
సాక్షి, ముంబై: మోస్ట్ ఎవైటెడ్ మారుతి సుజుకి ఆల్టో K10 2022 మోడల్ వచ్చేసింది. నేడు (గురువారం, ఆగస్టు 18) మారుతి సుజికి ఇండియా లాంచ్ చేసింది. మారుతి చల్ పడీ అంటూ ఆల్టో K10 2022 ను తీసుకొచ్చింది. రెడ్ అండ్ బ్లూ రంగుల్లో ఆవిష్కరించింది. ఆల్టో K10 2022 కేవలం ప్రారంభ రూ. 3, 99,000 గా కంపెనీ నిర్ణయించింది. మొత్తం నాలుగు వేరియంట్లలో ఈ న్యూ వెర్షన్ ఆల్టో K10 2022 లభించనుంది. (ప్రత్యేక డిపాజిట్ స్కీమ్: లక్ష డిపాజిట్ చేస్తే దాదాపు లక్షా 28 వేలు!)
మారుతి సుజుకి ఇప్పటికే కొత్త 2022 ఆల్టో కోసం బుకింగ్‌లను ప్రారంభించింది. ఆసక్తిగల కొనుగోలు దారులు ఆల్టోను రూ. 11,000తో బుక్ చేసుకునే అవకాశాన్ని కల్పించింది. కొత్త మారుతి సుజుకి ఆల్టో కె10 మారుతి సుజుకి ఆల్టో 800 ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్‌తో పాటు కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది.
(ఇది చదవండి: నా 30 ఏళ్ల అనుభవంలో తొలిసారి: ఎయిర్‌టెల్ చైర్మన్ ఆశ్చర‍్యం, ప్రశంసలు)
కాగా మారుతి సుజుకి ఆల్టో భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న కార్లలో ఒకటి. కంపెనీ ఇప్పటి వరకు ఈ కారును 40 లక్షల యూనిట్లకు పైగా విక్రయించింది. ఆల్టో ఫస్ట్ జనరేషన్ 2000లో ఆల్టో 800గా లాంచ్ అయిన సంగతి తెలిసిందే. కొత్త మారుతి సుజుకి ఆల్టో కె10కి రెనాల్ట్ నుండి మాత్రమే పోటీ ఇస్తుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. (రియల్‌మీ 5జీ ఫోన్, ఇయర్ బడ్స్ లాంచ్: ఇంత తక్కువ ధరలోనా సూపర్!)
Comments
Please login to add a commentAdd a comment