తైవాన్‌లో అత్యంత భారీ భూకంపం తైవాన్‌ను కుదిపేసింది. రిక్టర్ స్కేల్‌పై 7.6 గా నమోదైన ఈ భూకంపంలో నలుగురు వ్యక్తులు మరణించినట్లు తెలుస్తోంది. గత పాతికేళ్లలో ఎన్నడూ లేని విధంగా బుదవారం ఉదయం 7:58 గంటలకు ద్వీపం తూర్పు తీరాన్ని తాకింది. ఫలితంగా అనే భవనాలు నేలమట్టమయ్యాయి. కొండ చరియలు విరిగిపడ్డాయి. దీంతో అక్కడి ప్రజలు యోగ క్షేమాలపై సర్వత్రా ఆందోళన వ్యక్తమౌతోంది.
దీంతో సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన వీడియోలు వైరల్‌గా మారాయి. భూకంపం తీవ్రత దృశ్యాలు అనేక చోట రికార్డైనాయి. పలు ఆకాశహర్మ్యాలు, అనేక ఇళ్లు కూలి పోయాయి. చాలా చోట్ల రవాణా మార్గాలు దెబ్బ తిన్నాయి. మెట్రో రైలు, స్విమ్మింగ్ పూల్, దృశ్యాలు ఇంటర్నెట్‌లో బాగా వైరల్ అవుతున్నాయి.
దక్షిణాన హౌలెన్ నగరానికి 18 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్టు అమెరికా జియోలాజికల్ సర్వే (USGS) పేర్కొంది. దీంతో తూర్పు తైవాన్‌తో పాటు దక్షిణ జపాన్, ఫిలిప్పీన్స్‌లోని కొన్ని ప్రాంతాల్లో సునామీ హెచ్చరికలు జారీచేశారు. తైవాన్, జపాన్, ఫిలిప్సీన్స్ సహా పలు దేశాల్లో తరుచూ భూకంపాలు సంభవిస్తాయి. కానీ ఈ స్థాయిలో అక్కడ భూకంపం సంభవించడం గత పాతికేళ్లలో ఇదే తొలిసారి. సెప్టెంబరు 1999లో సంభవించిన భూకంపానికి 2 వేల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు.
भूकंप के समय मेट्रो के भीतर का हाल#earthquake #Taiwan pic.twitter.com/gd1dGN3BeA
— Umashankar Singh उमाशंकर सिंह (@umashankarsingh) April 3, 2024
Visuals of a Swimming Pool when the 7.4 earthquake hit Taiwan. #earthquake #Taiwan #Tsunami pic.twitter.com/YsBgfO9e2g
— Aajiz Gayoor (@AajizGayoor) April 3, 2024
Comments
Please login to add a commentAdd a comment