Motorcycles
-
అర్థం కాని.. అత్యద్భుతమైన మోటార్‌సైకిల్స్ (ఫోటోలు)
-
విదేశాల్లో మేడిన్ ఇండియా టూవీలర్ల జోరు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశీయంగా తయారైన ద్విచక్ర వాహనాల ఎగుమతులు ఈ ఏడాది ఏప్రిల్–జూలైలో 12.48 లక్షల యూనిట్లు నమోదయ్యాయి. అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 14 శాతం వృద్ధి నమోదు కావడం విశేషం. దేశీయంగా అమ్మకాలు తగ్గుతున్న నేపథ్యంలో తయారీ కంపెనీలకు కాస్త ఊరట కలిగించే విషయం. అలాగే టూవీలర్ల తయారీ విషయంలో భారత్ అనుసరిస్తున్న నాణ్యత, భద్రత ప్రమాణాలకు ఈ గణాంకాలు నిదర్శనం. 2024 జూలైతో ముగిసిన నాలుగు నెలల్లో మోటార్‌సైకిళ్లు 13 శాతం వృద్ధితో 10,40,226 యూనిట్లు వివిధ దేశాలకు సరఫరా అయ్యాయి. మొత్తం ఎగుమతుల్లో వీటి వాటా ఏకంగా 83 శాతానికి ఎగసింది. స్కూటర్ల ఎగుమతులు 21 శాతం అధికమై 2,06,006 యూనిట్లుగా ఉంది. టూవీలర్స్ ఎగుమతుల్లో బజాజ్ ఆటో, టీవీఎస్ మోటార్ కో, హోండా మోటార్‌సైకిల్స్ అండ్ స్కూటర్స్ ఇండియా, ఇండియా యమహా మోటార్, హీరో మోటోకార్ప్, సుజుకీ మోటార్‌సైకిల్ ఇండియా టాప్‌లో కొనసాగుతున్నాయి. అగ్రస్థానంలో బజాజ్.. ద్విచక్ర వాహనాల ఎగుమతుల్లో బజాజ్ ఆటో అగ్రస్థానంలో నిలిచింది. ఈ కంపెనీ 5 శాతం వృద్ధితో ఏప్రిల్–జూలైలో 4,97,114 యూనిట్లు నమోదు చేసింది. ఇందులో 4,97,112 యూనిట్లు మోటార్‌సైకిళ్లు ఉండడం గమనార్హం. టీవీఎస్ మోటార్ కో 14 శాతం వృద్ధితో 3,13,453 యూనిట్లతో రెండవ స్థానంలో కొనసాగుతోంది. హోండా మోటార్స్ అండ్ స్కూటర్స్ 76 శాతం దూసుకెళ్లి 1,82,542 యూనిట్లు, ఇండియా యమహా మోటార్ 28 శాతం అధికమై 79,082 యూనిట్లు, హీరో మోటోకార్ప్ 33 శాతం ఎగసి 73,731 యూనిట్లను విదేశాలకు సరఫరా చేశాయి. సుజుకీ మోటార్‌సైకిల్ ఇండియా 30 శాతం క్షీణించి 64,103 యూనిట్లు, రాయల్ ఎన్ఫీల్డ్ 2 శాతం వృద్ధితో 28,278 యూనిట్లు, పియాజియో వెహికిల్స్ 56 శాతం దూసుకెళ్లి 9,673 యూనిట్ల ఎగుమతులను సాధించాయి. బైక్స్‌లో బజాజ్ ఆటో, టీవీఎస్ మోటార్ కో, హోండా, స్కూటర్స్‌లో హోండా, టీవీఎస్ మోటార్, ఇండియా యమహా మొదటి మూడు స్థానాల్లో నిలిచాయి. -
ఓలా ఈ–బైక్స్ వచ్చేశాయ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎలక్ట్రిక్ స్కూటర్ల తయారీలో ఉన్న ఓలా ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్స్ విభాగంలోకి ప్రవేశించింది. రోడ్‌స్టర్, రోడ్‌స్టర్ ఎక్స్, రోడ్‌స్టర్ ప్రో వేరియంట్లను ప్రవేశపెట్టింది. 2.5–16 కిలోవాట్ అవర్ బ్యాటరీ సామర్థ్యంతో తయారయ్యాయి. ధర రూ.74,999 నుంచి మొదలై రూ.2,49,999 వరకు ఉంది. 2025 దీపావళి నుంచి డెలివరీలు ప్రారంభం అవుతాయి. ఒకసారి చార్జింగ్‌తో వేరియంట్‌నుబట్టి 200 నుంచి 579 కిలోమీటర్లు ప్రయాణిస్తుందని కంపెనీ తెలిపింది. టాప్ స్పీడ్ గంటకు 124–194 కిలోమీటర్లు. కాగా, క్విక్ కామర్స్‌లోకి ఓలా ఎంట్రీ ఇచ్చింది. ఇందుకోసం ఓలా క్యాబ్స్ కాస్తా ఓలా కన్జూమర్ అయింది. అలాగే ఓలా పే పేరుతో యూపీఐ సేవలను సైతం కంపెనీ ఆవిష్కరించింది. అనుబంధ కంపెనీ కృత్రిమ్ ఏఐ 2026 నాటికి ఏఐ చిప్‌ను ప్రవేశపెట్టనుంది. -
భారత్‌లోకి బీఎస్ఏ ఎంట్రీ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మహీంద్రా గ్రూప్‌నకు చెందిన మోటార్‌సైకిల్స్ బ్రాండ్ బీఎస్ఏ భారత్‌లో అడుగుపెట్టింది. గోల్డ్‌స్టార్ 650 మోడల్‌తో ఎంట్రీ ఇచి్చంది. ధర ఎక్స్‌షోరూంలో రూ.2.99 లక్షల నుంచి రూ.3.34 లక్షల వరకు ఉంది. 45.6 పీఎస్ పవర్, 55 ఎన్ఎం టార్క్‌తో 652 సీసీ లిక్విడ్ కూల్డ్ ఇంజన్, 5 స్పీడ్ ట్రాన్స్‌మిషన్‌తో తయారైంది. 12 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్, బ్రెంబో బ్రేక్స్, డ్యూయల్ చానెల్ ఏబీఎస్, 12వీ సాకెట్, యూఎస్బీ చార్జింగ్ పోర్ట్ వంటి హంగులు ఉన్నాయి. డెలివరీలు ప్రారంభం అయ్యాయి. పాతతరం ద్విచక్ర వాహన తయారీ దిగ్గజాల్లో బీఎస్ఏ ఒకటి. మహీంద్రా గ్రూప్ కంపెనీ క్లాసిక్ లెజెండ్స్ 2016లో బీఎస్ఏను కైవసం చేసుకుంది. యూకే సంస్థ బమింగమ్ స్మాల్ ఆమ్స్ కంపెనీ (బీఎస్ఏ) 1861లో ప్రారంభం అయింది. తొలి బైక్‌ను 1910లో విడుదల చేసింది. -
వాహనాల ధర ఎందుకు పెరుగుతుందో తెలుసా..?
పుణే, బిజినెస్ బ్యూరో: కాలుష్యాన్ని కట్టడి చేసే పేరిట అతి నియంత్రణలు, అధిక స్థాయి జీఎస్టీలను అమలు చేయడం వల్లే వాహనాల రేట్లకు రెక్కలు వచ్చాయని బజాజ్ ఆటో ఎండీ రాజీవ్ బజాజ్ వ్యాఖ్యానించారు. బ్రెజిల్ వంటి దేశాల్లో మోటార్‌సైకిళ్లపై పన్నులు 8–14 శాతం శ్రేణిలో ఉండగా దేశీయంగా మాత్రం అత్యధికంగా 28 శాతం జీఎస్టీ ఉంటోందని ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో వాహనాల ధరలను తగ్గించే పరిస్థితి ఉండటం లేదని, దీంతో నిర్వహణ వ్యయాలైనా తగ్గే విధంగా వాహనాలను రూపొందించడం ద్వారా కొనుగోలుదారులకు కొంతైనా ఊరటనిచ్చే ప్రయత్నం జరుగుతోందని బజాజ్ చెప్పారు. 125 సీసీ పైగా సామర్ధ్యం ఉండే స్పోర్ట్స్ మోటార్‌సైకిళ్ల విభాగంలో తమకు ముప్ఫై రెండు శాతం మేర వాటా ఉందని, దీన్ని మరింతగా పెంచుకునే దిశగా డబుల్ ఇంజిన్ సర్కార్ నినాదం తరహాలో డబుల్ ఇంజిన్ కారోబార్ (కార్యకలాపాలు) వ్యూహాన్ని అమలు చేస్తున్నట్లు రాజీవ్ చెప్పారు.బజాజ్ పల్సర్ 400 ధర రూ. 1,85,000బజాజ్ ఆటో తాజాగా పల్సర్ ఎన్ఎస్ 400జీ మోటార్‌సైకిల్‌ను ఆవిష్కరించింది. ప్రారంభ ఆఫర్ కింద దీని ధర రూ. 1,85,000గా (ఢిల్లీ ఎక్స్‌షోరూం) ఉంటుంది. డెలివరీలు జూన్ మొదటివారం నుంచి ప్రారంభమవుతాయని సంస్థ ఎండీ రాజీవ్ బజాజ్ తెలిపారు. స్పోర్ట్స్ సెగ్మెంట్లో తమ స్థానాన్ని మరింత పటిష్టం చేసుకునేందుకు ఇది తోడ్పడగలదని ఆయన పేర్కొన్నారు. ఇప్పటివరకు పల్సర్ బైకులు 1.80 కోట్ల పైచిలుకు అమ్ముడైనట్లు బజాజ్ వివరించారు. పరిమిత కాలం పాటు వర్తించే ఆఫర్ కింద కొత్త పల్సర్‌ను రూ. 5,000కే బుక్ చేసుకోవచ్చు. నాలుగు రంగుల్లో ఇది లభిస్తుంది. శక్తివంతమైన 373 సీసీ ఇంజిన్, 6 స్పీడ్ గేర్ బాక్స్, ఎల్రక్టానిక్ థ్రోటిల్ తదితర ప్రత్యేకతలు ఇందులో ఉంటాయి. సీఎన్జీ మోటార్‌సైకిల్‌ను జూన్ 18న ఆవిష్కరించనున్నామని రాజీవ్ చెప్పారు. ఇది ప్రపంచంలోనే తొలి సీఎన్జీ బైక్ అన్నారు. -
సీఎన్జీ బైక్‌పై బజాజ్ ఆటో కసరత్తు
పుణే: పర్యావరణ అనుకూల సీఎన్జీ ఇంధనంతో నడిచే మోటార్‌సైకిళ్ల తయారీపై ద్విచక్ర వాహనాల దిగ్గజం బజాజ్ ఆటో కసరత్తు చేస్తోంది. జూన్ కల్లా ఈ బైకు మార్కెట్లోకి రాగలదని కంపెనీ ఎండీ రాజీవ్ బజాజ్ తెలిపారు. మైలేజీని కోరుకునే కస్టమర్ల కోసం రూపొందిస్తున్న ఈ వాహనాన్ని వేరే బ్రాండ్ కింద ప్రవేశపెట్టనున్నట్లు వివరించారు. వచ్చే అయిదేళ్లలో కార్పొరేట్ సామాజిక బాధ్యతా కార్యక్రమాలపై (సీఎస్ఆర్) రూ. 5,000 కోట్లు వెచి్చంచనున్నట్లు ప్రకటించిన సందర్భంగా ఆయన ఈ విషయం వెల్లడించారు. పెట్రోల్‌తో నడిచే మోటర్‌సైకిళ్లతో పోలిస్తే దీని ధర కొంత అధికంగా ఉండవచ్చని అంచనా. కస్టమర్ల సౌకర్యార్ధం పెట్రోల్, సీఎన్జీ ఇంధనాల ఆప్షన్లు ఉండేలా ట్యాంకును ప్రత్యేకంగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉండటం వల్ల తయారీ కోసం మరింత ఎక్కువగా వెచి్చంచాల్సి రానుండటమే ఇందుకు కారణం. గ్రూప్‌నకు చెందిన అన్ని సీఎస్ఆర్, సేవా కార్యక్రమాలను ’బజాజ్ బియాండ్’ పేరిట సంస్థ నిర్వహించనుంది. దీని కింద ప్రధానంగా నైపుణ్యాల్లో శిక్షణ కలి్పంచడంపై దృష్టి పెట్టనుంది. -
ఈవీ రంగంలోకి హీరో మోటోకార్ప్, వందల కోట్ల పెట్టుబడులు
ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం హీరో మోటోకార్ప్ ఎలక్ట్రిక్ వెహికల్స్‌పై దృష్టి సారించింది. కొనుగోలు దారులకు అభిరుచికి అనుగుణంగా ఈవీ వెహికల్స్‌ను తయారు చేయనుంది. ఇందుకోసం అమెరికాకు చెందిన జీరో మోటార్ సైకిల్స్‌తో జత కలిసింది. ఆ సంస్థలో రూ.490కోట్లు పెట్టుబడులు పెడుతున్నట్లు హీరో మోటోకార్ప్ తెలిపింది. తద్వారా హీరో మోటోకార్ప్, జీరో మోటార్లు సంయుక్తంగా ఈవీ వెహికల్స్‌ను విడుదల చేయనున్నాయి. ప్రపంచంలోనే లార్జెస్ట్ టూవీలర్ తయారీ సంస్థగా పేరొందిన జీరో మోటార్స్ వెహిలక్స్, పవర్ ట్రైన్లను తయారు చేస్తుంది. తొలి బైక్ విడుదల మరోవైపు హీరో మోటోకార్ప్ మొబిలిటీ బ్రాండ్ విడా భాగస్వామ్యంతో అక్టోబర్ 7 తొలి ఎలక్ట్రిక్ బైక్‌ను విడుదల చేయనుంది. ఎలక్ట్రిక్ టూ వీలర్ కంపెనీ ఏథర్ ఎనర్జీలో 35 శాతానికి పైగా వాటా ఉన్న హీరో మోటాకార్ప్.. తాజాగా జీరో మోటార్స్‌లో పెట్టుబడులు పెడుతున్నట్లు ప్రకటించింది. ఆ ప్రకటనతో ఇన్వెస్టర్లు అప్రమత్తమయ్యారు. దీంతో గురువారం బీఎస్ఈలో కంపెనీ షేర్లు 2.11 శాతం తగ్గి రూ.2,534.20 వద్ద ముగిశాయి. -
మోటో వ్లాగర్లకు శుభవార్త..ఐఓసీ అదిరిపోయే బిజినెస్ ఐడియా!
న్యూఢిల్లీ: ఇంధన రిటైలింగ్‌లో పోటీ తీవ్రమవుతుండటంతో ప్రభుత్వ రంగ దిగ్గజం ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ) కొత్త అవకాశాలను అన్వేషిస్తోంది. ఇందులో భాగంగా హిమాలయాలకు బైక్‌లపై సాహసయాత్రలు చేసే పర్యాటకులను ఆకర్షించేందుకు ప్రత్యేకంగా బైకర్స్ కేఫ్‌లను ఏర్పాటు చేస్తోంది. సిమ్లాలో తొలి కేఫ్‌ను ప్రారంభించామని, త్వరలో చండీగఢ్–మనాలీ రూట్లో కూడా వీటిని ఏర్పాటు చేస్తామని కంపెనీ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. సిమ్లా శివార్లలోని షోగి దగ్గర్లో ఒక పెట్రోల్ బంకులో ఖాళీ స్థలం ఉండటంతో దాన్ని బైకర్స్ కేఫ్‌గా మార్చినట్లు పేర్కొన్నారు. ఇందులో వైఫైతో పాటు బైకర్లు విశ్రాంతి తీసుకునేందుకు, మోటర్‌సైకిళ్లను పార్కింగ్ చేసుకునేందుకు, చిన్నపాటి రిపేర్లు మొదలైన వాటికోసం ప్రత్యేక సదుపాయాలు కల్పించినట్లు చెప్పారు. అలాగే, లిప్ గార్డ్, సన్‌స్క్రీన్ లోషన్, గ్లవ్స్, రెయిన్ కోట్లు, టార్పాలిన్ మొదలైన వాటిని కూడా విక్రయిస్తున్నట్లు అధికారి పేర్కొన్నారు. సాధారణంగా బైకర్ల యాత్రలు ఢిల్లీ నుంచి లడఖ్ వరకూ వివిధ మార్గాల్లో ఏటా జూన్ తొలి వారంలో మొదలై అక్టోబర్ ప్రథమార్ధం వరకూ కొనసాగుతుంటాయి. -
బైక్‌పై చిన్నారులతో వెళ్తున్నారా? అయితే, జాగ్రత్త!
న్యూఢిల్లీ: నాలుగేళ్లలోపు చిన్నారులు ప్రయాణించే మోటార్ బైక్ వేగం గంటకు 40 కిలోమీటర్లకు మించరాదని కేంద్రం ప్రతిపాదించింది. దీంతో పాటు, 9 నెలల నుంచి 4 ఏళ్లలోపు చిన్నారులైతే తప్పని సరిగా హెల్మెట్ ఉండేలా వాహనదారు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపింది. దీంతోపాటు, వాహన చోదకుడు ఆ చిన్నారిని సేఫ్టీ పట్టీతో తన వీపునకు తగిలించుకోవాలని పేర్కొంది. దీనివల్ల, చిన్నారి మెడ, తలభాగాలకు పూర్తి రక్షణ కల్పించినట్లు అవుతుందని వివరించింది. దృఢమైన, తేలికపాటి, నీటిలో తడవని, అవసరానికి అనుగుణంగా సరి చేసుకోదగ్గ, కనీసం 30 కిలోల బరువును మోయగలిగే నైలాన్‌తో ఆ పట్టీ తయారయినదై ఉండాలని తెలిపింది. ద్విచక్ర వాహనాలపై ప్రయాణించే చిన్నారుల భద్రతే లక్ష్యంగా ఈ ప్రతిపాదనలను రూపొందించినట్లు కేంద్ర రోడ్డు రవాణా, హైవేల శాఖ తెలిపింది. అభ్యంతరాలు, సూచనలు తెలియజేయాల్సిందిగా ప్రజలను కోరింది. (చదవండి: రెండు రోజులు తర్వాత పుట్టింటికి .. బావిలో శవాలుగా తేలిన తల్లీ, కూతురు) -
బ్యాటరీతో నడవనున్న హీరో స్ప్లెండర్ బైక్
భారతదేశంలో ఎక్కువగా అమ్ముడుపోయే ద్విచక్ర వాహనం ఏదైనా ఉంది అంటే అది హీరో స్ప్లెండర్ అని చెప్పుకోవాలి. ఈ బైక్ ధర, నిర్వహణ ఖర్చు చాలా తక్కువగా ఉంటుంది. అందుకే సామాన్య ప్రజలు ఎక్కువగా కొనడానికి ఇష్ట పడతారు. అయితే, గత కొన్ని నెలల నుంచి పెట్రోల్ ధర భారీగా పెరగడంతో సామాన్యుడు ద్విచక్ర వాహనాన్ని బయటకు తీయాలంటే ఒకటికి రెండు సార్లు ఆలోచించాల్సి వస్తుంది. అయితే, ఇలాంటి భాదలు తరిమికొట్టడానికి హీరో స్ప్లెండర్ బైక్ కోసం ఈవీ కన్వర్షన్ కిట్ ను మార్కెట్లోకి విడుదల చేశారు. (చదవండి: Tesla: భారత్‌లో ఆన్లైన్ ద్వారా కార్ల అమ్మకం!) తమకు ఇష్టమైన బైక్ లో ఈ ఎలక్ట్రిక్ కిట్ ఇన్ స్టాల్ చేయడం ద్వారా డబ్బును ఆదా చేసుకోవచ్చు. ఈ ఎలక్ట్రిక్ కిట్ ను ఆర్ టీఓ కూడా ఆమోదించింది. మహారాష్ట్రలోని థానే కేంద్రంగా పనిచేస్తున్న ఈవీ స్టార్టప్ కంపెనీ గోగోఏ1 ఇటీవల దీనిని లాంఛ్ చేసింది, దీని ధర రూ.35,000. అయితే, అసలు మొత్తంతో పాటు రూ.6,300 జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. అలాగే, బ్యాటరీ ఖర్చును విడిగా చెల్లించాల్సి ఉంటుంది. మొత్తం మీద ఈవీ కన్వర్షన్ కిట్, బ్యాటరీ ధర రూ.95,000. హీరో స్ప్లెండర్ బైక్ తో పాటు దీనిని కొనడానికి అదనంగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. కంపెనీ తన కిట్ పై 3 సంవత్సరాల వారెంటీని కూడా అందిస్తోంది. రష్లేన్ ప్రకారం, గోగోఎ1 సింగిల్ ఛార్జ్ పై 151 కిలోమీటర్ల వరకు వెళ్లగలదు. ప్రస్తుతం, భారతదేశంలోని ప్రముఖ కంపెనీలు ఇటువంటి ఎలక్ట్రిక్ బైక్ లను ఇంకా లాంఛ్ చేయలేదు. అయితే, పెట్రోల్ వేరియెంట్లు భారీగా అమ్ముడు అవుతున్నాయి. ఇటువంటి పరిస్థితిలో గోగోఎ1 సంస్థ ప్రజల ముందు మంచి ఆప్షన్ ఉంచింది. కాకపోతే ఇది చాలా ఖరీదైనది అని ప్రజలు భావిస్తున్నారు. రాబోయే కాలంలో హీరో, బజాజ్, హోండా, యమహా సహా పలు ద్విచక్ర వాహనాల కంపెనీలు ఎలక్ట్రిక్ బైక్ లను విడుదల చేయనున్నాయి. -
ఇండియన్ మోటార్‌సైకిల్ ‘చీఫ్’
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ద్విచక్ర వాహన తయారీలో ఉన్న ఇండియన్ మోటార్‌సైకిల్ సరికొత్త చీఫ్ శ్రేణి మోటార్‌సైకిల్స్‌ను భారత్‌లో ప్రవేశపెట్టింది. ఎక్స్‌షోరూంలో ధర రూ.20.75 లక్షల నుంచి ప్రారంభం. 2022 చీఫ్ శ్రేణిలో చీఫ్ డార్క్ హార్స్, ఇండియన్ చీఫ్ బాబర్ డార్క్ హార్స్, ఇండియన్ సూపర్ చీఫ్ లిమిటెడ్ మోడల్స్ ఉన్నాయి. 1,890 సీసీ ఎయిర్ కూల్డ్ ఇంజన్ పొందుపరిచారు. 15.1 లీటర్ ఫ్యూయల్ ట్యాంక్, ప్రీలోడ్ అడ్జెస్టేబుల్ రేర్ షాక్స్, డ్యూయల్ ఎగ్జాస్ట్, ఎల్ఈడీ లైటింగ్, కీలెస్ ఇగ్నిషన్, యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్, సర్క్యులర్ టచ్ స్క్రీన్ రైడ్ కమాండ్ సిస్టమ్ వంటి హంగులు ఉన్నాయి. చదవండి : ఎలక్ట్రిక్ బైక్ ఐడియా..భలే ఉంది కదూ! -
ఒక్క రోజులో లక్ష స్కూటర్ల విక్రయం
న్యూఢిల్లీ: ద్విచక్ర వాహన పరిశ్రమలో మార్కెట్ లీడర్ హీరో మోటోకార్ప్ గత వారం 10వ వార్షికోత్సవం సందర్భంగా ఒక్క రోజు లక్ష యూనిట్లకు పైగా రిటైల్ చేసినట్లు తెలిపింది. ఆగస్టు 9నతో మా ప్రయాణం పదేళ్లు పూర్తి చేసుకుందని.. హీరో మోటోకార్ప్‌లో ఇదొక మైలురాయి అని కంపెనీ సేల్స్ హెడ్ నవీన్ చౌహాన్ తెలిపారు. దేశీయ, గ్లోబల్ మార్కెట్లలో పండుగలు లేని సమయంలో కూడా కస్టమర్లు ఈ స్థాయిలో ఒకే రోజు రికార్డ్ స్థాయిలో కొనుగోళ్లు జరపడం ఇదే ప్రథమమని చెప్పారు. కొత్తగా విడుదల చేసిన మాస్ట్రో ఎడ్జ్ 125, డెస్టినీ, ప్లెజర్ 110 స్కూటర్లకు అధిక డిమాండ్‌తో పాటు ఇతర బైక్స్లు రోజు వారీ సగటు కంటే రెట్టింపు అమ్మకాలు జరిపాయని తెలిపారు. చదవండి : సాఫ్ట్వేర్ సంస్థ (24)7.ఏఐ భారీ నియామకాలు -
ఎలక్ట్రిక్ బైక్ ఐడియా.. భలే ఉంది కదూ!
ఒంటెద్దు బళ్లు చూశాం గాని, ఒంటిచక్రం బండేమిటి? ఇదేదో సర్కస్ వ్యవహారం కాబోలనుకుంటున్నారా? ఇక్కడ ఫొటోలో కనిపిస్తున్న వాహనం అచ్చంగా ఒంటిచక్రం బండి. ఇది మోనోవీల్ ఎలక్ట్రిక్ బైక్. హోండా కంపెనీకి చెందిన డిజైనర్ నాషో ఆల్ఫోన్సో గార్షియా దీనికి రూపకల్పన చేశాడు. ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉండే నగరాల్లో ఇరుకిరుకు సందుల్లో కూడా తేలికగా ప్రయాణాలు సాగించడానికి ఈ వాహనం భేషుగ్గా ఉపయోగపడుతుందని గార్షియా చెబుతున్నాడు. దీనిని నడపడం పెద్దకష్టమేమీ కాదు. ఇందులో కాళ్లు మోపడానికి ఉండేచోటులో నిలుచుని, స్టార్ట్ చేస్తే చాలు. పడిపోతుందేమోననే భయం అక్కర్లేదు. ఇది పూర్తిగా సెల్ఫ్బ్యాలెన్సింగ్ వాహనం. హోండా సంస్థ ప్రస్తుతానికి దీనిని నమూనాగా మాత్రమే తయారు చేసింది. దీనిపై మరిన్ని పరీక్షలు విజయవంతమైతే, పూర్తిస్థాయి ఉత్పాదన ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. -
దేశీ ప్రీమియం బైక్స్ మార్కెట్‌పై బెనెల్లీ దృష్టి
ముంబై: ఇటాలియన్ సూపర్‌బైకుల తయారీ సంస్థ బెనెల్లీ భారత ప్రీమియం మోటార్ సైకిళ్ల మార్కెట్‌పై దృష్టి సారించింది. ఈ ఏడాది చివరిలోగా 250 – 500సీసీ సిగ్మెంట్లో మూడు బైకుల విడుదల లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా బెనెల్లీ 502సీ పవర్ క్రూజర్ బైకుల ప్రీ–బుకింగ్స్‌లను ఇటీవలే ప్రారంభించింది. ఈ నెలలో డెలవరీలను చేయనుంది. అలాగే దేశవ్యాప్తంగా డీలర్షిప్ నెట్‌వర్క్‌ను బలోపేతం చేసుకోవాలని భావిస్తోంది. ప్రీమియం టూ–వీలర్ సిగ్మెంట్లో 250–500 సీసీ శ్రేణి బైకుల అధిక డిమాండ్ ఉన్నందున ఈ విభాగపు మార్కెట్‌పై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు బెనెల్లీ భారత విభాగపు ఎండీ జబాక్ తెలిపారు. ఈ కంపెనీకి చెందిన భారత పోర్ట్‌ఫోలియోలో 500 సీసీ విభాగానికి చెందిన టీఆర్కే 502, టీఆర్కే 502 ఎక్స్‌తో పాటు లియోన్సినో, 374 సీసీ ఇంపీరియల్ అనే మూడు మోడళ్లు ఉన్నాయి. తెలంగాణకు చెందిన మహవీర్ గ్రూప్‌కు అనుబంధ ఆదిశ్వర్ ఆటో రైడ్ సంయుక్త భాగస్వామ్యంలో 2018లో ఒక తయారీ యూనిట్‌ను హైదరాబాద్‌లో ప్రారంభించి తిరిగి భారత మార్కెట్లోకి ప్రవేశించింది. -
1971 వార్ విజయానికి గుర్తుగా జావా స్పెషల్ ఎడిషన్ బైక్స్
ప్రముఖ వాహన తయారీ కంపెనీ జావా మోటార్ సైకిల్స్ 1971లో పాకిస్తాన్ తో జరిగిన యుద్దంలో భారత్ సాధించిన విజయానికి గుర్తుగా జావా బ్రాండ్‌లో ఖాకీ, మిడ్నైట్ గ్రే రంగులను పరిచయం చేసింది. భారత్‌లో సైనిక చిహ్నంతో మోటార్ సైకిల్స్ అందుబాటులోకి రావడం దేశ చరిత్రలో ఇదే తొలిసారి అని కంపెనీ తెలిపింది. "50 సంవత్సరాల క్రితం భారత సాయుధ దళాలు దురాక్రమణకు అడ్డుగా నిలిచాయి. చరిత్రలో జరిగిన అతి తక్కువ గొప్ప యుద్ధాలలో అద్భుతమైన విజయాన్ని సాధించాయి. 1971 వార్ విక్టరీ 50 సంవత్సరాలను పురస్కరించుకొని #SwarnimVijayVarsh జరుపుకోవడం మాకు గర్వంగా ఉంది" అని జావా మోటార్ సైకిల్స్ ట్విట్టర్ లో తెలిపింది. మాతృ భూమిని రక్షించడానికి సైనికులు చూపిన ధైర్యం, త్యాగాలను ఈ బైక్ పై ఉన్న భారత సైనిక చిహ్నం గుర్తు చేస్తుందని వివరించింది. మహీంద్రా అండ్ మహీంద్రా ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా జావా బృందాన్ని అభినందించారు ఈ స్పెషల్ ఎడిషన్ బైక్ ధర హైదరాబాద్ ఎక్స్‌షోరూంలో రూ.1.96 లక్షలుగా ఉంది. కస్టమర్లు కంపెనీ వెబ్ సైట్ ద్వారా స్పెషల్ ఎడిషన్ మోటార్ సైకిల్ ని ఆన్ లైన్ లో బుక్ చేసుకోవచ్చు. -
బైక్ ధరలను పెంచేసిన హీరో మోటో
సాక్షి,ముంబై: దేశీయ అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ బైక్ లవర్స్‌కి షాకిచ్చింది. వచ్చే నెలనుంచి తన మోటార్ సైకిళ్ల ధరలను పెంచుతున్నట్టు ప్రకటించింది. పెరుగుతున్న ఇన్పుట్ ఖర్చులరీత్యా తమ అన్ని మోడళ్ల బైక్‌లు, స్కూటర్ల ధరలను పెంచాల్సి వస్తోందని ప్రకటించింది. సవరించిన ధరలు అన్ని షోరూంలలో 2021 ఏప్రిల్ 1 నుండి అమల్లోకి వస్తాయని ఎక్స్ఛేంజీలకిచ్చిన సమాచారంలో సంస్థ వెల్లడించింది. (మారుతి కార్ల ధరలకు రెక్కలు) వినియోగదారుల మీద తక్కువ భారం పడేలా, తమ ఖర్చులను తగ్గించుకునే కార్యక్రమాన్ని వేగవంతం చేసినట్టు హీర మోటో తెలిపింది. అయితే ధరల పెరుగుదల పరిమాణంపై కంపెనీ నిర్దిష్ట వివరాలు ఇవ్వలేదు. కానీ, ఈ పెరుగుదల రూ .2500 వరకు ఉంటుందని, మోడల్, నిర్దిష్ట మార్కెట్ ఆధారంగా ఉంటుందని హీరో తెలిపింది. కాగా అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఇన్పుట్ ఖర్చుల భారం నేపథ్యంలో అన్నిమోడళ్ల కార్ల ధరలను పెంచుతున్నట్టు మంగళవారం ప్రకటించిన సంగతి తెలిసిందే. -
సరికొత్తగా టీవీఎస్ అపాచీ బైక్ : ధర?
సాక్షి, ముంబై: టీవీఎస్ మోటార్ కొత్త అపాచీ బైక్‌ను మార్కెట్లో విడుదల చేసింది. 2021 టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 160 4వీ మోటార్‌సైకిల్‌ను బుధవారం విడుదల చేసినట్లు రెగ్యులేటరీ ఫైలింగ్‌లో కంపెనీ తెలిపింది. ఈ కొత్త బైక్ రెండు వేరియంట్లలో అందుబాటులో ఉండనుంది. డిస్క్ వేరియంట్ ధర రూ.1,10,320,డ్రమ్ వేరియంట్ ధర రూ.1,07,270 (ఎక్స్‌షోరూం, న్యూఢిల్లీ ధరలు) గా కంపెనీ నిర్ణయించింది. రేసింగ్ రెడ్, నైట్ బ్లాక్, మెటాలిక్ బ్లూ మొత్తం మూడు రంగుల్లో అందుబాటులో ఉండనున్నట్లు కంపెనీ వెల్లడించింది. టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 160 4వీ కొత్త బూక్‌లో 159.7 సీసీ సింగిల్ సిలిండర్, 4 వాల్వ్, ఆయిల్ కూల్డ్ అధునాతన ఇంజీన్ అమర్చినట్టు తెలిపింది. ఇది 9,250 ఆర్పీఎం వద్ద 17.38 హెచ్‌పీ శక్తిని, 7,250 ఆర్పీఎం వద్ద 14.73 ఎన్ఎం టార్క్‌ని ప్రొడ్యూస్ చేస్తుంది. కిల్ కార్బన్ ఫైబర్ నమూనాతో సరికొత్త డ్యూయల్ టోన్ సీటు,ఎ ల్ఈడీ హెడ్‌ల్యాంప్, క్లా స్టైల్డ్ పొజిషన్ ల్యాంప్‌లు ఇతర కీలక ఫీచర్లతో ప్రీమియం లుక్‌తో ఆకట్టుకోనుంది. ఫైవ్ స్పీడ్ సూపర్-స్లిక్ గేర్‌బాక్స్ కలిగిన ఈ బైక్ ఈ సెగ్మెంట్లో అత్యంత శక్తిమంతమైన రైడింగ్ అనుభూతినిస్తుందని టీవీఎస్ మోటార్ కంపెనీ హెడ్ (మార్కెటింగ్) ప్రీమియం మోటార్ సైకిల్స్ మేఘశ్యామ్ దిఘోలే వెల్లడించారు. అలాగే పాత అపాచీల వెర్షన్లతో పోలిస్తే ఈ కొత్త బైక్ రెండు కిలోల బరువు తక్కువ ఉంటుంది. డిస్క్ వేరియంట్ 147 కిలోల బరువు, డ్రమ్ వేరియంట్ 145 కిలోల బరువు ఉంటుంది. -
అక్కడ టూ వీలర్స్‌పై పూర్తి నిషేధం
వియన్నా : ఆస్ట్రియా రాజధాని వియన్నా సిటీ సెంటర్లో అన్ని రకాల మోటారు సైకిళ్లను నిషేధించాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది. వియన్నాను మోటార్ సైకిల్ ఫ్రీ సెంటర్‌గా మార్చాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసకున్నారు. ఆస్ట్రియాలోనే అత్యధిక జనాభా కలిగిన వియన్నా ప్రాంతం యూరోప్ ఖండంలోనే అద్భుతమైన రహదార్లను కలిగి ఉండి టూ వీలర్ ప్రయాణాలకు అనువుగా ఉంటుంది. కాగా ఆస్ట్రియాలోని టైరోల్ రాష్ట్రంలో కొద్దికాలం కిందట పర్యావరణం కాపాడడంపై మోటారు సైకిళ్లపై నిషేధం విధించారు. తాజాగా వియన్నాలో కూడా దీనిని అమలు చేయనున్నారు. అయితే టైరోల్ ప్రాంతంలో ఉన్న నిషేధానికి భిన్నంగా ఇక్కడ అమలు చేయనున్నారు. అందుకు వియన్నాలో ప్రఖ్యాత మోటారు సైకిల్ బ్రాండ్ కెటిఎమ్ తన మద్దతు తెలిపింది. ('తండ్రిగా వాడి కోరికను తీర్చా') అన్ని రకాల టూ వీలర్స్ అంటే పర్యావరణానికి అనువుగా ఉండే బ్యాటరీ, ఎలక్ట్రికల్ చార్జింగ్‌తో నడిచే అన్ని రకాల వాహనాలను పూర్తిగా నిషేధం విధించనున్నారు.ఇప్పటికే వియాన్నా ప్రాంతంలో అత్యధికులు ద్విచక్ర వాహనాల నుంచి ఎలక్ట్రికల్ వాహనాలకు మారారు. అంతేగాక ఎలక్ట్రిక్ ప్యాసింజర్ కార్లను కూడా అక్కడి పౌరులు విస్తృతంగా అంగీకరించారు. అయితే మోటారు వాహనాలను పూర్తిగా నిషేధించాలని చేపట్టిన చర్యలపై వాహనదారులు ఆలక్ష్యం వహించడంతో స్థానిక అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో వియన్నా సిటీ సెంటర్లో బైక్ పార్కింగ్‌లో ఉన్న వాహనాలపై కూడా ఈ నిషేధం వర్తించనుంది. అయితే సిటీ సెంటర్ వెలుపల ఉన్న రింగ్‌రోడ్డుపై మాత్రం అన్ని రకాల ప్రైవేట్ కార్లు, వాన్లు, మోటార్ సైకిళ్లు ఆ మార్గాన్ని ఉపయోగించుకోవడానికి అనుమతులు ఇచ్చింది. వియన్నా సిటీ సెంటర్లో నివసించే వ్యక్తులు, ప్రైవేట్ గ్యారేజీలో పనిచేసే వాళ్లకు మాత్రం ఫ్రీ రోడ్లో తిరిగే అవకాశంతో పాటు వాహన పార్కింగ్‌కు అనుమతులిచ్చారు. -
బీఎండబ్ల్యూ సూపర్ బైక్స్ లాంచ్
సాక్షి, న్యూఢిల్లీ: జర్మనీ లగ్జరీ మోటార్‌సైకిల్ తయారీ సంస్థ బీఎండబ్ల్యూ మోట్రాడ్ ఇండియా కొత్త ఎఫ్ 900 ఆర్, ఎఫ్ 900 ఎక్స్ఆర్ బైక్‌లను దేశంలో విడుదల చేసింది. ఎఫ్900 ఆర్‌ను సింగిల్ స్టాండర్డ్ వేరియంట్లో లాంచ్ చేయగా , ఎక్స్ ఆర్ మోడల్‌ను స్టాండర్డ్, ప్రో వేరియంట్లలో అందుబాటులో వుంటాయి. ఈ రెండు బైక్‌లను జర్మనీలోని కంపెనీ ఫ్యాక్టరీల నుండి దిగుమతి చేస్తోంది. ఎఫ్ 900 ఆర్ ధర రూ .9.90 లక్షలు కాగా, ఎఫ్ 900 ఎక్స్ఆర్ స్టాండర్డ్ ధర, రూ .10.50 లక్షలు. ప్రో వేరియంట్ (ఎక్స్‌షోరూమ్, న్యూఢిల్లీ) ధర రూ.11. 50 లక్షలుగా నిర్ణయించింది. (ఒప్పో ఫైండ్ ఎక్స్ 2 నియో లాంచ్.. ధర ఎంతంటే?) ఈ రెండు బైక్‌లను 'రెయిన్' 'రోడ్' రైడింగ్ మోడ్లతో లాంచ్ చేసింది. అంతేకాదు ఈ రెండు బైక్‌లలో తొలిసారిగా ప్లాస్టిక్-వెల్డెడ్ ఇంధన ట్యాంకులను అమర్చింది. ఇదే ఆసక్తికరమైన హైలైట్. ప్రపంచంలోనే అత్యుత్తమ ప్రీమియం మోటార్‌సైకిళ్లను భారతదేశానికి తీసుకువచ్చామనీ, మిడ్ రేంజ్ విభాగంలో ఆకర్షణీయమైన విలువతోయూజర్లను ఆకట్టుకుంటాయని బీఎండబ్ల్యూ గ్రూప్ ఇండియా యాక్టింగ్ ప్రెసిడెంట్ అర్లిండో టీక్సీరా అన్నారు ఎఫ్ 900 ఆర్ లో 13-లీటర్ ఇంధన ట్యాంక్‌ను, ఎఫ్ 900 ఎక్స్ ఆర్15.5 లీటర్ ట్యాంకును ఇచ్చింది. వీటిల్లో బీఎండబ్ల్యూ మోట్రాడ్ కనెక్టివిటీతో 6.5 అంగుళాల కలర్ టిఎఫ్టి స్క్రీన్‌ను అమర్చింది. ఇంకా యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ఏబీఎస్), ఆటోమేటిక్ స్టెబిలిటీ కంట్రోల్ , యాంటీ-హోపింగ్ క్లచ్ , కాస్ట్ అల్యూమినియం వీల్స్ , ఆల్-ఎల్ఇడి హెడ్‌ల్యాంప్ లాంటి సేఫ్టీ ఫీచర్లున్నాయి. ఇవి 8500 ఆర్‌పిఎమ్ వద్ద 105 హెచ్‌పి పవర్‌ను, 6500 ఆర్‌పిఎమ్ వద్ద గరిష్టంగా 92 ఎన్ఎమ్ టార్క్‌ను అందిస్తాయి. కేవలం 3.6 సెకన్లలో గంటకు 0-100 కిమీ వేగం పుంజుకుంటాయి. గంటకు 200 కి.మీ గరిష్ట వేగాన్ని అందుకుంటాయి. ఈ సూపర్ బైక్‌లు కవా సాకి వెర్సిస్ 1000, డుకాటీ మల్టీస్ట్రాడా 950 వంటి వాటికి గట్టిపోటీ ఇవ్వనున్నాయని మార్కెట్ వర్గాల అంచనా. -
న్యూ ఇయర్ గిఫ్ట్ : హీరోమోటో కొత్త బైక్
సాక్షి,ముంబై : హీరోమోటో కొత్త ఏడాదిలో సరికొత్త బైక్‌ను లాంచ్ చేసింది.100సీసీ సెగ్మెంట్లో బీఎస్-6 నిబంధనలకు అనుగుణంగా తన తొలి మోటార్ సైకిల్ తీసుకొచ్చింది. హెచ్ఎఫ్ డీలక్స్ పేరుతో తీసుకొచ్చిన ఈ బైక్ ప్రారంభ ధరను రూ. 55925 గా నిర్ణయించింది. 2020 ఏప్రిల్ నుంచి కొత్త ఉద్గార నిబంధనలు అమలుకానున్న నేపథ్యంలో కంపెనీ బీఎస్-6 ఉత్పత్తుల పోర్ట్‌ఫోలియోలో వేగం పెంచింది. హీరో బైక్స్ లవర్స్‌కు కొత్త సంవత్సరం బహుమతిని అందించింది. తన పాపులర్, ఐకానిక్ మోటారుసైకిల్ హెచ్ఎఫ్ డీలక్స్ బైక్ బీఎస్-6 మోడల్‌ను రెండు వేరియంట్లలో లాంచ్ చేసింది. సెల్ఫ్-స్టార్ట్ అల్లాయ్-వీల్ వేరియంట్ ధర రూ. 55,925 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ), సెల్ఫ్-స్టార్ట్ అల్లాయ్-వీల్ ఐ3ఎస్ వేరియంట్ రూ.57,250 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) వద్ద దేశంలోని హీరో మోటోకార్ప్ షోరూమ్‌లలో జనవరి 2020 ప్రారంభం నుండి అందుబాటులో వుంటాయని హీరోమోటో ఒకప్రకటనలో వెల్లడించింది. -
బీఎండబ్ల్యూ మోటొరాడ్ కొత్త బైక్‌లు
ముంబై: జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల తయారీ కంపెనీ బీఎండబ్ల్యూకు చెందిన ప్రీమియం మోటార్‌సైకిల్ విభాగం ‘బీఎండబ్ల్యూ మోటొరాడ్’ తాజాగా భారత్‌లో రెండు అధునాతన బైక్‌లను ప్రవేశపెట్టింది. ‘బీఎండబ్ల్యూ ఆర్ 1250 ఆర్, బీఎండబ్ల్యూ ఆర్ 1250 ఆర్టీ’ పేర్లతో వీటిని మంగళవారం విడుదలచేసింది. ఈ నూతన సూపర్ బైక్‌ల ధరల శ్రేణి వరుసగా రూ. 15.95 లక్షలు, రూ. 22.50 లక్షలుగా నిర్ణయించింది. రెండు మోడళ్లలో 1,254 సీసీ ఇంజిన్లను అమర్చింది. ఆటోమేటిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ఏఎస్సీ), యాంటీ–లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ఏబీఎస్ ప్రో) వంటి అధునాతన ఫీచర్లు వీటిలో ఉన్నట్లు వెల్లడించింది. -
ఆ గోల్డెన్ బైక్స్ మళ్లీ వస్తున్నాయ్!
సాక్షి, ముంబై: భారతీయ ద్విచక్ర వాహన మార్కెట్లోకి మరో గోల్డెన్ బైక్స్ రీఎంట్రీ ఇవ్వబోతున్నాయి. ఈ మేరకు సోషల్ మీడియాలో పలు సంకేతాలు సందడి చేస్తున్నాయి. 2020 ఆటో ఎక్స్పో నాటికి ఈ బైక్స్ పరిచేయాలని కంపెనీ యోచిస్తోందట. ఈ కంపెనీ పేరే యెజ్డీ మోటార్ సైకిల్స్. మహీంద్ర అండ్ మహీంద్ర సొంతమైన ఈ క్లాసిక్ కంపెనీ తన ఐకానిక్ యెజ్డీ బైక్‌లను తిరిగి లాంచ్ చేస్తోంది. ప్రధానంగా ఇటీవల భారత మార్కెట్లో రీఎంట్రీ ఇచ్చిన జావా బైక్‌లు హల్చల్ చేస్తున్న నేపథ్యంలో కంపెనీ తాజా నిర్ణయం తీసుకుంది. లాంచింగ్‌పై కచ్చితమైన తేదీని ప్రకటించకపోయినప్పటికీ, భారత బైక్ మార్కెట్‌ను ఏలిన యెజ్డీ మోటార్ సైకిల్స్ బైక్స్ అధికారిక పేజీ ప్రస్తుతం యాక్టివ్‌గా ఉంది. ఈ పేజీలో కొన్ని వివరాలను కూడా పొందుపర్చింది. అలాగే ఆఫీషియల్ ట్విటర్, ఇన్స్టాగ్రామ్ తదితర సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలు యెజ్డీ బైక్‌ల లాంచింగ్‌పై స్పష్టమైన సంకేతాలని నిస్తున్నాయి. -
మార్కెట్లోకి సుజుకీ ‘ఇన్ట్రూడర్’ 2019 ఎడిషన్
ముంబై: వాహన తయారీ కంపెనీ సుజుకీ మోటార్‌సైకిల్ ఇండియా.. తన ‘ఇన్ట్రూడర్’ క్రూయిజర్ బైక్‌లో నూతన ఎడిషన్‌ను శుక్రవారం మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. అధునాతన గేర్ షిఫ్ట్ డిజైన్, అభివృద్ధిపరిచిన బ్రేక్ పెడల్ వంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీతో అందుబాటులోకి వచ్చిన ఈ బైక్ ధర రూ.1.08 లక్షలుగా కంపెనీ తెలిపింది. ‘స్టాండర్డ్ ఏబీఎస్, 155సీసీ ఇంజిన్, పూర్తి డిజిటల్ ఉపకరణాలతో ఈ బైక్ విడుదలైంది. క్రూయిజర్‌ను ఇష్టపడే యువతకు ఈ అడ్వాన్స్డ్ వెర్షన్ సరిగ్గా సరిపడే మోటార్‌సైకిల్‌గా భావిస్తున్నాం’ అని ఎస్ఎంఐపీఎల్ వైస్ ప్రెసిడెంట్ దేవశిష్ హన్డా అన్నారు. -
మళ్లీ వచ్చింది... జావా!
ముంబై: గంభీరమైన సౌండుతో, ఠీవికి మారుపేరుగా దేశీ రోడ్లపై ఒకప్పుడు దర్జాగా తిరుగాడిన జావా మోటార్‌సైకిల్ బ్రాండ్.. మళ్లీ వాహన ప్రియుల కోసం వచ్చేసింది. పారిశ్రామిక దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా అనుబంధ సంస్థ క్లాసిక్ లెజెండ్స్ దాదాపు రెండు దశాబ్దాల తర్వాత దీన్ని మరోసారి భారత మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. జావా ఫోర్టీ టూ, జావా, జావా పెరక్ పేరిట మూడు మోడల్స్‌ను దేశీ మార్కెట్లో గురువారం ఆవిష్కరించింది. 293 సీసీ సామర్థ్యంతో పనిచేసే ఈ బైక్‌ల ధర రూ.1.55 లక్షల నుంచి రూ.1.89 లక్షల దాకా ఉంది. తమ ద్విచక్ర వాహనాల విభాగానికి జావా సరైన జోడీగా మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా చెప్పారు. ‘సాధారణ వాహనాల్లా కాకుండా ఇది చాలా ప్రీమియం సెగ్మెంట్‌కి సంబంధించిన బైక్. జావాకి ఒక గొప్ప చరిత్ర, పేరు ఉన్నాయి. దాన్ని నిలబెట్టుకోవడంపైనే ప్రస్తుతం మా దృష్టంతా పెట్టాం. అమ్మకాల పరిమాణం గురించి పెద్దగా లక్ష్యాలేమీ నిర్దేశించుకోలేదు‘ అని ఆయన వివరించారు. ప్రస్తుతానికి దేశీ మార్కెట్‌పైనే దృష్టి పెట్టామని, ఎగుమతులకు కూడా అవకాశాలు ఉన్నాయని మహీంద్రా పేర్కొన్నారు. ఇండోర్‌లో తయారీ..: దేశీయంగా ప్రీమియం మోటార్‌సైకిల్ మార్కెట్ గణనీయంగా వృద్ధి చెందుతున్న నేపథ్యంలో జావాను మళ్లీ తీసుకురావడానికి ఇదే సరైన సమయంగా భావించినట్లు క్లాసిక్ లెజెండ్స్ సీఈవో ఆశీష్ జోషి పేర్కొన్నారు. గురువారం నుంచి ఆన్లైన్లో జావా బుకింగ్స్ ప్రారంభించామని, డిసెంబర్ 7 నుంచి కస్టమర్లకు అందించనున్నామని తెలియజేశారు. ప్రస్తుతం మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ దగ్గర పిఠంపూర్లో ఉన్న మహీంద్రా తయారీ ప్లాంటులో ఈ బైక్‌లను ఉత్పత్తి చేస్తున్నారు. ఏటా 5 లక్షల బైక్‌ల తయారీ సామర్థ్యం ఉన్నట్లు ఫి క్యాపిటల్ మేనేజ్మెంట్ వ్యవస్థాపకుడు అనుపమ్ తరేజా వెల్లడించారు. క్లాసిక్ లెజెండ్స్‌లో మహీంద్రా గ్రూప్‌నకు 60 శాతం వాటాలు ఉండగా, మిగతావి రుస్తుంజీ గ్రూప్, ఫి క్యాపిటల్ మేనేజ్మెంట్ వద్ద ఉన్నాయి. జావా చరిత్ర ఇదీ.. మోటార్ సైకిలంటే.. మూడు దశాబ్దాల క్రితం దాకా జావా, రాయల్ ఎన్ఫీల్డ్, యెజ్డీ, రాజ్‌దూత్ బైకుల పేర్లే ఎక్కువగా వినిపించేవి. ప్రస్తుతం రాయల్ ఎన్‌ఫీల్డ్‌కి ఉన్న క్రేజ్కన్నా ఎక్కువే అప్పట్లో జావాకి ఉండేది. కానీ ఆ తర్వాత జపాన్ కంపెనీల బైకులు భారత మార్కెట్‌ను ముంచెత్తిన తర్వాత ఇవి కనుమరుగయ్యాయి. మళ్లీ 2016లో దేశీ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా భారత ఉపఖండంలో జావా మోటార్‌సైకిల్స్ తయారీ, విక్రయానికి లైసెన్సు తీసుకుంది. కానీ రెండేళ్ల పాటు ఎలాంటి ఊసు లేదు. నాలుగు నెలల క్రితం జావాను ప్రవేశపెడుతున్నామంటూ మహీంద్రా ప్రకటించిన తర్వాత ఇది మళ్లీ జీవం పోసుకుంది. రాయల్ ఎన్ఫీల్డ్ 350కి పోటీగా బరిలోకి దిగింది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించిన మరిన్ని విశేషాలు.. ►చెకోస్లొవేకియాకి చెందిన ఫ్రాటిసెక్ జానెసెక్ 1929లో జావా మోటార్‌సైకిల్‌ను రూపొందించారు. అప్పట్లో వాండరర్ అనే మోటార్‌సైకిల్ సంస్థను కొనుగోలు చేసిన జానెసెక్.. తన పేరులోని తొలి అక్షరాన్ని వాండరర్లోని మొదటి అక్షరాన్ని కలిపి జావా అని కొత్త బైక్‌కు పేరు పెట్టారు. మొదట్లో 500 సీసీ బైక్స్ మాత్రమే తయారు చేసినా.. ఆ తర్వాత జనసామాన్యానికి చేరువయ్యే ఉద్దేశంతో 175 సీసీ బైక్‌లను, అటు పైన 250, 350 సీసీ బైక్‌లను రూపొందించారు. ► 1960లలో జావా మోటార్‌సైకిల్స్ భారత్‌లోకి ప్రవేశించాయి. రుస్తుం, ఫారూఖ్ ఇరానీలు ఏర్పాటు చేసిన ఐడియల్ జావా సంస్థ వీటిని దిగుమతి చేసుకుని విక్రయించేది. అనతికాలంలోనే బాగా పటిష్టమైన బైక్‌లుగా ఇవి ప్రాచుర్యంలోకి వచ్చాయి. ఇక్కడి డిమాండ్‌ను గుర్తించి అప్పట్లో మైసూర్లో తయారీ ప్లాంటును కూడా ఏర్పాటు చేశారు. 1961–71 మధ్య కాలంలో జావా కంపెనీ నుంచి లైసెన్సు తీసుకుని ఐడియల్ జావా వీటిని ఇక్కడ తయారు చేసేది. అటుపై 1971 నుంచి జావా సాంకేతిక సహకారంతో ఐడియల్ జావా కంపెనీ కొత్తగా యెజ్డీ పేరిట మోటార్‌సైకిల్స్‌ను విక్రయించింది. ఆ తర్వాత యూరప్‌లో పలు ప్రాంతాల్లో జావా మోటార్‌సైకిల్స్ తయారీ కొనసాగినప్పటికీ.. 1996లో భారత్‌లో కార్యకలాపాలు నిలిచిపోయాయి. ఇన్నాళ్లకు మళ్లీ మొదలయ్యాయి. -
యూత్ కోసం హీరో ఎక్స్ట్రీమ్ 200ఆర్
న్యూఢిల్లీ: హీరో మోటోకార్ప్ మరోసారి ప్రీమియం మోటార్ సైకిల్ విభాగంలోకి అడుగుపెట్టింది. ప్రత్యేకించి యువతను లక్ష్యించి... 200సీసీ సెగ్మెంట్లో సరికొత్త ప్రీమియం బైక్‌ను సోమవారం మార్కెట్లోకి విడుదల చేసింది. ‘ఎక్స్ట్రీమ్ 200ఆర్’ పేరిట అందుబాటులోకి వచ్చిన ఈ టూవీలర్‌ను యాంటీ లాక్ బ్రేక్ సిస్టమ్, ఎయిర్ కూల్డ్ ఇంజిన్ టెక్నాలజీతో రూపొందించినట్లు కంపెనీ తెలిపింది. ఢిల్లీలో దీని ఎక్స్–షోరూం ధర రూ.89,900. పండుగల సీజన్ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఈ కొత్త బైక్ ద్వారా అమ్మకాలు గణనీయంగా పెరిగి మార్కెట్ వాటా బలపడుతుందని భావిస్తున్నట్లు హీరో మోటోకార్ప్ సీఈఓ పవన్ ముంజాల్ చెప్పారు. 200సీసీ విభాగంలో మార్కెట్ వాటా పెంచుకోవడంలో భాగంగా ఎక్స్‌పల్స్ 200 వంటి పలు మోడళ్లను విడుదలచేయనున్నామని ఆయన వెల్లడించారు.