collapsed
-
మహారాష్ట్రలో క్రికెట్ ఆడుతూ కుప్పకూలిన క్రికెటర్
-
తమిళనాడులో కుప్పకూలిన ఫ్లైఓవర్..
సాక్షి, చెన్నై: తమిళనాడులో ఘోర ప్రమాద ఘటన చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్ కుప్పకూలడంతో శిథిలాల కింద వందలాది మంది కార్మికులు చికుకున్నారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు ముమ్మరంగా జరుగుతున్నాయి.వివరాల ప్రకారం.. తమిళనాడులోని తిరుపత్తూరు జిల్లాలో అంబూర్ బస్టాండ్ ఎదురుగా చెన్నై-బెంగళూరు జాతీయ రహదారిపై నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్ శనివారం అర్ధరాత్రి ఒక్కసారిగా కూలిపోయింది. ఈ క్రమంలో వందలాది మంది కార్మికులు శిథిలాల కింద చిక్కుకున్నారు. ఘటనా స్థలంలో రాత్రి నుంచి సహాయక చర్యలు ముమ్మరంగా జరుగుతున్నాయి. రెస్య్కూ టీమ్ ఇప్పటి వరకు 22 మందిని కాపాడింది. వారిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.ఇది కూడా చదవండి: రత్న భండార్‌లో రెండో సర్వే ప్రారంభం -
తప్పిన పెను ప్రమాదం.. ‘సుంకిశాల’లో అసలేం జరిగింది?
సాక్షి, నల్గొండ జిల్లా: సుంకిశాల పంప్ హౌస్ రక్షణ గోడ కూలిపోయింది. ఆ సమయంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. కూలీలు షిఫ్ట్ మారడానికి వెళ్లిన సమయంలో ప్రమాదం జరిగింది. కొన్ని క్షణాలు ముందైనా, ఆలస్యం అయినా భారీగా ప్రాణ నష్టం జరిగేది.పంప్ హౌస్‌లో షిఫ్ట్‌కు 115 మంది వరకు కూలీలు పని చేస్తున్నారు. సాగర్ డెడ్ స్టోరేజ్‌కు చేరిన సమయంలో హైదరాబాద్‌కు తాగునీటిని అందించడానికి సుంకిశాల పథకం చేపట్టారు. పథకంలో భాగంగా సొరంగ మార్గం నిర్మాణ పనులు చేస్తున్నారు. సొరంగంలోకి సాగర్ నీరు రాకుండా రిటైనింగ్ వాల్ నిర్మాణం చేపట్టగా.. సాగర్ నిండటంతో నీటి ఒత్తిడికి రక్షణ గోడ కూలింది. దీంతో సొరంగం పూర్తిగా మునిగిపోయింది. నీటిలోనే క్రేన్, టిప్పర్లు, ఇతర సాంకేతిక సామాగ్రి మునిగిపోయాయి. కోట్లలో నష్టం వాటిల్లినట్లు సమాచారం. ఈ నెల ఒకటినే రక్షణ గోడ కూలినా అధిక యంత్రాంగం గోప్యంగా ఉంచారు. ఆగష్టు ఒకటిన ఉదయం ఆరుగంటల సమయంలో ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై జలమండలి అధికారులు నీళ్లు నములుతున్నారు.అసలు అక్కడ ఏం జరగలేదన్నట్లు కప్పిపుచ్చుకునే ధోరణిలో అధికార యంత్రాంగం ఉంది. తిరిగి పనులు ప్రారంభం కావాలంటే వచ్చే వేసవి వరకు ఆగాల్సిందే. -
Nigeria: స్కూలు బిల్డింగ్ కూలి 22 మంది విద్యార్థులు మృతి
నైజీరియాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఉత్తర మధ్య నైజీరియాలో హఠాత్తుగా రెండంతస్తుల పాఠశాల భవనం కూలిపోయింది. తరగతులు జరుగుతున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో 22 మంది విద్యార్థులు మృతి చెందగా, 100 మందికి పైగా విద్యార్థులు శిథిలాల కింద చిక్కుకుపోయారని తెలుస్తోంది. శిథిలాల కింద చిక్కుకున్న విద్యార్థులను బయటకు తీసుకువచ్చేందుకు రిలీఫ్ అండ్ రెస్క్యూ టీమ్‌లు ఘటనాస్థలంలో సహాయక చర్యలను ముమ్మరం చేశాయి.బుసా బుజి కమ్యూనిటీలోని సెయింట్స్ అకాడమీ కాలేజీలో తరగతులు ప్రారంభమైన కొద్దిసేపటికే పాఠశాల భవనం కుప్పకూలింది. ప్రమాదం బారినపడినవారిలో 15 ఏళ్లలోపు విద్యార్థులు ఉన్నారు. శిథిలాల్లో మొత్తం 154 మంది విద్యార్థులు చిక్కుకుపోయారని, 132 మందిని రక్షించామని పోలీసు అధికార ప్రతినిధి ఆల్ఫ్రెడ్ అలబో తెలిపారు. వీరంతా ప్రస్తుతం వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ ప్రమాదంలో 22 మంది విద్యార్థులు మృతి చెందారు.నైజీరియా నేషనల్ ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ ఏజెన్సీ సిబ్బంది ప్రమాదం జరిగిన వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుంది. పాఠశాల నిర్మాణం బలహీనంగా ఉండడం, నది ఒడ్డున ఉండడం వల్లే ఈ ఘటన జరిగివుంటుందని అధికారులు అంటున్నారు. ప్రమాదం సంగతి తెలియగానే గ్రామస్తులు ముందుకు వచ్చి, సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల నుంచి విద్యార్థులను బయటకు తీసేందుకు రెస్క్యూ సిబ్బందికి సహకారం అందించారు. ఆఫ్రికాలోని అత్యధిక జనాభా కలిగిన నైజీరియాలో భవనాలు తరచూ కూలిపోతుండటం గమనార్హం. గత రెండేళ్లలో ఇలాంటి పలు ఘటనలు నమోదయ్యాయి. -
10 ఏళ్లలో కూలిపోయిన 200 వంతెనలు!
బీహార్‌లో వరుసగా బ్రిడ్జిలు కూలిపోతుండటం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. బీహార్‌లో ఇటీవలి కాలంలో జూన్ 18న తొలి వంతెన కూలగా ఆ తరువాత కేవలం 17 రోజుల్లోనే 12కు పైగా వంతెనలు కుప్పకూలిపోయాయి. ఈ నేపధ్యంలో ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఉన్నత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేసి బలహీనమైన వంతెనల విషయంలో దర్యాప్తు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.దేశంలో వంతెనలు కూలడమనేది ఒక్క బీహార్ మాత్రమే కాదు. ఇతర ప్రాంతాలలో కూడా వంతెనలు కూలుతుంటాయి. ఒక నివేదిక ప్రకారం 1977- 2017 మధ్య భారతదేశంలో 2,130 వంతెనలు కూలిపోయాయి. 2012- 2021 మధ్య 214 వంతెనలు కూలిపోయినట్లు ప్రభుత్వ రికార్డులలో నమోదయ్యింది.నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్‌సిఆర్‌బి) నివేదిక ప్రకారం ఇటీవలి కాలంలో వంతెనల కూలిన కేసులు తక్కువగా నమోదయ్యాయి. 2012- 2013 మధ్య సగటున 45 వంతెనలు కుప్పకూలగా, ఆ సంఖ్య 2021లో ఎనిమిదికి తగ్గింది.సంవత్సరంకూలిన వంతెనలు2012452013452014162015222016 192017 102018 172019232020920218 వంతెనలు కూలిపోవడానికి కారణంవంతెనలు కూలిపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. వంతెనల డిజైన్, ఉపయోగించిన మెటీరియల్, ఎప్పటికప్పుడు మరమ్మతులు చేయకపోవడం మొదలైనవి వీటిలో ప్రధాన కారణాలు. వంతెనలు కూలడానికి ప్రకృతి వైపరీత్యాలు కూడా ప్రధాన కారణాలుగా నిలుస్తున్నాయి. ఇండియా టుడే నివేదిక ప్రకారం ప్రకృతి వైపరీత్యాల కారణంగా దేశంలో 80కి పైగా వంతెనలు కూలిపోయాయి. 2012 నుంచి 2021 వరకు వంతెనలు కూలిన ప్రమాదాలలో 285 మంది మృతి చెందారు. 2022లో గుజరాత్‌లోని మోర్బీలో వంతెన కూలిపోవడంతో 141 మంది మృతి చెందారు.సంవత్సరం మృతుల సంఖ్య2013 532014 122015 242016 472017 102018 342019 262020 102021 5 -
గాలివానకు మళ్లీ కూలిన ఓడేడ్ వంతెన గడ్డర్లు
పెద్దపల్లి, సాక్షి: ముత్తారం మండలం ఓడేడ్ వద్ద జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం గర్మిళ్లపల్లి గ్రామాల మధ్య మానేరువాగుపై గిడ్డర్లు మరోసారి కూలాయి. దాదాపు తొమ్మిదేళ్లుగా నత్తనడకన సాగుతున్న వంతెన నిర్మాణంలో నాణ్యతలోపం మరోసారి వెల్లడైంది. మంగళవారం సాయంత్రం భారీగా వీచిన గాలులకు గర్మిళ్లపల్లి వైపు వంతెన 17, 18 నంబరు పిల్లర్లపై ఐదు గడ్డర్లు పెద్ద శబ్దంతో కింద పడ్డాయని స్థానికులు తెలిపారు. గాలి దుమారం రావడంతోనే గడ్డర్లు కూలిపోయినట్లు ప్రాథమికంగా తెలుస్తోందని పెద్దపల్లి జిల్లా ఆర్అండ్బీ ఇన్‌ఛార్జి అధికారి, ఈఈ నర్సింహాచారి పేర్కొన్నారు. అధికారులను క్షేత్రస్థాయికి పంపి ఘటనకు గల కారణాలు తెలుసుకుంటున్నామని చెప్పారు. 2016 ఆగస్టులో సుమారు రూ.49 కోట్ల అంచనా వ్యయంతో వంతెన పనులు ప్రారంభించారు. నిర్మాణ సమయంలో పలుమార్లు వచ్చిన వరదలకు సామగ్రి దెబ్బతినడం, గుత్తేదారులు మారడంతో పనులు ఆలస్యమయ్యాయి. రెండేళ్లుగా వాగు ఉద్ధృతంగా ప్రవహించడంతో గడ్డర్లకు సపోర్టుగా ఉన్న చెక్కలు దెబ్బతిన్నాయి. దీంతో ఈ ఏడాది ఏప్రిల్ 22న అర్ధరాత్రి గాలి దుమారానికి 1, 2 నంబరు పిల్లర్లలో మూడు గడ్డర్లు కింద పడ్డాయి.భూపాలపల్లి మీదుగా పెద్దపళ్లి జిల్లాకు వెళ్లాలంటే సుమారు 100కిలోమీటర్లు ప్రయాణించాలి. అలా కాకుండా బ్రిడ్జి గనుక పూర్తైతే కేవలం 30 కిలోమీటర్ల దూరానికి తగ్గిపోతుంది. ప్రత్యామ్నాయంగా వాగు గుండా మట్టి రోడ్డు నుంచి ప్రజలు రాకపోకలు కొనసాగిస్తున్నా.. వర్షాకాలం ఆ రోడ్డు కొట్టుకుపోతుండడంతో ఇబ్బందులు తప్పడం లేదు. -
బీహార్‌లో కూలిన మరో వంతెన
బీహార్‌లో వరుసగా వంతెనలు కూలిపోతుండటం స్థానికులను ఆందోళనకు గురిచేస్తోంది. అరారియాలో ఓ వంతెన కూలిపోయిన ఘటన మరువక ముందే సివాన్‌లోని దారుండా బ్లాక్‌లోని రామ్గర్హాలోని గండక్ కాలువపై నిర్మించిన వంతెన కూలిపోవడం కలకలం రేపుతోంది.పాతేడీ బజార్- దరౌండా బ్లాక్‌లను కలిపే ఈ వంతెన కూలిపోవడంతో స్థానికులు పలు ఇబ్బందులు పడుతున్నారు. కొద్ది రోజుల క్రితమే అరారియాలో ఓ వంతెన కూలిపోయింది. ఆ వంతెన నిర్మాణానికి దాదాపు రూ.12 కోట్లు ఖర్చు చేశారు. తాజాగా సివాన్‌లోని కాలువకు వంతెనకు ఒకే పిల్లర్ ఉండగా అది కూడా కొట్టుకుపోవడంతో వంతెన కూలిపోయింది.ఈ వంతెన నిర్మించి ఏడాది కూడా గడవకముందే కూలిపోవడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. శాఖాపరమైన నిర్లక్ష్యం కారణంగానే వంతెన కూలిపోయిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. -
ముంబై హోర్డింగ్ కుప్పకూలిన ఘటన,.. వెలుగులోకి కీలక విషయాలు
ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబయిలో హోర్డింగ్ కూలిన ఘటనలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ‘ఇగో మీడియా ప్రైవేట్ లిమిటెడ్’ యాడ్ ఏజెన్సీ యజమాని భవేష్ భిండేపై హత్యకేసు నమోదైంది. అయితే అతనిపై పోలీసు కేసులు కొత్తేమి కాదు. ఓ అత్యాచార కేసుతో సహా దాదాపు 20 కేసుల్లో భవేష్ నిందితుడిగా ఉన్నారు. ప్రస్తుతం భిండే పరారీలో ఉన్నాడని, అతని ఫోన్ కూడా స్విచ్ఛాఫ్ వస్తుందని పోలీసులు పేర్కొన్నారు.అడ్వర్టైజింగ్ ఏజెన్సీ యజమాని 2009లో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో ములుండ్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశాడు. ఆయన సమర్పించిన అఫిడవిట్ ప్రకారం ముంబై మున్సిపల్ కార్పొరేషన్ చట్టం, నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్(చెక్ బౌన్స్) కింద తనపై 23 కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాది జనవరిలో అతనిపై ములుంద్ పోలీస్ స్టేషన్లో అత్యాచారం కేసు నమోదైంది. ఛార్జిషీట్ కూడా దాఖలు చేశారు పోలీసులు. అయితే ముందస్తు బెయిల్‌పై ప్రస్తుతం బయట ఉన్నాడు.రాష్ట్రంలో హోర్డింగ్‌లు,బ్యానర్లను ఏర్పాటు చేయడం కోసం గత కొన్నేళ్లుగా భిండే భారతీయ రైల్వేలు, ముంబై పౌర సంస్థ, బృహన్ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ (BMC) నుంచి అనేక కాంట్రాక్టులను పొందినట్లు తెలుస్తోంది. అయితే చాలాసార్లు ఆయన నిబంధనలను ఉల్లఘించినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. భిండేతోపాటు అతని కంపెనీలలోని అనేక మంది చెట్లకు విషం, చెట్ల నరికివేత కేసుల్లో నిందితులుగా ఉన్నారు.ముంబైలోని ఘాట్కోపర్లో సోమవారం అకాల వర్షం, ఈదురు గాలులతో ఓ భారీ బిల్ బోర్డ్ పక్కనే ఉ న్న పెట్రోల్ పంపుపై కుప్పకూలిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో మృతుల సంఖ్య 14కు చేరింది. మరో 74 మంది తీవ్రంగా గాయపడ్డారు. కూలిన హోర్డింగ్ కింద నుజ్జునుజ్జయిన కార్లలో ఇంకా కొంత మంది చిక్కుకొని ఉండొచ్చని, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. -
కెన్యాలో కూలిన డ్యామ్
నైరోబీ(కెన్యా): ఆఫ్రికా దేశం కెన్యాలో జలాశయం ధ్వంసమై నివాసప్రాంతాలను ముంచెత్తడంతో 45 మంది ప్రాణాలు కోల్పోయారు. 49 మంది గల్లంతయ్యారు. సుమారు 109 మంది గాయపడి ఆస్పత్రి పాలయ్యారు. తరచూ ఆకస్మిక వరదలు సంభవించే గ్రేట్ రిఫ్ట్ వ్యాలీ ప్రాంతంలో సోమవారం వేకువజామున ఈ ఘటన చోటుచేసుకుంది. మయి మహియులో ఇటీవలి వర్షాలకు పొంగి పొర్లుతున్న పాత కిజాబె డ్యాం ఆనకట్ట కొట్టుకుపోయింది. దీంతో వరద ఒక్కసారిగా నివాస ప్రాంతాలను ముంచెత్తిందని, ప్రధాన రహదారి కొట్టుకుపోయిందని అధికారులు తెలిపారు. విమానాశ్రయంలో వరద పోటెత్తడంతో కొన్ని విమానాలను దారి మళ్లించారు. -
తైవాన్ను కుదిపేసిన భూకంపం : మెట్రోట్రైన్, స్విమ్మింగ్ పూల్‌లో దృశ్యాలు
తైవాన్‌లో అత్యంత భారీ భూకంపం తైవాన్ను కుదిపేసింది. రిక్టర్ స్కేల్‌పై 7.6 గా నమోదైన ఈ భూకంపంలో నలుగురు వ్యక్తులు మరణించినట్లు తెలుస్తోంది. గత పాతికేళ్లలో ఎన్నడూ లేని విధంగా బుదవారం ఉదయం 7:58 గంటలకు ద్వీపం తూర్పు తీరాన్ని తాకింది. ఫలితంగా అనే భవనాలు నేలమట్టమయ్యాయి. కొండ చరియలు విరిగిపడ్డాయి. దీంతో అక్కడి ప్రజలు యోగ క్షేమాలపై సర్వత్రా ఆందోళన వ్యక్తమౌతోంది. దీంతో సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన వీడియోలు వైరల్‌గా మారాయి. భూకంపం తీవ్రత దృశ్యాలు అనేక చోట రికార్డైనాయి. పలు ఆకాశహర్మ్యాలు, అనేక ఇళ్లు కూలి పోయాయి. చాలా చోట్ల రవాణా మార్గాలు దెబ్బ తిన్నాయి. మెట్రో రైలు, స్విమ్మింగ్ పూల్, దృశ్యాలు ఇంటర్నెట్లో బాగా వైరల్ అవుతున్నాయి. దక్షిణాన హౌలెన్ నగరానికి 18 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్టు అమెరికా జియోలాజికల్ సర్వే (USGS) పేర్కొంది. దీంతో తూర్పు తైవాన్‌తో పాటు దక్షిణ జపాన్, ఫిలిప్పీన్స్‌లోని కొన్ని ప్రాంతాల్లో సునామీ హెచ్చరికలు జారీచేశారు. తైవాన్, జపాన్, ఫిలిప్సీన్స్ సహా పలు దేశాల్లో తరుచూ భూకంపాలు సంభవిస్తాయి. కానీ ఈ స్థాయిలో అక్కడ భూకంపం సంభవించడం గత పాతికేళ్లలో ఇదే తొలిసారి. సెప్టెంబరు 1999లో సంభవించిన భూకంపానికి 2 వేల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. भूकंप के समय मेट्रो के भीतर का हाल#earthquake #Taiwan pic.twitter.com/gd1dGN3BeA — Umashankar Singh उमाशंकर सिंह (@umashankarsingh) April 3, 2024 Visuals of a Swimming Pool when the 7.4 earthquake hit Taiwan. #earthquake #Taiwan #Tsunami pic.twitter.com/YsBgfO9e2g — Aajiz Gayoor (@AajizGayoor) April 3, 2024 -
కుప్పకూలిన రష్యా యుద్ధ విమానం.. 65 మంది మృతి
మాస్కో: రష్యా యుద్ధ విమానం కుప్పకూలింది. రష్యా-ఉక్రెయిన్ సరిహద్దులో ఈ ఘోర ప్రమాదం జరిగింది. 65 మంది ఉక్రెయిన్ యుద్ధ ఖైదీలు దుర్మరణం చెందారు. ఆరుగురు సిబ్బంది, మరో ముగ్గురు వ్యక్తులు ఉన్నారని రక్షణ మంత్రిత్వ శాఖను వెల్లడించింది. ప్రమాదానికి కారణాలు ఇంకా సమాచారం లేదు. Video | Russian Military Plane Carrying 65 Ukrainian Prisoners Of War Crashes Read More: https://t.co/87kc55f1PP pic.twitter.com/8gFgajhX5C — NDTV (@ndtv) January 24, 2024 రష్యాకు చెందిన ఇల్యుషిన్ Il-76 సైనిక రవాణా విమానంగా అధికారులు గుర్తించారు. బెల్గోరోడ్ నగరానికి ఈశాన్య ప్రాంతంలో ఈ ఘటన సంభవించిందని స్థానిక గవర్నర్ వ్యాచెస్లావ్ గ్లాడ్కోవ్ మాట్లాడారు. తాను ఆ స్థలాన్ని పరిశీలించబోతున్నానని చెప్పారు. అత్యవసర సహాయ సిబ్బంది ఇప్పటికే సంఘటనా స్థలానికి చేరుకున్నారని ఆయన చెప్పారు. ఇదీ చదవండి: 21 మంది ఇజ్రాయెల్ సైనికులు మృతి -
Uttarkashi tunnel collapse rescue: పీడకల... అగ్నిపరీక్ష
ఉత్తరకాశీ/న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని సిల్క్యారా సొరంగంలో చిక్కుకొని, ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బతికిన 41 మంది కార్మికులు 17 రోజుల తర్వాత మంగళవారం రాత్రి క్షేమంగా బయటకు వచ్చారు. సొరంగంలో తమకు ఎదురైన భయానక అనుభవాలు, ప్రతికూల పరిస్థితులను తట్టుకొని ప్రాణాలు నిలబెట్టుకున్న తీరును పలువురు కార్మికులు బుధవారం మీడియాతో పంచుకున్నారు. సొరంగంలో తామంతా కష్టసుఖాలు కలబోసుకున్నామని, మిత్రులుగా మారామని చెప్పారు. ఆడిన ఆటలు, పాడుకున్న పాటల గురించి తెలియజేశారు. సొరంగంలో చిక్కుకున్నప్పుడు ప్రాణాలపై ఆశలు వదులుకున్నామని జార్ఖండ్‌లోని ఖిరాబేడా గ్రామానికి చెందిన అనిల్ బేడియా(22) అనే కార్మికుడు వెల్లడించాడు. ‘‘నవంబర్ 12న సొరంగంలో మేము పనిలో ఉండగా, హఠాత్తుగా కొంత భాగం కూలిపోయింది. భారీ శబ్ధాలు వినిపించాయి. మేమంతా లోపలే ఉండిపోయాం. బయటకు వచ్చే దారి కనిపించలేదు. ఎటు చూసినా చిమ్మచీకటి. అక్కడే సమాధి కావడం తథ్యమని అనుకున్నాం. మొదటి రెండు రోజులపాటు బతుకుతామన్న ఆశ లేకుండాపోయింది. క్రమంగా ధైర్యం కూడదీసుకున్నాం. బయట పడడానికి ప్రాధాన్యం ఇవ్వకుండా ముందు ఎలాగైనా ప్రాణాలు రక్షించుకోవాలని నిర్ణయించుకున్నాం. నిజంగా అదొక పీడకల, అగ్ని పరీక్ష. సొరంగం పైభాగంలోని రాళ్ల సందుల నుంచి పడుతున్న ఒక్కో చుక్క నీటిని ఒడిసిపట్టుకొని చప్పరించాం. మా దగ్గరున్న బొరుగులతో 10 రోజులపాటు కడుపు నింపుకున్నాం. అర్ధాకలితో గడిపాం. ఆ తర్వాత అధికారులు పైపు గుండా పండ్లు, భోజనం, నీళ్ల సీసాలు మాకు అందించారు. ప్రమాదం జరిగాక 70 గంటల తర్వాత అధికారులు మాతో మాట్లాడారు. అప్పుడే ప్రాణాలపై మాలో ఆశలు మొదలయ్యాయి. మేమంతా కలిసి నిత్యం దేవుడిని ప్రార్థించేవాళ్లం. చివరకు దేవుడు మా ప్రార్థనలు ఆలకించాడు. మొదట్లో కష్టంగా గడిచింది సొరంగంలో తాము చిక్కుకున్నట్లు తెలియగానే ఆందోళనకు గురయ్యామని ఉత్తరాఖండ్‌లోని చంపావత్ గ్రామానికి చెందిన పుష్కర్‌సింగ్ ఐరే అనే కార్మికుడు చెప్పాడు. మొదట్లో చాలా కష్టంగా గడిచిందని, చనిపోతామని అనుకున్నామని, క్రమంగా అక్కడి పరిస్థితులకు అలవాటు పడ్డామని తెలిపాడు. తొలుత సరైన ఆహారం లేదు, బయటున్నవారితో మాట్లాడే వీలు లేదని అన్నాడు. ఒంటిపై ఉన్న బట్టలతోనే 17 రోజులపాటు ఉండాల్సి వచి్చందని, స్నానం చేయలేదని, సొరంగం లోపలంతా అపరిశుభ్రంగా మారిందని తెలియజేశాడు. ప్లాస్టిక్ షీట్లపై నిద్రించామని పేర్కొన్నాడు. ఆహారం, నీరు అందిన తర్వాత ఊపిరి పీల్చుకున్నామని చెప్పాడు. కాలక్షేపం కోసం పేకాడామని, కాగితాలను క్రమపద్ధతిలో చింపుతూ ఉండేవాళ్లమని వివరించాడు. సాక్సులతో బంతులు చేసి, చోర్–సిఫాయి ఆట ఆడామని, పాటలు పాడుకున్నాం తెలిపాడు. నిత్యం యోగా, వాకింగ్ చేశాం.. సొరంగం నుంచి బయటకు వచి్చన 41 మంది కార్మికులతో మంగళవారం రాత్రి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫోన్ ద్వారా మాట్లాడారు. వారి ఆరోగ్యం గురించి ఆరా తీశారు. సొరంగంలో ఉన్నప్పుడు నిత్యం యోగా, వాకింగ్ చేశామని, తద్వారా మనోస్థైర్యం సడలకుండా జాగ్రత్తపడ్డామని, ఆత్మవిశ్వాసం పెంచుకున్నామని ప్రధానమంత్రికి కార్మికులు తెలియజేశారు. విదేశాల్లో ఉన్న భారతీయులు ప్రమాదాల్లో చిక్కుకుంటే మన ప్రభుత్వం కాపాడిందని, స్వదేశంలోనే ఉన్న తామెందుకు భయపడాలని భావించామని అన్నారు. రిషికేశ్ ఎయిమ్స్‌కు కార్మికుల తరలింపు సిల్క్యారా టన్నెల్ నుంచి బయటకు వచి్చన కార్మికులను బుధవారం రిషికేశ్‌లోని ఎయిమ్స్‌కు హెలికాప్టర్లో తరలించారు. డిజాస్టర్ వార్డులో చేర్చి, ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. మానసిక పరిస్థితి కూడా పరీక్షిస్తామని, అవసరమైన వారికి తగిన చికిత్స అందిస్తామని ఎయిమ్స్ వైద్యులు చెప్పారు. ఆరోగ్యం కుదుటపడిన వారిని ఇళ్లకు పంపిస్తామని వెల్లడించారు. కార్మికుల కుటుంబ సభ్యులు, బంధులను కూడా సిల్క్యారా నుంచి బస్సుల్లో ఎయిమ్స్‌కు తీసుకొచ్చారు. కార్మికుల గ్రామాల్లో సంబరాలు ఖిరాబేడా గ్రామం నుంచి మొత్తం 13 మంది యువకులు సొరంగం పనుల కోసం ఉత్తరకాశీకి చేరుకున్నారు. అదృష్టం ఏమిటంటే వారిలో ముగ్గురు మాత్రమే సొరంగంలో చిక్కుకున్నారు. బాధితులుగా మారిన మొత్తం 41 మంది కార్మికుల్లో 15 మంది జార్ఖండ్‌లోని వివిధ ప్రాంతాలకు చెందినవారే కావడం గమనార్హం. ఖిరాబేడాలో అనిల్ బేడియా తల్లి 17 రోజులపాటు తల్లడిల్లిపోయింది. కుమారుడు జాడ తెలియక ఆందోళనకు గురైంది. ఇంట్లో వంట చేసింది లేదు. ఇరుగు పొరుగు అందించిన భోజనంతో కడుపు నింపుకుంది. ఎట్టకేలకు కుమారుడు అనిల్ బేడియా సొరంగం నుంచి బయటకు రావడంతో ఆమె ఆనందానికి అవధుల్లేవు. ఇదే గ్రామానికి చెందిన శ్రవణ్ బేడియా(55)కు పక్షవాతం. ఏకైక కుమారుడు రాజేంద్ర సొరంగం నుంచి బయటపడడంతో అతని ఇంట సంబరాలు అంబరాన్ని తాకాయి. ప్రశంసలందుకున్న నాగపూర్ నిపుణుల సేవలు సిల్క్యారా సొరంగంలో సహాయక చర్యల్లో పలు ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు పాల్గొన్నాయి. నిపుణులు తమవంతు సేవలందించారు. కార్మికులకు ఊపిరి పీల్చుకోవడానికి ఇబ్బంది లేకుండా, కార్బన్డయాక్సైడ్ స్థాయిలు పెరగకుండా వీరు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకున్నారు. మహారాష్ట్రకు చెందిన కోల్ ఇండియా లిమిటెడ్ అనుబంధ సంస్థ డబ్ల్యూసీఎల్కు నిపుణులు సొరంగం వద్దే మకాం వేశారు. భారీ యంత్రాలతో తవ్వకం పనులు చేపట్టడంతో సొరంగం లోపల కార్బన్డయాక్సైడ్ స్థాయిలు పెరుగుతుండేవి. ప్రమాదకర స్థాయికి చేరగానే యంత్రాలను ఆపించేవారు. వారి సేవలు ప్రశంసలందుకున్నాయి. సొరంగంలో కార్మికులు భుజాలపై ఎత్తుకున్నారు ర్యాట్ హోల్ మైనింగ్ నిపుణుల్లో ఢిల్లీకి చెందిన ఫిరోజ్ ఖురేïÙ, యూపీకి చెందిన మోను కూమార్ తొలుత సొరంగంలోని కార్మికుల వద్దకు చేరుకున్నారు. తమను చూడగానే కార్మికులు ఆనందంతో భుజాలపై ఎత్తుకున్నారని ఫిరోజ్ వెల్లడించాడు. ‘‘మాకు పండ్లిచ్చారు. పేర్లు అడిగారు. అరగంట పాటు సొరంగంలో ఉన్నాం’’ అని మోను కూమార్ చెప్పాడు. తాము కార్మికుల వద్దకు వెళ్లిన ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సైతం వచ్చారని పేర్కొన్నాడు. కార్మికులను కాపాడినందుకు తాము డబ్బులేమీ తీసుకోలేదని తెలియజేశాడు. తల్లిదండ్రుల ఫొటో చూస్తూ కాలం గడిపా.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం లఖీంపూర్ ఖేరీ జిల్లా భైరాంపూర్కు చెందిన 25 ఏళ్ల మంజీత్ చౌహాన్ సిల్క్యారా టన్నెల్లో చిక్కకొని, 17 రోజుల తర్వాత బయటకు వచ్చాడు. అతడి రాకతో స్వగ్రామంలో ఆనందోత్సాహాలు వ్యక్తమయ్యాయి. మంజీత్ తల్లిదండ్రులు భైరాంపూర్లో ఉంటున్నారు. అతడి సోదరుడు గత ఏడాది రోడ్డు ప్రమాదంలో మరణించాడు. తల్లిదండ్రుల ఫొటో మంజీత్ వద్ద ఉంది. ఆ ఫొటో చూస్తూ ధైర్యం తెచ్చుకొని సొరంగంలో కాలం గడిపానని, ఒత్తిడిని అధిగమించానని చెప్పాడు. ‘‘సొరంగం లోపలిభాగం కూలిన సమయంలో అక్కడికి కేవలం 15 మీటర్ల దూరంలోనే పని చేస్తున్నాను. తొలుత అసలేం జరిగిందో అర్థం కాలేదు. క్రమంగా అది పీడ కలగా మారింది. ప్రమాదం జరిగాక మొదటి 24 గంటలు చాలా కష్టంగా గడిచాయి. మేమంతా భయందోళనకు గురయ్యాం. ఆకలి, దాహం, నీరసం, నిరాశ వంటివి అన్నీ ఒక్కసారిగా గుర్తొచ్చాయి. నాలుగు అంగుళాల పైపు గుండా అధికారులు ఆహారం, నీరు పంపించిన తర్వాత మా మానసిక స్థితి మారింది. సహాయక చర్యలు కొనసాగుతున్నట్లు తెలియడంతో మాలో మనోధైర్యం పెరిగింది. కుటుంబ సభ్యులతో మాట్లాడగలిగాం. అమ్మను జాగ్రత్తగా చూసుకోవాలని నాన్నకు చెప్పా. ఫోన్ వాల్‌పేపర్‌లో నా తల్లిదండ్రుల ఫొటో చూస్తూ ఉండిపోయేవాడిని. ప్రాణాలపై ఆశ కోల్పోకుండా అది ఉపయోగపడింది. సొరంగంలో అటూ ఇటూ నడుస్తూ ఉండేవాళ్లం. పైపు గుండా అధికారులు పంపించిన పప్పు నాకెంతో నచ్చింది. సొరంగంలో చిక్కుకున్న మేమంతా ఒకరికొకరం మంచి మిత్రులుగా మారిపోయాం. మా కష్ట సుఖాలు తెలియజేసుకున్నాం. క్రికెట్ ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ చూడలేకపోవడం పట్ల విచారంగా ఉంది. ఇంటికెళ్లిన తర్వాత మ్యాచ్ హైలైట్స్ చూస్తా’’ అని మంజీత్ చౌహాన్ ఉత్సాహంగా చెప్పాడు. సొరంగం పనులు కొనసాగుతాయి ఉత్తరాఖండ్‌లో 4.5 కిలోమీటర్ల పొడవైన సిల్క్యారా సొరంగం పనులు కొనసాగుతాయని కేంద్ర రోడ్డు రవాణా శాఖ అధికారులు బుధవారం ప్రకటించారు. కూలిపోయిన ప్రాంతంలో మరమ్మతులు, సేఫ్టీ ఆడిట్ ముగిసిన తర్వాత పనులు యథావిధిగా కొనసాగించనున్నట్లు తెలిపారు. ఇకపై ప్రమాదాలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభంచిన 900 కిలోమీటర్ల ‘చార్ధామ్ యాత్ర ఆల్ వెదర్ రోడ్’ ప్రాజెక్టులో భాగంగా సిల్క్యారా టెన్నల్‌ను నిర్మిస్తున్నారు. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో చార్‌ధామ్‌లో భాగమైన యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్ క్షేత్రాలను అనుసంధానించడానికి కేంద్రం రూ.12,000 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. అన్ని రకాల వాతావరణ పరిస్థితుల్లో నాలుగు క్షేత్రాలను చుట్టిరావడానికి వీలుగా ప్రాజెక్టును రూపొందించారు. నిర్మాణ పనులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2016 డిసెంబర్ 27న శంకుస్థాపన చేశారు. వాస్తవానికి 2020 మార్చిలోగా ప్రాజెక్టు పూర్తికావాలి. వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో జాప్యం జరుగుతోంది. కేబినెట్ భేటీలో మోదీ భావోద్వేగం సిల్క్యారా సొరంగంలో చేపట్టిన రెస్క్యూ ఆపరేషన్ కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ప్రత్యేకంగా ప్రస్తావనకు వచి్చంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన కేబినెట్ మంగళవారం రాత్రి సమావేశమైంది. సొరంగంలో చిక్కుకున్న కార్మికులను తలచుకొని ప్రధానమంత్రి తీవ్ర భావోద్వేగానికి గురయ్యారని కేంద్ర సమాచార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ బుధవారం చెప్పారు. కార్మికులను కాపాడడానికి కేంద్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుందని తెలిపారు. సహాయక చర్యలపై ప్రధాని మోదీ ఎప్పటికప్పుడు స్వయంగా ఆరా తీశారని, అధికారులకు ఆదేశాలు జారీ చేశారని వివరించారు. దేశ విదేశాల్లోని భారతీయులను కాపాడడం ప్రభుత్వ కర్తవ్యమని ఉద్ఘాటించారు. -
పోలింగ్ బూత్‌లో కుప్పకూలిన ఏజెంట్.. గుండెపోటుతో మృతి?
జైపూర్: రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓ పోలింగ్ ఏజెంట్ మృతి చెందాడు. పాలి జిల్లాలో ఓ అభ్యర్థికి సంబంధించిన పోలింగ్ ఏజెంట్ శనివారం ఉదయం పోలింగ్ జరుగుతుండగా కుప్పకూలిపోయాడు. సుమేర్పూర్ అసెంబ్లీ నియోజకవర్గంలోని బూత్ నంబర్ 47లో శాంతిలాల్ అనే పోలింగ్ ఏజెంట్ కుప్పకూలినట్లు పోలింగ్ అధికారి తెలిపారు. వెంటనే అతన్ని సమీపంలోని ఆసుపత్రికి తరలించి అక్కడి నుంచి జిల్లా ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. పోలింగ్ ఏజెంట్ మృతికి గుండెపోటు కారణమై ఉండవచ్చని అనుమానిస్తున్నారు. అయితే మృతి చెందిన పోలింగ్ ఏజెంట్ పార్టీకి సంబంధించినవారు అనే వివరాలు వెంటనే తెలియరాలేదు. కాగా రాజస్థాన్‌లో 200 అసెంబ్లీ స్థానాలు ఉండగా 199 నియోజకవర్గాలకు ఎన్నికలు జరుగున్నాయి. కరణ్‌పూర్ నియోజకవర్గంలో ఓ అభ్యర్థి మృతి చెందడంతో అక్కడ పోలింగ్ వాయిదా పడింది. -
ఉత్తరాఖండ్ లోని ఉత్తరకాశీలో కూలిన టన్నెల్
-
కుప్పకూలిన చార్దామ్ టన్నెల్..చిక్కుకున్న 40 మంది
డెహ్రాడూన్: నిర్మాణంలో ఉన్న ఓ భారీ టన్నెల్లో కొంత భాగం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 40 మంది దాకా కార్మికులు చిక్కుకున్నట్టు తెలుస్తోంది. ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీలో ఈ ఘటన జరిగింది. చార్దామ్ రోడ్డు ప్రాజెక్టులో భాగంగా సిల్క్యారా నుంచి దండల్‌గాన్‌ను కలుపుతూ నాలుగు కిలోమీటర్ల టన్నెల్ నిర్మిస్తున్నారు. ఇవాళ(ఆదివారం)ఉదయం 4 గంటల ప్రాంతంలో టన్నెల్‌లోని 150 మీటర్ల పొడవున్న ఒక భాగం కుప్పకూలినట్లు పోలీసులు చెప్పారు. టన్నెల్ కూలిన వెంటనే జిల్లా యంత్రాంగం అక్కడికి చేరుకుంది. టన్నెల్ కొంత భాగం ఓపెన్ చేసి చిక్కుకున్న 40 మంది కార్మికులను బయటికి తీసుకురావాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. ఈలోగా వారికి ఆక్సిజన్ అందించేందుకు పైప్‌ను ఏర్పాటు చేశారు. ఇదీచదవండి..రాహుల్ ఎక్కడ? -
అమెరికా ఎంక్యూ–9 డ్రోన్ పేల్చివేత
సనా: ఇప్పటికే ఇజ్రాయెల్–హమాస్ మధ్య ఘర్షణలతో పశి్చమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. మరోవైపు యెమెన్‌కు చెందిన హౌతీ మిలిటెంట్లు అమెరికా సైన్యంపై దాడులు చేస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. అమెరికాకు చెందిన ఎంక్యూ–9 డ్రోన్‌ను హౌతీ మిలిటెంట్లు పేలి్చవేశారు. యెమెన్ ప్రాదేశిక జలాల్లో బుధవారం ఈ సంఘటన జరిగిందని అమెరికా సైన్యం వెల్లడించింది. హౌతీ దుశ్చర్య నేపథ్యంలో పశి్చమాసియాలో అమెరికా సేనలు అప్రమత్తమయ్యాయి. హౌతీకి ఇరాన్ ప్రభుత్వం అండగా ఉండడం గమనార్హం. -
బ్రెజిల్లో విమానం కూలి..14 మంది మృతి
రియో డి జనిరో: బ్రెజిల్‌లోని అమెజాన్ అడవుల్లో చిన్న ప్యాసింజర్ విమానం కూలిన ఘటనలో అందులోని మొత్తం 14 మందీ దుర్మరణం చెందారు. మనాస్ నుంచి బయలుదేరిన విమానం బర్సెలోస్ సమీపంలో కూలిందన్నారు. ప్రమాద సమయంలో ఆ ప్రాంతంలో భారీగా వర్షం కురుస్తోందన్నారు. మృతుల్లో 12 మంది ప్రయాణికులు కాగా, ఇద్దరు విమాన సిబ్బంది అని అమెజొనాస్ రాష్ట్ర గవర్నర్ విల్సన్ లిమా చెప్పారు. -
లిబియా మరణాలు..11 వేలకు పైనే
డెర్నా: లిబియాలోని డెర్నాలో సంభవించిన ఆకస్మిక వరదల్లో మృతుల సంఖ్య శుక్రవారానికి 11 వేలు దాటింది. జాడ తెలియకుండా పోయిన మరో 10 వేల మంది కోసం అన్వేషణ ముమ్మరంగా సాగుతోంది. నివాస ప్రాంతాలను తుడిచిపెట్టిన మట్టి, బురద తొలగింపు పనులు సాగుతున్నాయి. సోమవారం సంభవించిన భారీ వర్షాలు, వరదలతో ఎగువనున్న రెండు జలాశయాలు బద్దలై ఒక్కసారిగా డెర్నా నగరాన్ని నీటి ప్రవాహం ముంచెత్తిన విషయం తెలిసిందే. -
విమానం ఎక్కాలన్న సరదా ఇప్పుడు తీరినట్లుంది..
సాక్షి, బళ్లారి: కర్ణాటకలోని చిత్రదుర్గం జిల్లా హిరియూరు తాలూకా వద్దికేరె గ్రామం సమీపంలో తపస్07 ఎ–14 రకం డ్రోన్ కుప్పకూలింది. చిత్రదుర్గం వద్ద డీఆర్డీఓ ఏరోనాటికల్ టెస్టింగ్ రేంజ్ (ఏటీఆర్) ఉంది. నిత్యం ఇక్కడ డ్రోన్లు, మానవ రహిత విమానాల పరీక్షలు జరుగుతుంటాయి. ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం ఈ డ్రోన్‌ను ప్రయోగాత్మకంగా పరీక్షిస్తుండగా చెళ్లకెర తాలూకా హిరియూరు వద్ద పొలంలో పెద్ద శబ్ధంతో కుప్పకూలింది. దాని భాగాలు చెల్లాచెదురుగా పడిపోయాయి. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి హాని జరగలేదు. డీఆర్డీవో అధికారులు, పోలీసులు ధ్వంసమైన డ్రోన్‌ను అక్కడి నుంచి తరలించారు. సాంకేతిక లోపంతోనే అది కూలిందని, విచారణ జరుపుతున్నామని డీఆర్డీవో అధికారులు చెప్పారు. -
విరుగుతున్న కొండచరియలు.. కుప్పకూలుతున్న ఇళ్లు
సిమ్లా: హిమాచల్ ప్రదేశ్‌లో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో కొండరియలు విరిగిపడుతున్నాయి. తాజాగా సిమ్లాలోని కృష్ణ నగర్ ప్రాంతంలో కొండచరియలు విరిగిపడగా.. వాటిపై ఉన్న ఏడు ఇళ్లు ఒక్కసారిగా కుప్పకూలిపోయాయి. ఈ భయానక దృశ్యాలు భీతికొల్పేవిగా ఉన్నాయి. ఈ ఘటనలో మరణాల సంఖ్య ఇంకా ఓ అంచనాకు రాలేమని సీపీ సంజీవ్ కుమార్ తెలిపారు. #WATCH | Several houses collapsed in Krishna Nagar area in Himachal Pradesh's Shimla after a landslide took place. Rescue operation underway. (Video Source: Local; confirmed by Police and administration) pic.twitter.com/qdYvR4C4fx — ANI (@ANI) August 15, 2023 కాగా.. గత మూడు రోజులుగా హిమాచల్ ప్రదేశ్ వర్షాలతో అతలాకుతలం అవుతోంది. ఇప్పటికే రాష్ట్రంలో వర్షాల కారణంగా 54 మంది మరణించారు. వర్షపు నీటితో నదులు ఉద్దృతంగా ప్రవహిస్తున్నాయి. సోమవారం వివిధ చోట్ల జరిగిన కొండచరియలు విరిగిపడిన ఘటనల్లో 12 మంది మృతి చెందారు. రహదారులు మూతపడ్డాయి. దీంతో రాష్ట్రంలో నేడు స్వాతంత్య్ర వేడుకలు కూడా జరపలేదు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది నిర్విరామంగా పనిచేస్తున్నారు. #WATCH | Hill collapsed in Krishna Nagar area in HP's Shimla. Around five to seven houses collapsed. Further details awaited. pic.twitter.com/esWoGcjxlB — ANI (@ANI) August 15, 2023 కాగా.. మరో రెండు రోజులు హిమాచల్ ప్రదేశ్‌లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తరాఖండ్, ఈశాన్య భారతంలో మరో ఐదు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని సూచించారు. ఇదీ చదవండి: స్వాతంత్య్ర వేడుకలకు దూరంగా ఆ రాష్ట్రం.. ఎందుకంటే. -
ఎల్బీనగర్ సాగర్ రింగ్ రోడ్డులో కూలిపోయిన ఫ్లైఓవర్
-
బిహార్‌లో కూలిన తీగల వంతెన
-
జైల్లో కుప్పకూలిన జైన్
న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టై 2022 మే నుంచి తీహార్ జైల్లో ఉన్న మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ గురువారం కుప్పకూలిపోయారు. జైల్లో కళ్లు తిరిగిపడిన జైన్‌ను పోలీసులు హుటాహుటిన దీన్‌దయాళ్ ఉపాధ్యాయ ఆస్పత్రిలో చేర్పించారు. శ్వాసతీసుకోవడంలో ఇబ్బందులు పడుతుండటంతో ఢిల్లీ ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే లోక్‌నాయక్ జయ్‌ప్రకాశ్ నారాయణ్ ఆస్పత్రి ఐసీయూకి మార్చారని ఆప్ వర్గాలు వెల్లడించాయి. గురువారం ఉదయం జైలు బాత్రూమ్లో జైన్ కాలుజారి పడిపోయారని జైలు అధికారి చెప్పారు. ‘‘కీలక అవయవాలకు గాయాలయ్యాయా అని వెంటనే వైద్యులు పరిశీలించి అంతా సాధారణంగా ఉందని తేల్చారు. వెనుకవైపు, ఎడమ కాలు, భుజం విపరీతంగా నొప్పి ఉన్నాయని చెప్పడంతో ఆస్పత్రికి తీసుకెళ్లాం’’ అన్నారు. స్నానాలగదిలో కళ్లు తిరిగి పడిపోవడంతో వెన్నెముకకు తీవ్ర గాయమైందని ఆప్ తెలిపింది. ‘‘ఢిల్లీ ప్రజలకు మంచి వైద్యం, ఆరోగ్యం అందించాలని చూసిన జైన్‌ను ఒక నియంత ఇలా శిక్షిస్తున్నాడు. దేవుడు అంతా చూస్తున్నాడు. అందరికీ న్యాయం జరుగుతుంది’ అంటూ ఆప్ నేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ట్వీట్‌చేశారు. జైన్‌ను చెప్పడంతో జైలు అధికారులు సోమవారమే సఫ్దర్‌జంగ్ ఆస్పత్రిలో చూపించారు. ‘‘జైన మతవిశ్వాసాలను బాగా పాటించే జైన్ జైల్లో కేవలం పళ్లు, పచ్చి కూరగాయలు తింటున్నారు. దాంతో 35 కిలోలు తగ్గారు. రాత్రంతా బీఐపీఏపీ మెషీన్‌తో శ్వాస ఇవ్వాలి’’ అని ఆప్ తెలిపింది. -
20 రోజుల్లో షిండే సర్కార్ పతనం: సంజయ్
జల్గావ్: మహారాష్ట్రలోని ఏక్నాథ్ షిండే ప్రభుత్వానికి మరణశాసనం సిద్ధమైందని శివసేన్(ఉద్ధవ్ వర్గం)నేత సంజయ్ రౌత్ వ్యాఖ్యానించారు. మరో 15–20 రోజుల్లో ఈ ప్రభుత్వం కూలిపోవడం ఖాయమని, మరణశాసనంపై సంతకం చేసేదెవరో ఇప్పుడు తేలాల్సి ఉందని రౌత్ జోస్యం చెప్పారు. ఉద్ధవ్ ఠాక్రే నాయకత్వంపై తిరుగుబాటు చేసి షిండే వర్గంలో చేరిన 16 మంది ఎమ్మెల్యేల అనర్హత సహా పలు పిటిషన్లు కోర్టులో పెండింగ్‌లో ఉన్న విషయాన్ని ప్రస్తావిస్తూ..తీర్పు కోసం తమ పార్టీ ఎదురు చూస్తోందని, న్యాయం జరుగుతుందన్న నమ్మకం తమకుందని చెప్పారు. ఉద్ధవ్ నేతృత్వంలోని శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీల మహా వికాస్ అఘాడీ ప్రభుత్వాన్ని గత ఏడాది జూన్‌లో షిండే, 39 మంది ఎమ్మెల్యేలు కూల్చి, బీజేపీ సాయంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం తెలిసిందే. -
డ్యాన్స్ చేస్తూ కుప్పకూలిన బీఆర్ఎస్ నేత