new bikes
-
భారత్‌లో రూ.13.49 లక్షల బైక్ లాంచ్: బుకింగ్స్ షురూ
కవాసకి దేశీయ మార్కెట్లో 2025 నింజా 1100ఎస్ఎక్స్ లాంచ్ చేసింది. దీని ధర రూ.13.49 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఈ బైక్ కోసం బుకింగ్స్ ప్రారంభమైనప్పటికీ.. డెలివరీలు వచ్చే ఏడాది ప్రారంభంలో మొదలయ్యే అవకాశం ఉందని సమాచారం.నింజా 1100ఎస్ఎక్స్ బైక్ లిక్విడ్ కూల్డ్, 1099సీసీ ఇంజిన్ పొందుతుంది. ఇది 9000 rpm వద్ద, 136 హార్స్ పవర్ & 7600 rpm వద్ద 113 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ గేర్‌బాక్స్ పొందుతుంది. కాబట్టి ఇది దాని మునుపటి మోడల్ కంటే కూడా ఉత్తమ పనితీరును అందిస్తుందని భావిస్తున్నాము.చూడటానికి కవాసకి నింజా దాని మునుపటి మోడల్ మాదిరిగా ఉన్నప్పటికీ.. ఇది కొన్ని కాస్మొటిక్ అప్డేట్స్ పొందుతుంది. ఇందులో ట్విన్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్‌లు, షార్ప్ అండ్ అగ్రెసివ్ ఫ్రంట్ ఫెయిరింగ్ వంటివన్నీ ఉన్నాయి. ఇందులో 4.3 ఇంచెస్ TFT డిస్ప్లే ఉంటుంది. ఇది కాల్స్, ఎస్ఎమ్ఎస్ అలర్ట్ వంటి వాటిని చూపిస్తుంది. అంతే కాకుండా ఈ బైకులో క్రూయిజ్ కంట్రోల్, ట్రాక్షన్ కంట్రోల్, మల్టిపుల్ పవర్ మోడ్లు, హ్యాండిల్‌బార్ మౌంటెడ్ USB ఛార్జింగ్ పోర్ట్ వంటివి కూడా ఉన్నాయి.ఇదీ చదవండి: రూ.5 లక్షలు పెరిగిన ధర.. ఇప్పుడు ఈ కారు రేటెంతో తెలుసా?మార్కెట్లో లాంచ్ అయిన కొత్త కవాసకి నింజా 1100ఎస్ఎక్స్ బైకుకు ప్రత్యక్ష ప్రత్యర్థులు లేదు. అయితే ధర పరంగా ట్రయంఫ్ రోడ్-బియాస్డ్ టైగర్ 900 జీటీ పోటీపడుతోంది. కాగా ఈ బైక్ కోసం కవాసకి డీలర్‌షిప్‌లలో రూ. 50,000 టోకెన్ మొత్తంతో బుక్ చేసుకోవచ్చు. -
2025లో లాంచ్.. ఇప్పుడే సిద్దమైన డుకాటీ
ప్రముఖ బైక్ తయారీ సంస్థ 'డుకాటీ' సరికొత్త మల్టిస్ట్రాడా వీ2, వీ2 ఎస్ బైకులను లాంచ్ చేయడానికి సిద్ధమైంది. కంపెనీ ఈ బైకులను వచ్చే ఏడాది (2025) లాంచ్ చేయనున్నట్లు సమాచారం.2025లో లాంచ్ కానున్న కొత్త డుకాటీ మల్టీస్ట్రాడా వీ2 బైక్.. దాని మునుపటి మోడల్స్ కంటే కూడా 18 కేజీల తక్కువ బరువుతో ఉంటుంది. ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ 19 లీటర్లు. ఇందులోని 890 సీసీ ఇంజిన్ 115.6 హార్స్ పవర్, 92.1 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ స్లిప్పర్ క్లచ్ అండ్ బైడైరెక్షనల్ క్విక్‌షిఫ్టర్‌తో 6 స్పీడ్ గేర్‌బాక్స్ పొందుతుంది.కొన్ని కాస్మొటిక్ అప్డేట్స్ కాకుండా డిజైన్, ఫీచర్స్ వంటివన్నీ రెండింటిలోనూ ఒకే విధంగా ఉన్నప్పటికీ.. ఎస్ వేరియంట్ ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ యూనిట్. ఈ బైక్ ముందు భాగంలో 120/70-ఆర్19 టైర్, వెనుక 170/60-ఆర్19 టైర్లు ఉన్నాయి. ఇందులో 320 మిమీ ఫ్రంట్ డిస్క్‌లు, వెనుక 265 మిమీ రియర్ డిస్క్ ఉన్నాయి.మల్టీస్ట్రాడా వీ2 ట్రాక్షన్ కంట్రోల్, రైడింగ్ మోడ్లు, స్విచబుల్ డ్యూయల్ ఛానల్ ఏబీఎస్, పవర్ మోడ్లు, ఇంజిన్ బ్రేకింగ్ కంట్రోల్‌తో కూడిన సరికొత్త ఎలక్ట్రానిక్స్ వంటివన్నీ ఉన్నాయి. ఈ ఎలక్ట్రానిక్స్ అన్నీ 5 ఇంచెస్ టీఎఫ్టీ డిస్ప్లేలో కనిపిస్తాయి. ప్రస్తుతం కంపెనీ ఈ బైక్ ధరలను వెల్లడించలేదు. అయితే ధరలు రూ. 16 లక్షల కంటే ఎక్కువ ఉండొచ్చని సమాచారం. -
కేటీఎం దూకుడు.. ఒకేసారి మార్కెట్లోకి 10 కొత్త బైక్‌లు
న్యూఢిల్లీ: ప్రీమియం బైక్స్ తయారీలో ఉన్న ఆస్ట్రియన్ కంపెనీ కేటీఎం పూర్తి స్థాయిలో ఉత్పత్తులను అందించడం ద్వారా భారత్‌లో తన మార్కెట్ ఉనికిని పెంచుకోవాలని చూస్తోంది. నాలుగు విభాగాల్లో అంతర్జాతీయంగా లభించే 10 కొత్త బైక్స్‌ను భారత మార్కెట్లో కంపెనీ ప్రవేశపెట్టింది. వీటి ధరలు రూ.4.75 లక్షలతో మొదలై రూ.22.96 లక్షల వరకు ఉంది.‘అంతర్జాతీయంగా కొన్నేళ్లుగా కేటీఎం అమ్మకాలను పెంచుకోగలిగింది. ప్రత్యేకించి బజాజ్ ఆటోతో భాగస్వామ్యం తర్వాత ఎగుమతులు అధికం అయ్యాయి. మహారాష్ట్ర చకన్లోని బజాజ్ ప్లాంటులో తయారైన బైక్స్‌ను 120కిపైగా దేశాలకు ఎగుమతి చేస్తోంది. గత ఏడాది కంపెనీ ప్రపంచవ్యాప్తంగా 3.7 లక్షల మోటార్‌సైకిళ్లను విక్రయించింది’ అని కేటీఎం–స్పోర్ట్మోటార్సైకిల్ జీఎంబీహెచ్ ఆసియా, పసిఫిక్, మిడిల్–ఈస్ట్, ఆఫ్రికా సేల్స్ వైస్ ప్రెసిడెంట్ పీటర్ పెర్బెర్స్లాగర్ తెలిపారు.ఇదీ చదవండి: మూడు ‘హీరో’ బైక్‌లు లాంచ్‌కు రెడీఅమ్మకాలలో భారత్ వాటా 40 శాతమని, ఇక్కడి మార్కెట్లో అపార అవకాశాలు ఉన్నాయని చెప్పారు. ఇప్పటి వరకు కంపెనీ పూర్తి ఉత్పత్తి శ్రేణిని దేశీయంగా అందించలేదని వివరించారు. చకన్ ప్లాంటు నుంచి 500 సీసీలోపు సామర్థ్యంగల 12 లక్షల యూనిట్ల కేటీఎం బైక్‌లు ఎగుమతి అయ్యాయి.కొత్త బైక్‌లు ఇవే..అడ్వెంచర్ టూరర్ మోటార్‌సైకిల్ సెగ్మెంట్లో 1290 సూపర్ అడ్వెంచర్ ఎస్ (రూ. 22.74 లక్షలు), 890 అడ్వెంచర్ ఆర్ (రూ. 15.80 లక్షలు), ఎండ్యూరో మోటార్‌సైకిల్ శ్రేణిలో 350 EXC-F (రూ. 12.96 లక్షలు), మోటోక్రాస్ విభాగంలో 450 SX-F (రూ. 10.25 లక్షలు), 250 SX-F (రూ. 9.58 లక్షలు), 85 SX (రూ. 6.69 లక్షలు), 65 SX (రూ. 5.47 లక్షలు), 50 SX (రూ. 4.75 లక్షలు). -
EICMA 2024 : కళ్ళు చెదిరే సరికొత్త బైకులు.. చూస్తే మతిపోవాల్సిందే! (ఫోటోలు)
-
ఇదే మంచి తరుణం.. ప్రీమియం బైక్‌లపై భారీ డిస్కౌంట్లు
పండుగ సీజన్లో మంచి ప్రీమియం బండి కొనాలనుకుంటున్నవారికి ఇదే మంచి సమయం. జావా యెజ్డీ మోటార్‌సైకిల్స్ తమ బైక్‌లపై పలు ఆఫర్లను ప్రకటించింది. జావా/యెజ్డీ బండిని ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ నుండి బుక్ చేసుకుంటే వివిధ బ్యాంకులు అందించే డిస్కౌంట్లతో పాటు రూ.22,500 వరకు ఆదా చేసుకోవచ్చు.ఫ్లిప్‌కార్ట్‌లో జావా/యెజ్డీ బైక్‌లపై ఎలాంటి ఆఫర్లు ఉన్నాయంటే.. ఉదాహరణకు హెచ్డీఎఫ్సీ క్రెడిట్ కార్డ్ హోల్డర్లు రూ.8,500 తగ్గింపును పొందవచ్చు. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ వినియోగదారులు రూ. 12,500 నుండి రూ.22,500 వరకు స్ట్రెయిట్ అప్ డిస్కౌంట్‌తోపాటు రూ.10,000 క్యాష్‌బ్యాక్ పొందవచ్చు.జావా యెజ్డీ మోటార్‌సైకిళ్లపై కంపెనీ ప్రాంతాలవారీగానూ ఆఫర్లను అందిస్తోంది. దేశంలోని దక్షిణ, మధ్య, పశ్చిమ ప్రాంతాల్లోని కస్టమర్లు రూ.19,000 వరకు ప్రయోజనాలను పొందవచ్చు. ఇందులో రూ. 10,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ , నాలుగు సంవత్సరాల లేబర్-ఫ్రీ పీరియాడిక్ సర్వీస్, నాలుగేళ్లు లేదా 50,000 కి.మీ వారంటీ ఉన్నాయి.తూర్పు ప్రాంత కస్టమర్లకు రూ.14,000 విలువైన ప్రయోజనాలను అందిస్తోంది. రూ.10,000 ఎక్స్ఛేంజ్ బోనస్‌తో పాటు రూ.1,500 విలువైన రోడ్ సైడ్ అసిస్టెన్స్, రూ.2,500 విలువైన యాక్సెసరీలను పొందవచ్చు. ఇక ఉత్తర భారతదేశంలోని కస్టమర్లకు రూ.10,000 ఎక్స్చేంజ్ బోనస్ లభిస్తుంది. దీంతోపాటు సులభమైన ఫైనాన్స్ ఆఫర్లు కూడా అందిస్తున్నారు. కొత్త యెజ్డీ అడ్వెంచర్‌ని కొనుగోలు చేసేవారు రూ.16,000 విలువైన ట్రయల్ ప్యాక్ యాక్సెసరీస్ ప్యాకేజీని ఉచితంగా అందుకోవచ్చు. -
భారత్‌లో కొత్త బైక్ లాంచ్: ఆనంద్ మహీంద్రా ట్వీట్
ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా (Anand Mahindra) తన సోషల్ మీడియా ఖాతాలో ఓ బైక్ వీడియో షేర్ చేసారు. ఇది ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన వీడియోలో బీఎస్ఏ మోటార్‌సైకిల్స్ కంపెనీకి చెందిన గోల్డ్ స్టార్ 650 బైక్ కనిపిస్తోంది. ఈ బైక్ వీడియో షేర్ చేస్తూ వెల్కమ్ బ్యాక్ అంటూ ట్వీట్ చేశారు. లక్షల మందిని మెప్పించిన ఈ వీడియోపై పలువురు నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు.బీఎస్ఏ గోల్డ్ స్టార్ 650మహీంద్రా గ్రూప్‌నకు చెందిన మోటార్‌సైకిల్స్ బ్రాండ్ బీఎస్ఏ దశాబ్దాల తరువాత భారత్‌లో అడుగుపెట్టింది. గోల్డ్ స్టార్ 650 పేరుతో లాంచ్ అయిన కొత్త బైక్ ధరలు రూ. 2.99 లక్షల నుంచి రూ. 3.34 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఇది 652 సీసీ ఇంజిన్ కలిగి 45.6 పీఎస్ పవర్, 55 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 5 స్పీడ్ ట్రాన్స్‌మిషన్‌తో వస్తుంది.Welcome back….#TheGreatestSingleOfAllTime #LegendIsHere #BSAgoldstar pic.twitter.com/03a66g8YHg— anand mahindra (@anandmahindra) August 20, 2024 -
వరల్డ్ ఫస్ట్ సీఎన్జీ బైక్.. లాంచ్ ఎప్పుడంటే?
బజాజ్ కంపెనీ లాంచ్ చేయనున్న సీఎన్జీ బైక్ ఈ నెల 18న లాంచ్ అవుతుందని గతంలో వెల్లడైంది. అయితే ఈ డేట్ ఇప్పుడు జూలై 5కి మారింది. ఇప్పటి వరకు ప్రపంచ మార్కెట్లో సీఎన్జీ బైక్ లేదు.బజాజ్ లాంచ్ చేయనున్న ఈ కొత్త సీఎన్జీ 125 సీసీ విభాగంలో లాంచ్ అవుతుంది. కంపెనీ లాంచ్ చేయనున్న ఈ బైక్ పేరు 'బ్రూజర్' అని తెలుస్తోంది. ఈ బైక్ సీఎన్జీ, పెట్రోల్‌తో నడిచే ప్రపంచంలోనే మొదటి ప్రొడక్షన్ స్పెక్ మోటార్‌సైకిల్. ఇది చూడటానికి సింపుల్ డిజైన్ కలిగి ఉన్నప్పటికీ.. వాహన వినియోగదారులకు కావాల్సిన అన్ని ఫీచర్స్ అందుబాటులో ఉంటాయి.భారతదేశంలో ఇంధన ధరలు రోజు రోజుకి పెరుగుతున్నాయి. పెట్రోల్ ధరలతో పోలిస్తే.. సీఎన్జీ ధరలు తక్కువ. కాబట్టి దేశీయ మార్కెట్లో సీఎన్జీ బైక్ లాంచ్ అనేది ఆటోమొబైల్ చరిత్రలో ఓ సంచలనం సృష్టిస్తుందనే చెప్పాలి. ఈ బైకుకు సంబంధించిన మరిన్ని వివరాలు జూలై 5న వెల్లడయ్యే అవకాశం ఉంది. -
రూ.20.95 లక్షల బీఎండబ్ల్యూ బైక్ లాంచ్ - పూర్తి వివరాలు
భారతీయ విఫణిలో బీఎండబ్ల్యూ మోటోరాడ్ తన 'ఆర్ 1300 జీఎస్' బైకును లాంచ్ చేసింది. కంపెనీ లాంచ్ చేసిన ఈ బైక్ ధర రూ. 20.95 లక్షలు (ఎక్స్ షోరూమ్, ఇండియా). ఇది ఇప్పటికే మార్కెట్లో అందుబాటులో ఉన్న బీఎండబ్ల్యూ ఆర్ 1250 జీఎస్ కంటే రూ. 40000 ఎక్కువ.కొత్త బీఎండబ్ల్యూ ఆర్ 1300 జీఎస్ బైక్ 1300 సీసీ లిక్విడ్ కూల్డ్ బాక్సర్ ట్విన్ ఇంజన్ పొందుతుంది. ఇది 7750 rpm వద్ద 143.5 Bhp పవర్, 6500 rpm వద్ద 149 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ గేర్‌బాక్స్‌తో లభిస్తుంది. పవర్, టార్క్ అనేవి దాని మునుపటి మోడల్ కంటే ఎక్కువ.బీఎండబ్ల్యూ ఆర్ 1300 జీఎస్ బైక్ చూడటానికి దాని ఆర్ 1300 జీఎస్ మాదిరిగానే ఉంటుంది. కానీ కొన్ని అప్డేటెడ్ మార్పులను చూడవచ్చు. ఇందులో రీడిజైన్ ఫ్రంట్, ఎల్ఈడీ డీఆర్ఎల్, ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్, స్టీల్ షీట్-మెటల్ ఫ్రేమ్ వంటివి ఉన్నాయి. వీటితో పాటు ఈ బైకులో 6.5 ఇంచెస్ ఫుల్ కలర్ TFT స్క్రీన్, మల్టిపుల్ రైడింగ్ మోడ్స్ పొందుతుంది.సుమారు 237 కేజీల బరువున్న ఈ ఆర్ 1300 జీఎస్.. తక్కువ హైట్ ఉన్న సీటును పొందుతుంది. పొట్టిగా ఉన్న రైడర్లకు కూడా ఇది ఉత్తమ రైడింగ్ అనుభూతిని అందిస్తుంది. ఇది ట్రయంఫ్ టైగర్ 1200 జిటి ప్రో, హార్లీ-డేవిడ్సన్ పాన్ అమెరికా 1250 వంటి బైకులకు ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది.Let's set the pace together. The all-new BMW R 1300 GS starts at an introductory price of INR 20.95 Lakhs*.Have you booked yours? ⬇️https://t.co/NIhvPAPFXK#r1300gs #1300gs #bmw1300gs #pricelaunch #adventurebike #kingofadventure #bmwmotorradlndia #makelifearide pic.twitter.com/Pl9KOODGs0— BMWMotorrad_IN (@BMWMotorrad_IN) June 13, 2024 -
ఇండియన్ మార్కెట్లో రూ.20.98 లక్షల బైక్ లాంచ్ - వివరాలు
ప్రముఖ బైక్ తయారీ సంస్థ 'డుకాటీ ఇండియా' దేశీయ మార్కెట్లో కొత్త 'పానిగేల్ వీ2' బైకును బ్లాక్ కలర్ ఆప్షన్లో లాంచ్ చేసింది. ఈ బైక్ ధర రూ. 20.98 లక్షలు (ఎక్స్ షోరూమ్). దీని ధర దాని మునుపటి మోడల్ కంటే కూడా రూ. 30000 ఎక్కువ. ఇప్పటికే కంపెనీ ఈ బైక్ కోసం బుకింగ్స్ స్వీకరించింది. డెలివరీలు త్వరలోనే ప్రారంభమవుతాయి.కొత్త డుకాటీ పానిగేల్ వీ2 బ్లాక్ ఫెయిరింగ్ పొందటమే కాకుండా.. ఫ్యూయల్ ట్యాంక్ మీద, వీల్స్ మీద, వెనుక భాగంలో రెడ్ కలర్ స్కీమ్ చూడవచ్చు. డిజైన్ దాదాపు దాని మునుపటి మోడల్ మాదిరిగానే ఉంటుంది. కాబట్టి అదే కన్ను మాదిరిగా ఉండే ఎల్ఈడీ డీఆర్ఎల్, ట్విన్ హెడ్‌ల్యాంప్ వంటివి ఉన్నాయి.పానిగేల్ వీ2 బైక్ అదే 995 సీసీ లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ పొందుతుంది. ఇది 10750 rpm వద్ద 155 Bhp పవర్, 9000 rpm వద్ద 104 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది. ఈ బైక్ 43 మిమీ ఫుల్లీ అడ్జస్టబుల్ షోవా యూఎస్డీ ఫ్రంట్ ఫోర్క్స్, వెనుకవైపు ఫుల్లీ అడ్జస్టబుల్ మోనోషాక్ పొందుతుంది. బ్రేకింగ్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది.మల్టిపుల్ రైడింగ్ మోడ్స్ కలిగిన ఈ బైక్.. కార్నరింగ్ ఏబీఎస్, ట్రాక్షన్ కంట్రోల్, ఇంజన్ బ్రేక్ కంట్రోల్ వంటి వాటితో పాటు.. పైరెల్లీ డయాబ్లో రోస్సో కోర్సా II టైర్లను కలిగి 17 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ పొందుతుంది. ఈ బైక్ రైడర్లకు అత్యుత్తమ రైడింగ్ అనుభూతిని అందిస్తుంది. -
జూన్ 13న లాంచ్ అయ్యే బీఎండబ్ల్యూ బైక్ ఇదే - వివరాలు
ఖరీదైన బైకులను లాంచ్ చేసే బీఎండబ్ల్యూ మోటోరాడ్ సరికొత్త 'ఆర్ 1300 జీఎస్'ను జూన్ 13న లాంచ్ చేయడానికి సిద్ధమైంది. కంపెనీ లాంచ్ చేయనున్న ఈ బైక్ ఆధునిక హంగులతో, అద్భుతమైన పనితీరును అందించడానికి కావాల్సిన ఇంజిన్ ఆప్షన్ పొందనున్నట్లు తెలుస్తోంది.బీఎండబ్ల్యూ ఆర్ 1300 జీఎస్ బైక్ మంచి డిజైన్, ఫీచర్స్ పొందుతుంది. ఇందులో ట్విన్ పాడ్ హెడ్‌లైట్, ఎల్ఈడీ డీఆర్ఎల్ వంటివి ఉంటాయి. ఈ బైక్ దాని మునుపటి మోడల్స్ మాదిరిగానే స్టాండర్డ్ రైడింగ్ మోడ్లు, ఎలక్ట్రానిక్ సస్పెన్షన్, ట్రాక్షన్ కంట్రోల్, క్రూయిజ్ కంట్రోల్ పొందుతుంది.బీఎండబ్ల్యూ ఆర్ 1300 జీఎస్ 1300 సీసీ ట్విన్ సిలిండర్ ఇంజన్ పొందుతుంది. ఇది 7750 rpm వద్ద 145 Bhp పవర్, 6500 rpm వద్ద 149 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ గేర్‌బాక్స్‌తో లభిస్తుంది.త్వరలో లాంచ్ కానున్న కొత్త బీఎండబ్ల్యూ ఆర్ 1300 జీఎస్ బైక్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్, BMW రాడార్ అసిస్టెడ్ క్రూయిజ్ కంట్రోల్, మల్టిపుల్ రైడ్ మోడ్లు, ట్రాక్షన్ కంట్రోల్, స్విచ్ చేయగల ఏబీఎస్ వంటి అనేక ఫీచర్స్ ఉన్నాయి. ఈ బైక్ ధర రూ. 20 లక్షల కంటే ఎక్కువ ధర వద్ద లాంచ్ అవుతుందని సమాచారం. ఖచ్చితమైన ధరలు లాంచ్ సమయంలో వెల్లడవుతాయి. -
ప్రపంచంలో మొదటి సీఎన్జీ బైక్ ఇదే.. ఆటోమొబైల్ చరిత్రలో నవశకం
దశాబ్దాల క్రితం డీజిల్ బైకులు వినియోగంలో ఉండేవి. ఆ తరువాత పెట్రోల్ బైకులు వచ్చాయి. ఇప్పుడు ఎలక్ట్రిక్ బైకులు అందుబాటులో ఉన్నాయి. కాగా.. త్వరలో సీఎన్జీ బైక్ లాంచ్ అవ్వడానికి సిద్ధమైంది.ప్రస్తుతం భారతీయ విఫణిలో సీఎన్జీతో నడిచే వాహనాల జాబితాలో కార్లు, ఆటో రిక్షాలు మాత్రమే ఉన్నాయి. ఇప్పటి వరకు సీఎన్జీ బైకులు ప్రపంచ మార్కెట్లో అడుగుపెట్టలేదు. కాబట్టి బజాజ్ ఆటో సీఎన్జీ బైక్ లాంచ్ చేసి.. నవ శకానికి నాంది పలకడానికి సన్నద్ధమవుతోంది. కంపెనీ లాంచ్ చేయనున్న కొత్త సీఎన్జీ బైక్ కోసం ఇప్పటికే ట్రేడ్‌మార్క్‌ను కూడా దాఖలు చేసింది.బజాజ్ కంపెనీ లాంచ్ చేయనున్న సీఎన్జీ బైకును ఈ నెల (జూన్ 18) అధికారికంగా పరిచయం చేయనుంది. లాంచ్‌కు సిద్దమవుతున్న ఈ బైక్‌కు 'ఫైటర్' అని నామకరణం చేశారు. బజాజ్ కంపెనీ గత కొంత కాలంగా ఈ సీఎన్జీ బైక్ మీద పనిచేస్తోంది. త్వరలో దీనిని అధికారికంగా ఆవిష్కరించడానికి సిద్ధమైంది.ఇప్పటికే అనేక సార్లు టెస్టింగ్ దశలో కనిపించిన బజాజ్ సీఎన్జీ బైక్ హాలోజన్ టర్న్ ఇండికేటర్లు, టెలిస్కోపిక్ ఫోర్క్‌లు, సస్పెన్షన్ డ్యూటీల కోసం మోనోషాక్ యూనిట్ వంటి వాటితోపాటు మల్టీ స్పోక్ అల్లాయ్ వీల్స్, సింగిల్ పీస్ సీటు, డిస్క్ & డ్రమ్ బ్రేక్ యూనిట్ పొందనున్నట్లు సమాచారం. -
రూ. 82911లకే కొత్త బైక్.. 73 కిమీ మైలేజ్
హీరోమోటోకార్ప్ కంపెనీ దేశీయ మార్కెట్లో ఎట్టకేలకు సరికొత్త స్ప్లెండర్ ప్లస్ XTEC 2.0 లాంచ్ చేసింది. కంపెనీ ఎవర్గ్రీన్ కమ్యూటర్ యొక్క 30వ వార్షికోత్సవాన్ని జరుపుకునే సందర్భంగా ఈ బైకును రూ. 82911 (ఎక్స్ షోరూమ్) ధర వద్ద లాంచ్ చేసింది.కొత్త హీరో స్ప్లెండర్ ప్లస్ 97.2 సీసీ ఎయిర్ కూల్డ్ ఇంజిన్ పొందుతుంది. ఇది 8000 rpm వద్ద 8.02 hp పవర్, 6000 rpm వద్ద 8.05 Nm టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 4 స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. ఇది ఒక లీటరుకు ఏకంగా 73 కిమీ మైలేజ్ అందిస్తుంది.డ్యూయల్ టోన్ కలర్ స్కీమ్ పొందిన ఈ బైక్ దాని మునుపటి మోడల్ కంటే కూడా చాలా అద్భుతమైన డిజైన్ పొందుతుంది. అంతే కాకుండా ఇందులో డిజిటల్ డిస్ప్లే.. బ్లూటూత్ కనెక్టివిటీకి సపోర్ట్ చేస్తుంది. ఇందులో USB ఛార్జింగ్ పోర్ట్ కూడా ఉంటుంది.డిజైన్, ఫీచర్స్ పరంగా ఉత్తమంగా ఉన్న ఈ బైక్ దాని స్టాండర్డ్ XTEC మోడల్ కంటే కూడా రూ. 3000 ఎక్కువ ధర వద్ద అందుబాటులో ఉంటుంది. ఇది దేశీయ మార్కెట్లో ఉఇప్పటికే అమ్మకానికి ఉన్న హోండా షైన్ 100, బజాజ్ ప్లాటినా 100 వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది. -
రూ.45 లక్షల బీఎండబ్ల్యూ బైక్ - పూర్తి వివరాలు
'బీఎండబ్ల్యూ మోటొరాడ్' దేశీయ మార్కెట్లో సరికొత్త 'ఎమ్ 1000 ఎక్స్ఆర్' బైక్ లాంచ్ చేసింది. దీని ధర రూ. 45 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఇప్పటికే భారతీయ విఫణిలో అందుబాటులో ఉన్న అత్యంత ఖరీదైన బైకుల జాబితాలో ఇది కూడా ఒకటిగా చేరింది. ఇది సీబియూ మార్గం ద్వారా ఇండియాకు దిగుమతి అవుతాయి. ఈ బైక్ బుక్ చేసుకుంటే డెలివరీలు జూన్ నుంచి ప్రారంభమవుతాయి.మంచి డిజైన్ కలిగిన ఈ బైక్, లేటెస్ట్ ఫీచర్స్ పొందుతుంది. ఇందులో 6.5 ఇంచెస్ టీఎఫ్టీ డిస్ప్లే ఉంటుంది. అంతే కాకుండా ట్రాక్షన్ కంట్రోల్, క్రూయిజ్ కంట్రోల్, వీలీ కంట్రోల్, బ్రేక్ స్లైడ్ అసిస్ట్ ఫంక్షన్, లాంచ్ కంట్రోల్ మరియు పిట్ లేన్ లిమిటర్ ఫంక్షన్లు వంటి అనేక ఫీచర్స్ ఇందులో ఉన్నాయి.బీఎండబ్ల్యూ ఎమ్ 1000 ఎక్స్ఆర్ బైక్ 999సీసీ ఇన్లైన్ ఫోర్ సిలిండర్ ఇంజిన్ పొందుతుంది. ఇది 199 Bhp పవర్ మరియు 113 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ బై-డైరెక్షనల్ క్విక్‌షిఫ్టర్‌తో 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది. ఇది కేవలం 3.2 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం వాడుతుంది. ఈ బైక్ టాప్ స్పీడ్ గంటకు 278 కిమీ కావడం గమనార్హం. ఇందులో రెయిన్, రోడ్, డైనమిక్, డైనమిక్ ప్రో మరియు రేస్ ప్రో మోడ్ అనే ఐదు రైడింగ్ మోడ్లు ఉన్నాయి. -
రూ.1.32 లక్షల కవాసకి బైక్ - వివరాలు
భారతీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన జపనీస్ బైక్ తయారీ సంస్థ కవాసకి.. ఎట్టకేలకు దేశీయ విఫణిలో ఓ సరికొత్త బైక్ లాంచ్ చేసింది. ఈ బైక్ దాని మునుపటి మోడల్స్ కంటే తక్కువ ధర వద్ద అందుబాటులో ఉంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఇండియన్ మార్కెట్లో విడుదలైన కొత్త కవాసకి బైక్ పేరు 'డబ్ల్యూ175 స్టీట్'. దీని ధర రూ. 1.35 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఇది దాని స్టాండర్డ్ మోడల్ కంటే కూడా రూ. 12000 తక్కువ ధరకే లభిస్తుంది. బుకింగ్స్, డెలివరీలకు సంబంధించిన వివరాలు కంపెనీ అధికారికంగా వెల్లడించలేదు. సింపుల్ డిజైన్ కలిగిన ఈ బైక్ బ్లాక్-అవుట్ ఫినిషింగ్‌లతో చూడటానికి ఆకర్షణీయంగా ఉంటుంది. ఇందులో 177 సీసీ ఎయిర్-కూల్డ్ సింగిల్-సిలిండర్ ఇంజన్ ఉంటుంది. ఇది 13 హార్స్ పవర్, 13.2 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. పనితీరు పరంగా అద్భుతంగా ఉండవచ్చని తెలుస్తోంది. ఇదీ చదవండి: ఈ బైక్ కొనుగోలుపై రూ.60,000 డిస్కౌంట్.. కవాసకి డబ్ల్యూ175 స్టీట్ బైక్ హాలోజన్ హెడ్‌లైట్, అనలాగ్ ఇన్స్ట్రుమెంటేషన్ వంటివి పొందుతుంది. డిజైన్, ఫీచర్స్ పరంగా అద్భుతంగా ఉన్న ఈ బైక్ తక్కువ ధర వద్ద విడులవడంతో మంచి అమ్మకాలను పొందుతుందని భావిస్తున్నారు. -
ఈ వారం భారత్‌లో విడుదలైన కొత్త బైకులు ఇవే!
పండుగ సీజన్ తరువాత కూడా భారతీయ మార్కెట్లో కొత్త బైకులు విడుదలవుతూనే ఉన్నాయి. బెంగళూరుకు చెందిన కంపెనీ ఓ ఎలక్ట్రిక్ బైక్ లాంచ్ చేయగా, చెన్నైకు చెందిన రాయల్ ఎన్ఫీల్డ్ రెండు కొత్త బైకులను లాంచ్ చేసింది. ఈ లేటెస్ట్ బైక్స్ ధరలు, ఇతర వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. రాయల్ ఎన్ఫీల్డ్ షాట్‌గన్ 650 దేశీయ బైక్ తయారీ దిగ్గజం రాయల్ ఎన్ఫీల్డ్ ఇటీవల 650 సీసీ విభాగంలో ఓ స్టైలిష్ బైక్ లాంచ్ చేసింది. రూ. 4.25 లక్షల ధర వద్ద లభించే ఈ బైక్ కేవలం 25 యూనిట్లకు మాత్రమే పరిమితం చేశారు. 648 సీసీ ప్యారలల్ ట్విన్ ఇంజిన్ కలిగిన ఈ బైక్ మంచి మీటియోర్ లాంటి డిజైన్ కలిగి 47 హార్స్ పవర్, 52.3 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుందని తెలుస్తోంది. 2024 హిమాలయన్ భారతదేశంలో ప్రారంభం నుంచి మంచి అమ్మకాలతో ముందుకు సాగుతున్న రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ ఇప్పుడు సరోకొత్త మోడల్‌గా మార్కెట్లో విడుదలైంది. ఈ లేటెస్ట్ బైక్ ధరలు రూ.2.69 లక్షల నుంచి రూ.2.79 లక్షల మధ్య ఉంటాయి. ఈ ధరలు 2023 డిసెంబర్ 31 వరకు మాత్రమే చెల్లిబాటు అవుతాయి. ఆ తరువాత ధరలు పెరిగే అవకాశం ఉంది. 2024 హిమాలయన్ లిక్విడ్ కూల్డ్, 452 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజన్ కలిగి 40 హార్స్ పవర్ మరియు 40 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ స్లిప్ అండ్ అసిస్ట్ క్లచ్‌తో 6 స్పీడ్ గేర్‌బాక్స్ పొందుతుంది. కాబట్టి అద్భుతమైన పర్ఫామెన్స్ చూడవచ్చు. ఇదీ చదవండి: నెలకు రూ.9 లక్షలు సంపాదిస్తున్న అందగత్తె.. కానీ ఈమె.. ఓర్క్సా మాంటిస్ ఎలక్ట్రిక్ బైక్ బెంగళూరుకు చెందిన ఎలక్ట్రిక్ బైక్ తయారీ సంస్థ 'ఓర్క్సా ఎనర్జీ' (Orxa Energy).. దేశీయ విఫణిలో 'మాంటీస్ ఎలక్ట్రిక్' (Mantis Electric) బైక్ లాంచ్ చేసింది. దీని ధర రూ. 3.6 లక్షలు (ఎక్స్-షోరూమ్, బెంగళూరు). కేవలం ఒకే వేరియంట్లో లభించే ఈ బైక్ 1.3 కిలోవాట్ ఛార్జర్ పొందుతుంది. కేవలం 8.9 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతమయ్యే ఈ బైక్ ఒక ఫుల్ ఛార్జ్‌తో 221 కిమీ రేంజ్ అందిస్తుందని తెలుస్తోంది. అల్ట్రావయోలెట్ ఎలక్ట్రిక్ బైకులకు ప్రధాన ప్రత్యర్థిగా ఉండే 'మాంటీస్ ఎలక్ట్రిక్' 182 కేజీల బరువును కలిగి అద్భుతమైన పనితీరుని అందిస్తుందని కంపెనీ వెల్లడించింది. చూడగానే ఆకర్శించే డిజైన్ కలిగిన ఈ బైక్ లేటెస్ట్ ఫీచర్స్ కలిగి వినియోగదారులకు ఉత్తమ రైడింగ్ అనుభవాన్ని అందిస్తుందని సంస్థ తెలిపింది. -
మార్కెట్లో విడుదలైన కొత్త బైకులు ఇవే!
భారతదేశంలో పండుగ సీజన్ మొదలైపోయింది. ఈ తరుణంలో చాలామంది కొత్త వాహనాలను కొనుగోలు చేయాలని చాలా ఆసక్తి కనపరుస్తారు. అలాంటి వారికోసం ఈ కథనంలో ఈ వారంలో మార్కెట్లో అడుగుపెట్టిన బైకుల గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. హోండా సీబీ300ఎఫ్ (Honda CB300F) హోండా మోటార్‌సైకిల్ ఇండియా పండుగ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని అప్డేటెడ్ 'సీబీ300ఎఫ్' బైక్ లాంచ్ చేసింది. ఈ బైక్ ధర రూ. 1.70 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఈ బైక్ దేశవ్యాప్తంగా ఉన్న బిగ్‌వింగ్ డీలర్‌షిప్‌లలో అందుబాటులో ఉంటాయి. ఈ బైక్ 293 సీసీ ఆయిల్-కూల్డ్ SOHC ఇంజన్ కలిగి 24 హార్స్ పవర్ అండ్ 25.6 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇది స్లిప్-అండ్-అసిస్ట్ క్లచ్‌తో 6-స్పీడ్ సీక్వెన్షియల్ గేర్‌బాక్స్‌తో లభిస్తుంది. 14.1 లీటర్ల ఫ్యూయెల్ కెపాసిటీ కలిగిన ఈ బైక్ లాంగ్ రైడ్ చేయడానికి కూడా అనుకూలంగా ఉంటుంది. ఇది కేవలం 7.94 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతమవుతుంది. కవాసకి నింజా జెడ్ఎక్స్-4ఆర్ (Kawasaki Ninja ZX-4R) ఇప్పటికే మార్కెట్లో మంచి ప్రజాదరణతో ముందుకు సాగుతున్న కవాసకి ఇప్పుడు ఎట్టకేలకు 'నింజా జెడ్ఎక్స్-4ఆర్' లాంచ్ చేసింది. దీని ధర రూ. 8.49 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఇండియా). ధర ఎక్కువైనా అద్భుతమైన రైడింగ్ అనుభూతిని అందిస్తుంది. కవాసకి నింజా జెడ్ఎక్స్-4ఆర్ 399 సీసీ లిక్విడ్-కూల్డ్ ఇన్లైన్-ఫోర్ ఇంజిన్ కలిగి సిక్స్-స్పీడ్ గేర్‌బాక్స్‌తో స్లిప్పర్ క్లచ్‌తో లభిస్తుంది. ఈ ఇంజిన్ 14,500 ఆర్పీఎమ్ వద్ద 76 బీహెచ్పీ పవర్ & 13,000 ఆర్పీఎమ్ వద్ద 39 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇదీ చదవండి: మహిళలకు శుభవార్త! గ్యాస్ స్టవ్‌తో పాటు ఫ్రీ సిలిండర్ పొందండిలా.. న్యూ కేటిఎమ్ 390 డ్యూక్ (New KTM 390 Duke) యువ రైడర్లకు ఎంతగానో ఇష్టమైన కేటిఎమ్ ఇప్పుడు మరో కొత్త బైక్ రూపంలో (న్యూ కేటిఎమ్ 390 డ్యూక్) దేశీయ మార్కెట్లో అడుగుపెట్టింది. ఈ బైక్ ధర రూ. 3,10,520 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ). ఈ బైక్ దాని మునుపటి మోడల్స్ కంటే కూడా పెద్ద ఇంజిన్ పొందుతుంది. కావున ఇందులో 399 సీసీ ఉంటుంది. ఇది 45 హార్స్ పవర్, 39 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. కంపెనీ ఈ బైక్ కోసం ఇప్పటికే బుకింగ్స్ స్వీకరించడం మొదలుపెట్టింది. డెలివరీలు ఈ నెల చివరి నాటికి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. -
విడుదలకు సిద్దమవుతున్న కొత్త బైకులు, ఇవే!
Upcoming Bikes: 2023 ఆగష్టు నెల ముగిసింది.. గత నెలలో హీరో కరీజ్మా ఎక్స్ఎమ్ఆర్, టీవీఎస్ ఎక్స్ ఈ-స్కూటర్, హోండా SP160, ఓలా ఎస్1 వంటివి విడుదలయ్యాయి. కాగా ఈ నెలలో మరి కొన్ని విడుదలకావడానికి సన్నద్ధమవుతున్న బైకులు ఏవి? ఎప్పుడు లాంచ్ అవుతాయనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. టీవీఎస్ అపాచీ ఆర్ఆర్310.. దేశీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన టీవీఎస్ మోటార్స్ ఈ నెలలో అపాచీ ఆర్ఆర్310 నేక్డ్ స్ట్రీట్‌ఫైటర్ వెర్షన్‌ను విడుదల చేయనుంది. ఇది కేవలం రీబ్యాడ్జ్ బీఎండబ్ల్యూ జీ 310 ఆర్ మాత్రమే కాదు.. చూడటానికి చాలా స్టైలిష్‌గా ఉంటుంది. పనితీరు పరంగా కూడా చాలా ఉత్తమంగా ఉండే అవకాశం ఉండనై ఆశిస్తున్నాము. ఇది 2023 సెప్టెంబర్ 06న విడుదలకానున్నట్లు సమాచారం. 2024 కేటీఎమ్ 390 డ్యూక్.. యువతరానికి ఇష్టమైన కెటిఎమ్ బ్రాండ్ త్వరలో 2024 కెటిఎమ్ 390 డ్యూక్ విడుదల చేయనుంది. ఈ బైక్ 399 సీసీ ఇంజిన్ కలిగి 44.8 హార్స్ పవర్ & 39 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఈ బైక్ దాని మునుపటి మోడల్ కంటే కూడా చాలా అద్భుతంగా ఉంటుందని భావిస్తున్నాము. సుజుకి వీ-స్ట్రోమ్ 800 డీఈ.. సుజుకి మోటార్ సైకిల్ కంపెనీ ఈ నెలలో తన వీ-స్ట్రోమ్ 800 డీఈ బైక్ లాంచ్ చేయనుంది. ఇది 776 సీసీ ప్యారలల్ ట్విన్ ఇంజిన్ కలిగి మంచి పనితీరుని అందించనుంది. ఈ కొత్త 800DE ఒక ఆధునిక ఎలక్ట్రానిక్స్ సూట్ అండ్ 21 ఇంచెస్ ఫ్రంట్ వీల్‌ను కలిగి ఉంది. ఈ కొత్త బైకుకి సంబంధించిన ధరలు, ఇతర వివరాలు లాంచ్ సమయంలో అధికారికంగా విడుదలవుతాయి. -
హోండా కొత్త బైక్ ఎస్పీ160: ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయంటే!
Honda SP160 ద్విచక్ర వాహన తయారీ దిగ్గజం హోండా మోటార్‌సైకిల్, స్కూటర్ ఇండియా భారత మార్కెట్లో సరికొత్త బైక్ ఎస్పీ160 విడుదల చేసింది. ఇది హోండా యునికార్న్ , హోండా X-బ్లేడ్ తర్వాత 160cc విభాగంలో ఇది మూడో మోడల్. వీటి ఎక్స్‌షోరూంలో ధర రూ.1.17 లక్షల నుండి ప్రారంభం. రెండు ట్రిమ్స్, ఆరు రంగుల్లో లభిస్తుంది. 13 బీహెచ్పీ పవర్, 14.58 ఎన్ఎం టార్క్‌తో 162 సీసీ ప్రోగ్రామ్డ్ ఫ్యూయల్ ఇంజెక్షన్ ఇంజన్, ఫ్లాషింగ్ ఇండికేటర్ లైట్స్, పూర్తి డిజిటల్ ఇన్స్ట్రుమెంట్, సింగిల్ చానెల్ యాంటీ లాక్ బ్రేక్ సిస్టమ్, ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్, స్పోర్టీ మఫ్లర్ వంటి హంగులు ఉన్నాయి. 3 ఏళ్లు స్టాండర్డ్, ఏడేళ్లు ఆప్షనల్ వారంటీ ఉంది. వేరియంట్ వారీగా హోండా ఎస్పీ160 ధరలు (ఎక్స్-షోరూమ్, న్యూఢిల్లీ) సింగిల్ డిస్క్ - రూ. 1,17,500 డ్యూయల్ డిస్క్ - రూ. 1,21,900 -
రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి మరో బైక్ - లాంచ్ ఎప్పుడంటే?
Royal Enfield Scram 440: దేశీయ టూ వీలర్ దిగ్గజం 'రాయల్ ఎన్ఫీల్డ్' (Royal Enfield) మార్కెట్లో మరో సరికొత్త మోడల్ విడుదల చేయడానికి సన్నద్ధమైంది. ఈ బైక్ వచ్చే సంవత్సరానికి భారతీయ విఫణిలో విడుదలయ్యే అవకాశం ఉంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం, రాయల్ ఎన్ఫీల్డ్ విడుదల చేయనున్న కొత్త బైక్ స్క్రామ్ 440 మోడల్ అవుతుందని సమాచారం. అంటే ఇది ఇప్పటికే మార్కెట్లో స్క్రామ్ ఆధారంగా తయారయ్యే అవకాశం ఉంది. ఇది 411 సీసీ ఇంజిన్ కలిగి ఉండనున్నట్లు తెలుస్తోంది. ఈ ఇంజిన్ ఇప్పటికే స్క్రామ్ 411లో ఉంది. (ఇదీ చదవండి: రైతుగా మారిన బ్యాంక్ ఎంప్లాయ్.. వేలమందికి ఉపాధి - రూ. కోట్లలో టర్నోవర్!) ఈ బైక్ డిజైన్, ఫీచర్స్ వంటివి అధికారికంగా విడుదలకాలేదు, త్వరలో అందుబాటులో ఉండే అవకాశం ఉందని భావిస్తున్నాము. ఈ బైక్ స్క్రామ్ సబ్-బ్రాండ్ క్రింద ఉంటుంది. అయితే హిమాలయన్ బైక్ కంటే కూడా తక్కువ ధర వద్ద ఉంటుందని తెలుస్తోంది. రానున్న రోజుల్లో ఇండియన్ మార్కెట్లో విడుదలకానున్న బైకుల జాబితాలో రాయల్ ఎన్ఫీల్డ్ మాత్రమే కాకుండా యమహా, హోండా వంటి కంపెనీలు కూడా ఉన్నాయి. ఇవన్నీ వారి పరిధిని విస్తరిస్తూ దేశంలో ఉనికిని మరింత చాటుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. -
భారత్‌లో ట్రయంఫ్ కొత్త బైక్స్..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రీమియం బైక్స్ తయారీలో ఉన్న బ్రిటిష్ కంపెనీ ట్రయంఫ్ తాజాగా భారత మార్కెట్లో రెండు కొత్త మోడళ్లను విడుదల చేసింది. ట్రయంఫ్ స్పీడ్ 400, స్క్రాంబ్లర్ 400 ఎక్స్ వీటిలో ఉన్నాయి. బజాజ్ ఆటో, ట్రయంఫ్ సంయుక్తంగా ఈ రెండు మోడళ్లను అభివృద్ధి చేశాయి. 2017లో ఇరు సంస్థలు భాగస్వామ్యం కుదుర్చుకున్నాయి. ఎక్స్‌షోరూంలో ట్రయంఫ్ స్పీడ్ 400 ధర రూ.2.23 లక్షలు ఉంది. ఈ నెల నుంచే లభిస్తుంది. స్క్రాంబ్లర్ 400 ఎక్స్ ధర ఇంకా ప్రకటించలేదు. అక్టోబర్ నుంచి ఈ మోడల్ డెలివరీలు ఉంటాయి. పెద్ద ఎత్తున అమ్మకాలను ఆశిస్తున్నట్టు బజాజ్ ఆటో ఎండీ రాజీవ్ బజాజ్ ఈ సందర్భంగా తెలిపారు. మహారాష్ట్ర పుణే సమీపంలోని చకన్ వద్ద ఉన్న కొత్త ప్లాంటులో ఈ బైక్స్ తయారు చేస్తామన్నారు. 2024 మార్చి నాటికి 80 నగరాలు, పట్టణాల్లో ట్రయంఫ్ వరల్డ్ షోరూంలు 100కుపైగా రానున్నాయి. -
దేశీయంగా కీవే బైక్స్ తయారీ: లక్కీ కస్టమర్లకు భారీ ఆఫర్
సూపర్‌బైక్స్ బ్రాండ్ కీవే ఎస్ఆర్ 250, ఎస్ఆర్ 125 మోడళ్ల తయారీని దేశీయంగా ఈ ఏడాది నుంచి చేపట్టనున్నట్టు ఆదీశ్వర్ ఆటో రైడ్ ఇండియా ప్రకటించింది. ఇటీవలే ప్రీమియం సెగ్మెంట్లో నాన్-రెట్రో మోటార్‌సైకిళ్లను ప్రవేశపెట్టింది కీవే. ఢిల్లీఎక్స్షోరూంలో పరిచయ ఆఫర్ ధర ఎస్ఆర్ 250 రూ.1.49 లక్షలు వద్ద అందుబాటులో ఉంటుంది. రూ.2,000కి బుక్ చేసుకోవచ్చు. ఇక ఎస్ఆర్ 125 రూ.1.19 లక్షలుగా ఉంది. కేవలం 1000కే బుక్ చేసుకోవచ్చు. వినియోగదార్లు దేశవ్యాప్తంగా ఉన్న 55 బెనెల్లి, కీవే షోరూంలు లేదా ఆన్లైన్లో ఈ బైక్స్‌ను కొనుక్కోవచ్చు. కీవే ఎస్ఆర్ 250 తొలి 500 డెలివరీల కోసం ప్రత్యేకంగా ఒక ప్రత్యేక లక్కీ డ్రాను ప్రకటించారు. ఈ లక్కీ డ్రాలో, ఐదుగురు లక్కీ కస్టమర్లు కీవే ఎస్ఆర్ ఎక్స్-షోరూమ్ ధరపై 100 శాతం క్యాష్‌బ్యాక్‌ను గెలుచుకునే అవకాశం ఉంటుంది. అంతేనా దీనికి అదనంగా , AARI 'My SR My Way' అనే కొత్త ప్లాట్‌ఫారమ్‌ను పరిచయం చేస్తోంది. కీవే ఎస్ఆర్ 125 బెస్ట్ మైలేజీ సామర్థ్యాన్ని కోరుకునే బైక్ లవర్స్‌కు ఇది బెస్ట్ ఆప్షన్. 125 సీసీ 4-స్ట్రోక్ ఎలక్ట్రానిక్ ఫ్యూయల్-ఇంజెక్షన్ పెట్రోల్ ఇంజన్ ఇందులో అమర్చారు. ఇది గరిష్టంగా 9.7hp శక్తిని 8.2nm గరిష్ట టార్క్ అందిస్తుంది. ఇంకా హాలోజన్ హెడ్‌ల్యాంప్, LCD కలర్ డిస్ప్లే, కాంబి-బ్రేకింగ్ సిస్టమ్ , డ్యూయల్-పర్పస్ టైర్స్ 1 ఉంది. బ్రేకింగ్ సిస్ఠంలో 300ఎంఎం ఫ్రంట్ డిస్క్, వెనుకవైపు 210ఎంఎ డిస్క్‌ను అందించింది. బైక్‌కు 160ఎంఎ గ్రౌండ్ క్లియరెన్స్‌తో పాటు, అడ్జస్టబుల్ రియర్ సస్పెన్షన్ లభిస్తుంది. Wishing a Happy World Motorcycle Day to those who love corners and the open highways.#HappyWorldMotorcycle #Bikers #MotorcycleDay #Passion #Riding #Keeway #India pic.twitter.com/sUPSPE272j — KeewayIndia (@keeway_india) June 20, 2023 -
ప్రత్యర్థులకు దడపుట్టిస్తున్న యమహా ప్లాన్స్
స్టైలిష్ బైకులకు ప్రసిద్ధి చెందిన 'యమహా' (Yamaha) దేశీయ మార్కెట్లో రానున్న రోజుల్లో ప్రీమియం బైక్స్ లాంచ్ చేయనున్నట్లు తెలిపింది. కంపెనీ వీటి కోసం త్వరలోనే ఫ్రీ బుకింగ్స్ కూడా స్వీకరించడానికి సిద్ధమవుతోంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. యమహా విడుదల చేయనున్న ఈ కొత్త బైక్స్ తమ బ్లూ స్క్వేర్ షోరూమ్స్ల విక్రయించనున్నట్లు సమాచారం. కంపెనీ ఇటీవలే 200వ షోరూమ్‌ను చెన్నైలో ప్రారభించింది. యమహా 2019 నుంచి ఈ ప్రీమియం డీలర్షిప్ నెట్వర్క్ ప్రారంభించడం మొదలుపెట్టింది. రానున్న రోజుల్లో ఈ షోరూమ్‌ల సంఖ్యను మరింత పెంచడానికి ప్రయత్నిస్తోంది. (ఇదీ చదవండి: మహీంద్రా థార్ Vs మారుతి జిమ్నీ - ఏది బెస్ట్ అంటే?) యమహా ఇండియా ఎమ్‌టి03, ఎమ్‌టి-07, ఎమ్‌టి-07, ఆర్3, ఆర్1, ఆర్1ఎమ్ వంటి ప్రీమియం బైకులను త్వరలోనే దేశీయ విఫణిలో విడుదల చేయనుంది. ఇప్పటికే సంస్థ వీటిని ఒక ప్రైవేట్ ఈవెంట్లో ప్రదర్శించింది. అయితే ఇవి మార్కెట్లో ఎప్పుడు విడుదలవుతాయనే ఖచ్చితమైన సమాచారం అందుబాటులో లేదు. బహుశా ఇవి పండుగ సీజన్లో విడుదలయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. -
మార్కెట్లోకి కొత్త స్పోర్ట్స్ బైక్‌లు.. ధరలు, ఫీచర్లు ఇవే..
ట్రయంఫ్ (Triumph) మోటార్‌సైకిల్స్ ఇండియా కొత్త ప్రీమియం బైక్‌లను మార్కెట్లోకి విడుదల చేసింది. 2023 స్ట్రీట్ ట్రిపుల్ 765 ఆర్ఎస్, స్ట్రీట్ ట్రిపుల్ 765 ఆర్ మోడళ్లను పరిచయం చేసింది. స్ట్రీట్ ట్రిపుల్ ఆర్ ధర రూ. 10.17 లక్షలు, స్ట్రీట్ ట్రిపుల్ ఆర్ఎస్ ధర రూ. 11.81 లక్షలు. (ఎక్స్ షోరూమ్) కలర్స్ ఇవే.. ట్రయంఫ్ స్ట్రీట్ ట్రిపుల్ ఆర్ సిల్వర్ ఐస్, క్రిస్టల్ వైట్ కలర్ ఆప్షన్లలో వస్తుంది. అలాగే ట్రయంఫ్ స్ట్రీట్ ట్రిపుల్ ఆర్ఎస్ సిల్వర్ ఐస్, కార్నివాల్ రెడ్, కాస్మిక్ ఎల్లో అనే మూడు రంగుల్లో లభ్యమవుతుంది. స్పెసిఫికేషన్లు 2023 ట్రయంఫ్ స్ట్రీట్ ట్రిపుల్ లైనప్‌లో లిక్విడ్-కూల్డ్, 765 సీసీ ఇన్-లైన్ త్రీ-సిలిండర్ ఇంజన్ ఉంది. స్ట్రీట్ ట్రిపుల్ ఆర్ ఇంజిన్ 11,500 ఆర్పీఎం వద్ద 118.4 బీహెచ్పీ, 9,500 ఆర్పీఎం వద్ద గరిష్టంగా 80 ఎన్ఎం టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్‌కు 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత చేశారు. ఇక స్ట్రీట్ ట్రిపుల్ ఆర్ఎస్ 12,000 ఆర్పీఎం వద్ద 128.2 బీహెచ్పీ అధిక అవుట్‌పుట్‌ను 9,500 ఆర్పీఎం వద్ద 80 ఎన్ఎం గరిష్ట టార్క్‌ను అందిస్తుంది. ఫీచర్స్ ట్రయంఫ్ స్ట్రీట్ ట్రిపుల్ ఆర్ఎస్ బైక్‌లో కార్నరింగ్ ఏబీఎస్, లీన్-యాంగిల్ సెన్సిటివిటీతో ట్రాక్షన్ కంట్రోల్, లింక్డ్ బ్రేకింగ్ సిస్టమ్, వీలీ కంట్రోల్, ఐదు రైడింగ్ మోడ్లు ఉన్నాయి. మరోవైపు 2023 స్ట్రీట్ ట్రిపుల్ ఆర్ నాలుగు రైడింగ్ మోడ్‌లను అందిస్తుంది. స్ట్రీట్ ట్రిపుల్ ఆర్‌లో ఎల్సీడీ డిస్ప్లే, ఆర్ఎస్ మోడల్లో బ్లూటూత్ కనెక్టివిటీతో టీఎఫ్టీ స్క్రీన్ ఉన్నాయి. ల్యాప్ టైమర్, క్రూయిజ్ కంట్రోల్‌తో కూడిన ట్రాక్ ఉపయోగం కోసం ఆర్ఎస్ వేరియంట్‌ను మరింత అనుకూలంగా ఉండేలా రూపొందించారు. StreetTriple 765 R-the new definitive street fighter-is priced from INR 10,17,000 Ex-Showroom, and StreetTriple 765 RS-the most powerful #StreetTriple ever-is priced from INR 11,81,000 Ex-Showroom.#StreetTriple765R #StreetTriple765RS #RacePowered #StreetTriple765 #TriumphIndia pic.twitter.com/2sOfixWOSc — TriumphIndiaOfficial (@IndiaTriumph) June 16, 2023 -
భారత్‌లో మళ్ళీ అడుగెట్టిన హీరో ఫ్యాషన్ ప్లస్ - ధర & వివరాలు
Hero Passion Plus: బిఎస్6 ఉద్గార ప్రమాణాల కారణంగా భారతదేశంలో మూడు సంవత్సరాలకు ముందు హీరో మోటోకార్ప్ (Hero MotoCorp) నిలిపివేసిన 'ఫ్యాషన్ ప్లస్' (Passion Plus) ఇప్పుడు మళ్ళీ దేశీయ మార్కెట్లో విడుదలైంది. ఈ బైక్ ధర దేశీయ మార్కెట్లో రూ. 76,065 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ). దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. కొత్త హీరో ఫ్యాషన్ ప్లస్ బైక్ చూడటానికి దాని మునుపటి మోడల్ మాదిరిగా ఉన్నప్పటికీ ఇందులో కొన్ని కాస్మొటిక్ అప్డేట్స్ గమనించవచ్చు. కాగా ఈ బైక్ లాంగ్ స్టాండింగ్ ఎయిర్ కూల్డ్, 97.2 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ ఉపయోగించి అదే 8 హార్స్ పవర్, 8.05 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ ఇప్పుడు OBD-2 కంప్లైంట్ అండ్ E20 కి సిద్ధంగా తయారైంది. ఈ బైక్ ఐ3ఎస్ స్టార్ట్/స్టాప్ టెక్నాలజీ కూడా పొందుతుంది. హీరో ఫ్యాషన్ ప్లస్ టెలిస్కోపిక్ ఫోర్క్ & ట్విన్ షాక్ అబ్జార్బర్స్ కలిగి డబుల్ క్రెడిల్ ఫ్రేమ్ పొందుతుంది. ఈ బైక్ బరువు 115 కేజీలు. దీన్ని బట్టి చూస్తే ఇప్పటి వరకు ఉన్న 100 సీసీ విభాగంలో ఇదే అత్యంత బరువైన బైక్ అని తెలుస్తోంది. ముందు, వెనుక 130 మిమీ డ్రమ్ బ్రేక్‌లు ఉంటాయి. (ఇదీ చదవండి: ఇండియాలో అక్కడ నివాసం చాలా కాస్ట్లీ - హైదరాబాద్ స్థానం ఏంటంటే?) గతంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన ఈ హీరో ఫ్యాషన్ ప్లస్ ఇప్పుడు మూడు కలర్ ఆప్షన్స్‌తో లభించడమే కాకుండా సెల్ఫ్ స్టార్ట్, డిజిటల్ అనలాగ్ డిస్ప్లే, USB ఛార్జింగ్ పోర్ట్ వంటివి వాటిని పొందుతుంది. ఈ బైక్ మార్కెట్లో హోండా షైన్, బజాజ్ ప్లాటినా మొదలైన 110 సీసీ విభాగంలోని బైకులకు ప్రత్యర్థిగా ఉంటుంది. -
సరికొత్త ఫీచర్లతో ప్రీమియం హీరో బైక్ వచ్చేస్తోంది: ఎప్పుడంటే?
హిస్టారిక్ ప్రీమియం మోటార్‌సైకిల్ బ్రాండ్, కరిజ్మా ఎక్స్ఎంఆర్ బైక్ మళ్లీ ఎంట్రీ ఇస్తోందన్న ఊహాగానాలు, ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ దారు హీరో మోటోకార్ప్ దాఖలు చేసిన ట్రేడ్‌మార్క్ దరఖాస్తుతో మరోసారి ఊపందు కున్నాయి. హీరో మోటోకార్ప్, రాబోయే మోటార్‌సైకిల్‌కి సంబంధించిన 14 సెకన్ల టీజర్ వీడియోను ఇటీవల విడుదల చేసింది. జూన్ 14న లాంచ్ డేట్ నిర్ధారించినప్పటికీ నిర్దిష్ట మోడల్ ఇంకా వెల్లడించలేదు. ఎక్స్ఎంఆర్ 210 లేదా ఎక్స్ట్రీమ్ 160R అప్డేటెడ్ వెర్షన్ అని కావచ్చని భావిస్తున్నారు. హీరో మోటార్స్ అప్డేట్ చేసిన రీమోడల్ బైక్ ఎక్స్ట్రీమ్160R అప్డేటెడ్ వెర్షన్లో ఫీచర్లు, డిజైన్, ఇంజన్ స్పెసిఫికేషన్లు పెద్దగా మారకపోవచ్చని అంచనా. అప్డేటెడ్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్, బ్లూటూత్ కనెక్టివిటీ, 5-స్పీడ్ గేర్‌బాక్స్ లాంటి అదనపు ఫీచర్లతో కీలక అప్‌గ్రేడ్స్‌నే అందిస్తోందట. కొత్త టూ-టోన్ బాడీ షేడ్స్‌ను కూడా పరిచయం చేసే అవకాశం ఉంది. అయితే, డ్యూయల్-ఛానల్ ABS సిస్టమ్‌తో వస్తుందా అనేది స్పష్టత లేదు. 163cc ఎయిర్-కూల్డ్ ఇంజిన్ 15 పవర్‌ను, 14 ఎన్ఎం గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. బైక్ ధర రూ. 1.30 లక్షల వరకు ఉండే అవకాశం ఉంది.