area
-
వదిలేసిన కారులో రూ. కోటి నగదు
యశవంతపుర (కర్ణాటక): ఖాళీ స్థలంలో వదిలి వెళ్లిన కారులో కోటి రూపాయల నగదు బయట పడిన ఘటన ఉత్తరకన్నడ జిల్లా అంకోలా తాలూకా జాతీయ రహదారి 63లో రామనగుళి వద్ద వెలుగులోకి వచ్చింది. సోమవారం సాయంత్రం నుంచి గుర్తు తెలియని కారు నిలిపి ఉంది. అనుమానం పడిన స్థానికులు అంకోలా పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు చేరుకుని పరిశీలించారు. బెంగళూరు రిజిస్ట్రేషన్ నంబర్ గల హుండై క్రెటా కారులో కోటి రూపాయిల నగదు లభించింది. కారును, నగదును సీజ్ చేశారు. కారు ఎవరిది, నగదుతో పాటు ఎందుకు వదిలేశారు అనేది సస్పెన్స్‌గా మారింది. కారు నంబరు ఆధారంగా పోలీసులు విచారణ చేపట్టారు. -
మహారాష్ట్ర, అరుణాచల్‌లో భూకంపం.. భయంతో జనం పరుగులు!
మహారాష్ట్ర, అరుణాచల్‌లో ఈరోజు (గురువారం) ఉదయం భూమి కంపించింది. మహారాష్ట్రలోని నాందేడ్‌లో సుమారు 10 సెకన్ల పాటు భూమి కంపించింది. దీంతో జనం భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. నాందేడ్‌తో పాటు పర్భానీ, హింగోలిలో భూ ప్రకంపనలు కనిపించాయి. మీడియాకు అందిన వివరాల ప్రకారం మహారాష్ట్రలోని నాందేడ్‌లో గురువారం ఉదయం 6 గంటల 8 నిముషాలకు భూకంప సంభవించింది. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపిన వివరాల ప్రకారం ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 4.2గా నమోదైంది. ఈ భూకంప కేంద్రం అఖారా బాలాపూర్ ప్రాంతంలో ఉన్నట్లు గుర్తించారు. ఈ భూకంపం వల్ల ఎటువంటి ప్రాణనష్టం జరిగినట్లు సమాచారం లేదు. మహారాష్ట్ర కంటే ముందు అరుణాచల్ ప్రదేశ్‌లో గురువారం తెల్లవారుజామున రెండుసార్లు భూకంపం సంభవించింది. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపిన వివరాల ప్రకారం గురువారం తెల్లవారుజామున 1:49 గంటలకు మొదటి భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.7గా నమోదైంది. ఈ భూకంప కేంద్రం అరుణాచల్ ప్రదేశ్‌లోని పశ్చిమ కమెంగ్‌లో ఉంది. దీని లోతు సుమారు 10 కిలోమీటర్లు. రెండవ భూకంపం 3.40 గంటలకు సంభవించింది. రెండో భూకంప కేంద్రం అరుణాచల్ ప్రదేశ్‌లోని తూర్పు కమెంగ్‌లో ఉంది. ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 3.4గా నమోదైంది.ఈ రెండు భూకంపాల వల్ల ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం లేదు. -
‘లొకేషన్’తో ప్రైవసీ చిక్కులు!
సాక్షి, హైదరాబాద్: ‘లొకేషన్ పంపు.. నేను వచ్చేస్తా..’ ఎవరినైనా కలవడానికి వెళ్తేనో, కొత్త ప్రదేశానికి వెళ్తేనో ఈ మాట తప్పకుండా వినిపిస్తుంది. ఎవరికైనా మనం ఎక్కడున్నామో అడ్రస్ చెప్పాలన్నా.. కొత్త ప్రాంతంలో నిర్దిష్టమైన ప్రాంతానికి వెళ్లాలన్నా ఈ లొకేషన్ ఫీచర్ ఎంతో ప్రయోజనకరం. పెద్దగా తికమక పడాల్సిన అవసరం లేకుండానే అవసరమైన ప్రదేశానికి చేరుకోవచ్చు. కానీ ఇది ఎంత సౌకర్యవంతమో అంతే స్థాయిలో ఇబ్బందికరం కూడా అని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇది మన ప్రైవసీని దెబ్బతీస్తుందని.. మనం ఎక్కడున్నాం, ఎక్కడికి వెళ్తున్నాం, ఎక్కడ ఎంత సేపు ఉన్నామనే ప్రతి అంశం ఈ లొకేషన్‌తో తెలిసిపోతుందని స్పష్టం చేస్తున్నారు. ఉదాహరణకు మనం ఏదైనా షాపింగ్ మాల్‌కు వెళ్లామా? సినిమా థియేటర్లో ఉన్నామా? ఏదైనా పర్యాటక ప్రాంతానికి వెళ్లామా? అన్న వివరాలు గూగుల్‌తో పాటు మన ఫోన్లోని వివిధ యాప్ సంస్థలకు చేరిపోతాయి. ఇది మన వ్యక్తిగత అంశాలను బహిరంగం చేయడమేనని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. అందువల్ల అవసరమైనప్పుడు మాత్రమే మన మొబైల్ ఫోన్లలోని లొకేషన్‌ను ఆన్ చేసుకోవాలని.. తర్వాత ఆఫ్ చేసి పెట్టడం వల్ల మనపై ఎవరూ నిఘా పెట్టకుండా ఉంటుందని వివరిస్తున్నారు. నిపుణులు సూచిస్తున్న జాగ్రత్తలివీ.. మొబైల్ ఫోన్లలోని అన్ని అప్లికేషన్స్ (యాప్‌ల)కు లొకేషన్ సర్వీసెస్ అనుమతులు (పర్మిషన్) ఇవ్వొద్దు. అపరిచిత, అనుమానాస్పద యాప్‌లకు మన లొకేషన్ యాక్సెస్ ఇస్తే.. అది మన వ్యక్తిగత భద్రతకు ముప్పుగా మారుతుంది. కొన్ని యాప్‌లకు మనం ఇచ్చే పర్మిషన్లతో.. మన లొకేషన్ వివరాలు తప్పుడు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లే అవకాశం, మన కదలికలపై నిఘా పెట్టేందుకు ఆస్కారం ఉంటుంది. లొకేషన్ ఆన్‌లో ఉండటంతో మనం ఎప్పుడు ఎక్కడ ఉంటున్నామన్న సమాచారం ఇతరులకు సులువుగా తెలిసే అవకాశం ఉంది. లొకేషన్‌ను ఆధారంగా చేసుకుని కొందరు ఆకతాయిలు వేధింపులకు పాల్పడే ప్రమాదం ఉంటుంది. మొబైల్లో ఎప్పుడూ లొకేషన్ ఆన్‌లో ఉండటం వల్ల బ్యాగ్రౌండ్లో ఈ యాప్ పనిచేస్తూ, బ్యాటరీలో చార్జింగ్ త్వరగా తగ్గుతుంది. మొబైల్లో డేటా కూడా త్వరగా అయిపోయే అవకాశం ఉంటుంది. -
విరుగుతున్న కొండచరియలు.. కుప్పకూలుతున్న ఇళ్లు
సిమ్లా: హిమాచల్ ప్రదేశ్‌లో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో కొండరియలు విరిగిపడుతున్నాయి. తాజాగా సిమ్లాలోని కృష్ణ నగర్ ప్రాంతంలో కొండచరియలు విరిగిపడగా.. వాటిపై ఉన్న ఏడు ఇళ్లు ఒక్కసారిగా కుప్పకూలిపోయాయి. ఈ భయానక దృశ్యాలు భీతికొల్పేవిగా ఉన్నాయి. ఈ ఘటనలో మరణాల సంఖ్య ఇంకా ఓ అంచనాకు రాలేమని సీపీ సంజీవ్ కుమార్ తెలిపారు. #WATCH | Several houses collapsed in Krishna Nagar area in Himachal Pradesh's Shimla after a landslide took place. Rescue operation underway. (Video Source: Local; confirmed by Police and administration) pic.twitter.com/qdYvR4C4fx — ANI (@ANI) August 15, 2023 కాగా.. గత మూడు రోజులుగా హిమాచల్ ప్రదేశ్ వర్షాలతో అతలాకుతలం అవుతోంది. ఇప్పటికే రాష్ట్రంలో వర్షాల కారణంగా 54 మంది మరణించారు. వర్షపు నీటితో నదులు ఉద్దృతంగా ప్రవహిస్తున్నాయి. సోమవారం వివిధ చోట్ల జరిగిన కొండచరియలు విరిగిపడిన ఘటనల్లో 12 మంది మృతి చెందారు. రహదారులు మూతపడ్డాయి. దీంతో రాష్ట్రంలో నేడు స్వాతంత్య్ర వేడుకలు కూడా జరపలేదు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది నిర్విరామంగా పనిచేస్తున్నారు. #WATCH | Hill collapsed in Krishna Nagar area in HP's Shimla. Around five to seven houses collapsed. Further details awaited. pic.twitter.com/esWoGcjxlB — ANI (@ANI) August 15, 2023 కాగా.. మరో రెండు రోజులు హిమాచల్ ప్రదేశ్‌లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తరాఖండ్, ఈశాన్య భారతంలో మరో ఐదు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని సూచించారు. ఇదీ చదవండి: స్వాతంత్య్ర వేడుకలకు దూరంగా ఆ రాష్ట్రం.. ఎందుకంటే. -
తాజ్‌మహల్‌ను తలదన్నేలా స్లమ్ టూరిజంనకు ఆదరణ.. మురికివాడలకు పర్యాటకుల క్యూ
ఆసియా ఖండంలోనే అతిపెద్ద స్లమ్ ఏరియా ధారావి(ముంబై). దీనిని సుందరంగా మార్చే బాధ్యతను ఆదానీ గ్రూప్ తన చేతుల్లోకి తీసుకుంది. అయితే మహారాష్ట్రలోని రాజకీయ ప్రతిపక్షాలు ఈ ప్రాజెక్టు నుంచి అదాని గ్రూపును తొలగించాలని డిమాండ్ చేస్తున్నాయి. కాగా ఇటీవలి కాలంలో ఈ భారీ స్లమ్ ఏరియాకు పర్యాటకులు తాకిడి మరింతగా పెరిగింది. ప్రతీయేటా వేలాదిమంది విదేశీయులు ఈ స్లమ్ ఏరియాను సందర్శించేందుకు వస్తున్నారు. ఇక్కడి పేదల దుర్భర పరిస్థితులను అసక్తిగా గమనిస్తున్నారు. దేశంలోని తాజ్‌మహల్‌ను చూసేందుకు వచ్చేవారికన్నా ఈ స్లమ్ ఏరియాకే అధికంగా పర్యాటకులు వస్తున్నారని పలు నివేదికలు చెబుతున్నాయి. 18వ శతాబ్ధంలో కొందరు మత్స్యకారులు తమ పరిస్థితులకు అనుగుణంగా ఇక్కడ ఆవాసం ఏర్పాటు చేసుకున్నారు. కూలీనాలీ చేసుకుంటూ ఇక్కడే ఉంటూ వచ్చారు. తరువాతి కాలంలో వివిధ వృత్తుల వారు ఇక్కడ నివాసం ఏర్పాటు చేసుకున్నారు. 20 వ శతాబ్ధం నాటికి ఇక్కడ పరిస్థితుల్లో మార్పు వచ్చింది. స్కూళ్లు, ఆధ్యాత్మిక ప్రదేశాలు, ఆసుపత్రులు.. ఇలా అన్ని సౌకర్యాలు ఈ ప్రాంతంలో సమకూరాయి. ప్రస్తుతం ఇది ఆసియాలో అతి పెద్ద మురికివాడగా పేరొందింది. సుమారు 550 ఎకరాల్లో విస్తరించిన ధారావి.. లెక్కకుమించిన గుడిసెలు కలిగిన బస్తీలతో నిండిపోయి ఉంటుంది. ఇక్కడి ఒక్కో గుడిసెలోనూ 10 మందికిపైగా వ్యక్తులు ఉంటున్నారు. దీనిని పరిశీలించి చూస్తే ఇక్కడి జనాభా ఎంత అధికమో తెలుస్తుంది. ధారావి మురికివాడలో 10 లక్షలకుపైగా జనాభా ఉండవచ్చని అంచనా. ఇక్కడికి వచ్చే టూరిస్టులు గంటల తరబడి ఇక్కడే ఉంటూ, ఇక్కడి పరిస్థితులను గమనిస్తుంటారు. పేదలు ఎలా జీవిస్తుంటారు? వారి దినచర్య ఎలా ఉంటుందనేది వీరు గమనిస్తారు. ఈ నేపధ్యంలో పలు అంశాలకు సంబంధిచిన వీడియోలు తీసి, సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. కాగా ఇటువంటి మురికి వాడలు మనదేశంలోనే కాకుండా ఆఫ్రికాదేశాలైన యుగాండా, కెన్యా, కేప్టౌన్లలోనూ కనిపిస్తాయి. ఇది కూడా చదవండి: నది దగ్గర తన పనిలో మునిగిన పాల వ్యాపారి.. కలెక్టర్ ఫొటోతో గుట్టు రట్టు -
ప్రపంచంలోని టాప్ 10 అతిపెద్ద నగరాలు
-
మలక్ పెట్ ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో దారుణం
-
నీట మునిగిన గంగా తీర ప్రాంతాలు
-
ఏరియా-51
-
దొంగల్లా దోచేస్తున్నారు
పోలవరం : పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ ప్రాంతంలో దొంగలు పడ్డారు. కుడి ప్రధాన కాలువ పనుల పేరుతో కృష్ణా జిల్లాకు పెద్దఎత్తున ఇసుక తరలించుకుపోతున్నారు. అభివృద్ధి ముసుగులో అక్రమ దందా సాగిస్తూ కోట్లాది రూపాయలను కొల్లగొడుతున్నారు. పోలవరం ప్రాజెక్ట్ ప్రాంతానికి సమీపంలోని మహానందీశ్వర క్షేత్రం వద్ద పెద్దఎత్తున తవ్వకాలు సాగిస్తూ కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్‌తోపాటు బయటి ప్రాంతాలకు భారీగా ఇసుక తరలించుకుపోతున్నారు. అభివృద్ధి పనులకు ఇసుక కేటాయించాలంటేప్రభుత్వ అనుమతి అవసరం. కానీ.. ఎలాంటి అనుమతులు లేకుండా రేయింబవళ్లు యంత్రాల సాయంతో ఇక్కడ తవ్వకాలు సాగిపోతున్నాయి. మంత్రిగారి అండతో.. కృష్ణా జిల్లాకు చెందిన మంత్రి అండతో ఇక్కడ ఇసుక అక్రమ దందా నడుస్తోంది. సదరు మంత్రి ఇచ్చిన మౌఖిక ఆదేశాల కారణంగా అధికారులెవరూ అటు కన్నెత్తి చూడటం లేదు. పోలవరం ప్రాజెక్ట్ ప్రాంతం నుంచి గోదావరి ఏటిగట్టు మీదుగా భారీ వాహనాల్లో దర్జాగా తరలించుకుపోతున్నా కిమ్మనడం లేదు. యంత్రాలూ ప్రాజెక్ట్వే మహానందీశ్వర క్షేత్రం వద్ద రెండు యంత్రాలతో రేయింబవళ్లు ఇసుక తవ్వుతున్నారు. పెదవేగి, హనుమాన్‌జంక్షన్ పరిసర ప్రాంతాల్లో పోలవరం కుడి ప్రధాన కాలువ పనులకు ఇక్కడి ఇసుకను వినియోగిస్తున్నట్టు చెబుతున్నారు. కాలువ పనులకు ఇసుక తోలేందుకు ప్రభుత్వం నుంచి ఎలాంటి అధికారిక అనుమతులు లేవు. పైగా.. ఇక్కడి నుంచి తరలిస్తున్న ఇసుకను ఆ పనులకు వినియోగించడం లేదు. ఇదిలావుంటే.. పోలవరం ప్రాజెక్ట్ హెడ్‌వర్క్స్ యంత్రాలనే ఇసుక అక్రమ తవ్వకాలకు వినియోగిస్తున్నారు. ఇలా తవ్విన ఇసుకను వందలాది వాహనాల్లో తరలించుకుపోతున్నారు. పోలవరం కుడి ప్రధాన కాలువ పనులకు దీనిని ఉపయోగిస్తున్నట్టు చెబుతూ బయటి ప్రాంతాలకు తరలించుకుపోతున్నారని స్పష్టంగా తెలుస్తోంది. దాదాపు నెల రోజులుగా తవ్వకాలు, రవాణా సాగుతున్నాయి. ప్రమాదకరంగా ఏటిగట్టు ప్రాంతం ఇసుక తవ్వకాలు, రవాణా వాహనాల రాకపోకల వల్ల పోలవరం గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇసుక తరలిస్తున్న లారీలు వేగంగా వెళ్తుండటంతో పోలవరంలోని ఏటిగట్టు సెంటర్ ప్రమాదకరంగా మారింది. ఈ సెంటర్ మీదుగా వెళ్లాలంటేనే ప్రజలు భయపడుతున్నారు. ఇటీవల గ్రామంలోని కొందరు యువకులు ఇసుక తరలిస్తున్న ఓ లారీని ఆపి ప్రశ్నించగా, ఎటువంటి అనుమతులు లేవని తేలింది. దీంతో యువకులు ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఆ లారీని స్వాధీనం చేసుకున్న అధికారులు కొద్దిసేపటికే దానిని వదిలేశారు. కృష్ణా జిల్లాకు చెందిన మంత్రి ఓ ఎమ్మెల్యేకు ఫోన్ చేయడం, ఆయన రంగంలోకి దిగటంతో లారీని వదిలేసినట్టు సమాచారం. -
మాతా శిశు మరణాలు అరికట్టడంలో ప్రభుత్వం విఫలం
మృతులకు రూ.3 లక్షల వంతున ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి వైఎస్సార్సీపీ నేత అనంత బాబు గంగవరం (రంపచోడవరం): ఏజెన్సీలో మాతా శిశు మరణాలను నివారించడంలో ప్రభుత్వం వైఫల్యం చెందిందని వైఎస్సార్ సీపీ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు, నియోజకవర్గ కన్వీనర్ అనంత ఉదయభాస్కర్ (బాబు) విమర్శించారు. శనివారం మండలంలో పర్యటించిన ఆయన స్థానిక విలేకర్లతో మాట్లాడారు. రంపచోడవరం ఏజెన్సీ డివిజన్లో దాదాపు అన్ని మండలాల్లో శిశు మరణాలు సంభివిస్తున్నాయని, అధికంగా రాజవొమ్మంగి మండలంలో జరుగుతున్నాయన్నారు. శిశు మరణాలపై ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదన్నారు. మృతుల కుటుంబాలకు రూ.మూడు లక్షల వంతున ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్రెడ్డి ఏజెన్సీ పర్యటన సమయంలో మృతుల కుటుంబాలకు పార్టీ తరఫున ఆర్థిక సాయం అందించారన్నారు. వరుసగా శిశు మరణాలు సంభవిస్తున్నా ప్రభుత్వం, అధికారులు వాటిని అరికట్టడంలో నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు. గిరిజనులకు సరైన వైద్య సేవలు అందడంలేదన్నారు. గిరిజన గ్రామాలలో వైద్యశిబిరాలు, అవగాహన సదస్సులు నిర్వహించి గర్భిణులు, బాలింతలను చైతన్య పరచాలన్నారు. లోతట్టు ప్రాంతాల్లో గిరిజనులకు మౌలిక సౌకర్యాలు అందడంలేదన్నారు. తాగునీటి ఎద్దడి నివారణకు పటిష్టమైన చర్యలను తీసుకోవాలని ఆయన డిమాండ్ చేవారు. ఆయన వెంట మండల కన్వీనర్ అమృత అప్పలరాజు, మాజీ కన్వీనర్ కల్లం సూర్యప్రభాకర్, జిల్లా కమిటీ కార్యవర్గ సభ్యులు ఏడుకొండలు, ముప్పనశెట్టి శ్రీను, మండల నాయకులు ఇరాట రమణ, బేబీరాణి, గంగాదేవి, తిరుపతిరావు, మాడెం కుమార్, మాగంటి శ్రీను, స్థానిక సర్పంచ్ అక్కమ్మ తదితరులు ఉన్నారు. -
మళ్లీ ఉత్కంఠ
దివీస్ బాధిత గ్రామాల్లో ఈ నెల 28 వరకూ 144 సెక్షన్ అమలు నేడు భూముల్లోకి వెళ్లేందుకు రైతుల సన్నద్ధం సీపీఎం ఆధ్వర్యంలో రెఢీ పోలీసుల మోహరింపు... తొండంగి: కోన తీరంలో దివీస్ లేబరేటరీస్‌కు ప్రభుత్వం కేటాయించిన రైతుల భూముల్లోకి బాధిత గ్రామాల ప్రజలు వెళ్లేందుకు గురువారం ప్రయత్నించనున్న నేపథ్యంలో తీరప్రాంతంలో 144 సెక్షన్ అమలు చేయడంతోపాటు భారీగా పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. దివీస్‌కు ప్రభుత్వం దానవాయిపేట, కోదాడ గ్రామల పంచాయతీల పరిధిలో కొత్తపాకలు, పంపాదిపేట, తాటియాకులపాలెం తదితర ప్రాంతాల్లో సుమారు 671 ఎకరాల భూమిని కేటాయించిన సంగతి విదితమే. సుమారు పది నెలల నుంచి రైతులు దివీస్‌ను వ్యతిరేకిస్తూ ఉద్యమిస్తున్నారు. ఈ ఉద్యమానికి వైఎస్సార్సీపీ, సీపీఎం, సీపీఐ, ఇతర వామపక్ష పార్టీలు, విప్లవ సంఘాలు మద్దతు పలకడంతో పలు దఫాలుగా ఉద్యమంలో భాగంగా రోడ్‌షోలు, నిరసన కార్యక్రమాలు, నిరాహార దీక్షలు చేస్తూనే ఉన్నారు. రైతుల స్వాధీనంలో ఉన్న భూముల్లోనూ, హైకోర్టు స్టేటస్కో ఇచ్చిన భూముల్లోనూ దివీస్ యాజమాన్యం ప్రహరీ గోడ, ఇతర నిర్మాణాలను చేపట్టడం ప్రారంభించింది. దివీస్ యాజమాన్యం చేపట్టిన అక్రమ నిర్మాణాలను నిరసిస్తూ బాధిత గ్రామాల రైతులు రెవెన్యూ, పోలీసు ఇతర ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. కొద్ది రోజులపాటు దివీస్ వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు నిర్వహించారు. రెవెన్యూ అధికారులు మొక్కుబడిగా సర్వే, విచారణలు చేపట్టి ఎటువంటి అక్రమ నిర్మాణాలు జరగలేదని ప్రకటించడంతో ప్రభుత్వాధికారుల తీరుపై ఆ ప్రాంత ప్రజలు మరింత మండిపడుతున్నారు. దీంతో బాధిత గ్రామాల రైతులు సీపీఎం ఆధ్వర్యంలో గురువారం తమ భూముల్లోకి ప్రవేశించి సాగు చేసుకునేందుకు సన్నద్ధమవడంతో ప్రభుత్వం భారీగా పోలీసుల బందోబస్తు ఏర్పాటు చేసింది. ఎనిమిది రోజులపాటు 144 సెక్షన్... కోన ప్రాంతంలో రైతులు దివీస్ ప్రతిపాదిత ప్రాంతంలో తమ భూముల్లోకి వెళ్లేందుకు ప్రయత్నించనున్న నేపధ్యంలో ఎటువంటి ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడకుండా తీరప్రాంతంలో 144 సెక్షన్‌ను అమలు చేస్తున్నట్టు ఒంటిమామిడి పోలీస్‌స్టేన్ హెచ్‌సీ మాణిక్యం తెలిపారు. బాధిత గ్రామాల్లోనూ, బీచ్‌రోడ్డులోనూ సుమారు 300 మంది -
మావోల కోటలో కానరాని అభివృద్ధి
ఇష్టారాజ్యంగా పనులు ప్రతిపాదనలు రంపచోడవరం : మావోయిస్టుల ప్రభావిత గ్రామాల్లో ఖర్చు చేయాల్సిన ఇంటిగ్రేటెడ్ యాక్షన్ ప్లాన్ (ఐఏపీ) కేంద్రప్రభుత్వం ఇచ్చే ని«ధులను ఐటీడీఏ అధికారులు ఇష్టారాజ్యంగా ఖర్చు చేశారు. ఫలితంగా అసలు లక్ష్యం నెరవేరకుండానే నిధులు ఖర్చు అవుతున్నాయి. ఐఏపీ నిధుల ద్వారా మావోయిస్టుల ప్రభావిత గ్రామాల్లో మౌలిక సదుపాయాలతో పాటు కమ్యూనికేషన్ వ్యవస్థను బలోపేతం చేయడం వంటి చర్యలు చేపట్టాలి. ఇందుకు భిన్నంగా ఐటీడీఏ అధికారుల తీరు ఉంటోంది. పూర్తిగా ఏజెన్సీ ప్రాంతంలో ఖర్చు చేయాల్సిన నిధులను మైదాన ప్రాంతంలో కూడా ఖర్చు చేశారు. నేటికీ అనేక మావోయిస్టు ప్రభావిత గ్రామాలకు రోడ్డు సదుపాయం లేదు. గుర్తేడు రోడ్డుకు మోక్షమెప్పుడు? ఒకప్పుడు మావోయిస్టులకు పెట్టని కోటగా ఉన్న గుర్తేడు వరకు రోడ్డు సదుపాయం మెరుగుపడింంది. ఈ ప్రాంతానికి ఆర్టీసీ బస్సు సర్వీసును కూడా నడుపుతున్నారు. గుర్తేడు నుంచి పాతకోట మీదుగా మంగంపాడు వరకు నిర్మాణం చేపట్టిన రోడ్డు నేటికీ పూర్తి చేయలేకపోయారు. పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖ చేపట్టిన రోడ్డు పనిని మావోలు అడ్డుకుని వాహనాలు తగులబెట్టారు. అప్పటి నుంచి ఈ రోడ్డు నిర్మాణానికి ఎవరూ ముందుకు రాలేదు. ఈ రోడ్డు నిర్మాణం ద్వారా అనేక గ్రామాలకు రవాణా సదుపాయం మెరుగుపడుతుంది. వై.రామవరం మండల కేంద్రం చేరుకునేందుకు గుర్తేడు నుంచి వై.రామవరానికి చేపట్టిన రోడ్డు నిర్మాణం దశాబ్దకాలం అవుతున్నా నేటికీ పూర్తి కాలేదు.ఈ రోడ్డు నిర్మాణం పూర్తిచేస్తే సుమారు వంద గ్రామాలకు మండల కేంద్రం దగ్గర అవుతుంది. అధికారులు ఇలాంటి కీలకమైన రోడ్డు నిర్మాణాలను పూర్తి చేయడంలో శ్రద్ధ చూపడం లేదు. సున్నంపాడు – నూరుపూడి వంతెన నిర్మాణమెప్పుడు? మారేడుమిల్లి మండలం సున్నంపాడు వద్ద కొండ వాగుపై వంతెన నిర్మాణం లేక 40 గ్రామాల గిరిజనులు ఇబ్బందులు పడుతున్నారు. గిరిజన సంక్షేమ ఇంజినీరింగ్ అధికారులు ఇక్కడ వంతెన నిర్మాణం కోసం చర్యలు తీసుకోలేదు. మారేడుమిల్లి–గుర్తేడు రోడ్డులో సంగువ కాలువపై ఆకుమామిడికోట వద్ద వంతెన నిర్మాణం చేయడం లేదు. సుమారు వంద గ్రామాల గిరిజనులు ఈ రహదారిలో రాకపోకలు సాగిస్తారు. ఐఏపీ నిధులతో ఇలాంటి ప్రధాన సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటే బాగుండేది. అనేక చోట్ల ఆశ్రమ పాఠశాలల్లో సరైన మౌళిక వసతులు లేవు. అంగన్వాడీ సెంటర్లు శిధిలావస్థకు చేరుకున్నాయి. 2010–11 సంవత్సరంలో ప్రారంభించిన ఐఏపీ పధకంలో ప్రాధాన్యత క్రమంలో పనులు గుర్తించి చేపట్టడంలో ఐటీడీఏ అధికారులు పూర్తిగా విఫలమైయారు. మైదాన ప్రాంతంలో వసతిగృహాలు నిర్మించారు. టీఎస్పీ వంటి నిధులతో వీటి నిర్మాణం చేయవచ్చు. ఐఏపీ నిధులు ఖర్చు చేయడమే చూసుకున్నారుగానీ గిరిజనుల ప్రయోజనాలను గాలికివదిలేశారు. కేంద్ర రూ. 120 కోట్లు మంజూరు చేస్తే రూ.100 కోట్లు ఖర్చు చేశారు. నాలుగేళ్లలో అనేక చోట్ల పనులు పూర్తి చేయలేదు. విలీనంలోనూ అదే పరిస్థితి విలీన మండలాల్లోని మావోయిస్టుల ప్రభావిత ప్రాంతాల్లో సైతం ఐఏపీ నిధులు సక్రమంగా అమలకు నోచుకోలేదు. విలీన మండలాల్లో చత్తీస్గడ్ సరిహద్దుకు అనుకుని ఉన్న చింతూరు, ఎటపాక మండలాల్లో మావోయిస్టుల ప్రభావం అధికంగా ఉంది. సరిహద్దు గ్రామాల్లో ఏళ్ల తరబడి రహదారులు ఆధ్వానంగా ఉన్నా అధికారులు వాటిపై దృష్టి సారించలేదు. ఉమ్మడి రాష్ట్రంలో ఖమ్మం జిల్లాలో ఉన్న ఈ మండలాలు మావోయిస్టు ప్రభావిత హైరిస్క్ జోన్లో ఉండేవి. అప్పట్లో కోట్లాది రూపాయలు ఐఏపీ నిధులు విడుదలైనా అధికారులు వాటిని ప్రధాన రహదారులు, హాస్టల్ భవనాలు నిర్మించేందుకే ప్రాధాన్యమిచ్చారే తప్ప మావో ప్రభావిత గ్రామాల్లో అభివృద్ధికి ఖర్చు చేయలేదు. చింతూరు మండలం ఏడుగురాళ్లపల్లి నుంచి చత్తీస్గడ్ సరిహద్దుల్లో ఉన మల్లంపేటకు వెళ్లే రహదారి ఏళ్లతరబడి అధ్వానంగా ఉన్నా పట్టించుకోవడం లేదు. ఉమ్మడి రాష్ట్ర హయాంలో ఈ రహదారికి సంబంధించి ఐదుసార్లు టెండర్లు పిలిచినా మావోయిస్టుల భయంతో రహదారి వేసేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడంతో సద్వినియోగం కాలేదు. చింతూరు మండలంలో చదలవాడ, చౌలూరు, గవల్లకోట వంటి మారుమూల గ్రామాలకు రహదారి సౌకర్యంం లేక గిరిజనులు ఇబ్బందులు పడుతున్నారు.కొండకాలువలపై వంతెన నిర్మాణాలు కేవలం ప్రతిపాదనలకే పరిమితమవుతున్నాయి. ఐఏపీలో ఇలాంటి గ్రామాలకు మౌలిక సదుపాయాలు కల్పిస్తే పథకం లక్ష్యం నెరవేరుతుంది. -
లాఠీ దాష్టీకం
దివీస్ కోసం పోలీసుల అతి.. అట్టుడికిన కోన తీరం బందోబస్తుతో రైతుల భూముల్లో చెట్ల తొలగింపు కోర్టు స్టే ఉన్న, అమ్మని భూముల్లో పనులపై ప్రజల ఆగ్రహం గ్రామాల్లో మహిళలపై దౌర్జన్యం అడ్డుకున్న 100 మంది అరెస్టు బాధితులను విడిపించిన ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా తొండంగి : జీడిచెట్ల వద్ద పిక్కలు ఏరుకుంటూ, గొర్రెల మందలను కాచుకుంటూ జీవనం సాగించే కోనతీరంలోని అమాయక ప్రజలపై కాలుష్య దివీస్ పరిశ్రమ కోసం ప్రభుత్వ ఒత్తిడితో పోలీసులు తమ కర్కశత్వాన్ని ప్రదర్శించారు. ప్రభుత్వం దివీస్ ల్యాబొరేటరీస్ పరిశ్రమ స్థాపన కోసం కోనఫారెస్ట్ భూములు 670 ఎకరాలను కేటాయించింది. ఈ భూములను తరతరాలుగా సాగు చేసుకుంటున్న రైతులు, బాధిత గ్రామాల ప్రజల కాలుష్య పరిశ్రమ స్థాపనను, భూముల కేటాయింపును తీవ్రంగా వ్యతిరేకిస్తూ చేసే పోరుకు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే దాడిశెట్టి రాజాతోపాటు సీపీఐ, సీపీఎం, సీపీఐ(ఎం.