highway
-
శరవేగంగా గ్రీన్‌ఫీల్డ్ హైవే
దేవరపల్లి: రెండు తెలుగు రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ నిర్మీస్తున్న గ్రీన్‌ఫీల్డ్ హైవే పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మరో నాలుగు నెలల్లో ఈ జాతీయ రహదారి ప్రజలకు అందుబాటులోకి రానుంది. ఎక్కడా గ్రామాలను తాకకుండా పచ్చని పంట పొలాల మధ్య నుంచి దీనిని నిర్మీస్తున్నారు. ఈ హైవే నిర్మాణం పూర్తయితే ఉత్తరాంధ్ర నుంచి తెలంగాణకు రవాణా సదుపాయం మెరుగుపడడంతో పాటు సమయం, దూరం ఆదా అవుతాయి. 162 కిలోమీటర్ల పొడవు... రూ.2,200 కోట్ల వ్యయం తెలంగాణలోని ఖమ్మం నుంచి తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లి వరకూ రూ.2,200 కోట్లతో నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఏఐ) సుమారు 162 కిలోమీటర్ల పొడవున ఈ గ్రీన్‌ఫీల్డ్ హైవేను నిర్మీస్తోంది. ఇది పూర్తయితే దేవరపల్లి – ఖమ్మం మధ్య సుమారు 70 కిలోమీటర్ల మేర దూరం తగ్గుతుందని అధికారులు చెబుతున్నారు. దీని నిర్మాణానికి 2022 ఏప్రిల్‌లో అప్పటి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శంకుస్థాపన చేశారు. గత ఏడాది సెప్టెంబర్ నాటికి ఈ హైవే నిర్మాణం పూర్తి కావాల్సి ఉండగా అధిక వర్షాలు, తుపానుల కారణంగా పనుల్లో జాప్యం జరిగింది. ఆంధ్రాలో హైవే సాగుతుందిలా.. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో చింతలపూడి సమీపంలోని రేచర్ల నుంచి ఈ గ్రీన్‌ఫీల్డ్ హైవే ప్రారంభమవుతుంది. అక్కడి నుంచి టి.నర్సాపురం, వేపుగుంట, గుర్వాయగూడెం, బొర్రంపాలెం, జంగారెడ్డిగూడెం వద్ద మద్ది ఆంజనేయస్వామి ఆలయం సమీపాన ఎర్రకాలువ మీదుగా కొయ్యలగూడెం మండలం రాజవరం, యర్రంపేట, దేవరపల్లి మండలం యాదవోలు, చిన్నాయగూడెం,గోపాలపురం మండలం వాదాలకుంట, వెదుళ్లకుంట గ్రామాల మీదుగా దేవరపల్లి వద్ద 16వ నంబర్ జాతీయ రహదారిని కలుస్తుంది. జంగారెడ్డిగూడెం వద్ద పుట్లగట్లగూడెం–గుర్వాయగూడెం వద్ద జంక్షన్ ఏర్పాటు చేస్తున్నారు. దీనికి 83 ఎకరాలు సేకరించారు. ఖమ్మం–దేవరపల్లి మధ్య 8 టోల్‌ప్లాజాలు, 51 మైనర్, 9 మేజర్ బ్రిడ్జిలు నిర్మీస్తున్నారు. ఉమ్మడి ‘పశ్చిమ’లో 72 కిలోమీటర్లు గ్రీన్‌ఫీల్డ్ హైవే పనులను హైదరాబాద్‌కు చెందిన డెకెం సంస్థ చేపట్టింది. తెలంగాణలో ఖమ్మం నుంచి రేచర్ల వరకూ ఒకే ప్యాకేజీగా పనులు జరుగుతున్నాయి. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 72 కిలోమీటర్ల పొడవును మూడు ప్యాకేజీల్లో ఈ పనులు జరుగుతున్నాయి. సేకరించిన భూములకు రైతులందరికీ పరిహారం అందించారు. భూసేకరణకు అడ్డంకులు గ్రీన్‌ఫీల్డ్ హైవేకి అవసరమైన భూసేకరణకు కొయ్యలగూడెం మండలం పొంగుటూరు వద్ద బ్రేక్ పడింది. ఆ గ్రామానికి చెందిన రైతు కోర్టుకు వెళ్లడంతో మూడెకరాల భూసేకరణ నిలిచిపోయింది. న్యాయస్థానం తీర్పు రిజర్వులో పెట్టి దాదాపు ఏడాది కావస్తోంది. తీర్పు కోసం అధికారులు ఎదురు చూస్తున్నారు.రూ.2 కోట్లకు ఎకరం ధరఇప్పటికే రెండు హైవేలు ఉండటం, మరో హైవే వస్తుండటంతో దేవరపల్లి ప్రాంతంలో ఇప్పటికే భూముల ధరలు ఊహించని విధంగా పెరిగాయి. ఎకరం రూ.2 కోట్లు పైగా పలుకుతోంది. మూడు జాతీయ రహదారులు అందుబాటులోకి రావడంతో మెట్ట ప్రాంతంలో వ్యవసాయ ఉత్పత్తులకు మెరుగైన రవాణా సౌకర్యం ఏర్పడుతుంది. పంట ఉత్పత్తులను దూర ప్రాంతాల్లోని మార్కెట్లకు రవాణా చేయడం ద్వారా రైతులు గిట్టుబాటు ధర పొందే అవకాశం కలుగుతుంది.ఇప్పటికే ఈ ప్రాంతం నుంచి రైతులు హైదరాబాద్, విశాఖపట్నం, విజయనగరం, కోల్‌కతా వంటి ప్రాంతాలకు వ్యవసాయ ఉత్పత్తులు రవాణా చేస్తున్నారు. ఈ ప్రాంతంలో ఎక్కువగా నిమ్మ, అరటి, కోకో, జీడిగింజల వంటి పంట ఉత్పత్తులు వస్తుంటాయి. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో..గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ సహకారంతో కేంద్ర జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ దీని నిర్మాణ పనులు చేపట్టింది. ఈ నేపథ్యంలో మొన్నటి వరకూ సాధారణ జంక్షన్‌గా ఉన్న దేవరపల్లి ఇప్పుడు మూడు జాతీయ రహదారుల జంక్షన్‌గా కొత్త రూపు సంతరించుకుంటోంది. కోల్‌కతా– చెన్నై 16వ నంబర్ జాతీయ రహదారి దేవరపల్లి మీదుగానే సాగుతోంది. అలాగే, దేవరపల్లి – ఖమ్మం జిల్లా తల్లాడ మధ్య ఇప్పటికే 316డి హైవే ఉంది.ఇప్పుడు కొత్తగా దేవరపల్లి – ఖమ్మం మధ్య కొత్తగా గ్రీన్‌ఫీల్డ్ హైవే నిర్మీస్తున్నారు. ఇది 16వ నంబర్ జాతీయ రహదారిని దేవరపల్లి వద్ద గోపాలపురం రోడ్డులోని డైమండ్ జంక్షన్‌కు రెండు కిలోమీటర్ల దూరంలో కలుస్తుంది. ఈ ప్రాంతంలో మూడు హైవేలు కలుస్తూండటంతో వాటిని విభజిస్తూ నూతన టెక్నాలజీతో అవుటర్ రింగ్ రోడ్డు (డ్రమ్‌ఫుట్) నిర్మీస్తున్నారు. ఈ గ్రీన్‌ఫీల్డ్ హైవేకి ప్రభుత్వం సుమారు 1,100 ఎకరాలు సేకరించింది. 85 శాతం పూర్తి ఖమ్మం–దేవరపల్లి గ్రీన్‌ఫీల్డ్ హైవే నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. ఇప్పటి వరకూ రేచర్ల నుంచి గుర్వాయగూడెం వరకూ 85 శాతం, అక్కడి నుంచి దేవరపల్లి వరకూ 65 శాతం పనులు పూర్తయ్యాయి. వంతెనలు, కల్వర్టుల నిర్మాణాలు పూర్తయ్యాయి. దేవరపల్లి వద్ద డ్రమ్‌ఫుట్ నిర్మాణం జరుగుతోంది. మొత్తంగా 85 శాతం పనులు పూర్తయ్యాయి. వచ్చే జూన్ నాటికి ఈ రోడ్డును ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తాం. – సురేంద్రనాథ్, పీడీ, నేషనల్ హైవేస్, రాజమహేంద్రవరం -
దక్షిణ కొరియాలో కూలిన ఎలివేటెడ్ హైవే
సియోల్: దక్షిణ కొరియా రాజధాని సియోల్ సమీపంలో నిర్మాణంలో ఉన్న ఎలివేటెడ్ హైవేలో కొంతభాగం కుప్పకూలింది. చియోనన్ ప్రాంతంలో చోటుచేసుకున్న ఈ ఘటనలో నలుగురు కార్మికులు చనిపోగా మరో ఆరుగురు గాయపడ్డారు. క్షతగాత్రుల్లో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు. ప్రమాద సమయంలో ఆ నిర్మాణంపై 10 మంది కార్మికులు పని చేస్తున్నారన్నారు.అది కూలడంతో వీరంతా శిథిలాల్లో చిక్కుకున్నట్లు వివరించారు. ఇద్దరు అక్కడికక్కడే చనిపోగా మరో ఇద్దరు ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారని చెప్పారు. ఘటనకు కారణాలు తెలియాల్సి ఉంది. శిథిలాలను తొలగించి, సహాయ కార్యక్రమాలను చేపట్టేందుకు 50 అగ్ని మాపక శకటాలు, మూడు హెలికాప్టర్లు, 150 మంది సిబ్బందిని అక్కడికి తరలించారు. -
కారులో మంటలు
-
తాగి రోడ్లపై రచ్చ
-
కారు ప్రమాదంలో దంపతుల మృతి: Tirupati
-
విజయవాడ- ఏలూరు హైవేపై ఘోర ప్రమాదం
సాక్షి, కృష్ణాజిల్లా: విజయవాడ- ఏలూరు హైవేపై ఘోర ప్రమాదం జరిగింది. రాంగ్ రూట్లో వేగంగా వచ్చి కారు.. మరో కారు ఢీకొట్టింది. ముందు భాగంలో కారు పూర్తిగా నుజ్జు నుజ్జు అయ్యింది. ఐదుగురి ప్రయాణీకుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. సంగారెడ్డి జిల్లా ఎద్దుమైలారం తోషిబా విద్యుత్ కంపెనీలో పని చేస్తున్న శివప్రసాద్‌కు చెందిన కారుగా గుర్తించారు. గన్నవరం పిన్నమనేని ఆసుపత్రికి క్షతగాత్రులను తరలించారు.మరో ఘటనలో...మరో ఘటనలో నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలైంది. నిత్యం వాహనాల రాకపోకలతో రద్దీగా ఉండే రహదారిపై ఓ వ్యక్తి నిర్లక్ష్యంగా ట్రాక్టర్ నడిపి మరో వాహన చోదకుడిని బలితీసుకున్నాడు. పట్టపగలు నడిరోడ్డు పై జరిగిన ఈ ఘటనలో వ్యక్తి మృతి దుర్మరణం చెందగా మరో మహిళ తీవ్రంగా గాయపడింది. మాచవరం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎస్ఆర్ఆర్ కళాశాల వద్ద ఏలూరు రోడ్డుపై శుక్రవారం ఈ ప్రమాదం చోటుచేసుకుంది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం చిన ఆగిరిపల్లి ప్రాంతానికి చెందిన బడుగు సోమయ్య (54) వ్యవసాయం చేస్తుంటాడు. ఈయనకు భార్య నలుగురు పిల్లలు ఉన్నారు. వారిలో పెద్ద కుమార్తె మమతతో కలసి కోర్టు పనుల నిమిత్తమై ద్విచక్రవాహనంపై విజయవాడ వచ్చారు. ఏలూరు రోడ్డు గుణదల నుంచి చుట్టుగుంట వైపు వెళుతుండగా వెనుకగా వేగంగా వచ్చిన ట్రాక్టర్ ఢీ కొట్టింది. దీంతో బైక్‌పై వెళుతున్న సోమయ్య, మమత రోడ్డుపై పడిపోయారు. అంతటితో ఆగకుండా ఆ డ్రైవర్ తన ట్రాక్టర్‌ను ముందుకు నడిపాడు.ఈ ఘటనలో రోడ్డుపై పడి ఉన్న సోమయ్యపై ట్రాక్టర్ ఎక్కడంతో తీవ్రంగా గాయపడి రక్తపు మడుగులో పడి ఉన్నాడు. మమత కొద్ది దూరంలో పడగా ముఖానికి, చేతులకు గాయాలయ్యాయి. ఇది గమనించిన స్థానికులు 108 సహాయంతో బాధితులను వైద్యం నిమిత్తం గుణదలలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షలు చేసిన తరువాత సోమయ్య మృతి చెందినట్లు నిర్ధారించారు. మమతకు ప్రాణాపాయం లేదని ఆమె కోలుకునే అవకాశం ఉందని వైద్యులు తెలిపారు.సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించి ప్రమాదానికి కారణమైన ట్రాక్టర్ డ్రైవర్ సాంబశివరావును అదుపులోకి తీసుకున్నారు. ట్రాక్టర్‌ను స్టేషన్‌కు తరలించారు. మృతుడి కుటుంబ సభ్యులు ప్రభుత్వాసుపత్రికి చేరుకుని కన్నీరు మున్నీరుగా విలపించారు. సోమయ్య కుమారుడు బడుగు దీపక్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మాచవరం పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. కాగా నిర్లక్ష్యంగా ట్రాక్టర్‌ను నడిపి ఓ వ్యక్తి మృతికి కారణమైన డ్రైవర్ సాంబశివరావుపై కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. -
Jaipur Tanker Blast: మానవత్వమా.. నీవెక్కడ..?
జైపూర్ : మానవత్వానికి మాయని మచ్చ వంటి ఘటన రాజస్థాన్ జైపుర్‌లో చోటు చేసుకుంది. ఈ శుక్రవారం ఎల్పీజీ ట్యాంకర్‌ను, ఓ ట్రక్ ఢీకొట్టి మంటలు చెలరేగాయి. మంటల్లో చిక్కుకున్న బాధితులు తమని కాపాడాలని వేడుకుంటూ హాహాకారాలు చేస్తూ పరిగెత్తారు. స్థానికులు బాధితుల్ని రక్షించేందుకు ముందుకు రాకపోగా .. వీడియోలు, ఫొటోలు తీస్తూ రాక్షసానందం పొందినట్లు తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే.. శుక్రవారం తెల్లవారు జామున 5:30 గంటలకు రాజస్థాన్‌లోని జైపుర్‌లో జైపుర్-అజ్మీర్ హైవేపై ఓ పెట్రోల్ బంకులో ఎల్పీజీ ట్యాంకర్‌ను, ఓ ట్రక్కు ఢీకొట్టింది. దీంతో మంటలు చెలరేగి దగ్గరలో ఉన్న పెట్రోల్ బంకుకు వ్యాపించాయి. ఆ సమయంలో బంకు వద్ద ఉన్న పలు వాహనాలు దగ్ధమయ్యాయి. ఇప్పటి వరకు ఈ ఘటనలో 14 మంది మృతి చెందగా.. దాదాపు 40 మంది గాయపడ్డారు.గాయపడిన వారిలో రాధేశ్యామ్ చౌదరి (32) ఒకరు. మంటల్లో చిక్కుకున్న రాధేశ్యామ్ తనని కాపాడాలని కోరుతూ 600 మీటర్లు పరిగెత్తారు. అక్కడే ఉన్న వారు రాధేశ్యామ్‌ను రక్షించేందుకు ముందుకు రాకపోగా .. వీడియోలు, ఫొటోలు తీస్తూ రాక్షసానందం పొందినట్లు బాధితుడి కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు.రాధేశ్యామ్ చౌదరి నేషనల్ బేరింగ్స్ కంపెనీ లిమిటెడ్‌లో మోటార్ మెకానిక్. శుక్రవారం తెల్లవారు జామున విధులు నిమిత్తం ఇంటి నుంచి కంపెనీకి తన బైక్‌పై బయలు దేరాడు. ఎల్పీజీ ట్యాంకర్‌ను, ఓ ట్రక్ ఢీకొట్టే సమయంలో రాధేశ్యామ్ అక్కడే ఉన్నారు. మంటల్లో చిక్కుకున్నారు. తనని తాను రక్షించుకునేందుకు 600 మీటర్లు పరుగులు తీశారు. అనంతరం కుప్పుకూలాడు. కొద్ది సేపటికి స్థానికులు రాధేశ్యామ్ చౌదరి సోదరుడు అఖేరామ్కు ఫోన్ చేసి సమాచారం అందించారు. రాధేశ్యామ్ అగ్ని ప్రమాదానికి గురయ్యాడని, వెంటనే హీరాపురా బస్ టెర్మినల్‌కు రావాలని కోరాడు. దీంతో భయాందోళనకు గురైన అఖేరామ్ ఘటనా స్థలానికి చేరుకున్నాడు. ఆ సమయంలో ఏం జరిగిందో కళ్లకు కట్టినట్లు మీడియాకు వివరించారు. ‘నా సోదరుడు తీవ్రంగా కాలిన గాయాలతో రోడ్డుపై ఆపస్మారస్థితిలో కనిపించాడు. పేలుడు జరిగిన ప్రదేశం నుంచి సుమారు 600 మీటర్లు పరిగెత్తినట్లు స్థానికులు చెప్పారు. తనని కాపాడాలని ఆర్తనాదాలు చేశారని, సాయం కోసం అర్దిస్తే ఒక్కరూ ముందుకు రాలేదని,బదులుగా చాలా మంది వీడియోలు తీశాడని విలపించారు. రాధేశ్యామ్‌ను అత్యవసర చికిత్స కోసం ఆస్పత్రికి తరలించేందుకు అంబులెన్స్ రాకకోసం ఎదురు చూశాం. కానీ రాలేదు. దీంతో కారులో నా సోదరుణ్ని జైపూర్‌లోని సవాయ్ మాన్ సింగ్ ఆస్పత్రికి తరలించాం. అతను బ్రతుకుతాడనే నమ్మకం ఉంది. కానీ 85 శాతం కాలిన గాయాలు మరింత ఇబ్బంది పడుతున్నట్లు అఖేరామ్ కన్నీటి పర్యంతరమయ్యారు. -
విశాఖ–ఖరగ్‌పూర్ మధ్య హైవే
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మరో గ్రీన్‌ఫీల్డ్ హైవే నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. విశాఖపట్నం– ఖరగ్‌పూర్ (పశ్చిమ బెంగాల్) మధ్య గ్రీన్‌ఫీల్డ్ హైవే నిర్మించాలని కేంద్ర జాతీయ రహదారుల శాఖ నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్‌ను అనుసంధానిస్తూ ఈ గ్రీన్‌ఫీల్డ్ హైవేను నిర్మించనున్నారు. దీనికోసం సమగ్ర ప్రాజెక్ట్ నివేదిక (డీపీఆర్) రూపొందించేందుకు జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ (ఎన్హెచ్ఏఐ) టెండర్లు పిలిచింది. కేంద్ర ప్రభుత్వం గతి శక్తి ప్రాజెక్ట్‌లో భాగంగా దీనిని నిర్మించనుంది. గ్రీన్‌ఫీల్డ్ హైవే ప్రధాన అంశాలివీ⇒ తూర్పు, ఈశాన్య రాష్ట్రాల మధ్య సరుకు రవాణాను వేగవంతం చేయడం ద్వారా లాజిస్టిక్ రంగ అభివృద్ధి కోసం ఈ హైవేను నిర్మించనున్నారు. ⇒ విశాఖపట్నం– ఖరగ్‌పూర్ మధ్య 783 కి.మీ. మేర ఆరు లేన్లుగా దీనిని నిర్మిస్తారు.⇒ నిర్మాణం పూర్తయితే విశాఖపట్నం నుంచి ఖరగ్‌పూర్‌కు 8 గంటల్లోనే చేరుకునే అవకాశం.⇒ విశాఖపట్నం, భావనపాడు, గోపాల్పూర్, కేంద్ర పారా పోర్టులను ఈ హైవే అనుసంధానిస్తుంది.⇒ విశాఖపట్నం నుంచి ఖుర్దా రోడ్ ( ఒడిశా) వరకు ఒక ప్యాకేజీ, ఖుర్దా రోడ్ నుంచి ఖరగ్‌పూర్ వరకు మరో ప్యాకేజీ కింద ఈ ప్రాజెక్ట్ చేపడతారు.⇒ డీపీఆర్ రూపొందించేందుకు టెండర్లు పిలవగా.. 10 సంస్థలు బిడ్లు దాఖలు చేశాయి. డిసెంబర్ చివరి వారానికి ఎన్హెచ్ఏఐ కన్సల్టెన్సీని ఖరారు చేయనుంది. ⇒ 2025 జూన్ నాటికి టెండర్ల ప్రక్రియ పూర్తిచేసి పనులు ప్రారంభిస్తారు.⇒ ఏడాదిన్నరలో గ్రీన్‌ఫీల్డ్ హైవే నిర్మాణం పూర్తి చేయాలన్నది ఎన్హెచ్ఏఐ లక్ష్యం. -
హైవేపై సూట్‌కేసులో మహిళ మృతదేహాం.. ఒంటి నిండా గాయాలు
రోడ్డు మీద ఓ సూట్‌కేసులో మహిళ మృతదేహం లభ్యమవ్వడం కలకలం రేపుతోంది. ఉత్తరప్రదేశ్‌లోని హాపూర్ జిల్లాలో ఈ ఘటన వెలుగుచూసింది. ఢిల్లీ- లక్నో జాతీయ రహదారి సర్వీస్ రోడ్డుపై శనివారం ఉదయం రెడ్ కలర్ సూట్‌కేసు ఉండటాన్ని ప్రయాణికులు గమనించి పోలీసులు సమాచారం అందించారు. వారు ఘటనా స్థలానికి చేరుకొని సూట్‌కేసును తెరిచి చూడగా అందులో ఓ మహిళ మృతదేహం కనుగొన్నారు. ఆమె శరీరమంతా గాయాల గుర్తులు ఉ్నట్లు గుర్తించారు. మహిళ వయసు 25 నుంచి 30 ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ఫోరెన్సిక్ నిపుణులతో కలిసి పోలీసు బృందం విచారణ చేపట్టారు. సూట్‌కేస్ నుంచి మహిళ మృతదేహాన్ని బయటకు తీశారు. అధికారులు సూట్‌కేస్‌ను క్షుణ్ణంగా పరిశీలించగా అందులో కొన్ని దుస్తులు కూడా ఉన్నాయి. అయితే మహిళ ఒంటిపై ఉన్న గాయాలు గమనిస్తే ఆమె మరణించి ఒక రోజు అయి ఉండవచ్చని ఎస్సీపీ వినీత్ భట్నాగర్ తెలిపారు. మహిళ ఎవరు? ఆమె మరణానికి గల కారణాలు తెలుసుకునేందుకు సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నట్లు చెప్పారు. -
హైదరాబాద్-బెంగళూరు హైవేపై భారీగా వరద
సాక్షి, అనంతపురం: ఉమ్మడి అనంతపురంలో భారీ వర్షాలు ముంచెత్తాయి. అనంతపురం, పెనుకొండ, ధర్మవరం, రాప్తాడులో కురిసిన వర్షానికి.. వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. పండమేరు వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. అనంతపురం పట్టణంలోని పలు శివారు కాలనీలు నీటిలో చిక్కుకున్నాయి.వరదలో ఇళ్లు మునిగిపోగా ఆటోలు, బైక్‌లు కొట్టుకుపోయాయి. ఇళ్లలోకి వరదనీరు చేరడంతో కాలనీ వాసులను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. వరదకు సామాగ్రి, నిత్యవసర సరుకులు కొట్టుకుపోవడంతో బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.వరదనీటితో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. హైదరాబాద్- బెంగళూరు జాతీయ రహదారిపై భారీగా వరద నీరు చేరింది. వరదలో బస్సులు, లారీలు, కారులు నిలిచిపోయాయి. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. -
అత్యంత అందమైన రహదారి 'రోడ్ టు హెవెన్'..!
అత్యంత సుందరమైన ప్రకృతి దృశ్యాలకు భారతదేశం నిలయం. ఏ ప్రదేశానికైన సదరాగా వెళ్లే..అక్కడ పేరు గాంచిని జలపాతాలు, ప్రకృతి తదితరాలు ఆకర్షణీయంగా ఉంటాయి. అవేగాక ఇంకేమైన ప్రసిద్ధిగాంచిన ఉంటే చూసి అబ్బురపడతాం. అలా కాకుండా పయనించే మార్గమే అత్యంత రమణీయంగా ఉండే రహదారి గురించి విన్నారా. ఔను మీరు వింటుంది నిజమే..ఈ దారిలో నుంచి పయనిస్తే స్వర్గంలో విహరిస్తున్నంత ఫీల్ కలుగుతుందట. ఇంతకీ ఆ రహదారి ఎక్కడంటే..గుజరాత్‌లోని కచ్‌లో ఉన్న రహదారిని రోడ్ టు హెవెన్‌గా పిలుస్తారు. కచ్ రాజధాని భుజ్ నుంచి ధోలావిరాకు దూరం 240 కిలోమీటర్లు. దీన్ని తగ్గించడానికి 2019లో ఖవ్దానుంచి ధోలవీరాను కలుపుతూ రాన్ రహదారిని ప్రారంభించారు. ఈ 30 కిలో మీటర్ల విస్తీరణ 2024లో ప్రారంభించారు. సరిగ్గా జీ20 సమ్మిట్ సమయానికి ప్రారంభమయ్యింది. ఇది హరప్పా నాగరికత అవశేషాలకు నిలయం. అలాంటి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ ఖవ్దా నుంచి దోలవీర వరకు వన్ వేల లేన్ ఈ రహదారి. దీన్ని డ్రోన్ సాయంతో చూస్తే భారతదేశంలో ది బెస్ట్ రోడ్డు రహదారి ఇదే అనిపిస్తుంది. ఈ రహదారి ఘదులి నుంచి సంతాల్‌పూర్ వరకు 278 కి.మీ పొడవైన జాతీయ రహదారిలో భాగం. తెల్లటి ఎడారి గుండే సాగే జర్నీ. ఈ రాన్ రహదారి ఒకప్పుడూ అరేబియా సముద్ర నిస్సార భాదం. భౌగోళిక మార్పుల వల్ల సముంద్రంతో సంబంధాన్ని మూసివేయడంతో అది నేడు తెల్లటి ఉప్పు ఏడారిగా కనిపిస్తోంది. ఈ మార్గం ధోలవిరాకు వెళ్లేలా ఎక్కువమంది ప్రయాణికులును ఆకర్షిస్తుంది. ఇక్కడ ఈ ధోలవీర అనేది రాన్ ఆఫ్ కచ్ పరిధిలో ఉన్న పురాతన హరప్పా నగరం. బాగా సంరక్షింపబడినఈ పురావస్తు ప్రదేశం సింధూలోయ నాగరికతను మను మందు ప్రస్ఫుటం అయ్యేలా హైలెట్ ఉంటుంది. ఇక్కడ నాటి చరిత్రకు ఆలవలం అయిన కోట గోడలు, ధాన్యాగారం, నివాస ప్రాంతాలు, ఈ పురాతన సంస్కృతి పట్టణ ప్రణాళిక,సామాజిక నిర్మాణంపై విలువైన అంతర్దృష్టులను అందిస్తుంది. ఈ ధోలవీరతో గుజరాత్ పురావస్తు పర్యాటకాన్ని ప్రోత్సహించాలని లక్ష్యంగా పెట్టుకుంది.(చదవండి: ఈసారి దసరా వెకేషన్‌కి కుట్రాలం టూర్..!) -
టమాటాలకు పోలీసు బందోబస్తు
పట్నా: ఉత్తరప్రదేశ్‌లోని ఒక వింత దృశ్యం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రోడ్డుపై చెల్లాచెదురుగా ఉన్న టమోటాలకు పోలీసు సిబ్బంది కాపలాగా నిలుచున్న ఆ దృశ్యం అందరినీ ఆలోచింపజేస్తోంది. టమాటాలు రోడ్డున పడ్డాయన్న సంగతి తెలుసుకున్న చుట్టుపక్కల వారు వాటిని ఎత్తుకెళ్లేందుకు హైవేపైకి గుంపులుగా చేరుకున్నారు. అయితే అక్కడున్న పోలీసులు వారిని తరిమికొట్టడంతో వారంతా మౌనంగా వెనుదిరిగారు.వివరాల్లోకి వెళితే ఒక లారీలో 1,800 కిలోల టమోటాలను ఢిల్లీకి తరలిస్తుండగా దారిలో ఆ లారీ ప్రమాదానికి గురైంది. దీంతో లారీలోని టమాటాలన్నీ రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయాయి. వెంటనే సదరు టమాటాల యజమాని టమాటాల భద్రత కోసం పోలీసులకు సమాచారం అందించారు. అర్జున్ అనే వ్యక్తి ఈ లారీని బెంగళూరు నుంచి ఢిల్లీకి తీసుకువెళుతున్నాడు.ఝాన్సీ-గ్వాలియర్ హైవేలోని సిప్రి బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో రాత్రి 12 గంటల సమయంలో లారీ అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో లారీ వెనుకే స్కూటీపై వస్తున్న ఒక మహిళకు గాయాలయ్యాయి. స్థానికులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. టమాటాలు ఎవరూ ఎత్తుకెళ్లకుండా చూసేందుకు ముగ్గురు పోలీసులు ఘటనా స్థలంలో కాపలాగా నిలిచారు. ఉదయాన్నే క్రేన్ రాగానే, లారీని సరిచేసి మళ్లీ టమాటాలను లారీలోకి ఎక్కించారు. అంత వరకూ పోలీసులు అక్కడే కాపలాగా ఉన్నారు. ప్రస్తుతం టమోటాల ధర మార్కెట్లో కిలో రూ.80 నుంచి రూ.120 వరకు ఉంది. పలు చోట్ల భారీ వర్షాలకు టమాటా పంట నాశనమైంది. దీంతో టమాటా ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. बंगलुरू से 1800 किलो टमाटर लेकर दिल्ली जा रहा ट्रक झांसी, यूपी में पलट गया। टमाटर की लूट न हो जाए, इसलिए रातभर पुलिस तैनात रही। मार्केट में टमाटर का रेट 80 से 120 रुपए किलो तक है।@RajuSha98211687 pic.twitter.com/g19jkVgOSs— Sachin Gupta (@SachinGuptaUP) October 18, 2024ఇది కూడా చదవండి: గాంధీజీ అడిగితే... బంగారు గాజులు ఇచ్చారు -
చికాగోలో నాట్స్ హైవే దత్తత కార్యక్రమం!
అమెరికాలో తెలుగువారికి కొండంత అండగా నిలుస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్.. తాజాగా తెలుగు వారిలో సామాజిక బాధ్యత పెంచేలా హైవే దత్తత కార్యక్రమాన్ని చేపట్టింది. నాట్స్ చికాగో విభాగం చేపట్టిన ఈ కార్యక్రమంలో నాట్స్ దత్తత తీసుకున్న హైవే (రూట్.59 స్ట్రీట్) లో పచ్చదనం, పరిశుభ్రత కార్యక్రమాన్ని నిర్వహించింది. హైవే పక్కన చెత్త చెదారాన్ని తొలగించడంతో పాటు అక్కడ పచ్చదనాన్ని పరిరక్షించే చర్యలు చేపట్టింది. అమెరికాలో విద్యార్ధుల్లో సేవా భావాన్ని పెంచేందుకు హైవే దత్తత లాంటి కార్యక్రమాలు చేపడుతుంటారు. నాట్స్ ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారిని అక్కడ ప్రభుత్వం కూడా గుర్తిస్తుంది. విద్యార్థుల సేవా సమయానికి గుర్తింపు ఇస్తుంది. విద్యార్థి దశ నుంచే సేవ చేయాలనే సంకల్పాన్ని కలిగించేందుకు నాట్స్ చికాగోలో హైవే దత్తత కార్యక్రమాన్ని తీసుకుందని నాట్స్ అధ్యక్షుడు మదన్ పాములపాటి అన్నారు. ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పనిచేసిన విద్యార్ధులను, నాట్స్ సభ్యులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు.ఈ కార్యక్రమం విజయవంతం చేయడానికి కృషి చేసిన చికాగో చాప్టర్ సమన్వయకర్తలు నరేందర్ కడియాల, వీర తక్కెళ్లపాటి లను అందరూ ప్రశంసించారు. ఇంకా ఈ కార్యక్రమంలో చికాగో చాప్టర్ సభ్యులు హవిల మద్దెల, చంద్రిమ దాడి, చెన్నయ్య కంబల, పాండు చెంగలశెట్టి, అంజయ్య వేలూరు, వినోత్ కన్నన్, దివాకర్ ప్రతాపుల మరియు ఇతర చాప్టర్ సభ్యులు తదితరులు కీలక పాత్ర పోషించారు. నాట్స్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ శ్రీనివాస్ పిడికిటి, ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు ఆర్కే బలినేని, హరీష్ జమ్ముల, ఎమాన్యుయేల్ నీలాతో పాటు నాట్స్ బోర్డు మాజీ సభ్యులు మూర్తి కొప్పాక, శ్రీని అరసాడ, శ్రీనివాస్ బోపన్నలు వాలంటీర్లకు విలువైన సూచనలు ఇచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. సామాజిక బాధ్యతను పెంచే అడాప్ట్ ఏ హైవే కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి నాట్స్ బోర్డ్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.(చదవండి: సివిల్ సర్వీసెస్ వ్రాసే పేద విద్యార్ధులకు నాట్స్ చేయూత!) -
హైదరాబాద్-విజయవాడ మధ్య నిలిచిన రాకపోకలు
సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో ఎడతెరిపిలేకుండా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. దీంతో తెలంగాణ- ఆంధ్రప్రదేశ్ మధ్య వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. నందిగామ మండలం ఐతవరం వద్ద 65వ జాతీయ రహదారిపై వరద నీరు భారీగా చేరడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. హైదరాబాద్, విజయవాడ హైవేలో వచ్చేవారు తప్పనిసరిగా వరద ఉధృతిని గమనించి ప్రయాణించాలని అధికారులు సూచించారు.తెలంగాణ -ఏపీ సరిహద్దు రామాపురం వద్ద చిమిర్యాల వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. నల్లబండగూడెం వద్ద జాతీయ రహదారిపైకి నీరు చేరింది. దీంతో అంతర్రాష్ట్ర చెక్‌పోస్టు వద్ద భారీగా వాహనాలు నిలిచిపోయాయి.సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం రామచంద్రాపురం వద్ద సాగర్ ఎడమ కాలువకు భారీ గండి పడింది. దాదాపు యాభై మీటర్ల మేర గండి పడటంతో వేల క్యూసెక్కుల నీరు వృధాగా పోతోంది. పంటల పొలాలు మునిగిపోయాయి. గండి పడ్డా కూడా ఘటనా స్థలానికి ఇరిగేషన్ అధికారులు రాలేదు. పలుచోట్ల సాగర్ ఎడమ లైనింగ్ దెబ్బతింది.గతంలోనే లైనింగ్, సాగర్ ఆధునికీకరణ కోసం వేల కోట్ల రూపాయల కేటాయింపు జరిగింది. కాంట్రాక్టర్లు తూతూ మంత్రంగా లైనింగ్ చేసి చేతులు దులుపుకున్నారు. పలుచోట్ల గండ్లు పడే ప్రమాదం ఉందని గతంలో అనేకసార్లు సాక్షి మీడియా హెచ్చరించింది. అయినా కూడా అధికారుల్లో చలనం లేదు. ఫలితంగా నడిగూడెం మండలంలో భారీ గండి పడింది. -
చార్ధామ్ యాత్రకు అడుగడుగునా ఆటంకాలు
ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాల కారణంగా చార్ధామ్ యాత్రకు పలు ఆటంకాలు ఏర్పడుతున్నాయి. ఈరోజు (శనివారం) ఉదయం కురిసిన వర్షం కారణంగా వివిధ చోట్ల కొండచరియలు విరిపడటంతో బద్రీనాథ్ హైవే మూసుకుపోయింది. ఎన్‌హెచ్, బీఆర్ఓ బృందాలు ప్రస్తుతం రోడ్డును క్లియర్ చేసే పనులు చేపడుతున్నాయి.చమోలి- నందప్రయాగ్ మధ్య మూడు ప్రదేశాలలో బద్రీనాథ్ హైవే మూసుకుపోయింది. చోప్టా మోటర్‌వేపై గోడ కూలిపోవడంతో భారీ వాహన రాకపోకలు నిలిచిపోయాయి. నందప్రయాగ్ సమీపంలో రహదారి కూడా మూసుకపోవడంతో 700 మంది బద్రీనాథ్ యాత్రికులు చమోలి, పిపల్కోటి, నందప్రయాగ్, కర్ణప్రయాగ్, గౌచర్ మరియు ఇతర ప్రాంతాలలో చిక్కుకుపోయారు. వీరికి అధికారులు బిస్కెట్లు, తాగునీరు అందించారు.నంద్‌ప్రయాగ్‌లో హైవే మూసుకుపోయిన కారణంగా, కౌటియల్సైన్ నందప్రయాగ్ మోటార్ రోడ్డు గుండా వాహనాలు వెళ్లాయి. సోన్లా సమీపంలో భారీగా బండరాళ్లు పడటంతో పలు వాహనాలు దెబ్బతిన్నాయి. భారీ వర్షాల కారణంగా రిషికేశ్-బద్రీనాథ్ హైవేలో రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. వందల సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. ఎన్‌హెచ్ బృందం జేసీబీతో మట్టిని తొలగించే పనులు చేపడుతోంది. -
హైవే ఎక్కితే టోల్!
సాక్షి, హైదరాబాద్: హైవే మీద కాస్త దూరమే ప్రయాణించినా ఇకపై సదరు వాహనం సంబంధిత ఖాతా నుంచి టోల్ రుసుము కట్ కానుంది. ప్రస్తుతం టోల్ ప్లాజాల్లోంచి వాహనం వెళ్తేనే టోల్ చెల్లించాల్సి వస్తోంది. టోల్ బూత్ వచ్చేలోపు రోడ్డు దిగిపోతే చెల్లించాల్సిన అవసరం ఉండటం లేదు. ఇకపై అలా కాకుండా హైవే ఎక్కితే చాలు రుసుము చెల్లించేలా కేంద్ర ప్రభుత్వం కొత్త విధానానికి శ్రీకారం చుట్టనుంది. వచ్చే సంవత్సరానికి ప్రాథమిక స్థాయిలో ఇది అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత దశల వారీగా పూర్తిస్థాయిలో దీన్ని అమలు చేయనున్నారు. సెన్సార్లు, ఫాస్టాగ్‌లకు చెల్లు ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఫాస్టాగ్‌తో అనుసంధానమై టోల్ వసూలు చేస్తున్నారు. గతంలో మాన్యువల్‌గా వసూలు చేసేందుకు ఏర్పాటు చేసుకున్న టోల్ ప్లాజాలనే వినియోగించుకుంటున్నారు. అక్కడి సిబ్బందికి నిర్ధారిత రుసుము చెల్లించి రశీదు పొందే పద్ధతి తొలగించి, సెన్సార్లు ఫాస్టాగ్ స్టిక్కర్‌ను రీడ్ చేయటం ద్వారా ఖాతా నుంచి డబ్బులు తీసుకునే విధానాన్ని అమలు చేస్తున్నారు. ఈ ఫాస్టాగ్ ఖాతాను వాడకాన్ని బట్టి ఎప్పటికప్పుడు టాప్ అప్ చేసుకోవల్సి ఉంటుంది.కాగా దీనికి పూర్తి భిన్నంగా కొత్త విధానాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టంతో అనుసంధానమయ్యే కొత్త టోల్ వ్యవస్థను తీసుకొస్తోంది. టోల్ బూత్ అవసరం లేకుండా ఇది పనిచేస్తుంది. వాహనాలు టోల్ రోడ్ల మీద తిరిగిన దూరాన్ని ఉపగ్రహ సాయంతో గుర్తించి, ఆ మేరకు టోల్‌ను లెక్కిస్తుంది. ఆ వ్యవస్థతో అనుసంధానించిన ఖాతా నుంచి అంతమేర టోల్ రుసుము డిడక్ట్ అవుతుంది. వాహనాల బారులు ఉండవు గతంలో మాన్యువల్‌గా టోల్ వసూలు చేసినప్పుడు రద్దీ అధికంగా ఉండే సమయంలో టోల్ ప్లాజాల వద్ద వాహనాలు కిలోమీటర్ల మేర బారులు తీరాల్సి వచ్చేది. దీన్ని నివారించేందుకు కేంద్రం ఫాస్టాగ్ విధానాన్ని తెచి్చంది. వాహనం టోల్ బూత్‌లోకి ప్రవేశిస్తుండగానే సెన్సార్లు ఫాస్టాగ్‌ను రీడ్ చేసి టోల్‌ను డిడక్ట్ చేస్తాయి. ఈ పద్ధతిలో వాహనాల బారులు ఉండవని భావించారు.కానీ సెన్సార్లు సరిగా పనిచేయకపోవడం, ఇతరత్రా కారణాలతో రద్దీ సమయాల్లో ఇప్పటికీ టోల్ ప్లాజాల వద్ద వాహనాలు బారులు తీరుతూనే ఉన్నాయి. దీనిని దృష్టిలో ఉంచుకునే గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టంను కేంద్రం తెరపైకి తెస్తోంది. ఈ పద్ధతిలో వాహనం ప్రయాణిస్తున్న సమయంలోనే క్షణాల్లో టోల్ లెక్కించడం, డబ్బులు డిడక్ట్ కావడం జరుగుతుంది. దీంతోపాటు అసలు టోల్‌బూత్‌లే ఉండకపోవడంతో ఎక్కడా వాహనాలు వేచి చూడాల్సిన పరిస్థితి రాదు. ప్రభుత్వానికి 3 రెట్లు పెరగనున్న ఆదాయం ప్రస్తుతం దేశవ్యాప్తంగా జాతీయ రహదారులపై రూ.40 వేల కోట్ల మేర టోల్ వసూలవుతోంది. ఈ ఆదాయం పెరగనుంది. ఇప్పటివరకు టోల్ గేట్లు వచ్చేలోపే దారి మళ్లి వెళ్లే వాహనాల వల్ల ఆదాయం రావటం లేదు. కొత్త విధానంతో టోల్ రోడ్డుపై వాహనాలు స్వల్ప నిడివిలో ప్రయాణించినా టోల్ వసూలు చేసే అవకాశం ఉండటంతో టోల్ ఆదాయం కనీసం మూడు రెట్లు పెరుగుతుందని అంచనా. పైగా టోల్ బూత్‌ల నిర్వహణ భారం ఉండదు. ఇలా పనిచేస్తుంది.. టోల్ రోడ్లను శాటిలైట్లు గుర్తించేందుకు వీలుగా ఆయా మార్గాల్లో ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేస్తారు. ఆ రోడ్లపై ప్రత్యేక కెమెరాలు కూడా ఉంటాయి. ఇవి ఉపగ్రహంతో అనుసంధానమై పనిచేస్తాయి. ఇక వాహనాల్లో ఆన్‌బోర్డ్ యూనిట్లను ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. ఇవి జీపీఎస్‌తో అనుసంధానమై పనిచేస్తాయి. ఇవన్నీ పరస్పరం సమన్వయం చేసుకుంటూ, వాహనం టోల్ రోడ్డు మీద ఎంత దూరం ప్రయాణించిందో కచి్చతంగా నిర్ధారిస్తాయి.వాహనదారు నిర్ధారించిన బ్యాంకు ఖాతాతో టోల్ వసూలు వ్యవస్థ అనుసంధానమై ఉంటుంది. ఏ ప్రాంతంలో టోల్ రోడ్డుపైకి వాహనం చేరింది, ఏ ప్రాంతంలో అది హైవే దిగిందీ అన్న విషయాన్ని క్షణాల్లో నమోదు చేసి టోల్‌ను నిర్ధారించి, సంబంధిత ఖాతా నుంచి వసూలు చేసుకుంటుంది. ఈ వ్యవస్థకు సంబంధించి ఇటీవలే కేంద్ర ప్రభుత్వం అంతర్జాతీయ స్థాయిలో ఆసక్తి వ్యక్తీకరణ నోటిఫికేషన్ జారీ చేసింది.మైసూరు–బెంగళూరు ఎక్స్‌ప్రెస్ వే, హర్యానా లోని పానిపట్–హిస్సార్ జాతీయ రహదారులపై ప్రయోగాత్మకంగా దీన్ని పరిశీలిస్తోంది. మరో ఏడాది కాలంలో దేశవ్యాప్తంగా దీన్ని ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. కానీ దీనికి మరింత సమయం పట్టే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. -
విరిగిపడిన కొండచరియలు.. గంగోత్రి హైవే బంద్
ఉత్తరాఖండ్‌లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పలుచోట్లు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా కొండచరియలు విరిగిపడుతూ జనాలను భయకంపితులను చేస్తున్నాయి. తాజాగా ఉత్తరకాశీలోని గంగోత్రి జాతీయ రహదారిపై కొండచరియలు విరిగిపడటంతో రహదారిని మూసివేశారు.దీంతో ఉత్తరకాశీలోని మనేరి, భట్వాడిల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. బార్డర్ రోడ్డు ఆర్గనైజేషన్ (బీఆర్ఓ) బృందం ఈ హైవేపై పడిన రాళ్లు, శిధిలాలను తొలగించేపని చేపట్టింది. వీలైనంత త్వరగా రహదారిని క్లియర్ చేసేందుకు ప్రయత్నిస్తోంది. మరోవైపు ఉత్తరాఖండ్‌లోని అల్మోరా, బాగేశ్వర్, చమోలీ, చంపావత్, గర్వాల్, హరిద్వార్, నైనిటాల్, పిథోరాఘర్, రుద్రప్రయాగ్, తెహ్రీ గర్వాల్, ఉధమ్ సింగ్ నగర్ జిల్లాల్లో ఆదివారం కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.వర్షాకాలం ప్రారంభమైనప్పటి నుంచి ఉత్తరాఖండ్‌లోని పలుచోట్ల కొండచరియలు విరిగిపడుతున్నాయి. ఆదివారం తెల్లవారుజామున కేదార్‌నాథ్‌లోని గౌరీకుండ్ సమీపంలో రాళ్లు పడడంతో ముగ్గురు మృతి చెందగా, ఇద్దరు గాయపడ్డారు. దీనికిముందు జూలై ప్రారంభంలో బద్రీనాథ్ మార్గంలో కొండచరియలు విరిగిపడిన ఉదంతాలు చోటుచేసుకున్నాయి. దీంతో అప్పట్లో బద్రీనాథ్ మార్గాన్ని కూడా మూసివేశారు. అయితే బీఆర్ఓ బృందం శిధిలాలు, రాళ్లను తొలగించడంతో ఆ రహదారిని తిరిగి తెరిచారు. गंगोत्री नेशनल हाईवे भूस्खलन के कारण बंद, रास्ते से मलबा हटाने में जुटी BRO की टीम#Gangotri | #NationalHighway | #Landslide | #Uttarakhand pic.twitter.com/GmtrvQ72iF— NDTV India (@ndtvindia) July 21, 2024 -
పాతాళగంగ లైన్ క్లియర్.. తెరుచుకోని జోషిమఠ్ రహదారి
ఉత్తరాఖండ్‌లోని చమోలి జిల్లాలోని బద్రీనాథ్ జాతీయ రహదారిపై రెండు భారీ కొండచరియలు విరిగిపడ్డాయి. వీటిలో ఒకటి బద్రీనాథ్ జాతీయ రహదారిలోని జోషిమఠ్‌లో, మరొకటి పాతాళగంగ ప్రాంతంలో చోటుచేసుకున్నాయి. దీంతో ఈ రెండు మార్గాల్లో వాహనాలు రాకపోకలను నిలిపివేశారు. అయితే తాజాగా చార్ధామ్ యాత్రికుల కోసం పాతాళగంగ రహదారిని క్లియర్ చేశారు. దీంతో 40 గంటల తరువాత ఈ రహదారిలో వెళ్లేవారికి ఉపశమనం లభించినట్లయ్యింది. జోషిమఠ్ సమీపంలో కొండచరియలు విరిగిపడిన రహదారి ప్రాంతాన్ని ఇంకా క్లియర్ చేయలేదు.48 గంటలు గడిచినా జోషిమఠ్-బద్రీనాథ్ హైవేలో ఇంకా వాహనాల రాకపోకలకు అనుమతి ఇవ్వలేదు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జోషిమఠ్‌లో కొండచరియలు విరిగిపడటంతో, బద్రీనాథ్, జోషిమఠ్, నీతి, మన, తపోవన్, మలారి, లత, రాయిని, పాండుకేశ్వర్, హేమకుండ్ సాహిబ్ మొదలైన ప్రాంతాల మధ్య కనెక్టివిటీ కోల్పోయింది. ఇలాంటి పరిస్థితుల్లో చార్ధామ్ యాత్రికులు పలు అవస్థలు పడుతున్నారు.రెండు వేల మందికి పైగా యాత్రికులు బద్రీనాథ్ హైవేపై చిక్కుకుపోయారు. బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ అధికారులు జోషిమఠ్‌లో రహదారిని క్లియర్ చేయడంలో బిజీగా ఉన్నారు. వర్షాల కారణంగా ఉత్తరాఖండ్‌లో 260కి పైగా రోడ్లు మూసుకుపోయాయి. వాటిపై పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని తొలగించి, రోడ్లను శుభ్రం చేసేందుకు 241 జేసీబీ యంత్రాలను ఏర్పాటు చేశారు. -
మంచిమాట చెప్పిన నితిన్ గడ్కరీ: రోడ్లు బాగుంటేనే..
టోల్ గేట్ వద్ద వేచి ఉండాల్సిన సమయాన్ని తగ్గించడానికి ఫాస్ట్‌ట్యాగ్ విధానం ప్రవేశపెట్టారు. ఈ విధానానికి కేంద్రం త్వరలోనే మంగళం పాడనుంది. ఫాస్ట్‌ట్యాగ్ స్థానంలో శాటిలైట్ బేస్డ్ టోల్ కలెక్షన్ అందుబాటులోకి రానుంది. ఈ విషయాన్ని ఇప్పటికే కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు. అంతే కాకుండా.. రోడ్లు సరిగా లేకుంటే హైవే ఏజెన్సీలు టోల్ వసూలు చేయకూడదని గడ్కరీ ఇటీవల స్పష్టం చేశారు.నాణ్యమైన సేవలు అందించని పక్షంలో మీరు టోల్ వసూలు చేయకూడదని గ్లోబల్ వర్క్‌షాపులో నితిన్ గడ్కరీ హైవే ఏజెన్సీలకు క్లారిటీ ఇచ్చారు. నాణ్యమైన రోడ్లు లేకుండానే టోల్ వసూలు చేస్తే.. ప్రభుత్వం మీద ప్రజలకు కోపం వస్తుంది. నాణ్యమైన సేవలను అందించినప్పుడే టోల్ వసూలు చేయాలని పేర్కొన్నారు.నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా.. ప్రస్తుతం ఉన్న ఫాస్ట్‌ట్యాగ్ వ్యవస్థను గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ బేస్డ్ ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్ వ్యవస్థను అమలు చేయాలని యోచిస్తోంది. ప్రారంభంలో ఈ విధానం కొంత దూరానికి మాత్రమే పరిమితం చేసి టెస్ట్ చేయడం జరుగుతుంది. ఆ తరువాత అన్ని హైవేల మీద ఇదే వ్యవస్థను అమలు చేసే అవకాశం ఉందని సమాచారం. -
గ్రీన్‌ఫీల్డ్ హైవే పనులపై టీడీపీ నేత దాదాగిరి
సాక్షి ప్రతినిధి, కడప: అధికారం వచ్చిందే తడవుగా టీడీపీ నేతలు పేట్రేగిపోతున్నారు. అభివృద్ధి పనుల్లోనూ అందినకాడికి దండుకుంటున్నారు. పనులు చేస్తోంది.. జాతీయ స్థాయి సంస్థలైనా సరే తమకేంటన్నట్టు చెలరేగుతున్నారు. తాజాగా వివిధ రాష్ట్రాల్లో కాంట్రాక్టు పనులు చేస్తున్న దిలీప్ దిల్కాన్ సంస్థకు తాజాగా ఇలాంటి దుస్థితే వైఎస్సార్ జిల్లాలో ఎదురైంది. టీడీపీ నాయకుల దాదాగిరితో రోడ్డు పనులు నిలిపేయాల్సిన పరిస్థితి ఉత్పన్నమైంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కొడికొండ చెక్‌పోస్టు నుంచి విజయవాడకు గ్రీన్‌ఫీల్డ్ హైవే రోడ్డు మంజూరైంది. అందులో మూడు ప్యాకేజీల పనులు దిలీప్ దిల్కాన్ సంస్థకు దక్కాయి. మరో మూడు ప్యాకేజీలు మెగా కంపెనీకి లభించాయి. ఈ క్రమంలో వైఎస్సార్ జిల్లా పులివెందుల నియోజకవర్గంలో రూ.700 కోట్లతో ఒక ప్యాకేజీ పనులను దిలీప్ దిల్కాన్ సంస్థ చేపట్టింది. ఇంతకాలం ఆ పనులు శరవేగంగా కొనసాగించారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న దౌర్జన్యకర పరిస్థితులు ఆ సంస్థకు కూడా ఎదురయ్యాయి. వేల్పుల గ్రామం వద్ద చేపడుతున్న పనుల వద్దకు వేముల మండలంలో క్రియాశీలకంగా వ్యవహరించే టీడీపీ నేత వెళ్లారు. పనులు నిలిపేయాలని, లేదంటే వెంటనే మీ జీఎంను వచ్చి కలవమని చెప్పండంటూ హుకుం జారీ చేశారు. దీంతో ఆ సంస్థ పర్సనల్ ఇన్చార్జి వచ్చి ఆ నాయకుడితో సమావేశమయ్యారు. ఈ మొత్తం వ్యవహారం మూడు రోజుల క్రితం నడిచినట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా నియోజకవర్గ టీడీపీ కీలక నాయకుడితో సదరు నేత ఫోన్లో మాట్లాడించారు. మీ పనులు సజావుగా కొనసాగాలంటే రూ.30 కోట్లు తనకు చెల్లించాలని ఆ కీలక నాయకుడు డిమాండ్ చేశారు. ‘ఎన్నికల్లో ఖర్చులు పెట్టుకున్నాం, మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. తనకు రూ.30 కోట్లు చెల్లిస్తేనే పనులు కొనసాగుతాయి’ అని తేల్చిచెప్పారు. మూడు రోజుల్లోగా మీ నిర్ణయం ఏంటో చెప్పాలని వేముల మండల నాయకుడు సంస్థ ప్రతినిధిని హెచ్చరించాడు.పనులను నిలిపేయించిన టీడీపీ నేతలు..దిలీప్ దిల్కాన్ సంస్థకు చెందిన పనులను బుధవారం సాయంత్రం వేముల మండలం వేల్పుల గ్రామం వద్ద టీడీపీ నేతలు నిలిపేశారు. ప్రశ్నించిన సంస్థ ప్రతినిధులకు మీకు ఇచ్చిన గడువు ముగిసిందని, మీ నుంచి ఎలాంటి నిర్ణయం రాలేదు కాబట్టే పనులు నిలిపేస్తున్నామని దాదాగిరి చేశారు. తమకు రూ.30 కోట్లు ఇచ్చేవరకు పనులు చేపట్టవద్దని హెచ్చరించారు. జిల్లాలో ఇదివరకు ఇలాంటి ఘటన చక్రాయపేట కేంద్రంగా ఓ సంస్థకు ఉత్పన్నమైతే అప్పటి వైఎస్సార్సీపీ ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. కాంట్రాక్టు సంస్థలకు ఆటంకాలు లేకుండా సత్వర చర్యలు చేపట్టింది.బెదిరింపులతో టీడీపీ నేతల స్వైరవిహారం.. టీడీపీ అధికారంలోకి రావడం ఆలస్యం వ్యక్తుల ఆస్తులు, వ్యాపారాలను చేజిక్కించుకునేందుకు ఆ పార్టీ నేతలు బరితెగిస్తున్నారు. వైఎస్సార్ జిల్లా కేంద్రం కడపలో ఓ వ్యాపారికి చెందిన రెండు మద్యం బార్లను తమకు అప్పగించాలని టీడీపీ నేతలు బెదిరించారు. అలాగే వేంపల్లె కేంద్రంగా పోటాపోటీగా పొక్లెయిన్లు పెట్టి టిప్పర్లతో ఇసుక తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. జిల్లావ్యాప్తంగా టీడీపీ నేతలు ఇసుక దోపిడీ చేస్తున్నా అధికార యంత్రాంగం ప్రేక్షక పాత్ర పోషిస్తోంది.ఆయా వ్యక్తులకు చెందిన ప్రైవేటు స్థలాలను సైతం కబ్జా చేస్తున్నారు. కోర్టులో ఉన్న వ్యవహారాల్లో సైతం తలదూర్చి సొంతం చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. పోలీసుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోతోంది. మునుపెన్నడూ ఇలాంటి అధ్వాన పరిస్థితులు చూడలేదని పాతతరం టీడీపీ నాయకులు సైతం వాపోతుండటం గమనార్హం. -
హైవేపై పెద్దపులిని ఢీకొన్న కారు
మర్రిపాడు/ఆత్మకూరు రూరల్: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం కదిరినాయుడుపల్లి సమీపంలో నెల్లూరు–ముంబయి జాతీయ రహదారిపైకి ఒక్కసారిగా పెద్దపులి రావడం కలకలం రేగింది. ఆ పులిని ఓ కారు ఢీకొనడం.. ఆగ్రహంతో పెద్దపులి తిరిగి ఆ కారుపై దాడి చేయడం సంచలనం సృష్టించింది. ఈ ఆకస్మిక ఘటనతో కారులో ప్రయాణిస్తున్నవారు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. కారులో ఉన్న వ్యక్తులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... బద్వేల్ నుంచి నెల్లూరుకు వెళ్తున్న ఓ కారుకు కదిరినాయుడుపల్లి సమీపంలో వెలిగొండ అటవీ ప్రాంతం వద్ద ఒక్కసారిగా పెద్దపులి అడ్డువచ్చింది.పెద్దపులిని కారు ఢీకొని కొద్దిదూరం ముందుకు దూసుకువెళ్లింది. దీంతో పెద్దపులికి కోపం వచ్చి వాహనం ముందు భాగంపై తన పంజాతో దాడి చేసింది. అనంతరం సమీపంలోని అటవీ ప్రాంతంలోకి వెళ్లిపోయింది. కారు డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో లోపల ఉన్నవారికి ప్రమాదం తప్పింది. కారు ముందుభాగం ధ్వంసమైంది. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు ఘటనాస్థలానికి వచ్చి వివరాలు సేకరించారు.పెద్దపులి కాలి ముద్రలు, కారు ఢీకొనడం వల్ల పులి గాయపడినట్లుగా ఆనవాలు కనుగొని ఉన్నతాధికారులకు సమాచారాన్ని అందించారు. అటవీశాఖ అధికారులు కదిరినాయుడుపల్లి సమీపంలోని అడవిలో గాలింపు చర్యలు చేపట్టారు. పెద్దపులి సంచారంతో కదిరినాయుడుపల్లి అటవీ ప్రాంతం సమీపంలోని పడమటినాయుడుపల్లి, చుంచులూరు తదితర గ్రామాల ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.శేషాచలం చేరిన పెద్దపులి!శ్రీశైలం–శేషాచలం మధ్య పెద్దపులుల కారిడార్ ఉంది. శ్రీశైలం–నాగార్జున సాగర్ అభయారణ్యం నుంచి శేషాచలం వరకు పులుల విస్తరణ కోసం అధికారులు పలు చర్యలు చేపట్టారు. అయితే, శేషాచలం వరకు పెద్దపులి వెళ్లిందా.. లేదా.. అని ఇప్పటికీ సంశయంగానే ఉండేది. ఆ అనుమానాలకు తెరదించుతూ శేషాచలం అటవీ ప్రాంతం వరకు పెద్దపులి చేరిందని కదిరి నాయునిపల్లె సమీపంలో సోమవారం జరిగిన ఘటనతో స్పష్టమైంది. -
జోషీమఠ్‌లో మరో విపత్తు.. స్థానికుల్లో ఆందోళన
ఉత్తరాఖండ్‌లోని జోషిమఠ్‌తో పాటు పరిసర ప్రాంతాల్లో భూమి కుంగుబాటు ఘటనను పూర్తిగా మరువకముందే మరో విపత్తు చోటుచేసుకుంది. తాజాగా జోషిమఠ్, బద్రీనాథ్ హైవే మధ్యలో అత్యంత లోతైన గొయ్యి ఏర్పడి స్థానికులను భయాందోళనలకు గురిచేస్తోంది. ఈ గొయ్యి మూడు అడుగుల వెడల్పు కలిగివుంది. సమాచారం అందుకున్న అధికారులు రంగంలోకి దిగి ఈ గుంతను పూడ్చారు. అయితే చాలాచోట్ల వాటంతట అవే ఇలాంటి గుంతలు ఏర్పడటం ఇక్కడి ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. గత సంవత్సరం జోషిమఠ్‌లో పలు చోట్ల భూమి కుంగిపోయింది.ఈ నేపధ్యంలో తక్షణం కొన్ని వందల కుటుంబాలవారిని ఇళ్లు ఖాళీ చేయించి, సురక్షిత ప్రాంతానికి తరలించారు. జోషిమఠ్‌లో భూమి కుంగిపోవడానికి కారణం ఇక్కడికి సమీపంలోని ప్రాజెక్టులేనని నిపుణులు తెలిపారు. తరుచూ ఇక్కడి భూమి కుంగిపోతున్నందున జోషిమఠ్‌ను మునిగిపోతున్న ప్రాంతంగా ప్రకటించారు. -
దేశవ్యాప్తంగా పెరిగిన టోల్ చార్జీలు..
-
Medak: రన్నింగ్ కారులో మంటలు.. దగ్ధమైన కారు
సాక్షి, మెదక్: మెదక్ జిల్లా జాతీయ రహదారిపై ఓ కారు అగ్నికి ఆహుతైంది. టేక్మాల్ మండలం బొడ్మట్ పల్లి వద్ద జాతీయ రహదారి 161పై వెళ్తున్న కారులో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. దీంతో నిమిషాల్లోనే కారు పూర్తిగా దగ్దమైంది. అయితే డ్రైవర్ అప్రమత్తతో పెను ప్రమాదం తప్పింది. ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. హైదరాబాద్ నుంచి నారాయణ్ ఖేడ్ వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. #A car coming from HYD to Narayankhed burntdown at Bodmatpalli of Medak district on Sunday morning alert driver stopped car on the road side and got other from the car all are safe.@Kalyan_TNIE @balaexpressTNIE @NewIndianXpress pic.twitter.com/ffifPUnHNc— Krishna.panugannti (@Krishna_TNIEsrd) May 5, 2024 -
హైవేపై పెరిగిన టోల్‌ఫీజు
కేతేపల్లి: హైదరాబాద్–విజయవాడ 65 నంబరు జాతీయ రహదారిపై టోల్గేట్ల వద్ద వాహనదారుల నుంచి వసూలు చేస్తున్న టోల్ ఫీజును రహదారి విస్తరణ కాంట్రాక్టు సంస్థ జీఎమ్మార్ యాజమా న్యం పెంచింది. ఒక్కో వాహనానికి ఒక వైపు, ఇరు వైపులా కలిపి రూ. 5నుంచి రూ. 40 వరకు, స్థాని కుల నెలవారీ పాస్‌ను రూ.330 నుంచి రూ.340 కి పెంచింది. యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండల ఆంథోల్ మైసమ్మ దేవాలయం నుంచి ఏపీలోని కృష్ణా జిల్లా చిల్లకల్లు వరకు గల 181.5 కి.మీ మేర రెండులేన్లుగా ఉన్న రహదారిని దాదాపు రూ.2000 కోట్ల వ్యయంతో 2012లో బీవోటీ పద్ధతిన జీఎమ్మార్ సంస్థ నాలుగు లేన్లుగా విస్తరించింది. ఈ విస్తరణ పనులకు అయిన వ్యయాన్ని రాబట్టుకునేందుకు 65 నంబరు జాతీయ రహదారిపై ఉమ్మడి నల్లగొండ జిల్లాలో చౌటుప్పల్ మండలం పంతంగి, కేతేపల్లి మండలం కొర్లపహాడ్, ఏపీలోని కృష్ణా జిల్లా చిల్లకల్లు వద్ద ఒకొక్కటి చొప్పున మూడు టోల్‌ప్లాజాలను జీఎమ్మార్ సంస్థ ఏర్పాటు చేసింది. వీటి ద్వారా 2012 నుంచి టోల్‌ఫీజు వసూళ్లను కాంట్రాక్టు సంస్థ ప్రారంభించింది. ఎన్హెచ్ఏఐ సూచించిన నిబంధనల మేరకు వార్షిక సవరణల పేరిట ఏడాదికి ఒకమారు వాహనాల నుంచి వసూలు చేస్తున్న టోల్‌ఫీజు ధరలను పెంచుకునే వెసులుబాటు జీఎమ్మార్ సంస్థకు ఎన్హెచ్ఏఐ కల్పించింది. ఆయా టోల్‌ప్లాజాల వద్ద ఈనెల 31(ఆదివారం) అర్ధరాత్రి 12 గంటల తర్వాత అంటే ఏప్రిల్ 1 నుంచి పెంచిన టోల్ ధరలు అమల్లోకి రానున్నాయి. ఏడాది కాలం పాటు ఇవే ధరలు అమల్లో ఉంటాయి. -
జమ్మూ- శ్రీనగర్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం
జమ్మూ: జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిపై శుక్రవారం(మార్చ్ 29) తెల్లవారుజామున ఘోర ప్రమాదం జరిగింది. రహదారిపై వెళుతున్న ట్యాక్సీ వాహనం రాంబన్ ప్రాంతానికి సమీపంలో అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో వాహనంలో ప్రయాణిస్తున్న వారిలో 10 మంది దాకా మృతి చెందినట్లు సమాచారం. ప్రమాద సమాచారం అందిన వెంటనే స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్(ఎస్డీఆర్ఎఫ్), సివిల్ క్విక్ రెస్పాన్స్ టీమ్(క్యూఆర్టీ) ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇదీ చదవండి.. ఘోర బస్సు ప్రమాదంలో 45 మంది దుర్మరణం -
సాగునీరు ఇవ్వకుంటే ఆత్మహత్యలే
మంథని: నీరు లేక కళ్లెదుటే పంటలు ఎండిపోతుంటే అన్నదాతలు అరిగోస పడుతున్నారు. ‘అధికార యంత్రాంగం స్పందించి ఇప్పటికైనా నీరు అందించి చేతికొచ్చే పంటలను కాపాడాలి.. లేదంటే మాకు చావుతప్ప మారోమార్గం లేదు’ అని ఆవేదన వ్యక్తం చేస్తూ పెద్దపల్లి జిల్లా మంథని – గోదావరిఖని ప్రధాన రహదారిపై మంగళవారం వేలాది మంది రైతులు రాస్తారోకో చేశారు. చేతుల్లో పురుగులమందు డబ్బాలు, వరి గంటలు పట్టుకొని రోడ్డుపై రోడ్డుపై బైఠాయించారు. గంట పాటు ఉండిపోయారు. వరి పొట్టదశకు చేరిందని, నీరు అందక పంట కళ్లముందే ఎండిపోతుంటే గుండెలు తరుక్కుపోతున్నాయని కన్నీటిపర్యంతమయ్యారు. కాలువ నీరే ఆధారంగా పంటలు సాగుచేస్తే ఎగువన ఉన్న కొందరు రైతులు మోటార్లు పెట్టి చివరి ఆయకట్టుకు సాగునీరు అందకుండా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్, నీటిపారుదల శాఖ అధికారుల నిర్లక్ష్యంతోనే ఈ దుస్థితి నెలకొందని ఆరోపించారు. ఆందోళన తీవ్రరూపం దాల్చడంతో రోడ్డుకు ఇరు వైపులా వందలాది వాహనాలు నిలిచిపోయాయి. ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. సమాచారం అందుకున్న మంథని సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సై వెంకటకృష్ణ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆందోళన విరమించాలని రైతులను కోరారు. నీటిపారుదల శాఖ ఈఈ బలరాం అక్కడకు చేరుకొని అక్రమంగా విద్యుత్ వినియోగించడంతోపాటు, కాలువలో విద్యుత్ మోటార్లు బిగిస్తున్న విషయంపై తమకు ఫిర్యాదు చేయాలన్నారు. విచా రణ జరిపి వాటిని తొలగించి చివరి ఆయకట్టుకు సాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారు. దీంతో రైతులు శాంతించారు. -
Pune:హోటల్లో దారుణం.. పాయింట్ బ్లాంక్‌లో కాల్చి హత్య
పుణె: మహారాష్ట్రలోని పుణె సమీపంలో దారుణం జరిగింది. పుణె-సోలాపూర్ నేషనల్ హైవే పక్కన ఉన్న ఒక రెస్టారెంట్లో అవినాష్ దాన్వే అనే వ్యక్తి తన స్నేహితులతో కలిసి కూర్చొని మాట్లాడుతున్నాడు. ఇంతలో అక్కడికి కస్టమర్లలా వచ్చిన ఇద్దరు వ్యక్తులు నేరుగా స్నేహితులతో కూర్చున్న దాన్వే వద్దకు వెళ్లి తలపై పాయింట్ బ్లాంక్‌లో తుపాకీ పెట్టి కాల్చారు. తలపై కాల్చగానే దాన్వే కిందపడిపోయాడు. అతని స్నేహితులు రెస్టారెంట్ నుంచి పారిపోయారు. ఇంతటితో ఆగకుండా మరో నలుగురైదుగురు దుండగులు రెస్టారెంట్ లోపలికి వచ్చి కాల్పులకు గురై పడిపోయిన దాన్వేను కత్తులతో విచక్షణారహితంగా పొడిచారు. ఈ దారుణ హత్య హోటల్ సీసీ టీవీ కెమెరాల్లో నమోదైంది. హత్యకు గల కారణాలు తెలియరాలేదని, నిందితుల కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు. ఇదీ చదవండి.. గుజరాత్ వర్సిటీలో విదేశీ విద్యార్థులపై దాడి -
యూపీలో రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబంలోని ఆరుగురు మృతి!
ఉత్తరప్రదేశ్‌లోని జౌన్పూర్ జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందగా, మరో ముగ్గురు గాయపడ్డారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం కోసం తరలించారు. గాయపడినవారు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మీడియాకు అందిన సమాచారం ప్రకారం గౌరబాద్‌షాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జౌన్పూర్-అజంగఢ్ హైవేపై ప్రసాద్ కెరకట్ కూడలి సమీపంలో శనివారం రాత్రి 2.30 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. బీహార్‌లోని సీతామర్హి నుంచి ప్రయాగ్‌రాజ్‌కు ఒకే కుటుంబానికి చెందిన తొమ్మిది మంది కారులో వెళ్తున్నారు. కారు జౌన్పూర్ నుంచి కెరకట్ వైపు మలుపు తిరిగిన వెంటనే ఎదురుగా వేగంగా వస్తున్న ట్రక్కు ఢీకొంది. స్థానికులు ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బీహార్‌లోని సీతామర్హికి చెందిన గజధర్ శర్మ తన కుమారుడు చందన్‌శర్మ పెళ్లి కోసం అమ్మాయిని చూసేందుకు తన కుటుంబంలోని తొమ్మిది మంది సభ్యులతో కలిసి ప్రయాగ్‌రాజ్ వెళ్తున్నారు. ఆయన కారు రాత్రి 2.30 గంటల ప్రాంతంలో ప్రమాదానికి గురయ్యింది. ఈ ఘటనలో ఆరుగురు కుటుంబ సభ్యులు అక్కడిక్కడే మృతి చెందారు. ఘటన అనంతరం లారీ డ్రైవర్, సహాయకుడు ట్రక్కును అక్కడే వదిలేసి పరారయ్యారు. ధ్వంసమైన కారు, లారీని క్రేన్, జేసీబీల సాయంతో పోలీసులు తొలగించారు. -
మంచు, వర్షాల కారణంగా ఐదు హైవేలు, 300 రోడ్లు మూసివేత!
ఉత్తరాఖండ్, జమ్మూ కాశ్మీర్, హిమాలయాలలోని ఎత్తైన పర్వతాలపై భారీ హిమపాతం కురుస్తుండగా, అక్కడి మైదాన ప్రాంతాల్లో బలమైన ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపధ్యంలో జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్లలో ఐదు జాతీయ రహదారులతో సహా 300కు పైగా రోడ్లను మూసివేశారు. హిమాచల్‌లో 263 రోడ్లు మూసివేశారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల కారణంగా పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయి నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడుతోంది. గడచిన 24 గంటల్లో పంజాబ్, హరియాణా, రాజస్థాన్‌లోని పలు ప్రాంతాలతో సహా దేశ రాజధాని ఢిల్లీ, పరిసర ప్రాంతాలలో కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు పడ్డాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) తెలిపింది. ఇంతేకాదు హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లోని కొన్ని చోట్ల వడగళ్ల వాన కురిసింది. జమ్మూ కాశ్మీర్, లడఖ్, గిల్గిత్, ఈశాన్య ప్రాంతంలో అరుణాచల్ ప్రదేశ్, పశ్చిమ బెంగాల్‌లోని ఉప-హిమాలయ ప్రాంతం, సిక్కిం, అస్సాం, మేఘాలయ, ఒడిశాలో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షపాతం నమోదయ్యింది. వాతావరణంలోని మార్పుల కారణంగా దేశంలోని పలు ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. పలుప్రాంతాల్లో 11 నుంచి 14 డిగ్రీల సెల్సియస్ మధ్య కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పశ్చిమ రాజస్థాన్‌లోని చురులో అత్యల్ప కనిష్ట ఉష్ణోగ్రత 6.6 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. ఉత్తర భారతదేశంలోని పర్వత, మైదాన ప్రాంతాల్లో బుధవారం కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేశారు. -
Khammam: గ్రీన్‌ఫీల్డ్ హైవే బ్రిడ్జిపై ప్రమాదం
సాక్షి, ఖమ్మం: ఖమ్మం జిల్లాలో నిర్మాణంలో ఉన్న వంతెన ఒక్కసారిగా కుప్పకూలింది. గ్రీన్ ఫీల్డ్ జాతీయ రహదారిలో భాగంగా వైరా-మధిర మధ్య భారీ వంతెన నిర్మిస్తున్న విషయం తెలిసిందే. గురువారం మధ్యాహ్నం బ్రిడ్జిపై సిమెంట్ కాంక్రీట్ పోస్తుండగా స్లాబ్ ఒక్కసారిగా కుప్పకూలింది. వైరా మండలం సోమవరం దగ్గర ఈ ఘటన జరిగింది. భారీ శబ్దం రావడంతో అటుగా వెళ్లే వాహనదారులు భయాందోళనకు గురయ్యారు. వంతెన మీద ఉన్న కూలీలు ప్రాణాలు రక్షించుకునేందుకు బ్రిడ్జిపైనుంచి కిందకు దూకేశారు. దీంతో పలువురు కూలీలకు స్వల్ప గాయాలయ్యాయి. నిర్మాణ పనుల్లో నిర్లక్ష్యం, నాసిరకంగా నిర్మించడం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కాగా ఖమ్మం నుంచి దేవరపల్లి వరకు నిర్మిస్తున్న గ్రీన్‌ఫీల్డ్ హైవే పనులను హెచ్డీ ఇన్ఫ్రా ఇంజనీరింగ్ లిమిటెడ్ సంస్థ నిర్మిస్తుంది. -
హైవేలకు సంక్రాంతి కళ
చౌటుప్పల్: సంక్రాంతి పండుగ నేపథ్యంలో హైదరాబాద్–విజయవాడ 65వ నంబర్ జాతీయ రహదారితో పాటు హైదరాబాద్–వరంగల్ 163 జాతీయ రహదారిపై శనివారం కూడా వాహనాల రద్దీ కొనసాగింది. తెల్లవారుజామునుంచి అర్ధరాత్రి వరకు వాహనాలు బారులుతీరుతూ వెళ్లాయి. యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి టోల్‌ప్లాజా వద్ద ట్రాఫిక్ జామ్ కాకుండా 12 టోల్‌బూత్‌లను తెరిచారు. శనివారం 80వేల పైచిలుకు వాహనాలు రాకపోకలు సాగించినట్లు టోల్‌ప్లాజా అధికారులు తెలిపారు. నల్లగొండ జిల్లా కేతేపల్లి మండలం కొర్లపహాడ్ టోల్‌ప్లాజా వద్ద ఉన్న 12 టోల్ కౌంటర్లకు 8 కౌంటర్లను విజయవాడ వైపు వెళ్లే వాహనాలకు కేటాయించారు. ఈ మార్గంలో శనివారం ఒక్కరోజే దాదాపు 40 వేల వాహనాలు వెళ్లినట్లు జీఎమ్మార్ అధికారులు వెల్లడించారు. యాదాద్రి జిల్లా బీబీనగర్ మండలం గూడూరు టోల్‌ప్లాజా వద్ద హైదరాబాద్ నుంచి వరంగల్ వైపు వెళ్లే వాహనాలు బారులుతీరాయి. సుమారు 30వేలకు పైగా వాహనాలు ఈ టోల్ గుండా ప్రయాణించాయి. -
Sankranthi Effect : సొంతూళ్లకు క్యూ కట్టిన హైదరాబాదీలు.. హైదరాబాద్-విజయవాడ హైవేపై ఫుల్ రష్ (ఫొటోలు)
-
ఇనుప రెయిలింగ్‌లో తల ఇరుక్కొని..
అల్లాదురం(మెదక్): హైవే ఇనుప రెయిలింగ్‌లో తల ఇరుకోవడంతో రెండు గంటల పాటు బాలుడు నరకయాతన అనుభవించాడు. ఈ సంఘటన శుక్రవారం అల్లాదుర్గం మండలం చిల్వెర ఐబి చౌరస్తా బ్రిడ్జి కింద జరిగింది. వట్పల్లి మండలం బూత్కూర్ గ్రామానికి చెందిన దంపతులు తమ కుమారుడితో బస్సు ఎక్కేందుకు నారాయణఖేడ్ వెళ్లేందుకు చిల్వెర ఐబీ చౌరస్తాకు వచ్చారు. బ్రిడ్జి కింద బాలుడు ఆడుకుంటూ రెయిలింగ్ మధ్యన తల పెట్టాడు. ఎంతకూ రాకపోవడంతో ప్రయాణికులు, స్థానికులు ప్రయతి్నంచినా వారి ప్రయత్నం ఫలించలేదు. చివరకు ఇనుప చువ్వలను తొలగించి బాలుడి తలను బయటకు తీయడంతో తల్లిదండ్రులు, ప్రయాణికులు ఉపీరి పిల్చుకున్నారు.రాజు పలు క్రీడల జిల్లా అధ్యక్ష కార్యదర్శులు హర్షం వ్యక్తం చేశారు. -
హైదరాబాద్-విజయవాడ హైవేపై వాహనాల రద్దీ
-
అరుణాచల్ హైవే ప్రాజెక్టు ఏమిటి? చైనా మండిపాటు ఎందుకు?
భారతదేశంలోని అరుణాచల్ ప్రదేశ్‌లో చైనా అనునిత్యం చొరబాటు ప్రయత్నాలను చేస్తోంది. వీటికి అడ్డుకట్ట వేసేందుకు భారత్ తన ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఈ నేపధ్యంలోనే అరుణాచల్ ఫ్రాంటియర్ హైవే పనులను భారత్ ప్రారంభించింది. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే సరిహద్దు ప్రాంతాలకు సైన్యం చేరుకోవడం మరింత సులభతరం కానుంది. అప్పుడు సైన్యం ఎల్ఏసీకి చేరుకోవడానికి అధిక సమయం పట్టదు. 1748 కి.మీ పొడవైన నేషనల్ హైవే-913ని పూర్తి చేయడానికి దాదాపు మూడు సంవత్సరాలు పట్టనుంది. ఈ ప్రాజెక్ట్ 2027 నాటికి పూర్తికానుంది. ఈ ప్రాజెక్టులో అంతర్జాతీయ సరిహద్దుకు ఐదు కిలోమీటర్ల లోపు ఉన్న అరుణాచల్ ప్రదేశ్‌లోని అన్ని గ్రామాలను ఆల్-వెదర్ రోడ్ల ద్వారా అనుసంధానం చేయనున్నారు. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి రూ.40 వేల కోట్లు వెచ్చిస్తున్నారు. 2016లో భారత్ ఈ ప్రాజెక్ట్ గురించి ప్రకటించిన తర్వాత చైనా దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇరుదేశాల మధ్య నెలకొన్న సరిహద్దు వివాదం పరిష్కారమయ్యే వరకు భారత్ ఈ ప్రాజెక్టు పనులు ప్రారంభించకూడదని చైనా ఓ ప్రకటన విడుదల చేసింది. అయితే చైనా అభ్యంతరాన్ని భారత్ పట్టించుకోలేదు. ఈ ప్రాజెక్టులో భాగంగా హున్లీ- హ్యూలియాంగ్ మధ్య దాదాపు 121 కిలోమీటర్ల పొడవున హైవే నిర్మించనున్నారు. అదే సమయంలో హున్లీ- ఇతున్ మధ్య 17 కిలోమీటర్ల పొడవైన వ్యూహాత్మక వంతెన, టుటిన్ నుండి జిడో వరకు 13 కిలోమీటర్ల పొడవైన రహదారిని నిర్మిస్తున్నారు. అరుణాచల్ ఫ్రాంటియర్ హైవే భూటాన్ సరిహద్దు సమీపంలోని తవాంగ్ నుంచి ప్రారంభమై భారత్-మయన్మార్ సరిహద్దు సమీపంలోని విజయనగర్‌లో ముగుస్తుంది. ఈ హైవే సిద్ధమైన తర్వాత తవాంగ్ సమీపంలోని బోమ్డిలా నుండి మయన్మార్ సరిహద్దు సమీపంలోని విజయనగరానికి అనుసంధానం ఏర్పడుతుంది. అన్ని వాతావరణాల్లోనూ ఉపయుక్తమయ్యేలా ఈ రహదారిని నిర్మిస్తున్నారు. సరిహద్దు ప్రాంతాలు, చుట్టుపక్కల గ్రామాలకు ఈ రహదారితో అనుసంధానం ఏర్పడుతుంది. ఈ హైవే నిర్మాణం కోసం అనేక సొరంగాలు కూడా నిర్మించనున్నారు. ఈ హైవే భూటాన్ సరిహద్దు సమీపంలోని తవాంగ్ నుంచి ప్రారంభమై, భారత్-మయన్మార్ సరిహద్దులోని విజయనగర్ వద్ద ముగుస్తుంది. ఈ రహదారి భారతదేశం-టిబెట్-చైనా, మయన్మార్ సరిహద్దులకు దగ్గరగా వెళుతుంది. -
‘హిట్ అండ్ రన్’కు టెక్నికల్ పరిష్కారం?
ఢిల్లీ: కొత్త చట్టాలను అనుసరించి.. హిట్ అండ్ రన్ కేసుల్లో కఠిన శిక్షలను నిరసిస్తూ ట్రక్కు డ్రైవర్లు ఇటీవల దేశవ్యాప్త ఆందోళనలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో వెనక్కి తగ్గిన కేంద్రం.. నిబంధన ఇంకా అమల్లోకి రాలేదని ట్రాన్స్ పోర్టు సంఘాలతో విస్త్రృత చర్చలు జరిపిన తర్వాతే దీనిపై తుది నిర్ణయం తీసుకుంటామని వెల్లడించింది. ఈ క్రమంలో ఇప్పుడు ‘హిట్ అండ్ రన్’కు పరిష్కారం.. రవాణాశాఖ(MoRTH.. The Union road transport and highways ministry) కీలక సూచన చేసినట్లు తెలుస్తోంది. ప్రమాదాలు జరిగిన వెంటనే ఆ విషయాన్ని అధికారులకు తెలియజేసే సాంకేతిక వ్యవస్థను ట్రక్కు డ్రైవర్లు వినియోగించేందుకు అనుమతించాలని సూచించినట్లు రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. తద్వారా అటువంటి వాటిని ‘హిట్ అండ్ రన్’ కింద పరిగణించకుండా ఉండవచ్చని తెలిపింది. అయితే ఈ అంశం కేంద్ర హోంశాఖ పరిధిలోకి వస్తుందని.. తుది నిర్ణయం ఆ శాఖ తీసుకుంటుందని రవాణాశాఖ పేర్కొంది. ‘ప్రమాదం జరిగిన అనంతరం బాధితులకు సహాయం చేసేందుకు అక్కడే ఉంటే స్థానికులు వారిపై దాడి చేసే ప్రమాదం ఉందని ట్రక్కు డ్రైవర్లు భావిస్తున్నారు. దీనికి పరిష్కారంగా మనం సాంకేతికతను ఉపయోగించుకోవచ్చు. ప్రమాదం జరిగిన వెంటనే ఆ విషయాన్ని అధికారులకు తెలియజేసేందుకు డ్రైవర్లు సాంకేతికత వాడుకోవచ్చు. ఆ తర్వాత ప్రమాదం జరిగిన ప్రదేశం నుంచి 25-50 కి.మీ పరిధిలో ఉన్న పోలీసులకు ఆ విషయాన్ని తెలియజేయవచ్చు. అటువంటి దాన్ని ‘హిట్ అండ్ రన్’ కేసుగా పరిగణనలోకి తీసుకోకుండా ఉండవచ్చు’ అని రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి అనురాగ్ జైన్ పేర్కొన్నారు. ఇదే విషయాన్ని కేంద్ర హోంశాఖకు సూచించామన్నారు. -
ఛార్జింగ్ స్టేషన్లు అవసరం లేని ఎలక్ట్రిక్ వాహనాలు..!
ఇకపై భవిష్యత్తు రవాణా ఇదే.. పెట్రోల్, డీజిల్ ధరల పెంపుతో అందరూ ఎలక్ట్రిక్ వాహనాలవైపు ఆసక్తి చూపిస్తున్నారు. ప్రభుత్వం కూడా ఎలక్ట్రిక్ వాహనాల వైపు దృష్టిసారించేలా వినియోగదారులను ప్రోత్సహిస్తోంది. దాంతో పెట్రోల్, డీజిల్ వాహనాల స్థానంలో కరెంట్‌తో నడిచే భారీ వాహనాలు వస్తున్నాయి. అధిక లోడుతో వెళ్లే ఇవి ఎక్కువగా హైవేలపై కనిపిస్తుంటాయి. వీటికి పెద్దమొత్తంలో కరెంట్ అవసరం అవుతోంది. మధ్యలో ఛార్జింగ్ అయిపోయినా లేదా ఛార్జింగ్ కోసం ఎక్కడైనా ఆగినా సమయం వృథా అవుతుంది. కాబట్టి విద్యుత్‌తో నడిచే భారీ ట్రక్కులపై వినియోగదారులు ఎక్కువ ఆసక్తి చూపడంలేదు. కానీ అలాంటి వారితోపాటు తరచూ సుదూర ప్రాంతాలకు వెళ్లే వారి కోసం ప్రభుత్వం ఎలక్ట్రిక్ హైవేలను ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. ఈ నేపథ్యంలో విదేశీ తరహాలో దేశంలో మొదటిసారిగా హైవేలో ఎలక్ట్రిసిటీ సిస్టమ్ టెక్నాలజీ రాబోతోంది. ఇకపై హైవేలో వెళ్లే భారీ వాహనాలు పవర్ ద్వారా నడవనున్నాయి. రైళ్లు, మెట్రో ట్రెయిన్లు ఎలా అయితే కరెంటుతో నడుస్తున్నాయో అలానే హైవే ఎలక్ట్రిక్ వాహనాలు కూడా పరుగులు పెట్టనున్నాయి. గతంలో ఈ ఎలక్ట్రిక్ హైవే టెక్నాలజీని జర్మనీ మొదటిసారి ఉపయోగించింది. ఇందులో భాగంగా హైవేపై వెళ్లే ట్రక్కుల పైభాగంలో రైళ్ల మాదిరి కరెంట్ సరఫరా కోసం ప్రత్యేక ఏర్పాటు ఉంటుంది. దాని నుంచి ట్రక్కులోని బ్యాటరీల్లోకి విద్యుత్ సరఫరా అవుతుంది. అవి రీచార్జ్ అవుతూ ట్రక్కు ముందుకుసాగుతుంది. హైవే నుంచి డైవర్షన్ తీసుకున్న తర్వాత ఎలాగూ అప్పటికే బ్యాటరీలు ఛార్జ్ అవుతాయి కాబట్టి అందులోని విద్యుత్‌ను వినియోగించుకుని వాహనం కదులుతుంది. ఈ టెక్నాలజీతో మార్గం మధ్యలో మళ్లీ ఛార్జింగ్ చేసుకోకుండా వాహనం కదులుతున్నప్పుడే చార్జ్ అయ్యే వెసులుబాటు ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇదీ చదవండి: కొత్త సంవత్సరంలో రూపాయి దారెటు? సోలార్ ఎనర్జీ సాయంతో రహదారులపై ట్రక్కులు, బస్సులు పరుగులు పెట్టేందుకు వీలుగా ఎలక్ట్రిక్ హైవేలు అభివృద్ధి చేయబోతున్నట్లు ఇటీవల కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. దీనిపై ప్రభుత్వం కసరత్తు చేస్తోందని చెప్పారు. ఎలక్ట్రిక్ వాహనాల కోసం సోలార్, పవన విద్యుత్ ఆధారిత ఛార్జింగ్ మెకానిజంను ఉపయోగించుకోవాలన్న దృఢ నిశ్చయంతో ప్రభుత్వం ఉందని మంత్రి అన్నారు. దిల్లీ-జైపుర్ మధ్య భారతదేశపు మొట్టమొదటి ఎలక్ట్రిక్ హైవేను అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే జర్మనీ, స్వీడన్, నార్వే వంటి దేశాల్లో ఈ సాంకేతికతను వినియోగిస్తున్నారని తెలిపారు. రహదారిపై ఏర్పాటు చేసిన పవర్ కేబుళ్ల విద్యుత్‌ను వాడుకొని వాహనాలు సునాయాసంగా ప్రయాణిస్తాయన్నారు. -
టోల్‌ప్లాజా తొలగింపుపై మంత్రి కీలక వ్యాఖ్యలు
సాధారణంగా చాలామందికి నిర్ణీత గడువు తర్వాత టోల్‌ప్లాజాలను మారుస్తారు లేదా తొలగిస్తారనే అపోహ ఉంది. కానీ దానికి సంబంధించి కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. జాతీయ రహదారుల రుసుముల నిబంధనలు-2008 ప్రకారం.. నిర్దిష్ట గడువు పూర్తయిన తర్వాత మూలధన వ్యయాన్ని రికవరీ చేశాక టోల్ ప్లాజాలను తొలగించాలనే ఎలాంటి నిబంధనా లేదని కేంద్ర ఉపరితల రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. దేశంలోని జాతీయ రహదారులపై ఏర్పాటు చేసిన ఏ ఒక్క టోల్ ప్లాజాలోనూ ఇప్పటివరకు మూలధన వ్యయాన్ని పూర్తిగా రికవరీ చేయలేదని గురువారం లోక్‌సభలో సభ్యులు అడిగిన ప్రశ్నకు ఆయన లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చారు. దేశవ్యాప్తంగా జాతీయ రహదారులు, ఎక్స్‌ప్రెస్‌వేల నిర్మాణ బాధ్యతలను నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా, నేషనల్ హైవేస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ పర్యవేక్షిస్తాయి. రవాణా సౌకర్యాలను మెరుగు పరిచేందుకు కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఎన్హెచ్ఏఐ పని చేస్తుంది. ఇది ప్రైవేటు కాంట్రాక్టు సంస్థల సహాయంతో వివిధ రాష్ట్రాల మధ్య హైవేలు, ఎక్స్‌ప్రెస్ హైవేలు నిర్మిస్తుంది. రోడ్డు వేయడానికి చేసిన ఖర్చును టోల్ రూపంలో వసూలు చేసి కాంట్రాక్టర్లకు చెల్లిస్తుంది. ఈ ప్రక్రియ కొన్నేళ్లపాటు సాగుతుంది. ఇదీ చదవండి: ఉంటుందో..? ఊడుతుందో..? మరోవైపు, జాతీయ రహదారులపై టోల్ ఛార్జీల వసూలుకు జీపీఎస్ ఆధారిత వ్యవస్థను 2024 మార్చి నాటికి తీసుకురానునట్లు గడ్కరీ ఇటీవల ప్రకటించారు. దీనివల్ల ట్రాఫిక్ ఇబ్బందులు తొలగడంతో పాటు జాతీయ రహదారిపై ప్రయాణించిన దూరానికి మాత్రమే టోల్ ఛార్జీ చెల్లించాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. -
మెరుపు వేగంతో నిలుచున్న లారీని ఢీకొట్టి..
లక్నో: తమిళనాడులో బుధవారం తెల్లవారుజామున ఘోరం జరిగింది. తెల్లవారుజామున 4 గంటల సమయంలో వేగంగా వెళ్తున్న వ్యాన్ అదుపుతప్పి నిలబడి ఉన్న లారీని ఢీకొట్టింది. సేలం-ఈరోడ్ హైవేపై ఈ ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో ఏడాది చిన్నారితో సహా ఆరుగురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సీసీటీవీలో రికార్డ్ అయిన దృశ్యాలు భీతికొల్పుతున్నాయి. Tragic road accident on Tamil Nadu highway kills 6 people. CCTV video emerges. #TamilNadu pic.twitter.com/grWJeeofoY — Vani Mehrotra (@vani_mehrotra) September 6, 2023 ఈంగూర్‌కు చెందిన ఎనిమిది మంది సభ్యులు వ్యాన్‌లో పెరుంతురై వైపు వెళుతున్నారు. ఈ క్రమంలో రోడ్డుకు పక్కన నిలిచి ఉన్న లారీని వ్యాన్ ఢీకొట్టారు. డ్రైవర్ నిద్రలో ఉండటమే ఇందుకు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతులను సెల్వరాజ్, మంజుల, ఆరుముగం, పళనిసామి, పాపతితో పాటు ఏడాది వయసున్న చిన్నారిగా గుర్తించారు. వ్యాన్ డ్రైవర్ విఘ్నేష్, మరో ప్రయాణికురాలు ప్రియా తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి పంపించారు. ఇదీ చదవండి: ఎయిర్ హోస్టెస్ రూపాకేసులో వీడిన మిస్టరీ -
అమెరికాలోని ఓ రహదారికి భారత సంతతి పోలీస్ పేరు!
భారత సంతతి వ్యక్తికి అరుదైన గౌరవం లభించింది. యూఎస్‌లోని ఓ రహదారికి అతడి పేరుని పెట్టిమరీ గౌరవించింది. ఇంతకీ ఎవరా వ్యక్తి ఎందుకంతా గౌరవం ఇచ్చిందంటే.. అమెరికాలోని కాలిఫోర్నియాలో 34 ఏళ్ల రోనిల్ సింగ్ అనే భారత సంతతి వ్యక్తి న్యూమాన్ పోలీస్ డిపార్ట్మెంట్లో పోలీస్ అధికారిగా విధులు నిర్వర్తిస్తున్నాడు. అయితే ఒకరోజు అతను విధినిర్వహణలో భాగంగా ఒక రాత్రి ఓవర్ టైం చేయాల్సి వచ్చింది. సరిగా 2018 డిసెంబర్ 26న క్రిస్మస్ రాత్రి ఓ రహదారి వద్ద గస్తీ కాస్తున్నారు. ఇంతలో ఓ వ్యక్తి కారులో తాగుతూ వచ్చి విచక్షణరహితంగా కాల్పులు చేస్తున్నాడు. ఆ కాల్పుల్లో రోనిల్ సింగ్ మృతి చెందాడు. విధి నిర్వహణలో భాగంగా ఇతురల భద్రత విషయమై జీవితాన్ని ఫణంగా పెట్టాడు సింగ్. అయితే అతడు చనిపోయేనాటికి కొడుకు ఆర్నవ్ కేవలం 5 నెలల పసివాడు. ఇలా విధినిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన ఆ వ్యక్తిని గౌరవించేలా ఓ రహదారికి అతని పేరు పెట్టి అంకితం ఇవ్వాలని నిర్ణయించారు. కానీ అములులోకి రాలేదు. ఎట్టకేలకు సింగ్ న్యూమాన్ పోలీస్ డిపార్ట్మెంట్ ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చడమే గాక అమలయ్యేలా చేసింది. ఆ కాలిఫోర్నియా రాష్ట్ర సెనేటర్ మేరి అల్వరాడో గిల్ యూఎస్ ప్రతినిధి డువార్టే, అసెంబ్లీ సభ్యుడు జువాన్ అలానిస్ సెప్టెంబర్ 2న హైవే 33 స్టుహ్ర్ రోడ్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి "కార్పోరల్ రోనిల్ సింగ్ మోమోరియల్ హైవే" అని నామకరణం చేసి మరీ సైన్ బోర్డు పెట్టారు. ఆ రహదారికి అతడి పేరుని పెట్టి అత్యున్నతంగా గౌరవించింది. ఈ కార్యక్రమంలో సింగ్ భార్య అనామిక, కొడుకు ఆర్నవ్ , ఇతర కుటుంబ సభ్యులు న్యూమాన్ పోలీస్ డిపార్ట్మెంట్లోని సింగ్ సహోద్యోగులు తదితరలు పాల్గొన్నారు. సింగ్ కొడుకు ఆర్నవ్ ఆ బోర్డు వెనకాల ఐ లవ్ యు పప్పా! అని రాశాడు. కాగా, రోనిల్ సింగ్ నేపథ్యం వచ్చేసరికి అతడు ఫిజీలో జన్మించి మోడెస్లో పోలీస్‌డిపార్ట్‌మెంట్‌లో వాలంటీర్‌గా లా ఎన్ఫోర్స్మెంట్ వృత్తిని ప్రారంభించాడు. తర్వాత టర్లాక్ పోలీస్ డిపార్ట్మెంటల్లో క్యాడెట్ జంతు సేవా అధికారిగా కూడా విధులు నిర్వర్తించాడు. ఇక సింగ్ చనిపోయిన ఒక ఏడాది తర్వాత పోలీసులు నిందితుడిని మెక్సికన్ జాతీయుడైన పాలో విర్జెన్ మెన్డోజాగా గుర్తించి అరెస్టు చేశారు. అతడికి పెరోల్ లేకుండా జీవితఖైదు శిక్ష విధించింది కోర్టు. అలాగే అతడిని తప్పించాలని చూసిన అతడి సోదరుడు కాన్రాడో విర్జెన్ మెన్డోజాకు 21 నెలల జైలు శిక్ష పడింది. -
230 కిలోమీటర్ల వేగంతో రోల్స్ రాయిస్ బీభత్సం
చంఢీగడ్: హర్యానాలోని నూహ్‌లో దారుణం జరిగింది. జాతీయ రహదారిపై రోల్స్ రాయిస్ కారు ఓ ట్యాంకర్‌ను ఢీకొన్న ఘటనలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. ట్యాంకర్ యూటర్న్ తీసుకునే క్రమంలో ఈ ఘటన జరిగిందని స్థానికులు తెలిపారు. కారు అతి వేగమే ప్రమాదానికి కారణం అని వెల్లడించారు. కారు, ట్యాంకర్ రెండు కూడా ఒకే దారిలో వస్తున్నాయి. ఈ క్రమంలో ట్యాంకర్ యూటర్న్ కోసం నిలిచి ఉంది. వెనకే ఉన్న రోల్స్ రాయిస్ దాదాపు గంటకు 230 కిలోమీటర్ల వేగంతో దూసుకొచ్చింది. అదుపుతప్పి నిలిచి ఉన్న ట్యాంకర్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు, ట్యాంకర్‌కు మంటలు అంటుకున్నాయి. కారు అతి వేగమే ప్రమాదానికి కారణం అని స్థానికులు తెలిపారు. కారులో ప్రయాణిస్తున్న ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. వెనకే మరో కారులో వస్తున్న బాధిత కుటుంబ సభ్యులు వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. కారు విలువ దాదాపు రూ.10 కోట్లు ఉంటుందని స్థానికులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇదీ చదవండి: రాహుల్ గాంధీ ఇక ఆ బంగ్లాకు వెళ్లలేరు.. ఎందుకంటే..? -
మహారాష్ట్రలో ట్రక్కు బీభత్సం.. 10 మంది మృతి
ముంబై: మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ధులే జిల్లాలోని జాతీయ రహదారిపై ఓ ట్రక్కు బీభత్సం సృష్టించింది. వేగంగా వచ్చిన ట్రక్కు అదుపుతప్పి నాలుగు వాహనాలు ఢీకొట్టి దాబాలోకి (హోటల్) దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు పది మంది మృతి చెందగా.. 20 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటన మంగళవారం ఉదయం పది గంటలకు పలాస్నర్ గ్రామ సమీపంలోని ముంబై-ఆగ్రా జాతీయ రహదారిపై జరిగింది. మధ్యప్రదేశ్ నుంచి ధులేకు వెళ్తుండగా.. ట్రక్కు బ్రేకులు ఫెయిల్ కావడంతో అదుపు తప్పింది. దీంతో ముందుగా హైవేపై బస్టాప్ సమీపంలో ఉన్న రెండు బైక్‌లు, ఒక కారు, మరొక కారును ఢీకొట్టింది. దీంతో కారు రోడ్డు పక్కకు ఎగిరిపడింది. అంతటితో ఆగకుండా పక్కన ఉన్న దాబాలోకి దూసుకెళ్లి బోల్తా కొట్టింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదంలో తొమ్మిది మంది మరణించగా.. 20 మందికిపైగా గాయపడినట్లు పోలీసులు పేర్కొన్నారు. భాదితుల్లో బస్టాప్‌లో వేచిచూస్తున్న ప్రయాణికులు సైతం ఉన్నారని, క్షతగాత్రులను ధులే, సిర్పూర్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. ప్రమాదంపై కేసు నమోదు చేసినట్లు విచారణ చేపట్టినట్లు చెప్పారు. చదవండి: సుప్రీంకోర్టులో ఢిల్లీ ప్రభుత్వానికి ఊరట.. -
వడివడిగా హాయివే.. పామర్రు నుంచి దిగమర్రు వరకు 4 లేన్ల ప్రయాణానికి సిద్ధం
ఆకివీడు: నాలుగు జిల్లాలను అనుసంధానం చేసే ఎన్‌హెచ్ 165 డెల్టా ప్రాంతానికి కీలకం. పామర్రు–(పీపీ) రాష్ట్ర రహదారిగా ఉన్న ఈ రోడ్డును జాతీయ రహదారుల శాఖ రెండు దశాబ్దాల క్రితం విలీనం చేసుకుంది. అయితే రహదారి విస్తరణ పనుల్లో తీవ్ర జాప్యం ఏర్పడింది. తొమ్మిదేళ్ల క్రితం ఈ రోడ్డు అభివృద్ధికి అప్పటి కేంద్ర మంత్రి ఆకివీడులో భూమి పూజ చేశారు. కృష్ణా జిల్లా పామర్రు నుంచి పశ్చిమ గోదావరి పాలకొల్లు మండలం దిగమర్రు వరకూ 107 కిలోమీటర్ల మేర రహదారిని నాలుగు లైన్లుగా విస్తరించేందుకు రూ.1,275 కోట్లు కేటాయించారు. రహదారి విస్తరణ కోసం సరిహద్దు భూముల సేకరణపై కొంత మంది రైతులు, స్థల యజమానులు కోర్టుకు వెళ్లడంతో నిర్మాణ పనులు ఆలస్యమయ్యాయి. అయితే వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక ముఖ్యమంత్రి చొరవతో ఈ పనుల్లో మళ్లీ పురోగతి కనిపిస్తోంది. రెండు దశల్లో పనుల నిర్వహణ.. ఈ మొత్తం రహదారి పనులను రెండు ఫేజ్‌లుగా విడదీసి పనులు వేగవంతం చేశారు. పామర్రు నుంచి ఆకివీడు 64 కిలోమీటర్ల మేర ఒక ఫేజ్, అలాగే ఆకివీడు నుంచి దిగమర్రు వరకూ 43 కిలోమీటర్ల మేర మరో ఫేజ్‌లో పనులు చేపడుతున్నారు. ప్రస్తుతం పామర్రు నుంచి ఆకివీడు వరకూ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. 90 కల్వర్టుల నిర్మాణం.. పామర్రు నుంచి ఆకివీడు ఉప్పుటేరు వరకూ రహదారి విస్తరణ పనులను వేగవంతం చేశారు. రూ.273 కోట్లతో పనులను చేపడుతున్నారు. దీనిలో కృష్ణా జిల్లా, ఏలూరు జిల్లాల పరిధిలో 90 కల్వర్టులు, 16 వంతెనలు, 2 మేజర్ బ్రిడ్జిల నిర్మాణం వేగంగా జరుగుతోంది. పలు చోట్ల రహదారి విస్తరణ పనులను చేపట్టారు. గుడివాడ, ఆకివీడు వద్ద ఉప్పుటేరుపై మేజర్ బ్రిడ్జి నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ఆకివీడు నుంచి దిగమర్రుపై కోర్టు వివాదం ఆకివీడు ఉప్పుటేరు నుంచి దిగమర్రు వరకూ రహదారి విస్తరణ కోసం చేపట్టిన భూసేకరణపై కోర్టు వివాదం ఏర్పడింది. ప్రస్తుతం ఉన్న రహదారికి రెట్టింపు భూమి సేకరించాల్సి ఉంది. కొన్ని చోట్ల మూడు లైన్లకు అనుకూలంగా జాతీయ రహదారి భూమి ఉంది. మరికొన్ని చోట్ల రెండు లైన్ల రోడ్డే ఉంది. దీంతో ఆకివీడు, ఉండి, భీమవరం, వీరవాసరం, లంకలకోడేరు ప్రాంతాల్లో భూసేకరణకు ఎన్‌హెచ్ అధికారులు చర్యలు చేపట్టారు. భూ యజమానులకు, ఎన్‌హెచ్ అధికారుల మధ్య అంగీకారం కుదరకపోవడంతో ఆయా ప్రాంతాల్లోని యజమానులు కోర్టును ఆశ్రయించారు. నాలుగు జిల్లాలకు మేలు.. ఎన్‌హెచ్ 165 నాలుగులైన్ల రహదారి విస్తరణ పనులు ఈ ప్రాంతంలో చేపట్టడం ద్వారా రహదారి మరింత అభివృద్ధి చెందుతుందని పలువురు పేర్కొంటున్నారు. దిగమర్రు వరకు రహదారి పనులు పూర్తయితే అక్కడ నుంచి తూర్పుగోదావరి జిల్లాకు రహదారి అనుసంధానమవుతుందని.. దీని ద్వారా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాతోపాటు కృష్ణా జిల్లా ప్రాంత ప్రజలకు మేలు చేకూరుతుందని వివరిస్తున్నారు. వేగంగా పనులు కృష్ణా జిల్లా పరిధిలోని ఎన్‌హెచ్–165 రహదారి విస్తరణ పనులు వేగంగా జరుగుతున్నాయి. ప్రాజెక్టు పరిధిలో పామర్రు నుంచి ఆకివీడు ఉప్పుటేరు వంతెన వరకూ రూ.273 కోట్లతో పనులు చేపడుతున్నాం. 90 కల్వర్టులు, రెండు మేజర్ వంతెనల నిర్మాణం పనులు శరవేగంగా సాగుతున్నాయి. –ఎం.సత్యనారాయణరావు, DE, NH, కృష్ణా జిల్లా కోర్టు అనుమతి రావాలి.. ఎన్‌హెచ్ 165 రహదారికి ఉప్పుటేరు నుంచి దిగమర్రు వరకూ రహదారి విస్తరణ పనులకు కోర్టు అనుమతి ఇవ్వాల్సి ఉంది. పలు చోట్ల రహదారి విస్తరణకు అవసరమయ్యే స్థల సేకరణపై సంబంధిత యజమానులు కోర్టుకు వెళ్లారు. దీంతో నిర్మాణ పనులు ఆగిపోయాయి. నాలుగు జిల్లాలను అనుసంధానం చేసే 165 రహదారి వల్ల ప్రజలకు అనేక ఉపయోగాలున్నాయి. – శ్రీనివాసరావు, DE, NH, పశ్చిమ గోదావరి జిల్లా -
జాతీయ రహదారిపై ఆయిల్ ట్యాంకర్ పేలి..
అమెరికా:అమెరికాలోని ఫిలడెల్ఫియాలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. నిత్యం రద్దీగా ఉండే జాతీయ రహదారిపై ఆయిల్ ట్యాంకర్ పేలింది. దీంతో రహదారిలోని ఎత్తైన భాగం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఆదివారం ఉదయం ఈ ఘటన జరిగినట్లు అధికారులు తెలిపారు. BREAKING: Fuel tanker explodes on Philadelphia highway, causing an entire overpass to collapse. pic.twitter.com/iwRVgxJZ41 — The Spectator Index (@spectatorindex) June 11, 2023 నాలుగు లైన్ల ప్రధాన రహదారి. నిత్యం రద్దీగా ఉంటుంది. అలాంటి రహదారిపై ఆయిల్ ట్యాంకర్ ఒక్కసారిగా పేలిపోయింది. దీంతో పొగలు తీవ్ర స్థాయిలో కమ్ముకున్నాయి. రహదారిపై ఉన్న ఎత్తైన భాగం కుప్పకూలిపోయింది. ఉదయం 7 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. ఉదయం అయినందున ట్రాఫిక్ పెద్దగా లేదని అధికారులు తెలిపారు. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని వెల్లడించారు. VIDEO/BREAKING: SkyFOX over the section of northbound I-95 that has collapsed in Philadelphia near the Cottman Ave exit. A tanker truck in the underpass beneath 95 caused the North lanes above to collapse & South have buckled down too. pic.twitter.com/0aIqreRlzI — Steve Keeley (@KeeleyFox29) June 11, 2023 ఇదీ చదవండి:నడిసంద్రంలో పర్యాటకుల పడవకు మంటలు..డాల్ఫిన్స్ కోసం వెళితే.. -
ఆ రోడ్డుపై ప్రయాణిస్తూ 14 దేశాలు దాటేయొచ్చు.. ఎక్కడుందో తెలుసా!
ఏ దేశంలోని రోడ్లయినా వివిధ ప్రాంతాలను కలుపుతాయనే విషయం మనకు తెలిసిందే. వివిధ రోడ్లపై ప్రయాణించడం ద్వారా మనం ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి చేరుకోవచ్చు. అయితే కొన్ని రోడ్లు చిన్నవిగా, మరికొన్ని రోడ్లు పెద్దవిగా ఉండటాన్ని మనం గమనించేవుంటాం. మనదేశంలోని అతిపెద్ద రోడ్డు విషయానికివస్తే అది నేషనల్ హైవే-44. ఇది 3,745 కిలోమీటర్ల దూరం కలిగివుంది. ఇది కన్యాకుమారితో మొదలై శ్రీనర్ వరకూ ఉంటుంది. అయితే ప్రపంచంలో దీనికి మించిన అతిపెద్ద హైవే ఉందని, దానిపై ప్రయాణిస్తే ఏకంగా 14 దేశాలు చుట్టేయచ్చనే సంగతి మీకు తెలుసా? ఉత్తర అమెరికా- దక్షిణ అమెరికాలను కలిపే పాన్ అమెరికా హైవే ప్రపంచంలోనే అతి పెద్ద రహదారి. అలస్కాలో మొదలై అర్జెంటీనా వరకూ ఈ రహదారి కొనసాగుతుంది. రెండు మహా ద్వీపాలను అనుసంధానించే ఈ సింగిల్ రూట్ నిర్మాణానికి 1923లో తొలి అడుగు పడింది. ఈ హైవేను మొత్తం 14 దేశాలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కాగా ఈ రహదారిలోని 110 కిలోమీటర్ల ఒక భాగం నిర్మాణం ఇప్పటివరకూ పూర్తి కాలేదు. ఈ భాగాన్ని డారియన్ గ్యాప్ అని అంటారు. ఇది పనామా కొలంబియాల మధ్య ఉంది. కాగా ఈ డారియన్ గ్యాప్ ప్రాంతం కిడ్నాప్‌లు, డ్రగ్ ట్రాఫికింగ్, స్మగ్లింగ్ తదితర అక్రమ కార్యకలాపాలకు నిలయంగా మారింది. దీంతో జనం ఈ మార్గాన్ని దాటేందుకు బోటు లేదా ప్లెయిన్ మాధ్యమంలో బైపాస్ చేస్తారు. చదవండి: ఖండాంతరాలు దాటిన ప్రేమ.. భార్య కోసం ఇండియా నుంచి యూరప్‌కు సైకిల్‌పై ఆ 14 దేశాలు ఇవే.. 1. యునైటెడ్ స్టేట్స్ 2.కెనడా 3. మెక్సికో 4. గ్వాటెమాల 5. ఎల్ సల్వడార్ 6.హోండురాస్ 7. నికరాగ్వా 8. కోస్టా రికా 9.పనామా 10.కొలంబియా 11. ఈక్వెడార్ 12. పెరూ 13.చిలీ 14. అర్జెంటీనా ప్రయాణానికి ఎంత సమయం పడుతుందంటే... ఎవరైనా ప్రతీరోజూ సుమారు 500 కిలోమీటర్ల మేరకు ప్రయాణించగలిగితే వారు 60 రోజుల్లో ఈ రహదారి ప్రయాణాన్ని పూర్తి చేయవచ్చు. కార్లెస్ సాంటామారియా అనే సైకిలిస్టు ఈ రహదారిని 177 రోజుల్లో చుట్టివచ్చాడు. ఈ నేపధ్యంలో అతని పేరు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో నమోదయ్యింది. ఈ రహదారి మొత్తం పొడవు 48 వేల కిలోమీటర్లు. The Pan-American highway is the longest highway in the world. This road is about 19.000 miles/30.000km long #nowyouknow #FridayThoughts pic.twitter.com/oRdBTMhFRD — 🇺🇦Evan Kirstel #B2B #TechFluencer (@EvanKirstel) November 6, 2020 -
48 గంటల్లోనే హైవే కింద సొరంగం.. ఆనంద్ మహీంద్రా ట్వీట్ వైరల్..
డచ్ దేశం నెదర్లాండ్స్‌లో ఒక్క వారాంతంలోనే హైవే కింద సొరంగం నిర్మించిన వీడియోను షేర్ చేశారు భారతవ్యాపార దిగ్గజం ఆనంద్ మహీంద్రా. ఇలాంటి నైపుణ్యం కదా మనం సంపాందిచుకోవాల్సిందని కొనియాడారు. ఇది లేబర్‌ను తగ్గించుకోవడం కాదు.. సమయాన్ని ఆదా చేసుకోవడం అని చెప్పుకొచ్చారు. అభివృద్ధి చెందుతున్న ఆర్థికవ్యవస్థలో ఇలా వేగంగా పనులు చేయడం కూడా చాలా కీలకమని ఆనంద్ మహీంద్రా పేర్కొన్నారు. వేగవంతమైన మౌలిక సదుపాయాల కల్పన అంటే వేగవంతమైన వృద్ధి, అందరికీ ప్రయోజనాలు చేకుర్చడం అని చెప్పారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. The Dutch built a tunnel under a highway in just one weekend! Skills we must acquire. It’s not about labour-saving, but about time-saving. That’s also critical in emerging economy. Faster infrastructure creation means faster growth & benefits to all. pic.twitter.com/SoU3NEsgpE — anand mahindra (@anandmahindra) March 3, 2023 -
అద్దంకి–నార్కెట్‌పల్లి హైవే ఇకపై.. కాసు బ్రహ్మానందరెడ్డి ఎక్స్‌ప్రెస్ వే
దాచేపల్లి: పల్నాడు ప్రాంతానికి చెందిన రాజకీయ యోధుడు, మాజీ ముఖ్యమంత్రి దివంగత కాసు బ్రహ్మానందరెడ్డి పేరు చిరస్మరణీయంగా నిలిచేలా వైఎస్సార్సీపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు బ్రహ్మానందరెడ్డి చేసిన సేవలు, ఆయన చేసిన అభివృద్ధిని గుర్తించిన ప్రభుత్వం హైదరాబాద్–విజయవాడ హైవే, విజయవాడ–చెన్నై హైవేలను కలుపుతూ పల్నాడు ప్రాంతంలోని అద్దంకి–నార్కెట్‌పల్లి ప్రధాన రహదారికి కాసు బ్రహ్మానందరెడ్డి ఎక్స్‌ప్రెస్ వేగా నామకరణం చేస్తూ గురువారం ఉత్తర్వులిచ్చింది. సుమారుగా 200 కిలోమీటర్ల పొడవున్న ఈ రహదారికి కాసు బ్రహ్మానందరెడ్డి ఎక్స్‌ప్రెస్ వేగా నామకరణం చేయడంపై పల్నాడు ప్రాంత ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రహదారికి తన తాత పేరు పెట్టడంపై గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. దివంగత సీఎం డాక్టర్ వైఎస్సార్ హయాంలో ఈ హైవే నిర్మాణాన్ని చేపట్టారు. -
నడిరోడ్డుపై కారు ఆపినందుకు..ఊహించని రేంజ్లో జరిమానా!
ఇటీవల కొంతమంది సోషల్‌మీడియా వినియోగదారులు మంచి మంచి వీడియోలతో రాత్రికి రాత్రి మంచి స్టార్డమ్ తెచ్చుకుంటున్నారు. ఆ క్రమంలో వాళ్లు చేసే పిచ్చి స్టంట్లు వారిని ఇబ్బందిపాలు చేయడం లేక కటకటాల పాలుచేయడమో! జరుగుతోంది. అచ్చం అలాంటి పనే ఇక్కడొక యువతి చేసి భారీ జరిమానాను ఎదుర్కొంటోంది. ఇన్‌స్టాగ్రాంలో మంచి ఫేమ్ ఉన్న ఆ యువతి ఒక వీడియో కోసం అని ఒక పిచ్చి స్టంట్ చేసి పోలీసులకు అడ్డంగా దొరికిపోయింది. ఆ వీడియోని చూసిన పోలీసులు ఆమెకు భారీగా జరిమాన విధించడమే గాక లీగల్ యాక్షన్స్ తీసుకుంటామని గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో చోటు చేసుకుంది. ఆమె కారుని హైవే మధ్యలో ఆపి హిరోయిన్ రేంజ్లో ఫోజులు కొడుతున్న ఓ వీడియోని ఇన్‌స్టాగ్రాంలో పోస్ చేసింది. ఐతే నెట్టింట వైరల్ అవుతున్న ఆవీడియోని చూసి ఘజియాబాద్ ట్రాఫిక్ పోలీసులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. దీంతో పోలీసలు సదరు మహిళను ఇన్‌స్టాగ్రాంలో మంచి ఫాలోవర్స్ ఉన్న వైశాలి చౌదరి ఖుటైల్గా గుర్తించారు. అంతేగాదు ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించినందుకు ఏకంగా రూ. 17 వేలు జరిమానా విధిస్తూ గట్టి షాక్ ఇచ్చారు ట్రాఫిక్ పోలీసులు. ఈ మేరకు సాహిబాద్ ఏసీపీ ట్విట్టర్ వేదికగా ఠాణా సాహిబాద్ ప్రాంతంలో ఒక యువతి కారుని నడిరోడ్డుపై ఆపి ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమించినందుకుగానూ రూ.17 వేలు జరిమాన విధిస్తున్నట్లు చలానా పంపినట్లు తెలిపారు. అంతేగాదు ఇందుకు గాను ఆ యువతిపై తాము న్యాయపరమైన చర్యలు కూడా తీసుకుంటామని ఏసిపీ ట్విట్టర్లో పేర్కొన్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. View this post on Instagram A post shared by Vish ♥️ (@vaishali_chaudhary_khutail) (చదవండి: ఆ స్కూల్లో ఒకే ఒక్కడు స్టూడెంట్!) -
‘హై’.. రన్ వే!
సాక్షి ప్రతినిధి, గుంటూరు: బాపట్ల జిల్లా కొరిశపాడు మండలంలోని జాతీయ రహదారిపై గురువారం చేపట్టిన విమానాల తొలి ట్రయల్ రన్ వియవంతమైంది. పిచ్చకలగుడిపాడు–రేణింగవరం గ్రామాల వద్ద 16వ నంబర్ హైవేపై 4.1 కిలోమీటర్ల పొడవు, 33 మీటర్ల వెడల్పుతో ఏర్పాటు చేసిన రన్‌వే మీదుగా విమానాలు గాల్లోకి దూసుకువెళ్లాయి. నాలుగు ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్‌లు, ఒక కార్గో విమానం ఐదు అడుగుల ఎత్తులో తిరుగుతుండగా.. రాడార్ సిగ్నల్స్‌తో పాటు రన్‌వే ఎమర్జెన్సీ ల్యాండింగ్‌కు అనువుగా ఉందా.. లేదా.. అనే విషయాన్ని వైమానిక దళ అధికారులు పరిశీలించారు. సదరన్ ఎయిర్ కమాండ్ నుంచి ఎప్పటికప్పుడు సూచనలందుకుంటూ ఈ ట్రయల్ రన్‌ను నిర్వహించారు. ఈ దృశ్యాలను తిలకించేందుకు సమీప గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో రన్‌వే వద్దకు చేరుకున్నారు. విమానాల విన్యాసాలను ఆసక్తిగా తిలకించారు. ఉదయం 10.51 గంటలకు ప్రారంభమైన ట్రయల్ రన్ ప్రక్రియ 45 నిమిషాలపాటు జరిగింది. బాపట్ల జిల్లా పిచ్చకలగుడిపాడు–రేణంగివరం మధ్య హైవేపై నిర్మించిన ఎయిర్ స్ట్రిప్ దేశంలోనే మూడవది.. వైమానిక దళ అధికారి ఆర్ఎస్ చౌదరి మాట్లాడుతూ.. ట్రయల్ రన్లో ఎలాంటి సమస్య ఎదురుకాలేదని చెప్పారు. రన్‌వేకు ఇరువైపులా ఫెన్సింగ్, గేట్లు పెట్టిన తర్వాత విమానాల ల్యాండింగ్‌కు ఏర్పాట్లు చేస్తామన్నారు. త్వరలోనే ఈ ప్రక్రియ పూర్తి చేస్తామని చెప్పారు. 16వ నంబర్ జాతీయ రహదారిపై బాపట్ల–నెల్లూరు జిల్లాల మధ్యలో రెండు ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీలు సిద్ధం చేస్తున్నామన్నారు. కొరిశపాడు మండలంలోని ఈ రన్‌వే.. దక్షిణ భారతదేశంలోనే మొదటిదని.. దేశంలోనే మూడవదని చెప్పారు. వచ్చే ఏడాది దీనిని ప్రధాని మోదీ లాంఛనంగా ప్రారంభిస్తారని తెలిపారు. ఉత్తరప్రదేశ్, రాజస్తాన్‌లో ఇప్పటికే రెండు ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీలు అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. ఏపీ, యూపీ, రాజస్తాన్‌తో పాటు పశ్చిమ బెంగాల్, తమిళనాడు, ఒడిశా, జమ్మూ కశ్మీర్‌లలో కూడా వీటిని ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. బాపట్ల కలెక్టర్ విజయకృష్ణన్ మాట్లాడుతూ.. ట్రయల్ రన్లో ఎలాంటి లోపాలు కనిపించలేదని తెలిపారు. కార్యక్రమంలో వాయుసేన అధికారి వి.ఎం.రెడ్డి, ప్రకాశం జిల్లా కలెక్టర్ కె.ఎస్.దినేశ్‌కుమార్, బాపట్ల ఎస్పీ వకుల్ జిందాల్, జిల్లా సంయుక్త కలెక్టర్ డాక్టర్ కె.శ్రీనివాసులు, వాయుసేన అధికారులు పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో నలుగురు దుర్మరణం
తాంసి(బోథ్): ఆదిలాబాద్ జిల్లాలో అంతర్రాష్ట్ర రహదారిపై ఆదివారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తాంసి మండలం హస్నాపూర్ గ్రామ సమీపంలోని మూలమలుపు వద్ద రెండు ద్విచక్రవాహనాలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో ముగ్గురు ప్రమాద స్థలంలోనే మృతిచెందగా ఒకరు ఆస్పత్రిలో చనిపోయారు. పోలీసుల కథనం ప్రకారం.. మహారాష్ట్రలోని కిన్వట్ తా లుకా అందుకోరి గ్రామానికి చెందిన సుజిత్‌రామ్ ఉపాధి కోసం భార్య వందన, కుమార్తె మనీష, కుమారుడు సంస్కార్తో కలసి ఇచ్చోడలో నివాసం ఉంటున్నాడు. అక్కడ సుజిత్‌రామ్ టెంట్‌హౌస్‌లో డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. కాగా, సుజిత్‌రామ్ సోదరుడి నిశ్చితార్థం ఉండటంతో శనివారం కుటుంబ సభ్యులతో కలసి ద్విచక్రవాహనంపై స్వగ్రామానికి వెళ్లారు. శుభకార్యం అనంతరం ఆదివారం ఉదయం తిరిగి ఇచ్చోడకు బయల్దేరారు. అదే సమయంలో మహారాష్ట్రలోని యావత్మాల్ జిల్లా ముంచ్ గ్రామానికి చెందిన ధన్వి నారాయణ ఆదిలాబాద్ వైపు నుంచి బైక్‌పై స్వగ్రామానికి వెళ్తున్నాడు. హస్నాపూర్ వద్దకు రాగానే ఈ రెండు బైక్‌లు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో ధన్వి నారాయణ (30), సుజిత్‌రామ్ (38), మనీష (15) తలలకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతిచెందారు. సంస్కార్(11), సుజిత్ భార్య వందనకు తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు ఆదిలాబాద్ రిమ్స్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సంస్కార్ మృతిచెందాడు. పోలీసులు మృతదేహాలను రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. -
టైర్ పేలి దూసుకెళ్లిన ఇన్నోవా ..ఐదుగురు మృతి
సాక్షి, మండ్య: వేగంగా వెళ్తున్న ఇన్నోవా కారు టైర్ పేలడంతో డివైడర్‌ను ఢీకొని అవతలి లేన్‌లో ఎదురుగా వస్తున్న స్విఫ్ట్ కారును గుద్దింది. ఈ ప్రమాదంలో ఇన్నోవాలోని ముగ్గురు, స్విఫ్ట్‌లోని ఇద్దరు అక్కడికక్కడే మరణించారు. ఆదివారం రాత్రి మండ్య జిల్లాలోని నాగమంగళ తాలూకాలోని ఎ.నాగతిహళ్ళి వద్ద బెంగళూరు– మంగళూరు హైవే పై జరిగింది. బెంగళూరు నుంచి హాసన్‌వైపు వెళుతున్న ఇన్నోవా కారు టైర్ పేలి అదుపు తప్పింది. డివైడర్‌ను ఢీకొని అవతలి లేన్ మీదకు దూసుకెళ్లింది. అదే సమయంలో హాసన్ నుంచి బెంగళూరు వైపు వస్తున్న స్విఫ్ట్ కారు మీద ఇన్నోవా పడడంతో రెండు వాహనాలూ తుక్కుతుక్కయ్యాయి. స్విఫ్ట్‌లో ప్రయాణిస్తున్న హాసన్‌కు చెందిన జయంతి (60), శ్రీనివాస్ మూర్తి (60), ఇన్నోవాలోని చెన్నైకి చెందిన కిశోర్ (25), ప్రభాకర్ (75), మరొక 40 సంవత్సరాల వ్యక్తి మృతి చెందారు. మరో ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని ఆదిచుంచనగిరి ఆస్పత్రికి తరలించారు. బిండిగనవిలె పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేశారు. (చదవండి: పండ్లరసంలో మద్యం కలిపి తాగించి.వృద్ధుడు అఘాయిత్యం) -
Highway to Swades: మనలోనే సూపర్శక్తి
భారతదేశంలో అత్యంత శక్తిమంతమైన మహిళల్లో ఒకరుగా పేరొందారు భైరవి జానీ. లాజిస్టిక్ సప్లై చైన్ వ్యవస్థాపకురాలైన భైరవి జానీ దేశం అంతటా పద్ధెనిమిది వేల కిలోమీటర్లకు పైగ పర్యటించి, తన అనుభవాలతోపాటు, ఎంతోమంది అభిప్రాయాలను పొందుపరిచి, ‘హైవే టు స్వదేశ్’ పేరుతో పుస్తకంగా తీసుకువచ్చారు. ఈ సందర్భంగా ఇటీవల హైదరాబాద్‌కు వచ్చిన భైరవి జానీ మనదేశంలోనే సూపర్ శక్తి ఉందంటూ తన పర్యటన విశేషాలను, అనుభవాలను పంచుకున్నారు. ‘‘భారతదేశపు నాగరికతపై దృష్టి సారించినప్పుడు మనవారిలో ఉన్న సూపర్ పవర్స్ ఏంటో అర్దమైంది. నాగాలాండ్‌లోని మారుమూల ప్రాంతాల నుంచి రాన్ అఫ్ కచ్ వరకు, దక్కన్ పీఠభూమిలోని వివిధ ప్రాంతాలన్నీ 51 రోజుల పాటు 18,181 కిలోమీటర్లు ప్రయాణించాను. వీటితోపాటు రెండు దశాబ్దాల కాలంలో దేశవ్యాప్తంగా చేసిన వివిధ ప్రయాణాలలో పరిశీలనల విశ్లేషణ కూడా ఇందుకు దోహదపడింది. ► స్వయంగా తెలుసుకుని... 2014లో ఒక రోజు రోడ్ ట్రిప్‌లో ఉన్నప్పుడు దేశ ఆర్థికాభివృద్దిపై సమగ్ర పుస్తకం తీసుకురావాలనే ఆలోచన వచ్చింది. అప్పటి నుంచే నా వ్యాపార పనులతో పాటు రోడ్ ట్రిప్స్ కూడా ప్లాన్ చేసుకునేదాన్ని. అన్ని చోట్లా ప్రజల జీవన స్థితిగతులను స్వయంగా అడిగి తెలుసుకున్నాను. చాలా భిన్నమైన పరిస్థితులు, అతి సాధారణ విషయాలు కూడా స్వయంగా చూసి తెలుసుకున్నాను. అలాగే, పెద్ద యెత్తున వ్యాపారాలు చేస్తున్న వారినీ కలిశాను. హిమాలయాల్లో ఉన్న భిన్న కమ్యూనిటీ ప్రజలను కలుసుకున్నాను. వారి సామాజిక, ఆర్థిక, అభివృద్ధి స్థితిగతులన్నింటిపైన ఒక అవగాహన తెచ్చుకున్నాను. కోవిడ్ లాక్డౌన్ టైమ్‌లో ఈ పుస్తకం రాయడం ప్రారంభించాను. హైదరాబాద్ విషయాలనూ ఇందులో పొందుపరిచాను. ఇక్కడి వంటకాలు, దుస్తులు, భాష,. సాహిత్యం, కళలు, ఆర్కిటెక్చర్, పండగలు, వ్యాపారం.. ప్రతిదీ సమ్మేళన సంస్కృతిగా ఉంటుంది. పాత నగరం నుంచి ఇప్పుడు ఆధునిక మహానగరంగా టెక్నాలజీ హబ్‌గా మారింది. ఇదంతా ప్రజల విజ్ఞానశక్తి, వ్యాపార శక్తిని సూచిస్తుంది. ‘హైవే టు స్వదేశ్’ అనేది భారతదేశంలోని పన్నెండు సూపర్ పవర్లకు అద్భుతమైన ప్రతిబింబం అని చెప్పవచ్చు. ► సమయపాలన చాలా మంది ‘మీరు 20 వేర్వేరు కంపెనీలలో బోర్డు మెంబర్‌గా ఉండి, ట్రావెలర్‌గా, రచయితగా సమయాన్ని ఎలా సర్దుబాటు చేసుకుంటున్నారు’ అని అడుగుతుంటారు. ఏదైనా పని ప్రారంభించాలనుకున్నప్పుడు, ఆ పని పూర్తిచేయనిదే నాకు నిద్ర పట్టదు. నేను తిరిగిన నేల, అక్కడి ప్రజల అనుభవాలను తెలుసుకుంటున్నప్పుడు జరిగింది అదే. టైమ్ విషయంలో చాలా కచ్చితమైన నిర్ణయం ఉంటుంది. రాజు అయినా కూలీ అయినా మనకు ఉండేది 24 గంటలు మాత్రమే. అందుకనే సమయాన్ని పనులవారీగా విభజించుకొని, ప్లాన్ చేసుకుంటాను. ముందుగా ఏ పని ముఖ్యమో దానిపైనే దృష్టి పెడతాను. ప్రతి విషయంలో ముందే ప్లానింగ్‌తో ఉంటాను. అనుకున్న సమయానికల్లా పనులు పూర్తి చేస్తాను. కుటుంబం, వ్యాపారం, రచనలు .. ఇలా టైమ్‌ని విభజించుకుంటాను. ► రోడ్ ట్రిప్స్.. మన దేశం చాలా అందమైనది. ఎంతో విజ్ఞానం ఇక్కడ ప్రజల మధ్య, సంస్కృతుల్లో భాగంగా ఉంది. ప్రతిచోటా ఆసక్తికరమైన కథనాలెన్నో. ఈ దేశంలో అపారమైన అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వం, కంపెనీ, ఏదో ఒకదానిపైన ఆధారపడకుండా ప్రజలు తమ మధ్య ఉన్న సూపర్ పవర్స్‌పై నమ్మకంతో ముందడుగు వేయాలి. మనకి మనమే ఒక అద్భుతమైనవారిగా విశ్వసిస్తే ఎన్నో అద్భుతాలను సృష్టించవచ్చు. రోడ్డు ట్రిప్స్‌లో పాల్గొనాలి. జనంతో మాట్లాడాలి. దేశం అభివృద్ధికి సంబంధించి లోతైన విశ్లేషణ చేసి, అందులో మనకున్న కలల సాధనకు కృషి చేయాలి’ అని వివరించారు భైరవి జానీ. 1896లో స్థాపించిన ఎస్.సి.ఏ. గ్రూప్ ఆఫ్ కంపెనీలకు దశాబ్ద కాలం నుంచి చైర్‌పర్సన్‌గా, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా సేవలందిస్తోంది భైరవి. ఈ క్రమంలో అనేక వెంచర్లను ప్రారంభించడంతో పాటు వాటిని అభివృద్ధి చేస్తూ వచ్చారు. ముంబై వాసి అయిన భైరవి జానీ యుఎస్ఎలో చదివి, అక్కడే వ్యాపారలావాదేవీలు కొనసాగించి 2001లో తన స్వంత వెంచర్‌ను ప్రారంభించేందుకు భారతదేశానికి తిరిగి వచ్చారు. దేశ, విదేశాల్లో బిజినెస్ ఉమన్‌గా తన సత్తా చాటుతున్నారు. శిక్షణ పొందిన శాస్త్రీయ నృత్యకారిణిగానూ ఆమెకు పేరుంది. హిమాలయాల్లో ఉన్న వివిధ కమ్యూనిటీ ప్రజలకు స్థిరమైన జీవనోపాధిని సృష్టించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. – నిర్మలారెడ్డి -
ఓ నలుగురికి భోజనం.. ఆ తర్వాతే మనం
సాక్షి, కామారెడ్డి: జీవితంలో నలుగురు మనుషులను సంపాదించుకుంటే చాలనేది పెద్దల మాట. మరి ఆ మాటనే ఒంట పట్టించుకున్నాడో ఏమో కానీ ఈ పోలీసాయనకి మాత్రం నిత్యం నలుగురుకి కడుపునిండా అన్నం పెట్టనిదే గానీ పొద్దు గడవదు. తానే స్వయంగా వండి నలుగురు పేదలకు వడ్డించిన తర్వాతే కానీ భోజనం చేయడు. కామారెడ్డి జిల్లా పోలీస్ శాఖలో సబ్ ఇస్పెక్టర్ గా పని చేస్తున్న బి. కోనారెడ్డి 44వ నంబరు జాతీయ రహదారిపై పెట్రోలింగ్ నిర్వహించే బృందానికి అధికారిగా రెండేళ్ళుగా విధులు నిర్వహిస్తున్నారు. హైవే మీద సుదూరప్రాంతాలకు కాలినడకన వెళ్లే పేదలను చూసి చలించిపోయిన ఆయన తనకు చేతనైనంతగా.. ప్రతిని«త్యం నలుగురికి కడుపునిండా భోజనం పెడుతున్నారు. తనకు డ్యూటీ లేని రోజున కూడా అలవాటును మానుకోకుండా పట్టణంలోని సీఎస్ఐ గ్రౌండ్ సమీపంలోని పేదలకు భోజనం పెడతారు. మానసిక వికలాంగులకైతే తానే అన్నం కలిపి ఇస్తాడు. తన వద్ద స్నేహితులు, బంధువుల దగ్గర వృథాగా ఉన్న దుస్తులను కూడా తీసుకుని పేదలకు అందిస్తుంటాడు. సాటి మనిషి ఆకలి తీర్చే అవకాశం, అదృష్టం మనుషులకే ఉందని, ఇది ఎంతో నాకు తృప్తినిస్తోందని సాక్షి వద్ద ఆనందం వ్యక్తం చేశారు. కాగా ఎస్సై కోనారెడ్డి ఔదార్యంపై ఉన్నతాధికారుల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. -
మహారాష్ట్రలో ఘోర బస్సు ప్రమాదం
నాసిక్: ప్రయాణికులతో వెళ్తున్న ప్రైవేట్ బస్సు ట్రక్కు ట్రైలర్‌ను ఢీకొట్టిన ఘటనలో మంటలు చెలరేగి బస్సులోని ఇద్దరు చిన్నారులు సహా 12 మంది సజీవ దహనమయ్యారు. మరో 43 మంది గాయపడ్డారు. మహారాష్ట్రలోని నాసిక్–ఔరంగాబాద్ హైవేపై నాదుర్నాకా సమీపంలో శనివారం ఉదయం 5.15 గంటల సమయంలో దుర్ఘటన సంభవించింది. యావత్మాల్ నుంచి ముంబై వైపు వెళ్తున్న ప్రైవేట్ లగ్జరీ బస్సు ట్రక్కు ట్రైలర్‌ను, ఆపై కార్గో వ్యాన్‌ను ఢీకొట్టింది. దీంతో బస్సులో వేగంగా వ్యాపించిన అగ్నికీలలు రెండేళ్ల వయస్సున్న ఇద్దరు చిన్నారులు సహా 12 మందిని బలి తీసుకున్నాయి. మరో 43 మంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది వచ్చి మంటలను ఆదుపులోకి తెచ్చారు. బస్సు పూర్తిగా తగులబడిపోయింది. క్షతగాత్రులను నాసిక్‌లోని వేర్వేరు ఆస్పత్రులకు తరలించారు. దుర్ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున, క్షతగాత్రులకు రూ.50 వేల చొప్పున పరిహారం ప్రకటించారు. మహారాష్ట్ర సీఎం షిండే ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం అందజేస్తామన్నారు. క్షతగాత్రులకు ఉచితంగా వైద్య సాయం అందజేస్తామని చెప్పారు. -
రహదారులే ఏరులైన వేళ.. ఎల్లో అలర్ట్ జారీ
న్యూఢిల్లీ: గత రెండు రోజులుగా వరసగా కురుస్తున్న భారీ వర్షాలకు రహదారులన్ని జలమయమయ్యాయి. ఈ మేరకు వరద తాకిడికి నేలకూలిన చెట్లు, పాడైన రహదారుల జాబితాను విడుదల చేశారు అధికారులు. ఈ క్రమంలోనే ఆ రహదారులకు ప్రత్యామ్నాయంగా తమ ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. అంతేగాదు ఢిల్లీ జైపూర్ హైవేపై ఉన్న వరద నీరు, ఆ నీటిలోనే వెళ్తున్న వాహనాలకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట హల్చల్ చేస్తుంది. రహదారులపై నీరు ఎక్కువగా ఉన్న వేగంగా వెళ్లిపోతున్న వాహనాలను ఆ వీడియోలో చూడవచ్చు. ట్రాఫిక్ పోలీసులు రంగంలోకి దిగే సరికి వాహనాలన్ని నెమ్మదిగా వెళ్తుంటాయి. శుక్రవారం ఉదయం నుంచి శనివారం ఉదయం వరకు సుమారు 15 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని భారత వాతావరణ శాఖ పేర్కొంది. అలాగే శనివారం కూడా భారీ వర్షాలు పడే అవకాశం ఉందంటూ...వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. (చదవండి: ఘోర ప్రమాదం..గోడ కూలి 10 మంది దుర్మరణం) -
YSR Kdapa-Renigunta: వడివడిగా హైవే.. రూ.4వేల కోట్లతో రోడ్డు నిర్మాణం
సాక్షి, రాజంపేట : శేషాచలం అటవీ ప్రాంతంలో పచ్చటి ప్రకృతి ఒడిలో ఆహ్లాదకరమైన ప్రయాణం చేసే దిశగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వడివడిగా అడుగులు వేస్తున్నాయి. రాయలసీమ జిల్లాలకు ముఖ్య రహదారిగా ప్రాచుర్యం పొందిన 716 కడప–రేణిగుంట జాతీయరహదారిని 2024 నాటికి పూర్తిగా అందుబాటులో తీసుకురావాలని కేంద్రం యోచిస్తోంది. తక్కువ వ్యవధిలోనే తిరుపతి.. కడప–రేణిగుంట ఎన్‌హెచ్ ఏర్పడిన తర్వాత తక్కువ వ్యవధిలో తిరుపతికి చేరుకోవచ్చు. ఫలితంగా మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, కర్ణాటక, తెలంగాణా రాష్ట్రాల నుంచి వచ్చేవారు తిరుపతి, చెన్నై నగరాలకు వెళ్లే వారికి కడప–రేణిగుంట రహదారి ఎన్‌హెచ్ చేయడం వల్ల త్వరితగతిన గమ్యానికి చేరుకునే వీలు కలుగుతుంది. రెండు ప్యాకేజీలుగా..హైవే నిర్మాణం కడప నుంచి చిన్నఓరంపాడు(64.2కేఎం), చిన్నఓరంపాడు నుంచి రేణిగుంట వరకు రెండుప్యాకేజీలుగా హైవే నిర్మాణపనులు జరుగుతాయి. నాలుగులేన్లుగా రోడ్డు నిర్మితం కానుంది. ఇందు కోసం టెండర్లను కూడా కేంద్రం పిలిచింది. రెండు ప్యాకేజీలకు కలిపి రూ.4వేల కోట్లు వ్యయం చేయనుంది. సెప్టెంబరు 16 తర్వాత టెండర్ల ఖరారును నిర్ణయిస్తారు. రాజంపేట, రైల్వేకోడూరులో బైపాస్ రహదారి కడప–రేణిగుంట రహదారిలో రాజంపేట, రైల్వేకోడూరులో బైపాస్ రహదారి నిర్మించాలని యోచిస్తున్నారు. ముంబై–చెన్నై రైలుమార్గం వెంబడి (పడమర వైపు )భాకరాపేట నుంచి చిన్నఓరంపాడు వరకు మార్గం నిర్మితం కానున్నది.ఇది పూర్తిగా అటవీమార్గంలోనే కొనసాగుతుంది. మార్గమధ్యలో ఆర్వోబీలు, చెయ్యేరునదిపై వంతెనలు, చిన్న చిన్న బ్రిడ్జిల నిర్మాణాలు ఉన్నాయి. త్వరతగితిన హైవే నిర్మాణానికి ఎంపీ మిథున్‌రెడ్డి కృషి కడప–రేణిగుంట నేషనల్ హైవే త్వరితగతిన నిర్మితమయ్యేలా రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డి తన వంతు కృషిచే శారు. కేంద్రం తీసుకున్న ప్రయార్టీలో కడప–రేణిగుంట ఎన్‌హెచ్‌ను చేర్చేలా ఎంపీ విశ్వప్రయత్నాలు చేశారు. ఫలితంగా భూసేకరణ, మరోవైపు టెండర్ల ప్రక్రియను కేంద్రం ప్రారంభించింది. రెండేళ్లలో ఎన్‌హెచ్‌ను అందుబాటులోకి తీసుకురావాలన్నదే అభిమతంగా ఎంపీ ప్రయత్నిస్తున్నారు. ఒంటిమిట్ట, నందలూరు ప్రాంతాలకు స్పెషల్ కనెక్టిటివిటీ అవసరం జిల్లాలో ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రాలైన నందలూరు, ఒంటిమిట్ట కేంద్రాలకు ఎన్‌హెచ్ నుంచి కనెక్టిటివిటీ రోడ్ (సర్వీసురోడ్డు) అవసరమని పలువురు భక్తులు కేంద్రాన్ని కోరుతున్నారు. వివిధ ప్రాంతాల నుంచి తిరుపతికి వెళ్లే యాత్రీకులు ఒంటిమిట్ట రామయ్య, సౌమ్యనాథుని దర్శించుకుంటారు. అంతేగాకుండా రాయలసీమలో తొలిసారిగా బయల్పడిన బౌద్ధారామాలున్నాయి. ట్రాఫిక్ సమస్య తగ్గుతుంది. ప్రస్తుతం కడప–రేణిగుంట హైవేలో ట్రాఫిక్ పెరుగుతోంది. ఈ మార్గం మీదుగా తిరుపతి, చెన్నై, ముంబై, హైదరాబాదులకు రాకపోకలు జరుగుతున్నాయి. నిత్యం 17వేలకు పైగా వాహనాలు పరుగులు తీస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న ట్రాఫిక్‌కు హైవే కెపాసిటీ సరిపోవడంలేదు. ఫలితంగా తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. అంతేగాకుండా కడప–రేణిగుంట రోడ్డు ప్రయాణం మూడు నుంచి నాలుగు గంటలకుపైగా పడుతోంది. సకాలంలో గమ్యాలకు చేరలేని పరిస్ధితి. నాలుగులైన్లరోడ్డు నిర్మాణంతో ట్రాఫిక్ తగ్గుతుంది. ప్రమాదాలు తగ్గుముఖం పడతాయి. భూసేకరణ ప్రక్రియ ప్రారంభం కడప–రేణిగుంట ఎన్‌హెచ్‌కు 1,066 ఎకరాల భూసేకరణ చేపట్టారు. ఇప్పటికే డ్రాఫ్ట్ నోటిఫికేషన్ పూర్తి అయింది. డ్రాఫ్ట్ డిక్లరేషన్ చేయాల్సి ఉంది. పరిహారం చెల్లింపు ప్రక్రియను రెవెన్యూ అధికారులు చేపట్టారు. అన్నమయ్య జిల్లా జేసీ తమీమ్ అన్సారియాలు పరిహారం అందజేసే అంశంపై కసరత్తు చేస్తున్నారు. వైఎస్సార్ జిల్లా జాయింట్ కలెక్టర్ కూడా భూసేకరణపై దృష్టి సారించారు. త్వరగా అందుబాటులోకి తీసుకొస్తాం రాజంపేట, రైల్వేకోడూరులో బైపాస్‌రోడ్డు నిర్మితం కానుంది. రూ.4వేల కోట్లతో రెండు ప్యాకేజీలుగా నిర్మాణ పనులు జరుగుతాయి. గ్రీన్‌హైవే ఎక్స్‌ప్రెస్‌లో పచ్చటి ప్రకృతిలో.. ఆహ్లాదకరమైన వాతవరణంలో త్వరితగతిన గమ్యాలకు చేరుకోవచ్చు. 2024 నాటికి అందుబాటులోకి తీసుకొచ్చే దిశగా అడుగులు పడుతున్నాయి. –పీవీ మిథున్‌రెడ్డి, ఎంపీ, రాజంపేట ప్రమాదాలు తగ్గుతాయి కడప–రేణిగుంట ఎన్‌హెచ్ నిర్మాణంతో ప్రమాదాలు తగ్గుముఖం పడతాయి. కడప–తిరుపతి మధ్య ప్రయాణ వ్యవధి తగ్గిపోతుంది. ప్రసిద్ధి చెందిన దేవాలయాలు ఒంటిమిట్ట, నందలూరులో ఉన్నందున ప్రత్యేకంగా స్పెషల్ సర్వీసు రోడ్డు నిర్మిచాల్సిన అవసరం ఉంది. త్వరగా అందుబాటులోకి వస్తే ఉభయ వైఎస్సార్ జిల్లా వాసులే కాకుండా, ఉత్తరభారతదేశం వారికి సకాలంలో తిరుపతి,గా చెన్నైలకు వెళ్లే వీలు ఉంటుంది. –మేడారఘునాథరెడ్డి, అధినేత, ఎంఆర్‌కెఆర్ సంస్థ, నందలూరు -
బ్యాగ్‌లో 15 ఏళ్ల బాలిక మృతదేహం
ముంబై: మహారాష్ట్రలో పాల్ఘర్ జిల్లాలోని వాసాయిలో 15 ఏళ్ల బాలిక మృతదేహంతో కూడిన బ్యాగ్‌ని గుర్తించారు పోలీసులు. ఆ బ్యాగ్ ముంబై అహ్మదాబాద్ హైవే పక్కనే ఉన్న నైగావ్ బ్రిడ్జి సమీపంలో శుక్రవారం సాయంత్రం రెండు గంటలన సమయంలో కనుగొన్నారు. ఒక బాటసారి ఈ బ్యాగ్‌ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో వాలివ్ పోలిస్టేషన్ బృందం సంఘటన స్థలానికి చేరుకుంది. ఐతే మృతదేహం పై పలు చోట్ల కత్తిపోట్టు ఉన్నాయని పోలీసులు తెలిపారు. ఆ బాలిక మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. బాధితురాలు ముంబైలోని అంధేరి ప్రాంతాని చెందిన వాసిగా పేర్కొన్నారు. అదీగాక అంధేరి పోలీస్టేషన్లో ఒక కిడ్నాప్ కేసు నమోదైనట్లు గుర్తించామని చెప్పారు. దీంతో తాము ఈ కేసును మర్డర్ కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. అలాగే బాధితురాలి కుటుంబికులు కూడా ఆమె స్కూల్‌కి వెళ్లిందని పొద్దుపోయినా ఇంటికి చేరుకోకపోవడంతో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. అంతేకాదు తాము ఆయా ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజ్‌లను కూడా పరిశీలిస్తున్నట్లు పోలీసుతెలిపారు. (చదవండి: 12 ఏళ్లలో 339 చోరీలు.. పోలీసులకు ఏమాత్రం డౌట్ రాకుండా.. ఆ ఆలు మగలు ఎలా చిక్కారంటే!) -
టైటిల్ పాజిటివ్‌గా ఉంది
‘‘హైవే’ టైటిల్ పాజిటివ్‌గా ఉంది. ట్రైలర్ చూడగానే ‘ఆవారా, రాక్షసుడు’ చిత్రాలు చూసినట్టుంది. ఇలాంటి మంచి సినిమాలు తీస్తున్నందుకు నిర్మాత వెంకట్‌గారికి థ్యాంక్స్’’ అని హీరో నాగశౌర్య అన్నారు. ఆనంద్ దేవరకొండ, మానస జంటగా కేవీ గుహన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘హైవే’. నార్త్‌స్టార్ సమర్పణలో శ్రీ ఐశ్వర్యలక్ష్మి మూవీస్, వెంకట్ తలారి ప్రొడక్షన్స్‌లో రూపొందిన ఈ సినిమా ఈ నెల 19న ‘ఆహా’ ఓటీటీలో రిలీజ్ అవుతోంది. ఈ సినిమా ట్రైలర్‌ను నాగశౌర్య విడుదల చేసి, మాట్లాడుతూ– ‘‘నాకు లవర్ బాయ్ అని ప్రేక్షకులు ట్యాగ్ ఇచ్చారు. కానీ ఆనంద్కి ఎలాంటి ట్యాగ్ లేకపోవడంతో వేర్వేరు జానర్ల సినిమాలను చేస్తున్నారు.. అది చాలా గొప్ప లక్షణం’’ అన్నారు. ‘‘హైవే’ చక్కని ప్రయోగాత్మక చిత్రం’’ అన్నారు ఆనంద్ దేవరకొండ. ‘‘సరికొత్త కథాంశంతో రూపొందిన మా సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తా రని ఆశిస్తున్నాను’’ అన్నారు కేవీ గుహన్. ‘‘అద్భుతమైన థ్రిల్లర్ చిత్రం ఇది’’ అన్నారు నిర్మాత శరత్ మరార్. ‘ఆహా’ మార్కెటింగ్ హెడ్ కార్తీక్, హీరోయిన్ మానస మాట్లాడారు. -
'హైవే'మూవీ ట్రైలర్ లాంచ్ వేడుక (ఫోటోలు)
-
అమ్మాయి లైఫ్ సేవ్ చేయాలంటున్న ఆనంద్ దేవరకొండ
Anand Deverakonda HighWay Trailer Released By Naga Shaurya: 'దొరసాని' సినిమాతో తెలుగు వెండితెరపై ఎంట్రీ ఇచ్చిన ఆనంద్ 'మిడిల్ క్లాస్ మెలోడీస్'తో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు ఆనంద్ దేవరకొండ. అనంతరం వచ్చిన 'పుష్పక విమానం' చిత్రంతో పర్వాలేదనిపించుకున్నాడు. ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకులను పలకరించనున్నాడు. అయితే ఈసారి థియేటర్లో కాకుండా డైరెక్ట్‌గా ఓటీటీ ద్వారా రానున్నాడు ఆనంద్ దేవరకొండ. ఇందులో ఆనంద్ దేవరకొండకు జోడీగా మానస అలరించనుండగా, అభిషేక్ బెనర్జీ కీలక పాత్ర పోషించారు. కె.వి గుహన్ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ ఆహా నిర్మించింది. ఈ సినిమా ఆగస్టు 19న నేరుగా ఆహాలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా మంగళవారం (ఆగస్టు 16) మూవీ ట్రైలర్‌ను హీరో నాగశౌర్య విడుదల చేశాడు. 'నగరంలో వరుస హత్యలతో ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్న సైకో కిల్లర్' అనే న్యూస్‌తో ప్రారంభమైన ఈ ట్రైలర్ ఆద్యతం ఉత్కంఠంగా సాగింది. చదవండి: నేను పెళ్లి చేసుకునే సమయానికే ఆమెకు ఒక బాబు: బ్రహ్మాజీ Get ready for this spine chilling thriller. #HighwayOnAHA Premieres August 19. ▶️https://t.co/aDUgzFE7Mf@ananddeverkonda @SaiyamiKher @nowitsabhi @kvguhan @simonkking #VenkatTalari pic.twitter.com/rWPm0EKRJE — ahavideoin (@ahavideoIN) August 16, 2022 'ఒక అమ్మాయి లైఫ్ సేవ్ చేసేందుకే నీ హెల్ప్ కావాల్సి వచ్చింది', 'మనతో గడుపుతుంది ఈ కొన్ని గంటలైన, తను నన్ను జీవితాంతం మర్చిపోకుడదురా' వంటి డైలాగ్‌లు ఆకట్టుకునేలా ఉన్నాయి. ఇందులో ఆనంద్ దేవరకొండ లుక్ కొత్తగా ఉంది. ఫొటోగ్రాఫర్ అయిన హీరో ప్రేమలో పడుతాడు. సాఫీగా సాగుతున్న అతని ప్రేమ కథలోకి ఓ సీరియల్ సైకో కిల్లర్ ఎంట్రీతో ఎలాంటి మలుపు తిరిగింది? అనే కథతో ఈ సినిమా రూపొందినట్లు తెలుస్తోంది. చదవండి: బిగ్‌బాస్ బ్యూటీకి లైంగిక వేధింపులు.. ఆవేదనతో పోస్ట్ -
'హైవే'లో దూసుకు వస్తున్న ఆనంద్ దేవరకొండ.. 'ఆహా' అనిపిస్తాడా?
Anand Deverakonda Highway Will Direct Release In AHA: రౌడీ హీరోగా విజయ్ దేవరకొండ తనదైన ముద్ర వేసుకున్నాడు. అన్న బాటలోనే తను కూడా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు విజయ్ సోదరుడు ఆనంద్ దేవరకొండ. 'దొరసాని' సినిమాతో తెలుగు వెండితెరపై ఎంట్రీ ఇచ్చిన ఆనంద్ 'మిడిల్ క్లాస్ మెలోడీస్'తో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అనంతరం వచ్చిన 'పుష్పక విమానం' చిత్రంతో పర్వాలేదనిపించుకున్నాడు. ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకులను పలకరించనున్నాడు. అయితే ఈసారి థియేటర్లో కాకుండా డైరెక్ట్‌గా ఓటీటీ ద్వారా రానున్నాడు ఆనంద్ దేవరకొండ. ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ ఆహా నిర్మించిన చిత్రం 'హైవే'. సైకలాజికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం పోస్టర్‌ను శనివారం (ఆగస్టు 6) విడుదల చేసింది ఆహా. ఇందులో అభిషేక్ బెనర్జీ, మానస కీలక పాత్రలు పోషించారు. ఫొటోగ్రాఫర్ అయిన హీరో ప్రేమలో పడుతాడు. సాఫీగా సాగుతున్న అతని జీవితం.. ఓ సీరియల్ కిల్లర్ ఎంట్రీతో ఎలాంటి మలుపు తిరిగింది అనే కథతో ఈ సినిమా రూపొందినట్లు సమాచారం. తర్వలో ఈ సినిమా విడుదల తేదిని ప్రకటించనున్నారు. మరి ఈ సినిమా ఆనంద్ దేవరకొండకు ఎలాంటి మలుపునిస్తుందో చూడాలి. చదవండి: మంటల్లో చిక్కుకున్న ప్రియాంక చోప్రా సహానటి.. బ్రేకప్ రూమర్స్..టైగర్ ష్రాఫ్ అదిరిపోయే స్టంట్స్! దిశా రియాక్షన్ ఇదే! ఇక బతుకంతా వాళ్లకు రాసిచ్చినట్టే.. రొమాంటిక్‌గా 'లైగర్' సాంగ్ HIGH! HIGH!! HIGHWAY!!! A nail biting original movie coming soon😱#HighwayOnAHA@ananddeverkonda @SaiyamiKher @nowitsabhi @kvguhan @simonkking #VenkatTalari pic.twitter.com/YRCgXaDLUB — ahavideoin (@ahavideoIN) August 6, 2022 -
డ్రోన్ల కోసం ఆకాశంలో ‘హైవే’!
రైళ్లు ప్రత్యేకంగా తమకంటూ ఉన్న పట్టాలపై పరుగెడుతుంటాయి.. కార్లు, బస్సుల్లాంటి వాహనాలు వేగంగా దూసుకెళ్లేందుకు ఎక్స్‌ప్రెస్ వేలు కడుతుంటారు. ప్రమాదాలు జరగకుండా రెడ్ సిగ్నళ్లు పెడుతుంటారు. మరి ఆకాశంలో ఎగురుతూ వెళ్లే డ్రోన్ల పరిస్థితి ఏమిటి? అవి ఢీకొట్టుకోకుండా వెళ్లేదెలా? రోజురోజుకూ డ్రోన్ల వినియోగం పెరిగిపోతున్న నేపథ్యంలో ఇలాంటి సందేహాలె వస్తుంటాయి. ఈ నేపథ్యంలోనే ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా యూకేలో డ్రోన్ల కోసం ప్రత్యేకంగా ‘సూపర్ హైవే’ను ఏర్పాటు చేస్తున్నారు. డ్రోన్లు ఒకదానికొకటి ఢీకొట్టుకోకుండా అత్యాధునిక టెక్నాలజీని ఇందులో వినియోగించనున్నారు. ఆ ప్రాజెక్ట్ స్కైవే విశేషాలు ఏమిటో తెలుసుకుందామా.. – సాక్షి సెంట్రల్ డెస్క్ కొన్నేళ్లుగా డ్రోన్ల వినియోగం పెరిగిపోతోంది. కిరాణా సరుకుల నుంచి మందుల దాకా నేరుగా డ్రోన్లతో ఇళ్ల వద్దకు డెలివరీ ఇచ్చేలా ఇప్పటికే అమెజాన్ వంటి సంస్థలు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. మరి ఎవరికివారు ఇష్టారాజ్యంగా డ్రోన్లను ఎగురవేస్తే పెద్ద సమస్య అయి కూర్చుంటుంది. డ్రోన్లు ఒకదానికొకటి ఢీకొట్టుకోవడమే కాదు.. విమానాలు, హెలికాప్టర్లు వంటి వాటికీ ప్రమాదకరంగా మారుతాయి. విద్యుత్, సెల్‌ఫోన్ టవర్లు, అతి ఎత్తయిన భవనాలను ఢీకొట్టడం వంటి సమస్యలూ ఉంటాయి. ఈ నేపథ్యంలో నేలపై రోడ్లు ఉన్నట్టుగానే.. డ్రోన్ల కోసం నిర్ణీత మార్గం ఏర్పాటు చేసేందుకు యూకేకు చెందిన ఆల్టిట్యూడ్ ఏంజిల్, బీటీ తదితర సంస్థలు ప్రతిపాదనలు సిద్ధం చేశాయి. ఆ మార్గంలో డ్రోన్లు ఒకదానికొకటి ఢీకొట్టుకోకుండా ‘డీఏఏ (డిటెక్ట్ అండ్ అవాయిడ్)’ టెక్నాలజీని వినియోగించనున్నాయి. 265 కిలోమీటర్ల పొడవున.. యూకే ఆగ్నేయ ప్రాంతంలో 265 కిలోమీటర్ల పొడవున ‘డ్రోన్ సూపర్ హైవే’ను ఏర్పాటు చేసేందుకు యూకే ప్రభుత్వం ఇటీవల అనుమతులు మంజూ రు చేసింది. కీలక నగరాలైన రీడింగ్, ఆక్స్ఫర్డ్, మిల్టన్ కీన్స్, కేంబ్రిడ్జ్, కొవెంట్రీ, రగ్బీ నగరాల మీదుగా ఈ డ్రోన్ హైవే సాగనుంది. 2024 జూన్ నాటికి ఈ ‘డ్రోన్ సూపర్ హైవే’ ఏర్పాటును పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే దీనికి ఎంత ఖర్చవుతుందనే అంచనాలను వెల్లడించలేదు. ఏమిటీ డీఏఏ టెక్నాలజీ? గాల్లో ఎగురుతూ వెళ్లే డ్రోన్లు, ఇతర యూఏవీ (అన్మ్యాన్డ్ ఏరియల్ వెహికల్స్)లను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ.. అవి ఒకదానికొకటి ఢీకొట్టుకోకుండా చేసేందుకు ఆల్టిట్యూడ్ ఏంజిల్ సంస్థ ‘డీఏఏ’ టెక్నాలజీని అభివృద్ధి చేసింది. దీనిలో భాగంగా డ్రోన్లు ప్రయాణించే ప్రాంతాల్లో నిర్ణీత దూరంలో పెద్ద టవర్లను నిర్మించి, పలు రకాల పరికరాలను అమర్చుతారు. వీటికి యారో టవర్స్ అని పేరుపెట్టారు. ఈ వ్యవస్థ ఎంతెంత పరిమాణంలో ఉన్న డ్రోన్లు.. ఎటువైపు నుంచి, ఎంత వేగంతో ప్రయాణిస్తున్నాయనేది గుర్తించి.. మిగతా డ్రోన్లకు సమాచారం ఇస్తుంది. ఢీకొట్టుకునే అవకాశమున్న డ్రోన్లకు వాటి మార్గం మార్చుకోవడం, మరికాస్త ఎత్తుకు ఎగరడం లేదా కిందికి దిగడం, వేగం తగ్గించుకోవడం, పెంచుకోవడం వంటి సూచనలు చేస్తుంది. డ్రోన్లలో మార్పులు అవసరం లేదు డ్రోన్ హైవేల్లో ప్రయాణించేందుకు, యారో టవర్లకు అనుసంధానం కావడం కోసం.. డ్రోన్లలో అదనపు పరికరాలేమీ అమర్చాల్సిన అవసరం లేదని ఆల్టిట్యూడ్ ఏంజిల్ సీఈవో రిచర్డ్ పార్కర్ పేర్కొన్నారు. భవిష్యత్తులో ఈ టెక్నాలజీ అద్భుతాలు సృష్టిస్తుందని.. డ్రోన్ హైవేలు రవాణాలో కీలకపాత్ర పోషిస్తాయని భావిస్తున్నామని తెలిపారు. -
ఆలియా భట్ కోసం ఇరవై ఏళ్ల ముందే..!
యూత్‌కి బాగా కనెక్ట్ అయ్యే దర్శకుడు ఇంతియాజ్ అలీ. తన సినిమాల్లోని నటీనటుల మధ్య నిజమైన బాండింగ్ ఏర్పడాలనుకుంటాడు. అందుకే సినిమా సెట్స్ మీదకు వెళ్లేముందు టీమ్‌ను ఏదైనా ట్రిప్‌కి పంపిస్తాడట. తన సినిమాకు కొన్నేళ్ల ముందుగానే స్క్రిప్ట్ రాసిపెట్టుకుంటాడు. ‘హైవే’ కోసమైతే ఆలియా భట్‌ను (29) తాను ఫస్ట్‌టైమ్ చూసిన వెంటనే (అప్పుడు ఆమెకు తొమ్మిదేళ్లు) స్క్రిప్ట్ రాయడం మొదలుపెట్టాడుట. నటీనటుల లైఫ్ ఎక్స్పీరియెన్సెస్నూ కథలో భాగంగా చూపించే ప్రతయ్నం చేస్తాడు. ఆయన ‘తమాషా’లో కథానాయకుడు.. అతని తండ్రికి మధ్య చూపించిన అనుబంధం.. ఆ సినిమా హీరో రణ్‌బీర్ కపూర్, అతని తండ్రి రిషి కపూర్‌కు మధ్య ఉన్న అనుబంధం ఆధారంగా చిత్రీకరించిందేనట. -
దేశంలోనే తొలి 'ఎలక్ట్రిక్ హైవే'.. ఆ నగరాల మధ్య నిర్మాణం!
ఢిల్లీ: దేశంలోనే తొలి ఎలక్ట్రిక్ హైవేను నిర్మించేందుకు ప్రణాళిక రచిస్తోంది భారత ప్రభుత్వం. తొలి రహదారిని దేశ రాజధాని ఢిల్లీ, ఆర్థిక రాజధాని ముంబైలమధ్య నిర్మించనున్నట్లు కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. ఈ రహదారిపై ట్రాలీబస్సుల మాదిరిగానే ట్రాలీ ట్రక్కులను ప్రవేశపెట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు గడ్కరీ తెలిపారు. దాని ద్వారా కాలుష్యం తగ్గటంతో పాటు సామర్థ్యం పెరుగుతుందన్నారు. ఢిల్లీలో నిర్వహంచిన హైడ్రాలిక్ ట్రైలర్ ఓనర్స్ అసోసియేషన్ కార్యక్రమం వేదికగా తొలి ఎలక్ట్రిక్ హైవే వివరాలను బహిర్గతం చేశారు గడ్కరీ. కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు రూ.2.5 లక్షల సొరంగాలను నిర్మించినట్లు తెలిపారు. 'ఢిల్లీ నుంచి ముంబై వరకు ఎలక్ట్రిక్ హైవే నిర్మించాలని ప్రణాళిక చేస్తున్నాం. ట్రాలీబస్సుల మాదిరిగానే మీరు ట్రాలీట్రక్కులను ఈ దారిలో తీసుకొస్తాం.' అని తెలిపారు. అయితే.. ఈ రహదారి గురించి పూర్తి వివరాలను వెల్లడించలేదు. ఎలక్ట్రిక్ హైవే అంటే ఏమిటి? ఎలక్ట్రిక్ హైవే అనగానే చాలా మందికి అర్థం కాకపోవచ్చు. వాహనాలకు ఈ రహదారులపై వెళ్తున్న క్రమంలో ఓవర్‌హెడ్ విద్యుత్తు లైన్ల ద్వారా పవర్ సరఫరా చేస్తారు. రైల్వే ట్రాక్‌ల మాదిరిగానే ఉంటాయి. హైవే పొడవున ఓవర్‌హెడ్ విద్యుత్తు లైన్లు ఏర్పాటు చేస్తారు. ట్రాలీబస్సులు, ట్రాలీట్రక్కులను ఉపయోగించటం ద్వారా కాలుష్యం తగ్గటంతో పాటు రవాణా సామర్థ్యం పెరుగుతుందనేది కేంద్రం ఆలోచన. మరోవైపు.. పెట్రోల్, డీజిల్‌ల ద్వారా కాలుష్యం పెరిగిపోతున్న క్రమంలో భారీ వాహనాల ఓనర్లు ఇథనాల్, మెథనాల్, గ్రీన్ హైడ్రోజన్ వంటి ప్రత్యామ్నాయాలవైపు వెళ్లాలని కోరారు నితిన్ గడ్కరీ. అలాగే.. అన్ని జిల్లా కేంద్రాలను నాలుగు లైన్ల రహదారులతో అనుసంధానిస్తామన్నారు. ప్రాంతీయ రవాణా కార్యాలయాల్లో అవినీతి పెరిగిపోతుందని, ఆర్టీఓల ద్వారా అందే సేవలను డిజిటలైజ్ చేస్తామని తెలిపారు. రోడ్డు ప్రమాదాలు, మరణాలను తగ్గించటమే తమ లక్ష్యమన్నారు. వస్తు రవాణా వ్యయం చైనా, ఐరోపా, అమెరికాలతో పోలిస్తే భారత్‌లోనే అధికమని ఆందోళన వ్యక్తం చేశారు. ఇదీ చదవండి: Reverse Waterfall: ఆకాశంలోకి ఎగిరే జలపాతాన్ని ఎప్పుడైనా చూశారా? -
పూర్తి కావొచ్చిన సూర్యాపేట–ఖమ్మం రహదారి
సాక్షి,హైదరాబాద్: సూర్యాపేట–ఖమ్మం మధ్య నిర్మిస్తున్న నాలుగు వరుసల జాతీయ రహదారి పనులు దాదాపు పూర్తి కావొచ్చాయి. సెప్టెంబరు చివరికల్లా రోడ్డు పనులు పూర్తికానుండటంతో వెంటనే ప్రారంభించి జాతికి అంకితం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ రోడ్డు అందుబాటులోకి రావటం వల్ల హైదరాబాద్–ఖమ్మం మధ్య ప్రయాణ సమయం దాదాపు గంట వరకు తగ్గిపోనుంది. సూర్యాపేట నుంచి హైదరాబాద్‌కు నాలుగు వరుసల రోడ్డు అందుబాటులో ఉండగా, సూర్యాపేట నుంచి ఖమ్మం మధ్య ఇంతకాలం రెండు వరుసల రోడ్డే ఉండేది. రోడ్డు కూడా బాగా దెబ్బతినిపోవడంతో ప్రయాణ సమయం బాగా పెరుగుతూ, తరచూ ప్రమాదాలకు నెలవుగా మారింది. దీంతో దీన్ని నాలుగు వరుసలకు విస్తరించాలని నిర్ణయించిన కేంద్రం 2019లో ఈ ప్రాజెక్టుకు అనుమతి మంజూరు చేసింది. కోవిడ్ కారణంగా పనుల్లో కొంత జాప్యం జరిగింది. దీంతో మూడు నెలల అదనపు సమయాన్ని నిర్మాణ సంస్థకు మంజూరు చేశారు. ఫలితంగా సెప్టెంబరు చివరి నాటికి పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. 58.63 కిలోమీటర్లకు ఇప్పటికే 49.55 కి.మీ. మేర పనులు పూర్తయ్యాయి. (క్లిక్: బ్లాక్ ఫిల్మ్‌లు, నంబర్ ప్లేట్లపై నజర్.. స్పెషల్ డ్రైవ్) -
యమునోత్రిలో కూలిన రహదారి భద్రత గోడ.. 10 వేల మంది యాత్రికులు..
ఉత్తరాఖండ్‌లోని యమునోత్రి ఆలయానికి వెళ్లే రహదారి భద్రతా గోడ శుక్రవారం ఒక్కసారిగా కూలిపోయిది. దీంతో రిషికేశ్-యమునోత్రి జాతీయ రహదారిపై వెళ్తున్న 10 వేల మందికి పైగా యాత్రికులు చిక్కుకున్నారు. జంకిచట్టి వద్ద భారీగా వాహనాలు నిలిచిపోవడంతో ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఈ రహదారులను పునరుద్ధరించడానికి కనీసం 3 రోజుల సమయం పడుతుందని అధికారులు పేర్కొంటున్నారు. అయితే చిన్న చిన్న వాహనాలను పంపడానికి అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. పెద్ద పెద్ద వాహనాల్లో ఉన్న యాత్రికులకు మాత్రం ఇబ్బందులు తప్పవని అధికారులు పేర్కొంటున్నారు. కాగా బుధవారం భారీ వర్షాలు కురవడంతో సయనచట్టి, రణచట్టి మద్య ఉన్న రహదారి కొట్టుకుపోయింది. ఈ నేపథ్యంలో 24 గంటలు మూసేసి తిరిగి గురువారం సాయంత్రం హైవే తెరిచారు. అయితే ఇంతలోనే మరోసారి రోడ్డు కూలిపోవడంతో ప్రస్తుత ఇబ్బంది పరిస్థితి తలెత్తినట్లు తెలుస్తోంది. చదవండి: విపరీతమైన ట్రాఫిక్‌తో కొట్టుమిట్టాడే నగరాల్లో ముంబై, బెంగళూరు.. -
విజయవాడ - బెంగళూరు మధ్య గ్రీన్ ఫీల్డ్ హైవే
నూతన జిల్లా శ్రీసత్యసాయి నుంచి ఇటు విజయవాడకు, అటు పొరుగున ఉన్న కర్ణాటక రాజధాని బెంగళూరుకు వెళ్లేందుకు ‘మార్గం’ సుగమమైంది. బెంగళూరు, కడప, విజయవాడ (బీకేవీ) ఎక్స్‌ప్రెస్ వేకు ప్రభుత్వం శ్రీకారం చుట్టడంతో దూరాభారం తగ్గనుంది. ప్రస్తుతం విజయవాడకు చేరాలంటే దాదాపు 8 గంటల ప్రయాణం చేయాల్సి వస్తోంది. గ్రీన్ ఫీల్డ్ హైవేపై గంటకు 120 కి.మీ. వేగంతో వెళ్లేలా నాలుగు వరుసల రహదారి నిర్మించనుండటంతో నాలుగు నుంచి ఐదు గంటల్లోనే విజయవాడ చేరుకునే అవకాశం ఉంటుంది. సాక్షి, పుట్టపర్తి: బెంగళూరు, కడప, విజయవాడను కలుపుతూ కొత్తగా జాతీయ రహదారి ఏర్పాటవుతోంది. జిల్లాలో 75 కి.మీ మేర విస్తరించనున్న ఈ రహదారిపై 120 కిలోమీటర్ల వేగంతో వాహనాలు ప్రయాణించేలా నిర్మించనున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా చిలమత్తూరు మండలం కోడూరు నుంచి ప్రకాశం జిల్లా ముప్పవరం వరకు నాలుగు లేన్ల గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వేగా నిర్మించనున్నారు. దీంతో ప్రయాణ సమయం తగ్గడమే కాకుండా సుఖవంతంగా సాగేలా నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ప్రతిపాదనలు సిద్ధం చేసింది. శ్రీసత్యసాయి జిల్లాలోని చిలమత్తూరు, గోరంట్ల, ఓడీచెరువు, నల్లమాడ, ముదిగుబ్బ , కదిరి మండలాల్లో సాగే గ్రీన్‌ఫీల్డ్ హైవే కోసం భూసేకరణకు సంబంధించి అధికారులు మార్కింగ్ చేస్తున్నారు. జిల్లాలో మొత్తంగా 2 వేల ఎకరాలు సేకరించనున్నారు. కోడూరు నుంచి ప్రారంభం.. చిలమత్తూరు మండలం కోడూరు వద్ద బెంగళూరు– హైదరాబాద్ జాతీయ రహదారి –44 నుంచి నాలుగు లేన్ల గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ వే మొదలవుతుంది. అక్కడి నుంచి వైఎస్సార్ జిల్లా పులివెందుల సమీపంలోని వీరపునాయునిపల్లె, ఎర్రగుంట్ల, కమలాపురం, మైదుకూరు, పోరుమామిళ్ల, పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా సీతారాంపురం, ప్రకాశం జిల్లా సీఎస్‌పురం మీదుగా పామూరు, కనిగిరి, చీమకుర్తి, పెద్ద ఉయ్యాలవాడ, బొద్దికూరపాడు, నాగంబొట్లపాళెం, కంకుపాడు, అద్దంకి, ముప్పవరం వరకు రోడ్డు నిర్మాణం సాగనుంది. జిల్లాలోని ఎనిమిది మండలాల మీదుగా.. జిల్లాలో 75 కిలోమీటర్ల మేర గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వే విస్తరించనుంది. చిలమత్తూరు మండలం కోడూరు వద్ద ఎన్‌హెచ్–44 వద్ద మొదలై చాగిలేరు, గోరంట్ల మండలంలోని బూదిలి, జక్కసముద్రం, పుట్టపర్తి మండలంలోని అమగొండపాళ్యం, సాతర్లపల్లి, ఓడీచెరువు మండలం కొండకమర్ల, నల్లమాడ మండలం వేళ్లమద్ది, కదిరి మండలంలోని పట్నం, తలుపుల మండలంలోని లక్కసముద్రం, ముదిగుబ్బ మండలంలోని దేవరగుడి వరకు రోడ్డు నిర్మాణం జరగనుంది. భూసేకరణ ఇలా... జాతీయ రహదారి నిర్మాణానికి 90 మీటర్ల వెడల్పున భూమిని సేకరించనున్నారు. శ్రీ సత్యసాయి జిల్లాలో 2 వేల ఎకరాల భూసేకరణకు త్వరలోనే 3–ఏ నోటిఫికేషన్ ఇవ్వనున్నారు. భూసేకరణలో భాగంగా ప్రభుత్వ, అటవీ, పట్టా భూముల వారీగా వివరాలు సిద్ధం చేస్తున్నారు. డీపీఆర్ ప్రకారం ఏయే రెవెన్యూ గ్రామాల మీదుగా ఈ రోడ్డు వెళ్తుందనే వివరాలతో నోటిఫికేషన్ ఇవ్వనున్నారు. పెరిగిన భూమి విలువ... నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఏఐ) బీకేవీ ఎక్స్‌ప్రెస్ వే కోసం సర్వే ప్రారంభించింది. భూసేకరణకు సంబంధించిన రాళ్లు ఏర్పాటు చేసింది. దీంతో ఆయా ప్రాంతాల్లో భూముల విలువ బాగా పెరిగింది. భూముల క్రయ, విక్రయాలు ఊపందుకున్నాయి. ఈ రహదారి పూర్తయితే విజయవాడ – బెంVýæళూరు మధ్య ప్రయాణం సుఖవంతంగా సాగనుంది. రహదారిపైకి వెళ్లేందుకు 13 చోట్లే అనుమతి.. బీకేవీ ఎక్స్‌ప్రెస్ వే పైకి వెళ్లేందుకు వాహనదారులు అన్ని చోట్ల అవకాశం ఉండదు. వాహనాల స్పీడ్, భద్రతా ప్రమాణాల మేరకు... మూడు జిల్లాల్లో కేవలం 13 చోట్ల మాత్రమే రహదారిలోకి వెళ్లేందుకు, బయటకు వచ్చేందుకు అవకాశం కల్పిస్తూ రూపకల్పన చేశారు. డీపీఆర్ రూపకల్పన విజయవాడ– బెంగళూరు జాతీయ రహదారికి సంబంధించిన డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (డీ.పీ.ఆర్)రూపకల్పనలో ఉన్నాం. త్వరలోనే భూసేకరణ పూర్తవుతుంది. –రామకృష్ణ , ప్రాజెక్డ్ డైరెక్టర్, ఎన్హెచ్ఏఐ -
పగటి పూట బొమ్మ.. రాత్రి కాగానే ‘దెయ్యం’లా హైవేపై..
దెయ్యం కథలు.. నమ్మకం ఉన్నా.. ‘ఛస్’ అని ఛీదరించుకున్నా వీటి గురించి ఆసక్తి కలగక మానదు. ఎందుకంటే ఆ కథల్లోని నేరేషన్ అలా ఉంటుంది కాబట్టి. ఇప్పుడు చెప్పుకోబోయే యూకే ‘బెట్టీ బైపాస్’ కొంత క్యూరియాసిటీని రేకెత్తించడం ఖాయం!. ఎందుకంటే ఈ దెయ్యం ఈమధ్యే పదేళ్లు పూర్తి చేసుకుంది కాబట్టి!. బర్మింగ్హమ్-వోర్‌సెయిస్టర్ సరిహద్దు. హైవే కావడంతో వాహనాల రద్దీ ఎక్కువే!. చెక్‌పోస్ట్‌కి దగ్గర్లో ఒక శాండ్విచ్ ట్రక్ ఉంటుంది. ఆ నిర్వాహకులు ఏర్పాటు చేసిన బెంచ్ మీద కనిపించే ఒక రూపాన్ని చూసి ఎవరైనా వణికిపోతుంటారు. కారణం.. గత పదేళ్లుగా ఆ రూపం అక్కడక్కడే తిరుగుతోంది. ఆ రూపం పేరు ‘బెట్టీ’.. పక్కనే పిల్లల్ని వేసుకుని తిరిగే ఓ వీల్ ఊయల కూడా ఉంటుంది. పగలు బెంచ్ మీద కనిపించే ఆ రూపం.. రాత్రిపూట దెయ్యంగా మారుతుందనే ప్రచారం నడుస్తుంది. అందుకే ఈ దారికి కూడా ‘బెట్టీ బైపాస్’ అని పేరొచ్చింది. బిడ్డను కోల్పోయిన ఆ తల్లి దెయ్యంగా మారి.. అలా హైవేపై తిరుగుతోందని, ఎవరో ఆమెను యాక్సిడెంట్ చేసి చంపేశారని, కాదు కాదు.. ఆమె భర్తే ఆమెను చంపేశాడని.. ఇలా రకరకాల ప్రచారాలు వినిపిస్తుంటాయి. బెట్టీ మీద సింపథీ ఉన్నా.. దెయ్యం అనే ఊహ మాత్రం చాలామందిని వణికించేది. దీంతో ఈ మిస్టరీని చేధించేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. ఏళ్లు గడుస్తున్నా.. ఆ ఘోస్ట్ లేడీ వ్యవహారాన్ని ఎవరూ తేల్చలేకపోయారు. ఈలోపు ఆ నోటా ఈ నోటా పాకి ఈ దెయ్యం కథ.. దెయ్యాల మీద అన్వేషణ చేసే వాళ్లకు, అంతర్జాతీయ మీడియా హౌజ్ దృష్టికి చేరింది. ఎవరికి వాళ్లు ఈ మిస్టరీని చేధించాలని ప్రయత్నించారు. ఈ ప్రయత్నంలో పగలబడి నవ్వుకున్నారు. కారణం.. అదొక ప్రాక్టికల్ జోక్ కాబట్టి! బెట్టీ ఒక షోకేజ్ బొమ్మ. దానిని అక్కడ తీసుకొచ్చి పెట్టిన వ్యక్తి పేరు నిక్ హజ్బెండ్. ఆయన ఆ శాండ్విచ్ ట్రక్ యజమాని. ఓ ఛారిటీ షాప్ నుంచి ఆ షోకేజ్ బొమ్మను కొనుక్కొచ్చి.. దానికి బెట్టీ అనే పేరు పెట్టి రోజూ దానిని రకరకాల యాంగిల్స్‌లో అక్కడి బెంచ్‌ల మీద కూర్చోబెడుతున్నాడు. అలా పదేళ్లు గడిచిపోయింది. ఈలోపు హైవే మీద వెళ్లే చాలామంది.. ప్రత్యేకించి రాత్రిళ్లు ఆ బొమ్మను చూసి వణికిపోయేవాళ్లట. పైగా అది అక్కడక్కడే ఉండడం, నిక్ చెప్పిన కల్పిత కథలతో అదొక దెయ్యం అని బలంగా ఫిక్స్ అయిపోయారు. అలా బెట్టీ కథ చుట్టుపక్కల పాకేసింది. పాపం అనుకున్నారట.. ప్రాక్టికల్ జోక్స్‌తో ఇంట్లో వాళ్లను ఫూల్స్ చేసే నిక్.. జనాలందరినీ భయపెట్టాలనే ఉద్దేశంతోనే ఈ ప్రయత్నం చేశాడు. అయితే పగటిపూట ఆ ఫుడ్ ట్రక్ దగ్గర ఆగిన కొందరు.. బెట్టీ గురించి అడిగినప్పుడు వాళ్లకు రకరకాల కథలు చెప్పేవాడు. ఆమె భర్త చేతిలో మోసపోయినా ఒక అనాథ అని, అందుకే బిడ్డతో అక్కడ అలా కూర్చుంటుందని(సజీవంగా ఉందని నమ్మించాడు కూడా!) చెప్పడంతో చాలామంది ‘పాపం’ అని సాయం చేసేందుకు ముందుకు వచ్చేవాళ్లట. తీరా అదొక బొమ్మ అని తెలిశాక నిక్‌ను తిట్టుకుంటూ.. సరదాగా ఫొటోలు తీసుకుని వెళ్లిపోయేవాళ్లట. కొన్నాళ్ల తర్వాత నిక్, ఆ ప్రమ్(తిప్పే ఊయల)ని మాయం చేయడంతో బిడ్డ గురించి ఆరా తీసేవాళ్లట. వాళ్లకు ఆ బిడ్డ పెరిగి.. స్కూల్‌కు వెళ్తోందని చెప్పేవాడట. ఇలా జనాలందరికీ ఒక్కో రకమైన కథ చెప్పి బురిడీ కొట్టించేవాడు ఆ ట్రక్కు యజమాని. ఒకానొక టైంలో కౌన్సిల్ ఆఫీసర్లు సైతం ఆ అనాథ మహిళకు సాయం చేయాలని ముందుకొచ్చారట. కానీ, అదొక బొమ్మ అని తెలిశాక.. నిక్కు వార్నింగ్ఇచ్చి మరీ బెట్టీతో ఫొటోలు దిగి వెళ్లిపోయారట. మొత్తానికి బెట్టీ తన కుటుంబంలో ఒక భాగం అయ్యిందని, ఆ బొమ్మకు చేసిన 20 పౌండ్ల ఖర్చు తన వ్యాపారానికి ఎంతో సాయం ఇప్పుడు చేస్తోందని సంతోషపడుతున్నాడు నిక్. మొత్తానికి పదేళ్లపాటు జనాలను బురిడీ కొట్టించాడు ఈ పెద్దాయన. -
వామ్మో.. కొండ చిలువలు ఒకదాని వెంట మరోకటి..
సాక్షి, వరంగల్: అడవుల్లో, చెట్లపొదల్లో ఉండే కొండ చిలువలు ఆహారం కోసం ఒకచోటునుంచి మరోచోటుకు వెళ్తుంటాయి. అలాంటి ఘటనే ఇది. బుధవారం హనుమకొండ జిల్లా శాయంపేట మండలంలోని మాందారిపేట గుట్టలోనుంచి రోడ్డు ఆవతలికి వెళ్లే క్రమంలో జాతీయ రహదారిపై రెండు కొండచిలువలు వచ్చాయి. ఒకదాని వెనకాల మరోకటి క్యూ లైన్ లాగా రోడ్డుపై నుంచి వెళ్తుండడంతో వాహనదారులు ఆపి ఆసక్తి చూస్తూ ఫొటోలు తీశారు. -
ఆనంద్ దేవరకొండ ‘హైవే’ షూటింగ్ పూర్తి
యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో ఆనంద్ దేవరకొండ హీరోగా ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కేవీ గుహన్ దర్శకత్వంలో రూపొందుతోన్న సైకో క్రైమ్ థ్రిల్లర్ ‘హైవే’. మానస రాధాకృష్ణన్ హీరోయిన్గా నటిస్తోంది. తొలి చిత్రం ‘చుట్టాలబ్బాయి’ ఘనవిజయం సాధించి ఇండస్ట్రీలో అభిరుచిగల నిర్మాతగా పేరు తెచ్చుకున్న నిర్మాత వెంకట్ తలారి శ్రీ ఐశ్వర్య లక్ష్మీ మూవీస్ పతాకంపై ప్రొడక్షన్ నెం.2గా ‘హైవే’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. క్యాచీ టైటిల్‌తో పాటు డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కుతోన్న ఈ చిత్రంపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ‘హైవే’ షూటింగ్ పూర్తయింది. ఈ సందర్భంగా మేకర్స్ పోస్టర్‌ను విడుదల చేస్తూ మూవీ షూటింగ్ పూర్తయినట్లు తెలిపారు. ఈ సందర్భంగా నిర్మాత వెంకట్ తలారి మాట్లాడుతూ.. ‘శ్రీ ఐశ్వర్య లక్ష్మీ మూవీస్ బేనర్‌పై ఒక డిఫరెంట్ క్రై మ్ థ్రిల్లర్ గా ‘హైవే’ మూవీ రూపొందుతోంది. 118 వంటి సూపర్‌హిట్ చిత్రాన్ని తెరకెక్కించిన గుహన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఆనంద్ దేవరకొండ, మానస రాధాకృష్ణన్ హీరోహీరోయిన్లుగా నటించారు. నేడు హైవే మూవీ షూటింగ్ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో షూటింగ్ జరిపాం. ఈ సినిమాలో కొంత మంది ప్రముఖ నటీనటులు కూడా నటించారు. వారి వివరాలు త్వరలో తెలియజేస్తాం’ అన్నారు. చిత్ర దర్శకుడు కేవీ గుహన్ మాట్లాడుతూ.. ‘‘హైవే’ నేపథ్యంలో సాగే ఒక సైకో క్రై మ్ థ్రిల్లర్ మూవీ ఇది. టెక్నికల్‌గా చాలా అడ్వాన్స్డ్గా ఉంటుంది. ప్రతిక్షణం ట్విస్టులు, టర్నులతో ఆసక్తికరంగా ఉంటుంది. ప్రస్తుతం హైవే షూటింగ్ పూర్తయ్యింది. త్వరలో కొన్ని క్రేజీ అప్డేట్స్తో మీ ముందుకు వస్తాం’’ అని పేర్కొన్నారు. -
డీజిల్ దొంగలు
-
డేంజర్ చౌరస్తా.. డబుల్రోడ్లు వేసినప్పటికీ ప్రమాదాలు
సాక్షి, ఇబ్రహీంపట్నం(కరీంనగర్): గ్రామాలకు వెళ్లేందుకు డబుల్రోడ్లు వేసినప్పటికీ ప్రధాన కూడళ్ల వద్ద ఎలాంటి హెచ్చరిక బోర్డులు, స్పీడ్ బ్రేకర్లు పెట్టకపోవడంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇబ్రహీంపట్నం మండల కేంద్రానికి రావడానికి జాతీయ రహదారి నుంచి సింగిల్‌రోడ్డును 10 ఏళ్ల క్రితం డబుల్‌రోడ్డుగా మార్చారు. దీంతో వాహనాలు అతివేగంగా వస్తూ ప్రమాదాలు జరుగుతున్నాయి. నిత్యం రద్దీ.. మండల కేంద్రంలోని ఇందిరాగాంధీ చౌరస్తా వద్ద నాలుగు గ్రామాలకు వెళ్లే రోడ్డును డబుల్‌రోడ్డుగా చేశారు. ఈ చౌరస్తా నుంచి మెట్పల్లి, ఇబ్రహీంపట్నం వస్తుండగా ఇబ్రహీంపట్నం నుంచి గోదూర్ మీదుగా నిర్మల్ జిల్లాకు, ఖానాపూర్‌కు ఇబ్రహీంపట్నం నుంచి మూలరాంపూర్, ఇబ్రహీంపట్నం నుంచి వర్షకొండ మీదుగా నిర్మల్ జిల్లాకు నిత్యం వందలాది వాహనాలు వెళ్తుంటాయి. మహారాష్ట్ర నుంచి నిర్మల్ జిల్లా మీదుగా ఇబ్రహీంపట్నం నుంచి ఇతర జిల్లాలకు తక్కువ దూరం అవుతున్నందున అనేక వాహనాలు వెళ్తుంటాయి. ఇబ్రహీంపట్నం ఇందిరాగాంధీ చౌరస్తా వద్ద ఎలాంటి హెచ్చరిక బోర్డులు, స్పీడ్‌బ్రేకర్లు లేకపోవడంతో వాహనాలు అతివేగంగా వస్తు అప్పుడప్పుడు ప్రమాదాలు గత సంవత్సరం గోదూర్ వైపు నుంచి బైంసాకు వెళ్తున్న ఓ కారు బైకు ను ఢీ కొనడంతో ఓ మహిళతో పాటు యువతికి తీవ్ర గాయాలయ్యాయి. ఇదే సంవత్సరం కోమటి కొండాపూర్‌కు చెందిన భార్యభర్తలు బైక్‌పై గోదూర్ నుంచి కోమటికొండాపూర్‌కు వెళ్తుండగా అతివేగంగా కారును ఢీ కొట్టి కిందపడగా తీవ్రగాయాలయ్యాయి. ఈ చౌరస్తా గుండా నిత్యం బైక్‌లతో పాటు భారీ వాహనాలు అతివేగంగా వెళ్తుండడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. హెచ్చరిక బోర్డులు, స్పీడ్ బ్రేకర్లు లేకనే.. ఇందిరాగాంధీ చౌరస్తా వద్ద నాలుగు గ్రామాలకు వెళ్లే రోడ్లు ఉండడంతో నిత్యం వందలాది వాహనాలు వెళ్తుంటాయి. ఇక్కడ ఎలాంటి హెచ్చరిక బోర్డులు, స్పీడ్బ్రేకర్లును ఆర్అండ్బీ అధికారులు ఏర్పాటు చేయకపోవడంతో ప్రమాదాల చౌరస్తాగా మారింది. చౌరస్తా వద్ద వాహనాలు వేగంగా వెళ్లడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదని మండల ప్రజలు ఆరోపిస్తున్నారు. అధికారులు ఇప్పటికైనా పట్టించుకొని హెచ్చరిక బోర్డులు, స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేసి ప్రమాదాలను అరికట్టాలని మండల ప్రజలు కోరుతున్నారు. ప్రమాదాలు జరగకుండా చర్యలు చేపట్టాలి చౌరస్తా వద్దనే మా షాపు ఉంది. నిత్యం వాహనాలు వేగంగా వెళ్లడంతో అప్పుడప్పుడు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఆర్అండ్బీ అధికారులు చౌరస్తా వద్ద ప్రమాదాలు జరగకుండా, వాహనాలు వేగంగా వెళ్లకుండా చర్యలు తీసుకోవాలి. – పోలకొండ సుధాకర్ వర్మ, ఇబ్రహీంపట్నం ప్రతిపాదనలు పంపాం చౌరస్తా వద్ద నాలుగుదారులకు వెళ్లే చోట హెచ్చరిక, సూచికల బోర్డులు ఏర్పాటు చేయడానికి రూ.2లక్షలతో ప్రతిపాదినలు తయారుచేసి మంజూరు కోసం పై అధికారులకు పంపాం. నిధులు మంజూరు కాగానే హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేస్తాం. – వేణు, ఆర్అండ్బీ, ఏఈ, మెట్పల్లి చదవండి: మద్యానికి బానిసైన కొడుకును మందలించినందుకు... -
Anaconda: రోడ్డు దాటుతున్న భారీ అనకొండ.. షాకింగ్ వీడియో..
బ్రసీలియా: సాధారణంగా అడవిలోని జంతువులు, సరీసృపాలు మానవ ఆవాసాలకు వస్తున్న సంఘటనలను తరచుగా వార్తల్లో చూస్తునే ఉంటాం. కాగా, అవి.. ఆహారం కోసం, ఆవాసం కోసం దారితప్పి మానవ ఆవాసాల్లోకి ప్రవేశిస్తుంటాయి. అడవికి దగ్గరగా ఉన్న ప్రదేశాలలోని రోడ్లపై జంతువులు, పాములు రోడ్డును దాటుతూ ఒకవైపు నుంచి మరొవైపుకు వెళ్లిన సంఘటనలు కొకొల్లలు. తాజాగా, బ్రెజిల్‌లోని హైవేపై ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. ఒక పెద్ద అనకొండ రోడ్డును దాటుకుంటు వెళ్లింది. కాగా, మొదట దీన్నిచూసిన ప్రయాణికులు షాక్‌కు గురయ్యారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతుంది. కాగా, అసలే అది హైవే.. వాహనాల రద్దీ కూడా ఎక్కువగా ఉంది. ఉన్నట్టుండి రోడ్డు పక్కన ఉన్న చెట్ల పొదల్లోంచి ఒక పదడుగుల అనకొండ బయటకు వచ్చింది. ఆ తర్వాత.. మెల్లగా పాకుకుంటూ.. డివైడర్ ఎక్కేసింది. ఒకవైపు నుంచి మరోవైపు వెళ్లసాగింది. అనకొండ ను చూసిన ప్రయాణికులు .. తమ వాహనాలను ఆపివేసి దాన్ని తమ మొబైల్లో వీడియో తీసుకుంటున్నారు. అనకొండకు ఎవరు కూడా ఆపద తలపెట్లలేదు. వేగంగా వచ్చిన వాహనదారులు.. కార్లను రోడ్డుకు ఒకవైపు నిలిపేసి ఆ అనకొండను ఆశ్చర్యంగా చూస్తున్నారు. మరికొందరు దూరం నుంచి సెల్ఫీలు తీసుకుంటున్నారు. అయితే, అనకొండ మాత్రం మెల్లగా పాకుకుంటూ.. రోడ్డుపక్కన ఉన్న పొదల్లోకి వెళ్లి అదృష్యమయ్యింది. కాగా, ఈ వీడియోను ఒక బ్రెజిల్‌లోని ఒక వ్యక్తి అనిమల్స్ వేంచర్ అనే ఇన్‌స్టాలో పోస్ట్ చేశాడు. దీనికి ఇతను ‘అనకొండ రోడ్డుదాటుతుంటే.. ప్రయాణికులు చూస్తు ఉండిపోయారు’ అని క్యాప్షన్ ఇచ్చాడు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు ‘ఎంత బాగా పాకుకుంటూ వెళ్తుంది..’,‘అనకొండకు.. ఆపద కల్గించనందుకు ధన్యవాదాలు..’, ‘జంతువుల మనుగడకు మనుషులు సహాయపడుతున్నందుకు థ్యాంక్స్.. అంటూ కామెంట్లు పెడుతున్నారు. సాధారణంగా బ్రెజిల్ అడవులలో ఉండే అనకొండలు 550 పౌండ్ల బరువుని కల్లి ఉండి, 29 అడుగుల పొడవు వరకు పెరుగుతాయి. చదవండి: మహిళకు షాక్.. ఇంటిని బందెల దొడ్డి చేశాయ్! -
‘హైవే’పై దూసుకెళ్తున్న ఆనంద్ దేవరకొండ
యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. తాజాగా ఆయన నటించిన 'పుష్పక విమానం' విడుదలకు సిద్ధంగా ఉంది. థియేటర్లలోనే ఈ సినిమాను వదలాలనే ఆలోచనలో ఉన్నారు. ఇదిలా ఉంటే ఈ యంగ్ హీరో నటిస్తున్న తాజా చిత్రం ‘హైవే’. ఏ నర్వ్ వ్రాకింగ్ రైడ్ స్టోరి’ అనేది ట్యాగ్‌లైన్. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కేవీ గుహన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని..‘చుట్టాలబ్బాయి’ఘనవిజయంతో ఇండస్ట్రీలో అభిరుచిగల నిర్మాతగా పేరు తెచ్చుకుంటున్న వెంకట్ తలారి శ్రీ ఐశ్వర్య లక్ష్మీ మూవీస్ పతాకంపై ప్రొడక్షన్ నెం.2గా నిర్మిస్తున్నారు. మానస రాధాకృష్ణన్ హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఈ సందర్భంగా ‘హైవే’ చిత్రం నుండి కొత్త పోస్టర్‌ను విడుదలచేసింది చిత్ర యూనిట్. ఆనంద్ దేవరకొండ, మానస రాధాకృష్ణన్ కలిసి ఉన్న ఈ పోస్టర్ ఆసక్తికరంగా ఉండటంతో పాటుగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత వెంకట్ తలారి మాట్లాడుతూ.. ‘గుహన్‌గారి దర్శకత్వంలో ఆనంద్ దేవరకొండ హీరోగా మా శ్రీ ఐశ్వర్య లక్ష్మీ మూవీస్ బేనర్‌పై సైకో క్రై మ్ థ్రిల్లర్ మూవీగా ‘హైవే’ రూపొందుతోంది. ఈ చిత్రాన్ని హై టెక్నికల్ వ్యాల్యూస్‌తో భారీ స్థాయిలో నిర్మిస్తున్నాం. ఆనంద్ దేవరకొండ, మానస రాధాకృష్ణన్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. మరికొంతమంది ప్రముఖ నటీనటులు ఈ చిత్రంలో నటించనున్నారు వారి వివరాలను త్వరలోనే వెల్లడిస్తాం. ‘హైవే’ తప్పకుండా ఒక సక్సెస్ఫుల్ థ్రిల్లింగ్ మూవీ అవుతుందని నమ్మకంఉంది’అన్నారు. చిత్ర దర్శకుడు కేవీ గుహన్ మాట్లాడుతూ..‘నేను దర్శకత్వం వహిస్తోన్న మూడో చిత్రమిది ‘హైవే’ నేపథ్యంలో సాగే ఒక సైకో క్రై మ్ థ్రిల్లర్ మూవీ. టెక్నికల్‌గా చాలా అడ్వాన్స్డ్గా ఉండబోతుంది. సైమన్ కె. కింగ్ సంగీతం ఈ చిత్రానికి మరో స్పెషల్ అట్రాక్షన్’అని అన్నారు. -
నెల్లూరులో ఘోర రోడ్డు ప్రమాదం, నలుగురు దుర్మరణం
సాక్షి, నెల్లూరు: గూడూరు జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. లారీ-కారు ఢీకొనడంతో నలుగురు మృతి చెందారు. తిరుపతి నుంచి రాజమండ్రి వెళ్తుండగా ఘటన జరిగింది. మృతులంతా ఒకే కుటుంబానికి చెందినవారు. మృతులను వీరయ్య, వరలక్ష్మీ, మణికంఠ, స్వాతిగా పోలీసులు గుర్తించారు. లిఖిత అనే యువతికి తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. జాతీయ రహదారిపై కొంతకాలంగా బ్రిడ్జి నిర్మాణం జరుగుతోంది. సింగిల్ రోడ్డు కావడం, అధికారులు పట్టించుకోకపోవడంతో నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి. -
హైవేలో లారీ పార్క్ చేస్తే అంతే..!
పలమనేరు: గంగవరం సర్కిల్ పరిధిలోని చెన్నై–బెంగళూరు హైవేలో ఆగి ఉన్న లారీలే టార్గెట్‌గా చోరీలు జరుగుతున్నాయి. డ్రైవర్ లారీని ఆపి నిద్రించే సమయంలో ఓ ముఠా చోరీలకు పాల్పడుతోంది. మొగి లిఘాట్ నుంచి బంగారుపాళెం మధ్యలో వారం రోజుల్లో రెండు చోరీలు జరిగినట్టు తెలిసింది. లారీల్లోని సరుకును దొంగలు మాయం చేస్తున్నారు. నాలుగురోజుల కిందట చెన్నైనుంచి బెంగళూరుకు వెళుతున్న లారీని డ్రైవర్ విశ్రాంతి కోసం బలిజపల్లి సమీపంలో ఆపి నిద్రిస్తుండగా చోరీ జరిగింది. లారీ వెనుక వైపు టార్పాలిన్ విప్పిన దొంగలు అందులోని బటర్‌ఫ్లై కంపెనీకి చెందిన స్టౌవ్‌లను తస్కరించినట్టు తెలిసింది. నిద్రలో ఉన్న డ్రైవర్ లేచి చూసేసరికి దొంగలు మరో లారీలో జారుకున్నట్టు సమాచారం. మరో ఘటనలో ఇంటీరియల్ డిజైన్ పరికరాల లోడ్ లారీలో డ్రైవర్ నిద్రిస్తుండగా, అందులోనూ కొంత సామాగ్రిని దొంగలు చోరీ చేసినట్టు తెలిసింది. సింగిల్ డ్రైవర్లున్న వాహనాలనే టార్గెట్‌గా చేసుకుని, డ్రైవర్ నిద్రపోతున్న సమయంలో లారీలు, టెంపోలు, కంటైనర్లలో చోరీ చేస్తున్నట్లు తెలుస్తోంది. హైవేలో చెన్నై నుంచి ఖాళీ లోడ్‌తో వచ్చే లారీడ్రైవర్లు, క్లీనర్లు చోరీలకు పాల్పడుతున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. నిద్రిస్తున్న డ్రైవర్‌పై మత్తుమందు కూడా చల్లుతున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ డ్రైవర్ అప్రమత్తమైతే దోచుకున్న సరుకుతో తాము తీసుకొచ్చిన లారీ ఎక్కి పరారవుతున్నట్టు సమాచారం. ఈచోరీలకు సంబంధించి పోలీసులు సీసీ కెమె రా ఫుటేజీల ఆధారంగా నిందితులను గాలిస్తున్నట్టు తెలిసింది. కోవిడ్ నేపథ్యంలో హైవే పట్రోలింగ్ వాహనాలు తిరక్కపోవడం కూడా హైవేలో చోరీలకు కారణమవుతోంది. త్వరలోనే ఈ చోరీ కేసులను ఛేదించే పనిలో పోలీసులు ఉన్నట్టు తెలుస్తోంది. చదవండి: కోవాగ్జిన్ సామర్థ్యం 77.8 శాతం -
కొడకారా దోపిడీ కేసు.. రాజకీయ చిత్తులు-జిత్తులు
కేరళ ఎన్నికల్లో చిత్తుగా ఓడిన బీజేపీకి ‘హవాలా మనీ’ ఆరోపణలు కొత్త తలనొప్పిని తెచ్చిపెడుతున్నాయి. కార్యకర్తల స్థాయి నుంచి కీలక నేతల దాకా ప్రతీ ఒక్కరి మధ్య ఈ స్కామ్ చిచ్చుపెడుతోంది. ఎన్నికలకు ముందు త్రిస్సూరు కొడకారా హైవేపై దోపిడి జరగడం.. ఈ కేసులో బాధితుడు ఫిర్యాదు చేసిన సొమ్ముకంటే ఎక్కువ సొమ్మును పోలీసులు రికవరీ చేస్తుండడం, ఆ సొమ్ముతో రాజకీయ నేతలకు లింకులు.. వెరసి పొలిటికల్ థ్రిల్లర్ మూవీని తలపిస్తున్నాయి అక్కడి రాజకీయాలు. త్రిస్సూరు: ఎన్నికల్లో గెలుపు కోసం కేరళ బీజేపీ డబ్బులు పంచాలని ప్రయత్నించిందని, కానీ బీజేపీ నేతలే ఆ డబ్బు కోసం దోపిడీ డ్రామాలు ఆడారనే ఆరోపణలు.. ప్రస్తుతం ఆ పార్టీని ఇరకాటంలో పడేస్తున్నాయి. అయితే ఇదంతా ఎల్డీఎఫ్(సీపీఐ-ఎం) రాజకీయ కుట్రలో భాగమేనని బీజేపీ ప్రత్యారోపణలకు దిగింది. ప్రభుత్వంతో కుమ్మక్కై పోలీసులు కుట్రకు పాల్పడుతున్నాయని ఆదివారం బీజేపీ పక్ష నేతలంతా మీడియా సమావేశం నిర్వహించి ఆరోపణలకు దిగారు. ఈ సమావేశంలో బీజేపీ కేరళ అధ్యక్షుడు సురేంద్రన్‌తో పాటు కేంద్ర మంత్రి మురళిధరన్, పార్టీ మాజీ అధ్యక్షులు కుమ్మనం రాజేంద్రన్, కృస్ణదాస్ ఇంకా సీనియర్ నేతలు పాల్గొన్నారు. ఇలా మొదలైంది.. ఏప్రిల్ 7న త్రిస్సూరుకు చెందిన షమ్జీర్ శామ్సుదీన్ అనే వ్యక్తి కొడకారా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం మొదలైంది. ఏప్రిల్ 3న రాత్రి.. అంటే అసెంబ్లీ ఎలక్షన్లకు మూడు రోజుల ముందు షమ్జీర్ తన కారులో కొచ్చివైపు వెళ్తున్నాడు. ఆ టైంలో కొడకారా ఫ్లైఓవర్ వద్ద తొమ్మిది మంది దుండగులు ‘ఫేక్ యాక్సిడెంట్’తో తనను ఆపారని, బెదిరించి ల్యాండ్ సెటిల్మెంట్ కోసం తీసుకెళ్తున్న పాతిక లక్షల రూపాయలు దోచుకున్నారని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే అతను ఒంటరిగా వెళ్లి ఫిర్యాదు చేయలేదు. అతని కూడా వ్యాపారవేత్త ఏకే ధర్మరాజన్ కూడా ఉన్నాడు. ధర్మరాజన్ ఆరెస్సెస్ సభ్యుడు. ఆయన ఆ డబ్బును చాలామంది దగ్గరి నుంచి అప్పుగా తీసుకున్నానని చెప్పడం, సరిగ్గా దోపిడీ జరిగింది ఎన్నికల టైం కావడంతో పోలీసులకు అనుమానం మొదలైంది. డొంక కదిలింది.. ఈ కేసులో దీపక్ అనే వ్యక్తి పోలీసులు మొదటగా అరెస్ట్ చేశారు. అతనిచ్చిన సమాచారంతో ఈ దోపిడీలో పాల్గొన్న మరో 19 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే పోలీసులు పాతిక లక్షల కంటే ఎక్కువ సొమ్మును రికవరీ చేయడంతో అసలు ట్విస్ట్ మొదలైంది. దీంతో పోలీసులు ధర్మరాజన్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా.. యువ మోర్చా నేత సునీల్ నాయక్ తనకు ఆ డబ్బు ఇచ్చాడని ధర్మరాజన్ చెప్పాడు. దీంతో కొడకారా పోలీసులు సునీల్ పిలిపించుకుని విచారించారు. తనకు ఆ డబ్బు బయటి నుంచి వచ్చిందని, ధర్మరాజన్తో తనకున్న లావాదేవీల కారణంగానే ఆ డబ్బు ఇచ్చానని చెప్పాడు. దీంతో కొడకారా పోలీసులు మరోసారి ధర్మరాజన్‌ను ఇంటరాగేషన్ చేయడంతో.. ఆ సొమ్ము బీజేపీ నేతల కోసమేనని ధర్మరాజన్ చెప్పడంతో కేసు కొత్త మలుపు తిరిగింది. బీజేపీతో లింకులు! త్రిస్సూరులోని ఓ హోటల్లో బీజేపీ కీలక నేత ఒకరు తనకోసం రూమ్ బుక్ చేశారని ధర్మరాజన్ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇది నిజమేనని ఒప్పుకున్న బీజేపీ కార్యదర్శి అనీష్ కుమార్.. కేవలం ప్రింటింగ్ ఎలక్ట్రానిక్ మెటీరియల్ ఇంఛార్జిగా ఉన్న ధర్మరాజన్ కోసం ఆ పని చేయాల్సి వచ్చిందని చెప్పాడు. ఆ సొమ్ము బీజేపీకి చెందిన మరో ముగ్గురు నేతలకు అందించాల్సి ఉందని ధర్మరాజన్ చెప్పగా, వాళ్లు మాత్రం ఆ డబ్బుతో తమకేం సంబంధం లేదని పోలీసుల ఎదుట స్టేట్మెంట్ ఇచ్చారు. ఇక ఈ కేసులో అరెస్టయిన దీపక్.. దోపిడీ జరిగిన తెల్లారే బీజేపీ ఆఫీస్‌కు వెళ్లాడన్న విషయం వెలుగులోకి రావడంతో కథ కొత్త మలుపు తిరిగింది. పైగా రికవరీ సొమ్ము దగ్గర దగ్గర మూడున్నర కోట్ల రూపాయలు ఉండొచ్చని పోలీసులు అంచనాకి వచ్చారు. ప్రత్యేక దర్యాప్తు బృందం రంగప్రవేశంతో ఇప్పటిదాకా జరిగిన సోదాల్లో కోటి రూపాయల దాకా సొమ్ము రికవరీ అయినట్లు తెలుస్తోంది. సొంత నేతల పనేనా? ఈ దోపిడీలో ప్రధాన నిందితుడిగా ఉన్న దీపక్.. దోపిడీ తర్వాత బీజేపీ ఆఫీస్‌కు వెళ్లిన విషయాన్ని పార్టీ కూడా ధృవీకరించింది. అయితే దోపిడీకి సంబంధించి సొంత నేతలపైనే అధిష్టానానికి అనుమానం వచ్చిందని, ఆ కోణంలోనే దర్యాప్తు కోసం కొందరిని ఆఫీస్‌కు పిలిపించుకున్నామని, అందులో కార్యకర్త దీపక్ కూడా ఉన్నాడని బీజేపీ కార్యదర్శి అనీష్ కుమార్ చెప్పాడు. దీంతో ఈ దోపిడీ స్కెచ్ బీజేపీలోని సొంత నేతల పనే అని పోలీసులు ఒక నిర్ధారణకు వచ్చారు. అంతేకాదు కొడాకరా దోపిడీ గురించి బీజేపీ నేతలు ఒకరిపై ఒకరు వాట్సాప్ గ్రూపుల్లో విపరీతంగా వ్యతిరేక ప్రచారం చేసుకున్నారనే విషయం పోలీసుల దృష్టికి వచ్చింది. దీంతో కేరళ బీజేపీలో అంతర్గత కుమ్ములాట వల్లే ఇదంతా జరిగి ఉండొచ్చని పోలీసులు ఒక అంచనాకి వచ్చారు. అయితే ఈ కాంట్రవర్సీకి బీజేపీ కేరళ అధిష్టానం దూరంగా ఉండాలని ప్రయత్నిస్తూనే.. ఇదంతా ఎల్డీఎఫ్ కుట్రలో భాగమేనని వాదిస్తోంది. ఈ కేసులో ప్రధాన నిందితుల్ని పట్టుకోవాల్సింది పోయి.. బీజేపీ నేతలతో ముడిపెట్టాలని పోలీసులు ప్రయత్నిస్తున్నారని బీజేపీ ఆరోపణలను దిగింది. నిందితుల్లో లెఫ్ట్ నేత కూడా?! పోలీసులు నిందితుల కాల్ లిస్టులను పరిశీలించాల్సింది పోయి.. వ్యాపారవేత్త అయిన ధర్మరాజన్ కాల్ లిస్ట్‌ను జల్లెడ పడుతోందని బీజేపీ మండిపడింది. ఈ కేసులో ఆరెస్ట్ చేయాల్సిన నిందితుడు మరోకడున్నాడని, అతను లెఫ్ట్ పార్టీ యూత్ వింగ్ లీడర్ మాత్రమే కాదని, త్రిస్సూరుకు చెందిన ఓ అధికార పార్టీ ఎమ్మెల్యేకు దగ్గరి బంధువని బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ సురేంద్రన్ ఆరోపిస్తున్నాడు. అంతేకాదు ఆ నిందితుడు ఈ కేసు నుంచి తప్పించునేందుకు వామపక్ష ఉద్యమవేత్త ఎన్ఎన్ పురం సాయం కూడా తీసుకున్నాడని చెప్పాడు. సీపీఎం నేత కొడియారి బాలకృష్ణన్ కొడుకును బెంగళూరులో డ్రగ్స్ ట్రాఫికింగ్ కేసులో అరెస్ట్ చేయగా, ప్రతీకారంగానే తన కొడుకు హరికృష్ణన్‌ను విచారణపేరుతో ఇబ్బంది పెట్టాలని బీజేపీ ప్రయత్నిస్తోందని సురేంద్రన్ ఆరోపణలకు దిగారు. సిట్ ముందుకు నేతలు కొడకారా దారి దోపిడీ కేసు వ్యవహారంలో కేరళ బీజేపీ కీలక నేతల్ని ప్రశ్నిస్తోంది సిట్. బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు సురేంద్రన్ ఎన్నికల టైంలో ఇద్దరికి లంచాల ప్రలోభం చూపెట్టాడన్న ఆరోపణలపై కూడా దర్యాప్తు చేయాలని నిర్ణయించుకుంది. అంతేకాదు ఆయన డ్రైవర్‌తో పాటు ముఖ్య అనుచరుల్ని సిట్ ప్రశ్నించింది కూడా. ఇక సురేంద్రన్ తనయుడు హరికృష్ణన్.. దోపిడీ జరిగిన రోజు ధర్మరాజన్తో పలుమార్లు ఫోన్‌కాల్స్ మాట్లాడినట్లు పోలీసులకు ఆధారాలు లభించినట్లు తెలుస్తోంది. దీంతో హరికృష్ణన్‌కు సిట్ నోటీసులు పంపింది. మరోవైపు బీజేపీ నేత, నటుడు సురేష్ గోపీని కూడా(హెలికాఫ్టర్ల ప్రచారంపై) ప్రశ్నించాలని సిట్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే కొడకారా కేసులో న్యాయవిచారణ జరిపించాలని కాంగ్రెస్ పార్టీ కేరళ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తోంది. ఈడీ దృష్టి కొరకాడ హవాలా మనీ కేసు అని, ఇందులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ జోక్యం చేసుకోవాలని కోరుతూ లోక్‌తంత్రిక్ జనతా దళ్ యువ విభాగం జాతీయాధ్యక్షుడు సలీం మడావూర్ హైకోర్టును ఆశ్రయించాడు. దీంతో ఈ కేసులో జోక్యం చేసుకుంటుందో లేదో తెలపాల్సిందిగా ఈడీ ఏజెన్సీని ధర్మాసనం కోరింది. అయితే ఈడీ వారం గడువు కోరగా.. కోర్టు పదిరోజుల గడువు మంజూరు చేసింది. ఈ క్రమంలో ఈడీ ఇప్పటికే ఈ కేసు ఫైల్స్‌ను పరిశీలిస్తున్నట్లు సమాచారం. -
శీను ద్వయం..మున్నా గ్యాంగ్‌కు సింహ స్వప్నం
సాక్షి, ఒంగోలు: నేషనల్ హైవేపై లారీ డ్రైవర్లు, క్లీనర్లను హతమార్చిన గ్యాంగ్‌లో ప్రధాన నిందితుడు మున్నాతో సహా 18 మందికి సోమవారం ఒంగోలు 8వ అదనపు జిల్లా కోర్టు జడ్జి మనోహర్‌రెడ్డి శిక్షలు విధించిన విషయం తెలిసిందే. ఈ తీర్పు రావడం వెనుక కానిస్టేబుళ్లు వై.శ్రీనివాసరావు, బీఎస్ శ్రీనివాస్ కృషి ప్రశంసనీయం. మున్నా గ్యాంగ్‌కు శిక్ష పడిందని తెలియగానే బాధిత కుటుంబాలే కాదు.. ప్రస్తుతం పనిచేస్తున్న, రిటైరైన అధికారులు, పలువురు న్యాయవాదులు శీను ద్వయాన్ని అభినందనలతో ముంచెత్తారు. ఒంగోలుకు చెందిన వై.శ్రీనివాసరావు, బీఎస్ శ్రీనివాస్ 1993లో కానిస్టేబుళ్లుగా ఎంపికై తొలుత పొన్నలూరు పోలీసుస్టేషన్లో విధుల్లో చేరారు. 2008లో మున్నా కేసు వెలుగుచూసినపుడు వై.శ్రీనివాసులు అలియాస్ వాసు మద్దిపాడు పోలీస్‌స్టేషన్‌లో కోర్టు కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. కేసు తీవ్రత దృష్ట్యా సీఐడీ దర్యాప్తు చేయడం, మరో వైపు సింగరాయకొండ కేసులో సాక్షులను ప్రవేశపెట్టాల్సి రావడంతో కానిస్టేబుల్ వాసును అప్పటి ఎస్పీ సీఎస్‌ఆర్‌కేఎల్‌ఎన్ రాజు పబ్లిక్ ప్రాసిక్యూటర్ వద్ద లైజన్ ఆఫీసర్‌గా నియమించారు. అతనికి తోడుగా బీఎస్ శ్రీనివాస్‌ను పంపారు. మున్నా గ్యాంగ్‌పై నమోదైన నాలుగు కేసుల్లో సాక్షులకు సమన్లు పంపడం, వారు తప్పనిసరిగా కోర్టుకు హాజరయ్యేలా చూడడం, వారి భద్రతకు ఉన్నతాధికారులతో భరోసా ఇప్పించడంలో ఇద్దరూ సఫలీకృతులయ్యారు. చదవండి: ఒంగోలు కోర్టు సంచలన తీర్పు; 12 మందికి ఉరి శిక్ష ఆఫర్లు.. బెదిరింపులు.. ఒంగోలు సబ్ జైల్లో ఉంటున్న మున్నా గ్యాంగ్‌తో సఖ్యంగా ఉంటూ అవసరమైన సమాచారాన్ని ఉన్నతాధికారులకు చేరవేసేవారు. ఈ క్రమంలో ‘సాక్షులను తీసుకురావడం, వారికి నచ్చజెప్పడం మీకు అనవసరం. మీరు ఆ పని ఆపితే అర కోటి ఇస్తాం’ అంటూ మున్నాతోపాటు అతని బావమరిది హిదయతుల్లా అలియాస్ బాబులు ఆఫర్ చేయగా ఇద్దరూ తిరస్కరించారు. దీంతో వారిద్దరిపై మున్నా అనుచరులు ఆటోతో ఎటాక్ చేయగా తృటిలో తప్పించుకున్నారు. బిహార్, పశ్చిమబెంగాల్, ఛత్తీస్ఘర్, తమిళనాడు రాష్ట్రాలకు వెళ్లి బాధిత కుటుంబాలు సాక్ష్యం చెప్పేందుకు రప్పించడం, మృతదేహాలు లభించిన స్థలంలో చూసిన సాక్షులను కోర్టులో హాజరుపరచడంలో వీరిద్దరూ కృషి చేశారు. ఏదో ఒక విధంగా బెయిల్‌పై బయటకు రావాలని మున్నా గ్యాంగ్ కుటిల యత్నాలు చేయగా వాసు, శ్రీనివాస్ అడ్డుతగిలారు. దీంతో ఒక దశలో ‘మా మాట వింటే లక్షాధికారులు అవుతారు.. కాదంటే మీ అంతుచూస్తాం’ అని మున్నా గ్యాంగ్ హెచ్చరించినా వెరవలేదు. ఈ క్రమంలో అప్పటి జిల్లా ఎస్పీ రఘురామిరెడ్డి ఏఆర్ సిబ్బందికి బాడీ వార్న్ కెమెరాలు అందించి నిఘా పెంచడంతో మున్నా గ్యాంగ్ ఆగడాలు తగ్గుముఖం పట్టాయి. నిత్యం సైకిల్‌పై కోర్టుకు వెళ్లి వస్తున్న వాసుకు వెపన్ ఇవ్వాలని పోలీసు ఉన్నతాధికారులు నిర్ణయించగా వాసు సున్నితంగా తిరస్కరించారు. దీంతో మాలకొండయ్య అనే మరో హెడ్ కానిస్టేబుల్‌ను భద్రత కోసం ప్రత్యేకంగా అప్పటి ఎస్పీ సీఎం త్రివిక్రమవర్మ నియమించారు. ఉన్నతాధికారుల అండదండలు మున్నా గ్యాంగ్‌ను కలిసేందుకు వచ్చే పాత నేరస్తులపై దృష్టి పెట్టడం కష్టం అవుతుందనే ఉద్దేశంతో అప్పటి ఎస్పీ నవీన్‌చంద్ మొదలు ప్రస్తుత ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ వరకు లైజన్ ఆఫీసర్లను మార్చే ప్రయత్నం చేయలేదు. ఇదిలా ఉండగా కిల్లర్ గ్యాంగ్‌పై కేసు నమోదు చేసిన సమయంలో ఉన్న పలువురు ఆఫీసర్లు రిటైరయ్యారు. మరికొందరు వేర్వేరు జిల్లాల్లో పనిచేస్తున్నారు. వీరందరికీ కేసుల స్థితిగతులను వివరించడంతోపాటు పబ్లిక్ ప్రాసిక్యూటర్లకు చేదోడువాదోడుగా ఉంటూ మున్నా గ్యాంగ్‌కు కఠిన శిక్ష పడేలా చేశారు. అందుకే అందరినీ హడలెత్తించిన మున్నా గ్యాంగ్‌కు వై.శ్రీనివాసరావు, బీఎస్ శ్రీనివాస్ పేరు వింటే ముచ్చెమటలు పట్టేవి. -
ఆనంద్ దేవరకొండతో హైవే ప్రయాణం
ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కేవీ గుహన్ ‘118’ చిత్రంతో దర్శకుడిగా మారిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన ఆనంద్ దేవరకొండ హీరోగా ‘హైవే’ అనే చిత్రానికి శ్రీకారం చుట్టారు. శ్రీ ఐశ్వర్య లక్ష్మీ మూవీస్ పతాకంపై వెంకట్ తలారి నిర్మిస్తున్న ఈ సినిమా గురువారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఆనంద్ దేవరకొండపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి దర్శకుడు ఎం. వీరభద్రం కెమెరా స్విచ్చాన్ చేయగా, తుంగతుర్తి ఎంఎల్ఎ గాదరి కిశోర్‌కుమార్ క్లాప్ కొట్టారు. ఈ సందర్భంగా వెంకట్ తలారి మాట్లాడుతూ – ‘‘చుట్టాలబ్బాయి’ వంటి సూపర్‌హిట్ తర్వాత మా బేనర్లో చేస్తోన్న రెండో చిత్రమిది. హైవే నేపథ్యంలో ఒక సైకో క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందుతోన్న ఈ చిత్రం తప్పకుండా విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది. జూన్ మొదటి వారంలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం’’ అన్నారు. ‘‘ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ దాదాపు పూర్తయ్యింది. ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ ఎంపిక జరుగుతోంది’’ అన్నారు కేవీ గుహన్. ‘‘గుహన్‌గారి దర్శకత్వంలో సినిమా చేస్తుండటం చాలా సంతోషం. ఈ ప్రయాణంలో ఎన్నో కొత్త విషయాలు నేర్చుకుంటాననే నమ్మకం ఉంది’’ అన్నారు ఆనంద్ దేవరకొండ. ఈ చిత్రానికి సంగీతం: సైమన్ కె. కింగ్. -
అమెరికాలో హైవేను రెండేళ్ల పాటు దత్తత తీసుకున్న నాట్స్
ఫ్లోరిడా: నాట్స్ సేవ కార్యక్రమాలలో మరో ముందడుగు వేసింది. అమెరికాలో రహదారుల పరిరక్షణ, పచ్చదనం, పరిశుభ్రత కూడా ప్రజలు తమ సామాజిక బాధ్యతగా భావిస్తుంటారు. ఈ క్రమంలో ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ టెంపాబే విభాగం టెంపాలోని రెండు మైళ్ల హైవేను దత్తత తీసుకుంది. దీని ప్రకారం ఈ రెండు మైళ్ల పరిధిలో ఉండే హైవేను పరిశుభ్రత బాధ్యతను నాట్స్ భుజానికెత్తుకుంది. ఈ పరిశుభ్రత కార్యక్రమాన్ని నాట్స్ బోర్డ్ మాజీ ఛైర్మన్ శ్రీనివాస్ గుత్తికొండ ప్రారంభించారు. 20 మంది నాట్స్ సభ్యులు, స్థానిక ఉండే హైస్కూల్ విద్యార్ధులు ఈ కార్యక్రమంలో పాల్గొని తమ సేవలు అందించారు. రెండు మైళ్ల పాటు రహదారికి ఇరువైపులా ఉన్న చెత్త చెదారం అంతా తొలగించారు. అంతా శుభ్రంగా ఉండేలా చేశారు. ఎర్త్ డే నాడు విద్యార్ధుల్లో కూడా మన పరిసరాలను మనమే బాగు చేసుకోవాలనే స్ఫూర్తిని నింపేందుకు నాట్స్ ఈ కార్యక్రమం చేపట్టింది. ఇందులో పాల్గొన్న విద్యార్ధులకు నాట్స్ సేవా ధ్రువ పత్రాలను అందించింది. నాట్స్ టెంపాబే నాయకత్వం ఎంతో సమర్థంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. నాట్స్ నాయకులు శ్రీనివాస్ గుత్తికొండ, ప్రశాంత్ పిన్నమనేని, శ్రీనివాస్ మల్లాది,రాజేష్ కాండ్రు, సుధీర్ మిక్కిలినేని, ప్రసాద్ ఆరికట్ల, బిందు సుధ, శ్రీనివాస్ అచ్చి, శ్రీనివాస్ బైరెడ్డి, భాస్కర్ సోమంచి, జగదీష్ తౌతం, రమేష్ కొల్లి, సుమంత్ రామినేని, అనిల్ అరేమండ, విజయ్ కట్టా ఈ కార్యక్రమంలో కీలక పాత్ర పోషించారు. ఆండ్రెస్ క్వాస్ట్, రోనక్ అగర్వాల్, ఆండీ చెన్, అభయ్ తుంగతుర్తి, సూర్య కార్తికేయన్, విజయలక్ష్మి రిష్విత సి ఆరికట్ల, శ్రీష్ బైరెడ్డి, క్రిష్ తలతి, అంజలి శర్మ, కుషి తలతి తదితరులు రహదారి పరిశుభ్రతలో ఎంతో ఉత్సాహంగా పనిచేశారు. టెంపా బే చాప్టర్ కోసం సర్వీస్ సర్టిఫికేట్ టెంప్లేట్ తయారు చేయడంలో సోహన్ మల్లాడి కీలకపాత్ర పోషించారు. ఈ కార్యక్రమం కోసం నాట్స్ టెంపా బే యూత్ కమిటీ సభ్యులు రుత్విక్ ఆరికట్ల, సోహన్ మల్లాదిలు చూపిన చొరవను నాట్స్ ప్రత్యేకంగా అభినందించింది. ఈ రహదారికి రెండేళ్ల పాటు పరిశుభ్రత నిర్వహణను నాట్స్ తీసుకుంది కాబట్టి.. ఇది క్రమం తప్పకుండా కొనసాగించనుంది. నాట్స్ ఫ్లోరిడా చాప్టర్ చేసిన ఈ సేవా కార్యక్రమాన్ని స్ఫూర్తి గా తీసుకొని ఇతర నాట్స్ చాఫ్టర్లు కూడ ముందుకు రావడం చాలా సంతోషాన్ని ఇస్తోందని నాట్స్ చైర్మన్ శ్రీదర్ అప్పసాని, అధ్యక్షుడు శేఖర్ అన్నే ఫ్లోరిడా చాప్టర్ నాయకత్వాన్ని అభినందించారు. -
మరో రెండింటిని ఎన్‌హెచ్‌లుగా గుర్తించాలి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఏడు స్టేట్ హైవేలను నేషనల్ హైవేస్‌గా మార్చేందుకు కేంద్రం సూత్రప్రాయ ఆమోదం తెలపడంతో మరో రెండు రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా గుర్తించాలని ఏపీ ప్రభుత్వం మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్‌పోర్టు అండ్ హైవేస్‌కు లేఖ రాసింది. రాయలసీమ జిల్లాల్లో వైఎస్సార్ కడప, కర్నూలు, అనంతపురంలలో రెండు రహదారులపై ట్రాఫిక్ పెరిగినందున ఎన్‌హెచ్‌లుగా గుర్తింపు ఇవ్వాలని లేఖలో కోరింది. జమ్మలమడుగు–నంద్యాల, కొడికొండ చెక్‌పోస్టు–ముద్దనూరు–కదిరి రాష్ట్ర రహదారులను ఎన్‌హెచ్‌లుగా గుర్తించాలని రాష్ట్ర ప్రభుత్వం తాజాగా లేఖ రాసింది. ఈ రహదారులపై నిత్యం ఏడు వేల ప్యాసింజర్ కార్ యూనిట్లు (పీసీయూ) వెళ్తున్నందున ట్రాఫిక్ పెరిగిందని రహదారుల అభివృద్ధి సంస్థ నివేదించింది. గెజిట్ నోటిఫికేషన్ ఇప్పటికే మూడు రాష్ట్ర రహదారులకు జాతీయ రహదారుల నంబర్లను కేటాయించి గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. తెలంగాణ, ఏపీలను కలిపే విధంగా మహబూబ్‌నగర్, కర్నూలు జిల్లాల మధ్య ఎన్‌హెచ్–67 జంక్షన్ వద్ద నాగర్‌కర్నూల్, కోలాపూర్, రామాపూర్, మండుగల, శివాపురం, కరివెన, నంద్యాల వరకు (ఎన్‌హెచ్–40 సమీపంలో) ఉన్న 94 కి.మీ. రోడ్డును ‘ఎన్‌హెచ్–167కే’గా గుర్తించింది. అనంతపురం జిల్లా పరిధిలోని ఎన్‌హెచ్–44పై కోడూరు నుంచి ముదిగుబ్బ (ఎన్‌హెచ్–42) వయా పుట్టపర్తి మీదుగా వెళ్లే 79 కి.మీ. రాష్ట్ర రహదారికి ఎన్‌హెచ్–342 కేటాయించారు. వైఎస్సార్ కడప జిల్లా పరిధిలోనూ రాయచోటి–వేంపల్లె–యర్రగుంట్ల–ప్రొద్దుటూరు–చాగలమర్రి వరకు ఉన్న 130.50 కి.మీ. రోడ్డును తాజాగా ఎన్‌హెచ్‌గా గుర్తించారు. ఈ రోడ్డుకు ఎన్‌హెచ్–440 నంబర్ కేటాయించారు. -
ఒంటరి వ్యక్తులే లక్ష్యంగా..
తణుకు (పశ్చిమగోదావరి): జాతీయ రహదారిపై దారి దోపిడీలకు పాల్పడుతున్న ముగ్గురిని శనివారం పోలీసులు అరెస్టు చేశారు. మోటారు సైకిళ్లపై ఒంటరిగా వెళ్లే వ్యక్తులను లక్ష్యంగా చేసుకుని వారిని ఆపి నగదు, సెల్ఫోన్లు దొంగిలించడం వీరి వృత్తి.. శనివారం తణుకు సర్కిల్ పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కొవ్వూరు డీఎస్పీ కె.రాజేశ్వరరెడ్డి వివరాలు వెల్లడించారు. తణుకు సర్కిల్ పరిధిలోని పెరవలి, తణుకు పట్టణ పోలీసు స్టేషన్ పరిధిలోని హైవేపై గత రెండ్రోజుల వ్యవధిలోనే రెండు దారి దోపిడీలు జరిగినట్లు ఫిర్యాదులు రావడంతో.. ఇన్‌ఛార్జి సీఐ ఆకుల రఘు ఆధ్వర్యంలో నిఘా ఉంచారు. హైవేపై రాత్రి సమయాల్లో ఒంటరిగా వెళుతున్న వ్యక్తులను లక్ష్యంగా చేసుకుని వారిని వెంబడిస్తూ అనువైన ప్రదేశంలో ఆపి గొడవ పెట్టుకుని.. వారిని గాయపరిచి సెల్ఫోన్లు, నగదు లాక్కెళుతున్నట్లు గుర్తించారు. గుర్తు తెలియని ముగ్గురు వ్యక్తులు పల్సర్ మోటారు సైకిల్‌పై తిరుగుతూ దోపిడీలు చేస్తున్నట్లు చెప్పారు. దీంతో స్థానిక పెరవలి వై జంక్షన్ వద్ద శుక్రవారం పోలీసులు నిఘా ఉంచి వాహనాల తనిఖీ చేపట్టారు. పల్సర్ వాహనంపై అనుమానాస్పదంగా వెళ్తున్న ముగ్గురు వ్యక్తులను ఆపి విచారించగా వారి నుంచి సరైన సమాధానం రాకపోవడంతో వారిని విచారించారు. గత కొద్దిరోజులగా దారి దోపిడీలకు పాల్పడుతున్నట్లుగా నిర్ధారించారు. తణుకు హౌసింగ్ బోర్డు కాలనీలో ఉంటున్న గంటా శ్రీను అలియాస్ గరగ శ్రీను, బరువు లోవరాజు, కోటిపల్లి ప్రవీణ్‌కుమార్ అలియాస్ నానిలను అరెస్టు చేసి వారిపై కేసు నమోదు చేశారు. వారి నుంచి రూ. 1500 నగదు, రెండు సెల్ఫోన్లు, నేరాలకు ఉపయోగిస్తున్న మోటారుసైకిల్ స్వా«దీనం చేసుకున్నారు. కేసును త్వరితగతిన ఛేదించడానికి సహకరించిన ఇన్‌ఛార్జి సీఐ ఆకుల రఘు, పట్టణ ఎస్సై కె.రామారావు, పెరవలి ఎస్సై ఎం.సూర్యభగవాన్, ఏఎస్సై ఐ.శ్రీధర్, హెడ్‌కానిస్టేబుళ్లు శ్రీనివాసరెడ్డి, సత్యనారాయణ, సాంబయ్యలను డీఎస్పీ రాజేశ్వరరెడ్డి అభినందించారు. -
వైరల్ : చూస్తున్నంతసేపు ఉత్కంఠ..
క్యుబెక్ : సాధారణంగా విమానాలు రన్‌వే మీద ల్యాండ్ అవడం చూస్తుంటాం.. కానీ ఇక్కడ మాత్రం ఒక విమానం అత్యవసర పరిస్థితి ఏర్పడడంతో హైవే మీద ల్యాండ్ అవ్వాల్సి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. కెనెడాలోని క్యుబెక్ ఫ్రావిన్స్ హైవే నిత్యం వేలాది వాహనాలతో రద్దీగా ఉంటుంది. ఈ నేపథ్యంలో అప్పటికే హైవేపై వేగంగా కార్లు వెళుతున్నాయి. ఇదే సమయంలో ఆకాశంలో వెళ్తున్న విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో పైలట్ విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేయాలనుకున్నాడు. కానీ ఇంకా రన్‌వే చాలా దూరంలో ఉండడంతో అంతసేపు విమానం గాల్లో ఉంటే కష్టమని హైవేపై ల్యాండ్ చేద్దామని భావించాడు. రోడ్డుపై కార్లు రివ్వుమని దూసుకెళుతుండడంతో పైలట్ జాగ్రత్తగా ఏ వాహనానికి తగలకుండా మెళ్లిగా విమానాన్ని హైవే మధ్యలో దింపేశాడు. ఇదంతా రోడ్డుపై వెళుతున్న ఒక ప్రయాణికుడు వీడియో తీసి ట్విటర్లో షేర్ చేశాడు. అయితే వీడియోలో పైలట్ విమానాన్ని ల్యాండింగ్ చేస్తున్న సమయం ఎంతో ఉత్కంఠ కలిగించింది. హైవేపై వెళుతున్న వాహనాలకు ఏమాత్రం ఇబ్బంది కలగకుండా జాగ్రత్తగా విమానాన్ని కిందకు దించడంలో పైలట్ చాకచక్యతను మెచ్చుకొని తీరాల్సిందే. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ' రన్‌వే మీద దిగాల్సిన విమానం హైవే మీద దిగింది.. పైలట్ సమయస్పూర్తిని మెచ్చుకోవాల్సిందే.. లేకుంటే పెద్ద ప్రమాదమే జరిగేది' అంటూ కామెంట్లు పెడుతున్నారు. -
హైవే పోలీస్
సాక్షి,సిటీబ్యూరో: రోడ్డు ప్రమాదాలుజరిగినప్పుడు క్షతగాత్రులను రక్షించే క్రమంలో తమపైనా కేసులునమోదవుతాయన్న అపోహలు ప్రజలు వీడనాడాలని, సహాయం చేసేవారిపై ఎలాంటి కేసులు ఉండవని సైబరాబాద్ పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్ స్పష్టం చేశారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రమాదాలు జరిగినప్పుడు, అత్యవసర సమయాల్లో సహాయం చేసేందుకు ప్రజలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. గచ్చిబౌలిలోని సైబరాబాద్ పోలీసు కమిషనరేట్‌లో గురువారం హైవే పెట్రోలింగ్ వాహనాలను ట్రాఫిక్ డీసీపీ విజయ్‌కుమార్‌తో కలిసి సజ్జనార్ ప్రారంభించారు. ఈ సందర్భంగాఆయన మాట్లాడుతూ.. ఇటు జాతీయరహదారులు, అటు అంతర్గతరహదారులపై జరుగుతున్న ప్రమాదాల్లో క్షతగ్రాతులను సరైన సమయాల్లో ఆస్పత్రికి చేర్చకపోవడం వల్లే చాలామంది ప్రాణాలు కోల్పోతున్నట్టుఅధ్యయనంలో తేలిందన్నారు. ఈ ఏడాది రోడ్డు భద్రతపై ప్రధానంగా దృష్టి సారించామని, ఇందులో భాగంగా‘నేషనల్ హైవే పెట్రోలింగ్’తోపాటు సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలోని 36 పోలీసు స్టేషన్ల పరిధిలో కానిస్టేబుల్ స్థాయి గల సిబ్బందిని రోడ్డు ప్రమాదాల క్షతగాత్రుల సహాయానికి కో–అర్డినేటర్స్ (సమన్వయకర్త)గా నియమించామన్నారు. వీరు 24 గంటలపాటు విధుల్లో సేవలు అందిస్తారన్నారు. రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారు బతికేందుకు అవకాశమున్న ‘గోల్డెన్ అవర్’(తొలి గంట)లో ప్రాథమిక చికిత్స చేసి ఆస్పత్రిలో చేర్పించేలా అటు హైవే బృందాలు, ఇటు కో–అర్డినేటర్స్ సమర్థంగా పనిచేసేలా వైద్యులతో శిక్షణ ఇప్పించామని సీపీ చెప్పారు. రోడ్డు ప్రమాదాల్లో బాధితుల ప్రాణాలు రక్షించడంపై ప్రతి ఆస్పత్రిలో ట్రామాకేర్ సెంటర్‌తో పాటు ఎమర్జెన్సీ సెంటర్ ఉండేలా చూడాలని ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల యాజమాన్యాలను కోరామన్నారు. తొలిసారి శంషాబాద్ జోన్లో.. సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలోకి వచ్చే ఎన్‌హెచ్–44 మార్గంలోని రాజేంద్రనగర్ ఠాణా పరిధి హసన్‌నగర్ ఎక్స్ రోడ్డు నుంచి షాద్‌నగర్ ఠాణా పరిధిలోని హమీద్ కాటన్ మిల్స్ వరకు 54 కిలోమీటర్లలో నాలుగు పెట్రోలింగ్ వాహనాలు గురువారం నుంచి సేవలు అందిస్తాయని సీపీ సజ్జనార్ తెలిపారు. త్వరలో మాదాపూర్, బాలానగర్ జోన్లలోనూ హైవే పెట్రోలింగ్ సేవలు అందుబాటులోకి తెస్తామన్నారు. ‘ఒక్కో పెట్రోలింగ్ వాహనంలో ఒక ఎస్ఐ, ఇద్దరు కానిస్టేబుళ్లు, ఒక డ్రైవర్ ఉంటారు. వీరికి రోడ్డు ప్రమాద సమయాల్లో అవసరమైన 18 అర్టికల్స్ అందించాం. ఫస్ట్ ఎయిడ్ కిట్, బ్రీత్ అనలైజర్, ట్యాప్, వాహనాలు ప్రమాదమై అందులో శరీరాలు ఇరుక్కుపోయినా.. వెహికల్ స్ట్రక్ అయినా కట్ చేయడానికి కట్టర్స్, క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించడానికి స్ట్రెచర్ అందుబాటులో ఉంచాం. రెండు షిఫ్ట్‌ల్లో 24 గంటల పాటు పెట్రోలింగ్ చేస్తారు. ఏమాత్రం ఇబ్బంది, అవసరమున్నా, రోడ్డు ప్రమాదమైనా డయల్ 100కి కాల్ చేయండి. లేదంటే హైవే పెట్రోలింగ్ నంబర్ 85004 11111కు సమాచారం అందించండి’ అని సీపీ ప్రజలను కోరారు. హైవే రక్షణ దళం విధులు ఏమంటే.. రోడ్డు ప్రమాదం జరిగిన ప్రాంతానికి ఈ హైవే పెట్రోలింగ్ సిబ్బంది వెళ్లి క్షతగాత్రులను ప్రాథమిక చికిత్స చేసి వెంటనే వారిని ఆస్పత్రికి తరలిస్తారు. ఫొటో, వీడియో తీస్తారు. లా అండ్ అర్డర్ పోలీసులు, 108కి కూడా సమాచారం ఇస్తారు. డ్రంకన్ డ్రైవ్, హెల్మెట్ లేకుండా బైక్ నడపడం, ట్రిపుల్ రైడింగ్, ఆటోల్లో ఎక్కువగా ప్రయాణికులు, సెల్‌ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్, అతి వేగంగా వెళ్లడం తదితర ట్రాఫిక్ ఉల్లంఘనులపై చర్యలు తీసుకుంటారు. అనధికారిక ప్రాంతాల్లో మద్యం అమ్మకాలతో పాటు మద్యపానాన్ని నియంత్రిస్తారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలు దృష్టికి వస్తే చర్యలు తీసుకుంటారు. వాహనాలు బ్రేక్‌డౌన్, ఇంధనం అయిపోయినా, సరైన మార్గం లేకుండా వేచి ఉండేవారికి సహకరిస్తారు. ఆస్పత్రులు, ఠాణాలు, ఆర్టీఓ, ఎన్హెచ్ఏఐ సిబ్బందిని సమన్వయం చేస్తారు. అలాగే, రోడ్డు ధ్వంసమై ఉండటం, సైన్ బోర్డులు, మార్కింగ్‌లు సరిగా లేకపోయినా నివేదిక రూపొందించి సంబంధిత విభాగాలకు పంపుతార’ని ట్రాఫిక్ డీసీపీ విజయ్ కుమార్ తెలిపారు. త్వరలో ఈ ప్రాంతాల్లోనూ.. స్టేట్ హైవే నార్సింగి నుంచి మెయినాబాద్ చేవెళ్ల రోడ్డు శంకర్పల్లి రోడ్డు, రాజీవ్ రహదారి, డెయిరీ ఫాం సుచిత్ర నుంచి కొంపల్లి మీదుగా మేడ్చల్, హత్వేలీ నేషనల్ హైవే, మియాపూర్ జంక్షన్ నుంచి బాచుపల్లి గండిమైసమ్మ మేడ్చల్ చెక్‌పోస్టు ప్రాంతాల్లో హైవే పెట్రోలింగ్‌ను అందుబాటులోకి తేనున్నారు. -
ఆగని డోలీ కష్టాలు
విజయనగరం, శృంగవరపుకోట రూరల్ : గిరిజన పల్లెలను రహదారి సమస్య వేధిస్తోంది. అత్యవసర వేళ ఆస్పత్రికి తరలించడానికి డోలీ అనివార్యమవుతోంది. శృంగవరపుకోట మండలంలో నెలలు నిండిన ఓ గర్భిణిని డోలీ సాయంతో ఆదివారం మైదాన ప్రాంతానికి తీసుకువచ్చారు. అప్పటికే సమాచారం అందుకున్న కొట్టాం ప్రాధమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి ముమ్ములూరి ఫణీంద్ర ఆదేశాల మేరకు హెల్త్ అసిస్టెంట్ తాతారావు పురిటి నొప్పులతో బాధపడుతున్న గర్భిణిని ఫీడరు అంబులెన్స్ సాయంతో శృంగవరపుకోట పట్టణంలోని సామాజిక ఆస్పత్రిలో చేర్పించారు. ఈ సంఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. శృంగవరపుకోట మండలం, దారపర్తి గిరిశిఖర పంచాయతీ పల్లపుదుంగాడ గిరిజన గ్రామానికి చెందిన జన్ని సుమిత్ర అనే గర్భిణికి ఉదయం 6గంటల సమయంలో పురిటినొప్పులు ప్రారంభమయ్యాయి. బాధతో విలవిలలాడుతున్న ఆమెను భర్త సన్యాసిరావు, తోటి గిరిజనులు అప్పటికప్పుడు డోలీ కట్టిసుమారు 9 కిలోమీటర్లు రాళ్లు, గుట్టల రహదారిలో బొడ్డవర పంచాయతీకి చెందిన దబ్బగుంట మైదాన గ్రామం వద్దకు చేర్చారు. అక్కడి నుంచి ఫీడరు అంబులెన్స్‌లో ఎస్.కోటలోని సీహెచ్‌సీలో చేర్చగా సూపరింటెండెంట్ డాక్టర్ రంధి త్రినాథరావు ఆమెకు చికిత్స అందించా రు. మరో 24 గంటల్లో ఆమె ప్రసవించే అవకా శం ఉన్నందున జాగ్రత్తగా చూసుకోవాలని వైద్య సిబ్బందిని ఆదేశించారు. రహదారి లేకనే ఇలాంటి కష్టాలు గిరిశిఖర గిరిజన గ్రామాలకు రహదారి సౌకర్యం లేకనే గర్భిణులు, రోగులను మైదాన ప్రాంతం వరకు డోలీలో దిగువకు మోసుకుని రావాల్సి వస్తోందని, ఇలాంటి సమయాల్లో ఒక్కోసారి మార్గమధ్యలో ప్రాణాలు కోల్పోతు న్న సందర్భాలు కూడా ఉన్నాయని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ఎస్.కోట మండలంలో పర్యటించిన రాష్ట్ర డిప్యూటీ సీఎం పాముల పుష్ప శ్రీవాణి దృష్టికి రోడ్డు సమస్య తీసుకెళ్లినట్టు చెప్పారు. గడచిన వారం రోజుల్లోనే గిరిజన గ్రామం నుంచి నిండు గర్భిణిని డోలీలో మైదాన ప్రాంతానికి తీసుకు రావడం ఇది రెండోది. -
నడిరోడ్డుపై బిడ్డకు జన్మనిచ్చిన మహిళ
భోపాల్: అధికారుల అలసత్వం మూలానా ఓ మహిళ నడి రోడ్డుపై బిడ్డకు జన్మనివ్వాల్సి వచ్చింది. ఈ సంఘటన మధ్యప్రదేశ్‌లో చోటు చేసుకుంది. ఆ వివరాలు.. బుర్హాన్పూర్ జిల్లాకు చెందిన కమలాభాయ్ ప్రసవవేదనతో విలవిల్లాడుతుంది. దాంతో ఆమె భర్త ప్రభుత్వం గర్భిణి మహిళల కోసం ప్రవేశపెట్టిన ‘జనని ఎక్స్‌ప్రెస్’ అంబులెన్స్‌కు కాల్ చేశాడు. కానీ అంబులెన్స్ సరైన సమయానికి రాలేదు. మరోవైపు కమలాభాయ్ నొప్పులతో బాధపడుతుంది. దాంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో కమలాభాయ్ భర్త తన బైక్ మీద ఆమెని ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించాడు. కానీ ఈ లోపే కమలాభాయ్ రోడ్డు మీదనే బిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం ఆమెను అక్కడి నుంచి షాపూర్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తరలించారు. వైద్యులు కమలాభాయ్, ఆమె కుమార్తెను ఆస్పత్రిలో చేర్చుకుని చికిత్స అందించారు. ప్రస్తుతం తల్లీబిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నట్లు తెలిపారు. ఈ సంఘటనపై కమలాభాయ్ కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంబులెన్స్ సిబ్బంది మీద చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. -
అర్ధరాత్రి హైవేపై దొంగలు
సాక్షి, ఒంగోలు: అర్ధరాత్రి హైవేపై దొంగ–పోలీసు ఆట గమ్మత్తుగా సాగింది. ద్విచక్ర వాహనంపై దొంగలు, నాలుగు చక్రాల వాహనంలో పోలీసులు వెరసి రైట్ రూట్, రాంగ్రూట్లో సాగిన వేట ఒక వైపు భయం భయంగా మరో వైపు ఛాలెంజింగ్‌గా సాగింది. ఈ క్రమంలో దాదాపు రెండు గంటలపాటు సాగిన ఈ ఆటలో ఎట్టకేలకు పోలీసులు ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకోగా మరో ఇద్దరు తప్పించుకున్నారు. ఈ సంఘటన స్థానిక ఒంగోలు–మేదరమెట్ల మధ్య జాతీయ రహదారిపై ఆదివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. ఆగిన లారీలే లక్ష్యం నెల్లూరు జిల్లాకు చెందిన ముగ్గురు యువకులు మోటారు బైకుపై వేటకు బయల్దేరారు. వీరు కేవలం ఆగిన లారీలను టార్గెట్‌గా చేసుకొని అందులో ఉన్న సొత్తు కాజేయడం లక్ష్యం. ఈ క్రమంలోనే వీరు పలు వాహనాల్లో సొత్తు కాజేశారు. ఇలా వీరు జిల్లాలోని మేదరమెట్ల వరకు వెళ్లారు. అక్కడి నుంచి తిరిగి వస్తూ గుండ్లాపల్లి గ్రోత్ సెంటర్‌కు ఇవతల పైపుల ఫ్యాక్టరీ సమీపంలో ఆగిన లారీలో సొత్తు కోసం తచ్చాడుతుండడాన్ని ఓ లారీ డ్రైవర్ గమనించాడు. అతను హైవేపై ఒంగోలు వైపు వెళ్తున్న పోలీస్ హైవే పెట్రోలింగ్ సిబ్బందికి సమాచారం ఇచ్చాడు. మొత్తం ముగ్గురు యువకులు ఉన్నారని, వారంతా అనుమానాస్పదంగా ఉన్నట్లు పేర్కొన్నారు. పోలీసులు వాహనాన్ని వెనక్కు తిప్పారు. అదీ రాంగ్రూట్లో. రెండు గంటలకుపైగా కొనసాగిన ఛేజింగ్ వాస్తవానికి మేదరమెట్ల వైపు నుంచి ఒంగోలు వైపునకు వాహనాలు హైవేకు తూర్పు మార్గంలో వస్తుంటాయి. నిందితులు అదే మార్గంలో ఉన్నట్లు లారీ డ్రైవర్ చెప్పడంతో నిందితులు తప్పించుకోకూడదనే ఉద్దేశంతో హైవే పెట్రోలింగ్ సిబ్బంది డేంజర్ సిగ్నల్స్ వేసుకుంటూ రాంగ్రూట్లో వేట ప్రారంభించారు. మద్దిపాడు సమీపంలో ద్విచక్ర వాహనంపై ముగ్గురు యువకులు వెళ్తున్నట్లు గమనించడం, వారు మద్యం తాగి వాహనం నడుపుతున్నట్లు అనుమానం రావడంతో వారిని ఆపేందుకు యత్నించారు. వారు పోలీసు వాహనాన్ని చూసి వేగంగా ముందుకు దూకించారు. పోలీసులు తమ వాహనాన్ని తిప్పుకొని వెంటాడారు. ఏడుగుండ్లపాడు వద్దకు రాగానే నిందితులు మళ్లీ అదే రూట్లో మేదరమెట్ల వైపుకు మళ్లించారు. ఇలా మూడు నాలుగు సార్లు పోలీసులను ముప్పతిప్పలు పట్టించారు. పోలీసులకు వారిలో ఉన్న అనుమానం నిజమే అన్న భావన వ్యక్తమైంది. మళ్లీ వారు వెంటాడగా శ్రీ ప్రతిభ డిగ్రీ కాలేజీ సమీపంలోని ఒక పొగాకు కంపెనీ వద్ద హైవే ఫెన్సింగ్‌కు తమ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టి ముగ్గురు యువకులు పలాయనం చిత్తగించారు. ఓ యువకుడు పొగాకు గోడౌన్ గేటు దూకి తప్పించుకునేందుకు చేసిన యత్నించాడు. పోలీసులు సైతం గేటు దూకి యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుల గుట్టురట్టు నిందితుడు పోలీసుల ఎదుట నోరు విప్పాడు. హైవేపై ఆగి ఉన్న లారీల్లో సొత్తు కాజేయడమే లక్ష్యంగా నెల్లూరు జిల్లా నుంచి బయల్దేరినట్లు అంగీకరించాడు. ముగ్గురిలో ఒకరు లారీ వెనుక భాగంలో పరిశీలిస్తుంటే రెండో వ్యక్తి లారీ ముందు భాగంలో ఉంటూ సూచనలు చేస్తుంటాడు. మూడో వ్యక్తి లారీ క్యాబిన్లోకి ఎక్కి సొత్తు కాజేస్తుంటామని పేర్కొన్నారు. నిందితుడి నుంచి స్వాధీనం చేసుకున్న ద్విచక్రవాహనం చోరీ చేసిందిగా భావిస్తున్నారు. అసలు నంబర్‌కు బదులు దొంగ స్టిక్కర్ అంటించి నడుపుతున్నట్లు తెలుస్తోంది. ఇక నిందితుని వద్ద ఉన్న రూ.39 వేలకుపైగా నగదు ఎక్కడెక్కడ చోరీ చేశారన్న సమాచారం పోలీసులు గుర్తించలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో పారిపోయిన మరో ఇద్దరిని అదుపులోకి తీసుకునేందుకు పోలీసు బృందాలుగా విడిపోయి రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. వారు కూడా పట్టుబడితేగానీ అసలు వీరు ఎప్పటి నుంచి నేరాలకు పాల్పడుతున్నారు.. ఇప్పటికి ఎన్ని నేరాలు చేశారు.. తదితర వివరాల గుట్టు వెల్లడయ్యే అవకాశం ఉంది. -
అనకాపల్లి హైవేపై బైక్‌ను ఢీకొన్న కారు
-
పశ్చిమ గోదావరి జిల్లాలో అన్నదాతల ఆందోళన
-
నెత్తురోడిన రహదారులు
సాక్షి, నార్కట్‌పల్లి (నకిరేకల్) : రహదారులు మరో మారు నెత్తురోడాయి. ఉమ్మడి జిల్లాలోని ఆయా మండలాల పరిధిలో శుక్రవారం చోటు చేసుకున్న వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురు దుర్మరణం చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. నార్కట్‌పల్లి, చివ్వెంల, రామన్నపేట, తిప్పర్తి మండలాల్లో చోటు చేసుకున్న ఈ ఘటనల వివరాలు.. నల్లగొండకు చెందిన మందడి సత్యపాల్‌రెడ్డి (30) తన స్నేహితుడి మేడి శ్రీనివాస్ సోదరి గ్రామం కట్టంగూర్ మండలం పామనగుండ్లకు కారులో వెళ్లారు. రాత్రి తిరిగి నల్లగొండకు బయలు దేరారు. అయితే నార్కట్‌పల్లి వద్ద వీరు ఫైఓవర్ దిగకుండా అలాగే ముందుకు వెళ్లారు. వారిజాల వేణుగోపాలస్వామి ఆలయానికి వెళ్లే ఆర్చి వద్ద యూటర్న్ తీసుకుంటుండగా సూర్యాపేట నుంచి హైదరాబాద్ వైపు వెళుతున్న మరో కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సత్యపాల్‌రెడ్డి, శ్రీనివాస్‌కు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం మేరకు పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను కామినేని ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సత్యపాల్‌రెడ్డి మృతిచెందాడు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ విజయ్‌కుమార్ తెలిపారు. సీటు బెల్ట్ పెట్టుకుని ఉంటే.. కారులో ప్రయాణిస్తున్న సత్యపాల్‌రెడ్డి సీట్ బెల్ట్ పెట్టుకుని ఉంటే మృతిచెందే వాడు కాదని ఘటనాస్థలిని పరిశీలిస్తే అవగతమవుతోంది. శ్రీనివాస్ సీట్ బెల్ట్ పెట్టుకుని డ్రైవింగ్ చేస్తుండడంతో ప్రమాదం జరిగినప్పుడు బెలూన్స్ ఓపెన్ కావడంతో అతడు గాయాలతో బయటపడ్డాడు. ప్రమాదానికి కారణమైన మరో కారులో ప్రయాణిస్తున్న వారు సీటు బెల్ట్ పెట్టుకోవడం వల్ల బెలున్స్ ఓపెన్ కావడంతో స్వల్పగాయాలతో బయటపడినట్టు పోలీసులు తెలిపారు. గుర్తుతెలియని వాహనం ఢీకొని.. చివ్వెంల (సూర్యాపేట) : నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలం ఆళ్లగడప గ్రామానికి చెందిన నిమ్మల సోమ య్య (45) తన కుమారుడి పెళ్లి కార్డులు పంచేందుకు కోదాడ వెళ్లి తిరిగి సూర్యాపేటవైపు మోపెడ్‌పై వస్తున్నాడు. మార్గమధ్యలో గుంజలూరు గ్రామ స్టేజి వద్ద విజయవాడ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న గుర్తుతెలియన వాహనం వెనుకనుంచి ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో సోమయ్య కాళ్లు, చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం సూర్యాపేట ఏరియాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మధ్యాహ్నం మృతిచెందినట్లు బంధువులు తెలిపారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని బం ధువులకు అప్పగించారు. మృతుడి కుమారుడు నరేశ్ ఫిర్యాదు మేరకు ఎస్ఐ లవకుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కారు – లారీ ఢీ.. ఒకరు.. రామన్నపేట (నకిరేకల్) : నల్లగొండ జిల్లా కేంద్రంలోని నాగార్జునకాలనీకి చెందిన తల్లం నవీన్(33) శుక్రవారం రామన్నపేటలో నివాసం ఉంటున్నతన స్నేహితుడిని కలువడానికి వచ్చాడు. అనంతరం స్నేహితుడి కారు తీసుకుని భువనగిరి వైపు వెళ్తుండగా ఇంద్రపాలనగరం శివారులోని సబ్‌స్టేషన్ సమీపంలో ఎదురుగా వస్తున్న లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన నవీన్‌ను 108 వాహనంలో రామన్నపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో ప్రథమ చికిత్స అనంతరం అతడిని నార్కట్‌పల్లిలోని కామినేని ఆసుపత్రికి తీసుకెళ్లగా అక్కడ చికిత్స పొందుతూ సాయంత్రం మృతిచెందాడు. మృతుడి బాబాయి ప్రకాష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ సీహెచ్ సాయిలు తెలిపారు. మినీగూడ్స్ బోల్తా ..ఇద్దరు.. తిప్పర్తి (నల్లగొండ) : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెల్లురు జిల్లా లింగసముద్రం మండలానికి చెందిన మహేష్‌బాబు(30)మినీ గూడ్స్ డ్రైవర్‌గా,షేక్ నజీర్(35) ఇదే వాహనానికి క్లినర్‌గా పనిచేస్తున్నాడు. సింగరాయకొండ నుంచి కూల్ బాక్స్‌లను లోడ్ చేసుకుని జహీరాబాద్‌లో ఆన్లోడ్ చేసి తిరిగి నెల్లురు వెళ్తున్నారు. మార్గమధ్యలో మండల పరిధిలోని రామలింగాలగూడెం వద్ద ఒక్కసారిగా ముందు టైర్ పగలడంతో అదుపుతప్పి మినీగూడ్స్ డివైడర్ దాటి అటు వైపు నుంచి వస్తున్న లారీని ఢీకొట్టి డివైడర్‌పై పడింది. దీంతో మినీగూడ్స్లో ఉన్న డ్రైవర్, క్లినర్ ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు మృతుల బందువులకు సమాచారం అందజేశారు. మృతదేహాలను నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీకి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ మధు తెలిపారు. -
మృత్యు మలుపులు..!
సాక్షి, కొండమల్లేపల్లి : నాగార్జునసాగర్–హైదరాబాద్ రాష్ట్ర రహదారిపై పలుచోట్ల ఉన్న మూలమలుపులు మృత్యు పిలుపుగా మారాయి. ఆయా మూలమలుపుల వద్ద ఎప్పుడు ఏ ప్రమాదం చోటు చేసుకుంటుందోనని వాహనదారులు, ప్రయాణికులు భయాందోళన చెందుతున్నారు. నిత్యం రద్దీగా ఉండే రహదారిపై ఉన్న మలుపులు ప్రమాదాలకు నెలవులు అవుతున్నాయి. కొండమల్లేపల్లి మండల పరిధిలో ప్రధాన రహదారిపై ఉన్న మూలమలుపుల వద్ద ఇప్పటికే పలుమార్లు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో కొంతమంది మృత్యువాత పడగా మరికొంత మంది క్షతగాత్రులయ్యారు. కొండమల్లేపల్లి మండల పరిధిలోని కేశ్యతండా, జోగ్యతండా, చెన్నారం వద్ద ఉన్న మలుపులు ప్రమాదకరంగా మారడంతో వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారని పలు వురు పేర్కొంటున్నారు. ఆయా మూలమలుపుల వద్ద హెచ్చరిక, సూచిక బోర్డులు ఏర్పాటు చేయకపోవడంతో ఈ దారిగుండా రాకపోకలు సాగించే వాహనదారులు మూలమలుపుల వద్ద అవగాహ న లేక ప్రమాదాల బారిన పడుతున్నారు. కొండమల్లేపల్లి మండల పరిధిలోని చెన్నారం మూలమలుపు వద్ద ఈనెల 6న ఆర్టీసీ బస్సు, టాటా ఏస్ వాహనం ఢీకొన్న ఘటనలో ఎనిమిది మంది మృత్యువాతపడగా మరికొందరికి గాయాలయ్యాయి. గతేడాది డిసెంబర్లో జోగ్యతండా వద్ద బాలుడిని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో మృత్యువాతపడ్డాడు. ఆయా మూలమలుపుల వద్ద రోడ్డుకు ఇరువైపుల ఫెన్సింగ్ ఏర్పాటు చేయడంతో పాటు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని తండావాసులు కోరుతున్నారు. చర్యలు చేపడుతున్నాం నాగార్జుసాగర్–హైదరాబాద్ ప్రధాన రహదారిపై ప్రమాదాల నివారణకు చర్యలు చేపడుతున్నాం. ఆయా మూలమలుపుల వద్ద హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయడంతో పాటు బారీకేడ్లను సైతం ఏర్పాటు చేస్తాం. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలి. ఇప్పటికే పలుమార్లు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో వాహనదారులకు ప్రమాదాల నివారణపై అవగాహన కల్పించాం. – శ్రీనివాస్‌నాయక్, ఎస్ఐ, కొండమల్లేపల్లి -
మూడు రోజులు..రెండున్నర కోట్లు
సాక్షి, జయపురం: స్థానిక పట్టణ పరిధిలో దాదాపు మూడు రోజుల వ్యవధిలో పలు కేసుల్లో సుమారు రూ.2.5 కోట్ల విలువైన గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇదే విషయమై జయపురం సబ్‌డివిజన్ పోలీసు అధికారిణి సాగరిక నాథ్ విలేకరుల సమావేశంలో శుక్రవారం మాట్లాడారు. గత రెండు రోజుల వ్యవధిలో జయపురం, బొరిగుమ్మ, బొయిపరిగుడ పోలీస్స్టేషన్ల పరిధుల్లో సుమారు 1015 కేజీల గంజాయిను స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడులలో ఒక యువతి సహా దాదాపు 11 మంది నిందితులను అరెస్టు చేశామని ఆమె వెల్లడించారు. మల్కన్‌గిరి జిల్లాలో తక్కువ ధరకు కొనుగోలు చేసిన గంజాయిను ఛత్తీస్‌గఢ్ మీదుగా ఉత్తరప్రదేశ్‌కు తరలిస్తున్నారని ఆమె వివరించారు. విజయవాడ–రాంచీ కారిడార్‌లో గురువారం జరిపిన పోలీసుల తనిఖీల్లో దాదాపు 110 కేజీల గంజాయి పట్టుబడిందని ఆమె తెలిపారు. ఈ కేసుకు సంబంధించి మధ్యప్రదేశ్‌కు చెందిన దాదాపు నలుగురు నిందితులను అరెస్టు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. నిందితుల్లో చందన నమాలి(25), అనూప్ గౌతమ్, హరిశంకర దువన్యాన్, స్థానికుడైన విష్ణు సాహు ఉన్నారని తెలిపారు. అలాగే అంబాగుడ సమీపంలో ఒక వాహనం ఒక వ్యక్తిని ఢీకొని వెళ్లిపోయిందన్న స్థానికుల సమాచారం మేరకు స్పందించిన పోలీసులు సంఘటన స్థలానికి చేరుకునే లోపు నిందితులు పరారీ కాగా, వాహనంలోని సుమారు 280 కేజీల గంజాయిను పట్టుకున్నారు. ఈ కేసు నుంచి తప్పించుకున్న వారిలో అనుగూలు వాసి భజనన్ సాహు, మల్కన్‌గిరికి చెందిన రామ ఖెముండులుగా పోలీసులు గుర్తించారు. 10 బస్తాల్లో.. అలాగే జయపురం సదర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని 26వ నంబర్ జాతీయ రహదారిలో నిర్వహించిన తనిఖీల్లో 10 బస్తాల్లో తరలిస్తున్న గంజాయిను పట్టుకున్నారు. ఈ కేసుకు సంబంధించి, మధ్యప్రదేశ్‌కు చెందిన ప్రకాష్నాయి, ఛత్తీస్‌గఢ్‌కు చెందిన రాకేష్‌కుమార్ బర్మన్, రాజవిశ్వ బర్మలను పోలీసులు అరెస్టు చేసి, వారి వద్ద నుంచి రూ.2500 నగదు, 2 మొబైల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు బొయిపరిగుడలో పోలీసులు నిర్వహించిన వాహన తనిఖీల్లో సుమారు 400 కేజీల గంజాయిను పట్టుకున్నారు. ఇదే కేసుకు సంబంధించి ఉత్తరప్రదేశ్‌కు చెందిన సచిన్‌కుమార్, టింకు కుమార్, మురతధజ్ శుక్లాలను పోలీసులు అరెస్టు చేశారు. అయితే ఈ గంజాయి మల్కన్‌గిరి–కొరాపుట్ ప్రాంతాల నుంచి దేశంలోని అనేక రాష్ట్రాలకు తరలిస్తున్నారని ఆమె వెల్లడించారు. గంజాయి తరలింపునకు అడ్డుకట్ట వేసేందుకు తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తలను తీసుకుంటున్నామని ఆమె తెలిపారు. సమావేశంలో జయపురం పట్టణ పోలీసు అధికారి బాలేశ్వర గిడి, సదర్ పోలీసు అధికారి ధిరెన్ కుమిర్ బెహరా, అంబాగుడ పంటి అధికారి నారాయణ పట్నాయక్ తదితరులు పాల్గొన్నారు. రాయగడలో.. రాయగడ: వచ్చే సాధారణ ఎన్నికల నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతా చర్యలను ముమ్మరం చేసిన ఎక్సైజ్, పోలీస్ యంత్రాంగానికి పెద్దఎత్తున గంజాయి పట్టుబడుతోంది. జిల్లాలోని బిసంకటక్ ప్రాంతంలో భారీగా గంజాయి తరలిస్తున్న వాహనాల్లో పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. ఈ సందర్భంగా గురువారం జరిపిన తనిఖీల్లో అక్రమంగా గంజాయి తరలిస్తున్న రెండు వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకుని, వాటిల్లో తరలిస్తున్న సుమారు 193 కేజీల గంజాయిను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే శుక్రవారం సాయంత్రం జరిపిన వాహన తనిఖీల్లో దాదాపు 100 కేజీల గంజాయి తరలిస్తున్న ఒక కారును పోలీసులు పట్టుకున్నారు. అయితే కారులో అక్రమంగా తరలిస్తున్న ఈ గంజాయికి రక్షణగా నలుగురు వ్యక్తులు మోటారు సైకిల్‌తో ప్రయాణించినట్లు పోలీసులు చెబుతున్నారు. ఇదే విషయమై ఆ నలుగురు వ్యక్తులను పట్టుకుని, విచారణ చేపట్టగా వారంతా పద్మపూర్, గజపతి, పుటాసింగి, గుణుపురం, మునిగుడ ప్రాంతాలకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. అనంతరం వారి వద్ద ఉన్న సెల్ఫోన్ల ఆధారంగా గంజాయి దొంగల కోసం గాలింపు చర్యలు చేపడుతున్నట్లు ఐఐసీ అధికారి జశ్వంత్ హీయల్ తెలిపారు. అయితే ముఖ్యంగా యువతకు ఉపాధి లేకపోవడంతో పాకెట్ మనీ కోసం ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తక్కువ వ్యయంతో ఎక్కువ ఆదాయం వచ్చే మార్గాలను యువత అన్వేషిస్తోందని, ఈ క్రమంలో ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం యువతకు ఉపాధి కల్పించేలా చేస్తే చాలావరకు ఇలాంటి దుశ్చర్యలను అరికట్టవచ్చని స్థానికులు పేర్కొంటున్నారు. -
జాతీయ రహదారిపై కారు దగ్ధం
సాక్షి,జడ్చర్ల: జాతీయ రహదారిపై ప్రయాణిస్తున్న ఓ కారు బుధవారం అర్ధరాత్రి అకస్మాత్తుగా దగ్ధమైంది. బాధితుల కథనం ప్రకారం.. హైదరాబాద్‌లోని బడంగ్‌పేటకు చెందిన భరత్, దివ్య భార్యాభర్తలు కలిసి ఓ అద్దె కారులో మంత్రాలయం వెళ్లి స్వామి వారిని దర్శించుకుని బుధవారం రాత్రి తిరుగు ప్రయాణమయ్యారు. అయితే మండలంలోని మల్లెబోయిన్పల్లి స్టేజీ సమీపంలో కారు డ్రైవర్ శ్రీకాంత్ మూత్ర విసర్జన కోసం ఇంజన్ ఆఫ్ చేయగా.. ముందుభాగం నుంచి పొగలు వచ్చాయి. దీంతో ప్రమాదాన్ని పసిగట్టిన డ్రైవర్ శ్రీకాంత్ వెంటనే కారులో ఉన్న భార్యాభర్తలను వారి లగేజీని కిందకు దింపగానే మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో కారు మొత్తం కాలిపోయింది. వెంటనే డ్రైవర్ శ్రీకాంత్ 100 నంబర్‌కు డయల్ చేసి పోలీసులు, అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించగా వారు వచ్చి మంటలను ఆర్పారు. షార్ట్‌సర్క్యూట్ కారణంగా కారులో మంటలు చెలరేగి ఉండవచ్చని డ్రైవర్ శ్రీకాంత్ పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ బాలరాజుయాదవ్ తెలిపారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. -
ఇరుకు వంతెనతో ఇక్కట్లు
సాక్షి,నల్లగొండ : పెద్దవూర మండల కేంద్రంలోని పెట్రోల్ బంక్ సమీపంలో నాగార్జునసాగర్– హైదరాబాద్ ప్రధాన రహదారిపై ఉన్న ఇరుకు వంతెనతో వాహనదారులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. నాగార్జునసాగర్ ప్రపంచ పర్యాటక కేంద్రం కావడం, హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్‌ను కలిపే ప్రధాన రహదారి ఇదే కావడం, అదీగాక మిర్యాలగూడెం పరిసర ప్రాంతాలలో రైస్ మిల్లులు, సిమెంట్ ఫ్యాక్టరీలు అధిక సంఖ్యలో ఉండటంతో నిత్యం వేల సంఖ్యలో వాహనాలు వెళ్తుంటాయి. ఇరురాష్ట్రాలకు చెందిన వీఐపీలు సైతం ఈ రోడ్డు మార్గాన పోవాల్సిందే. రహదారి ఇరుకుగా ఉండి కేవలం ఒక్క వాహనం మాత్రమే వెళ్లటానికి వీలు ఉంది. దీంతో ఎదురుగా వాహనాలు వచ్చినప్పుడు వంతెన అవతలి వైపు ఉన్న వాహనాలు నిలుపు కోవాల్సిందే. ఒకే వాహనం పోవటానికి వీలు అవుతుండటంతో ట్రాఫిక్‌కు ఇబ్బందులు కలుగుతున్నాయి. రెండు వాహనాలు వంతెనపైకి వచ్చి ఇరుక్కు పోయిన సందర్భాలు కోకొల్లలు. ఆ సమయంలో వాహనాలు వంతెన నుంచి రాలేక గంటల తరబడి ట్రాఫిక్ నిలిచిపోయిన దాఖలాలు ఉన్నాయి. వంతెన సమీపంలో ఎలాంటి ప్రమాద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయకపోవడంతో రాత్రి సమయాలలో లైట్ల వెలుతురులో వంతెన ఉన్నట్లు డ్రైవర్లకు కనపడక వాహనాలు ఢీ కొన్న పరిస్థితులు ఉన్నాయి. వంతెనపై ఇరువైపులా కంపచెట్లు మొలవడంతో పాటు రెండు అడుగుల వెడల్పులో ఇసుక పేరుకుపోయింది. వాహనాలు ఎదురుగా వస్తున్నప్పుడు ద్వి చక్రవాహనాలు ఆ ఇసుకలో స్లిప్ అయ్యి కింద పడి గాయాల పాలవుతున్నారు. రెండేళ్ల కిందట మండలంలోని నాయినివానికుంట గ్రామానికి చెందిన జానపాటి లింగమ్మ వంతెనపై నడుచుకుంటు వెళ్తుండగా వెనకనుంచి లారీ ఢీ కొనడంతో ఆమె మృతి చెందింది. కృష్ణా తాగునీటి నల్లా పెట్రోల్ బంక్ ఎదురుగా ఉండటంతో గ్రామస్తులు తాగు నీటి కోసం ఇరుకు వంతెనపై నుంచి నడుచుకుంటూ వెళ్లి నీళ్లు తెచ్చుకుంటారు. వంతెనపై నడిచి వెళ్లేటప్పుడు ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని ప్రజలు భయబ్రాంతులకు గురి అవుతున్నారు. ప్రస్తుతం జడ్చర్ల–కోదాడ వరకు జాతీయ రహదారి పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనైనా ఇరుకు వంతెనకు మోక్షం కలుగుతుందేమో చూడాలి మరి. అధికారులు స్పందించి నిత్యం రద్దీగా ఉండే ప్రధాన రహదారిపై ఉన్న ఇరుకు వంతెనను వెడల్పు చేసి ప్రమాదాలు చోటు చేసుకోకుండా చూడాలని వాహనదారులు కోరుతున్నారు. నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి ఇరుకు వంతెనపై నిత్యం ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. వంతెనపై రెండు వైపులా రెయిలింగ్‌కు మూడు నాలుగు అడుగుల వెడల్పులో ఇసుక ఉంది. దీనిపై బైక్‌లు స్లిప్ అయ్యి కింద పడి గాయాలపాలవుతున్నారు. ఒకే వాహనం పోవడానికి వీలుండటంతో ట్రాఫిక్‌కు అంతరాయం కలుగుతుంది. అధికారులు స్పందించి వంతెనను వెడల్పు చేయాలి. – కిలారి మురళీయాదవ్, పెద్దవూర -
మృత్యు మార్గం.. ఆ మూలమలుపు..!
ఇంటి నుంచి బయటికి వెళ్లిన మనిషి తిరిగొచ్చే వరకు కుటుంబ సభ్యులకు కంటి మీద కునుకులేకుండా పోతుంది. నాలుగింతలు పెరిగిన వాహనాల రద్దీకి తగినట్టుగా పదేళ్లుగా రహదారుల విస్తరణ జరగలేదు. ఫలితంగా నిత్యం ప్రమాదాలు జరుగుతుండటంతో రహదారులు ‘మృత్యు మార్గాలు’ మారి రక్తపుటేరులను పారిస్తున్నాయి. ఈ క్రమంలోనే చాలా కుటుంబాలు పెద్ద దిక్కును కోల్పోయి రోడ్డున పడిన పరిస్థితులు అనేకం. సాక్షి, పేరేచర్ల: మేడికొండూరు, ఫిరంగిపురం మండలాల్లో ప్రధాన రహదారుల పరిస్థితి అత్యంత భయానకంగా తయారైంది. రహదారులు విస్తరణకు నోచుకోక పోవటం వలన ఫిరంగిపురం, మేడికొండూరు పరిధిలోని గుంటూరు–కర్నూలు, గుంటూరు–హైదరాబాద్ ప్రధానరహదారుల మీద ప్రమాదాల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది. పెద్ద వాహనాల మితిమీరిన వేగం, మూల మలుపులు, ఇరుకు రోడ్లు, కాలం చెల్లిన బ్రిడ్జిలుతో పాటు అడ్డదారుల్లో వేగంగా వచ్చే టిప్పర్లతో మనిషి ప్రాణాలను బలితీసుకుంటున్నాయి. దీనికి తోడు డివైడర్లు వద్ద ప్రమాద సూచికలు, రేడియం స్టిక్కర్లు లేక పోవటంతో వాహనాల వేగం అదుపు చేయలేక డివైడర్లను ఢీకొట్టి మృత్యువాత పడిన దాఖలాలు ఎన్నో. ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం ప్రభుత్వం కొన్నేళ్లుగా పేరేచర్ల నుంచి కొండమోడు వెళ్లే రహదారిని నాలుగు లైన్లుగా విస్తరణ చేస్తామన్న మాట ఆచరణలో కనిపించడం లేదు. ఫిరంగిపురం వైపు వెళ్లే గుంటూరు–కర్నూలు రహదారిని కూడా విస్తరిస్తామని చెప్పినా దాని గురించి పట్టించు కోలేదు. ముఖ్యంగా ఈ మార్గాల గుండా వేల సంఖ్యలో వాహనాలు తిరుగుతూ ఉంటాయి. దీనికి తోడు వేగాన్ని నియంత్రించాల్సిన రవాణాశాఖ చోద్యం చూస్తుండటంతో డ్రైవర్లు మరింత రెచ్చి పోతున్నారు. రెండు మండలాల్లో టిప్పర్లు 500కి పైనే ఉన్నాయి. ఇటీవల హార్స్ పవర్ ఎక్కువగా ఉన్న టిప్పర్ల డ్రైవర్లు ఇష్టారాజ్యంగా నడపడంతో పాటు కార్లు, ట్రాలీ ఆటో వాలాలు ఎదురుగా ఉన్న వాహనాలను వేగంతో ఓవర్ టేక్ చేస్తూ భయపెడుతున్నారు. అధిక సంఖ్యలో ప్రమాదాలు మేడికొండూరు పరిధిలోని పేరేచర్ల నుంచి కొర్రపాడు ఉన్నత పాఠశాల వరకు అనేక ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. పేరేచర్ల ఫైల్ ఓవర్‌తో పాటు జోసిల్ కంపెనీ, డోకిపర్రు అడ్డరోడ్డు, సబ్‌స్టేషన, మేడికొండూరు పరిధిలోని కోల్డ్‌స్టోరేజీ, ఈద్గా సమీపంలో ప్రమాదాలు సంభవిస్తున్నాయి. ఇక ఫిరంగిపురం పరిధిలోని కారం మిల్లు నుంచి పొనుగుపాడు వరకు ఉన్న 19.5 కిలోమీటర్ల రహదారి ఉంది. 3 కిలోమీటర్లు నాదెండ్ల పరిధి పోనూ 16.5 కిలోమీటర్లు ఫిరంగిపురం లోకి వస్తుంది. ఇందులో 4.6 కిలోమీటర్ల రహదారి అత్యంత ప్రమాదకరంగా గుర్తించారు. దీని మధ్యలో వేములూరిపాడు, రేపూడి, వేమవరం క్రాస్ తగులుతాయి. కేవలం నాలుగేళ్లలో ఈ రహదారిలో 50కి పైగా ప్రమాదాలు జరిగి అనేక మంది మృత్యువాత పడ్డారు. మేడికొండూరు మండలంలో.. సంవత్సరం ప్రమాదాలు మృతులు క్షతగాత్రులు 2013 47 26 21 2014 51 29 22 2015 57 32 25 2016 49 25 24 2017 48 35 13 2018 42 18 34 ఫిరంగిపురం పరిధిలో .. సంవత్సరం ప్రమాదాలు మృతులు క్షతగాత్రులు 2015 20 10 10 2016 20 13 7 2017 28 13 15 2018 32 11 21 -
అలా సాగు..తున్నాయి
శ్రీకాకుళం, ఎచ్చెర్ల క్యాంపస్/ రణస్థలం: 16వ నంబరు జాతీయ రహదారిపై నిత్యం వందలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. అతివేగానికి పెట్టింది పేరైన ఈ రహదారిపై ఏ కారణంతోనైనా ట్రాఫిక్ సమస్య తలెత్తినా దారి పొడవునా వాహనాలు నిలిచిపోయే పరిస్థితి. దీనికితోడు ఏదో ఒకచోట ప్రమాదాలు సంభవిస్తుంటాయి. ఈ సమస్యలను దృష్టిలో పెట్టుకుని విస్తరణ పనులు వేగవంతం చేయాలి. అయితే పక్క జిల్లాలతో పోల్చితే మన జిల్లాకు సంబంధించి పనుల్లో జాప్యమవుతోంది. ఇప్పటికీ భూములు కోల్పోయిన వారికి పరిహారాలు చెల్లింపులో, బైపాస్ భూ సేకరణలో వేగవంతం కావడంలేదు. జిల్లాలో పైడిభీమవరం నుంచి ఇచ్ఛాపురం వరకు 16వ నంబరు జాతీయ రహదారి విస్తరించి ఉండగా, ట్రాఫిక్, ప్రమాదాలు, వాహనాల రాకపోకల సంఖ్య ఆధారంగా రణస్థలం నుంచి నరసన్నపేట వరకు 54.20 కిలోమీటర్లు ఆరులైన్లుగా విస్తరిస్తున్నారు. నరసన్నపేటలో ఇప్పటికే బైపాస్ నిర్మాణం నాలుగు లైన్ల విస్తరణ సమయంలోనే పూర్తయ్యింది. ప్రస్తుతం ఎచ్చెర్లలో కింతలిమిల్లు నుంచి చిలకపాలెం టోల్‌ప్లాజా వరకు ఐదు కిలోమీటర్లు బైపాస్ నిర్మాణం చేపడుతున్నారు. ఇందుకోసం 81.77 ఎకరాల సేకరణ చేపట్టారు. రణస్థలం నుంచి లావేరు మండలం రావివలస వరకు మూడున్నర కిలోమీటర్లు బైపాస్ రోడ్డు నిర్మాణం చేపడుతున్నారు. ఈ నిర్మాణానికి 66.36 ఎకరాలు సేకరిస్తున్నారు. భూములు కోల్పోయిన వారికి ప్రభుత్వ ధరలు, పట్టణ ప్రాంతాల ఆధారంగా డబ్బులు చెల్లించేందుకు సిద్ధమవుతున్నారు. భూ సేకరణ రెవెన్యూ అధికారులు పర్యవేక్షిస్తున్నారు. జిల్లాలో చురుగ్గా సాగని పనులు రణస్థలం నుంచి నరసన్నపేటకు ఆరులైన్లు, రెండు బైపాస్ రోడ్ల నిర్మాణం పనులు ఆఫ్కో ఇన్ఫ్రా సంస్థ టెండర్లు దక్కించుకుంది. అంచనా విలువ రూ. 1,665 కోట్లు, రోడ్డు నిర్మాణానికి రూ.1,183 కోట్లు కేటాయించారు. ప్రస్తుతం ఈ సంస్థ ఎచ్చెర్ల సమీపంలో స్థలం లీజుకు తీసుకుని సామగ్రి, సిబ్బంది నివాసాలు కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. ఆరులైన్ల రోడ్డు నిర్మాణానికి సిబ్బంది సర్వే, నిర్మాణ పాయింట్లు గుర్తింపు పూర్తి చేశారు. సిమెంట్, కాంక్రీట్, బీటీ ఇలా మూడు లేయర్లతో రోడ్డు నిర్మాణం చేపడతారు. విశాఖపట్నం జిల్లా ఆనందపురం నుంచి రణస్థలం వరకు, జిల్లా పరిధిలో పైడిభీమవరం నుంచి రణస్థలం వరకు ఆరులైన్ల విస్తరణ పనులు పూర్తవుతున్నాయి. ఈ ప్రాజెక్టు టెండరును అశోక్ బిల్డర్స్ కాంట్రాక్టు సంస్థ రూ. 1,187 కోట్లకు దక్కించుకుంది. మొత్తంగా 48 కిలోమీటర్లు రోడ్డు నిర్మాణ పనులు చేపడుతున్నారు. ప్రమాదాల నియంత్రణకు మార్గం ప్రస్తుతం బైపాస్, ఆరులైన్ల రోడ్లు పూర్తయితే ప్రమాదాల నియంత్రణ, ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం లభిస్తుంది. భారీ వాహనాలు బైపాస్ రోడ్డుపై నుంచి తరలించొచ్చు. పెరుగుతున్న వాహన రవాణాకు సైతం సరిపడే వ్యవస్థ వస్తుంది. బైపాస్ భూసేకరణ నష్టపరిహారం చెల్లింపులు పూర్తయిన వెంటనే పనలు ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. రణస్థలం నుంచి ఆరులైన్ల రోడ్డు నిర్మాణం చేపట్టేలా అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇంజినీరింగ్ సిబ్బంది నిరంతరం జాతీయ రహదారిపై సర్వే నిర్వహిస్తున్నారు. మరోవైపు శాటిలైట్ సర్వేలు సైతం అనేకసార్లు చేశారు. కాంట్రాక్టు గడువులోపు పూర్తి కావాలంటే వేగవంతం చేస్తేనే సాధ్యమవుతోంది. గడువులోగా పనులు పూర్తవుతాయి 2017 నవంబరులో ప్రారంభించిన ఈ పనులకు కాంట్రాక్టు గడువు 2020 మే 14 వరకు ఉంది. ఆలోగా ఆరు లైన్ల విస్తరణ, బైపాస్ రోడ్లు పూర్తవుతాయి. రోడ్ల నిర్మాణ పనులు అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్వహిస్తాం. ప్రస్తుతం వాహనాల రాకపోకలు, భవిష్యత్తు అవకాశాల ఆధారంగా పనులు చేస్తున్నాం. రోడ్డు నిర్మాణానికి సంబంధించి పనులు కొనసాగుతున్నాయి. – జేసీహెచ్ వేంకటరత్నం, ఎన్‌హెచ్ విశాఖపట్నం ప్రాంతీయ ప్రాజెక్టు డైరెక్టర్ -
ఆదిలోనే హంసపాదు..
పేరుకే జాతీయ రహదారి.. పంచాయతీలో వేసే అంతర్గత రహదారుల కంటే అధ్వానంగా నిర్మిస్తున్నారు. చాలా చోట్ల రహదారి కుంగిపోతుండగా అప్పుడే దానికి మరమ్మతులు చేస్తున్నారు. జాతీయ రహదారి నాణ్యతపై స్థానికుల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కృష్ణాజిల్లా, కృత్తివెన్ను: పశ్చిమగోదావరి జిల్లా దిగమర్రు నుంచి ప్రకాశం జిల్లా ఒంగోలు వరకు విస్తరించిన 216 జాతీయ రహదారి కృత్తివెన్ను మండలంలో పల్లెపాలెం వద్ద నుంచి మునిపెడ వరకు సుమారు 20 కిలోమీటర్లు మేర ఉంది. పల్లెపాలెం నుంచి గరిశపూడి వరకు జరుగుతున్న పనులు నత్తనడకన సాగుతున్నాయి. దీంతో పాటు ఈ ప్రాంతంలో ఇప్పటికే మొదటి లేయర్ పూర్తిచేసుకున్న చోట సిమెంటు రోడ్డు అడ్డంగా రెండుగా చీలిపోవడంతో ఇదేనా జాతీయ రహదారి అంటూ స్థానికులు ముక్కున వేలేసుకుంటున్నారు. అడుగడుగునా పగుళ్లే.. పల్లెపాలెం వద్ద నుంచి గరిశపూడి వరకు చాలా మేర సింగిల్ లైన్ రహదారి మొదటి దశ పూర్తయింది. ఇక్కడ గరిశపూడి, సీతనపల్లి మెగా స్కీం, బోలుగొంది అడ్డరోడ్డు తదితర ప్రాంతాల్లో జాతీయ రహదారి పగుళ్లిచ్చింది. వేసిన సిమెంటు రోడ్డు అడ్డంగా రెండుగా చీలిపోయే రీతిలో పగుళ్లివ్వడంతో ప్రతిష్టాత్మకమైన జాతీయ రహదారి నిర్మాణంపై స్థానికుల్లో పలు అనుమానాలకు దారితీస్తుంది. సిమెంటు రోడ్డు నిర్మాణం తరువాత వాటర్ క్యూరింగ్ విషయంలోనూ సరైన శ్రద్ధ చూపలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. తూతూమంత్రంగా ఎర్త్ వర్క్ జాతీయ రహదారి నిర్మాణ సమయంలో ఎర్త్ వర్కును పటిష్టంగా చేయాల్సిన అవసరం ఉంది. రోడ్డు మొత్తానికి ఎర్త్ వర్కే కీలకం. కానీ ఇక్కడ మాత్రం ఎర్త్ వర్క్ పనుల సమయంలో సరైన నాణ్యతా ప్రమాణాలు పాటించలేదన్న విమర్శలున్నాయి. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ రహదారి నిర్మాణం పూర్తికాకుండానే కొన్ని చోట్ల రోడ్డు కుంగిపోతుంది. సీతనపల్లి మెగాస్కీం సమీపంలో ఇదే తరహాలో రోడ్డు దెబ్బతినడం దాన్ని సరిచేసినట్లు స్థానికులు చెబుతున్నారు. ఆదిలోనే ఇలా ఉంటే భవిష్యత్తులో రహదారి భద్రత ఎలా ఉం టుందన్న సందేహం ప్రజల్లో వ్యక్తమవుతుంది. రహదారి నిర్మాణ సమయంలో సరైన ప్రాథమిక చర్యలు తీసుకోవడం లేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. బోలుగొంది అడ్డరోడ్డు, గరిశపూడి, మాట్లాం తూము, అంబేడ్కర్ నగర్ తదితర ప్రాంతాల్లో చిన్నపాటి చినుకు పడితే వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బంది ఉంటుంది. ఈ ప్రదేశాల్లో ప్రమాదాలు సైతం నిత్యకృత్యమయ్యాయి. వీటిపై సంబంధిత అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రహదారి పగుళ్లపై సంబంధిత అధికారులను ప్రశ్నించగా రోడ్డును పూర్తిస్థాయిలో నాణ్యతగా తమకు అప్పగించాల్సిన బాధ్యత నిర్మాణ కంపెనీదంటూ చెప్పారు. నాణ్యతా ప్రమాణాలు పాటించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. -
తండ్రులు దొంగలు.. కొడుకులు కాపలా
సాక్షి, సిటీబ్యూరో: దేశంలోని హైవేల్లో వెలసిన దాబాలు, హోటల్స్ వద్ద ఆపే బస్సులే వారి టార్గెట్. ఆ వాహనాల్లోని ప్రయాణికులు భోజనానికి వెళితే నగదు, బంగారు ఆభరణాలున్న బ్యాగ్‌లను చోరీ చేస్తారు. వారే ‘కంజర్ కెర్వా’ ముఠా దొంగలు. వీరు చేసేది దొంగతనాలే అయినా ‘లగ్జరీ’ జీవనాన్ని అనుభవిస్తున్నారు. చోరీ సొత్తుతో మధ్యప్రదేశ్ ధార్ జిల్లా మన్వర్ తాలూకా కెర్వా జాగీర్‌లోని ఉన్న కొండపై ముల్తానిపుర కాలనీలో అందమైన భవంతులు నిర్మించుకొని సకల సౌకర్యాలు అనుభవిస్తున్నారు. దాదాపు 70 నుంచి 80 ఇళ్లు ఉన్న ఈ కాలనీలో 60 ఇళ్లు విలాసవంతంగా ఆర్సీసీ టెక్నాలజీతో నిర్మించడం గమనార్హం. సిటీ లైఫ్‌స్టైల్ తరహా వాతావరణం వారి ఇళ్లలో కనిపిస్తుండడంతో ఎవరికీ అనుమానం రాకూడదని స్థానికంగా కొన్ని వ్యాపారాలు ఏర్పాటు చేసుకున్నారు. ఒకరు పాఠశాల నడుపుతుండగా, మరికొందరు ఇతర వ్యాపకాలను ఎంచుకున్నారు. గురువారం కూకట్‌పల్లిలో సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులకు చిక్కిన ఐదుగురు నిందితుల చరిత్రను చూస్తే వారు చదువుకున్నది తక్కువైనా... వారి తెలివేంటో చెబుతోంది. మైదర్ అలీ కాశమ్.. చోరీ సొత్తుతో పాఠశాల ఏర్పాటు గుజరాత్ రాష్ట్రం సూరత్ జిల్లా జాంకావావ్ గ్రామానికి చెందిన మైదర్ అలీ కాశమ్ ముల్తాని ఎనిమిదో తరగతి చదువుకున్నాడు. ఉపాధి కోసం కుటుంబ సభ్యులతో కలిసి 2004లో కెర్వా జాగీర్‌లోని ముల్తానిపురకు వలస వెళ్లాడు. అక్కడ కొందరితో ఏర్పడిన పరిచయంతో 2008 నుంచి దూర ప్రాంతాలకు వెళ్లే బస్సుల్లో చోరీలు చేయడం మొదలెట్టాడు. నెలలో రెండు రోజులు మాత్రమే ఊరు నుంచి బయటకు వెళ్లే కాశమ్.. చోరీలు చేసేందుకు దాదాపు పది రాష్ట్రాలు చుట్టి వచ్చాడు. ఇలా చోరీలు చేయగా వచ్చిన డబ్బుతో 500 గజాల్లో ఆర్సీసీ టెక్నాలజీతో అందమైన భవంతిని నిర్మించాడు. రెండేళ్ల క్రితం ‘ఆనంద్ ఇంగ్లిష్ హైస్కూల్’ను ప్రారంభించగా 250 మంది వరకు విద్యార్థులు చదువుతున్నారు. రెండు స్కూల్ బస్సులతో పాటు మారుతీ స్విఫ్ట్ డిజైన్ కారు కూడా కొనుగోలు చేశాడు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోనే కాకుండా తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్, హర్యానా, ఉత్తరప్రదేశ్, ఢిల్లీలోనూ చోరీలు చేశాడు. ఇప్పటివరకు ఏ కేసులోనూ కాశమ్ అరెస్టు కాలేదు. అయితే 2015 నుంచి పూణే పోలీసులకు వాంటెడ్‌గా ఉన్నాడు. సికిందర్ రజాక్.. ఆదాయం చాలాక చోరబాట.. కేర్వా జాగిర్కే చెందిన సికిందర్ రజాక్ ఐదో తరగతి వరకు మాత్రమే చదివాడు. టైలరింగ్ చేస్తున్న సికిందర్‌కు లగ్జరీ జీవితానికి ఆదాయం చాలకపోవడంతో 2004 నుంచి చోరీల బాటపట్టాడు. తమ గ్రామస్తులతో కలిసి హైవేల్లో బస్సుల్లో చోరీలు చేయడం ప్రారంభించి ముఠా నాయకుడిగా ఎదిగాడు. నెలలో 28 రోజులు ఊర్లో ఉంటే రెండు రోజులు మాత్రమే చోరీలకు బయటకు వెళ్లేవాడు. దీంతో ఇప్పటివరకు పోలీసులకు చిక్కలేదు. ఆర్సీసీ టెక్నాలజీతో అందమైన భవంతిని నిర్మించుకున్న రజాక్ కారు కూడా కొన్నాడు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో కలిపి పది రాష్ట్రాల్లో జరిగిన చోరీల్లో ఇతడికి ప్రమేయముంది. మోసిన్ ఖాన్.. ‘దొంగ’ తండ్రికి వారసుడు.. ఎనిమిదో తరగతి చదివిన మోసిన్ ఖాన్ తండ్రి సలావుద్దీన్ చోరీలు చేసేవాడు. ఎనిమిదేళ్ల క్రితం సలావుద్దీన్ ఆనారోగ్యంతో చోర వృత్తి నుంచి తప్పుకోవడంతో ఆ వారసత్వాన్ని మోసిన్ ఖాన్ అందిపుచ్చుకున్నాడు. 2010లో చోరీల బాటలో ఉన్న మోసిన్ ఖాన్‌కు రెండస్తుల అందమైన భవంతి కొనుగోలు చేయడంతో పాటు కారులో తిరుగుతుంటాడు. దాదాపు పది రాష్ట్రాల్లో నేర ప్రమేయమున్నా ఇప్పటి వరకు పోలీసులు పట్టుబడలేదు. తయ్యుబ్.. అఫ్సర్ ఖాన్ ఒకరు డ్రైవర్.. ఇంకొకరు మెకానిక్ మూడో తరగతి మాత్రమే చదివిన మహమ్మద్ తయ్యుబ్ ఖాన్ కారు డ్రైవర్‌గా పనిచేస్తూ ఆశించిన ఆదాయం రాకపోవడంతో ఇటీవల తమ గ్రామస్తుడైన హైదర్ గ్యాంగ్‌లో సభ్యుడిగా చేరాడు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఒకసారి హైదరాబాద్‌కు వచ్చి వెళ్లాడు. అలాగే చదువుకొని అఫ్సర్ ఖాన్ మెకానిక్‌గా పనిచేస్తూ తమ గ్రామస్తులతో కలిసి చోరీల బాట పట్టాడు. ఈ ఏడాది ఫిబ్రవరిలో హైదరాబాద్ వచ్చి వెళ్లాడు. దొంగల పిల్లలే ఇళ్లకు కాపలా.. చోరీలు చేస్తూ భారీగా డబ్బులు సంపాదించిన ఈ నిందితుల పిల్లలంతా వారి ఊర్లోకి కొత్తగా ఎవరు వస్తున్నారో కనిపెడుతుంటారు. వారు కట్టుకున్న భవనంపైనే కాపలాకాస్తూ (వాచ్డాగ్) కొత్త వాహనం, కొత్త వ్యక్తి ఎవరైనా కనిపిస్తే వారి తల్లిదండ్రులకు సమాచారం ఇస్తుంటారు. దీంతో వారు ఇళ్లకు తాళాలు వేసి వేరే ఊర్లకు వెళుతుంటారు. ఆ వాహనం, వ్యక్తులు తిరిగి వెళ్లిపోయారని సెల్‌ఫోన్ ద్వారా సమాచారం అందుకున్నాక మళ్లీ తిరిగొస్తారు. అయితే విలాస జీవితాన్ని అనుభవిస్తున్న ఈ నిందితులంతా తమ పిల్లలను చదివించడం లేదు. ఆడపిల్లలను అసలు పాఠశాలకే పంపరు. కొడుకులను కూడా ఏడో తరగతి వరకు మాత్రమే పరిమితం చేసి ‘చోర వృత్తి’లోకి తీసుకొస్తుండడం గమనార్హం. -
ప్రయాణం.. నరకప్రాయం
గోపాలపురం : దేవరపల్లి–తల్లాడ రహదారి గోతులమయంగా మారింది. భారీ గోతులతో ప్రయాణం నరకప్రాయంగా మారింది. హైదరాబాద్‌కు దగ్గర మార్గం కావడంతో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, ఉభయ గోదావరి జిల్లాల నుంచి నిత్యం వేలాది వాహనాలు ఈ రహదారి మీదుగా ప్రయాణిస్తుంటాయి. అసలే అంతంతమాత్రంగా ఉండే ఈ రహదారి ఇటీవల కురిసిన భారీ వర్షాలకు మరింత తూట్లు పడింది. మోకాలు లోతులో గోతులు పడడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఒళ్లు హూనం అవుతోందని వాపోతున్నారు. మరోవైపు వాహనాలు మరమ్మతులకు గురవుతున్నాయని యజమానులు వాపోతున్నారు. ముఖ్యంగా గోపాలపురం నుంచి కొయ్యలగూడెం మధ్య రహదారి బాగా పాడైంది. గోపాలపురం వైఎస్సార్ జంక్షన్ వద్ద పెద్ద పెద్ద గోతులు ఏర్పడడంతో వాహనాలు ప్రమాదాలకు గురవుతున్నాయి. కరిచర్లగూడెం సమీపంలోని ఓంకార్ ఫెర్టిలైజర్ వద్ద కూడా భారీగోతులు పడ్డాయి. గతంలో ఈ రోడ్డు రాష్ట్రీయ రహదారిగా ఉండేది. ఇటీవల జాతీయ రహదారిగా మార్చారు. దీంతో ఆర్ అండ్ బీ అధికారులు ఈ రోడ్డు నిర్వహణను పట్టించుకోవడం లేదు. అటు జాతీయ రహదారి అధికారులు కూడా పట్టించుకోకపోవడంతో ప్రయాణికులకు పాట్లు తప్పడం లేదు. లారీలు గోతుల్లో పడి రిపేర్లు చేయడానికి రోజుల తరబడి నిలిచిపోతున్నాయి. సంబంధిత అధికారులు, నిత్యం ప్రయాణించే ప్రజాప్రతి«నిధులకు రోడ్డుపై ఉన్న గోతులు కనిపించడం లేదా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. -
రహదారుల్లో రకాలు తెలుసా?
విశాఖసిటీ: వేసవిలో చాలా ఎంజాయ్ చేస్తున్నారు కదా. అమ్మమ్మ, తాతయ్య దగ్గరకు, వినోదయాత్రలకు వెళ్లారా? మరి రోడ్డుపై ప్రయాణిస్తున్నప్పుడు కిలోమీటర్ల గురించి సూచించే మైలు రాళ్లు మీకు రోడ్డు పక్కనే కనిపించాయా..? వాటి మధ్య ఉన్న తేడాలు మీరు గుర్తించారా..? ఒక్కో రోడ్డులో ఒక్కో రంగుతో కూడిన మైలు రాయిలున్నాయి కదా. వాటి గురించి తెలుసుకుందామా మరి.. పచ్చరంగు ఉంటే..? మైలు రాళ్లు పై భాగంలో ఆకుపచ్చ రంగు ఉంటే అవి స్టేట్ హైవేలు అని అర్థం. ఈ రోడ్లను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు నిర్మిస్తుంటాయి. వాటి పర్యవేక్షణను రాష్ట్ర ప్రభుత్వమే చూసుకుంటుంది. తెలుపు లేదా నలుపు రంగు ఉంటే? మైలు రాళ్ల పై భాగంలో తెలుపు లేదా నలుపు రంగు ఉంటే.. మనం ప్రయాణిస్తోంది పెద్ద నగరం మీదుగా లేదా జిల్లాలో అని అర్థం చేసుకోవాలి. ఈ రహదారుల్ని ఆయా నగరాలు లేదా జిల్లాల అభివృద్ధి శాఖలు పర్యవేక్షిస్తుంటాయి. ఆరెంజ్ లేదా ఎరుపురంగు ఉంటే.? మైలు రాళ్ల పై భాగంలో ఎరుపు లేదా ఆరెంజ్ రంగు ఉంటే మనం గ్రామాల్లో ప్రయాణిస్తున్నామని తెలుసుకొండి. అలాగే ఈ రోడ్లను ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన కింద నిర్మించారని అర్థం. పసుపు రంగు ఉంటే..? ఇక మైలు రాళ్ల పైభాగంలో పసుపు రంగులో ఉంటే మనం జాతీయ రహదారిపై ప్రయాణిస్తున్నామని తెలుసుకోవాలి. మన దేశంలో కేవలం కొన్ని జాతీయ రహదారులే ఉన్నాయి. వీటిని నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా(ఎన్హెచ్ఏఐ) పర్యవేక్షిస్తుంటుంది. మనం కేవలం ప్రయాణిస్తున్నప్పుడు మనం చేరుకోవాల్సిన గమ్యం ఎంత దూరం ఉందో చూశారు కదా.. ఈ సారి మాత్రం పైభాగం ఏ రంగులో ఉందో గమనించి.. రహదారుల మధ్య బేధాల్ని తెలుసుకొండి. -
కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డూ ప్రమాదం
-
కర్నూలు హైవేపై ఘోర ప్రమాదం
సాక్షి, కర్నూలు : మృత్యువు ఎప్పుడు ఏ రూపంలో వస్తుందో చెప్పలేమనడానికి కర్నూలు జిల్లాలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదమే నిదర్శనం. కర్నూలు నగరానికి చెందిన రిటైర్డ్ ప్రొఫెసర్ డాక్టర్ శివభూషణం, అతని భార్య సుక్కలమ్మలు డ్రైవర్ ఎస్.వెంకటరమణతో కలిసి కర్నూలు వైపు కారులో వస్తున్నారు. అలాగే హైదరాబాద్ నుంచి మైసూరుకు నలుగురితో వెళుతున్న మరో కారుకి కర్నూలు జిల్లా కల్లూరు మండలం చిన్నటేకూరు గ్రామశివారులోని 44వ నంబరు జాతీయ రహదారి వద్ద టైరు పంక్చర్ అయ్యింది. దీంతో అదుపు తప్పిన కారు డివైడర్‌ను ఢీకొట్టి పల్టీలు కొడుతూ ప్రొఫెసర్ ప్రయాణిస్తున్న కారుని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ప్రొఫెసర్, అతని భార్య, డ్రైవర్లు అక్కడికక్కడే మృతి చెందగా..ప్రమాదానికి కారణమైన కారులో ప్రయాణిస్తున్న కార్తీక్, తేజేష్, రాకేష్, శేఖర్లు స్వల్పగాయాలతో బయటపడ్డారు. ప్రమాద సమాచారాన్ని అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టానికి తరలించారు. కాగా, మృతుడు శివభూషణానికి ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. -
హైవేలపై అండర్‌పాస్‌లు!
సాక్షి, హైదరాబాద్: రాజీవ్ రహదారి.. రాష్ట్రంలో కీలకమైన రోడ్డు. హైదరాబాద్ – రామగుండం వరకు విస్తరించిన 230 కిలోమీటర్ల ఈ రోడ్డును బాగా గమనిస్తే ఎక్కడా బైపాస్‌లు కనిపించవు. రెండు రోడ్లు కలిసే చోట ప్రత్యామ్నాయ మార్గాలుగా అండర్‌పాస్‌ల ఊసే ఉండదు. వాహనదారులు ఈ రోడ్డు మీదుగా బిక్కుబిక్కుమంటూ సాగాల్సిందే. వేగంగా వాహనాలు దూసుకెళ్లే రోడ్లు ఎలా ఉండకూడదో చక్కటి ఉదాహరణగా నిలిచే రోడ్డు ఇది. జాతీయ రహదారులపై వాహనాలు రయ్‌మంటూ దూసుకెళ్తున్నాయి. ఎదురుగా రోడ్డును ఆనుకునే ఓ ఊరు తారసపడింది. వేగంగా దూసుకొచ్చే వాహనాలు ఊరి వైపు కాకుండా ఆ పక్కనే నిర్మించిన అండర్‌పాస్ గుండా దూసుకుపోయాయి. కాస్త ముందుకు వెళ్లిన తర్వాత మరో రోడ్డు దాటుతున్న సమయంలోనూ వాహన వేగం తగ్గలేదు. అక్కడ మరో అండర్పాస్లోంచి దూసుకుపోయే ఏర్పాటు. చివరకు బైపాస్ ముగిసే చోట కూడా మరో అండర్‌పాస్ ఉండటంతో వాహనాల అదే వేగంతో వెళ్లొచ్చు. రెండు రోడ్ల మీదుగా దూసుకొచ్చే వాహనాలు పరస్పరం ఢీకొనే ప్రమాదం కూడా ఉండదు. మొదటిది వాస్తవం.. రెండోది కల్పన. అయితే ఇప్పుడు జాతీయ రహదారులపై పరిస్థితి మారనుంది. కేంద్ర ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయం వేగంగా దూసుకెళ్లే వాహనాల భద్రతకు భరోసా ఇవ్వనుంది. జాతీయ రహదారులపై ప్రమాదాలను వీలైనంత తగ్గించేందుకు గ్రామాలుండే చోట్ల వాటిపై బైపాస్‌లు, వాటిని అండర్‌పాస్‌లతో జోడించటం అత్యవసరమని కేంద్రం నిర్ణయించింది. విధానపరమైన నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో కచ్చితంగా అమలు చేయాలని ఆదేశించింది. జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్హెచ్ఏఐ) నిర్మించే రోడ్లపై దీని అమలు ప్రారంభించారు. ఫలితంగా ఇప్పటికే ప్రణాళిక రూపొందించి పనులు ప్రారంభించని రోడ్ల డిజైన్లను మారుస్తున్నారు. ఆయా రహదారులన్నింటిలో అవసరమైన చోట్ల అండర్‌పాస్‌లను నిర్మించేలా కొత్త నమూనాలను రూపొందించారు. ఎలా ఉంటుంది..? చాలా రహదారులపై గ్రామాలున్నాయి. వాహనాలు ఆ గ్రామాల మీదుగా దూసుకుపోతున్నప్పుడు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇలాంటి చోట్ల బైపాస్‌లను నిర్మించి వేరే ప్రాంతాలకు వెళ్లే వాహనాలను వాటి మీదుగా మళ్లించాలి. కానీ భూ సేకరణ, నిర్మాణ వ్యయాల కారణంగా బైపాస్‌లు లేకుండానే రోడ్ల నిర్మాణాలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఎన్హెచ్ఏఐ రోడ్లపై కచ్చితంగా బైపాస్‌లు నిర్మిస్తారు. రోడ్డును ఆనుకుని 500 మీటర్ల కంటే ఎక్కువ మేర గ్రామం విస్తరించి ఉంటే వీటి నిర్మాణం తప్పనిసరి. తాజా నిర్ణయం మేరకు ఈ బైపాస్‌ల ప్రారంభం, ముగిసే చోట అండర్‌పాస్‌లు కూడా నిర్మించాల్సి ఉంటుంది. గ్రామాల వైపు వెళ్లే వాహనాలు, ప్రధాన కారిడార్ మీదుగా వెళ్లే వాహనాల మధ్య ఎలాంటి అయోమయం లేకుండా ఈ అండర్‌పాస్‌లు దారులను విడదీస్తాయి. కొన్ని చోట్ల బైపాస్‌ల మీదుగా మరో రోడ్డు విస్తరించి ఉంటుంది. ఇలాంటి వాటికి రెండో రోడ్డు కలిసే చోట మూడో అండర్‌పాస్ నిర్మించాల్సి ఉంటుంది. మారిన డిజైన్లు.. ప్రస్తుతం హైదరాబాద్–కొడంగల్ మీదుగా విస్తరించే జాతీయ రహదారిలో హైదరాబాద్–మన్నెగూడ మధ్య రెండు చోట్ల కొత్తగా అండర్‌పాస్‌లను ప్రతిపాదించారు. మొయినాబాద్, చేవెళ్ల బైపాస్‌లలో వీటిని నిర్మిస్తారు. ఖమ్మం–కోదాడ మార్గంలో 11 ప్రధాన అండర్‌పాస్‌లు, ద్విచక్ర వాహనాలు, కార్లు వెళ్లగలిగే 9 చిన్న అండర్‌పాస్‌లను ప్రతిపాదించారు. ఖమ్మం–సూర్యాపేట మార్గంలో 12 ప్రధాన అండర్‌పాస్‌లు, 11 చిన్న అండర్‌పాస్‌లను నిర్మించాలని నిర్ణయించారు. ఖమ్మం–అశ్వారావుపేటలో ఎన్ని అండర్‌పాస్‌లు నిర్మించాలనే విషయంలో సర్వే జరుపుతున్నారు. త్వరలో మిగతా చోట్ల కూడా వీటిని ఖరారు చేయనున్నారు. ఆ తర్వాత జాతీయ రహదారుల విభాగం పనులు చేపట్టే రోడ్లపైనా నిర్మించనున్నారు. -
ఓవర్‌లోడ్.. అతివేగం.. అజాగ్రత్త
సారంగాపూర్(జగిత్యాల): పరిమితికి మించిన ప్రయాణాలతో ప్రాణాలు పోతున్నా.. ప్రయివేటు వాహనదారులకు పట్టింపు ఉండడం లేదు. ఓ వైపు రహదారి భద్రతవారోత్సవాలు ప్రారంభించి ప్రమాదకర ప్రయాణాలపై అవగాహన కల్పిస్తున్నా.. ఓవర్‌లోడ్ ప్రయాణాలు తగ్గడం లేదు. కరీంనగర్ జిల్లాలో ఆటోబోల్తాపడి 8 మంది మరణించిన ఘటన మరువకముందే జగిత్యాల జిల్లాలో సోమవారం మరో ఘటన జరిగింది. 35మంది ఉపాధిహామీ కూలీలతో వెళ్తున్న ట్రాలీఆటో బోల్తాపడింది. ఆటోలోని 21మంది గాయపడగా.. ఆదృష్టవశాత్తు ప్రాణాపాయం తప్పింది. వీరందరినీ జగిత్యాల ఏరియా ఆస్పత్రికి తరలించారు. పోలీసుల వివరాల ప్రకారం.. సారంగాపూర్ మండలం పెంబట్ల గ్రామంలోని బుడిగెజంగాలకాలనీ, బీసీ కాలనీకి చెందిన కూలీలు కొద్దిరోజులుగా ఉపాధిహామీ పనులకు వెళ్తున్నారు. సోమవారం ఉదయం పెంబట్ల గ్రామ శివారుల్లోని పెంబట్ల– రంగపేటమధ్య పెద్దమ్మ ఆలయానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న అటవీ ప్రాం తంలో పనులు నిర్వహించడానికి సుమారు 35 మంది గ్రామానికి చెందిన పార్తం గంగాధర్ ట్రాలీఆటోలో వెళ్లారు. పనులు ముగించుకుని 10 గంటల ప్రాంతంలో ఆటోలో ఇళ్లకు బయల్దేరారు. ఆటో లక్ష్మీదేవిపల్లి గ్రామం దాగటగానే ఓవర్‌లోడ్‌తో కుదుపునకు గురికావడంతో డ్రైవర్ అకస్మాత్తుగా బ్రేక్‌వేశాడు. దీంతో అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ఘటనలో 21 మంది కూలీలు గాయపడ్డారు. క్షతగాత్రులు వీరే.. ఆటోలో ప్రయాణిస్తున్న కుంట గంగు, పురా ణం మల్లవ్వ, పత్రి రాధ, గిండె లక్ష్మి, పర్సమల్ల బుజ్జి, పత్రి లచ్చవ్వ, పత్రి భీమక్క, మిర్యాల సుమలత, పత్రి కావ్య, మస్తాను దుబ్బరాజు, అనుమండ్ల సునీత, పురాణం మమత, పత్రి చిన్నఎల్లవ్వ, చొప్పరి సుజాత, బొడ్డుపల్లి మల్లవ్వ, సొప్పరి రాజమ్మ, కట్టెకోల దుబ్బరాజు, నారెల్ల ఆశవ్వ, పత్రి భీమక్క, పస్తం గంగమ్మ, మామిడి లక్ష్మి గాయపడ్డారు. పత్తి ఎల్లవ్వ, పురాణం ఎల్లక్క, పత్రి లచ్చవ్వ, పత్రి భీమక్క, పస్తం దుబ్బరాజుకు తీవ్రగాయాలయ్యాయి. సకాలంలో స్పందించిన పోలీసులు విషయం తెలుసుకున్న సారంగాపూర్ ఎస్సై రాజయ్య అక్కడికి చేరుకున్నారు. 108 రావడం ఆలస్యం కావడంతో ప్రయివేటు వాహనాల్లో క్షతగాత్రులను జగిత్యాల ఏరియా ఆస్పత్రికి తరలించా రు. తహసీల్దార్ వసంత, ఎంపీడీవో పుల్లయ్య పరిస్థితి సమీక్షించారు. క్షతగాత్రులను ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి, టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ సంజయ్‌కుమార్ తదితరులు పరామర్శించారు. ఆటో డ్రైవర్ నిర్లక్ష్యంతోనే ప్రమాదం జరిగిందని, ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. -
భారీగా ఐస్‌క్రీమ్స్ పట్టివేత
ఎచ్చెర్ల క్యాంపస్: జాతీయ రహదారిపై చిలకపాలెం సమీపంలో టోల్‌ప్లాజా వద్ద నాణ్యతా ప్రమాణాలు పాటించని ఐస్‌క్రీమ్స్‌ను భారీగా పట్టుకున్నారు. శ్రీకాకుళం రీజనల్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్సుమెంట్ అధికారులు ఇక్కడ తనిఖీలు నిర్వహిస్తుండగా ఈ ఐస్‌క్రీమ్‌లు పట్టుపడ్డాయి. ఇందులో నాణ్యతా ప్రమాణాలు పాటించని ఐస్‌క్రీమ్స్‌ను గుర్తించారు. వీటి విలువ రూ. 60 వేలు ఉంటాయని అంచనావేశారు. కప్పులు, చాకోబార్, కోన్సు రకాలు ఉన్నాయి. విజయనగరం జిల్లా నెల్లిమర్ల ప్రాంతానికి చెందిన శ్రీవెంబమాంబ ప్రొజెన్ ఫుడ్స్ నుంచి టెక్కలిలో అమ్మకానికి ఈ ఐస్‌క్రీమ్స్ తీసుకువెళుతున్నారు. ఈ ఐస్‌క్రీమ్స్‌పై బ్యాచ్ నంబర్, తయారీ తేదీ, వినియోగ పరిమితి వంటి అంశాలు ప్రస్తావించలేదు. కొన్ని కప్పులపై మాత్రం కాలపరిమితి ఆరు నెలలు, 12 నెలల్లోపు వినియోగించవచ్చునని ఉంది. ఈ ఐస్‌క్రీమ్స్ నాణ్యతా ప్రమాణాలు, పిల్లలు తినటం వల్ల వారి ఆరోగ్యంపై చూపే ప్రభావం వంటి అంశాలు తెలుసుకునేందుకు హైదరాబాద్‌కు చెందిన స్టేట్ ల్యాబ్రేటరీకి నమూనాలు పంపించినట్టు ఎన్ఫోర్స్మెంట్ అధికారులు చెప్పారు. మరోపక్క విజయనగరం అధికారులను రీజనల్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారి టి.హరికృష్ణ, డీఎస్పీ ప్రసాదరావు, సీఐ జి.చంద్ర అప్రమతం చేశారు. ఈ మేరకు విజయనగరం ఫుడ్ సేప్టీ అధికారులు ఐస్‌క్రీమ్ తయారీ యూనిట్‌ను విస్తృతంగా పరిశీలించారు. మంచినీరు వినియోగించకపోవటం, వనస్పతి నూనె పరిమితికి మించి వినియోగించటం వంటి లోపాలు అక్కడ బయటపడినట్టు అధికారులు చెప్పారు. ఐస్‌క్రీమ్స్ తయారీకి వినియోగించే పలు వస్తు సామగ్రి స్వాధీనం చేసుకున్నారు. మరో పక్క ఇంటికి వినియోగించే గ్యాస్ సిలిండర్లు ఇక్కడ ఆరు వినియోగిస్తున్నట్టు గుర్తించారు. ఈ గ్యాస్ సిలిండర్లు వినియోగానికి సంబంధించి పౌరసరఫరాల శాఖ అధికారులు 6ఏ కేసు నమోదు చేసి, సిలిండర్లు స్వాధీనం చేసుకున్నారు. అలాగే కల్తీ ఆహార చట్టాలు కింది కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తామని విజిలెన్స్ అధికారులు వెల్లడించారు. -
నీటి కోసం హైవేపై రాస్తారోకో
యర్రగొండపాలెం: తాగునీటి కోసం మండలంలోని సర్వేయపాలెం గ్రామానికి చెందిన ప్రజలు సోమవారం సమీపంలోని జాతీయరహదారి వద్దకు వచ్చి రాస్తారోకో చేశారు. దాదాపు 3 గంటలపాటు రాకపోకలను స్తంభించి పోవడంతో ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. రహదారిపైగా వెళ్తున్న 10వ తరగతి విద్యార్థులు, అత్యవసర వాహనాలను మాత్రమే వారు అనుమతించారు. బస్సులు, లారీలు, ద్విచక్రవాహనాలను సైతం ఎటూ కదలనీయకుండా చేశారు. తమ గ్రామంలో 300 గడపలు ఉంటే ఒక్క బోరు మాత్రమే పనిచేస్తుందని, అందులో నుంచి వచ్చే అరకొరనీటి కోసం పనులు సైతం వదులుకొని గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆ గ్రామానికి చెందిన పలువురు మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. 4 సంవత్సరాల క్రితం సాగర్‌నీటి కోసం పైపులు వేసి వారం రోజులు నీళ్లు వదిలారని, ఆ తరువాత ఏకారణంతోనో నీటి విడుదల నిలిపి వేశారని తెలిపారు. కనీసం ట్యాంకర్ల ద్వారా కూడా నీటిని సరఫరా చేయడంలేదని, అనేక పర్యాయాలు ప్రజాప్రతినిధులను, అధికారులను కలిసి తమ సమస్య విన్నవించుకున్నప్పటికీ ఫలితంలేకుండా పోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సాగర్పైపులైన్ ఉంది కదా నీటిని ఎందుకు వదలడం లేదని ఆర్డబ్ల్యూఎస్ అధికారులను నిలదీస్తే తమ గ్రామం సాగర్ నీటి విడదల జాబితాలో లేదని బదులిస్తున్నారని, కూలిపనులు పనులు మానుకొని గ్రామం అంతా రోడ్డుపైకి చేరాల్సిన గత్యంతరం ఏర్పడిందని ఆ గ్రామానికి చెందిన పి.ఇజ్రాయిల్ తెలిపాడు. సమస్య పరిష్కారం అయ్యేవరకూ ఆందోళన చేస్తునే ఉంటామని ఆ గ్రామస్తులు హెచ్చరించారు. ఎంపీడీఓ టి.హనుమంతరావు, సీఐ డి.మల్లికార్జునరావు, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ శ్రీనివాసరావులు అక్కడికి చేరుకొని రెండు రోజుల్లో పైపులైన్వేసి సాగర్ నీటిని సరఫరా చేస్తామని, అప్పటి వరకు ట్యాంకర్ల ద్వారా నీటిని అందిస్తామని స్పష్టమైన హామీ ఇచ్చారు. దీంతో గ్రామస్తులు ఆందోళనను విరమించారు. -
‘గ్రీన్’ హైవేకు పచ్చజెండా
సాక్షి, చెన్నై: గ్రీన్ హైవేకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రూ.10 వేల కోట్లతో పనులు చేపట్టనున్నారు. ఈ పనులకుగాను స్థల సేకరణకు తగ్గ ఆదేశాలు జారీ అయ్యాయి. చెన్నై నుంచి సేలం వైపు ఎనిమిది మార్గాలతో 274 కిమీ దూరంలో ఈ గ్రీన్ నేషనల్ హైవే రూపుదిద్దుకోనుంది. కన్యాకుమారి నుంచి చెన్నై మీదుగా పలు రాష్ట్రాలను కలుపుతూ జాతీయ రహదారి రూపదిద్దుకుని ఉన్న విషయం తెలిసిందే. రాష్ట్రంలో జాతీయ రహదారుల్లో నిత్యం వాహనాలు దూసుకెళ్తున్నాయి. ఈ జాతీయ రహదారులను అనుసంధానిస్తూ రాష్ట్ర రహదారులు అనేకం ఉన్నాయి. అయినా, ట్రాఫిక్ తగ్గేది లేదు. ఈ పరిస్థితుల్లో చెన్నై నుంచి పశ్చిమ తమిళనాడు వైపుగా సేలంకు సరికొత్త రోడ్డు మార్గానికి కేంద్రం నిర్ణయించింది. ఇందుకు తగ్గ ప్రణాళిక సిద్ధమైంది. పచ్చదనంతో నిండిన మార్గంగా ఈ జాతీయ రహదారిని రూపొందించేందుకు కేంద్రం చర్యలు తీసుకుంది. ఈ పనులకుగాను స్థలసేకరణ నిమిత్తం రాష్ట్ర రహదారుల శాఖ కార్యదర్శి రాజీవ్ రంజన్‌కు కేంద్ర రహదారుల శాఖ నుంచి ఆదివారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ మార్గం సాగే జిల్లాల్లోని కలెక్టర్ల పర్యవేక్షణలో స్థల సేకరణకు ప్రత్యేక అధికారుల్ని రంగంలోకి దించే విధంగా ఆ ఉత్తర్వుల్లో వివరించారు. అలాగే , ఆ రోడ్‌రూట్ మ్యాప్ అంశాలను అందులో పొందుపరిచారు. రూ.10 వేల కోట్లతో పచ్చదనం: చెన్నై నుంచి సేలం వరకు 274 కి. మీద దూరం రూపుదిద్దుకోనున్న ఈ హైవే 250 కిమీ దూరం అటవీ మార్గంలో సాగనుంది. చెన్నై తాంబరం నుంచి ధర్మపురి జిల్లా అరూర్ వరకు ఎన్‌హెచ్ 179బీగా, అరూర్ నుంచి సేలం వరకు ఎన్‌హెచ్ 179ఏగా ఈ గ్రీన్ హైవేను పిలుస్తారు. రూ.పదివేల కోట్ల వ్యయంతో పచ్చదనంతో ఈ మార్గం రూపుదిద్దుకోనుంది. కాంచీపురం జిల్లాల్లో 53 కిమీ, తిరువణ్ణామలై జిల్లా సెయ్యారు, వందవాసి, పోలూరు, ఆరణి, సెంగం మీదుగా 122 కి.మీ, కృష్ణగిరిలో రెండు కిమీ, ధర్మపురి జిల్లా తీర్థమలై, అరూర్, పాపిరెడ్డి పట్టిలను కలుపుతూ 53 కి.మీ, సేలం జిల్లా వాలప్పాడి తాలుకా నుంచి సేలం నగరంలోకి 38 కిమీ దూరం నిర్మించనున్నారు. స్థలసేకరణ ప్రక్రియను త్వరితగతిన ముగించాలని, ప్రత్యేక అధికారుల ద్వారా పనులు చేపట్టాలని ఆదేశాలు జారీ అయ్యాయి. 250 కి.మీ దూరం అటవీ మార్గంలో ఈ గ్రీన్ హైవే పయనించనున్న దృష్ట్యా, అందుకు తగ్గ అనుమతులు రాష్ట్ర ప్రభుత్వం కోర్టులో ఉంది. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏ మేరకు స్పందిస్తుందో వేచి చూడాల్సిందే. ఈ రహదారి పూర్తయతే చెన్నై నుంచి సేలంకు 3 గంటల్లో చేరుకోవచ్చు. దేశంలోనే రెండవ గ్రీన్ హైవే తమిళనాడుకు దక్కడం గమనించదగ్గ విషయం. -
వాహనం ఆగిందా..డీజిల్ గోవిందా..!
బొంరాస్‌పేట: మండల పరిధిలోని అంతరాష్ట్ర రహదారిపై ఉన్న తుంకిమెట్ల హైటెక్ దొంగతనానికి అడ్డాగా మారింది. గ్రామంలో రహదారి పక్కన నిలిచి ఉన్న వాహనాల్లో నుంచి డీజిల్ దొంగతనం పరిపాటిగా మారింది. తాజాగా ఆదివారం తెల్లవారుజామున డీజిల్ దొంగతనం జరిగింది. బాధితుల వివరాల మేరకు.. గ్రామంలో సిమెంటు ట్యాంకర్ల డ్రైవర్లు, లారీల డ్రైవర్లు ఉన్నారు. రాత్రి పూట ఇంటివద్ద విశ్రాంతి తీసుకొని ఉదయం వెళ్లేందుకు గ్రామంలోని రహదారి పక్కన తమ వాహనాలకు నిలుపుతారు. దీన్ని అదునుగా చూసి దొంగలు మాటువేసి పెద్ద మొత్తంలో డీజిల్‌ను లాగేస్తూ హైటెక్ దందాను నడిపిస్తున్నారు. ఆదివారం తెల్లవారు జామున మూడు లారీలు వెంకటయ్యగౌడ్ లారీలో నుంచి 400 లీటర్లు, శామప్ప లారీలో 100 లీటర్లు, బూదరి వెంకటయ్య లారీలో 100 లీటర్ల డీజిల్ మాయమైంది. డీజిల్ ఇలా మాయం... విశ్రాంతి కోసం నిలిపిన వాహనాల్లో డీజిల్ దొంగతనానికి అలవాటుపడ్డ దుండగులు ఎవరికీ అనుమానం రాకుండా ఓ కారులో వస్తారు. అదే కారులో డ్రమ్ములు ఉంచుకొని దొంగతనం చేయాల్సిన వాహనం పక్కన కారును నిలుపుతారు. లారీల డీజిల్ ట్యాంకు తాళం పగులగొట్టి ట్యాంకు నుంచి కారులో ఉన్న డ్రమ్ముల్లోకి పైపులు వేసి నేరుగా డీజిల్‌ను లాగేస్తారు. డ్రుమ్ములు నిండగానే ఉడాయిస్తారు. ఇది గమనించిన స్థానికులు గతంలో వారిని వెంబడించడంతో దొంగలు చిక్కకుండా పరారయ్యారని పలువురు పేర్కొంటున్నారు. నెలలో నాలుగోసారి నెలరోజుల క్రితం రూ.1.50లక్షల డీజిల్ మాయం చేశారు. నెల రోజలు క్రితం ఐదు లారీలు (తుంకిమెట్లకు చెందిన లారీడ్రైవర్లు శ్యామప్ప, రాములు, నర్సింలు, నారాయణ, దస్తప్ప) నుంచి 140 లీటర్ల వరకు రూ.1.50లక్షల డిజిల్ ఒకేరాత్రి లాగేశారు. తర్వాత షబ్బీర్, తోలు నర్సింలు, అఫీజ్‌ల వాహనాల్లో డీజిల్ దొంగతనం జరిగింది. మూడోసారి హైదరాబాద్‌కు చెందిన రెండు లారీలు రోడ్డు పక్కన తుంకిమట్లెలో నిలిచి ఉండగా డీజిల్ మాయం చేశారు. పోలీసుల కన్నుగప్పి డీజిల్ దొంగతనాలపై పోలీసులు పహారా నిర్వహిస్తున్నా దొంగతనాలు జరుగుతూనే ఉన్నాయి. శనివారం రాత్రి నుంచి పోలీసులు ఆదివారం తెల్లవారుజామున పోలీసులు వెళ్లిన పది నిమిషాల్లో డీజిల్ దొంగతనం కావడం పట్ల బాధితులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. 400 లీటర్ల డీజిల్ పోయింది పోలీసుల కన్నుగప్పి జరుగుతున్న డీజిల్‌మాయం సంఘటనలు అనుమానాలకు తావిస్తోంది. నా లారీలో నుంచి 400 లీటర్ల రూ.28వేల విలువ చేసే డీజిల్ మాయమైంది. 100కు కాల్ చేశాం. సరైన రీతిలో పోలీసుల స్పందన కరువైంది. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేందుకు విరాళాలు సేకరిస్తున్నామని చెప్తున్నారు. – వెంకటయ్యగౌడ్, తుంకిమెట్ల విచారణ జరుపుతున్నాం తుంకిమెట్లలో డీజిల్ దొంగతనాలపై నిఘా ఉంచాం. హైటెక్ దొంగతనానికి పాల్పడేది స్థానికులా, బయటివారా అనే కోణంలో విచారణ చేస్తున్నాం. ఆదివారం చోటుచేసుకున్న సంఘటనపై ఫిర్యాదు అందలేదు. దీనిపై విచారణ చేస్తున్నాం. – వెంకటేశ్వర్లు, ఎస్సై, బొంరాస్‌పేట -
అంతా గుట్టు.. కొల్లగొట్టు!
