టోల్ గేట్ వద్ద వేచి ఉండాల్సిన సమయాన్ని తగ్గించడానికి ఫాస్ట్‌ట్యాగ్ విధానం ప్రవేశపెట్టారు. ఈ విధానానికి కేంద్రం త్వరలోనే మంగళం పాడనుంది. ఫాస్ట్‌ట్యాగ్ స్థానంలో శాటిలైట్ బేస్డ్ టోల్ కలెక్షన్ అందుబాటులోకి రానుంది. ఈ విషయాన్ని ఇప్పటికే కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు. అంతే కాకుండా.. రోడ్లు సరిగా లేకుంటే హైవే ఏజెన్సీలు టోల్ వసూలు చేయకూడదని గడ్కరీ ఇటీవల స్పష్టం చేశారు.
నాణ్యమైన సేవలు అందించని పక్షంలో మీరు టోల్ వసూలు చేయకూడదని గ్లోబల్ వర్క్‌షాపులో నితిన్ గడ్కరీ హైవే ఏజెన్సీలకు క్లారిటీ ఇచ్చారు. నాణ్యమైన రోడ్లు లేకుండానే టోల్ వసూలు చేస్తే.. ప్రభుత్వం మీద ప్రజలకు కోపం వస్తుంది. నాణ్యమైన సేవలను అందించినప్పుడే టోల్ వసూలు చేయాలని పేర్కొన్నారు.
నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా.. ప్రస్తుతం ఉన్న ఫాస్ట్‌ట్యాగ్ వ్యవస్థను గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ బేస్డ్ ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్ వ్యవస్థను అమలు చేయాలని యోచిస్తోంది. ప్రారంభంలో ఈ విధానం కొంత దూరానికి మాత్రమే పరిమితం చేసి టెస్ట్ చేయడం జరుగుతుంది. ఆ తరువాత అన్ని హైవేల మీద ఇదే వ్యవస్థను అమలు చేసే అవకాశం ఉందని సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment