Hero Passion Plus launched in India; Check price and details - Sakshi
Sakshi News home page

Hero MotoCorp: మూడేళ్లకు ముందు నిలిచిపోయింది.. మళ్ళీ ఇప్పుడు లాంచ్ అయింది - ధర ఏంటంటే?

Published Thu, Jun 8 2023 12:20 PM | Last Updated on Thu, Jun 8 2023 12:37 PM

Hero passion plus india launched price and details - Sakshi

Hero Passion Plus: బిఎస్6 ఉద్గార ప్రమాణాల కారణంగా భారతదేశంలో మూడు సంవత్సరాలకు ముందు హీరో మోటోకార్ప్ (Hero MotoCorp) నిలిపివేసిన 'ఫ్యాషన్ ప్లస్' (Passion Plus) ఇప్పుడు మళ్ళీ దేశీయ మార్కెట్లో విడుదలైంది. ఈ బైక్ ధర దేశీయ మార్కెట్లో రూ. 76,065 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ). దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

కొత్త హీరో ఫ్యాషన్ ప్లస్ బైక్ చూడటానికి దాని మునుపటి మోడల్ మాదిరిగా ఉన్నప్పటికీ ఇందులో కొన్ని కాస్మొటిక్ అప్డేట్స్ గమనించవచ్చు. కాగా ఈ బైక్ లాంగ్ స్టాండింగ్ ఎయిర్ కూల్డ్, 97.2 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ ఉపయోగించి అదే 8 హార్స్ పవర్, 8.05 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ ఇప్పుడు OBD-2 కంప్లైంట్ అండ్ E20 కి సిద్ధంగా తయారైంది. ఈ బైక్ ఐ3ఎస్ స్టార్ట్/స్టాప్ టెక్నాలజీ కూడా పొందుతుంది.

హీరో ఫ్యాషన్ ప్లస్ టెలిస్కోపిక్ ఫోర్క్ & ట్విన్ షాక్ అబ్జార్బర్స్‌ కలిగి డబుల్ క్రెడిల్ ఫ్రేమ్ పొందుతుంది. ఈ బైక్ బరువు 115 కేజీలు. దీన్ని బట్టి చూస్తే ఇప్పటి వరకు ఉన్న 100 సీసీ విభాగంలో ఇదే అత్యంత బరువైన బైక్ అని తెలుస్తోంది. ముందు, వెనుక 130 మిమీ డ్రమ్ బ్రేక్‌లు ఉంటాయి.

(ఇదీ చదవండి: ఇండియాలో అక్కడ నివాసం చాలా కాస్ట్లీ - హైదరాబాద్ స్థానం ఏంటంటే?)

గతంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన ఈ హీరో ఫ్యాషన్ ప్లస్ ఇప్పుడు మూడు కలర్ ఆప్షన్స్‌తో లభించడమే కాకుండా సెల్ఫ్ స్టార్ట్, డిజిటల్ అనలాగ్ డిస్‌ప్లే, USB ఛార్జింగ్ పోర్ట్‌ వంటివి వాటిని పొందుతుంది. ఈ బైక్ మార్కెట్లో హోండా షైన్, బజాజ్ ప్లాటినా మొదలైన 110 సీసీ విభాగంలోని బైకులకు ప్రత్యర్థిగా ఉంటుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement