హ్యుందాయ్ కంపెనీ భారతదేశంలో విడుదల చేయనున్న ఎక్స్‌టర్ SUV టీజర్లను గత కొన్ని రోజులుగా విడుదల చేస్తూనే ఉంది. అయితే ఇప్పుడు కంపెనీ ఈ కారుని అధికారికంగా వెల్లడించింది, అంతే కాకుండా బుకింగ్స్ కూడా ప్రారంభించింది. హ్యుందాయ్ ఎక్స్‌టర్ గురించి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.
బుకింగ్స్ & లాంచ్ టైమ్
హ్యుందాయ్ ఎక్స్‌టర్ బుక్ చేసుకోవాలనుకునే కస్టమర్లు ఇప్పుడు రూ. 11,000 చెల్లించి బుక్ చేసుకోవచ్చు. అయితే ఈ కారు 2023 జులై లేదా ఆగస్టు నెలలో లాంచ్ అయ్యే అవకాశం ఉంటుంది. డెలివరీలు ఆ తరువాత ప్రారంభమవుతాయి.
డిజైన్ & ఫీచర్స్
దేశీయ మార్కెట్లో విడుదలకానున్న కొత్త హ్యుందాయ్ ఎక్స్‌టర్ EX, S, SX, SX (O), SX(O) కెనెక్ట్ అనే ఐదు వేరియంట్లలో విడుదలకానుంది. ఇప్పటికే సౌత్ కొరియాలో టెస్టింగ్ దశలో ఉన్న ఈ కారు మంచి డిజైన్ కలిగి ఉంటుంది. అయితే ఇది రేంజర్ ఖాకీ అనే కొత్త కలర్‌లో లభించనుంది. ఇందులో H షేప్ ఎల్ఈడీ హెడ్ లాంప్, DRL, విశాలమైన ఫ్రంట్ ఫాసియా, డ్యూయెల్ టోన్ అల్లాయ్ వీల్స్, రూప్ రెయిల్స్ వంటివి ఉంటాయి.
రియర్ ప్రొఫైల్ కూడా చాలా ఆధునికంగా ఉంటుంది. టెయిల్ గేట్, షార్క్ ఫిన్ యాంటెన్నా, ఎల్ఈడీ టెయిల్ లాంప్ మొదలైనవి ఉంటాయి. కంపెనీ ఏ ఎస్‌యువి ఇంటీరియర్ ఫీచర్స్, డిజైన్ వంటి వాటిని గురించి అధికారికంగా వెల్లడించలేదు. కానీ ఇందులో ఆధునిక కాలంలో వినియోగదారునికి కావలసిన అన్ని ఫీచర్స్ అందుబాటులో ఉంటాయని భావిస్తున్నాము.
(ఇదీ చదవండి: జొమాటో సీఈఓ అద్భుతమైన కార్ల ప్రపంచం - చూద్దాం రండి!)
ఇంజిన్ & పర్ఫామెన్స్
హ్యుందాయ్ ఎక్స్‌టర్ ఎస్‌యువిలో 1.2 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ ఇంజిన్ ఉండనుంది. ఈ ఇంజిన్ ఇప్పటికే గ్రాండ్ ఐ10 నియోస్, ఆరా, వెన్యూ కార్లలో అందుబాటులో ఉంది. పర్ఫామెన్స్ ఫిగర్స్ ఇంకా వెల్లడికానప్పటికీ ఇది 83hp పవర్ 114Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుందని భావిస్తున్నాము. ఇంజిన్ 5 స్పీడ్ మ్యాన్యువల్ లేదా ఆటోమాటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్స్ పొందనుంది.
కంపెనీ ఈ ఎస్‌యువిని లాంచ్ చేసే సమయంలోనే ధరలను గురించి కూడా అధికారికంగా వెల్లడించనుంది. హ్యుందాయ్ ఎక్స్‌టర్ గురించి ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను, సందేహాలను మాతో పంచుకోండి.
Comments
Please login to add a commentAdd a comment