్డి, కొమర వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. మరోవైపు సినిమాలు, టీవీ సీరియల్స్, వెబ్‌సిరీస్‌ల షూటింగ్స్ కూడా ఈ నెల 19 నుంచి 31 వరకు జరగకూడదని ఇండియన్ మోషన్ పిక్చర్స్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ (ఐఎమ్పీఆర్ఏ) ఆదివారం ఓ ప్రకటన విడుదల చేసింది. తిరిగి షూటింగ్స్‌ను ఎప్పుడు ప్రారంభించాలనే విషయాలను అప్పటి పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఈ నెల 30న ఓ నిర్ణయాన్ని వెల్లడిస్తామని ఐఎమ్పీఆర్ఏ పేర్కొంది. సి. కల్యాణ్, ప్రసన్నకుమార్, జీవిత, వెంకటేష్, నారాయణదాస్, బెనర్జీ, దామోదర ప్రసాద్, మధు -
కమల్ హాసన్‌పై నిర్మాత కంప్లయింట్
లోకనాయకుడు కమల్ హాసన్‌పై ప్రముఖ నిర్మాత, స్టూడియో గ్రీన్ సంస్థ అధినేత కేయి జ్ఞానవేల్ రాజా నిర్మాతల మండలి కంప్లయింట్ ఇచ్చారు. 2015లో రిలీజ్ అయిన ఉత్తమ విలన్ సినిమాకు సంబంధించిన విషయంలో కమల్, తనకు 10 కోట్ల రూపాయిలు బకాయి పడ్డట్టుగా జ్ఞానవేల్ రాజా పేర్కొన్నారు. ఉత్తమ విలన్ సినిమా రిలీజ్ సమయంలో కమల్‌కు ఆర్థిక ఇబ్బందులు ఎదురు కావటంతో జ్ఞానవేల్ రాజా నుంచి 10 కోట్ల రూపాయిలు డబ్బు తీసుకున్నారు. దీనికి బదులుగా స్టూడియో గ్రీన్ బ్యానర్లో ఓ సినిమా చేసేందుకు ఒప్పందం చేసుకున్నారు. అయితే నాలుగేళ్లు గడుస్తున్న కమల్ ఇంతవరకు జ్ఞానవేల్ రాజాకు కాల్షీట్స్ ఇవ్వకపోవటంతో ఆయన నిర్మాతల మండలిని ఆశ్రయించారు. నిర్మాత మండలి కలుగచేసుకొని కమల్ కాల్ షీట్స్ కానీ లేదా తన డబ్బు తనకు వెనక్కి గాని ఇప్పించాలని కోరారు. ఈ వివాదంపై నిర్మాత మండలి పెద్దలు ఎలా స్పందిస్తారో చూడాలి. ప్రస్తుతం కమల్ హాసన్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఇండియన్ 2 షూటింగ్లో బిజీగా ఉన్నారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తోంది. -
గిల్డ్ పేరుతో డబ్బు వసూళ్లపై నిషేదం
దక్షిణ భారత సినీ, టీవీ నిర్మాతల మండలి(గిల్డ్) పేరుతో సభ్యుల నుంచి, బ్యాంకు నుంచి డబ్బును వసూల్ చేయడంపై మద్రాసు హైకోర్టు నిషేధం విధించింది. వివరాల్లోకి వెళితే దక్షిణ భారత సినీ, టీవీ నిర్మాతల మండలికి అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహిస్తున్న స్టంట్‌మాస్టర్ జాగ్వర్ తంగం మద్రాసు హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు. అందులో తాను అధ్యక్షుడిగా బాధ్యతలను నిర్వహిస్తున్న దక్షిణ భారత సినీ, టీవీ నిర్మాతల మండలికి బదులుగా బాల సుబ్రమణియం అనే వ్యక్తి నకిలీ సంఘాన్ని ఏర్పాటు చేసి సభ్యుల వద్ద డబ్బును వసూల్ చేసి మోసానికి పాల్పడడంతో పాటు ఆ సంఘం నుంచి తనను తొలగించినట్లు ప్రచారం చేసుకుంటున్నారని పేర్కొన్నారు. నిజానికి తమ సంఘం దక్షిణ చెన్నై సంఘాల రిజిస్టర్ కార్యాలయంలో నమోదైందని తెలిపారు. అలాంటిది బాలసుబ్రమణియన్ వర్గం నకిలీ సంఘాన్ని ప్రారంభించి మోసాలకు పాల్పడుతోందని తెలిపారు. అంతే కాకుండా స్థానిక వడపళనిలోని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకులో తమ సంఘం పేరుతో ఉన్న ఖాతా నుంచి డబ్బును వసూలు చేస్తున్నారని తెలిపారు. కాబట్టి వారి నకిలీ సంఘంపైనా, అదే విధంగా బ్యాంకులో డబ్బును వసూలు చేకుండా నిషేధించాలని కోరారు. ఈ పిటిషన్‌పై సోమవారం కోర్టులో విచారణ జరిగింది. పిటిషనుదారుడి తరఫున న్యాయవాది ఆర్.మహేశ్వరి హాజరై తన వాదనలను వినిపించారు. అనంతరం న్యాయమూర్తులు కృష్ణన్ రామస్వామి నకిలీ సంఘం పేరుతో సభ్యుల నుంచి ఎలాంటి డబ్బును వసూలు చేయరాదని, అదే విధంగా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ఎలాంటి లావాదేవీలు జరపరాదని ఉత్తర్వులు జారీ చేశారు. అదే విధంగా బాలసుబ్రమణియంను వచ్చే నెల 9వ తేదీలోగా ఈ వ్యవహారంపై బదులు పిటిషన్‌ను దాఖలు చేయాలని ఆదేశించారు. -
స్టార్ హీరోల సినిమాలకు షాక్!
రజనీకాంత్, కమలహాసన్, విజయ్, అజిత్ తదితర 14 మంది స్టార్ హీరోల చిత్రాల విడుదలకు నిర్మాతల మండలి సలహా కమిటీ ఆంక్షలు విధించింది. ఈ మేరకు కమిటీ మంగళవారం ఒక ప్రకటనను మీడియాకు విడుదల చేసింది. అందులో తమిళ నిర్మాతల మండలి సలహా కమిటీ, సేలం డిస్ట్రిబ్యూటర్ల సంఘం సమావేశం అయ్యి ఒక తీర్మానం చేసినట్లు పేర్కొన్నారు. సినిమాలు విడుదలలో ఏర్పడుతున్న సమస్యలు, కష్టాలు, చిన్న చిత్రాల విడుదలకు థియేటర్ల కొరత తదితర విషయాల గురించి చర్చించారు. అందులోని లోపాలను సరిదిద్దే విధంగా కొన్ని ముఖ్య నిర్ణయాలను తీసుకోవడం జరిగిందన్నారు. అందులో భాగంగా నటులు రజనీకాంత్, కమలహాసన్, విజయ్, అజిత్, సూర్య, కార్తీ, విక్రమ్, విశాల్, ధనుష్, శివకార్తీకేయన్, శింబు, విజయ్‌సేతుపతి, జయంరవి, రాఘవలారెన్స్ వంటి హీరోల చిత్రాలతో పాటు భారీ బడ్జెట్ చిత్రాలు సేలంలో 45 డిజిటల్ ప్రింట్లతోనే విడుదల చేయాలి. అదే విధంగా సేలం టౌన్‌లోని 7 థియేటర్లలోనూ, హోసూర్, ధర్మపురి, కృష్ణగిరి, నామక్కల్, కుమారపాళైయం, తిరుసెంగోడు ప్రాంతాల్లో రెండేసి థియేటర్లలోనూ ఇతర ఊర్లలో ఒక్కో థియేటర్లో మాత్రమే విడుదల చేయాలని నిర్ణయం చేసినట్లు తెలిపారు. అదే విధంగా ఇతర నటుల చిత్రాలను 36 డిజిటల్ ప్రింట్లతోనే విడుదల చేయాలని తీర్మానం చేసినట్లు చెప్పారు. సేలం జిల్లాలో వ్యాపారం జరగని చిన్న చిత్రాలను సేలం డిస్ట్రిబ్యూటర్ల కౌన్సిలే బాధ్యత తీసుకుని 3 శాతం సర్వీస్ చార్జీలు మాత్రమే తీసుకుని విడుదల చేసే విధంగా తీర్మానం చేసినట్లు పేర్కొన్నారు. ఈ నిర్ణయం బుధవారం నుంచే అమలులోకి వస్తుందని కమిటీ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. -
తుది తీర్పునకు లోబడే..
సాక్షి, హైదరాబాద్: తెలుగు నిర్మాతల మండలి ఎన్నిక తాము ఇచ్చే తుది తీర్పునకు లోబడి ఉంటుందని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఎ.రాజశేఖర్‌రెడ్డి శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. 2019–21 సంవత్సరానికి తెలుగు నిర్మాతల మండలికి జరుగుతున్న ఎన్నికల్లో కోశాధికారి పోస్టుకు తాను దాఖలు చేసిన నామినేషన్‌ను తిరస్కరించడాన్ని సవాలు చేస్తూ యలమంచిలి రవిచంద్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్‌పై జస్టిస్ రాజశేఖర్‌రెడ్డి విచారణ జరిపారు. పిటిషనర్ తరఫు న్యాయవాది జె.విజయలక్ష్మి వాదనలు వినిపిస్తూ చదలవాడ శ్రీనివాసరావును ఏకగ్రీవం చేసేందుకే పిటిషనర్ నామినేషన్‌ను తిరస్కరించారని తెలిపారు. దీని వెనుక పెద్ద కుట్ర ఉందన్నారు. కోశాధికారి పోస్టుకు పిటిషనర్ పేరును వైవీఎస్ చౌదరి ప్రతిపాదించారని, ఆ తరువాత ఆయనే నామినేషన్ దాఖలు చేయడంతో పిటిషనర్ నామినేషన్‌ను తిరస్కరించారని వివరించారు. పిటిషనర్‌తోపాటు వైవీఎస్ చౌదరి, రామ సత్యనారాయణ, చదలవాడ శ్రీనివాసరావులు నామినేషన్లు దాఖలు చేశారని, పిటిషనర్ నామినేషన్ తిరస్కరణకు గురికాగా, వైవీఎస్ చౌదరి, రామ సత్యనారాయణ నామినేషన్లను ఉపసంహరించుకున్నారని, బరిలో శ్రీనివాసరావు ఒక్కరే మిగిలారన్నారు. ఆయన కోసమే ఇదంతా చేశారని వివరించారు. వైవీఎస్ చౌదరి ఉపాధ్య పదవికి పోటీ చేస్తున్నారని, ఈ కుట్ర కోణాన్ని పరిగణనలోకి తీసుకుని తన నామినేషన్‌ను పరిగణనలోకి తీసుకునేలా ఆదేశాలు ఇవ్వాలని కోర్టును కోరారు. ఈ నెల 30న(నేడు) జరగనున్న నిర్మాతల మండలి ఎన్నిక ఈ వ్యాజ్యంలో కోర్టు ఇచ్చే తుది తీర్పుకు లోబడి ఉంటుందని న్యాయమూర్తి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. -
నిర్మాతల మండలి ఎన్నికలు వద్దు
‘‘నిర్మాతల మండలి ఎన్నికల కోసం డబ్బు ఖర్చు చేసే బదులు అందరూ ఒక్కటిగా ప్యానల్‌ని ఎన్నుకుంటే బాగుంటుంది. ఈ విషయంపై తెలంగాణ ఎఫ్డీసీ చైర్మన్ రామ్మోహనరావు, నిర్మాత సురేశ్‌బాబుతో కూడా మాట్లాడాను. చాలా మంది నిర్మాతల అభిప్రాయం కూడా ఇదే’’ అని తెలంగాణ ఫిలిం ప్రొడ్యూసర్ కౌన్సిల్ ప్రెసిడెంట్, నిర్మాత ప్రతాని రామకృష్ణ గౌడ్ అన్నారు. తెలుగు ఫిలిం చాంబర్ నిర్మాతల మండలి ఎన్నికలు ఈ నెల 30న జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రతాని రామకృష్ణ గౌడ్ సోమవారం విలేకరులతో మాట్లాడుతూ– ‘‘ఎన్నికల విషయంలో ఇటీవలే నిర్మాతల మండలి సమావేశం జరిపి రెండు ప్యానల్స్‌ని ఎంపిక చేసింది.ఆ తర్వాత కొన్ని నాటకీయ పరిణామాల మధ్య రెండు ప్యానల్స్ ఒక్కటయ్యాయి. అందులో కొందరిని పక్కన పెట్టారు. నిర్మాతల మండలి బాగా ఉంటున్న క్రమంలో కొందరు కావాలని సమస్యలు సృష్టిస్తున్నారు. ఇప్పటికే కొందరు ఎల్.ఎల్. పి అంటూ చానల్స్ విషయంలో సపరేట్గా ఉండటంతో కౌన్సిల్‌కు వచ్చే ఆదాయం తగ్గింది. ఆ సమస్యను పరిష్కరిస్తామని నిర్మాత సి. కళ్యాణ్‌గారు చెప్పారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు నేడు ఉపసంహరణ చేసుకుంటే బాగుంటుంది. ఎన్నికల ముందే అందరు పెద్ద వాళ్లతో కూర్చుని నిర్మాతల మండలి ప్యానల్‌ని ఎంపిక చేస్తే బాగుంటుంది. నేడు నేను ఉపసంహరణ చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నాను, మీరు కూడా ముందుకు రావాలి’’ అన్నారు. ఈ సమావేశంలో నిర్మాతలు శంకర్ గౌడ్, జేవీఆర్, సాయి వెంకట్‌లతో పాటు మరికొందరు నిర్మాతలు పాల్గొన్నారు. -
30న నిర్మాతల మండలి ఎన్నికలు
