హ్యుందాయ్ ఇండియా తన లైనప్ నుంచి కోనా ఎలక్ట్రిక్ కారును నిలిపివేసింది. 2019 నుంచి సుమారు ఐదేళ్లపాటు భారత మార్కెట్లో అమ్మకానికి ఉన్న ఈ కారు ఉత్పత్తి ఇప్పుడు నిలిచిపోయింది. ఇది దేశీయ విఫణిలో లాంచ్ అయిన మొట్టమొదటి హ్యుందాయ్ ఎలక్ట్రిక్ కారు. ప్రస్తుతం కోనా ఎలక్ట్రిక్ నిలిచిపోవడంతో.. ఐయోనిక్ 5 ఎలక్ట్రిక్ కారు మాత్రమే అమ్మకానికి ఉంది.
ప్రస్తుతం నిలిచిపోయిన హ్యుందాయ్ కోనా ఎలక్ట్రిక్ స్థానంలోకి 2025లో లాంచ్ కానున్న క్రెటా ఈవీ రానున్నట్లు సమాచారం. హ్యుందాయ్ కోన ఎలక్ట్రిక్ కారు ప్రారంభ ధర రూ. 25.30 లక్షలు (లాంచ్ సమయంలో.. ఎక్స్ షోరూమ్). ఇది 29.2 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ కలిగి, ఒక సింగిల్ చార్జితో 452 కిమీ మైలేజ్ అందిస్తుంది. ఇందులోని 100 కిలోవాట్ మోటారు 131 Bhp పవర్, 395 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment