new version
-
టాలీ నుంచి ప్రైమ్ 5.0
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వ్యాపార నిర్వహణ సాఫ్ట్వేర్ సంస్థ టాలీ తాజాగా ఏపీఐ ఆధారిత టాలీప్రైమ్ 5.0 వెర్షన్‌ను ప్రవేశపెట్టింది. జీఎస్టీ పోర్టల్‌ను సందర్శించాల్సిన అవసరం లేకుండా ‘కనెక్టెడ్ జీఎస్టీ’ ఫీచరు పొందుపర్చిన ఈ సమగ్ర వెర్షన్‌తో సంస్థలకు సమయం ఆదా అవుతుంది. అలాగే కచి్చతత్వం పెరుగుతుందని కంపెనీ సౌత్ జోన్ జీఎం అనిల్ భార్గవన్ తెలిపారు. ప్రస్తుతం తమకు రెండు తెలుగు రాష్ట్రాల్లో 1.20 లక్షల పైచిలుకు కస్టమర్లు ఉన్నారని చెప్పారు. వచ్చే మూడేళ్లలో 30–40 శాతం వృద్ధిని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. దేశవ్యాప్తంగా 25 లక్షలుగా ఉన్న కస్టమర్లను 2026–27 నాటికి 35 లక్షలకు పెంచుకోనున్నట్లు వివరించారు. ఇందుకోసం ఏటా మరిన్ని కొత్త ఉత్పత్తులను ప్రవేశపెడుతున్నట్లు అనిల్ వివరించారు. -
AP: 25 నుంచి 31 వరకు ఈ–ఆఫీస్‌లు పనిచేయవు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గ్రామ పంచాయతీ స్థాయి నుంచి సచివాలయ శాఖలు, శాఖాధిపతులు, స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థలు, రాష్ట్ర యూనిట్లు, జిల్లా ప్రభుత్వ కార్యాలయాలన్నింటిలో ఈ–ఆఫీస్‌లను ప్రస్తుత వెర్షన్ నుంచి కొత్త వెర్షన్‌కు మార్పు చేస్తున్నారు. అందువల్ల ఈ నెల 25 నుంచి 31వ తేదీ వరకు ప్రస్తుత పాత వెర్షన్‌లోని ఈ–ఆఫీస్‌లు పనిచేయబోవని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ ఆరు రోజుల్లో కార్యాలయాల్లో కార్యకలాపాలు సజావుగా సాగేందుకు ఆయా శాఖల ఉన్నతాధికారులు అవసరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కేఎస్ జవహర్ రెడ్డి ఆదేశించారు. కొత్త వెర్షన్ ఈ–ఆఫీస్‌లు ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి అందుబాటులోకి వస్తాయన్నారు. అప్పటి వరకు ప్రభుత్వ కార్యకలాపాలకు సంబంధించి ఉత్తరప్రత్యుత్తరాలు కొనసాగేలా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాల్సిందిగా సీఎస్ సూచించారు. కొత్త వెర్షన్‌పై ఈ నెల 23, 24 తేదీల్లో గ్రామ పంచాయతీ స్థాయి నుంచి అన్ని ప్రభుత్వ కార్యాలయాల వరకు మాస్టర్ శిక్షకులను డెవలప్ చేయనున్నట్లు ఐటీ శాఖ పేర్కొంది. రాష్ట్ర సచివాలయంలోని ఐదో బ్లాక్‌లో మాస్టర్ శిక్షకులకు శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపింది. సచివాలయ శాఖలు, శాఖాధిపతుల కార్యాలయాల నుంచి మాస్టర్ శిక్షణకు సిబ్బందిని పంపాలని ఐటీ శాఖ సూచించింది. -
మెర్సిడెస్ కొత్త వర్షన్స్ భారత్‌కు వచ్చేశాయ్! ధరలు ఇవే..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: లగ్జరీ కార్ల తయారీలో ఉన్న మెర్సిడెస్ బెంజ్ 2023 వర్షన్ ఎంట్రీ లెవెల్ సెడాన్ అయిన ఏ–క్లాస్ లిమోసిన్‌ను రూ.45.80 లక్షల ధరలో ప్రవేశపెట్టింది. ఎనిమిదేళ్ల వారంటీ ఉంది. 10.25 అంగుళాల ఎంబీయూఎక్స్ డిజిటల్ డిస్ప్లే, 17 అంగుళాల 5 స్పోక్ అలాయ్ వీల్స్, కొత్త ఎల్ఈడీ టెయిల్ లైట్స్, 7 ఎయిర్‌బ్యాగ్స్ పొందుపరిచారు. అలాగే ఎంట్రీ లెవెల్ పెర్ఫార్మెన్స్ హ్యాచ్‌బ్యాక్ ఏ 45 ఎస్ ఏఎంజీ 4మేటిక్ ప్లస్‌ను రూ.92.5 లక్షల ధరలో పరిచయం చేసింది. 2.0 లీటర్ 4 సిలిండర్ టర్బోచార్జ్డ్ ఏఎంజీ పెట్రోల్ ఇంజన్‌తో తయారైంది. గంటకు 100 కిలోమీటర్ల వేగాన్ని 3.9 సెకన్లలో అందుకుంటుంది. ఇదీ చదవండి: ర్యాపిడో బైక్ కెప్టెన్లకు గుడ్ న్యూస్.. ఇకపై మరింత ఆదాయం -
కియా నుంచి మరో నయా కారు లాంచ్ - ధర ఎంతో తెలుసా?
భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన దక్షిణ కొరియా కార్ల తయారీ సంస్థ కియా మోటార్స్ దేశీయ మార్కెట్లో 'సోనెట్ ఆరోక్స్' (Sonet Aurochs) అనే కొత్త ఎడిషన్ విడుదల చేసింది. ఈ లేటెస్ట్ ఎడిషన్ హెచ్టిఎక్స్ వేరియంట్‌పై ఆధారపడి ఉంటుంది కానీ కొన్ని కాస్మెటిక్ అప్డేట్స్ పొందుతుంది. ఈ కియా కారు గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ధర & కలర్ ఆప్షన్స్ మార్కెట్లో అడుగుపెట్టిన కియా కొత్త ఎడిషన్ ప్రారంభ ధర రూ. 11.85 లక్షలు(ఎక్స్-షోరూమ్). ఇది మొత్తం నాలుగు వేరియంట్లలో లభిస్తుంది. అవి 1.0 లీటర్ పెట్రోల్ iMT, 1.0 లీటర్ పెట్రోల్ DCT, 1.5 లీటర్ డీజిల్ iMT, 1.5 లీటర్ డీజిల్ AT. కియా సోనెట్ ఆరోక్స్ నాలుగు కలర్స్ లో లభిస్తుంది. అవి గ్రావిటీ గ్రే, అరోరా బ్లాక్ పెర్ల్, స్పార్క్లింగ్ సిల్వర్, గ్లేసియర్ వైట్ పెర్ల్ కలర్స్. డిజైన్ సోనెట్ ఆరోక్స్ గతంలో అమ్ముడైన యానివెర్సరీ ఎడిషన్ మాదిరిగానే ఫ్రంట్ అండ్ రియర్ స్కిడ్ ప్లేట్స్, సెంటర్ వీల్ క్యాప్స్, గ్రిల్, డోర్ గార్నిష్, సైడ్ స్కిడ్ ప్లేట్లపై టాన్జేరిన్ యాక్సెంట్ వంటి వాటిని పొందుతుంది. ముందు భాగంలో Aurochs బ్యాడ్జ్ చూడవచ్చు. ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్, టెయిల్ లైట్స్ కలిగి రియర్ ఫ్రొఫైల్ లో 16 ఇంచెస్ డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్ పొందుతుంది. ఫీచర్స్ 2023 సోనెట్ ఆరోక్స్ 8.0 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, వైర్లెస్ ఆపిల్ కార్ప్లే & ఆండ్రాయిడ్ ఆటో కనెక్టివిటీతో పాటు ఫ్లాట్-బాటమ్ స్టీరింగ్ వీల్, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, హైట్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్, క్రూయిజ్ కంట్రోల్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, రియర్ ఏసీ వెంట్స్ మొదలైనవి ఉన్నాయి. (ఇదీ చదవండి: జొమాటో సీఈఓ అద్భుతమైన కార్ల ప్రపంచం - చూద్దాం రండి!) ఇంజిన్ & స్పెసిఫికేషన్స్ కొత్త సోనెట్ ఆరోక్స్ ఎడిషన్ లో 1.0 లీటర్ టర్బో పెట్రోల్ & 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ ఉంటాయి. పెట్రోల్ ఇంజిన్ 118 bhp పవర్, 172 ఎన్ఎమ్ టార్క్ అందిస్తాయి. డీజిల్ ఇంజిన్ 114 bhp పవర్, 250 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తాయి. ఇంజిన్ 6 స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్, 7-స్పీడ్ డ్యూయెల్ క్లచ్ ట్రాన్స్మిషన్ పొందుతుంది. -
ఇన్నోవా క్రిస్టాలో రెండు కొత్త గ్రేడ్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కొత్త ఇన్నోవా క్రిస్టా వాహనానికి సంబంధించి రెండు టాప్ గ్రేడ్ల (జెడ్ఎక్స్, వీఎక్స్) ధరలను టయోటా కిర్లోస్కర్ మోటర్ (టీకేఎం) ప్రకటించింది. ఇందులో జెడ్ఎక్స్ గ్రేడ్ ధర రూ. 25.43 లక్షలు కాగా, వీఎక్స్ రేటు వేరియంట్‌ను బట్టి రూ. 23.79–23.84 లక్షలుగా (ఎక్స్ షోరూం) ఉంటుందని తెలిపింది. వీటిలో 7 ఎయిర్బ్యాంగ్లు, ముందు..వెనుక పార్కింగ్ సెన్సార్లు, స్మార్ట్ ఎంట్రీ సిస్టమ్ వంటి ఫీచర్లు ఉంటాయని పేర్కొంది. దీనితో ప్రస్తుతం మొత్తం నాలుగు గ్రేడ్లలో (జీ, జీఎక్స్, వీఎక్స్, జెడ్ఎక్స్) కొత్త ఇన్నోవా క్రిస్టా లభిస్తున్నట్లవుతుందని సంస్థ వైస్ ప్రెసిడెంట్ అతుల్ సూద్ తెలిపారు. రూ. 50,000 చెల్లించి ఆన్లైన్లో లేదా డీలర్ల దగ్గర బుక్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. -
ప్రయాణికులకు మరో గుడ్ న్యూస్.. త్వరలో కొత్త వెర్షన్ వందే భరత్ రైళ్లు
-
వాట్సాప్‌లో కొత్త ఫీచర్స్.. లుక్ మొత్తం మారనుందా?
ప్రపంచంలో ఇప్పటివరకు ఉన్న మోస్ట్ పాపులర్ మేసేజింగ్ యాప్‌లో బెస్ట్ ఏదంటే అందరూ చెప్పే సమాధానం 'వాట్సాప్' (WhatsApp). ఎంతో మంది నిత్యజీవితంలో భాగమైపోయిన ఈ యాప్‌లో ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్స్ అందుబాటులోకి వస్తూనే ఉన్నాయి. అయితే త్వరలో ‘వాట్సాప్’ లుక్ మారే అవకాశాలు ఉన్నట్లు పుకార్లు వినిపిస్తున్నాయి. నివేదికల ప్రకారం ఆండ్రాయిడ్ యాప్‌కు కొత్త 'యూజర్ ఇంటర్ఫేస్' ను వాట్సాప్ టెస్ట్ చేస్తోంది. ఇది మునుపటికంటే చాలా ఆధునికంగా ఉండటమే కాకుండా ఫీచర్లను యూజర్లు సులభంగా ఉపయోగించుకునే విధంగా ఉంటుందని తెలుస్తోంది. డబ్ల్యూఏబీటాఇన్ఫో వెల్లడించిన రిపోర్ట్ ప్రకారం, ఆండ్రాయిడ్ యాప్ యూఐను పూర్తిగా మార్చేందుకు వాట్సాప్ సన్నదవుతోంది. ఇందులో భాగంగానే యాప్ బాటమ్‌లో నేవిగేషన్ బార్‌ను యాడ్ చేస్తోంది. బాటమ్ బార్లో చాట్స్, కమ్యూనిటీస్, స్టేటస్, కాల్స్ ట్యాబ్స్ ఉంటాయని దీనికి సంబంధించిన కొన్ని ఫొటోలను కూడా విడుదల చేసింది. (ఇదీ చదవండి: అనంత్ అంబానీ ధరించిన వాచ్ స్పెషలేంటో తెలుసా? ఎన్ని కోట్లు ఉంటుందంటే..?) త్వరలో అందుబాటులోకి రానున్న కొత్త ఫీచర్స్ అన్నీ దాదాపు వాట్సాప్ ఆండ్రాయిడ్ యాప్‌ని ఐఓఎస్ యాప్‌లాగా మార్చే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. బీటా అప్డేట్ 2.23.8.4 ఆండ్రాయిడ్ వెర్షన్లో వాట్సాప్ టెస్ట్ చేస్తున్నట్లు డబ్ల్యూఏబీటాఇన్ఫో వెల్లడించింది. ఇప్పటికీ కొంత మంది వాట్సాప్ బీటా యూజర్లకు కొత్త ఇంటర్ఫేస్తో కూడిన అప్డేట్ వచ్చేసింది. ఒకవేళ సాధారణ యూజర్ అయితే ఈ అప్డేట్ కోసం మరి కొన్ని రోజులు ఎదురుచూడాల్సి ఉంటుంది. బీటా యూజర్లు టెస్ట్ చేసిన తరువాత అందులో బగ్స్ ఏవీ లేవని నిర్దారించుకున్న తరువాత అప్డేట్ను వాట్సాప్ అందుబాటులోకి తెస్తుంది. (ఇదీ చదవండి: దేశీయ మార్కెట్లో నయా కారు విడుదల చేసిన కియా మోటార్స్ - పూర్తి వివరాలు) అంతే కాకుండా వాట్సాప్ ఎడిట్ ఫీచర్‌ను కూడా టెస్ట్ చేస్తోంది. ఇది మెసేజ్ సెండ్ చేసిన తరువాత కూడా ఎడిట్ చేసుకోవడానికి అనుమతిస్తుంది. ప్రస్తుతం ఉన్న ఫీచర్స్ ప్రకారం మనం పంపించే మెసేజ్‌లో తప్పు ఉంటే దానిని డిలీట్ చేయడమే తప్పా వేరే మార్గం లేదు. వాట్సాప్ ఎడిట్ ఫీచర్ అందుబాటులో వచ్చిన తరువాత ఈ ఇబ్బందికి చెక్ పెట్టేయొచ్చు. అయితే ఈ ఫీచర్ ఎప్పుడు అందుబాటులోకి వస్తుందనేది ఖచ్చితంగా తెలియదు. -
సరికొత్త ఫీచర్లతో బజాజ్ పల్సర్ ఎన్ఎస్ సిరీస్
హైదరాబాద్: బజాజ్ ఆటో తన పల్సర్ ఎన్ఎస్ నేకెడ్ స్ట్రీట్‌ఫైటర్ లైన్‌కు అప్డేట్ వెర్షన్‌ను విడుదల చేసింది. ఈ సిరీస్‌లోని ఎన్ఎస్ 160, ఎన్ఎస్ 200 మోడళ్లను సరికొత్త ఫీచర్లతో తీసుకొచ్చింది. వీటి ధరలు వరుసగా రూ.1.35 లక్షలు.., రూ.1.47 లక్షలుగా ఉన్నాయి. మంచి హ్యాండ్లింగ్ కోసం యూఎస్డీ ఫ్రంట్ ఫోర్క్‌లు, మెరుగైన భద్రతకు డ్యూయల్ చానల్ ఏబీఎస్ను అమర్చారు. ఇన్ఫినిటీ డిస్ప్లే కొత్త పల్సర్లలో ప్రత్యేకం. డిస్ప్లే కన్సోల్‌లో ఇప్పుడు గేర్ పొజిషన్ ఇండికేటర్ కూడా ఉంది. ఎన్ఎస్ 200 మోడల్ 18.75 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 6-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో జత చేశారు. ఎన్ఎస్ 160 మోడల్ 14.6 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. బజాజ్ పల్సర్ పల్సర్ ఎన్ఎస్ 160, ఎన్ఎస్ 200లు మెటాలిక్ పెరల్ వైట్, గ్లోసీ ఎబోనీ బ్లాక్, శాటిన్ రెడ్ , ప్యూటర్ గ్రే రంగులలో లభ్యం. -
త్వరలోనే మోటరోలా కొత్త వర్షన్ మడత ఫోన్లు.. ప్రకటించిన సీఈవో
మోటరోలా కొత్త వర్షన్ మడత ఫోన్లు త్వరలోనే మార్కెట్లోకి విడుదల కానున్నాయి. ఈ ఏడాదిలోనే మోటరోలా రేజర్ (Motorola Razr) ఫోల్డబుల్ కొత్త వర్షన్ ఫోన్లను విడుదల చేయనున్నట్లు లెనోవో సీఈవో యువాన్‌కింగ్ యాంగ్ తెలిపారు. దశాబ్దాల క్రితం బాగా పాపులరైన మడత ఫోన్ మోడళ్లు ప్రస్తుత స్మార్ట్ ఫోన్ యుగంలో మళ్లీ ఆదరణ పొందుతున్నాయి. 2000 సంవత్సరంలో మోటరోలా రేజర్ మడత ఫోన్ బాగా పాపులర్ అయిన ఫోన్లలో ఒకటి. మోటరోలా సంస్థను గూగుల్ నుంచి 2014లో లెనోవో సంస్థ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. బార్సిలోనాలో జరిగిన మొబైల్ వరల్డ్ కాంగ్రెస్‌లో పాల్గొన్న సందర్భంగా సీఎన్‌బీసీ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో లెనోవో సీఈవో యువాన్‌కింగ్ యాంగ్ మోటరోలా రేజర్ ఫోన్ గురించి మాట్లాడారు. కొత్త వర్షన్ మడత ఫోన్‌ను త్వరలోనే విడుదల చేస్తామని చెప్పారు. రాబోయే స్మార్ట్‌ఫోన్ గురించిన వివరాలను ఎక్కువగా ప్రస్తావించని ఆయన ఆ ఫోన్లో అప్లికేషన్లు, ఇతర ఫీచర్లు మాత్రం అందరికీ నచ్చేలా ఉంటాయన్నారు. ఫోల్డబుల్ ఫోన్ల ధరలు ప్రస్తుతం చాలా ఎక్కువగా ఉన్నప్పటికీ, భవిష్యత్తులో తగ్గుతాయని పేర్కొన్నారు. చదవండి: రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్.. మరో ట్రావెల్ క్రెడిట్ కార్డ్! కాగా ఈ మొబైల్ వరల్డ్ కాంగ్రెస్‌లో మోటరోలా తన ‘రోలబుల్’ కాన్సెప్ట్ స్మార్ట్‌ఫోన్‌ను కూడా ప్రదర్శించింది. ఇందులో రోల్ అప్ డిస్ప్లే ఉంటుంది. అంటే ఫోన్ డిస్ప్లేను కింది నుంచి పైకి జరపవచ్చన్న మాట. చదవండి: WTW Report: పెరగనున్న జీతాలు.. ఆసియా-పసిఫిక్‌లో భారత్ టాప్! -
గుడ్‌న్యూస్: క్విక్ హీల్ న్యూ వెర్షన్ 23 లాంచ్
పుణె: సైబర్ సెక్యూరిటీ సొల్యూషన్లు అందించే ‘క్విక్ హీల్’ మాల్వేర్ను గుర్తించే ‘వెర్షన్ 23’ని విడుదల చేసింది. వ్యవస్థలపై సైబర్ దాడులను గుర్తించడమే కాకుండా, ముప్పు తీవ్రతను అంచనా వేస్తుందని కంపెనీ తెలిపింది. లోతైన విశ్లేషణ టూల్స్‌తో దాడులను నిరోధిస్తుందని వెల్లడించింది. దీనివల్ల సైబర్ దాడుల ముప్పును గుర్తించే సమయం గణనీయంగా తగ్గుతుందని పేర్కొంది. ర్యామ్‌సమ్‌వేర్ నుంచి రక్షణ, ఎప్పటికప్పుడు ఇంజన్ స్కానింగ్, యాంటీ ట్రాకర్, బ్రీచ్ అలర్ట్ తదితర ఫీచర్లతో ఈ నూతన టెక్నాలజీ పనిచేస్తుందని తెలిపింది. ‘‘కరోనా సంక్షోభం తర్వాత సైబర్ దాడులు అసాధారణ స్థాయిలో పెరిగాయి. ఈ దాడులు ఎంతో అత్యాధునికంగా ఉంటున్నాయి. కనుక వీటిని సాధారణ యాంటీ వైరస్లు గుర్తించలేవు. దీన్ని దృష్టిలో పెట్టుకుని వెర్షన్ 23ని రూపొందించాం’’అని క్విక్ హీల్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ సంజయ్ కట్కర్ తెలిపారు. -
ఇదో రకం బాదుడు, యూట్యూబ్ తరహాలో వాట్సాప్ ప్రీమియం సర్వీస్.. పైసలు కట్టాల్సిందే!
వాట్సాప్‌లో(WhatsApp) కూడా యూట్యూబ్ తరహాలో త్వరలో ప్రీమియం అకౌంట్ సర్వీసును అందించనుంది. అంటే ఈ ప్రత్యేక సర్వీస్‌ను పొందాలంటే సబ్స్క్రిప్షన్ తప్పనిసరి చేయనుంది. ప్రస్తుతం పలువురు బీటా వినియోగదారులతో ఈ కొత్త వెర్షన్‌ను టెస్ట్ చేస్తోంది. ఈ కొత్త సర్వీస్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకునే వాళ్లకు ప్రీమియం మెనూ, అదనపు ఫీచర్లుంటాయని తెలిపింది. అయితే సాధారణ యూజర్లు కంగారుపడాల్సిన అవసరం లేదని ఈ కొత్త WhatsApp ప్రీమియం సబ్స్క్రిప్షన్ కేవలం వాట్సాప్ బిజినెస్ వెర్షన్ కోసం విడుదల చేయనున్నట్లు తెలిపింది. వాళ్ల కోసమే ప్రీమియం సర్వీస్ కొత్తగా రాబోతోన్న ఈ సర్వీస్‌లో ప్రత్యేక నేమ్‌తో వాట్సాప్ కాంటాక్ట్ లిస్టునూ క్రియేట్ చేసుకుని అందరికీ షేర్ చేసుకోవచ్చు. అంతేకాక ఏకకాలంలో 10 డివైజ్‌లలో లాగిన్ అయ్యే ఆప్షన్ కూడా ఉంటుంది. ప్రీమియం వెర్షన్లో 32 మందితో వీడియో కాల్ మాట్లాడవచ్చ. వీటికి ఎంత వరకు ఛార్జ్ చేస్తారు అనేది తెలియాల్సి ఉంది. కాగా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వంటి ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫాంల ద్వారా మెటా ఇప్పటికే చాలా ఆదాయాన్ని పొందుతుంది. ఎలాంటి ప్రకటనలు లేదా సబ్స్క్రిప్షన్ ప్లాన్లు వంటి ఆదాయ వనరులు లేకుండా సంస్థ కస్టమర్లకు ఉచితంగా అందిస్తున్న ఏకైక సేవ WhatsApp మాత్రమే. అందుకే దీని నుంచి కూడా ఆదాయాన్ని ఆర్జించాలని సంస్థ భావిస్తోంది. అందుకోసమే నిర్దిష్ట వ్యాపారాల కోసం ప్రీమియం సబ్స్క్రిప్షన్ ప్లాన్లను తీసుకురాబోతందని తెలిపింది. వాట్సాప్‌లో కొత్తగా రాబోతున్న ప్రీమియం వర్షన్ ఐచ్ఛికం మాత్రమేనని తప్పనిసరిగా సబ్స్క్రిప్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదని కంపెనీ వెల్లడించింది. చదవండి: టాటా టియాగో ఈవీకి రెస్పాన్స్ అదిరింది.. రికార్డ్ బుకింగ్స్‌తో షాకైన కంపెనీ! -
హ్యుందాయ్ ఎన్–లైన్ మెటావర్స్ కమింగ్ సూన్, బుకింగ్స్ షురూ!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: హ్యుందాయ్ మోటార్ ఇండియా వెన్యూ ఎన్–లైన్ బుకింగ్స్‌ను ప్రారంభించింది. సెప్టెంబర్ 6న ఈ కొత్త మోడల్ భారత్‌లో రంగ ప్రవేశం చేయనుంది. అప్డేటెడ్ ఫీచర్లతో హ్యుందాయ్ ఇండియా కొత్త వెర్షన్ ధరను కంపెనీ సెప్టెంబర్ 6వ తేదీన ప్రకటించనుంది. అయితే బుకింగ్స్ ఓపెన్ చేసింది. అధికారిక వెబ్సైట్లో రూ.21,000 చెల్లించి ఆన్‌లైన్‌ద్వారా బుక్ చేసుకోవచ్చు. హ్యుందాయ్ ఇండియా కొత్త వెన్యూ ఎన్-లైన్ మెటావర్స్ శ్రేణిలో ఐ20 ఎన్-లైన్ తర్వాత రెండో మోడల్. స్పోర్టీ లుక్స్, మెరుగైన పనితీరు ఈ శ్రేణి ప్రత్యేకత. కారు లోపల, వెలుపల పలు మార్పులు చేశారు. 1.0 లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్ పొందుపరిచారు. 7 స్పీడ్ డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్, డిస్క్ బ్రేక్స్ ఏర్పాటు ఉంది. -
ఆల్ న్యూ ఆల్టో కే10- 2022 వచ్చేసింది.. మోర్ ఎనర్జీ ఫీచర్స్‌తో
సాక్షి, ముంబై: మోస్ట్ ఎవైటెడ్ మారుతి సుజుకి ఆల్టో K10 2022 మోడల్ వచ్చేసింది. నేడు (గురువారం, ఆగస్టు 18) మారుతి సుజికి ఇండియా లాంచ్ చేసింది. మారుతి చల్ పడీ అంటూ ఆల్టో K10 2022 ను తీసుకొచ్చింది. రెడ్ అండ్ బ్లూ రంగుల్లో ఆవిష్కరించింది. ఆల్టో K10 2022 కేవలం ప్రారంభ రూ. 3, 99,000 గా కంపెనీ నిర్ణయించింది. మొత్తం నాలుగు వేరియంట్లలో ఈ న్యూ వెర్షన్ ఆల్టో K10 2022 లభించనుంది. (ప్రత్యేక డిపాజిట్ స్కీమ్: లక్ష డిపాజిట్ చేస్తే దాదాపు లక్షా 28 వేలు!) మారుతి సుజుకి ఇప్పటికే కొత్త 2022 ఆల్టో కోసం బుకింగ్‌లను ప్రారంభించింది. ఆసక్తిగల కొనుగోలు దారులు ఆల్టోను రూ. 11,000తో బుక్ చేసుకునే అవకాశాన్ని కల్పించింది. కొత్త మారుతి సుజుకి ఆల్టో కె10 మారుతి సుజుకి ఆల్టో 800 ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్‌తో పాటు కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది. (ఇది చదవండి: నా 30 ఏళ్ల అనుభవంలో తొలిసారి: ఎయిర్టెల్ చైర్మన్ ఆశ్చర్యం, ప్రశంసలు) కాగా మారుతి సుజుకి ఆల్టో భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న కార్లలో ఒకటి. కంపెనీ ఇప్పటి వరకు ఈ కారును 40 లక్షల యూనిట్లకు పైగా విక్రయించింది. ఆల్టో ఫస్ట్ జనరేషన్ 2000లో ఆల్టో 800గా లాంచ్ అయిన సంగతి తెలిసిందే. కొత్త మారుతి సుజుకి ఆల్టో కె10కి రెనాల్ట్ నుండి మాత్రమే పోటీ ఇస్తుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. (రియల్మీ 5జీ ఫోన్, ఇయర్ బడ్స్ లాంచ్: ఇంత తక్కువ ధరలోనా సూపర్!) -
2023 ఆడి క్యూ3 బుకింగ్స్ షురూ, తొలి కస్టమర్లకు ఆఫర్లు
సాక్షి, ముంబై: లగ్జరీకార్ల సంస్థ ఆడి 2023 ఆడి క్యూ3ని పరిచయం చేసింది. లగ్జరీ ఎస్యూవీ ఆడి క్యూ3ని ముందస్తు బుకింగ్ కోసం అందుబాటులో ఉంచింది. రూ. 2 లక్షలు చెల్లించి ఈ కారును బుక్ చేసుకోవచ్చు. ఈ ఏడాది చివరి నాటికి డెలివరీలు ప్రారంభమవుతాయని భావిస్తున్నారు. అయితేముందుగా బుక్ చేసిన కస్టమర్లకు బంపర్ ఆఫర్ అందిస్తోంది. (75 వేలకోట్ల పెట్టుబడులు, 24వేల జాబ్స్ , బిగ్ ఇన్వెస్టర్‌గా అదానీ) వినూత్న డిజైన్,బెస్ల్ఇన్ క్లాస్ ఎమినిటీస్‌తో తమ బెస్ట్-సెల్లింగ్ మోడల్ కొత్త ఆడి క్యూ3ని దక్కించుకునేందుకు అద్భుత అవకాశమని ఆడి ఇండియా హెడ్ బల్బీర్ సింగ్ ధిల్లాన్ వెల్లడించారు. వినియోగదారులు www.audi.inలో లేదా 'myAudi కనెక్ట్' యాప్ ద్వారా కారును ఆన్లైన్లో కాన్ఫిగర్ చేసి, ఆర్డర్ చేయవచ్చు. 2023 ఆడి క్యూ 3 2 వేరియంట్లలో అందుబాటులో ఉంది. ప్రీమియం ప్లస్ అండ్, టెక్నాలజీ, క్వాట్రో ఆల్-వీల్ డ్రైవ్ సిస్టమ్‌ను జోడించింది. (Moto G62 5G:మోటో కొత్త 5జీ స్మార్ట్‌ఫోన్, స్పెషల్ ఎట్రాక్షన్ ఏంటంటే?) అలాగే, మొదటి 500 మంది కస్టమర్లు 2+3 సంవత్సరాల పాటు పొడిగించిన వారంటీతోపాటు 3 సంవత్సరాలు లేదా 50వేల కిలోమీటర్లు ఉచిత సర్వీస్ ప్యాకేజీలాంటి ప్రయోజనాలు అందిస్తోంది. దీంతోపాటు ప్రస్తుత ఆడి కస్టమర్లకు ప్రత్యేక లాయల్టీ ప్రయోజనాలను కూడా అందిస్తుంది. పార్కింగ్ ఎయిడ్ ప్లస్ రియర్ వ్యూ కెమెరాతో, స్పీడ్ లిమిటర్‌తో కూడిన క్రూయిజ్ కంట్రోల్ సిస్టమ్, ఎక్స్టీరియర్ మిర్రర్స్, పవర్-అడ్జస్టబుల్, హీటెడ్, పవర్ ఫోల్డింగ్, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, బ్లూటూత్ ఇంటర్ఫేస్,6-స్పీకర్ ఆడియో సిస్టమ్ అందిస్తోంది. 2023 ఆడి క్యూ3లో 2.0-లీటర్ ఫోర్-సిలిండర్ టిఎఫ్ఎస్ఐ పెట్రోల్ ఇంజన్ 190 పిఎస్, 320 ఎన్ఎమ్ పీక్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. 7.3 సెకన్లలో గంటలకు వంద కిలోమీటర్లు వేగం పుంజుకుంటుంది. ప్రీమియమ్ ప్లస్ వేరియంట్లో 18-అంగుళాల 5 ఆర్మ్ స్టైల్ అల్లాయ్ వీల్స్, LED రియర్ కాంబినేషన్ ల్యాంప్స్‌తో కూడిన LED హెడ్‌ల్యాంప్‌లు, పనోరమిక్ గ్లాస్ సన్‌రూఫ్, హై గ్లాస్ స్టైలింగ్ ప్యాకేజీ, 4-వే లంబార్ సపోర్ట్‌తో పవర్ అడ్జస్టబుల్ ఫ్రంట్ సీట్లు ఉండనున్నాయి. -
2023 స్కోడా కొడియాక్ లాంచ్: ఆ లగ్జరీ కార్లకు షాక్!
ముంబై: లగ్జరీ కార్ల తయారీ సంస్థ స్కోడా తన ఫ్టాగ్‌షిప్ కొడియాక్ 2023 వెర్షన్ కారును లాంచ్ చేసింది. దీని ప్రారంభ ధర రూ. 37,49,000 (ఎక్స్-షోరూమ్). ఎంట్రీ-లెవల్ లగ్జరీ 4×4 SUV స్టైల్, స్పోర్ట్‌లైన్ , ఎల్ అండ్ కే మూడు వేరియంట్లు అందుబాటులో ఉంటాయి. అయితే 2023 స్కోడా కొడియాక్ ధర రూ. టాప్-ఎండ్ ఎల్ అండ్ కే వేరియంట్ ధర 39.99 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా కంపెనీ ప్రకటించింది. అయితే ఇవి ఆఫర్ ధరలు మాత్రమే. 2023, మార్చి వరకు మాత్రమే ఈ ఆఫర్ ధరలు అందుబాటులో ఉంటాయి స్కోడా వెల్లడించింది. ప్రస్తుతం బుకింగ్‌లు అందుబాటులో ఉన్నాయి. 50వేలు చెల్లించి అన్ని స్కోడా డీలర్‌షిప్‌లలో ఈ కారును బుక్ చేసుకోవచ్చు. వచ్చే ఏడాది జనవరి, మార్చి మధ్య డెలివరీలు అవుతాయి. గత జనవరిలో లాంచ్ చేసిన స్కోడా మోడల్ 2022 ఎస్యూవీ 48 గంటల్లో మొత్తం 1,200 యూనిట్లు రికార్డ్ స్థాయి సేల్స్‌ను నమోదు చేసిన సంగతి తెలిసిందే. గత ఏడాది మోడల్‌తో పోలిస్తే దాదాపు లక్షన్నన్నర రూపాయల రేటు పెంచింది. 2023 స్కోడా కొడియాక్ ఇంజన్, ఫీచర్లు వోక్స్వ్యాగన్ గ్రూప్ 2-లీటర్ TSI పెట్రోల్ ఇంజన్‌ను అమర్చింది. ఇది 187.7 HP , 320 Nm టార్క్‌ను ప్రొడ్యూస్ చేస్తుంది. ప్రామాణిక 7 స్పీడ్ DSG ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అందించింది. ఇది 7.8 సెకన్లలో 100 కిలోమీటర్ల వేగం పుంజుకుంటుంది. 6 డ్రైవింగ్ మోడ్లలో ఇది లభ్యం. డైనమిక్ ఛాసిస్ కంట్రోల్ (డీసీసీ) CANTON 12-స్పీకర్ 625W సరౌండ్ సౌండ్ సిస్టమ్ వంటి కొన్ని కూల్ సెగ్మెంట్-ఎక్స్‌క్లూజివ్ ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి. బ్లైండ్లు, బ్లాంకెట్స్,అంబరిల్లా, హోల్డర్, పనోరమిక్ సన్‌రూఫ్ వంటి అనేక సూపర్ ఫీచర్లు కూడా ఉన్నాయి. 2023 స్కోడా కొడియాక్ జీప్ కంపాస్, మెరిడియన్, సిట్రోయెన్ సీ5 ఎయిర్‌క్రాస్, వోక్స్వ్యాగన్ టిగువాన్,2023 హ్యుందాయ్ టక్సన్ వంటి వాటికి గట్టి పోటీ ఇవ్వనుంది. -
టాటా టియాగో కొత్త వెర్షన్ వచ్చేసింది! ధర చూస్తే...
సాక్షి, ముంబై: టాటామోటార్స్ టియాగో ఎన్ఆర్జీ ఎక్స్‌టీ కారును బుధవారం లాంచ్ చేసింది. ఎన్ఆర్జీ తొలివార్షికోత్సవాన్ని పురస్కరించు కుని, క్రాస్ఓవర్ వెర్షన్‌గా దీన్ని తీసుకొచ్చింది. 6.42 లక్షలు నుంచి రూ. 7.38 లక్షల (ఎక్స్-షోరూమ్) వద్ద భారత మార్కెట్లో విడుదల చేసింది. అయితే ఊహించినట్టుగానే ఎక్స్‌టీ వేరియంట్‌తో పోలిస్తేకొత్త ఫీచర్లను జోడించిమరీ 41వేల రూపాయల ధర తగ్గించింది. ఇంజీన్, ఫీచర్లు టాటా కొత్త ఎంట్రీ-లెవల్ కారు టియాగో ఎన్ఆర్జీ ఎక్స్‌టీ వేరియంట్ 2 ట్రిమ్‌లలో లభిస్తుంది. మాన్యుల్ గేర్ బాక్స్ 1.2 లీటర్ల పెట్రోల్ ఇంజీన్‌ను పొందుపర్చింది. 14-అంగుళాల హైపర్‌స్టైల్ వీల్స్, హర్మాన్ 3.5-అంగుళాల ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, హైట్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్, ఫ్రంట్ ఫాగ్ ల్యాంప్స్ లాంటి అనేక ఇతర ఫీచర్లు ఉన్నాయి. అలాగే రిథమ్ ప్యాక్ కావాలంటే అదనంగా 30వేలు చెల్లించాలి. మిడ్నైట్ ప్లమ్ కలర్‌తో పాటు ఇప్పటికే ఉన్న ఒపల్ వైట్, డేటోనా గ్రే, అరిజోనా బ్లూ ఫ్లేమ్ రెడ్ కలర్స్‌లో ఇది లభ్యం. The wait is finally over! Introducing the all-new Tiago XT NRG, built for the ones who dare to #LiveDifferent. Get, Set, and #DoMoreWithXTraNRG in your all-new #TiagoXTNRG. Visit https://t.co/Hq2GY0aoPI to book your #Tiago.#TiagoNRG #UrbanToughroader #SeriouslyFun pic.twitter.com/8CNPaaGOV1 — Tata Motors Cars (@TataMotors_Cars) August 3, 2022 -
