
రణ్‌దీప్ హుడా (Randeep Hooda).. సినిమా అంటే ఎంత పిచ్చో మాటల్లో చెప్పలేదు. చేతల్లో చూపించాడు. సినిమా కోసం ఎన్ని కష్టాలైనా పడతాడు. తన శరీరాన్ని నచ్చినట్లుగా మార్చేస్తాడు. సర్‌బిజత్ సినిమా కోసం నెల రోజుల్లోనే 18 కిలోలు తగ్గిపోయాడు. గతేడాది వచ్చిన స్వతంత్ర వీర్ సావర్కర్ కోసం ఏకంగా 30 కిలోలకు పైనే తగ్గిపోయాడు. ఇందుకోసం తిండిమానేసి కడుపు కాల్చుకున్నాడు.
జాట్ మూవీతో ఫుల్ క్రేజ్
ఈ సినిమా కోసం పైసాపైసా కూడబెట్టి కొన్న రెండు,మూడు ప్లాట్లను అమ్మేశాడు. దర్శకుడిగా, హీరోగా, నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమా నష్టాల్ని మిగిల్చింది. తాజాగా ఇతడు జాట్ సినిమాతో పలకరించాడు. తెలుగు డైరెక్టర్ గోపీచంద్ మలినేని రూపొందించిన ఈ సినిమాలో సన్నీడియోల్ హీరోగా, రణ్‌దీప్ విలన్‌గా నటించారు. కేవలం హిందీలో మాత్రమే రిలీజైన ఈ చిత్రానికి విశేష ఆదరణ లభిస్తోంది. కలెక్షన్స్ మాట పక్కనపెడితే విలన్‌గా రణ్‌దీప్‌కు మాత్రం మరింత గుర్తింపు తీసుకొచ్చింది.
ఆ సినిమాకు నేను హీరో..
తాజాగా అతడు గతంలో ఎదురైన చేదు అనుభవాన్ని తల్చుకుని బాధపడ్డాడు. రణ్‌దీప్ హుడా మాట్లాడుతూ.. ఆలియా భట్ (Alia Bhatt)తో కలిసి నేను హైవే సినిమా చేశాను. కానీ ప్రమోషన్స్‌లో నా స్థానంలో రణ్‌బీర్ కపూర్ (Ranbir Kapoor) ఉన్నాడు. రణ్‌బీర్- ఆలియా ప్రమోషన్స్ చూసి నేను షాకయ్యాను. ఎందుకంటే ఆయనకు నా సినిమాతో ఏం పని? హైవేలో నేను హీరో. మరి ప్రమోషన్స్‌లో తనెందుకు ఉన్నాడో అర్థం కాలేదు. సరే, పోనీ.. కనీసం ప్రమోషన్స్‌కు నన్నైనా పిలవాలి కదా.. పిలవలేదు. అప్పుడు చాలా బాధేసింది. ఆ సమయంలో నాకు సపోర్ట్‌గా నిలబడి ప్రమోషన్స్‌కు పిలిచుంటే అది నా కెరీర్‌కు సాయపడేదేమో!
లవ్ జర్నీ..
బహుశా.. హైవే ప్రమోషన్స్ అప్పుడే రణ్‌బీర్, ఆలియా ప్రేమలో పడ్డారేమో! నా సినిమా వల్ల వారిద్దరి మనసులు దగ్గరయ్యాయంటే అది నాకు సంతోషమే! కానీ నన్ను పట్టించుకుంటే బాగుండేదనిపించింది. అయితే వారి ప్రమోషన్స్‌తో సినిమాకు పెద్దగా హైప్ రాకపోవడంతో రిలీజ్‌కు సరిగ్గా రెండు రోజుల ముందు నన్ను ప్రమోషన్స్‌కు పిలిచారు అని చెప్పుకొచ్చాడు.