Telugu Producers
-
నిర్మాతల మండలి అధ్యక్షుడు సి.కళ్యాణ్ పై సభ్యుల ఆగ్రహం
తెలుగు నిర్మాతల మండలి సర్వసభ్య సమావేశం రసాభాసగా మారింది. నిర్మాత మండలి అధ్యక్షుడు సి. కల్యాణ్‌పై సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పదవీకాలం ముగిసినా నిర్మాత మండలి ఎన్నికలు నిర్వహించడం లేదని ఆందోళనకు దిగారు. ఈ మొత్తం వ్యవహారాన్ని ఒక సభ్యుడు వీడియో తీయగా..అతనిపై అధ్యక్షుడు సీ కల్యాణ్ అసహనం వ్యక్తం చేశాడు. దీంతో వీరిద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. -
అదే జరిగితే ' అంతకుముందు.. ఆ తర్వాత'.. డైరెక్టర్ లింగుస్వామి సీరియస్..!
అనువాద చిత్రాల వివాదం మరింత ముదిరేలా కనిపిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతికి 'వారిసు' రిలీజ్‌పై వివాదం ఇంకా కొనసాగుతోంది. తాజాగా ఈ అంశంపై దర్శకుడు లింగుస్వామి స్పందించారు. టాలీవుడ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ నిర్ణయంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై ఏం చేయాలో మాకు తెలుసన్నారు. (చదవండి: టాలీవుడ్లో ‘అనువాదం’ పై వివాదం) సంక్రాంతికి కేవలం తెలుగు చిత్రాలకు మాత్రమే థియేటర్ల కేటాయింపుల్లో ప్రాధాన్యత ఇవ్వాలని తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి చేసిన ప్రకటనపై కోలీవుడ్ దర్శక, నిర్మాతలు విమర్శలు చేశారు. ఇలా వ్యవహరించడం పద్ధ కాదని డైరెక్టర్ లింగుస్వామి అన్నారు. ఒకవేళ ఆ విధంగానే జరిగితే తీవ్ర పరిణామాలు ఉంటాయని లింగుస్వామి హెచ్చరించారు. ఇక తెలుగు సినీ నిర్మాతల మండలి లేఖపై తమిళ సినీ దర్శకులు ఆగ్రహంగా ఉన్నారు. తెలుగు రాష్ట్రాల్లో వారిసుకు రావాల్సిన థియేటర్లు లభించకపోతే పరిస్థితి పూర్తిగా మారుతుందన్నారు. వారు ఇలాగే వ్యవహరిస్తే 'వారిసుకు ముందు, వారిసుకు తర్వాత' అనేలా ఉంటుందని దర్శకుడు లింగుసామి అన్నరు. విజయ్ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం 'వారిసు'. దిల్‌రాజు నిర్మాత. యూత్‌ఫుల్, ఫ్యామిలీ ఎంటర్టైనర్గా సిద్ధమైన ఈ చిత్రాన్ని తెలుగులో 'వారసుడు' పేరుతో సంక్రాంతికి విడుదల చేయాలని చిత్రబృందం నిర్ణయించారు. -
షూటింగ్ సంక్షోభం.. దిగొచ్చిన అగ్ర హీరోలు.. చిరు లేఖ
టాలీవుడ్ నిర్మాతల చర్చలు ఫలిస్తున్నట్లు తెలుస్తోంది. బడ్జెట్ సంక్షోభంలో భాగంగా పలువురు అగ్ర హీరోలు తమ రెమ్యునరేషన్ తగ్గించుకునే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం టాలీవుడ్లో బడ్జెట్ సంక్షోభం నెలకొంది. సినిమాల బడ్జెట్, టికెట్ ధరలపై మంగళవారం కీలక భేటీ అయిన ప్రొడ్యుసర్స్ గిల్డ్ సినిమా షూటింగ్‌ల బంద్‌కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. సినిమా నిర్మాణల బడ్జెట్ వ్యయం, హీరోల రెమ్యునరేషన్ అంశాలు ఓ కొలిక్కి వచ్చేంత వరకు తాత్కాలికంగా షూటింగ్ నిలివేస్తున్నట్లు నిన్న నిర్మాతల గిల్డ్ సంచలన నిర్ణయం తీసుకుంది. చదవండి: Tollywood: టాలీవుడ్ నిర్మాతల సంచలన నిర్ణయం, కొత్త నిబంధనలివే! దీంతో షూటింగ్ దశలో ఉన్న పెద్ద హీరోల సినిమాలతో పాటు చిన్న సినిమాల షూటింగ్ నిలిచిపోయే పరిస్థితి నెలకొనడంతో ప్రముఖ నిర్మాత దిల్ రాజు రంగంలోకి దిగాడు. ఇదే