ఎల్), జనశక్తి, ఏపీ వ్యవసాయరైతు కూలీసంఘం, సీఐటీయూ, ఐద్వా మహిళాసంఘం తదితర సంఘాలు, పార్టీల మద్దతునిస్తున్నారు. రెవెన్యూ అధికారులు పలుమార్లు రైతులు ప్రభుత్వానికి అప్పగించని భూముల్లో బలవంతంగా చెట్లను తొలగించబోతుంటే బాధిత గ్రామాల ప్రజలు ప్రతిఘటిస్తూనే ఉన్నారు. శుక్రవారం కూడా రెవెన్యూ అధికారులు భారీగా జేసీబీలు, కోత యంత్రాలతో చెట్లను తొలగించారు. విషయం తెలుసుకున్నతాటియాకులపాలెం, కొత్తపాకలు, పంపాదిపేట తదితర గ్రామాలకు చెందిన వారంతా తమ భూముల్లోకి వెళ్లి చెట్లుతొలగిస్తున్న జేసీబీ, కోత యంత్రాలను నిలుపుదల చేయించారు. అప్పటికే భారీగా మోహరించిన పోలీసులు వారిని బలవంతంగా వ్యానులో ఎక్కించి అరెస్టు చేశారు. తాటియాకులపాలెం రైతు సన్ని సత్యనారాయణను పోలీసులు దారుణంగా కొట్టడంతో తీవ్రగాయాలపాలయ్యాడు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు సుమారు 100 మందిని కోటనందూరు, అన్నవరం, ఒంటిమామిడి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. దివీస్ కోసం బలవంతపు భూసేకరణకు చర్యలు ప్రారంభించిన నేపథ్యంలో కోన తీరప్రాంతంలో బాధిత గ్రామాల వద్ద సుమారు వెయ్యిమంది పోలీసులను మోహరించారు. మానవత్వాన్ని మరిచి.. పోలీసులు మానవత్వాన్ని మరచి బహిర్భూమికి వెళ్లేందుకు ప్రయత్నించిన మహిళలు, రోడ్డుకు సమీపంలో చదువుకుంటున్న విద్యార్థులు, యువతులు, బీచ్‌రోడ్డు ఎక్కేందుకు ప్రయత్నించిన ప్రతి ఒక్కరిపై ధాషీ్టకాన్ని ప్రదర్శించారు. పంపాదిపేటలో బీచ్‌రోడ్డుకు ఆవల ఉన్న పశువుల మకాంలోకి, ఇళ్ల వద్దకు వెళ్తున్న మహిళలను అరెస్టు చేశారు. మహిళలని కూడా చూడకుండా ఈడ్చుకుంటూ జీపుల్లో ఎక్కించారు. బాధితులకు అండగా ఎమ్మెల్యే రాజా అరెస్టుల విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా బాధిత ప్రజలకు అండగా నిలిచారు. అరెస్టు సంఘటనలు తెలిసిన వెంటనే ఆయన కొత్తపాకలు సమీపంలో దివీస్‌కు ప్రతిపాదిత భూములు వద్దకు వెళ్లారు. దీంతో బాధిత రైతులంతా అక్కడకు చేరుకున్నారు. హైకొర్టు స్టేటస్కో విధించిన భూముల్లోనూ పనులు నిర్వహించారని, అడ్డువచ్చిన ప్రతి ఒక్కరినీ కొట్టి అరెస్టు చేశారని రైతులు ఎమ్మెల్యే వద్ద వాపోయారు. దీంతో అక్కడ ఉన్న డీఎస్పీ రాజశేఖర్‌తో ఎమ్మెల్యే మాట్లాడారు. దివీస్‌కు ప్రతిపాదించిన భూముల్లో వాస్తవంగా రైతుల నుంచి కొనుగోలు చేసినది ఎంత, అమ్మని భూమి ఎంత ఉందో రెవెన్యూ అధికారులు గుర్తించి, అవసరమైతే సర్వే నంబర్లతో బోర్డులు ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే రాజా అన్నారు. తక్షణమే పనులు నిలిపివేయాలని డీఎస్పీని కోరారు. లేదంటే వారి తరఫున ధర్నాకు దిగుతానని హెచ్చరించారు. అరెస్టయినవారిని విడిపించిన ఎమ్మెల్యే ఈ సందర్భంగా 100 మందిని పోలీసులు అరెస్టు చేశారు. వీరిని అన్నవరం పోలీస్‌స్టేషన్‌కు 32 మందిని, కోటనందూరు 66 మందిని, ఒంటిమామిడిపోలీస్స్టేషన్కు ఇద్దరిని వాహనాల్లో తరలించారు. డీఎస్పీతో చర్చించిన అనంతరం ఎమ్మెల్యే రాజా వారిని అక్కడి నుంచి బయటకు పంపించారు. -
బలప్రయోగం చేస్తే ప్రాణత్యాగానికీ సిద్ధం
దివీస్ బాధిత గ్రామాల ప్రజల హెచ్చరిక కోన భూముల్లో చెట్లు తొలగింపునకు యత్నం యంత్రాలతో భూముల్లోకి ప్రవేశించిన అధికారులు సమైక్యంగా అడ్డుకున్న మూడు గ్రామాల ప్రజలు తొండంగి : దివీస్ ల్యాబొరేటరీస్ కోసం తమ భూముల్ని బలప్రయోగంతో లాక్కోజూస్తే ప్రాణత్యాగాలకైనా వెనుకాడబోమని బాధిత గ్రామాల ప్రజలు స్పష్టం చే శారు. ఎన్నో ఏళ్లుగా సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న భూములను నేడు కాలుష్య కారక పరిశ్రమకు ప్రభుత్వం బలవంతంగా లాక్కొంటోందని ఆక్రోశించారు. బుధవారం మండలంలో ప్రభుత్వం దివీస్‌కు కేటాయించిన భూముల్లో చెట్ల తొలగింపునకు అధికారులు పోలీసు బందోబస్తుతో జేసీబీలు, కటింగ్ యంత్రాలు, ట్రాక్టర్లతో ప్రవేశించేందుకు ప్రయత్నించారు. ఈ విషయం బాధిత గ్రామాల ప్రజలకు విషయం తెలియడంతో పంపాదిపేట, కొత్తపాకలు, తాటియాకులపాలెం గ్రామాలకు చెందిన సుమారు 400 మంది కలసికట్టుగా భూముల్లోకి వెళ్లారు. ప్రభుత్వానికి అమ్మని భూముల్లో, హైకోర్టు సేకరణను వ్యతిరేకించిన భూముల్లో పనులు ఎలా చేస్తారంటూ అధికారులను నిలదీశారు. అధికారుల మాటలు విని వస్తే ఇబ్బందులు పడాల్సి వస్తుందని జనమంతా జేసీబీలు, కోత యంత్రాల సామగ్రి తెచ్చిన సిబ్బందిని హెచ్చరించారు. మరోసారి యంత్రాలతో భూముల్లోకి వస్తే ఊరుకోబోమన్నారు. దీంతో వారంతా అక్కడి నుంచి వెళ్లిపోయారు. తరచూ రైతుల భూముల్లోకి ప్రవేశించి ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని బాధిత గ్రామాల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొద్ది రోజుల క్రితం కూడా ఇదేవిధంగా చెట్లను తొలగించడంతో ఆందోళన చేశామన్నారు. ప్రభుత్వం తమ భూముల వ్యవహారంపై మొండి వైఖరి వీడాలని కోరారు. పనులు పరిశీలించేందుకు వెళ్లామంతే: తహసీల్దార్ గతంలో ప్రభుత్వం దివీస్‌కు భూములు అప్పగించిన నేపథ్యంలో ఆ సంస్థ అక్కడ ఏ పనులు చేస్తున్నదీ పరిశీలించేందుకు వెళ్లామని తహశీల్దార్ టి.వి.సూర్యనారాయణ తెలిపారు. కోర్టు కేసులకు సంబంధించిన భూముల్లోకి వెళ్లలేదని చెప్పుకొచ్చారు. -
జనాభాలో ఫస్ట్... విస్తీర్ణంలో లాస్ట్
జిల్లాల పునర్విభజన తర్వాత హైదరాబాద్ ముఖచిత్రమిది * విస్తీర్ణపరంగా అగ్రస్థానంలో నల్లగొండ * జనాభాలో అతి చిన్న జిల్లాగా సిరిసిల్ల సాక్షి, హైదరాబాద్: కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత హైదరాబాద్ నగరమే అత్యధిక జనాభా గల జిల్లాగా అవతరించనుంది. 2011 జనాభా లెక్కల ప్రకారం హైదరాబాద్ జిల్లా 39.43 లక్షల జనాభాతో అగ్రస్థానంలో ఉండగా.. తర్వాతి స్థానాల్లో రంగారెడ్డి (25.51 లక్షలు), మేడ్చల్(మల్కాజిగిరి) (25.51 లక్షలు) ఉన్నాయి. అతి తక్కువ జనాభా గల జిల్లాగా రాజన్న (సిరిసిల్ల) జిల్లా ఏర్పాటు కానుంది. జనాభాపరంగా మొదటి స్థానంలో ఉన్న హైదరాబాద్.. విస్తీర్ణంలో మాత్రం 217 చదరపు కిలోమీటర్ల పరిధితో చిన్న జిల్లాగా మిగలనుంది. నల్లగొండ జిల్లా 6,862.78 చ.కి.మీ. విస్తీర్ణంతో అతిపెద్ద జిల్లాగా అవతరించనుంది. భూపాలపల్లి(జయశంకర్ జిల్లా) 6,175.21 చ.కి.మీ. పరిధితో రెండోస్థానంలో, రంగారెడ్డి జిల్లా (5,005.98 చ.కి.మీ.) మూడో స్థానంలో నిలిచింది. -
వరద ప్రాంతాల్లో పర్యటించనున్నజగన్
-
వరద ప్రాంతాల్లో పర్యటించనున్న వైఎస్ జగన్
విజయవాడ: రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలతో నష్టపోయిన బాధితులను ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షనేత, వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శించనున్నారు. గుంటూరు జిల్లాలోని వరద ముంపు ప్రాంతాల్లో సోమ, మంగళవారాల్లో వైఎస్ జగన్ పర్యటించనున్నారు. వరదల దాటికి పంట నష్టపోయిన రైతులతో పాటు ఇతర బాధితులను ఆయన పరామర్శించనున్నారు. -
మరణశయ్యపై మన్యం
తూర్పు మన్యంలో మృత్యువు గాండ్రిస్తోంది. సీజనల్ వ్యాధులతో పాటు అంతు చిక్కని రోగాలతో అడవిబిడ్డలు అకాల మరణం పాలవుతున్నారు. విలీన మండలాల్లో పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. ఇరవై రోజుల వ్యవధిలో ఐదుగురు అంతుపట్టని కాళ్ళవాపు వ్యాధితో ప్రాణాలు విడిచారంటే పరిస్థితి తీవ్రత అర్థమవుతుంది. మలేరియాతో పాటు ఈ వ్యాధి ఆదివాసీల ప్రాణాలతో చెలగాటం ఆడుతోంది. సాక్షి ప్రతినిధి, కాకినాడ : ‘తూర్పు’లో మన్యం వాసులకు వింత వ్యాధి సోకింది. వ్యాధి సోకి 20 రోజులైనా ఇంతవరకు వైద్యులు కూడా ఇది ఏ వ్యాధో గుర్తించలేకపోయారు. అంతుచిక్కని ఈ వ్యాధితో ఇంతవరకు ఐదుగురు గిరిజనులు మృత్యువాతపడటం మన్యంలో ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. జిల్లాలోని విలీన మండలమైన వీఆర్‌పురం వాసులను ఈ వ్యాధి వేధిస్తోంది. ఈ మండలంలోని రేఖవానిపాలెం గ్రామ పంచాయతీ పరిధిలోని అన్నవరం, లక్ష్మీనగరం గ్రామాల గిరిజనులు వ్యాధితో చిగురుటాకుల్లా వణికిపోతున్నారు. గత నెల 14తేదీన ఈ గ్రామానికి చెందిన ఇంటర్ విద్యార్థిని బురకా మంగవేణి, ఈ నెల ఒకటో తేదీన అదే గ్రామానికి చెందిన మరో ఇంటర్ విద్యార్థి గొడ్ల కన్నయ్య ఇవే లక్షణాలతో మృత్యువాతకు గురయ్యాడు. తాజాగా మంగళవారం బురకా ఎర్రయ్య అనే గిరిజనుడు కూడా ఇవే లక్షణాలతో మృత్యువాతకు గురికావడంతో గిరిజనం ఆందోళన చెందుతోంది. ఈ గ్రామానికి సమీపాన ఉన్న లక్ష్మినగరానికి చెందిన సరియం బాబురావు కూడా సోమవారం మృతిచెందాడు. ఇంతవరకు ఈ ఒక్క మండలంలో నలుగురు గిరిజనులు మృత్యువాతకు గురయ్యారు. రేఖపల్లి పంచాయతీ పరిధిలో అన్నవరం శివారుచెరువు గుంపు గ్రామంలో 200 కుటుంబాలున్నాయి. అంతా వ్యవసాయ కూలీలే. అన్నవరం గ్రామంలోని చెరువుగుంపులో ఈ జ్వరాలతో తొమ్మిది మంది బాధపడుతున్నారు. ఈ వ్యాధి సోకి గొడ్ల సింగయ్య, సోడె కన్నయ్య, సోడె పెదకన్నయ్య, కారం రామారావు, కబడి రాజు, సోడె లక్ష్మయ్య, కారం ఎర్రయ్య, కొవ్వాసి వీరారెడ్డి, కుంజా రాజయ్య తదితరులు మంచంపట్టారు. వీరు కాకుండా మండలంలోని శివారు గ్రామాల్లో కూడా ఈ వ్యాధి లక్షణాలతో మరికొందరు గిరిజనులు బాధపడుతున్నారని జిల్లా కేంద్రానికి అందిన సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. ఆ గ్రామాల్లో దోమకాటున్నా మలేరియా కేసులు ఇంతవరకు రికార్డు కాలేదు. పోనీ డెంగీ అనుకుంటే ప్లేట్లేట్స్ కూడా ఏమీ తగ్గడం లేదని వీఆర్‌పురం మండలం రేఖపల్లి పిహెచ్సి వైద్యుడు దుర్గాప్రసాద్ చెప్పారు. ఈ విషయాన్ని ఆయన జిల్లా వైద్యాధికారి చంద్రయ్య దృష్టికి తీసుకువెళ్లారు. విషయం తెలిసిన రేఖపల్లి పీహెచ్సీ వైద్యాధికారులు డాక్టర్ ఏ.రామారావు, దుర్గాప్రసాద్ అన్నవరం గ్రామానికి వెళ్లి కాళ్ల వాపు వ్యాధితో బాధపడుతున్న బాధితుల నుంచి, మృతి చెందిన వారి కుటుంబ సభ్యుల నుంచి కూడా ఆ వ్యాధికి సంబంధించిన వివరాలు తెలుసుకున్నారు. వ్యాధి లక్షణాలు... ఈ గిరిజన గ్రామాల్లో సాధారణంగా జ్వరం వస్తే ఒకటి, రెండు రోజులకు తగ్గిపోయేది. కానీ ఇటీవల కాలంలో వస్తున్న జ్వరాలకు స్థానిక వైద్యులు చెప్పే ముందులు వాడుతున్నా తగ్గడం లేదు. సరికదా, మరుసటి రోజుకు జ్వరం తీవ్రత 102 డిగ్రీలకు పెరిగిపోతోంది. రెండు రోజులకు కళ్లు తిరగడం, వాంతులు కావడం జరుగతుంది. మూడో రోజుకు కాళ్లకు నీరుపట్టేసి పైకి లేవలేని పరిస్థితికి చేరుకుని మంచం పట్టేస్తున్నారు. మూడో రోజు జ్వరం తీవ్రత పెరిగి అపస్మారక స్థితికి చేరుకుని నాలుగో రోజుకు మృత్యువాతకు గురవతున్నారు. వ్యాధి వచ్చిన గిరిజనులకు కుటుంబ సభ్యులు స్థానికంగానే వైద్యం చేయించినా జ్వరం తీవ్రత పెరిగి పై నుంచి కిందవరకు ళ్లువాసిపోతున్నాయి. పసర వైద్యంపై అనుమానం... జ్వరమొస్తే సహజంగా నాటు వైద్యాన్ని కూడా ఇక్కడి గిరిజనులు ఆశ్రయిస్తున్నారు. ప్రధానంగా జ్వరం ఎక్కువగా ఉంటే పసర వైద్యాన్ని తీసుకోవడం ఇక్కడ పరిపాటి. గతంలో ఇలా పసర వైద్యం తీసుకున్నా ఎప్పుడూ ఇలా జరగలేదని గిరిజనులు చెబుతున్నారు. ఉబ్బు కామెర్లుగా భావించి పసర వైద్యం చేయించుకోవడంతో ఇలా కాళ్లు వాపు వ్యాధి వచ్చిందంటున్నారు. వీఆర్‌పురం మండలం కన్నాయగూడెంలో ఐదేళ్ల్ల క్రితం ఇదేరకంగా కాళ్లవాపు వ్యాధితో పలువురు గిరిజనులు మృతి చెందారని స్థానికులు చెప్పారు. రక్త నమూనాల సేకరణ... వ్యాధి లక్షణాలు ఏమిటనేది తెలుసుకునేందుకు వ్యాధిగ్రస్తుల రక్త నమూనాలు సేకరించి పరీక్షించేందుకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ బుధవారం రాత్రి పొద్దుపోయాక ఏర్పాట్లు చేసింది. వ్యాధితో బాధపడుతున్న తొమ్మిది మందిని కాకినాడ జీజీహెచ్‌కు బుధవారం రాత్రి తరలించేందుకు నిర్ణయించి ఆ మేరకు ఆంబులెన్సులు సిద్ధం చేస్తున్నారు. -
అడవుల విస్తీర్ణంతో జిల్లాకు పూర్వవైభవం
భావితరాల మేలు కోసం మొక్కలు నాటాలి సింగరేణి హరితహారంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మణుగూరు : అడవుల విస్తీర్ణంతో జిల్లాకు తిరిగి పూర్వ వైభవం తీసుకురావాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. శుక్రవారం సింగరేణి ఆధ్వర్యంలో మణుగూరులో నిర్వహించిన హరితహారంలో మొక్కలు నాటిన అనంతరం మంత్రి మాట్లాడుతూ గతంలో అడవుల పెంపకంలో జిల్లా దేశంలోనే చెప్పుకోదగిన స్థాయిలో ఉండేదని ఉమ్మడి రాష్ట్రంలోనూ అటవీ విస్తీర్ణంలో జిల్లా ప్రథమ స్థానంలో ఉందన్నారు. గత ప్రభుత్వాల అనాలోచిత నిర్ణయాలు, కొందరు స్మగ్లర్లు, స్వార్థపరుల కారణంగా అడవులు తగ్గిపోయాయన్నారు. తిరిగి అడవులు పెంచేందుకు ప్రజలందరి సహకారం అవసరమన్నారు.భావితరాల మేలు కోసం ప్రతి విద్యార్థి మొక్క నాటేలా ఆసక్తి కల్పించాలన్నారు. అడవులు ఉంటే అడవి బిడ్డలైన గిరిజనులకు అన్నిరకాలుగా మేలు చేసినట్లేనన్నారు. సింగరేణి మణుగూరు ఏరియాలో ఒకేసారి పదిహేను వేల మొక్కలు నాటేలా కార్యక్రమం చేపట్టడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, ఐటీడీఏ పీఓ రాజీవ్‌గాంధీ హన్మంతు, సింగరేణి ప్లానింగ్ అండ్ ప్రాజెక్టు డైరెక్టర్ మనోహర్‌రావు, ఏరియా సీజీఎం మాదాసి మల్లేష్, ఎస్వోటూ సీజీఎం నారాయణ, ఓసీ ప్రాజెక్టు అధికారి టీవీ.రావు, ఆర్డీఓ రవీంద్రనాథ్, ఎంపీపీ చిడెం అంజమ్మ, జెడ్పీటీసీ దుర్గ, తహసీల్దారు తిరుమలాచారి, మున్సిపల్ కమిషనర్ సంపత్‌కుమార్, ఎంపీడీఓ పురుషోత్తం, ఐసీడీఎస్ సీడీపీఓ సుబ్బలక్ష్మి, టీబీజీకేఎస్ నాయకుడు సామా శ్రీనివాసరెడ్డి, ఎక్స్లెంట్, శ్రీవిద్య పాఠశాలల కరస్పాండెంట్లు యూసుఫ్‌షరీఫ్, నూకారపు రమేష్ చౌదరి, టీఆర్ఎస్ నాయకులు ఎడ్ల శ్రీనివాస్, పాయం నర్సింహారావు, ముత్యంబాబు, ఉడుముల లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. -
పుష్కర ప్రాంతాలను పరిశీలించండి
అర్బన్ జిల్లా ఎస్పీ గుంటూరు (పట్నంబజారు) : కృష్ణా పుష్కర బందోబస్తులో భాగంగా వచ్చిన అధికారులు వారికి అప్పగించిన ప్రాంతాలను పరిశీలించాలని అర్బన్ జిల్లా ఎస్పీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి ఆదేశించారు. అర్బన్ ఎస్పీ క్యాంపు కార్యాలయంలో గురువారం ఆయన అధికారులతో సమావేశమయ్యారు. అధికారులు ఘాట్ల వద్ద వారికి కేటాయించిన ప్రాంతాలను పరిశీలించి సలహాలు, సూచనలు అందజేశారు. తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి సారిస్తామని అధికారులు తెలిపారు. పుష్కరాల సమయంలో ప్రజలకు సేవలందించేందుకు 500 మంది స్కౌట్స్ అండ్ గైడ్స్ పోలీసుశాఖకు అందుబాటులో ఉంచుతామని గుంటూరు కార్యదర్శి జీవీ కుమార్, అసిస్టెంట్ ఎస్వోసీ పి.శ్రీనివాస్ ఎస్పీకి తెలియ జేశారు. ఈ కార్యక్రమంలో సీఐడీ ఎస్పీ డి.కోటేశ్వరరావు, అదనపు ఎస్పీలు జె.భాస్కరరావు, సుబ్బారాయుడు, బీపీ తిరుపాల్ తదితరులు పాల్గొన్నారు. -
వాడవాడలా హరితహారం
ఎమ్మెల్యే దివాకర్‌రావు మంచిర్యాల రూరల్ : హరితహారం కార్యక్రమంలో భాగంగా మండంలోని హాజీపూర్, దొనబండ జీపీల్లో బుధవారం విస్తృతంగా మొక్కలు నాటారు. మండలంలోని హాజీపూర్ జీపీ పరిధిలోని ధర్మారం, దొనబండ గ్రామాల్లో రహదారులకు ఇరువైపులా ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు మొక్కలు నాటారు. వాడవాడలా హరితహారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ హరితహారంలో ప్రతీ ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. వాతావరణ కాలుష్యం నివారణకు, వర్షాలు సమృద్ధిగా కురవాలంటే వన సంపందను విరివిగా పెంచాలని కోరారు. భవిష్యత్‌లో రైతాంగానికి సాగునీరు కూడా అందాలంటే మొక్కల పెంపకంలో పొలం, చెరువు గట్లపై మొక్కలు నాటేలా చైతన్యం కావాలని కోరారు. ఈ కార్యక్రమాల్లో ఎంపీపీ బేర సత్యనారాయణ, వైస్ ఎంపీపీ మందపల్లి శ్రీనివాస్, హాజీపూర్, దొనబండ సర్పంచులు ఆకుతోట సత్తమ్మ, జాడి సత్యం, ఉప సర్పంచులు బెడ్డల సత్తయ్య, దొమ్మాటి లచ్చన్న, ఎంపీటీసీలు బేతు రమాదేవి, మడావి సంధ్యారాణి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు దొమ్మాటి సత్తయ్య, నాయకులు మాధవరపు రాజేశ్వర్‌రావు, సింగిల్ విండో చైర్మన్ కొట్టె సత్తయ్య పాల్గొన్నారు. -
ఒకే ఏరియా.. ఆరు వెంచర్లు!
సాక్షి, హైదరాబాద్: సాధారణంగా ఏ డెవలపరైనా వెంచర్‌ను ప్రారంభించే ముందు ఆయా ప్రాంతంలో అమ్మకాలెలా ఉంటాయి? భవిష్యత్తు అభివృద్ధి ఉంటుం దా? కొనుగోలుదారుల పెట్టుబడికి లాభం చేకూరుతుందా? వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. ఒకవేళ ఉన్నా సరే ఒకే ఏరియాలో ఒకట్రెండు వెంచర్లను ప్రారంభించేందుకే సంశయించే ఈరోజుల్లో ఒకేసారి ఆరు వెంచర్లు.. అది కూడా ఏకకాలంలో ప్రారంభించింది సుఖీభవ ప్రాపర్టీస్ ప్రై.లి. ‘‘సరిగ్గా ఏడాది క్రితం రాంపల్లిలోని తారక్ ఎన్‌క్లేవ్‌లో గజం రూ. 6,750 చొప్పున విక్రయించాం. ఇప్పుడక్కడ గజం రూ.10 వేలకు పైనే పలుకుతుంది. ఇది చాలదూ మా వెంచర్లు కొనుగోలుదారులకు లాభాన్ని చేకూర్చేవే అనేందుకంటున్నారు సుఖీభవ ప్రాపర్టీస్ ప్రై.లి. సీఎండీ గురురాజ్. ♦ రాంపల్లిలో 15 ఎకరాల్లో సిలికాన్ మెడల్స్ అభివృద్ధి చేస్తున్నాం. గజం రూ.8 వేలు. 133-500 గజాల మధ్య ప్లాట్లుంటాయి. మొత్తం 275 ప్లాట్లు. అభివృద్ధి పనులు 70 శాతం వరకు పూర్తయ్యాయి. కొనుగోలుదారులు కోరితే ఆయా స్థలంలో ఇంటి నిర్మాణం కూడా చేసిస్తాం. చ.అ. రూ.1,300. ♦ అనంతారంలో 14 ఎకరాల్లో హైవే కౌంటి వెంచర్‌ను చేస్తున్నాం. గజం రూ.4,500. వంద శాతం అభివృద్ధి పనులు పూర్తయ్యాయి. 180-400 గజాల మధ్య మొత్తం 210 ప్లాట్లొస్తాయి. ఈ వెంచర్లో చిల్డ్రన్స్ ప్లే ఏరియా కూడా ఉంటుంది. ♦ భువనగిరి టౌన్లో 14 ఎకరాల్లో రాక్పోర్ట్ కాలనీని అభివృద్ధి చేస్తున్నాం. గజం రూ.4,999. మొత్తం 250 ప్లాట్లుంటాయి. 75 శాతం అభివృద్ధి పనులు పూర్తయ్యాయి. చిల్డ్రన్స్ ప్లే ఏరియా ఉంటుంది. ♦ కీసరలో 200 ఎకరాల్లో మామిడి ఆర్చిడ్స్ ఫాంల్యాడ్ వెంచర్‌ను చేస్తున్నాం. 5, 10, 15 గుంటల చొప్పున విక్రయిస్తాం. 5 గుంటలకు రూ.10.27 లక్షలు. ఫామ్‌లో 50 శాతం మామిడి చెట్లు, మిగతా స్థలంలో సీజన్ ఫ్రూట్స్ పండిస్తాం. మూడేళ్ల వరకు మొక్కల పెంపకం కంపెనీదే. ఈ వెంచర్లో రిసార్ట్ కూడా ఉంటుంది. లైఫ్ టైం మెంబర్షిప్ ఉచితం. ♦ రాయగిరి దగ్గర కూనురులో వనమాలి టౌన్‌షిప్‌ను చేస్తున్నాం. మొత్తం 150 ఎకరాలు. తొలి దశలో 60 ఎకరాలను అభివృద్ధి చేస్తున్నాం. గజం రూ.3,150. హైవే ఫేసింగ్ కమర్షియల్ అయితే గజం రూ.4,050. మొత్తం 1,100 ప్లాట్లు. 133-500 గజాల మధ్య ప్లాట్ సైజులుంటాయి. వెంచర్లో 80 శాతం అభివృద్ధి పనులు పూర్తయ్యాయి. స్విమ్మింగ్‌పూల్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, ఇండోర్.ఔట్‌డోర్ గేమ్స్, జాగింగ్, మెడిటేషన్ వంటి వసతులుంటాయి. -
'జీవోలన్నీ బడా బాబుల లాభం కోసమే'
విశాఖపట్నం: రాజధాని ప్రాంతంలో భూదందాలపై సాక్షిలో వెలువడిన కథనాలపై మాజీ ఐఏఎస్ అధికారి ఈఏఎస్.శర్మ స్పందించారు. గత నెలలో ప్రభుత్వానికి తాను రాసిన లేఖలోని అంశాలు, ఈ రోజు సాక్షిలో వెలువడిన కథనాల్లోని అంశాలు ఒకేలా ఉన్నాయని ఈ సందర్భంగా శర్మ వెల్లడించారు. సీఆర్డీఏకు సంబంధించిన ప్రతి జీవో.. బడా బాబులకు లాభం చేకూర్చేలా ఉందని శర్మ తెలిపారు. రాజధాని ప్రాంతంలోని భూదందాపై హైకోర్టు సిట్టింగ్ జడ్జీతో విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. గత నెల 22న ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ.. అజయ్ కలామ్‌కు రాజధాని ప్రాంతంలో భూదందాలపై శర్మ లేఖ రాసిన విషయం తెలిసిందే. -
పేరు వెనుక కథ..
నగర వాసులు రోజూ ఎన్నో ఏరియాలుచుట్టేస్తుంటారు. సంవత్సరాలుగా ఆ ప్రాంతాల్లో ఉంటున్నా.. దానికి ఆ పేరెలా వచ్చిందో తెలియదు. తెలుసుకోవాలనిపించినా చరిత్ర తిరగేసే అవకాశం, ఓపిక ఉండదు. జీహెచ్ఎంసీ ఎన్నికల వేళ నగరంలోని కొన్ని ముఖ్య ప్రాంతాల ‘పేరు వెనుక కథ’ తెలుసుకుందాం. - సాక్షి, సిటీబ్యూరో ఖైరతాబాద్ రాకుమారి ‘ఖైరియాటున్నిసా’ పేరు మీదుగా ఖైరతాబాద్ వచ్చింది. ఆమె ఇబ్రహీం కులీ కుతుబ్ షా (1518-80) కుమార్తె. ఖైరియా తరచూ అనారోగ్యంతో ఇబ్బంది పడేది. దీంతో ఆహ్లాదకర వాతావరణంలో ఉంచితే నయమవుతుందని వైద్యులు సూచించారట. దీంతో కుతుబ్‌షా అల్లుడు, ఇంజినీర్ అయిన హజ్రత్ హుస్సేన్ షా వలిని రాకుమారి కోసం ప్యాలెస్, మసీదు, గార్డెన్, చెరువు నిర్మించమని సూచించాడు. సుల్తాన్ ఆజ్ఞ మేరకు ‘హుస్సేన్‌సాగర్’ తవ్వించాడు వలి. రాజకుమారి పేరుమీదుగా కాలక్రమంలో ‘ఖైరతాబాద్’గా ఈ ప్రాంతానికి పేరు స్థిరపడింది. సుల్తాన్‌బజార్ నిజాం హయాంలో ఇది ప్రముఖ వాణిజ్య కేంద్రం. 1933 వరకూ ఈ ప్రాంతం బ్రిటిష్ రెసిడెన్సీ పరిధిలో ఉండేది. జూన్ 14, 1933లో దీన్ని నిజాంకు అప్పగించారు. మొదట్లో రెసిడెన్సీ బజారని పిలిచినా.. నిజాం ఆదేశాల మేరకు సుల్తాన్ బజార్‌గా మార్చారు. అప్పట్లో ఇక్కడ ఎక్కువశాతం మరాఠీలు ఉండేవారు. సోమాజిగూడ ‘సోనాజీ’ అనే పండిట్ పేరు నుంచి సోమాజిగూడ పేరు వచ్చింది. 1853 ప్రాంతంలో సోనాజీ.. నిజాం రెవిన్యూ విభాగంలో పనిచేసేవాడు. ఆయన నివసించిన భవంతి ఆ కాలంలో ఎంతో పేరుపొందింది. ఆయన మరణం తర్వాత ఆ ప్రాంతాన్ని సోనాజీగా పిలిచేశారు. కాలక్రమంలో సోమాజీగా మారింది. బషీర్‌బాగ్.. పాయిగా నవాబు అస్మన్జా బషీరుద్దౌలా బహదూర్. ఈ ప్రాంతంలో కళ్లుచెదిరే ప్యాలెస్, పార్కును కట్టించాడు. ఈ రాజభవనం చరిత్రలో కనుమరుగైనా.. పాయిగా ప్రభువు ‘బషీరుద్దౌలా’ పేరు మాత్రం ‘బషీర్‌బాగ్’గా నిలిచిపోయింది. తార్నాక.. నిజాంల హయాంలో ఈ ప్రాంతం మామిడి తోటలతో ఉండేది. వీటి రక్షణకు ముళ్లకంచె వేసి కాపలా కోసం, పహారా కాసేందుకు నిజాంలు కొందరిని నియమించారు. భద్రతా సిబ్బంది కోసం అవుట్‌హౌస్ సైతం కట్టించారు. ఉర్దూలో ‘తార్’ అంటే ‘వైరు’ అని, ‘నాకా’ అంటే ‘రక్షకభటుడి గది’ అని అర్థం. అలా తార్నాక పేరు స్థిరపడింది. -
ఏ ప్రాంతంలో ఉంటే అక్కడే ఓటు
రాష్ర్ట ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ స్పష్టీకరణ విశాఖపట్నం: ఉద్యోగ, ఉపాధి రీత్యా ఏ ప్రాంతంలో ఉంటే అక్కడే విధిగా ఓటుహక్కు కలిగి ఉండాలని ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ స్పష్టం చేశారు. విశాఖ కలెక్టరేట్ మీటింగ్ హాలులో గురువారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ నివాసం ఒక చోట..ఓటు హక్కు మరొక చోట ఉంటే ఓటు కోల్పోయే ప్రమాదముందన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడిన వారు..లేదా ఉద్యోగ, ఉపాధిరీత్యా ఇక్కడ ఉంటున్నవారు స్థానికంగా ఓటు హక్కు తీసుకునేందుకు ఆసక్తి చూపడం లేదని, అడిగితే తమ ఊరులో ఓటుహక్కు ఉందని చెబుతున్నారని చెప్పారు. ఆధార్ సీడింగ్ పూర్తయితే ఎక్కడైతే నివాసముంటారో అక్కడే ఓటుహక్కు ఉంటుందని, మిగిలిన ప్రాంతాల్లో ఉన్న ఓటుహక్కును నకిలీగా నిర్ధారించి తొలగిస్తామన్నారు. నగరాలు, పట్టణాల్లో ఓటర్ల జాబితాలలో సమూలమార్పులు తీసుకొస్తున్నట్టు చెప్పారు. ఈనెల 20కల్లా ఎట్టి పరిస్థితుల్లోనూ ఆధార్ సీడింగ్ పూర్తి చేయాల్సిందేనన్నారు. త్వరలో ఎన్నికలు జరగనున్న విశాఖ, కాకినాడ కార్పొరేషన్లతో పాటు ఇతర మున్సిపాల్టీల్లో ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించేందుకు ఓటరు-ఆధార్‌సీడింగ్ ఎంతగానో దోహదపడుతుందన్నారు. -
ఆయ‘కట్టు’ తప్పింది!
లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందించాలనే బృహత్తర లక్ష్యం ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా దూరమవుతోంది.. ప్రాజెక్టుల నిర్మాణంలో ప్రణాళికా లోపం రాష్ట్ర రైతాంగానికి శాపంగా మారుతోంది.. సాగునీటి పథకాలకు భారీగా నిధులు కేటాయిస్తున్నా మొత్తం బూడిదలో పోసిన పన్నీరుగా మారుతోంది.. పూర్తయ్యే దశలో ఉన్న ప్రాజెక్టులకు నిధులివ్వక, నిధులిచ్చిన ప్రాజెక్టులు పూర్తిగాక ఎక్కడిదక్కడే ఉండిపోతోంది.. శరాఘాతంలా పరిణమించిన భూసేకరణ, ఎటూ తేలని భూ పరిహారం, ఎస్కలేషన్ చెల్లింపులపై తేల్చని ప్రభుత్వ ధోరణితో పరిస్థితి మరింత దారుణంగా మారుతోంది.. ఈ ఏడాది కొత్తగా ఆరు లక్షల ఎకరాలకు సాగునీరిస్తామన్న టీఆర్ఎస్ ప్రభుత్వ హామీ కూడా నీళ్లలోనే కలసిపోయింది. - సాక్షి, హైదరాబాద్ వ్యయం భారీగానే.. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి ప్రభుత్వం భారీ స్థాయిలో నిధులను వ్యయం చేస్తోంది. కానీ ఫలితం మాత్రం ఉండడం లేదు. మొత్తంగా 33 భారీ, మధ్యతరహా ప్రాజెక్టులను చేపట్టి... 2004 నుంచి ఇప్పటివరకు రూ. 37,935 కోట్ల మేర ఖర్చుచేశారు. ఈ ఏడాది (2014-15) బడ్జెట్లోనూ సాగునీటి ప్రాజెక్టులకు రూ. 4 వేల కోట్ల మేర కేటాయింపులు చేశారు. ఇందులో ఇప్పటివరకు రూ. 3,200 కోట్ల మేర నిధులను ఖర్చు చేసినట్లు రికార్డులు చెబుతున్నాయి. వచ్చే బడ్జెట్లో సైతం ఇదే స్థాయి కేటాయింపులు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. కానీ ఈ స్థాయిలో నిధుల వ్యయం జరుగుతున్నా... గత పదేళ్లలో సాగులోకి వచ్చిన కొత్త ఆయకట్టు కేవలం 6.34 లక్షల ఎకరాలు మాత్రమే కావడం గమనార్హం. ఒక్క అడుగూ కదల్లేదు.. ప్రాజెక్టుల నిర్మాణంలో జరుగుతున్న జాప్యం కారణంగా ఈ ఏడాది నిర్దేశించుకున్న ఆయకట్టు లక్ష్యం.. ఒక్క అడుగు కూడా కదలలేదు. తక్షణ ఆయకట్టునిచ్చే ప్రాజెక్టులకు భారీగా నిధులు కేటాయించి, వెంటనే పూర్తిచేస్తామని... మార్చి నాటికి ఆరు లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు నీరు అందిస్తామని టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రకటించింది. కానీ ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు కొత్తగా రెండు వేల ఎకరాల ఆయకట్టుకు మాత్రమే సాగునీరు అందించగలిగింది. మూల్యం తప్పదా? సాగునీటి ప్రాజెక్టులను పూర్తిచేయడంలో ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా మూల్యం భారీగానే చెల్లించుకోక తప్పని పరిస్థితి కనిపిస్తోంది. ఆ అదనపు మోత ఈ ఏడాది వరకు సుమారు రూ. 10 వేల కోట్ల వరకూ ఉంటుందని నిపుణుల అంచనా. ఆలస్యమైన కొద్దీ ఈ ‘భారం’ మరింత పెరగవచ్చని వారు అభిప్రాయపడుతున్నారు. నిర్మాణాలు దాదాపు చివరిదశకు చేరిన పలు ప్రధాన ప్రాజెక్టుల పనులు కూడా పెండింగ్‌లో పడిపోయాయి. చాలా ప్రాజెక్టుల నిర్మాణాల కోసం పెట్టుకున్న తుది గడువు ఎప్పుడో ముగిసిపోవడంతో... మరి కొన్నేళ్లు పెంచుతూనే వస్తున్నారు. ఇలా పొడిగిస్తుండడంతో అంచనా వ్యయాన్ని కూడా సవరించాల్సి వస్తోంది. పలు ప్రాజెక్టుల పనులకు సంబంధించిన ధరల (ఎస్కలేషన్ చార్జీల)ను పెంచాలని కాంట్రాక్టర్లు డిమాండ్ చేస్తూ.. పనులను కూడా నిలిపివేశారు. ధరలను పెంచితేనే పనులు చేస్తామంటున్నారు. వారు కోరుతున్న మేర ఎస్కలేషన్ చార్జీలను చెల్లిస్తే ప్రభుత్వంపై అదనంగా రూ. 10 వేల కోట్ల భారం పడనుంది. చేతిదాకా వచ్చినా.. మహబూబ్‌నగర్‌లోని కల్వకుర్తి, నెట్టెంపాడు, రాజీవ్‌బీమా, కోయిల్‌సాగర్, నల్లగొండలోని ఏఎమ్మార్పీ, వరంగల్‌లోని దేవాదుల, కరీంనగర్, ఖమ్మం, నల్లగొండలకు సాగునీటిని ఇచ్చే ఎస్సారెస్పీ-2, వరద కాలువ, కరీంనగర్‌లోని ఎల్లంపల్లి, ఖమ్మం జిల్లాకు చెందిన రాజీవ్‌సాగర్, ఇందిరా సాగర్ ప్రాజెక్టుల నిర్మాణాలు 80 శాతానికిపైగా పూర్తయ్యాయి. ఏఎమ్మార్పీ, దేవాదుల ప్రాజెక్టుల నుంచి ఇప్పటికే పాక్షికంగా నీటిని కూడా విడుదల చేశారు. అలాగే కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, ఎల్లంపల్లి వంటి ప్రాజెక్టుల నుంచి ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో నీటిని ఇవ్వడానికి అవకాశం ఉంది. కానీ ఈ ప్రాజెక్టుల నిర్మాణ పనులు కూడా మందకొడిగా సాగుతున్నాయి. నత్తను మించిపోయింది.. 2014-15లో సాగులోకి తేవాల్సిన ఆయకట్టు లక్ష్యం.. 6,27,607 ఎకరాలు (అదనంగా స్థిరీకరణ 12,000 ఎకరాలు) ఫిబ్రవరి 15 నాటికి సాగులోకి వచ్చిన కొత్త ఆయకట్టు.. 2,000 ఎకరాలు (కొమురంభీమ్ ప్రాజెక్టు పరిధిలో) 2015-16 ఏడాది కోసం నిర్దేశించుకున్న కొత్త ఆయకట్టు లక్ష్యం... 6,72,000 ఎకరాలు లక్ష్యాన్ని నీరుగార్చేవి ఇవే.. ప్రభుత్వ ప్రణాళికా లోపం.. అధికారుల్లో చొరవ లేకపోవడం ప్రధాన ప్రాజెక్టుల పరిధిలో నెలకొన్న భూసేకరణ సమస్యలు, పరిహారంలో జాప్యం ఎస్కలేషన్ చార్జీలు పెంచాలంటూ పనులు నిలిపివేసిన కాంట్రాక్టర్లు కాంట్రాక్టర్ల డిమాండ్లపై రాష్ట్ర ప్రభుత్వం ఎటూ తేల్చకపోవడం లక్ష్యం బారెడు.. పని మూరెడు మొత్తం ఆయకట్టు లక్ష్యం.. 47,47,736 ఎకరాలు అదనంగా స్థిరీకరించాల్సినది.. 42,000 ఎకరాలు ఇప్పటివరకు అందుబాటులోకి వచ్చినది 6,20,461 ఎకరాలు ఇంకా వృద్ధిలోకి రావాల్సింది... 41,27,275 ఎకరాలు -
అటవీ ఆక్రమణలు ఉపేక్షించం
30 శాతం ఆక్రమణ చెరలోనే ఆక్రమణదారులపై కఠిన చర్యలు ప్రభుత్వానికి నివేదిక జిల్లాలో 7శాతమే అడవులు జిల్లా అటవీశాఖాధికారి ఎస్.రాజశేఖర్ సాక్షి, విజయవాడ : జిల్లాలో అటవీభూముల ఆక్రమణదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా అటవీశాఖాధికారి ఎస్.రాజశేఖర్ హెచ్చరించారు. ఇతర జిల్లాలతో పోలిస్తే జిల్లాలో తక్కువ విస్తీర్ణంలో కేవలం ఏడు శాతం మాత్రమే అడవులున్నాయని తెలిపారు. జిల్లాలో తక్కువ విస్తీర్ణంలో ఉన్న అటవీ భూములను పూర్తిస్థాయిలో పరిరక్షించటానికి శాఖాపరంగా తీసుకుంటున్న చర్యల్ని ఆయన వివరించారు. ఇప్పటికే జిల్లాలోని నూజివీడు డివిజన్లో ఆక్రమణలు అధికంగా జరిగాయని పేర్కొన్నారు. అటవీ భూముల్లో సుమారు 30శాతం ఆక్రమణల్లోనే ఉన్నాయని రాజశేఖర్ చెప్పారు. జిల్లాలో 49,960 హెక్టార్లలో అటవీప్రాంతం ఉందని తెలిపారు. దీనిలో సుమారు 20శాతం అటవీ ప్రాంతం కొండల్లో ఉందని, విజయవాడ డివిజన్ పరిధిలోని జగ్గయ్యపేట, కొండపల్లి, కంచికచర్ల, శోభనాపురం, విజయవాడ తదితర ప్రాంతాల్లో 25,368.04 హెక్టార్లు అటవీప్రాంతం ఉందని చెప్పారు. అలాగే మైలవరం డివిజన్ పరిధిలోని జి.కొండూరు, ఎ.కొండూరు, మైలవరం తదితర ప్రాంతాల్లో 11,863.42 హెక్టార్లలో అడవులున్నాయని వివరించారు. నూజివీడు డివిజన్ పరిధిలోని నూజివీడు, సుంకొల్లు, విస్సన్నపేట, తదితర ప్రాంతాల్లో 12,708.83 హెక్టార్లలో అడవులున్నాయని, వీటిలో సుమారు 25 నుంచి 30శాతం అడవులు ఆక్రమణల చెరలోనే ఉన్నాయని తెలిపారు. 40 ఏళ్లుగా ఆక్రమణలు దాదాపు 40 ఏళ్ల నుంచి జిల్లాలో అడవుల ఆక్రమణలు యథేచ్ఛగా జరగుతున్నాయని రాజశేఖర్ తెలిపారు. ఈ క్రమంలోనే తమశాఖ అధికారులు కొనేళ్ల కిత్రమే అక్రమణలదారులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి అరె స్టు చేశారని చెప్పారు. ప్రస్తుతం 50కి పైగా కేసులు కోర్టుల్లో ఉన్నాయని వివరించారు. నూజివీడులో సుమారు 30 వేల ఎకరాల అడవులు అన్యాకాంత్రం అయ్యాయని, వీటిపై ఇప్పటికే చర్యలు తీసుకున్నామని చెప్పారు. అడవుల్లో మామిడి, పామాయిల్, ఇతర పంటలు సాగులో ఉన్నాయని చెప్పారు. అటవీ భూములను ప్రభుత్వం తీసుకోవడానికి సంబంధించి తమ శాఖకు ఎలాంటి ప్రతిపాదనలు రాలేదని, గతంలో కలెక్టర్ ఆదేశాలతో భూముల వివరాల నివేదికను పంపామని చెప్పారు. అటవీ భూములను ల్యాండ్ కన్వర్షన్ చేయాలంటే కేంద్ర ప్రభుత్వం అనుమతి తప్పనిసరని తెలిపారు. -
చిరుత చిక్కింది
బెజ్జంకి, న్యూస్‌లైన్ : కొన్నేళ్లుగా ఈ ప్రాంత ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్న చిరుత అనూహ్యంగా ఉచ్చులో చిక్కింది. వేటగాళ్లు అడవిపందుల కోసం అమర్చిన ఉచ్చులో ప్రమాదవశాత్తు చిక్కిన చిరుత కాసేపు నానా హంగామా సృష్టించింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎనిమిది గంటల ఉత్కంఠ పరిస్థితుల అనంతరం చిరుతను బంధించి తరలించడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. బెజ్జంకి మండలం హన్మాజిపల్లెకు చెందిన తోటపల్లి లచ్చయ్య అనే గొర్లకాపరి సోమవారం ఉదయం 11.30 ప్రాంతంలో గొర్లమందను గ్రామ శివారు పంతుళ్ల కొండాపూర్ ల్యాగల గుట్ట సమీపానికి మేతకు తీసుకెళ్లాడు. అటువైపు వెళ్తుండగానే గొర్లు ఒక్కసారిగా బెదిరిపోయాయి. కాసేపటికి తోటపల్లి చిన్నచంద్రయ్య గొర్లు కూడా అక్కడివరకు వెళ్లి బెదిరి చెల్లాచెదురయ్యాయి. గొర్లకాపరులు వెళ్లి చూడగా వారికి చిరుత కనిపించడంతో ఒక్కసారిగా బెదిరిపోయారు. అడవిపందుల కోసం వేటగాళ్లు అమర్చిన ఉచ్చులో చిరుత చిక్కుకుందని గుర్తించి, వెంటనే గ్రామస్తులకు సమాచారం అందించారు. సర్పంచ్ హన్మండ్ల నర్సవ్వ, గ్రామస్తులు అక్కడకు చేరుకుని ఎస్సై ఉపేందర్‌రావు, తహశీల్దార్ కిష్టయ్యకు సమాచారం అందించారు. వారు ఫారెస్టు అధికారులకు సమాచారం ఇచ్చారు. 8 గంటలు ఉత్కంఠ చిరుత చిక్కిందనే సమాచారం మండలవ్యాప్తంగా వ్యాపించడంతో ప్రజలు భారీగా తరలివచ్చారు. ఫారెస్ట్ అధికారులు డీఎఫ్ ఏఎస్పీ జోజీ, డీఎఫ్‌వో నర్సయ్య, కరీంనగర్ రేంజ్ అధికారి వాహబ్ 2 గంటల ప్రాంతంలో అక్కడకు చేరుకున్నారు. 6 గంటల ప్రాంతంలో వరంగల్ ఫారెస్ట్ రేంజ్ అధికారి రాజరాం, డాక్టర్ ప్రవీణ్‌కుమార్, రెస్క్యూ టీం సభ్యులు బాలాజీ, కృష్ణ, సదానందం, చారి చేరుకున్నారు. డాక్టర్ ప్రవీణ్‌కుమార్ చిరుతకు మత్తు ఇంజక్షన్ వేయగా మూడు సార్లు గురితప్పింది. నాలుగోసారి ఇంజక్షన్ చిరుతకు తగిలినా మత్తు ఎక్కలేదు. మరోసారి ప్రయత్నంలో చిరుతకు మత్తు ఎక్కడంతో దాని దగ్గరికి వెళ్లిన అధికారులు చిరుత ముందరికాలుకు ఉన్న ఉచ్చును తొలగించారు. బోనులోకి ఎక్కించి చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని జూపార్క్‌కు తరలించారు. డీఎస్పీ రవీందర్ ఎప్పటికప్పుడు పరిస్థితి పర్యవేక్షించారు. ఊపీరి పీల్చుకున్న ప్రజలు మండలంలోని మైలారం, హన్మాజిపల్లె, గోపాల్పూర్ గ్రామాల్లో చిరుత సంచారంతో రెండేళ్లుగా ప్రజలు భయాం దోళనకు గురవుతున్నారు. రైతులు రాత్రివేళ వ్యవసాయ బావుల వద్దకు వెళ్లాలంటేనే జంకుతున్నారు. గతేడాది ముచ్చతల లక్ష్మారెడ్డి అనే రైతుకు చెందిన లేగదూడ బావి వద్ద ఉండగా చిరుత తినేసింది. మూడురోజుల క్రితం హన్మాజీపల్లికి చెందిన పురుషోత్తం రాజయ్య గొర్రె పిల్లను, రెండు రోజుల క్రితం మైలారం గ్రామానికి చెందిన మడికట్టు అశోక్ లేగదూడను తినేసింది. దీంతో భయాందోళన పెరిగిపోయింది. అడవిపందుల బెడద కూడా ఎక్కువగానే ఉంది. అయితే వేటగాళ్లు అడవిపందుల కోసం ల్యాగలగుట్ట సమీపంలో అమర్చిన ఉచ్చులో అనూహ్యంగా చిరుత చిక్కుకోవడంతో ఆయా గ్రామాల ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. చిరుత బం ధించే విషయంలో ఫారెస్టు అధికారుల తీరుకు ప్రజలు అసహనం వ్యక్తం చేశారు. 12 గంటల సమయంలో సమాచారం అందిస్తే చాలా ఆలస్యంగా చేరుకోవడంపై మండిపడ్డారు. -
‘లెక్క’ లేకుంటే చిక్కులే..!
ముంబై: వ్యాపార అవసరాలు.. ఇతరత్రా పనుల కోసం పెద్దమొత్తంలో నగదు తీసుకెళ్తున్నారా..? అయితే ఈ ఎన్నికల సమయంలో కాస్త జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి. ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో.. డబ్బులు వెంట తీసుకెళ్లడం సమస్యకు దారితీసే అవకాశముంది. ఈ విషయంలో తగిన అవగాహనతో వ్యవహరించకుంటే ఇబ్బందులు తప్పవు. నగరానికి చెందిన వ్యాపారులేకాకుండా ఇతర ప్రాంతాల నుంచి నగరానికి వచ్చినవారు కూడా వివిధ అవసరాల కోసం, కొనుగోళ్ల కోసం పెద్దమొత్తంలో నగదు తీసుకొని వస్తుంటారు. ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమలులోకి రావడం, పోలింగ్‌లో డబ్బు ప్రభావాన్ని నియంత్రించేందుకు పోలీసులు తనిఖీలు చేపడుతున్నారు. దీనిపై అవగాహన లేకపోవడంతో తనిఖీల్లో డబ్బు పట్టుబడి గతంలో చాలామంది వ్యాపారులు, కొనుగోలు దారులు ఇబ్బందుల్లో పడ్డారు. లెక్క తప్పనిసరి ఎన్నికల సందడి ఊపందుకున్న క్రమంలో నగరంతోపాటు ఢిల్లీ జాతీయ ప్రాదేశిక ప్రాంతాల్లో పోలీసులు విస్తృతంగా తనిఖీలు జరుపుతున్నారు. ఈ క్రమంలో రూ.లక్షకు మించి నగదు తీసుకెళ్లే వారు కచ్చితంగా ఆ డబ్బులకు సంబంధించి పూర్తి వివరాలు చూపాల్సి ఉంటుంది. డబ్బులను ఎక్కడికి తీసుకెళ్తున్నారు.. ఆ డబ్బులు ఎక్కడ నుంచి అందాయో.. ఏ అవసరాలకు తీసుకెళ్తున్నామనే విషయాలపై పూర్తిస్థాయి ఆధారాలు చూపాల్సి ఉంటుంది. ఆ విషయంతో పోలీసులు సంతృప్తి చెందకుంటే స్వాధీనం చేసుకున్న డబ్బులు సీజ్ చేసి కేసును ఇన్‌కంట్యాక్స్ అధికారులకు సిఫార్సు చేస్తారు. డబ్బులు తీసుకెళ్తున్న వారు ఆదాయపు పన్నుశాఖ అధికారులకు తగిన ఆధారాలు చూపితే డబ్బులు రిలీజ్ అవుతాయి. ఇంకా ఇలా చేయండి పెద్దమొత్తంలో నగదు తీసుకెళ్లడానికి ఆర్టీజీఎస్ (రియల్ టైం గ్రాస్ సెటిల్మెంట్) పద్ధతిని అనుసరిస్తే మేలు. ఈ పద్ధతిలో బ్యాంకు ద్వారా డబ్బులను నేరుగా అవసరమైన వారికి చేరవేయవచ్చు. డబ్బులు ట్రాన్స్ఫర్ చేసే వ్యక్తికి.. డబ్బులు పొందుతున్న వ్యక్తికి పాన్‌కార్డు తప్పనిసరిగా ఉండాలి. తాము ఎవరికైతే డబ్బులు పంపుతున్నామో వారి అకౌంట్ నంబరు, బ్యాంకు బ్రాంచి పేరు, ఏరియా, ఐఎఫ్ఎస్సీ కోడ్లను తెలపాలి. ఈ పద్ధతి ద్వారా తాము తీసుకెళ్లదల్చుకున్న డబ్బులను బ్యాంకు ద్వారా బదిలీ చేయవచ్చు. ఎన్నికల పర్వం ముగిసే వరకు ఈ పద్ధతిని అనుసరిస్తే పోలీసుల తనిఖీలతో ఇబ్బందులు పడే ఆస్కారం ఉండదు. -
విభజన ఇబ్బంది
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : ఆంధ్రప్రదేశ్‌ను నిట్ట నిలువునా చీల్చిన కాంగ్రెస్ ప్రభుత్వ దుర్నీతిని నిరసిస్తూ బుధవారం చేపట్టిన సీమాంధ్ర బంద్‌ను పురస్కరించుకుని నగరం నుంచి వెళ్లే ఆర్టీసీ బస్సులు సాయంత్రం వరకు నిలిచిపోయాయి. బంద్ గురించి ముందే తెలిసినందున ప్రయాణికులు కూడా పెద్దగా బస్టాండ్లకు రాలేదు. వారాంతం కాకపోవడం వల్ల రద్దీ కనిపించలేదు. తిరుపతి, కడప మార్గాల్లో సాయంత్రం ఐదు గంటల నుంచి, హైదరాబాద్ వైపు రాత్రి ఏడు గంటల నుంచి అన్ని బస్సు సర్వీసులను పునరుద్ధరించామని ఏపీఎస్ ఆర్టీసీ స్థానిక అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్ రవీంద్రారెడ్డి తెలిపారు. -
మహిళలకు 33 శాతం ఇళ్లు
సాక్షి, ముంబై: మహారాష్ట్ర హౌసింగ్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ (మాడా) నిర్మిస్తున్న ఇళ్లలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని యోచిస్తోంది. ఈ ప్రతిపాదన కార్యరూపం దాల్చితే ఇక మీదట మాడా నిర్వహించే లాటరీ ప్రక్రియ ద్వారా మహిళలకు ప్రత్యేకంగా 33 శాతం ఇళ్లు లభించనున్నాయి. దీన్ని అన్ని వర్గాల మహిళలకూ అమలు చేయాలని యోచిస్తున్నారు. సుధారణ సమితి చేసిన ఈ సిఫార్సుకు రాష్ట్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపితే సొంతగూటి కోసం మహిళలు కంటున్న కలలు సాకారం కానున్నాయి. ఇదివరకే మాడా ముంబైతోపాటు పశ్చిమ, తూర్పు శివారు ప్రాంతాల్లో అనేక ఇళ్లు నిర్మించింది. వాటిని పేదలకు చౌక ధరలకే అందజేయాలని నిర్ణయించింది. అర్హుల నుంచి బ్యాంక్ లేదా అన్లైన్ ద్వారా దరఖాస్తులు ఆహ్వానిస్తారు. ఇందులో ఉన్నత, మధ్య తరగతి, పేదలు ఇలా వివిధ వర్గాల కోసం ఇళ్లు కేటాయిస్తారు. లాటరీలో ఇళ్లు వచ్చిన వారికి తదనంతరం అందజేస్తారు. మహిళలకు కూడా ప్రత్యేకంగా కోటా లేకపోవడంతో వీరికి అన్యాయం జరుగుతోందనే విమర్శలున్నాయి.దీంతో 33 శాతం రిజర్వేషన్ అమలుచేస్తే అన్ని వర్గాల మహిళలకు సొంతిళ్లు లభిస్తాయని మాడా అభిప్రాయపడుతోంది. దీనిపై తీవ్రంగా చర్చలు జరుగుతున్నాయి. ఈ ప్రతిపాదన అమలుకు మాడా నియమావళిలో కొన్ని మార్పులు చేయాల్సి ఉంటుంది. న్యాయనిపుణులు, అనుభవజ్ఞుల సలహాలు తీసుకున్న తరువాత ఒక నిర్ణయానికి వస్తామని మాడా ఉపాధ్యక్షుడు సతీష్ గవయి తెలిపారు. ఇదిలాఉండగా యుద్ధాల్లో గాయాలైన, అమరులైన సైనికుల కుటుంబాలు, విధినిర్వహణలో మరణించిన పోలీసులు, అంధులు, వికలాంగులు, మానసిక వికలాంగులతోపాటు ప్రభుత్వ ఉద్యోగులు, కార్పొరేషన్, మున్సిపాలిటీలు, జిల్లా పరిషత్, పంచాయతీ సమితుల్లో పనిచేసేవారికి కూడా రిజర్వేషన్ అమలు చేయాలని యోచిస్తున్నట్లు గవయి వెల్లడించారు.అయితే ఇది చాలా సంక్లిష్ట ప్రక్రియ కాబట్టి చర్చోపచర్చల తరువాతే తుది నిర్ణయం తీసుకుంటామన్నారు. ఆ తరువాత రూపొందించే నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించాల్సి ఉంటుందని ఆయన వివరించారు.