![Ducati Panigale V2 Black Launched In India At Rs 20 98 Lakh](/styles/webp/s3/article_images/2024/06/11/ducati-new-bike.jpg.webp?itok=dfKMRQgK)
ప్రముఖ బైక్ తయారీ సంస్థ 'డుకాటీ ఇండియా' దేశీయ మార్కెట్లో కొత్త 'పానిగేల్ వీ2' బైకును బ్లాక్ కలర్ ఆప్షన్‌లో లాంచ్ చేసింది. ఈ బైక్ ధర రూ. 20.98 లక్షలు (ఎక్స్ షోరూమ్). దీని ధర దాని మునుపటి మోడల్ కంటే కూడా రూ. 30000 ఎక్కువ. ఇప్పటికే కంపెనీ ఈ బైక్ కోసం బుకింగ్స్ స్వీకరించింది. డెలివరీలు త్వరలోనే ప్రారంభమవుతాయి.
కొత్త డుకాటీ పానిగేల్ వీ2 బ్లాక్ ఫెయిరింగ్ పొందటమే కాకుండా.. ఫ్యూయల్ ట్యాంక్ మీద, వీల్స్ మీద, వెనుక భాగంలో రెడ్ కలర్ స్కీమ్ చూడవచ్చు. డిజైన్ దాదాపు దాని మునుపటి మోడల్ మాదిరిగానే ఉంటుంది. కాబట్టి అదే కన్ను మాదిరిగా ఉండే ఎల్ఈడీ డీఆర్ఎల్, ట్విన్ హెడ్‌ల్యాంప్ వంటివి ఉన్నాయి.
పానిగేల్ వీ2 బైక్ అదే 995 సీసీ లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ పొందుతుంది. ఇది 10750 rpm వద్ద 155 Bhp పవర్, 9000 rpm వద్ద 104 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది. ఈ బైక్ 43 మిమీ ఫుల్లీ అడ్జస్టబుల్ షోవా యూఎస్డీ ఫ్రంట్ ఫోర్క్స్, వెనుకవైపు ఫుల్లీ అడ్జస్టబుల్ మోనోషాక్ పొందుతుంది. బ్రేకింగ్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది.
మల్టిపుల్ రైడింగ్ మోడ్స్ కలిగిన ఈ బైక్.. కార్నరింగ్ ఏబీఎస్, ట్రాక్షన్ కంట్రోల్, ఇంజన్ బ్రేక్ కంట్రోల్ వంటి వాటితో పాటు.. పైరెల్లీ డయాబ్లో రోస్సో కోర్సా II టైర్‌లను కలిగి 17 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ పొందుతుంది. ఈ బైక్ రైడర్లకు అత్యుత్తమ రైడింగ్ అనుభూతిని అందిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment