ఉత్తరాఖండ్‌లోని యమునోత్రి ఆలయానికి వెళ్లే రహదారి భద్రతా గోడ శుక్రవారం ఒక్కసారిగా కూలిపోయిది. దీంతో రిషికేశ్-యమునోత్రి జాతీయ రహదారిపై వెళ్తున్న 10 వేల మందికి పైగా యాత్రికులు చిక్కుకున్నారు. జంకిచట్టి వద్ద భారీగా వాహనాలు నిలిచిపోవడంతో ట్రాఫిక్ జామ్ అయ్యింది.
ఈ రహదారులను పునరుద్ధరించడానికి కనీసం 3 రోజుల సమయం పడుతుందని అధికారులు పేర్కొంటున్నారు. అయితే చిన్న చిన్న వాహనాలను పంపడానికి అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. పెద్ద పెద్ద వాహనాల్లో ఉన్న యాత్రికులకు మాత్రం ఇబ్బందులు తప్పవని అధికారులు పేర్కొంటున్నారు.
కాగా బుధవారం భారీ వర్షాలు కురవడంతో సయనచట్టి, రణచట్టి మద్య ఉన్న రహదారి కొట్టుకుపోయింది. ఈ నేపథ్యంలో 24 గంటలు మూసేసి తిరిగి గురువారం సాయంత్రం హైవే తెరిచారు. అయితే ఇంతలోనే మరోసారి రోడ్డు కూలిపోవడంతో ప్రస్తుత ఇబ్బంది పరిస్థితి తలెత్తినట్లు తెలుస్తోంది.
చదవండి: విపరీతమైన ట్రాఫిక్‌తో కొట్టుమిట్టాడే నగరాల్లో ముంబై, బెంగళూరు..
Comments
Please login to add a commentAdd a comment