
ఒకప్పుడు ఇండియన్ సినిమా అంటే అందరూ బాలీవుడ్ అనేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. 'బాహుబలి', 'పుష్ప 1& 2', 'ఆర్ఆర్ఆర్' తదితర చిత్రాలతో తెలుగు సినిమా ఎనలేని పేరు గడిస్తోంది. దీంతో బాలీవుడ్ హవా రోజురోజుకీ తగ్గిపోతోంది. ఇండస్ట్రీపై ఇదివరకే పలువురు విమర్శలు చేయగా.. ఇప్పుడు స్టార్ హీరో సన్నీ డియోల్ బాలీవుడ్ పరువు తీసేశాడని చెప్పొచ్చు.
(ఇదీ చదవండి: రిలీజ్ కి ముందే రూ.58 కోట్ల కలెక్షన్)
'యానిమల్'లో విలన్ గా నటించిన బాబీ డియోల్ అన్నయ్య సన్నీ డియోల్. కొన్నాళ్ల క్రితం 'గదర్ 2' మూవీతో అద్భుతమైన హిట్ కొట్టాడు. తెలుగు దర్శకుడు గోపీచంద్ మలినేని ఇతడిని హీరోగా పెట్టి 'జాట్' అనే సినిమా తీశాడు. తాజాగా సోమవారం ముంబైలో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. ఇందులో సన్నీ డియోల్.. హిందీ నిర్మాతలపై కౌంటర్స్ వేశాడు.
'ముంబై ప్రొడ్యూసర్స్.. జాట్ నిర్మాతలని చూసి చాలా నేర్చుకోవాలి. ఎందుకంటే ఒకసారి స్క్రిప్ట్ అంతా లాక్ అయితే పూర్తిగా దర్శకుడిపై నమ్మకం ఉంచుతారు' అని సన్నీ డియోల్ చెప్పుకొచ్చాడు.
ఇతడు హీరోగా లాహోర్ 1947 అనే మూవీ మొదలైంది. కానీ అది ఆలస్యమవుతూ వస్తోంది. ఇలా లేట్ అవుతుండటంపైనే సన్నీ.. పరోక్షంగా అసంతృప్తిని వెళ్లగక్కడా అనిపిస్తోంది. ఇకపోతే జాట్ ఏప్రిల్ 10న థియేటర్లలోకి రాబోతుంది. తెలుగు నిర్మాణ సంస్థలైన మైత్రీ మూవీ మేకర్స్, పీపుల్స్ మీడియా సంయుక్తంగా నిర్మించాయి.
(ఇదీ చదవండి: 'కన్నప్ప' మూవీని ట్రోల్ చేస్తే శాపానికి గురవుతారు: రఘుబాబు)
#SunnyDeol says Bombay Producers should learn from #Jaat Producers Mythri & PMF and Trust the Director once everything is locked!!
He is possibly indicating his displeasure about the much delayed #Lahore1947!! pic.twitter.com/JUfSLZVQYZ— AndhraBoxOffice.Com (@AndhraBoxOffice) March 24, 2025