Jaat Movie
-
ఆ హీరోకు నా సినిమాతో ఏం పని? నన్ను పక్కనపడేసి..: 'జాట్' విలన్
రణ్‌దీప్ హుడా (Randeep Hooda).. సినిమా అంటే ఎంత పిచ్చో మాటల్లో చెప్పలేదు. చేతల్లో చూపించాడు. సినిమా కోసం ఎన్ని కష్టాలైనా పడతాడు. తన శరీరాన్ని నచ్చినట్లుగా మార్చేస్తాడు. సర్‌బిజత్ సినిమా కోసం నెల రోజుల్లోనే 18 కిలోలు తగ్గిపోయాడు. గతేడాది వచ్చిన స్వతంత్ర వీర్ సావర్కర్ కోసం ఏకంగా 30 కిలోలకు పైనే తగ్గిపోయాడు. ఇందుకోసం తిండిమానేసి కడుపు కాల్చుకున్నాడు. జాట్ మూవీతో ఫుల్ క్రేజ్ఈ సినిమా కోసం పైసాపైసా కూడబెట్టి కొన్న రెండు,మూడు ప్లాట్లను అమ్మేశాడు. దర్శకుడిగా, హీరోగా, నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమా నష్టాల్ని మిగిల్చింది. తాజాగా ఇతడు జాట్ సినిమాతో పలకరించాడు. తెలుగు డైరెక్టర్ గోపీచంద్ మలినేని రూపొందించిన ఈ సినిమాలో సన్నీడియోల్ హీరోగా, రణ్‌దీప్ విలన్‌గా నటించారు. కేవలం హిందీలో మాత్రమే రిలీజైన ఈ చిత్రానికి విశేష ఆదరణ లభిస్తోంది. కలెక్షన్స్ మాట పక్కనపెడితే విలన్‌గా రణ్‌దీప్‌కు మాత్రం మరింత గుర్తింపు తీసుకొచ్చింది.ఆ సినిమాకు నేను హీరో..తాజాగా అతడు గతంలో ఎదురైన చేదు అనుభవాన్ని తల్చుకుని బాధపడ్డాడు. రణ్‌దీప్ హుడా మాట్లాడుతూ.. ఆలియా భట్ (Alia Bhatt)తో కలిసి నేను హైవే సినిమా చేశాను. కానీ ప్రమోషన్స్‌లో నా స్థానంలో రణ్‌బీర్ కపూర్ (Ranbir Kapoor) ఉన్నాడు. రణ్‌బీర్- ఆలియా ప్రమోషన్స్ చూసి నేను షాకయ్యాను. ఎందుకంటే ఆయనకు నా సినిమాతో ఏం పని? హైవేలో నేను హీరో. మరి ప్రమోషన్స్‌లో తనెందుకు ఉన్నాడో అర్థం కాలేదు. సరే, పోనీ.. కనీసం ప్రమోషన్స్‌కు నన్నైనా పిలవాలి కదా.. పిలవలేదు. అప్పుడు చాలా బాధేసింది. ఆ సమయంలో నాకు సపోర్ట్‌గా నిలబడి ప్రమోషన్స్‌కు పిలిచుంటే అది నా కెరీర్‌కు సాయపడేదేమో!లవ్ జర్నీ..బహుశా.. హైవే ప్రమోషన్స్ అప్పుడే రణ్‌బీర్, ఆలియా ప్రేమలో పడ్డారేమో! నా సినిమా వల్ల వారిద్దరి మనసులు దగ్గరయ్యాయంటే అది నాకు సంతోషమే! కానీ నన్ను పట్టించుకుంటే బాగుండేదనిపించింది. అయితే వారి ప్రమోషన్స్‌తో సినిమాకు పెద్దగా హైప్ రాకపోవడంతో రిలీజ్‌కు సరిగ్గా రెండు రోజుల ముందు నన్ను ప్రమోషన్స్‌కు పిలిచారు అని చెప్పుకొచ్చాడు.చదవండి: అలాంటి తప్పులు భవిష్యత్తులో జరగనివ్వను: సమంత -
'జాట్' సినిమాను బాయ్‌కాట్ చేయండి.. ఫైర్ అవుతున్న తమిళులు
