ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం హీరో మోటోకార్ప్ ఎలక్ట్రిక్ వెహికల్స్‌పై దృష్టి సారించింది. కొనుగోలు దారులకు అభిరుచికి అనుగుణంగా ఈవీ వెహికల్స్‌ను తయారు చేయనుంది. ఇందుకోసం అమెరికాకు చెందిన జీరో మోటార్ సైకిల్స్‌తో జత కలిసింది. ఆ సంస్థలో రూ.490కోట్లు పెట్టుబడులు పెడుతున్నట్లు హీరో మోటోకార్ప్ తెలిపింది.
తద్వారా హీరో మోటోకార్ప్, జీరో మోటార్‌లు సంయుక్తంగా ఈవీ వెహికల్స్‌ను విడుదల చేయనున్నాయి. ప్రపంచంలోనే లార్జెస్ట్ టూవీలర్ తయారీ సంస్థగా పేరొందిన జీరో మోటార్స్ వెహిలక్స్, పవర్ ట్రైన్‌లను తయారు చేస్తుంది.
తొలి బైక్ విడుదల
మరోవైపు హీరో మోటోకార్ప్ మొబిలిటీ బ్రాండ్ విడా భాగస్వామ్యంతో అక్టోబర్ 7 తొలి ఎలక్ట్రిక్ బైక్‌ను విడుదల చేయనుంది. ఎలక్ట్రిక్ టూ వీలర్ కంపెనీ ఏథర్ ఎనర్జీలో 35 శాతానికి పైగా వాటా ఉన్న హీరో మోటాకార్ప్.. తాజాగా జీరో మోటార్స్‌లో పెట్టుబడులు పెడుతున్నట్లు ప్రకటించింది. ఆ ప్రకటనతో ఇన్వెస‍్టర్లు అప్రమత్తమయ్యారు. దీంతో గురువారం బీఎస్‌ఈలో కంపెనీ షేర్లు 2.11 శాతం తగ్గి రూ.2,534.20 వద్ద ముగిశాయి.
Comments
Please login to add a commentAdd a comment