automobiles
-
నాలుగేళ్లలో 5 లక్షలమంది కొన్న కారు ఇదే
భారతీయ మార్కెట్లో అత్యంత సురక్షితమైన కారు.. 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ పొందిన వాహనాల జాబితాలో ఒకటైన 'టాటా పంచ్' (Tata Punch) తాజాగా.. అమ్మకాల్లో అరుదైన రికార్డ్ కైవసం చేసుకుంది. కేవలం 4 సంవత్సరాల్లో ఏకంగా 5 లక్షల సేల్స్ (Sales) మైలురాయిని దాటేసింది.టాటా పంచ్ 2021 అక్టోబర్‌లో ప్రారంభమైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు మొత్తం 5,04,679 మంది దీనిని కొనుగోలు చేసినట్లు సమాచారం. 2021లో 22,571 యూనిట్లు, 2022లో 1,29,895 యూనిట్లు, 2023లో 1,50,182 యూనిట్లు, 2024లో 2,02,031 యూనిట్ల సేల్స్ జరిగాయి. అంతే కాకుండా గత ఏడాది ఎక్కువమంది కొనుగోలు చేసిన కారుగా కూడా ఓ హిస్టరీ క్రియేట్ చేసింది.సింపుల్ డిజైన్, లేటెస్ట్ ఫీచర్స్ కలిగిన ఈ కారు కావలసినన్ని సేఫ్టీ ఫీచర్స్ పొందింది. ఇది ప్రస్తుతం పెట్రోల్, CNG, ఎలక్ట్రిక్ రూపాల్లో అమ్మకానికి ఉంది. ఈ కారు ధరలు రూ. 6.19 లక్షల నుంచి రూ. 14.44 లక్షల మధ్య ఉన్నాయి. అయితే ఈ అన్ని మోడల్స్.. ఉత్తమ సేఫ్టీ ఫీచర్స్ కలిగి ఉన్నాయి. -
ఐదు బెస్ట్ కార్లు: తక్కువ ధర & ఎక్కువ సేఫ్టీ!
ఓ కారును కొనాలంటే డిజైన్, మైలేజ్ చూస్తే సరిపోదు. అందులోని సేఫ్టీ ఫీచర్స్ కూడా చూడాలి. అంటే.. ఆ కారులో ఎన్ని ఎయిర్ బ్యాగులున్నాయి.. రియర్ కెమెరా వంటివి ఉన్నాయా? లేదా? అనే విషయాలు కూడా తప్పకుండా పరిశీలించాలి. ఇవన్నీ ఉన్న కారు కొనాలంటే ఎక్కువ డబ్బు ఖర్చు చేయాలేమో అనే అనుమానం మీకు రావచ్చు. కానీ ఈ కథనంలో తక్కువ ధర వద్ద.. 6 ఎయిర్ ఎయిర్‌బ్యాగ్‌లను కలిగిన టాప్ 5 కార్లను గురించి తెలుసుకుందాం.హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ (Hyundai Grand i10 Nios)ఇండియన్ మార్కెట్లో అధిక అమ్మకాలు పొందిన 'హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్' అన్ని వేరియంట్లలోనూ ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు లభిస్తాయి. ఈ కారు ధర రూ. 5.92 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఈ హ్యాచ్‌బ్యాక్ 1.2 లీటర్ ఇంజిన్ ద్వారా 82 Bhp పవర్, 114 Nm టార్క్ అందిస్తుంది. ఇది 5 స్పీడ్ మాన్యువల్ & ఆటోమాటిక్ గేర్‌బాక్స్ ఎంపికలను పొందుతుంది.హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ 6 ఎయిర్‌బ్యాగ్‌లతో పాటు ఏబీఎస్ విత్ ఈబీడీ, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, త్రీ పాయింట్ సీట్ బెల్ట్, రియర్ కెమెరా, రియర్ పార్కింగ్ సెన్సార్లు వంటి సేఫ్టీ ఫీచర్స్ ఉన్నాయి.నిస్సాన్ మాగ్నైట్ (Nissan Magnite)ఇటీవల ఫేస్‌లిఫ్ట్ రూపంలో మార్కెట్లో లాంచ్ అయిన నిస్సాన్ మాగ్నైట్ ధర రూ. 5.99 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఈ మోడల్ ఎంట్రీ-లెవల్ వేరియంట్ ఆరు ఎయిర్‌బ్యాగ్‌లను పొందుతుంది. ఇందులోని 1 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ ఇంజిన్ 71 Bhp, 96 Nm టార్క్ అందిస్తే.. 1 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ 99 Bhp పవర్, 160 Nm టార్క్ డెలివరీ చేస్తుంది. ఈ కారులో 360 డిగ్రీ కెమెరా, ఏబీఎస్ విత్ ఈబీడీ, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, త్రీ పాయింట్ సీట్ బెల్ట్, రియర్ కెమెరా, రియర్ పార్కింగ్ సెన్సార్లు మొదలైనవన్నీ ఉన్నాయి.మారుతి స్విఫ్ట్ (Maruti Swift)మారుతి సుజుకి కంపెనీకి చెందిన స్విఫ్ట్ గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే మారుతి కార్లను ఉపయోగిస్తున్న వారిలో చాలామంది ఈ 'స్విఫ్ట్' కారునే ఉపయోగిస్తున్నారు. దీని ప్రారంభ ధర రూ. 6.5 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఈ కారులో 5 స్పీడ్ మ్యాన్యువల్ లేదా ఆటోమాటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇది 6 ఎయిర్‌బ్యాగ్‌లతో పాటు ఏబీఎస్ విత్ ఈబీడీ, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, త్రీ పాయింట్ సీట్ బెల్ట్, రియర్ కెమెరా, రియర్ పార్కింగ్ సెన్సార్లు వంటి సేఫ్టీ ఫీచర్స్ పొందుతుంది.ఇదీ చదవండి: అంబానీ ఇంటికి కొత్త అతిథి.. ఇది చాలా స్పెషల్!హ్యుందాయ్ ఎక్స్టర్ (Hyundai Exter)హ్యుందాయ్ కంపెనీకి చెందిన కాంపాక్ట్ ఎస్యూవీ ఎక్స్టర్.. ఆరు ఎయిర్‌బ్యాగ్‌లను పొందుతుంది. ఈ కారు ప్రారంభ ధర రూ. 5.99 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఇది డాష్‌క్యామ్, వెహికల్ స్టెబిలిటీ మేనేజ్మెంట్, ఏబీఎస్ విత్ ఈబీడీ వంటి అనేక సేఫ్టీ ఫీచర్స్ పొందుతుంది. ఇందులోని 1.2 లీటర్ ఇంజిన్ మంచి పనితీరును అందిస్తుంది.సిట్రోయెన్ సీ3 (Citroen C3)రూ. 6.16 లక్షల ఎక్స్ షోరూమ్ వద్ద లభించే 'సిట్రోయెన్ సీ3' కూడా ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు పొందుతుంది. ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు ఫీల్ (ఓ), షైన్ వేరియంట్లలో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఎయిర్‌బ్యాగ్‌లు కాకుండా ఇందులో ఈబీఎస్ విత్ ఈబీడీ, ఎలక్ట్రానిక్ స్పెబిలిటీ ప్రోగ్రామ్, హిల్ హోల్డ్ అసిస్ట్, డే-నైట్ ఐవీఆర్ఎం వంటివి కూడా ఉన్నాయి. -
తక్కువ ధర.. ఎక్కువ మైలేజ్: ఇదిగో టాప్ 5 బైకులు
మార్కెట్లో లక్ష రూపాయల నుంచి రూ.70 లక్షల వరకు బైకులు అందుబాటులో ఉన్నాయి. అయితే.. చాలామంది ధరను మాత్రమే కాకుండా మైలేజ్‌ను దృష్టిలో ఉంచుకుని టూ వీలర్స్ కొనుగోలు చేస్తున్నారు. ఈ కథనంలో ఎక్కువ మైలేజ్ ఇచ్చే టాప్ 5 బైకులు గురించి వివరంగా తెలుసుకుందాం.బజాజ్ ఫ్రీడమ్ 125'బజాజ్ ఫ్రీడమ్ 125' అనేది ప్రపంచంలోనే మొట్టమొదటి సీఎన్జీ బైక్. దీని ధర రూ.89,997 నుంచి రూ. 1.09 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య ఉంది. ఈ బైకులోని 125 సీసీ ఇంజిన్ 9.3 బిహెచ్పీ పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. అయితే ఇందులో సీఎన్జీ, పెట్రోల్ కోసం రెండు ఫ్యూయల్ ట్యాంకులు ఉంటాయి. ఈ బైక్ 65 కిమీ/లీ మైలేజ్ ఇస్తుందని సమాచారం.టీవీఎస్ స్టార్ సిటీ ప్లస్ఎక్కువ మైలేజ్ ఇచ్చే బైకుల జాబితాలో 'టీవీఎస్ స్టార్ సిటీ ప్లస్' ఒకటి. ఈ బైక్ ధరలు రూ. 75541 నుంచి రూ. 78541 (ఎక్స్ షోరూమ్) మధ్య ఉన్నాయి. ఈ బైకులో ఎకోథ్రస్ట్ ఫ్యూయల్ ఇంజెక్షన్ (ETFi) టెక్నాలజీ ఉంది. కాబట్టి ఇది సాధారణ మోడల్ కంటే కూడా ఎక్కువ పనితీరును అందిస్తుంది. ఈ బైకులోని 110 సీసీ ఇంజిన్ 8 బీహెచ్పీ పవర్, 8.7 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇది 86 కిమీ/లీ మైలేజ్ అందిస్తుంది.బజాజ్ ప్లాటినా 110రూ. 71,354 (ఎక్స్ షోరూమ్) ధర వద్ద లభిస్తున్న బజాజ్ ప్లాటినా 110 బైక్ 70 కిమీ/లీ మైలేజ్ అందిస్తుంది. ఇందులోని 115 సీసీ ఇంజిన్ 8.4 బీహెచ్పీ పవర్, 9.8 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ బైకులో ఎల్ఈడీ డీఆర్ఎల్, హ్యాండ్ గార్డ్లు, వైడ్ ఫుట్‌పెగ్‌లు, 5 స్పీడ్ గేర్‌బాక్స్ వంటివి ఉన్నాయి.హోండా సీడీ 110 డ్రీమ్ డీలక్స్హోండా సీడీ 110 డ్రీమ్ డీలక్స్ కూడా ఎక్కువ మైలేజ్ ఇచ్చే బైకుల జాబితాలో ఒకటి. రూ. 74401 (ఎక్స్ షోరూమ్) వద్ద లభిస్తున్న ఈ బైక్ 110 సీసీ ఇంజిన్ పొందుతుంది. ఇది జపనీస్ ఎన్హాన్స్డ్ స్మార్ట్ పవర్ (ESP) టెక్నాలజీ పొందుతుంది. కాబట్టి ఉత్తమ పనితీరును అందిస్తుంది. ఈ బైక్ మైలేజ్ 65 కిమీ/లీ అని తెలుస్తోంది.ఇదీ చదవండి: 10 రోజుల్లో 10000 మంది కొన్న కారు ఇదే..హీరో స్ప్లెండర్ ప్లస్భారతదేశంలో ఎక్కువమంది కొనుగోలు చేస్తున్న బైకుల జాబితాలో ప్రధానంగా చెప్పుకోదగ్గ బైక్ హీరో స్ప్లెండర్ ప్లస్. ఈ బైక్ ధరలు రూ. 75441 నుంచి రూ. 78286 మధ్య ఉన్నాయి. 100 సీసీ ఇంజిన్, ఐ3ఎస్ టెక్నాలజీ కలిగిన ఈ బైక్ 80.6 కిమీ/లీ మైలేజ్ అందిస్తుంది. కాబట్టి దీనిని మైలేజ్ రాజు అని కూడా పిలుస్తారు. -
2025 కవాసకి కొత్త బైక్.. రేటెంతో తెలుసా?
కవాసకి ఇండియా తన జెడ్ఎక్స్-4ఆర్ఆర్ బైకును కొత్త కలర్ ఆప్షన్లో లాంచ్ చేసింది. దీని ధర రూ. 9.42 లక్షలు (ఎక్స్ షోరూమ్, ఇండియా). ఇది ఇప్పుడు లైమ్ గ్రీన్/ఎబోనీ/బ్లిజార్డ్ వైట్ అనే కొత్త రంగులో అందుబాటులో ఉంది. ఈ కొత్త బైక్ 2024 మోడల్ కంటే రూ. 32,000 ఖరీదైనది.కవాసకి నింజా జెడ్ఎక్స్-4ఆర్ఆర్ బైక్ 399సీసీ లిక్విడ్-కూల్డ్, ఇన్లైన్-ఫోర్ ఇంజన్ పొందుతుంది. ఇది 14500 rpm వద్ద 77 Bhp పవర్, 13000 rpm వద్ద 39 Nm టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ గేర్‌బాక్స్‌తో లభిస్తుంది.2025 కవాసకి నింజా జెడ్ఎక్స్-4ఆర్ఆర్ ట్విన్ ఎల్ఈడీ హెడ్‌లైట్స్, అప్స్వెప్ట్ టెయిల్ లాంప్, టెన్సిల్ స్టీల్ ట్రేల్లిస్ ఫ్రేమ్ వంటివి పొందుతుంది. యూఎస్డీ ఫోర్క్, బ్యాక్-లింక్ మోనోషాక్ కలిగిన ఈ బైక్ 17 ఇంచెస్ వీల్స్ కలిగి ఉంటుంది. సుమారు 189 కేజీల బరువున్న కొత్త కవాసకి బైక్ గ్రౌండ్ క్లియరెన్స్ 135 మిమీ.నింజా జెడ్ఎక్స్-4ఆర్ఆర్ బైక్ స్పోర్ట్, రోడ్, రెయిన్ లేదా కస్టమ్ అనే నాలుగు రైడ్ మోడ్‌లను పొందుతుంది. ట్రాక్షన్ కంట్రోల్, డ్యూయెల్ ఛానల్ ఏబీఎస్, కలర్డ్ టీఎఫ్టీ డిస్ప్లే వంటివి కూడా ఈ బైకులో చూడవచ్చు. ఇది కేవలం పరిమిత సంఖ్యలో మాత్రమే అందుబాటులో ఉంటాయి. కంపెనీ అధికారిక డీలర్‌షిప్‌లలో బుకింగ్‌లను స్వీకరించడం ప్రారంభించింది. -
టయోటా లాంచ్ చేసిన మరో ఫెస్టివ్ ఎడిషన్ ఇదే..
టయోటా కంపెనీ గ్లాన్జా, టైసర్, హైరైడర్ ఫెస్టివల్ ఎడిషన్లను లాంచ్ చేసింది. ఇప్పుడు తాజాగా రూమియన్ ఫెస్టివ్ ఎడిషన్ లాంచ్ చేసింది. ఈ కారు కొనుగోవులు చేసేవారు ఎటువంటి అదనపు ఖర్చులు లేకుండానే రూ. 20608 విలువైన యాక్సెసరీలను పొందవచ్చు.టయోటా రూమియన్ ఫెస్టివ్ ఎడిషన్ మడ్ ఫ్లాప్‌లు, మ్యాట్లు, క్రోమ్ డోర్ వైజర్, స్పాయిలర్ వంటి వాటిని పొందుతుంది. అంతే కాకుండా టెయిల్‌గేట్, రియర్ బంపర్, హెడ్‌ల్యాంప్, నంబర్ ప్లేట్, బాడీ మౌల్డింగ్లకు గార్నిష్‌లు ఉన్నాయి. ఈ కొత్త యాక్ససరీస్ వల్ల కారు మరింత అద్భుతంగా కనిపిస్తుంది.టయోటా రూమియన్ దాని మునుపటి మోడల్లోని 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్ పొందుతుంది. ఇది 102 Bhp పవర్, 138 Nm టార్క్ అందిస్తుంది. ఇది 5 స్పీడ్ మాన్యువల్ లేదా 6 స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ అప్షన్స్ పొందుతుంది. ఈ ఫెస్టివల్ ఎడిషన్ ఎస్, జీ, వీ ట్రిమ్‌లలో మాత్రమే కాకుండా CNG రూపంలో కూడా అందుబాటులో ఉంది.ఇదీ చదవండి: టయోటా టైజర్ లిమిటెడ్ ఎడిషన్.. మంచి ఆఫర్‌తో..మార్కెట్లో లాంచ్ అయిన కొత్త టయోటా రూమియన్ ప్రధానంగా మారుతి సుజుకి ఎర్టిగా, కియా కారెన్స్, హ్యుందాయ్ అల్కాజార్ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది. అయితే ఇది ఫెస్టివ్ ఎడిషన్ కాబట్టి మంచి అమ్మకాలను పొందుతుందని భావిస్తున్నాము. అయితే ఈ కారు ఎప్పటి వరకు మార్కెట్లో విక్రయానికి ఉంటుందనేది తెలియాల్సి ఉంది. -
మొదటిసారి కారు కొన్నవారు ఇంతమందా?
కరోనా మహమ్మారి తరువాత చాలామంది సొంత వాహనం కలిగి ఉండాలనే ఉద్దేశ్యంతో వాహనాలను కొనుగోలు చేస్తున్నారు. దీంతో ఆటోమొబైల్ మార్కెట్ మూడు పువ్వులు ఆరు కాయలుగా విరాజిల్లుతోంది. మొదటిసారి కార్లను కొనుగోలు చేసినవారు 67 శాతం మంది ఉన్నట్లు రిటైల్ ప్లాట్‌ఫారమ్ స్పిన్నీ ఒక నివేదికలో వెల్లడించింది.మొదటిసారి వాహనం కొనుగోలు చేసిన మొత్తం 67 శాతం మందిలో 30 శాతం మహిళలే ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఇందులో కూడా 80 శాతం మంది పెట్రోల్ కార్లను కొనుగోలు చేశారు. డీజిల్ కార్ల కొనుగోలుకు కేవలం 12 శాతం మంది మాత్రమే ఆసక్తి చూపినట్లు తెలుస్తోంది. ఐదు శాతం కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (CNG) మోడల్ ఎంచుకున్నారు.కొత్త వాహనాలను కొనుగోలు చేసినవారిలో చాలామంది వైట్, రెడ్, గ్రే కలర్స్ ఎంచుకున్నారు. సుమారు 60 శాతంమంది ఫైనాన్సింగ్ ద్వారా కార్లను కొనుగోలు చేసినట్లు సమాచారం. డెలివరీల విషయానికి వస్తే.. 82 శాతం మంది డీలర్షిప్స్ నుంచి డెలివరీ తీసుకున్నట్లు, 18 శాతం మంది హోమ్ డెలివరీ ద్వారా డెలివరీ తీసుకున్నట్లు తెలుస్తోంది.ఇదీ చదవండి: కోటి మంది కొన్న హోండా స్కూటర్ ఇదే..ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. 76 శాతం మంది మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఆప్షన్ కలిగిన కార్లను కొనుగోలు చేశారు. ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఆప్షన్ వాహనాలను కొనుగోలు చేసినవారు 24 శాతం మంది మాత్రమే. దీన్ని బట్టి చూస్తే.. టెక్నాలజీ పెరిగినప్పటికీ.. మాన్యువల్ ట్రాన్స్మిషన్ వాహనాలనే కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది.కొత్త వాహనాల అమ్మకాలు ఢిల్లీలో ఎక్కువగా ఉన్నాయి. ఆ తరువాత స్థానంలో బెంగళూరు, ముంబై ఉన్నాయి. ప్రస్తుతం ప్రపంచ ఆటోమొబైల్ భారత్ మూడో స్థానంలో ఉంది. నేడు మన దేశంలో చైనా, జపాన్, జర్మన్ వంటి అనేక దేశాల బ్రాండ్స్ కూడా గొప్ప అమ్మకాలను పొందుతున్నాయి. -
హోండా బైకులకు రీకాల్: జాబితాలోని మోడల్స్ ఇవే..
ప్రముఖ టూ వీలర్ తయారీ సంస్థ 'హోండా మోటార్‌సైకిల్ & స్కూటర్ ఇండియా' తన సీబీ350, హైనెస్ సీబీ350 బైకులకు రీకాల్ ప్రకటించింది. వీల్ స్పీడ్ సెన్సార్, క్యామ్‌షాఫ్ట్ సమస్యల కారణంగానే ఈ రీకాల్ ప్రకటించినట్లు కంపెనీ వెల్లడించింది.2020 అక్టోబర్ నుంచి 2024 ఏప్రిల్ మధ్య తయారైన సీబీ300ఎఫ్, సీబీ300ఆర్, సీబీ350, హైనెస్ సీబీ350, సీబీ350ఆర్ఎస్ బైకులకు కంపెనీ రీకాల్ ప్రకటించింది. ఇప్పటి వరకు ఈ బైకులలో ఎలాంటి సమస్య తలెత్తలేదు, కానీ కంపెనీ ముందుగానే ఈ నిర్ణయం తీసుకుంది.వీల్ స్పీడ్ సెన్సార్‌లో ఉన్న సమస్య వల్ల అందులోని నీరు ప్రవేశించే అవకాశం ఉంది. ఇది స్పీడోమీటర్, ట్రాక్షన్ కంట్రోల్, ఏబీఎస్ వంటి వాటిమీద ప్రభావం చూపే అవకాశం ఉంది. కాబట్టి ఈ సమస్యను రీకాల్ ద్వారా పరిష్కరించడానికి కంపెనీ సిద్ధమైంది.ఇదీ చదవండి: 809కిమీ రేంజ్ అందించే బెంజ్ కారు లాంచ్: ధర ఎంతంటే? ఇక క్యామ్‌షాఫ్ట్ కాంపోనెంట్‌తో వచ్చే సమస్యలు.. వెహికల్ పనితీరు మీద ప్రభావితం చూపుతాయి. కాబట్టి 2020 అక్టోబర్ నుంచి 2024 ఏప్రిల్ మధ్య తయారైన.. కంపెనీ వెల్లడించిన బైకులకు సంస్థ ఉచితంగానే సమస్యను పరిష్కరిస్తుంది. వాహనం వారంటీతో సంబంధం లేకుండా సమస్యకు కారణమైన భాగాలను కంపెనీ ఉచితంగానే రీప్లేస్ చేస్తుంది. -
ఎలక్ట్రిక్ వాహన వినియోగదారులకు ఊరట
భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించేందుకు కేంద్ర మంత్రివర్గం కొత్త పథకానికి ఆమోదం తెలిపింది. ఈ కొత్త స్కీమ్ పేరు ''పీఎం ఎలక్ట్రిక్ డ్రైవ్ రివల్యూషన్ ఇన్ ఇన్నోవేటివ్ వెహికల్ ఎన్హాన్స్మెంట్'' (PM E-DRIVE). ఇది మార్చి వరకు తొమ్మిదేళ్లపాటు అమలులో ఉన్న ప్రస్తుత 'ఫేమ్' ప్రోగ్రామ్‌ను భర్తీ చేస్తుంది.ఈ కొత్త పథకం ద్వారా ఎలక్ట్రిక్ కార్లకు ఎటువంటి సబ్సిడీలు లభించదు. కానీ ఎలక్ట్రిక్ టూ వీలర్స్, త్రీ వీలర్స్, బస్సులకు సబ్సిడీ లభించే అవకాశం ఉంది. దీనికోసం కేంద్రం రెండేళ్లకు రూ. 10900 కోట్లు కేటాయించారు. ఇందులో హైబ్రిడ్ అంబులెన్స్‌లు, ఎలక్ట్రిక్ ట్రక్కులకు కూడా కొంత ప్రోత్సాహాలు లభిస్తాయి.పీఎం ఈ-డ్రైవ్ స్కీమ్ కింద 88500 ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జర్లను ఏర్పాటు చేయనున్నట్లు సమాచార, ప్రసార శాఖ మంత్రి 'అశ్విని వైష్ణవ్' ప్రకటించారు. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో పీఎం ఈ-డ్రైవ్ స్కీమ్‌పై నిర్ణయం తీసుకున్నట్లు వైష్ణవ్ విలేకరులతో చెప్పారు.రాష్ట్ర రవాణా సంస్థలు & ప్రజా రవాణా సంస్థల ద్వారా 14,028 ఎలక్ట్రిక్ బస్సుల సేకరణకు రూ.4,391 కోట్లు అందించారు. ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నై, అహ్మదాబాద్, సూరత్, బెంగళూరు, పూణె, హైదరాబాద్‌ల వంటి 40 లక్షల కంటే ఎక్కువ జనాభా ఉన్న తొమ్మిది నగరాల్లో CESL ద్వారా డిమాండ్ అగ్రిగేషన్ చేయనున్నారు. రాష్ట్రాలతో సంప్రదించిన తరువాత ఇంటర్సిటీ, ఇంటర్‌స్టేట్ ఎలక్ట్రిక్ బస్సులకు కూడా మద్దతు లభిస్తుంది.ఎలక్ట్రిక్ అంబులెన్స్‌ల ఏర్పాటు చేయడానికి కేంద్రం రూ.500 కోట్లు కేటాయించింది. రోగుల రవాణా కోసం ఎలక్ట్రిక్ అంబులెన్స్ వినియోగాన్ని ప్రోత్సహించడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఎలక్ట్రిక్ ట్రక్కుల ప్రోత్సహించేందుకు కూడా రూ.500 కోట్లు అందించారు.ఛార్జింగ్ స్టేషన్స్ ఇన్స్టాలేషన్స్భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలను ఇప్పటికి కూడా చాలామంది కొనుగోలు చేయకపోవడానికి ప్రధాన కారణం.. ఛార్జింగ్ సదుపాయాలు లేకపోవడమే. దీనిని దృష్టిలో ఉంచుకుని కేంద్రం ఛార్జింగ్ స్టేషన్స్ కూడా ఏర్పాటు చేయనుంది. ఎంపిక చేసిన నగరాల్లో ఛార్జింగ్ స్టేషన్స్ ఇన్స్టాల్ చేయనున్నారు. ఇందులో ఎలక్ట్రిక్ ఫోర్-వీలర్స్ కోసం 22,100 ఫాస్ట్ ఛార్జర్లు, ఈ-బస్సుల కోసం 1,800 ఫాస్ట్ ఛార్జర్లు, టూ వీలర్ & త్రీ వీలర్స్ కోసం 48400 ఫాస్ట్ ఛార్జర్లను ఇన్స్టాల్ చేయనున్నట్లు సమాచారం. దీనికోసం రూ. 2000 కోట్లు వెచ్చించారు. -
భారత్‌లో జపనీస్ బ్రాండ్ కారు లాంచ్: ధర రూ. 69.70 లక్షలు
ప్రముఖ కార్ల తయారీ సంస్థ లెక్సస్ ఇండియా.. భారతీయ మార్కెట్లో 'ఈఎస్ లగ్జరీ ప్లస్ ఎడిషన్' లాంచ్ చేసింది. ఈ కారు ధర రూ. 69.70 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఇది సెల్ఫ్ ఛార్జింగ్ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ పవర్‌ట్రెయిన్ పొందుతుంది.లెక్సస్ ఈఎస్ లగ్జరీ ప్లస్ ఎడిషన్ కొత్త సిల్వర్ గ్రిల్, రియర్ ల్యాంప్ క్రోమ్ గార్నిష్, ఎల్ఈడీ లైట్ లెక్సస్ లోగోతో కూడిన ఇల్యూమినేటెడ్ స్కఫ్ ప్లేట్, లోగో ల్యాంప్, రియర్ సీట్ పిల్లో వంటి ఫీచర్స్ పొందుతుంది. కంపెనీ లాంచ్ చేసిన ఈ కారు మీద 8 సంవత్సరాలు / 160000 కిమీ వారంటీ అందిస్తుంది. కస్టమర్లు 5 సంవత్సరాల వరకు రోడ్‌సైడ్ అసిస్టెన్స్ కూడా పొందవచ్చు.లెక్సస్ కొత్త కారు లాంచ్ చేసిన సందర్భంగా కంపెనీ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ తన్మయ్ భట్టాచార్య మాట్లాడుతూ.. రాబోయే పండుగ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని కొత్త ఎడిషన్ లాంచ్ చేయడం ఆనందంగా ఉంది. ఇది లేటెస్ట్ డిజైన్, ఫీచర్స్ పొందుతుంది. పనితీరు కూడా చాలా ఉత్తమంగా ఉంటుందని ఆయన అన్నారు.2024 ప్రథమార్థంలో, జపనీస్ కార్ల తయారీ కంపెనీ లెక్సస్ భారతదేశంలో 55 శాతం ఈఎస్ కార్లను విక్రయించింది. ఇప్పుడు ఇందులో లగ్జరీ ప్లస్ ఎడిషన్ లాంచ్ చేసింది. ఇది కూడా మనషి మంచి అమ్మకాలు పొందుతుందని భావిస్తున్నారు. -
భారత్‌లో టాటా కర్వ్ లాంచ్: ధర & వివరాలు
టాటా మోటార్స్ దేశీయ మార్కెట్లో కర్వ్ పెట్రోల్, డీజిల్ వేరియంట్లను లాంచ్ చేసింది. ఇవి మొత్తం ఎనిమిది వేరియంట్లలో అందుబాటులో ఉన్నాయి. పెట్రోల్ వేరియంట్స్ ప్రారంభ ధర రూ. 10 లక్షల నుంచి రూ. 17.5 లక్షలు. డీజిల్ వేరియంట్స్ ధరలు రూ. 11.5 లక్షల నుంచి రూ. 17.7 లక్షల (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్) మధ్య ఉన్నాయి.కొత్త టాటా కర్వ్ 1.2 లీటర్ త్రీ సిలిండర్ టర్బో పెట్రల్, 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్, 1.2 లీటర్ టర్బో పెట్రోల్ అనే మూడు ఇంజిన్ ఆప్షన్స్ పొందుతుంది. మూడు ఇంజన్లు 7-స్పీడ్ డ్యూయల్-క్లచ్ ఆటోమేటిక్ ఆప్షన్‌తో పాటు 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో స్టాండర్డ్‌గా వస్తాయి. ఇది భారతదేశంలో డ్యూయల్-క్లచ్ గేర్‌బాక్స్ పొందిన ఏకైక డీజిల్ కారుగా నిలిచింది.టాటా కర్వ్ కారు లేటెస్ట్ డిజైన్ పొందుతుంది. ఇందులో ఫోర్ స్పోక్ స్టీరింగ్ వీల్ ఉంటుంది. ఇది 18 ఇంచెస్ అల్లాయ్ వీల్స్, ఫ్లష్ డోర్ హ్యాండిల్స్, 12.3 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, ఫుల్లీ డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే, పనోరమిక్ సన్‌రూఫ్, రిక్లైనింగ్ రియర్ సీటు, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు వంటివి పొందుతుంది.సేఫ్టీ ఫీచర్స్ విషయానికి వస్తే.. టాటా కర్వ్ ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, లెవెల్ 2 ఏడీఏఎస్, ఈసీఎస్, డిస్క్ బ్రేక్‌లు, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టం, 360 డిగ్రీ కెమెరా, ఆటో-హోల్డ్‌తో కూడిన ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ వంటివన్నీ పొందుతుంది. ఈ కొత్త కారు సిట్రోయెన్ బసాల్ట్ కారుకు ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది. -
లాంచ్‌కు సిద్ధమవుతున్న జర్మన్ బ్రాండ్ కారు
జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ 'ఆడి' కొత్త తరం 'క్యూ5' కారును ఆవిష్కరించింది. ఇది ప్రీమియం ప్లాట్‌ఫారమ్ కంబస్షన్ (PPC) ఆధారంగా తయారైన బ్రాండ్ మొదటి వెహికల్. ఈ కారు వచ్చే ఏడాది దేశీయ విఫణిలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.కొత్త ఆడి క్యూ5 మ్యాట్రిక్స్ ఎల్ఈడీ హెడ్‌లైట్స్, అప్డేటెడ్ ఫ్రంట్ బంపర్, చిన్న గ్రిల్, వెనుకవైపు కనెక్టెడ్ ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్స్, డ్యూయల్ టోన్ బంపర్ వంటివి పొందుతుంది. ఇంటీరియర్ డిజైన్ ఆడి క్యూ6 ఈ-ట్రాన్ మాదిరిగా ఉంటుంది.కొత్త తరం ఆడి క్యూ5 11.9 ఇంచెస్ డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే, 14.5 ఇంచెస్ టచ్‌స్క్రీన్, త్రీ-స్పోక్ స్టీరింగ్ వంటివి కలిగి ఉంటుంది. ఇది మూడు పవర్‌ట్రెయిన్ ఎంపికలతో అందుబాటులో ఉంది. అవి 2.0 లీటర్ ఫోర్ సిలిండర్ టర్బో పెట్రోల్, 2.0 లీటర్ ఫోర్ సిలిండర్ డీజిల్, 3.0 లీటర్ వీ6 టర్బో పెట్రోల్ ఇంజిన్స్.ఆడి క్యూ5 కారు ఈ నెల చివరినాటికి జర్మనీలో, ఆ తరువాత యూరప్‌లోని ఇతర దేశాలలో లాంచ్ అవుతుంది. 2025 మొదటి త్రైమాసికంలో డెలివరీలు ప్రారంభమవుతాయి. ఇది భారతీయ మార్కెట్లో వచ్చే ఏడాది లాంచ్ అవుతుందని సమాచారం. కంపెనీ దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెల్లడించాల్సి ఉంది.భారతదేశంలో లాంచ్ అయిన తరువాత, ఆడి క్యూ5 కారు ఇప్పటికే విక్రయానికి ఉన్న మెర్సిడెస్ బెంజ్ జీఎల్సీ, వోల్వో ఎక్స్‌సీ60 వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది. ఈ కారు ధర రూ. 65 లక్షల కంటే ఎక్కువ ఉండే అవకాశం ఉంది. అధికారిక ధరలు లాంచ్ సమయంలో వెల్లడవుతాయి. -
రూ.1.15 లక్షల ఎలక్ట్రిక్ స్కూటర్: 137 కిమీ రేంజ్
ప్రముఖ టూ వీలర్ తయారీ సంస్థ 'బజాజ్ ఆటో'.. చేతక్ బ్లూ 3202 ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ చేసింది. రూ. 1.15 లక్షల (ఎక్స్ షోరూమ్) ధర వద్ద లాంచ్ అయిన ఈ కొత్త స్కూటర్ బ్రూక్లిన్ బ్లాక్, సైబర్ వైట్, ఇండిగో మెటాలిక్, మాట్ కోర్స్ గ్రే అనే నాలుగు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.బజాజ్ ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. రూ.2000 చెల్లించి స్కూటర్ బుక్ చేసుకోవచ్చు. చేతక్ 3202 ఈవీ 3.2 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ పొందుతుంది. చూడటానికి ఇది ప్రీమియం వేరియంట్ మాదిరిగా అనిపిస్తుంది. ఒక ఫుల్ చార్జితో 137 కిమీ రేంజ్ అందిస్తుంది.బజాజ్ చేతక్ బ్లూ 3202 ఎలక్ట్రిక్ స్కూటర్ ఎల్ఈడీ హెడ్‌లైట్, ఓటీఏ అప్డేట్లు, యూఎస్బీ ఛార్జింగ్ పోర్ట్, రివర్స్ ఫంక్షన్స్, స్మార్ట్ కీతో పాటు ఎకో-రైడింగ్ మోడ్ వంటివి పొందుతుంది. అంతే కాకుండా ఇందులో హిల్ హోల్డ్ అసిస్ట్ మరియు రోల్-ఓవర్ డిటెక్షన్ కూడా ఉంటాయి. ఇది ఓలా ఎస్1 ప్రో, టీవీఎస్ ఐక్యూబ్ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది. -
సెప్టెంబర్‌లో లాంచ్ అయ్యే ఎలక్ట్రిక్ కార్లు
పండుగ సీజన్లో దేశీయ మార్కెట్లో లాంచ్ కావడానికి కొత్త ఎలక్ట్రిక్ కార్లు సిద్ధమవుతున్నాయి. ఇందులో మెర్సిడెస్ మేబ్యాచ్ ఈక్యూఎస్, ఎంజీ విండ్సర్ ఈవీ, బీవైడీ ఈ6 ఫేస్‌లిఫ్ట్ ఉన్నాయి. త్వరలో లాంచ్ కానున్న ఈ కొత్త కార్ల గురించి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.మెర్సిడెస్ మేబ్యాచ్ ఈక్యూఎస్జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ తన మేబ్యాచ్ ఈక్యూఎస్ లాంచ్ చేయడానికి సిద్ధమవుతోంది. ఇది అత్యంత ఖరీదైన కార్ల జాబితాలో ఒకటిగా నిలువనుంది. సరికొత్త ఈక్యూఎస్ సీబీయూ మార్గం ద్వారా భారతదేశానికి రానుంది. కాబట్టి దీని ధర కొంత ఎక్కువగానే ఉంటుందని తెలుస్తోంది.మెర్సిడెస్ మేబ్యాచ్ ఈక్యూఎస్ ప్రత్యేకమైన కలర్ ఆప్షన్ కలిగి ఒక సింగిల్ చార్జితో 600 కిమీ రేంజ్ అందించేలా రూపొందించారు. ఇందులోని ఎలక్ట్రిక్ మోటార్ 649 Bhp పవర్, 950 Nm టార్క్ అందిస్తుంది. ఈ కారు 4.4 సెకన్లలో 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. దీని టాప్ స్పీడ్ గంటకు 210 కిమీ.ఎంజీ విండ్సర్ ఈవీసెప్టెంబర్ 11న ఎంజీ విండ్సర్ ఈవీ లాంచ్ కానుంది. ఇది మార్కెట్లో అడుగుపెట్టనున్న కంపెనీ మూడో ఎలక్ట్రిక్ కారు. లాంచ్ తరువాత బుకింగ్స్ ప్రారంభమవుతాయని సమాచారం. దీని ధర రూ. 20 లక్షల లోపు ఉండే అవకాశం ఉంది. ఈ ఎలక్ట్రిక్ కారు ఇప్పటికే పలుమార్లు టెస్టింగ్ సమయంలో కనిపించింది.త్వరలో లాంచ్ కానున్న కొత్త ఎంజీ విండ్సర్ ఈవీ.. కొత్త డిజైన్, అప్డేటెడ్ ఫీచర్స్ పొందుతుంది. ఇందులో ఒక పెద్ద 15.6 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, 135-డిగ్రీల రిక్లైనింగ్ ఫంక్షన్లతో రియర్ సీట్లు, 360 డిగ్రీల సరౌండ్ వ్యూ కెమెరా, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, యాంబియంట్ లైటింగ్, ఫుల్లీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ మొదలైన ఫీచర్స్ ఉన్నాయి.బీవైడీ ఈ6 ఫేస్లిఫ్ట్బీవైడీ ఈ6 ఫేస్‌లిఫ్ట్ వచ్చే నెలలో లాంచ్ కానుంది. ఈ6 ఎలక్ట్రిక్ ఎమ్‌పివి ఇటీవలే గ్లోబల్ మార్కెట్లో ఎం6గా లాంచ్ అయింది. కంపెనీ ఈ కారుకు సంబంధించిన టీజర్‌ను ఇప్పటికే రిలీజ్ చేసింది. ఈ కొత్త కారు 55.4 కిలోవాట్, 71.8 కిలోవాట్ బ్యాటరీ ఫ్యాక్స్ ఉంటాయి. ఇవి వరుసగా 420 కిమీ, 530 కిమీ రేంజ్ అందిస్తాయి. -
భారత్‌లో మరో మసెరటి కారు లాంచ్: ధర ఎంతో తెలుసా?
ప్రముఖ వాహన తయారీ సంస్థ 'మసెరటి'.. భారతీయ మార్కెట్లో సెకండ్ జనరేషన్ 'గ్రాన్టూరిస్మో' (GranTurismo) లాంచ్ చేసింది. ఈ కారు ప్రారంభ ధరలు రూ. 2.72 కోట్లు (ఎక్స్ షోరూమ్, ఇండియా). ఇది మోడెనా, ట్రోఫియో అనే రెండు ట్రిమ్‌లలో లభిస్తుంది.రెండు డోర్స్, నాలుగు సీట్లు కలిగిన ఈ కారు 3.0 లీటర్ వీ6 ట్విన్ టర్బో పెట్రోల్ ఇంజిన్ పొందుతుంది. ఇది 490 హార్స్ పవర్, 600 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఈ కారు 3.9 సెకన్లలో 0 నుంచి 100 కిమీ/గం వరకు వేగవంతం అవుతుంది.మసెరటి గ్రాన్టూరిస్మో 12.2 ఇంచెస్ డిజిటల్ డయల్ డిస్ప్లే, 12.3 ఇంచెస్ సెంట్రల్ ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్ ఉన్నాయి. దానికి కింద భాగంలో క్లైమేట్ కంట్రోల్స్ కోసం 8.8 ఇంచెస్ టచ్‌స్క్రీన్ కూడా ఉంటుంది. డిజిటల్ క్లాక్, ఆప్షనల్ హెడ్ అప్ డిస్ప్లే, సోనస్ ఫాబ్రే ఆడియో సిస్టమ్ మొదలైనవి కూడా ఇందులో చూడవచ్చు.20 ఇంచెస్ ఫ్రంట్ వీల్, వెనుకవైపు 21 ఇంచెస్ వీల్స్ పొందిన మసెరటి గ్రాన్టూరిస్మో ఇండియన్ మార్కెట్లో ఇప్పటికే అమ్మకానికి ఉన్న బీఎండబ్ల్యూ ఎం8 కాంపిటీషన్, ఫెరారీ రోమా వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది. -
కొత్త బైక్ లాంచ్ చేసిన ట్రయంఫ్ - ధర రూ.9.72 లక్షలు
దేశీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన 'ట్రయంఫ్ మోటార్‌సైకిల్' భారతీయ విఫణిలో 'డేటోనా 660' బైక్ లాంచ్ చేసింది. ఈ బైక్ ధర రూ. 9.72 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఇది దాని డేటోనా 675 ఆధారంగా తయారైంది.లేటెస్ట్ డిజైన్ కలిగిన ట్రయంఫ్ డేటోనా 660 బైక్.. ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్ సెటప్, కాంపాక్ట్ టెయిల్ సెక్షన్ పొందుతుంది. ఇది షోవా 41 మిమీ బిగ్ పిస్టన్ అప్‌సైడ్ డౌన్ ఫోర్క్, వెనుకవైపు 130 మిమీ షోవా మోనోషాక్ ప్రీలోడ్ అడ్జస్ట్మెంట్ ఉన్నాయి. బ్రేకింగ్ విషయానికి వస్తే.. ఈ బైక్ రేడియల్ కాలిపర్లతో 310 మిమీ ట్విన్ డిస్క్‌లు, వెనుక స్లైడింగ్ కాలిపర్‌తో 220 మిమీ సింగిల్ డిస్క్ ఉన్నాయి.డేటోనా 660 బైక్ 660 సీసీ లిక్విడ్ కూల్డ్ ఇన్లైన్ ట్రిపుల్ ఇంజిన్ పొందుతుంది. ఇది 95 Bhp పవర్, 69 Nm టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ గేర్‌బాక్స్ కలిగి, స్లిప్ అండ్ అసిస్ట్ క్లచ్ పొందుతుంది. ఈ బైక్ ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ 14 లీటర్లు. కాబట్టి లాంగ్ రైడింగ్ చేయడానికి కూడా ఇది అనుకూలంగా ఉంటుంది.డేటోనా 660 బైక్ ఇన్స్ట్రుమెంటేషన్ కోసం మల్టీ ఫంక్షన్ కలర్ TFT స్క్రీన్ పొందుతుంది. ఈ బైక్ రోడ్, రైన్, స్పోర్ట్ అనే మూడు రైడ్ మోడ్‌లను పొందుతుంది. డ్యూయల్-ఛానల్ ఏబీఎస్, స్విచబుల్ ట్రాక్షన్ కంట్రోల్ కూడా ఇందులో ఉంటుంది. ఈ కొత్త బైక్ కవాసకి నింజా 650, ఎప్రిలియా ఆర్ఎస్ 660 వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది.It’s GAME ON! The moment you've been waiting for is here. Introducing the ALL-NEW Daytona 660, priced at ₹9 72 450/- Ex-Showroom.Get ready to experience the thrilling triple-powered performance, delivering pure exhilaration.Bookings are open now at Triumph dealerships near you pic.twitter.com/KyBEMWKcw5— TriumphIndiaOfficial (@IndiaTriumph) August 29, 2024 -
నిబంధనలు పాటించని మెర్సిడెస్ బెంజ్!.. ఎంపీసీబీ
పూణె తయారీ కేంద్రంగా ఉన్న లగ్జరీ కార్ల తయారీ సంస్థ 'మెర్సిడెస్ బెంజ్ ఇండియా' పర్యావరణ ప్రమాణాలను పాటించడం లేదని మహారాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (MPCB) ఆరోపించింది. ప్లాంట్ కార్యకలాపాలను సమగ్రంగా సమీక్షించాలని కోరింది.మహారాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి నుంచి ఎలాంటి వ్రాతపూర్వక నోటీసు అందుకోలేదని మెర్సిడెస్ బెంజ్ ఇండియా ఒక ప్రకటనలో వెల్లడించింది. అవసరమైతే ఎలాంటి దిద్దుబాటు చర్యలు చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని కంపెనీ పేర్కొంది.2024 ఆగస్టు 23న నిర్వహించిన సాధారణ తనిఖీలో.. పూణేలోని చకాన్లోని మెర్సిడెస్ బెంజ్ అసెంబ్లీ ప్లాంట్ మహారాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (MPCB) నిర్దేశించిన కాలుష్య నియంత్రణ మార్గదర్శకాలకు కట్టుబడి లేదని గుర్తించినట్లు బోర్డు తెలిపింది. దీంతో బెంజ్ అసెంబ్లీ ప్లాంట్ మీద తగిన చర్యలు తీసుకోవాలని ప్రాంతీయ అధికారులను ఆదేశించింది. తక్షణ చర్యగా.. రూ. 25 లక్షల బ్యాంక్ గ్యారెంటీని జప్తు చేసినట్లు వెల్లడించింది.ఆటోమోటివ్ ఇన్నోవేషన్‌లో అగ్రగామిగా ఉన్న మెర్సిడెస్ బెంజ్ స్థిరమైన ఉత్పత్తి పద్ధతుల్లో పర్యావరణ ప్రమాణాలను పాటించకపోవడం అనేది ఆందోళన కలిగించే విషయం. ఇది బ్రాండ్ మీదున్న నమ్మకాన్ని ఒమ్ముచేసే అవకాశం ఉంటుంది. కాబట్టి పర్యావరణం, సుస్థిరత పద్ధతులను నిలబెట్టడానికి.. తప్పనిసరి నిబంధనలను పాటిస్తామని, ప్రమాణాలకు కట్టుబడి ఉండటానికి కంపెనీ అధిక ప్రాధాన్యతనిస్తుందని మెర్సిడెస్ బెంజ్ ఇండియా తెలిపింది. -
వెహికల్ కొంటున్నారా?.. దీన్ని ఓ లుక్ వేయండి!
ఒక వాహనం కొనుగోలు చేయాలంటే రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటి మొత్తం డబ్బు ఒకేసారి చెల్లించి తీసుకోవడం. రెండు 'ఈఎమ్ఐ' రూపంలో తీసుకోవడం. ఇంతకీ ఏ విధంగా కొనుగోలు చేస్తే ఉత్తమం? మొత్తం డబ్బు చెల్లించడం (ఫుల్ క్యాష్) ద్వారా లాభాలేంటి? ఈఎమ్ఐ ద్వారా కొనుగోలు చేస్తే వచ్చే లాభ, నష్టాల గురించి మరిన్ని వివరాలు ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.బంధువులు కొన్నారు, పక్కింటి వాళ్ళు కొన్నారు, ఎదురింటి వాళ్ళు కొన్నారు అని, ఆవేశంతో ఆలోచించకుండా వాహనాలు కొనుగోలు చేస్తే.. ఆ తరువాత ప్రతికూల ప్రభావాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అధిక వడ్డీలు ఆర్థిక ఒత్తిడికి గురి చేస్తాయి. కాబట్టి ఒక వాహనం కొనుగోలు చేసే ముందు ఆర్థిక పరిస్థితులను బేరీజు వేసుకోవడం మాత్రమే.. సంపాదనను కూడా బేరీజు వేసుకోవాల్సి ఉంటుంది.మొత్తం డబ్బు చెల్లించి (ఫుల్ క్యాష్)ఏదైనా వాహనం (కారు / బైక్) కొనాలంటే మొత్తం డబ్బు చెల్లించడం అనేది ఉత్తమ ఎంపిక. ఎందుకంటే ఒకేసారి వాహన ఖరీదును చెల్లించాలమంటే.. ప్రతి నెలా ఈఎమ్ఐలు చెల్లించాల్సిన అవసరం లేదు. రిజిస్టేషన్స్, యాక్ససరీస్ వంటివన్నీ ఒకేసారి పొందవచ్చు. వడ్డీ చార్జీలు నుంచి తప్పించుకోవచ్చు. అంతే కాకుండా వన్ టైమ్ సెటిల్మెంట్ ద్వారా కొన్ని సార్లు ఆఫర్స్ కూడా లభిస్తాయి. తక్షణమే మీరు వాహనానికి ఓనర్ కూడా అవ్వొచ్చు.లోన్ మీద కారు కొనుగోలునిజానికి ప్రతి ఒక్కరూ మొత్తం డబ్బు చెల్లించే విధానం పాటించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒక కారు కొనాలంటే కనీసం రూ. 10 లక్షల కంటే ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది. కాబట్టి ఒకేసారి అంత మొత్తం చెల్లించడం కొందరికి కష్టమే. కానీ వారు ప్రతి నెలా కొంత మొత్తంగా చెల్లిస్తూ కారును కొనుగోలు చేసే స్థోమత ఉంటుంది. అలాంటి వారు తప్పకుండా లోన్ మీద కారును తీసుకోవచ్చు.లోన్ ద్వారా కారు కొనుగోలు చేసేవారు తెలుసుకోవాల్సిన విషయాలు👉లోన్ తీసుకుని కారు కొనేయాలనుకుంటే సరిపోదు. ఎందుకంటే ఒక బ్యాంకు మీకు వెహికల్ లోన్ ఇవ్వాలంటే ముందుగా మీ సంపాదన, సిబిల్ స్కోర్ వంటి వాటిని చూస్తుంది. ఇవన్నీ బేరీజు వేసుకుని మీరు లోన్ తీసుకోవడానికి అర్హులేనా? అర్హులైతే ఎంత వరకు లోన్ మంజూరవుతుంది, అనే విషయాలను పరిగణలోకి తీసుకుంటుంది.👉వెహికల్ లోన్ తీసుకునే వ్యక్తి తిరిగి చెల్లించే సమయం (డ్యూరేషన్) ఎంచుకోవచ్చు. ఇక్కడ గుర్తుంచుకోవలసిన ముఖ్యమైన విషయమును ఏమిటంటే? మీరు ఎంచుకున్న సమయం లేదా సంవత్సరాలను బట్టి వడ్డీ అనేది నిర్ణయిస్తారు. డ్యూరేషన్ అనేది వీలైనంత తక్కువ సెలక్ట్ చేసుకుంటే వడ్డీ తగ్గుతుంది.👉కొన్ని సందర్భాల్లో కొన్ని డీలర్‌షిప్‌లు కొంత కాలానికి 0% ఫైనాన్సింగ్‌తో సహా ప్రమోషనల్ వడ్డీ రేట్లను అందిస్తాయి. ఇది మీరు తీసుకునే లోన్‌కు సంబందించిన ఖర్చులను కొంత తగ్గించడానికి ఉపయోగపడుతుంది.👉లోన్ తీసుకునే వ్యక్తి వడ్డీ రేట్లను ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. ఈ విషయంలో తొందరపడితే నష్టపోయేది మీరే. కాబట్టి తక్కువ వడ్డీ రేటుకు ముందుగా ప్రాధాన్యత ఇవ్వడం మర్చిపోకండి. కొన్ని ప్రైవేట్ కంపెనీలు ఈ విషయంలో భారీ వడ్డీలను వసూలు చేసి అమాయక ప్రజలను దోచుకునే అవకాశం ఉంది.లోన్ తీసుకుని వాహనాలను కొనుగోలు చేయడంలో పెద్దగా లాభాలు కనిపించవు, కానీ ఆదమరిస్తే నష్టాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.👉రుణ గ్రహీత లోన్ తీసుకున్నప్పుడు వడ్డీ చార్జీలను తీసుకోకుండా ముందడుగు వేస్తే.. అసలు ధర కంటే ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో మళ్ళీ మళ్ళీ ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.👉వడ్డీ అనేది కూడా చివరి వరకు ఒకేలా ఉండదు. ఇందులో కొన్ని సార్లు పెరుగుదలలు కూడా ఉంటాయి. రేపో రేటు పెరిగితే కొన్ని బ్యాంకులు లేదా ఆర్థిక సంస్థలు వడ్డీలను అమాంతం పెంచేస్తాయి. ఇది రుణ గ్రహీత మీద భారం పడేలా చేస్తాయి.👉ముందుగానే మీ సంపాదన, ఈఎమ్ఐ వంటి వాటిని లెక్కించుకోవాలి. ఒకసారి ఈఎమ్ఐ మొదలు పెట్టిన తరువాత.. ఇతరత్రా ఖర్చులు తగ్గించుకోవాలి. లేకుండా ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కుపోవాల్సి ఉంటుంది. నెలవారీ ఖర్చులు కూడా లెక్కించుకోవడం ఉత్తమం. పొరపాటున ఈఎమ్ఐ కట్టడం ఆలస్యమైతే.. కట్టాల్సిన డబ్బు కంటే ఇంకా ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది. ఇది సిబిల్ స్కోర్ మీద కూడా ప్రభావం చూపుతుంది.10 లక్షల కారును 7 సంవత్సరాల వ్యవధితో లోన్ ద్వారా తీసుకుంటే?👉ఒక వ్యక్తి రూ. 10 లక్షల కారును కొనాలనుకుంటే.. దానికి కావాల్సిన లోన్‌ను బ్యాంక్ / ఆర్థిక సంస్థ నుంచి తీసుకుంటారు. డ్యూరేషన్ 7 సంవత్సరాలు ఎంచుకున్నట్లయితే.. నెలకు సుమారు రూ. 15వేలు కంటే ఎక్కువ ఈఎమ్ఐ రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. ఇది కూడా మీకు లోన్ ఇచ్చే బ్యాంక్ ఫిక్స్ చేసే వడ్డీ రేటు మీద ఆధారపడి ఉంటుంది.ఉదాహరణకు.. ఒక బ్యాంక్ 8.65 శాతం వడ్డీతో రూ. 10 లక్షలు లోన్ ఇస్తే (7 సంవత్సరాల కాల వ్యవధి) నెలకు రూ. 15912 చెల్లించాల్సి ఉంటుంది. అంటే మీరు 7 సంవత్సరాల్లో మొత్తం రూ. 13,36,608 చెల్లించాల్సి ఉంటుంది. అంటే తీసుకున్నదానికంటే సుమారు రూ. 3.36 లక్షలు ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది.అదే వడ్డీ రేటు 11 శాతం అనుకుంటే (10 లక్షలు 7 సంవత్సరాల డ్యూరేషన్) అప్పుడు నెలకు రూ. 17122 చొప్పున మొత్తం రూ. 14,38,248 చెల్లించాల్సి ఉంటుంది. దీన్ని బట్టి ఎంత వడ్డీకి ఎంత చెల్లించాల్సి ఉంటుందనేది స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. -
ప్రజలపై ట్యాక్స్ పిడుగు.. భారీగా పెరిగిన వెహికల్స్ ధరలు
కార్లు, బైకుల ధరలను అప్పుడప్పుడు తయారీ సంస్థలే పెంచుతూ ఉంటాయి. కానీ ఇప్పుడు పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వమే వెహికల్ ట్యాక్స్ పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో అక్కడి వాహనాల ధరలు మరింత పెరుగుతాయి.పంజాబ్ ప్రభుత్వం ప్యాసింజర్ వాహనాలు, టూ వీలర్స్ మీద మోటార్ వెహికల్ ట్యాక్స్‌ను 05 నుంచి 1 శాతానికి పెంచింది. త్వరలో పండుగ సీజన్.. ఈ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వాహన అమ్మకాలపైన ప్రభావం చూపే అవకాశం ఉంది.పంజాబ్ రవాణాశాఖ విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం.. రూ. 15 లక్షల విలువైన ప్యాసింజర్ వాహనాలపైన ట్యాక్స్ 9 నుంచి 9.5 శాతానికి పెంచింది. దీంతో వాహనాలపై చెల్లించాల్సిన పన్ను రూ. 7000 నుంచి రూ. 20వేలకు పెరిగింది. అదే సమయంలో రూ. 15 లక్షల నుంచి రూ. 25 లక్షల విలువైన వాహనాలపైన ట్యాక్స్ 11 శాతం నుంచి 12 శాతానికి పెరిగింది. రూ. 25 లక్షల కంటే ఎక్కువ విలువైన వాహనాలపైన ట్యాక్స్ 13 శాతంగా ఉంది.ఇదీ చదవండి: రూ.30 లక్షల జీతం.. ట్రైన్లోనే ప్రయాణం: ఓ టెకీ సమాధానం ఇదేఇక ద్విచక్ర వాహనాల విషయానికి వస్తే.. రూ. 1 లక్ష కంటే తక్కువ ఖరీదైన ద్విచక్ర వాహనాల మీద ట్యాక్స్ 7 శాతం నుంచి రూ. 7.5 శాతానికి పెరిగింది. అలాగే రూ. 1 లక్ష నుంచి రూ. 2 లక్షల ఖరీదైన వాహనాలపైన ట్యాక్స్ 10 శాతంగా ఉంది. రూ. 2 లక్షల కంటే ఎక్కువ ఖరీదైన టూ వీలర్స్ మీద ప్రభుత్వం ట్యాక్స్‌ను 11 శాతానికి చేర్చింది.పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం వాహనాలపైన పెంచిన ట్యాక్స్.. తక్షణమే అమలులోకి వస్తుంది. దీంతో కార్లు, బైకుల ధరలు అమాంతం పెరిగిపోయాయి. ట్యాక్స్ పెరుగుదల అమ్మకాలపైన ఎలాంటి ప్రభావం చూపుతుందనే విషయం త్వరలోనే తెలుస్తుంది. -
టీవీఎస్ జుపీటర్ 110 లాంచ్: ధర ఎంతంటే?
టీవీఎస్ మోటార్ కంపెనీ భారతీయ మార్కెట్లో 'జుపీటర్ 110' స్కూటర్ లాంచ్ చేసింది. ఈ స్కూటర్ ప్రారంభ ధర రూ. 73,700 (ఎక్స్-షోరూమ్). ఇది నాలుగు వేరియంట్లలో.. ఆరు కొత్త కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది.కొత్త జుపీటర్ 110 స్కూటర్ కొత్త కలర్ స్కీమ్ మాత్రమే కాకుండా.. డ్యూయల్ టోన్ సీట్, ఫ్రంట్ ఫోర్క్లపై రిఫ్లెక్టర్లు, ఎల్ఈడీ డీఆర్ఎల్, స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీతో కూడిన కొత్త ఇన్స్ట్రుమెంట్ కన్సోల్, టర్న్-బై-టర్న్ నావిగేషన్, కాల్స్ అండ్ ఎస్ఎమ్ఎస్ అలర్ట్ వంటివన్నీ పొందుతుంది.33 లీటర్లు అండర్ సీట్ స్టోరేజ్ పొందిన జుపీటర్ 113 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ పొందుతుంది. ఇది 8 బిహెచ్పి పవర్, 9.8 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. పర్ఫామెన్స్ అనేది దాదాపు దాని స్టాండర్డ్ మోడల్ మాదిరిగానే ఉంటుంది. -
కారు ప్రమాదానికి గురైందా? ఇన్సూరెన్స్ ఇలా క్లెయిమ్ చేసుకోండి
ఒకప్పుడు ఇంటికో వాహనం ఉండేది. ఇప్పుడు మనిషికో వాహనం అన్నట్టుగా వెహికల్స్ సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. వాహనాలను వినియోగించే ప్రతి ఒక్కరూ భీమా / ఇన్సూరెన్స్ చేయించుకోవాలి. ఇది ప్రమాదం జరిగినప్పుడు నష్టాన్ని కొంత వరకు భర్తీ చేస్తుంది. కాబట్టి అది కొత్త కారు అయినా.. పాత కారు అయినా ఇన్సూరెన్స్ అనేది తప్పనిసరి.చట్టప్రకారం కూడా మీ కారుకు భీమా ఉండాల్సిందే. చాలా మంది తమ వాహనాలకు ఇన్సూరెన్స్ తీసుకున్నప్పటికీ.. వాటిని ఎలా క్లెయిమ్ చేయాలో కొంతమందికి తెలిసి ఉండకపోవచ్చు. ఈ కథనంలో ఇన్సూరెన్స్ ఎలా క్లెయిమ్ చేసుకోవాలో వివరంగా తెలుసుకుందాం.ఇన్సూరెన్స్ అనేది రెండు రకాలుగా ఉంటుంది. ఇందులో ఒకటి క్యాష్‌లెస్ క్లెయిమ్.. రెండు రీయింబర్స్మెంట్ క్లెయిమ్. ఇందులో క్యాష్‌లెస్ క్లెయిమ్ అనేది ఉత్తమ ఎంపిక. ఎందుకంటే కారుకు ప్రమాదం జరిగితే.. దాన్ని రిపేర్ చేసుకోవడానికి అయ్యే మొత్తం ఖర్చు సదరు కంపెనీ భరిస్తుంది. రీయింబర్స్మెంట్ క్లెయిమ్ అయితే.. ముందుగా కారును రిపేర్ చేసుకుని, ఆ తరువాత బిల్స్‌ను కంపెనీలకు చూపించి క్లెయిమ్ చేసుకోవాలి ఉంటుంది. ఆ బిల్స్ అన్నీ ఇన్సూరెన్స్ కంపెనీ అంగీకరిస్తే.. మీ డబ్బు మీకు వస్తుంది.క్యాష్‌లెస్ క్లెయిమ్ కింద జరిగిన నష్టాన్ని భర్తీ చేసుకోవాలంటే.. కారు ప్రమాదానికి గురైన వెంటనే ఇన్సురెన్స్ కంపెనీకి సమాచారం ఇవ్వాలి. ఆ ప్రమాదంలో ఎవరైనా మరణిస్తే వెంటనే సమీపంలోని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలి. ఆ తరువాత ఇన్సూరెన్స్ సంస్థ కారును ఏదైనా గ్యారేజిలో జరిగిన నష్టాన్ని లేదా ప్రమాదాన్ని అంచనా వేసి ఖర్చు ఎంతవుతుందో లెక్కిస్తారు. అయితే ఇన్సురెన్స్ కంపెనీలకు తెలియకుండా కారును రిపేర్ షాపుకు లేదా గ్యారేజీకి తీసుకెళ్లకూడదు.కారును గ్యారేజీ సిబ్బంది రిపేర్ చేసిన తరువాత.. రిపేర్ చేయడానికి అయిన ఖర్చును నేరుగా ఇన్సూరెన్స్ కంపెనీ నేరుగా గ్యారేజికే చెల్లిస్తుంది. ఒకవేళా కారును రిపేర్ చేయడానికి వీలుకానప్పుడు కారు విలువ మొత్తాన్ని సంస్థ కారు యజమానికి చెల్లిస్తుంది.ఇక రెండోది.. రీయింబర్స్మెంట్ క్లెయిమ్. దీని కింద ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవాలంటే.. ముందుగా కారు ప్రమాదానికి గురైన 24 గంటలలోపు ఫోన్ చేసి లేదా ఆన్లైన్లో చెప్పే అవకాశం ఉంటే తెలియజేయాలి. ఆ తరువాత క్లెయిమ్ రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తుంది. ఈ నెంబర్ తరువాత ఎప్పుడైనా ప్రమాదాలు జరిగినప్పుడు కూడా ఉపయోగపడుతుంది. సంస్థకు సమాచారం అందించిన తరువాత మీ వాహనాన్ని మీకు నచ్చిన గ్యారేజికి తీసుకెళ్లి రిపేర్ చేసుకోవచ్చు.ఇదీ చదవండి: నష్టం జరిగింది.. రూ.50 కోట్లు ఇవ్వండి: రిమీ సేన్కారు రిపేర్ పూర్తయిన తరువాత.. దానికైన ఖర్చు సంబంధిత డాక్యుమెంట్స్ అన్నీ ఇన్సూరెన్స్ సంస్థకు అందించాలి. వాటన్నింటినీ కంపెనీ పరిశీలించి కారు యజమానికి డబ్బు చెల్లిస్తుంది. -
మాటలకు అందని ఆటోమొబైల్ చరిత్ర! తొలిసారి కారు వాడకం ఎప్పుడంటే?
సువిశాలమైన భారతదేశం ఈ రోజు అన్ని రంగాల్లోనూ ముందుకు దూసుకెళ్తూ ప్రపంచానికే పోటీ ఇచ్చే స్థాయికి ఎదిగిందంటే.. ఇదంతా ఒక్క రోజులో జరిగిన పురోగతి కాదు, దశాబ్దాల తదేక కృషి ఫలితమే ఈ అభివృద్ధి. ఇండియాలో ఇతర రంగాలు ఒక ఎత్తయితే, ఆటో మొబైల్ రంగం మరో ఎత్తు అనే చెప్పాలి.1957 వరకు కూడా సొంతంగా కారుని ఉత్పత్తి చేయలేని భారత్ ఈ రోజు ప్రపంచ ఆటోమొబైల్ పవర్‌హౌస్‌లలో ఒకటిగా ఎదిగింది. ఎన్నో ఒడిదుడుకులను దాటుకుంటూ.. అఖండ విజయం సాధించడానికి అహర్నిశలు పాటుపడింది. నిజానికి భారతీయ ఆటోమొబైల్ పరిశ్రమ ప్రయాణం చాలా బిన్నంగా ఉంటుంది. మన దేశంలో మొదటి వాహనం 1897లో అడుగుపెట్టినప్పటికీ దానిని ఒక ఆంగ్లేయుడు దిగుమతి చేసుకున్నట్లు చరిత్ర చెబుతోంది.టాటా కారును కలిగిన మొదటి భారతీయ సంతతి వ్యక్తి..ఇండియా.. బ్రిటిష్ పాలనలో ఉన్నప్పుడు బొంబాయి, మద్రాస్, కలకత్తా వంటి నగరాల్లో కేవలం కొద్దిమందికి మాత్రమే కార్లు ఉండేవి. 20వ శతాబ్దం మొదటి అర్ధభాగం వరకు భారతదేశంలోని దాదాపు అన్ని కార్లు దిగుమతి చేసుకున్నవే. 1898లో జమ్సెట్జీ నుస్సర్వాన్జీ (Jamsetji Nusserwanji) టాటా కారును కలిగి ఉన్న భారతీయ సంతతికి చెందిన మొదటి వ్యక్తి అయ్యాడు.ఆవిరితో నడిచే వాహనాలు..తరువాత కాలక్రమంలో ఆవిరితో నడిచే వాహనాలు ఆధిపత్యం చెలాయించాయి. 1903వ సంవత్సరంలో మద్రాస్‌లోని సింప్సన్ & కోకి చెందిన 'శామ్యూల్ జాన్' భారతదేశపు మొట్టమొదటి ఆవిరి కారును నిర్మించాడు. అప్పట్లో ఈ కారు గొప్ప ప్రశంసలు అందుకుంది. ఇది తరువాత వచ్చిన భవిష్యత్ ఆవిష్కరణలకు కూడా ఆధారంగా నిలిచింది. 1928లో జనరల్ మోటార్స్ ఇండియా లిమిటెడ్ తన బొంబాయి ఫ్యాక్టరీలో ట్రక్కులు, కార్లను అసెంబ్లింగ్ చేయడం ప్రారంభించింది. 1930 నాటికి ఫోర్డ్ మోటార్ కో ఆఫ్ ఇండియా లిమిటెడ్ మద్రాస్‌లో ఆటోమొబైల్స్ అసెంబ్లీని ప్రారంభించింది.భారతదేశానికి స్వతంత్రం వచ్చిన ప్రారంభ రోజుల్లో 1948 నాటికి హిందుస్థాన్ మోటార్స్, మహీంద్రా, స్టాండర్డ్, ప్రీమియర్, టాటా మోటార్స్ వంటి ప్రధాన కంపెనీలు పుట్టుకొచ్చాయి. ఆ తరువాత కాలంలోనే దేశం కొత్త ప్రగతి యుగానికి నాంది పలికేందుకు సిద్ధమైంది. మహాత్మా గాంధీ స్వావలంబన సూత్రాలకు అనుగుణంగా, స్వదేశీ ఆటో పరిశ్రమను నిర్మించాలనే కలను భారత ప్రభుత్వం సాకారం చేసింది.భారతీయ ఆటోరంగానికి ఆటంకం..ఆటోమోటివ్ భాగాలను మాత్రమే కాకుండా వాహనాల కోసం అంతర్గత పర్యావరణ వ్యవస్థను నిర్మించాలనే నిర్ణయం 1952 నాటి టారిఫ్ కమిషన్ సృష్టికి దారితీసింది. ఆ తరువాత కొన్ని ఆటంకాలు ఎదురయ్యాయి. దీంతో 1954 నాటికి, ఫోర్డ్, జనరల్ మోటార్స్, రూట్స్ వంటి కొన్ని అతిపెద్ద ఆటోమోటివ్ ఎగుమతిదారులు తక్షణమే దుకాణాన్ని మూసివేశారు. ఇది ప్రపంచంలోని ఇతర దేశాల నుంచి భారతీయ మార్కెట్‌ను దూరం చేశారు. అంతే కాకుండా స్థానిక కంపెనీలు తయారు చేసిన మోడల్స్ అమ్మకపు ధరలపై తీవ్రమైన షరతులను ఎదుర్కొంటున్నందున భారతీయ ఆటో రంగం దాదాపు ఆగిపోయినట్లయింది.అంబాసిడర్ & ప్రీమియర్ పద్మిని..అయినప్పటికీ ఆటోమొబైల్ పరిశ్రమ మళ్ళీ సవాళ్ళను ఎదుర్కోవడానికి సిద్ధమైంది. ఇందులో భాగంగానే 1957లో హిందుస్థాన్ అంబాసిడర్ రూపంలో మొట్టమొదటి ఆల్-ఇండియన్ కారు ఉనికిలోకి వచ్చింది. ఆ తరువాత 1964లో ప్రీమియర్ కంపెనీ అంబాసిడర్‌కు ప్రత్యర్థిగా 'పద్మిని' కారుని ప్రారంభించింది. ఈ రెండు కార్లు ఆటోమొబైల్ పరిశ్రమను తిరుగులేకుండా దశాబ్ద కాలం పాటు పాలించాయి.SIAM ఏర్పాటు..భారతీయ ఆటోమొబైల్ పరిశ్రమ అభివృద్ధి చెందిన ప్రారంభ రోజులలో స్థిరమైన పురోగతి, పరిశోధన ద్వారా పరిశ్రమకు మద్దతునిచ్చే లక్ష్యంతో దేశీయ సంస్థలు ఏర్పడ్డాయి. 1960లో, సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మానుఫ్యాక్చరర్స్ (SIAM) భారతదేశంలో ఆటోమొబైల్స్ కోసం స్థిరమైన అభివృద్ధి వ్యవస్థను రూపొందించే దృష్టితో ఏర్పడింది.భారతదేశ ఆటోమొబైల్ పరిశ్రమ చరిత్రను మనం పరిశీలిస్తే.. 1980లలో సాధించిన విజయాలే ఈ రోజు బలమైన పరిశ్రమలకు పునాదులని తెలుస్తోంది. 21వ శతాబ్దంలో మారుతీ సుజుకిగా పిలువబడే మారుతీ ఉద్యోగ్ లిమిటెడ్, జపాన్ ఆటోమోటివ్ పవర్‌హౌస్ సుజుకితో జాయింట్ వెంచర్‌గా ఏర్పడింది. ఆ తరువాత బాలీవుడ్ రంగం ఈ పరిశ్రమను పరిచయం చేయడంలో ప్రధాన పాత్ర వహించింది.వేగం పెరిగిన ఇండియన్ ఆటోమొబైల్ మార్కెట్..విదేశీ ప్రభావంతో పాటు పెట్టుబడి పరంగా కూడా 1990 వ దశకంలో భారతీయ ఆటో మార్కెట్ వేగంగా ముందుకు సాగింది. పెట్టుబడులు వెల్లువెత్తడంతో 1993 & 1996 మధ్య కార్ల విక్రయాలు రెట్టింపయ్యాయి. ఆ తరువాత మెర్సిడెస్ బెంజ్ 2004లో భారతదేశానికి వచ్చి దేశంలోని మొట్టమొదటి విదేశీ లగ్జరీ ఆటోమేకర్‌గా చరిత్ర సృష్టించింది. 2006లో బీఎండబ్ల్యూ, 2007లో ఆడి అరంగేట్రం చేశాయి. అప్పటి నుంచి ఈ మూడు జర్మన్ కంపెనీలు భారతదేశంలోని లగ్జరీ కార్ల మార్కెట్లో ఆధిపత్యం చెలాయిస్తున్నాయి.ప్రస్తుతం మనం కంప్యూటర్ యుగంలో ఉన్నాము. కావున కొత్త ఆవిష్కరణలు పుట్టుకొచ్చాయి. ఇందులో భాగంగానే ఆధునిక ఆటో పరిశ్రమ కొత్త మార్గాల్లో ప్రవేశించింది. భారతీయ ఆటోమొబైల్ పరిశ్రమ ఆధునిక హంగులను పొందగలిగింది.➤ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్: వాహనాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ఒక కొత్త శకానికి నాంది పలికింది. AI సామర్థ్యాలు కలిగిన కార్లు మునుపటి వాటికంటే మరింత ఆధునికంగా మారాయి. తయారీ ప్రక్రియ నుంచి మొత్తం ఉత్పత్తి వరకు ఈ టెక్నాలజీ కీలక పాత్ర పోషిస్తోంది.ఇప్పుడు మార్కెట్లో ఉన్న దాదాపు అన్ని వాహనాలు బిఎస్ 6 ఉద్గార ప్రమాణాలకు అనుకూలంగా తయారవుతున్నాయి. నేడు బిఎస్ 4 వాహనాల ఉత్పత్తి ఆగిపోయింది. రానున్న రోజుల్లో డీజిల్ కార్లు కూడా కనుమరుగయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.➤ఎలక్ట్రిక్ మొబిలిటీ: ఒకప్పుడు నీటి ఆవిరి ద్వారా.. ఆ తరువాత డీజిల్, పెట్రోల్ వంటి కార్లు మార్కెట్లో అడుగుపెట్టాయి. ఆ తరువాత ఎలక్ట్రిక్ వాహనాలు అరంగేట్రం చేసి భారదేశాన్ని మరింత ప్రగతి మార్గంలో పయనించేలా చేశాయి. చాలామంది ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు.➤స్వయంప్రతిపత్త వాహనాలు (Autonomous Vehicles): భారతీయ ఆటో పరిశ్రమలో చెప్పుకోదగ్గ మార్పు ఈ స్వయంప్రతిపత్తి వాహనాలు. అంటే ఈ వాహనాలు తనకు తానుగానే ముందుకు సాగుతాయి. ఇది మానవుడు కనిపెట్టిన అద్భుత సృష్టి అనే చెప్పాలి. ప్రస్తుతం ఈ వాహనాలు ఇండియన్ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. కంప్యూటర్ ద్వారా ఆపరేట్ అయ్యే ఆ వాహనాలు ప్రమాదాల నుంచి మనుషులను కాపాడంలో ప్రధాన పాత్ర వహిస్తాయి.➤భద్రతపై దృష్టి: ఇప్పుడు మార్కెట్లో విడుదలయ్యే చాలా కంపెనీల వాహనాలు భద్రతాపరంగా చాలా ఫీచర్స్ కలిగి ఉన్నాయి. ప్రయాణికుల భద్రతకు పెద్దపీట వేయడంలో భాగంగానే సంస్థలు ఈ విధమైన వాహనాలను ఉత్పత్తి చేస్తున్నాయి. ఆధునిక కాలంలో ADAS టెక్నాలజీ కూడా ఎక్కువ భద్రతను కల్పిస్తుంది. రానున్న రోజుల్లో ఎగిరే కార్లు కూడా భారతదేశంలో అరంగేట్రం చేయనున్నాయి.ఒకప్పుడు కారునే తయారు చేయలేని భారత్.. ఈ రోజు ఎన్నెన్నో దేశాలకు కార్లను ఎగుమతి చేస్తోంది. 2021 ఏప్రిల్ నుంచి 2022 మార్చి నాటికి మన దేశంలో 22,933,230 వాహనాలు ఉత్పత్తయ్యాయని SIAM నివేదించింది. దీన్ని బట్టి చూస్తే ఇండియన్ ఆటోమొబైల్ పరిశ్రమ ఎంతగా అభివృద్ధి చెందిందో మనకు ఇట్టే అర్థమవుతుంది. రానున్న రోజుల్లో మరింత ఎత్తుకి ఎదుగుతుందని స్పష్టంగా అర్థమవుతోంది. -
భారత్‌లో సరికొత్త జర్మన్ బ్రాండ్ కారు లాంచ్: వివరాలు
మెర్సిడెస్ బెంజ్ ఇండియన్ మార్కెట్లో 'జీఎల్ఈ 300డీ 4మ్యాటిక్ ఏఎంజీ లైన్' లాంచ్ చేసింది. సంస్థ లాంచ్ చేసిన ఈ లగ్జరీ కారు ధర రూ. 97.85 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఇది దాని మునుపటి మోడల్స్ కంటే కూడా ఎక్కువ డిజైన్, ఫీచర్స్ పొందుతుంది.కొత్త మెర్సిడెస్ బెంజ్ కారు త్రీ-పాయింటెడ్ స్టార్ ప్యాటర్న్‌తో కూడిన డైమండ్ గ్రిల్, స్పోర్టియర్ ఎయిర్ ఇన్లెట్లు, క్రోమ్ ఇన్సర్ట్ & బ్లాక్ సరౌండ్‌తో మ్యాట్ డార్క్ గ్రేలో పెయింట్ చేసి ఉండటం చూడవచ్చు. ఇందులోని అప్డేటెడ్ ఫీచర్స్ వాహన వినియోగదారులకు మంచి డ్రైవింగ్ అనుభూతిని అందిస్తాయి.మెర్సిడెస్ బెంజ్ జీఎల్ఈ 300డీ 4మ్యాటిక్ ఏఎంజీ లైన్ 2.0 లీటర్ ఫోర్ సిలిండర్ డీజిల్ ఇంజిన్ పొందుతుంది. ఇది 269 హార్స్ పవర్, 550 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇది 48వీ మైల్డ్-హైబ్రిడ్ ఇంటిగ్రేటెడ్ స్టార్టర్-జెనరేటర్ కూడా పొందుతుంది. ఇది 20 హార్స్ పవర్, 200 న్యూటన్ మీటర్ టార్క్ అదనంగా ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ లగ్జరీ కారు టాప్ స్పీడ్ గంటకు 230 కిమీ. -
అప్డేటెడ్ జావా 42 బైక్ ఇదే.. ధర ఎంతో తెలుసా?
ప్రముఖ బైక్ తయారీ సంస్థ జావా మోటార్‌సైకిల్ అప్డేటెడ్ బైక్ లాంచ్ చేసింది. కంపెనీ లాంచ్ చేసిన ఈ కొత్త జావా 42 బైక్ ధరలు రూ. 1.73 లక్షల నుంచి రూ. 1.98 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఈ బైక్ దాని స్టాండర్డ్ మోడల్ కంటే కూడా రూ. 16000 తక్కువ ధరకే లభిస్తుంది.2024 జావా 42 బైక్ 294 సీసీ లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ పొందుతుంది. ఇది 27.32 హార్స్ పవర్ మరియు 26.84 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది స్లిప్ అండ్ అసిస్ట్ క్లచ్ పొందుతుంది. రీడిజైన్ పొందిన ఈ బైక్ సింగిల్ ఛానల్ ఏబీఎస్ పొందుతుంది. అనలాగ్ ఎల్సీడీ సెటప్ కూడా ఇందులో గమనించవచ్చు.మెరుగైన గ్రౌండ్ క్లియరెన్స్ కలిగిన ఈ బైక్ సౌకర్యవంతమైన రైడింగ్ అనుభూతిని అందిస్తుంది. అప్డేటెడ్ జావా 42 సీటు ఎత్తు 788 మిమీ వరకు ఉంటుంది. ఈ అప్డేటెడ్ బైక్ దాని మునుపటి మోడల్ కంటే కూడా చాలా ఆకర్షణీయంగా ఉంటుంది.The 2024 Jawa 42 is here! This is the answer you’ve been waiting for. With the perfect trinity of Performance, Neo-Classic Design and Engineering - you are in for a ride like no other!#Jawa42TheAnswer #Jawa42 #JPanther #JawaMotorcycles pic.twitter.com/AA4qFLCT3g— Jawa Motorcycles (@jawamotorcycles) August 13, 2024 -
2025-26 నాటికి ఇదే లక్ష్యం: అమిత్ షా
ఫ్యూయెల్ (పెట్రోల్, డీజిల్) వాడకాన్ని తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగానే ఎలక్ట్రిక్, సీఎన్జీ వాహనాలు ఉత్పత్తిని ప్రోత్సహించడం చేస్తోంది. కేంద్ర మంత్రి 'నితిన్ గడ్కరీ' హైడ్రోజన్ వాహనాలను ఉత్పత్తి చేయాలని కంపెనీలకు చెబుతున్నారు. అంతే కాకుండా ఇథనాల్ వాడకాన్ని పెంచాలని సూచిస్తున్నారు. ఇప్పుడు కేంద్ర హోం మంత్రి 'అమిత్ షా' కూడా ఇథనాల్ ఉత్పత్తిని పెంచాలని కోరుతున్నారు.మోదీ ప్రభుత్వం 2025-26 నాటికి 20 శాతం ఇథనాల్‌ను కలపాలనే లక్ష్యాన్ని సాధిస్తుందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా శనివారం అన్నారు. ఇథనాల్ ఉత్పత్తి పెరిగితే ముడిచమురు దిగుమతి తగ్గుతుందని అమిత్ షా చెప్పారు. దీనికోసం చక్కెర మిల్లులు ఇథనాల్‌ను ఉత్పత్తి చేయాలని కోరారు.పెట్రోల్ వినియోగం తగ్గితే.. పర్యావరణ కాలుష్యం కూడా తగ్గుతుందని నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ కోఆపరేటివ్ షుగర్ ఇండస్ట్రీస్ ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సులో అమిత్ షా అన్నారు. దాదాపు 5000 కోట్ల లీటర్ల పెట్రోలుకు వెయ్యి కోట్ల లీటర్ల ఇథనాల్ అవసరం ఉంటుందని కూడా ఆయన చెప్పారు.ఇదీ చదవండి: బీఎస్ఎన్ఎల్ యూనివర్సల్ 4జీ, 5జీ సిమ్: ఎక్కడైనా.. ఎప్పుడైనాఇథనాల్ను కలపడం వల్ల పర్యావరణం మెరుగుపడటమే కాకుండా.. చక్కెర మిల్లుల లాభాలు పెరగడం వల్ల రైతులకు మేలు జరుగుతుందని అమిత్ షా అన్నారు. ఇథనాల్ ఉత్పత్తిపైన ప్రతి 3 నెలలకు ఒకసారి సమీక్షించి నిర్ణయాలు తీసుకుంటామని, మంత్రుల బృందం ద్వారా ఇథనాల్ మిశ్రమాన్ని ప్రధానమంత్రి స్వయంగా పర్యవేక్షిస్తారని షా అన్నారు. -
భారత్‌లో రూ.1.11 కోట్ల జర్మన్ బ్రాండ్ కారు లాంచ్ - వివరాలు
ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ (Mercedes Benz) దేశీయ మార్కెట్లో 'ఏఎంజీ జీఎల్సీ 43 4మ్యాటిక్' కూపే లాంచ్ చేసింది. కంపెనీ లాంచ్ చేసిన ఈ కారు ధర రూ.1.11 కోట్లు (ఎక్స్ షోరూమ్).బీఎండబ్ల్యూ ఎక్స్3 ఎం40ఐకు ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న కొత్త ఏఎంజీ జీఎల్సీ 43 4మ్యాటిక్ 2.0 లీటర్, ఫోర్ సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ కలిగి 421 హార్స్ పవర్, 500 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 9-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో నాలుగు చక్రాలకు పవర్ డెలివరీ చేస్తుంది. ఇది 4.7 సెకన్లలోనే గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది.కొత్త మెర్సిడెస్ బెంజ్ ఏఎంజీ జీఎల్సీ 43 4మ్యాటిక్ స్లోపింగ్ రూఫ్‌లైన్, స్పోర్టియర్ ఫ్రంట్ అండ్ రియర్ బంపర్లు, 21 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ వంటివి పొందుతుంది. ఈ కారు లోపల 12.3 ఇంచెస్ డ్రైవర్ డిస్ప్లే, 11.9 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ వంటి వాటితో పాటు అత్యాధునిక సేఫ్టీ ఫీచర్స్ పొందుతుంది.