యశవంతపుర (కర్ణాటక): ఖాళీ స్థలంలో వదిలి వెళ్లిన కారులో కోటి రూపాయల నగదు బయట పడిన ఘటన ఉత్తరకన్నడ జిల్లా అంకోలా తాలూకా జాతీయ రహదారి 63లో రామనగుళి వద్ద వెలుగులోకి వచ్చింది. సోమవారం సాయంత్రం నుంచి గుర్తు తెలియని కారు నిలిపి ఉంది. అనుమానం పడిన స్థానికులు అంకోలా పోలీసులకు సమాచారం ఇచ్చారు.
పోలీసులు చేరుకుని పరిశీలించారు. బెంగళూరు రిజిస్ట్రేషన్ నంబర్ గల హుండై క్రెటా కారులో కోటి రూపాయిల నగదు లభించింది. కారును, నగదును సీజ్ చేశారు. కారు ఎవరిది, నగదుతో పాటు ఎందుకు వదిలేశారు అనేది సస్పెన్స్‌గా మారింది. కారు నంబరు ఆధారంగా పోలీసులు విచారణ చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment