
వారం క్రితం థియేటర్లలో రిలీజైన సినిమాకు వరస షాకులు తగులుతూనే ఉన్నాయి. తొలుత తమిళనాడులో వ్యతిరేకత రాగా.. తర్వాత క్రైస్తవుల నుంచి వచ్చింది. ఇప్పుడు ఏకంగా మూవీ టీమ్ అందరిపై పోలీస్ కేసు(FIR On Jaat Team) నమోదు కావడం చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ అసలేమైంది?
తెలుగు దర్శకుడు గోపీచంద్ మలినేనితో మైత్రీ మూవీ మేకర్స్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థలు నిర్మించిన లేటెస్ట్ సినిమా 'జాట్'(Jaat Movie). బాలీవుడ్ హీరో సన్నీ డియోల్(Sunny Deol) నటించాడు. టాలీవుడ్ యాక్టర్స్ జగపతిబాబు, రమ్యకృష్ణ, రెజీనా తదితరులు కీలక పాత్రలు పోషించారు.
(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చేసిన 20 సినిమాలు)
యావరేజ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమాకు వివాదాలు మాత్రం తప్పట్లేదు. తమిళుల హక్కుల కోసం పోరాడిన ఎల్‌టీటీఈని ఓ ఉగ్రవాద సంస్థగా చూపించారని కొందరు తమిళియన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు చర్చిల కొన్ని సన్నివేశాలు తీయడంపై పలు క్రైస్తవ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. మూవీని బ్యాన్ చేయాలని కోరాయి.
ఇప్పుడు మనోభావాలు దెబ్బతీశారని జాట్ మూవీ టీమ్ పై.. పంజాబ్ లోని జలంధర్ లో పోలీస్ కేసు పెట్టారు. వికల్ప్ గోల్డ్ అనే వ్యక్తి చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ చిత్రంలో శిలువను కించపరిచేలా చూపించారని, క్రైస్తవుల పర్వదినాలైన గుడ్‌ప్రైడే, ఈస్టర్ వచ్చే నెలలో ఈ మూవీని ఉద్దేశపూర్వకంగా రిలీజ్ చేశారని వికల్ప్ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు.
(ఇదీ చదవండి: ఓటీటీలోకి విక్రమ్ కొత్త సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్)