ఒంగోలు : నిత్యం రద్దీగా ఉండే ఒంగోలు–నంద్యాల రహదారి నిర్వహణ (మెయింటెనెన్స్)పనుల్లో నిధులు నిలువునా దోచేశారు. అక్కడక్కడ తూతూ మంత్రంగా పనులు చేసినట్లు చూపించి కోట్లాది రూపాయలు ఆరగించారు. ఐదేళ్ల పాటు రోడ్డు మరమ్మతుల పేరిట మంజూరైన నిధులు పప్పుబెల్లాల్లా ఆరగించారు. ఐదేళ్లపాటు రోడ్డు మరమ్మతుల కోసం 2013 జనవరిలో అప్పటి ప్రభుత్వం జిల్లాలోని రెండు రోడ్లకుగాను రూ.45.38 కోట్లు విడుదల చేసింది. ఈ నిధులను ఒంగోలు–నంద్యాల రోడ్డులో 100 కిలో మీటర్లు, దొనకొండ కనిగిరి రోడ్డులో 144 కిలో మీటర్లు మేర నిర్వహణ కోసం కేటాయించారు. అందుకుగాను ఔట్పుట్ అండ్ పెర్ఫార్మెన్స్ బేస్డ్ రోడ్డు కాంట్రాక్ట్ (ఓపీఆర్‌సీ)గ్రాంట్ కింద జిల్లాలో ప్యాకేజ్–38లో భాగంగా రోడ్డు నిర్వహణకు విడుదల చేశారు. ఒంగోలుకు చెందిన కాంట్రాక్ట్ సంస్థలు మెసర్స్ ఎస్ఎస్ఎన్సి–భవానీ జాయింట్ వెంచర్‌గా పనులు చేపట్టేందుకు రోడ్లు, భవనాల శాఖ(ఆర్ అండ్ బీ)తో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ రోడ్డు పనుల నిర్వహణ బాధ్యతలను పర్యవేక్షించేందుకు కనిగిరి ఆర్ అండ్ బీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్(ఈఈ)కు అప్పగించారు. అయితే ఐదేళ్లు పూర్తయిపోతోంది. ఎక్కడ గుంతలు అక్కడే వదిలేసి మిగిలిన నిధులను పూర్తిగా తీసుకునేందుకు అటు అధికారులు, ఇటు కాంట్రాక్టర్లు రంగం సిద్ధం చేసుకున్నారు. ఐదు రకాల నిర్వహణ కోసం నిధులు... రెండు రోడ్లలో వాహనాల రాకపోకల సమయంలో దెబ్బతిన్న చోట, రోడ్డు మార్జిన్లు, వర్షాలకు, వరదలకు గుంతలు పడ్డ ప్రాంతాల్లో మరమ్మతులు చేయటానికి ఐదు రకాల పనుల చేపట్టటానికి ప్రత్యేకంగా నిధులు కేటాయించారు. అందులో భాగంగా సాధారణ రోడ్డు నిర్వహణ కోసం రూ.8.54 కోట్లు కేటాయించారు. అదేవిధగా రోడ్లపై బాగా గుంతలు పడి రాకపోకలకు ఇబ్బందిగా ఉంటే అలాంటి ప్రాంతాల్లో రోడ్డును పునరుద్ధరించటాని రూ.3.09 కోట్లు కేటాయించారు. కాలానుగుణంగా వర్షాలు ఎక్కువగా పడి గుంతలు ఏర్పడిన సమయాల్లో వాహనాల రాకపోకలకు ఇబ్బంది లేకుండా మరమ్మతులు చేపట్టడానికి రూ.23.95 కోట్లు, చిన్న, చిన్న మరమ్మతులకు రూ.6.81 కోట్లు, అత్యవసర పరిస్థితుల్లో విపత్కర పరిస్థితులు ఎదురై రోడ్లు దెబ్బతిన్నప్పుడు వాడేందు రూ.3 కోట్లు కేటాయించారు. ఈ రెండు రోడ్లకు కేటాయించిన నిధుల్లో ఏ హెడ్‌లోనూ సగానికి పైగా నిధులు ఖర్చు చేయలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అత్యవసర పరిస్థితుల్లో వాడాల్సిన నిధులు అసలు ఖర్చే చేయలేదన్న వాదన వినపడుతోంది. ఒంగోలు–చీమకుర్తిలోపే ఎన్నో గుంతలు... రోడ్డు నిర్వహణ కోసం కోట్లాది రూపాయలు ట్రెజరీలో మూలుగుతున్నాయి. ఒంగోలు–చీమకుర్తి మధ్యలో రోడ్డు ఎన్నో గుంతలు పడి వాహనదారులు నానా అవస్థలు పడుతున్నారు. అయినా అధికారులకు మాత్రం చీమకుట్టినట్టయినా లేదు. ఒంగోలు నగరంలోని ఫ్లై ఓవర్ నుంచి వరుసగా ఎప్పుడూ గుంతలతోనే వాహనదారులు అవస్థలు పడుతున్నారు. భారీ వాహనాలు తిరిగే ఒంగోలు–చీమకుర్తి రోడ్డులో మార్జిన్లు గుంతలతో ఇప్పటికీ అవస్థలు పడుతూనే ఉన్నారు. రోడ్డు నిర్వహణ పేరుతో దోచుకోవటమే పనిగా అధికారులు, కాంట్రాక్టర్లు పెట్టుకున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
హైవేపై నిలిచిపోయిన ధనుంజయ ట్రావెల్స్ బస్సు
-
అత్యంత ఎత్తయిన రహదారి
శ్రీనగర్: జమ్మూ కశ్మీర్‌లోని లడఖ్ ప్రాంతంలో ఎత్తయిన ప్రదేశాల్లో ఒకటి ‘ఉమ్లింగ్లా టాప్’అనే ప్రాంతం. వేసవిలో మైనస్ 10 నుంచి 20 డిగ్రీల ఉష్ణోగ్రత.. ఇక చలికాలంలోనైతే ఏకంగా మైనస్ 40 డిగ్రీలకు ఉష్ణోగ్రత చేరే సరిహద్దు ప్రదేశం అది. ఆక్సిజన్ స్థాయిలు అయితే మిగతా ప్రాంతాలతో పోలిస్తే 50 శాతం తక్కువగా ఉంటాయి. ఇక అక్కడ నివాసమనేది ఊహించుకోవడానికీ కుదరని విషయం. అలాంటి ప్రాంతంలో బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (బీఆర్ఓ) వాహనాలు ప్రయాణించేందుకు అనువుగా ఉండేలా రహదారి నిర్మాణాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. 86 కి.మీ. పొడవుగల రోడ్డును భూఉపరితలానికి 19,300 అడుగుల ఎత్తులో నిర్మించింది. దీంతో ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన రహదారిగా రికార్డుల్లోకి ఎక్కింది. ఈశాన్య ప్రాంతంలోని ఇండో–చైనా సరిహద్దులోని చిసూమ్లే, డెమ్చోక్ గ్రామాలను కలుపుతూ దీన్ని నిర్మించారు. అలాగే లేహ్ ప్రాంతానికి 230 కి.మీ. దూరంలోనే ఈ రెండు గ్రామాలు ఉన్నాయని బీఆర్ఓ అధికారి తెలిపారు. రహదారి నిర్మాణ సమయంలో అక్కడి వాతావరణ పరిస్థితులు ఆటంకంగా మారాయని.. ఇక్కడ పనిచేసే పనివాళ్లు ప్రతి పది నిమిషాలకు ఓసారి ఆక్సిజన్ కోసం కిందకు వెళ్లాల్సిన పరిస్థితి ఎదురైందని తెలిపారు. అంతేగాక ఇక్కడ పనిచేసిన వాళ్లలో చాలామంది తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఎదుర్కొన్నారని.. జ్ఞాపక శక్తి లోపం, కంటిచూపు మందగించడం, అధిక రక్తపోటు వంటి వ్యాధులకు కూడా గురయ్యారని రహదారి నిర్మాణంలో కీలకపాత్ర పోషించిన చీఫ్ ఇంజనీర్, ప్రాజెక్ట్ హిమాంక్ అధికారి డీఎమ్ పుర్విమత్ తెలిపారు. అయినా దేశ ప్రయోజనాల కోసం తమ సిబ్బంది కష్టపడి లక్ష్యాన్ని పూర్తిచేసినట్లు వివరించారు. -
రహదారుల పక్కనే విశ్రాంతి
♦ ప్రయాణికులు, డ్రైవర్ల కోసం వే సైడ్ ఎమినిటీ సెంటర్లు ♦ సరికొత్త విధానాన్ని ఆవిష్కరించిన కేంద్రం కడప కార్పొరేషన్ : దేశంలోని అన్ని జాతీయ రహదారు ల పక్కన ప్రయాణికులు, డ్రైవర్ల కోసం ప్రతి 50 కిలోమీటర్లకు ఒకటి చొప్పున సౌ కర్య కేంద్రాలు (వే సైడ్ ఎమినిటీ సెంటర్లు) అభివృద్ధి చేయాలని కేంద్ర రవాణా, జాతీయ రహదారుల శాఖ నిర్ణయించింది. కారు, బస్సు ప్రయాణిలతోపాటు భారీ వాహనాల డ్రైవర్లు విశ్రాంతి తీసుకునేందుకు వీటిలో సదుపాయాలు కల్పించనున్నారు. జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ(ఎన్హెచ్ఏఐ)ఈ బాధ్యతలు చూసుకుంటుంది. అమెరికా, జర్మనీ తరహాలో ఈ కేంద్రాలను అభివృద్ధి చేయనున్నారు. ఈ మేరకు సరికొత్త విధానాన్ని కేంద్ర ప్రభుత్వం ఆవిష్కరించింది. ఈ కేంద్రాల్లో కార్లు, బస్సులు, ట్రక్కులకు పార్కింగ్ స్థలాలు కేటాయిస్తారు. పెట్రోల్ బంకులు, వాహన మరమ్మతు కేంద్రాలు, విశ్రాంతి గదులు, డార్మిటరీలు, రెస్టారెంట్లు, ఫుడ్ కోర్టులు, దాబాలు, వ్యవసాయ, చేనేత ఉత్పత్తుల విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేస్తారు. భవిష్యత్లు రాబోతున్న ఎలక్ట్రిక్ కార్లను దృష్టిలో ఉంచుకొని విద్యుత్ చార్జింగ్ వ్యవస్థలు నెలకొల్పుతారు. మూడు భాగాలుగా ఈ కేంద్రాలు ఏర్పాటు కానున్నాయి. సెప్టెంబర్ 21 లోపు దరఖాస్తు చేసుకోవచ్చు ఐదు ఎకరాలలోపు స్థలం ఉండి స్థలంలో ఏర్పాటయ్యే కేంద్రాన్ని హైవే నెస్ట్ అని, అంతకన్నా ఎక్కువ స్థలంలో నెలకొల్పే కేంద్రాన్ని హైవే విలేజ్ అని పిలుస్తారు. ఐదు ఎకరాలకు పైబడి స్థలం ఉన్న వ్యక్తులు సొంతగా నూ ఈ కేంద్రాలను అభివృద్ధి చేసుకోవచ్చు. ముందుకొచ్చేవారికి ప్రభుత్వమే జాతీయ రహదారుల అనుసంధానాన్ని కల్పిస్తుంది. జాతీయ రహదారులకు ఆనుకొని భూములున్న ప్రైవేటు వ్యక్తులు ఆగష్టు 4 నుంచి తమ ఆసక్తిని వ్యక్తం చేస్తూ దరఖాస్తు చేసుకోవచ్చు. ఎన్హెచ్ఏఐ ప్రాంతీయ కార్యాలయాల్లో సెప్టెంబర్ 21లోపు దరఖాస్తులు దాఖలు చేయవచ్చు. ఆంధ్రప్రదేశ్‌లో తిరుపతి–తిరుత్తణి, చెన్నై సెక్షన్లో ఎన్‌హెచ్–205పై ఎస్వీ పురం గ్రామం వద్ద, అనంతపురం–బెంగళూరు సెక్షన్లో రేగాటిపల్లి గ్రామం వద్ద (అనంతపురం జిల్లా) ఇలాంటి కేంద్రాలు ఏర్పాటు కానున్నాయి. త్వరలో ఇతర జాతీయ రహదారుల్లో కూడా వీటిని ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఈ కేంద్రాల్లో విశ్రాంతి తీసుకోవడానికి, పార్కింగ్, ఇతర అవసరాలను బట్టి నిర్ణీత ధరలను నిర్ణయించనున్నారు. ప్రయాణికుల అవసరాలు తీరేలా సదుపాయలు తొలి విభాగంలో సాధారణ ప్రయాణికులు, భారీ వాహనాల డ్రైవర్ల అవసరాలకు తగినట్లుగా, రెండో విభాగంలో ప్రత్యేక తరగతి ప్రయాణికుల అవసరాలు తీర్చేలా సదుపాయాలు ఉంటాయి. మూడో విభాగాన్ని ట్రక్ డ్రైవర్లకు కేటాయిస్తారు. మొత్తం స్థలంలో 20 శాతంలోనే నిర్మాణాలుంటాయి. మిగిలిన 80 శాతం పార్కింగ్, ఇతర వినోద సదుపాయాలకు కేటాయిస్తారు. -
మద్యం వ్యాపారులకు సర్కారు బాసట
- రాష్ట్ర రోడ్లను జిల్లా రోడ్లుగా డీనోటిఫై - సవరణపై జీఓ ఎంఎస్ నెం.28 విడుదల - జిల్లాలో 150 మంది వ్యాపారులకు ఊరట - లైసెన్సుల జారీలో కదలిక కర్నూలు(రాజ్‌విహార్) : సుప్రీం కోర్టు మార్గదర్శకాల ప్రకారం జాతీయ/రాష్ట్ర రహదారులపై మద్యం అమ్మకాలు నిలిచిపోవడంతో ప్రభుత్వం నివారణ చర్యలు చేపట్టింది. సదరు రహదారులను జిల్లా రహదారులుగా మార్పు చేస్తూ మంగళవారం రాత్రి జీఓ ఎంఎస్ నెం.28 విడుదల చేసింది. దీంతో జిల్లాలో రహదారుల పక్కన ఉన్న 150 మంది మద్యం వ్యాపారులకు ఊరట లభించింది. ప్రస్తుతం ఉన్న దుకాణాల్లోనే అమ్మకాలను కొనసాగించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో అటు వ్యాపారులు.. ఇటు ఎక్సైజ్ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. సుప్రీం కోర్టు మార్గదర్శకాల నేపథ్యంలో రోడ్ల పక్కన ఉన్న మద్యం షాపులను యజమానులు నివాస ప్రాంతాలకు తరలించడంతో జిల్లాలోని పలు ప్రాంతాల్లో మహిళలు మూడు రోజులుగా ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. ఇదీ పరిస్థితి.. జిల్లాలో 204 దుకాణాలు, 47 బార్లకు ప్రభుత్వం అనుమతించింది. కొత్త మద్యం పాలసీ ప్రారంభమై నాలుగు రోజులు గడిచినప్పటికీ కేవలం 74 దుకాణాలకు, రెండు బార్లకు మాత్రమే ఎక్సైజ్ అధికారులు లైసెన్సులు జారీ చేశారు. నిబంధనలు తప్పించుకునేందుకు వ్యాపారులు రాజకీయ ప్రయత్నాలు కూడా చేశారు. జాతీయ/రాష్ట్ర రహదారులకు 500 మీటర్ల దూరంలో దుకాణాలు ఏర్పాటు చేసుకోవాలన్న నిబంధనతో లైసెన్సుల జారీలో గందరగోళం నెలకొని జాప్యం చోటు చేసుకుంది. సవరణ ఉత్తర్వులు వెలువడటంతో లైసెన్సుల జారీలో మళ్లీ కదలిక మొదలైంది. ఎక్సైజ్ కార్యాలయంలో వ్యాపారులు ఇచ్చిన సమాచారంతో అర్ధరాత్రి వరకు లైసెన్సులు జారీ ప్రక్రియ కొనసాగింది. మూడో రోజు రూ.3.50 కోట్ల మద్యం కొనుగోలు నూతన మద్యం పాలసీ అమలులో భాగంగా అనుమతి పత్రాలు పొందిన వ్యాపారులు మంగళవారం మూడో రోజు రూ.3.50 కోట్ల మద్యం కొనుగోలు చేశారు. 7,600 బాక్సుల లిక్కర్, 3,300 బాక్సుల బీరును కొనుగోలు చేసి దుకాణాలకు తరలించారు. మొత్తంగా నాలుగు రోజుల్లో రూ.8 కోట్ల మద్యాన్ని వ్యాపారులు కొనుగోలు చేశారు. కల్లూరు శివారులోని హంద్రీ నది ఒడ్డున ఉన్న ఐఎంఎల్ డిపో మద్యం కొనుగోలుదారులతో కిటకిటలాడుతోంది. -
కిక్కు.. రోడ్డు దిగాల్సిందే!
- నేటి నుంచి కొత్త మద్యం పాలసీ – జాతీయ, రాష్ట్ర రహదారుల పక్కన దుకాణాలు 167, బార్లు 17 – సుప్రీం కోర్టు ఆదేశాలు పాటించాలంటున్న అధికారులు – మేజర్ డిస్ట్రిక్ట్ రోడ్స్(ఎండీఆర్)గా మార్పు కోసం ఎదురుచూపులు కర్నూలు: జాతీయ, రాష్ట్ర రహదారుల పక్కన మద్యం దుకాణాలను జులై 1వ తేదీ నుంచి(శనివారం) నిర్ణీత దూరంలో ఏర్పాటు చేయాల్సిందే. ఈ మేరకు ఎక్సైజ్ అధికారులు కసరత్తు చేస్తున్నారు. నూతనంగా లైసెన్స్ పొందిన వ్యాపారులు శనివారం నుంచి దుకాణాలు ప్రారంభించనున్నారు. వారు సుప్రీంకోర్టు ఆదేశాలను తప్పక పాటించాలి. రూ.20 వేల లోపు జనాభాఉన్న ప్రాంతాల్లో రహదారికి 220 మీటర్ల దూరంలో దుకాణాన్ని ఏర్పాటు చేసుకునే వెసులుబాటు ప్రభుత్వం కల్పిస్తుందన్న ఆశతో పాత వ్యాపారులు ఎదురు చూస్తున్నారు. జిల్లాలోని నగర/పట్టణాల్లో జాతీయ, రాష్ట్ర రహదారులను మేజర్ డిస్ట్రిక్ట్ రోడ్స్(ఎండీఆర్)గా మార్పునకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అది అమలైతే జాతీయ, రాష్ట్ర రహదారులకు 220 మీటర్ల దూరంలో దుకాణాలను కొనసాగించవచ్చునన్న ఆశతో పాత వ్యాపారులు ఎదురు చూస్తున్నారు. మిగతా ప్రాంతాల్లో రహదారికి 500 మీటర్ల దూరంలో దుకాణం ఉండాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. కర్నూలు డివిజన్లో 86, నంద్యాల డివిజన్లో 81 కలిపి 167 మద్యం దుకాణాలు జాతీయ, రాష్ట్ర రహదారుల పక్కన ఉన్నట్లు గుర్తించారు. సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం వాటన్నింటినీ తొలగించాల్సిందే. అయితే మేజర్ డిస్ట్రిక్ట్ రోడ్స్‌గా మార్పు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నందున దుకాణాలు అక్కడే కొనసాగించేందుకు అవకాశం వస్తుందని 80 శాతం మంది వ్యాపారులు చివరి రోజు రాత్రి వరకు ఎదురుచూస్తున్నారు. అలాగే జిల్లాలో పాతవి 35 బార్లు ఉండగా, నంద్యాలలో 15కు గాను రెండు రోడ్‌సైడ్, కర్నూలులో 18కి గాను 12 రోడ్‌సైడ్ ఉన్నట్లు గుర్తించారు. వారంతా కూడా చివరిగా ప్రభుత్వం తీసుకునే నిర్ణయం కోసం ఎదురు చూస్తుండటంతో కొత్త దుకాణాల ఏర్పాటు గందరగోళంగా మారింది. ఎంఆర్పీ అమలయ్యేనా? ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా మద్యం వ్యాపారులు గరిష్ట చిల్లర ధర కంటే అదనపు ధరకు మద్యం విక్రయించి సొమ్ము చేసుకున్నారు. నెల రోజుల క్రితం వరకు సీసాపై రూ.20 వరకు అదనంగా దోపిడీ చేశారు. జూలై 1 నుంచి ఏర్పాటు కానున్న కొత్త దుకాణాల ఫీజులు భారీగా తగ్గనున్నాయి. ఈసారైనా మద్యం వ్యాపారులు ఎంఆర్పీకి విక్రయిస్తారా లేక మళ్లీ సిండికేట్ల రూపంలో అదనపు ధరలతో దోచుకోవడం మొదలు పెడతారా అనే విషయం చర్చనీయాంశంగా మారింది. -
రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి
– మృతుల్లో ఒకరికి వచ్చే నెలలో పెళ్లి – ముగ్గురుకి తీవ్ర గాయాలు - కర్నూలు వెంకటరమణ కాలనీ మలుపు వద్ద దుర్ఘటన కర్నూలు : కర్నూలు శివారులోని వెంకటరమణ కాలనీ మలుపు వద్ద జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు మృతిచెందగా, మరో ముగ్గురు తీవ్ర గాయాలకు గురై ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్యాలకుర్తి గ్రామానికి చెందిన శ్రీనివాసరెడ్డి(28), భరత్‌రెడ్డి(28), గూడూరు మండలం గుడిపాడు గ్రామానికి చెందిన రాజశేఖర్‌రెడ్డి(30) ప్రమాదంలో అక్కడికక్కడే మృతిచెందగా, డోన్ మండలం చింతలపేట గ్రామానికి చెందిన రమణారెడ్డి, కర్నూలులోని వెంకటరమణ కాలనీకి చెందిన గోపాల్‌రెడ్డితో పాటు టాటా ఏసీ పార్సిల్ సర్వీస్ డ్రైవర్ మహావీర్ గాయాలకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రమాదంలో మృతిచెందిన ముగ్గురితో పాటు గాయాలకు గురైన గోపాల్‌రెడ్డి, రమణారెడ్డిలు సమీప బంధువులు. కేఎ 53 ఎంబి 1307 కారులో ఆదివారం ఉదయం గోనెగండ్ల మండలం వేముగోడుకు వెళ్లి అక్కడ కౌలుకు భూమి తీసుకునేందుకు రైతులతో మాట్లాడి సాయంత్రం తిరుగు ప్రయాణమయ్యారు. ఏరువాక పున్నమి కరీ పండుగ సందర్భంగా రాత్రి ప్యాలకుర్తి గోడౌన్ దగ్గర డిన్నర్ ముగించుకుని కర్నూలుకు బయలుదేరారు. రాత్రి 1:30 గంటల సమయంలో వెంకటరమణ కాలనీ మలుపు వద్ద వాహనం ప్రమాదానికి గురైంది. హైదరబాద్ నుంచి బెంగుళూరుకు వెళ్తున్న పార్సిల్ సర్వీసు టాటా ఏసీ కేఏ 01 ఏఈ 3907 వేగంగా వచ్చి ఢీకొట్టడంతో కారులో ఉన్న ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. పార్సిల్ సర్వీసు వాహనం డ్రైవర్‌తో పాటు కారులో ఉన్న ఇద్దరు గాయాలకు గురయ్యారు. రెండు వాహనాలు కూడా రోడ్డుకు ఇరువైపులా బోల్తా పడి నుజ్జునుజ్జు అయ్యాయి. వచ్చేనెలలో పెళ్లి.. శ్రీనివాసరెడ్డి ఎంబీఏ, భరత్‌రెడ్డి, రాజశేఖర్‌రెడ్డిలు డిగ్రీ వరకు చదువుకున్నారు. శ్రీనివాసరెడ్డికి దేవనకొండ మండలం మాసాపురంలో పెళ్లి నిశ్చయమయ్యింది. వచ్చే నెల 11, 12 తేదీల్లో వివాహం జరిపించేందుకు కోడుమూరులో కళ్యాణ మండపం కూడా ఖరారు చేసుకున్నారు. కర్నూలులోని బాలాజీనగర్‌లో నివాసముంటూ చోల మండలం ఫైనాన్స్‌లో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్నాడు. రాజశేఖర్‌రెడ్డి భార్య సుస్మిత, కూతురు సాయి అశ్రితతో కలసి సంతోష్‌నగర్‌లో ఉంటూ ఫైనాన్స్ వ్యాపారం నిర్వహిస్తున్నాడు. భరత్‌రెడ్డి బాలాజీనగర్‌లోని ఓ అపార్ట్మెంట్లో నివాసముంటూ క్యాబ్ డ్రైవర్‌గా జీవనం సాగిస్తున్నాడు. ప్రమాదం జరిగిన వెంటనే నాలుగో పట్టణ పోలీసులు అక్కడికి చేరుకుని 108 వాహనం ద్వారా క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్సలు చేయించారు. మృతదేహాలను మార్చురీ కేంద్రానికి తరలించి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. సోమవారం ఆసుపత్రి వద్దకు కుటుంబ సభ్యులు, బంధువులు పెద్ద ఎత్తున తరలివచ్చి కన్నీరుమున్నీరయ్యారు. ఆసుపత్రి ప్రాంగణంలో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. కోడుమూరు నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి విష్ణువర్దన్‌రెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి కోట్ల హర్షవర్దన్‌రెడ్డి మార్చురీ కేంద్రానికి వచ్చి మృతదేహాలను పరిశీలించి వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు. నాలుగో పట్టణ సీఐ నాగరాజరావు ఆధ్వర్యంలో ఎస్ఐ కిరణ్ కేసు నమోదు చేసుకుని ప్రమాద సంఘటన పూర్వాపరాలపై దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రతిపాదనలు సిద్ధం చేయండి
- హైవేల అభివృద్ధిపై కలెక్టర్ - సంబంధిత అధికారులతో సమీక్ష కర్నూలు(అగ్రికల్చర్): కర్నూలు నుంచి దోర్నాల, అనంతపురం నుంచి గిద్దలూరు వరకు రోడ్డు విస్తరణకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్.సత్యనారాయణ ఆదేశించారు. ఇందుకు సంబంధించి కాన్ఫరెన్స్ హాల్లో శుక్రవారం హైవే అథారిటీ, రోడ్లు భవనాల శాఖ అధికారులు, రెవెన్యూ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. కర్నూలు నుంచి నందికొట్కూరు, ఆత్మకూరు, దోర్నాల వరకు ఎన్‌హెచ్-340సీ, అనంతపురం నుంచి కొలిమిగుండ్ల, అవుకు, బనగానపల్లి, గోస్పాడు, శిరువెల్ల, మహానంది, నంద్యాల మీదుగా గిద్దలూరు వరకు ఎన్‌హెచ్- 544డీ నెంబరుతో నాలుగు లైన్ల రోడ్డు వేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. ఇప్పటికే సిద్ధం చేసిన ప్రతిపాదనలకు తగిన మార్పులు చేర్పులు చేయాలన్నారు. బైపాస్ రోడ్లు వేసేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. కర్నూలు నుంచి గార్గేయపురం, బ్రాహ్మణకొట్కూరు, నందికొట్కూరు, ఆత్మకూరుకు బైపాస్ రోడ్డు నిర్మాణానికి రెండు రకాల ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. అనంతపురం నుంచి గిద్దలూరు, కర్నూలు నుంచి దోర్నాల వరకు ఎన్‌హెచ్ రోడ్ల నిర్మాణానికి అవసరమైన అటవీ భూములపై గతంలో ఉన్న ప్రతిపాదనలనే పరిశీలించాలని సూచించారు. అలైన్‌మెంటు ప్రతిపాదనల్లో విద్యుత్ లైన్లు, ఆర్డబ్ల్యూఎస్ పైప్లైన్లను చేర్చాలన్నారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ ప్రసన్న వెంకటేష్, డీఆర్ఓ గంగాధర్‌గౌడు, నేషనల్ హైవే పీడీ చంద్రశేఖర్‌రెడ్డి, ఆర్ అండ్‌బీ ఎస్ఈ శ్రీనివాసరెడ్డి, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ హరిబాబు, నంద్యాల, ఆత్మకూరు డీఎఫ్ఓలు శివప్రసాద్, సెల్వమ్, నంద్యాల ఆర్డీఓ రాంసుందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ప్రాణం తీసిన వేగం
రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి శిరివెళ్ల: వేగం ఓ యువకుడి ప్రాణం తీసింది. మండల పరిధిలోని గోవిందపల్లె, కానాలపల్లె మధ్య 18వ జాతీయ రహదారిపై రోడ్డు డివైడర్‌ను ఢీకొని మోటార్ సైకిల్‌పై వెళ్తున్న బి. సుదర్శన్‌రెడ్డి ( 21 )మృతి చెందాడు. నంద్యాల పట్టణం క్రాంతినగర్‌కు చెందిన ఇతను.. మంగళవారం మైదూకూరులో ఉన్న తన పెద్దనాన్నను చూసి తిరిగి రాత్రి మోటార్ సైకిల్‌పై స్వగ్రామానికి వస్తున్నాడు. వేగంగా వస్తూ ప్రమాదంతో తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు ఆటోలో చికిత్స నిమిత్తం నంద్యాల ప్రభుత్వానికి తరలించగా కోలుకోలేక అర్ధరాత్రి దాటాక మృతి చెందాడు. మృతుడు హోటల్ మేనేజ్మెంట్ కోర్సు చేసి ఉద్యోగాన్వేషణలో ఉన్నాడు. మృతుని తమ్ముడు ఓబులరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సుధాకరరెడ్డి తెలిపారు. -
హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం
ఆగి ఉన్న లారీని ఢీకొన్న కారు.. ఐదుగురి దుర్మరణం నందిగామ (షాద్‌నగర్): ఆగి ఉన్న లారీని వెనక నుండి వస్తున్న ఇండికా కారు వేగంగా వచ్చి ఢీ కొట్టడంతో ఐదుగురు వ్యక్తులు దుర్మరణం చెందారు. ఈ సంఘటన గురువారం అర్ధరాత్రి రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం 44వ జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లా సి.గూడూరు మండలం చింతమానుపల్లి గ్రామానికి చెందిన సోమన్న (65), అతని భార్య నర్సమ్మ (55), బంధువు సిద్ధమ్మ (50), సోమన్న కొడుకు సోమేశ్ (45) హైదరాబాద్‌లోని శేరిలింగంపల్లి నుండి అద్దెకు తీసుకున్న టాటా ఇండికా కారులో గురువారం అర్ధరాత్రి స్వగ్రామమైన కర్నూలు జిల్లాకు బయలు దేరారు. ఈ కారు నందిగామ మండలంలోని 44వ నెంబర్ జాతీయ రహదారిపై వెళుతుంది. ఈ సమయంలో ఎంఎస్ఎన్ పరిశ్రమ సమీపంలో మరమ్మత్తుల కారణంగా లారీ ఆగిపోయి ఉంది. వెనక నుంచి అతివేగంగా వస్తున్న ఇండికా కారు లారీని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇండికా కారు లారీ కిందికి సగభాగం వరకు దూసుకపోయింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న నలుగురితో పాటు రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం కమ్మెట గ్రామానికి చెందిన కారు డ్రైవర్ మల్లేశ్ (35) కూడా దుర్మరణం చెందాడు. కొడుకును చూడటానికి వచ్చి అనంతలోకాలకు.. సోమేశ్ హైదరాబాద్‌లోని శేరిలింగంపల్లి సమీపంలో మేస్త్రీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. వారి తల్లిదండ్రులు సోమన్న , నర్సమ్మ ఈ నెల 10న కొడుకును చూడటానికి హైదరాబాద్ వచ్చారు. గురువారం ఉదయం సోమన్న ప్రమాదవశాత్తు కొడుకు ఇంట్లో కింద పడగా కాలు విరిగింది. సమీపంలోని ఓ ఆసుపత్రికి తీసుకెళ్లగా అక్కడ వైద్య ఖర్చులు అధికంగా అవుతాయని వైద్యులు చెప్పడంతో సోమన్నను స్వగ్రామానికి తరలించి చికిత్స చేయించాలని కుటుంబ సభ్యులు భావించారు. దీంతో వీరి కుటుంబ సభ్యులందరూ కారును అద్దెకు తీసుకొని అర్ధరాత్రి స్వగ్రామానికి వెళ్తూ ప్రమాదానికి గురై దుర్మరణం పాలయ్యారు. కారులో ఇరుక్కుపోయిన మృతదేహాలు గురువారం రాత్రి 11.30 గంటలకు అతివేగంగా వెళుతున్న ఇండికా కారు ఆగిఉన్న లారీని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో మృతదేహాలు కారులో ఇరుక్కుపోయాయి. మృతదేహాలను వెలికి తీయడానికి పోలీసులకు రెండు గంటల సమయం పట్టింది. చివరికి క్రేన్ సహాయంలో కారును తొలగించి మృతదేహాలను బయటికి తీసి శవ పరీక్షల నిమిత్తం షాద్‌నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పార్కింగ్ లైట్లు వేయక పోవడమే.. ప్రమాదానికి కారణమా..? 44వ నెంబరు జాతీయ రహదారిపై గురువారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదానికి ప్రధాన కారణం ఆగీ ఉన్న లారీనే. లారీ హైదరాబాదు నుంచి కర్నూలు వైపునకు వెళ్తుండగా నందిగామ శివారులోని ఎంఎస్ఎన్ పరిశ్రమ సమీపంలో ఇంజన్లో సమస్య తలెత్తింది. దీంతో లారీ రోడ్డుపైనే ఆగిపోయింది. కనీసం అక్కడ పార్కింగ్ లైట్లు కూడా వేయలేదు. దీంతో లారీ కనిపించకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని స్థానికులు భావిస్తున్నారు. మృతుల కుటుంబ సభ్యులు హైదరాబాద్, కర్నూలు నుండి షాద్‌నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలివచ్చారు. బంధువులు, కుటుంబ సభ్యుల రోదనలతో ఆసుపత్రి ఆవరణలో విషాయఛాయలు నెలకొన్నాయి. కమ్మెటలో విషాదం నందిగామ వద్ద రోడ్డు ప్రమాదంలో కారుడ్రైవర్ మల్లేశ్ దుర్మరణం చేవెళ్ల: నందిగామ వద్ద గురువారం అర్ధరాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన డ్రైవర్ మల్లేశ్ స్వగ్రామం కమ్మెటలో శుక్రవారం విషాదచాయలు అలుముకున్నాయి. ఆగిఉన్న లారీని కారు ఢీకొట్టిన ప్రమాదంలో ఐదుగురు వ్యక్తులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో మరణించిన కారు డ్రైవర్ రావులపల్లి మల్లేశ్(35)ది చేవెళ్ల మండలం కమ్మెట. గ్రామానికి చెందిన రావులపల్లి ఎల్లయ్య చిన్న కుమారుడైన మల్లేశ్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. నాలుగేళ్ల కిత్రం లింగంపల్లికి వెళ్లి కుటుంబంతో అక్కడే ఉంటున్నాడు. సొంతంగా ఇండికా కారు తీసుకొని దానిని నడుపుకుంటూ జీవిస్తున్నాడు. గురువారం లింగంపల్లి నుంచి కర్నూలు జిల్లా గూడురుకు కిరాయి రావటంతో కారులో ఐదుగురుని ఎక్కించుకొని వెళ్తుండగా నందిగామ వద్ద జరిగిన ప్రమాదంలో అతడు కూడా మరణించాడు. దీంతో గ్రామంలో విషాదం నెలకొంది. శుక్రవారం ఉదయం కమ్మెట సర్పంచ్ హన్మంత్‌రెడ్డి, కుటుంబసభ్యులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని గ్రామానికి తీసుకు వచ్చి అంత్యక్రియలు చేశారు. మృతునికి భార్య శ్రీలత, ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. -
కారుబోల్తా.. ఇద్దరు మృతి
కేసు విచారణకు వెళ్తూ..మృత్యు ఒడికి - మరో ఇద్దరికి గాయాలు డోన్ టౌన్: ఒక కేసు విచారణ నిమిత్తం వెళ్తూ రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. ఈ ఘటన డోన్ మండలం ఓబులాపురం మెట్టవద్ద 44వ నెంబర్ జాతీయ రహదారిపై బుధవారం ఉదయం 6గంటలకు చోటు చేసుకుంది. బెంగళూరు హెచ్‌సీఎల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక కేసు విచారణ నిమిత్తం ఫిర్యాదు దారుడు జయన్నతో పాటు కానిస్టేబుల్ సురేష్‌ను వెంట తీసుకొని ఎస్ఐ శ్రీనివాసులు.. కేఏ 53పీ 9799 అనే ఇన్నోవా వాహనంలో హైదరాబాద్‌కు వెళ్తున్నారు. డ్రైవర్ మంజునాథ్ నిద్రమత్తు కారణంగా, అత్యంత వేగంతో కారు నడపడంతో ఓబులాపురం వద్ద ప్రమాద సూచిక రాళ్లను ఢీకొట్టి అది బోల్తాపడింది. ప్రమాదంలో కానిస్టేబుల్ సురేష్ (29), జయన్న (28) అక్కడిక్కకడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన ఎస్ఐ శ్రీనివాసులు , కారు డ్రైవర్ మంజునాథ్‌ను చికిత్స నిమిత్తం డోన్ ప్రజావైద్యశాలకు తరలించారు. విషయం తెలిసిన వెంటనే డోన్ రూరల్ ఎస్ఐ రామసుబ్బయ్య ఘటన స్థలానికి చేరుకున్నారు. మృతుల కుటుంబాలకు సమాచారం అందించి వారి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం డోన్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. క్షతగాత్రుల బంధువులకు కూడా సమాచారం ఇచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. సంఘటనా స్థలాన్ని సీఐ శ్రీనివాసులు గౌడ్ పరిశీలించి క్షతగాత్రులను పరామర్శించారు. మృతుల్లో కానిస్టేబుల్ అవివాహితుడు కాగా జయన్నకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు డోన్ రూరల్ ఎస్ఐ రామసుబ్బయ్య తెలిపారు. -
రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి
కర్నూలు : కర్నూలు శివారులోని జాతీయ రహదారిపై మహీంద్రా షోరూమ్‌కు ఎదురుగా జరిగిన రోడ్డు ప్రమాదంలో వడ్డెగేరికి చెందిన మగ్బూల్ బాషా కుమారుడు ముల్లా ఇమ్రాన్ బాషా(34) అక్కడికక్కడే మృతిచెందాడు. ఇతను శరీన్‌నగర్‌లో ఉన్న బ్లూబర్డ్ వాటర్ ప్యూరిఫై కంపెనీలో సేల్స్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్నాడు. బుధవారం ఉదయం 10 గంటల సమయంలో ఆఫీసు నుంచి ఏపీ21 క్యూ 4756 ద్విచక్ర వాహనంపై సంతోష్‌నగర్ వైపు వెళ్తుండగా ఎదురుగా కారు వేగంగా వచ్చి ఢీకొట్టింది. దీంతో అతను రోడ్డుపై కింద పడి అక్కడికక్కడే మృతిచెందాడు. ఈయనకు 2013లో పెళ్లి అయింది. ఇద్దరు సంతానం. భార్య ప్రస్తుతం ఆరు నెలల గర్భవతి. ప్రమాద విషయం తెలిసిన వెంటనే కుటుంబ సభ్యులు సంఘటనా స్థలానికి చేరుకుని కన్నీరుమున్నీరయ్యారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు నాల్గో పట్టణ సీఐ నాగరాజరావు తెలిపారు. -
ఒకటి కాదు ఏకంగా 12 సింహాలు వచ్చాయి..
న్యూఢిల్లీ: రోడ్డుపై అకస్మాత్తుగా ఓ సింహం ప్రత్యక్షమైతే ఎలా ఉంటుంది? జనం భయంతో పరుగులు పెడతారు..! అలాంటిది ఏకంగా 12 సింహాలు గుంపుగా వస్తే..!? పరిస్థితిని ఊహించలేం కదూ..! గుజరాత్‌లోని ఓ హైవేపై ఈ దృశ్యం ఆవిష్కృతమైంది. పిపవావ్-రాజుల హైవేను దాటి మరోవైపు వెళ్లేందుకు అటవీ ప్రాంతం నుంచి 12 సింహాలు గుంపుగా వచ్చాయి. వీటిని చూడగానే కొందరు వాహానదారులు భయపడగా.. మరికొందరు యువకులు ధైర్యం చేసి మొబైల్ ఫోన్లతో ఫొటోలు, వీడియోలు తీసేందుకు ఉత్సాహం చూపారు. గత శనివారం రాత్రి జరిగిన ఈ సంఘటనను ఓ డ్రైవర్ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. హైవేపై ట్రాఫిక్ ఎక్కువగా ఉండటంతో సింహాలు రోడ్డు దాటేందుకు కొంత సమయం పట్టింది. సింహాలు మొదట హైవేపైకి రాగానే ఓ వైపు లేన్లలో వాహానాలను ఆపివేశారు. కాగా హైవేపై డివైడర్ ఎత్తుగా ఉండటంతో అటుపక్క లేన్లలో వస్తున్న వారికి సింహాలు కనపడకపోవడంతో వాహనాలను ఆపలేదు. సింహాలు నెమ్మదిగా డివైడర్ ఎక్కి రోడ్డు దాటేందుకు ప్రయత్నించగా, అటువైపు వస్తున్నవారు వాహనాలను ఆపి అవి వెళ్లేందుకు దారి ఇచ్చారు. సింహాలు రావడంతో హైవేపై దాదాపు 15 నిమిషాల పాటు ట్రాఫిక్ ఆగిపోయింది. సింహాలన్నీ రోడ్డు దాటిన తర్వాత ట్రాఫిక్ క్లియరైంది. కాగా ఓ సింహం రోడ్డు దాటలేక వెనక్కు వెళ్లిపోయింది. గతంలో ఈ ప్రాంతంలో రోడ్డు, రైల్వే లైన్ దాటుతూ చాలా సింహాలు ప్రమాదాల్లో మరణించాయి. -
మద్యం దుకాణాలు వద్దంటూ ర్యాలీ
నంద్యాల: తమ ప్రాంతంలో మద్యం దుకాణాలు వద్దంటూ నంద్యాల పట్టణంఓని పద్మావతి నగర్ మహిళలు సోమవారం ర్యాలీ నిర్వహించారు. కాలనీలో సగం భాగం పైగా నివాస గృహాలు, కాలేజీలు, ఆసుపత్రులు, స్టేడియం ఉన్నాయి. కాలనీలో అక్కడక్కడ ఉన్న ఖాళీ స్థలాల్లో మద్యం షాపులను పెట్టడానికి ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. టీడీపికి చెందిన మాజీ మంత్రి అనుచరులకు కూడా మద్యం షాపు ఏర్పాటుకు ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో స్థానికులు గెలివి రామకృష్ణ, బాచంనాగేశ్వరరెడ్డి, నెరవాటి నందబాబు ఆధ్వర్యంలో పద్మావతినగర్ పార్కులో సమావేశమయ్యారు. అనంతరం పద్మావతినగర్ సెంటర్ వరకు ప్లకార్డులు ప్రదర్శిస్తూ ర్యాలీ నిర్వహించారు. అనంతరం రాస్తారోకో చేసి ట్రాఫిక్‌ను స్తంభింపజేశారు. నివాస గృహాల మధ్య మద్యం షాపుల ఏర్పాటుకు అనుమతి ఇవ్వరాదని వారు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆందోళనలో శేషిరెడ్డి, డాక్టర్ చంద్రశేఖర్, డాక్టర్ తారకేష్, డాక్టర్ జఫరుల్లా, న్యాయవాదులు సత్యం, గోళ్ల జయకృష్ణ, బీజేపీ నేతలు పెసల శ్రీకాంత్, నిమ్మకాయల సుధాకర్, లయన్స్‌క్లబ్ ప్రతినిధులు కశెట్టి చంద్రశేఖర్, కశెట్టి వేణుగోపాల్, గెలివి చక్రవర్తి, ఏపీయూడబ్ల్యూజే జిల్లా ఉపాధ్యక్షుడు శ్యాంసుందర్‌లాల్ పాల్గొన్నారు. -
మద్యం దుకాణం.. కాలనీల్లో దుమారం
- 500 మీటర్ల ఆంక్షలతో విక్రయదారులు ఉరుకులు..పరుగులు - ప్రత్యామ్నాయలో భాగంగా సమీప కాలనీ వైపు చూపు – సంసారల మధ్య వద్దంటూ మహిళల ఆందోళన – భగవాన్‌నగర్, ఇండస్ట్రీయల్ ఎస్టేట్‌లో చీపుర్లతో నిరసన కర్నూలు: మద్యం వ్యాపారుల్లో అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలు గుబులు పుట్టిస్తున్నాయి. ఆరు నెలల క్రితం వరకు 100 మీటర్లకే ఉన్న ఆంక్షలు కాస్త 500 మీటర్లకు చేరడంతో కొత్త ఇలాకాల్లో దుకాణాల ఏర్పాటుకు విక్రయదారులు వెతుకులాటలో ఉన్నారు. అయితే సంసారాల మధ్య మద్యం దుకాణాలు వద్దు అంటూ మహిళలు చాలా కాలనీల్లో నిరసన వ్యక్తం చేస్తున్నారు. కర్నూలు నగరంలో జాతీయ రహదారి పక్కన ఉన్న కల్లూరు చెన్నమ్మ సర్కిల్ పరిధిలోని మద్యం దుకాణాలను ఇతర ప్రాంతాలకు తరలించేందుకు వ్యాపారులు సన్నద్దం కాగా, కల్లూరు ఎస్టేట్ పరిధిలోని భగవాన్‌నగర్, పోలీస్ కాలనీ, ఇండస్ట్రీయల్ ఎస్టేట్, గ్రామ స్వరాజ్య సంఘం కాలనీ వాసులు కొంత కాలంగా అడ్డుకుంటున్నారు. ఒక్కొక్క దుకాణానికి లక్ష రూపాయల దాకా బాడుగ ఇస్తామని చెప్పి ఒప్పందం కుదుర్చుకుంటున్నప్పటికీ స్థానికంగా నివాసం ఉండే కుటుంబాల వారు నిరసన వ్యక్తం చేస్తున్నారు. జాతీయ రహదారులకు 500 మీటర్లలోపు మద్యం విక్రయాలను నిషేధిస్తూ సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలతో మద్యం వ్యాపారులు ప్రత్యామ్నాయ మార్గాలను వెతుక్కుంటున్న నేపథ్యంలో నిరసనలు మొదలయ్యాయి. దిక్కుతోచని స్థితిలో వ్యాపారులు జిల్లాలో మొత్తం 203 మద్యం దుకాణాలు, 32 బార్లు ఉన్నాయి. అందులో 164 దుకాణాలు, 16 బార్లు జాతీయ రహదారులకు 100 మీటర్ల దూరంలోనే ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వాటి నిర్వాహకులకు ఎక్సైజ్ అధికారులు ఇప్పటికే నోటీసులు ఇచ్చారు. ఆంక్షల పరిధిలో ఉన్న దుకాణాలు, బార్లను ఇతర ప్రాంతాలకు తరలించాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో కొత్త కాలనీలకు దుకాణాలను తరలించే పనిలో మద్యం వ్యాపారులు ఉన్నారు. అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలు కావడంతో కచ్చితంగా అమలు చేసేందుకు ఎక్సైజ్ అధికారులు పట్టుదలగా ఉన్నారు. సంసారాల మధ్య మద్యం దుకాణాలను ఏర్పాటు చేసేందుకు కాలనీ మహిళలు నిరసన వ్యక్తం చేస్తుండటంతో ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితిలో కొంతమంది వ్యాపారులు కొట్టుమిట్టాడుతున్నారు. భగవాన్ నగర్, పోలీసు కాలనీ వాసులు మద్యం దుకాణాలను అడ్డుకోవడం కోసం ప్రత్యేకంగా ఓ కమిటీని కూడా ఏర్పాటు చేశారు. కల్లూరులోని పారిశ్రామిక వాడలో తమ ఇళ్ల మధ్య మద్యం దుకాణం వద్దంటూ ఆదివారం చీపుర్లతో నిరసన వ్యక్తం చేశారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొనడంతో అటు వ్యాపారులకు, ఇటు ఎక్సైజ్ అధికారులకు సమస్య మింగుడు పడని విధంగా మారింది. ఏప్రిల్ నుంచి కొత్త మద్యం లైసెన్సులు: సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు జాతీయ రహదారుల పక్కన 500 మీటర్ల దూరంలో మద్యం షాపులు ఉండాలన్న నిబంధనలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్ 1 నుంచి కొత్త మద్యం పాలసీ తీసుకరానుంది. ఈ మేరకు మద్యం షాపుల యజమానులకు కొత్త లైసెన్సులు జారీ చేసే విషయంలపై ఇటీవల విజయవాడలో ఆశాఖ మంత్రి కమిషనర్‌తో సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో కర్నూలు డివిజన్ పరిధిలో 86, నంద్యాల డివిజన్ పరిధిలో 77 షాపులు జాతీయ రహదారుల పక్కనున్నట్లు గుర్తించి వాటికి నోటీసులు కూడా జారీ చేశారు.మిగితా 40 షాపులు మాత్రం యథావి«ధిగా కొనసాగుతాయి. వీటికి మాత్రం జూన్ వరకు లైసెన్సులు కొనసాగించాలని, 163 దుకాణాల మాత్రం ఏప్రిల్ 1వ తేదీ నుంచి కొత్త లైసెన్సులు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. జాతీయ రహదారి పక్కనున్న దుకాణాలను ప్రత్యామ్నాయ కాలనీల్లో ఏర్పాటు చేయడానికి మహిళల నుంచి నిరసన వెల్లువెత్తుతుండటంతో ఎక్సైజ్ అధికారులకు తలనొప్పిగా మారింది. -
అక్కడే ఎందుకో?
హైవేల్లోని ప్రమాద స్థలాల పరిశీలన రెండు అధికారుల బృందాల సర్వే రోడ్డు ప్రమాదాలకు అనేక కారణాలు ఉంటాయి. అయితే ఒకే ప్రాంతంలో పదే పదే రోడ్డు ప్రమాదాలు జరుగుతూ ప్రాణనష్టం జరుగుతుంటే.. అక్కడ ప్రమాదాలు ఎందుకు అవుతున్నాయన్న విషయాన్ని తెలుసుకుని వాటి నివారణకు చర్యలు చేపట్టాలి్సందే. ఈ కోణంలోనే జిల్లాలోని జాతీయ, రాష్ట్ర రహదారుల్లో తరచూ ప్రమాదాలు సంభవిస్తున్న ప్రదేశాలను గుర్తించి పరిష్కార మార్గాలు చూపే దిశగా ఓ సమగ్ర సర్వే జరిగింది. రాష్ట్ర డీజీపీ సాంబశివరావు ఆదేశాల మేరకు రాష్ట్రంలోని జాతీయ, రాష్ట్ర రహదారులపై ఈ సర్వే ఈ నెల 11 నుంచి మొదలై ఆదివారంతో ముగిసింది. ఈ సర్వే వివరాలు ఇలా ఉన్నాయి. అమలాపురం టౌన్ : జిల్లాలోని జాతీయ, రాష్ట్ర రహదారుల్లో వారం రోజులుగా అధికారుల రెండు సర్వే బృందాలు విస్తృతంగా పర్యటించి ప్రమాదాల ప్రదేశాలను, కారణాలను, పరిష్కారాలను కనుగొన్నాయి. డీఎస్పీ స్థాయి అధికారి, మోటారు వెహికల్ ఇ¯ŒSస్పెక్టర్ (ఎంవీఐ), ఆర్అండ్బీ ఇంజినీరు, స్థానిక పోలీసు అధికారులు ఈ బృందాల్లో సభ్యులుగా ఉన్నారు. జిల్లాలో సమగ్ర సర్వేను ఆదివారం సాయంత్రానికి పూర్తి చేశాయి. ఒక బృందంలో కాకినాడ మహిళా విభాగం డీఎస్పీ వి.విజయారావు, కాకినాడ ఎంవీఐ దుర్గావిఠల్, ఆర్అండ్బీ ఇంజినీరు నరసింహరావు ఉన్నారు. మరో బృందంలో కాకినాడ ట్రాఫిక్ డీఎస్పీ కేవీవీ సత్యనారాయణ ఆధ్వర్యంలో సర్వే నిర్వహించారు. పరిష్కార మార్గాలు సూచించే ఈ సర్వే నివేదికలు డీజీపీకి అందజేస్తారు. వంద మీటర్లు.. మూడు ప్రమాదాలు.. మూడు ప్రాణాలు సర్వే నిర్వహణకు కొన్ని పరిమితులతో శాస్త్రీయంగా నిర్వహించారు. జాతీయ లేదా రాష్ట్ర రోడ్డులో ఎక్కడైనా ఏడాది కాలంలో వంద మీటర్ల రోడ్డు పరిధిలో వరుసగా మూడు రోడ్డు ప్రమాదాలు జరిగి కనీసం ముగ్గురు... ఆ పైన వ్యక్తులు చనిపోతే... అలాంటి చోట్ల మరింతగా పరిశీలన చేశారు. అసలు అక్కడే ఇన్ని ప్రమాదాలు... ఇంతమంది చనిపోవడానికి కారణాలను కూడా ఐదు కోణాల్లో సర్వే పత్రాల్లో నమోదు చేశారు. రోడ్డు సరిగా లేకపోవటమా? మానవ తప్పదమా? (నిర్లక్ష్య డ్రైవింగ్) వాహన లోపమా? రోడ్డు నిబంధనలు పాటించకపోవడమా? రోడ్డు మార్జిన్లు ఆక్రమణలకు గురై రోడ్డు ఇరుకుగా ఉండటం వల్లా? ఈ కారణాలపై బృందాలు అధ్యయనం చేశాయి. ఉదాహరణకు అమలాపురం రూరల్ మండలం ఈదరపల్లి శివారు ఆర్ఆర్ నగర్ వద్ద స్టేట్ హైవే 104 రోడ్డులో వంద మీటర్ల పరిధిలో గత ఎనిమిది నెలల్లో మూడు రోడ్డు ప్రమాదాలు జరిగి ముగ్గురు మృత్యువాత పడ్డారు. డీఎస్పీ విజయారావు ఆధ్వర్యంలోని సర్వే బృందం పట్టణ సీఐ వైఆర్కే శ్రీనివాస్‌తో కలసి ఆదివారం మధ్యాహ్నం గంటకు పైగా ఆ రోడ్డుపై ఉండి వాహనాలు రాకపోకలు... వేగం.. పరిశీలించారు. వివరాలను సర్వే పత్రాల్లో నమోదు చేశారు. ఇవీ డేంజర్ స్పాట్లు.. ఈ రెండు బృందాలు జిల్లాలోని జాతీయ, రాష్ట్ర రహదారుల్లో దాదాపు 130 చోట్ల రోడ్డు ప్రమాదాలపై సర్వేతో అధ్యయనం చేసింది. జిల్లాలో అడ్డతీగల, రంగంపేట, పి.గన్నవరం నుంచి గంటి రోడ్డు (కాలువ పక్క రోడ్డు), ఐ.పోలవరం మండలం కొమరిగిరి మలుపు (216 హైవే) రోడ్లపై ఒకేచోట పలు ప్రమాదాలు జరిగి ప్రాణ నష్టాలు వాటిల్లినట్టు గుర్తించాయి. జాతీయ రహదారిలో జగ్గంపేట, రాజానగరం–కాకినాడ రోడ్డు (ఏడీబీ)పై ప్రమాదాల తీవ్రత ఎక్కువగా ఉన్నట్టు బృందం నిర్ధారించింది. ఇవీ వైఫల్యాలు.. ఈదరపల్లి ఆర్ఆర్ నగర్ వద్ద ఈ వంద మీటర్ల రోడ్డు కొద్ది దూరంలో చిన్నపాటి మలుపు ఉండడాన్ని గుర్తించారు. స్టేట్ హై వేలు ఏడు మీటర్ల వెడుల్పు ఉండాల్సి ఉంది. అయితే ఇక్కడ ఐదున్నర మీటర్ల వెడుల్పు మాత్రమే ఉంది. రోడ్డు మధ్యలో సెంట్రల్ లై¯ŒS (తెల్లటి రంగుతో ఉండే లై¯ŒS) రోడ్డుపై లేదు. రోడ్డుకు ఓ పక్క మార్జి¯ŒS లేకుండా మట్టిగుట్టలు ఉన్నాయి. దీని వల్ల వాహనాలు ఎదురెదురుగా వచ్చినప్పుడు రోడ్డు మార్జి¯ŒSలోకి వచ్చే వీలు లేదు. వీటి వల్ల తరుచూ ప్రమాదాలు జరుగుతున్నాయన్న అంచనాకు సర్వే బృందం వచ్చినట్టు తెలిసింది. ఈ విషయాలపై ఆర్అండ్బీ ఇంజినీరును సర్వే బృందం గుచ్చిగుచ్చి ప్రశ్నించింది. రోడ్డుకు ఉండాల్సిన కొన్ని నిబంధనలు ఇక్కడ అమలు కాలేదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. -
హైవే.. నోవే!
