‘అతను రాక్షసుడా?.., కాదు... రాక్షసుడు కాదు.., అయితే అతను దేవుడే...’ అనే అర్థం వచ్చే హిందీ సంభాషణలతో హిందీ చిత్రం ‘జాట్’ ట్రైలర్ విడుదలైంది. సన్నీ డియోల్ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న చిత్రం ఇది. శుక్రవారం ఈ చిత్రం టీజర్ విడుదలైంది.
ఈ యాక్షన్ ΄్యాక్డ్ టీజర్‌లో విలన్లను రఫ్ఫాడించారు సన్నీ డియోల్. ఆయన పాత్ర ఎంత పవర్‌ఫుల్‌గా ఉంటుందో టీజర్ స్పష్టం చేస్తోంది. సన్నీ డియోల్, రణదీప్ హుడా తదితరులతో ఈ టీజర్ సాగుతుంది. వచ్చే ఏడాది ఏప్రిల్‌లో ఈ చిత్రం విడుదల కానుంది. వినీత్ కుమార్ సింగ్, సయామీ ఖేర్, రెజీనా కసాండ్రా తది తరులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: తమన్, కెమెరా: రిషి పంజాబీ.
Comments
Please login to add a commentAdd a comment