బాలీవుడ్ స్టార్ హీరో సన్నీ డియోల్ హీరోగా తెలుగు దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కించిన చిత్రం జాట్. మైత్రీ మూవీ మేకర్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రాన్ని బాయ్‌కాట్ చేయాలని #BoycottJaatMovie పేరుతో ఒక హ్యాష్ ట్యాగ్ వైరల్ అవుతుంది. శ్రీలంకలో (Sri Lanka) తమిళుల హక్కుల కోసం పోరాడిన ఎల్టీటీఈని ఒక ఉగ్రవాద సంస్థగా ఈ చిత్రంలో చూపించారంటూ కొందరు తమిళియన్స్ విరుచుకుపడుతున్నారు. తమ కోసం ప్రాణాలకు తెగించిన వారిని ఇలా చూపించడం ఎంతమాత్రం కరెక్ట్ కాదు అంటూ తమ ఎక్స్ పేజీలలో పోస్టులు పెడుతున్నారు. తమిళనాడులో దర్శకుడు గోపీచంద్ మలినేని అడుగుపెడితే తగిన బుద్ధి చెబుతాం అంటూ భగ్గుమంటున్నారు.సినిమా కథలో భాగంగా శ్రీలంక నుంచి పారిపోయి వచ్చిన పాత్రలో నటుడు రణతుంగ కనిపిస్తాడు. జాట్‌లో అతనే విలన్ కూడా.. డిప్యూటీ కమాండర్ ఆఫ్ జాఫ్నా టైగర్ ఫోర్స్ (JTF) పేరుతో పోలీసుల హిట్‌లిస్ట్‌లో రణతుంగ పేరు ఉంటుంది. ఇక్కడ జాఫ్నా అనేది శ్రీలంకలోని ద్వీపకల్పం. అక్కడే ఎల్టీటీఈని స్థాపించిన ప్రభాకరన్ జన్మించారు. ఇందులో విలన్‌తో నడిచే గ్యాంగ్‌ను చూపించిన తీరు అంతా కూడా ఎల్టీటీఈకు దగ్గరి పోలీకలు ఉన్నాయని వారు చెబుతున్నారు. ఈ సినిమాలో ఎల్టీటీఈ పేరు చెప్పనప్పటికీ ఆ మార్క్ చూపుతూ సినిమా తీశారని చెబుతున్నారు. ఎల్టీటీఈని ఒక ఉగ్రవాద సంస్థగా ఎందుకు చూపారంటూ కామెంట్లు చేస్తున్నారు. తమిళులు ఈ చిత్రాన్ని చూడొద్దంటూ వైరల్ చేస్తున్నారు. శ్రీలంకలోని తమిళుల కోసం ప్రత్యేక సైన్యాన్ని ఏర్పాటు చేసి ప్రజల హక్కుల కోసం పోరాడిన వారి గురించి ఇలా చూపిస్తారా అంటూ దర్శకుడు గోపీచంద్ మలినేనిపై విరుచుకుపడుతున్నారు. కొందరు తెలుగువారు తమిళుల పట్ల ఇంతలా ద్వేషం చూపుతున్నారా..? అంటూ ప్రశ్నించారు. ఈ తెలుగు దర్శకుడు తమిళ స్వాతంత్ర్య సమరయోధులు LTTEపై అంత ద్వేషం కక్కడానికి కారణం ఏమిటి..? LTTEపై ఇంత తప్పుడు ప్రచారం ఎందుకు..? అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. తమ కోసం ప్రాణాలు ఇచ్చిన వారిని ఉగ్రవాదులుగా ఎందుకు చూపుతున్నారు అంటూ ఫైర్ అవుతున్నారు.తమిళుల హక్కుల కోసం ఎల్టీటీఈ.. దాని గురించి తెలుసా..?అణచివేతకు గురైన తమిళులకు స్వేచ్ఛ పేరిట ఉత్తర శ్రీలంకలోని వన్నీ అటవీ ప్రాంతం నుంచి ఎల్టీటీఈ సాయుధ పోరాటం కొనసాగించింది. శ్రీలంకలో ఉన్న తమిళుల హక్కుల కోసం తమిళ్ న్యూటైగర్స్(TNT) పేరుతో 1972లో ఈ సంస్థను ప్రభాకరణ్ ప్రారంభించాడు. అయితే, 1975లో జాఫ్నా మేయర్‌ను అతి సమీపం నుంచి ప్రభాకరణ్ కాల్చి చంపాడు. ఆపై 1976లో టీఎన్టీ పేరును లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం(LTTE)గా మార్చాడు. దానికి తనే లీడర్‌గా ఉంటూ తమ ప్రత్యర్థుల్ని నిర్ధాక్షిణ్యంగా హత్య చేయడం ప్రారంభించారు. ప్రభాకరణ్ నాయకత్వంలో ఎల్టీటీఈ మరింత పవర్ఫుల్ అయింది. ఏకంగా గెరిల్లా దళంగా ఎదిగింది. సుమారు మూడున్నర దశాబ్దాల పాటు సాగిన ఈ ఉద్యమంలో మొత్తం 60వేల మంది ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం.శ్రీలంకలోని తమిళ ప్రజల దీనస్థితి తనను ఆయుధం పట్టేలా చేసిందని ప్రభాకరన్ ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. ప్లాన్ ప్రకారమే తమపై నరమేధం సాగుతోందని ఆయన చెప్పాడు. తమ జాతిని కాపాడుకునేందుకు ఈ నిరంకుశ రాజ్యం నుంచి ప్రజలను రక్షించేందుకే సాయుధ పోరాట మార్గాన్ని ఎంచుకున్నాని ఆయన మరణానికి ముందు చెప్పాడు. 2009లో శ్రీలంక సైన్యం జరిపిన కాల్పుల్లో ప్రభాకరణ్ హతమయ్యాడు.As a Tamilian, I strongly oppose the misrepresentation of the LTTE as terrorists in the movie Jaat. The LTTE was born out of systemic oppression and genocide against Tamils in Sri Lanka. Stop rewriting our history to suit your narrative.#BoycottJaatMovie #LTTEFreedomFighters pic.twitter.com/OaOISdJ5QZ— Senthilvelu V C (@Senthilveluvc) April 13, 2025LTTE was not a terrorist group.It was a resistance force born out of oppression, fighting for Tamil rights & justice.‘Jaat’ shamelessly demonizes a freedom struggle.Tamils won’t stay silent when history is twisted.#BoycottJaatMovie #LTTEFreedomFighters@Seeman4TN @SaalanPaari pic.twitter.com/Qq4sEb9pFV— Asif Ahammed (@asifahamadu) April 13, 2025#BoycottJaatMovie #LTTEFreedomFighters 😠 Why is there so much hatred towards the Tamil liberation movement? #Jaat 🛑#SaveTamilTrue Freedom Rules 💯1.Respect women and give equal rights.2. Never ever use alcohol.3.They never disrespect other's language. pic.twitter.com/0wGibMSRIy— Tamil Pillaigal 🐬 (@TamilPillaigal) April 13, 2025 -
హిట్ ఇచ్చిన డైరెక్టర్‌కు మరో ఛాన్స్ ఇస్తున్న 'బాలకృష్ణ'
నందమూరి బాలకృష్ణ( Nandamuri Balakrishna) వరుస విజయాలతో స్పీడ్ మీదున్నారు. రీసెంట్గా డాకు మహారాజ్‌తో విజయాన్ని అందుకున్న ఆయన ఇప్పుడు మరో సినిమాను పట్టాలెక్కించేందుకు రెడీ అయిపోతున్నాడు. అయితే, మాస్ సినిమాలకు తనదైన మార్క్ చూపించే బాలయ్య ఇప్పుడు మళ్లీ అదే ఫార్ములాను నమ్ముకున్నాడు. వీర సింహారెడ్డి సినిమాతో తనకు హిట్ ఇచ్చిన గోపీచంద్ మలినేని దర్శకత్వంలో కొత్త సినిమాను ఆయన ప్రకటంచనున్నారు. ఈమేరకు ఇద్దరి మధ్య చర్చలు కూడా ముగిశాయని తెలుస్తోంది.జాట్ సినిమాతో బాలీవుడ్ ప్రేక్షకులను మెప్పించిన గోపీచంద్ మలినేని మాస్ చిత్రాలను తెరకెక్కించడంలో గుర్తింపు తెచ్చుకున్నాడు. దీంతో ఆయనకు హిందీలో కూడా ఆదరణ దక్కింది. క్రాక్, వీర సింహా రెడ్డి , జాట్ ఇలా వరుస చిత్రాలతో జోరు మీదున్న మలినేని మరోసారి బాలయ్యతో సినిమా సెట్ చేశాడు. వృద్ధి సంస్థ బ్యానర్ పై సతీష్ కిలారు ఈ చిత్రాన్ని నిర్మిస్తారని తెలుస్తోంది. ఈ సంస్థ నుంచి ఇప్పటికే రామ్ చరణ్ పెద్ది సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.బాలకృష్ణ- బోయపాటి శ్రీను కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘అఖండ 2: తాండవం’ దసరా సందర్భంగా సెప్టెంబరు 25న థియేటర్లలోకి రానుంది. బాలయ్య ఇందులో మురళీ కృష్ణగా, అఖండ రుద్ర సికిందర్ అఘోరాగా రెండు పాత్రల్లో కనిపించనున్నారు. ‘అఖండ’కు కొనసాగింపుగా పాన్ ఇండియా రేంజ్లో బోయపాటి శ్రీను ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అఖండ సినిమాకు బాలీవుడ్లో భారీగానే ఫ్యాన్స్ ఉన్నారు. అందుకే ఈ చిత్రాన్ని హిందీలో డైరెక్ట్‌గా విడుదల చేయనున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమా నుంచి త్వరలో గ్లింప్స్ విడుదల కానుంది. -
హిట్ కొట్టినా.. కలెక్షన్స్ ఏంటి ఇలా ఉన్నాయ్?
ఈ మధ్య కాలంలో తెలుగు సినిమాలు ఉత్తరాదిలో దుమ్మురేపుతున్నాయి. ఈ క్రమంలోనే మన తెలుగు డైరెక్టర్ మన టాలీవుడ్ ఫ్లేవర్ కథతో తీసిన సినిమా ఒకటి తాజాగా థియేటర్లలోకి వచ్చింది. టాక్ పాజిటివ్ వచ్చింది గానీ కలెక్షన్స్ మాత్రం విచిత్రంగా కనిపిస్తున్నాయి.టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీస్ తీసిన లేటెస్ట్ హిందీ సినిమా 'జాట్'(Jaat Movie). గోపీచంద్ మలినేని అనే తెలుగు దర్శకుడు తీసిన ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరో సన్నీ డియోల్ (Sunny Deol)నటించాడు. విలన్ గా రణ్ దీప్ హుడా చేసినప్పటికీ.. చాలామంది తెలుగు ఆర్టిస్టులు కీలక పాత్రలు పోషించారు.(ఇదీ చదవండి: చెబితే బూతులా ఉంటుంది.. ఓటీటీ మూవీ రివ్యూ)తెలుగు సినిమా కథతో తీసిన ఈ సినిమాకు తొలిరోజు రూ.11 కోట్ల మేర వసూళ్లు వచ్చాయి. అయితే వీకెండ్ కావడంతో ఏమైనా పెరుగుతాయేమోనని అందరూ అనుకున్నారు. కానీ మూడు రోజుల్లో(Day 3 Collection) కేవలం రూ.32.20 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ మాత్రమే వచ్చినట్లు అధికారికంగా ప్రకటించారు.ఉత్తరాదిలో పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమాకు రూ.32 కోట్ల అంటే చాలా నామమాత్రమే అని చెప్పొచ్చు. ఇలా అయితే రూ.100 కోట్ల మార్క్ చేరెదెప్పుడో? లాభాల్లోకి వచ్చేదెప్పుడో చూడాలి?(ఇదీ చదవండి: పెళ్లికి ముందే చెట్టాపట్టాల్.. ప్రియురాలితో స్టార్ హీరో) -
తెలుగు కథతో తీసిన హిందీ సినిమా.. Day 1 కలెక్షన్స్ ఎంత?
తెలుగులో ప్రముఖ నిర్మాణ సంస్థలైన మైత్రీ మూవీ మేకర్స్, పీపుల్స్ మీడియా నిర్మాణ సంస్థలు కలిస నిర్మించిన హిందీ సినిమా 'జాట్'(Jaat Movie). సన్నీ డియోల్ హీరోగా నటించిన ఈ చిత్రం.. నిన్న (ఏప్రిల్ 10) థియేటర్లలోకి వచ్చింది. మరి తొలి రోజు వసూళ్లు ఎంతొచ్చాయి? టాక్ ఏం వినిపిస్తుంది.తెలుగులో ఎన్నో సినిమాల్లో కనిపించిన ఓ మాస్ కథతో తీసిన మూవీ జాట్. ఓ ఊరు మొత్తాన్ని వేధించే విలన్, అనుకోకుండా అక్కడ ల్యాండ్ అయిన హీరో, అనుకోని పరిస్థితుల్లో వీళ్లిద్దరి మధ్య ఫైటింగ్, చివరకు ఏమైందనేదే స్టోరీ.(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 21 సినిమాలు)హిందీలో ఈ మధ్య సౌత్ సినిమాలకు మంచి ఆదరణ లభిస్తోంది. దీంతో తెలుగు ఫ్లేవర్ కథతో జాట్ తీశారు. టాక్ అయితే పాజిటివ్ వచ్చింది. దీంతో తొలిరోజు రూ.11.6 కోట్ల మేర గ్రాస్ వసూళ్లు (Day 1 Collection) వచ్చాయి. ఇది తక్కువ కానప్పటికీ.. సన్నీ (Sunny Deol) గత చిత్రం 'గదర్ 2'తో పోలిస్తే చాలా తక్కువ. ఎందుకంటే ఆ మూవీకి తొలిరోజు రూ.40 కోట్లు వచ్చాయి. ప్రస్తుతానికి హిందీలో మాత్రమే రిలీజ్ చేశారు. తెలుగులోనూ విడుదల చేస్తారనే టాక్ వచ్చింది. మరి ఈ వీకెండ్ గడిస్తే జాట్.. బాక్సాఫీస్ జాతకం ఏంటనేది బయటపడుతుంది. తెలుగు వెర్షన్ రిలీజ్ గురించి ఓ క్లారిటీ వస్తుందేమో!(ఇదీ చదవండి: పవన్ సినిమా.. చెప్పిన టైంకి రిలీజ్ అవుతుందా?) -
'జాట్' ట్విటర్ రివ్యూ.. గోపీచంద్ మలినేని హిట్ కొట్టాడా..?
తెలుగు దర్శకుడు గోపీచంద్ మలినేని(GopiChand malineni) బాలీవుడ్‌లోకి జాట్ సినిమాతో ఎంట్రీ ఇచ్చారు. సీనియర్ హీరో సన్నీ డియోల్‌తో(Sunny Deol) భారీ మాస్ యాక్షన్ చిత్రాన్ని ఆయన తెరకెక్కించారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ టీజీ విశ్వప్రసాద్ ఈ మూవీని నిర్మించారు. ఏప్రిల్ 10న విడుదలైన ఈ చిత్రంలో రణదీప్ హుడా విలన్‌గా మెప్పించగా.. వినీత్ కుమార్ సింగ్, సయామీ ఖేర్, రెజీనా కీలకపాత్రల్లో నటించారు. తమన్ సంగీతం అందించారు. అయితే, బాలీవుడ్లో గోపీచంద్ మలినేని హిట్ అందుకున్నాడా..? అనే అంశంపై నెటిజన్లు తమ అభిప్రాయాన్ని ఎక్స్ పేజీలలో పోస్ట్‌లు పెడుతున్నారు.జాట్ ట్రైలర్‌ను చూసిన వారందరూ చాలా మాస్‌గా ఉందని తప్పకుండా బాలీవుడ్లో హిట్ కొడుతాడని దర్శకుడు గోపీచంద్ మలినేనిపై అంచనాలు పెట్టుకున్నారు. కానీ, సినిమా అనుకున్నంత రేంజ్లో లేదని నెటిజన్లు అభిప్రాయ పడుతున్నారు. రొటీన్ కథకు భారీ యాక్షన్ సీన్స్ జత చేసి సినిమా తీశారని చెప్పుకొస్తున్నారు. అయితే, ఈ సినిమాకు తమన్ అందించిన మ్యూజిక్ చాలా వరకు ప్లస్ అయిందని అంటున్నారు. ఇలాంటి కథతో తెలుగులో ఇప్పటివరకు చాలా సినిమాలు వచ్చాయని జాట్ చూసిన వాళ్లు పోస్టులు షేర్ చేయడం విశేషం. అయితే, గోపీచంద్ మలినేని మేకింగ్ స్టైల్ చాలా రిచ్‌గా ఉందని చెబుతున్నారు. పుష్ప సినిమాతో బాలీవుడ్ ప్రేక్షకులు మాస్ స్టోరీకి కనెక్ట్ అయ్యారు. ఇప్పుడు జాట్ కథకు వారు కనెక్ట్ అయితే మాత్రం బ్లాక్‌బస్టర్ గ్యారెంటీ అంటూ రివ్యూవర్లు పేర్కొంటున్నారు.వీరసింహారెడ్డి వంటి ఓల్డ్ స్టోరీతో భారీ వసూళ్లు రాబట్టిన గోపీచంద్ మలినేని.. ఆ తరువాత రవితేజతో ఓ చిత్రాన్ని ప్లాన్ చేసుకున్నాడు. కానీ, అది సెట్స్ మీదకు వెళ్లకుండానే ఆగిపోయింది. అదే కథను జాట్‌గా బాలీవుడ్లో తెరకెక్కించాడని తెలుస్తోంది. అయితే, ఎక్కువమంది జాట్ చిత్రంపై కాస్త నెగటివ్ రిపోర్ట్స్ ఇస్తున్నారు. కానీ అభిమానులు మాత్రం సన్నీ డియోల్ దుమ్మురేపాడంటూ చెబుతున్నారు. సినిమా అద్భుతంగా ఉందంటూ.. చాలా ఏళ్ల తర్వాత వింటేజ్ సన్నీ డియోల్ కనిపించాడని అంటున్నారు. జాట్ చూసిన కొందరు మాత్రం మైండ్ బ్లోయింగ్ అంటూ.. బాక్సాఫీస్ వద్ద పైసా వసూల్ చిత్రం అంటున్నారు. ఓవరాల్‌గా మంచి ఎంటర్టైనరే కాకుండా భారీ యాక్షన్ మూవీ అంటూ తమ ఎక్స్ పేజీలలో పోస్టులు పెడుతున్నారు. సన్ని డియోల్‌ను అభిమానించే వారికి జాట్ తప్పకుండా నచ్చుతుందని అంటున్నారు. అయితే, ఈ సినిమాకు ఎక్కువమంది 2.5/5 రేటింగ్ ఇస్తున్నారు. పెద్దగా చెప్పుకోదగిన సినిమా అయితే కాదని చాలామంది అభిప్రాయపడుతున్నారు. #OneWordReview...#Jaat: POWER-PACKED.Rating: ⭐️⭐️⭐️½#SunnyDeol roars again... A full-on mass entertainer, driven by three major strengths: #Sunny's heroism, seeti-maar dialogues and zabardast action... A mass-friendly package that delivers what it promises. #JaatReview… pic.twitter.com/Aivq0tdOrz— taran adarsh (@taran_adarsh) April 10, 2025“SORRY BOL”जाट करेगा सबकी खड़ी खाट या जाट की हो जाएगी खड़ी खाट ? बात “खिचड़ी” के पसंद और नापसंद की है । मुझे खिचड़ी पसंद नहीं । #jaat @iamsunnydeol #Survivor2025 #LCDLFAllStars #LCDLFAlIStars #Survivor #chilhavisto pic.twitter.com/8tz0bPKDEs— Rajnish Mehta (@RajnishBaBaMeht) April 10, 2025#OneWordReview...#jaat : Blockbuster.Rating: ⭐️⭐️⭐️⭐️½#jaat has everything: star power, style, scale, soul, substance and surprises... #SunnyDeol #JaatReview pic.twitter.com/qvGzD8Tdxh— Filmy Entertainment. (@filmyentertain0) April 10, 2025Congrats brother @megopichand @MusicThaman for the success of #Jaat #JaatReview 🔥🔥🔥🔥pic.twitter.com/O2xInmVWMm— Telugodu ᴮᵃˡᵃʸʸᵃ ᴮᵈᵃʸ ᵀʳᵉⁿᵈ ᴼⁿ ᴶᵘⁿᵉ ¹⁰ᵗʰ (@AndhraTelugodu) April 10, 2025#Jaat Interval - Super Entertaining till now. #SunnyDeol of 90’s is back with this film.. no one has presented him like this in last 15 Years.— Sumit Kadel (@SumitkadeI) April 10, 2025#JaatReview: Commercial Mass Masala Entertainment – ⭐⭐⭐ (3/5)Plot:Set in the rural coastal belt of Andhra Pradesh, #Jaat at its core is a battle of Ram (#SunnyDeol) vs Raavan (#RandeepHooda).Analysis:#Jaat sticks to the tried-and-tested formula of mass masala… pic.twitter.com/UbvLzFcQ9d— Movie_Reviews (@MovieReview_Hub) April 10, 2025INTERVAL: #Jaat is out and out #SunnyDeol show, which shows him in that #Gadar #Ghayal and #Ghatak type roles, but the otherwise show is destroyed by Director's crap vision and outdated storytelling that faded away in South back in 2000s. The rest of the cast seems Horrible! pic.twitter.com/meeKgEUDVK— $@M (@SAMTHEBESTEST_) April 10, 2025 -
'జాట్' థీమ్ సాంగ్ చూశారా..?
బాలీవుడ్ హీరో సన్నీ డియోల్(Sunny Deol) కొత్త సినిమా 'జాట్'(Jaat) నుంచి థీమ్ సాంగ్‌ను తాజాగా విడుదల చేశారు. తెలుగు దర్శకుడు గోపీచంద్ మలినేని(Gopichandh Malineni) తెరకెక్కిస్తున్న ఈ క్రేజీ మూవీని భారీ బడ్జెట్‌తో మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ టీజీ విశ్వప్రసాద్ ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఏప్రిల్ 10న విడుదల కానున్న ఈ చిత్రం ప్రమోషన్స్ ఇప్పటికే జరుగుతున్నాయి. అయితే, తెలుగు వర్షన్ సినిమా విడుదలకు ఇంకాస్త టైమ్ పడొచ్చని సమాచారం. టీజర్, ట్రైలర్, ఊర్వశి రౌతేలా ప్రత్యేకమైన సాంగ్ ప్రేక్షకులను మెప్పించాయి. ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు. జాట్ సినిమాలో రణదీప్ హుడా విలన్‌గా నటిస్తున్నారు. వినీత్ కుమార్ సింగ్, సయామీ ఖేర్, రెజీనా కీలకపాత్రల్లో మెప్పించనున్నారు.