ప్రతి రెండేళ్లకోసారి నిర్మాతలమండలి ఎన్నికలు నిర్వహిస్తారు. కానీ ఈసారి జరగాల్సిన ఎన్నికలు చాలాకాలంగా వాయిదా పడుతూ వస్తున్నాయి. ఎట్టకేలకు నిర్మాతల మండలి ఎన్నికలు జూన్ 30న జరగనున్నాయి. ఈ సందర్భంగా శనివారం హైదరాబాద్‌లో జరిగిన పాత్రికేయుల సమావేశంలో నిర్మాత సి.కళ్యాణ్, ప్రసన్నకుమార్ కలిసి ‘మన కౌన్సిల్– మన ప్యానెల్’ అనే నినాదంతో ముందుకు వచ్చారు. సి.కళ్యాణ్ మాట్లాడుతూ– ‘‘నిర్మాతల మండలి నిర్మాతల శ్రేయస్సు కోసం ఏర్పాటు చేయబడింది. నిర్మాతలందరం ఒక గ్రూప్‌గా ఏర్పడి నిర్మాతల మండలి బలంగా ఉండాలని పి.రామ్మోహన్రావు, డి.సురేశ్‌బాబు, అల్లు అరవింద్, చదలవాడ శ్రీనివాసరావు లాంటి పెద్దలందరూ ముందుకొచ్చారు’’ అన్నారు. చదలవాడ శ్రీనివాసరావు మాట్లాడుతూ– ‘‘నిజానికి ఎన్నికలు జరగకుండా ఏకగ్రీవంగా అర్హులకు తగ్గ పదవులిచ్చి నిర్మాతల మండలి స్ట్రాంగ్‌గా ఉండాలన్నదే మా కోరిక. కానీ సమయాభావం వల్ల సభ్యులందరూ అందుబాటులో లేని కారణంగా ఎన్నికలు జరపక తప్పటం లేదు’’ అన్నారు. టి. ప్రసన్నకుమార్ మాట్లాడుతూ– ‘‘ఇండస్ట్రీలో చాలా సమస్యలున్నాయి. ఎన్నికల్లో ఎవరు గెలిచినా మిగిలిన సభ్యులు స్వచ్ఛందంగా రాజీనామాలు చేసి అర్హులైన, ఆసక్తి ఉన్న సభ్యులకి పదవులిస్తాం’’ అన్నారు. ఈ ఎన్నికల్లో ‘మన ప్యానెల్’,‘గిల్డ్ప్యానెల్’ పోటీ పడనున్నాయి. ఈ కార్యక్రమంలో వైవీయస్ చౌదరి, నిర్మాతలు మోహన్ వడ్లపట్ల, రామసత్యనారాయణ, అశోక్ వల్లభనేని తదితరులు పాల్గొన్నారు. -
విశాల్‌కు గట్టి ఎదురుదెబ్బ
తమిళ సినిమా: నిర్మాతల మండలి అధ్యక్షుడు, తెలుగు తమిళ చిత్రాల హీరో విశాల్‌కు ఎదురు దెబ్బ తగిలింది. నిర్మాతల మండలి కార్యవర్గం పలు ఆరోపణలను ఎదుర్కోవడం, ఎన్నికలకు ముందు చేసిన వాగ్ధానాలను నెరవేర్చకపోవడం వంటి కారణాలతో మండలి కార్యనిర్వాకాన్ని ప్రభుత్వం తన చేతుల్లోకి తీసుకుంది. నటుడు విశాల్ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహిస్తున్న నిర్మాతల మండలికి చెందిన నిధిలో రూ.7 కోట్లు ఖర్చు చేశారని, దానికి సరైన వివరాలను చూపడం లేదని మండలి సభ్యులు పలువురు ఆరోపణలు చేస్తున్నారు. ఈ వ్యవహారంపై నటుడు కే.రాజన్, ఎస్వీ.శేఖర్, ఏఎల్.అళగప్పన్ పలువురు సభ్యులు మండలి కార్యాలయం ముందు ఆందోళన చేసి కార్యాలయానికి తాళం వేశారు. ఈ వ్యవహారం పోలీస్ కేసులు, అరెస్ట్‌లు, కోర్టుల వరకూ వెళ్లింది. అదే విధంగా మండలికి చెందిన ఆదాయ, వ్యయ వివరాలను సర్వసభ్య సమావేశంలో ఆమోదం పొందలేదని పలువురు సభ్యులు ఆరోపిస్తున్నారు. ఇక ఇటీవల నిర్వహించిన ఇళయరాజా 75వ అభినందన కార్యక్రమానికి సర్వసభ్య సమావేశంలో అంగీకారం పొందలేదనే ఆరోపణలు వస్తున్నాయి. కార్యక్రమానికి చెందిన ఆదాయ, ఖర్చుల వివరాలను వెల్లడించలేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మండలిలో జరుగుతున్న అవనీతి, అవకతవకలపై ప్రభుత్వం చర్చలు తీసుకోవాలని మండలిలోని ఒక వర్గం ముఖ్యమంత్రిని కలిసి విజ్ఞప్తి చేసింది. ఈ పరిస్థితుల్లో నిర్మాత మండలి నిర్వాకాన్ని ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకుంది. ఈ విషయాన్ని మండలి రిజిస్టార్ తెలిపారు. కాగా నిర్మాతల మండలి పర్యవేక్షకుడిగా ఎన్.శేఖర్ని ప్రభుత్వం నియమించింది. ఇకపై మండలిలో ఏ కార్యక్రమాలు చేపట్టాలన్నా ఆయన ద్వారానే జరగాల్సి ఉంటుంది. ఇది ప్రస్తుతం నిర్మాతలమండలి కార్యవర్గానికి అవమానకరమైన అంశమే అవుతుంది. ముఖ్యంగా మండలి అధ్యక్షుడు విశాల్‌కు ఇది ఘోర అవమానకరమైన ఘటనే. ఇవే కారణాలు.. ప్రభుత్వం నిర్మాతల మండలిని తన ఆధీనంలోకి తీసుకోవడానికి 5 కారణాలను పేర్కొంది. మండలికి చెందిన నిధిలోంచి స్వచ్ఛంద సంస్థలకు రుణాలు ఇచ్చినట్లు తెలిసింది. ఇది మండలి విధి విధానాలకు వ్యతిరేకం. అదే విధంగా మండలి నిధిలో కోట్లాది రూపాయల్లో అవకతవకలు జరిగాయి. ఇక మండలి ఏ విషయంలోనూ నిబంధనల ప్రకారం సరైన రికార్డులను పొందుపరచలేదు. అలాగే చిరునామాను మార్చి ఆ వివరాలను ప్రభుత్వ రిజిస్టర్ కార్యాలయంలో నమోదు చేసుకోలేదు. ఇది చట్ట విరుద్దమైన చర్య. మండలిలోని అవకతవకల కారణంగా మీరే సొంతంగా నిబంధనలను రూపొందించుకోవడం అపాయకరం. అలాగే నిబంధనలను మార్చినా వాటిని సర్వసభ్యుల ఆమోదం పొందాల్సి ఉంటుంది. ఇక మండలి ఆదాయ, వ్యయ వివరాలను సర్వసభ్య సమావేశంలో ఆమోదం పొందలేదు’అని ప్రభుత్వం పేర్కొంది. దీంతో మండలిలో వ్యతిరేక వర్గం ఇప్పటి వరకూ విశాల్ వర్గంపై చేస్తున్న ఆరోపణలు వాస్తవమేననే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. -
డిజిటల్ మీడియాకు షాక్ ఇచ్చిన తెలుగు నిర్మాతలు
ప్రస్తుత పరిస్థితుల్లో థియేటర్లకు వెళ్లి సినిమాలు చూసే ప్రేక్షకుల తగ్గిపోతున్నారు. సినిమా రిలీజ్ అయిన నెల రోజుల్లోనే అమేజాన్, నెట్‌ఫ్లిక్స్, జియో లాంటి డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌లో అందుబాటులోకి వస్తుండటంతో థియేటర్లలో సినిమా చూసేందుకు ప్రేక్షకులు పెద్దగా ఇంట్రస్ట్ చూపించటం లేదు. ప్రస్తుతానికి డిజిటల్ మీడియా ద్వారా నిర్మాతలకు మంచి లాభాలే వస్తున్నా భవిష్యత్తులో వీటి వల్ల థియేటర్ల మనుగడ ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉందన్న వాదన వినపడుతుంది. అందుకే ఈ విషయంపై నిర్మాతల మండలి పెద్దలు ఓ నిర్ణయం తీసుకున్నారు. ఏప్రిల్ 1 నుంచి ఏ సినిమా అయిన రిలీజ్ అయిన 8 వారాల వరకు డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌లో ప్రదర్శించకుండా ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్టుగా తెలిపారు. అయితే ఈ నిర్ణయంపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. పెద్ద సినిమాలు హిట్ సినిమాలకు ఈ నిర్ణయం మేలు చేసినా చిన్న సినిమాలు, ఫ్లాప్ టాక్ వచ్చిన సినిమాలకు ఈ నిర్ణయంతో నష్టాలు పెరిగే అవకాశం ఉందని కొందరు వాదిస్తున్నారు. -
కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు : విశాల్
కేంద్రప్రభుత్వానికి తమిళ చిత్ర నిర్మాతల మండలి ధన్యవాదాలు తెలిపింది. దీనికి సంబంధించి శనివారం ఆ మండలి నిర్వాహకులు ఒక ప్రకటన మీడియాకు విడుదల చేశారు. అందులో పైరసీతో భారతీయ సినిమా నానాటికీ నశించిపోతోందని పేర్కొన్నారు. ముఖ్యంగా ప్రాంతీయ భాషా చిత్రాల్లో వ్యాపార రీత్యా, ఉన్నత విలువలతో కూడిన చిత్రాలను అందించడంలో ముందుండే తమిళ సినిమా రంగాన్ని రక్షించడానికి ఈ యాక్ట్ దోహదం చేస్తుందన్నారు. సెక్షన్ 6ఏ ఆఫ్ ది సినిమాటోగ్రాఫ్ యాక్ట్ చట్టానికి గానూ యావత్ సినీ పరిశ్రమ తరఫున నిర్మాతల మండలి తరఫున ప్రధానమంత్రి నరేంద్రమోదికి నిర్మాతల మండలి అధ్యక్షుడు విశాల్ ధన్యవాదాలు తెలుపారు. అదే విధంగా సింగిల్ విండో సిస్టం పేరుతో చిత్రపరిశ్రమ ఫలం పొందేలా ఒక విభాగాన్ని ఏర్పాటు చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఇక 28 శాతంగా ఉన్న జీఎస్టీ పన్నును సినీరంగం కోసం 18 శాతానికి తగ్గించడానికి కృషి చేసిన కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి పొన్.రాధాకృష్ణన్‌కు ఈ సందర్భంగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నామని పేర్కొన్నారు. -
విశాల్‌తో ఢీకి భారతీరాజా రెడీ
తమిళ నిర్మాతలమండలి ఎన్నికల్లో సీనియర్ దర్శకుడు భారతీరాజా, ప్రస్తుతం మండలి అధ్యక్షుడు విశాల్‌ను ఢీ కొనడానికి సిద్ధం అవుతున్నట్లు తాజా సమాచారం. విశాల్‌పై ఇటీవల ఆయన వ్యతిరేక వర్గం పలు ఆరోపణలు గుప్పిస్తున్న విషయం తెలిందే. అదేవిధంగా గత 18వ తేదీన విశాల్ వ్యతిరేక వర్గం మండలి కార్యాలయానికి తాళం వేసి చేసిన రచ్చ గురించి తెలిసిందే. విశాల్ మండలి అధ్యక్ష పదవికి తక్షణమే రాజీనామా చేయాలని, వెంటనే మళ్లీ మండలి ఎన్నికలు నిర్వహించాలన్న డిమాండ్‌తో పాటు ఆయనపై పలు ఆరోపణల చిట్టాతో భారతీరాజా నేతృత్వంలో వ్యతిరేక వర్గం ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామిని కలిసి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. అంతే కాదు విశాల్‌ను పోలీసులు అరెస్ట్ చేసే వరకూ పరిస్థితులను తీసుకొచ్చారు. మార్చిలోనే ఎన్నికలు మూడు ఏళ్లకొకసారి జరిగే నిర్మాతల మండలి ఎన్నికలు 2019 మార్చిలో జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో మళ్లీ తాను అధ్యక్ష పదవికి పోటీ చేయనున్నట్లు నటుడు విశాల్ చాలా కాలం క్రితమే ప్రకటించారు. దీంతో ఆయన వ్యతిరేక వర్గానికి నేతృత్వం వహిస్తున్న దర్శకుడు భారతీరాజానే అధ్యక్ష పదవికి పోటీ చేయించాలనే నిర్ణయానికి వచ్చిన విశాల్ వ్యతిరేక వర్గం ఆ ప్రయత్నాలను ఇప్పటి నుంచే మొదలెట్టింది. అంతే కాదు పోటీ చేయాలని భారతీరాజాపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. విశాల్‌తో ఢీ కొనడానికి భారతీరాజా సిద్ధంగానే ఉన్నట్లు, అయితే ఇటీవల జరిగిన పరిణామాలతో నిర్మాతలు కొన్ని వర్గాలుగా విడిపోయినట్లు వారందరినీ ఒక్క తాటిపైకి తీసుకొస్తే తాను విశాల్‌ను ఢీకొంటానని భారతీరాజా చెప్పినట్లు, ఆయన అనుకూల వర్గానికి చెందిన ఒకరు చెప్పారు. నిర్మాతల మండలి అధ్యక్షుడిగా ఒక తమిళుడు ఉండాలన్నదే తమ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. గత ఎన్నికలే చాలా రసవత్తరంగాజరిగాయి. ఆ పోటీలో అందరి ఊహలను తలకిందులు చేస్తూ విశాల్ జట్టు విజయం సాధించింది.ఈ సారి కూడా గట్టి పోటీ నెలకొననుందన్న మాట. చూద్దాం ఏం జరుగుతుందో, ఇంకా మూడు నెలలు ఉందిగా! -
హీరో విశాల్ అరెస్ట్..
