Hyundai
-
మూడు ఐఐటీలతో హ్యుందాయ్ ఒప్పందం.. భారీ పెట్టుబడి
న్యూఢిల్లీ: బ్యాటరీలు, విద్యుదీకరణ రంగాలలో సహకార పరిశోధనా వ్యవస్థను నెలకొల్పేందుకు మూడు ఐఐటీలతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు హ్యుండై మోటార్ గ్రూప్ తెలిపింది. ఇందుకోసం ఐదేళ్లలో 7 మిలియన్ డాలర్ల పెట్టుబడి చేయనున్నట్టు వెల్లడించింది. ఐఐటీ ఢిల్లీ, ఐఐటీ బాంబే, ఐఐటీ మద్రాస్ వీటిలో ఉన్నాయి.సహకారంలో భాగంగా హ్యుండై సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను ఐఐటీ ఢిల్లీలో ఏర్పాటు చేస్తామని, హ్యుండై మోటార్ గ్రూప్ నుండి స్పాన్సర్‌షిప్‌ల ద్వారా నిర్వహిస్తామని సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. బ్యాటరీలు, విద్యుదీకరణలో పురోగతిని నడిపించడం హ్యుండై సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ప్రాథమిక లక్ష్యం. ప్రధానంగా భారతీయ మార్కెట్ యొక్క విభిన్న అవసరాలను తీర్చడానికి ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నారు.ఈ సెంటర్ భారత విద్యా వ్యవస్థ నుండి ప్రతిభావంతులైన వ్యక్తులతో బలమైన నెట్‌వర్క్‌ను పెంపొందించగలదని నమ్ముతున్నామని, ఆవిష్కరణలు, భవిష్యత్తు వృద్ధిని ప్రోత్సహిస్తుందని హ్యుండై మోటార్ గ్రూప్ రిసర్చ్, డెవలప్మెంట్, ప్లానింగ్, కోఆర్డినేషన్ సెంటర్ హెడ్ నక్సప్ సంగ్ వివరించారు. హ్యుండై సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అకడమిక్–పారిశ్రామిక సహకార ప్రాజెక్టులపై సంయుక్త పరిశోధనలను నిర్వహించడమే కాకుండా.. కొరియా, భారత్‌కు చెందిన బ్యాటరీ, విద్యుద్దీకరణ నిపుణుల మధ్య సాంకేతిక, మానవ వనరుల మార్పిడిని సులభతరం చేస్తుందని సంస్థ తెలిపింది. -
కలిసొచ్చిన పెళ్లిళ్ల సీజన్.. వాహన అమ్మకాల జోరు
న్యూఢిల్లీ: పెళ్లిళ్ల సీజన్, ఎస్‌యూవీలకు డిమాండ్ నెలకొనడం, గ్రామీణ మార్కెట్లు మెరుగుపడుతుండటం వంటి సానుకూల అంశాలతో నవంబర్‌లో వాహన విక్రయాలు పెరిగాయి. మారుతీ సుజుకీ ఇండియా, టాటా మోటర్స్, టయోటా కిర్లోస్కర్ మోటర్స్ మొదలైన దిగ్గజాల దేశీయ అమ్మకాలు వృద్ధి చెందాయి.మారుతీ విక్రయాలు 5 శాతం, టాటా మోటర్స్ 2 శాతం, టయోటా 44 శాతం మేర వృద్ధి నమోదు చేశాయి. అటు, కొత్తగా లిస్టయిన హ్యుందాయ్ మోటర్ ఇండియా అమ్మకాలు 2 శాతం క్షీణించాయి. గ్రామీణ మార్కెట్లు పుంజుకుంటూ ఉండటం, ఎస్‌యూవీలకు డిమాండ్ నెలకొనడం, లిమిటెడ్ ఎడిషన్లను ప్రవేశపెట్టడం తదితర అంశాలు తమకు కలిసొచ్చాయని మారుతీ సుజుకీ ఇండియా సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పార్థో బెనర్జీ తెలిపారు.నవంబర్‌లో బ్రెజా, ఎర్టిగా, గ్రాండ్ విటారా ఎక్స్ఎల్6 వంటి యుటిలిటీ వాహనాల అమ్మకాలు గత నవంబర్‌లో నమోదైన 49,016 యూనిట్లతో పోలిస్తే 59,003 యూనిట్లకు పెరిగాయి. అయితే, ఆల్టో, ఎస్–ప్రెసోలాంటి మినీ–సెగ్మెంట్ కార్ల అమ్మకాలు 9,959 యూనిట్ల నుంచి 9,750 యూనిట్లకు తగ్గాయి. మరోవైపు, వివిధ వర్గాల అవసరాలకు అనుగుణమైన హ్యాచ్‌బ్యాక్‌ల నుంచి ఎస్‌యూవీల వరకు వైవిధ్యమైన పోర్ట్‌ఫోలియోతో విక్రయాలు మెరుగుపర్చుకుంటున్నట్లు టయోటా వైస్ ప్రెసిడెంట్ శబరి మనోహర్ తెలిపారు. -
క్రాష్ టెస్టులో 5 స్టార్ రేటింగ్: సేఫెస్ట్ కారుగా టక్సన్
భారత్ ఎన్సీఏపీ క్రాష్ టెస్టులో హ్యుందాయ్ టక్సన్ 5 స్టార్ రేటింగ్ సాధించింది. బీఎన్సీఏపీ పరీక్షించిన తొలి హ్యుందాయ్ కారు టక్సన్ కావడం గమనార్హం. ఇది అడల్ట్ సేఫ్టీలో 32 పాయింట్లకు 30.84 పాయింట్లు సాధించగా, పిల్లల రక్షణలో 49కు 41 పాయింట్లు సాధించింది.హ్యుందాయ్ టక్సన్ కారులో ఫ్రంటల్ ఎయిర్ బ్యాగ్, బెల్ట్ ప్రీటెన్షనర్, బెల్ట్ లోడ్ లిమిటర్, సైడ్ హెడ్ కర్టెన్ ఎయిర్ బ్యాగ్, సైడ్ చెస్ట్ ఎయిర్ బ్యాగ్, సైడ్ పెల్విస్ ఎయిర్ బ్యాగ్ వంటివి ఉన్నాయి. ఇందులో చైల్డ్ సీట్ కోసం ఐసోఫిక్స్ మౌంట్స్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, సీట్ బెల్ట్ రిమైండర్లు మొదలైనవి ఉన్నాయి.హ్యుందాయ్ టక్సన్ ధర రూ.29.02 లక్షల నుంచి రూ.35.94 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య ఉంది. ఇది 2.0-లీటర్ పెట్రోల్ ఇంజన్, 2-లీటర్ డీజిల్ ఇంజన్ ఆప్షన్లలో లభిస్తుంది. పెట్రోల్ ఇంజన్ 156 బీహెచ్పీ పవర్, 192 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. డీజిల్ ఇంజిన్ 186 బీహెచ్పీ పవర్, 416 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది.హ్యుందాయ్ టక్సన్ మంచి డిజైన్, ఫీచర్స్ పొందుతుంది. ఇది రెండు డ్యూయల్-టోన్ షేడ్స్, ఐదు మోనోటోన్ రంగులలో లభిస్తుంది. అవి అట్లాస్ వైట్, అబిస్ బ్లాక్, అమెజాన్ గ్రే, స్టార్రీ నైట్, ఫియరీ రెడ్, అట్లాస్ వైట్ విత్ అబిస్ బ్లాక్ రూఫ్, అబిస్ బ్లాక్ రూఫ్ తో ఫియరీ రెడ్.Safety ratings of Hyundai-Tucson Gasoline.The Hyundai Tucson Gasoline has scored 5 Star Safety Ratings in both Adult Occupant Protection (AOP) and Child Occupant Protection (COP) in the latest Bharat NCAP crash tests#bharatncap #safetyfirst #safetybeyondregulations #drivesafe pic.twitter.com/9vpaEUga8y— Bharat NCAP (@bncapofficial) November 28, 2024 -
భారత్‌లో 6 లక్షల మంది కొన్న కారు ఇదే..
అత్యంత ప్రజాదరణ పొందిన 'హ్యుందాయ్ వెన్యూ' కారును దేశీయ విఫణిలో ఆరు లక్షల మంది కొనుగోలు చేశారు. 2019లో ప్రారంభమైన ఈ ఎస్యూవీ ఐదున్నర సంవత్సరాల్లో ఈ మైలురాయిని చేరుకుంది. అత్యధికంగా 2024 ఆర్ధిక సంవత్సరంలో 1,28,897 యూనిట్లు అమ్ముడయ్యాయి.హ్యుందాయ్ వెన్యూ మార్కెట్లో లాంచ్ అయిన తరువాత.. మొదటి ఆరు నెలల్లో 50,000 యూనిట్ల మైలురాయిని చేరుకుంది. ఆ తరువాత 15 నెలల్లో లక్ష యూనిట్లు, 25 నెలల్లో రెండు లక్షల యూనిట్లు, 36 నెలల్లో మూడు లక్షల యూనిట్ల అమ్మకాలను సాధించింది. 2023 నవంబర్ నాటికి వెన్యూ సేల్స్ ఐదు లక్షల యూనిట్లు కావడం గమనార్హం. ఆ తరువాత లక్ష యూనిట్లు అమ్ముడు కావడానికి 12 నెలల సమయం పట్టింది.ఇదీ చదవండి: పెద్ద బ్యాటరీలు కలిగిన టూ వీలర్స్ ఇవే!.. రేంజ్ కూడా ఎక్కువే..హ్యుందాయ్ వెన్యూ మొత్తం 26 వేరియంట్లు, 3 ఇంజన్లు, 3 గేర్‌బాక్స్ ఎంపికలలో లభిస్తుంది. దీని ధరలు రూ. 7.94 లక్షల నుంచి రూ. 13.44 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య ఉంది. కాగా కంపెనీ 2025 వెన్యూ కారును వచ్చే ఏడాది ప్రారంభంలో లాంచ్ చేయడానికి సన్నద్ధమవుతోంది. ఇప్పటికే ఈ కారు పలుమార్లు టెస్టింగ్ సమయంలో కనిపించింది. రాబోయే 2025 వెన్యూ మోడల్ దాని స్టాండర్డ్ మోడల్ కంటే కూడా ఉత్తమంగా ఉంటుందని తెలుస్తోంది. -
నిరాశ మిగిల్చిన హ్యుందాయ్ మోటార్స్ ఐపీఓ!
హ్యుందాయ్ మోటార్స్ ఇండియా ఐపీఓ మంగళవారం స్టాక్మార్కెట్లో లిస్ట్ అయింది. కొంతకాలంగా మదుపర్లు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్న ఈ ఐపీఓ 1.5 శాతం డిస్కౌంట్‌తో మార్కెట్లోకి ప్రవేశించింది. ప్రముఖ కార్ల తయారీ కంపెనీ హ్యుందాయ్ అనుబంధ సంస్థ హ్యుందాయ్ మోటార్స్ ఇండియా లిమిటెడ్(హెచ్ఎంఐఎల్) రూ.27,870 కోట్లు సమీకరించేందుకు ఐపీఓ బాట పట్టింది. ఈ ఐపీఓ సబ్స్క్రిప్షన్ అక్టోబర్ 17తో ముగిసింది.ఐపీఓ సబ్స్క్రిప్షన్ కోసం హ్యుందాయ్ మోటార్స్ ఇండియా ఒక్కో షేరు ధరల శ్రేణిని రూ.1865-1960గా నిర్ణయించింది. కానీ 1.5 శాతం డిస్కౌంట్‌తో రూ.1931కు స్టాక్ మార్కెట్లో లిస్టవ్వడం గమనార్హం. ఈ ఐపీఓకు సంబంధించి భారీగా లిస్టింగ్ గెయిన్స్ వస్తాయని ముందుగా భావించారు. కానీ అందుకు భిన్నంగా స్టాక్ ఒక శాతం డిస్కౌంట్లో లిస్ట్ కావడంతో మదుపర్లు కొంత నిరాశ చెందుతున్నట్లు తెలిసింది.ఇదీ చదవండి: ఇంటి రుణం త్వరగా తీర్చండిలా..గతంలో లైప్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(ఎల్ఐసీ) ఐపీఓకు వచ్చిన సమయంలో అత్యధికంగా రూ.21 వేలకోట్లు సమీకరించింది. ఇవ్వాళ లిస్టయిన హ్యుందాయ్ మోటార్స్ లిమిటెడ్ ఏకంగా రూ.27,870 కోట్ల సమీకరించాలనే లక్ష్యంతో మార్కెట్లో లిస్టయ్యింది. ఇదిలాఉండగా, కేవలం లిస్టింగ్ లాభాల కోసమే ఐపీఓకు దరఖాస్తు చేసుకునే వారికి ఇది కొంత నిరాశ కలిగిస్తుంది. కంపెనీ బిజినెస్‌పై అవగాహన ఏర్పరుచుకుని, యాజమాన్యం ఎలాంటి భవిష్యత్తు కార్యాచరణతో ఉందనే అంశాలను పరిగణించి ఐపీఓకు దరఖాస్తు చేస్తే మేలని నిపుణులు సూచిస్తున్నారు. లిస్టింగ్ సమయంలో కొన్ని కారణాల వల్ల లాభాలు రాకపోయినా దీర్ఘకాలంలో మంది రాబడులు సంపాదించే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. -
హ్యుండై విస్తరణ ప్లాన్.. మరిన్ని కొత్త ఉద్యోగాలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీలో ఉన్న దక్షిణ కొరియా సంస్థ హ్యుండై అనుబంధ కంపెనీ హ్యుండై మోటార్ ఇండియా తమిళనాడు ప్లాంటును విస్తరించాలని నిర్ణయించింది. ప్రీ–ఫీజిబిలిటీ రిపోర్ట్‌ను ఈ మేరకు దాఖలు చేసింది. దీని ప్రకారం కాంచీపురం జిల్లాలోని ఈ కేంద్రంలో రూ.1,500 కోట్లతో ఆధునీకరణ పనులు చేపడతారు.విస్తరణ పూర్తి అయితే 5.4 లక్షల చదరపు మీటర్లున్న ప్లాంటు స్థలం 7.21 లక్షల చదరపు మీటర్లకు పెరుగుతుంది. కొత్తగా 155 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఆధునీకరణ పనులకు కొత్తగా స్థలం కొనుగోలు చేయాల్సిన అవసరం లేదని కంపెనీ తెలిపింది. మొత్తం 538 ఎకరాల్లో ఈ కేంద్రం నెలకొని ఉంది.ప్లాంటు వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 8.5 లక్షల యూనిట్లు. అయిదేళ్లలో విస్తరణ పనులు పూర్తి అవుతాయని సంస్థ భావిస్తోంది. దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలో ప్రయాణికుల వాహనాలకు పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చడానికి ఈ పెట్టుబడి కీలకమని హ్యుండై వెల్లడించింది. -
హ్యుందాయ్ మెగా ఐపీవో రెడీ
దక్షిణ కొరియా కార్ల తయారీ దిగ్గజం హ్యుందాయ్ దేశీ అనుబంధ యూనిట్ మెగా పబ్లిక్ ఇష్యూకి రంగం సిద్ధమైంది. 2003లో జపనీస్ అగ్రగామి మారుతీ సుజుకీ ఐపీవో తర్వాత మరో టాప్ ఆటోమొబైల్ సంస్థ లిస్ట్ కానుంది. భారత స్టాక్ మార్కెట్ చరిత్రలో అతిపెద్ద ఐపీవోగా హ్యుందాయ్ సరికొత్త రికార్డ్ సృష్టించనుంది. న్యూఢిల్లీ: రెండు దశాబ్దాల తదుపరి మరో ఆటో రంగ దిగ్గజం నిధుల సమీకరణకు వస్తోంది. హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్(హెచ్ఎంఐఎల్) పబ్లిక్ ఇష్యూ ఈ నెల15న ప్రారంభంకానుంది. 17న ముగియనున్న ఇష్యూకి ఒక్కో షేరుకి రూ. 1,865–1,960 చొప్పున ధరల శ్రేణిని ప్రకటించింది. ఇష్యూలో భాగంగా ప్రమోటర్ సంస్థ హ్యుందాయ్ మోటార్ కంపెనీ 14,21,94,700 షేర్లను విక్రయానికి ఉంచనుంది. తద్వారా 3.3 బిలియన్ డాలర్లు(రూ. 27,870 కోట్లు) సమీకరించాలని భావిస్తోంది. దీంతో ఇంతక్రితం 2022 మే నెలలో బీమా దిగ్గజం ఎల్ఐసీ రూ. 21,000 కోట్లు సమీకరించిన ఇష్యూని అధిగమించనుంది. వెరసి దేశీయంగా అతిపెద్ద పబ్లిక్ ఇష్యూగా రికార్డు నెలకొల్పనుంది. లిస్టింగ్ తదుపరి కంపెనీ మార్కెట్ విలువ 19 బిలియన్ డాలర్ల (రూ.1.6 లక్షల కోట్లు)కు చేరనుంది.క్రెటా ఈవీ వస్తోంది.. దేశీయంగా కార్ల తయారీ, అమ్మకాలలో మారుతీ సుజుకీ తదుపరి హ్యుందాయ్ మోటార్ ఇండియా రెండో ర్యాంకులో నిలుస్తున్న సంగతి తెలిసిందే. 2025 జనవరి–మార్చి కాలంలో క్రెటా ఈవీని ప్రవేశపెట్టాలని చూస్తున్నట్లు హెచ్ఎంఐఎల్ పేర్కొంది. రానున్న కొన్నేళ్లలో మరో 4 ఈవీలను విడుదల చేసే యోచనలో ఉన్నట్లు తెలియజేసింది. 1996లో కార్యకలాపాలు ప్రారంభించిన కంపెనీ వివిధ విభాగాలలో 13 మోడళ్లను విక్రయిస్తోంది. ప్రపంచంలోనే ఇండియా అత్యంత ఆసక్తికరమైన మార్కెట్‌గా కంపెనీ ఎండీ, సీఈవో అన్సూ కిమ్ ఐపీవో రోడ్‌షో సందర్భంగా పేర్కొన్నారు. ఐపీవో ద్వారా కంపెనీ బ్రాండ్ మరింత మందికి చేరువవు తుందన్నారు. -
బాహు‘బుల్’ ఐపీఓలొస్తున్నాయ్!
ఇప్పటిదాకా వచ్చినవి ఒక రేంజ్.. ఇకపై వచ్చేవి వేరే లెవెల్! అడుగుపెడితే మార్కెట్ రికార్డులన్నీ తుడిచిపెట్టుకుపోవాల్సిందే!! ఇప్పటికే సెపె్టంబర్లో ఇన్వెస్టర్లు ఐపీఓల వర్షంలో ముద్దవుతుండగా.. రాబోయే రెండు నెలల్లో బాహుబలి ఆఫర్లు మార్కెట్‌ను ముంచెత్తనున్నాయి. దేశంలో రెండో బడా కార్ల కంపెనీ హ్యుందాయ్ మోటార్ ఇండియా అతిపెద్ద ఇష్యూగా రికార్డు బ్రేక్ చేయనుంది. ఇక ఫుడ్–గ్రాసరీ డెలివరీ దిగ్గజం స్విగ్గీ రెండో మెగా స్టార్టప్ ఆఫర్‌గా నిలవనుంది. ఈ రెండింటికీ సెబీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఇక మెగా ఐపీఓల జాతరకు రంగం సిద్ధమైంది. దక్షిణకొరియా కార్ల దిగ్గజం హ్యుందాయ్ ఐపీఓకు సెబీ తాజాగా ఆమోదం తెలపడంతో పబ్లిక్ ఆఫర్ల (ఐపీఓ) చరిత్రలో సరికొత్త అధ్యాయానికి తెరలేచింది. ఈ ఇష్యూ ద్వారా కంపెనీ కనీసం 3 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.25,000 కోట్లు) సమీకరించనుంది. హ్యుందాయ్ ఇండియా మాతృ సంస్థ (ప్రమోటర్) హ్యుందాయ్ మోటార్ కంపెనీ ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) మార్గంలో కొంత వాటాను, అంటే 14.22 కోట్ల షేర్లను విక్రయిచనుంది. తాజా ఈక్విటీ షేర్లు ఏవీ జారీ చేయడం లేదు. ఈ ఇష్యూ పూర్తయితే ఎల్ఐసీ రికార్డును బద్దలవుతుంది. 2022లో ఎల్ఐసీ ఐపీఓ ద్వారా కేంద్ర ప్రభుత్వం రూ.21,000 కోట్లను సమీకరించింది. ఇప్పటిదాకా ఇదే దలాల్ స్ట్రీట్‌లో అతిపెద్ద పబ్లిక్ ఆఫర్.రెండు దశాబ్దాల తర్వాత... దేశీ వాహన పరిశ్రమలో ఇదో సరికొత్త మైలురాయిగా నిలవనుంది. 2003లో జపాన్ వాహన దిగ్గజం మారుతీ సుజుకీ లిస్టింగ్ అయిన రెండు దశాబ్దాల తర్వాత మళ్లీ దేశీయంగా ఒక కార్ల కంపెనీ ఐపీఓకు వస్తుండటం ఇదే తొలిసారి కావడం విశేషం. అమ్మకాల పరంగా దేశంలో రెండో అతిపెద్ద కార్ల కంపెనీగా నిలుస్తున్న హ్యుందాయ్ ఇండియా మార్కెట్ క్యాప్ (విలువ) 18–20 బిలియన్ డాలర్లుగా ఉంటుందని అంచనా. ప్రస్తుతం మారుతీ మార్కెట్ విలువ దాదాపు 48 బిలియన్ డాలర్లు. కాగా, అక్టోబర్‌లో హ్యుందాయ్ ఐపీఓ వస్తుందని సమాచారం. 1996లో భారత్‌లోకి అడుగుపెట్టిన హ్యుందాయ్.. వివిధ కార్ల విభాగాల్లో 13 మోడల్స్ విక్రయిస్తోంది. గత నెలలో ఎలక్ట్రిక్ టూవీలర్ కంపెనీ ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ ఐపీఓ ద్వారా రూ.6,145 కోట్ల సమీకరించడంతో పాటు బంపర్ లిస్టింగ్ నేపథ్యంలో హ్యుందాయ్ మెగా ఇష్యూపై ఇన్వెస్టర్లు గురిపెడుతున్నారు. స్విగ్గీ డెలివరీ రెడీ...ఫుడ్ డెలివరీ దిగ్గజం స్విగ్గీకి కూడా సెబీ నుంచి ప్రాథమిక ఆమోదం లభించింది. సెబీ కొన్ని మార్పుచేర్పులు సూచించడంతో తుది డ్రాఫ్ట్ ప్రాస్పెక్టస్‌ను కంపెనీ త్వరలో దాఖలు చేయనుంది. ఏప్రిల్‌లో వాటాదారుల ఆమోదం ప్రకారం ఈ మెగా ఇష్యూ ద్వారా రూ.10,414 కోట్లను స్విగ్గీ సమీకరించనుంది. ఇందులో రూ.3,750 కోట్లను తాజా ఈక్విటీ షేర్ల జారీ ద్వారా కంపెనీ సమీకరించనుంది. మిగతా మొత్తాన్ని ప్రస్తుత ఇన్వెస్టర్లు కొంత వాటాను విక్రయించి సొమ్ము చేసుకోనున్నారు. తుది ఆమోదం మేరకు ఇష్యూ సైజు 1.4 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.11,700 కోట్లు) ఉండొచ్చని అంచనా. 2014లో ఆరంభమైన స్విగ్గీ ప్రస్తు తం ఫుడ్ డెలివరీతో పాటు క్విక్ కామర్స్ (ఇన్‌స్టామార్ట్), హైపర్ లోకల్ లాజిస్టిక్స్ విభాగాల్లో దూసుకుపోతోంది. ఈ ఏడాది ఏప్రిల్ నాటికి కంపెనీ మార్కెట్ వేల్యుయేషన్ 13 బిలియన్ డాలర్లుగా అంచనా. 2022–23 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ 1.09 బిలియన్ డాలర్ల ఆదాయం ఆర్జించింది. 4,700 మందికి పైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు. కాగా, జొమాటో 2021లో బంపర్ లిస్టింగ్‌తో బోణీ చేసింది. రూ.9,375 కోట్లు సమీకరించింది. రూ.76 ఇష్యూ ధర కాగా, 60% ప్రీమియంతో రూ.115 వద్ద లిస్టయింది. రెండేళ్లలో జొమాటో షేరు రూ.46 కనిష్ట స్థాయి నుంచి 520 శాతం (ప్రస్తుత ధర 286) ఎగబాకడం విశేషం. కాగా, స్విగ్గీ ఐపీఓ నవంబర్‌లో ఉండొచ్చనేది మార్కెట్ వర్గాల సమాచారం.– సాక్షి, బిజినెస్ డెస్క్ -
హ్యుందాయ్ అల్కాజార్ నయా అవతార్..
కొత్త ఫీచర్లతో సరికొత్తగా అప్డేట్ చేసిన 7-సీటర్ ఎస్యూవీ హ్యుందాయ్ అల్కాజార్ నయా అవతార్‌ను హ్యుందాయ్ ఇండియా విడుదల చేసింది. 2024 హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‌లిఫ్ట్ పెట్రోల్ వేరియంట్‌ను రూ. 14.99 లక్షలు, డీజిల్ వేరియంట్‌ను రూ.15.99 లక్షల ప్రత్యేక ప్రారంభ ధరతో లాంచ్ చేసింది.హ్యుందాయ్ అల్కాజార్ అమ్మకాలు గత కొన్ని నెలలుగా నిస్తేజంగా ఉన్నాయి. ఇప్పుడొచ్చిన అప్డేట్తోనైనా ఈ ఎస్యూవీ నెలవారీ విక్రయాల సంఖ్య మరింత పెరుగుతుందని భావిస్తున్నారు. ఈ విభాగంలో టాటా సఫారి, మహీంద్రా ఎక్స్‌యూవీ700, ఎంజీ హెక్టర్, సిట్రోయెన్ సీ3 ఎయిర్‌క్రాస్, కియా కారెన్స్ వంటివి దీనికి పోటీగా ఉన్నాయి.2024 హ్యుందాయ్ అల్కాజార్ లుక్స్ పరంగా క్రెటాను సాగదీసినట్లుగా ఉంటుంది. హెచ్-ఆకారంలో కనెక్ట్ చేసిన ఎల్ఈడీ డీఆర్ఎల్లు, పెద్ద రేడియేటర్ గ్రిల్ , విశాలమైన స్కఫ్ ప్లేట్‌తో బచ్-లుకింగ్ ఫ్రంట్ ఫేస్‌తో కూడిన బోల్డ్-లుకింగ్ డిజైన్ థీమ్ ఇందులో ఇచ్చారు. ఇక వాహనం ఇరువైపులా చేసిన పెద్ద మార్పులు ఏంటంటే.. కొత్త 18-అంగుళాల డైమండ్-కట్ అల్లాయ్ వీల్స్, పెద్ద రియర్ క్వార్టర్ విండోస్, బ్లాక్-పెయింటెడ్ క్లాడింగ్, బ్రిడ్జ్-టైప్ రూఫ్ రెయిల్స్.ఆల్కాజర్ రియర్ ఫేస్ కూడా కొత్త స్పాయిలర్, రీవర్క్ చేసిన బంపర్, స్కిడ్ ప్లేట్ కోసం కొత్త డిజైన్‌తో భారీగా సర్దుబాట్లు చేశారు. సీక్వెన్షియల్ టర్న్ ఇండికేటర్లతో కనెక్ట్ చేసిన ఎల్ఈడీ టెయిల్‌ల్యాంప్‌లను కూడా దీనికి ఇచ్చారు. కొలతల విషయానికొస్తే, అల్కాజర్ అవుట్గోయింగ్ మోడల్‌తో పోల్చితే 2024 ఆల్కాజర్ 60 మిమీ పొడవు, 10 మిమీ వెడల్పు, 35 మిమీ పొడవు అధికంగా ఉంటాయి. 2,760 ఎంఎం వీల్‌బేస్‌లో మాత్రం ఎటువంటి మార్పు లేదు. ఇక ఇంటీరియర్‌లోనూ డ్యాష్బోర్డ్తోపాటు మరికొన్ని మార్పులు చేశారు.అల్కాజార్ ఫేస్‌లిఫ్ట్‌లో 1.5లీటర్ డీజిల్, 1.5లీటర్ టర్బో-పెట్రోల్ ఎంపికలు, మూడు డ్రైవ్ మోడ్లు (నార్మల్, ఎకో, స్పోర్ట్), మూడు ట్రాక్షన్ మోడ్లు (స్నో, మడ్, శాండ్) ఉన్నాయి. కొత్త బోల్డ్ హ్యుందాయ్ అల్కాజర్ 9 రంగులలో లభిస్తుంది. వీటిలో 8 మోనో-టోన్ ఎంపికలు అవి కొత్త రోబస్ట్ ఎమరాల్డ్ మ్యాటీ, టైటాన్ గ్రే మ్యాటీ, రోబస్ట్ ఎమరాల్డ్, స్టార్రీ నైట్, రేంజర్ ఖాఖీ, ఫైరీ రెడ్, అబిస్ బ్లాక్, అట్లాస్ వైట్, ఒక డ్యూయల్- బ్లాక్ రూఫ్‌తో అట్లాస్ వైట్‌లో టోన్ కలర్ ఆప్షన్ అందుబాటులో ఉంది. -
Hyundai Venue E+: ఎలక్ట్రిక్ సన్‌రూఫ్‌తో అదిరిపోతున్న కొత్త వేరియంట్
హ్యుందాయ్ మోటార్ ఇండియా తమ అప్డేట్ చేసిన ‘వెన్యూ ఈప్లస్’ (Hyundai Venue E+) వేరియంట్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. దీని ధర రూ. 8.23 లక్షలతో ప్రారంభమవుతుంది. కొత్త వేరియంట్ జోడింపుతో ఈ లైనప్‌లో మొత్తం వెన్యూ వేరియంట్ల సంఖ్య పదికి చేరింది.‘వెన్యూ ఈప్లస్’ మోడల్‌ను ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ ప్యానెల్, అడ్జస్టబుల్ ఫ్రంట్, రియర్ హెడ్రెస్ట్ వంటి సరికొత్త ఫీచర్లతో అప్డేట్ చేశారు. ఇక కార్ ఇంటీరియర్ విషయానికి వస్తే 60:40 స్ప్లిట్ వెనుక సీట్లు, వీటికి టూస్టెప్ రిక్లైన్ ఫంక్షన్ ఇచ్చారు. ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు ప్రయాణికులకు భద్రత కల్పిస్తాయి. డే అండ్ నైట్ అడ్జస్టబుల్ ఇన్సైడ్ రియర్ వ్యూ మిర్రర్, ప్యాసింజర్లు అందరికీ త్రీ-పాయింట్ సీట్ బెల్ట్, ఈఎస్సీ, హిల్ స్టార్ట్ అసిస్ట్ కంట్రోల్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.ఇక ఇంజిన్ గురించి చెప్పుకోవాలంటే ‘వెన్యూ ఈప్లస్’ 1.2-లీటర్ ఎన్ఏ పెట్రోల్ ఇంజన్‌తో ఐదు-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. ఇంజిన్ కాన్ఫిగరేషన్ విషయానికి వస్తే.. 82 బీహెచ్పీ, 114 ఎన్ఎం గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. హ్యుందాయ్ వెన్యూలో ఇప్పటికే ఈ, ఎస్, ఎస్ ప్లస్, ఎస్ (O), ఎగ్జిక్యూటివ్, ఎస్ (O) ప్లస్, ఎస్ఎక్స్, నైట్ ఎడిషన్, ఎస్ఎక్స్ ( O) వేరియంట్లు ఉన్నాయి. కొత్త ఈప్లస్ మోడల్ కావాలంటే ‘వెన్యూ ఈ’ వేరియంట్‌పై రూ. 29,000 అదనంగా ఖర్చవుతుంది. -
తళుక్కున మెరిసే హ్యుందాయ్ క్రెటా కొత్త ఎడిషన్
హ్యుందాయ్ ఇండియా క్రెటా నైట్ (Creta Knight) ఎడిషన్‌ను విడుదల చేసింది. ఇప్పటికే ఉన్న కొన్ని క్రెటా వేరియంట్లకు ఇది కాస్మెటిక్ అప్‌గ్రేడ్. హ్యుందాయ్ క్రెటా నైట్ ఎడిషన్ ధరలు రూ.14.51 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభమవుతాయి. ఇందులో 1.5 ఎంపీఐ పెట్రోల్, డీజిల్ ఇంజిన్ ఆప్షన్లలో పలు వేరియంట్లు ఉన్నాయి.బ్లాక్ కలర్ ఎక్స్టీరియర్, కాంట్రాస్ట్ రెడ్ బ్రేక్ కాలిపర్లతో బ్లాక్ అల్లాయ్ వీల్స్, మ్యాటీ లోగో, బ్లాక్ అవుట్ సైడ్ రియర్ వ్యూ మిర్రర్, బ్లాక్ స్పాయిలర్ వంటివి క్రెటా నైట్ ఎడిషన్ అప్డేట్లలో ప్రధానంగా ఉన్నాయి. ఇంటీరియర్స్ పూర్తిగా బ్లాక్ అప్హోల్స్స్టరీ, స్టీరింగ్ వీల్‌పై లెదర్-ర్యాప్, గేర్ నాబ్‌తో అప్డేట్ చేశారు. మెటల్ పెడల్స్‌తో పాటు బ్రాస్ కలర్ ఇన్సర్ట్లు ఉన్నాయి.సాధారణ కలర్ ఆప్షన్స్ మాత్రమే కాకుండా, కొనుగోలుదారులు రూ.5,000 అదనంగా చెల్లించి టైటాన్ గ్రే మ్యాటీ కలర్ వాహనాన్ని, రూ. 15,000 చెల్లించి డ్యూయల్ టోన్ కలర్స్‌ను ఎంచుకునే అవకాశం కూడా ఉంది.కొత్త ఎడిషన్ ధరలుహ్యుందాయ్ క్రెటా 1.5 పెట్రోల్CRETA Knight S(O) MT: రూ. 14.51 లక్షలుCRETA Knight S(O) CVT: రూ. 16.01 లక్షలుCRETA Knight SX (O) MT: రూ. 17.42 లక్షలుCRETA Knight SX (O) CVT: రూ. 18.88 లక్షలుహ్యుందాయ్ క్రెటా 1.5 డీజిల్CRETA Knight S(O) MT: రూ. 16.08 లక్షలుCRETA Knight S(O) AT: రూ. 17.58 లక్షలుCRETA Knight SX (O) MT: రూ. 19 లక్షలుCRETA Knight SX (O) AT: రూ. 20.15 లక్షలు -
1974 మోడల్ తరహాలో కొత్త కారు (ఫొటోలు)
-
ఇకపై కావాలన్నా.. ఈ కారును కొనలేరు!.. ఎందుకంటే?
హ్యుందాయ్ ఇండియా తన లైనప్ నుంచి కోనా ఎలక్ట్రిక్ కారును నిలిపివేసింది. 2019 నుంచి సుమారు ఐదేళ్లపాటు భారత మార్కెట్లో అమ్మకానికి ఉన్న ఈ కారు ఉత్పత్తి ఇప్పుడు నిలిచిపోయింది. ఇది దేశీయ విఫణిలో లాంచ్ అయిన మొట్టమొదటి హ్యుందాయ్ ఎలక్ట్రిక్ కారు. ప్రస్తుతం కోనా ఎలక్ట్రిక్ నిలిచిపోవడంతో.. ఐయోనిక్ 5 ఎలక్ట్రిక్ కారు మాత్రమే అమ్మకానికి ఉంది.ప్రస్తుతం నిలిచిపోయిన హ్యుందాయ్ కోనా ఎలక్ట్రిక్ స్థానంలోకి 2025లో లాంచ్ కానున్న క్రెటా ఈవీ రానున్నట్లు సమాచారం. హ్యుందాయ్ కోన ఎలక్ట్రిక్ కారు ప్రారంభ ధర రూ. 25.30 లక్షలు (లాంచ్ సమయంలో.. ఎక్స్ షోరూమ్). ఇది 29.2 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ కలిగి, ఒక సింగిల్ చార్జితో 452 కిమీ మైలేజ్ అందిస్తుంది. ఇందులోని 100 కిలోవాట్ మోటారు 131 Bhp పవర్, 395 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. -
ప్రముఖ కంపెనీ కార్ల రీకాల్.. ఎందుకంటే..
