Hero Motocorp
-
ఎన్ఎక్స్200 vs ఎక్స్‌పల్స్ 200 4వీ: ఏది బెస్ట్ బైక్?
భారతదేశంలో ప్రముఖ టూ-వీలర్ తయారీ సంస్థ అయిన.. హోండా మోటార్‌సైకిల్ (Honda Motorcycle) తన సీబీ200ఎక్స్ స్థానంలో 'ఎన్ఎక్స్200'ను లాంచ్ చేసింది. కంపెనీ దీనిని అడ్వెంచర్ టూరర్ అని పిలిచింది. ఈ బైక్ టూరింగ్ కోసం ఎక్కువమంది కొనుగోలు చేస్తున్నప్పటికీ.. ఇది హీరో ఎక్స్‌పల్స్ 200 4Vకి ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది. ఈ రెండు బైకుల మధ్య వ్యత్యాసం ఏంటో ఇక్కడ చూద్దాం.ధర: హోండా ఎన్ఎక్స్200 ఒక వేరియంట్లో మాత్రమే రూ. 1.68 లక్షలకు అందుబాటులో ఉంది. కాగా హీరో ఎక్స్‌పల్స్ 200 4వీ స్టాండర్డ్, ప్రో, ప్రో డాకర్ ఎడిషన్ అనే మూడు వేరియంట్లలో లభిస్తుంది. వీటి ధరలు రూ. 1.51 లక్షల నుంచి రూ. 1.67 లక్షల (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్) మధ్య ఉంది.ఫీచర్స్: హోండా ఎన్ఎక్స్200.. హీరో ఎక్స్‌పల్స్ 200 4వీ రెండూ కూడా బ్లూటూత్ కనెక్టివిటీతో కూడిన ఫుల్లీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్, ఎల్ఈడీ హెడ్‌లైట్, టెయిల్‌లైట్, టర్న్ ఇండికేటర్లు, USB ఛార్జింగ్ పోర్ట్ వంటి వాటిని పొందుతాయి. ఎక్స్‌పల్స్ 200 4వీ టర్న్-బై-టర్న్ నావిగేషన్ పొందుతుంది, ఎన్ఎక్స్200 ట్రాక్షన్ కంట్రోల్ పొందుతుంది.ఇదీ చదవండి: బీవైడీ సీలియన్ 7 వచ్చేసింది.. ధర ఎంతో తెలుసా?హీరో ఎక్స్‌పల్స్ 200 4వీ, హోండా ఎన్ఎక్స్200 కంటే ఎత్తుగా, పొడవుగా, వెడల్పుగా ఉంటుంది. డిజైన్ కూడా భిన్నంగా ఉంటుంది. హోండా ముందు భాగంలో అప్సైడ్డౌన్ ఫోర్కే పొందుతుంది. కానీ హీరో దాని సస్పెన్షన్ సెటప్ కోసం ఫుల్లీ అడ్జస్టబుల్ పొందుతుంది.పవర్‌ట్రెయిన్: హీరో ఎక్స్‌పల్స్ 200 4వీ.. 199.6 సీసీ సింగిల్ సిలిండర్, ఆయిల్ - కూల్డ్ ఇంజిన్ కలిగి 8,500 rpm వద్ద 18.9 Bhp & 6,500 rpm వద్ద 17.35 Nm టార్క్ అందిస్తుంది. ఇది 5 స్పీడ్ గేర్‌బాక్స్ ఆప్షన్ పొందుతుంది. ఇక హోండా ఎన్ఎక్స్200 బైక్ 184.4 సీసీ సింగిల్-సిలిండర్, ఎయిర్-కూల్డ్ ఇంజిన్ ద్వారా 17.03 bhp పవర్, 15.9 Nm టార్క్ అందిస్తుంది. ఇందులో కూడా 5-స్పీడ్ గేర్‌బాక్స్ ఉంటుంది. రెండూ కూడా ఉత్తమ పనితీరును అందిస్తాయి. -
మార్కెట్లోకి హీరో కొత్త స్కూటర్
ప్రపంచంలోనే అతిపెద్ద ద్విచక్రవాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ (Hero MotoCorp).. న్యూ డెస్టినీ 125 (New Destini 125) స్కూటర్‌ను విడుదల చేసింది. దీంతో 125సీసీ స్కూటర్ మార్కెట్లో విస్తృత మార్పులకు శ్రీకారం చుట్టింది. అత్యాధునిక సాంకేతికత, అసాధారణమైన మైలేజ్, టైమ్‌లెస్ డిజైన్‌ను మిళితం చేస్తూ పట్టణ వాహనదారుల కోసం దీన్ని రూపొందించినట్లు కంపెనీ పేర్కొంది.హీరో న్యూ డెస్టినీ 125 స్కూటర్.. డెస్టిని 125 వీఎక్స్, డెస్టిని 125 జెడ్ఎక్స్, డెస్టిని 125 జెడ్ఎక్స్ ప్లస్ అనే మూడు వేరియంట్లలో లభిస్తుంది. వీటి ప్రారంభ ధరలు (ఢిల్లీ ఎక్స్-షోరూమ్) వరుసగా రూ.80,450, రూ.89,300, రూ.90,300.ప్రత్యేకంగా పట్టణ వాహనదారుల అవసరాలను తీర్చడానికి రూపొందించిన న్యూ డెస్టినీ 125.. వాహనదారుల భద్రత, సౌలభ్యం కోసం 30 పేటెంట్ అప్లికేషన్లతోపాటు ఇల్యూమినేటెడ్ స్టార్ట్ స్విచ్‌లు, ఆటో-కాన్సల్ వింకర్ల వంటి సరికొత్త ఫీచర్లతో వచ్చింది.‘హీరో డెస్టిని 125 అనేది మా ఆవిష్కరణ-ఆధారిత విధానానికి, పర్యావరణ అనుకూల చైతన్యాన్ని అందించడంలో మా నిబద్ధతకు నిదర్శనం. 59 కి.మీ మైలేజ్, అధునాతన ఫీచర్లతో ఈ స్కూటర్ ఆధునిక రైడర్లకు గేమ్-ఛేంజర్’ హీరో మోటోకార్ప్ ఇండియా బిజినెస్ యూనిట్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ రంజీవ్‌జిత్ సింగ్ పేర్కొన్నారు. -
హార్లే - హీరో సరికొత్త బైక్: త్వరలో..
మార్కెట్లో అప్డేటెడ్ బైకులు పెరుగుతున్న తరుణంలో.. కొత్త వెర్షన్స్‌ను పరిచయం చేసేందుకు అమెరికన్ బ్రాండ్ 'హార్లే డేవిడ్సన్'తో సహకారాన్ని విస్తరించినట్టు హీరో మోటోకార్ప్ (Hero MotoCorp) తెలిపింది.హీరో మోటోకార్ప్ & హార్లే డేవిడ్సన్ మధ్య జరిగిన ఒప్పందంలో భాగంగానే.. కొత్త వెర్షన్ హార్లే డేవిడ్సన్ ఎక్స్440 (Harley Davidson X440) బైక్ రానుంది. ఈ రెండు కంపెనీల సహకారంతో తయారైన తొలి మోడల్ 'ఎక్స్ 440'. ఇది గతేడాది మార్కెట్లో అడుగుపెట్టింది. మంచి అమ్మకాలను కూడా పొందుతోంది.హీరో మోటోకార్ప్.. హార్లే డేవిడ్సన్ మధ్య భాగస్వామ్యం 2020 అక్టోబరులో జరిగింది. ఆ తరువాత దేశంలో హార్లే డేవిడ్సన్ బ్రాండ్ ప్రీమియం మోటార్‌సైకిళ్లను అభివృద్ధి చేసి హీరో మోటోకార్ప్ విక్రయిస్తుంది. సర్వీస్, విడిభాగాల సరఫరా బాధ్యత కూడా హీరో మోటోకార్ప్ చేపట్టింది. -
ఓ మంచి ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలనుకుంటున్నారా? ఇవి చూడండి
భారతదేశంలో ఎలక్ట్రిక్ టూ వీలర్ల వినియోగం విపరీతంగా పెరుగుతోంది. అయితే మార్కెట్లోని ఉత్తమ ఈవీ స్కూటర్లు ఏవి? వాటి ధర, రేంజ్ వంటి వివరాలు ఎలా ఉన్నాయనే విషయాలు ఈ కథనంలో తెలుసుకుందాం.బజాజ్ చేతక్ (Bajaj Chetak)ప్రముఖ వాహన తయారీ సంస్థ బజాజ్ ఆటో.. ఎలక్ట్రిక్ టూ వీలర్ విభాగంలో చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ విక్రయిస్తోంది. దీని అమ్మకాలు ప్రస్తుతం ఆశాజనకంగానే ఉన్నాయి. కాగా ఈనెల 20న మరో అప్డేటెడ్ మోడల్ లాంచ్ చేయడానికి కంపెనీ సిద్ధమైంది. కాగా ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న బేస్ మోడల్ 2.88 కిలోవాట్ బ్యాటరీతో 123 కిమీ రేంజ్ అందిస్తుంది. ఈ స్కూటర్ ధర రూ. లక్ష కంటే ఎక్కువ.టీవీఎస్ ఐక్యూబ్ (TVS iQube)మార్కెట్లో ఎక్కువ అమ్మకాలు పొందుతున్న ఎలక్ట్రిక్ స్కూటర్ల జాబితాలో ఒకటి టీవీఎస్ ఐక్యూబ్. రూ. 89999 ప్రారంభ ధర వద్ద లభించే ఈ స్కూటర్ 2.2 కిలోవాట్ లిథియం అయాన్ బ్యాటరీ ద్వారా 75 కిమీ రేంజ్ అందిస్తుంది. దీని టాప్ స్పీడ్ 75 కిమీ/గం. ఇది 12.7 సెంమీ TFT డిస్ప్లే కలిగి, ఎల్ఈడీ హెడ్‌లైట్, 4.4 కిలోవాట్ BLDC మోటార్ వంటివి పొందుతుంది.ఇదీ చదవండి: భారత్‌లో అత్యధికంగా అమ్ముడైన కారు: 1.86 లక్షల మంది కొనేశారుహీరో విడా (Hero Vida)రూ. 96000 (ఎక్స్ షోరూమ్) ధర వద్ద అందుబాటులో ఉన్న హీరో విడా మంచి అమ్మకాలు పొందుతున్న ఒక బెస్ట్ మోడల్. ఇందులో 2.2 కిలోవాట్ రిమూవబుల్ బ్యాటరీ ఉంటుంది. ఇది ఒక సింగిల్ ఛార్జీతో 94 కిమీ రేంజ్ అందిస్తుంది. దీని టాప్ స్పీడ్ 69 కిమీ/గం. ఈ స్కూటర్ 7 ఇంచెస్ డిజిటల్ TFT టచ్‌స్క్రీన్ పొందుతుంది.ఓలా ఎలక్ట్రిక్ (Ola Electric)ప్రారంభం నుంచి గొప్ప ఆదరణ పొందిన ఓలా ఎలక్ట్రిక్ ఇటీవల నాలుగు ఎలక్ట్రిక్ స్కూటర్లను లాంచ్ చేసింది. అవి ఓలా గిగ్, ఓలా గిగ్ ప్లస్, ఓలా ఎస్1 జెడ్, ఓలా ఎస్1 జెడ్ ప్లస్. కంపెనీ వీటి కోసం బుకింగ్స్ స్వీకరించడం కూడా ప్రారంభించింది. కాబట్టి కేవలం 499 రూపాయలతో బుక్ చేసుకోవచ్చు. డెలివరీలు 2025లో ప్రారంభమవుతాయి. -
కొత్త ఎలక్ట్రిక్ బైక్‌పై హీరో కసరత్తు
న్యూఢిల్లీ: మధ్య స్థాయి పర్ఫార్మెన్స్ సెగ్మెంట్ ఎలక్ట్రిక్ మోటర్‌సైకిల్ తయారీపై కసరత్తు చేస్తున్నట్లు హీరో మోటోకార్ప్ సీఈవో నిరంజన్ గుప్తా తెలిపారు. అమెరికాకు చెందిన జీరో మోటర్‌సైకిల్స్ భాగస్వామ్యంలో ఈ వాహనం అభివృద్ధి చేసే ప్రక్రియ తుది దశలో ఉందని పేర్కొన్నారు.జీరో మోటర్‌సైకిల్స్ ప్రధానంగా ఎలక్ట్రిక్ మోటర్‌సైకిల్స్, పవర్‌ట్రెయిన్స్ తయారు చేస్తుంది. 2022 సెప్టెంబర్‌లో జీరోలో 60 మిలియన్ డాలర్ల వరకు పెట్టుబడులు పెట్టే ప్రతిపాదనకు హీరో బోర్డు ఆమోదముద్ర వేసింది. మరోవైపు, తమ ఎలక్ట్రిక్ స్కూటర్ల శ్రేణిని మరింతగా విస్తరిస్తున్నట్లు గుప్తా చెప్పారు.వచ్చే ఆరు నెలల్లో వివిధ ధర శ్రేణుల్లో, కస్టమర్ సెగ్మెంట్లలో తమ ఎలక్ట్రిక్ వాహనాలు ఉంటాయని వివరించింది. ప్రస్తుతం హీరో మోటోకార్ప్‌కి చెందిన విడా ఎలక్ట్రిక్ స్కూటర్లు రూ. 1–1.5 లక్షల శ్రేణిలో అందుబాటులో ఉన్నాయి. 230 నగరాలు, పట్టణాల్లో అమ్ముడవుతున్నాయి. -
అంచనాలను దాటి దూసుకెళ్లిన ‘హీరో’
న్యూఢిల్లీ: ద్విచక్ర వాహన రంగ దిగ్గజం హీరో మోటోకార్ప్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024–25) రెండో త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. జూలై–సెప్టెంబర్(క్యూ2)లో కన్సాలిడేటెడ్ నికర లాభం 6 శాతం వృద్ధితో రూ. 1,066 కోట్లను తాకింది. అమ్మకాలు పుంజుకోవడం ఇందుకు తోడ్పడింది.గతేడాది(2023–24) ఇదే కాలంలో రూ. 1,007 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 9,533 కోట్ల నుంచి రూ. 10,483 కోట్లకు బలపడింది. ఈ కాలంలో 15.2 లక్షల మోటార్‌సైకిళ్లు, స్కూటర్లను విక్రయించింది. గత క్యూ2లో 14.16 లక్షల వాహనాలు అమ్ముడయ్యాయి. మూడు మోడళ్లు రెడీ...క్యాష్ మేనేజ్మెంట్పై ప్రత్యేక దృష్టి పెట్టడం ద్వారా పటిష్ట క్యాష్‌ఫ్లోను సాధిస్తున్నామని, దీంతో ఆర్థికంగా మరింత బలపడుతున్నట్లు కంపెనీ సీఈవో నిరంజన్ గుప్తా పేర్కొన్నారు. ఎంట్రీ, డీలక్స్ విభాగాల్లో మరిన్ని బ్రాండ్లను ప్రవేశపెట్టనున్నట్లు తెలియజేశారు. తద్వారా ప్రీమియం విభాగంలో పటిష్ట పోర్ట్‌ఫోలియోను ఏర్పాటు చేసుకుంటున్నట్లు వివరించారు.ఇదీ చదవండి: కేటీఎం దూకుడు.. ఒకేసారి మార్కెట్లోకి 10 కొత్త బైక్లురానున్న ఆరు నెలల్లో ఎక్స్‌పల్స్ 210, ఎక్స్ట్రీమ్ 250ఆర్, కరిజ్మా ఎక్స్ఎంఆర్ 250 బైకులను విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. అంతేకాకుండా ఈ ఏడాది చివరికల్లా ప్రీమియా విభాగంలో 100 స్టోర్లను అధిగమించనున్నట్లు తెలియజేశారు. హీరో మోటో షేరు బీఎస్ఈలో 2% బలపడి రూ. 4,604 వద్ద ముగిసింది. -
ఇక అందుబాటు ధరలో హీరో ఎలక్ట్రిక్ టూ-వీలర్లు
వాహనాల తయారీ దిగ్గజం హీరో మోటోకార్ప్ తమ ఎలక్ట్రిక్ టూ–వీలర్ల వ్యాపార విభాగాన్ని మరింత పటిష్టం చేసుకోవడంపై దృష్టి పెడుతోంది. వచ్చే కొద్ది నెలల్లో అందుబాటు ధరల్లో మరిన్ని మోడల్స్‌ను ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోంది. హీరో మోటోకార్ప్ సీఈవో నిరంజన్ గుప్తా ఈ విషయాలు తెలిపారు.‘వచ్చే ఆరు నెలల్లో ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) విభాగం చాలా సందడిగా ఉండబోతోంది. విడా శ్రేణికి సంబంధించి అందుబాటు ధరల్లో మోడల్స్‌ను కూడా ప్రవేశపెట్టబోతున్నాం‘ అని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం విడా ఎలక్ట్రిక్ స్కూటర్ల ధరలు రూ. 1–1.5 లక్షల శ్రేణిలో (రాష్ట్రాలు ఇచ్చే సబ్సిడీలతో కలిపి) ఉన్నాయి. 230 నగరాలు, పట్టణాల్లో విడా స్కూటర్లను కంపెనీ విక్రయిస్తోంది. 32 రోజుల పాటు సాగిన పండుగ సీజన్లో ఎలక్ట్రిక్ వాహనాలకు మంచి స్పందన కనిపించిందని, 11,600 యూనిట్లు విక్రయించామని గుప్తా వివరించారు.క్షేత్రస్థాయిలో భౌతికంగా సేల్స్, సర్వీస్ మౌలిక సదుపాయాలు ఉంటే కస్టమర్‌కి మరింత నమ్మకం ఉంటుందని ఆయన పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా దాదాపు అన్ని ప్రాంతాల్లో కార్యకలాపాలు ఉండటం తమకు కలిసి వచ్చే అంశమని వివరించారు. ఈవీల విభాగంలో ధర, కస్టమర్ సర్వీసు అంశాలే దీర్ఘకాలికంగా ఏ కంపెనీకైనా కీలకం అవుతాయని పేర్కొన్నారు.ఇదీ చదవండి: టయోటాకు సుజుకీ ఈవీలు.. గుజరాత్ ప్లాంటులో తయారీఇక దేశీ మార్కెట్లో మొత్తం వాహన విక్రయాలపరంగా చూస్తే పట్టణ ప్రాంతాలు మెరుగ్గా ఉన్నాయని, గ్రామీణ ప్రాంతాలు కూడా క్రమంగా పుంజుకుంటున్నాయని గుప్తా చెప్పారు. ఈ ఏడాది పండుగ సీజన్లో హీరో మోటోకార్ప్ విక్రయాలు గత సీజన్‌తో పోలిస్తే 13 శాతం పెరిగి 15.98 లక్షల యూనిట్లకు చేరాయి. వచ్చే ఏడాది ద్వితీయార్థంలో బ్రిటన్, ఇటలీ, స్పెయిన్ తదితర దేశాల్లోకి కూడా విస్తరించనున్నట్లు కంపెనీ వెల్లడించింది. -
అక్కడ డొక్కు డొక్కు.. ఇక్కడ డుగ్గు డుగ్గు
రాయల్ ఎన్ఫీల్డ్.. యెజ్డీ.. జావా.. నార్టన్... బీఎస్ఏ.. విశ్వ విఖ్యాత బైక్ బ్రాండ్లు ఇవి. విదేశాల్లో మనుగడ సాధించలేక చేతులెత్తేసిన ఈ బ్రాండ్లన్నీ భారతీయుల చేతిలో మళ్లీ ప్రాణం పోసుకున్నాయి. అమ్మకాల్లో దుమ్మురేడమే కాదు.. మళ్లీ వాటిని గ్లోబల్ బ్రాండ్లుగా నిలబెట్టి మనోళ్లు సత్తా చాటుతున్నారు!మహీంద్రా కంపెనీ క్లాసిక్ లెజెండ్స్ తాజాగా ప్రఖ్యాత బ్రిటిష్ మోటార్‌సైకిల్ బ్రాండ్ బీఎస్ఏను భారత్‌లో ప్రవేశపెట్టడం తెలిసిందే. అక్కడ మూసేసిన ఈ కంపెనీని కొనుగోలు చేసి, మన మార్కెట్లో లాంచ్ చేసింది. విదేశీ బ్రాండ్లకు మన దగ్గర తిరిగి జీవం పోస్తూ... 1994లో ప్రారంభమైన ఈ ట్రెండ్ ఇప్పటికీ నాన్‌స్టాప్‌గా కొనసాగుతూనే ఉంది. ఇంగ్లాండ్‌లో కార్యకలాపాలను నిలిపేసిన బ్రిటిష్ మోటార్ సైకిల్ కంపెనీ రాయల్ ఎన్ఫీల్డ్ను ఐషర్ గ్రూప్ 1994లో చేజిక్కించుకుంది. అయితే, మన దగ్గర ఈ బ్రాండ్‌ను మళ్లీ జనాల్లోకి తీసుకెళ్లేందుకు ఆ కంపెనీకి 15 ఏళ్లు పట్టింది. 2009లో క్లాసిక్ 350, క్లాసిక్ 500 మోటార్ సైకిళ్లు డుగ్గు డుగ్గు మంటూ మళ్లీ మన రోడ్లపై పరుగులు తీయడం మొదలైంది. ఇప్పుడు యువతకు ఈ మోటార్ సైకిల్స్ అంటే ఎంత క్రేజో చెప్పాల్సిన పని లేదు! ‘2009లో విడుదల చేసిన క్లాసిక్‌తో రాయల్ ఎన్ఫీల్డ్ గ్లోబల్ కంపెనీగా అపూర్వ విజయం సొంతం చేసుకుంది. మొదట్లో ఏడాదికి 50,000 బుల్లెట్లను అమ్మడమే గగనంగా ఉన్న స్థాయి నుంచి ప్రస్తుతం అనేక మోడల్స్ దన్నుతో వార్షిక సేల్స్ 8.5 లక్షలకు ఎగబాకాయి’ అని కంపెనీ సీఈఓ గోవిందరాజన్ పేర్కొన్నారు. 2009 నుంచి ఇప్పటిదాకా రాయల్ ఎన్ఫీల్డ్ 75 లక్షల మోటార్ సైకిళ్లను విక్రయించగా అందులో 40 లక్షలు క్లాసిక్ మోడల్ కావడం మరో విశేషం. ఈ నెల 12న కూడా కంపెనీ కొత్త క్లాసిక్‌ను ప్రవేశపెట్టింది.యెజ్డీ.. కుర్రకారు హార్ట్ ‘బీట్’ అనుపమ్ తరేజా సారథ్యంలోని క్లాసిక్ లెజెండ్.. గ్లోబల్ బైక్ బ్రాండ్స్ జావా, యెజ్డీ, బీఎస్ఏలను భారతీయులకు మళ్లీ పరిచయం చేసింది. 1970లో మార్కెట్ నుంచి వైదొలగిన చెక్ కంపెనీ జావా.. 2018లో మనోళ్ల చేతికి చిక్కింది. అప్పటి నుంచి 1.4 లక్షల జావాలు రోడ్డెక్కాయి. గత నెల 13న జావా 42 మోడల్‌ను సైతం రంగంలోకి దించింది. ఇక అప్పట్లో అదిరిపోయే బీట్తో కుర్రోళ్ల మనను కొల్లగొట్టిన యెజ్డీ కూడా 1996లో అస్తమించి.. 2022లో లెజెండ్స్ ద్వారా తిరిగి ప్రాణం పోసుకుంది. 60 వేల బైక్‌లు ఇప్పటిదాకా అమ్ముడవ్వడం విశేషం. బీఎస్ఏ అయితే, 1973లోనే మూతబడింది. దాన్ని ఆనంద్ మహీంద్రా పోటాపోటీగా దక్కించుకుని యూకేతో పాటు భారత్‌లోనూ మళ్లీ ప్రవేశ పెట్టారు.అదే బాటలో టీవీఎస్, హీరో... ఇక దేశీ దిగ్గజం టీవీఎస్ కూడా మరో విఖ్యాత బ్రిటిష్ బైక్ బ్రాండ్ నార్టన్‌ను కేవలం రూ.153 కోట్లకు కొనుగోలు చేసింది. 2025 నాటికి తొలి మోడల్‌ను ప్రవేశపెట్టడంతో పాటు మూడేళ్లలో ఆరు కొత్త నార్టన్ బైక్‌లను తీసుకొచ్చే సన్నాహాల్లో ఉంది. ఈ ప్రఖ్యాత బ్రాండ్లను దక్కించుకోవడంతో పాటు వాటి చారిత్రక నేపథ్యాన్ని అలాగే కొనసాగించడం ద్వారా ఒరిజినాలిటీని కాపాడుతున్నామని తరేజా వ్యాఖ్యానించారు. బీఎస్ఏను భారత్‌లోనే తయారు చేస్తున్నా, దాని బ్రిటిష్ బ్రాండ్ ప్రాచుర్యం పదిలంగా ఉందన్నారు. ఇక భారత్‌లో నేరుగా ప్లాంట్ పెట్టి, చేతులెత్తేసిన హార్లీ డేవిడ్సన్కు హీరో మోటోకార్ప్ దన్నుగా నిలిచింది. ఆ కంపెనీతో జట్టుకట్టి మళ్లీ హార్లీ బైక్‌లను భారతీయులకు అందిస్తోంది. ఎక్స్440 బైక్‌ను ఇక్కడే అభివృద్ధి చేయడం విశేషం. దీన్ని దేశీయంగా హీరో ఉత్పత్తి చేస్తున్పప్పటికీ, ప్రామాణిక హార్లీ బైక్ బ్రాండ్ విలులో ఎలాంటి మార్పులు చేయలేదని కంపెనీ ప్రెసిడెంట్, సీఈఓ జోషెన్ జీట్స్ పేర్కొన్నారు. భారత్‌లో నేరుగా విక్రయాల్లో వెనుకబడ్డ బీఎండబ్ల్యూ మోటోరాడ్, టీవీఎస్‌తో జట్టుకట్టింది. టీవీఎస్ రూపొందించిన 500 సీసీ లోపు బైక్‌లు 60 వేలకు పైగా అమ్ముడవ్వడం మనోళ్ల సత్తాకు నిదర్శనం! → 2015లో మహీంద్రా మెజారిటీ పెట్టుబడితో ఫై క్యాపిటల్ ఓనర్ అనుపమ్ తరేజా క్లాసిక్ లెజెండ్స్ అనే కంపెనీని నెలకొల్పారు. జావా, యెజ్డీ, బీఎస్ఏ వంటి గ్లోబల్ ఐకాన్లను దక్కించుకుని, పునరుద్ధరించారు.→ 2013లో టీవీఎస్ బీఎండబ్ల్యూ మోటోరాడ్‌తో డీల్ కుదుర్చుకుంది, తద్వారా ప్రపంచ మార్కెట్ కోసం 500 సీసీ లోపు బైక్‌లను అభివృద్ధి చేసి, ఇంటా బయటా విక్రయిస్తోంది. 2020లో టీవీఎస్ మోటార్ కంపెనీ ప్రఖ్యాత బ్రిటిష్ మోటార్‌సైకిల్ బ్రాండ్ నార్టన్‌ను కొనుగోలు చేసింది; వచ్చే మూడేళ్లలో ఆరు కొత్త మోడల్స్‌ను ప్రవేశపెట్టే పనిలో ఉంది.→ 1994లో ఐషర్ గ్రూప్ ఇంగ్లాండ్‌లో పూర్తిగా అమ్మకాలను నిలిపేసిన బ్రిటిష్ బైక్ దిగ్గజం రాయల్ ఎన్ఫీల్డ్ను చేజిక్కించుకుంది. 2009లో ‘క్లాసిక్’ బ్రాండ్‌కు తిరిగి జీవం పోయడంమే కాదు.. గ్లోబల్ కంపెనీగా దీన్ని మళ్లీ నిలబెట్టింది.→ 2023లో హీరో మోటోకార్ప్ భారత్‌లో విఫలమై షట్టర్ మూసేసిన హార్లే డేవిడ్సన్కు మళ్లీ ఇక్కడ ప్రాణం పోసింది. ఎక్స్440 మోడల్‌ను విడుదల చేసి సక్సెస్ కొట్టింది.– సాక్షి, బిజినెస్ డెస్క్ -