► జాతీయ, రాష్ట్ర రహదారులకు దూరంగా మద్యం షాపులు ► ఏ మద్యం షాపైనా 500 మీటర్ల దూరంలో ఉండాల్సిందే ► మద్యం షాపులపై కొరడా ఝుళిపించిన సుప్రీంకోర్టు మార్కాపురం ప్రాంతంలో ► 144 షాపులకు ముప్పు ఆందోళనలో మద్యం వ్యాపారులు మార్కాపురం: రోడ్డు ప్రమాదాల నివారణే ధ్యేయంగా సుప్రీంకోర్టు మద్యం షాపులపై కొరడా ఝుళిపించింది. గతేడాది నవంబర్‌లో ఇచ్చిన తీర్పును ఈ నెల 31వ తేదీలోపు అమలు చేయాలని ఎక్సైజ్ అధికారులను ఆదేశించటంతో ఒక్కసారిగా మద్యం షాపుల యజమానుల్లో ఆందోళన మొదలైంది. జాతీయ, రాష్ట్ర రహదారికి 500 మీటర్ల దూరంలో మాత్రమే మద్యం షాపులు ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. మార్కాపురం ఎక్సైజ్ సూపరింటెండెంట్ పరిధిలో మార్కాపురం, కంభం, యర్రగొండపాలెం, కనిగిరి, కందుకూరు, సింగరాయకొండ, గిద్దలూరు, దర్శి, పొదిలిలో ఎక్సైజ్ పోలీసుస్టేషన్లు ఉన్నాయి. వీటి పరిధిలో 169 వైన్‌షాపులు నడుస్తున్నాయి. సమీపించిన గడువు సుప్రీంకోర్టు్ట ఆదేశాలతో ప్రస్తుతం రోడ్డుకు దగ్గరలో ఉన్న (సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం) 144 షాపులను జనవాసాలకు దూరంగా ఏర్పాటు చేయాలని ఎక్సైజ్ అధికారులు నిర్ణయించారు. మూడు రోజుల నుంచి జిల్లా వ్యాప్తంగా మద్యం షాపుల యజమానులతో మాట్లాడుతున్నారు. షాపులను అత్యవసరంగా తొలగించాలని ఆదేశించడంతో వ్యాపారులు కలవరపాటుకు గురవుతున్నారు. ఈ నిబంధనల ప్రకారం ప్రతి మండల కేంద్రం రాష్ట్ర, లేదా జాతీయ రహదారికి అనుబంధంగా ఉంది. ఇప్పటి వరకూ ఎక్సైజ్ అధికారులు గుడికి, బడికి 100 మీటర్ల దూరం ఉంటే చాలనే నిబంధన ప్రకారం 2015లో మద్యం షాపులకు లైసె¯Œ్సలు ఇచ్చారు. తాజా నిబంధనలతో పరిస్థితి తారుమారైంది. మార్కాపురం పట్టణంలో 13, దర్శిలో 7, తాళ్లూరులో 4, రాజంపల్లిలో 1, పొదిలిలో 6, దొనకొండలో 3, దోర్నాలలో 3, కంభంలో 5 మద్యం షాపులను రాష్ట్ర రహదారికి దూరంగా ఏర్పాటు చేయనున్నారు. ఈ నెల 31లోపు ప్రక్రియ పూర్తి కావాల్సి ఉంది. 2015లో మద్యం షాపులు దక్కించుకున్న యజమానులు ఏటా ప్రభుత్వానికి షాపు ఆధారంగా రూ.30 నుంచి రూ.45 లక్షల వరకు లైసెన్స్ ఫీజు కింద చెల్లిస్తున్నారు. మార్కాపురం సూపరింటెండెంట్ పరిధిలో ఏటా 60 కోట్ల రూపాయల ఆదాయం వస్తోంది. ఒంగోలు సర్కిల్ నుంచి సుమారు 54 కోట్ల రూపాయల ఆదాయం వస్తోంది. ప్రస్తుతం తిరునాళ్ల సీజన్. ప్రభుత్వ నిబంధనలు అమలు చేస్తే మద్యం షాపులన్నీ ఊరికి దూరంగా ఉంటాయి. తిరునాళ్లకు మద్యం తాగేందుకు శివారు ప్రాంతాలకు ఎవరొస్తారని వ్యాపారులు ప్రశ్నిస్తున్నారు. దోర్నాల, మార్కాపురం, పెద్దారవీడు, త్రిపురాంతకం, కంభం, పొదిలి, దర్శి, కనిగిరి పట్టణాల మీదుగా పలు రాష్ట్ర, జాతీయ రహదారులున్నాయి. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం పట్టణంలో ఉన్న షాపులను కూడా ఊరి బయటకు తరలించాలి్సన పరిస్థితి ఏర్పడింది. సుప్రీం తీర్పు పాటించాల్సిందే ఈ నెల 31వ తేదీలోపు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం రాష్ట్ర, జాతీయ రహదారి పక్కన ఉన్న మద్యం దుకాణాలు తొలగిస్తాం. ఇక నుంచి వ్యాపారులు సుమారు 500 మీటర్ల దూరంలో మద్యం షాపులు ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. నిబంధనలకు వ్యతిరేకంగా యజమానులు వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. ఆర్.హనుమంతురావు, ఎక్సైజ్ సూపరింటెండెంట్, మార్కాపురం. -
వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరి మృతి
ప్యాపిలి: రాచర్ల–ప్యాపిలి రహదారిలో శుక్రవారం జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృతి చెందారు. బోంచెర్వుపల్లి వద్ద ఉన్న ప్రియా సిమెంట్ ఫ్యాక్టరీ నుంచి సిమెంట్ లోడుతో వస్తున్న లారీ మునిమడుగు వద్దకు రాగానే అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో అనంతపురం జిల్లా అమడుగురుకు చెందిన లారీ డ్రైవర్ ప్రతాప్ (40) అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్ర గాయాలకు గురైన లారీ క్లీనర్ మునయ్యను చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. రాచర్ల ఎస్ఐ నరేష్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ట్రాక్టర్ బోల్తా పడి ఒకరి మృతి.. జలదుర్గం పోలీస్‌స్టేషన్ పరిధిలోని గోపాలనగరం మిట్ట వద్ద ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తా పడిన ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. అనంతపురం జిల్లా నుంచి ఇసుక లోడ్‌తో వెళ్తున్న ట్రాక్టర్ గోపాలనగరం మిట్ట వద్దకు రాగానే అదుపు తప్పింది. దీంతో ఇంజన్ నుంచి ట్రాలీ విడిపోయి బోల్తా పడింది. ప్రమాదంలో ట్రాలీలో ఉన్న అనంతపురం జిల్లా పెదపప్పూరు మండలం తురకపల్లికి చెందిన వెంకటరాముడు(35) మృతి చెందాడు. జలదుర్గం ఏఎస్ఐ గోపాల్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
బీరు లారీ బోల్తా
వెల్దుర్తి రూరల్: వెల్దుర్తి పట్టణ సమీపంలోని ఎన్‌హెచ్–44పై తిక్కతాత గుడి సమీపంలోని వంతెనపై బీరు లారీ బోల్తా పడింది. సంగారెడ్డి నుంచి అనంతపురం ప్రైవేటు ఏజెన్సీకి బీరు లోడు లారీ గురువారం రాత్రి బయలు దేరింది. శుక్రవారం ఉదయం 10 గంటల సమయంలో వెల్దుర్తి సమీపంలో వంతెనను ఢీకొనడంతో బోల్తా పడింది. తాడిపత్రికి చెందిన డ్రైవర్ శ్రీనివాసరెడ్డి స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. బాక్స్‌ల్లో ఉన్న బీరు సీసాలు కొన్ని పగిలిపోయాయి. సమాచారం అందుకున్న ఎస్ఐ తులసీ నాగ ప్రసాద్, పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని ట్రాఫిక్‌ను మళ్లించారు. బోల్తా పడిన లారీని పక్కకు తొలగించారు. గాయపడిన డ్రైవర్‌ను 108లో ఆసుపత్రికి తరలించారు. డోన్ ఎక్సైజ్ సీఐ విజయ్‌కుమార్ సాయంత్రం సంఘటన స్థలాన్ని పరిశీలించారు. లారీలోని బాక్స్‌లను మరో లారీలోకి మార్చి ప్రభుత్వ గోడౌన్‌కు తరలించారు. -
600 సెల్ ఫోన్లు చోరీ
వెల్దుర్తి రూరల్ : హైవేలో ప్రయాణిస్తున్న వాహనంలోంచి 600 సెల్ఫోన్లు చోరీ అయిన సంఘటన బుధవారం చోటుచేసుకుంది. ఎస్ఐ తులసీనాగప్రసాద్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. బెంగళూరు నుంచి నాగపూర్‌కు.. కొత్త వీడియోకాన్(కంపెనీ రేటు రూ. 803లు) సెల్ఫోన్లను తరలిస్తున్నారు. డ్రైవర్‌తో పాటు, క్లీనర్, ఎక్స్ట్రా డ్రైవర్ ఉన్నారు. వీరు వెల్దుర్తి మండలం చెరుకులపాడు క్రాస్ వద్ద లారీని పరిశీలించగా.. డోర్ సీల్ లేకపోవడం గమనించారు. డోర్ తెరిచి చూడగా అందులోని 15 బాక్సులు చోరీకి గురైనట్లు గుర్తించారు. దీంతో లాజిస్టిక్స్ ట్రాన్స్పోర్ట్ కంపెనీ ప్రతినిధులకు విషయం తెలిపారు. హైదరాబాద్ నుంచి వచ్చిన ప్రతినిధులు వెల్దుర్తి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. చోరీకి గురైన సెల్ఫోన్ల విలువ రూ.5లక్షలు ఉంటుందని తెలిపారు. -
గుర్తు తెలియని మృతదేహం లభ్యం
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు) : నగరంలోని రాయల్ ఎన్ఫీల్డ్ షో రూం సమీపంలో జాతీయ రహదారికి ఎదురుగా ఆదివారం ఓ గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభించింది. మృతదేహంపై ఎటువంటి గాయాలు లేవు. గుండు చేయించుకొని 35 ఏళ్ల వయస్సు, 5.5 అడుగుల ఎత్తు, నల్లని చర్మంతో ఉన్న వ్యక్తి తెలుపు బనియన్, నీలిరంగు పుల్ డ్రాయర్ ధరించాడు. మృతుడి వివరాలు ఎవరికైనా తెలిస్తే కర్నూలు తాలుకా పోలీసు స్టేషన్ సీఐ సెల్ : 9440795514, 08518220093 నంబర్లలో తెలియజేయాలని పోలీసులు కోరారు. -
జమ్ము-శ్రీనగర్ హైవేలో వన్ వే ట్రాఫిక్
శ్రీనగర్: జమ్మూ-శ్రీనగర్ హైవేలో వాహనాలను శనివారం వన్ వేలో మాత్రమే అనుమతిస్తున్నట్లు ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వెల్లడించింది. రోడ్డు మార్గంలో ప్రతికూల పరిస్థితులు ఉన్నందున ఈ నిర్ణయం తీసుకుంటున్నామని, ఆర్మీ, పారామిలిటరీ బలగాలకు కూడా ఈ నిబంధనలు వర్తిస్తాయని అధికారులు వెల్లడించారు. శ్రీనగర్ నుంచి జమ్మూ వైపు ప్రయాణించే వాహనాలకు మాత్రమే అనుమతి ఉందన్నారు. కశ్మీర్ లోయకు సరుకుల రవాణాకు ఉపయోగించే ఏకైక మార్గం ఇదే కావడంతో రోడ్డు మూసివేత ప్రజలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. అక్కడ నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. చలికాలంలో కొండచరియలు విరిగిపడటం, మంచు కారణంగా ఈ రోడ్డును అధికారులు మూసివేసి ఉంచారు. ఈ సమయంలో పర్యాటకులు సైతం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. -
రక్తమోడుతున్న రహదారులు
అనంతపురం సెంట్రల్ : జిల్లాలో రహదారులు రక్తమోడుతున్నాయి. ప్రతిరోజూ ఎక్కడో ఒక చోట రోడ్డు ప్రమాదం రూపంలో ప్రజలు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. మరెందరో వికలాంగులుగా తయారవుతున్నారు. జాతీయ రహదారుల వేగాన్ని నియంత్రించలేకపోతుండడంతోనే ఎక్కువశాతం ఈ ప్రమాదాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. రోడ్డు భద్రతా వారోత్సవాల పేరుతో అధికారులు హడావుడి చేస్తున్నా ఆచరణలో ఫలితాలు సాధించలేకపోతున్నారు. 2016 సంవత్సరంలో అధికారికంగా 1394 ప్రమాదాలు జరిగాయి. ఇందులో 637 మంది మృతి చెందగా, 2084 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో సగానికిపైగా వికలాంగులుగా మారారు. 2017 సంవత్సరం ప్రారంభం నుంచి రోడ్డు ప్రమాదాలు మరీ ఎక్కువయ్యాయి. ఇప్పటికే వందకు పైగా ప్రమాదాలు జరిగాయి. ప్రముఖులను పొట్టన పెట్టుకున్న ప్రమాదాలు.. ఈ ఘటనల్లో ప్రముఖులు సైతం ప్రాణాలు కోల్పోయారు. ఇందులో ముఖ్యంగా జేఎన్టీయూ వీసీ ఎంఎంఎం సర్కార్ ఒకరు. బుధవారం పామిడి మండల కేంద్రం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో వీసీతో పాటు ఆయన వ్యక్తిగత సహాయకుడు బాబాఫకృద్దీన్, డ్రైవర్ నాగప్రసాద్ దుర్మరణం చెందారు. వారు ప్రయాణిస్తున్న ఇన్నోవా కారు టైరు పగిలి డివైడర్‌ను దాటుకొని లారీని ఢీకొట్టింది. వీసీ ప్రయాణిస్తున్న కారు వంద కిలోమీటర్లకు పైగా స్పీడుతో వెళుతున్నట్లు అంచనా వేశారు. ఇదే తరహాలోనే ఈ నెల ఐదో తేదీన విధినిర్వహణలో చురుగ్గా ఉండే కానిస్టేబుల్ ప్రేమ్‌కుమార్ (40) కనగానపల్లి మండలం పర్వతదేవరపల్లి సమీపాన స్కార్పియో వాహనం ప్రమాదంలో మృతి చెందారు. ఈ ఘటనలో మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ నెల ఆరో తేదీన బత్తలపల్లి మండలం నల్లబోయనపల్లి సమీపంలో ఆర్టీసీ బస్సును కారు ఢీకొన్న సంఘటనలో గుంతకల్లుకు చెందిన నాగరాజు, మస్తాన్ఖాన్లు మృత్యువాత పడ్డారు. గతేడాది డిసెంబర్లో కర్నూలు జిల్లా డోన్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మాజీ కౌన్సిలర్లు వై.మాధవి, వై.రామ్మోహన్‌రెడ్డి దంపతులతోపాటు వారి కుమార్తె దుర్మరణం చెందారు. ఈ ప్రమాదాలన్నీ అతివేగంతోనే జరిగాయని స్పష్టమవుతోంది. జాతీయ రహదారిపై వేగ నియంత్రిక సాధనాలు లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. కనీసం సూచికబోర్డులు కూడా ఎక్కడా కనిపించవు. ఫలితంగా అనేకమంది ప్రాణాలను పొగొట్టుకుంటున్నారు. -
ఆదిలోనే అడ్డంకులు!
కర్నూలు-మార్కాపురం జాతీయ రహదారిలో మార్పులు? - అటవీ భూముల సేకరణకు లభించని అనుమతి - జిల్లాలో నాలుగు లైన్ల రెండు జాతీయ రహదారుల నిర్మాణం - మొత్తం 29.8 కిలోమీటర్ల అటవీ భూములు అవసరం - ఇప్పటికీ ప్రారంభం కాని సర్వే పనులు అనంతపురం-అమరావతి, కర్నూలు-మార్కాపురం రహదారుల నిర్మాణానికి ఆదిలోని అవాంతరం ఎదురయింది. అటవీ శాఖ భూములు ఇచ్చేందుకు పర్యావరణ శాఖ అనుమతివ్వకపోవడంతో రహదారిలో మార్పులు తప్పవనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇటీవల ఈ నాలుగు లేన్ల గ్రీన్ ఫీల్డ్ హైవే ఎక్స్‌ప్రెస్ జాతీయ రహదారులకు కేంద్రం పచ్చజెండా ఊపినా.. తాజా వ్యవహారం రాష్ట్ర ప్రభుత్వానికి తలనొప్పిగా మారనుంది. కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): జిల్లాలో రెండు నాలుగు లేన్ల గ్రీన్ ఫీల్డ్ హైవే ఎక్స్‌ప్రెస్ జాతీయ రహదారుల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. మొత్తం 150 కిలోమీటర్ల రహదారుల నిర్మాణానికి 1,713 హెక్టార్ల ప్రభుత్వ, ప్రైవేట్ భూమలతో పాటు అటవీ భూమి అవసరం అవుతుంది. ఇందులో 29.8 కిలోమీటర్ల అటవీ భూముల్లో రహదారుల నిర్మాణాలు చేపట్టాల్సి ఉంటుంది. అయితే కేంద్ర పర్యావరణ అటవీశాఖ ఈ భూములను ఇచ్చేందుకు నిరాకరించింది. దీంతో రహదారుల అలైన్మెంట్లో మార్పులు తప్పనిసరి కావచ్చని అధికారులు భావిస్తున్నారు. జిల్లాలో రెండు జాతీయ రహదారుల నిర్మాణానికి చర్యలు జాతీయ రహదారి 44 వెంట ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజధాని హైదరాబాద్‌కు కర్నూలు జిల్లా వాసులు మూడు, నాలుగు గంటల్లో చేరుకునేవారు. అయితే రాష్ట్ర విభజన తర్వాత కొత్త రాజధాని అమరావతికి వెళ్లాలంటే సరైన రహదారులు లేకపోవడంతో 8–10 గంటల సమయం పడుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సీమ జిల్లాల నుంచి అమరావతికి కొత్తగా నాలుగు లైన్ల గ్రీన్ ఫీల్డ్ హైవే ఎక్స్‌ప్రెస్ జాతీయ రహదారి నిర్మాణానికి ప్రణాళిక సిద్ధం చేసింది. అనంతపురం నుంచి కడప.. కర్నూలు, ప్రకాశం జిల్లా మీదుగా అమరావతికి ఈ రహదారి చేరుకుంటుంది. ఎక్కడా మలుపులు లేకుండా రహదారి నిర్మించాలనేది ప్రణాళిక. అలాగే అనంతపురం–అమరావతి రహదారికి అనుసంధానంగా కర్నూలు–మార్కాపురం జాతీయ రహదారిని నిర్మించనున్నారు. ఈ రెండు రహదారులు మార్కాపురం వద్ద అనుసంధానమై అక్కడి నుంచి ఆరు లైన్లుగా అమరావతికి సాగిపోతాయి. ఈ రహదారులు వినియోగంలోకి వస్తే సీమ జిల్లాల నుంచి రాజధాని అమరావతికి నాలుగు గంటల్లో చేరుకునే అవకాశం ఉంటుంది. అనుమతికి కేంద్ర పర్యావరణ అటవీశాఖ నిరాకరణ అనంతపురం–అమరావతి గ్రీన్ ఫీల్డ్ హైవే ఎక్స్‌ప్రెస్ జాతీయ రహదారి జిల్లాలో 71.60 కిలోమీటర్ల వెళ్తుంది. ఈ రహదారి జిల్లాలో కొలిమిగుండ్ల మండలం బుగ్గ వద్ద ప్రవేశించి సంజామల, ఉయ్యాలవాడ, ఆళ్లగడ్డ, రుద్రవరం మండలాల మీదుగా సాగుతుంది. ఇందులో రుద్రవరం మండలంలో 14 కిలోమీటర్ల రహదారి నిర్మాణ పనులకు అటవీ భూములు అవసరం కానున్నాయి. అలాగే కర్నూలు నుంచి మార్కాపురం వరకు కొనసాగే జాతీయ రహదారి కర్నూలు, మిడ్తూరు, జూపాడుబంగ్లా, పాములపాడు, వెలుగోడు మండలాల మీదుగా 78.60 కిలోమీటర్లు సాగుతుంది. ఇందులో వెలుగోడు మండలంలో 15 కిలోమీటర్ల అటవీ భూముల్లో రహదారి నిర్మించాల్సి ఉంది. రెండు రహదారుల్లో మొత్తం 29.8 కిలోమీటర్లు సాగే జాతీయ రహదారులకు అటవీ భూములను ఇచ్చేందుకు కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ అనుమతి నిరాకరించింది. ఈ నేపథ్యంలో రెండు రహదారుల అలైన్మెంట్లో మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా కర్నూలు–మార్కాపురం రహదారి అలైన్మెంట్లో మార్పు తప్పనిసరి అని తెలుస్తోంది. ప్రారంభం కాని సర్వే పనులు అనంతపురం–అమరావతి జాతీయ రహదారి మొత్తం 598 కిలోమీటర్లు సాగుతుంది. ఇందులో కర్నూలు ఫీడర్‌కు సంబంధించి రెండు జాతీయ రహదారుల నిర్మాణానికి మొత్తం 1713 హెక్టార్ల భూమి అవసరం. రూ.7,139 కోట్లతో రెండున్నరేళ్లలో ప్రాజెక్టును పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ఇంతవరకు సర్వే పనులు కూడా పూర్తి కాని పరిస్థితి. కేంద్ర ప్రభుత్వమే ప్రత్యేక బృందాలతో సర్వే చేయించాలి. దీనికి తోడు అటవీ భూములను రహదారుల నిర్మాణానికి ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతివ్వకపోవడం అయోమయానికి గురిచేస్తోంది. అటవీ భూములు ఇచ్చేందుకు అనుమతి నిరాకరణ జిల్లాలో వెళ్తున్న అనంతపురం–అమరావతి, కర్నూలు–మార్కాపురం జాతీయ రహదారుల నిర్మాణానికి అటవీ భూములను ఇచ్చేందుకు కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ అనుమతి నిరాకరించింది. ఈ కారణంగా అలైన్మెంట్లో మార్పులు వచ్చే అవకాశం ఉంది. రెండు రహదారుల్లో 29.8 కిలోమీటర్ల మేర అటవీ భూములు ఉన్నాయి. – నాగరాజు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ -
రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి
కర్నూలు(అర్బన్) : నగర శివారులోని 44వ నంబర్ జాతీయ రహదారిపై మంగళవారం ఉదయం 5 గంటలకు జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఆగి ఉన్న కర్ణాటక రాష్ట్రానికి చెందిన సిమెంట్ లారీని ఐచర్ ఢీకొంది. దీంతో ఐచర్ వాహనంలో నిద్రిస్తున్న కో డ్రైవర్ రవీంద్రరెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. వాహనాన్ని నడుపుతున్న డ్రైవర్ విజయకుమార్ తీవ్రంగా గాయపడ్డాడు. మృతి చెందిన రవీంద్రరెడ్డి ఆలూరు మండలం కమ్మరచేడు గ్రామవాసిగా గుర్తించారు. తాలూకా సీఐ మహేశ్వరరెడ్డి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
హాహాకారాలు..ఆర్తనాదాలు!
- ఓర్వకల్లు వద్ద రోడ్డు ప్రమాదం - లారీని ఢీకొన్న ఆర్టీసీ బస్సు - పదిమందికి తీవ్ర గాయాలు - లారీలో ఇరుక్కుపోయిన డ్రైవర్ - అతికష్టం మీద బయటకు తీసిన స్థానికులు ఓర్వకల్లు : నిత్యం రద్దీగా ఉండే జాతీయ రహదారి.. మంగళవారం ఉదయం పదిగంటల సమయంలో శబ్దం..రక్షించండి అంటూ హాహాకారాలు..ఆర్తనాదాలు.. వెంటనే స్పందించిన స్థానికులు, పోలీసులు..గ్యాస్ కట్టర్ల సాయంతో క్షతగాత్రులను బయటకు తీశారు. కర్నూలు–చిత్తూరు 18వ నంబర్ జాతీయ రహదారిపై ఓర్వకల్లు వద్ద లారీని బస్సు ఢీకొన్న ఘటనలో పదిమంది గాయపడ్డారు. కడప డిపోకు చెందిన ఏపీ04 టీయు 5995 నంబర్ గల ఆర్టీసీ అద్దె బస్సు ఉదయం 6 గంటలకు కడప నుంచి కర్నూలుకు బయలుదేరింది. ఓర్వకల్లు ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా గల ఫ్లై ఓవర్ వంతెనపై నిలబడిన ఆటోను తప్పించబోయి ఎదురుగా వస్తున్న హర్యానాకు చెందిన హెచ్ఆర్55 డబ్ల్యూ 2412 నంబర్ గల లారీని ఢీకొంది. దీంతో లారీ ముందు భాగం దెబ్బతిని లారీడ్రైవర్ బుచ్చిబాబు రెండు కాళ్లు స్టీరింగ్ కింద ఇరుక్కుపోయాయి. బస్సులో ప్రయాణిస్తున్న డ్రైవర్ పెంచలయ్య, కండక్టర్ రామచంద్రారెడ్డితో పాటు ప్రయాణికులు రమేష్, రామకృష్ణ నాయక్, సంపత్‌కుమార్, శ్రీనివాసులు, విజయ్‌కుమార్, మహిమూన్, షహినాబి రక్తగాయాలకు గురయ్యారు. ఘటన జరిగిన వెంటనే స్థానికులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుని క్షతగాత్రులను 108 వాహనంలో కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు..స్థానికుల చేత లారీలో ఇరుక్కుకపోయిన డ్రైవర్‌ను గడ్డపారలు, గ్యాస్ కట్టర్లతో అతికష్టం మీద బయటకు తీశారు. డ్రైవర్ బుచ్చిబాబు గంటసేపు నరకయాతన అనుభవించాడు. ఈలోగా కర్నూలు తాలూకా సీఐ నాగరాజు యాదవ్, ఎస్ఐ చంద్రబాబు నాయుడు, ఉలిందకొండ, నాగలాపురం ఎస్ఐలు వెంకటేశ్వరరావు, మల్లికార్జున ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాద తీరును పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడతామని పోలీసులు తెలిపారు. కాంట్రాక్టర్ల నిర్లక్ష్యంతోనే ప్రమాదాలు... రోడ్డు నిర్మాణ పనుల్లో కాంట్రాక్టర్ల నిర్లక్ష్యంతోనే ప్రమాదాలు జరుగుతున్నాయని పలువురు ఆరోపించారు. ఐదేళ్ల నుంచి కొనసాగుతున్న రహదారి విస్తరణ పనుల్లో భాగంగా సంబంధిత కాంట్రాక్టర్లు, ఇంజనీరింగ్ అధికారులు ఇష్టానుసారంగా రోడ్డు మలుపులు ఏర్పాటు చేస్తుండగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు. -
హైవేపై ఢీకొన్న 30 వాహనాలు!
-
హైవేపై ఢీకొన్న 30 వాహనాలు!
జైపూర్: దట్టమైన పొగమంచు ఉత్తర భారతాన్ని వణికిస్తుంది. పొగమంచు కారణంగా జాతీయ రహదారులపై ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. జైపూర్- ఆగ్రా రహదారిపై ఆదివారం ఉదయం భారీ రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో సుమారు 30 వాహనాలు ఒకదాన్ని ఒకటి ఢీకొన్నాయి. దీంతో.. ఒకరు మృతి చెందగా సుమారు 20 మందికి పైగా గాయాలైనట్లు అధికారులు వెల్లడించారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. గాయపడిన వారికి మెడికల్ సేవలు అందించినట్లు జైపూర్ పోలీసు అధికారులు వెల్లడించారు. పొగమంచు మూలంగా ముందున్న వాహనాలు కనిపించకపోవడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. 1 dead as almost 30 vehicles rammed into each other on Jaipur- Agra Highway due to fog; 28 injured out of which 3 are critical. — ANI (@ANI_news) 29 January 2017 -
నాలుగు లేన్ల రహదారికి ప్రతిపాదనలు
– నంద్యాల చెక్ పోస్టు నుంచి సఫా కాలేజీ వరకు – రూ. 22.5 కోట్లతో నివేదిక – మరికొన్ని రహదారులకు ప్రతిపాదనలు కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): కర్నూలు నగరంలోని నంద్యాల చెక్ పోస్టు నుంచి సఫా ఇంజినీరింగ్ కళాశాల వరకు ఉన్న నాలుగు లేన్ల రహదారి నిర్మాణానికి అర్అండ్బీ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఈ రహదారి తీవ్రంగా దెబ్బదినడంతో ప్రమాదాలకు నిలయమైంది. పలుమార్లు ప్యాచ్ వర్కులు చేపట్టారు. అయినా రహదారి పరిస్థితి అధ్వానంగా ఉండడంతో శాశ్వత ప్రతిపాదికన నాలుగు లేన్ల రహదారి నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నారు. ఈ మేరకు అర్అండ్బీ అధికారులు నంద్యాల చెక్ పోస్టు నుంచి సఫా కళాశాల వరకు మొత్తం 6.5 కిలోమీటర్ల నాలుగు లేన్ల రహదారి నిర్మాణాన్ని రూ. 22.5 కోట్లతో చేపట్టేందుకు ప్రతిపాదలను సిద్ధం చేశారు. ఇందుకు ఈఎన్సీ(ఇంజినీర్ ఇన్ చీఫ్) ఆమోదం కోసం ప్రభుత్వానికి నివేదించారు. త్వరలోనే ఈ రహదారి నిర్మాణానికి ప్రభుత్వం ఆమోద ముద్ర వేసే అవకాశం అధికంగా ఉందని అసిస్టెంటు ఇంజినీరు ఫణిరాము తెలిపారు. మరికొన్ని రహదారుల కోసం ప్రతిపాదనలు.. ఉల్చాల–రేమట–కొత్తకోట రహదారి తీవ్రంగా దెబ్బతినడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చాలా ఏళ్ల నుంచి రహదారి పరిస్థితి మారకపోవడంతో ప్రయాణాలు ప్రమాదకరంగా మారాయి. ఈ నేపథ్యంలో రహదారి బాగా దెబ్బతిన్న ప్రదేశాల్లో మొత్తం ఏడు కిలోమీటర్ల మేర నిర్మాణానికి ప్రతిపాదనలు పంపారు. – కర్నూలు–లక్ష్మీపురం రహదారిలో రెండు కిలోమీటర్లు, అనుగొండ–లక్ష్మీపురంలో రహదారిలో రెండు కిలోమీటర్లు, ఓర్వకల్లు–గుంబాయ్తండా రహదారిలో నాలుగు కిలోమీటర్లు, ఓర్వకల్లు–చింతలపల్లి రహదారిలో దెబ్బతిన్న 6 కిలోమీటర్ల వ్యవధిలో నూతన రహదారుల నిర్మాణాల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు ఏఈ వివరించారు. -
‘పవర్ పాండి’ సందడి
పాణ్యం: తమిళ నటుడు, రజనీకాంత్ అల్లుడు ధనుష్ దర్శకత్వంలో నిర్మిస్తున్న పవర్ పాండి చిత్రంలో కొన్ని సన్నివేశాలను తమ్మరాజుపల్లె సమీపంలో బుధవారం చిత్రీకరించారు. జాతీయ రహదారిపై ద్విచక్రవాహనాలతో షూటింగ్ చేశారు. షూటింగ్ తిలకించేందకు వివిధ గ్రామాల నుంచి అభిమానులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ప్రముఖ నటుడు రాజ్‌కిరణ్, మరో ఐదుగురు సీనియర్ నటులు పాల్గొన్నారు. షూటింగ్ సమయంలో భారీ కెమెరాలు, సెట్టింగ్ వస్తువులు, సంస్థలో పని చేసే వారు రోడ్లపైకి వచ్చారు. దీంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. -
పాదచారులపైకి దూసుకెళ్లిన బస్సు
వ్యక్తి పరిస్థితి విషమం వెల్దుర్తి రూరల్ : కర్నూలు - బెంగళూరు జాతీయ రహదారిపై మంగళవారం తెల్లవారు జామున పాదచారులపై ఆర్టీసీ బస్సు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తికి తీవ్రగాయాలు కాగా పరిస్థితి విషమంగా ఉంది. డోన్ నుంచి వెల్దుర్తి వస్తున్న ఆర్టీసీ బస్సు మార్గమధ్యంలో మాదార్పురంలోకి వెళ్లి హైవేపైకి చేరుతున్న సమయంలో హైవేపై వాకింగ్ చేస్తున్న వెల్దుర్తికి చెందిన మంగళి నాగరాజు (అగ్రిగోల్డ్ ఏజెంట్), సప్లయర్స్ చంద్రపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో నాగరాజు తలకు తీవ్రగాయాలయ్యాయి. 108లో కర్నూలు ఆసుపత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఢాబాలపై పెద్ద నోట్ల రద్దు ఎఫెక్ట్
-
రోడ్డు ప్రమాదంలో వృద్ధురాలు మృతి
వెల్దుర్తి రూరల్: స్థానిక పోలీస్‌స్టేషన్ పరిధిలోని సూదేపల్లె స్టేజ్ వద్ద ఎన్‌హెచ్–44పై జరిగిన రోడ్డు ప్రమాదంలో వృద్ధురాలు మృతిచెందగా ఇద్దరు గాయపడ్డారు. ఎస్ఐ తులసీనాగప్రసాద్ తెలిపిన వివరాల మేరకు.. రాజస్థాన్ అడిషనల్ డీజీగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఐపీఎస్ అధికారి ఎన్. రవీంద్రకుమార్‌రెడ్డి తల్లి మాణిక్యమ్మ (82)..కర్నూలు రెవిన్యూ కాలనీలో ఉంటున్నారు. ఆమె చెల్లెలు రాజమ్మతో కలిసి సీతారామాపురం కాశిరెడ్డినాయన ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించే కారులో బయలుదేరారు.మధ్యాహ్నం 3గంటల ప్రాంతంలో కుక్క అడ్డరావడంతో కారు బోల్తా పడింది. ప్రమాదంలో మాణిక్యమ్మ, రాజమ్మలు తీవ్రంగా గాయపడగా, డ్రైవర్ నరేంద్రారెడ్డికి స్వల్ప గాయాలపాలయ్యాడు. ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు, వాహనదారుల 108 సమాచారం ఇచ్చారు. వాహనంలో క్షతగాత్రులను కర్నూలు ఆసుపత్రికి తరలించేలోపు మాణిక్యమ్మ మృతిచెందగా, రాజమ్మ గౌరీగోపాల్ ఆసుపత్రిలో చికిత్సపొందుతోంది. పూర్తివివరాలు సేకరించి కేసు నమోదు చేయనున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
సాఫ్ట్వేర్ ఇంజనీర్ దుర్మరణం
ఆళ్లగడ్డ : పట్టణ శివారులోని ప్రభుత్వ గోదాముల సమీపంలో సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో సాఫ్ట్వేర్ ఇంజినీర్ దుర్మరణం చెందాడు. మండంలోని నల్లగట్ల గ్రామానికి చెందిన బండి చంద్ర (28)హైదరాబాద్‌లో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. సెలవుపై గ్రామానికి వచ్చిన యువకుడు సోమవారం పని మీద ఆళ్లగడ్డ పట్టణానికి వచ్చాడు. రాత్రి బైక్‌పై తిరిగి వెళ్తుండగా పట్టణ శివారులో గోదాముల వద్ద హైవేపైకి చేరుకోగానే నంద్యాల వైపు నుంచి వస్తున్న ట్రాక్టర్ వేగంగా ఢీకొంది. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
రిమ్స్ పరిధిలో గుర్తు తెలియని మృతదేహం
కడప అర్బన్ : కడప నగర శివార్లలోని రిమ్స్ పోలీసుస్టేషన్ పరిధిలో గుర్తు తెలియని పురుష మృతదేహాన్ని గుర్తించినట్లు సీఐ మోహనప్రసాద్, ఎస్ఐ రామాంజనేయులు తెలిపారు. ఈ మృతదేహం రిమ్స్ ఆస్పత్రి సమీపంలోని హైవే రోడ్డు పక్కన పడి ఉందని తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వివరించారు. -
బంధాల వారధులు
ఏపీ, తెలంగాణ జిల్లాలను కలిపే వంతెనలు నడిగడ్డ చుట్టూ కృష్ణా, తుంగభద్ర జీవనదులు జోగుళాంబ గద్వాల జిల్లాకు రాకపోకలకు ఇవే ప్రధానం వ్యాపారం, బంధుత్వాల పరంగా కీలక భూమిక అలంపూర్: జోగుళాంబ గద్వాల జిల్లాకు ఇతర ప్రాంతాలతో ఉన్న అనుబంధాన్ని ప్రధాన వారధులు కలుపుతున్నాయి. ఇటు తెలంగాణ.. అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని పలు జిల్లాలకు విద్య, వ్యాపార, బంధుత్వాలను కలిపేందుకు ఈ వంతెనలు ప్రముఖపాత్ర పోషిస్తున్నాయి.. ఏ ప్రాంతంలోనైనా ఒకటిరెండు వారధులు ఉండడం సహజం. కానీ జోగుళాంబ గద్వాల జిల్లా చుట్టూ ఆరు వారధులు ఉన్నాయి. కృష్ణానదిపైనే రెండు ప్రధాన వంతెనలు నిర్మించారు. రాష్ట్రంలోని ఇతరప్రాంతాలతో పోల్చితే నడిగడ్డకు వెళ్లాలంటే మాత్రం ఈ భారీ వారధులను దాటాల్సిందే. మాతృ జిల్లా మహబూబ్‌నగర్ సువిశాలంగా ఉండడంతో ఈ వంతెనలకు పెద్దగా గుర్తింపురాలేదు. కానీ జోగుళాంబ గద్వాల జిల్లా ఆవిర్భవించిన తర్వాత ప్రాంతాలను కలుపుతున్న వారధుల గురించి ప్రస్తుతం చర్చ సాగుతోంది. జిల్లాల పునర్విభజనలో అలంపూర్, గద్వాలకురాష్ట్రస్థాయిలో ప్రత్యేకగుర్తింపు లభిం చింది. గద్వాలకు నియోజకవర్గాన్ని ఆనుకునే కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. అలంపూర్ నియోజకవర్గంలో మాత్రం కృ ష్ణా, తుంగభద్ర నదులు ప్రవహిస్తున్నా యి. ఈ రెండు నదుల సంక్షేమక్షేత్రం కూడా అలంపూర్‌లోనే ఉండడం మరో విశేషంగా చెప్పొచ్చు.. దేశంలోని అతి పొడవైన 44వ నంబర్ జాతీయ ర హదారిపై బీచుపల్లి వద్ద నిర్మించిన వంతెన ఇతర ప్రాంతాలతో రాకపోకలు సాగించేందుకు దోహదపడుతోంది. ప్రధాన వారధులు ఇవే.. ∙ఇటిక్యాల మండలం బీచుపల్లి క్షేత్రం వద్ద 44వ జాతీయరహదారిలోని కృష్ణానదిపై వారధి నిర్మించారు. గద్వాల నియోజకవర్గంలోని ధరూర్ మండలంలోని జూరాల ప్రాజెక్టు బ్రిడ్జి రాకపోకలకు అనువుగా ఉంది. ఈ రెండు వారధుల ద్వారా గద్వాల, వనపర్తి జిల్లాలోని గ్రామాల ప్రజలు రాకపోకలు సాగిస్తుంటారు. బీచుపల్లి వద్ద ఉన్న వారధి పైనుంచి దేశవ్యాప్తంగా ప్రజలు రాకపోకలు సాగిస్తుంటారు. ∙అలంపూర్ నియోజకవర్గంలోని పుల్లూరు వద్ద తుం గభద్ర వారధి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను కలుపుతోంది. వీటితోపాటు జాతీయరహదారి కావడంతో ఇతరరాష్ట్రాల ప్రజలకు రవాణా సౌలభ్యం కల్పిస్తోంది. ∙అలాగే అంపూర్ నియోజకవర్గంలోని అయిజ మండలం నాగుల్‌దిన్నె బ్రిడ్జి తెలంగాణ– ఆంధ్రప్రదేశ్ ప్రాంతాలను కలుపుతోంది. ∙వడ్డేపల్లి మండలంలోని రాజోలి వద్ద సుంకేసుల బ్యారేజీపై నిర్మించిన వారధి పైనుంచి ఆంధ్రప్రదేశ్– తెలంగాణ జిల్లాల గ్రామాల ప్రజలు రాకపోకలు సాగిస్తుంటారు. ∙అలంపూర్ మండలంలోని అలంపూర్– ర్యాలంపాడు గ్రామాల మధ్య ఉన్న తుంగభద్రపై బ్రిడ్జిని నిర్మిస్తున్నారు. ఇలా జోగుళాంబ గద్వాల జిల్లాకు రాకపోకలు సాగించేందుకు ఈ వారధులే కీలకంగా మారనున్నాయి. అయితే వీటిలో అలంపూర్– ర్యాలంపాడు గ్రామాల మధ్య ఉన్న బ్రిడ్జి, అయిజ మండలం నాగుల్‌దిన్నె వద్ద ఉన్న బ్రిడ్జి నిర్మాణదశలో ఉన్నాయి. విద్య, వ్యాపారపరంగా.. గద్వాల, అలంపూర్ వాసులు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడిరాష్ట్రంలో ఉన్నత విద్యపరంగా ఎక్కువగా కర్నూలుపైనే ఆధారపడేవారు. ఇక్కడే విద్యాసంస్థలు అనేకం ఉండడంతో 80శాతం మంది విద్యార్థులు చదువులు సాగించేవారు. అలాగే చాలామంది వనపర్తికి ఉన్నత చదువులకు వెళ్లేవారు. బంధుత్వాలపరంగా ఈ ప్రాంత ప్రజలు ఎక్కువగా నాగర్‌కర్నూలు జిల్లాలోని కొల్లాపూర్, ఆంధ్రలోని కర్నూలు, నందికొట్కూరు, ఆధోని, మంత్రాలయం, ఎమ్మిగనూరు తదితర ప్రాంతాలకు బంధుత్వాలు ఉన్నాయి. ఈ ప్రాంతాలకు నాగల్‌దిన్నె, సుంకేసుల, తుంగభద్ర వారధుల ద్వారా రాకపోకలు సాగిస్తున్నారు. అలాగే వ్యాపారపరంగా ఏ చిన్న వస్తువు కావాలన్నా కర్నూలుకు వెళ్తారు. యంత్రాల విడిభాగాలు, ఇంటినిర్మాణ సామగ్రి, కిరాణ వస్తువులు, వస్త్రాలు తదితర వాటికి ఇక్కడినుంచే కొనుగోలుచేస్తారు. జోగుళాంబ, జములమ్మను దర్శించుకునేందుకు వస్తారు. ఇలా ఈ వారధులు జోగుళాంబ గద్వాల జిల్లాకు మణిహారంగా మారనున్నాయి. -
వ్యాపారులపై ఉక్కుపాదం
ఎటువంటి నోటీసులు లేకుండా దుకాణాల తొలగింపు రోడ్డున పడ్డ 200 మంది వ్యాపారులు అధికార పార్టీ నాయకుల అత్యుత్సాహం ప్రదర్శించిన అధికారులు ప్రభుత్వమే ఆదుకోవాలంటున్న వ్యాపారులు ఐ.పోలవరం : జాతీయ రహదారి 216 విస్తరణ పనుల పుణ్యమా అని మురమళ్లలో వివిధ చిరు వ్యాపారాలు చేసుకునే సుమారు 200 మంది రోడ్డున పడ్డారు. ఎటువంటి ముందస్తు నోటీసులు లేకుండానే వారిపై ఉక్కుపాదం మోపారు. గత వంద సంవత్సరాలుగా మురమళ్ల రహదారికి ఆనురేని ఇరువైపులా బడ్డిలు, దుకాణాలు వేసుకుని జీవనోపాధి సాగిస్తున్నారు. అధికారుల అత్యుత్సాహం, భరోసా ఇవ్వని ప్రజాప్రతినిధుల వల్ల వ్యాపారులు జీవనోపాధి కోల్పోయి పస్తులుండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇదీ పరిస్థితి.. ఐ.పోలవరం మండలం మురమళ్ల రాఘవేంద్రవారధి నుంచి కొమరగిరి వరకూ జాతీయ రహదారి ఇరువైపులా పంటకాలువకు ఆనుకొని బడ్డీలు, తా త్కాలిక దుకాణాలు పెట్టుకుని వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. సందడిలో సడేమియా అన్న చందా గా హైవే విస్తరణ నేపథ్యంలో పూర్తిగా హైవే స్థలా న్ని ఖాళీ చేయాలని అధికారులు పట్టుపడ్డారు. అయితే వ్యాపారస్తుల నుంచి తీవ్ర స్థాయిలో ఆందోళనలు రావడంతో అధికారులు, ప్రజాప్రతి నిధులు ఒక అడుగు వెనక్కు వేసి కొంత ఉపశమ నం కలిగించేలా వారికి భరోసా ఇచ్చారు. దీనిలో భాగంగా మొదట ఇరువైపులా 10 మీటర్లు స్థల సే కరణ చేసి మార్కింగ్ ఇచ్చారు. ఈ మేరకు వ్యాపారస్తులు స్వచ్ఛందంగా తమ వ్యాపారాలను మార్కింగ్ వరకూ వెనక్కి మళ్లించుకుని కుదించుకున్నారు. రాజకీయ దురుద్దేశంతో.. అధికార నాయకుల ప్రోత్సాహంతో పంట కాలువ దిగువున ఉన్న రైతులు, వ్యాపార సంస్థలు తొలగించాలంటూ అధికారులపై తీవ్ర ఒత్తిళ్లు తీసుకువచ్చారు. దుకాణాల వెనుక ఉన్న కాలువలో వ్యర్థాలు తదితర వాటి వల్ల ప్రజలు రోగాల బారిన పడుతున్నామని నాలుగు గ్రామాలకు చెందిన రైతులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. దీనితో ఇరిగేషన్ శాఖ అధికారులు ఉన్న వ్యాపార సంస్థలను కూడా ఎటువంటి నోటీసులు జారీ చేయకుండానే ఉన్న దుకాణాలను నేలమట్టం చేశారు. దీంతో వ్యాపారస్తులు విస్మయానికి గురయ్యారు. రైతుల సాగునీటì ప్రవాహానికి ఎటువంటి ఆటంకం కలుగకుండా చూస్తామని వ్యాపారస్తులు చెప్పినప్పటికీ ఇరిగేషన్ అధికారులు నిర్ధాక్షినంగా వ్యవహరించారు. పంట కాలువలు ఆక్రమణలకు గురై శివారు భూములకు నీరు అందక పోవడం జిల్లా వ్యాప్తంగా ఉన్నప్పటికీ ఈ ప్రాంతంలోనే ఇరిగేషన్ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించి ఉన్న దుకాణాలను తొలగించడంపై వ్యాపారస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మండలంలోనే కాకుండా ధవళేశ్వరం నుంచి బొబ్బర్లంక, పల్లంకుర్రు ప్రధాన పంటకాలువతో పాటు మీడియం, మైనర్ కాలువల ఆక్రమణలతో ఇబ్బందులు పడుతుంటే మురమళ్లలోనే తొలగించడంపై ఆంతర్యం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. 15 మంది వ్యాపారులు కోర్టు స్టే తెచ్చుకున్నా తొలగించారని అంటున్నారు. స్థానిక ప్రజా ప్రతినిధులు కలుగజేసుకుని వీధిన పడ్డ చిరు వ్యాపారులకు తగిన నష్ట పరిహారంతో పాటు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని కోరుతున్నారు. -
ములుగు జాతీయరహదారిపై ఉద్రిక్తత
వరంగల్: కొత్త జిల్లాల ఏర్పాటులో భాగంగా ములుగును జిల్లా కేంద్రంగా చేయాలంటూ గ్రామస్తులు నిర్వహించిన ఆందోళన హింసాత్మకంగా మారింది. ములుగు జాతీయరహదారిపై ఆందోళనకారులు బస్సుల అద్దాలను ధ్వంసం చేశారు. దీంతో పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టేందుకు లాఠీచార్జ్ చేశారు. ఈ ఘటనలో సుమారు 100 మందికి పైగా గాయాలైనట్లు సమాచారం. ఈ ఘటనతో ములుగులో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. -
జాతీయ రహదారిపై ఉద్రిక్తత
– పరిహారం కోసం రైతుల ఆందోళన – 5 కి.మీ. మేర నిలిచిన వాహనాలు – సీపీఐ, ప్రజా సంఘాల నాయకుల అరెస్ట్ డోన్ టౌన్: రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది ప్రకటించిన కరువు ప్రాంత రైతులకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ రైతులు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. హైదరాబాద్ – బెంగళూరు జాతీయ రహదారిని డోన్ సమీపంలో ఓబులాపురం మెట్ట వద్ద సోమవారం ఉదయం ఏపీ రైతు సంఘం, సీపీఐ, వ్యవసాయ కార్మిక సంఘం, సభ్యులు ఎడ్లబండ్లతో దిగ్బంధించారు. సీపీఐ జిల్లా అధ్యక్షుడు రామాంజనేయులు, నియోజకవర్గ కార్యదర్శి రంగనాయుడు ఆధ్వర్యంలో ఓబులాపురం, యాపదిన్నె, దేవరబండ, రేకులకుంట, కొత్తపల్లె, ఉంగరానిగుండ్ల తదితర గ్రామాల నుంచి రైతులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. సమాచారం అందుకున్న సీఐ శ్రీనివాసులు గౌడ్ అక్కడికి చేరుకుని ఆందోళన విరమించాలని కోరారు. తమకు న్యాయం జరిగే వరకు ఆందోళన విరమించమని తేల్చిచెప్పడంతో సీఐ డోన్, వెల్దుర్తి, కష్ణగిరి నుంచి పోలీసులను రప్పించారు. అప్పటికే దాదాపు 5 కి.మీ. మేర వాహనాలు నిలిచిపోయాయి. ఎస్ఐలు రామసుబ్బయ్య, సోమ్లనాయక్, పోలీసులు అక్కడికి చేరుకుని ఆందోళన చేస్తున్న వారిని అరెస్ట్ చేసే ప్రయత్నం చేయగా పరిస్థితి ఉద్రిక్తతంగా మారింది. సీపీఐ నాయకులు రామాంజనేయలు, రంగనాయుడు, లక్ష్మీనారాయణ, శివ, నారాయణ, కష్ణమూర్తి, రాముడు, సుధాకర్, నక్కిశ్రీకాంత్, రంగన్న తదితరులను అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. చంద్రబాబు రైతు ద్రోహి: రైతు సంక్షేమాన్ని విస్మరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైతు ద్రోహిగా చరిత్రలో మిగిలిపోతారని సీపీఐ జిల్లా అధ్యక్షుడు రామాంజనేయులు విమర్శించారు. వ్యవసాయ భూములను కార్పొరేట్ సంస్థలకు ధారాదత్తం చేస్తున్న సీఎంకు రైతులు గుణపాఠం చెబుతారన్నారు. గతంలో వ్యవసాయం దండగ అన్న చంద్రబాబును చిత్తుగా ఓడించినా ఇంకా బుద్ధి రాలేదని ఎద్దేవా చేశారు. నియంతలా వ్యవహరిస్తే ప్రజలు తిరగబడతారన్నారు. రైతులకు ఇవ్వాల్సిన పరిహారం ఇవ్వకపోతే భారీ ఎత్తున ఆందోళనలు చేపడుతామని హెచ్చరించారు. -
హైవేపై ఆర్తనాదం
• రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన యువకుడు • 108 వాహనం కోసం గంటకు పైగా ఎదురుచూపు • యువకుడి మృతితో కోపోద్రిక్తులైన బంధువులు • అంబులెన్స్, సిబ్బందిపై దాడి, పరిస్థితి ఉద్రిక్తం బుక్కరాయసముద్రం/ గార్లదిన్నె: 108 సిబ్బంది నిర్లక్ష్యం ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. వారి నిర్లక్ష్యం కారణంగానే తమవాడు చనిపోయాడంటూ మృతుని బంధువులు అంబులెన్స్‌ను ధ్వంసం చేయడంతో పాటు సిబ్బందిపై దాడికి యత్నించారు. గార్లదిన్నె మండలం పెనకచెర్ల గ్రామానికి చెందిన నాగార్జున(25) ఆటో న డుపుకుని బతుకుతున్నాడు. తన అక్క కూతురైన సుమంజలితో ఆర్నెల్ల కిందట పెళ్లైంది. బుధవారం రాత్రి అనంతపురంలో పని ముగించుకుని బైక్‌లో ఇంటికి తిరుగుప్రయాణమయ్యాడు. వడియంపేట మిట్టపై ఉన్న షిరిడీ∙సాయి ఇంజినీరింగ్ కళాశాల వద్దనున్న పెట్రోలు బంక్ వద్దకు రాగానే అక్కడ పెట్రోల్ వేయించుకొని మళ్లీ బయలుదేరాడు. అంతలోనే వేగంగా వచ్చిన లారీ బైక్‌ను బలంగా ఢీకొంది. ఘటనలో నాగార్జునకు తీవ్ర గాయాలయ్యాయి. ఆలస్యంగా వచ్చిన అంబులెన్స్ ఘటనపై స్థానికులు 108 వాహనానికి సమాచారం అందించారు. అంతలోనే నాగార్జున చనిపోయాడు. జిల్లాలో సీఎం పర్యటన ఉండగా అంబులెన్స్‌లు పర్యటనకు వెళ్లాయి. దీంతో ప్రమాదం జరిగిన చాలా సేపటికి 108 రావడంతో బంధువులు దానిపై దాడి చేశారు. వాహన డ్రైవర్‌ను కొట్టేందుకు యత్నించారు. దీంతో రహదారిపై కంపలు వేసి అక్కడే స్థానికులతో సహా ఆందోళనకు దిగారు. వడియం పేట దగ్గర మూడు కిలోమీటర్ల మేర భారీగా ట్రాఫిక్ స్తంభించింది. పోలీసులు రంగంలోకి దిగి ఆందోళనకారులకు సర్ది చెప్పి ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. గుత్తి టోల్గేట్ వద్ద ప్రమాదానికి కారణమైన లారీని పోలీసులు పట్టుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రాణాలు పోతున్నా...అధికారులకు సీఎం పోగ్రామే ఎక్కువై పోయిందా అని మృతుని బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
హైవేపై గుర్తుతెలియని వ్యక్తి దుర్మరణం
గండేపల్లి : నిత్యం వాహనాల రాకపోకలతో రద్దీగా ఉండే జాతీయ రహదారి అది. అటుగా ప్రయాణిస్తున్న వారికి నీలాద్రిరావుపేట వద్ద ఓ దృశ్యం భయకంపితుల్ని చేసింది. మాంసం ముద్దలుగా ఉన్న మృతదేహాన్ని చూసి వారు భీతిల్లిపోయారు. పోలీసుల కథనం ప్రకారం.. జాతీయ రహదారిలో నీలాద్రిరావుపేటలోని రుచి దాబా ఎదురుగా బ్రిడ్జిపై మంగళవారం తెల్లవారుజామున గుర్తుతెలియని వ్యక్తిని ఓ వాహనం ఢీకొంది. ఈ సంఘటనలో అక్కడికక్కడే ఆ వ్యక్తి చనిపోయాడు. మృతదేహం పైనుంచి అనేక వాహనాలు ప్రయాణించడంతో మాంసపు ముద్దలా మారింది. సమాచారం అందుకున్న గండేపల్లి, జగ్గంపేటSఎస్సైలు రజనీకుమార్, అలీఖాన్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మతిస్థిమితం లేకపోవడమో, రోడ్డు దాటుతుండగా వాహనం ఢీకొట్టి ఉండవచ్చని వారు పేర్కొన్నారు. అతడికి సుమారు 50 ఏళ్లు ఉంటాయని, మృతదేహంపై జంజం, లేత నీలిరంగు ప్యాంట్, తెలుపురంగు చొక్కా, బెల్టు, కొలతలకు వాడే టేపు ఉన్నాయని చెప్పారు. ఆచూకీ తెలిసిన వారు 94409 04841, 08852 237733 సెల్ నంబర్లకు తెలియజేయాలని కోరారు. మృతదేహాన్ని రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రికి తరలించి, కేసు నమోదు చేసినట్టు తెలిపారు.