-
హీరో విశాల్ అరెస్ట్..
తమిళ నిర్మాతల మండలిలో నెలకొన్న విబేధాలు తారస్థాయికి చేరాయి. హీరో అరెస్ట్‌తో గురువారం నిర్మాతల మండలి ఎదుట ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. తమిళ నిర్మాతల మండలి అధ్యక్షుడిగా ఎన్నికైన విశాల్‌ను తొలుత అభినందించిన వాళ్లే ఇప్పుడు విమర్శిస్తున్నారు. సమస్యలను పట్టించుకోవడం లేదని.. పైరసీని అడ్డుకోవడంలో విఫలమయ్యారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పైరసీ సినిమాల వెబ్సైట్ తమిళ్‌రాకర్స్‌లో విశాల్‌కు షేర్ ఉందంటూ ప్రముఖ నిర్మాత అజగప్పన్ ఆరోపించారు. ఇక మీదట నిర్మాతల మండలిలోకి రానిచ్చేది లేదంటూ ఆయన ప్రత్యర్థులు కొందరు కార్యాలయానికి తాళం వేశారు. దాంతో విశాల్ తాళం పగలగొట్టి లోనికి వెళ్లేందుకు ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో తమిళ నిర్మాతల మండలి కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చివరకూ చెన్నై పోలీసలు విశాల్‌ను అరెస్ట్ చేశారు. అయితే గత కొంతకాలంగా విశాల్‌కు, నిర్మాతలకు మధ్య విబేధాలు మొదలయ్యాయి. దాంతో ఓ వర్గం వారు విశాల్ రాజీనామాకు డిమాండ్ చేస్తున్నారు. అంతేకాక ఈ నెల 21న తమిళనాట ఏకంగా 9 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఇన్ని సినిమాలు ఒకేసారి రిలీజ్ చేసేలా పర్మిషన్ ఎలా ఇచ్చారంటూ చిన్న సినిమాల నిర్మాతలు విశాల్‌ను నిలదీస్తున్నారు. కాగా అరెస్ట్ విషయమై విశాల్ ట్విటర్లో స్పందించారు. ‘ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు కొందరు నిన్న తమిళ నిర్మాతల మండలికి తాళం వేశారు. అప్పుడు స్పందించని పోలీసులు.. నేడు మా తప్పేం లేకపోయినప్పటికి నన్ను, నా సహచరులను అరెస్ట్ చేశారు. దీన్ని నమ్మలేకపోతున్నాను. ఈ విషయం గురించి పోరాటం చేస్తానం’టూ ట్వీట్ చేశారు. Police who were mute yesterday wen unauthorised ppl locked the doors & gates of TFPC have arrested me & my colleague today for no fault of ours,absolutely unbelievable We will fight back,wil do everything to conduct Ilayaraja sir event & raise funds to help Producers in distress — Vishal (@VishalKOfficial) December 20, 2018 -
ఒకేరోజు 9 సినిమాల రిలీజ్.. విశాల్‌పై ఆరోపణలు
సాక్షి, చెన్నై: తమిళ నిర్మాతల మండలిలో వర్గపోరు తారాస్థాయికి చేరుకుంది. సినిమాల రిలీజ్ విషయంలో ఎదురవుతున్న పోటి వివాదానికి మరింత ఆజ్యం పోసింది. ఈ నెల 21న తమిళనాట ఏకంగా 9 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. దీంతో ఇన్ని సినిమాలను ఒకేసారి రిలీజ్ చేసేలా ఎలా పర్మిషన్ ఇస్తారంటూ చిన్న సినిమాల నిర్మాతలు, నిర్మాతల మండలి అధ్యక్షుడు విశాల్‌ను నిలదీస్తున్నారు. వీరికి నిర్మాతల మండలిలోని విశాల్ వ్యతిరేఖవర్గం మద్ధుతు తెలపడంతో వివాదం మరింత ముదిరింది. ఒకే రోజు పెద్ద సంఖ్యలో సినిమాల విడుదలకు పర్మిషన్ ఇవ్వడాన్ని నిరసిస్తూ టీనగర్‌లోని నిర్మాతల సంఘం ఆఫీస్‌లకు తాళం వేశారు. ఒకే రోజు ఇన్ని సినిమాలు రిలీజ్ అయితే చిన్న సినిమా నిర్మాతల పరిస్థితి ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు. -
నటనా, రెడ్‌కార్డా?
తమిళ సినిమా: నటిస్తారా? రెడ్‌కార్డుకు సిద్ధ పడతారా? అంటూ నటుడు వడివేలుకు నిర్మాతల సంఘం అల్టిమేటం జారీ చేసిందా? దీనికి అవుననే సమాధానమే కోలీవుడ్ వర్గాల నుంచి వస్తోంది. విషయం ఏమిటంటే హాస్యనటుడిగా రాణిస్తున్న వడివేలును స్టార్ డైరెక్టర్ శంకర్ హీరోగా పరిచయం చేశారు. ఆయన ఎస్.ప్రొడక్షన్ పేరుతో చిత్ర నిర్మాణ సంస్థను ప్రారంభించి 2006లో తన శిష్యుడు శింబుదేవన్‌ను దర్శకుడిగా పరిచయం చేసి ఇంసై అరసన్ 23ఆమ్ పులికేసి చిత్రాన్ని నిర్మించారు. ఆ చిత్రం మంచి విజయం సాధించడంతో పాటు వడివేలుకు హీరోగా క్రేజ్ పెరిగింది. ఇక ఆ తరువాత హాస్య పాత్రల్లో నటించేది లేదంటూ ప్రకటించేశారు. హింసై అరసన్ 23ఆమ్ పులికేసి చిత్రం విజయంతో దర్శకుడు శంకర్ ఆ చిత్రానికి సీక్వెల్‌ను నిర్మించడానికి సిద్ధమయ్యారు. దీంతో శింబుదేవన్ దర్శకత్వంలోనే వడివేలు హీరోగా హింసై అరసన్ 24ఆమ్ పులికేసి చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేశారు. అందుకోసం భారీ సెట్స్ వేశారు. వడివేలు ఈ చిత్రంలో నటించడానికి కమిట్ అయ్యారు. చిత్ర షూటింగ్ ప్రారంభం అయి కొంత భాగం జరిగిన తరువాత వడివేలు సడన్‌గా తానీ చిత్రంలో నటించనని వైదొలిగారు. వడివేలు కథలో, కాస్ట్యూమ్స్ వంటి విషయాల్లో జోక్యం చేసుకుంటున్నారనే ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. ఈ వివాదంపై దర్శకుడు శంకర్ నిర్మాతల మండలి, నడిగర్‌సంఘానికి వడివేలుపై íఫిర్యాదు చేశారు. అందులో తన చిత్రంలో వడివేలును నటింపజేయాలని, లేని పక్షంలో తాను హింసై అరసన్ 24ఆమ్ పులికేసి చిత్రం కోసం ఇప్పటి వరకూ ఖర్చు చేసిన రూ.9కోట్లను ఆయన తిరిగి చెల్లించేలా ఆదేశించాలని కోరారు. దీంతో నిర్మాతల మండలి నిర్వాహకులు, ఫెఫ్సీ అధ్యక్షుడు ఆర్కే.సెల్వమణి ఈ వ్యవహారంపై చర్చించారు. నటుడు వడివేలును వివరణ కోరుతూ లేఖ రాశారు. అయితే ఆ చిత్రం కోసం తాను కేటాయించిన కాల్షీట్స్ను వారు వృథా చేశారని, దీంతో తాను పలు ఇతర చిత్రాలను కోల్పోయి నష్టపోయానని, అందువల్ల ఇకపై హింసై అరసన్ 24ఆమ్ పులికేసి చిత్రంలో నటించలేనని బదులిచ్చారు. ఇలాంటి పరిస్థితుల్లో నటుడు, నిర్మాతల మండలి అధ్యక్షుడు విశాల్ ఇటీవల వడివేలుతో మరోసారి సమావేశమై చర్చలు జరిపారు. అప్పుడు వడివేలు తనను మరో రెండు కోట్లు అదనంగా చెల్లిస్తేనే ఆ చిత్రంలో నటిస్తానని చెప్పినట్లు సమాచారం. ఈ వ్యవహారంపై గురువారం విశాల్ నేతృత్వంలో బృందం సమావేశాన్ని నిర్వహించారు. అప్పుడు వడివేలు ఎలాంటి నిబంధనలు విధించకుండా హింసై అరసన్ 24ఆమ్ పులికేసి చిత్రంలో నటించాలని, లేని పక్షంలో నష్టపరిహారంగా ఆ చిత్ర నిర్మాత శంకర్‌కు రూ.9 కోట్లు చెల్లించాలని నిర్ణయం తీసుకున్నట్లు, అదీ కాకపోతే నటుడు వడివేలుపై ఇకపై ఏ చిత్రంలోనూ నటించకుండా రెడ్ కార్టు విధించేవిధంగా తీర్మానం చేసినట్లు సమాచారం. దీంతో వడివేలు మళ్లీ హింసై అరసన్ 24ఆమ్ పులికేసి చిత్రంలో నటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. -
ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు
తమిళసినిమా: నిర్మాతల విజయమే తమ లక్ష్యం అని నటుడు, నిర్మాతల మండలి అధ్యక్షుడు విశాల్ పేర్కొన్నారు. ఈయన తాజాగా నిర్మించి, కథానాయకుడిగా నటించిన చిత్రం ఇరుంబుతిరై. సమంత కథానాయకిగా, నటుడు అర్జున్ ప్రతినాయకుడిగా నటించిన ఈ చిత్రానికి పీఎస్.మిత్రన్ దర్శకుడు. గత వారం తెరపైకి వచ్చిన ఈ చిత్రం విశేష ప్రేక్షకాదరణతో ప్రదర్శింపబడుతుండడంతో గురువారం మధ్యాహ్న చిత్ర యూనిట్ స్థానిక వడపళనిలోని ఒక నక్షత్ర హోటల్లో సక్సెస్ మీట్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా నటుడు అర్జున్ మాట్లాడుతూ తన వద్ద అసిస్టెంట్‌గా పని చేసిన విశాల్ ఆ తరువాత తన సలహాతో నటుడిగా మారి, ఆపై నిర్మాత, నడిగర్‌సంఘం, కార్యదర్శి, నిర్మాతల మండలి అధ్యక్షుడు ఇలా ఎదగడం తనకు గర్వంగా ఉందన్నారు. దర్శకుడు మిత్రన్ ఈ చిత్రాన్ని మలచిన తీరు తనను ఆకట్టుకుందని పేర్కొన్నారు. ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు ఇరుబుతిరై చిత్రం తనకు మంచి అనుభవం అని అనంతరం మాట్లాడిన చిత్ర కథానాయకుడు, నిర్మాత విశాల్ అన్నారు. ఇందులో యాక్షన్ కింగ్ అర్జున్ విలన్‌గా నటించడానికి అంగీకరించడం విశేషం అన్నారు. ఇక కథానాయకిగా నటించిన సమంత గురించి చెప్పేతీరాలని అన్నారు. ఎందుకంటే వివాహానంతరం కథానాయికలుగా రాణించలేరనే దాన్ని ఆమె బ్రేక్ చేశారని అన్నారు. ఇరుబుతిరై చిత్ర విడుదలను అడ్డుకోవడానికి చాలా విధాలుగా కొందరు ప్రయత్నించారని అన్నారు. చిత్రాన్ని ఈ నెల 11న విడుదల చేయడానికి సిద్ధం కాగా, అంతకు ముందు రోజు అంటే 10 తేదీ రాత్రి 8 గంటల నుంచి తాను అనుభవించిన టెన్షన్ మాటల్లో చెప్పలేనన్నారు. డబ్బు విలువ అప్పుడే తనకు తెలిసిందన్నారు. నిర్మాతల మండలి అధ్యక్షుడినైన తనకే అలాంటి పరిస్థితి ఎదురైందన్నారు. అయినా నిర్మాతల మండలి ఎప్పుడూ నిజాయితీగా ఉంటుందని, నిర్మాతలు విజయాలు సాధించేలా చేయడమే తమ లక్ష్యమని అన్నారు.అదే విధంగా చిత్రంలో ఆధార్ కార్డు, డిజిటల్ ఇండియా వంటి అంశాల గురించిన వాస్తవాలను చూపించే ప్రయత్నం చేశామన్నారు. అదే విధంగా బ్యాంకు రుణాల విషయంలో జరుగుతున్న మోసాలను చిత్రంలో ఆవిష్కరించామని తెలిపారు. దీనిని కొందరు వ్యతిరేకిస్తూ ఆందోళనకు దిగారని, అలాంటి వారంతా సినిమా థియేటర్ల ముందు కాకుండా ఏ వళ్లువర్‌కోట్టం వద్దనో, లేదా సెన్సార్ కార్యాలయం ఉన్న శాస్త్రీభవన్ వద్దనో ఆందోళన చేసుకోవాలని అన్నారు. సెన్సార్ అయిన చిత్రం గురించి నిర్మాతలు భయపడాల్సిన అవసరం లేదని విశాల్ పేర్కొన్నారు. -
మెర్క్యురీకి టైమ్ వచ్చింది!
సాక్షి, సినిమా : ప్రభుదేవా మెర్క్యురీకి టైమ్ వచ్చింది. 48 రోజుల చిత్రపరిశ్రమ సమ్మె తెరపడింది. రాష్ట్ర ప్రభుత్వం, సినీ సంఘాలతో ఇటీవల జరిపిన ద్వైపాక్షిక చర్చలు సఫలం కావడంతో శుక్రవారం కొత్త చిత్రాలు విడుదల అవుతాయని నిర్మాతల మండలి అధ్యక్షుడు విశాల్ బుధవారం వెల్లడించారు. అదేవిధంగా చిత్ర షూటింగ్‌లు ప్రారంభం కానున్నాయి. ఇలాంటి పరిస్థితిలో సమ్మె విరమణ తరువాత తెరపైకి వస్తున్న తొలి చిత్రంగా మెర్క్యురీ నమోదైంది. ప్రభుదేవా కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం ఇది. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహించిన ఇందులో రమ్యా నంబీశన్, మేయాదమాన్ చిత్రం ఫేమ్ ఇందుజా నాయికలుగా నటించారు. ఇది హర్రర్ నేపథ్యంలో తెరకెక్కిన మూఖీ చిత్రం. మొత్తం మీద ఇదో ప్రయోగాత్మక సైలెంట్ థ్రిల్లర్ చిత్రం. సంతోష్ నారాయణన్ సంగీతాన్ని అందించారు. మరో విశేషం ఏమిటంటే ఈ చిత్రాన్ని చిత్రపరిశ్రమ సమ్మె కొనసాగుతుండగానే విడుదల చేస్తానని దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ ప్రకటించారు. ఆ తరువాత సినీవర్గాల వ్యతిరేకతతో వెనక్కు తగ్గారు. అయితే తమిళంలో మినహా ప్రపంచవ్యాప్తంగా మెర్క్యురీ చిత్రం గత వారమే విడుదలైంది. అంతేకాదు ఈ చిత్రం ఇతర భాషల్లో వెబ్‌సైట్స్‌ల్లో కూడా హల్చల్ చేస్తోంది. దీంతో ప్రభుదేవా ఈ చిత్రాన్ని పైరసీ సీడీలో చూడకండి అని విజ్ఞప్తి చేశారు. ఈ రీజన్‌తోనే అయ్యి ఉండవచ్చు సమ్మె విరమణ తరువాత మొదట ఈ చిత్రాన్ని విడుదలకు నిర్మాతల మండలి అనుమతి ఇచ్చి ఉండవచ్చు. అయితే దీనితో పాటు రెండు చిన్న చిత్రాలు శుక్రవారం తెరపైకి రానున్నాయి. -
క్యూబ్, వీపీఎఫ్ చార్జీలు చెల్లించేది లేదు
క్యూబ్, వీపీఎఫ్ చార్జీలు ఇకపై చెల్లించేది లేదని నిర్మాతల మండలి, థియేటర్ల యాజమాన్యం బుధవారం జరిపిన చర్చల్లో నిర్ణయం తీసుకున్నారు. డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్స్( క్యూబ్, వీపీఎఫ్) చార్జీలు తగ్గించాలని నిర్మాతల మండలి డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ విషయమై డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్స్ సంస్థతో పలుమార్లు జరిపిన చర్చలు విఫలం కావడంతో నిర్మాతల మండలి ఈ నెల ఒకటో తేదీ నుంచి కొత్త చిత్రాల విడుదలను, ఈనెల 16వ తేదీ నుంచి చిత్ర షూటింగ్‌లతో పాటు, సినిమాకు సంబంధించిన అన్ని కార్యక్రమాలను నిలిపివేస్తూ సమ్మెకు దిగిన విషయం తెలిసిందే. బుధవారం సాయంత్రం నిర్మాతల మండలి నిర్వాహకులు, థియేటర్ల మాజమాన్యం, ఫెఫ్సీ నిర్వాహకుల సమావేశం స్థానిక ఫిలిం చాంబర్లో జరిగింది. ఈ సమావేశంలో ఇకపై డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్లకు ఎలాంటి చార్జీలు చెల్లించేది లేదని, అవసరమైతే ఈ వ్యవహారంలో అందరూ కలిసి న్యాయపోరాటం చేయాలని తీర్మానం చేసినట్లు సమాచారం. అదే విధంగా సినిమా టిక్కెట్లను ఇకపై కంప్యూటర్ బుకింగ్ ద్వారా నిర్వహించాలని నిర్మాతల మండలి అధ్యక్షుడు విశాల్ కోరినట్లు, ఈ విధానాన్ని మరో 30 రోజుల్లో అమలు పరచాలని థియేటర్ల యాజమాన్యాన్ని డిమాండ్ చేసినట్లు తెలిసింది. అయితే ఈ విషయంలో నిర్మాతల మండలి అధ్యక్షుడు విశాల్‌కు తమిళనాడు థియేటర్ల సంఘం అధ్యక్షుడు పన్నీర్‌సెల్వంకు పెద్ద మధ్య వాగ్వాదం జరిగిందని తెలిసింది. సొంత ప్రొజెక్టర్లు ఉండగా వీపీఎఫ్ చార్జీలు ఎందుకు వసూలు చేస్తున్నారని విశాల్ థియేటర్ల యాజమాన్యాన్ని ప్రశ్నించడంతో వాగ్వాదానికి దారి తీసింది, అదే విధంగా ఆన్లైన్ బుకింగ్‌పై అదనంగా వసూలు చేసే రుసుమును తగ్గించాలన్న డిమాండ్ గురించి చర్చ జరిగినట్లు సమాచారం. అయితే ఈ సమావేశానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. సమావేశంలో నిర్మాతల మండలి అధ్యక్షుడు విశాల్, తమిళనాడు థియేటర్ల సంఘం అధ్యక్షుడు పన్నీర్‌సెల్వం, చెన్నై థియేటర్ల సంఘం అధ్యక్షుడు అభిరామిరామనాథన్, ఫెఫ్సీ అధ్యక్షుడు ఆర్కే.సెల్వమణి పాల్గొన్నారు. -
వివాదంలో జుంగా
తమిళసినిమా: వివాదాలకు దూరంగా ఉండే నటుడు విజయ్‌సేతుపతి. అలాంటిదిప్పుడు ఆయన చిత్రం వివాదాల్లో చిక్కుకోవడం విశేషం. విజయ్‌సేతుపతి, షాయేషా సైగల్ జంటగా నటిస్తున్న చిత్రం జుంగా. ఇది ఆయన సొంతంగా నిర్మిస్తున్న చిత్రం అన్నది గమనార్హం. దీనికి గోకుల్ దర్శకుడు కొంత భాగం చిత్రీకరణను జరుపుకున్న ఈ చిత్రం ఇప్పుడు వివాదాల్లో చిక్కుకుంది. డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్స్ చార్జీలు తగ్గించాలంటూ నిర్మాతల మండలి సమ్మెబాట పట్టిన విషయం తెలిసిందే. అందులో భాగంగా ఈ నెల 16వ తేదీ నుంచి చిత్ర షూటింగ్‌లతో పాటు సినిమాలకు సంబంధించిన అన్ని కార్యక్రమాలను నిలిపివేస్తున్నట్లు వెల్లడించారు. అయితే ఇతర రాష్ట్రాల్లో చిత్రీకరణ జరుపుకుంటున్న చిత్రాలకు ఈ నెల 23 వరకూ గడువు ఇచ్చారు. అయితే విజయ్ నటిస్తున్న తాజా చిత్రంతో పాటు మరో నాలుగు చిత్రాలకు సెట్ వేసి షూటింగ్ జరుపుతున్నందున వాటికి మాత్రం అనుమతి ఇచ్చినట్లు నిర్మాతల మండలి కార్యదర్శి ముత్తురాజ్ వివరణ ఇచ్చారు. అవి కూడా 23వ తేదీతో షూటింగ్‌ను నిలిపివేశారు. ఇలాంటి పరిస్థితుల్లో విజయ్‌సేతుపతి జుంగా చిత్ర యూనిట్ ఇటీవల పోర్చుగల్ దేశానికి షూటింగ్‌కు వెళ్లింది. దీంతో ఆ చిత్రం వివాదాల్లో చిక్కుకుంది. నిర్మాతల మండలి నిర్ణయాన్ని ధిక్కరించి జుంగా చిత్ర షూటింగ్‌ను నిర్వహిస్తుండడంతో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ఈ చిత్రంపై చర్యలు తీసుకోవాలనే డిమాండ్ వ్యక్తం అవుతోంది. అయితే ఈ వ్యవహారం గురించి జుంగా చిత్ర వర్గాలను విచారించగా తాము నిర్మాతల మండలి నుంచి అనుమతి తీసుకున్నట్లు చెబుతున్నారు. మండలి నిర్వాహకులు మాత్రం ఈ నెల 23వ తేదీ తరువాత ఎవరికీ షూటింగ్‌కు అనుమతి ఇవ్వలేదని అంటున్నారు. మరి ఈ వివాదం ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో చూడాలి. -
క్షీణ దశలో ఆ రెండూ : సీనియర్ నటుడు
సాక్షి, సినిమా : క్షీణ దశలో ఆ రెండు రంగాలు కొట్టుమిట్టాడుతున్నాయని సీనియర్ నటుడు వివేక్ ఆవేదన వ్యక్తం చేశారు. డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్లు చార్జీలు తగ్గించాలన్న నిర్మాతల డిమాండ్‌ను వారు పట్టించుకోకపోవడంతో ఈ నెల 1న నుంచి కొత్త చిత్రాలను విడుదల చేయరాదని నిర్మాతల మండలి తీర్మానం చేశారు. దీంతో అప్పటి నుంచి థియేటర్లలో కొత్త చిత్రాలు విడుదల కావడంలేదు. దీంతో థియేటర్ల యాజమాన్యం నిర్మాతల మండలికి సహకరించకుండా పాత తమిళ చిత్రాలను, ఆంగ్లం, హిందీ, తెలుగు వంటి ఇతర భాషా చిత్రాలను ప్రదర్శించుకుంటున్నాయి. అయినా ప్రేక్షకులు లేక థియేటర్లు వెలవెలబోతున్నాయి. ఈ నెల 16వ తేదీ నుంచి చిత్రం నిర్మాణాలను నిలిపివేయడంతో తమిళ చిత్ర పరిశ్రమ సంక్షోభంలో పడింది. చెన్నై థియేటర్ల సంఘం ప్రదర్శనల రద్దుకు నిరాకరించినా, తమిళనాడు థియేటర్ల సంఘం ప్రభుత్వం తమకు ఇంతకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చాలంటూ ఈ నెల 16 నుంచి ప్రదర్శనలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో చిత్ర పరిశ్రమ పూర్తిగా పడకేసింది. ఇదిలా ఉంటే కావేరి పరివాహక సంఘాన్ని ఏర్పాటు చేయడంలో సమస్యలు నెలకొనడంతో కావేరి డెల్టా రైతుల పరిస్థితి జీవన పోరాటంగా మారింది. రైతులు పంటలు పండక అప్పుల ఊబిలో కూరుకుపోయి ఆత్మహత్యలే శరణ్యంగా మారిందన్నారు. మరో పక్క పండిన పంటలకు గిట్టుబాటు ధరలు లేక నానా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. దీంతో బ్యాంకు రుణాలను మాఫీ చేయాలని పోరుబాట పట్టినా ప్రభుత్వంలో చలనం కనిపించడం లేదు. ఈ పరిస్థితులపై నటుడు వివేక్ స్పందిస్తూ తమిళనాడులో ప్రస్తుతం క్షీణ దశకు చేరుకున్నది రెండు రంగాలన్నారు. అవి ఒకటి వ్యవసాయం, రెండు సినిమా అని ఆయన తన ట్విట్టర్లో పేర్కొన్నారు. వ్యవసాయం సంక్షోభానికి బీటలు వారిన నేల, మరుగైన నదులు, చెట్లు, ఫలించని పథకాలు అని అన్నారు. ఇక సినిమా స్తంభించడానికి ప్రణాళికలు లేని చిత్రాల విడుదల, చార్జీల పెంపు, పారితోషికాల అధికం లాంటివన్నారు. వీటన్నిటిలో ప్రభుత్వం కలగజేసుకుంటే పరిష్కారం లభిస్తుందని ఈ సందర్భంగా నటుడు వివేక్ పేర్కొన్నారు. -
థియేటర్లు బంద్
-
నేటి నుంచి థియేటర్లు బంద్
సాక్షి, హైదరాబాద్: సినిమా డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్ల తీరుకు నిరసనగా 5 రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి సినిమా థియేటర్లను బంద్ చేస్తున్నట్టు దక్షిణాది సినీ నిర్మాతల మండలి ప్రకటించింది. డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్లు (క్యూబ్, యూఎఫ్‌వో సంస్థలు) వర్చువల్ ప్రింట్ ఫీజు (వీపీఎఫ్)ను తగ్గించాలని డిమాండ్ చేసింది. గురువారం హైదరాబాద్‌లోని తెలుగు ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ కార్యాలయంలో దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమ జేఏసీ చైర్మన్ డి.సురేశ్‌బాబు ఈ వివరాలను వెల్లడించారు. తెలంగాణ, ఏపీ, తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి సినిమాల ప్రదర్శనను నిలిపివేస్తున్నామని ప్రకటించారు. ‘‘డిజిటల్ సర్వీసు ప్రొవైడర్లు (క్యూబ్, యూ ఎఫ్‌వో సంస్థలు) ఏర్పాటు చేసిన కొన్నాళ్ల తర్వాత వర్చువల్ ప్రింట్ ఫీజు (వీపీఎఫ్)ను తీసేయాల్సి ఉంది. అమెరికాలో పూర్తిగా తీసేశారు. మన దేశంలో ఇప్పటికీ వసూలు చేస్తున్నారు. ఉత్తరా దిలో కొన్ని చోట్ల ఎక్కువ, మరికొన్ని చోట్ల తక్కువగా.. దక్షిణాదిలో ఎక్కువగా రేటు వసూలు చేస్తున్నారు. అసలు దక్షిణాదిలో ఈ ఫీజును పూర్తిగా తీసేయాలి..’’అని సురేశ్ బాబు డిమాండ్ చేశారు. ఆంగ్ల సినిమాలకు వీపీఎఫ్ వసూలు చేయని డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్లు ప్రాంతీయ చిత్రాలకు ఎందుకు వసూలు చేస్తున్నారని ప్రశ్నించారు. ఏమాత్రం పట్టించుకోవడం లేదు..: థియేటర్లలో వాణిజ్య ప్రకటనల నిడివిని 8 నిమిషాలకి తగ్గించాలని ఆయన డిమాండ్ చేశారు. ఫిల్మ్ చాంబర్ నుంచి పంపిన 2 సినిమా ట్రైలర్లను తప్పకుండా ప్రదర్శించా లని చెప్పినా సర్వీసు ప్రొవైడర్లు వేయడం లేదన్నారు. మార్కెట్లో 90% క్యూబ్, యూఎఫ్‌వోల వాటా ఉందని, మిగతా 10% పీఎక్స్‌డీ, రాక్స్, అల్ట్రా, ప్రొవిజ్ వంటి సంస్థల చేతిలో ఉందని తెలి పారు. రేట్లు తగ్గించడం సహా పలు అంశాలపై చర్చలు కొనసా గుతున్నాయని.. చర్చలు ఫలిస్తే సినిమాల ప్రదర్శన యథావిధి గా ఉంటుందని చెప్పారు. చిన్న సినిమాలకూ మరింత ప్రయోజనం ఉండేలా చర్చలు జరుపుతున్నామన్నారు. ప్రాంతీయ భాషా సినిమా ప్రదర్శనలను శుక్రవారం నుంచి నిలిపివేస్తున్నామని.. హిందీ, ఇంగ్లిష్ సినిమాల వాళ్లతోనూ మాట్లా డుతున్నామన్నారు. సమావేశంలో జేఏసీ కన్వీనర్ íకిరణ్, తెలుగు ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ సెక్రెటరీ ముత్యాల రాందాస్, డిజిటల్ కమిటీ చైర్మన్ దామోదర్ ప్రసాద్, తెలంగాణ స్టేట్ ఫిల్మ్ చాంబర్ తరఫున మురళీమోహన్, నిర్మాతలు సి.కల్యాణ్, సునీల్ నారంగ్ పాల్గొన్నారు. -
మార్చి 2 నుంచి థియేటర్ల బంద్
సాక్షి, హైదరాబాద్ : మార్చి 2 నుంచి థియేటర్లు నిరవధికంగా బంద్ నిర్వహించాలని తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలితోపాటు దక్షిణాది నిర్మాతల సంఘం తీర్మానించింది. సినిమా డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్లు క్యూబ్, యూఎఫ్ఓ సంస్థలకు, నిర్మాత సంఘాలకు జరిగిన చర్చలు విఫలమయ్యాయి. దీంతో వచ్చే నెల 2నుంచి సినిమాలను ఆ సర్వీస్‌లకు ఇవ్వకూడదని నిర్మాతల ఐకాస నిర్ణయం తీసుకుంది. ఈకారణంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలతో పాటు తమిళనాడు, కేరళ, కర్ణాటకల్లో వేలాది సినిమా ధియేటర్లు బంద్ కానున్నాయి. తెలుగురాష్ట్రాల్లో సుమారు 2400పైగా ధియేటర్లు ఉన్నాయి. వీటిల్లో సుమారు 2వేల ధియేటర్లు మేర మూత పడనున్నాయి. వివాదం ఏంటి? ప్రింట్ వ్యవస్థ స్థానంలో డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్లు వచ్చారు. అంటే ఫిల్మ్‌ను ప్రింట్ల రూపంలో కాకుండా డిజిటల్ రూపంలో ధియేటర్లలో ప్రదేశిండం. క్యూబ్, యుఎఫ్ఓ, పిఎక్స్‌డీ వంటి సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి. ప్రత్యేక వ్యవస్థ ద్వారా సినిమాను థియేటర్లలో ప్రదర్శించేవారు. వాటికి నిర్మాతలు కొంత మొత్తాన్ని సర్వీస్ ప్రొవైడర్లకు చెల్లించాల్సి ఉండేది. కాల క్రమేణా ఈ సర్వీస్ చార్జీలు విపరీతంగా పెరిగిపోయాయి. దీంతో అంత మొత్తంలో చార్జీలను నిర్మాతలు చెల్లించలేక రేట్లను తగ్గించమని కోరారు. అయితే వారి విన్నపాన్ని సర్వీస్ ప్రొవైడర్లను పట్టించుకోలేదు. దీనికారణంగా దక్షిణాది రాష్ట్రాల నిర్మాతల మండలి క్యూబ్, యూఎఫ్ఓ ప్రతినిధులతో చర్చలు జరిపింది. అయితే ఇరువురి మధ్య చర్చలు విఫలం కావడంతో ఆ సంస్థలకు సినిమాలను ఇవ్వరాదని నిర్మాత ఐకాస నిర్ణయం తీసుకుంది. -
శింబుపై చర్యలేవి.?
నటుడు శింబుపై చర్యలేవి అంటూ నిర్మాత పీఎల్.తేనప్పన్ ప్రశ్నించడంతో ఒక ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం రచ్చరచ్చగా మారింది. వివరాల్లోకి వెళితే నిర్మాత మైకెల్ రాయప్పన్ ఇంతకు ముందు శింబు కథానాయకుడిగా అన్భానవన్ అసరాదవన్ అడంగాదవన్ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం ఫ్లాప్ అయ్యింది. అయితే ఈ చిత్రంతో తాను రూ. 20 కోట్లకు పైగా నష్ట పోయానని, అందుకు కారణం నటుడు శింబునే అని చెప్పారు. తాను సరిగా షూటింగ్‌కు రాకపోవడంతోనే షూటింగ్ ఆగిందని నిర్మాత మైకెల్ రాయప్పన్ నిర్మాతల మండలిలో శింబుపై ఫిర్యాదు చేశారు. తాను నష్టపోయిన రూ. 20 కోట్లను శింబు చెల్లించాలని అందులో పేర్కొన్నారు. అదే నిర్మాత తాజాగా జీవా, నిక్కీగల్రాని జంటగా ‘కీ’ అనే చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం శుక్రవారం చెన్నైలో జరిగింది. ఈ కార్యక్రమంలో నటుడు, నిర్మాతల మండలి అధ్యక్షుడు విశాల్ పాల్గొన్నారు. మరో అతిథిగా పాల్గొన్న నిర్మాత పీఎల్. తేనప్పన్ మాట్లాడుతూ ఈ చిత్ర నిర్మాత మైకెల్ రాయప్పన్ నటుడు శింబుపై నిర్మాతల మండలిలో ఫిర్యాదు చేసినా, ఆయనపై చర్యలు తీసుకోకపోవడానికి కారణం ఏమిటని విశాల్‌ను ప్రశ్నించారు. దీంతో విశాల్‌కు అనుకూలంగా విన్నర్ చిత్ర నిర్మాత రామచంద్రన్ ఈ ప్రస్తావన ఇక్కడ అప్రస్తుతం అని అనడంతో వాగ్వాదం రచ్చగా మారింది. అనంతరం విశాల్ మాట్లాడుతూ మైకెల్‌రాయప్పన్ ఫిర్యాదుపై నటుడు శింబును వివరణ కోరామని, అయితే ఆయన స్పందించలేదని తెలిపారు. ఈ సమస్యపై త్వరలోనే చర్చిస్తామని చెప్పారు. నిర్మాతలకు మంచే జరుగుతుందని విశాల్ అన్నారు. తాను మైకెల్ రాయప్పన్ నిర్మించిన కీ చిత్రం కోసం ఫిబ్రవరి 9వ విడుదల చేయాల్సిన తన చిత్రం ఇరుంబుతిరై చిత్రాన్ని మరోసారి వాయిదా వేసుకుంటున్నానని తెలిపారు. అదే విధంగా ఆయన సంస్థలో తాను పారితోషికం తీసుకోకుండా నటించడానికి సిద్ధం అని, ఆ చిత్ర విజయం సాధిస్తే అప్పుడు పారితోషికం తీసుకుంటానని విశాల్ అన్నారు. -
అందుకే పోటీ చేశా!
సాక్షి, సినిమా: అన్నం పెట్టిన పరిశ్రమకు ఏదైనా మంచి చేయాలనే నిర్మాతల మండలి ఎన్నికల్లో పోటీ చేయాల్సి వచ్చిందని ఆ సంఘ అధ్యక్షుడు, నటుడు, నిర్మాత విశాల్ పేర్కొన్నారు. ఆయన తాజాగా కథానాయకుడిగా నటించి, విశాల్ ఫిలిం ఫ్యాక్టరీ పతాకంపై నిర్మించిన చిత్రం ఇరుంబుతిరై. ఇందులో నటి సమంత హీరోయిన్గా, సీనియర్ నటుడు అర్జున్ ప్రతినాయకుడిగా నటించారు. పీఎస్.మిత్రన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి యువన్ శంకర్‌రాజా సంగీతాన్ని అందించారు. ఈ చిత్ర టీజర్ ఆవిష్కరణ కార్యక్రమం బుధవారం సాయంత్రం స్థానిక వడపళనిలోని ఒక నక్షత్ర హోటల్లో జరిగింది. విశాల్ మాట్లడుతూ.. ఇరుంబుతిరై చిత్రం ఏప్రిల్‌లోనే విడుదల కావలసి ఉందన్నారు. తాను నిర్మాతల మండలి ఎన్నికల్లో పోటీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడడంతో చిత్ర విడుదలకు జాప్యం జరిగిందన్నారు. తానూ వడ్డీకి డబ్బులు తీసుకునే చిత్రాలను నిర్మిస్తున్నానని, వడ్డీలు పెరుగుతాయని స్వార్థం చూసుకుని ఈ చిత్రాన్ని నిర్ణయించిన తేదీలో విడుదల చేసుకోవచ్చునని అన్నారు. అయితే తనకు అన్నం పెట్టిన చిత్ర పరిశ్రమకు ఏదైనా మంచి చేయాలన్న ఉద్దేశంతోనే నిర్మాతలమండలి ఎన్నికల్లో తన బృందంతో పోటీ చేశానని అన్నారు. ఆ విధంగా చేసిన వాగ్దానాలను నెరవేర్చుతున్నామని, పలు వివాధాలు ఎదురవుతున్నా వాటిని ఎదుర్కొని సాధించే విధంగా ముందుకు సాగుతున్నామని చెప్పారు. అందుకు అందరూ సహకరించాలని, సంఘం ద్వారా నిర్మాతలందరికీ మంచి జరిగే సమయం ఆసన్నమైందని అన్నారు. -
తమిళ నిర్మాతల వార్
తమిళ సినిమా (చెన్నై): తమిళ నిర్మాతల మండ లి సర్వసభ్య సమావేశంలో 2 వర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. మండలి అధ్యక్షు డు విశాల్‌కు వ్యతిరేకంగా పెద్ద పోరే జరగడం తో సమావేశం అర్ధాంతరంగా నిలిచిపోయింది. ఏప్రిల్‌లో జరిగిన ఎన్నికల్లో పోటీ చేసిన నటుడు విశాల్ వర్గం గెలుపొంది నిర్వహణ బాధ్యతల ను చేపట్టింది. ఆదివారం తొలి సర్వసభ్య సమావేశం చెన్నైలోని కలైవానర్ అరంగంలో ఉదయం 10.30 గంటలకు ప్రారంభమైంది. మొదలైన కొద్ది సేపటికే విశాల్‌కు వ్యతిరేకంగా నటుడు, దర్శకుడు చేరన్ వర్గం నినాదాలు చేసింది. అందులో కొందరు విశాల్ మాట్లాడు తున్న మైక్‌ను లాగేశారు. దీంతో ఇరువర్గాల మధ్య గొడవ చెలరేగింది. వాగ్వాదాలు, తోపులాటలతో సమావేశం పోరు వాతావరణాన్ని తలపించింది. అనంతరం చేరన్ వర్గం మీడియాతో మాట్లాడుతూ విశాల్ ఏడు కోట్ల అవకతవకలకు పాల్పడ్డారని, ఆయన అధ్యక్ష పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. కాగా, ఆరోపణలకు ఆధారాలుంటే చూపించాలని, అప్పుడు తాను తగిన బదులిస్తాని విశాల్ సవాల్ విసిరారు. -
నా తండ్రి భిక్షమడగడం కళ్లారా చూశా: టాప్ హీరో
పెరంబూర్: నా తండ్రి భిక్షమడగడం నేను కళ్లారా చూశాను అని హీరో, నడిగర్ సంఘం కార్యదర్శి విశాల్ అన్నారు. ఏప్రిల్ 2న జరగనున్న తమిళ నిర్మాతల మండలి ఎన్నికల్లో అధ్యక్ష పదవికి ఆయన పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తన ప్యానల్ సభ్యుల పరిచయ కార్యక్రమం ఆదివారం సాయంత్రం స్థానిక సాలిగ్రామంలోని ప్రసాద్ ల్యాబ్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా విశాల్ మాట్లాడుతూ నిర్మాతలకు మంచి చేయాలనే ఉద్దేశంతోనే తాను అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నానని తెలిపారు. నడిగర్ సంఘంలో జరిగే మంచి పనులు ఆ సంఘంలోని సభ్యులకే లబ్ధి చేకూరుస్తాయని, అదే నిర్మాతల మండలిలో అయితే పరిశ్రమకు చెందిన ప్రతి ఒక్కరికి మంచి జరుగుతుందని పేర్కొన్నారు. కాగా నడిగర్ సంఘానికి తమ కార్యవర్గం చేసిన వాగ్ధానాలన్ని నెరవేర్చామన్నారు. అదే విధంగా నిర్మాతల శ్రేయస్సే ధ్యేయంగా పని చేస్తామన్నారు. తన తండ్రి మహాప్రభు వంటి విజయవంతమైన చిత్రాన్ని నిర్మించారని, ఐ లవ్ ఇండియా చిత్రం నిర్మించి.. దాన్ని అనుకున్న తేదీకి విడుదల చేయడానికి ఒక ల్యాబ్ ముందు భిక్షమడిగారన్నారు. తాను చేసిన ఒకే ఒక తప్పు ఈ చిత్రాన్ని నిర్మించడం అని ఆయన అన్న మాటలు తనను ఇంకా కలచివేస్తున్నాయని పేర్కొన్నారు. అలాంటి పరిస్థితి ఏ నిర్మాతకు రాకూడదన్నారు. తాను నిర్మాతల మండలి ఎన్నికల్లో పోటీ చేస్తానని తన తండ్రికి చెప్పినప్పుడు పోటీలో నెగ్గి ఏం చేస్తావని ఆయన ప్రశ్నించారని అన్నారు. ప్రతి నిర్మాతకు కనీసం అర గ్రౌండ్ లేదా పావు గ్రౌండ్ స్థలాన్ని అందించగలిగితేనే ఇంటికి రా లేకపోతే రావొద్దు అని తన తండ్రి అన్నారని విశాల్ తెలిపారు. ఈ సందర్భంగా తమ ప్యానల్ వాగ్ధానాల పట్టికను వెల్లడించారు. -
విశాల్‌కు నిర్మాతల మండలి షాక్ !
నటుడు విశాల్ తమిళ నిర్మాతల మండలి పెద్ద షాక్ ఇచ్చింది. నిర్మాతల మండలిలో ఆయన సభ్యత్వాన్ని తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు సోమవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. విశాల్ నటుడిగా, నిర్మాతగా, దక్షిణ భారత నటీనటుల సంఘం కార్యదర్శిగా కేరీర్‌ను విజయవంతంగా కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. ఈయన గత ఆగస్ట్ 17వ తేదీన ఒక తమిళ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తమిళ నిర్మాతల మండలి కార్యవర్గ చర్యలపై ఆరోపణలు చేసినట్లు కథనాలు వెలువడి పెద్ద చర్చకే దారి తీశారుు. అంతే కాదు తమిళ నిర్మాత మండలి కార్యవర్గంలోనూ కలవరాన్ని రేకెత్తించారుు. విశాల్ వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన నిర్మాతల మండలి ఆయనపై చర్యలకు సిద్ధమైంది. కాగా ఈ నెల 12వ తేదీన నిర్వహించిన కార్యవర్గ సమావేశంలో విశాల్ చేసిన ఆరోపణలపై చర్చించిన నిర్మాతల మండలి ఆయనపై చర్యలు తీసుకోవాలన్న నిర్ణయానికి వచ్చారు. ఈ నేపథ్యంలో సోమవారం నిర్మాతల మండలి ఒక ప్రకటనను విడుదల చేసింది. అందులో.. విశాల్ ఆరోపణలు సంఘం నియమ నిబంధనలను, సంఘటితను దెబ్బ తీసే విధంగా ఉన్నాయని, ఈ ఆరోపణలపై వివరణ కోరుతూ విశాల్‌కు సెప్టెంబర్ 2న లేఖ పంపినట్టు తెలిపారు. అందుకు ఆయన ఇచ్చిన వివరణ సంతృప్తినివ్వకపోవడంతో విశాల్‌ను మండలి సభ్యుత్వం నుంచి తాత్కాలికంగా తొలగిస్తున్నట్లు వెల్లడించారు. ఇది చిత్ర పరిశ్రమలో పెద్ద కలకలానికే దారి తీస్తోందన్నది గమనార్హం. కాగా నడిగర్ సంఘం కార్యదర్శిగా బాధ్యతలను నిర్వహిస్తున్న విశాల్ త్వరలో జరగనున్న తమిళ నిర్మాతల మండలి ఎన్నికల్లోనూ కార్యదర్శి పదవికి పోటీ చేయడానికి సిద్ధమవుతున్నట్లు ఇప్పటికే ప్రచారం హోరెత్తుతున్న నేపథ్యంలో ఆయన సభ్యత్వాన్ని రద్దు చేయడం చర్చనీయాంశంగా మారింది. -
'నిర్మాతల మండలికి ఎలాంటి సంబంధం లేదు'
హైదరాబాద్ : గ్యాంగ్‌స్టర్ నయీంతో నిర్మాతలకు ఎలాంటి సంబంధం లేదని నిర్మాతల మండలి బుధవారం ఓ ప్రకటన చేసింది. ప్రచారం కోసమే కొంతమంది ఇటువంటి ఆరోపణలు చేస్తున్నారని వ్యాఖ్యానించింది. వారికి షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు నిర్మాతల మండలి తెలిపింది. వారు గతంలో కూడా ఇలాంటి ఆరోపణలే చేశారని, అడిగితే ఆధారాలు చూపిస్తానని తప్పించుకున్నారని నిర్మాతల మండలి తెలిపింది. కాగా నిర్మాత నట్టికుమార్ ఆరోపణలు బాధ కలిగించాయని నిర్మాత అశోక్‌కుమార్ అన్నారు. త్వరలో మీడియా ముందుకు వచ్చి అతని ఆరోపణలపై సమాధానం ఇస్తానని ఆయన తెలిపారు. తనపై చేసిన ఆరోపణలు నిరూపించకపోతే నట్టికుమార్‌పై పరువునష్టం కేసు వేస్తానని అశోక్ కుమార్ హెచ్చరించారు. అలాగే ఫిల్మ్ ఛాంబర్లో రూ.14 కోట్లు నిధులు మాయంపై కూడా నిర్మాతల మండలి స్పందించింది. రూ.60 లక్షల నిధులు మాత్రమే మాయం అయ్యాయని, దీనిపై అకౌంటెంట్ శేఖర్ బాబు, మరో అకౌంటెంట్‌పై కేసులు కూడా నమోదు అయినట్లు నిర్మాతల మండలి తెలిపింది. కాగా నయీంకు కొంతమంది సినిమా పరిశ్రమ పెద్దలు కూడా సహకరించారని నట్టికుమార్ ఆరోపించిన విషయం తెలిసిందే. -
ఎటో వెళ్ళిపోయింది శాటిలైట్
వెండితెర సినిమా బుల్లితెరకు రావాలంటే చాలా ఠీవి కావాలి. పెద్ద హీరోల ఠీవి ఉండాలి. పెద్ద హిట్ కొట్టిన ఠీవి సంపాదించాలి. హీరో ఉండి హిట్టు లేకపోయినా హిట్టు కొట్టి హీరో లేకపోయినా మన టీవీకి మాత్రం ఈ సినిమాల ఠీవి డౌటే! అంతా... శాటిలైట్ మాయ! స్టార్ల మధ్యలో తిరిగే శాటిలైట్ కాదు... శాటిలైట్ చుట్టూ తిరిగే స్టార్ల బిజినెస్ ఇది! ‘మల్లెలతీరంలో సిరిమల్లెపువ్వు’... ఉద్యోగంలో మునిగిపోయిన భర్త... మానసికంగా దగ్గరైన మరో యువకుడు... వారి మధ్య చిక్కిన ఒక యంగ్ మ్యారీడ్ ఉమన్... ఈ ముగ్గురి నడుమ సాగే ఈ సినిమా బాగుందని రివ్యూలు వచ్చినా, జనం వచ్చే లోపలే హాలులో నుంచి మాయమై పోయింది. టీవీలో వేసినప్పుడన్నా చూద్దామంటే శాటిలైట్ రైట్స్ ఇప్పటికీ అమ్ముడే కాలేదు. కాబట్టి టీవీలోనూ ఆ బొమ్మ కనపడదు. గడప దాటని సినిమాలెన్నో! ఈ పరిస్థితి ఒక్క ‘మల్లెల తీరంలో సిరిమల్లె పువ్వు’కే పరిమితం కాదు. సినిమా బాగుందని పేరొచ్చినా, స్టార్స్ లేకపోవడంతో - ఇలా టీవీ ప్రసారానికి కూడా నోచుకోని సినిమాలు బోలెడు. పెద్ద వయసువాళ్ళ భావోద్వేగాలు చూపుతూ డాక్టర్ కిరణ్ తీసిన ‘చిన్ని చిన్ని ఆశ’ లాంటివి అందుకు ఉదాహరణ. సింగీతం శ్రీనివాసరావు లాంటివారు నటించినా... ప్చ్! మీకో సంగతి తెలుసా? ఫ్లాపైన స్టార్ హీరోల సినిమాల గతీ అంతే. మొన్నటి బాలకృష్ణ ‘పరమవీర చక్ర’ మొదలు ఇటీవలి రజనీకాంత్ ‘లింగ’, విక్రమ్ ‘ఐ’, సూర్య ‘సికిందర్’.... వేటికీ శాటిలైట్ బిజినెస్ ఇప్పటికీ కాలేదు. కనక ఇప్పట్లో ఇవి టీవీలో వచ్చే ఛాన్సూ లేదు. నాని, సమంత నటించిన గౌతమ్ మీనన్ సినిమా ‘ఎటో వెళ్ళిపోయింది మనసు’ పరిస్థితీ అంతే. ఆ మాటకొస్తే బడా హీరోల భారీ చిత్రాలను మినహాయిస్తే - నూటికి పది, పదిహేను చిత్రాలకే శాటిలైట్ బిజినెస్ అవుతోంది. శాటిలైట్ రైట్స్ అమ్ముడై, ఆ మాత్రం డబ్బయినా చేతికొస్తే కానీ నిర్మాత సినిమా రిలీజ్ చేయలేడు. రైట్స్ కొనాల్సిన టీవీ చానల్సేమో - సినిమా రిలీజై, ఆడియన్స్ రియాక్షన్ బాగుండి, పేరున్న ఆర్టిస్టులుంటే అప్పుడు కొంటామంటున్నాయి. ‘‘ఒక్క మాటలో చెప్పాలంటే పిచ్చి కుదిరితే కానీ పెళ్ళి కుదరదు. పెళ్ళి కుదిరితే కానీ పిచ్చి కుదరదు. సినిమాల శాటిలైట్ వ్యాపారం అలా ఉంది’’ అని తెలుగు సినీ నిర్మాతల మండలి గౌరవ కార్యదర్శి టి. ప్రసన్నకుమార్ వ్యాఖ్యానించారు. ఇవాళ ఒక సగటు తెలుగు సినిమా శాటిలైట్ బిజినెస్ అయిందంటే... ఆ నిర్మాత నక్క తోక తొక్కినట్లే! సినిమా మీద పెట్టిన పెట్టుబడిలో పావువంతయినా వెనక్కి వచ్చిందని సంబరపడాల్సిందే! శాటిలైట్ అంత కీలకమా? ఒకప్పుడు సినిమా అంటే హాలులో రిలీజ్.... జనం అక్కడ చూడడమే! టీవీ వచ్చాక సీన్ మారింది. దూరదర్శన్ ఒక్కటే ఉన్నప్పుడు, నిర్ణీత మొత్తం నిర్మాతకు చెల్లించి, సినిమా ప్రసారం చేసేవారు. అప్పట్లో డి.డి. నేషనల్ చానల్లో మన సినిమా మూడు నెలలకొకటి ప్రసారమైతే గొప్ప. అలా ప్రసారం కావడానికి పెద్ద పోటీ. జెమినీ, ‘ఈ’, ‘మా’, ‘జీ తెలుగు’ లాంటి శాటిలైట్ టీవీ చానల్స్ వచ్చాక పరిస్థితి మారింది. టి.ఆర్.పీలద్వారా యాడ్స్‌తో ఆదాయం తెచ్చుకోవాలంటే చానల్స్‌కు సినిమాలు రెడీమేడ్ సాఫ్ట్వేర్! దాంతో కనపడిన ప్రతి సినిమానూ టీవీ చానల్స్ పప్పుబెల్లాలు కొన్నట్లు కొనేశాయి. నిర్మాతలూ తమ సినిమాల టీవీ ప్రసార హక్కులు అడిగినవాడికి అడిగినట్లుగా - పదికీ, పరకకూ ఇచ్చేశారు. కొన్ని చానల్స్ దొరికిందే సందని... అతి తెలివితో, శాశ్వత హక్కులూ రాయించేసుకున్నాయి. ఈ పరిస్థితుల్లో కొత్తగా తీస్తున్న సినిమాల నిర్మాతలకు ఈ శాటిలైట్ రైట్స్ నయా ఆమ్దానీ అయింది. సినిమా వ్యాపారంలో కొత్త ఐటమ్ వచ్చి చేరింది. బాతును మింగిన గుడ్డు కొన్నేళ్ళలోనే ఈ రైట్స్ రేట్లు బాగా పెరిగాయి. ఒక అగ్ర హీరో సంగతే తీసుకుంటే ఆయన సినిమా శాటిలైట్ రైట్స్ ఒకప్పుడు 30 లక్షల లోపు పలికింది. తరువాత అది కోటికీ, అటుపైన 4.5 కోట్లకీ ఎగబాకింది. ఇదంతా జస్ట్... ఫోర్... ఫైవ్ ఇయర్స్‌లో వచ్చిన ఛేంజ్! కానీ, రోజుకో గుడ్డు పెట్టే బంగారు బాతును పొట్ట కోసి చూస్తే? అదే జరిగింది! జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే శాటిలైట్ ఆదాయంతో సినిమా బడ్జెట్ తిరిగి వచ్చేస్తుందని నయా ప్రొడ్యూసర్స్‌ను ముగ్గులోకి లాగి ప్రాజెక్ట్ సెట్ చేసేవాళ్ళు వచ్చారు. చానల్స్‌కూ, ప్రొడ్యూసర్స్కూ మధ్యన వ్యవహారం నడిపే మీడియేటర్లు వచ్చారు. శాటిలైట్ రైట్స్ ఆదాయం కోసమే ఏదో ఒక సినిమా చుట్టేసేవాళ్ళు వచ్చారు. అది కొంతకాలం నడిచింది. ఇంతలో పేరుకుంటున్న నష్టాలు, మార్కెట్ పరిస్థితిని గమనించిన టీవీ చానల్స్ శాటిలైట్ రైట్స్ కోసం ఎగబడడం మానేశాయి. ఖర్చు ఎక్కువ... రికవరీ తక్కువ! పెట్టిన కోట్ల పెట్టుబడికి తగినంత ఆదాయం రావడం లేదనేది చానల్స్ వాదన. సినిమాల మధ్యలో వేసే వాణిజ్య ప్రకటనల నిడివి తగ్గిస్తూ, ‘టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ’ (ట్రాయ్) విధించిన షరతులూ తోడయ్యాయి. ‘‘సినిమాల రైట్స్ కోసం చానల్స్ చాలా పెద్ద మొత్తం వెచ్చించాల్సి వస్తోంది. తొలి మూడు టెలికాస్ట్‌ల తర్వాతా మాకు వెనక్కి వస్తున్నది - 30 నుంచి 40 శాతమే. గతంలో ‘ట్రాయ్’ నిబంధనలు లేనప్పుడు ఎక్కువ యాడ్స్ ద్వారా ఖర్చు రాబట్టుకొనేవాళ్ళం. ఇప్పుడా పరిస్థితి లేదు’’ అని ఒక ప్రముఖ తెలుగు టీవీ ఉన్నతోద్యోగి వివరించారు. కాకపోతే, ఖర్చయినా స్టార్స్ సినిమాలైతే, జనాన్ని ఆకట్టుకోవచ్చని ఆ సినిమాల వరకు మాత్రం కొంటున్నాయి. మరోపక్క చానల్స్‌కు ఎలాగోలా అమ్మకపోతామా అని మీడియేటర్లు కొనుక్కున్న సినిమాలూ దాదాపు 50 - 60 దాకా మిగిలిపోయాయి. అలా వాళ్ళ డబ్బూ కోట్లల్లో ఇరుక్కుపోయింది. మరి, ఈ పరిస్థితి మారాలంటే? మళ్ళీ శాటిలైట్ బిజినెస్ కావాలంటే? ‘‘గతంలో పెరిగిన శాటిలైట్ రేట్లను బట్టి, రెమ్యూనరేషన్లు, సినిమా బడ్జెట్ పెంచేసు కుంటూ పోయారు. తీరా ఇప్పుడు శాటిలైట్ బిజినెస్ పడిపోయింది. అందుకే, ఆ మేరకు ఖర్చులు తగ్గించుకొని, కేవలం థియేటర్లలో వచ్చే వసూళ్ళను బట్టే సినిమా బడ్జెట్‌ను ప్లాన్ చేసుకోవాలి’’ అని ప్రొడ్యూసర్ వివేక్ కూచిభొట్ల సూచించారు. ఆ పని చేస్తే శాటిలైట్ రైట్స్ కచ్చితంగా నిర్మాతకు అదనపు ఆదాయమే అవుతుంది. హాలులో కాకపోయినా కనీసం టీవీలో అయినా ‘బొమ్మ’ చూసే భాగ్యం ప్రేక్షకులకు కలుగుతుంది. - రెంటాల జయదేవ శాటిలైట్ రైట్స్... సోల్డ్ అవుట్ అల్లు అర్జున్ ‘సన్నాఫ్ సత్యమూర్తి’ - రూ. 8.5 కోట్లు (‘మా’ టి.వి) రవితేజ ‘కిక్ 2’ - రూ. 7.5 కోట్లు (‘జెమినీ’) - రిలీజ్‌కు ముందే రామ్ ‘పండగ చేస్కో’ - రూ. 6.5 కోట్లు (‘జీ తెలుగు’) - రిలీజ్‌కు ముందే బాలకృష్ణ ‘లయన్’ - రూ. 5.5 కోట్లు (‘జెమినీ’) - రిలీజ్‌కు ముందే ‘అనుక్షణం’ ప్లస్ ‘కరెంట్ తీగ’ - రూ. 4.5 కోట్లు (‘జెమినీ’) నితిన్ ‘చిన్నదాన నీ కోసం’ - రూ. 4.5 కోట్లు (‘జెమినీ’) గోపీచంద్ ‘జిల్’ - రూ. 4 కోట్లు (‘జెమినీ’) నాని ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ - రూ. 3.9 కోట్లు (‘జెమినీ’) కల్యాణ్‌రామ్ ‘పటాస్’ - రూ. 3.75 (‘జెమినీ’) శర్వానంద్ ‘మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు’ - రూ. 1.2 కోట్లు (‘మా’ టి.వి) స్టిల్ ఫర్ సేల్! బాలకృష్ణ ‘పరమవీర చక్ర’ రజనీకాంత్ ‘లింగ’ విక్రమ్ - శంకర్ల ‘ఐ’ సూర్య ‘సికిందర్’ కార్తీ ‘బిర్యానీ’, ‘బ్యాడ్‌బాయ్’ నాని ‘ఎటో వెళ్ళిపోయింది మనసు’ అల్లరి నరేశ్ ‘బందిపోటు’ సుధీర్‌బాబు ‘ఆడు మగాడ్రా బుజ్జీ‘ సందీప్ కిషన్ ‘రారా కృష్ణయ్య‘ నాని ‘జెండాపై కపిరాజు’ ఆ డబ్బు లేదనుకొని సినిమా తీయాలి! ‘‘శాటిలైట్ బిజినెస్ 22 నెలలుగా తగ్గి, మిడ్వే ఫిల్మ్స్, చిన్నచిత్రాలు ఇబ్బంది పడుతున్నాయి. మా ‘అంతకు ముందు ఆ తరువాత’ రిలీజయ్యాక 5 నెలలకి అమ్ముడై, వడ్డీలకే పోయింది. ఇప్పటి దాకా శాటిలైట్ కలుపుకొని, బడ్జెట్వేసేవాళ్ళం. ఇప్పుడిక అది లెక్కలో నుంచి తీసేసి, ఖర్చు తగ్గించుకొని సినిమా తీయాలి.’’ - కె.ఎల్. దామోదర ప్రసాద్, ‘అలా మొదలైంది’ తదితర చిత్రాల నిర్మాత సెన్సిబుల్ సినిమాను చంపేస్తున్నారు! ‘‘మా ‘మల్లెలతీరంలో...’కొచ్చిన ప్రశంసలు, రివ్యూలు ఫైల్ చేసి పంపినా, చానల్స్ నుంచి స్పందన లేదు. స్టార్స్, ప్యాడింగ్, కామెడీ ట్రాక్ ఉండాలి లాంటి షరతులు చానల్స్ కూడా పాటించడం అన్యాయం. అటు రిలీజుకు హాళ్ళూ ఇవ్వక, ఇటు శాటిలైట్ రైట్స్ కొనుక్కోకుండా సెన్సిబుల్ సినిమాను చంపేస్తున్నారు.’’ - రామరాజు, ‘మల్లెల తీరంలో సిరిమల్లెపువ్వు’ చిత్ర దర్శకుడు -
ఐదు రోజులుగా ఆగిపోయిన సినిమా షూటింగులు
టాలీవుడ్లో నిర్మాతలు, ఫిలిం ఫెడరేషన్ మధ్య వార్ మళ్లీ మొదలైంది. ఇప్పటికే ఐదు రోజులుగా షూటింగులన్నీ ఆగిపోయాయి. దీంతో ఈ కేసును లేబర్ కమిషనర్ సుమోటోగా విచారణకు స్వీకరించారు. ఈ సందర్భంగా సీసీఐ అనే కొత్త క్లాజును నిర్మాతలు తెరమీదకు తీసుకొచ్చారు. అయితే, దక్షిణభారత దేశంలోని ఏ ఫెడరేషన్‌లోనూ ఈ క్లాజు లేదని తెలుగు ఫిలిం ఫెడరేషన్ వాదిస్తోంది. ఈ క్లాజు అమలుచేస్తే తమ జీవితాలు రోడ్డున పడతాయని సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. అయితే, ఇప్పటివరకు తాము ఫెడరేషన్ చెప్పినట్లే చేశామని, ఇకమీదట కూడా అలాగే చేస్తూ పోతుంటే మాత్రం భారీగా నష్టపోవాల్సి వస్తుందని నిర్మాతలు తెలిపారు. దీంతో ఈవివాదం ఇంకా ఎటూ తేలకుండానే ఆగిపోయింది. -
సినీ డ్యాన్సర్ల నిరసన ర్యాలీ
శ్రీనగర్‌కాలనీ: తెలంగాణ ఫిలిం డ్యాన్సర్స్ అండ్ డ్యాన్స్ డెరైక్టర్స్ యూనియన్ సభ్యులతో గతవారం ఓ చిత్ర షూటింగ్లో చోటుచేసుకున్న వివాదానికి నిరసనగా యూనియన్ అధ్యక్షుడు కెవిన్ ఆధ్వర్యంలో సోమవారం బైక్‌ర్యాలీ నిర్వహించారు. సారధి స్టూడియో నుంచి ఫిలించాంబర్ వరకు నిర్వహించిన ఈ ర్యాలీలో సుమారు 200 మంది కళాకారులు పాల్గొన్నారు. అనంతరం ఫిలించాంబర్‌లోని ప్రొడ్యూసర్స్ కౌన్సిల్‌తో సమావేశమయ్యారు. ఎన్నో సంవత్సరాలుగా డ్యాన్సర్లు ఎదుర్కొంటున్న సమస్యలను వారికి వివరించారు. గత వారం జరిగిన సంఘటన విషయాలను సైతం వారికి వివరించారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందించారు. తెలంగాణ డ్యాన్సర్స్ అసోసియేషన్ సభ్యులు యథావిధిగా అన్ని సినిమాలకు పనిచేసుకోవచ్చని, తమకు ఎలాంటి అభ్యంతరాలులేవని ఈసందర్భంగా నిర్మాతల మండలి సభ్యులు హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సభ్యులు ఎన్వీ ప్రసాద్, సురేష్‌బాబు, సుధాకర్ రెడ్డి, బండ్ల గణేష్, సి.కళ్యాణ్, తెలంగాణ రాష్ట్ర అసోసియేషన్లకు చెందిన పలువురు ప్రతినిధులు పాల్గొన్నారు. కాగా డ్యాన్సర్లకు తెలంగాణ అసోసియేషన్లు, తెలంగాణ ఫిలిం ప్రొడక్షన్ ఫోర్సు, ఓయూ జేఏసీ నేతలు మద్దతు పలికారు. -
వివాదాల్లో నటి కాజల్ అగర్వాల్
వివాదాల్లో హీరోయిన్లు అనేది ఇప్పుడు సర్వసాధారణంగా మారింది. మొదట నటించడానికి సమ్మతించడం ఆ తరువాత కాల్షీట్స్ లేవంటూ నిర్మాతల్ని సమస్యల్లోకి నెట్టడంలాంటి చర్యల్లో నాయికలు చర్చనీయాంశంగా మారుతున్నారు. వీళ్ల వెర్షన్ మరోలా ఉంటుంది. తామిచ్చిన కాల్షీట్స్ సద్వినియోగ పరుచుకోకుండా ఇతర చిత్రాల్లో నటించనీయకుండా కొందరు నిర్మాతలు తమను నష్టపరుస్తున్నారన్నది నాయికల వాదన. ప్రస్తుతం ఇలాంటి వివాదాల్లోనే నటి కాజల్ అగర్వాల్, కన్నడ నటి హరిప్రియ చిక్కుకున్నారు. వీరిద్దరిపై నిర్మాతల మండలికి ఫిర్యాదులు చేరాయి. వివరాల్లోకెళితే నటి కాజల్ అగర్వాల్ నటుడు, నిర్మాత ఉదయనిధి స్టాలిన్ సరసన నన్బేండా చిత్రంలో నటించడానికి అంగీకరించారు. అందుకు పారితోషికం కోటిన్నరగా ఒప్పందం కుదిరినట్లు సమాచారం. అదేవిధంగా అడ్వాన్స్‌గా 40 లక్షలు పుచ్చుకున్నారు. ఆ తరువాత కొన్ని సమస్యలు తలెత్తాయి. మొత్తం మీద నన్బేండా చిత్రంలో కాజల్ నటించలేదు. ఆమెకు బదులు నయనతార నటిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ తుది దశకు చేరుకుంది. ఇలాంటి పరిస్థితిలో తానిచ్చిన అడ్వాన్స్ తిరిగిచ్చేయాల్సిందిగా ఉదయనిధి స్టాలిన్ కాజల్ అగర్వాల్‌ను అడిగారు. అందుకామె అడ్వాన్స్ తిరిగిచ్చేది లేదు పొమ్మంది. అందుకామె చెబుతున్న రీజన్ తాను కేటాయించిన కాల్షీట్స్ను సద్వినియోగం చేసుకోకుండా చివరి క్షణంలో షూటింగ్ షెడ్యూల్ మార్చుకోవడం వల్ల తన కాల్షీట్స్ వృథా అయ్యాయని, తద్వారా తెలుగులో ఒక ప్రముఖ నటుడితో నటించే అవకాశాన్ని వదులుకోవలసి వచ్చిందన్నది. దీంతో ఉదయనిధి స్టాలిన్ కాజల్‌పై తమిళ నిర్మాతల మండలిలో ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంలో మండలిలో చర్చ జరుగుతుండగా కాజల్ తీసుకున్న అడ్వాన్స్ తిరిగిచ్చేది లేదని కాజల్ వర్గం తేల్చి చెప్పేసినట్లు సమాచారం. అదేవిధంగా తమిళంలో మురన్, వల్లకోట్టై తదితర చిత్రాల్లో నటించిన కన్నడ నటి హరిప్రియ ఒక కన్నడ చిత్రంలో నటించడానికి రెండు కోట్లు తీసుకుందట. అయితే ఆ చిత్రంలో ఆమెకు బదులు వేరే నటిని ఎంపిక చేసినట్లు తెలిసింది. దీంతో ఆ నిర్మాత నుంచి తీసుకున్న రెండు కోట్లు తిరిగి ఇవ్వడానికి నటి హరిప్రియ నిరాకరించారట. ఇప్పుడా నిర్మాత కన్నడ నిర్మాతల మండలిలో హరిప్రియపై ఫిర్యాదు చేశారు. అయితే ఈమె కూడా తీసుకున్న రెండు కోట్లు తిరిగిచ్చేది లేదంటూ ఖరాఖండిగా చెప్పేసినట్లు సమాచారం. చిత్రంలో ఒక్క రోజు నటించి ఆ తరువాత నటించకపోతే తీసుకున్న మొత్తం తిరిగి నిర్మాతకు చెల్లించాలనే నిబంధన సంఘంలో ఉందట. కానీ ఈ ఇద్దరు భామలు ఒక రోజు కూడా నటించకుండా ఆ చిత్రాల్లో నటించలేదు. కాబట్టి తీసుకున్న అడ్వాన్స్ తిరిగి చెల్లించాల్సిందే లేని పక్షంలో తగిన చర్యలుంటాయని సీనియర్ నిర్మాత ఒకరు అన్నారు. కాబట్టి నటి కాజల్ అగర్వాల్, హరిప్రియల వ్యవహారం చర్చనీయాంశంగా మారింది.