హ్యుందాయ్ మోటార్ ఇండియా (హెచ్ఎంఐఎల్) తన ఈవీ అయానిక్5 మోడల్ కార్లను రీకాల్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఇంటిగ్రేటెడ్ ఛార్జింగ్ కంట్రోల్ యూనిట్ (ఐసీసీయూ)ను అప్‌గ్రేడ్ చేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పింది. జులై 21, 2022 నుంచి ఏప్రిల్ 30, 2024 మధ్య తయారు చేసిన అయానిక్ 5 మోడల్ కార్లలో ఐసీసీయూలో మార్పులు చేయనున్నట్లు పేర్కొంది.ఈ సందర్భంగా హెచ్ఎంఐఎల్ ప్రతినిధి మాట్లాడుతూ..‘కార్ల రీకాల్ అంశాన్ని భారతీయ ఆటోమొబైల్ తయారీదారుల సొసైటీ (ఎస్ఐఏఎం)కు తెలియజేశాం. హ్యుందాయ్ మోటార్ ఇండియా కస్టమర్ భద్రతకు ప్రాధాన్యతనిస్తోంది. అందులో భాగంగా 1,744 యూనిట్ల అయానిక్ 5 మోడల్కార్లను రీకాల్ చేస్తున్నాం. వినియోగదారులకు ఎలాంటి ఖర్చు లేకుండా వాటిలోని ఇంటిగ్రేటెడ్ ఛార్జింగ్ కంట్రోల్ యూనిట్‌ను తనిఖీ చేసి ఏదైనా సమస్యలుంటే అప్‌గ్రేడ్ చేస్తాం. రీకాల్ ప్రక్రియలో కార్ల యజమానులతో సంస్థకు చెందిన ప్రత్యేక బృందాలు వ్యక్తిగతంగా సంప్రదిస్తాయి’ అని తెలిపారు. అయానిక్ 5 ప్రారంభ ధర రూ.46.05 లక్షలు(ఎక్స్‌షోరూం)గా ఉంది.ఇదీ చదవండి: టీవీ, మొబైళ్లలోకి ప్రవేశిస్తున్న ‘గాలి’!ఈ ఏడాదిలో కంపెనీకి చెందిన కార్లను రీకాల్ చేయడం ఇది రెండోసారి. ఎలక్ట్రానిక్ ఆయిల్ పంప్ కంట్రోలర్‌లో సమస్యల కారణంగా ఫిబ్రవరి 13, 2023 నుంచి జూన్ 6, 2023 మధ్య తయారు చేసిన క్రెటా, వెర్నా 7,698 యూనిట్లను ఫిబ్రవరిలో రీకాల్ చేశారు. -
ఎలక్ట్రిక్ వాహనదారులకు గుడ్‌న్యూస్.. ఛార్జింగ్ సమస్యకు చెక్!
వాహన తయారీ సంస్థ హ్యుందాయ్ మోటార్స్ ఇండియా లిమిటెడ్ (హెచ్ఎంఐఎల్) కీలక ప్రకటన చేసింది. తమిళనాడు కేంద్రంగా మొత్తం 100 ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్లను ఇన్స్టాల్ చేస్తున్నట్లు వెల్లడించింది. భారత్‌లో హ్యుందాయ్ మోటార్స్ 28 వసంతాలు పూర్తి చేసుకుందని, ఈ సందర్భంగా 180 కిలోవాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్లను చైన్నై అంతటా ఏర్పాటు చేసినట్లు హెచ్ఎంఐఎల్ ఎక్జిక్యూటీవ్ డైరెక్టర్ జే వాంగ్ ర్యూ తెలిపారు.హ్యుందాయ్ ‘ప్రోగ్రెస్ ఫర్ హ్యుమానిటీ’ విజన్‌కు అనుగుణంగా మేం వాహనదారుల సౌకర్యాన్ని మెరుగు పరిచే లక్ష్యాన్ని నిర్ధేశించుకున్నాం. కాబట్టే తమిళనాడు అంతటా 100 ఛార్జింగ్ స్టేషన్లను ఇన్స్టాల్ చేయడానికి, ఈవీ ఎకోసిస్టమ్‌ను మెరుగుపరచడానికి, రాష్ట్రవ్యాప్తంగా వాహనదారులు ఈవీలను వినియోగించేలా ప్రోత్సహించేలా ప్రయత్నిస్తున్నట్లు జే వాంగ్ ర్యూ వెల్లడించారు. ఫాస్ట్ పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్‌తో పాటు, ప్రస్తుతం తమిళనాడులో అందుబాటులో ఉన్న 170 కంటే ఎక్కువ ఛార్జింగ్ పాయింట్లు కస్టమర్ సౌలభ్యం కోసం మై హ్యుందాయ్ యాప్‌లోని ఈవీ ఛార్జ్ విభాగంలో మ్యాప్ చేసింది. తద్వారా ఈవీ వాహనదారులు ఛార్జింగ్ పాయింట్లలో తమ వాహనాలకు ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. హ్యుందాయ్ ఈవీ వినియోగదారులే కాకుండా ఇతర వాహన యజమానులు ఛార్జింగ్ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చు అని హ్యుందాయ్ స్పష్టం చేసింది. -
దేశీయంగా ఈవీ బ్యాటరీల తయారీ
న్యూఢిల్లీ: దేశీయంగా ఎలక్ట్రిక్ వాహన బ్యాటరీల తయారీని చేపట్టే దిశగా ఎక్సైడ్ ఎనర్జీ సొల్యూషన్స్‌తో దక్షిణ కొరియా ఆటోమొబైల్ దిగ్గజాలు హ్యుందాయ్, కియా జట్టు కట్టాయి. భారత్‌లో తమ ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) విస్తరణ ప్రణాళికలకు అనుగుణంగా ఇందుకు సంబంధించి ఎక్సైడ్ ఎనర్జీతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నట్లు హ్యుందాయ్ తెలిపింది. దీని ప్రకారం లిథియం–ఐరన్–ఫాస్ఫేట్ (ఎల్ఎఫ్పీ) సెల్స్ తయారీపై ప్రధానంగా దృష్టి పెట్టనున్నట్లు వివరించింది. స్థానికంగా తయారీ వల్ల బ్యాటరీ వ్యయాలు కొంత మేర తగ్గగలవని, తద్వారా ఇతర సంస్థలతో మరింత మెరుగ్గా పోటీపడగలమని హ్యుందాయ్ మోటర్ .. కియా ఆర్అండ్డీ విభాగం హెడ్ హుయి వాన్ యాంగ్ తెలిపారు. భారత మార్కెట్లో తమ బ్యాటరీల అభివృద్ధి, ఉత్పత్తి, సరఫరా తదితర కార్యకలాపాల విస్తరణకు ఎక్సైడ్ ఎనర్జీతో వ్యూహాత్మక భాగస్వామ్యం తోడ్పడగలదని ఆయన పేర్కొన్నారు. హ్యుందాయ్ ప్రస్తుతం భారత్‌లో అయోనిక్ 5, కోనా ఎలక్ట్రిక్ వాహనాలను, కియా ఇండియా ఈవీ6 మోడల్‌ను విక్రయిస్తున్నాయి. -
న్యూయార్క్ ఆటో షోలో హల్చల్ చేసిన లేటెస్ట్ కార్లు (ఫోటోలు
-
కొత్త ఈవీలపై ఆటో కంపెనీల కసరత్తు
న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్ వాహనాలకు (ఈవీ) సంబంధించి కేంద్రం కొత్త విధానం ప్రకటించిన నేపథ్యంలో ఆటోమొబైల్ కంపెనీలు రాబోయే రోజుల్లో మరిన్ని విద్యుత్ వాహనాలను ప్రవేశపెట్టడంపై దృష్టి పెడుతున్నాయి. మారుతీ సుజుకీ, హ్యుందాయ్, మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా మోటర్స్ మొదలైన దిగ్గజాలు డిమాండ్‌కి అనుగుణంగా కొత్త మోడల్స్‌పై కసరత్తు చేస్తున్నాయి. 2025 జనవరితో మొదలుపెట్టి.. రాబోయే రోజుల్లో అయిదు బ్యాటరీ ఎలక్ట్రిక్ వెహికల్స్‌ను ప్రవేశపెట్టనున్నట్లు మహీంద్రా అండ్ మహీంద్రా సీఈవో (ఆటోమోటివ్ విభాగం) నళినికాంత్ గొల్లగుంట తెలిపారు. తమ వినూత్నమైన ఇన్గ్లో ప్లాట్‌ఫాంపై ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలను తయారు చేయనున్నట్లు పేర్కొన్నారు. 2027 నాటికి తమ పోర్ట్‌ఫోలియోలో 20–30 శాతం వాటా విద్యుత్ వాహనాలదే ఉండగలదని నళినికాంత్ వివరించారు. మరోవైపు, తాము కూడా ఈవీలపై గణనీయంగా ఇన్వెస్ట్ చేస్తున్నట్లు మారుతీ సుజుకీ ఇండియా ఈడీ (కార్పొరేట్ అఫైర్స్) రాహుల్ భారతి తెలిపారు. 2024–25 ఆర్థిక సంవత్సరంలో 550 కిలోమీటర్ల రేంజ్ ఉండే అధునాతన ఈవీ ఉత్పత్తిని ప్రారంభిస్తామని, 7–8 ఏళ్లలో ఆరు ఈవీ మోడల్స్‌ను ఆవిష్కరిస్తామని ఆయన పేర్కొన్నారు. కర్బన ఉద్గారాలు, చమురు దిగుమతులను తగ్గించుకోవడానికి భారత్‌లో హైబ్రీడ్–ఎలక్ట్రిక్, సీఎన్జీ, బయో–సీఎన్జీ, ఇథనాల్ ఫ్లెక్స్ ఫ్యూయల్ వంటి మరెన్నో టెక్నాలజీలు అవసరమని రాహుల్ తెలిపారు. అటువంటి సాంకేతికతలపై కూడా తాము పని చేయడానికి కట్టుబడి ఉన్నామన్నారు. పదేళ్లలో హ్యుందాయ్ రూ. 26 వేల కోట్లు .. 2030 నాటికి భారత ఆటోమోటివ్ మార్కెట్లో ఈవీల వాటా 20 శాతంగా ఉంటుందని పరిశ్రమ అంచనా వేస్తున్నట్లు హ్యుందాయ్ మోటర్ ఇండియా సీవోవో తరుణ్ గర్గ్ తెలిపారు. ఈవీలు క్రమంగా ప్రధాన స్థానాన్ని దక్కించుకోవచ్చన్నారు. ఈ నేపథ్యంలో రాబోయే పదేళ్లలో తమిళనాడులో రూ. 26,000 కోట్ల మేర హ్యుందాయ్ ఇన్వెస్ట్ చేయనుంది. హ్యుందాయ్ ఇప్పటికే కోనా, అయోనిక్ 5 పేరిట ఎలక్ట్రిక్ వాహనాలను విక్రయిస్తోంది. 10 ఈవీలపై టాటా దృష్టి.. 2026 నాటికి పది ఎలక్ట్రిక వాహనాలను ప్రవేశపెట్టాలని నిర్దేశించుకున్నట్లు టాటా మోటర్స్ తెలిపింది. కర్వ్ ఈవీ, హ్యారియర్ ఈవీతో పాటు కంపెనీ ఈ ఏడాది మరో నాలుగు ఈవీలను ప్రవేశపెట్టే యోచనలో ఉంది. మరోవైపు తాము ఈ ఏడాది 12 కొత్త వాహనాలను ప్రవేశపెట్టనుండగా, వాటిలో మూడు .. బ్యాటరీ ఎలక్ట్రిక్ వాహనాలు ఉండనున్నట్లు మెర్సిడెస్ బెంజ్ తెలిపింది. 2030 నాటికి భారత్‌లో తమ ఆదాయంలో 50 శాతం భాగం ఎలక్ట్రిక్ వాహనాలదే ఉండగలదని అంచనా వేస్తున్నట్లు ఆడి ఇండియా తెలిపింది. ప్రస్తుతం కంపెనీ నాలుగు ఎలక్ట్రిక్ మోడల్స్‌ను దేశీయంగా విక్రయిస్తోంది. అమ్మకాల లక్ష్యాన్ని చేరుకునేందుకు మరిన్ని ఉత్పత్తులను ప్రవేశపెట్టే యోచనలో ఉంది. -
రూ.16.8 లక్షల ఎస్‌యూవీని ఆవిష్కరించిన ప్రముఖ కంపెనీ
ప్రముఖ కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ మధ్యశ్రేణి ఎస్యూవీ క్రెటా ఎన్‌లైన్‌ను ఇటీవల ఆవిష్కరించింది. ప్రారంభ ధర రూ.16.82 లక్షలు(ఎక్స్‌షోరూం). ఎన్8, ఎన్10 వేరియంట్లలో ఇది లభించనుందని తెలిపింది. రూ.25,000తో బుకింగ్‌లను ప్రారంభించినట్లు కంపెనీ నిర్వాహకులు తెలిపారు. ఎన్‌లైన్ శ్రేణిలో ఇప్పటికే ఐ20 హ్యాచ్‌బ్యాక్, కాంపాక్ట్ ఎస్యూవీ వెన్యూ ఉన్నాయి. ఎన్ లైన్, ప్రామాణిక మోడల్ వాహనాల మధ్య డిజైన్‌లో పలు మార్పులుంటాయి. కొత్త 18 అంగుళాల డ్యూయల్ టోన్ అలాయ్‌వీల్స్, రెడ్ ఫ్రంట్, రేర్ బ్రేక్ కాలిపర్స్, గ్రిల్‌పై ఎన్ లైన్ బాడ్జింగ్ పలు డిజైన్ సంబంధిత మార్పులుంటాయి. ఎన్ లైన్ వినియోగదార్ల సగటు వయసు 36 ఏళ్లుగా ఉందని కంపెనీ సీఓఓ తరుణ్ గార్గ్ తెలిపారు. ఇదీ చదవండి: ఈ–స్కూటర్‌కు రూ.10,000 వరకు ఆర్థిక ప్రోత్సాహకం! -
భారత్‌లో ప్రతి 5 నిమిషాలకు అమ్ముడు పోయే కారు ఇదే!
-
సేల్స్ బీభత్సం.. భారత్‌లో ప్రతి 5 నిమిషాలకు అమ్ముడు పోయే కారు ఇదే!
భారత్‌లో ప్రముఖ తయారీ కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ (హెచ్ఎంఐఎల్) సరికొత్త రికార్డ్లను నమోదు చేసింది. దేశీయంగా హ్యుందాయ్ క్రెటా వన్ మిలియన్ అమ్మకాల మార్కును సాధించినట్లు తెలిపింది. 2015లో మార్కెట్‌కి పరిచయమైన క్రెటా కేవలం ఎనిమిదేళ్లలోనే ఈ ఘనత సాధించింది. ఈ సమయంలో, క్రెటా భారతదేశంలో అత్యధికంగా అమ్ముడైన మిడ్‌సైజ్ ఎస్‌యూవీగా కొనసాగుతోంది. ప్రతి 5 నిమిషాలకు ఒక క్రెటా అమ్ముడవుతోంది. ఈ సందర్భంగా సీఓఓ తరుణ్ గార్గ్ మాట్లాడుతూ..‘భారతీయ రోడ్లపై పది లక్షలకు పైగా క్రెటాతో బ్రాండ్ తన వారసత్వాన్ని కొనసాగిస్తుందని పునరుద్ఘాటించారు. ఇటీవల లాంచ్ చేసిన కొత్త క్రెటాకు కూడా అద్భుతమైన కస్టమర్ రెస్పాన్స్ వచ్చిందని, ప్రకటించినప్పటి నుండి 60 వేల బుకింగ్స్ ను దాటిందని తెలిపారు. దేశీయ మార్కెట్ అమ్మకాలతో పాటు, ఎగుమతి మార్కెట్లో కూడా 2.80 లక్షల యూనిట్లకు పైగా క్రెటా విక్రయించినట్లు వెల్లడించారు. -
Hyundai IPO: ఐపీవో బాటలో హ్యుందాయ్.. రూ.27500 కోట్ల సమీకరణ!
న్యూఢిల్లీ: ఆటో రంగ దక్షిణ కొరియా దిగ్గజం హ్యుందాయ్ మోటార్ పబ్లిక్ ఇష్యూ బాట పట్టింది. దేశీ అనుబంధ కంపెనీ హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్(హెచ్ఎంఐఎల్)ను స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్ట్ చేయడం ద్వారా కనీసం 3.3 బిలియన్ డాలర్లు(సుమారు రూ. 27,500 కోట్లు) సమీకరించాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. దేశీయంగా కార్ల తయారీకి అతిపెద్ద కంపెనీలలో మారుతీ సుజుకీ ఇండియా తదుపరి రెండో ర్యాంకులో నిలుస్తున్న హెచ్ఎంఐఎల్.. ఐపీవో ద్వారా 15–20 శాతం వాటాను విక్రయించే వీలున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. వెరసి 3.3–5.6 బిలియన్ డాలర్లు సమీకరించవచ్చని అంచనా వేశాయి. అంచనాలకు అనుగుణంగా హెచ్ఎంఐఎల్ పబ్లిక్ ఇష్యూకి వస్తే బీమా రంగ ప్రభుత్వ దిగ్గజం ఎల్ఐసీ రికార్డును అధిగమించే వీలుంది. రూ. 21,000 కోట్ల సమీకరణ చేపట్టిన ఎల్ఐసీ ఇష్యూ.. అతిపెద్ద ఐపీవోగా నిలుస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ అంశాలపై కంపెనీ ప్రతినిధులు స్పందించకపోవడం గమనార్హం! దేశీయంగా 1996లో హెచ్ఎంఐఎల్ కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం విభిన్న విభాగాలలో 13 రకాల మోడళ్ల కార్లను విక్రయిస్తోంది. దేశవ్యాప్తంగా 1,366 అమ్మకాల ఔట్లెట్లు, 1,549 సర్వీసు పాయింట్లను కలిగి ఉంది. -
పిచ్చెక్కిస్తున్న దీని డిజైన్..SUVలకు విపత్తుగా మారుతోంది..!
-
షారుక్ ఖాన్ గ్యారేజిలో ఇదే ఫస్ట్ ఎలక్ట్రిక్ కారు - ధర ఎంతో తెలుసా?
భారతీయ మార్కెట్లో 'హ్యుందాయ్' (Hyundai) కంపెనీ తన 'ఐయోనిక్ 5' (Ioniq 5) ఎలక్ట్రిక్ కారుని ఆవిష్కరించినప్పటి నుంచి ఎంతోమంది వాహన ప్రియుల మనసు దోచేసింది. ఇటీవల బాలీవుడ్ స్టార్ షారూఖ్ ఖాన్ కూడా ఈ కారుని కొనుగోలు చేశారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. గత 20 సంవత్సరాలుగా హ్యుందాయ్ ఇండియన్ బ్రాండ్ అంబాసిడర్‌గా కొనసాగుతున్న షారూఖ్ ఖాన్‌కు కంపెనీ 'ఐయోనిక్ 5' 1100వ యూనిట్‌ను డెలివరీ చేసింది. ఈ ఏడాది ప్రారంభంలో గ్రేటర్ నోయిడాలో జరిగిన ఆటో ఎక్స్పో 2023లో ఐయోనిక్ 5 ఈవీ లాంచ్ సమయంలో కూడా షారుక్ పాల్గొన్నారు. ఇప్పటికే అత్యంత ఖరీదైన కార్లను కలిగి ఉన్న షారుక్ ఖాన్ గ్యారేజిలో చేరిన మొదటి ఎలక్ట్రిక్ కారు 'హ్యుందాయ్ ఐయోనిక్ 5' కావడం గమనార్హం. మొదటి సారి గ్యారేజిలో ఎలక్ట్రిక్ కారు చేరటం ఆనందంగా ఉందని, అందులోనూ హ్యుందాయ్ ఎలక్ట్రిక్ కారు చేరటం మరింత సంతోషంగా ఉందని షారుక్ వెల్లడించారు. భారతీయ మార్కెట్లో అందుబాటులో ఉన్న హ్యుందాయ్ ఐయోనిక్ 5 ఎలక్ట్రిక్ కారు 72.6 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ కలిగి ఒక ఫుల్ ఛార్జ్‌తో 630 కిమీ రేంజ్ అందిస్తుంది. ఈ కారు 350 కిలోవాట్ డీసీ ఛార్జర్ ద్వారా 18 నిముషాల్లో 10 నుంచి 80 శాతం వరకు ఛార్జ్ చేసుకుంటుంది. హ్యుందాయ్ ఐయోనిక్ ఎలక్ట్రిక్ కారు ధర రూ. 46 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఇదీ చదవండి: తుఫాన్ ప్రభావం.. కొత్త సర్వీసులకు శ్రీకారం చుట్టిన ఆటోమొబైల్ కంపెనీలు షారూఖ్ ఖాన్ ఇతర కార్లు ప్రపంచంలో ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకునే నటుల జాబితాలో ఒకరైన షారుక్ అత్యంత విలాసవంతమైన, ఖరీదైన కార్లను కొనుగోలు చేశారు. ఈయన వద్ద ఉన్న కార్లలో బెంట్లీ కాంటినెంటల్ GT, రోల్స్ రాయిస్ ఫాంటమ్, మెర్సిడెస్-బెంజ్ S-క్లాస్, బుగట్టి వేరాన్ స్పోర్ట్స్, ఆడి A6, రేంజ్ రోవర్ వోగ్, హ్యుందాయ్ క్రెటా వంటివి మరెన్నో ఉన్నాయి. -
అమెజాన్ ద్వారా కారు కొనేయొచ్చు - పూర్తి వివరాలు
ఆన్లైన్ షాపింగ్ చేయాలంటే ముందుగా గుర్తొచ్చే ఫ్లాట్‌ఫామ్ అమెజాన్. ఇప్పటి వరకు ఫ్యాషన్, హోమ్ యుటిలిటీ, మొబైల్స్, టీవీలు వంటి వస్తువులను విక్రయించిన ఈ సంస్థ త్వరలో కార్లను కూడా విక్రయించడానికి సన్నద్ధమవుతోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలకు ఈ కథనంలో తెలుసుకుందాం. అమెజాన్ కంపెనీ ఇప్పుడు వినియోగదారులకు వర్చువల్ షోరూం ఎక్స్పీరియన్స్ అందించడమే కాకుండా వివిధ బ్రాండ్లకు సంబంధించి కార్ల ధరలు, ఫీచర్ల వంటి వాటిని గురించి తెలియజేయడానికి హ్యుందాయ్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది. అమెజాన్ ద్వారా కారు భాగాలను, ఇతర యాక్ససరీస్ కూడా కొనుగోలు చేసే సదుపాయం ఉంటుంది. ఈ ప్రక్రియ వల్ల కొనుగోలుదారులు మరింత సులభమైన షాపింగ్ అనుభూతిని పొందవచ్చు. ఈ అవకాశం వచ్చే ఏడాది నుంచి అందుబాటులోకి రానున్నట్లు సమాచారం. ఇదీ చదవండి: ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి సంచలన వ్యాఖ్యలు.. సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావడం.. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే.. అమెజాన్ ద్వారా లావాదేవీలు జరిగినప్పటికీ.. ఇందులో అసలు విక్రేత కంపెనీ అధికారిక డీలర్ ఉంటారు. అంటే డీలర్‌షిప్‌కి.. కస్టమర్‌కి మధ్య వారధిలా పనిచేస్తుంది. అయితే దీని ద్వారా వినియోగదారుడు కొన్ని అదనపు సౌకర్యాలను పొందవచ్చు.