Earthquake
-
నేపాల్ - టిబెట్ సరిహద్దుల్లో భారీ భూకంపం
-
ప్రకాశం జిల్లాలో మళ్లీ భూకంపం
-
ఏపీలో మళ్లీ భూ ప్రకంపనలు
సాక్షి, ప్రకాశం: ఏపీలో మరోసారి భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. ప్రకాశం జిల్లాలో ఆదివారం ఉదయం భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. వివరాల ప్రకారం.. ప్రకాశం జిల్లాలోని ముండ్లమూరు మండలంలో ఆదివారం ఉదయం 10:40 గంటల సమయంలో స్వల్ప ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. సింగన్నపాలెం, మారెళ్లలోనూ భూమి కంపించింది. దీంతో, భయాందోళనకు గురైన ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఇక, శనివారం కూడా ముండ్లమూరు, తాళ్లురులో భూ ప్రకంపనలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. శనివారం రిక్టార్ స్కేల్‌పై 3.1 తీవ్రతతో భూమి కంపించినట్టు అధికారులు తెలిపారు. కాగా, గత మూడేళ్ల కాలంలో ఇక్కడ వరుసగా భూ ప్రకంపనలు వస్తున్నాయి. దీంతో, ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
ఏపీలో మళ్లీ కంపించిన భూమి.. ఎక్కడంటే?
సాక్షి, ప్రకాశం: ప్రకాశం జిల్లాలో స్వల్ప భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. మండ్లమ్మురు, తాళ్లూరు మండలాల్లో పలు చోట్లు శనివారం ఉదయం భూమి కంపించింది. దీంతో, ప్రజలు భయాందోళనలకు గురయ్యారు.ఏపీలో మరోసారి భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. తాజాగా ప్రకాశం జిల్లాలోని మండ్లమ్మురు, తాళ్లూరు మండలాల్లో భూమి కంపించింది. ఈ రెండు మండలాల్లోని పలు గ్రామాల్లో రెండు సెకన్ల పాటు భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. దీంతో, ప్రజలు భయాందోళనలకు గురై ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు.ఇదిలా ఉండగా.. ఇటీవలి కాలంలో తెలుగు రాష్ట్రాల్లో భూమి కంపించిన విషయం తెలిసిందే. తెలంగాణలోని ములుగు జిల్లా కేంద్రంగా భూ ప్రకంపనలు వచ్చాయి. అదే సమయంలో ఏపీలో విశాఖ సహా పలు జిల్లాల్లో భూమి కంపించింది. -
అది భూకంపం కాదు.. బాంబు దాడే!
నియంత పాలకుడి పీడ విరగడైందన్న సిరియా ప్రజల ఆనందం ఎంతో సేపు నిలవలేదు. ఓపక్క ప్రభుత్వ ఏర్పాటునకు తిరుగుబాటు దళాలు కొర్రీలు పెడుతున్న వేళ.. మరోవైపు మిలిటరీ స్థావరాలు, ఆయుధ కారాగార ధ్వంసం పేరిట ఇజ్రాయెల్ భీకర దాడులతో విరుచుకుపడుతోంది. దీంతో ఎప్పుడు ఏం జరుగుతుందో అని భయం భయంగా గడుపుతున్నారు ఆ దేశ ప్రజలు. తాజాగా..తాజాగా.. టార్టస్ రీజియన్‌లో భూమి కంపించినంత పనైంది. రిక్టర్ స్కేల్‌పై 3 తీవ్రత నమోదైంది. అది భూకంపం అని భావించినవారందరికీ.. సిరియన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యూమన్స్ రైట్స్ షాకిచ్చింది. ఇజ్రాయెల్ జరిపిన బాంబు దాడి అని ప్రకటించింది.వైమానిక దాడుల్లో భాగంగా.. స్థావరాలపై బాంబులు ప్రయోగించాయి ఇజ్రాయెల్ బలగాలు. ఆ ప్రభావంతో.. అగ్ని గోళం తరహాలో భారీ పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి భూమి కంపించినంత పనైంది. 2012 నుంచి ఇప్పటిదాకా సిరియా తీరం వెంట ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో.. అతిపెద్ద దాడి ఇదేనని సిరియన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యూమన్స్ రైట్స్ ప్రకటించింది. 23వ ఎయిర్ ఢిపెన్స్ బ్రిగేడ్ బేస్‌పై జరిగిన దాడిగా ఇది తెలుస్తోంది. JUST IN: 🇮🇱 Israel continues to conduct airstrikes in Syria. pic.twitter.com/06nQDxz3Fw— BRICS News (@BRICSinfo) December 15, 2024 ఇక్కడ మరో విశేషం ఏంటంటే.. ఇది భూకంపం కంటే రెండు రేట్ల వేగంతో ప్రయాణించిందట. అలా.. 800 కిలోమీటర్ల దూరంలోని టర్కీ నగరం ఇస్నిక్లోని భూకంప కేంద్రం ఈ తీవ్రతను గుర్తించడం గమనార్హం.Thank you, @CeciliaSykala . The #explosion of the ammunition depot at #Tartus , Syria was detected at Iznik, Türkiye magnetometer station 820 km away. Signal took 12 minutes to travel in the lower ionosphere. That's about twice as fast as earthquake signals travel. https://t.co/rs2nH1wtwL pic.twitter.com/3u4KYbD57f— Richard Cordaro (@rrichcord) December 16, 2024ఇక.. సిరియాపై ఇజ్రాయెల్ దాడులు చాలాకాలంగానే కొనసాగుతున్నాయి. హెజ్బొల్లాకు అత్యాధునిక ఆయుధాలు చేరకుండా ఉండేందుకే వైమానిక దాడులతో నాశనం చేస్తున్నామని ఇజ్రాయెల్ సమర్థించుకుంటోంది. సిరియాతో యుద్ధం మా అభిమతం కాదు. కానీ, మా దేశ భద్రతకు ముప్పు వాటిల్లో అంశంపై.. మరీ ముఖ్యంగా ఉత్తర సరిహద్దుపైనే మా దృష్టి ఉంది అని బెంజిమన్ నెతన్యాహూ చెబుతున్నారు. మరోవైపు.. సిరియాకు ఆయుధ సహకారం అందించిన రష్యా.. తాజా పరిణామాలతో తన స్థావరాలను ఖాళీ చేస్తోంది. తాజాగా దాడి జరిగిన స్థావరం కూడా రష్యాకు చెందినదే అనే ప్రచారం నడుస్తోంది. -
మహబూబ్ నగర్లో కంపించిన భూమి
మహబూబ్‌నగర్, సాక్షి: తెలంగాణలో మరోసారి భూమి కంపించింది. ఈసారి మహబూబ్ నగర్లో స్వల్పస్థాయిలో భూమి కంపించిందని, రిక్టర్ స్కేల్‌పై 3 తీవ్రతతో నమోదైందని అధికారులు వెల్లడించారు.శనివారం మధ్యాహ్నాం 1గం.22ని. ప్రాంతంలో దాసరిపల్లి పరిధిలో భూమి కంపించింది. కృష్ణా పరివాహక ప్రాంతంలో.. జూరాల ప్రాజెక్టు ఎగువన, దిగువన భూమి కంపించింది. తాజాగా.. ములుగు కేంద్రంగా 5.3 తీవ్రతతో భూమి కంపించిన సంగతి తెలిసిందే. ఈ ప్రభావం గోదావరి తీర ప్రాంతం వెంట.. ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాల్లో కనిపించింది. అలాగే హైదరాబాద్‌తో పాటు ఏపీలోని కొన్ని చోట్ల కూడా కొన్నిసెకన్లపాటు భూమి కంపించడం గమనార్హం.ఇదీ చదవండి: తెలంగాణను వణికించిన భూకంపం! -
మరోసారి అమెరికాను వణికించిన భూకంపం
-
తెలుగు రాష్ట్రాల వెన్నులో వణుకు పుట్టించిన భూకంపం
-
ఏమిటీ సీస్మిక్ జోన్లు.. మనం ఎక్కడున్నాం?
భూకంపాలు వచ్చేందు కు అవకాశం ఉండే ప్రాంతాలను సీస్మిక్ జోన్లుగా పేర్కొంటారు. భూమి లోపలి పొరల పరిస్థితి, వాటి మధ్య ఖాళీలు, పగుళ్లు, కదలికలు వచ్చే అవకాశం వంటి అంశా లను పరిశీలించి వీటిని.. ఎంత స్థాయిలో ప్రకంపనలు రావొచ్చనేది అంచనా వేస్తారు. ఆ తీవ్రతను బట్టి ఒకటి నుంచి ఐదు వరకు జోన్లుగా విభజిస్తారు. జోన్–1లో ఉంటే అత్యంత స్వల్ప స్థాయిలో... జోన్–5లో ఉంటే తీవ్ర స్థాయిలో తరచూ భూకంపాలు వచ్చే ప్రాంతం అని చెప్పవచ్చు.రాష్ట్రంలో భూకంప జోన్లు ఇలా..జోన్–1: అతి స్వల్ప స్థాయిలో ప్రకంపనలకు అవకాశం ఉండే ప్రాంతాలు. ఇక్కడ ప్రకంపనలు వచ్చినా మనం గుర్తించలేనంత స్వల్పంగా ఉంటాయి.జోన్–2: ప్రకంపనల తీవ్రత 0.1 నుంచి నాలుగు పాయింట్ల వరకు ఉండే ప్రాంతాలివి. రాష్ట్రంలో గ్రేటర్ హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలు, నిజామాబాద్, నల్లగొండతోపాటు ఏపీలోని కర్నూల్, నంద్యాల, అనంతపురం ప్రాంతాల వరకు జోన్–2లో ఉన్నాయి. ఇక్కడ వచ్చే ప్రకంపనలతో దాదాపుగా ఎలాంటి నష్టం ఉండదు.జోన్–3:భూకంపాల తీవ్రత రిక్టర్ స్కేలుపై 5 నుంచి 6 వరకు నమోదయ్యే అవకాశం ఉన్న ప్రాంతాలివి. మహారాష్ట్రలో చంద్రాపూర్ నుంచి మొదలై ఉత్తర తెలంగాణలో గోదావరి నది వెంట ఉన్న రామగుండం, మంచిర్యాల, భూపాలపల్లి, బెల్లంపల్లి, భద్రాచలం, ఖమ్మంతోపాటు ఏపీలోని ఉభయ గోదావరి జిల్లాలు, ఒంగోలు, నెల్లూరు తదతర ప్రాంతాలు జోన్–3 పరిధిలోకి వస్తాయి. దేశంలో చూస్తే పశ్చిమ తీర ప్రాంతాలు, గంగా, యమునా నది పరీవాహక ప్రాంతాలు ఉన్నాయి. ఇక్కడి భూకంపాలతో కొంత వరకు నష్టం జరిగే ప్రమాదం ఉంటుంది.జోన్–4:భూప్రకంపనల తీవ్రత 6 నుంచి 7 పాయింట్ల వరకు ఉండే ప్రాంతాలివి. ముంబై సహా మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలు, గుజరాత్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బిహార్, జార్ఖండ్, ఢిల్లీ వంటివి జోన్–4లో ఉన్నాయి. ఇక్కడ భారీ భూకంపాలు, తీవ్ర నష్టం జరిగే ప్రమాదం ఉంటుంది.జోన్–5: భూకంపాల తీవ్రత 7 పాయింట్లు, అంతకు మించి వచ్చే ప్రమాదమున్న ప్రాంతాలివి. హిమాలయ పర్వత ప్రాంతాలు, జమ్మూకశ్మీర్, ఈశాన్య రాష్ట్రాలు, గుజరాత్ రాష్ట్రంలోని కొంత భాగం దీని పరిధిలో ఉన్నాయి. ఇక్కడ వచ్చే భూకంపాలు అత్యంత నష్టాన్ని కలిగించే అవకాశం ఉంటుంది. -
వరదలు.. పెనుగాలులు.. భూకంపం
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: రాష్ట్రంలోని గోదావరి తీర ప్రాంతాలు ప్రకృతి విపత్తులకు నిలయంగా మారుతున్నాయి. కొన్నేళ్ల నుంచి జరిగిన ఘటనలను పరిశీలిస్తే.. ఏటా ఏదో ఒక విపత్తు ఎదురవుతోంది. ముఖ్యంగా ములుగు జిల్లా పరిసర ప్రాంతాల్లో ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలు కలకలం రేపుతున్నాయి. వరుసగా అతి భారీ వర్షాలు, వరదలు, పెనుగాలులు టోర్నడోలు, ఇప్పుడు భూకంపం వంటివి తీవ్ర చర్చనీయాంశంగా మారుతున్నాయి.అతి భారీ వర్షాలతో..2022 జూలై 14 నుంచి 16 వరకు ఈ ప్రాంతాల్లో కురిసిన కుంభవృష్టి కారణంగా గోదావరికి భారీగా వరదలు వచ్చాయి. ఏ క్షణమైనా కరకట్ట కొట్టుకుపోయి భద్రాచలం మునిగిపోతుందనే పరిస్థితి ఏర్పడింది. 2023 జూలై 27న భూపాలపల్లి, ములుగు జిల్లాల పరిధిలో అత్యంత భారీ వర్షం కురిసింది. ములుగు జిల్లా లక్ష్మీదేవిపేటలో ఏకంగా ఒక్కరోజే 64.9 సెంటీమీటర్ల వాన పడింది. అందులో కేవలం మూడు గంటల్లోనే 46.4 సెంటీమీటర్ల అతి భారీ వాన పడింది. అదేరోజు జయశంకర్ జిల్లా చిట్యాలలో 61.8 సెంటీమీటర్ల వర్షం కురిసింది. వాగులు ఉప్పొంగి గ్రామాలు నీట మునిగి పన్నెండు మంది మృత్యువాత పడ్డారు. ఈ ఏడాది ఆగస్టు 31న నర్సంపేట, పాలకుర్తి, మహబూబాబాద్ నియోజకవర్గాల పరిధిలో భారీ వర్షంపడి మున్నేరు, ఆకేరు, పాలేరు వాగులకు కనీవినీ ఎరుగని రీతిలో వరద వచ్చింది. ఖమ్మం పట్టణం, పరిసర గ్రామాలు చిగురుటాకులా వణికిపోయాయి.లక్ష చెట్లను కూల్చేసిన పెనుగాలులుఈ ఏడాది ఆగస్టు 31, సెప్టెంబర్ ఒకటో తేదీల మధ్య ములుగు జిల్లా తాడ్వాయి మండలంలో తీవ్ర పెను సుడిగాలులు వీచాయి. ఏటూరునాగారం అభయారణ్యంలో ఏకంగా 334 హెక్టార్ల పరిధిలో లక్ష వరకు చెట్లు కూలిపోయాయి. ఇది దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. ఆ వాయు విధ్వంసానికి కారణాలను ఇప్పటికీ స్పష్టంగా తేల్చలేదు. ఇక్కడే భూకంప కేంద్రాలురాష్ట్రంలోని సిర్పూర్, జైనూర్, ఆసిఫాబాద్, బెల్లంపల్లి, మంచిర్యాల, రామగుండం, మంథని, భూపాలపల్లి, వరంగల్, ములుగు, నర్సంపేట, మహబూబాబాద్, ఖమ్మం, మణుగూరు, కొత్తగూడెం, భద్రాచలం ప్రాంతాలు భూకంప సీస్మిక్ జోన్–3 పరిధిలో ఉన్నాయి. బొగ్గు గనులు విస్తృతంగా ఉన్న ఈ ప్రాంతాల్లో తరచూ భూమి నుంచి భారీ శబ్దాలు రావడం సాధారణంగా మారిపోయింది. ఇదే ప్రాంతంలోని భద్రాచలంలో 1969లో 5.7 తీవ్రతతో భూకంపం రాగా.. ఇప్పుడు 5.3 తీవ్రతతో ప్రకంపనలు నమోదయ్యాయి. గత ఆరేళ్లలో మణుగూరులో స్వల్ప స్థాయిలో మూడు సార్లు ప్రకంపనలు వచ్చాయి కూడా. భారీగా నీటి ప్రాజెక్టుల నిర్మాణం, బొగ్గు తవ్వకాలు, గోదావరిలో ఇష్టారాజ్యంగా ఇసుక తవ్వకాలు వంటివి విపత్తులకు దారితీస్తున్నాయని పర్యావరణవేత్తలు పేర్కొంటున్నారు. వేడి నీటిబుగ్గలకూ కేంద్రంములుగు జిల్లాలోని రామన్నగూడెం ప్రాంతంలో వేడి నీటిబుగ్గలు ఉన్నాయి. 1954లో ఇక్కడ చమురు నిక్షేపాల అన్వేషణ కోసం తవ్వకాలు జరిపి వదిలేసిన బోరులోనుంచి ఇప్పటికీ వేడి నీళ్లు వెలువడుతూ ఉన్నాయి. భూమి పొరల్లో పగుళ్ల వల్ల నీళ్లు మరింత లోతుకు వెళ్లి... అక్కడి అధిక ఉష్ణోగ్రతల వల్ల వేడై పైకి ఉబికివస్తాయని నిపుణులు చెబుతున్నారు.మానవ తప్పిదాలపై ప్రకృతి హెచ్చరికలివి!మానవ తప్పిదాలపై ప్రకృతి చేసిన హెచ్చరికలను మనం పట్టించుకోలేదు. మూడు నెలల క్రితం తాడ్వాయి అడవుల్లో టోర్నడోల తీవ్రత కారణంగా లక్ష చెట్లు నేలకొరిగినప్పుడే భూకంపాలపై హెచ్చరికలు జారీ అయ్యాయి. ఆ ఘటన జరిగాక కారణాలేమిటన్న దానిపై ప్రభుత్వం, వర్సిటీలు, ఎన్జీఆర్ వంటి సంస్థలు ఎలాంటి పరిశోధనలు చేయలేదు. మనం గోదావరి బెల్ట్‌ను నాశనం చేశాం. ప్రాజెక్టుల కోసం అడవులు నరికేశాం. భూమి లోపల పొరలు ఎలా ఉన్నాయి? డ్యామ్‌ల వల్ల వాటికి ఏ మేరకు నష్టం అన్నది సాంకేతికంగా పరిశీలించలేదు. అది భూకంపాలకు కారణమవుతోంది.– పాకనాటి దామోదర్‌రెడ్డి, పర్యావరణవేత్త -
వరదలు.. పెనుగాలులు.. భూకంపం
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: రాష్ట్రంలోని గోదావరి తీర ప్రాంతాలు ప్రకృతి విపత్తులకు నిలయంగా మారుతున్నాయి. కొన్నేళ్ల నుంచి జరిగిన ఘటనలను పరిశీలిస్తే.. ఏటా ఏదో ఒక విపత్తు ఎదురవుతోంది. ముఖ్యంగా ములుగు జిల్లా పరిసర ప్రాంతాల్లో ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలు కలకలం రేపుతున్నాయి. వరుసగా అతి భారీ వర్షాలు, వరదలు, పెనుగాలులు టోర్నడోలు, ఇప్పుడు భూకంపం వంటివి తీవ్ర చర్చనీయాంశంగా మారుతున్నాయి.అతి భారీ వర్షాలతో..2022 జూలై 14 నుంచి 16 వరకు ఈ ప్రాంతాల్లో కురిసిన కుంభవృష్టి కారణంగా గోదావరికి భారీగా వరదలు వచ్చాయి. ఏ క్షణమైనా కరకట్ట కొట్టుకుపోయి భద్రాచలం మునిగిపోతుందనే పరిస్థితి ఏర్పడింది. 2023 జూలై 27న భూపాలపల్లి, ములుగు జిల్లాల పరిధిలో అత్యంత భారీ వర్షం కురిసింది. ములుగు జిల్లా లక్ష్మీదేవిపేటలో ఏకంగా ఒక్కరోజే 64.9 సెంటీమీటర్ల వాన పడింది. అందులో కేవలం మూడు గంటల్లోనే 46.4 సెంటీమీటర్ల అతి భారీ వాన పడింది. అదేరోజు జయశంకర్ జిల్లా చిట్యాలలో 61.8 సెంటీమీటర్ల వర్షం కురిసింది. వాగులు ఉప్పొంగి గ్రామాలు నీట మునిగి పన్నెండు మంది మృత్యువాత పడ్డారు. ఈ ఏడాది ఆగస్టు 31న నర్సంపేట, పాలకుర్తి, మహబూబాబాద్ నియోజకవర్గాల పరిధిలో భారీ వర్షంపడి మున్నేరు, ఆకేరు, పాలేరు వాగులకు కనీవినీ ఎరుగని రీతిలో వరద వచ్చింది. ఖమ్మం పట్టణం, పరిసర గ్రామాలు చిగురుటాకులా వణికిపోయాయి.లక్ష చెట్లను కూల్చేసిన పెనుగాలులుఈ ఏడాది ఆగస్టు 31, సెప్టెంబర్ ఒకటో తేదీల మధ్య ములుగు జిల్లా తాడ్వాయి మండలంలో తీవ్ర పెను సుడిగాలులు వీచాయి. ఏటూరునాగారం అభయారణ్యంలో ఏకంగా 334 హెక్టార్ల పరిధిలో లక్ష వరకు చెట్లు కూలిపోయాయి. ఇది దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. ఆ వాయు విధ్వంసానికి కారణాలను ఇప్పటికీ స్పష్టంగా తేల్చలేదు. ఇక్కడే భూకంప కేంద్రాలురాష్ట్రంలోని సిర్పూర్, జైనూర్, ఆసిఫాబాద్, బెల్లంపల్లి, మంచిర్యాల, రామగుండం, మంథని, భూపాలపల్లి, వరంగల్, ములుగు, నర్సంపేట, మహబూబాబాద్, ఖమ్మం, మణుగూరు, కొత్తగూడెం, భద్రాచలం ప్రాంతాలు భూకంప సీస్మిక్ జోన్–3 పరిధిలో ఉన్నాయి. బొగ్గు గనులు విస్తృతంగా ఉన్న ఈ ప్రాంతాల్లో తరచూ భూమి నుంచి భారీ శబ్దాలు రావడం సాధారణంగా మారిపోయింది. ఇదే ప్రాంతంలోని భద్రాచలంలో 1969లో 5.7 తీవ్రతతో భూకంపం రాగా.. ఇప్పుడు 5.3 తీవ్రతతో ప్రకంపనలు నమోదయ్యాయి. గత ఆరేళ్లలో మణుగూరులో స్వల్ప స్థాయిలో మూడు సార్లు ప్రకంపనలు వచ్చాయి కూడా. భారీగా నీటి ప్రాజెక్టుల నిర్మాణం, బొగ్గు తవ్వకాలు, గోదావరిలో ఇష్టారాజ్యంగా ఇసుక తవ్వకాలు వంటివి విపత్తులకు దారితీస్తున్నాయని పర్యావరణవేత్తలు పేర్కొంటున్నారు.వేడి నీటిబుగ్గలకూ కేంద్రంములుగు జిల్లాలోని రామన్నగూడెం ప్రాంతంలో వేడి నీటిబుగ్గలు ఉన్నాయి. 1954లో ఇక్కడ చమురు నిక్షేపాల అన్వేషణ కోసం తవ్వకాలు జరిపి వదిలేసిన బోరులోనుంచి ఇప్పటికీ వేడి నీళ్లు వెలువడుతూ ఉన్నాయి. భూమి పొరల్లో పగుళ్ల వల్ల నీళ్లు మరింత లోతుకు వెళ్లి... అక్కడి అధిక ఉష్ణోగ్రతల వల్ల వేడై పైకి ఉబికివస్తాయని నిపుణులు చెబుతున్నారు.మానవ తప్పిదాలపై ప్రకృతి హెచ్చరికలివి!మానవ తప్పిదాలపై ప్రకృతి చేసిన హెచ్చరికలను మనం పట్టించుకోలేదు. మూడు నెలల క్రితం తాడ్వాయి అడవుల్లో టోర్నడోల తీవ్రత కారణంగా లక్ష చెట్లు నేలకొరిగినప్పుడే భూకంపాలపై హెచ్చరికలు జారీ అయ్యాయి. ఆ ఘటన జరిగాక కారణాలేమిటన్న దానిపై ప్రభుత్వం, వర్సిటీలు, ఎన్జీఆర్ వంటి సంస్థలు ఎలాంటి పరిశోధనలు చేయలేదు. మనం గోదావరి బెల్ట్‌ను నాశనం చేశాం. ప్రాజెక్టుల కోసం అడవులు నరికేశాం. భూమి లోపల పొరలు ఎలా ఉన్నాయి? డ్యామ్‌ల వల్ల వాటికి ఏ మేరకు నష్టం అన్నది సాంకేతికంగా పరిశీలించలేదు. అది భూకంపాలకు కారణమవుతోంది.– పాకనాటి దామోదర్‌రెడ్డి, పర్యావరణవేత్త -
మేడారంలో భూకంపం!
సాక్షి, హైదరాబాద్/ ములుగు/ ఏటూరునాగారం/ సాక్షి నెట్వర్క్: బుధవారం ఉదయం.. సమయం 7.27 గంటలు.. ములుగు జిల్లా మేడారంలోని దట్టమైన అటవీ ప్రాంతం.. ఉన్నట్టుండి ఏదో కలకలం.. ఒక్కసారిగా అంతా ఊగిపోవడం మొదలైంది.. నిమిషాల్లోనే ఇది వందల కిలోమీటర్ల దూరం వ్యాపించింది. ముఖ్యంగా గోదావరి నది పరీవాహక ప్రాంతమంతటా విస్తరించింది. తమ చుట్టూ ఉన్నవన్నీ ఊగిపోతున్నట్టుగా కనిపించడంతో జనం గందరగోళానికి గురయ్యారు.. మేడారం కేంద్రంగా వచ్చిన భూకంపం ప్రభావం ఇది. ఇక్కడ రిక్టర్ స్కేల్‌పై 5.3 తీవ్రతతో ప్రకంపనలు వచ్చినట్టు జాతీయ భూకంప పరిశోధన కేంద్రం (నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ – ఎన్సీఎస్) ప్రకటించింది. ఇక్కడి దట్టమైన అటవీ ప్రాంతంలో సుమారు 40 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం ఉన్నట్టు గుర్తించామని తెలిపింది. ఇంతకుముందు 1969లో భద్రాచలం వద్ద 5.7 తీవ్రతతో భూకంపం రాగా.. 55 ఏళ్ల తర్వాత ఇప్పుడు దాదాపు అదేస్థాయిలో ప్రకంపనలు రావడం గమనార్హం. అయితే భూకంపాలకు వచ్చే అవకాశం తక్కువగా ఉన్న జోన్–2, 3ల పరిధిలో తెలంగాణ ఉందని... ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ‘నేషనల్ జియోఫిజికల్ రిసెర్చ్ ఇనిస్టిట్యూట్ (ఎన్జీఆర్ఐ)’శాస్త్రవేత్తలు తెలిపారు. కంపించిన సమ్మక్క, సారలమ్మ గద్దెలు భూకంప కేంద్రానికి అత్యంత సమీపంలో ఉన్న మేడారం సమ్మక్క, సారలమ్మ ఆలయం వద్ద ప్రభావం ఎక్కువగా కనిపించింది. సమ్మక్క–సారలమ్మ గద్దెలపై భక్తులు, పూజారులు ఉన్న సమయంలో వచ్చిన ప్రకంపనలతో.. అమ్మవార్ల హుండీలు, పల్లెం, ఇతర సామగ్రి కదలిపోయాయి. ఈ దృశ్యాలు సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి కూడా. బుధవారం మేడారం వచ్చి సమ్మక్క, సారలమ్మలను దర్శించుకున్న ములుగు కలెక్టర్ దివాకర టీఎస్ మీడియాతో మాట్లాడారు. సెపె్టంబర్ 4న దట్టమైన అటవీ ప్రాంతంలో టోర్నడోలతో వేలాది చెట్లు నేలమట్టం కావడానికి.. ఇప్పుడు వచ్చిన భూకంపానికి ఎలాంటి సంబంధం లేదని, దీనిపై అవాస్తవ ప్రచారాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. రెండు రాష్ట్రాల్లోనూ ప్రభావం మేడారం కేంద్రంగా వచ్చిన భూకంపం ప్రభావం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కనిపించింది. బుధవారం ఉదయం 7.27 గంటలకు భూకంపం రాగా.. సుమారు రెండు, మూడు నిమిషాల తర్వాత దూర ప్రాంతాల్లోనూ ప్రకంపనలు కనిపించాయి. భూకంప కేంద్రం నుంచి చుట్టూ సుమారు 225 కిలోమీటర్ల దూరం వరకు విస్తరించాయి. ఏపీలో ఎనీ్టఆర్ జిల్లా నుంచి విశాఖపట్నం జిల్లా వరకు స్వల్పంగా రెండు, మూడు సెకన్ల పాటు ప్రకంపనలు వచ్చినట్టు గుర్తించారు. వాటి తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 3 పాయింట్లలోపే నమోదైనట్టు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. తెలంగాణతోపాటు పొరుగు రాష్ట్రాల్లో కలిపి వందకు పైగా ప్రాంతాల్లో ప్రకంపనలు నమోదైనట్టు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ (ఎన్సీఎస్) వెబ్సైట్, భూకంప్ మొబైల్యాప్ ద్వారా వెల్లడైంది. ఇది రెండో పెద్ద భూకంపం... గోదావరి నది పరీవాహక ప్రాంతం వెంబడి రిక్టర్ స్కేల్‌పై 2 నుంచి 4 తీవ్రత వరకు భూకంపాలు వచ్చినా.. ఇలా 5 పాయింట్లకు పైన తీవ్రత ఉండటం అరుదని నిపుణులు చెబుతున్నారు. 1969 జూలై 5న భద్రాచలం వద్ద 5.7 తీవ్రతతో వచ్చిన భూకంపమే పెద్దది. 1983లో మేడ్చల్‌లో 4.8, 2021లో పులిచింతలలో 4.6 తీవ్రతతో భూకంపాలు వచ్చాయి. ఇప్పుడు మేడారంలో వచ్చిన భూకంపం గత 55 ఏళ్లలో రెండో పెద్దదిగా రికార్డయింది. రెండు తెలుగు రాష్ట్రాలను కలిపి చూస్తే... ఇది నాలుగో అతిపెద్ద భూకంపమని చెబుతున్నారు. సమ్మక్క, సారలమ్మ మహిమ అనుకున్నాం.. మేడారంలోని సారలమ్మ గద్దె వద్ద ఉదయం పూజలు చేస్తున్నాం. ఉన్నట్టుండి ఒక్కసారిగా అమ్మవార్ల గద్దెలు, గ్రిల్స్ ఊగడం మొదలుపెట్టాయి. రెండు, మూడు సెకన్లు గద్దెలు కదిలాయి. భయాందోళనకు గురయ్యా. ఇది సమ్మక్క, సారలమ్మ తల్లుల మహిమ అనుకున్నా.. తర్వాత భూకంపం అని తెలిసింది. – కాక కిరణ్, సారలమ్మ, పూజారి దేశంలోనే సురక్షిత ప్రాంతం హైదరాబాద్ భూకంపాల విషయంలో దేశంలోనే అత్యంత సురక్షిత ప్రదేశం హైదరాబాద్. తెలంగాణలోని చాలా ప్రాంతాలు దక్కన్ పీఠభూమిపై ఉండటంతో భూకంపాల ప్రమాదం చాలా తక్కువ. సాధారణంగా చూస్తే రెండు తెలుగు రాష్ట్రాలు ఒకింత సేఫ్‌జోన్‌లోనే ఉన్నాయి. అయితే గోదావరి నదికి దగ్గరిలోని పరీవాహక ప్రాంతాల్లో తీవ్రత కొంత ఎక్కువగా ఉంటుంది. వేల ఏళ్లుగా నది ప్రవాహం వల్ల భూగర్భంలో ఏర్పడే పగుళ్లు (ఫాల్ట్స్) దీనికి కారణం. 5 పాయింట్లలోపు వచ్చే భూకంపాలతో ప్రమాదమేమీ ఉండదు. భవనాలు ఊగడం, పగుళ్లురావడం వంటివి జరగొచ్చు. ఆరు, ఏడు పాయింట్లు దాటితేనే భవనాలు కూలిపోతాయి. – పూర్ణచంద్రరావు, పూర్వ డైరెక్టర్, నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ ఇక్కడ తరచూ ప్రకంపనలు సాధారణమే.. గోదావరి నది పరీవాహక ప్రాంతంలో తరచూ మనం గమనించలేనంత స్వల్ప స్థాయిలో భూకంపాలు వస్తూనే ఉంటాయి. ఈ జోన్ పరిధిలో రిక్టర్ స్కేల్‌పై 6 పాయింట్ల వరకు భూకంపాలు వచ్చే వీలుంది. జియోలాజికల్, టెక్టానిక్ యాక్టివిటీని బట్టి తెలంగాణ జోన్–2, జోన్–3ల పరిధిలో ఉంది. హైదరాబాద్, చుట్టుపక్కల ప్రాంతాలు జోన్–2లోకి వస్తాయి. ఇప్పుడు భూకంపం సంభవించిన ప్రాంతం జోన్–3లో ఉంది. ఏపీలోని ప్రకాశం, ఒంగోలు, అద్దంకి వంటివి కూడా జోన్–3లోనే ఉన్నాయి. – ఎం.శేఖర్, ప్రిన్సిపల్ సైంటిస్ట్, ఎన్జీఆర్ఐ భూమి పొరల్లో సర్దుబాటుతోనే.. భూమి లోపలి పొరల్లో అసమతౌల్యత ఉంటే సర్దుబాటు అయ్యే క్రమంలో భూకంపాలు వస్తాయి. మేడారం భూకంపం అలాంటిదే. నేల పొరల్లో సర్దుబాటు పూర్తయ్యే వరకు కంపనాలు వస్తూ ఉంటాయి. గతంలో సర్వే ఆఫ్ ఇండియా పరిశోధనల్లో హైదరాబాద్ నుంచి భద్రాచలం వరకు లినియమెంట్ ఉన్నట్టు తేలింది. అయితే భారీ వర్షాలు, పెనుగాలులకు భూకంపాలకు సంబంధం లేదు. వాటికి గ్లోబల్ వార్మింగ్ వంటి వాతావరణ మార్పులే కారణం. ఈ ఏడాది ఉత్తరార్ధ గోళంలో భీకర వర్షాలు కురిశాయి. దుబాయ్ వంటి ఎడారి దేశాల్లో వరదలు వచ్చాయి. – చకిలం వేణుగోపాల్, రిటైర్డ్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్, సర్వే ఆఫ్ ఇండియా -
55 ఏళ్ల తర్వాత ఆ రేంజ్లో.. భయపెట్టిన భూకంపం!
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల వెన్నులో ఇవాళ(బుధవారం, డిసెంబర్ 4 2024) స్వల్ప భూకంపం వణుకు పుట్టించింది. ఉదయం ఏడు గంటల ప్రాంతంలో కొన్ని సెకన్ల పాటు భూమి కంపించింది. దీంతో భయాందోళనకు గురైన ప్రజలు.. బయటకు పరుగులు తీశారు. మీడియా కథనాలతో తమవారి క్షేమసమాచారం గురించి.. ప్రకంపనల గురించి ఆరాలు తీస్తూ కనిపించారు. మరోపక్క.. మళ్లీ భూకంపం రావొచ్చన్న వదంతుల నడుమ చాలా గ్రామాల్లో ప్రజలు సాయంత్రం దాకా రోడ్ల మీదే గడుపుతూ కనిపించారు. భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.0గా నమోదైందని, తెలంగాణలోని ములుగు జిల్లా మేడారంలో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు హైదరాబాద్‌లోని సీఎస్ఐఆర్-ఎన్జీఆర్ఐ శాస్త్రవేత్తలు వెల్లడించారు. భూకంప కేంద్రం నుంచి 225 కి.మీ పరిధిలో ఈ ప్రకంపనల ప్రభావం కనిపించిందన్నారు.ఆస్తి, ప్రాణ నష్టం నమోదు కాలేదని ప్రకటించారు.👉హైదరాబాద్ సహా ఉమ్మడి ఖమ్మం, రంగారెడ్డి, వరంగల్, కరీంనగర్, జనగామ జిల్లాల పరిధిలో ప్రకంపనలు వచ్చాయి. హైదరాబాద్ నగర పరిధిలోని వనస్థలిపురం, హయత్‌నగర్, అబ్దుల్లాపూర్‌మెట్ పరిసర ప్రాంతాల్లో భూమి కంపించింది. ఏపీలోని విజయవాడ, విశాఖపట్నం, జగ్గయ్యపేట, నందిగామ, ఏలూరు సహా పలు ప్రాంతాల్లో భూమి కంపించింది.👉1969లో భద్రాచలం పరిసరాల్లో దాదాపు ఇదే తీవ్రతతో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. సుమారు 50 ఏళ్ల తర్వాత నేడు ఆ తీవ్రతతో ప్రకంపనలు వచ్చాయని భూగర్భ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భూమి పగుళ్లలో ఒత్తిడితో స్థానచలనం జరిగి ప్రకంపనలు వస్తుంటాయని తెలిపారు. 👉హైదరాబాద్, భద్రాచలం, ఏటూరు నాగారం, ములుగు తదితర ప్రాంతాలు జోన్-3లో ఉన్నాయన్నారు. కానీ, జోన్-5లో ఉన్న ఉత్తర భారతంలోని ప్రాంతాలతో పోలిస్తే మన దగ్గర తీవ్రత తక్కువగా ఉంటుందని చెప్పారు. దీంతో.. ప్రజలు భయాందోళన చెందాల్సిన అవసరం లేదంటున్నారు.👉ములుగు నుంచి 50 కిలోమీటర్లు ఈశాన్యం వైపు ఏటూరు నాగారం భూకంప కేంద్రంలో రిక్టర్ స్కేల్ పై 5 తీవ్రతగా భూకంపం నమోదైంది. గతంలో 1969, 2018లో కొత్తగూడెం, భద్రాచలంలో భూ ప్రకంపనలు వచ్చాయి.👉తెలుగు రాష్ట్రాల్లో భూ ప్రకంపనలపై తెలంగాణ విపత్తు నిర్వహణశాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. ములుగు జిల్లా మేడారం వద్ద భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు చెప్పారు. భూమికి 40 కి.మీ లోతులో ప్రకంపనలు వచ్చాయని తెలిపింది. భూకంప కేంద్రం ఎక్కువ లోతులో ఉన్నందున ప్రకంపనల తీవ్రత తక్కువగా ఉందని చెప్పారు. ఇప్పటి వరకు ఉన్న సమాచారం మేరకు ఎలాంటి నష్టం జరగలేదని, అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉందని, వదంతులు నమ్మొద్దని తెలిపింది. -
‘మళ్లీ భూ ప్రకంపనలు’.. వాట్సాప్‌లో వాయిస్ మెసేజ్ చక్కర్లు
జయశంకర్, సాక్షి: ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో ఏ నలుగురు కలిసినా.. ఆఖరికి ఫోన్లలో మాట్లాడిన ఈ ఉదయంపూట సంభవించిన భూ ప్రకంపనల గురించే చర్చించుకుంటున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంతో పాటు కాటారం రెవెన్యూ డివిజన్ లోని కాటారం , మల్హార్ రావు, మహముత్తారం, మహదేవపూర్, పలిమెల మండలాల్లో నాలుగు సెకండ్ల పాటు కంపించిన భూమి.. ప్రజలను తీవ్ర భయాందోళనకు గురి చేసింది. అయితే..ఇది చర్చ వరకే పరిమితం కాలేదు. ‘‘మళ్లీ భూకంపం వస్తోందంటూ..’’ సోషల్ మీడియాలో ఓ వాయిస్ మెసేజ్.. వాట్సాప్ గ్రూపులలో చక్కర్లు కొడుతోంది. దీంతో జనం హడలిపోతున్నారు. ఇళ్లలోకి వెళ్లకుండా రోడ్లపై కూర్చుని.. భూకంపం గురించే చర్చించుకుంటున్నారు. అయితే ఈ ప్రచారాన్ని ఖండించిన పోలీసులు.. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రజలకు భరోసా కల్పిస్తున్నారు. అలాగే తప్పుడు ప్రచారాలు చేసేవాళ్లపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరిస్తున్నారు.ఇదిలా ఉంటే.. జిల్లా వ్యాప్తంగా ఉదయం భూమి స్వల్పంగా కంపించడంతో ప్రజలు వణికిపోయారు. భూపాలపల్లి జిల్లా కేంద్రంతో పాటు చిట్యాల మండలం కైలాపూర్ గ్రామంలో భూకంప తీవ్రత దృశ్యాలు సీసీ కెమెరాలు రికార్డు అయ్యాయి. అలాగే.. రంగాపురం గ్రామంలోని ఓ ఇంటి పెంకులు ఊడిపడిపోవడంతో.. ఆ ఊరి ప్రజలు ఆ ఇంటి వద్ద గుమిగూడారు. తమ ప్రాంతాల్లో ఏళ్ల తరబడి ఇలాంటి ఘటనలు చూడలేదని కొందరు వృద్ధులు చెబుతున్నారు. అయితే ఈ ప్రాంతం సేఫ్ జోన్‌గానే ఉందని, స్వల్ప ప్రకంపనలకు భయపడనక్కర్లేదని, భారీ భూకంపాలు అసలు తెలుగు రాష్ట్రాల్లో వచ్చే ఛాన్సే లేదని శాస్త్రవేత్తలు అంటున్నారు.అయితే.. గోదావరి పరివాహక ప్రాంతాల్లో భారీ భూకంపాల సంభవించే అవకాశాలపై.. అలాగే వీక్ జోన్ల పరిశీలనపై తమ అధ్యయనం కొనసాగుతోందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.20 ఏళ్ల తర్వాత తెలుగు గడ్డపై భూకంపం!.. చిత్రాల కోసం క్లిక్ చేయండి -
భాగ్యనగరంలో భూకంపం.. ఉలిక్కిపడ్డ నగరవాసులు
-
తెలుగు రాష్ట్రాల్లో కంపించిన భూమి.. 20 ఏళ్ల తర్వాత భూ ప్రకంపనలు (ఫొటోలు)
-
తెలుగు రాష్ట్రాల్లో భూప్రకంపనలు
-
తెలుగు రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు.. భయంతో జనం పరుగులు
సాక్షి, ఖమ్మం: తెలుగు రాష్ట్రాల్లో పలు జిల్లాల్లో భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా, విజయవాడ, జగ్గయ్యపేట.. తెలంగాణలోని ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి వరంగల్ జిల్లాలతో సహా హైదరాబాద్‌లో కూడా భూమి కంపించడంతో ఇళ్లలో నుంచి ప్రజలు పరుగులు తీశారు. పలు ప్రాంతాల్లో బుధవారం ఉదయం 7:27 గంటలకు రెండు నిమిషాల పాటు భూమి కంపించింది. దీంతో, ఇళ్లు, అపార్ట్మెంట్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ప్రకంపనల తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.3గా నమోదైంది. కాగా, ములుగు జిల్లాలోని మేడారం కేంద్రంగా భూమి కంపించినట్టు అధికారులు చెబుతున్నారు. దాదాపు 20 ఏళ్ల తర్వాత తెలుగు స్టేట్స్లో ఇలా భూమి కంపించడం గమనార్హం. ఈ మేరకు సీఎస్ఐఆర్ ఓ ఫొటోను విడుదల చేసింది. Got a whatsapp forward video from Bhadrachalam, Telangana. A strong one 😮Credits to respective owner pic.twitter.com/i3OR9wFfM4— Telangana Weatherman (@balaji25_t) December 4, 2024 వివరాల ప్రకారం.. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, బోరబండ, రాజేంద్రనగర్, రాజేంద్రనగర్ సహా రంగారెడ్డి జిల్లాలో దాదాపు ఐదు సెకన్ల పాటు భూమి కంపించినట్టు స్థానికులు చెబుతున్నారు. తెలంగాణలోని చాలా జిలాల్లో భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. అటు, మహారాష్ట్రలోని గడ్చిరోలిలో కూడా భూమి కంపించింది. ఖమ్మంలోకి నేలకొండపల్లి, భద్రాద్రి కొత్తగూడెంలోని చుండడ్రుగొండలో బుధవారం తెల్లవారుజామున కొన్ని సెకన్ల పాటు భూమి కంపించినట్టు ప్రజలు తెలిపారు. భూ ప్రకంపనలతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.For the first time in last 20years, one of the strongest earthquake occured in Telangana with 5.3 magnitude earthquake at Mulugu as epicentre.Entire Telangana including Hyderabad too felt the tremors. Once again earthquake at Godavari river bed, but a pretty strong one 😮 pic.twitter.com/RHyG3pkQyJ— Telangana Weatherman (@balaji25_t) December 4, 2024అటు ఉమ్మడి వరంగల్ జిల్లాలో కూడా భూమి కంపించింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం రంగాపురం గ్రామంలో 10 సెకన్ల పాటు భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గవ్యాప్తంగా స్వల్పంగా భూమి కంపించింది. దీంతో, ప్రజలు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. అలాగే, కేససముద్రం, మహబూబాబాద్, బయ్యారంలో కూడా కొన్ని సెకండ్ల పాటు భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి.హన్మకొండ జిల్లా పరకాల డివిజన్లో భూ ప్రకంపనలు వచ్చాయి. అలాగే, వరంగల్‌లోని పలు ప్రాంతాల్లో 5 నుండి 15 సెకండ్ల వరకు స్వల్పంగా కంపించిన భూమి. దీంతో, భయాందోళనలో స్థానికులు ఉన్నాయి. భూమి కంపించడంపై ఉదయాన్నే సిటి మొత్తం పెద్ద ఎత్తున చర్చనీయాంశం అవుతోంది. కరీంనగర్‌లోని పలు ప్రాంతాల్లో కూడా భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా, విజయవాడ, తిరువూరు, నందిగామ, గుడివాడ, మంగళగిరి, జగ్గయ్యపేటలోని పలు ప్రాంతాల్లో భూమి కంపించడంతో ప్రజలు భయంతో పరుగులు తీసినట్టు చెబుతున్నారు. బుధవారం ఉదయం కొన్ని సెకన్ల పాటు భూమి కంపించినట్టు స్థానికులు చెబుతున్నారు. -
ఇరాన్ భూగర్భ అణుపరీక్షలు?
టెహ్రాన్: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలను ఇరాన్ మరింత పరాకాష్టకు తీసుకెళ్తోందా? అందులో భాగంగా తాజాగా అణు పరీక్షలు నిర్వహించిందా? అక్టోబర్ 5న శనివారం రాత్రి ఇరాన్, ఇజ్రాయెల్ భూభాగాల్లో దాదాపుగా ఒకే సమయంలో సంభవించిన భూకంపం ఈ అనుమానాలకు తావిస్తోంది. స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 10:45 ప్రాంతంలో ఇరాన్‌లోని అరదాన్ నగర సమీపంలో సంభవించిన ఈ భూకంప తీవ్రత 4.5గా నమోదైంది. అక్కడికి 110 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో కూడా ప్రకంపనలు చోటుచేసుకున్నట్టు అమెరికా భూ¿ౌతిక సర్వే విభాగం ధ్రువీకరించింది. తర్వాత కొద్ది నిమిషాలకే ఇజ్రాయెల్‌లోనూ ప్రకంపనలు కన్పించాయి.యి. ఇది భూకంపం కాదని, కచి్చతంగా భూగర్భ అణు పరీక్షల పర్యవసానమేనని విశ్లేషణలు వెల్లువెత్తుతున్నాయి. భూకంపం సంభవించింది అణు ప్లాంట్‌కు అతి సమీపంలోనే అంటూ వస్తున్న వార్తలు ఈ అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయి. భూ కంప కేంద్రం ఉపరితలానికి కేవలం 10 కి.మీ. లోపల ఉండటం చూస్తుంటే భూగర్భ అణు పరీక్షలు జరిగి ఉంటాయని అంటున్నారు. -
జపాన్‌లో భూకంపం.. సునామీ హెచ్చరిక జారీ
టోక్యో: జపాన్ తీరంలోని పసిఫిక్ మహాసముద్రంలో భూకంపం సంభవించింది. మంగళవారం త్లెలవారుజామున రిక్టార్ స్కేల్‌పై 5.9 తీవ్రతతో భూకంపం సంభవించటంతో.. జపాన్ దీవులైన ఇజు, ఒగాసవారాలకు అధికారులు సునామీ హెచ్చరికలు జారీచేశారు. జపాన్ రాజధాని టోక్యోకు 600 కిలోమీటర్ల దూరంలోని తోరిషిమా ద్వీపంలో సంభవించిన భూకంపంతో ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదని ఆ దేశ వాతావరణ సంస్థ వెల్లడించింది. భూకంపం కారణంగా పెద్దగా ప్రకంపనలు చోటుచేసుకొనప్పటికీ.. భూకంపం సంభవించిన 40 నిమిషాల్లోనే ఇజు దీవుల్లోని హచిజో ద్వీపంలో దాదాపు 50 సెంటీమీటర్ల అతి చిన్న సునామీ వచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు. అయితే, సముద్రపు నీరు ఒక మీటరు ఎత్తులో ఎగసిపడితే సునామి ప్రభావం తీవ్రంగా ఉంటుందని అధికారులు అందోళన వ్యక్తం చేస్తున్నారు.All tsunami warnings lifted for Japan's Izu and Ogasawara islands after earlier 5.6 magnitude earthquake https://t.co/bWfknc7WAj— Factal News (@factal) September 24, 2024క్రెడిట్స్: Factal Newsఈ క్రమంలోనే అధికారులు.. ముందస్తుగా సునామీ హెచ్చరికలు జారీ చేశారు. తరచూ భూకంపాలు సంభవించే జపాన్‌లో గత రెండు నెలల్లో అనేక చిన్న భూకంపాలు చోటుచేసుకున్నాయి. సెప్టెంబరు 23న తైవాన్‌లో 4.8 తీవ్రత, సెప్టెంబర్ 22న ఎహిమ్‌లో 4.9 తీవ్రత, సెప్టెంబర్ 21న చిబాలో 4.6 తీవ్రతతో చిన్న భూకంపాలు సంభవించాయి.చదవండి: వింత శబ్దాల మిస్టరీ వీడింది -
Russia: రష్యాలో భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
రష్యాలో భూకంపం సంభవించింది. స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం ఇది చోటుచేసుకుంది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత ఏడుగా నమోదైంది. భూకంప కేంద్రం తూర్పు కంచట్కా ద్వీపకల్ప తీరంలో ఉందని వెల్లడయ్యింది. ఈ భూకంపం దరిమిలా యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే అధికారులు సునామీ హెచ్చరికలను జారీ చేశారు.భూకంపం అంటే భూమిలోని క్రస్ట్ పొరలో అకస్మాత్తుగా విడుదలయ్యే ఒత్తిడి శక్తి. దీని ఫలితంగా భూమి లోపలి నుంచి బయటకు ప్రకంపనలు పుట్టించే తరంగాలు విడుదలవుతాయి. క్రస్ట్‌లో ఏర్పడే ఒత్తిళ్లు చాలా వరకు రాతి పొర వరకు మాత్రమే వస్తాయి. అయితే రాతి పొరను మించిపోయిన ఒత్తిడి వచ్చినప్పుడు అది బలహీన ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకుంటుంది. ఫలితంగా భూకంపాలు ఏర్పడుతాయి. అయితే భూకంప తీవ్రత అధికంగా ఉంటే దాని ప్రకంపనలు చాలా దూరం వరకూ విస్తరిస్తాయి. Magnitude 7.0 earthquake strikes off #Russia, tsunami warning issued: #US monitors. https://t.co/eLyx1YCU4L pic.twitter.com/wWvMMnmKZb— Arab News (@arabnews) August 17, 2024 -
జపాన్ను కుదిపేసిన తీవ్ర భూకంపం
టోక్యో: జపాన్ దక్షిణ తీర ప్రాంతంలో గురువారం శక్తివంతమైన భూకంపం సంభవించింది. క్యుషు దీవిలో ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.1గా నమోదైంది. భూమికి సుమారు 30 కిలోమీటర్ల అడుగున భూకంప కేంద్రం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. నిచినన్ నగరంతోపాటు మియజాకి ప్రిఫెక్చర్ తీవ్ర ప్రభావానికి గురైంది. భూకంప కేంద్రానికి సమీపంలోని మియజాకి విమానాశ్రయంలో భవనాల అద్దాలు ధ్వంసమయ్యాయి. ముందు జాగ్రత్తగా అధికారులు రన్‌వేను మూసివేశారు. పొరుగునే ఉన్న కగోíÙయా ప్రిఫెక్చర్‌లోని ఒసాకిలో కాంక్రీట్ గోడలు ధ్వంసమయ్యాయి. క్యుషు, షికోకు దీవుల తీరం వెంబడి అలలు సుమారు 1.6 అడుగుల ఎత్తున సుమారు అరగంటసేపు ఎగిసిపడ్డాయి. దీంతో, అధికారులు ముందు జాగ్రత్తగా సునామీ హెచ్చరికలు జారీ చేశారు. తీరప్రాంతాల వైపు వెళ్లరాదని ప్రజలకు సూచనలిచ్చారు. భూకంపం తాకిడితో ముగ్గురు గాయపడినట్లు అధికారులు తెలిపారు. -
జపాన్‌లో భారీ భూకంపం
జపాన్లోభారీ భూకంపం సంభవించింది. దక్షిణ ద్వీపం క్యుషు ప్రాంతంలో గురువారం తెల్లవారుజామున స్వల్ప వ్యవధిలో రెండుసార్లు భూమి కంపించింది. యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే ప్రకారం రిక్టర్‌స్కేల్‌పై తొలిసారి 6.9 తీవ్రతతో, రెండోసారి 7.1 తీవ్రతతో భారీ భూకంపం నమోదైంది . జపాన్ వాతావరణ కేంద్రం ప్రకారం దక్షిణ జపాన్‌లోని క్యుషు తూర్పు తీరంలో సుమారు 30 కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రీకృతమై ఉంది.ఈ భూ ప్రకంపనల ధాటికి ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఇళ్లు, కార్యాలయాల నుంచి ఒక్కసారిగా బయటకు పరుగులు తీశారు. ఈ ఘటనలో ప్రాణ, ఆస్తి నష్టానికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియరాలేదు.అదే విధంగా జపాన్‌కు వాతావరణ శాత సునామీ హెచ్చరిక జారీ చేసింది. పశ్చిమ దీవులైన క్యుషు, షికోకులోని పసిఫిక్ తీరంలో సముద్ర మట్టం ఒక మీటరు మేర పెరిగే ప్రమాదం ఉందని, ప్రజలు సముద్రం, నదీ తీరాలకు దూరంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. -
ఫిలిప్పీన్స్‌లో 6.7 తీవ్రతతో భూకంపం
ఫిలిప్పీన్స్‌లోని మిండనావో ద్వీపం తూర్పు తీరంలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 6.7గా నమోదైంది. భూకంప కేంద్రం భూమికి 10 కిమీ (6.21 మైళ్ళు) లోతులో ఉందని జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియోసైన్సెస్ (జిఎఫ్‌జెడ్) వెల్లడించింది.యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపిన వివరాల ప్రకారం భూకంప తీవ్రత 6.8గా నమోదైంది. ఈ విపత్తు కారణంగా ఎలాంటి సునామీ ముప్పు లేదని అమెరికా జాతీయ సునామీ హెచ్చరికల కేంద్రం తెలిపింది. ఫిలిప్పీన్ సిస్మోలజీ ఏజెన్సీ పేర్కొన్న వివరాల ప్రకారం భూకంపం వల్ల ఎలాంటి నష్టం జరగలేదు. అయితే ఈ భూకంపం అనంతర కూడా ప్రకంపనలు వస్తాయని హెచ్చరించింది. ఫిలిప్పీన్స్ దేశం పసిఫిక్ మహాసముద్రం తీరంలోని రింగ్ ఆఫ్ ఫైర్ జోన్లో ఉంది. ఇక్కడ అగ్నిపర్వతాలు బద్దలు కావడం, భూకంపాలు రావడం సర్వసాధారణంగా జరుగుతుంటుంది. -
USA Earthquake: కాలిఫోర్నియాలో భూకంపం.. 4.9 తీవ్రత నమోదు
అమెరికాలోని కాలిఫోర్నియాలో 4.9 తీవ్రతతో భూకంపం సంభవించింది. లాస్ ఏంజెల్స్‌లో కూడా భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. భూకంప కేంద్రం బార్స్టో సమీపంలో ఉంది. కాలిఫోర్నియాలోని ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. ఈ విపత్తు కారణంగా చోటుచేసుకున్న ప్రాణ, ఆస్తి నష్టంపై అధికారులు ఆరా తీస్తున్నారు.యూఎస్ టుడే అందించిన వివరాల ప్రకారం శాన్ బెర్నార్డిగో కౌంటీతో పాటు, లాస్ ఏంజిల్స్, కెర్న్, రివర్సైడ్, ఆరెంజ్ కౌంటీలలో భూకంప ప్రకంపనలు సంభవించాయి. కాలిఫోర్నియాలోని ప్రజలు భూకంపానికి సంబంధించిన వీడియోలు, ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. అలాగే వారి అనుభవాలను తెలియజేశారు.భూకంపం కారణంగా ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు తక్షణ నివేదికలు లేవని బార్స్టో ఫైర్ ప్రొటెక్షన్ డిస్ట్రిక్ట్ బెటాలియన్ చీఫ్ ట్రావిస్ ఎస్పినోజా తెలిపారు. లాంగ్ బీచ్ మేయర్ రెక్స్ తన ట్విట్టర్ ఖాతాలో ఇప్పటివరకు నగరంలో ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం లేదన్నారు.