ఇదే అంశంపై పలువురు టాలీవుడ్ అగ్ర హీరోలతో ఆయన సమావేశమైనట్లు సమాచారం. నీ సందర్భంగా స్టార్ హీరోలైన జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్‌తో పాటు పలువురు తమ రెమ్యునరేషన్ తగ్గించుకుంటామని దిల్ రాజుకు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. త్వరలోనే మిగతా హీరోలతో కూడా ఈ విషయమై చర్చించి ఓ నిర్ణయం తీసుకుంటామని ప్రొడ్యుసర్స్ గిల్డ్ తెలిపింది. షూటింగ్ సంక్షోభంపై నిర్మాతల గిల్డ్‌కు చిరంజీవి లేఖ రాసినట్లు సమాచారం అందింది. ఇక దీనిపై ఈ రోజు మధ్యాహ్నం నిర్మాతలు భేటీకి సిద్ధం అవుతున్నట్లు కూడా తెలుస్తోంది. చదవండి: ఫ్యాన్స్‌కి షాక్.. ఏడాదికే బ్రేకప్ చెప్పుకున్న ‘బిగ్‌బాస్’ జోడీ -
ఆగస్టు 1 నుంచి సినిమా షూటింగ్స్ బంద్!
తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి కీలక నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 1 నుంచి సినిమా చిత్రీకరణలను తాత్కాలికంగా బంద్ చేయాలని భావిస్తోంది. సినిమా చిత్రీకరణలు నిలిపివేసి సమస్యలపై నిర్మాతలంతా కలిసి చర్చించాలని తీర్మానించింది. అలాగే ఓటీటీ రిలీజ్‌లపైనా పలు నిర్ణయాలు తీసుకుంది. భారీ బడ్జెట్ చిత్రాలను పది వారాల తర్వాతే ఓటీటీలో రిలీజ్ చేయాలని నిర్ణయించింది. పరిమిత బడ్జెట్లో తీసిన చిత్రాలను నాలుగు వారాల తర్వాత ఓటీటీలో విడుదల చేసుకోవచ్చని చెప్పింది. అలాగే రూ.6 కోట్ల లోపు బడ్జెట్‌తో నిర్మించిన సినిమాల ఓటీటీ రిలీజ్ విషయంపై ఫెడరేషన్తో చర్చించాకే ఓ నిర్ణయం తీసుకుంటామని తెలిపింది. మంగళవారం నాడు అన్నపూర్ణ స్టూడియోలో ప్రొడ్యూసర్స్ గిల్డ్ అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ భేటీలో 25 మంది నిర్మాతలు పాల్గొన్నారు. ఓటీటీలో కొత్త సినిమాలు, నటీనటుల పారితోషికాలు, కార్మికుల వేతనాలపై సుమారు గంటపాటు చర్చించిన అనంతరం.. సినిమా ప్రదర్శన కోసం చెల్లించే వీపీఎఫ్ ఛార్జీలను ఎగ్జిబిటర్లే చెల్లించాలని ప్రొడ్యూసర్స్ గిల్డ్ నిర్ణయించింది. సామాన్యులకు టికెట్ ధరలను అందుబాటులో ఉంచాల్సిందేనని స్పష్టం చేసింది. సాధారణ థియేటర్లు, సి-క్లాస్ సెంటర్లలో టికెట్ ధరలు రూ.100, రూ.70 రూపాయలు ఉండేలా ప్రతిపాదనలు ముందు పెట్టింది. మల్టీఫ్లెక్స్‌లో జీఎస్టీతో కలిపి రూ.125, రూ.150 ఉండేలా ప్రతిపాదనలు చేసింది. ఫిలిం చాంబర్, నిర్మాతల మండలితో చర్చించాకే సినిమా నిర్మాణ వ్యయాలు పెంచుకోవాలని సూచించింది. ఫిలిం చాంబర్ నిర్ణయించిన రేట్ కార్డ్ నే షూటింగ్ ప్రదేశాల్లో నిర్మాతలు అమలు చేయాలని ఆదేశించింది. నిర్మాతలను తప్పుదోవ పట్టిస్తున్న మేనేజర్లు, కోఆర్డినేటర్ల వ్యవస్థను తొలగించాలని మండిపడింది. నిర్ణీత సమయానికల్లా నటీనటులు షూటింగ్స్‌కు హాజరయ్యేలా నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలని సూచించింది. నిర్దేశించిన సమయానికల్లా చిత్రీకరణ పూర్తి చేయాలని తెలిపింది. నటీనటుల సహాయకులకు వసతులు, ఇతర సౌకర్యాలు కల్పిస్తే పారితోషకంలో కోత విధించాల్సిందేనని పేర్కొంది. చదవండి: రణ్వీర్ సింగ్‌ను అనుకరించిన నటుడు, నిజంగానే అంత సాహసం చేశాడా? హోంటూర్ వీడియోను షేర్ చేసిన యాంకర్ శ్యామల -
తుది తీర్పునకు లోబడే..
సాక్షి, హైదరాబాద్: తెలుగు నిర్మాతల మండలి ఎన్నిక తాము ఇచ్చే తుది తీర్పునకు లోబడి ఉంటుందని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఎ.రాజశేఖర్‌రెడ్డి శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. 2019–21 సంవత్సరానికి తెలుగు నిర్మాతల మండలికి జరుగుతున్న ఎన్నికల్లో కోశాధికారి పోస్టుకు తాను దాఖలు చేసిన నామినేషన్‌ను తిరస్కరించడాన్ని సవాలు చేస్తూ యలమంచిలి రవిచంద్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్‌పై జస్టిస్ రాజశేఖర్‌రెడ్డి విచారణ జరిపారు. పిటిషనర్ తరఫు న్యాయవాది జె.విజయలక్ష్మి వాదనలు వినిపిస్తూ చదలవాడ శ్రీనివాసరావును ఏకగ్రీవం చేసేందుకే పిటిషనర్ నామినేషన్‌ను తిరస్కరించారని తెలిపారు. దీని వెనుక పెద్ద కుట్ర ఉందన్నారు. కోశాధికారి పోస్టుకు పిటిషనర్ పేరును వైవీఎస్ చౌదరి ప్రతిపాదించారని, ఆ తరువాత ఆయనే నామినేషన్ దాఖలు చేయడంతో పిటిషనర్ నామినేషన్‌ను తిరస్కరించారని వివరించారు. పిటిషనర్‌తోపాటు వైవీఎస్ చౌదరి, రామ సత్యనారాయణ, చదలవాడ శ్రీనివాసరావులు నామినేషన్లు దాఖలు చేశారని, పిటిషనర్ నామినేషన్ తిరస్కరణకు గురికాగా, వైవీఎస్ చౌదరి, రామ సత్యనారాయణ నామినేషన్లను ఉపసంహరించుకున్నారని, బరిలో శ్రీనివాసరావు ఒక్కరే మిగిలారన్నారు. ఆయన కోసమే ఇదంతా చేశారని వివరించారు. వైవీఎస్ చౌదరి ఉపాధ్య పదవికి పోటీ చేస్తున్నారని, ఈ కుట్ర కోణాన్ని పరిగణనలోకి తీసుకుని తన నామినేషన్‌ను పరిగణనలోకి తీసుకునేలా ఆదేశాలు ఇవ్వాలని కోర్టును కోరారు. ఈ నెల 30న(నేడు) జరగనున్న నిర్మాతల మండలి ఎన్నిక ఈ వ్యాజ్యంలో కోర్టు ఇచ్చే తుది తీర్పుకు లోబడి ఉంటుందని న్యాయమూర్తి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. -
డిజిటల్ మీడియాకు షాక్ ఇచ్చిన తెలుగు నిర్మాతలు
ప్రస్తుత పరిస్థితుల్లో థియేటర్లకు వెళ్లి సినిమాలు చూసే ప్రేక్షకుల తగ్గిపోతున్నారు. సినిమా రిలీజ్ అయిన నెల రోజుల్లోనే అమేజాన్, నెట్‌ఫ్లిక్స్, జియో లాంటి డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌లో అందుబాటులోకి వస్తుండటంతో థియేటర్లలో సినిమా చూసేందుకు ప్రేక్షకులు పెద్దగా ఇంట్రస్ట్ చూపించటం లేదు. ప్రస్తుతానికి డిజిటల్ మీడియా ద్వారా నిర్మాతలకు మంచి లాభాలే వస్తున్నా భవిష్యత్తులో వీటి వల్ల థియేటర్ల మనుగడ ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉందన్న వాదన వినపడుతుంది. అందుకే ఈ విషయంపై నిర్మాతల మండలి పెద్దలు ఓ నిర్ణయం తీసుకున్నారు. ఏప్రిల్ 1 నుంచి ఏ సినిమా అయిన రిలీజ్ అయిన 8 వారాల వరకు డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌లో ప్రదర్శించకుండా ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్టుగా తెలిపారు. అయితే ఈ నిర్ణయంపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. పెద్ద సినిమాలు హిట్ సినిమాలకు ఈ నిర్ణయం మేలు చేసినా చిన్న సినిమాలు, ఫ్లాప్ టాక్ వచ్చిన సినిమాలకు ఈ నిర్ణయంతో నష్టాలు పెరిగే అవకాశం ఉందని కొందరు వాదిస్తున్నారు. -
'కత్తి' కోసం పవన్... నో అంటున్న విజయ్
వివాదాల నడుమ విడుదలై తమిళనాడులో ఘన విజయాన్ని సొంతం చేసుకున్న 'కత్తి' చిత్రంపై టాలీవుడ్ హీరో పవన్ కళ్యాణ్ మనసు పారేసుకున్నట్లు సమాచారం. దాంతో పలువురు నిర్మాతలు ఆ సినిమా రీమేక్ హక్కులను సొంతం చేసుకునేందుకు పోటీ పడుతున్నారు. కోలీవుడ్‌లో విజయ్- సమంత జంటగా నటించిన కత్తి చిత్రానికి ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహించారు. సినిమా విడుదలైన వారంలోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 30 కోట్లు వసూలు చేసి రికార్డు సృష్టించింది. దాంతో పలువురు తెలుగు నిర్మాతలు 'కత్తి' రీమేక్ హక్కుల కోసం ఆసక్తి చూపుతున్నారు. పవన్ కళ్యాణ్ హీరోగా ఈ సినిమాను రీమేక్ చేసేందుకు రైట్స్ కోసం ప్రయత్నిస్తున్నారు. అయితే సినిమా ఒరిజినల్ హక్కులను ఇంత వరకు ఎవరికీ అమ్మలేదని ఆ చిత్ర నిర్మాతల సన్నిహిత వర్గాలు తెలిపాయి. అలాగే ఈ సినిమా రీమేక్‌పై హీరో విజయ్ కూడా సుముఖంగా లేడని, ఈ సినిమాను తెలుగులోకి డబ్బింగ్ చేసి త్వరలో విడుదల చేయాలనే ఉద్దేశంలో ఉన్నట్లు చెప్పారు. మరి పవన్ కళ్యాణ్ ప్రయత్నాలు ఫలిస్తాయా, కత్తిని చేతబడతారా అనేది తెలియాలంటే మరి కొద్ది రోజులు వేచి చూడాల్సిందే. -
'మారియన్'పై తెలుగు నిర్మాతల కన్ను
హైదరాబాద్: భారత్ బాల దర్శకత్వంలో ధనుష్ -పార్వతీమీనన్ నటించిన తమిళ చిత్రం 'మారియన్'పై టాలీవుడ్ చిత్ర నిర్మాతల కన్నుపడింది. గత నెల 19న విడుదలైన ఈ చిత్రంకు సూపర్ హిట్ టాక్ వచ్చింది. కలెక్షన్ల కనక వర్షం కురిపించిందని కోలీవుడ్ సమాచారం. వేణు రవిచంద్రన్ నిర్మించిన ఈ చిత్రంలో ధనుష్ అద్భుతంగా నటించాడని అభిమానులు పొంగిపోతున్నారు. ఈ చిత్రం చూసిన సూపర్ స్టార్ రజనీకాంత్ అల్లుడు ధనుష్ నటనను మెచ్చుకున్నారు. ఆస్కార్ అవార్డు పొందిన ఏఆర్ రెహమాన్ ఈ సినిమాకు అదిరిపోయే సంగీతం అందించారు. తమిళంలో హిట్టు కొట్టిన ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయాలన్న ఆలోచనతో ఓ పెద్ద నిర్మాత ఉన్నట్లు తెలుస్తోంది. కొందరు ఈ చిత్రాన్ని డబ్బింగ్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ చిత్రాన్ని రీమేక్ చేస్తారా లేక డబ్బింగ్ చేస్తారా అనే విషయం త్వరలోనే తెలుస్తుంది.