
ప్రస్తుత పరిస్థితుల్లో థియేటర్లకు వెళ్లి సినిమాలు చూసే ప్రేక్షకుల తగ్గిపోతున్నారు. సినిమా రిలీజ్ అయిన నెల రోజుల్లోనే అమేజాన్, నెట్‌ఫ్లిక్స్, జియో లాంటి డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌లో అందుబాటులోకి వస్తుండటంతో థియేటర్లలో సినిమా చూసేందుకు ప్రేక్షకులు పెద్దగా ఇంట్రస్ట్ చూపించటం లేదు. ప్రస్తుతానికి డిజిటల్ మీడియా ద్వారా నిర్మాతలకు మంచి లాభాలే వస్తున్నా భవిష్యత్తులో వీటి వల్ల థియేటర్ల మనుగడ ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉందన్న వాదన వినపడుతుంది.
అందుకే ఈ విషయంపై నిర్మాతల మండలి పెద్దలు ఓ నిర్ణయం తీసుకున్నారు. ఏప్రిల్ 1 నుంచి ఏ సినిమా అయిన రిలీజ్ అయిన 8 వారాల వరకు డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌లో ప్రదర్శించకుండా ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్టుగా తెలిపారు. అయితే ఈ నిర్ణయంపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. పెద్ద సినిమాలు హిట్ సినిమాలకు ఈ నిర్ణయం మేలు చేసినా చిన్న సినిమాలు, ఫ్లాప్ టాక్ వచ్చిన సినిమాలకు ఈ నిర్ణయంతో నష్టాలు పెరిగే అవకాశం ఉందని కొందరు వాదిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment