మహారాష్ట్ర, అరుణాచల్‌లో ఈరోజు (గురువారం) ఉదయం భూమి కంపించింది. మహారాష్ట్రలోని నాందేడ్‌లో సుమారు 10 సెకన్ల పాటు భూమి కంపించింది. దీంతో జనం భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. నాందేడ్‌తో పాటు పర్భానీ, హింగోలిలో భూ ప్రకంపనలు కనిపించాయి.
మీడియాకు అందిన వివరాల ప్రకారం మహారాష్ట్రలోని నాందేడ్‌లో గురువారం ఉదయం 6 గంటల 8 నిముషాలకు భూకంప సంభవించింది. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపిన వివరాల ప్రకారం ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 4.2గా నమోదైంది. ఈ భూకంప కేంద్రం అఖారా బాలాపూర్ ప్రాంతంలో ఉన్నట్లు గుర్తించారు. ఈ భూకంపం వల్ల ఎటువంటి ప్రాణనష్టం జరిగినట్లు సమాచారం లేదు.
మహారాష్ట్ర కంటే ముందు అరుణాచల్ ప్రదేశ్‌లో గురువారం తెల్లవారుజామున రెండుసార్లు భూకంపం సంభవించింది. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపిన వివరాల ప్రకారం గురువారం తెల్లవారుజామున 1:49 గంటలకు మొదటి భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.7గా నమోదైంది. ఈ భూకంప కేంద్రం అరుణాచల్ ప్రదేశ్‌లోని పశ్చిమ కమెంగ్‌లో ఉంది. దీని లోతు సుమారు 10 కిలోమీటర్లు. రెండవ భూకంపం 3.40 గంటలకు సంభవించింది. రెండో భూకంప కేంద్రం అరుణాచల్ ప్రదేశ్‌లోని తూర్పు కమెంగ్‌లో ఉంది. ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 3.4గా నమోదైంది.ఈ రెండు భూకంపాల వల్ల ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం లేదు.
Comments
Please login to add a commentAdd a comment