TVS Apache RTR 160 4V 2021 Model Price in India - Sakshi
Sakshi News home page

సరికొత్తగా టీవీఎస్‌ అపాచీ బైక్‌ : ధర?

Published Wed, Mar 10 2021 3:57 PM | Last Updated on Wed, Mar 10 2021 6:31 PM

2021 TVS Apache RTR 160 4V launched Check price details - Sakshi

సాక్షి, ముంబై: టీవీఎస్ మోటార్ కొత్త అపాచీ బైక్‌ను మార్కెట్లో  విడుదల చేసింది.  2021 టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 160 4వీ మోటార్‌సైకిల్‌ను బుధవారం విడుదల చేసినట్లు రెగ్యులేటరీ ఫైలింగ్‌లో కంపెనీ తెలిపింది. ఈ కొత్త బైక్‌ రెండు వేరియంట్లలో అందుబాటులో ఉండనుంది. డిస్క్‌ వేరియంట్‌ ధర రూ.1,10,320,డ్రమ్‌ వేరియంట్‌ ధర రూ.1,07,270 (ఎక్స్‌షోరూం, న్యూఢిల్లీ ధరలు) గా  కంపెనీ నిర్ణయించింది. రేసింగ్‌ రెడ్‌, నైట్‌ బ్లాక్‌, మెటాలిక్‌ బ్లూ మొత్తం మూడు రంగుల్లో అందుబాటులో ఉండనున్నట్లు కంపెనీ వెల్లడించింది.

 టీవీఎస్  అపాచీ ఆర్టీఆర్ 160 4వీ కొత్త బూక్‌లో  159.7 సీసీ సింగిల్‌ సిలిండర్‌, 4 వాల్వ్‌, ఆయిల్‌ కూల్డ్‌  అధునాతన  ఇంజీన్‌ అమర్చినట్టు తెలిపింది.  ఇది 9,250 ఆర్‌పీఎం వద్ద 17.38 హెచ్‌పీ శక్తిని, 7,250 ఆర్‌పీఎం వద్ద 14.73 ఎన్‌ఎం టార్క్‌ని ప్రొడ్యూస్‌ చేస్తుంది. కిల్ కార్బన్ ఫైబర్ నమూనాతో సరికొత్త డ్యూయల్ టోన్ సీటు,ఎ ల్‌ఈడీ హెడ్‌ల్యాంప్‌, క్లా స్టైల్డ్‌ పొజిషన్‌ ల్యాంప్‌లు  ఇతర కీలక ఫీచర్లతో ప్రీమియం లుక్‌తో ఆకట్టుకోనుంది.  ఫైవ్‌ స్పీడ్‌ సూపర్-స్లిక్  గేర్‌బాక్స్‌ కలిగిన ఈ బైక్‌ ఈ సెగ్మెంట్‌లో అత్యంత శక్తిమంతమైన రైడింగ్‌ అనుభూతినిస్తుందని టీవీఎస్  మోటార్ కంపెనీ హెడ్ (మార్కెటింగ్) ప్రీమియం మోటార్ సైకిల్స్ మేఘశ్యామ్ దిఘోలే వెల్లడించారు. అలాగే పాత అపాచీల వెర్షన్‌లతో పోలిస్తే ఈ కొత్త బైక్‌ రెండు కిలోల బరువు తక్కువ ఉంటుంది. డిస్క్ వేరియంట్ 147 కిలోల బరువు, డ్రమ్ వేరియంట్ 145 కిలోల బరువు ఉంటుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement