ఇండియన్ మార్కెట్లో ఎప్పటికప్పుడు కొత్త ఉత్పత్తులు విడుదలవుతూనే ఉన్నాయి. ఈ తరుణంలో ఇప్పటికే మంచి అమ్మకాలతో ముందుకు సాగుతున్న హ్యుందాయ్ కంపెనీ మరో కారుని దేశీయ విఫణిలో విడుదల చేయడానికి సన్నద్ధమవుతోంది. కంపెనీ ఈ కొత్త కారు టీజర్ కూడా విడుదల చేసింది.
హ్యుందాయ్ విడుదల చేయనున్న కొత్త కారు పేరు 'ఎక్స్‌టర్' (Exter). ఇది మైక్రో SUV విభాగంలో అడుగుపెట్టే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇప్పటికి విడుదలైన టీజర్ ప్రకారం ఇది మంచి డిజైన్ కలిగి ఉంటుందని స్పష్టంగా అర్థమవుతోంది. ఈ కారు 2023 జులై నాటికి ఉత్పత్తి దశకు చేరుకునే అవకాశం ఉంది.
హ్యుందాయ్ ఎక్స్‌టర్ భారతదేశం నుంచి ఇతర దేశాలకు ఎగుమతి అయ్యే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు భావిస్తున్నాయి. ఇది ప్రత్యేకమైన ఫ్రంట్-ఎండ్ డిజైన్ కలిగి ఉండటం వల్ల కంపెనీకి చెందిన ఇతర మోడల్స్ కంటే కూడా భిన్నంగా ఉంటుంది. H-ఆకారంలో ఉండే ఎల్ఈడీ DRLలతో స్ప్లిట్ హెడ్‌ల్యాంప్ సెటప్ చూడచక్కగా ఉంటుంది.
(ఇదీ చదవండి: కారు ఇన్సూరెన్స్ ప్రీమియం తగ్గించుకోవాలా.. ఈ టిప్స్ ఫాలో అవ్వండి!)
ఫ్రంట్ బంపర్, బంపర్ వెడల్పు అంతటా విస్తరించి ఉండే బ్లాక్ గ్రిల్ నిటారుగా, అడ్డంగా ఉండటం మీరు ఇందులో గమనించవచ్చు. రెండర్‌లో ఫాక్స్ సిల్వర్ స్కిడ్ ప్లేట్, ఫ్లేర్డ్ వీల్ ఆర్చ్‌లు విదేశీయ మార్కెట్లో అమ్ముడవుతున్న హ్యుందాయ్ క్యాస్పర్‌ని గుర్తుకు తెస్తుంది. డిజైన్ పరంగా ఇది ఐయోనిక్ 5కి అదగ్గరగా ఉన్నట్లు అనిపిస్తుంది.
కొత్త హ్యుందాయ్ ఎక్స్‌టర్ ఇంటీరియర్ ఫీచర్స్ గురించి ఎటువంటి అధికారిక వివరాలు వెల్లడి కాదు, కానీ ఇది గ్రాండ్ ఐ10 నియోస్ వంటి ఇంటీరియర్ పొందే అవకాశం ఉంది. అయితే ఇది బెస్ట్ గ్రౌండ్ క్లియరెన్స్, రీట్యూన్డ్ సస్పెన్షన్ వంటివి పొందనుంది.
(ఇదీ చదవండి: కంప్యూటర్ వద్దనుకున్నారు.. వంకాయ సాగు మొదలెట్టాడు - ఇప్పుడు సంపాదన చూస్తే..)
హ్యుందాయ్ ఎక్స్‌టర్ ఇంజిన్ వివరాలు కూడా ప్రస్తుతానికి అందుబాటులో లేదు. కానీ ఇందులో ఆరా, ఐ20, వెన్యూలోని 1.2 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ కలిగి 5-స్పీడ్ మాన్యువల్ & ఆటోమాటిక్ గేర్‌బాక్స్ ఉండే అవకాశం ఉంది. హ్యుందాయ్ కంపెనీ 2023 ఆగస్ట్‌లో 'ఎక్స్‌టర్'ని లాంచ్ చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. దీని ధర నియోస్ కంటే ఎక్కువగా ఉంటుందని అంచనా. ఈ కారు ఖచ్చితమైన ధరలు లాంచ్ సమయంలో వెల్లడవుతాయి.
Comments
Please login to add a commentAdd a comment