hyundai cars
-
ఇకపై కావాలన్నా.. ఈ కారును కొనలేరు!.. ఎందుకంటే?
హ్యుందాయ్ ఇండియా తన లైనప్ నుంచి కోనా ఎలక్ట్రిక్ కారును నిలిపివేసింది. 2019 నుంచి సుమారు ఐదేళ్లపాటు భారత మార్కెట్లో అమ్మకానికి ఉన్న ఈ కారు ఉత్పత్తి ఇప్పుడు నిలిచిపోయింది. ఇది దేశీయ విఫణిలో లాంచ్ అయిన మొట్టమొదటి హ్యుందాయ్ ఎలక్ట్రిక్ కారు. ప్రస్తుతం కోనా ఎలక్ట్రిక్ నిలిచిపోవడంతో.. ఐయోనిక్ 5 ఎలక్ట్రిక్ కారు మాత్రమే అమ్మకానికి ఉంది.ప్రస్తుతం నిలిచిపోయిన హ్యుందాయ్ కోనా ఎలక్ట్రిక్ స్థానంలోకి 2025లో లాంచ్ కానున్న క్రెటా ఈవీ రానున్నట్లు సమాచారం. హ్యుందాయ్ కోన ఎలక్ట్రిక్ కారు ప్రారంభ ధర రూ. 25.30 లక్షలు (లాంచ్ సమయంలో.. ఎక్స్ షోరూమ్). ఇది 29.2 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ కలిగి, ఒక సింగిల్ చార్జితో 452 కిమీ మైలేజ్ అందిస్తుంది. ఇందులోని 100 కిలోవాట్ మోటారు 131 Bhp పవర్, 395 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. -
ఫైన్ మాత్రమే కాదు.. కొత్త కారు కూడా! కస్టమర్ దెబ్బకు ఖంగుతిన్న డీలర్
కార్లను కొనుగోలు చేసినప్పుడు డీలర్షిప్ వర్గాలు కొన్ని సందర్భాల్లో మోసం చేసే అవకాశం ఉంటుంది. ఇలాంటి మోసాలకు బలైన బాధితులు కన్స్యూమర్ కోర్టు ద్వారా పరిష్కారం లేదా నష్టపరిహారం పొందుతారు. ఇటీవల కర్ణాటకలో ఇలాంటి సంఘటన వెలుగులోకి వచ్చింది. కర్ణాటకకు చెందిన వ్యక్తి 2019 జూన్ 11న 'అద్వాతి మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్' నుంచి 'హ్యుందాయ్ శాంట్రో ఎమ్‌టి స్పోర్ట్జ్' (Hyundai Santro M.T Sportz) కారును రూ. 6,25,663కు కొనుగోలు చేశాడు. ఆ తరువాత ఇందులో లోపాలు ఉన్నట్లు, రెండు సర్వీసింగ్ సెషన్లకు లోనయ్యిందని డీలర్‌షిప్‌కు విన్నవించాడు. కస్టమర్ అభ్యర్థన మేరకు డీలర్షిప్ రెండు సార్లు సర్వీస్ చేసింది. సర్వీస్ చేసిన తరువాత 2020 అక్టోబర్ 17న బాణావర నుంచి అరసికెరెకు ప్రయాణిస్తుండగా కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ప్రయాణికులు బయటపడ్డారు, అదృష్టవశాత్తు ఎవరికీ పెద్ద గాయాలు కాలేదు. సంఘటన జరిగిన వెంటనే వినియోగదారుడు షోరూమ్‌కు తెలియజేశాడు, డీలర్షిప్ యాజమాన్యం స్పందిస్తూ.. కారును రీప్లేస్ చేస్తామని హామీ ఇచ్చారు. కానీ ఎన్ని రోజులు ఎదురు చూసినా కస్టమర్‌కు కారుని అందించలేదు. దీంతో విసిగిపోయిన కస్టమర్ బాణవర పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ దాఖలు చేశాడు. కారు తయారీలో లోపాలు ఉన్నట్లు, అదే కారులో మంటలు రావడానికి కారణమని డిస్ట్రిక్ట్ కన్స్యూమర్ డిస్ప్యూట్ రిడ్రెసల్ కమిషన్‌కు తెలియజేశాడు. కాలిపోయిన కారుకు బదులుగా ఇంకో కారు ఇస్తామన్న షోరూమ్ వాగ్దానాలను వెల్లడించాడు. ఈ సంఘటన మానసిక ఒత్తిడికి దారితీసినట్లు, ఎక్కువ ఆర్థిక నష్టాన్ని కలిగించినట్లు ప్రస్తావించాడు. ఇదీ చదవండి: గంటకు 23 మంది.. ఏడాదికి వేలల్లో.. ఆందోళనలో టెకీలు! విచారణ తర్వాత డిస్ట్రిక్ట్ కమిషన్.. తయారీ లోపం వల్ల అగ్ని ప్రమాదం జరిగినట్లు నిర్థారించి, దీనికి షోరూమ్ బాధ్యత వహించి కొత్త హ్యుందాయ్ శాంత్రోను అందించాలని, కస్టమర్‌కు 1.4 లక్షల పరిహారం ఇవ్వాలని కంపెనీని ఆదేశించింది. -
హ్యుందాయ్ కీలక నిర్ణయం: తొలి బ్రాండ్‌గా రికార్డ్
దక్షిణ కొరియా ఆటోమొబైల్ దిగ్గజం, దేశంలోని మూడో అతిపెద్ద కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ మోటార్ ఇండియా కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. ఇకపై తమ కార్లు అన్నింటిలోనూ ఆర్ ఎయిర్ బ్యాగులను ప్రామాణింగా అందించనున్నట్టు మంగళవారం వెల్లడించింది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన భారత్ NCAP మార్గదర్శకాల ప్రకారంఈ రేటింగ్స్‌లోనూ స్వచ్ఛందంగా పాల్గొనాలని నిర్ణయించినట్లు పేర్కొంది. భారతదేశంలో బ్రాండ్ అందించే అన్ని కార్లు, ఎస్‌యూవీల్లో ఇక 6 ఎయిర్‌బ్యాగ్‌లను ప్రామాణికంగా ఉంటాయి. తద్వారా హ్యుందాయ్ తమ అన్ని కార్లలో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లను అందించనున్న దేశంలో తొలి బ్రాండ్‌గా అవతరించింది హ్యుందాయ్ ఇండియా కూడా భారత్ న్యూ కార్ అసెస్మెంట్ ప్రోగ్రామ్ (BNCAP) ద్వారా క్రాష్ టెస్టింగ్ కోసం తమ మూడు కార్లను స్వచ్ఛందంగా అందిస్తున్నట్లు ప్రకటించింది. (2023 ఐసీసీ వరల్డ్ కప్: ప్రకటనల ఆదాయం ఎంతో తెలుసా?) హ్యుందాయ్ ఉత్పత్తి పోర్ట్‌ఫోలియో 13 విభిన్న మోడళ్లను కలిగి ఉంది. వాటిలో చాలా వరకు ఇప్పటికే ఆరు ఎయిర్‌బ్యాగ్‌లను అమర్చారు. ఈ సేఫ్టీ ఫీచర్ గ్రాండ్ i10 నియోస్, ఆరా , వెన్యూ సబ్-4 మీటర్ SUVలతో సహా మిగిలిన మూడు మోడళ్లలో అందుబాటులో ఉంది. (ఐటీ దిగ్గజాల కీలక నిర్ణయం: ఆందోళనలో టెకీలు ) ఇంతకుముందు, హ్యుందాయ్ అన్ని మోడళ్లలో అన్ని సీట్లకు 3-పాయింట్ సీట్ బెల్ట్‌లు మరియు సీట్ బెల్ట్ రిమైండర్లను ప్రామాణికంగా చేసింది. వాటిలో చాలా వరకు ESC మరియు హిల్-స్టార్ట్ అసిస్ట్ కంట్రోల్‌ని స్టాండర్డ్‌గా అమర్చారు. తమ కంపెనీ కార్లలో ‘అందరికీ భద్రత’ అనేదే తమ అత్యంత ప్రాధాన్యత అని హ్యుందాయ్ మోటార్ ఇండియా ఎండీ కం సీఈఓ ఉన్సూ కిమ్ వెల్లడవించారు.పేర్కొన్నారు. వాహన భద్రతా లక్షణాల ప్రామాణీకరణలో బెంచ్‌మార్క్ సృష్టికర్తలుగా ఉన్న తాము ఇపుడిక అన్ని మోడల్స్ అన్ని వేరియంట్లలో 6 ఎయిర్‌బ్యాగ్‌ల ప్రామాణీకరణను ప్రకటించడం సంతోషంగా ఉందన్నారు. (మరో వివాదంలో బిగ్ బీ అమితాబ్: ఇంత దారుణమా అంటూ తీవ్ర ఆగ్రహం) -
హ్యుందాయ్ కొత్త కారు - టాటా ప్రత్యర్థిగా నిలుస్తుందా?
Hyundai Exter: భారతీయ మార్కెట్లో విడుదలవుతున్న కొత్త వాహనాల సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది. ఇందులో భాగంగానే నేడు 'హ్యుందాయ్' (Hyundai) కంపెనీ కొత్త మైక్రో ఎస్యువి 'ఎక్స్టర్' (Exter) లాంచ్ చేసింది. ఈ ఆధునిక మోడల్ గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. హ్యుందాయ్ ఎక్స్టర్ మొత్తం ఐదు ట్రిమ్స్‌లో లభిస్తుంది. అవి ఈఎక్స్, ఎస్, ఎస్ఎక్స్, ఎస్ఎక్స్ (ఓ) అండ్ ఎస్ఎక్స్ (ఓ) కనెక్ట్. వీటి ధరలు రూ. 6 లక్షల నుంచి రూ. 9.32 లక్షల వరకు ఉంటుంది. ఆటో ట్రిమ్‌లో టాప్ వేరియంట్ ధర రూ. 10 లక్షల వరకు ఉంటుంది (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఇండియా). ఇప్పటికే కంపెనీ ఈ ఎస్యువి కోసం బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. డెలివరీలు కూడా త్వరలోనే ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది. హ్యుందాయ్ ఎక్స్టర్ 1.2 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ ఫోర్ సిలిండర్ పెట్రోల్ ఇంజన్‌తో లభిస్తుంది. ఇది 83 హార్స్ పవర్, 114 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 5-స్పీడ్ మాన్యువల్ లేదా 5-స్పీడ్ ఆటోమాటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్స్ పొందుతుంది. ఇది CNG వెర్షన్లో కూడా లభిస్తుంది. హ్యుందాయ్ ఎక్స్టర్ చూడగానే ఆకర్శించే డిజైన్ కలిగి ప్రత్యేకమైన డే టైమ్ రన్నింగ్ ల్యాంప్, వెనుక వైపు ఎల్ఈడీ టెయిల్-ల్యాంప్ కలిగి సైడ్ ప్రొఫైల్ 15 ఇంచెస్ డ్యూయెల్ టోన్ అల్లాయ్ వీల్స్ పొందుతుంది. మొత్తం ఆరు కలర్ ఆప్షన్లలో లభించే ఈ ఎస్యువి పరిమాణం పరంగా కూడా చాలా ఉత్తమంగా ఉంటుంది. (ఇదీ చదవండి: త్వరలో రానున్న కొత్త కార్లు - టాటా పంచ్ ఈవీ నుంచి టయోటా రూమియన్ వరకు..) ఫీచర్స్ విషయానికి వస్తే.. ఇది హ్యుందాయ్ నియోస్, ఆరా వంటి వాటిని పోలి ఉంటుంది. ఇందులో 4.2 ఇంచెస్ ఫుల్లీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ బ్లాక్ అండ్ ఆలివ్-గ్రీన్ షేడ్స్‌లో సెమీ-లెథెరెట్ సీట్ అప్హోల్స్టరీని పొందుతాయి. అంతే కాకుండా ఇందులో సింగిల్-పేన్ సన్‌రూఫ్, 8 ఇంచెస్ టచ్‌స్క్రీన్, ఆపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, వైర్లెస్ ఛార్జింగ్ మొదలైనవి ఉంటాయి. ఆధునిక సేఫ్టీ ఫీచర్స్ కూడా ఉందులో లభిస్తుంది. హ్యుందాయ్ ఎక్స్టర్ భారతీయ విఫణిలో టాటా పంచ్, సిట్రోయెన్ సి3, మారుతి సుజుకి ఇగ్నిస్ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది. కావున అమ్మకాల పరంగా గట్టి పోటీని ఎదుర్కోవాల్సి ఉంటుంది. -
కొత్త హ్యుందాయ్ ఎక్స్టర్ ఫస్ట్ యూనిట్ ఇదే! ప్రత్యర్థులకు తిప్పలు తప్పవా?
Hyundai Exter First Unit Rolls Out: భారతదేశంలో హ్యుందాయ్ కంపెనీ తన 'ఎక్స్టర్' (Exter) ఎస్‌యువిని మార్కెట్లో విడుదల చేయనున్నట్లు ఇప్పటికే గతంలో అధికారికంగా ప్రకటించింది. కంపెనీ ఈ కారుకి సంబంధించిన టీజర్స్, ఫోటోలు వంటివి కూడా విడుదల చేసింది. అయితే ఇప్పుడు తాజాగా దేశీయ విఫణిలో విడుదలయ్యే ఎక్స్టర్ ఫస్ట్ యూనిట్ చెన్నైలోని కంపెనీ ప్లాంట్ విడుదలైంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. హ్యుందాయ్ 2023 జులై 10న ఇండియన్ మార్కెట్లో విడుదలచేయనున్న ఎక్స్టర్ ఫస్ట్ యూనిట్లు ఎట్టకేలకు వెల్లడించింది. ఇప్పటికే రూ. 11,000 టోకెన్ మొత్తంతో బుకింగ్స్ స్వీకరించడం కూడా ప్రారంభించింది, డెలివరీలు జులై చివరి నాటికి ప్రారంభమయ్యే అవకాశం ఉంటుందని భావిస్తున్నాము. ఈ కారుకి బ్రాండ్ అంబాసిడర్‌గా భారత క్రికెట్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యాను ప్రకటించింది. హ్యుందాయ్ ఎక్స్టర్ EX, S, SX, SX(O), SX(O) కనెక్ట్ అనే ఐదు వేరియంట్లలో విడుదలయ్యే అవకాశం ఉంది. కలర్ ఆప్షన్స్‌లో అట్లాస్ వైట్, అట్లాస్ వైట్ ప్లస్ అబిస్ బ్లాక్, కాస్మిక్ బ్లూ, కాస్మిక్ బ్లూ ప్లస్ అబిస్ బ్లాక్, ఫైరీ రెడ్, స్టార్రి నైట్ టైటాన్ గ్రే, టామ్‌బాయ్ ఖాకీ, టామ్‌బాయ్ ఖాకీ ప్లస్ అబిస్ బ్లాక్ అనే మోనో టోన్ అండ్ డ్యూయెల్ టోన్ వున్నాయి. డిజైన్ పరంగా హెచ్ షేప్ ఎల్ఈడీ డిఆర్ఎల్, స్ప్లిట్ హెడ్‌ల్యాంప్, డ్యూయల్ టోన్ అల్లాయ్ వీల్స్, రూఫ్ రెయిల్స్, ఫ్లోటింగ్ రూఫ్ ఎఫెక్ట్‌తో డ్యూయల్ టోన్ పెయింట్ ఆప్షన్లు లభిస్తాయి. వెనుక వైపు వర్టికల్ టెయిల్ గేట్, షార్క్ ఫిన్ యాంటెన్నా, బిల్ట్-ఇన్ స్పాయిలర్, టెయిల్-ల్యాంప్ ఉన్నాయి. ఈ SUV 3,595 మిమీ పొడవు, 1,595 మిమీ వెడల్పు, 1,575 మిమీ ఎత్తు కలిగి ఉంటుంది. (ఇదీ చదవండి: మారుతి సుజుకి ఫస్ట్ ఎలక్ట్రిక్ కారు వచ్చేస్తోంది! లాంచ్ ఎప్పుడంటే?) ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే, వైర్లెస్ ఫోన్ ఛార్జింగ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, పవర్ విండోస్ మొదలైనవి ఉంటాయి. అంతే కాకుండా ఇందులో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, ఏబీఎస్ విత్ ఈబిడీ, రియర్ పార్కింగ్ కెమెరా, ఐసోఫిక్స్ చైల్డ్-సీట్ ఎంకరేజ్ మొదలైనవి ఉన్నాయి. (ఇదీ చదవండి: ఎన్ని ఉద్యోగాలకు అప్లై చేసినా ఒక్కటీ రాలేదు.. నేడు ప్రపంచ ధనికుల్లో ఒకడిగా!) హ్యుందాయ్ కొత్త ఎక్స్టర్ 1.2 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ కలిగి 83 హెచ్‌పి పవర్, 113.8 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 5 స్పీడ్ మాన్యువల్ లేదా 5 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ పొందుతుంది. ఇది 1.2 లీటర్ బై-ఫ్యూయల్ కప్పా పెట్రోల్ + CNG ఇంజన్ ద్వారా కూడా శక్తిని పొందుతుంది. సిఎన్జీ ఇంజన్ తక్కువ అవుట్‌పుట్ గణాంకాలను కలిగి ఉంటుంది, కానీ మైలేజ్ కొంత ఎక్కువగా ఉంటుంది. ఇది 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో మాత్రమే లభిస్తుంది. అధికారిక ధరలు ఇంకా వెల్లడి కాలేదు, కానీ ఇది రూ. 6 నుంచి రూ. 12 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య విడుదలయ్యే అవకాశం ఉందని భావిస్తున్నాము. -
టాటా పంచ్ ప్రత్యర్థిగా హ్యుందాయ్ ఎక్స్టర్ - లాంచ్ డేట్ ఫిక్స్
Hyundai Exter: భారతీయ మార్కెట్లో హ్యుందాయ్ కంపెనీ కొత్త కారుని (ఎక్స్టర్) విడుదల చేయనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ SUV ఫోటోలను, డిజైన్, ఫీచర్స్, ఇంజిన్ వివరాలను వెల్లడించినప్పటికీ ఖచ్చితమైన లాంచ్ డేట్ వెల్లడించలేదు. అయితే ఇప్పుడు సంస్థ ఎక్స్టర్ లాంచ్ డేట్ కూడా అధికారికంగా వెల్లడించింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. లాంచ్ డేట్ నివేదికల ప్రకారం, హ్యుందాయ్ ఎక్స్టర్ 2023 జులై 10న అధికారికంగా విడుదలయ్యే అవకాశం ఉంది. అంటే ఈ ఎస్యువి మార్కెట్లో అడుగుపెట్టడాని మరెన్నో రోజులు లేదని స్పష్టమవుతోంది. ఇప్పటికే రూ. 11,000లతో బుకింగ్స్ కూడా మొదలయ్యాయి. కావున డెలివరీలు జులై చివరినాటికి ప్రారంభమవుతాయని భావిస్తున్నారు. వేరియంట్స్ & డిజైన్ మార్కెట్లో విడుదలకానున్న హ్యుందాయ్ ఎక్స్టర్ మొత్తం ఐదు వేరియంట్లలో విడుదలయ్యే అవకాశం ఉందని సమాచారం. అవి EX, S, SX, SX(O), SX(O) కనెక్ట్. డిజైన్ పరంగా దాని మునుపటి మోడల్స్ కంటే ఉత్తమంగా ఉండే ఈ కారు ఫీచర్స్ పరంగా కూడా చాలా ఆధునికంగా ఉంటుంది. ఇది హెచ్ షేప్ ఎల్ఈడీ డిఆర్ఎల్, స్ప్లిట్ హెడ్‌ల్యాంప్, డ్యూయల్ టోన్ అల్లాయ్ వీల్స్, రూఫ్ రెయిల్స్, సి పిల్లర్‌కు టెక్స్చర్డ్ ఫినిషింగ్, ఫ్లోటింగ్ రూఫ్ ఎఫెక్ట్‌తో డ్యూయల్ టోన్ పెయింట్ ఆప్షన్లు లభిస్తాయి. వెనుక వైపు నిలువుగా ఉండే టెయిల్ గేట్, షార్క్ ఫిన్ యాంటెన్నా, బిల్ట్-ఇన్ స్పాయిలర్, టెయిల్-ల్యాంప్ వంటివి ఉన్నాయి. ఫీచర్స్ ప్రస్తుతానికి కంపెనీ ఈ ఎస్యువి ఇంటీరియర్ ఫీచర్స్ అధికారికంగా వెల్లడించనప్పటికీ.. టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్, డ్రైవర్ డిస్ప్లే, ఏసీ వెంట్స్, సింగిల్ పేన్ సన్‌రూఫ్ వంటివి వుంటాయని తెలుస్తోంది. మొత్తం మీద ఈ కారు దాని మునుపటి మోడల్స్ కంటే ఉత్తమంగా ఉంటుందని స్పష్టంగా అర్థమవుతోంది. ఇంజిన్ కొత్త హ్యుందాయ్ ఎక్స్టర్ 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుందని భావిస్తున్నారు. ఇప్పటికే ఇది హ్యుందాయ్ ఆరా వంటి కార్లలో ఉపయోగంలో ఉంది. ఈ ఇంజిన్ 83 hp పవర్, 114 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 5 స్పీడ్ మ్యాన్యువల్ లేదా ఆటోమాటిక్ గేర్‌బాక్స్ పొందనుంది. ఈ మైక్రో ఎస్యువి CNG రూపంలో విడుదలయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ వెర్షన్ కేవలం స్పీడ్ మ్యాన్యువల్ ఆప్షన్ మాత్రమే పొందుతుంది. (ఇదీ చదవండి: వెయ్యికోట్ల సామ్రాజ్యానికి తిరుగులేని అధినేత్రి - సక్సెస్ స్టోరీ) సేఫ్టీ ఫీచర్స్ ప్రస్తుతం మార్కెట్లో కొత్త వాహనాలను కొనుగోలు చేసేవారు కేవలం డిజైన్, ఫీచర్స్, మైలేజ్ వంటి విషయాలతో పాటు సేఫ్టీకి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. మార్కెట్లో విడుదలైన తరువాత టాటా పంచ్ మైక్రో ఎస్‌యువికి ప్రత్యర్థిగా నిలబడనున్న ఎక్స్టర్ తప్పకుండా అద్భుతమైన సేఫ్టీ ఫీచర్స్ పొందుతుంది. కావున ఇందులోని అన్ని వేరియంట్లలోనూ ఆరు ఎయిర్ బ్యాగులు, హై ఎండ్ వేరియంట్లలో డ్యూయెల్ కెమెరా సెటప్, హిల్ హోల్డ్ కంట్రోల్, ట్రీ పాయింట్ సీట్ బెల్ట్, రియర్ పార్కింగ్ సెన్సార్లు, ఏబీఎన్ విత్ ఈబీడీ వంటివి లభిస్తాయి. (ఇదీ చదవండి: ఖరీదైన కారు కాలిపోతే కంపెనీకి థ్యాంక్స్ చెప్పిన ఓనర్ - వైరల్ పోస్ట్ & వీడియో) ప్రత్యర్థులు & అంచనా ధర హ్యుందాయ్ ఎక్స్టర్ ధరలు అధికారికంగా వెల్లడి కాలేదు, కానీ దీని ప్రారంభ ధర రూ. 6 లక్షల వరకు ఉంటుందని భావిస్తున్నారు. ఇది 'టాటా పంచ్, సిట్రోయెన్ సి3' వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది. హ్యుందాయ్ ఎక్స్టర్ గురించి ఎప్పటికప్పుడు మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి. -
హ్యుందాయ్ ఎక్స్టర్ లాంచ్ ఎప్పుడో తెలిసిపోయింది.. డెలివరీలు కూడా..
Hyundai Exter: హ్యుందాయ్ కంపెనీ విడుదల చేయనున్న కొత్త మైక్రో SUV 'ఎక్స్టర్' (Exter) లాంచ్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసేవారికి కంపెనీ శుభవార్త చెప్పింది. ఇప్పటి వరకు డిజైన్, ఫీచర్స్, బుకింగ్స్ వంటి సమాచారం వెల్లడించిన కంపెనీ తాజాగా లాంచ్ టైమ్ ఎప్పుడనే దానికి సంబంధించిన సమాచారం వెల్లడించింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. లాంచ్ టైమ్: దేశీయ మార్కెట్లో విడుదలకానున్న హ్యుందాయ్ ఎక్స్టర్ '2023 జులై' నాటికి అధికారికంగా విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటికే రూ. 11,000తో బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించిన హ్యుందాయ్ డెలివరీలను కూడా వేగవంతం చేయడానికి తగిన ఏర్పాట్లు చేసుకుంటోంది. డిజైన్ & వేరియంట్స్: భారతీయ విఫణిలో అడుగెట్టనున్న ఎక్స్టర్ EX, S, SX, SX(O), SX(O) కనెక్ట్ అనే ఐదు వేరియంట్లలో విడుదలవుతుంది. డిజైన్ విషయానికి వస్తే.. ఇది కంపెనీ ఇతర మోడల్స్ కంటే కూడా కొంత భిన్నంగా ఉంటుందని తెలుస్తోంది. ఇందులో హెచ్ షేప్ ఎల్ఈడీ డిఆర్ఎల్, స్ప్లిట్ హెడ్‌ల్యాంప్ సెటప్ చూడవచ్చు. డ్యూయల్ టోన్ అల్లాయ్ వీల్స్, రూఫ్ రెయిల్స్, సి పిల్లర్‌కు టెక్స్చర్డ్ ఫినిషింగ్ వంటివాటితో పాటు ఫ్లోటింగ్ రూఫ్ ఎఫెక్ట్‌తో డ్యూయల్ టోన్ పెయింట్ ఆప్షన్లు గమనించవచ్చు. రియర్ ప్రొఫైల్ లో నిలువుగా ఉండే టెయిల్ గేట్, షార్క్ ఫిన్ యాంటెన్నా, బిల్ట్-ఇన్ స్పాయిలర్, టెయిల్-ల్యాంప్ వంటివి ఉన్నాయి. (ఇదీ చదవండి: హ్యుందాయ్ ఎక్స్టర్ గురించి లేటెస్ట్ న్యూస్.. ఇక ప్రత్యర్థుల పని అయిపోయినట్టేనా?) సేఫ్టీ ఫీచర్స్: ఇటీవల కంపెనీ తన ఎక్స్టర్ సేఫ్టీ ఫీచర్స్ గురించి వెల్లడించింది. ఇందులో ఆరు ఎయిర్ బ్యాగులు ఉంటాయని తెలిసింది. హై ఎండ్ వేరియంట్లలో డ్యూయెల్ కెమెరా సెటప్, హిల్ హోల్డ్ కంట్రోల్, ట్రీ పాయింట్ సీట్ బెల్ట్, రియర్ పార్కింగ్ సెన్సార్లు, ఏబీఎన్ విత్ ఈబీడీ వంటివి లభిస్తాయి. ఇవన్నీ కూడా వాహన వినియోగదారుల భద్రతను నిర్దారించడంలో ఉపయోగపడతాయి. ఇంజిన్: ఇక ఇంజిన్ విషయానికి వస్తే, ఇందులో 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుందని భావిస్తున్నారు. ఇప్పటికే ఇది హ్యుందాయ్ ఆరా వంటి కార్లలో ఉపయోగంలో ఉంది. ఈ ఇంజిన్ 83 hp పవర్, 114 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 5 స్పీడ్ మ్యాన్యువల్ లేదా ఆటోమాటిక్ గేర్‌బాక్స్ పొందనుంది. ఈ మైక్రో ఎస్యువి CNG రూపంలో విడుదలయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ వెర్షన్ కేవలం స్పీడ్ మ్యాన్యువల్ ఆప్షన్ మాత్రమే పొందుతుంది. (ఇదీ చదవండి: బ్యాంక్ జాబ్ వదిలి బెల్లం బిజినెస్.. రూ. 2 కోట్ల టర్నోవర్!) అంచనా ధర & ప్రత్యర్థులు: హ్యుందాయ్ ఎక్స్టర్ ప్రారంభ ధర రూ. 6 లక్షల వరకు ఉంటుందని భావిస్తున్నారు. ఇది దేశీయ మార్కెట్లో విడుదలైన తరువాత 'టాటా పంచ్, సిట్రోయెన్ సి3' వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది. డెలివరీలు ఆగస్టు నాటికి ప్రారంభమవుతాయి. హ్యుందాయ్ ఎక్స్టర్ గురించి ఎప్పటికప్పుడు మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి. ఈ కథనంలో మీ అభిప్రాయాలను, సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. -
హ్యుందాయ్ ఎక్స్టర్ గురించి లేటెస్ట్ న్యూస్.. ఇక ప్రత్యర్థుల పని అయిపోయినట్టేనా?
Hyundai Exter: హ్యుందాయ్ కంపెనీ దేశీయ మార్కెట్లో విడుదల చేయనున్న కొత్త 'ఎక్స్టర్' మైక్రో SUV గురించి కొంత కొంత సమాచారంగా వెల్లడిస్తూనే ఉంది. ప్రారంభంలో టీజర్లను మాత్రమే విడుదల చేసిన కంపెనీ కొన్ని రోజులకు ముందు కారుకి సంబంధించిన ఒక అధికారిక ఫోటో విడుదల చేసింది. అయితే ఇప్పుడు సేఫ్టీ ఫీచర్స్ గురించి వెల్లడించింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. వేరియంట్స్.. భారతదేశంలో ఇప్పటికే అమ్మకానికి ఉన్న టాటా పంచ్ కారుకి ప్రధాన ప్రత్యర్థిగా నిలబడటానికి సిద్దమవుతున్న ఎక్స్టర్ మొత్తం ఐదు వేరియంట్లలో లభిస్తుందని తెలుస్తోంది. అవి EX, S, SX, SX(O), SX(O) కనెక్ట్. డిజైన్, ఫీచర్స్ పరంగా చాలా అద్భుతంగా ఉంటుందని ఇటీవల వెల్లడైన ఫోటోల ద్వారా స్పష్టంగా తెలిసింది. సేఫ్టీ ఫీచర్స్.. హ్యుందాయ్ ఎక్స్టర్ అన్ని వేరియంట్లలోనూ ప్రామాణికంగా ఆరు ఎయిర్ బ్యాగులు ఉంటాయి. అవి డ్రైవర్, ప్యాసింజర్, కర్టెన్, సైడ్ ఎయిర్ బ్యాగ్. ఇవన్నీ కూడా వాహన వినియోగదారుల భద్రతను నిర్దారించడంలో సహాయపడతాయి. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అందించిన సమాచారం ప్రకారం కార్లలో ఆరు ఎయిర్ బ్యాగులు తప్పనిసరి. ఈ నియమాన్ని హ్యుందాయ్ అనుసరిస్తోంది. ఎయిర్ బ్యాగులు మాత్రమే కాకుండా హై ఎండ్ వేరియంట్లలో డ్యూయెల్ కెమెరా సెటప్, హిల్ హోల్డ్ కంట్రోల్, త్రీ పాయింట్ సీట్ బెల్ట్, రియర్ పార్కింగ్ సెన్సార్లు, ఏబీఎస్ విత్ ఈబిడి వంటి లేటెస్ట్ ఫీచర్స్ కూడా లభిస్తాయి. కావున భద్రత పరంగా ఈ కారు పటిష్టంగా ఉంటుందని ఇప్పుడే తెలిసిపోయింది. (ఇదీ చదవండి: బ్యాంక్ జాబ్ వదిలి బెల్లం బిజినెస్.. రూ. 2 కోట్ల టర్నోవర్!) లాంచ్ టైమ్ & ఇంజిన్ డీటైల్స్.. ఇంజిన్ విషయానికి వస్తే.. కొత్త హ్యుందాయ్ ఎక్స్టర్ 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ పొందనుంది. ఇది 83 hp పవర్, 114 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 5 స్పీడ్ మ్యాన్యువల్ లేదా ఆటోమాటిక్ గేర్‌బాక్స్ పొందనుంది. ఈ కొత్త SUV CNG వెర్షన్ లో కూడా రానున్నట్లు సమాచారం, ఇది కేవలం 5 స్పీడ్ మ్యాన్యువల్ ఆప్షన్ మాత్రమే పొందుతుంది. ఈ కారు 2023 జులై చివరలో లేదా ఆగష్టు ప్రారంభంలో దేశీయ మార్కెట్లో అధికారికంగా విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ కొత్త కారు గురించి ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను, సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. -
విడుదలకు ముందే బుకింగ్స్ షురూ.. లాంచ్ అయితే రచ్చ.. రచ్చే!
హ్యుందాయ్ కంపెనీ భారతదేశంలో విడుదల చేయనున్న ఎక్స్టర్ SUV టీజర్లను గత కొన్ని రోజులుగా విడుదల చేస్తూనే ఉంది. అయితే ఇప్పుడు కంపెనీ ఈ కారుని అధికారికంగా వెల్లడించింది, అంతే కాకుండా బుకింగ్స్ కూడా ప్రారంభించింది. హ్యుందాయ్ ఎక్స్టర్ గురించి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం. బుకింగ్స్ & లాంచ్ టైమ్ హ్యుందాయ్ ఎక్స్టర్ బుక్ చేసుకోవాలనుకునే కస్టమర్లు ఇప్పుడు రూ. 11,000 చెల్లించి బుక్ చేసుకోవచ్చు. అయితే ఈ కారు 2023 జులై లేదా ఆగస్టు నెలలో లాంచ్ అయ్యే అవకాశం ఉంటుంది. డెలివరీలు ఆ తరువాత ప్రారంభమవుతాయి. డిజైన్ & ఫీచర్స్ దేశీయ మార్కెట్లో విడుదలకానున్న కొత్త హ్యుందాయ్ ఎక్స్టర్ EX, S, SX, SX (O), SX(O) కెనెక్ట్ అనే ఐదు వేరియంట్లలో విడుదలకానుంది. ఇప్పటికే సౌత్ కొరియాలో టెస్టింగ్ దశలో ఉన్న ఈ కారు మంచి డిజైన్ కలిగి ఉంటుంది. అయితే ఇది రేంజర్ ఖాకీ అనే కొత్త కలర్లో లభించనుంది. ఇందులో H షేప్ ఎల్ఈడీ హెడ్ లాంప్, DRL, విశాలమైన ఫ్రంట్ ఫాసియా, డ్యూయెల్ టోన్ అల్లాయ్ వీల్స్, రూప్ రెయిల్స్ వంటివి ఉంటాయి. రియర్ ప్రొఫైల్ కూడా చాలా ఆధునికంగా ఉంటుంది. టెయిల్ గేట్, షార్క్ ఫిన్ యాంటెన్నా, ఎల్ఈడీ టెయిల్ లాంప్ మొదలైనవి ఉంటాయి. కంపెనీ ఏ ఎస్యువి ఇంటీరియర్ ఫీచర్స్, డిజైన్ వంటి వాటిని గురించి అధికారికంగా వెల్లడించలేదు. కానీ ఇందులో ఆధునిక కాలంలో వినియోగదారునికి కావలసిన అన్ని ఫీచర్స్ అందుబాటులో ఉంటాయని భావిస్తున్నాము. (ఇదీ చదవండి: జొమాటో సీఈఓ అద్భుతమైన కార్ల ప్రపంచం - చూద్దాం రండి!) ఇంజిన్ & పర్ఫామెన్స్ హ్యుందాయ్ ఎక్స్టర్ ఎస్‌యువిలో 1.2 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ ఇంజిన్ ఉండనుంది. ఈ ఇంజిన్ ఇప్పటికే గ్రాండ్ ఐ10 నియోస్, ఆరా, వెన్యూ కార్లలో అందుబాటులో ఉంది. పర్ఫామెన్స్ ఫిగర్స్ ఇంకా వెల్లడికానప్పటికీ ఇది 83hp పవర్ 114Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుందని భావిస్తున్నాము. ఇంజిన్ 5 స్పీడ్ మ్యాన్యువల్ లేదా ఆటోమాటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్స్ పొందనుంది. కంపెనీ ఈ ఎస్‌యువిని లాంచ్ చేసే సమయంలోనే ధరలను గురించి కూడా అధికారికంగా వెల్లడించనుంది. హ్యుందాయ్ ఎక్స్టర్ గురించి ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను, సందేహాలను మాతో పంచుకోండి. -
హ్యుందాయ్ 'ఎక్స్టర్' ఫస్ట్ లుక్ - చూసారా!
ఇండియన్ మార్కెట్లో ఎప్పటికప్పుడు కొత్త ఉత్పత్తులు విడుదలవుతూనే ఉన్నాయి. ఈ తరుణంలో ఇప్పటికే మంచి అమ్మకాలతో ముందుకు సాగుతున్న హ్యుందాయ్ కంపెనీ మరో కారుని దేశీయ విఫణిలో విడుదల చేయడానికి సన్నద్ధమవుతోంది. కంపెనీ ఈ కొత్త కారు టీజర్ కూడా విడుదల చేసింది. హ్యుందాయ్ విడుదల చేయనున్న కొత్త కారు పేరు 'ఎక్స్టర్' (Exter). ఇది మైక్రో SUV విభాగంలో అడుగుపెట్టే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇప్పటికి విడుదలైన టీజర్ ప్రకారం ఇది మంచి డిజైన్ కలిగి ఉంటుందని స్పష్టంగా అర్థమవుతోంది. ఈ కారు 2023 జులై నాటికి ఉత్పత్తి దశకు చేరుకునే అవకాశం ఉంది. హ్యుందాయ్ ఎక్స్టర్ భారతదేశం నుంచి ఇతర దేశాలకు ఎగుమతి అయ్యే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు భావిస్తున్నాయి. ఇది ప్రత్యేకమైన ఫ్రంట్-ఎండ్ డిజైన్ కలిగి ఉండటం వల్ల కంపెనీకి చెందిన ఇతర మోడల్స్ కంటే కూడా భిన్నంగా ఉంటుంది. H-ఆకారంలో ఉండే ఎల్ఈడీ DRLలతో స్ప్లిట్ హెడ్‌ల్యాంప్ సెటప్ చూడచక్కగా ఉంటుంది. (ఇదీ చదవండి: కారు ఇన్సూరెన్స్ ప్రీమియం తగ్గించుకోవాలా.. ఈ టిప్స్ ఫాలో అవ్వండి!) ఫ్రంట్ బంపర్, బంపర్ వెడల్పు అంతటా విస్తరించి ఉండే బ్లాక్ గ్రిల్ నిటారుగా, అడ్డంగా ఉండటం మీరు ఇందులో గమనించవచ్చు. రెండర్లో ఫాక్స్ సిల్వర్ స్కిడ్ ప్లేట్, ఫ్లేర్డ్ వీల్ ఆర్చ్‌లు విదేశీయ మార్కెట్లో అమ్ముడవుతున్న హ్యుందాయ్ క్యాస్పర్ని గుర్తుకు తెస్తుంది. డిజైన్ పరంగా ఇది ఐయోనిక్ 5కి అదగ్గరగా ఉన్నట్లు అనిపిస్తుంది. కొత్త హ్యుందాయ్ ఎక్స్టర్ ఇంటీరియర్ ఫీచర్స్ గురించి ఎటువంటి అధికారిక వివరాలు వెల్లడి కాదు, కానీ ఇది గ్రాండ్ ఐ10 నియోస్ వంటి ఇంటీరియర్ పొందే అవకాశం ఉంది. అయితే ఇది బెస్ట్ గ్రౌండ్ క్లియరెన్స్, రీట్యూన్డ్ సస్పెన్షన్ వంటివి పొందనుంది. (ఇదీ చదవండి: కంప్యూటర్ వద్దనుకున్నారు.. వంకాయ సాగు మొదలెట్టాడు - ఇప్పుడు సంపాదన చూస్తే..) హ్యుందాయ్ ఎక్స్టర్ ఇంజిన్ వివరాలు కూడా ప్రస్తుతానికి అందుబాటులో లేదు. కానీ ఇందులో ఆరా, ఐ20, వెన్యూలోని 1.2 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ కలిగి 5-స్పీడ్ మాన్యువల్ & ఆటోమాటిక్ గేర్‌బాక్స్ ఉండే అవకాశం ఉంది. హ్యుందాయ్ కంపెనీ 2023 ఆగస్ట్‌లో 'ఎక్స్టర్'ని లాంచ్ చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. దీని ధర నియోస్ కంటే ఎక్కువగా ఉంటుందని అంచనా. ఈ కారు ఖచ్చితమైన ధరలు లాంచ్ సమయంలో వెల్లడవుతాయి. -
కియా, హ్యుందాయ్ కంపెనీలకు షాక్! ఆ కార్లు రీకాల్ చేసేయాలని అభ్యర్థనలు
దక్షిణ కొరియాకు చెందిన దిగ్గజ వాహన తయారీ సంస్థలైన కియా, హ్యుందాయ్ కంపెనీల కార్లను అమెరికా దేశంలో రీకాల్ చేసేయాలని ఆ దేశ ఫెడరల్ ప్రభత్వానికి అభ్యర్థనలు వచ్చాయి. ఎందుకంటే ఆ కార్లను సులువుగా దొంగిలిస్తున్నారట. ‘అసోసియేటెడ్ ప్రెస్’ కథనం ప్రకారం.. అమెరికాలోని 17 రాష్ట్రాల అటార్నీ జనరల్‌లు మిలియన్ల కొద్దీ కియా, హ్యుందాయ్ కార్లను రీకాల్ చేయాలని ఫెడరల్ ప్రభుత్వాన్ని అభ్యర్థించారు. ఇదీ చదవండి: వాహన ఇన్సూరెన్స్ చేయిస్తున్నారా? వీటితో భలే బెనిఫిట్స్! అమెరికా దేశంలో గత దశాబ్దంలో విక్రయించిన కొన్ని కియా, హ్యుందాయ్ కార్లలో ఇంజిన్ ఇమ్మొబిలైజర్లు లేవు. వీటిని చాలా కార్లలో ప్రామాణిక ఫీచర్‌గా పరిగణిస్తారు. కీ లేకుండా ఇంజిన్‌ను స్టార్ట్ చేయకుండా ఈ ఇంజిన్ ఇమ్మొబిలైజర్లు నిరోధిస్తాయి. కేవలం స్క్రూడ్రైవర్, యూఎస్బీ కేబుల్‌తో కియా, హ్యుందాయ్ కార్లను ఎలా కొట్టేయొచ్చో చూపించే కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో, టిక్‌టాక్‌లో దర్శనమిస్తున్నాయి. లాస్ ఏంజిల్స్‌లో కేవలం హ్యుందాయ్, కియా కార్ల దొంగతనాలు 2022లో దాదాపు 85 శాతం పెరిగాయి. నగరంలో జరిగిన మొత్తం కార్ల దొంగతనాలలో హ్యుందాయ్, కియా కార్ల దొంగతనాలు 20 శాతం ఉన్నాయని కాలిఫోర్నియా అటార్నీ జనరల్ కార్యాలయం తెలిపింది. దొంగిలించిన ఈ కార్లు 14 ప్రమాదాలు, ఎనిమిది మరణాలకు కారణమయ్యాయని నేషనల్ హైవే ట్రాఫిక్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్ పేర్కొంటోంది. గత అక్టోబరులో న్యూయార్క్‌లోని బఫెలోలో జరిగిన కారు ప్రమాదంలో నలుగురు టీనేజర్లు చనిపోయారు. టిక్‌టాక్ ఛాలెంజ్‌లో భాగంగా కియా కారును దొంగిలించిన ఆరుగురు యువకులు వేగంగా దూసుకెళ్లి ప్రమాదానికి గురయ్యారు. ఈ నేపథ్యంలో కాలిఫోర్నియా అటార్నీ జనరల్ రాబ్ బొంటా, ఇతర అటార్నీ జనరల్‌లు కియా, హ్యుందాయ్ కార్ల దేశవ్యాప్త రీకాల్‌ను అభ్యర్థిస్తూ నేషనల్ హైవే ట్రాఫిక్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్‌కు లేఖ పంపారు. కియా, హ్యుందాయ్ కంపెనీలు తమ అనేక వాహనాలకు ప్రామాణిక భద్రతా ఫీచర్లను కల్పించడంలో విఫలమవడం వల్ల వాహనదారులను, సామాన్య ప్రజలను ప్రమాదంలో పడేశాయని ఆరోపించారు. ఇదీ చదవండి: బిర్యానీ అమ్ముతూ రోజుకు రూ.37 లక్షలు సంపాదిస్తున్నాడు.. ఫుడీ ఐఐటీయన్! -
దూసుకెళ్తున్న కొత్త హ్యుందాయ్ వెర్నా బుకింగ్స్: ఇప్పటికే..
2023 ఆటో ఎక్స్‌పోలో కనిపించిన కొత్త హ్యుందాయ్ వెర్నా ఇటీవలే దేశీయ మార్కెట్లో అధికారికంగా విడుదలైంది. కంపెనీ ఈ సెడాన్ కోసం గత నెలలోనే బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. అయితే ఇప్పటికి ఈ కొత్త మోడల్ కోసం ఎనిమిది వేల కంటే ఎక్కువ బుకింగ్స్ వచ్చినట్లు సమాచారం. 2023 వెర్నా బుక్ చేసుకోవాలనుకునే కస్టమర్లు రూ. 25,000 చెల్లించి హ్యుందాయ్ డీలర్షిప్ ద్వారా లేదా ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. డెలివరీలు ఏప్రిల్ మొదటి వారంలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అదే సమయంలో లొకేషన్, బుక్ చేసుకునే వేరియంట్ ఆధారంగా వెయిటింగ్ పీరియడ్ సుమారు రెండు నెలల వరకు ఉంటుందని భావిస్తున్నారు. దేశీయ మార్కెట్లో విడుదలైన సరికొత్త హ్యుందాయ్ వెర్నా రెండు పెట్రోల్ ఇంజిన్ ఆప్సన్లను కలిగి ఉంటుంది. ఇందులో ఒకటి 6 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్, ఇంటెలిజెంట్ వేరియబుల్ ట్రాన్స్మిషన్ (IVT)తో వచ్చే 1.5 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్, మరొకటి 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్, 7 స్పీడ్ డిసిటి కలిగిన 1.5 లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్. ఇవి రెండూ ఉత్తమమైన పనితీరుని అందిస్తాయి. (ఇదీ చదవండి: ఇది కదా సక్సెస్ అంటే: ఒకప్పుడు ట్యూషన్ టీచర్.. ఇప్పుడు వంద కోట్లకు అధిపతి!) కొత్త హ్యుందాయ్ వెర్నా డిజైన్, ఫీచర్స్ పరంగా చాలా అప్డేట్ పొందింది. ఇది మొత్తం నాలుగు వేరియంట్లలో లభిస్తుంది. దేశీయ విఫణిలో హోండా సిటీ, మారుతి సుజుకి సియాజ్, ఫోక్స్‌వ్యాగన్ వర్టస్ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉన్న ఈ సెడాన్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ఈ లింకుపై క్లిక్ చేయండి. -
హ్యుందాయ్ అల్కజార్ ఇప్పుడు కొత్త ఇంజిన్‌తో.. బుకింగ్స్ స్టార్ట్
ప్రారంభం నుంచి మంచి అమ్మకాలతో ముందుకు సాగుతున్న 'హ్యుందాయ్ అల్కజార్' ఇప్పుడు 1.5-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్‌తో అందుబాటులో ఉంది. ఈ SUV కోసం కంపెనీ రూ. 25,000తో బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. డెలివరీలు త్వరలో ప్రారంభమవుతాయి. కంపెనీ అందించే హ్యుందాయ్ అల్కజార్ 1.5 లీటర్ టర్బో-పెట్రోల్ వెర్షన్ 158 బీహెచ్‌పి పవర్, 253 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇది 6 స్పీడ్ మ్యాన్యువల్, 7 7-స్పీడ్ డ్యూయల్-క్లచ్ ఆటోమేటిక్ ఆప్సన్స్ పొందుతుంది. మ్యాన్యువల్ వెర్షన్ 17.5 కిమీ/లీటర్ మైలజీని అందించగా, డ్యూయల్-క్లచ్ ఆటోమేటిక్ వెర్షన్ 18 కిమీ/లీ మైలేజ్ అందిస్తుంది. హ్యుందాయ్ కంపెనీ ఈ నెల ప్రారంభంలో 2023 అల్కజార్ SUV విడుదల చేసింది. ఇది మునుపటికంటే ఎక్కువ అప్డేటెడ్ ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఇందులో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, వెహికల్ స్టెబిలిటీ మేనేజ్మెంట్, హిల్-స్టార్ట్ అసిస్ట్ కంట్రోల్ వంటి వాటితో పాటు డిస్క్ బ్రేక్‌లు ఉన్నాయి. కొత్త హ్యుందాయ్ అల్కజార్ ఐడిల్ స్టార్ట్ అండ్ గో ఫంక్షన్‌తో కూడా వస్తుంది. కావున ఎక్కువ ట్రాఫిక్ ఉన్న సమయంలో కొంత ఇంధనాన్ని అదా చేయడానికి ఉపయోగపడుతుంది. అప్డేటెడ్ అల్కజార్ మోడల్ దాని మునుపటి మోడల్ కంటే ఎక్కువ ధర వద్ద అందుబాటులో ఉంటుంది. -
2023 హ్యుందాయ్ వెర్నా ఇలాగే ఉంటుంది - ఫోటోలు
హ్యుందాయ్ కంపెనీ భారతదేశంలో 2023 వెర్నా విడుదల చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించింది. ఈ మిడ్-సైజ్ సెడాన్ కోసం కంపెనీ బుకింగ్స్ స్వీకరించడం కూడా ప్రారంభించింది. ఈ సెడాన్ ఇటీవల టెస్టింగ్ సమయంలో కనిపించింది. హ్యుందాయ్ వెర్నా దాని మునుపటి మోడల్స్ కంటే చాలా ఆధునిక డిజైన్ పొందుతుంది. ఈ సెడాన్ ముందు భాగంలో స్పోర్టినెస్ డిజైన్ లాంగ్వేజ్ కలిగి, పారామెట్రిక్ గ్రిల్ పొందుతుంది. ఫ్రంట్ బంపర్ కొత్తగా కనిపిస్తుంది. బోనెట్ మీద బ్రాండ్ లోగో చూడవచ్చు. స్ప్లిట్ హెడ్‌లైట్ సెటప్, ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్ గ్రిల్ పక్కన అమర్చబడి ఉంటుంది. సైడ్ ప్రొఫైల్‌లో డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. వెనుక వైపు వెడల్పు అంతటా విస్తరించి ఉండే ఎల్ఈడీ టెయిల్ లైట్ చూడవచ్చు. దాని పైన హ్యుందాయ్ బ్రాండ్ లోగో ఉంటుంది. ఇంటీరియర్ డిజైన్, ఫీచర్స్ వంటివి ఇంకా అధికారికంగా వెల్లడి కాలేదు, అయినప్పటికీ ఇందులో బెస్ట్ ఫీచర్స్, ఏడిఏఎస్ టెక్నాలజీ వంటివి వుండే అవకాశం ఉంది. 2023 హ్యుందాయ్ వెర్నా రెండు ఇంజిన్ ఆప్సన్స్ పొందనుంది. ఇందులో మొదటి 1.5 లీటర్ ఇంజిన్, ఇది 115 పిఎస్ పవర్ & 250 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. రెండవ ఇంజిన్ 1.5 లీటర్ టర్బో పెట్రోల్, ఇది 160 పిఎస్ పవర్ & 265 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్, పర్ఫామెన్స్ వివరాలు కూడా అధికారికంగా వెల్లడి కాలేదు. -
హ్యుందాయ్ లేటెస్ట్ కారు, రేపే లాంచ్: డిజైన్‌కి మాత్రం ఫిదా అవ్వాల్సిందే!
దక్షిణ కొరియా కార్ బ్రాండ్ హ్యుందాయ్ కొత్త ‘వెర్నా’ సెడాన్ విడుదలకు సర్వం సిద్ధం చేసింది. రేపు మార్కెట్లో అధికారికంగా విడుదల చేయడానికి సన్నద్ధమైంది. ఇప్పటికే కంపెనీ ఈ సెడాన్ కోసం రూ. 25 వేలతో బుకింగ్స్ ప్రారభించింది. ఈ కొత్త మోడల్ దాని మునుపటి మోడల్స్ కంటే భిన్నంగా ఉంది. (ఇది కూడా చదవండి: మెగా డీల్ జోష్: ఎయిరిండియాలో ఉద్యోగాలు, పైలట్‌కు జీతం ఎంతంటే?) హ్యుందాయ్ వెర్నా సెడాన్ కొత్త డిజైన్ పొందుతుంది. ఇందులో స్ప్లిట్ హెడ్‌ల్యాంప్ సెటప్, ఫుల్ ఎల్ఈడీ లైట్ బార్, ఫ్లాట్‌గా ఉండే బోనెట్, డోర్స్ మీద క్యారెక్టర్ లైన్స్, స్టైలిష్ డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్ వంటివి చూడవచ్చు. వెనుక భాగంలో వెడల్పు అంతటా విస్తరించి ఉండే లైట్ బార్ ఉంటుంది. హ్యుందాయ్ వెర్నా 1.5 లీటర్ డైరెక్ట్ ఇంజెక్షన్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌తో 6 స్పీడ్ మాన్యువల్ లేదా 7 స్పీడ్ డిసిటి ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. ఇందులో డీజిల్ ఇంజిన్ ఆప్సన్ లేదు. కావున ఇది EX, S, SX, SX (O) ట్రిమ్‌లలో విక్రయించబడుతుంది. ధరలు మునుపటి మోడల్ కంటే కూడా ఎక్కువగా ఉంటాయని అంచనా. ఈ సెడాన్ ధరలు అధికారికంగా రేపు లాంచ్ సమయంలో వెల్లడవుతాయి. ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో డిజిటల్ డ్రైవర్స్ డిస్ప్లే, బ్రాండెడ్ సౌండ్ సిస్టమ్, సన్‌రూఫ్, పవర్డ్ ఫ్రంట్ సీట్లు, వెంటిలేటెడ్ సీట్లు, 360 డిగ్రీ కెమెరా వంటి ప్రీమియం ఫీచర్స్‌తో పాటు ADAS టెక్నాలజీ ఉంటాయి. మల్టిపుల్ ఎయిర్ బ్యాగులు, ఏబీఎస్ విత్ ఈబిడి, రివర్స్ పార్కింగ్ కెమెరా, రివర్స్ పార్కింగ్ సెన్సార్ వంటి ఆధునిక సేఫ్టీ ఫీచర్స్ ఇందులో పొందవచ్చు. కొత్త హ్యుందాయ్ వెర్నా బ్రాండ్ యొక్క సెన్సుయస్ స్పోర్టినెస్ డిజైన్ లాంగ్వేజ్ కలిగి ఉండటం వల్ల కొత్తగా దర్శన మిస్తుంది. ఇది చూడటానికి లేటెస్ట్ హ్యుందాయ్ ఎలంట్రా, గ్రాండియర్ సెడాన్ మాదిరిగా ఉంటుంది. ఇది మార్కెట్లో విడుదలైన తరువాత స్కోడా స్లావియా, ఫోక్స్‌వ్యాగన్ వర్టస్ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది. -
హ్యుందాయ్ భారీ ఆఫర్, ఆ కారుపై లక్ష దాకా డిస్కౌంట్
సాక్షి,ముంబై: దక్షిణ కొరియా ఆటోమేకర్ హ్యుందాయ్ తన పాపులర్ కార్లపై భారీ తగ్గింపును అందిస్తోంది. ముఖ్యంగా హ్యుందాయ్ తొలి ఈవెహికల్ కోనా ఎలక్ట్రిక్‌తో పాటు హ్యుందాయ్ ఐ20, ఆరా, ఐ10 నియోస్, లాంటి కొన్ని కార్ల కొనుగోలుపై లక్ష రూపాయల దాకా డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది. హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ కొనుగోలుపై రూ. 35,000 వరకు నగదు తగ్గింపు, రూ. 10,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్, రూ. 3,000 వరకు కార్పొరేట్ తగ్గింపు అందుబాటులో ఉన్నాయి.1.2L NA పెట్రోల్, 1.2L Bi సీఎన్జీ 1.0L టర్బో పెట్రోల్ ఇంజన్‌తో, హ్యుందాయ్ గ్రాండ్ i10 నియోస్ ప్రస్తుతం మార్కెట్లో ఉన్న వాల్యూ ఫర్ మనీ హ్యాచ్‌బ్యాక్‌లలో ఒకటి. (హైదరాబాద్‌లో గృహ విక్రయాలు జూమ్, ఏకంగా 130 శాతం జంప్) హ్యుందాయ్ ఆరా హోండా అమేజ్, టాటా టిగోర్ లాంటి కార్లకు గట్టిపోటీ ఇస్తున్న హ్యుందాయ్ ఆరాపై రూ. 25,000 వరకు నగదు తగ్గింపు, రూ. 10,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ , రూ. 3,000 వరకు కార్పొరేట్ తగ్గింపు అందుబాటులో ఉన్నాయి. (యాపిల్ గుడ్‌న్యూస్: ఇండియాలో నాలుగురెట్లు పెరగనున్న ఉద్యోగాలు!) హ్యుందాయ్ ఐ20 హ్యుందాయ్ ఐ20 మాగ్నా, స్పోర్ట్స్ వేరియంట్స్ కొనుగోళ్లపై రూ. 13 వేల వరకు నగదు రాయితీ, ఇతరప్రోత్సాహకాలను అందిస్తోంది. ఇంకా రూ. 10,000 ఎక్స్ఛేంజ్ బోనస్, రూ. 3,000 తగ్గింపు కూడా. హ్యుందాయ్ i20 1.5L డీజిల్ ఇంజన్, 1.0L టర్బో పెట్రోల్ ఇంజన్ , 1.2L NA పెట్రోల్ ఇంజన్‌తో లభ్యం. హ్యుందాయ్ కోనా EV దేశీయ మార్కెట్లో హ్యుందాయ్ తొలి ఈవీ కోనా ఇప్పుడు రూ. 1 లక్ష క్యాష్ డిస్కౌంట్ ఉంది. ఇందులో ఎలాంటి ఎక్స్ఛేంజ్ డీల్స్ లేదా కార్పొరేట్ డిస్కౌంట్లు అందుబాటులో లేవు. -
హ్యుందాయ్ కంపెనీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సోషల్ మీడియా యూజర్లు
హ్యుందాయ్ మోటార్స్ కాశ్మీర్ విషయంలో పాకిస్థాన్ సపోర్ట్ చేస్తూ పెట్టిన ఒక పోస్టు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతుంది. ఫిబ్రవరి 5న పాకిస్తాన్ దేశంలో కాశ్మీర్ కోసం పోరాడి చనిపోయిన వారిని గుర్తుచేసుకుంటూ ప్రతి ఏడాది కాశ్మీరీ సంఘీభావ దినాన్ని అక్కడ జరుపుకుంటారు. అయితే, ప్రముఖ కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ పాకిస్తాన్ తన ట్విటర్ హ్యాండిల్స్ ద్వారా చేసిన ఒక పోస్టులో.. "మన కాశ్మీరీ సోదరుల త్యాగాలను గుర్తుంచుకుందాం. స్వేచ్ఛ కోసం పోరాడుతున్న వారికి మద్దతుగా నిలబడదాం" అని హ్యుందాయ్ #KashmirSolidarityDay అనే హ్యాష్ ట్యాగ్ ఉపయోగించి పోస్ట్ చేసింది. అయితే, ఆ పోస్టులు ఇప్పుడు తొలగించినప్పటికి అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. హ్యుందాయ్ పాకిస్తాన్ ట్విటర్ హ్యాండిల్ పోస్టు చేసిన ట్వీట్లను చాలా మందికి స్క్రీన్ షాట్ తీసి ట్విటర్ వేదికగా యూజర్లు షేర్ చేస్తూ కంపెనీ మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భారతీయ ట్విటర్ వినియోగదారులు ఈ పోస్టుపై తన వైఖరిని వివరించాలని కోరుతూ హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్(హెచ్ఎంఐఎల్)ను కోరుతూ భారీ సంఖ్యలో పోస్టులు పెడుతున్నారు. ఇంకా, చాలా మంది భారతీయ వినియోగదారులు హ్యుందాయ్ ఇండియా ఉత్పత్తులను బహిష్కరించాలని కూడా పిలుపునిచ్చారు. చాలా మంది ఆ కంపెనీకి చెందిన కార్లను అస్సలు కొనవద్దు అని కోరుతున్నారు. Hyundai in Pakistan is asking for freedom of Kashmir. Hyundai Pakistan also posted them same on its Facebook page. Link: https://t.co/ZOBDggsdW0 pic.twitter.com/Kmmk2Rc1wu — Anshul Saxena (@AskAnshul) February 6, 2022 Hello @Hyundai_Global ,How come your official handle in Pak is supporting terror state Pakistan’s propaganda on Kashmir ?@HyundaiIndia If you can’t respect sovereignty of my nation,Pack your bags and leave my country ! Friends,Keep retweeting till @Hyundai_Global apologise ! pic.twitter.com/zbtth6NklS — Major Surendra Poonia (@MajorPoonia) February 6, 2022 Why do brands need to meddle in Politics? pic.twitter.com/j5xPqWvLCN — Gabbbar (@GabbbarSingh) February 6, 2022 @Hyundai @HyundaiIndia time to change your name pic.twitter.com/okSDJSUX24 — Professor Disrespect (@Deludedindian) February 6, 2022 For Hyundai pakistan if it is freedom struggle going on in kashmir, then Indians will hv to rethink about buying @HyundaiIndia cars. Cant leave this behind. pic.twitter.com/1zxgdNPbbi — Pratheesh Viswanath (@pratheesh_Hind) February 6, 2022 For Hyundai pakistan if it is freedom struggle going on in kashmir, then Indians will hv to rethink about buying @HyundaiIndia cars. Cant leave this behind. pic.twitter.com/1zxgdNPbbi — Pratheesh Viswanath (@pratheesh_Hind) February 6, 2022 For Hyundai pakistan if it is freedom struggle going on in kashmir, then Indians will hv to rethink about buying @HyundaiIndia cars. Cant leave this behind. pic.twitter.com/1zxgdNPbbi — Pratheesh Viswanath (@pratheesh_Hind) February 6, 2022 వినియోగదారులు ఆ ట్వీట్లను చూడకుండా సంస్థ పరిమితం చేసింది. ఈ సమస్యపై నేరుగా ప్రస్తావించకుండా హెచ్ఎంఐఎల్ తన ప్రకటనలో"హ్యుందాయ్ మోటార్ ఇండియా ఇప్పుడు 25 సంవత్సరాలకు పైగా భారతీయ మార్కెట్ లో ఉంది. జాతీయవాదాన్ని గౌరవించే మా బలమైన నైతిక తత్వానికి మేము దృఢంగా నిలబడతాము. హ్యుందాయ్ మోటార్ ఇండియాను కలిపే అవాంఛనీయ సోషల్ మీడియా పోస్ట్ ఈ గొప్ప దేశానికి మా అసమాన నిబద్ధత, సేవను దెబ్బతీస్తోంది. హ్యుందాయ్ బ్రాండ్'కు భారతదేశం రెండవ నిలయం, సున్నితమైన విషయాలలో ఎటువంటి ఉపేక్ష వహించేది లేదు. అటువంటి అభిప్రాయాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. భారతదేశం పట్ల మా నిబద్ధతలో భాగంగా, దేశంతో పాటు దాని పౌరుల మెరుగుదల దిశగా మా ప్రయత్నాలను కొనసాగిస్తాము" అని ఆ ప్రకటనలో తెలిపింది. -
ఈవీ ప్రియులకు పండగే.. 2022లో రాబోతున్న టాప్ ఎలక్ట్రిక్ కార్లు ఇవే!
దేశంలో రోజు రోజుకి పెట్రోల్ ధరలు పెరిగిపోతున్న తరుణంలో వినియోగదారులు ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోళ్లవైపు మొగ్గు చూపుతున్నారు. ప్రజల ఆసక్తిని గమనించిన కంపెనీలు వారికి తగ్గట్టు సరికొత్త ఎలక్ట్రిక్ వాహన ఉత్పత్తులను మార్కెట్లోకి తీసుకొని వస్తున్నాయి. ఇప్పటికే దేశంలో అనేక రకాల ఎలక్ట్రిక్ కార్లు రోడ్డు మీద చక్కర్లు కొడుతున్నప్పటికి, వచ్చే ఏడాది 2022లో దిగ్గజ కంపెనీలు కూడా తమ ఎలక్ట్రిక్ కార్లను లాంచ్ చేసేందుకు సిద్దం అవుతున్నాయి. 2022లో ఎలక్ట్రిక్ కారు తయారీ కంపెనీలు తీసుకొనిరాబోతున్న కార్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. మెర్సిడెస్ బెంజ్ ఈక్యూఎస్ ప్రముఖ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ టెస్లా కంపెనీకి పోటీ ఇచ్చేందుకు ఈక్యూఎస్ అనే ఎలక్ట్రిక్ కారును మార్కెట్లోకి తీసుకొని రాబోతుంది. మెర్సిడెస్ బెంజ్ ఈక్యూఎస్ 450+ కారు ఎడ్మండ్స్ చేసిన రియల్ వరల్డ్ రేంజ్ టెస్టులో 422 మైళ్ల దూరం ప్రయాణించింది. టెస్లా ఉత్తమ మోడల్ కంటే దాదాపు 20 మైళ్ళు ఎక్కువ దూరం ప్రయాణించింది అన్నామట. మెర్సిడెస్ బెంజ్ ఈక్యూఎస్ 450+ కారును ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 770 కిమీ వెళ్లనున్నట్లు కంపెనీ తెలిపింది. ఈ కారు ధర $102,310 (రూ.76,07,899) లుగా ఉంది. ఇందులో మూడు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ కారు 0-100 కిలోమీటర్ల వేగాన్ని 5.9 సెకన్లలో అందుకుంటుంది.ఈ కారుకు ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్ వద్ద 10-80 శాతం చేరుకోవడానికి 30 నిమిషాలు మాత్రమే పడుతుంది. దీనిలో 107.8 kWh బ్యాటరీ సామర్ధ్యం గల ఇంజిన్ ఉంది. ఇది 2022 మొదటి త్రైమాసికంలో వచ్చే అవకాశం ఉంది. (చదవండి: ఒమిక్రాన్ భయాలతో భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్..!) టెస్లా మోడల్ 3 & మోడల్ వై ఎలక్ట్రిక్ కారు ప్రియులు అందరూ ఈ ఏడాదిలో టెస్లా కారు విడుదల అవుతుందని అనుకున్నారు. కానీ, అలా జరగలేదు. టెస్లా మోడల్ 3 సింగిల్, డ్యూయల్ మోటార్ సెటప్‌లతో ఉంటుంది. టెస్లా మోడల్ 3 బేస్ వేరియంట్ పూర్తి ఛార్జీపై 423 కిలోమీటర్లు పరుగులు తీస్తుంది. ఈ కారు 6 సెకన్లలోపు 0 నుండి 100 కిమీ వేగాన్ని అందుతుంటుంది. అయితే, ఈ ఎలక్ట్రిక్ కారు టాప్ వేరియంట్ ఒకే పూర్తి ఛార్జీతో 568 కిలోమీటర్ల వరకు నడుస్తుంది. ఈ వేరియంట్ కేవలం 3 సెకన్లలో 0 నుండి 100 కిమీ వేగాన్ని అందుకుంటుంది. దీని ధర సుమారు రూ. 60 - 80 లక్షల మధ్య ఉండే అవకాశం ఉంది. మోడల్ వై అనేది ఏడు సీట్ల వాహనం. అమెరికాలో దీని ధర 54,000 డాలర్ల(సుమారు 40 లక్షల రూపాయల) పై మాటే. ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే 326 కిమీ వరకు వెళ్లగలదు. దీని గరిష్ట వేగం గంటకు 135 కిలోమీటర్లు. ఇది 4.8 సెకన్లలో 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. ఈ రెండు కూడా ఈ రెండవ త్రైమాసికంలో వచ్చే అవకాశం ఉంది. (చదవండి: క్రెడిట్, డెబిట్ కార్డు యూజర్లకు అలర్ట్..!) వోల్వో XC40 రీఛార్జ్ వోల్వో మొట్ట మొదటి ఆల్-ఎలక్ట్రిక్ వాహనం ఇదే. రాబోయే వోల్వో ఎక్స్‌సి 40 రీఛార్జ్ డ్యూయల్ ఎలక్ట్రిక్ మోటార్స్ ద్వారా వస్తుంది. ఎలక్ట్రిక్ పవర్‌ట్రెయిన్ 408 బిహెచ్పి, 660 ఎన్ఎమ్ పీక్ టార్క్ ఉత్పత్తి చేస్తుందని, ఇది కేవలం 4.5 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ స్ప్రింట్ చేయడానికి అనుమతిస్తుంది. ఎక్స్‌సి 40 రీఛార్జ్ ఒకే ఛార్జీపై 418 కిలోమీటర్ల పరిధిని అందిస్తుందని కంపెనీ ధ్రువీకరించింది. వోల్వో ఎక్స్‌సి 40 రీఛార్జ్ భారత మార్కెట్లో ధృవీకరించబడిన సరికొత్త ఆల్-ఎలక్ట్రిక్ ప్రీమియం ఎస్యూవీ ఆఫర్. దీని ధర సుమారు రూ.50 లక్షలుగా ఉండే అవకాశం ఉంది. వచ్చే ఏడాది మొదటి త్రైమాసికంలో ఈ కారును లాంచ్ చేసే అవకాశం ఉంది. ఆడి క్యూ4 ఈ-ట్రాన్ జర్మనీకి చెందిన దిగ్గజ లగ్జరీ కార్ల తయారీ కంపెనీ ఆడి.. క్యూ4 ఈ-ట్రాన్ అనే ఎలక్ట్రిక్ కారును 2022లో మార్కెట్లోకి తీసుకురాబోతోంది. దీజెనీవాలో జరుగుతున్న మోటార్ షోలో కంపెనీ ఈ కారు కాన్సెప్ట్‌ను ఆవిష్కరించింది. క్యూ4 ఇ-ట్రాన్ ఒక 4 డోర్ ఎస్యూవీ. ఇందులో రెండు ఎలక్ట్రిక్ మోటార్లు ఉంటాయి. మాగ్జిమమ్ ఔట్పుట్ 302 బీహెచ్పీ. ఇందులో క్వాట్రో ఆల్ వీల్ డ్రైవ్ సిస్టమ్ ఉంటుంది. ఈ కారు 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని 6.3 సెకన్లలో అందుకుంటుంది. కారును ఒకసారి చార్జ్ చేస్తే 450 కిలోమీటర్లు వెళ్లొచ్చు. గరిష్ట వేగం గంటకు 180 కిలోమీటర్లు. ఈ కారు ధర సుమారు రూ.75 లక్షలు ఉండవచ్చు. హ్యుందాయ్ అయోనిక్ 5 ప్రముఖ కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ వచ్చే ఏడాది అయోనిక్ 5 ఎలక్ట్రిక్ కారును లాంచ్ చేసేందుకు సిద్దం అవుతుంది. ఈ కారును కేవలం 5 నిమిషాల ఛార్జ్ చేస్తే దాదాపు 100 కిలో మీటర్ల వరకు ప్రయాణించే అవకాశం ఉంది. అయోనిక్ 5 కార్లు ప్రధానంగా 390 హెచ్‌పీ అవుట్ పుట్తో.. ఆల్ వీల్ డ్రైవ్ కార్ల రూపంలో చెలామణీలోకి వచ్చే అవకాశం ఉంది. 5 సెకన్లలో సున్నా నుంచి 100 కేఎంపీహెచ్ స్పీడును అందుకొనున్నాయి. పలు రిపోర్టుల ప్రకారం అయోనిక్ 5 కారును ఫుల్ ఛార్జ్ చేస్తే 450 కిలో మీటర్లు వరకు వెళ్లనుంది. దీని ధర సుమారు రూ- 25-30 లక్షల మధ్య ఉండే అవకాశం ఉంది. మినీ కూపర్ ఎస్ఈ జర్మన్ లగ్జరీ కారు బ్రాండ్ బీఎమ్డబ్ల్యూకి చెందిన ప్రీమియం స్మాల్ కార్ బ్రాండ్ మినీ కూపర్, భారత మార్కెట్ కోసం ప్లాన్ చేసిన ఎలక్ట్రిక్ కార్లు అప్పుడే పూర్తిగా అమ్ముడైనట్లు కంపెనీ ప్రకటించింది. ఈ కొత్త ఎలక్ట్రిక్ మినీ కూపర్ ఎస్ఈ 32.6కెడబ్ల్యుహెచ్ బ్యాటరీ చేత పని చేస్తుంది.ఈ కారు 181 బిహెచ్పీ పవర్, 270ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ మోడల్ 7.3 సెకన్లలో 0-100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. దీని టాప్ స్పీడ్ గంటకు 150 కి.మీ. డబ్ల్యుఎల్ టీపీ ప్రకారం.. కూపర్ ఎస్ఈను ఒకసారి ఫుల్ చార్జ్ చేస్తే 270 కిలోమీటర్ల వెళ్లగలదు అని కంపెనీ తెలిపింది. ఈ కారు ఇంటిగ్రేటెడ్ ఎల్ఈడిడిఆర్ఎల్ ఓవల్ హెడ్ ల్యాంప్, షడ్భుజి ఆకారంలో ఉండే గ్రిల్, కాంట్రాస్ట్ కలర్ ఓఆర్ విఎమ్ లతో వస్తుంది. ఈ కారు లోపల 8.8 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్ మెంట్ సిస్టమ్, ఫుల్ డిజిటల్ ఇన్ స్ట్రుమెంట్ క్లస్టర్ ఉండనుంది. కస్టమర్లు మినీ కూపర్ ఎస్ఈ ఎలక్ట్రిక్ కారుని 11కెడబ్ల్యు(2.5 గంటలు) లేదా 50కెడబ్ల్యు ఛార్జర్ తో ఛార్జ్ చేయవచ్చు. ఇది బ్యాటరీని 35 నిమిషాల్లో 0-80 శాతం నుంచి ఛార్జ్ చేస్తుంది. ఈ కారు ధర సుమారు రూ.50 లక్షలు ఉండే అవకాశం ఉంది. వచ్చే ఏడాది జనవరిలో దీనిని లాంచ్ చేసే అవకాశం ఉంది. (చదవండి: 2021 రౌండప్: అత్యంత చెత్త కంపెనీ ఏదంటే..) -
కొత్త కారు కొనే వారికి బంపర్ ఆఫర్.. భారీగా తగ్గింపు!
మీరు కొత్త కారు కొనాలని చూస్తున్నారా? అయితే, మీకు ఒక శుభవార్త. ప్రముఖ ఆటోమొబైల్ తయారీ సంస్థ హ్యుందాయ్ ఎంపిక చేసిన మోడల్స్ మీద భారీగా డిస్కౌంట్ అందిస్తుంది. ఇయర్ ఎండ్ సేల్ పేరుతో కార్ల మీద డిస్కౌంట్ ప్రకటించింది. ఈ నెలలో కారు కొనుగోలు చేసే వారికి ₹50,000 వరకు ప్రయోజనాలను అందిస్తుంది. ఇది పరిమిత కాల ఆఫర్ మాత్రమేనని గుర్తుపెట్టుకోవాలి. డిసెంబర్ నెల చివరి వరకే ఆఫర్లు అందుబాటులో ఉంటాయి. ఈ క్రింద పేర్కొన్న కార్ల మీద రూ.50 వేల వరకు డిస్కౌంట్ అందిస్తుంది. హ్యుందాయ్ శాంట్రో (పెట్రోల్): ₹40,000 వరకు హ్యుందాయ్ ఐ20 (పెట్రోల్/డీజిల్): ₹40,000 వరకు హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 ఎన్ఐఓఎస్ (పెట్రోల్/డీజిల్): ₹50,000 వరకు హ్యుందాయ్ ఆరా(పెట్రోల్/డీజిల్): ₹50,000 వరకు కార్లపై తగ్గింపు ఆఫర్లు అనేవి ప్రాంతం, డీలర్షిప్, కారు మోడల్, వేరియంట్ ప్రాతిపదికన మారుతూ ఉంటాయి. అందువల్ల మీరు కారు కొనుగోలు చేయడానికి ముందుగానే ఆఫర్ వివరాలు పూర్తిగా తెలుసుకోవడం ఉత్తమం. లేదంటే ఇబ్బంది పడాల్సి రావొచ్చు. అలాగే, వచ్చే నెల నుంచి కార్ల ధరలు మళ్లీ పెరిగే అవకాశం ఉంది. మీరు కొత్త కారు కొనుగోలు చేయలని చూస్తుంటే? ఇది ఉత్తమ సమయం. -
కొత్త కారు కొనేవారికి హ్యుందాయ్ అదిరిపోయే ఆఫర్!
మీరు గనుక కొత్త కారు కొనాలని చూస్తున్నారా? అయితే, మీకు ఒక శుభవార్త. హ్యుందాయ్ మోటార్ ఇండియా సెప్టెంబర్ 2021లో ఎంపిక చేసిన మోడల్స్ పై రూ.50,000 వరకు డిస్కౌంట్స్ అందిస్తోంది. హ్యుందాయ్ శాంట్రో, గ్రాండ్ ఐ10 నియోస్, హ్యుందాయ్ ఆరా, హ్యుందాయ్ ఐ20 కార్లపై ఈ నెలలో భారీ ఆఫర్లను ప్రకటించింది. దీనికి సంబంధించి వివరాలు ఈ క్రింది విదంగా ఉన్నాయి. ఈ ఆఫర్ కేవలం ఈ నెల చివరి వరకు మాత్రమే ఉంటుంది. (చదవండి: మహారాష్ట్రలో భారీగా తగ్గనున్న ఆ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర!) హ్యుందాయ్ సాంట్రో మారుతి సుజుకి వ్యాగన్ఆర్, టాటా టియాగో ప్రత్యర్థి అయిన హ్యుందాయ్ సాంట్రో కారు అసలు ధర రూ.4,76,690 నుంచి రూ.6,44,690(ఎక్స్ షోరూమ్, ఢిల్లీ) వరకు ఉంది. అయితే, మీరు ఎంచుకున్న వేరియంట్ కార్లపై రూ.40,000 వరకు డిస్కౌంట్స్ కంపెనీ అందిస్తుంది. డిస్కౌంట్ - రూ.25,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ - రూ.10,000 కార్పొరేట్ డిస్కౌంట్ - రూ.5,000 మొత్తం - రూ.40,000 వరకు హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ మారుతి సుజుకి స్విఫ్ట్ కు ప్రధాన ప్రత్యర్ధి హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ కారు అసలు ధర రూ.5,28,590 నుంచి రూ.8,50,050 (ఎక్స్ షోరూమ్, ఢిల్లీ) వరకు ఉంది. మీరు ఎంచుకున్న వేరియంట్ ఆధారంగా నియోస్ కార్లపై రూ.50,000 వరకు డిస్కౌంట్స్ కంపెనీ అందిస్తుంది. డిస్కౌంట్ - రూ.35,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ - రూ.10,000 కార్పొరేట్ డిస్కౌంట్ - రూ.5,000 మొత్తం - రూ.50,000 వరకు హ్యుందాయ్ ఆరా మారుతి సుజుకి డిజిర్, హోండా అమేజ్ ప్రత్యర్థి అయిన హ్యుందాయ్ ఆరా కారు అసలు ధర రూ.5,99,900 నుంచి రూ.9,36,300(ఎక్స్ షోరూమ్, ఢిల్లీ) వరకు ఉంది. మీరు ఎంచుకున్న వేరియంట్ ఆధారంగా కాంపాక్ట్ సెడాన్ కార్లపై రూ.50,000 వరకు డిస్కౌంట్స్ కంపెనీ అందిస్తుంది. డిస్కౌంట్ - రూ.35,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ - రూ.10,000 కార్పొరేట్ డిస్కౌంట్ - రూ.5,000 మొత్తం - రూ.50,000 వరకు హ్యుందాయ్ ఐ20 మారుతి సుజుకి బాలెనో, టాటా ఆల్ట్రోజ్ వంటి వాటి ప్రధాన ప్రత్యర్ధి హ్యుందాయ్ ఐ20 కారు అసలు ధర రూ.6,91,200 వద్ద ప్రారంభమై రూ.11,40,200 (ఎక్స్ షోరూమ్, ఢిల్లీ) వరకు ఉంది. మీరు ఎంచుకున్న వేరియంట్ బట్టి ప్రీమియం హ్యాచ్ బ్యాక్ కారుపై రూ.40,000 వరకు డిస్కౌంట్స్ కంపెనీ అందిస్తుంది. డిస్కౌంట్ - రూ.25,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ - రూ.10,000 కార్పొరేట్ డిస్కౌంట్ - రూ.5,000 మొత్తం - రూ.40,000 వరకు -
హ్యుందాయ్ నుంచి మరో సరికొత్త కారు.. అదిరే డిజైన్ తో
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: హ్యుందాయ్ మోటార్ ఐ20 ఎన్ లైన్ వర్షన్‌ను విడుదల చేసింది. ధర ఎక్స్‌షోరూంలో రూ.11.76 లక్షలు. 1 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్, 88.3 కిలోవాట్ అవర్ పవర్‌తో ఎన్6, ఎన్8 వేరి యంట్లలో ప్రవేశపెట్టింది. దేశవ్యాప్తంగా 188 డీలర్షిప్స్ వద్ద కొత్త వర్షన్ లభిస్తుంది. వెహికిల్ స్టెబిలిటీ మేనేజ్మెంట్ వ్యవస్థతో ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్ అసిస్ట్ కంట్రోల్, డైనమిక్ గైడ్‌లైన్స్‌తో రేర్ కెమెరా, టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్, న్యూ వాయిస్ రికగ్నిషన్ కమాండ్స్ ఫీచర్లు ఉన్నాయి. ఢిల్లీ ఎక్స్‌షోరూంలో ఐ20 రెగ్యులర్ మోడల్ ధర రూ.6.91 లక్షల నుంచి రూ.11.4 లక్షల వరకు ఉంది. -
అదిరే అల్కాజర్, సరికొత్త ఫీచర్లతో మార్కెట్లో సందడి
కరోనా కారణంగా కొత్త కార్ల తయారీ, విడుదల ఆగిపోయింది. అయితే పరిస్థితులు అదుపులోకి రావడంతో కొత్త కొత్త కార్లు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. తాజాగా ప్రముఖ కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ 7 సీట్ల సామర్థ్యంతో ప్రీమియం ఎస్యూవీ- 'అల్కాజర్ వచ్చే వారం మార్కెట్లో విడుదల చేయనుంది. ప్రస్తుతం ఈ కార్‌ను ప్రీ ఆర్డర్ కోసం హ్యుందాయ్ ప్రతినిధులు అందుబాటలోకి తెచ్చారు. రెండు సీటింగ్ కాన్ఫిగరేషన్ ఆప్షన్స్ మరియు రెండు ఇంజన్ ఆప్షన్లతో ఈ కార్ రాబోయే హ్యుందాయ్ ఎస్యూవీ టాటా సఫారి వంటి కార్లతో పోటీ పడుతుందని అశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఫీచర్స్ ఎలా ఉన్నాయంటే కొత్త అల్కాజర్ ఎస్‌యూవీని ఎన్ని ట్రిమ్ లెవల్లో అందిస్తుందో హ్యుందాయ్ ఇండియా ధృవీకరించలేదు. అయితే మార్కెట్ నిపుణుల అంచనా ప్రకారం.. హ్యుందాయ్ ఎస్యూవీ సిగ్నేచర్, సిగ్నేచర్ (ఓ), ప్రెస్టీజ్, ప్రెస్టీజ్ (ఓ), ప్లాటినం మరియు ప్లాటినం (ఓ) అనే మొత్తం ఆరు ట్రిమ్ లెవల్స్ అందుబాటులో ఉంచవచ్చని తెలుస్తోంది. హ్యుందాయ్ అల్కాజర్ యొక్క సెగ్మెంట్ వీల్‌బేస్ 2,760 మి.మీటర్లుగా ఉంది. దీంతో పాటు.. • 10.25 అంగుళాల మల్టీ ఇన్ఫర్మేషన్ డిస్ ప్లే • 8స్పీకర్లతో బోస్ ప్రీమియం సౌండ్ సిస్టం • AQI డిస్ప్లేతో ఎయిర్ ప్యూరిఫైయర్ • సీట్ల ముందు భాగంగా వాటర్ బాటిల్, బుక్స్ పెట్టుకునేలా సెట్ బ్యాక్ టేబుల్ • వాయిస్-ఎనేబుల్డ్ స్మార్ట్ పనోరమిక్ సన్‌రూఫ్ • మంచు, ఇసుక వంటి ప్రదేశాల్లో కార్ ను కంట్రోల్ చేసే ట్రాక్షన్ కంట్రోల్ మోడేస్ • హ్యుందాయ్ బ్లూ లింక్ కనెక్ట్ చేసిన కార్ సిస్టమ్ • యాంబెంట్ వేరియంట్స్ 64రంగుల కలర్స్ తో లైంటింగ్ • హ్యుందాయ్ బ్లూ లింక్ కనెక్ట్ చేసిన కార్ సిస్టమ్ హ్యుందాయ్ అల్కాజర్ ఇంజిన్ వివరాలు రాబోయే హ్యుందాయ్ అల్కాజర్ ఎస్‌యూవీకి ఒక పెట్రోల్ ఇంజన్, డీజిల్ ఇంజిన్లను డిజైన్ చేశారు. పెట్రోల్ మోటారు 2.0-లీటర్ ఎంపిఐ యూనిట్ ను కలిగి ఉంది. ఇది గరిష్టంగా 157 బిహెచ్పి మరియు 191 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. మరొకటి 1.5-లీటర్ డీజిల్ ఇంజన్. ఇది బెల్ట్‌లు 113 బిహెచ్పి మరియు 250 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఆరు-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ మరియు ఆరు-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ తో రెండు ఇంజిన్లను రెండు ట్రాన్స్మిషన్లతో హ్యుందాయ్ అల్కాజర్ మార్కెట్లో సందడి చేస్తోంది. చదవండి : సరికొత్త ఎలక్ట్రిక్ సూపర్ బైక్ ను రూపొందించిన విద్యార్థులు -
కొత్త కారు కొనేవారికి అదిరిపోయే ఆఫర్
మీరు కొత్త కారు కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నారా? అయితే మీకోసం అదిరిపోయే ఆఫర్ అందుబాటులో ఉంది. ప్రముఖ వాహన తయారీ కంపెనీ హ్యుందాయ్ ఇండియా తన మోడళ్లపై అదిరిపోయే డిస్కౌంట్‌ను అందిస్తోంది. దీంతో కారు కొనే వారికి చాలా ఊరట లభించనుంది. హ్యుందాయ్ తన కార్ల అమ్మకాలలో గత నెలలో గణనీయమైన వృద్ధిని నమోదు చేసింది. దక్షిణ కొరియా కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ గత నెలలో 51, 600 యూనిట్లను విక్రయించింది. ఇది 2020 ఫిబ్రవరిలో 40,010 యూనిట్ల పోల్చితే 29 శాతం ఎక్కువ. హ్యుందాయ్ కార్లలో క్రెటా, ఐ20 కార్లు ఎక్కువగా అమ్ముడుపోయాయి. గణనీయమైన వృద్ధిని నమోదు చేయడానికి ప్రధాన కారణం తన కార్ల మోడళ్లపై అదిరిపోయే డిస్కౌంట్‌ను అందించడమే. అందుకే ఈ నెలలో కూడా కొన్ని కార్లపై అదిరిపోయే డిస్కౌంట్‌ను అందిస్తోంది. హ్యుందాయ్ కంపెనీ ఎంపిక చేసిన మోడళ్లపై గరిష్టంగా రూ.1.5 లక్షల వరకు తగ్గింపు అందిస్తోంది. గ్రాండ్ ఐ10 నియోస్, ఎలంట్రా, శాంట్రో, ఆరా, కోనా వంటి మోడళ్లకు ఈ ఆఫర్ వర్తించనుండగా.. మార్చి నెలాఖరు దాకా ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. ఏ మోడల్ పై ఎంత తగ్గింపు అందించింది క్రింద తెలుసుకోండి. మోడళ్ల వారీగా డిస్కౌంట్: హ్యుందాయ్ కోనా మోడల్ పై రూ.1.5 లక్షల వరకు తగ్గింపు హ్యుందాయ్ ఎలంట్రా మోడల్ పై రూ.1 లక్ష వరకు తగ్గింపు హ్యుందాయ్ ఆరా మోడల్ పై రూ.70 వేలు వరకు తగ్గింపు హ్యుందాయ్ నియోస్ మోడల్ పై రూ.60 వేలు వరకు తగ్గింపు హ్యుందాయ్ శాంట్రో(ఎంట్రీ లెవెల్) మోడల్ పై రూ.50 వేలు వరకు తగ్గింపు -
కొత్త కార్ల ‘పండుగ’!
రోనా కష్టకాలంలోనూ కొత్త కార్లు రోడెక్కడానికి సిద్ధమయ్యాయి. పండుగ సీజన్‌ను సెంటిమెంట్‌ను ఆసరా చేసుకొని ప్రముఖ కార్ల కంపెనీలు భారత మార్కెట్లోకి దాదాపు 12రకాల స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్స్(ఎస్యూవీ)మోడళ్లను విడుదల చేసేందుకు సిద్ధమయ్యాయి. భారత్‌లో ఈ ఆగస్ట్ 22న వినాయక చవితితో పండుగ సీజన్ ప్రారంభం కానుంది. సాధారణంగా కార్ల కంపెనీలు పండుగ సీజన్‌ను క్యాష్‌ను చేసుకునేందుకు తమ కొత్త మోడళ్లను మార్కెట్లోకి విడుదల చేస్తుంటాయి. ఈసారి కంపెనీలకు పండుగ సీజన్ మరింత కీలకం కానుంది. కరోనా అనంతరం కార్లకు పెరిగిన డిమాండ్‌తో పాటు అంటువ్యాధి కారణంగా ఏర్పడిన అంతరాయంతో ఈసారి విక్రయాలు భారీగా ఉండవచ్చని కంపెనీలు ఆశిస్తున్నాయి. హ్యుందాయ్ నుంచి 4 మోడళ్లు పండుగ సీజన్ సందర్భంగా హ్యుందాయ్ కంపెనీ ఎస్యూవీ విభాగంలో 4మోడళ్లను మార్కెట్లోకి విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. అందుకు అనుగుణంగా కంపెనీ తన ప్లాంట్లలో 3 షిఫ్టుల్లో కార్యకలాపాలను నిర్వహిస్తుంది. ‘‘ఈ ఆగస్ట్‌లో కంపెనీ నిర్వహణ సామర్థ్యం 90–92శాతంగా ఉంది. రానున్నరోజుల్లో మరింత పెంచే అవకాశం ఉంది. సెప్టెంబర్ నాటికి ప్రీ–కోవిడ్ స్థాయి ఉత్పత్తిని అందుకుంటాము’’ అని హ్యుందాయ్ మోటర్ ఇండియా తెలిపింది. టొయోటా నుంచి బడ్జెట్ కారు: దీపావళి పండుగ సందర్భంగా జపాన్‌కు చెందిన టొయోటా కిర్లోస్కర్ భారత మార్కెట్లోకి బడ్జెట్ కారును విడుదల చేయనుంది. ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీకి ’అర్బన్ క్రూయిజర్’ అనే పేరును ఖరారు చేసింది. ఈ మోడల్ కారు ధర రూ.8నుంచి రూ. 11లక్షల మధ్య ఉండొచ్చని పరిశ్రమ వర్గాల అం చనా. కొత్తగా కారును కొనాలనుకునేవారు ఈ మో డల్ పట్ల ఆకర్షితులవుతారని కంపెనీ ఆశిస్తోంది. కియా నుంచి కూడా... దక్షిణ కొరియా దిగ్గజం కియా మోటర్స్ కూడా వచ్చే సెప్టెంబర్‌లో కాంపాక్ట్ ఎస్యూవీ ‘సోనెట్’ను విడుదల చేయనుంది. భారత్‌లో సెల్టోస్, కార్నివాల్ తర్వాత ‘సోనెట్’ మూడో మోడల్ కావడం విశేషం. దేశీయ మార్కెట్లో హ్యుం దాయ్ వెన్యూ, మారుతీ విటారా బ్రెజా, టాటా నెక్సాన్, మహీంద్రా ఎక్స్‌యూవీ 300 మోడళ్లతో ఇది పోటీ పడే అవకాశం ఉంది. ఈ మోడల్ ధర రూ.7నుంచి రూ.12లక్షల మధ్య ఉండొచ్చు. ఆగస్ట్ 15న మహీంద్రా థార్ లాంచ్ దేశీయ యుటిలిటీ వాహన దిగ్గజం మహీంద్రా కంపెనీ తన కొత్త మోడల్ 2020 థార్ మోడల్ కారును ఆగస్ట్ 15న భారత మార్కెట్లో ఆవిష్కరించనుంది. ఈ ఏడాది ప్రారంభంలోనే విడుదల కావాల్సిన 2020 థార్ మోడల్ లాక్డౌన్ కారణంగా వాయిదా పడింది. ఈ థార్ మోడల్ కారు డీజిల్, పెట్రోల్ ఇంజన్ ఆప్షన్లో లభిస్తోంది. ఫ్రెంచ్ కార్ బ్రాండ్ రెనాల్ట్ సబ్–కాంపాక్ట్ విభాగంలో తన కొత్త మోడల్ కారును దీపావళికి విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంది. అలాగే ఎంజీ గ్లస్టర్, డస్టర్ ఎస్‌యూవీలు ఈ పండుగ సీజన్లో భారత్ మార్కెట్లోకి విడుదల కానున్నాయి. -
హ్యుందాయ్ ‘ఆరా’.. ఆగయా
చెన్నై: హ్యుందాయ్ మోటార్ కంపెనీ తన కొత్త కాంపాక్ట్ సెడాన్ ‘ఆరా’ను ఆవిష్కరించింది. ఈ సెడాన్‌ను వచ్చే నెలలో మార్కెట్లోకి ప్రవేశపెడతామని హ్యుందాయ్ ఇండియా తెలియజేసింది. ఈ సెగ్మెంట్లో ఎక్సెంట్ తర్వాత ఈ కంపెనీ అందిస్తున్న మరో కారు ఇది. స్పోర్ట్స్ యుటిలిటి వెహికల్ (ఎస్యూవీ), కాంపాక్ట్ హ్యాచ్‌బాక్ సెగ్మెంట్లలో మంచి అమ్మకాలు సాధిస్తున్నామని కంపెనీ ఎమ్డీ, సీఈఓ ఎస్.ఎస్. కిమ్ పేర్కొన్నారు. కాంపాక్ట్ సెడాన్ సెగ్మెంట్లో వెనకబడి ఉన్నామని, కొత్త ఆరా కారుతో ఆ సెగ్మెంట్లో కూడా మంచి అమ్మకాలు సాధించగలమని ఆయన ధీమా వ్యక్తంచేశారు. బీఎస్ 6 పర్యావరణ నిబంధనలకు అనుగుణంగా ఈ కారును రూపొందించామని, పెట్రోల్, డీజిల్ వేరియంట్లలో ఇది లభ్యమవుతుందని చెప్పారాయన. ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్, వైర్లెస్ చార్జింగ్, డ్రైవర్ రియర్ వ్యూ మానిటర్, స్వెప్ట్‌బ్యాక్ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్, బూమరాంగ్ షేప్‌లో ఉండే ఎల్ఈడీ డే రన్నింగ్ లైట్స్ తదితర ఫీచర్లున్నాయని తెలియజేశారు. కాగా ఈ కారు ధర వివరాలను కంపెనీ వెల్లడించలేదు. అయితే రూ.6 లక్షల నుంచి రూ.9 లక్షల (ఎక్స్‌షోరూమ్ ధరలు) శ్రేణిలో ఉండొచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక ఈ కారు మారుతీ డిజైర్, హోండా అమేజ్, ఫోక్స్‌వ్యాగన్ అమియో, ఫోర్డ్ ఆస్పైర్, టాటా టిగొర్, టొయోటా యారీలకు గట్టి పోటీనిస్తుందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.