ఫిలిప్పీన్స్‌లో ఇండియన్ కంపెనీ.. 48 దేశాల్లో హవా
ప్రముఖ టూ వీలర్ తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ తన ఉనికిని నిరంతరం విస్తరిస్తూనే ఉంది. ఇందులో భాగంగానే బ్రాండ్ అమ్మకాలను ఇతర దేశాలకు కూడా విస్తరిస్తోంది. ఈ తరుణంలో కంపెనీ తన కార్యకలాపాలను ఫిలిప్పీన్స్‌లో ప్రారంభించింది.కొలంబియన్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్‌లో భాగమైన టెర్రాఫిర్మా మోటార్స్ కార్పొరేషన్ (TMC).. ఫిలిప్పీన్స్‌లోని హీరో మోటోకార్ప్ ఉత్పత్తుల అసెంబ్లర్, విక్రయదారుగా ఉంటుంది. ఈ భాగస్వామ్యం అక్టోబర్ 2022లో ప్రకటించినప్పటికీ ఇప్పటికి అమలు అయ్యింది. దీంతో హీరో మోటోకార్ప్ వాహనాలు ఆగ్నేయాసియా మార్కెట్లోకి కూడా విస్తరిస్తున్నాయి.ఫిలిప్పీన్స్‌లోని లగునాలో టెర్రాఫిర్మా మోటార్స్ కార్పొరేషన్లో అసెంబ్లీ యూనిట్, విడిభాగాల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. సుమారు 600 చదరపు మీటర్ల విస్తీరణంలో ఉన్న ఈ సదుపాయంలో సంవత్సరానికి 1.5 లక్షల యూనిట్ల ఉత్పత్తి సాధ్యమవుతుందని తెలుస్తోంది.ఈ కొత్త తయారీ కేంద్రంలో ఎక్స్‌పల్స్ 200 4వీ, హంక్ 160ఆర్ 4వీ, జూమ్ వంటి టూ వీలర్లను ఉత్పత్తి చేయనున్నట్లు సమాచారం. హీరో మోటోకార్ప్ ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా సుమారు 48 దేశాల్లో తన కార్యకలాపాలను నిర్వహిస్తోంది. రాబోయే రోజుల్లో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నాము. -
కేవలం 100 మందికి మాత్రమే ఈ బైక్.. వేలంలో కొనాల్సిందే
దేశంలో అతి పెద్ద టూ-వీలర్ తయారీ సంస్థగా ప్రసిద్ధి చెందిన హీరో మోటోకార్ప్ తన సెంటెనియల్ ఎడిషన్ మోటార్‌సైకిల్ విక్రయాలను ప్రకటించింది. జనవరిలో జరిగిన హీరో వరల్డ్ ఈవెంట్లో పరిచయమైన ఈ బైక్ త్వరలో రోడ్డుపైకి రానుంది. అయితే కేవలం 100 యూనిట్లను మాత్రమే కంపెనీ విక్రయించనుంది.హీరో మోటోకార్ప్ ఫౌండర్ డాక్టర్ బ్రిజ్మోహన్ లాల్ ముంజాల్ 101వ పుట్టినరోజు సందర్బంగా కంపెనీ సెంటెనియల్ ఎడిషన్ బైకును విక్రయించనుంది. ఈ బైక్‌ను తమ 'ఉద్యోగులు, సహచరులు, వ్యాపార భాగస్వాములు, వాటాదారుల' కోసం ప్రత్యేకంగా వేలం వేయనున్నట్లు హీరో ప్రకటించింది. దీని ద్వారా వచ్చిన ఆదాయాన్ని సంస్థ సమాజం మేలు కోసం ఉపయోగించనున్నట్లు సమాచారం. డెలివరీలు సెప్టెంబర్‌లో ప్రారంభం కానున్నాయి.హీరో సెంటెనియల్ ఎడిషన్ అనేది కరిజ్మా ఎక్స్ఎమ్ఆర్ ప్లాట్‌ఫామ్‌పై ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఇది కార్బన్ ఫైబర్ బాడీవర్క్, సింగిల్ సీట్, ఫుల్లీ అడ్జస్టబుల్ సస్పెన్షన్, కార్బన్ ఫైబర్ ఎగ్జాస్ట్ మఫ్లర్ వంటి వాటిని పొందుతుంది. ఇవన్నీ కలిగి ఉండటం వల్ల స్టాండర్డ్ బైక్ కంటే ఇది 5.5 కేజీలు ఎక్కువ బరువును కలిగి ఉంటుంది.Hero MotoCorp introduces The Centennial Collector's Edition Motorcycle. Designed, sculpted, and etched with the utmost reverence. This masterpiece is meticulously handcrafted for only the chosen one hundred. On auction for the greater good.#HeroMotoCorp #TheCentennial pic.twitter.com/nD9ddlkq3j— Hero MotoCorp (@HeroMotoCorp) July 1, 2024 -
పెరగనున్న టూ వీలర్స్ ధరలు.. జులై 1నుంచే అమలు
భారతదేశంలో అతిపెద్ద టూ వీలర్ తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ తన లైనప్‌లో ఎంపిక చేసిన ద్విచక్ర వాహనాల ధరలను పెంచనున్నట్లు ప్రకటించింది. కంపెనీ ఏ మోడల్ మీద ఎంత ధరలను పెంచనుంది అనే వివరాలను ప్రస్తుతానికి అధికారికంగా వెల్లడించలేదు.హీరో మోటోకార్ప్ తన టూ వీలర్ల ధరలను పెంచినట్లయితే.. రూ. 1500 వరకు పెంచే అవకాశం ఉంది. ఇది కూడా మోడల్‌ను బట్టి మారుతూ ఉండే అవకాశం ఉంది. ధరల పెంపు 2024 జులై 1 నుంచి వర్తిస్తుంది. ఇన్పుట్ ఖర్చులు పెరగటం వల్ల కంపెనీ తన ఉత్పత్తుల ధరలను పెంచాల్సి వచ్చిందని కంపెనీ పేర్కొంది.హీరో మోటోకార్ప్ మోటార్‌సైకిళ్ల శ్రేణిలో స్ప్లెండర్ ప్లస్ వేరియంట్లు, హెచ్ఎఫ్ డీలక్స్, హెచ్ఎఫ్ 100, ప్యాషన్ ప్లస్, ప్యాషన్ ఎక్స్‌టెక్, సూపర్ స్ప్లెండర్, సూపర్ స్ప్లెండర్ ఎక్స్‌టెక్, గ్లామర్, గ్లామర్ ఎక్స్‌టెక్, ఎక్స్ట్రీమ్ 125ఆర్, ఎక్స్ట్రీమ్ 4వీ, ఎక్స్ట్రీమ్ 200 4వీ, ఎక్స్ట్రీమ్ 160ఆర్, మావ్రిక్ 440 వంటివి ఉన్నాయి. స్కూటర్ల విభాగంలో హీరో డెస్టిని ప్రైమ్, డెస్టిని 125 ఎక్స్టీఈసీ, జూమ్, ప్లెజర్ ప్లస్ ఎక్స్‌టెక్ వున్నాయి. -
‘ఏథర్’లో ఉన్నదంతా అమ్మేసుకున్న సచిన్ బన్సాల్
ఫ్లిప్‌కార్ట్ సహ వ్యవస్థాపకుడు సచిన్ బన్సాల్ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ ఏథర్ ఎనర్జీలో తనకున్న 7.5 వాటానంతా అమ్మేసుకుని ఆ సంస్థ నుంచి వైదొలిగారు. 2014 నుంచి ఏథర్ కంపెనీలో దాదాపు రూ.400 కోట్లు ఇన్వెస్ట్ చేసిన తొలి ఇన్వెస్టర్లలో బన్సాల్ ఒకరు.ఎకనామిక్స్ టైమ్స్ కథనం ప్రకారం.. తన వాటాలో 2.2 శాతం భాగాన్ని హీరో మోటోకార్ప్‌కు రూ .124 కోట్లకు విక్రయించిన సచిన్ బన్సాల్ మిగిలిన 5.3 శాతం వాటాను జెరోధా సహ వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్‌కు సుమారు రూ .282 కోట్లకు విక్రయించారు. ఈ డీల్ తర్వాత ఈవీ స్టార్టప్‌లో హీరో మోటోకార్ప్ వాటా 40 శాతానికి పెరగనుంది.2024 ఆర్థిక సంవత్సరంలో ఏథర్ టర్నోవర్ రూ.1,753 కోట్లుగా ఉందని, అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో నమోదైన రూ.1,784 కోట్లతో పోలిస్తే ఇది 1.7 శాతం తగ్గిందని హీరో మోటోకార్ప్ తెలిపింది. -
రూ. 82911లకే కొత్త బైక్.. 73 కిమీ మైలేజ్
హీరోమోటోకార్ప్ కంపెనీ దేశీయ మార్కెట్లో ఎట్టకేలకు సరికొత్త స్ప్లెండర్ ప్లస్ XTEC 2.0 లాంచ్ చేసింది. కంపెనీ ఎవర్గ్రీన్ కమ్యూటర్ యొక్క 30వ వార్షికోత్సవాన్ని జరుపుకునే సందర్భంగా ఈ బైకును రూ. 82911 (ఎక్స్ షోరూమ్) ధర వద్ద లాంచ్ చేసింది.కొత్త హీరో స్ప్లెండర్ ప్లస్ 97.2 సీసీ ఎయిర్ కూల్డ్ ఇంజిన్ పొందుతుంది. ఇది 8000 rpm వద్ద 8.02 hp పవర్, 6000 rpm వద్ద 8.05 Nm టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 4 స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. ఇది ఒక లీటరుకు ఏకంగా 73 కిమీ మైలేజ్ అందిస్తుంది.డ్యూయల్ టోన్ కలర్ స్కీమ్ పొందిన ఈ బైక్ దాని మునుపటి మోడల్ కంటే కూడా చాలా అద్భుతమైన డిజైన్ పొందుతుంది. అంతే కాకుండా ఇందులో డిజిటల్ డిస్ప్లే.. బ్లూటూత్ కనెక్టివిటీకి సపోర్ట్ చేస్తుంది. ఇందులో USB ఛార్జింగ్ పోర్ట్ కూడా ఉంటుంది.డిజైన్, ఫీచర్స్ పరంగా ఉత్తమంగా ఉన్న ఈ బైక్ దాని స్టాండర్డ్ XTEC మోడల్ కంటే కూడా రూ. 3000 ఎక్కువ ధర వద్ద అందుబాటులో ఉంటుంది. ఇది దేశీయ మార్కెట్లో ఉఇప్పటికే అమ్మకానికి ఉన్న హోండా షైన్ 100, బజాజ్ ప్లాటినా 100 వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది. -
భారత్‌లో లాంచ్ అయిన కొత్త బైకులు ఇవే..
గత కొన్ని రోజులుగా కొత్త వాహనాలు దేశీయ మార్కెట్లో లాంచ్ అవుతూనే ఉన్నాయి. ఇందులో బైకులు, కార్లు ఉన్నాయి. ఈ కథనంలో ఈ మధ్య కాలంలో భారతీయ విఫణిలో లాంచ్ అయిన బైకుల గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.కవాసకి జెడ్650ఆర్ఎస్జపాన్ బైక్ తయారీ సంస్థ కవాసకి దేశీయ మార్కెట్లో జెడ్650ఆర్ఎస్ బైక్ లాంచ్ చేసింది. ఈ బైక్ ధర రూ. 6.99 లక్షలు (ఎక్స్ షోరూమ్). దీని ధర మునుపటి మోడల్ కంటే కూడా రూ. 7000 ఎక్కువ కావడం గమనార్హం. ఇది 649 సీసీ ఇంజిన్ కలిగి, 68 హార్స్ పవర్, 64 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.హీరో మావ్రిక్ 440హీరో మోటోకార్ప్ కూడా ఇటీవల మార్కెట్లో మావ్రిక్ 440 అనే కొత్త బైక్ లాంచ్ చేసింది. ఈ బైక్ ధర 1.99 లక్షల నుంచి రూ. 2.24 లక్షల (ఎక్స్ షోరూమ్) వరకు ఉంది. ఈ బైక్ 440 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ కలిగి 27 హార్స్ పవర్, 36 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇది స్లిప్ అండ్ అసిస్ట్ క్లచ్‌తో 6 స్పీడ్ గేర్‌బాక్స్‌ను పొందుతుంది.కవాసకి జెడ్900కవాసకి లాంచ్ చేసిన మరో బైక్ జెడ్900. దీని ధర రూ. 9.29 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఇది చూడటానికి దాని మునుపటి మోడల్ మాదిరిగా ఉన్నప్పటికీ.. ధర మాత్రం దాని కంటే రూ. 9000 ఎక్కువ. ఈ బైక్ 948 సీసీ ఇంజిన్ కలిగి, 125 హార్స్ పవర్, 98.6 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది.కవాసకి నింజా 500మార్కెట్లో లాంచ్ అయిన మరో బైక్ కవాసకి నింజా 500. దీని ధర రూ. 5.24 లక్షలు (ఎక్స్ షోరూమ్). 451 సీసీ ఇంజిన్ కలిగిన ఈ బైక్ 45 హార్స్ పవర్, 42.6 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది భారతదేశానికి కంప్లైట్ బిల్డ్ (CBU) ద్వారా దిగుమతి అవుతుంది. -
మార్కెట్లో లాంచ్ అయిన 'మార్విక్ 440' బైక్ - వివరాలు
దేశీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన టూ వీలర్ తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ ఎట్టకేలకు 'మార్విక్ 440' బైక్ లాంచ్ చేసింది. దేశీయ విఫణిలో లాంచ్ అయిన ఈ బైక్ ధరలు రూ. 1.99 లక్షల నుంచి రూ. 2.24 లక్షల మధ్య ఉన్నాయి. కంపెనీ ఈ బైక్ కోసం రూ. 5000 మొత్తంతో బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. డెలివరీలు ఏప్రిల్ 15 నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అయితే మార్చి 15లోపల బుక్ చేసుకున్న కస్టమర్లకు రూ. 10000 విలువైన యాక్ససరీస్ లభించే అవకాశం ఉన్నట్లు సమాచారం. చూడటానికి హార్లే డేవిడ్సన్ ఎక్స్440 మాదిరిగా ఉండే హీరో మార్విక్ 440 బైక్ 440 సీసీ ఇంజిన్ కలిగిన ఈ హీరో మావ్రిక్ 26 హార్స్ పవర్, 36 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ గేర్‌బాక్స్ కలిగి ఉత్తమ పనితీరుని అందించనుంది. డిజైన్, ఫీచర్స్ పరంగా అద్భుతంగా ఉన్న ఈ బైక్ మార్కెట్లో ఇప్పటికే అమ్మకానికి ఉన్న రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ 350, క్లాసిక్ 350, హోండా సిబి350, జావా 350 వంటి బైకులకు ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది, కాబట్టి ఇది అమ్మకాల పరంగా గట్టి పోటీ ఎదుర్కోవాల్సి ఉంటుందని తెలుస్తోంది. ఇదీ చదవండి: గర్ల్‌ఫ్రెండ్‌కు పువ్వులిచ్చేందుకు తిప్పలు - బ్లింకిట్‌లో యూజర్ చాట్ వైరల్ -
హీరో మోటో డివిడెండ్ రూ. 100
న్యూఢిల్లీ: ద్విచక్ర వాహన దిగ్గజం హీరో మోటోకార్ప్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023–24) మూడో త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. అక్టోబర్–డిసెంబర్ (క్యూ3)లో కన్సాలిడేటెడ్ నికర లాభం 50 శాతం జంప్‌చేసి రూ. 1,093 కోట్లను తాకింది. వివిధ ప్రాంతాలలో అమ్మకాలు పుంజుకోవడం లాభాలకు దోహదపడింది. గతేడాది (2022–23) ఇదే కాలంలో రూ. 726 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 8,300 కోట్ల నుంచి రూ. 10,031 కోట్లకు ఎగసింది. ఈ కాలంలో 18 శాతం అధికంగా 14.6 లక్షల మోటార్‌సైకిళ్లు, స్కూటర్లను విక్రయించింది. కంపెనీ చైర్మన్ ఎమెరిటస్ బ్రిజ్మోహన్ లాల్ ముంజాల్ శత జయంతి సందర్భంగా రూ. 25 ప్రత్యేక డివిడెండుతో కలిపి వాటాదారులకు కంపెనీ బోర్డు మొత్తం షేరుకి రూ. 100 చొప్పున మధ్యంతర డివిడెండును ప్రకటించింది. రూ. 600 కోట్లు వెచి్చంచడం ద్వారా విడిభాగాలు, యాక్సెసరీస్, మెర్కండైజ్ బిజినెస్‌ను విస్తరించే ప్రణాళికల్లో ఉన్నట్లు హీరో మోటోకార్ప్ తాజాగా వెల్లడించింది. ఫలితాల నేపథ్యంలో హీరో మోటోకార్ప్ షేరు 2 శాతం లాభంతో రూ. 4,909 వద్ద ముగిసింది. -
ఆటో రిక్షా.. అదే స్కూటర్ - ఇప్పటి వరకు ఇలాంటి వెహికల్ చూసుండరు!
భారతదేశంలో ఎప్పటికప్పుడు కొత్త కొత్త వాహనాలు విడుదలవుతూనే ఉన్నాయి. అయితే ఇటీవల హీరో మోటోకార్ప్ మొదటిసారి ఓ వినూత్న వాహనాన్ని ఆవిష్కరించింది. ఇది ఇప్పటి వరకు మార్కెట్లో లాంచ్ అయిన వాహనాల కంటే ఇది చాలా భిన్నంగా ఉంటుంది. మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. హీరో మోటోకార్ప్ ఆవిష్కరించిన ఈ కొత్త వెహికల్ 'సర్జ్ ఎస్32' కన్వర్టిబుల్ ఎలక్ట్రిక్ త్రీ-వీలర్ చూడటానికి ఆటో రిక్షా మాదిరిగా ఉంటుంది. కానీ ఇది ఒక ఎలక్ట్రిక్ స్కూటర్‌కి జత చేసి ఉండటం చూడవచ్చు. కాబట్టి ఈ వెహికల్ అటు స్కూటర్‌గా, ఆటో రిక్షాగా కూడా పనిచేస్తుంది. కంపెనీ ప్రత్యేకంగా దీనిని స్వయం ఉపాధి పొందే వారికోసం రూపొందించినట్లు వెల్లడించింది. ఇటీవల జరిగిన ‘హీరో వరల్డ్’ ఈవెంట్లో కంపెనీ దీన్ని ప్రదర్శించింది. ఈ వాహనానికి విండ్ స్క్రీన్, హెడ్‌ల్యాంప్, టర్న్ ఇండికేటర్లు, విండ్ స్క్రీన్ వైపర్లు ఉన్నాయి, డోర్స్ మాత్రం లేదు. కానీ జిప్‌తో కూడిన సాఫ్ట్డోర్లు లభించే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇదీ చదవండి: మూడు నెలల బిడ్డను అక్కడ విడిచిపెట్టి.. ఇన్ఫోసిస్ కోసం సుధామూర్తి.. కొత్త సర్జ్ ఎస్32 త్రీవీలర్‌లో 10 kW ఇంజిన్, 11 kWh బ్యాటరీ ఉంటుంది. అదే సమయంలో రోజు వారీ వినియోగనైకి అనుకూలంగా ఉండటానికి స్కూటర్లో 3kw ఇంజిన్, 3.5 కిలోవాట్ బ్యాటరీ ఉంటుంది. త్రీవీలర్ 50 కిమీ/గం వేగంతో 500 కిమీ బరువుని మోయగల కెపాసిటీ కలిగి ఉంటుంది. స్కూటర్ మాత్రం 60 కిమీ వేగంతో ప్రయాణిస్తుంది. -
నేపాల్‌లో హీరో మోటోకార్ప్ ప్లాంట్
న్యూఢిల్లీ: ద్విచక్ర వాహన తయారీ దిగ్గజం హీరో మోటాకార్ప్ నేపాల్‌లో అసెంబ్లింగ్ యూనిట్ ఏర్పాటు చేస్తోంది. 2024 మార్చిలో కార్యకలాపాలు ప్రారంభం అవుతాయని సంస్థ ప్రకటించింది. కంపెనీ ఉత్పత్తులకు నేపాల్ పంపిణీదారు అయిన సీజీ మోటార్స్ భాగస్వామ్యంతో ఏటా 75,000 యూనిట్ల సామర్థ్యం గల కేంద్రాన్ని నవల్పూర్ జిల్లాలో నెలకొల్పనుంది. 2014లో నేపాల్‌లో ఎంట్రీ ఇచ్చిన హీరో మోటోకార్ప్.. ఆ దేశంలో ప్రముఖ ద్విచక్ర వాహన కంపెనీగా నిలిచింది. "నేపాల్‌లోని సీజీ గ్రూప్‌తో భాగస్వామి కావడానికి సంతోషిస్తున్నాం. నేపాల్ మాకు చాలా ముఖ్యమైన మార్కెట్. ఇక్కడ కస్టమర్లకు అత్యుత్తమ ఉత్పత్తులు, సేవలు అందించడానికి నిరంతరం ప్రయత్నిస్తాం" అని హీరో మోటోకార్ప్ గ్లోబల్ బిజినెస్ హెడ్ సంజయ్ భాన్ అన్నారు. -
బంపరాఫర్, ఎలక్ట్రిక్ బైక్ కొనుగోలుకు ఇదే మంచి ఛాన్స్!
ఎలక్ట్రిక్ వెహికల్స్ కొనాలనుకుంటున్నారా? అయితే డిసెంబర్ 31లోపు కొనేసేయండి. ఈ లోపాటు వెహికల్స్ ధరలు తక్కువ ధరకే లభ్యం కానున్నాయి. కొత్త ఏడాది ప్రారంభంతో కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఫేమ్ పథకంలో మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉందని, ఫలితంగా ఈవీ ధరలకు రెక్కలొచ్చే అవకాశం ఉందని మార్కెట్ నిపుణుల అంచనా. డిసెంబర్ నెలలలో ప్రముఖ టూవీలర్ తయారీ సంస్థలు ఓలా, ఎథేర్ మోటార్స్, హీరో మోటోకార్పొతో పాటు పలు ఇతర ఆటోమొబైల్ సంస్థలు ఈవీలపై ఆఫర్లు అందిస్తున్నాయి. వాటిల్లో ముందుగా ఎథేర్ మోటార్స్ 450 ఎస్ అండ్ 450 ఎక్స్ మోడళ్లపై రూ.6,500 క్యాష్ బెన్ఫిట్స్ అందిస్తుంది. అదనంగా రూ.1500 కార్పొరేట్ బెన్ఫిట్స్ను సొంతం చేసుకోవచ్చుకోవచ్చు. ఇక ఎథేర్ ఎలక్ట్రిక్ డిసెంబర్ స్కీమ్ కింద మరో రూ.5,000 ఆదా చేసుకోవచ్చు. ఓలా సైతం ఇయర్ ఎండ్ ఆఫర్ కింద రూ.20వేల వరకు సబ్సిడీ, ఎంపిక చేసిన క్రెడిట్ కార్డ్‌లపై రూ.5 వేల వరకు డిస్కౌంట్ సొంతం చేసుకోవచ్చు. దీంతో పాటు డౌన్ పేమెంట్ తగ్గుతుంది. జీరో ప్రాసెసింగ్ ఛార్జీలు వర్తిస్తాయి. మరో ఈవీ సంస్థ హీరో మోటోకార్ప్ సైతం విడా వి1 ఎలక్ట్రిక్ స్కూటర్‌పై రూ.38,500విలువ చేసే ఆఫర్లను అందిస్తుంది. రూ.7,500 వరకు ఈఎంఐ బెన్ఫిట్స్, రూ.8,259 విలువ చేసే బ్యాటరీ వారెంటీ పొడిగింపు, రూ.6,500 డిస్కౌంట్, రూ.5,000 ఎక్స్ఛేంజీ బోనస్, రూ.7,500 లాయల్టీ డిస్కౌంట్, రూ.2,500 కార్పొరేట్ డిస్కౌంట్, రూ.1,125 విలువచేసే సబ్స్క్రిప్షన్ ప్లాన్లతో మొత్తం కలిపి రూ.38,500 వరకు ప్రయోజనాల్ని అందిస్తోంది. -
హీరో మోటో ఎండీ, తదితరులపై ఫోర్జరీ కేసు:షేరు ఢమాల్
Delhi Police file FIR against Hero MotoCorp chairman Pawan Munjal ద్విచక్ర వాహన తయారీదారు హీరో మోటోకార్ప్‌కు మరోసారి భారీ షాక్ గిలింది. మోసం, ఫోర్జరీ , నేరపూరిత కుట్ర ఆరోపణలతో ఢిల్లీ కోర్టు ఆదేశాలపై హీరో మోటో ఎండీ, సహా పలువురి సీనియర్ అధికారులపై కేసు నమోదైంది. నకిలీ బిల్లులు తయారు చేసి, ఆదాయపు పన్ను శాఖలో డిపాజిట్ చేసి, సేవా పన్నులో లబ్ధి పొందారని పోలీసులు ఆరోపించారు. దీంతో స్టాక్ 3 శాతం భారీ పతనాన్ని నమోదు చేసింది. ఈ కేసు ఎఫ్ఐఆర్ 2010కి ముందు నాటి పాత విషయానికి సంబంధించినదని, ఇతర దర్యాప్తులు , పన్ను విచారణలకు ఎలాంటి సంబంధం లేదని కంపెనీ తెలిపింది. బిలియనీర్ , కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ పవన్ ముంజాల్, సీఈవో పవన్ కాంత్, ముగ్గురిపై ఫోర్టరీ అరోపణలపై కేసు నమోదైంది. కాగా పవన్ ముంజాల్సహా మరికొందరికీలక అధికారులపై మనీలాండరింగ్ ఆరోపణలు దాఖలైనాయి. ఇందులో భాగంగానే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) 2023 ఆగస్టు లో ముంజాల్, ఇతరులపై సోదాలు నిర్వహించింది. ప్రకటించని విదేశీ కరెన్సీని కలిగి ఉన్నారనే ఆరోపణలపై డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) ఫిర్యాదు చేసింది. దీంతో ముంజాల్ నివాసంతో పాటు పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. వ్యక్తిగత అవసరాల కోసం కోసం రూ.40 కోట్ల విలువైన విదేశీ కరెన్సీ (నిషేధిత వస్తువు)ని అక్రమంగా ఎగుమతి చేసినట్టు ఈడీ ఆరోపించింది. దీనికి సంబంధించిన తనిఖీల్లో సెర్చ్ 25 కోట్ల రూపాయల విలువైన విదేశీ కరెన్సీ, నగదు, బంగారం ,వజ్రాభరణాలు (విదేశీ కరెన్సీ, బంగారంతో సహా) స్వాధీనం చేసుకున్నట్లు ఈడీ తెలిపింది. (ఇజ్రాయెల్-గాజా సంక్షోభం: ‘షెకెల్’ కోసం సెంట్రల్ బ్యాంకు కీలక నిర్ణయం) ఆగస్ట్ 20, 2018న ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి ముంజాల్‌తో పాటు ఎగ్జిక్యూటివ్ లండన్‌కు బ్రిటిష్ ఎయిర్వేస్ విమానంలో భద్రతా తనిఖీల సమయంలో అతని హ్యాండ్ బ్యాగేజీలో రూ.81 లక్షల కంటే ఎక్కువ విలువైన విదేశీ కరెన్సీని సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ స్వాధీనం చేసుకుంది. 800 కోట్లకు పైగా అక్రమ వ్యాపార వ్యయాలు, భూమి కొనుగోలుకు ఉపయోగించిన రూ. 60 కోట్ల విలువైన "ఖాతాలో చూపని" అక్రమ ఆస్తులను సోదాల్లో కనుగొన్నట్లు ఐటి అడ్మినిస్ట్రేటివ్ అథారిటీ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ గత ఏడాది మార్చిలో ప్రకటించిన సంగతి తెలిసిందే. (స్పోర్ట్స్ ఈవెంట్లో మెరిసిన రణబీర్, అలియా...మరో విశేషమేమంటే..!) -
హీరో మోటోకార్ప్ డిజిటల్ రైడ్
న్యూఢిల్లీ: ద్విచక్ర వాహన తయారీ దిగ్గజం హీరో మోటోకార్ప్ 2030 నాటికి డిజిటల్ వేదిక ద్వారా 30 శాతం అమ్మకాలను సాధించాలని లక్ష్యంగా చేసుకుంది. అలాగే మహిళా ఉద్యోగుల సంఖ్యను 30 శాతానికి చేర్చాలని నిర్ణయించామని హీరో మోటోకార్ప్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ పవన్ ముంజాల్ తెలిపారు. 2022–23 కంపెనీ వార్షిక నివేదికలో ఆయన ఈ విషయాలను వెల్లడించారు. ‘డిజిటల్ వేదికలను పెంపొందించాం. కొనుగోళ్లకు ముందు, తర్వాతి అవసరాలకు ప్రధాన గమ్యస్థానంగా ఈ వేదిక నిలిచింది. సమాచార సాంకేతిక వ్యవస్థలను ఆధునీకరించాం. ఆధునిక అనలిటిక్స్, ఆరి్టఫీíÙయల్ ఇంటెలిజెన్స్ టూల్స్‌ను వినియోగిస్తున్నాం. ఆటోమేషన్ సాంకేతికలను అమలు చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి వద్ద ఉన్న తయారీ కేంద్రంలో స్థాపించిన ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ డిజిటల్ ఫ్యాక్టరీ లైట్‌హౌస్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి నాటికి ఉత్పాదకతను 20 శాతం పెంచాలని లక్ష్యంగా చేసుకుంది’ అని ఆయన వివరించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆరోగ్యకర వృద్ధిని ఆశిస్తున్నామని చెప్పారు. భారత్‌తోపాటు విదేశీ మార్కెట్ల కోసం 2023–24లో 65 లక్షలకు పైగా ద్విచక్ర వాహనాల ఉత్పత్తిని లక్ష్యంగా పెట్టుకున్నామని వెల్లడించారు. 2022–23లో కంపెనీ 53 లక్షల యూనిట్లను తయారు చేసింది. 54 లక్షల యూనిట్లను విక్రయించింది. ఈ ఏడాది దారి చూపుతాం.. భారత్‌లో మోటార్‌సైకిళ్లు, స్కూటర్ల డిమాండ్‌లో గ్రామీణ, ఉప నగర మార్కెట్లు సవాళ్లను ఎదుర్కొన్నాయని ముంజాల్ పేర్కొన్నారు. అయినప్పటికీ నిర్మాణాత్మక వృద్ధి అంశాలు చెక్కుచెదరకుండా కొనసాగుతున్నాయని తెలిపారు. ‘దేశంలోని యువ నైపుణ్యం కలిగిన జనాభా, గ్రామీణ, ఉప నగర ప్రాంతాల బలమైన ఆర్థిక వృద్ధి సామర్థ్యం, వినియోగదారులకు రుణాలు సులభంగా అందుబాటులో ఉండడం, లాస్ట్ మైల్ కనెక్టివిటీకి పెరుగుతున్న డిమాండ్ దృష్ట్యా విజయవంతమైన 2023–24 సంవత్సరానికి హీరో మోటోకార్ప్ దారి చూపుతుందని విశ్వసిస్తున్నాం. అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులు సవాల్ విసురుతున్నప్పటికీ బ్రాండ్ నిర్మాణం, కొత్త ఉత్పత్తుల విడుదల, నెట్వర్క్ పరిధిని విస్తరించడంలో పెట్టుబడులను కొనసాగించాం. ప్రపంచంలోనే అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీదారుగా కొత్త మార్కెట్లలో మా ఉనికిని నెలకొల్పడానికి, ఇప్పటికే ఉన్న వాటిలో వాటాను పెంచుకోవడానికి, మార్కెట్ అభివృద్ధి ప్రయత్నాలకు కట్టుబడి ఉండటానికి దీర్ఘకాలిక ప్రణాళికలను రచించాం. ఇంటర్నల్ కంబషన్ ఇంజన్, ఎలక్ట్రిక్ మోడళ్లకు మరింత విలువ కేంద్రీకృతంగా ముందుకు తీసుకెళ్లాలని భావిస్తున్నాం’ అని ముంజాల్ పేర్కొన్నారు. -
బైక్ ప్రేమికులకు షాక్.. మళ్ళీ పెరిగిన హీరో మోటోకార్ప్ ధరలు!
Hero MotoCorp Price Hike: ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ ' హీరోమోటోకార్ప్' (Hero MotoCorp) ఎట్టకేలకు తమ వాహనాల ధరలను మరో సారి పెంచింది. పెరిగిన ధరలు జులై 03 నుంచి అమలులోకి రానున్నట్లు సమాచారం. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం, హీరో మోటోకార్ప్ ఈ సారి సగటున 1.5 శాతం ధరలను పెంచనున్నట్లు తెలుస్తోంది. ధరల పెరుగుదల వేరియంట్, మోడల్ మీద ఆధారపడి ఉంటుంది. అయితే ఏ మోడల్ మీద ఎంత పెరిగింది అనే వివరాలు ప్రస్తుతానికి అందుబాటులో లేదు. గతంలో.. హీరో మోటోకార్ప్ మూడు నెలలకు ముందు కూడా తమ వాహనాల ధరలను పెంచింది. కాగా మళ్ళీ ఇప్పుడు మరో సారి పెంచినట్లు ప్రకటించింది. ముడి సరకుల ఖర్చులతో పాటు ఇతర అంశాలను పరిగణలోకి తీసుకుని ధరల పెరుగుల జరిగినట్లు తెలిసింది. అయితే కొనుగోలుదారులకు ధరల పెరుగుదల నుంచి కొంత ఉపశమనం కలిగించడానికి ఆకర్షణీయమైన ఫైనాన్సింగ్ ప్రొగ్రామ్‌లను అందించనుంది. (ఇదీ చదవండి: కనుమరుగవుతున్న 44 ఏళ్ల చరిత్ర.. హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌లో హెచ్డీఎఫ్సీ విలీనం!) రానున్న పండుగ సీజన్లో వాహనాల అమ్మకాలు పెరుగుతాయని కంపెనీ భావిస్తోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని ఆఫర్స్ అందించడం జరుగుతుంది. ఇప్పటికే మంచి అమ్మకాలతో ముందుకు సాగుతున్న ఎక్స్ట్రీమ్, స్ప్లెండర్ మొదలైన వెహికల్ ధరలు మరో రెండు రోజుల్లో పెరగనున్నాయి. -
భారత్‌లో హీరో ఎక్స్ట్రీమ్ 160ఆర్ 4వి బైక్ - ధర & వివరాలు
2023 Hero Xtreme 160R 4V: భారతీయ మార్కెట్లో ఇప్పటికే మంచి అమ్మకాలతో ముందుకు దూసుకెళ్తున్న 'హీరో మోటోకార్ప్' (Hero MotoCorp) ఎట్టకేలకు మరో కొత్త బైక్ లాంచ్ చేసింది. ఈ బైక్ దాని మునుపటి మోడల్ కంటే కూడా ఆధునిక ఫీచర్స్ పొందుతుంది. కంపెనీ లాంచ్ చేసిన ఈ బైక్ ధర, అప్డేటెడ్ ఫీచర్స్ గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. వేరియంట్స్ & ధరలు దేశీయ మార్కెట్లో విడుదలైన హీరో మోటోకార్ప్ కొత్త బైక్ పేరు 'ఎక్స్ట్రీమ్ 160ఆర్ 4వి'. ఇది స్టాండర్డ్, కనెక్టెడ్, ప్రో అనే మూడు వేరియంట్లలో లభిస్తుంది. వీటి ధరలు వరుసగా రూ. 1.27 లక్షలు, రూ. 1.32 లక్షలు & రూ. 1.36 లక్షలు (అన్ని ధరలు ఎక్స్ షోరూమ్, ఢిల్లీ). డిజైన్ & ఫీచర్స్ 2023 ఎక్స్ట్రీమ్ 160ఆర్ 4వి రీ డిజైన్ చేయబడిన ఫుల్ ఎల్ఈడీ హెడ్‌లైట్ పొందుతుంది, స్విచ్ గేర్ మునుపటి కంటే ఎక్కువ ప్రీమియంగా ఉంటుంది. ఈ బైక్ స్ప్లిట్ సీటు సెటప్ కలిగి రైడర్ అండ్ పిలియన్ ఇద్దరికీ చాలా అనుకూలంగా ఉంటుంది. మోనోషాక్ షోవా 7 స్టెప్ ప్రీలోడ్ అడ్జస్టబుల్ యూనిట్ వంటివి కేవలం టాప్ ఎండ్ వేరియంట్లలో మాత్రమే లభిస్తాయి. మిగిలిన వేరియంట్లలో టెలిస్కోపిక్ ఫోర్క్ / మోనోషాక్ సెటప్ ఉంటాయి. ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో LCD డిస్ప్లే లభిస్తుంది. దీనికి బ్లూటూత్ కనెక్షన్ ఉంటుంది. కావున కాల్, నోటిఫికేషన్ అలర్ట్ వంటి వాటిని పొందవచ్చు. కాగా దీనికి సింగిల్ పీస్ సీటు, ఫోన్ మౌంట్, బార్ ఎండ్ మిర్రర్ వంటి యాక్ససరీస్ లభిస్తాయి. ఆసక్తి కలిగిని వినియోగదారులు బైకుని మరింత అందంగా చేయాలనుకుంటే ఈ యాక్ససరీస్ పొందవచ్చు. (ఇదీ చదవండి: ఏఐ చేసిన పనికి బిత్తరపోయిన జనం - అసలు విషయం ఏంటంటే?) ఇంజిన్ & పర్ఫామెన్స్ 2023 ఎక్స్ట్రీమ్ 160ఆర్ 4వి బైకులోని 163 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజన్ ఇప్పుడు ఎయిర్ కూల్డ్తో పాటు ఆయిల్ కూలర్‌ను పొందుతుంది. కావున ఇది ఆధునిక 4 వాల్వ్ హెడ్ పొందుతుంది. ఇది 16.9 bhp పవర్ 14.6 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ 12 లీటర్ల వరకు ఉంటుంది. బైక్ మొత్తం బరువు సుమారు 140 కేజీల కంటే ఎక్కువ. (ఇదీ చదవండి: కన్నీళ్లు తెప్పిస్తున్న స్విగ్గీ డెలివరీ బాయ్ కష్టాలు.. కస్టమర్ సాయంతో జాబ్ కొట్టాడిలా..!) ప్రత్యర్థులు భారతదేశంలో విడుదలైన కొత్త ఎక్స్ట్రీమ్ 160ఆర్ 4వి ధరల పరంగా బజాజ్ పల్సర్, అపాచే ఆర్టిఆర్ 4వి బైకులకు ప్రత్యర్థిగా ఉంటుంది. సంస్థ ఈ బైక్ కోసం ఈ రోజు నుంచి బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించనుంది. డెలివరీలు జూలై రెండవ వారంలో మొదలయ్యే అవకాశం ఉంటుంది. -
ఈ–టూవీలర్ల విస్తరణపై మరింత దృష్టి
న్యూఢిల్లీ: వాహనాల తయారీ దిగ్గజం హీరో మోటోకార్ప్ తమ ఎలక్ట్రిక్ టూవీలర్ల పోర్ట్‌ఫోలియోను మరింత విస్తరించడంపై దృష్టి పెట్టనుంది. అలాగే, తమ ప్రస్తుత సేల్స్ మౌలిక సదుపాయాలను మెరుగుపర్చుకోనుంది. కొత్త సీఈవోగా నియమితులైన నిరంజన్ గుప్తా కంపెనీ భవిష్యత్ ప్రణాళికలను ఈ మేరకు వివరించారు. ప్రీమియం సెగ్మెంట్లో (160–450 సీసీ) స్థానాన్ని పటిష్టం చేసుకోవడం, ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల విభాగంలో అగ్ర స్థానాన్ని దక్కించుకోవడంపై ప్రధానంగా దృష్టి పెట్టనున్నట్లు తెలిపారు. కంపెనీ చరిత్రలో ఎన్నడూ లేనంతగా ఈ ఏడాది పెద్ద సంఖ్యలో కొత్త ప్రీమియం వాహనాలను ప్రవేశపెట్టనున్నట్లు గుప్తా వివరించారు. మరింత మంది కస్టమర్లకు చేరువయ్యే దిశగా ఈ–టూవీలర్ల కేటగిరీలో కొత్తగా ఎంట్రీ–లెవెల్ మోడల్స్‌ను ప్రవేశపెట్టనున్నట్లు చెప్పారు. నియంత్రణపరమైన మార్పులతో (ఫేమ్ స్కీము కింద సబ్సిడీలను తగ్గించడంలాంటివి) ఈవీ స్టార్టప్ విభాగంలో కన్సాలిడేషన్‌కు అవకాశం ఉందని గుప్తా చెప్పారు. అటు 1,000 ప్రధాన డీలర్‌షిప్‌లలో 35–40 శాతం డీలర్‌షిప్‌లను దశలవారీగా అప్‌గ్రేడ్ చేసే యోచనలో ఉన్నట్లు ఆయన తెలిపారు. అంతర్జాతీయంగా మెక్సికో, నైజీరియా, బంగ్లాదేశ్, కొలంబియా వంటి 8–10 మార్కెట్లలో వ్యాపారాన్ని పటిష్టం చేసుకునేందుకు కసరత్తు చేయనున్నట్లు గుప్తా చెప్పారు. -
భారత్‌లో మళ్ళీ అడుగెట్టిన హీరో ఫ్యాషన్ ప్లస్ - ధర & వివరాలు
Hero Passion Plus: బిఎస్6 ఉద్గార ప్రమాణాల కారణంగా భారతదేశంలో మూడు సంవత్సరాలకు ముందు హీరో మోటోకార్ప్ (Hero MotoCorp) నిలిపివేసిన 'ఫ్యాషన్ ప్లస్' (Passion Plus) ఇప్పుడు మళ్ళీ దేశీయ మార్కెట్లో విడుదలైంది. ఈ బైక్ ధర దేశీయ మార్కెట్లో రూ. 76,065 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ). దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. కొత్త హీరో ఫ్యాషన్ ప్లస్ బైక్ చూడటానికి దాని మునుపటి మోడల్ మాదిరిగా ఉన్నప్పటికీ ఇందులో కొన్ని కాస్మొటిక్ అప్డేట్స్ గమనించవచ్చు. కాగా ఈ బైక్ లాంగ్ స్టాండింగ్ ఎయిర్ కూల్డ్, 97.2 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ ఉపయోగించి అదే 8 హార్స్ పవర్, 8.05 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ ఇప్పుడు OBD-2 కంప్లైంట్ అండ్ E20 కి సిద్ధంగా తయారైంది. ఈ బైక్ ఐ3ఎస్ స్టార్ట్/స్టాప్ టెక్నాలజీ కూడా పొందుతుంది. హీరో ఫ్యాషన్ ప్లస్ టెలిస్కోపిక్ ఫోర్క్ & ట్విన్ షాక్ అబ్జార్బర్స్ కలిగి డబుల్ క్రెడిల్ ఫ్రేమ్ పొందుతుంది. ఈ బైక్ బరువు 115 కేజీలు. దీన్ని బట్టి చూస్తే ఇప్పటి వరకు ఉన్న 100 సీసీ విభాగంలో ఇదే అత్యంత బరువైన బైక్ అని తెలుస్తోంది. ముందు, వెనుక 130 మిమీ డ్రమ్ బ్రేక్‌లు ఉంటాయి. (ఇదీ చదవండి: ఇండియాలో అక్కడ నివాసం చాలా కాస్ట్లీ - హైదరాబాద్ స్థానం ఏంటంటే?) గతంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన ఈ హీరో ఫ్యాషన్ ప్లస్ ఇప్పుడు మూడు కలర్ ఆప్షన్స్‌తో లభించడమే కాకుండా సెల్ఫ్ స్టార్ట్, డిజిటల్ అనలాగ్ డిస్ప్లే, USB ఛార్జింగ్ పోర్ట్ వంటివి వాటిని పొందుతుంది. ఈ బైక్ మార్కెట్లో హోండా షైన్, బజాజ్ ప్లాటినా మొదలైన 110 సీసీ విభాగంలోని బైకులకు ప్రత్యర్థిగా ఉంటుంది. -
రూ. 60760కే హెచ్ఎఫ్ డీలక్స్ కొత్త ఎడిషన్ - అదిరిపోయే ఫీచర్స్
Hero HF Deluxe Black Canvas Edition: భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన 'హీరో మోటోకార్ప్' (Hero MotoCorp) తన బెస్ట్ సెల్లింగ్ మోడల్ అయిన హెచ్ఎఫ్ డీలక్స్‌కి చెందిన మరో కొత్త ఎడిషన్‌ను లాంచ్ చేసింది. మార్కెట్లో విడుదలైన ఈ కొత్త బైక్ పేరు 'హెచ్ఎఫ్ డీలక్స్ బ్లాక్ కాన్వాస్' (HF Deluxe Black Canvas). ఈ బైక్ గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ధరలు & కలర్ ఆప్షన్స్ కొత్త హీరో హెచ్ఎఫ్ డీలక్స్ బ్లాక్ కాన్వాస్ ఎడిషన్ రెండు వేరియంట్లలో లభిస్తుంది. అవి కిక్ వేరియంట్, సెల్ఫ్ స్టార్ట్ వేరియంట్. వీటి ధరలు వరుసగా రూ. 60760 & రూ. 66,408 (ఎక్స్-షోరూమ్, ఇండియా). ఈ బైక్ ఇప్పుడు ఆల్ న్యూ బ్లాక్ పెయింట్ స్కీమ్‌లో లభిస్తుంది. అంతే కాకుండా ఇది నెక్సస్ బ్లూ, కాండీ బ్లేజింగ్ రెడ్, హెవీ గ్రే విత్ బ్లాక్, బ్లాక్ విత్ స్పోర్ట్స్ రెడ్ అనే పెయింట్ స్కీమ్‌లో కూడా అందుబాటులో ఉంటుంది. (ఇదీ చదవండి: ఒకప్పుడు క్రెడిట్ కార్డు ఏజంట్.. ఇప్పుడు రూ. 1000 కోట్ల సామ్రాజ్యాధిపతి) డిజైన్ & ఫీచర్స్ కొత్త హెచ్ఎఫ్ డీలక్స్ బ్లాక్ కాన్వాస్ ఎడిషన్ 3డీ హెచ్ఎఫ్ డీలక్స్ ఎంబ్లమ్ పొందుతుంది. ఇందులో అన్ని లైట్స్ హాలోజన్ యూనిట్లు కావడం విశేషం. ఫీచర్స్ విషయానికి వస్తే.. ట్యూబ్‌లెస్ టైర్స్, USB ఛార్జింగ్ పోర్ట్, సైడ్-స్టాండ్ ఇండికేటర్, టో-గార్డ్ వంటివి ఉన్నాయి. ఇక పరిమాణం పరంగా ఈ బైక్ పొడవు 1965 మిమీ, వెడల్పు 720 మిమీ, వీల్‌బేస్ 1,235 మిమీ, గ్రౌండ్ క్లియరెన్స్ 165 మిమీ వరకు ఉంటుంది. (ఇదీ చదవండి: రోజుకి రూ. 1.6 లక్షల సంపాదిస్తున్న 34 ఏళ్ల యువతి.. ఈమె చేసే పనేంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు..!!) ఇంజిన్ అండ్ పర్ఫామెన్స్ హీరో హెచ్ఎఫ్ డీలక్స్ బ్లాక్ కాన్వాస్ ఎడిషన్ 97.2 సీసీ సింగిల్ సిలిండర్, ఎయిర్ కూల్డ్ ఇంజిన్ పొందుతుంది. ఇది 8000 ఆర్పీఎమ్ వద్ద 7.9 బీహెచ్పీ పవర్ 6000 ఆర్పీఎమ్ వద్ద 8.05 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇందులో టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్, డ్యూయెల్ షాక్ అబ్సార్బర్స్, 130 మిమీ డ్రమ్ బ్రేక్స్ వంటివి ఉన్నాయి. ఈ బైక్‌పై కంపెనీ 5 సంవత్సరాల వారెంటీ లభిస్తుంది. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి. -
భారత్‌లో హీరో ఎక్స్‌పల్స్ 200 4వి లాంచ్ - పూర్తి వివరాలు
Hero Xpulse 200 4V: భారతీయ మార్కెట్లో ఎట్టకేలకు అప్డేటెడ్ 'హీరో ఎక్స్‌పల్స్ 200 4వి' (Hero Xpulse 200 4V) విడుదలైంది. అదే సమయంలో ర్యాలీ ఎడిషన్ ప్రో వేరియంట్‌గా కొత్త రూపంలో అందుబాటులోకి వచ్చింది. ఈ లేటెస్ట్ బైక్ ధరలు, ఇతర ఫీచర్స్ వంటివి ఈ కథనంలో తెలుసుకుందాం. ధరలు దేశీయ మార్కెట్లో విడుదలైన అప్డేటెడ్ హీరో ఎక్స్‌పల్స్ 200 4వి బైక్ ధర రూ. 1.44 లక్షలు, కాగా ర్యాలీ ఎడిషన్ ప్రో ధర రూ. 1.51 లక్షలు (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్). ఈ బైక్స్ వాటి మునుపటి మోడల్స్ కంటే కూడా చాలా అప్డేటెడ్ ఫీచర్స్ పొందుతాయి. డిజైన్ & ఫీచర్స్ మార్కెట్లో అడుగుపెట్టిన ఈ లేటెస్ట్ బైక్స్ అప్డేటెడ్ ఎల్ఈడీ హెడ్‌లైట్ పొందుతుంది, కావున ఇది మునుపటి కంటే చాలా ప్రకాశవంతంగా ఉంటుంది. అంతే కాకుండా పొడవైన విండ్‌స్క్రీన్, కొత్త స్విచ్ గేర్ వంటివి మరింత ఫ్రీమియంగా ఉంటాయి. బ్లాక్ ఎలిమెంట్స్ స్థానములో ఇవి పెద్ద హ్యాండ్ గార్డ్లను పొందుతాయి. ఇవన్నీ రైడర్‌కి మరింత మంచి రైడింగ్ అనుభూతిని అందిస్తాయి. ఇంజిన్ అప్డేటెడ్ హీరో ఎక్స్‌పల్స్ బైకుల ఇంజిన్లలో పెద్దగా మార్పులు జరగలేదు. కానీ 200 సిసి ఆయిల్ కూల్డ్ ఇంజిన్ ఇప్పుడు ఓబిడి-2 కంప్లైంట్‌తో పాటు ఈ20 అనుకూలతను పొందుతుంది. ఇంజిన్ 19.1 hp పవర్, 17.35 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ బైక్ ఇప్పుడు సింగిల్ ఛానల్ ఏబీఎస్ కోసం రోడ్, ఆఫ్-రోడ్, ర్యాలీ అనే మూడు రైడింగ్ మోడ్స్ పొందుతుంది. ఈ బైకులో ఫుట్ పెగ్‌లు ఇప్పుడు 35 మి.మీ తక్కువ, వెనుక 8 మి.మీ ఎక్కువతో సెట్ చేశారు. కావున రైడింగ్ చేయడానికి మునుపటికంటే చాలా అనుకూలంగా ఉంటుంది. USB ఛార్జర్ మరింత అనుకూల ప్రదేశంలో నిక్షిప్తం చేశారు. ఇక ప్రో వేరియంట్ ర్యాలీ కిట్ పొందటం వల్ల రెండు చివర్లలో లాంగ్ ట్రావెల్ సస్పెన్షన్ పెరిగి అడ్జస్టబుల్, బెంచ్ స్టైల్ సీట్, హ్యాండిల్‌బార్ రైజర్లు లభిస్తాయి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలు, సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. -
ఎలక్ట్రిక్ వెహికల్ వాహనదారులకు ముఖ్య గమనిక!
ఎలక్ట్రిక్ వాహనదారులకు ముఖ్య గమనిక. ఇప్పటికే ఈవీ వెహికల్‌ను కొనుగోలు చేశారా? అదనంగా ఛార్జర్లతో పాటు వెహికల్‌కు సంబంధించిన ఎక్విప్మెంట్ కోసం డబ్బులు ఖర్చు చేశారా? అయితే మీకో శుభవార్త. దేశంలో ఆటోమొబైల్ దిగ్గజ సంస్థలైన ఎథేర్ ఎనర్జీ, టీవీఎస్ మోటార్స్, ఓలా, హీరో మోటో కార్ప్ కంపెనీలు డబ్బుల్ని రిఫండ్ చేస్తున్నట్లు ప్రకటించాయి. ద్విచక్ర వాహనం తయారు చేసే సంస్థలకు ఫేమ్ పథకం కింద కేంద్రం కొన్ని రాయితీలు కల్పిస్తున్న విషయం తెలిసిందే. వాహన తయారీ సంస్థలు వాహనదారులకు విక్రయించే వెహికల్ ధర రూ.1.5 లక్షలు మించకూడదు. ధర మించితే ఫేమ్ పథకం సదరు తయారీ సంస్థలకు వర్తించదు. అయినప్పటికీ దేశంలోని కొన్ని ఆటోమొబైల్ సంస్థలు నిబంధనలు ఉల్లంఘించి ఛార్జర్లు, వాహనానికి వినియోగించే ఇతర వస్తువులకు అదనంగా డబ్బులు వసూలు చేస్తున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. దీంతో కేంద్రం రాయితీ కింద చెల్లించాల్సిన రూ.800 కోట్లను ప్రభుత్వం నిలిపివేసింది. ఆయా ఆటోమొబైల్ సంస్థలకు నోటీసులు జారీ చేసింది. తాజాగా కేంద్రం నిర్ణయంతో ఓలా ఎలక్ట్రిక్‌కు అతిపెద్ద ఎదురుదెబ్బ తగిలిందంటూ నివేదికలు పేర్కొన్నాయి. 2021 నుంచి ఓలా ఎలక్ట్రిక్ వెహికల్స్‌ను తయారు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఓలా ఎస్1, ఎస్1 ప్రో విక్రయాలు జరిపే సమయంలో హోం ఛార్జర్లకు అదనంగా డబ్బులు వసూలు చేసింది. ఆ మొత్తం విలువ రూ.131 కోట్లుగా ఉంది. తాజాగా కేంద్రం నిర్ణయంతో ఆ భారీ మొత్తాన్ని ఓలా తన వాహన దారులకు చెల్లించాల్సి ఉందని సమాచారం. రీఫండ్‌పై ఓలా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అటు ఏథర్ ఎనర్జీ, టీవీఎస్ మోటార్, హీరో మోటోకార్ప్ సైతం స్పందించలేదు. చదవండి👉 ‘ఎలివేట్’ పేరిట హోండా కొత్త కారు.. మూడేళ్ల నుంచి ఊరిస్తూ.. చివరికి ఇలా -
హీరో మోటోకార్ప్ సిబ్బందికి వీఆర్ఎస్
న్యూఢిల్లీ: ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ తన సిబ్బందికి స్వచ్ఛంద పదవీ విరమణ పథకాన్ని (వీఆర్ఎస్) ప్రకటించింది. సామ ర్థ్యం మెరుగుదల, వ్యయ నియంత్రణ, పటిష్ట ఉత్పాదక సంస్థగా రూపుదిద్దుకోవడం లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. వీఆర్ఎస్ ఉద్యోగులందరికీ ఈ ఆఫర్ వర్తిస్తుందని పేర్కొంది. ఒకేసారి తగిన స్థాయిలో డబ్బు అందజేత, వేరియబుల్ పే (పనితీరు ఆధారంగా అదనపు ప్రయోజనం), బహుమతులు, వైద్య కవరేజీ, కంపెనీ కారు వినియోగం, పునరా వాస సహాయం, కెరీర్ మద్దతు వంటి ఎన్నో ప్రయోజనాలను ప్యాకేజీలో భాగంగా ఉన్నట్లు కంపెనీ తెలిపింది. 2022–23 ఆర్థిక సంవత్సరంలో ద్విచక్ర వాహన విభాగంలో రిటైల్ అమ్మకాలు ఏడేళ్ల కనిష్ట స్థాయిలో 1.59 కోట్ల యూనిట్లకు పడిపోయినట్లు ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ (ఎఫ్ఏడీఏ) తాజా డేటా నేపథ్యంలో హీరో మోటోకార్ప్ తాజా ప్రకటన చేసింది. అయితే మార్చిలో మంచి అమ్మకాలు జరగడం ఒక వినియోగ సెంటిమెంట్‌కు సంబంధించి ఒక సానుకూల పరిణామమని కంపెనీ పేర్కొంది. ప్రభుత్వ నిర్మాణాత్మక విధానాలు, సామాజిక రంగ సంస్కరణలు డిమాండ్‌ను ప్రోత్సహిస్తాయని, ఈ ఆర్థిక సంవత్సరంలో రెండంకెల వృద్ధికి ఈ అంశాలు దోహదం చేస్తాయని ద్విచక్ర వాహన పరిశ్రమ అంచనా వేస్తున్నట్లు హీరో మోటోకార్ప్ వివరించింది. -
భారత్‌లో తక్కువ ధర వద్ద లభించే టాప్ 5 బైకులు - వివరాలు
సాధారణంగా చాలామంది వాహన వినియోగదారులు మంచి మైలేజ్ అందించి సరసమైన ధర వద్ద లభించే వాహనాలను (బైకులు, కార్లు) కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతుంటారు. దేశీయ విఫణిలో ద్విచక్ర వాహన విభాగంలో సరసమైన ధర వద్ద లభించే ఐదు బైకులు గురించి ఇక్కడ తెలుసుకోవచ్చు. హీరో హెచ్ఎఫ్ 100: భారతదేశంలో అమ్ముడవుతున్న అత్యంత సరసమైన బైకుల జాబితాలో చెప్పుకోదగ్గ బైక్ హీరో హెచ్ఎఫ్ 100. ఈ బైక్ ధర రూ. 54,962 (ఎక్స్-షోరూమ్). ఇది 97 సీసీ ఇంజిన్ కలిగి 8 హెచ్‌పి పవర్ 8.05 ఎన్ఎమ్ టార్క్ అందిస్తూ కేవలం ఒకే వేరియంట్లో అందుబాటులో ఉంది. హీరో హెచ్ఎఫ్ డీలక్స్: హీరో మోటోకార్ప్ కంపెనీకి చెందిన హెచ్ఎఫ్ డీలక్స్ మన జాబితాలో సరసమైన ధర వద్ద లభించే పాపులర్ బైక్. దీని ధర రూ. 61,232 నుంచి రూ. 68,382 (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంది. 100 సిసి విభాగంలో తిరుగులేని అమ్మకాలు పొందుతూ ఇప్పటికీ ఎక్కువ మంది కస్టమర్ల మనసు దోచేస్తున్న బైక్ హీరో హెచ్ఎఫ్ డీలక్స్ కావడం విశేషం. టీవీఎస్ స్పోర్ట్: టీవీఎస్ కంపెనీకి చెందిన ద్విచక్ర వాహనాలు మార్కెట్లో ఒకప్పటి నుంచి మంచి సంఖ్యలో అమ్ముడవుతున్నాయి. ఇందులో ఒకటి 'టీవీఎస్ స్పోర్ట్' బైక్. దీని ధర రూ. 61,500 నుంచి రూ. 69,873 (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంది. కిక్ స్టార్ట్, సెల్ఫ్ స్టార్ట్ వెర్షన్లలో అందుబాటులో ఉన్న ఈ బైక్ 109.7 సీసీ ఇంజిన్ కలిగి 8.3 హెచ్‌పి పవర్ 8.7 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. హోండా షైన్ 100: మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన, ఎక్కువ అమ్ముడవుతున్న బైకులలో హోండా షైన్ 100 కూడా ఒకటి. దీని ధర రూ. 64,900 (ఎక్స్-షోరూమ్). ఈ బైక్ 99.7 సీసీ ఇంజిన్ కలిగి 7.61 హెచ్‌పి పవర్, 8.05 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ ఎలక్ట్రిక్ స్టార్టర్ పొందుతుంది. ఇది దేశీయ మార్కెట్లో లభించే అత్యంత సరసమైన సెల్ఫ్-స్టార్ట్ మోటార్‌సైకిల్‌గా నిలిచింది. బజాజ్ ప్లాటినా 100: భారతీయ మార్కెట్లో లభించే సరసమైన బైకుల జాబితాలో ఒకటి బజాజ్ కంపెనీకి చెందిన ప్లాటినా 100. ఈ బైక్ ధర రూ.67,475 (ఎక్స్-షోరూమ్). ఇది సిగ్నేచర్ DTS-i టెక్నాలజీ 102 సిసి ఇంజిన్ ద్వారా 7.9 హెచ్‌పి పవర్ మరియు 8.3 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. డిజైన్, ఫీచర్స్ పరంగా ఆకర్షణీయంగా ఉంటుంది. -
Pawan Munjal: తిరుగులేని సీఈఓ, 40కి పైగా దేశాల్లో
ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ కేవలం భారతదేశంలో మాత్రమే కాకుండా ప్రపంచములోని చాలా దేశాల్లో తన ఉనికిని చాటుకుంటోంది. ఎప్పటికప్పుడు కొత్త వాహనాలను విడుదల చేస్తూ తనదైన రీతిలో ముందుకు దూసుకెళ్తోంది. కంపెనీ ఈ స్థాయిలో ఉందంటే దానికి ప్రధాన కారణం దాని వెనుకుండి నడిపిస్తున్న ఎందరో కార్మికులు. ప్రపంచంలో అతి పెద్ద టూ వీలర్ తయారీ సంస్థగా కీర్తి గడించిన హీరో మోటోకార్ప్ కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ 'పవన్ ముంజాల్' నేతృత్వంలో ఇప్పుడు ముందుకు సాగుతోంది. బ్రిజ్మోహన్ లాల్ ముంజాల్ స్థాపించిన ఈ సంస్థ ప్రస్తుతం లాభాల బాటలో పయనిస్తోంది. 2022 డిసెంబర్ 10 నాటికి పవన్ ముంజాల్, వారి కుటుంబ సభ్యుల ఆస్తుల విలువ 3.55 బిలియన్ డాలర్లు. 2011లో హీరో కంపెనీ హోండా నుంచి విడిపోయిన తరువాత పవన్ ముంజాల్ ముందుండి నడిపించి ప్రపంచ దేశాలకు విస్తరించడంతో గొప్ప కృషి చేశారు. కంపెనీ తన ద్విచక్ర వాహనాలను ఆసియా, ఆఫ్రికా, మధ్య, దక్షిణ అమెరికా వంటి 40కి పైగా దేశాల్లో విక్రయిస్తోంది. (ఇదీ చదవండి: SBI: మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోండి.. బ్యాంకుకి వెళ్లకుండా!) ఇప్పటికి పవన్ ముంజాల్ నేతృత్వంలో భారతదేశంలో ఆరు సహా ఎనిమిది తయారీ కేంద్రాలు ఉన్నాయి. అంతే కాకుండా ఆయన హీరో ఇన్వెస్ట్‌కార్ప్ ప్రైవేట్ లిమిటెడ్, హీరో ఫ్యూచర్ ఎనర్జీస్ గ్లోబల్ లిమిటెడ్, బహదూర్ చంద్ ఇన్వెస్ట్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్, రాక్‌మ్యాన్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ బోర్డులో కూడా ఒకరుగా ఉన్నారు. హీరో మోటోకార్ప్ ఎలక్ట్రిక్ వాహన రంగంలో నిలదొక్కుకోవడానికి, 2022 అక్టోబర్‌లో తన మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ 'విడా' విడుదల చేసింది. ఈ స్కూటర్ ఇప్పటికే మార్కెట్లో మంచి అమ్మకాలతో ముందుకు సాగుతోంది. కంపెనీ మరిన్ని ఎలక్ట్రిక్ వెహికల్స్ దేశీయ మార్కెట్లో విడుదల చేయడానికి తగిన సన్నాహాలు సిద్ధం చేసుకుంటోంది. -
Hero Super Splendor XTEC: ఎక్కువ మైలేజ్, అప్డేటెడ్ ఫీచర్స్.. ధర ఎంతంటే?
భారతీయ మార్కెట్లో హీరో మోటోకార్ప్ ఉగాది పండుగకు ముందే సూపర్ స్ప్లెండర్ XTEC బైక్ విడుదల చేసింది. ఇది డ్రమ్ బ్రేక్, డిస్క్ బ్రేక్ అనే రెండు వేరియంట్స్‌లో లభిస్తుంది. వీటి ధరలు వరుసగా రూ. 83,368, రూ. 87,268 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ). దేశీయ మార్కెట్లో విడుదలైన ఈ కొత్త బైక్ ఇప్పుడు బ్లూటూత్ కనెక్టివిటీతో ఫుల్లీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ పొందుతుంది. ఇందులో ఇన్కమింగ్ కాల్స్, ఎస్ఎమ్ఎస్ అలర్ట్, ఫోన్ బ్యాటరీ లెవెల్ వంటి వాటిని తెలుసుసుకోవచ్చు. ఇది 125 సీసీ విభాగంలో విడుదలైన కొత్త బైక్. హీరో సూపర్ స్ప్లెండర్ ఎక్స్‌టెక్ 125 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ కలిగి 7,500 ఆర్‌పిఎమ్ వద్ద 10.84 బీహెచ్‌పి పవర్, 6,000 ఆర్‌పిఎమ్ వద్ద 10.6 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. ఈ బైక్ 68 కిమీ/లీటర్ మైలేజ్ అందిస్తుందని కంపెనీ తెలిపింది. హీరో మోటోకార్ప్ లాంచ్ చేసిన ఈ కొత్త బైక్ ఎల్ఈడీ హెడ్‌లైట్, విజర్, డ్యూయల్-టోన్ స్ట్రిప్స్ వంటి వాటిని పొందటమే కాకుండా, గ్లోస్ బ్లాక్, క్యాండీ బ్లేజింగ్ రెడ్, మాట్ యాక్సిస్ గ్రే కలర్ ఆప్సన్స్‌లో లభిస్తుంది. కంపెనీ ఈ బైక్ కోసం బుకింగ్స్ స్వీకరించడం కూడా ప్రారంభించింది. డెలివరీలు త్వరలోనే ప్రారంభమవుతాయి. -
2023 ఫిబ్రవరిలో టూవీలర్ సేల్స్: టీవీఎస్ నుంచి రాయల్ ఎన్ఫీల్డ్ వరకు
ఫిబ్రవరి 2023 ముగియడంతో దాదాపు అన్ని కంపెనీలు తమ అమ్మకాల గణాంకాలను వెల్లడించాయి. గత నెలలో దేశీయ మార్కెట్లో వాహనాల అమ్మకాలు కొంత పురోగతి చెందినట్లు నివేదికల ద్వారా తెలుస్తోంది. మంచి అమ్మకాలు పొందిన టాప్ 5 టూవీలర్ బ్రాండ్స్ లో హీరో మోటోకార్ప్ మొదటి స్థానంలో చేరింది. గత నెలలో హీరో మోటోకార్ప్ మొత్తం 382317 యూనిట్లను విక్రయించి 2022 ఫిబ్రవరి కంటే 15.34 శాతం పెరుగుదలను నమోదు చేసింది. ఇదే నెల గతేడాది కంపెనీ అమ్మకాలు 3,31,462 యూనిట్లు. ఎగుమతుల విషయంలో మాత్రం -54.68 శాతం తగ్గుదలను నమోదు చేసింది. కంపెనీ మొత్తం అమ్మకాలు 3,94,460 యూనిట్లు (ఎగుమతులు + దేశీయ అమ్మకాలు). హోండా మోటార్‌సైకిల్ ఈ జాబితాలో రెండవ స్థానంలో నిలిచింది. కంపెనీ దేశీయ అమ్మకాలు 2,27,064 యూనిట్లు కాగా, ఎగుమతులు 20,111 యూనిట్లు. 2023 ఫిబ్రవరిలో మొత్తం అమ్మకాలు 2,47,175 యూనిట్లు. దేశీయ అమ్మకాల్లో కంపెనీ -20.25 శాతం, ఎగుమతుల్లో -25.36 శాతం, మొత్తం అమ్మకాల పరంగా -20.93 శాతం తగ్గుదలను నమోదు చేసింది. టీవీఎస్ మోటార్ విషయానికి వస్తే 2023 ఫిబ్రవరిలో 2,21,402 యూనిట్లను దేశీయ మార్కెట్లో 27.83 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఎగుమతుల పరంగా 45,624 యూనిట్లను విక్రయించి 2022 ఫిబ్రవరి కంటే -51.68 శాతం తగ్గుదలను నమోదు చేసింది. మొత్తం అమ్మకాల పరంగా -0.22 శాతం తగ్గుదలతో 2,67,026 యూనిట్ల వద్ద ఆగిపోయింది. 2023 ఫిబ్రవరిలో బజాజ్ ఆటో మొత్తం అమ్మకాలు దేశీయ అమ్మకాలు + ఎగుమతులు 2,35,356 యూనిట్లతో 2022 ఫిబ్రవరి కంటే -15.74 శాతం అతగ్గుదలను నమోదు చేసింది. ఎగుమతులు 1,15,021 యూనిట్లు కాగా, దేశీయ అమ్మకాలు 1,20,335 యూనిట్ల వద్ద ఉన్నాయి. దేశీయ అమ్మకాల్లో కంపెనీ పురోగతిని కనపరిచినప్పటికీ, ఎగుమతుల్లో -37.08 శాతం తగ్గుదలను నమోదు చేసింది. రాయల్ ఎన్ఫీల్డ్ అమ్మకాల విషయానికి వస్తే, మొత్తం అమ్మకాలు 71,544 యూనిట్లు (ఎగుమతులు + దేశీయ అమ్మకాలు) కాగా, కేవలం దేశీయ అమ్మకాలు 64,436 యూనిట్లు, ఎగుమతులు 7,108 యూనిట్లు. కంపెనీ ఎగుమతుల్లో 1.18 శాతం వృద్ధిని, దేశీయ అమ్మకాల్లో 23.59 శాతం వృద్ధిని కనపరిచింది. -
హీరో జూమ్ బుక్ చేసుకున్నారా.. అయితే మీకో గుడ్ న్యూస్!
హీరో మోటోకార్ప్ ఇటీవల భారతీయ మార్కెట్లో విడుదల చేసిన కొత్త 'జూమ్' (Xoom) స్కూటర్ తన తొలి డెలివరీలను ముంబైలో ప్రారంభించింది. కంపెనీ ఈ స్కూటర్ని ఎల్ఎక్స్ (LX), విఎక్స్ (VX), జెడ్ఎక్స్ (ZX) వేరియంట్స్‌లో అందిస్తోంది. దీని ప్రారంభ ధర రూ. 72,349 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ). హీరో లేటెస్ట్ జూమ్ స్కూటర్ ఇప్పటికే మార్కెట్లో ఉన్న హోండా డియోకి ప్రధాన ప్రత్యర్థిగా ఉండనుంది. ఇది 110 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ కలిగి 8.05 బిహెచ్పి పవర్, 8.7 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ i3S ఐడిల్ స్టార్ట్-స్టాప్ టెక్నాలజీ కలిగి ఉండటం వల్ల స్కూటర్ కెపాసిటీ మరింత మెరుగ్గా ఉంటుంది. జూమ్ స్కూటర్ రైడర్, పిలియన్‌కి సౌకర్యవంతంగా ఉన్న విశాలమైన సీటు కలిగి ఉంటుంది. ముందువైపు మంచి లైటింగ్ సెటప్, వెనుక హెచ్ షేప్ టైల్లైట్ కలిగి 12 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ ఇందులో పొందుపర్చింది. ఫీచర్స్ పరంగా బ్లూటూత్ కనెక్టివిటీతో కూడిన డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, USB ఛార్జర్, గ్లోవ్ బాక్స్ లాంటివి ఉన్నాయి. ఈ స్కూటర్ టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్, మోనోషాక్ సెటప్ వంటి సస్పెషన్ సెటప్ & ఫ్రంట్ డిస్క్ బ్రేక్, డ్రమ్ బ్రేక్ తో మంచి బ్రేకింగ్ సిస్టం కలిగి ఉంటుంది. కస్టమర్ల అభిరుచికి తగిన విధంగా కంపెనీ తన కొత్త స్కూటర్ని పోలెస్టార్ బ్లూ, స్పోర్ట్స్ రెడ్, మాట్ అబ్రాక్స్ ఆరెంజ్, పెర్ల్ సిల్వర్ వైట్, బ్లాక్ అనే కలర్ ఆప్సన్స్ అందిస్తోంది. -
హీరో ఎలక్ట్రిక్ వెహికల్ డెలివరీలు షురూ!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ద్విచక్ర వాహన తయారీ దిగ్గజం హీరో మోటో కార్ప్ విదా వీ1 ఎలక్ట్రిక్ స్కూటర్ల డెలివరీలను ప్రారంభించింది. బెంగళూరుతో మొదలుకుని దశలవారీగా ఇతర నగరాల్లో డెలివరీలు చేపడతారు. 2022 అక్టోబరులో విదా వీ1 వాహనాన్ని కంపెనీ ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. ఒకసారి చార్జింగ్ చేస్తే 163 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. గరిష్ట వేగం గంటకు 80 కిలోమీటర్లు. వేరు చేయగలిగే బ్యాటరీ, మూడు రకాల చార్జింగ్ ఆప్షన్స్‌తో లభిస్తుంది. ఢిల్లీలో ఆన్‌రోడ్ ధర విదా వీ1 ప్లస్ రూ.1.35 లక్షలు, విదా వీ1 ప్రో రూ.1.46 లక్షలు ఉంది. -
బైక్ లవర్స్‌కి గుడ్ న్యూస్..హీరో-హార్లే బైక్ వచ్చేస్తోంది
న్యూఢిల్లీ: దేశీ ద్విచక్ర వాహన దిగ్గజం హీరో మోటోకార్ప్, ప్రీమియం మోటర్‌సైకిల్స్ సంస్థ హార్లే–డేవిడ్సన్ సంయుక్తంగా రూపొందించే బైక్ రాబోయే రెండేళ్లలో మార్కెట్లోకి రానుంది. ప్రీమియం సెగ్మెంట్లో తమ స్థానాన్ని మరింత పటిష్టం చేసుకునేందుకు హీరో దీన్ని ప్రవేశపెట్టనుంది. హీరో మోటోకార్ప్ సీఎఫ్‌వో నిరంజన్ గుప్తా ఈ విషయాలు వెల్లడించారు. ప్రీమియం ఉత్పత్తుల పోర్ట్‌ఫోలియోను మరింత పటిష్టం చేసుకుంటున్నామని, ఏటా ఈ విభాగంలో కొత్త మోడల్స్ ప్రవేశపెట్టనున్నామని ఆయన పేర్కొన్నారు. భారత మార్కెట్లో హార్లే–డేవిడ్సన్ వాహనలకు సంబంధించి 2020 అక్టోబర్‌లో ఇరు సంస్థలు ఒక ఒప్పందం కుదుర్చుకున్నాయి. దీని ప్రకారం హార్లే–డేవిడ్సన్ బ్రాండ్ పేరిట హీరో మోటోకార్ప్ భారత్‌లో ప్రీమియం మోటర్‌సైకిళ్ల అభివృద్ధి, విక్రయాలు చేపట్టనుంది. అలాగే ఆయా బైక్‌లకు అవసరమైన సర్వీసింగ్, విడిభాగాల సరఫరా కూడా హీరో చేపట్టనుంది. 100–110సీసీ బడ్జెట్ బైక్‌ల విభాగంలో ఆధిపత్యం ఉన్న హీరో .. 160సీసీ ఆ పై విభాగాల్లోనూ అమ్మకాలను పెంచుకోవడం ద్వారా లాభదాయకతను మెరుగుపర్చుకునే యోచనలో ఉంది. గడిచిన కొద్ది త్రైమాసికాలుగా విడిభాగాలు, యాక్సెసరీలు, మర్చండైజ్ (పీఏఎం) వ్యాపార వృద్ధిపై మరింతగా దృష్టి పెడుతున్నట్లు గుప్తా చెప్పారు. ఈ ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంలో పీఏఎం వ్యాపార ఆదాయం 45 శాతం వృద్ధి చెంది రూ. 2,300 కోట్లుగా నమోదైనట్లు వివరించారు. -
బైక్ కొనాలనుకునే వారికి షాక్.. ధరలు పెంచిన ప్రముఖ కంపెనీ!
న్యూఢిల్లీ: ద్విచక్ర వాహనాల తయారీ దిగ్గజం హీరో మోటోకార్ప్ తమ మోటర్‌సైకిళ్లు, స్కూటర్ల ధరలను రూ. 1,500 వరకూ పెంచనున్నట్లు ప్రకటించింది. డిసెంబర్ 1 నుండి కొత్త రేట్లు అమల్లోకి వస్తాయని తెలిపింది. మోడల్స్, మార్కెట్లను బట్టి పెంపు పరిమాణం ఉంటుందని సంస్థ వివరించింది. ‘ద్రవ్యోల్బణంపరమైన ఒత్తిళ్ల కారణంగా మోటార్‌సైకిళ్లు, స్కూటర్ల ధరలను పెంచక తప్పడం లేదు’ అని హీరో మోటోకార్ప్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ నిరంజన్ గుప్తా తెలిపారు. ధరల భారం ప్రభావం కస్టమర్లపై ఎక్కువగా పడకుండా వినూత్న ఫైనాన్సింగ్ ఆప్షన్లు కూడా అందించడం కొనసాగిస్తామని ఆయన పేర్కొన్నారు. డిమాండ్ మెరుగుపడే సంకేతాలు కనిపిస్తున్న నేపథ్యంలో రాబోయే త్రైమాసికాల్లో పరిశ్రమ అమ్మకాలు పుంజుకోగలవని ఆశిస్తున్నట్లు గుప్తా వివరించారు. చదవండి: మాదాపూర్ గుర్తుందా.. మళ్లీ అదే తరహా డెవలప్మెంట్ అక్కడ మొదలైంది! -
ఈవీ రంగంలోకి హీరో మోటోకార్ప్, వందల కోట్ల పెట్టుబడులు
ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం హీరో మోటోకార్ప్ ఎలక్ట్రిక్ వెహికల్స్‌పై దృష్టి సారించింది. కొనుగోలు దారులకు అభిరుచికి అనుగుణంగా ఈవీ వెహికల్స్‌ను తయారు చేయనుంది. ఇందుకోసం అమెరికాకు చెందిన జీరో మోటార్ సైకిల్స్‌తో జత కలిసింది. ఆ సంస్థలో రూ.490కోట్లు పెట్టుబడులు పెడుతున్నట్లు హీరో మోటోకార్ప్ తెలిపింది. తద్వారా హీరో మోటోకార్ప్, జీరో మోటార్లు సంయుక్తంగా ఈవీ వెహికల్స్‌ను విడుదల చేయనున్నాయి. ప్రపంచంలోనే లార్జెస్ట్ టూవీలర్ తయారీ సంస్థగా పేరొందిన జీరో మోటార్స్ వెహిలక్స్, పవర్ ట్రైన్లను తయారు చేస్తుంది. తొలి బైక్ విడుదల మరోవైపు హీరో మోటోకార్ప్ మొబిలిటీ బ్రాండ్ విడా భాగస్వామ్యంతో అక్టోబర్ 7 తొలి ఎలక్ట్రిక్ బైక్‌ను విడుదల చేయనుంది. ఎలక్ట్రిక్ టూ వీలర్ కంపెనీ ఏథర్ ఎనర్జీలో 35 శాతానికి పైగా వాటా ఉన్న హీరో మోటాకార్ప్.. తాజాగా జీరో మోటార్స్‌లో పెట్టుబడులు పెడుతున్నట్లు ప్రకటించింది. ఆ ప్రకటనతో ఇన్వెస్టర్లు అప్రమత్తమయ్యారు. దీంతో గురువారం బీఎస్ఈలో కంపెనీ షేర్లు 2.11 శాతం తగ్గి రూ.2,534.20 వద్ద ముగిశాయి. -
హీరో మోటోకార్ప్ ఈవీ: తొలి మోడల్ కమింగ్ సూన్
న్యూఢిల్లీ: ద్విచక్రవాహనాల దిగ్గజం హీరో మోటోకార్ప్ తాజాగా ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలోకి ప్రవేశిస్తోంది. వచ్చే నెలలో విడా బ్రాండ్ కింద తొలి మోడల్‌ను దేశీ మార్కెట్లో ఆవిష్కరించనున్నట్లు సమాచారం. రవాణా రంగంలో కొత్త శకాన్ని ఆవిష్కరించేలా అక్టోబర్ 7న రాజస్థాన్‌లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనున్నట్లు స్టాక్ ఎక్స్ఛేంజీలకు తెలియజేసింది. ( క్లిక్: మాకూ పీఎల్ఐ స్కీమ్ ఇవ్వండి : టోయ్స్ పరిశ్రమ) తద్వారా పరోక్షంగా ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలో ఎంట్రీని వెల్లడించింది. జైపూర్‌లో నిర్వహించే ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా డీలర్లు, ఇన్వెస్టర్లు, అంతర్జాతీయ పంపిణీదారులను ఆహ్వనించింది. జైపూర్‌లోని పరిశోధన, అభివృద్ధి కేంద్రంలో ఈ వాహనాన్ని రూపొందించినట్లు, విడా బ్రాండ్ కింద ప్రవేశపెట్టనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరులో ఉన్న ప్లాంటులో వీటి తయారీ చేపట్టవచ్చని పేర్కొన్నాయి. ఇదీ చదవండి: Gold Price: ఫెస్టివ్ సీజన్లో గుడ్ న్యూస్ -
హీరో వాహనాలు మరింత ప్రియం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ద్విచక్ర వాహన తయారీ దిగ్గజం హీరో మోటోకార్ప్ మోటార్‌సైకిల్స్, స్కూటర్స్ ధర పెంచుతోంది. మోడల్‌నుబట్టి రూ.2,000 వరకు ఈ పెంపు ఉంటుందని కంపెనీ మంగళవారం ప్రకటించింది. ఏప్రిల్ 5 నుంచి కొత్త ధరలు అమలులోకి రానున్నాయి. ముడిసరుకు వ్యయాలు అధికం అయినందునే ఈ నిర్ణయం తీసుకున్నట్టు హీరో మోటోకార్ప్ వెల్లడించింది. -
హీరో మోటోకార్ప్ విదా
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ద్విచక్ర వాహన తయారీ దిగ్గజం హీరో మోటోకార్ప్ విదా పేరుతో ఎలక్ట్రిక్ వెహికల్స్ బ్రాండ్‌ను ఆవిష్కరించింది. జూలై 1న అధికారికంగా ఎలక్ట్రిక్ వాహనంతో సహా విదా బ్రాండ్ కింద భవిష్యత్‌లో ప్రవేశపెట్టబోయే ఉత్పత్తులు, సేవలను పరిచయం చేయనున్నట్టు వెల్లడించింది. దుబాయి వేదికగా మార్చి 3న సాయంత్రం ఈ కార్యక్రమం జరిగింది. ఆంధ్రప్రదేశ్ చిత్తూరులో ఉన్న కంపెనీ ప్లాంటులో విదా మోడల్స్ ఉత్పత్తిని చేపట్టనున్నారు. ఏడాది చివర్లో డెలివరీలు ప్రారంభం కానున్నాయని కంపెనీ తెలిపింది. హీరో మోటాకార్ప్ ఈ సందర్భంగా రూ.760 కోట్ల ఫండ్‌ను ప్రకటించింది. పర్యావరణం, సామాజిక, పాలన విభాగాల్లో దేశవ్యాప్తంగా 10,000 మంది ఔత్సాహిక వ్యాపారవేత్తలను ప్రోత్సహించనున్నట్టు వెల్లడించింది. ‘విదా అంటే జీవితం. ప్రపంచంపై సానుకూల ప్రభావాన్ని సృష్టించడం, మనందరినీ అర్థ్ధవంతమైన మార్గాల్లో ముందుకు తీసుకెళ్లడం బ్రాండ్ ఏకైక ఉద్దేశం. మేము, మా పిల్లలు, తరువాతి తరం కోసం నిర్మిస్తున్న వాటికి ఈ పేరు సరైనదని నమ్ముతున్నాం. కేవలం 17 వారాల్లో ప్రపంచాన్ని మెరుగైన ప్రదేశంగా మార్చడానికి మా విదా ప్లాట్‌ఫామ్, ఉత్పత్తులు, సేవలను ఆవిష్కరిస్తాం’ అని హీరో మోటోకార్ప్ చైర్మన్, సీఈవో పవన్ ముంజాల్ తెలిపారు. జూలై 1న హీరో గ్రూప్ వ్యవస్థాపకులు బ్రిజ్మోహన్ లాల్ ముంజాల్ జయంతి. -
ఓలా, బజాజ్ ఎలక్ట్రిక్ స్కూటర్లకు పోటీగా వచ్చేస్తున్న హీరో ఎలక్ట్రిక్ స్కూటర్!
ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ తన మొట్టమొదటి ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాన్ని 2022 మార్చిలో విడుదల చేయడానికి సిద్ధంగా ఉందని సంస్థ సీఎఫ్ఓ నిరంజన్ గుప్తా తెలిపారు. ద్విచక్ర వాహన దిగ్గజం కూడా విస్తృత శ్రేణిలో ప్రీమియం ఎలక్ట్రిక్ ఉత్పత్తులను ప్రారంభించాలని యోచిస్తున్నట్లు అధికారి తెలిపారు. ఆటోమేకర్ తన ఎలక్ట్రిక్ వాహనాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు తయారీ కేంద్రంలో తయారు చేస్తున్నట్లు పేర్కొంది. భారతదేశపు అతిపెద్ద ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ గత కొంతకాలంగా తన ప్రతిష్టాత్మక మొట్టమొదటి ఎలక్ట్రిక్ వాహనాన్ని అభివృద్ది చేస్తుంది. ఈ స్కూటర్ టీవీఎస్ ఐక్యూబ్, బజాజ్ చేతక్, ఓలా ఎస్1 వంటి స్కూటర్ల పోటీ పడనుంది. తమ ఎలక్ట్రిక్ వాహనాన్ని పెద ప్రజలకు అందుబాటులో ఉండేలా రూపొందిస్తున్నట్లు నిరంజన్ గుప్తా పేర్కొన్నారు. ఇప్పటికే హీరో మోటోకార్ప్ కంపెనీ అథర్ ఎనర్జీ, గోగోరోలో పెట్టుబడి పెట్టినట్లు తెలిపారు. అలాగే, దేశవ్యాప్తంగా ఈవీ ఛార్జింగ్ మౌలిక సదుపాయాలను కల్పించడానికి హీరో మోటోకార్ప్ భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్(బీపీసీఎల్)తో చేతులు కలిపింది. ఎలక్ట్రిక్ వాహనాలతో పాటు హీరో మోటోకార్ప్ ప్రీమియం పోర్ట్ ఫోలియోలో మరిన్ని ఉత్పత్తులను తయారీ చేయలని చూస్తున్నట్లు గుప్తా తెలిపారు. (చదవండి: ఉక్రెయిన్ నుంచి మనవాళ్లు రావాలంటే.. ఇంత ఖర్చు అవుతుందా?) -
హీరో మోటోకార్ప్ తొలి ఎలక్ట్రిక్ స్కూటర్.. మేడ్ ఇన్ ఏపీ
ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ తన మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్‌ను వచ్చే ఏడాది మార్చి నాటికి మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. తన ఎలక్ట్రిక్ వేహికల్ ప్రాజెక్ట్ ఇప్పటికే చివరి దశలో ఉందని తెలిపింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరులో ఉన్న ప్లాంట్‌లో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లను ఉత్పత్తి తయారు చేయనున్నట్లు పేర్కొన్నారు. భారతదేశపు అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీదారు ఇప్పటికే ఈ ఏడాది ప్రారంభంలో తన ఎలక్ట్రిక్ స్కూటర్ మొదటి లుక్ చూపింది. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో కంపెనీ బ్యాటరీ స్వాప్ టెక్నాలజీ, మరిన్ని ఫీచర్లను టెక్ దిగ్గజంతో పంచుకోవడానికి తైవాన్ కంపెనీ గోగోరోతో ఒప్పందం చేసుకుంది. హీరో మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ ఇంతకుముందు చూపించినట్లు మార్కెట్లోకి తీసుకొని రానున్నారు. ఇది ఫుల్-ఎల్ఈడీ లైటింగ్, ఫాస్ట్ ఛార్జింగ్, లాంగ్ రేంజ్, బ్యాటరీ స్వాప్ టెక్నాలజీతో రాబోతుంది. హీరో మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ ఇప్పటికే మార్కెట్లో ఉన్న బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్, అథర్ 450ఎక్స్, టివిఎస్ ఐక్యూబ్ వంటి ప్రత్యర్థులతో తలపడనుంది. హీరో కస్టమర్లను ఆకట్టుకోవడం కోసం తన ప్రత్యర్థుల కంటే తక్కువ ధరకు తీసుకొని వచ్చే అవకాశం ఉంది. ఈ స్కూటర్ ధర లక్ష లోపు ఉండే అవకాశం ఉంది. (చదవండి: ఎలన్ మస్క్ స్పేస్ ఎక్స్ సంస్థపై సంచలన ఆరోపణలు చేసిన ఇండో-అమెరికన్!) -
బైక్ కొనుగోలుదారులకు హీరో మోటోకార్ప్ షాక్!
మీరు పండుగ సమయంలో కొత్తగా బైక్ లేదా స్కూటర్ కొనాలని చూస్తున్నారా? అయితే, మీరు చేదు వార్త. దేశంలో అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ తన మోటార్ సైకిళ్లు, స్కూటర్ల ధరలను పెంచనున్నట్లు తెలిపింది. ఈ పెరిగిన ధరలు దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 20 నుంచి అమలులోకి రానున్నాయి. రోజు రోజుకి పెరుగుతున్న విడిభాగాల వస్తువుల ధరల వల్ల ద్విచక్ర వాహన ధరలను పెంచాల్సి వస్తున్నట్లు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. మోటార్ సైకిళ్లు, స్కూటర్ల ధరల పెంపు అనేది రూ.3,000 వరకు ఉండనుంది. బైక్, స్కూటర్ వేరియంట్ బట్టి ధరలు పెరగనున్నాయి. త్వరలో రోబోయే పండుగ సీజన్ ముందు ధరలు పెంచడం విశేషం. ఈ పండుగ సీజన్లో డిమాండ్ ఆశాజనకంగా ఉంటుంది అని కంపెనీ భావిస్తుంది. హీరో మోటోకార్ప్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఐదు నెలల్లో 1.80 మిలియన్ యూనిట్లను విక్రయించింది. ఇది గత ఏడాది క్రితం కాలంలో విక్రయించిన 1.61 మిలియన్ యూనిట్లకంటే సుమారు 12శాతం ఎక్కువ. ఈ ఏడాది కూడా గత ఏడాది మాదిరిగానే ఉత్పత్తి, అమ్మకాలు కరోనా మహమ్మారి కారణంగా ప్రభావితం చెందాయి. (చదవండి: ఐపీఎల్ ప్రియులకు ఎయిర్టెల్ శుభవార్త!) -
బ్యాటరీతో నడవనున్న హీరో స్ప్లెండర్ బైక్
భారతదేశంలో ఎక్కువగా అమ్ముడుపోయే ద్విచక్ర వాహనం ఏదైనా ఉంది అంటే అది హీరో స్ప్లెండర్ అని చెప్పుకోవాలి. ఈ బైక్ ధర, నిర్వహణ ఖర్చు చాలా తక్కువగా ఉంటుంది. అందుకే సామాన్య ప్రజలు ఎక్కువగా కొనడానికి ఇష్ట పడతారు. అయితే, గత కొన్ని నెలల నుంచి పెట్రోల్ ధర భారీగా పెరగడంతో సామాన్యుడు ద్విచక్ర వాహనాన్ని బయటకు తీయాలంటే ఒకటికి రెండు సార్లు ఆలోచించాల్సి వస్తుంది. అయితే, ఇలాంటి భాదలు తరిమికొట్టడానికి హీరో స్ప్లెండర్ బైక్ కోసం ఈవీ కన్వర్షన్ కిట్ ను మార్కెట్లోకి విడుదల చేశారు. (చదవండి: Tesla: భారత్‌లో ఆన్లైన్ ద్వారా కార్ల అమ్మకం!) తమకు ఇష్టమైన బైక్ లో ఈ ఎలక్ట్రిక్ కిట్ ఇన్ స్టాల్ చేయడం ద్వారా డబ్బును ఆదా చేసుకోవచ్చు. ఈ ఎలక్ట్రిక్ కిట్ ను ఆర్ టీఓ కూడా ఆమోదించింది. మహారాష్ట్రలోని థానే కేంద్రంగా పనిచేస్తున్న ఈవీ స్టార్టప్ కంపెనీ గోగోఏ1 ఇటీవల దీనిని లాంఛ్ చేసింది, దీని ధర రూ.35,000. అయితే, అసలు మొత్తంతో పాటు రూ.6,300 జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. అలాగే, బ్యాటరీ ఖర్చును విడిగా చెల్లించాల్సి ఉంటుంది. మొత్తం మీద ఈవీ కన్వర్షన్ కిట్, బ్యాటరీ ధర రూ.95,000. హీరో స్ప్లెండర్ బైక్ తో పాటు దీనిని కొనడానికి అదనంగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. కంపెనీ తన కిట్ పై 3 సంవత్సరాల వారెంటీని కూడా అందిస్తోంది. రష్లేన్ ప్రకారం, గోగోఎ1 సింగిల్ ఛార్జ్ పై 151 కిలోమీటర్ల వరకు వెళ్లగలదు. ప్రస్తుతం, భారతదేశంలోని ప్రముఖ కంపెనీలు ఇటువంటి ఎలక్ట్రిక్ బైక్ లను ఇంకా లాంఛ్ చేయలేదు. అయితే, పెట్రోల్ వేరియెంట్లు భారీగా అమ్ముడు అవుతున్నాయి. ఇటువంటి పరిస్థితిలో గోగోఎ1 సంస్థ ప్రజల ముందు మంచి ఆప్షన్ ఉంచింది. కాకపోతే ఇది చాలా ఖరీదైనది అని ప్రజలు భావిస్తున్నారు. రాబోయే కాలంలో హీరో, బజాజ్, హోండా, యమహా సహా పలు ద్విచక్ర వాహనాల కంపెనీలు ఎలక్ట్రిక్ బైక్ లను విడుదల చేయనున్నాయి. -
ఒక్క రోజులో లక్ష స్కూటర్ల విక్రయం
న్యూఢిల్లీ: ద్విచక్ర వాహన పరిశ్రమలో మార్కెట్ లీడర్ హీరో మోటోకార్ప్ గత వారం 10వ వార్షికోత్సవం సందర్భంగా ఒక్క రోజు లక్ష యూనిట్లకు పైగా రిటైల్ చేసినట్లు తెలిపింది. ఆగస్టు 9నతో మా ప్రయాణం పదేళ్లు పూర్తి చేసుకుందని.. హీరో మోటోకార్ప్‌లో ఇదొక మైలురాయి అని కంపెనీ సేల్స్ హెడ్ నవీన్ చౌహాన్ తెలిపారు. దేశీయ, గ్లోబల్ మార్కెట్లలో పండుగలు లేని సమయంలో కూడా కస్టమర్లు ఈ స్థాయిలో ఒకే రోజు రికార్డ్ స్థాయిలో కొనుగోళ్లు జరపడం ఇదే ప్రథమమని చెప్పారు. కొత్తగా విడుదల చేసిన మాస్ట్రో ఎడ్జ్ 125, డెస్టినీ, ప్లెజర్ 110 స్కూటర్లకు అధిక డిమాండ్‌తో పాటు ఇతర బైక్స్లు రోజు వారీ సగటు కంటే రెట్టింపు అమ్మకాలు జరిపాయని తెలిపారు. చదవండి : సాఫ్ట్వేర్ సంస్థ (24)7.ఏఐ భారీ నియామకాలు -
టాప్‌గేర్‌లో ద్విచక్ర వాహన విక్రయాలు
ముంబై: గత ఆర్థిక సంవత్సరం(2020–21)చివరి నెల మార్చిలో మోటార్ సైకిల్, స్కూటర్ విక్రయాలు జోరుగా కొనసాగాయి. అంతకు ముందు ఆర్థిక సంవత్సరం(2019–20) ఇదే మార్చిలో కరోనా ప్రేరేపిత లాక్‌డౌన్‌తో విక్రయాలు గణనీయంగా పడిపోవడం(లో బేస్) 2021 మార్చిలో అమ్మకాల వృద్ధికి కలిసొచ్చింది. సమీక్షించిన మార్చి నెలలో హీరోమోటోకార్ప్, హోండా మోటార్ సైకిల్, బజాజ్ ఆటో, టీవీఎస్ మోటార్స్, రాయల్స్ ఎన్ఫీల్డ్ కంపెనీలు మొత్తం 14, 21,600 వాహనాలు విక్రయించాయి. 2019–20 ఆర్థిక సంవత్సరం మార్చిలో విక్రయించిన మొత్తం 8,08,692 యూనిట్లతో పోలిస్తే ఇది 75% శాతం అధికం. టూ–వీలర్స్ మార్కెట్ దిగ్గజం హీరో మోటోకార్ప్ మార్చిలో మొత్తం 5.77 లక్షల వాహనాలను విక్రయించింది. గతేడాది ఇదే నెలలో అమ్మిన 3.35 లక్షల యూనిట్లతో పోలిస్తే ఇది 72 శాతం అధికం. హోండా మోటార్ సైకిల్ ఇండియా అమ్మకాలు 60.76 శాతం వృద్ధిని కనబరిచి 3.95 లక్షల వాహనాలను అమ్మింది. ‘‘వ్యక్తిగత రవాణాకు ప్రాధాన్యత పెరగడంతో ద్వి చక్ర వాహనాలకు డిమాండ్ పెరిగింది. అయితే విద్యా సంస్థల మూసివేత, ఇంటి వద్ద నుంచే పని తదితర అంశాలు విక్రయాలపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నాయి’’ అని ఆటో పరిశ్రమకు చెందిన ఒక నిపుణుడు తెలిపారు. -
హీరో మోటోకార్ప్ లాభం రూ.621 కోట్లు
న్యూఢిల్లీ: టూవీలర్ దిగ్గజం హీరో మోటోకార్ప్ కంపెనీకి గత ఆర్థిక సంవత్సరం (2019–20) నాలుగో త్రైమాసిక కాలంలో రూ.621 కోట్ల నికర లాభం(స్డాండ్‌అలోన్) సాధించింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం (2018–19) ఇదే క్వార్టర్లో రూ.730 కోట్ల నికర లాభం ఆర్జించామని, 15 శాతం క్షీణించిందని హీరో మోటోకార్ప్ తెలిపింది. కార్యకలాపాల ఆదాయం రూ.7,885 కోట్ల నుంచి 21 శాతం పతనమై రూ.6,235 కోట్లకు తగ్గిందని పేర్కొంది. అమ్మకాలు తక్కువగా ఉండటం వల్ల నికర లాభం, ఆదాయాలు తగ్గాయని వెల్లడించింది. ఒక్కో ఈక్విటీ షేర్‌కు రూ.25 తుది డివిడెండ్‌ను ఇవ్వాలని డైరెక్టర్ల బోర్డ్ సిఫార్సు చేసింది. వాహన అమ్మకాలు 25 శాతం తగ్గాయని కంపెనీ తెలిపింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం క్యూ4లో 17.81 లక్షలుగా ఉన్న వాహన విక్రయాలు గత క్యూ4లో 13.35 లక్షలకు తగ్గాయని పేర్కొంది. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో హీరో మోటో షేరు స్పల్ప లాభంతో రూ.2,386 వద్ద ముగిసింది. -
హీరో స్ల్పెండర్ ప్లస్, కొత్త వెర్షన్
సాక్షి, న్యూఢిల్లీ: ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ తన పాపులర్ మోడల్ స్ల్పెండర్ ప్లస్‌ను బీఎస్-6 వెర్షన్ ఇంజీన్‌తో లాంచ్ చేసింది. దేశీయంగా త్వరలో అమలుకానున్న కొత్త ఉద్గార నిబంధనల నేపథ్యంలో ఈ బైక్‌ను శుక్రవారం విడుదల చేసింది. ధర రూ .59,600 నుండి ప్రారంభమవుతుంది. దీంతో పాటు బీఎస్-6 నిబంధనలకు అనుగుణంగా రెండు స్కూటర్లను కూడా తీసుకొచ్చింది. డెస్టినీ 125, మాస్ట్రో ఎడ్జ్ 125 పేరుతో తీసుకొచ్చిన వీటి ధరలను వరుసగా రూ .64,310 , రూ .67,950 (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్ న్యూఢిల్లీ) ప్రారంభమవుతుందని హీరో మోటోకార్ప్ ఒక ప్రకటనలో తెలిపింది. కొత్త నిబంధనలకు అనుగుణంగా తమ పోర్ట్‌ఫోలియోను విస్తరించామని హీరో మోటోకార్ప్ హెడ్ (గ్లోబల్ ప్రొడక్ట్ ప్లానింగ్) మాలో లే మాసన్ అన్నారు. జైపూర్‌లోని ఆర్అండ్డీ హబ్ - సెంటర్ ఆఫ్ ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ (సిఐటి) వద్ద వీటిని పూర్తిగా దేశీయంగా డిజైన్ చేసి అభివృద్ధి చేసినట్లు తెలిపారు. -
రెండో రోజూ రికార్డులే..
కంపెనీల క్యూ3 ఫలితాలు బాగా ఉంటాయనే అంచనాలతో మంగళవారం స్టాక్ మార్కెట్ లాభాల్లో ముగిసింది. సెన్సెక్స్, నిఫ్టీల ఆల్‌టైమ్ హై రికార్డులు వరుసగా రెండో రోజూ కొనసాగాయి. సూచీల్లో వెయిటేజీ అధికంగా ఉన్న హెచ్డీఎఫ్సీ, ఐటీసీ, యాక్సిస్ బ్యాంక్, టీసీఎస్ షేర్లలో జోరుగా కొనుగోళ్లు జరిగాయి. దీంతో సెన్సెక్స్, నిఫ్టీలు వరుసగా రెండో ట్రేడింగ్ సెషన్లో కూడా ఇంట్రాడేలోనూ, ముగింపులోనూ కొత్త శిఖరాలకు చేరాయి. స్టాక్ సూచీలు లాభపడటం ఇది వరుసగా నాలుగో రోజు. రోజంతా తీవ్రమైన ఒడిదుడుకులమయంగా పరిమిత శ్రేణిలో సెన్సెక్స్, నిఫ్టీలు కదలాడాయి. అయితే చివరి గంటలో కొనుగోళ్లు జోరుగా సాగాయి. సెన్సెక్స్ 93 పాయింట్ల లాభంతో 41,953 పాయింట్ల వద్ద, నిఫ్టీ 33 పాయింట్లు పెరిగి 12,362 పాయింట్ల వద్ద ముగిశాయి. కీలకమైన 42,000 పాయింట్ల మైలురాయికి సెన్సెక్స్ 47 పాయింట్ల దూరంలో ఉండగా, నిఫ్టీ కీలకమైన 12,350 పాయింట్ల మైలురాయిని అధిగమించింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ ఫ్లాట్‌గా ట్రేడైంది. లోహ, ఐటీ, కన్సూమర్, వాహన షేర్లు పెరిగాయి. బ్యాంక్, ఇంధన, రియల్టీ షేర్లలో లాభాల స్వీకరణ చోటు చేసుకుంది. ద్రవ్యోల్బణం పెరుగుతున్నా... రిటైల్ ద్రవ్యోల్బణం ఐదేళ్ల గరిష్ట స్థాయికి ఎగిసినా మార్కెట్ ముందుకే దూసుకుపోయిందని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ ఎనలిస్ట్ వినోద్ నాయర్ పేర్కొన్నారు. బడ్జెట్లో మరిన్ని తాయిలాలను కేంద్రం ప్రకటించగలదన్న ఆశలున్నాయని, కంపెనీల క్యూ3 ఫలితాలపై ఆశావహ అంచనాలూ లాభాలకు కారణమన్నారు. - హీరో మోటొకార్ప్ షేర్ 2.1 శాతం లాభంతో రూ.2,408 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా లాభపడిన షేర్ ఇదే. - రుణ నాణ్యత ఒకింత తగ్గడంతో ఇండస్ఇండ్ బ్యాంక్ 3.8 శాతం నష్టంతో రూ.1,470 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా నష్టపోయిన షేర్ ఇదే. - పలు షేర్లు ఇంట్రాడేలో ఆల్‌టైమ్‌హైలను తాకాయి. హెచ్డీఎఫ్సీ, దివీస్ ల్యాబ్స్, బెర్జర్ పెయింట్స్, హెచ్‌సీఎల్ టెక్, ఇప్కా ల్యాబ్స్, మెట్రోపొలిస్ హెల్త్‌కేర్, ఎన్ఐఐటీ టెక్ తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. -
హీరో మోటో తొలి బీఎస్-6 బైక్
సాక్షి, ముంబై : హీరో మోటో కార్ప్ ప్రీమియం బైక్ సెగ్మెంట్లోకి ఎంట్రీ ఇచ్చింది. బీఎస్-6 నిబంధనలకనుగుణంగా భారతదేశపు మొట్టమొదటి మోటారు సైకిల్ ‘స్పెండర్ 110 సిసి ఐస్మార్ట్’ పేరుతో లాంచ్ చేసింది. దీని ధరను రూ .64,900 గా నిర్ణయించింది. హీరో స్ప్లెండర్ ఐ స్మార్ట్ రిటైల్ అమ్మకాలు మరికొన్ని రోజుల్లో ఢిల్లీ, నేషనల్ క్యాపిటల్ రీజియన్ (ఎన్‌సిఆర్) లో ప్రారంభం కానున్నాయి. రాబోయే కొద్ది వారాల్లో ఇది క్రమంగా దేశవ్యాప్తంగా అందుబాటులో ఉంటుంది. భారతదేశపు అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటో తాజా లాంచ్‌తో తన మార్కెట్ షేర్‌ను మరింత పెంచుకోవాలని చూస్తోంది. 110 సీసీ బీఎస్-6 కంప్లైంట్ ఫ్యూయల్ ఇంజెక్షన్, 9 గరిష్ట బిహెచ్పి వద్ద 7500 ఆర్‌పిఎమ్ శక్తిని ఉత్పత్తి చేస్తుంది. 5500 ఆర్‌పిఎమ్ వద్ద 9.89 ఎన్ఎమ్ టార్క్‌ను అందిస్తుంది. స్ప్లెండర్ ఐస్మార్ట్ దేశవ్యాప్తంగా దశలవారీగా అందుబాటులో ఉంటుంది. హీరో మోటోకార్ప్ ప్రతినిధి సంజయ్ భన్ తెలిపారు. దేశీయ ఆటోమొబైల్ పరిశ్రమలో ప్రపంచంతో సమానంగా ఉంచే బీఎస్-6 ఉద్గార నిబంధనలు 2020 ఏప్రిల్ 1 నుండి అధికారికంగా అమలులోకి రానున్నసంగతి తెలిసిందే. -
హీరో మోటోకార్ప్ విక్రయాల్లో మరో మైలురాయి
న్యూఢిల్లీ: దేశంలో అతిపెద్ద ద్విచక్ర వాహన కంపెనీ హీరో మోటోకార్ప్ విక్రయాల్లో మరో మైలురాయిని దాటింది. హరిద్వార్ ప్లాంట్ నుంచి ఉత్పత్తి అయ్యే వాహన అమ్మకాలు 2.5 కోట్ల మార్కును అధిగమించినట్లు బుధవారం ప్రకటించింది. ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన ఈ ప్లాంట్ ఉత్పత్తి సామర్థ్యం రోజుకు 9,500 యూనిట్లు కాగా, ప్రారంభించిన 11 ఏళ్లలోనే ఈస్థాయి రికార్డును నెలకొల్పడం విశేషమని కంపెనీ వివరించింది. 2008లో ఉత్పత్తిని మొదలుపెట్టి.. తాజాగా సాధించిన ఘనత కేవలం ఈ ఒక్క ప్లాంట్‌కే కాకుండా, మొత్తం కంపెనీ విజయంగా భావిస్తున్నామని సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఆపరేషన్స్), చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ విక్రమ్ కస్బేకర్ చెప్పారు. -
‘హీరో’ లాభం 10 శాతం డౌన్
న్యూఢిల్లీ: టూ వీలర్ దిగ్గజం హీరో మోటొకార్ప్ నికర లాభం రెండో త్రైమాసిక కాలంలో 10 శాతం తగ్గింది. గత క్యూ2లో రూ.982 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ2లో రూ.884 కోట్లకు తగ్గిందని హీరో మోటొకార్ప్ తెలిపింది. కార్యకలాపాల ఆదాయం రూ.9,168 కోట్ల నుంచి రూ.7,661 కోట్లకు తగ్గిందని కంపెనీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్, నిరంజన్ గుప్తా తెలిపారు. ఈ క్యూ2లో స్వచ్ఛంద పదవీ విరమణ(వీఆర్ఎస్) పథకాన్ని తెచ్చామని, వీఆర్ఎస్కు అంగీకరించిన ఉద్యోగుల కోసం రూ.60 కోట్లు కేటాయింపులు జరిపామని, ఆ మేరకు నికర లాభం ప్రభావితమైందని వివరించారు. గత క్యూ2లో 15.2 శాతంగా ఉన్న నిర్వహణ లాభ మార్జిన్ ఈ క్యూ2లో 14.5 శాతానికి తగ్గిందని పేర్కొన్నారు. గత క్యూ2లో 21.3 లక్షలుగా ఉన్న వాహన విక్రయాలు ఈ క్యూ2లో 21 శాతం తగ్గి 16.91 లక్షలకు చేరాయని గుప్తా తెలిపారు. కాగా, పండుగల సీజన్ ముగిసిన తర్వాత భారత్ స్టేజ్–సిక్స్ (బీఎస్–సిక్స్) మోటార్ బైక్‌లను కంపెనీ అందుబాటులోకి తేనుంది. -
హీరో మోటో ఉద్యోగులకు స్వచ్ఛంద పదవీ విరమణ
న్యూఢిల్లీ: ద్విచక్ర మోటారు వాహనాల మార్కెట్ లీడర్ హీరో మోటోకార్ప్ తన ఉద్యోగులకు స్వచ్చంద పదవీ విరమణ (వీఆర్ఎస్) పథకాన్ని ప్రారంభించినట్టు సోమవారం ప్రకటించింది. ఉత్పాదకతను, సామర్థ్యాన్ని పెంచడమే దీని ఉద్దేశ్యంగా పేర్కొంది. ఈ పథకం ఈ నెల (సెపె్టంబర్) 28వరకు అమల్లో ఉంటుంది. 40 ఏళ్లు, అంతకు మించి వయసులో ఉన్న వారు, కంపెనీలో కనీసం ఐదేళ్ల సర్వీసు (స్థిరంగా) పూర్తి చేసినవారు అర్హులుగా కంపెనీ తెలిపింది. ఉద్యోగి కంపెనీలో ఎన్నేళ్ల పాటు పనిచేశారు, పదవీ విమరణకు (58 ఏళ్లు) ఇంకా ఎన్నేళ్ల కాలం మిగిలి ఉంది?.. తదితర అంశాల ఆధారంగా ఏకీకృత చెల్లింపుల మొత్తాన్ని కంపెనీ నిర్ణయిస్తుంది. ఆటోరంగం మందగమన పరిస్థితుల్లో కంపెనీ ఈ కీలక నిర్ణయం తీసుకోవడం గమనార్హం. -
బీఎస్–6 వాహనాల క్యూ!!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశంలో బీఎస్–6 ప్రమాణాల అమలు గడువు దగ్గర పడుతుండటంతో వాహన కంపెనీలు కొత్త మోడళ్ల ఆవిష్కరణలను వేగవంతం చేశాయి. ఒకదాని వెంట ఒకటి బీఎస్–6 వేరియంట్లను సిద్ధం చేస్తున్నాయి. వాహన కాలుష్యాన్ని గణనీయంగా తగ్గించే భారత్ స్టేజ్–6 ప్రమాణాలు 2020 ఏప్రిల్ 1 నుంచి అమలులోకి రానున్నాయి. దీనికి అనుగుణంగా కొత్త టెక్నాలజీ కోసం ఆటోమొబైల్ సంస్థలు రూ.70– 80 వేల కోట్లను వెచ్చిస్తున్నాయి. మరోవైపు బీఎస్–4తో పోలిస్తే బీఎస్–6 వాహనం మోడల్‌నుబట్టి 15 శాతం వరకు ఖరీదు కానుంది. ద్విచక్ర వాహన కంపెనీ హోండా బీఎస్–6 వేరియంట్ యాక్టివా–125 స్కూటర్‌ను ఆవిష్కరించింది. స్కూటర్స్ విభాగంలో ఇదే తొలి బీఎస్–6 వాహనం. ఈ ఏడాది సెప్టెంబర్ నుంచి అమ్మకాలు ప్రారంభమవుతాయి. హీరో మోటోకార్ప్ స్ప్లెండర్ ఐస్మార్ట్ బైక్ బీఎస్–6 ధ్రువీకరణ దక్కించుకుంది. ఐషర్ ప్రో 2000 సిరీస్ లైట్ డ్యూటీ ట్రక్‌ను విడుదల చేసింది. లగ్జరీ కార్ల దిగ్గజం మెర్సిడెస్ బెంజ్ నాలుగు వేరియంట్లలో లాంగ్ వీల్ బేస్ ఈ–క్లాస్ సెడాన్‌తోపాటు ఎస్–క్లాస్ 350డీ మోడల్‌ను ప్రవేశపెట్టింది. టయోటా కిర్లోస్కర్ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ గ్లాంజాను విడుదల చేసింది. బీఎస్–6తో మూడు నాలుగు నెలల్లో పెట్రోల్, డీజిల్ వెహికిల్స్‌ను ప్రవేశపెడతామని మహీంద్రా అండ్ మహీంద్రా ఎండీ పవన్ గోయెంకా చెప్పారు. మారుతి సుజుకి ఇండియా బాలెనో, ఆల్టో మోడళ్లను అందుబాటులోకి తెచ్చింది. ఇతర మోడళ్లను ప్రస్తుతం పరీక్షిస్తోంది. డెడ్‌లైన్‌లోగా అన్ని మోడళ్లను బీఎస్–6 ప్రమాణాలతో ప్రవేశపెడతామని బజాజ్ ఆటో తెలిపింది. మోపెడ్స్ విభాగంలో ఏకఛత్రాధిపత్యం కొనసాగిస్తున్న టీవీఎస్.. బీఎస్–6 వేరియంట్‌ను రూపొందిస్తున్నట్లు ప్రకటించింది. భారత్ స్టేజ్ ప్రమాణాలు.. భారత్‌లో బీఎస్–1 ప్రమాణాలు 2000 సంవత్సరంలో అమల్లోకి వచ్చాయి. 2005లో బీఎస్–2, బీఎస్–3 2010లో వచ్చాయి. ఇప్పుడున్న బీఎస్–4 ప్రమాణాలు 2017 ఏప్రిల్‌లో మొదలయ్యాయి. దేశంలో కాలుష్యం అంతకంతకూ పెరుగుతుండడంతో బీఎస్–5కు బదులుగా బీఎస్–6 ప్రమాణాలను అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. బీఎస్–4 వాహనం 50 పీపీఎం (పార్ట్స్ పర్ మిల్లియన్) సల్ఫర్‌ను విడుదల చేస్తే, బీఎస్–6 వెహికల్ విషయంలో ఇది 10 పీపీఎం ఉంటుంది. డీజిల్ కార్లలో నైట్రోజన్ ఆక్సైడ్స్ 70 శాతం వరకు తగ్గితే, పెట్రోల్ కార్లలో 25 శాతం తగ్గుతుంది. బీఎస్–4 కోసం ఇప్పటికే భారీగా ఖర్చు చేసిన తయారీ సంస్థలు అతి తక్కువ కాలంలోనే నూతన టెక్నాలజీ కోసం పెట్టుబడి పెట్టాల్సి వస్తోంది. భారీ పెట్టుబడులతో... భారత్ స్టేజ్–6 ప్రమాణాలకు అనుగుణంగా వాహనాలను అభివృద్ధి చేసేందుకు, విడిభాగాలను స్థానికంగా తయారు చేసేందుకై ప్యాసింజర్ వెహికల్ మాన్యుఫాక్చరింగ్ కంపెనీలు రూ.35,000– 40,000 కోట్లు పెట్టుబడి పెడుతున్నట్లు ఇక్రా వెల్లడించింది. అలాగే ద్విచక్ర వాహన తయారీ సంస్థల నుంచి రూ.15,000 కోట్ల వరకు పెట్టుబడులు ఉండొచ్చని సమాచారం. మొత్తంగా వాహన పరిశ్రమ రూ.70–80 వేల కోట్ల నిధులు వెచ్చిస్తున్నట్లు సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చరర్స్ చెబుతోంది. బీఎస్–6 గ్రేడ్ ఫ్యూయెల్స్ కోసం ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు రూ.28,000 కోట్లు ఖర్చు చేస్తున్నాయి. బీఎస్–6 నూతన సాంకేతిక పరిజ్ఞానం కోసం రూ.1,000 కోట్లు ఇన్వెస్ట్ చేసినట్టు మహీంద్రా ప్రకటించింది. హోండా మోటార్‌సైకిల్స్ అండ్ స్కూటర్స్ ఇండియా రూ.800 కోట్లు వెచ్చిస్తోంది. 2019–20లో విస్తరణ నిధులు రూ.1,500 కోట్లు ఉండొచ్చని హీరో మోటోకార్ప్ వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్‌లో నెలకొల్పనున్న కొత్త ప్లాంటుతోపాటు బీఎస్–6 అప్‌గ్రెడేషన్‌కు ఈ మొత్తాన్ని ఖర్చు చేయనున్నట్టు కంపెనీ సీఎఫ్‌వో నిరంజన్ గుప్తా తెలిపారు. ఫోర్స్ మోటార్స్ రూ.250 కోట్లు వెచ్చిస్తోంది. వచ్చే మూడేళ్లకుగాను యమహా ఇండియా రూ.100 కోట్లు ఖర్చు చేయనుంది. -
‘హీరో’ లాభం 25 శాతం డౌన్
న్యూఢిల్లీ: టూవీలర్ దిగ్గజం హీరో మోటోకార్ప్ నికర లాభం గత ఆర్థిక సంవత్సరం క్యూ4లో 25 శాతం తగ్గి రూ.730 కోట్లకు చేరింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం (2017–18) క్యు4లో రూ.967 కోట్ల నికర లాభం వచ్చిందని హీరో మోటోకార్ప్ చైర్మన్ పవన్ ముంజల్ పేర్కొన్నారు. గత క్యూ4లో అమ్మకాలు తగ్గడంతో నికర లాభం కూడా తగ్గిందని, ఆదాయం రూ.8,564 కోట్ల నుంచి 8 శాతం పతనమై రూ.7,885 కోట్లకు తగ్గిందని తెలిపారు. అంతకు ముందు ఆర్థిక సంవత్సరం క్యూ4లో 20 లక్షల వాహనాలు విక్రయించగా, గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్లో 17.8 లక్షల వాహనాలు విక్రయించామని, అమ్మకాలు 11 శాతం తగ్గాయని తెలిపారు. రూ. 2 ముఖ విలువ గల ఒక్కో షేర్‌కు రూ.32 డివిడెండ్‌ను ప్రకటించారు. కాగా ఈ ఏడాది జనవరి 31న ఒక్కో షేర్‌కు రూ.55 మధ్యంతర డివిడెండ్‌ను కంపెనీ ప్రకటించింది. 78 లక్షల వాహన విక్రయాలు.. ఇక పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే, 2017–18 ఆర్థిక సంవత్సరంలో రూ.3,697 కోట్లుగా ఉన్న నికర లాభం గత ఆర్థిక సంవత్సరంలో 8 శాతం తగ్గి రూ.3,385 కోట్లకు చేరింది. ఆదాయం మాత్రం రూ.32,872 కోట్ల నుంచి 2 శాతం వృద్ధితో రూ.33,651 కోట్లకు పెరిగింది. వాహన విక్రయాలు రూ.75.87 లక్షల నుంచి 78.20 లక్షలకు పెరిగాయి. వివిధ ప్రాంతాల్లో పరిస్థితులు అంతంతమాత్రంగానే ఉన్నప్పటికీ, రికార్డు విక్రయాలు సాధించామని ముంజల్ వ్యాఖ్యానించారు. మార్కెట్లో ఇబ్బందులున్నా, అగ్రస్థానాన్ని కొనసాగించామన్నారు. కష్టాలు కొనసాగుతాయ్..... దేశీయ మార్కెట్లో సమీప భవిష్యత్తులో కష్టాలు కొనసాగుతాయని ముంజల్ పేర్కొన్నారు. పండుగల సీజన్లో అమ్మకాలు పుంజుకుంటాయన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. భారత్ స్టేజ్ (బీఎస్)–6 ప్రమాణాలు వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి అమల్లోకి వస్తాయని, ఈ నిబంధనలు పాటించే బైక్‌లను, స్కూటర్లను అంతకంటే ముందే మార్కెట్లోకి తెస్తామని తెలిపారు. అయితే బీఎస్ సిక్స్ నిబంధనలు కఠినంగా ఉన్నాయని, ఈ నిబంధనల కారణంగా వాహన పరిశ్రమకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం కూడా సమస్యాత్మకమేనని పేర్కొన్నారు. కంపెనీ ఆర్థిక ఫలితాలు అంతంతమాత్రంగానే ఉంటాయన్న అంచనాలతో కంపెనీ షేరు బీఎస్ఈలో 0.5 శాతం నష్టంతో రూ.2,604 వద్ద ముగిసింది. -
అటూఇటుగా బైక్‌ల విక్రయాలు..
న్యూఢిల్లీ: ద్విచక్ర వాహన విక్రయాలు 2018 డిసెంబర్లో మిశ్రమంగా నిలిచాయి. పలు సంస్థల అమ్మకాలు 30 శాతానికి మించి వృద్ధిరేటు నమోదు చేయగా.. మరికొన్ని కంపెనీలు సవాళ్లను ఎదుర్కొన్నాయి. అత్యధిక వాల్యూమ్స్‌ను నమోదు చేస్తున్న హీరో మోటోకార్ప్ దేశీ అమ్మకాలు 4 శాతం తగ్గాయి. ఈ అంశంపై స్పందించిన సంస్థ చైర్మన్ పవన్ ముంజాల్.. ‘లిక్విడిటీ (నగదు లభ్యత) కొరత, పెరిగిన ద్విచక్ర బీమా అమ్మకాలపై ప్రతికూల ప్రభావం చూపాయి.’ అని వ్యాఖ్యానించారు. ఇక రాయల్ ఎన్ఫీల్డ్ దేశీ అమ్మకాలు 13 శాతం తగ్గినప్పటికీ.. అంతర్జాతీయ అమ్మకాలు 41 శాతం వృద్ధి చెందాయి. ఇదే సమయంలో సుజుకీ మోటార్‌సైకిల్ అమ్మకాలు ఏడాది ప్రాతిపదికన 33.82 శాతం, ఏప్రిల్–డిసెంబర్ కాలంలో 30 శాతం పెరిగాయి. ‘ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 7.5 లక్షల యూనిట్ల విక్రయాలు జరగాలనేది సంస్థ లక్ష్యంగా కాగా, ఇప్పటివరకు 5,45,683 యూనిట్లను విక్రయించాం.’ అని ఎస్ఎంఐపీఎల్ మేనేజింగ్ డైరెక్టర్ సతోషి ఉచిడా అన్నారు. మరోవైపు బజాజ్ ఆటో గతనెల మొత్తం విక్రయాలు 18 శాతం, దేశీ అమ్మకాలు 31 శాతం, ఎగుమతులు 16 శాతం వృద్ధి రేటును నమోదుచేశాయి. టీవీఎస్ మోటార్ మొత్తం విక్రయాల్లో 6 శాతం, దేశీ అమ్మకాల్లో ఒక శాతం, ఎగుమతుల్లో 22 శాతం పెరిగాయి. ఈ సంస్థ స్కూటర్ విక్రయాలు 9 శాతం పెరిగి 91,480 యూనిట్లుగా నిలిచాయి. ఫోర్డ్ అమ్మకాలు 14.8% అప్ 2018 డిసెంబర్ దేశీ అమ్మకాలు 5,840 యూనిట్లుగా ఉన్నట్లు ఫోర్డ్ ఇండియా సంస్థ తెలిపింది. అంతకుముందు ఏడాది ఇదేకాలంలో 5,087 యూనిట్ల విక్రయాలు జరగ్గా.. ఏడాది ప్రాతిపదికన 14.8% వృద్ధి నమోదైనట్లు వెల్లడించింది. అయితే, ఎగుమతులు 24.8 శాతం తగ్గిన కారణంగా.. గతనెల మొత్తం అమ్మకాల్లో 18 శాతం క్షీణత నమోదైనట్లు వివరించింది. సోనాలికా ట్రాక్టర్ విక్రయాలు 12% పెరిగాయి గతనెల్లో ట్రాక్టర్ల అమ్మకాలు 5,052 యూనిట్లుగా సంస్థ ప్రకటించింది. అంతక్రితం ఏడాది డిసెంబర్‌తో పోల్చితే 11.9% పెరిగాయి. ఎగుమతులు 26 శాతం, మొత్తం అమ్మకాలు 14% వృద్ధి చెందాయి. జీఎస్టీని తగ్గించాలి.. ప్రస్తుతం కేవలం కొన్ని వస్తు, సేవలపై మాత్రమే 28% జీఎస్టీ రేటు అమల్లో ఉండగా.. ఈ క్యాటగిరీలో ద్విచక్ర వాహనాలూ ఉన్నాయని పవన్ ముంజాల్ వ్యాఖ్యానించారు. విలాస వస్తువులపై ఉండే ఈరేటును సామాన్యులు వినియోగించే బైక్‌లపై విధించడం సరికాదన్నారు. త్వరలోనే బీఎస్ సిక్స్ ఉద్గార నిబంధనలు అమలుకానుండగా.. ఈ నిర్ణయం తరువాత బైక్‌ల ధరలు మరింత పెరగనున్నట్లు తెలిపారు. ఈ అంశాలను పరిగణలోనికి తీసుకుని ద్విచక్రవాహనాలపై జీఎస్టీ రేటును 18%కి తగ్గించాలని కోరారు. -
మార్కెట్లోకి హీరో ‘డెస్టినీ 125’
న్యూఢిల్లీ: ద్విచక్ర వాహనాల తయారీ దిగ్గజం హీరో మోటోకార్ప్.. దేశీ మార్కెట్లో ‘డెస్టినీ 125’ పేరిట సరికొత్త స్కూటర్‌ను సోమవారం విడుదల చేసింది. ఈ మోడల్ ధరల శ్రేణి రూ.54,650–రూ.57,500గా ఉన్నట్లు ప్రకటించింది. ఢిల్లీ/ఎన్సీఆర్లో విక్రయాలు ప్రారంభం కాగా, దేశవ్యాప్త అమ్మకాలు వచ్చే 3–4 వారాల్లో ప్రారంభంకానున్నట్లు కంపెనీ తెలియజేసింది. ఈ సందర్భంగా సంస్థ గ్లోబల్ ప్రోడక్ట్ ప్లానింగ్ హెడ్ మాలో లీ మాసన్ మాట్లాడుతూ.. ‘125–సీసీ విభాగానికి చెందిన స్కూటర్ మార్కెట్ గణనీయంగా విస్తరిస్తోంది. ఏడాది ప్రాతిపదికన 75 శాతం వృద్ధిరేటును నమోదుచేసింది. ఈ విభాగంలో బహుళ బ్రాండ్ విధానాన్ని అనుసరిస్తున్నాం. ఈ ఏడాది చివరినాటికి మరో స్కూటర్‌నూ విడుదలచేయనున్నాం’’ అని వివరించారు. -
హీరో మోటో లాభం 976 కోట్లు
న్యూఢిల్లీ: దేశంలో అతిపెద్ద ద్విచక్ర వాహన కంపెనీ హీరో మోటోకార్ప్ సెప్టెంబర్ త్రైమాసికంలో ఫలితాల పరంగా మెప్పించలేకపోయింది. కంపెనీ నికర లాభం 3.38 శాతం తగ్గి రూ.976.28 కోట్లకు పరిమితమైంది. ప్రధానంగా అధిక వ్యయాలు ఇందుకు కారణమయ్యాయి. అమ్మకాల ఆదాయం మాత్రం రూ.9,091 కోట్లకు పెరిగింది. అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో లాభం రూ.1,010 కోట్లు, ఆదాయం రూ.8,371 కోట్లుగా ఉండటం గమనార్హం. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో వ్యయాలు రూ.7,053 కోట్లుగా ఉంటే, తాజా సమీక్షా త్రైమాసికంలో అవి రూ.7,866 కోట్లకు ఎగశాయి. వాహన విక్రయాలు సెప్టెంబర్ త్రైమాసికంలో కంపెనీ మొత్తం 21,34,051 వాహనాలను విక్రయించింది. క్రితం ఏడాది ఇదే కాలంలో అమ్మకాలు 20,22,805 యూనిట్లతో పోలిస్తే వృద్ధి చెందాయి. పనితీరుపై హీరోమోటో చైర్మన్, ఎండీ, సీఈవో పవన్ ముంజాల్ మాట్లాడుతూ... హీరో మోటారు సైకిళ్లు, స్కూటర్లకు డిమాండ్ నిలకడగా ఉన్నట్టు చెప్పారు. దీంతో రెండో త్రైమాసికంలోనూ వృద్ధి నమోదు చేశామన్నారు. ఎక్స్ట్రీమ్ 200ఆర్ విడుదల ద్వారా ఖరీదైన మోటారు సైకిళ్ల విభాగంలోకి తిరిగి అడుగుపెట్టినట్టు చెప్పారు. రానున్న పండుగల సందర్భంగా ఎక్స్ట్రీమ్ 200ఆర్ తమ మార్కెట్ ఆధిపత్యాన్ని కొనసాగించేందుకు సాయపడుతుందని పేర్కొన్నారు. ‘‘హీరో మోటోకార్ప్‌లో గట్టి ఆర్థిక నిర్మాణం, మా ఐకానిక్ బ్రాండ్లకు బలమైన డిమాండ్ నెలకొల్పాం. దీంతో ప్రతీ క్వార్టర్లోనూ వృద్ధి నమోదు చేస్తూ వస్తున్నాం. ఈ ఏడాది మిగిలిన కాలంలోనూ ఇది కొనసాగుతుంది. ధరల పరమైన సవాళ్లను అధిగమించి లాభదాయకమైన, స్థిరమైన వృద్ధి కొనసాగిస్తాం’’ అని పవన్ ముంజాల్ చెప్పారు. -
స్టాక్స్ వ్యూ
హిందుస్తాన్ యూనిలీవర్ - కొనొచ్చు బ్రోకరేజ్ సంస్థ: మోతిలాల్ ఓస్వాల్‌ప్రస్తుత ధర: రూ.1,621 టార్గెట్ ధర: రూ.2,025 ఎందుకంటే: ఈ కంపెనీ ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసిక కాలంలో మంచి వృద్ధినే కనబరిచింది. అదే జోరు రెండో క్వార్టర్లో కూడా కొనసాగవచ్చు. పట్టణ ప్రాంతాల్లో కంటే గ్రామీణ ప్రాంతాల్లోనే కంపెనీ వృద్ధి అధికంగా ఉండనున్నది. పట్టణ అమ్మకాల కంటే గ్రామీణ అమ్మకాలు ఒకటిన్నర రెట్లు అధికంగా ఉంటాయని అంచనా. విలువ పరంగా చూస్తే 1.3 రెట్లు అధికంగా ఉండొచ్చు. ఈ క్యూ2లో చోటు చేసుకున్న రవాణా సమ్మె, కేరళ వరదలు చెప్పుకోదగ్గ ప్రభావం చూపకపోవచ్చు. ఈ రెండు సమస్యల కారణంగా సరఫరా చైన్‌లో తలెత్తిన సమస్యలు పూర్తిగా సమసిపోయాయని చెప్పవచ్చు. రెండేళ్లలో అమ్మకాలు 6–8% చొప్పున చక్రగతిన వృద్ధి సాధిస్తాయని కంపెనీ ధీమాగా ఉంది. ప్రకటనల కోసం అధికంగా వ్యయం చేస్తోంది. ఉత్పత్తుల ధరల పెంపు, వ్యయ నియంత్రణ పద్ధతుల ద్వారా ఈ అధిక ప్రకటనల వ్యయ భారాన్ని తట్టుకోవాలని కంపెనీ యోచిస్తోంది. ఈ క్యూ2లో కొన్ని ఉత్పత్తుల ధరలను ఈ కంపెనీ 3–4% రేంజ్లో పెంచింది. ఆ ప్రభావం క్యూ2 ఆర్థిక ఫలితాల్లో కనిపించవచ్చు. ఆయుష్, ఇందులేఖలతో పాటు లక్స్, హమామ్, లైఫ్‌బాయ్ బ్రాండ్లలో అందుబాటులోకి తెచ్చిన నేచురల్ వేరియంట్ల అమ్మకాలు పుంజుకుంటున్నాయి. ‘విన్నింగ్ మెనీ ఇండియాస్’ వ్యూహంలో వినియోగదారుల అభిరుచులకనుగుణంగా ఉత్పత్తులను అందిస్తోంది. అవసరమైన టెక్నాలజీని అవసరమైన స్థాయిలో వినియోగిస్తోంది. జీఎస్టీ అమల్లోకి వస్తే, అసంఘటిత రంగం నుంచి మార్కెట్ సంఘటిత రంగానికి మళ్లుతుందనే భావన ఉండేది. అయితే జీఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత కూడా అసంఘటిత రంగం నుంచి చెప్పుకోదగ్గ స్థాయిలో మార్కెట్ సంఘటిత రంగానికి మళ్లలేదని చెప్పవచ్చు. దీనికి తోడు పోటీ తీవ్రత కొనసాగుతుండటం, అధిక ప్రకటనల వ్యయాల కారణంగా నిర్వహణ మార్జిన్లపై ప్రభావం పడనుండటం.. ప్రతికూలాంశాలు. హీరో మోటొకార్ప్ - కొనొచ్చు బ్రోకరేజ్ సంస్థ: సెంట్రమ్ బ్రోకింగ్ ప్రస్తుత ధర: రూ.3,166 టార్గెట్ ధర: రూ.4,009 ఎందుకంటే: ఈ కంపెనీ ఇటీవలనే 200 సీసీ కేటగిరిలో ఎక్స్ట్రీమ్ 200ఆర్ మోడల్‌ను మార్కెట్లోకి తెచ్చింది. ప్రీమియమ్ బైక్ సెగ్మెంట్లోకి ఈ బైక్ ద్వారా ఈ కంపెనీ మళ్లీ రీ ఎంట్రీ ఇస్తోంది. రూ. 89,900(ఎక్స్ షోరూమ్) ధర గల ఈ బైక్ కారణంగా ఈ షేర్ ధర రీరేట్ కాగలదని భావిస్తున్నాం. ఈ సెగ్మెంట్లో అత్యంత చౌక అయిన బైక్ ఇదే. ఈ బైక్‌కు వినియోగదారుల నుంచి మంచి స్పందనే లభిస్తోంది. కంపెనీ బ్రాండ్ పటిష్టంగా ఉండటం, ధర చౌకగా ఉండటం వంటి కారణాల వల్ల మార్జిన్లు అధికంగా ఉండే ప్రీమియమ్ బైక్ సెగ్మెంట్లో ఈ బైక్‌తో కొంత మార్కెట్ వాటాను ఈ కంపెనీ కొల్లగొట్టగలదని భావిస్తున్నాం. బజాజ్ ఆటో కంపెనీకి చెందిన పల్సర్ ఎన్ఎస్ 200, టీవీఎస్ మోటార్ కంపెనీకి చెందిన ఆపాచీ ఆర్టీఆర్ 300, ఎన్వీ బైక్‌ల ధరలతో పోల్చితే ఈ ఎక్స్ట్రీమ్ 200ఆర్ బైక్ ధర 20–40% తక్కువగా ఉండటం చెప్పుకోదగ్గ విశేషం. ఇక ఎక్స్ట్రీమ్ 200ఆర్ బైక్ ధర లభించే స్థాయిల్లోనే ఉన్న ఇతర కంపెనీల 150సీసీ–180 సీసీ బైక్‌లతో పోల్చితే సౌకర్యాలు, ఫీచర్లు ఎక్స్ట్రీమ్ 200ఆర్ బైక్‌లోనే అధికంగా ఉన్నాయి. దీంతో ప్రస్తుతం 100–125 సీసీ బైక్‌లను ఉపయోగిస్తున్న వినియోగదారులు తదుపరి అప్‌గ్రేడ్ కోసం ఈ బైక్‌నే ఎంపిక చేసుకునే అవకాశాలు అధికంగా ఉన్నాయి. ఇటీవలే తన బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించడానికి క్రికెటర్ విరాట్ కోహ్లితో ఒక ఒప్పందం కుదుర్చుకుంది. కోహ్లితో బ్రాండింగ్, గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్ పుంజుకుంటుండటం... సానుకూలాంశాలు. గమనిక: ఈ కాలమ్‌లో షేర్లపై ఇచ్చిన సలహాలు, సూచనలు, వివిధ బ్రోకరేజ్ సంస్థలు వ్యక్తం చేసిన అభిప్రాయాలు మాత్రమే. -
యూత్ కోసం హీరో ఎక్స్ట్రీమ్ 200ఆర్
న్యూఢిల్లీ: హీరో మోటోకార్ప్ మరోసారి ప్రీమియం మోటార్ సైకిల్ విభాగంలోకి అడుగుపెట్టింది. ప్రత్యేకించి యువతను లక్ష్యించి... 200సీసీ సెగ్మెంట్లో సరికొత్త ప్రీమియం బైక్‌ను సోమవారం మార్కెట్లోకి విడుదల చేసింది. ‘ఎక్స్ట్రీమ్ 200ఆర్’ పేరిట అందుబాటులోకి వచ్చిన ఈ టూవీలర్‌ను యాంటీ లాక్ బ్రేక్ సిస్టమ్, ఎయిర్ కూల్డ్ ఇంజిన్ టెక్నాలజీతో రూపొందించినట్లు కంపెనీ తెలిపింది. ఢిల్లీలో దీని ఎక్స్–షోరూం ధర రూ.89,900. పండుగల సీజన్ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఈ కొత్త బైక్ ద్వారా అమ్మకాలు గణనీయంగా పెరిగి మార్కెట్ వాటా బలపడుతుందని భావిస్తున్నట్లు హీరో మోటోకార్ప్ సీఈఓ పవన్ ముంజాల్ చెప్పారు. 200సీసీ విభాగంలో మార్కెట్ వాటా పెంచుకోవడంలో భాగంగా ఎక్స్‌పల్స్ 200 వంటి పలు మోడళ్లను విడుదలచేయనున్నామని ఆయన వెల్లడించారు. -
హీరో ధరలు అప్
న్యూఢిల్లీ: దిగ్గజ టూవీలర్ల తయారీ కంపెనీ ‘హీరో మోటొకార్ప్’ తాజాగా తన వాహన ధరలను రూ.500 వరకు పెంచుతున్నట్లు ప్రకటించింది. ధరల పెంపు తక్షణం అమల్లోకి వస్తుందని పేర్కొంది. ముడిపదార్ధాల ధరలు పెరగడం, కరెన్సీ విలువ తగ్గుదల, ఉత్పత్తి వ్యయాల పెరుగుదల వంటి అంశాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. కాగా ప్రస్తుతం కంపెనీ రూ.40,000– రూ.1,00,000 ధర శ్రేణిలో టూవీలర్లను విక్రయిస్తోంది. హీరో మోటొకార్ప్ జూన్ నెల విక్రయాలు 13 శాతం వృద్ధితో 7,04,562 యూనిట్లకు పెరిగాయి. -
హీరో టూవీలర్ల ధరలు అప్
న్యూఢిల్లీ: దిగ్గజ టూవీలర్ల తయారీ కంపెనీ ‘హీరో మోటోకార్ప్’ తాజాగా తన వాహన ధరలను రూ.625 వరకు పెంచింది. ఉత్పత్తి వ్యయాల పెరుగుదల నేపథ్యంలో బైక్స్, స్కూటర్ల ధరలను తక్షణం పెంచినట్లు కంపెనీ తెలిపింది. మార్కెట్, మోడల్ ప్రాతిపదికన ధరల పెంపు ఉంటుందని పేర్కొంది. కాగా హీరో మోటోకార్ప్ రూ.40,000– రూ.1,00,000 ధరల శ్రేణిలో వాహనాలను మార్కెట్లో విక్రయిస్తోంది. -
హీరో ప్యాషన్ ప్రో, ఎక్స్‌ప్రో... 2018 ఎడిషన్స్
న్యూఢిల్లీ: దేశీ దిగ్గజ టూవీలర్ల తయారీ కంపె నీ ‘హీరో మోటోకార్ప్’ తాజాగా 2018 ప్యాషన్ ప్రో, ప్యాషన్ ఎక్స్‌ప్రో మోటార్‌సైకిళ్లను మార్కెట్లోకి తీసుకువచ్చింది. వీటి ధర లు వరుసగా రూ.53,189, రూ.54,189గా ఉన్నాయి. అన్ని ధరలు ఎక్స్‌షోరూమ్ ఢిల్లీవి. 100–110 సీసీ మోటార్‌సైకిల్ విభాగంలో మార్కెట్ వాటాను మరింత పెంచుకోవాలనే లక్ష్యంతో కంపెనీ ఈ బైక్స్‌ను ఆవిష్కరించింది. వీటిల్లో బీఎస్–4 నిబంధనలకు అనువైన 110 సీసీ ఇంజిన్లను అమర్చినట్లు కంపెనీ తెలిపింది. -
హీరో మోటోకార్ప్ లాభం రూ.805 కోట్లు
న్యూఢిల్లీ: ద్విచక్ర వాహనాల తయారీ దిగ్గజం హీరో మోటోకార్ప్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో రూ. 805 కోట్ల నికర లాభం ఆర్జించింది. ఇది క్రితం ఆర్థిక సంవత్సరం నమోదైన రూ. 772 కోట్ల లాభంతో పోలిస్తే సుమారు 4 శాతం అధికం. మరోవైపు, తాజా క్యూ3లో మొత్తం ఆదాయం 5 శాతం వృద్ధితో రూ. 7,031 కోట్ల నుంచి రూ. 7,416 కోట్లకు పెరిగింది. వ్యయాలు సైతం 5.75 శాతం పెరిగి రూ. 5,945 కోట్ల నుంచి రూ. 6,287 కోట్లకు చేరాయి. హీరో మోటోకార్ప్.. 2017–18కి గాను రూ. 2 ముఖ విలువ గల షేరు ఒక్కింటిపై రూ. 55 మేర మధ్యంతర డివిడెండు ప్రకటించింది. మూడో త్రైమాసికంలో కూడా తాము నిర్దేశించుకున్న లక్ష్యాలను అధిగమించినట్లు సంస్థ ఎండీ పవన్ ముంజల్ తెలిపారు. బీఎస్ఈలో మంగళవారం హీరో మోటోకార్ప్ షేరు సుమారు 3 శాతం క్షీణించి రూ. 3,543 వద్ద ముగిసింది. -
హోండాకు ఝలక్: హీరో కొత్త స్కూటర్లు
ద్విచక్ర వాహన తయారీదారు హీరో మోటోకార్ప్ సరికొత్త వ్యూహంతో బైక్ లవర్స్‌ను ఆకట్టుకునేందుకు సిద్ధమవుతోంది. అలాగే స్కూటర్ల విభాగంలో ప్రత్యర్థి హోండాకు గట్టి పోటీ ఇవ్వాలని నిర్ణయించుకుంది. మార్కెట్ లీడర్‌గా తన స్థానాన్ని మరింత మెరుగుపరుచుకుంటూ ప్రీమియం బైక్ సెగ్మెంట్ మరియు స్కూటర్లపై దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో 2018-19 నాటికి రెండు కొత్త మోడళ్లను మార్కెట్లోకి ప్రవేశపెట్టనుంది. గత ఆర్థిక సంవత్సరం హోండా స్థానంలో తన స్థానాన్ని పెంచే వ్యూహంలో భాగంగా మూడు కొత్త స్కూటర్ల మోడళ్లను ప్రారంభించాలని యోచిస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో కొత్త 125 సిసి స్కూటర్‌ను ప్రవేశపెట్టాలని కంపెనీ భావిస్తోంది. ప్రీమియం మోటార్ సైకిల్ సెగ్మెంట్లో ఈ ఆర్థిక సంవత్సరం చివరకు మార్కెట్ వాటాను పెంచుకోవడమే లక్ష్యంగా ప్రణాళికలు రచిస్తోంది. ఈ ఏడాది చివరి నాడికి ఒక కొత్త 200 సీసీ స్పోర్ట్స్ బైక్‌ను, వచ్చే ఏడాదిలో మరో రెండు మోడళ్లు విడుదల చేసేందుకు హీరో మోటోకార్ప్ కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం తమ పోర్ట్‌ఫోలియోలో స్కూటర్స్ విభాగం 110సీసీ కెపాసిటీతో మాస్ట్రో ఎడ్జ్, మోడల్స్ ఉండగా ..100 సీసీ సామర్థ్యంతో డ్యూయెట్ అందుబాటులో ఉంది. అయితే హోండా కంపెనీకి స్కూటర్స్ విభాగంలో మంచి పట్టు ఉంది. యాక్టివా 4జీ, డియో, ఏవియేటర్, యాక్టివరా ఐ, క్లిక్ 110 సీసీ స్కూటర్స్ కాగా 125 సీసీ సామర్థ్యంతో యాక్టివా 125 హోండా పోర్ట్‌ఫోలియోలో ఉన్నాయి. దేశీయ మోటర్ సైకిల్స్ మార్కెట్లో 50 శాతం మార్కెట్ వాటా ఉన్న హీరో మోటో కార్ప్ కు స్కూటర్స్ విభాగంలో కేవలం 12 శాతం మాత్రమే మార్కెట్ షేర్ ఉంది. అయితే హోండాకు ఇదే విభాగంలో సుమారు 60 శాతం మార్కెట్ వాటా ఉండటం, మరో కంపెనీ టీవీస్కు 15శాతం పైగా మార్కెట్ వాటా ఉండటంతో హీరో కార్ప్ స్కూటర్స్ తయారీపై దృష్టి సారించింది. అయితే ఈ వార్తలపై సంప్రదించినప్పుడు హీరో మోటో కార్ప్ ప్రతినిధి వ్యాఖ్యానించడానికి నిరాకరించారు. కాగా 2016-17 సంవత్సరానికి వార్షిక నివేదికలో కంపెనీ వాటాదారులకు ఇచ్చిన సందేశం లో హీరో మోటార్ కార్ప్ సీఎండీ పవన్ ముంజాల్ మాట్లాడుతూ, వచ్చే ఆర్థిక సంవత్సరానికి ప్రీమియం, స్కూటర్ కేటగిరీలు సహా అరడజను కొత్త ఉత్పత్తులను లాంచ్ చేయనున్నట్టు చెప్పారు. ఇటీవలే హోండా మొట్టమొదటి భాగస్వామి హీరో మోటోకార్ప్‌ను అధిగమించింది. ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-జులై మాసాలలో హీరో మోటార్ కార్పొరేషన్ 24,22,650 యూనిట్లు విక్రయించింది. హోండా మోటార్స్ 19,90,438 యూనిట్లు విక్రయించింది. స్కూటర్ సెగ్మెంట్లో 21,45,491 యూనిట్లు విక్రయించగా, హెచ్ఎంఎస్ఐ 6,72,828 యూనిట్లు విక్రయించింది. టీవీఎస్ మోటార్స్ కార్ల అమ్మకాలు బాగా క్షీణించాయి. ఏప్రిల్-జూలై త్రైమాసికంలో 3,38,723 యూనిట్లు విక్రయించింది. ఏప్రిల్-జూలై నెలలో మొత్తం స్కూటర్ల విక్రయాలు 41,03,644 యూనిట్లుగా నమోదయ్యాయి. -
హీరో మోటో లాభం రూ.914 కోట్లు
జూన్ క్వార్టర్లో గరిష్ట విక్రయాలు కంపెనీ చరిత్రలోనే రికార్డు న్యూఢిల్లీ: ద్విచక్ర వాహన కంపెనీ హీరో మోటోకార్ప్ జూన్ త్రైమాసికంలో మెరుగైన ఫలితాలను ప్రకటించింది. రూ.8,613 కోట్ల ఆదాయంపై రూ.914 కోట్ల లాభాన్ని ఆర్జించింది. అంతకుముందు ఏడాది ఇదే కాలంలో నమోదైన ఫలితాలతో పోల్చి చూస్తే లాభం 3.5 శాతం, ఆదాయం 7.5 శాతం వృద్ధి చెందాయి. జూన్ త్రైమాసికంలో కంపెనీ 18,53,647 వాహనాలను విక్రయించింది. కంపెనీ చరిత్రలో ఓ త్రైమాసికంలో గరిష్ట విక్రయాల రికార్డు ఇది. అంతకుముందు ఏడాది ఇదే కాలంలో విక్రయాలు 17,45,389తో పోలిస్తే 6.2 శాతం ఎక్కువ. జూన్ త్రైమాసికంలో కంపెనీ చరిత్రలోనే గరిష్ట సంఖ్యలో వాహనాలను విక్రయించడం ద్వారా దేశీయ మోటార్‌సైకిల్ మార్కెట్లో తమ స్థానాన్ని మరింత సుస్థిరపరుచుకున్నట్టు హీరోమోటో కార్ప్ చైర్మన్, ఎండీ పవన్‌ముంజాల్ తెలిపారు. మార్కెట్ సెంటిమెంట్ మెరుగుపడడంతోపాటు కంపెనీ వాహన శ్రేణికి డిమాండ్ ఉండడమే ఇందుకు కారణమన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో దేశాలు అనిశ్చిత పరిస్థితులను ఎదుర్కొంటుంటే భారత్‌లో మాత్రం స్థిరమైన ఆర్థిక, రాజకీయ వాతావరణం నెలకొందని వ్యాఖ్యానించారు. ద్విచక్ర వాహన మార్కెట్ లీడర్‌గా తయారీరంగ వృద్ధిలో తమవంతు పాత్ర పోషించేందుకు మరిన్ని పెట్టుబడులు, ఆవిష్కణలపై దృష్టి పెడతామన్నారు. ఈ ఆర్థిక సంవత్సరం కంపెనీకి ఆశాజనకంగా ఉంటుందన్నారు. రానున్న క్వార్టర్లలో పలు ఉత్పత్తులను ఆవిష్కరిస్తామని, దేశీయంగా అగ్రస్థానాన్ని కాపాడుకుంటూనే ప్రపంచ మార్కెట్లలోనూ విస్తరిస్తామని చెప్పారు. -
డిస్కౌంట్ల ఎఫెక్ట్ : హీరో లాభాలు డౌన్
దేశీయ అతిపెద్ద టూ-వీలర్ దిగ్గజం హీరో మోటోకార్ప్ కు బీఎస్-3 వాహనాల డిస్కౌంట్ల దెబ్బ బాగానే కొట్టింది. బుధవారం కంపెనీ వెల్లడించిన నాలుగో క్వార్టర్ ఫలితాల్లో హీరో మోటార్ కార్ప్ నికర లాభాలు 13.9 శాతం పడిపోయి రూ.717.75 కోట్లగా నమోదయ్యాయి. ప్రభుత్వం హఠాత్తుగా తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయంతో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో టూవీలర్స్ కు మందగించిన డిమాండ్, బీఎస్-3 వాహనాలపై నిషేధం విధిస్తూ సుప్రీంకోర్టు ప్రకటించిన తీర్పుతో తీసుకొచ్చిన భారీ డిస్కౌంట్లతో లాభాలకు గండికొట్టినట్టు కంపెనీ ప్రకటించింది. కంపెనీ ముందటి ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో రూ.833.29 కోట్ల నికర లాభాలను ప్రకటించింది. నిర్వహణల నుంచి వచ్చే మొత్తం ఆదాయం కూడా 7.7 శాతం పడిపోయి రూ.7488.08 కోట్లగా రికార్డైనట్టు తెలిపింది. మొత్తం వ్యయాలు కూడా కంపెనీవి 5.3 శాతం పడిపోయాయి. క్వార్టర్ రివ్యూలో కంపెనీ సేల్స్ వాల్యుమ్ 5.8 శాతం క్షీణించింది. కంపెనీ ముందటేడాది క్వార్టర్ లో 17,21,240 టూవీలర్స్ ను విక్రయిస్తే, ఇవి మార్చి క్వార్టర్ లో 16,21,805గానే నమోదయ్యాయి. మొత్తంగా ఈ ఆర్థిక సంవత్సరంలో కంపెనీ 66,64,240 యూనిట్ల విక్రయాలు చేపట్టినట్టు తెలిసింది. ఇవి 2015-16 స్వల్పంగా పెరుగుదల అని హీరో మోటోకార్ప్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో పవన్ ముంజల్ తెలిపారు. 2016-17లో గ్లోబల్ మార్కెట్లో కొన్ని కీలక ఇన్ రోడ్లను ఏర్పాటుచేసుకున్నామని, అర్జెంటీనా, నైజీరియాల్లో తమ వాహనాలను లాంచ్ చేసినట్టు చెప్పారు. బంగ్లాదేశ్ లో 2017-18లో తమ కార్యకలాపాలను ప్రారంభిస్తామని పేర్కొన్నారు. 21018-19లో రూ.2500 కోట్లను కొత్త ప్రొడక్ట్ డెవలప్ మెంట్ కోసం పెట్టుబడులు పెట్టనున్నామని, దానిలో భాగంగా గుజరాత్ లో దశల వారీగా సామర్థ్యం పెంపు, ఆంధ్రప్రదేశ్, బంగ్లాదేశ్ లో అప్ కమింగ్ ప్లాంట్లు ఏర్పాటుచేయబోతున్నట్టు ముంజల్ తెలిపారు. -
రెండో అతిపెద్ద బైక్స్ తయారీ కంపెనీగా హోండా
బజాజ్ వెనక్కి; టాప్‌లో హీరో ముంబై: హోండా మోటర్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (హెచ్ఎంఎస్ఐ) ఏప్రిల్ నెలలో బజాజ్ ఆటోను వెనక్కునెట్టి రెండో అతిపెద్ద బైక్స్ తయారీ కంపెనీగా అవతరించింది. అలాగే టూవీలర్ మార్కెట్ లీడర్‌గా కొనసాగుతున్న హీరో మోటొకార్ప్‌కు కూడా సవాల్ విసురుతోంది. ‘తొలిసారిగా రెండో అతిపెద్ద మోటార్‌సైకిల్ కంపెనీగా అవతరించాం. చాలా ఆనందంగా ఉంది. కంపెనీ బైక్స్ అమ్మకాలు 22% వృద్ధితో 1,83,266 యూనిట్లకు ఎగశాయి’ అని హెచ్ఎంఎస్ఐ సీనియర్ వైస్‌ప్రెసిడెంట్ (సేల్స్ అండ్ మార్కెటింగ్) వై.యస్.గులెరియా తెలిపారు. కాగా బజాజ్ దేశీ విక్రయాలు ఏప్రిల్ నెలలో 19% క్షీణతతో 1,61,930 యూనిట్లకు తగ్గాయి. దీంతో హోండా కంపెనీకి బజాజ్ ఆటోకి మధ్య బైక్స్ విక్రయాల అంతరం 21,336 యూనిట్లుగా నమోదయ్యింది. ఇదేసమయంలో మొత్తం విక్రయాల పరంగా చూస్తే హీరోకి , హోండాకి మధ్య అంతరం 12,377 యూనిట్లుగా ఉంది. ఏప్రిల్‌లో హోండా మొత్తం వాహన విక్రయాలు 34% వృద్ధితో 5,78,929 యూనిట్లకు ఎగిస్తే.. హీరో మొత్తం వాహన అమ్మకాలు మాత్రం 3.5% క్షీణతతో 5,91,306 యూనిట్లకు తగ్గాయి. -
హీరో బైక్స్ ధరలు పెరిగాయ్
న్యూఢిల్లీ: దేశీయ అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ బైక్‌ల ధరలను పెంచేసింది. సంస్థకు చెందిన వివిధ మోడళ్ల ద్విచక్ర వాహనాల ధరలను రూ .500 నుంచి రూ .2,200 వరకు పెంచుతున్నట్టు ప్రకటించింది. ఉత్పత్తి ఖర్చలు పెరిగిన కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు హీరో మోటోకార్ప్ ఒక ప్రకటనలో పేర్కొంది. పెంచిన ధరలు మే 1వ తేదీనుంచి అమలవుతాయని తెలిపింది. ఎంట్రీ లెవల్ మోడల్స్ దగ్గర్నుంచి, హై ఎండ్ మోడల్ వాహనాలపై ఈ భారం పడనుంది. వివిధ బైకుల ధరలు రూ .500 నుంచి రూ .2,200 వరకు పెరగనున్నాయి ముఖ్యంగా ఎంట్రీ లెవల్ మోడల్ హెచ్ఎఫ్ డాన్ నుంచి టాప్ ఎండ్ మోడల్ కరిష్మా జెడ్‌ఎంఆర్ మోడల్స్ పాపులర్. వీటి ధరలు రూ.40వేల నుంచి లక్షరూపాయలకు వున్నాయి. రాబోయే పెళ్లిళ్ల సీజన్ నేపథ్యంలో దేశంలో టూవీలర్స్ ధరలను పెంచేందుకు కంపెనీ నిర్ణయించింది. అలాగే మే నెలలో బలమైన రిటైల్ అమ్మకాలు కొనసాగించాలని కంపెనీ భావిస్తోందని తెలిపింది. కాగా గతనెలలో అమ్మకాలు బాగా క్షీణించి 5,91306 యూనిట్లను విక్రయించింది. గత ఏడాది ఇదే నెల అమ్మకాలు 6,12,739 యూనిట్లతో పోలిస్తే 3.49శాతం తక్కువ. -
బోణీ అదిరింది
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి నెలలో (ఏప్రిల్) వాహన విక్రయాలు జోరందుకున్నాయి. మారుతీ సుజుకీ,, టయోట, హోండా, నిస్సాన్ ఇండియా కంపెనీలు అమ్మకాల్లో రెండంకెల వృద్ధిని సాధించాయి. మారుతీ రికార్డ్ స్థాయిలో అమ్మకాలు సాధించింది. అంతేకాకుండా ఈ కం పెనీ మినీ, యుటిలిటి ఇలా ప్రతి సెగ్మెంట్ రెండంకెల వృద్ధిని సాధించింది. టాటా మోటార్స్ దేశీ విక్రయాలు 21% క్షీణించాయి. అయితే ప్రయాణికుల వాహన విక్రయాలు 23% వృద్ధి చెందాయి. హీరో వాహన ధరలు పెరిగాయ్.. న్యూఢిల్లీ: దేశీ అతిపెద్ద ద్విచక్ర వాహన కంపెనీ ‘హీరో మోటొకార్ప్’ తాజాగా తన వాహన ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. ధరల పెంపు రూ.500–రూ.2,200 శ్రేణిలో ఉంటుందని కంపెనీ పేర్కొంది. ఉత్పత్తి వ్యయాలు పెరుగుదల నేపథ్యంలో ధరలు పెంచుతున్నామని, ఈ తాజా నిర్ణయం మే 1 నుంచి అమల్లోకి వచ్చిందని తెలిపింది. బీఎస్3 దెబ్బ రూ.600 కోట్లు: భారత్ స్టేజ్(బీఎస్)–3 వాహన విక్రయాలపై నిషేధం వల్ల టూవీలర్ కంపెనీలపై రూ.600 కోట్ల భారం పడిందని రేటింగ్ కంపెనీ ఇక్రా తెలిపింది. ఏప్రిల్ 1 నుంచి బీఎస్3 వాహన విక్రయాలు, రిజిస్ట్రేషన్లపై సుప్రీం కోర్ట్ నిషేధం విధించింది. 8 లక్షల బీఎస్3 వాహనాలు ఉండగా, వీటిల్లో 6.71 లక్షలు టూవీలర్లు. వీటి విక్రయానికి మార్చి చివరి 3 రోజుల్లో కంపెనీలు భారీ డిస్కౌంట్లిచ్చాయి. -
టూ-వీలర్స్‌కు డిసెంబర్‌లోనూ బ్రేకులు
పెద్ద నోట్ల రద్దయి దాదాపు రెండు నెలలు గడిచినా టూ-వీలర్ విక్రయాలు మాత్రం కోలుకోవడం లేదు. నగదుతో ముడిపడి ఉన్న గ్రామీణ ప్రాంత మార్కెట్ నుంచి వీటికి డిమాండ్ భారీగా పడిపోయింది. దీంతో మోటార్ సైకిల్స్ దిగ్గజాలు హీరో మోటోకార్పొ, బజాజ్ ఆటో, టీవీఎస్ మోటారో కో కంపెనీలకు డిసెంబర్ నెలలో కూడా విక్రయాలు మందగించాయి. దేశీయ దిగ్గజ టూ-వీలర్ తయారీదారి హీరో మోటోకార్పొ లిమిటెడ్ 2016 డిసెంబర్ నెల విక్రయాలు 33.91 శాతం పడిపోయి, 3,30,202 యూనిట్లగా నమోదైనట్టు తెలిసింది. గతేడాది ఈ కంపెనీ విక్రయాలు 4,99,665 యూనిట్లగా ఉన్నాయి. హీరో మోటోకార్పొ ప్రత్యర్థి బజాజ్ ఆటోకు సైతం దేశీయ బైక్ అమ్మకాలు 11 శాతం క్షీణించి, 1,06,665 యూనిట్లగా నమోదయ్యాయి. వీటితో పాటు చెన్నైకు చెందిన టీవీఎస్ మోటార్ టూ-వీలర్ విక్రయాలు కూడా దేశీయంగా 8.76 శాతం పడిపోయినట్టు ఆ కంపెనీ పేర్కొంది. డిసెంబర్ నెల సమీక్షలో తమ విక్రయాలు 1,53,413 యూనిట్లగా రికార్డు అయినట్టు టీవీఎస్ మోటార్ కంపెనీ చెప్పింది. ప్రధానంగా పెద్ద నోట్ల రద్దు ప్రభావంతోనే ఆటోమొబైల్ విక్రయాలు పతనమయ్యాయని, ఈ సమయంలో వాహన కొనుగోళ్లకు గ్రామీణ ప్రాంతాల్లో సెంటిమెంట్ దెబ్బతిన్నిందని ఆటో పరిశ్రమ నిపుణుడు అబ్దుల్ మజీద్ తెలిపారు. గ్రామీణ మార్కెట్ నుంచి 50 శాతం మోటార్ సైకిల్ విక్రయాలు నమోదైతాయని పరిశ్రమ అంచనావేస్తోంది. ఆటోమొబైల్ తయారీదారుల సంఘం సియామ్ సైతం నవంబర్‌లో టూవీలర్ అమ్మకాలు గతేడాది కంటే పడిపోయినట్టు చెప్పింది. గతేడాది డిసెంబర్ నెలలో 13,20,552 యూనిట్లగా ఉన్న టూ-వీలర్ విక్రయాలు ఈ ఏడాది డిసెంబర్లో 12,43,251 యూనిట్లగా ఉన్నట్టు పేర్కొంది. నోట్ల రద్దుపై ప్రకటన వచ్చిన అనంతరం నవంబర్ నెలలో విక్రయాలు పడిపోయిన సంగతి తెలిసిందే. నోట్ల రద్దు ప్రభావం ఆటో పరిశ్రమపై భారీగానే ఎఫెక్ట్ చూపింది. ఈ దెబ్బనుంచి కోలుకోవడానికి ఇంకా రెండు లేదా మూడు నెలలు పట్టే అవకాశముందని టూ-వీలర్ పరిశ్రమ భావిస్తోంది. -
దూసుకుపోయిన 'హీరో'
న్యూఢిల్లీ : టూవీలర్ దిగ్గజం హీరో మోటార్ కార్పొ, స్ట్రీట్ అంచనాలను అధిగమించి రయ్‌మని దూసుకుపోయింది. బుధవారం వెలువరిచిన రెండో క్వార్టర్ ఫలితాల్లో పన్నుల అనంతరం లాభాల్లో 28 శాతం వృద్ధి సాధించి, రూ.1,004 కోట్ల లాభాలను నమోదుచేసింది. గతేడాది ఇదే క్వార్టర్లో ఈ లాభాలు రూ.772 కోట్లగా ఉన్నాయి. మార్కెట్ విశ్లేషకుల అంచనాల ప్రకారం హీరో మోటార్ కార్పొ ఈ క్వార్టర్లో కేవలం రూ.926 కోట్ల లాభాలను మాత్రమే రికార్డు చేస్తుందని తెలిసింది. కానీ అంచనాలు మించి హీరో మోటార్ కార్పొ దూసుకుపోయింది. అన్ని త్రైమాసిక ఫలితాల్లో కెల్లా ఇవే అత్యంత ఉత్తమమైన క్వార్టర్లీ ఫలితాలుగా హీరో మోటార్ కార్పొకు నిలిచాయి. ఈ త్రైమాసికంలో హీరో మోటార్ కార్పొ రికార్డు స్థాయిల్లో 18,23,498 మోటార్ సైకిల్స్ విక్రయాలను చేపట్టినట్టు ప్రకటించింది. ఇవి గతేడాది కంటే 15.8 శాతం వృద్ధి అని కంపెనీ వెల్లడించింది. కాగ, కంపెనీ రూ.1000కోట్లకు పైగా క్వార్టర్లీ లాభాలను నమోదుచేయడం ఇదే మొదటిసారని హీరో మోటార్ కార్పొ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ పవన్ ముంజల్ తెలిపారు. గతేడాది ఇదే క్వార్టర్లో రూ.7,386 కోట్లగా ఉన్న కంపెనీ రెవెన్యూలు, ఈ త్రైమాసికంలో 15 శాతం ఎగిసి, రూ.8,449 కోట్లగా నమోదయ్యాయి. -
హీరో కొత్త ‘అచీవర్ 150’
• ప్రారంభ ధర రూ.61,800 • ప్రీమియం విభాగంపై దృష్టి గుర్గావ్: దేశీ దిగ్గజ టూవీలర్ల తయారీ కంపెనీ ‘హీరో మోటోకార్ప్’ తాజాగా తన ప్రీమియం బైక్ ‘అచీవర్ 150’లో అప్డేట్ వెర్షన్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. ఈ కొత్త బైక్.. డ్రమ్ బ్రేక్స్, డిస్క్ బ్రేక్స్ అనే రెండు ఆప్షన్లలో వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది. డ్రమ్ బ్రేక్స్ వేరియంట్ ధర రూ.61,800గా, డిస్క్ బ్రేక్స్ వేరియంట్ ధర రూ.62,800గా ఉంది. అన్ని ధరలు ఎక్స్‌షోరూమ్ ఢిల్లీవి. 100 సీసీ, 125 సీసీ విభాగాల్లో అగ్రస్థానంలో కొనసాగుతోన్న హీరో ఈ కొత్త బైక్ ద్వారా ప్రీమియం విభాగంలోనూ తన సత్తా చాటాలని భావిస్తోంది. కాగా కొత్త ‘అచీవర్ 150’ బైక్‌లో బీఎస్-4 నియంత్రణలకు అనువైన ఐ3ఎస్ టెక్నాలజీతో కూడిన ఇంజిన్‌ను పొందుపరిచామని కంపెనీ పేర్కొంది. -
‘హీరో’ మైండ్ మారిందా?
♦ రిజిస్ట్రేషన్ చేసుకోమంటూ ఏపీ సర్కారు లేఖ ♦ అయినా ముందుకొచ్చి భూమి తీసుకోని హీరో ♦ ఒప్పందం జరిగి రెండేళ్లయినా ఎక్కడి గొంగడి అక్కడే ♦ వివాదంలో ఉన్న భూమి ఇవ్వడమే కారణమా!! సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో తొలిసారిగా వస్తుందనుకున్న భారీ ఆటోమొబైల్ ప్రాజెక్టు చుట్టూ నీలినీడలు కమ్ముకుంటున్నాయి. దేశీయ అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీ కంపెనీ హీరో మోటోకార్ప్... ఏపీలో పెడతామన్న భారీ ప్లాంట్‌పై ఆశలు అడుగంటుతున్నాయి. ఉచితంగా భూమి ఇచ్చి... దాన్ని రిజిస్ట్రేషన్ చేసుకోమని రాష్ట్ర ప్రభుత్వం కంపెనీకి లేఖలు రాస్తున్నా... కంపెనీ నుంచి స్పందన లేకపోవడంతో ఈ అనుమానాలకు బలం చేకూరుతోంది. చిత్తూరు జిల్లాలో శ్రీ సిటీకి ఆనుకొని ఉన్న స్థలంలో హీరో మోటోకార్ప్‌కు 600 ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించింది. ఈ భూ కేటాయింపునకు సంబంధించి అన్ని అనుమతులూ పూర్తి చేసి రిజిస్ట్రేషన్ చేసుకోమని లేఖ రాసి నెల రోజులు దాటినా కంపెనీ ముందుకు రావడం లేదని ఈ వ్యవహారంతో నేరుగా సంబంధం ఉన్న ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’కి చెప్పారు. ప్రస్తుతం గుజరాత్లో నిర్మాణంలో ఉన్న 5వ ప్లాంట్ పూర్తయితే తప్ప ఈ ప్లాంట్ గురించి ఆలోచించకపోవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. పునరాలోచనలో కంపెనీ..!! ఏపీ ప్రభుత్వ వైఖరితో యూనిట్ ఏర్పాటు గురించి కంపెనీ పునరాలోచనలో పడినట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. ఎందుకంటే ప్రాజెక్టులను ఆకర్షించడానికి అనేక హామీలు గుప్పించిన రాష్ట్ర ప్రభుత్వం తీరా ఒప్పందం కుదుర్చుకున్నాక వ్యవహరిస్తున్న విధానంపై కంపెనీ వర్గాలు గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. ఉచితంగా భూమి ఇస్తామని చెప్పి కోర్టు వివాదాల్లో ఉన్న భూమిని కట్టబెట్టడంపై కంపెనీ విస్తుపోయింది. హీరో కంపెనీకి ఇచ్చిన స్థలం తమదంటూ చెన్నైకి చెందిన కంపెనీ కోర్టు మెట్లు ఎక్కింది. దీంతో హీరో సంస్థ రాష్ట్రంలో ప్రాజెక్టు ఆలోచనలను పక్కకు పెట్టి గుజరాత్‌లోని యూనిట్ నిర్మాణంపై పూర్తి స్థాయిలో దృష్టి సారించినట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయమై మాట్లాడటానికి హీరో మోటోకార్ప్ అధికారులు నిరాకరించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ యూనిట్ గురించి ఎటువంటి వివరాలు చెప్పలేమని తమను సంప్రతించిన ‘సాక్షి’ ప్రతినిధితో చెప్పారు. దీనికి తోడు ద్విచక్ర వాహన అమ్మకాల్లో తీవ్ర ఒత్తిడి ఉండటం కూడా కంపెనీ పునరాలోచనకు కారణం కావచ్చని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తు తం కంపెనీ వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 81 లక్షల యూనిట్లు ఉండగా, అమ్మకాలు 66 లక్షలు మాత్రమే ఉన్నాయి. దీనికి తోడు స్కూటర్ మార్కెట్ నుంచి వస్తున్న తీవ్ర పోటీ మోటార్ సైకిళ్ల అమ్మకాలపై ప్రభావం చూపిస్తోంది. ప్రస్తుత యువత స్కూటర్ల వైపే మొగ్గు చూపుతుండటమే దీనికి కారణం. దీనితో భవిష్యత్తు విస్తరణ కార్యక్రమాలను పునస్సమీక్షించాలని కంపెనీ ఆలోచనగా ఉన్నట్లు మార్కెట్ వర్గాలు చెపుతున్నాయి. ఒప్పందం కుదిరి రెండేళ్లు హీరో మోటార్స్ దక్షిణాదిలో యూనిట్ పెడతామని ప్రకటించినప్పటి నుంచి ఆ ప్రాజెక్టును చేజిక్కించుకోవడానికి దక్షిణాది రాష్ట్రాలు తీవ్రంగా పోటీపడ్డాయి. అనేక రాయితీలతో పాటు భూమి కూడా ఉచితంగా ఇవ్వడానికి రాష్ట్రం ముందుకు రావడంతో ఇక్కడే యూనిట్ నెలకొల్పడానికి కంపెనీ అంగీకరించింది. ఈ మేరకు సెప్టెంబర్, 2014లో హీరో మోటార్స్ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదర్చుకుంది. రూ.1,600 కోట్ల పెట్టుబడితో మొత్తం మూడు దశల్లో 18 లక్షల యూనిట్ల ఉత్పత్తి సామర్థ్యం గల యూనిట్‌ను నెలకొల్పనున్నట్లు చెప్పింది. దీంతో హీరో మోటోకార్ప్ పూర్తి ఉత్పత్తి సామర్థ్యం 1.2 కోట్ల యూనిట్లకు చేరుతుంది. ప్రస్తుతం కంపెనీకి దేశ వ్యాప్తంగా నాలుగు యూనిట్లుండగా మొత్తం ఉత్పత్తి సామర్థ్యం 81 లక్షలుగా ఉంది. ఇప్పుడు గుజరాత్లో ఐదవ యూనిట్ నిర్మాణంలో ఉంది. ఈ యూనిట్ తొలి దశ వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి అందుబాటులోకి వస్తుందని కంపెనీ అంచనా వేస్తోంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఆరవ యూనిట్ ఆంధ్రప్రదేశ్‌ది అవుతుంది. ఇదీ ఒప్పందం... ⇒ సెప్టెంబర్ 2014లోనాటి ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం.. ⇒ రూ.1,600 కోట్ల పెట్టుబడితో 18 లక్షల యూనిట్ల ఉత్పత్తి సామర్థ్యం ⇒ మూడు దశల్లో డిసెంబర్, 2023 నాటికి పూర్తి చేయాలన్న లక్ష్యం ⇒ డిసెంబర్ 2018 నాటికి తొలి దశలో 5 లక్షల యూనిట్ల ఉత్పత్తి -
హీరో పగ్గాలుమళ్లీ పవన్ ముంజాల్కే
న్యూఢిల్లీ: దేశీ టూవీలర్ దిగ్గజ కంపెనీ ‘హీరో మోటోకార్ప్’ చైర్మన్ అండ్ మేనేజింగ్ డెరైక్టర్ (సీఎండీ), సీఈవోగా మళ్లీ పవన్ ముంజాల్ నియమితులయ్యారు. ఈయన ఐదేళ్లపాటు పదవిలో కొనసాగుతారు. మామూలుగా పవన్ ముంజాల్ పదవీ కాలం ఈ సెప్టెంబర్ 30తో ముగుస్తుంది. కంపెనీ ఈయన పదవీ కాలాన్ని మరో ఐదేళ్లు పొడిగించింది. అలాగే విక్రమ్ కాస్బెకర్కు డెరైక్టర్ల బోర్డులో చోటు కల్పించింది. -
దూసుకెళ్లిన హీరో మోటో కార్ప్
ముంబై: భారతదేశ అతిపెద్ద మోటార్ సైకిళ్ల తయారీ దారు హీరో మోటోకార్ప్ నికర లాభాల్లో దూసుకుపోయింది. సోమవారం వెల్లడించిన ఆర్థిక ఫలితాల్లో విశ్లేషకుల అంచనాలను అధిగమించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో 18.1 శాతం ఎగబాకి రూ.883 కోట్ల రూపాయల నికరలాభాన్ని నమోదు చేసింది. జూన్ క్వార్టర్ లో ఆదాయంలో 7.7 శాతం వృద్ధితో రూ.8,011కోట్ల రూపాయలను ఆర్జించింది. ఆపరేటింగ్ మార్జిన్ (ఈబీఐటీడీఏ ) 15.35 శాతంగా నమోదైంది. గత ఏడాది ఇదే క్వార్టర్ లో ఇది 14 శాతంగా ఉంది.అయితే రూ. 843కోట్ల నికర లాభాలు, విక్రయాల్లో రూ.7,658కోట్ల ఆదాయాన్ని ఎనలిస్టులు అంచనావేశారు. క్యూ 1 ఫలితాలతో వెల్లడితో మార్కెట్ లో షేరు మెరుపులు మెరిపించింది. 2 శాతానికిపైగా లాభపడి 52 వారాల గరిష్టాన్ని తాకింది హీరోమోటోకార్ప్ ద్విచక్ర వాహన విక్రయాల్లో 6 శాతానికి పైగా వృద్ధితో నికర లాభాల్లో అగ్రభాగాన్ని సాధించింది. విక్రయించిన ద్విచక్రవాహనాల యూనిట్ల మొత్తం సంఖ్య 17,45,389కు చేరింది గత ఏడాది ఇదే త్రైమాసికంలో 16,45,240 గా నమోదైంది. కాగా స్తబ్దుగా ఉన్న దేశీయ ద్విచక్రవాహనాల మార్కెట్ దేశంలో గతకొంతకాలంగా పుంజుకుందని, ఇది హీరో కంపెనీ బాగా కలిసి వచ్చిందని మార్కెట్ వర్గాల అంచనా. రానున్న కాలంలో సాధారణ వర్షపాతం కారణంగా గ్రామీణుల ఆదాయం పెరగనుందనీ, తత్ఫలితంగా ద్విచక్రవాహనాలు అమ్మకాలు కూడా జోరందుకోనున్నాయని ఎనలిస్టులు భావిస్తున్నారు. అలాగే 7వ వేతన సంఘం సిఫారసులతో గణనీయంగా పెరిగిన ప్రభుత్వ ఉద్యోగుల జీతాల ప్రభావం దేశీయ టూ వీలర్స్ అమ్మకాలపై సానుకూలంగా పడనుందని పేర్కొన్నారు. -
హీరో యాజమాన్యంలో మార్పులు!
• హీరో మోటోకార్ప్ నుంచి తప్పుకుంటున్న సునిల్ ముంజాల్ • ఆగస్టు 16 నుంచీ గ్రూప్ ఇతర సంస్థల బాధ్యతలు • గ్రూప్ వ్యవస్థాపకులు బ్రిజ్మోహన్లాన్ మృతి నేపథ్యం న్యూఢిల్లీ : యాజమాన్య పంపిణీలో భాగంగా ఐదు బిలియన్ డాలర్ల హీరో గ్రూప్ ప్రధాన కంపెనీ హీరో మోటోకార్ప్ నుంచి సునిల్ ముంజల్ తప్పుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన కంపెనీ జాయింట్ మేనేజింగ్ డెరైక్టర్ వ్యవరిస్తున్నారు. ఆయన పెద్ద సోదరుడు పవన్ ముంజాల్ చీఫ్‌గా ఉన్నారు. ఇతర వ్యాపార అవకాశాలతోపాటు గ్రూప్‌లోని ఇతర కంపెనీపై ఆయన ఇకపై దృష్టి సారించనున్నారు. ఎంఎంల్ ముంజాల్ కుటుంబం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. గత ఏడాది నవంబర్‌లో హీరో గ్రూప్ వ్యవస్థాపకులు డాక్టర్ బ్రిజ్మోహన్ లాన్ ముంజాల్ మృతి నేపథ్యంలో తాజా యాజమాన్య మార్పులు చోటుచేసుకుంటుండడం గమనార్హం. సంస్థ జాయింట్ మేనేజింగ్ డెరైక్టర్‌గా సునిల్ పదవీ బాధ్యతల కాలం ఆగస్టు 16తో ముగుస్తుంది. అటు తర్వాత ఆయన హీరో కార్పొరేట్ సర్వీస్, ఇతర అనుబంధ కంపెనీలకు చైర్మన్‌గా కొనసాగుతారు. కొత్త వ్యాపార అవకాశాలపై సైతం ఆయన దృష్టి సారిస్తారు. తాజా పరిణామంలో భాగంగా హీరో గ్రూప్‌లో ప్రమోట ర్ వాటాలో ఎటువంటి మార్పూ వుండదని కంపెనీ స్టాక్ ఎక్స్ఛేంజీలకు తెలిపింది. సాన్నిహిత్యంపై ప్రభావం ఉండదు... కాగా ఇది వ్యాపార విభజన, విస్తరణ భాగమేనని, కుటుంబం సాన్నిహిత్యం, ఐక్యతపై ఈ ప్రభావం ఏదీ ఉండబోదని సునిల్ ముంజాల్ తెలిపారు. పవన్ ముంజాల్ కూడా ఇదే విధమైన వ్యాఖ్యలు చేశారు. ముంజాల్ సోదరులు నలుగురిలో సునిల్ చిన్నవారు. కాగా ఎన్ఎస్ఈలో హీరోమోటో కంపెనీ షేర్ ధర గురువారం క్రితం ముగింపు కన్నా స్వల్పంగా 0.39 శాతం (రూ.12.65) తగ్గి రూ. 3,192 వద్ద ముగిసింది. -
హీరో స్ల్పెండర్లో కొత్త వేరియంట్
♦ ఐస్మార్ట్ 110 ః రూ.53,300 ♦ కంపెనీ సొంతంగా డిజైన్ చేసి, ♦ డెవలప్ చేసిన తొలి బైక్ న్యూఢిల్లీ: టూవీలర్ దిగ్గజం హీరో మోటోకార్ప్ కంపెనీ తొలిసారిగా సొంతంగా డిజైన్ చేసి, అభివృద్ధి చేసిన స్ప్లెండర్ కొత్త వేరియంట్‌ను గురువారం మార్కెట్లోకి తెచ్చింది. స్ప్లెండర్ ఐస్మార్ట్ 110 పేరుతో అందిస్తున్న ఈ బైక్ ధర రూ.53,300(ఎక్స్ షోరూమ్, ఢిల్లీ) గా నిర్ణయించామని హీరో మోటొకార్ప్ తెలిపింది. జైపూర్‌లో ఉన్న సెంటర్ ఆఫ్ ఇన్నోవేషన్‌లో ఈ బైక్ డిజైనింగ్, అభివృద్ధి జరిగిందని హీరో మోటోకార్ప్ చైర్మన్, ఎండీ, సీఈఓ పవన్ ముంజాల్ చెప్పారు. పూర్తిగా కొత్త చాసిస్, ఫ్రేమ్, కొత్త బ్రాండ్ ఇంజిన్‌తో ఈ బైక్‌ను రూపొందించామని పేర్కొన్నారు. గతంలో తమ భాగస్వామి హోండాకు చెందిన ఎలాంటి సాంకేతిక అంశాన్ని ఈ బైక్ తయారీలో ఉపయోగించుకోలేదని పేర్కొన్నారు. బీఎస్ఫోర్ ఇంజిన్.. భారత్ స్టేజ్ ఫోర్ పర్యావరణ నియమనిబంధనలకనుగుణంగా తయారైన కొత్త ఇంజిన్‌తో ఈ కొత్త బైక్‌ను రూపొందించామని ముంజాల్ తెలిపారు. ఈ సెగ్మెంట్ బైక్‌ల్లో ఈ ప్రత్యేకత ఉన్న బైక్ ఇదొక్కటేనని పేర్కొన్నారు. ఈ బైక్ పాత స్ప్లెండర్ కంటే 9 శాతం ఎక్కువ పవర్‌ను, 12 శాతం అధిక టార్క్‌ను ఇస్తుందని వివరించారు. 60 కిమీ. వేగాన్ని 7.45 సెకన్లలోనే అందుకునే ఈ బైక్ గరిష్ట వేగం గంటకు 87కిమీ. అని తెలిపారు. ఈ బైక్‌లో 110 సీసీ ఎయిర్ కూల్డ్ సింగిల్ సిలిండర్ ఇంజిన్, 4 గేర్లు, కొత్త అలాయ్ వీల్స్, ట్యూబ్‌లెస్ టైర్లు వంటి ప్రత్యేకతలున్నాయని పేర్కొన్నారు. ఐత్రిఎస్(ఐడిల్ స్టార్ట్ అండ్ స్టాప్ సిస్టమ్-ఇంజిన్ న్యూట్రల్‌కు వచ్చి పది సెకన్లు పూర్తికాగానే ఇంజిన్ ఆటోమేటిక్‌గా ఆగిపోతుంది. క్లచ్ లాగితే మళ్లీ ఇంజిన్ స్టార్ట్ అవుతుంది) టెక్నాలజీతో బైక్‌ను రూపొందించామని ముంజాల్ తెలిపారు. మైలేజీ లీటర్‌కు 75-80 కిమీ. వస్తుందని కంపెనీ అంచనా వేస్తోంది. -
బ్రిజ్‌మోహన్‌లాల్ ముంజాల్ మృతి తీరని లోటు
వ్యాపార వర్గాల నివాళి న్యూఢిల్లీ: హీరో మోటొకార్ప్ వ్యవస్థాపకులు బ్రిజ్మోహన్ లాల్ ముంజాల్ మృతి పరిశ్రమకు తీరని లోటని భారత వ్యాపార, వాణిథ జ్య వర్గాలు సంతాపం వ్యక్తం చేశాయి. 92 ఏళ్ల ముంజాల్ ఆదివారం సాయంత్రం మరణించారు. హీరో మోటో వ్యవస్థాపకులు బ్రిజ్మోహన్ లాల్ ముంజాల్ గొప్ప గొప్ప సంస్థలను నిర్మించిన గొప్పవ్యక్తని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ నివాళులర్పించారు. ముంజాల్ నాణ్యతకు, ప్రమాణాలకు కట్టుబడి ఉన్నారని వాణిజ్యం, పరిశ్ర మల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తన సంతాప సందేశంలో పేర్కొన్నారు. భారత పారిశ్రామిక రంగానికి సంబంధించిన అత్యంత ప్రముఖులైన వ్యక్తుల్లో ఆయన ఒకరని సీఐఐ ప్రెసిడెంట్ సుమీత్ మజుందార్ చెప్పారు. అంతర్జాతీయంగా భారత వాహన రంగానికి ఎనలేని ఖ్యాతిని ముంజాల్ ఆర్జించిపెట్టారని సియామ్ ప్రెసిడెంట్ వినోద్ దాసరి చెప్పారు. ప్రస్తుత పాకిస్తాన్‌లోని కమాలియాలో 1923లో ముంజాల్ జన్మిం చారు. ముంజాల్ సోదరులు లూధియానాలో సైకిల్ విడిభాగాలు తయారు చేసే చిన్న వ్యాపారాన్ని ప్రారంభించారు. భారత్‌లో అతిపెద్ద వ్యాపార గ్రూప్‌గా హీరో మోటోకార్ప్ అవతరించడంలో ముంజాల్ ఇతోధికంగా కృషి చేశారు. 2005లో ఆయనకు పద్మ భూషణ్ అవార్డు లభించింది.