
ఒకప్పుడు సినిమాలో చిన్న చిన్న పొరపాట్లు ఉన్నాసరే పెద్దగా పట్టించుకునేవాళ్లు కాదు. కానీ ఇప్పుడు సోషల్ మీడియా దెబ్బకు ఎప్పుడు ఎవరికీ మనోభావాలు దెబ్బతింటాయో తెలియని పరిస్థితి. తాజాగా రిలీజైన జాట్ సినిమాకు ఇలానే పరిస్థితి ఎదురైంది. మొన్న తమిళ ప్రేక్షకులు హర్ట్ కాగా.. తాజాగా పలు క్రైస్తవ సంఘాలు సినిమాపై ఆగ్రహం వ్యక్తం చేశాయి.
జాట్ సినిమాలోని ఓ సన్నివేశంలో విలన్ రణ్ దీప్ హుడా.. గుండాయిజం, బెదిరింపు లాంటివి చేస్తాడు. అలానే రక్తపాతానికి సంబంధించిన సీన్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు వీటిపై పలు క్రైస్తవ సంఘాలు ఫైర్ అవుతున్నాయి. రెండు రోజుల్లో చర్యలు తీసుకోవాలని, అలానే సినిమాని బ్యాన్ చేయాలని హెచ్చరిస్తున్నాయి.
(ఇదీ చదవండి: 'పుష్ప 2'కి నా మ్యూజిక్ పెట్టుకోలేదు.. అయినా బాధ లేదు)
కొన్నిరోజుల క్రితం తమిళ ప్రేక్షకుల నుంచి నిరసన వినిపించింది. సినిమాలోని కొన్ని సీన్లలో శ్రీలంకలో తమిళుల హక్కుల కోసం పోరాడిన ఎల్‌టీటీఈని ఓ ఉగ్రవాద సంస్థగా చూపించారని కొందరు తమిళియన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇలా రిలీజై వారం రోజులు కూడా కాకముందే వరస వివాదాల్లో చిక్కుకోవడం 'జాట్' వార్తల్లో నిలుస్తుంది. ఇక కలెక్షన్స్ విషయానికొస్తే.. 6 రోజుల్లో రూ65.45 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు.
(ఇదీ చదవండి: స్టార్ హీరో డ్రగ్స్ మత్తు.. నటిపై అసభ్యకర కామెంట్స్)