మారుతీ ఎర్టిగా రూ. 8.35 లక్షల నుంచి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ సంస్థ మారుతీ సుజుకీ మల్టీ పర్పస్ వెహికల్ ఎర్టిగా కొత్త వెర్షన్‌ను విడుదల చేసింది. ఎక్స్‌షోరూంలో ధర రూ.8.35–12.79 లక్షల మధ్య ఉంది. మారుతీ సుజుకీ సబ్‌స్క్రైబ్ విధానంలోనూ కారును సొంతం చేసుకోవచ్చు. చందా నెలకు పెట్రోల్ వేరియంట్ రూ.18,600, సీఎన్జీ అయితే రూ.22,400 చెల్లించాల్సి ఉంటుంది. మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్స్‌తో 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్, క్రూయిజ్ కంట్రోల్, ఫాలో మీ హోమ్ ఫంక్షన్‌తో కూడిన హెడ్‌ల్యాంప్స్‌ను ఈ కారుకు పొందుపరిచారు. సీఎన్జీ వేరియంట్లోనూ ఇది లభిస్తుంది. ప్యాడల్ షిఫ్టర్స్‌తో అత్యాధునిక 6 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో రూపుదిద్దుకుంది. పెట్రోల్ వేరియంట్ లీటరుకు 20.51 కిలోమీటర్లు, సీఎన్జీ కిలోకు 26.11 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుంది. ‘పదేళ్ల క్రితం ఎర్టిగా విడుదల భారతీయ ఆటోమొబైల్ పరిశ్రమలో ఒక ముఖ్యమైన క్షణం. ఇది కొత్త విభాగాన్ని సృష్టించింది. ఈ విభాగం ఏటా సగటున 4.7% వృద్ధి చెందుతోంది’ అని మారుతీ సుజుకీ ఇండియా ఎండీ, సీఈవో హిసాటీ టాకేయూచీ తెలిపారు. ఎక్స్ఎల్6 కొత్త వెర్షన్.. ప్యాసింజర్ కార్ల పరిశ్రమలో మల్టీ పర్పస్ వెహికల్స్ (ఎంపీవీ) విభాగం వాటా 2014–15లో 4–5 శాతమే. ప్రస్తుతం 8–9 శాతానికి చేరింది. అన్ని కంపెనీలు కలిపి నెలకు సుమారు 22,000 యూనిట్లు విక్రయిస్తున్నాయి. ఈ విభాగంలో సంస్థ వాటా దాదాపు రెండింతలై 61 శాతానికి ఎగబాకిందని మారుతీ సుజుకీ ఇండియా మార్కెటింగ్, సేల్స్ సీనియర్ ఈడీ శశాంక్ శ్రీవాస్తవ తెలిపారు. ఈ నెలాఖరులో ఎక్స్ఎల్6 కొత్త వర్షన్ రానుందని ఆయన చెప్పారు. -
రెనో క్విడ్ కొత్త వెర్షన్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ సంస్థ రెనో ఇండియా క్విడ్ కొత్త వెర్షన్‌ను ప్రవేశపెట్టింది. ధర ఎక్స్‌షోరూంలో రూ.4.49 లక్షల నుంచి ప్రారంభం. మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఆప్షన్స్‌తో 0.8 లీటర్, 1.0 లీటర్ పెట్రోల్ పవర్‌ట్రైన్స్‌తో క్విడ్ మై22 క్లైంబర్ శ్రేణి తయారైంది. ఈ మోడల్ భారతీయ మార్కెట్లో ప్రస్తుతం ఉన్న అన్ని భద్రతా అవసరాలకు అనుగుణంగా ఉందని వివరించింది. -
బ్రహ్మోస్ మరింత శక్తివంతం
న్యూఢిల్లీ: బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ మిస్సైల్ కొత్త వెర్షన్‌ను భారత్ అభివృద్ధి చేస్తోంది. వాయుమార్గాన ప్రయోగించే ఈ కొత్త వెర్షన్ బ్రహ్మోస్ 800 కిలోమీటర్లు ప్రయాణం చేసి లక్ష్యాన్ని ఛేదించగలదని అంచనా. ఇప్పటివరకు దీని పరిధి దాదాపు 300 కిలోమీటర్లుంది. బ్రహ్మోస్ రేంజ్ ఎప్పటికప్పుడు వృద్ధి చేస్తూ వస్తున్నారని, సాఫ్ట్‌వేర్‌లో చిన్న మార్పుతో రేంజ్‌ను 500 కిలోమీటర్లు పెంచవచ్చని, తాజాగా దీని టార్గెట్ రేంజ్‌ను 800కిలోమీటర్లకు చేరనుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. దీన్ని సు– 30 ఎంకేఐ కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ నుంచి ప్రయోగిస్తారు. ప్రస్తుతం భారత వాయుసేన వద్ద బ్రహ్మోస్ మిస్సైల్ అమర్చిన సు–30 విమానాలు 40 ఉన్నాయి. -
డుకాటి పనిగలే సరికొత్తగా ...! ధర ఎంతంటే..!
ప్రముఖ ఇటాలియన్ ఆటోమొబైల్ దిగ్గజం డుకాటి భారత మార్కెట్లలోకి సరికొత్త అప్డేట్డ్ వెర్షన్ బైక్‌ను లాంచ్ చేసింది. వీ4 శ్రేణిలో ‘డుకాటి పనిగలే వీ4 ఎస్పీ’ టాప్-ఆఫ్-ది-లైన్ వెర్షన్ బైక్‌ను డుకాటి ఇండియా విడుదల చేసింది. 2021డుకాటి పనిగలే వీ4 ఎస్పీ ధర 36.07 లక్షలు (ఎక్స్‌షోరూమ్)గా ఉంది. దీని ధర డుకాటి వీ4 ఎస్ బైక్ మోడల్ కంటే ఎక్కువ. ట్రాక్ఫోకస్డ్, తేలికైన బైక్ మోడల్‌గా డుకాటి పనిగలే నిలవనుంది. ఇందులో తేలికైన అల్లాయ్ వీల్స్‌తో పాటుగా కార్బన్ ఫైబర్‌తో బైక్ బాడీను రూపొందించారు. దీంతో సుమారు 1.4 కిలోల బరువు తగ్గింది. చదవండి: బిఎమ్‌డబ్ల్యు ఎలక్ట్రిక్ స్కూటర్ ధరెంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే! డుకాటి పనిగలే స్టాండర్డ్ వెర్షన్ డిజైన్‌ను వీ4 ఎస్పీ పొందనుంది. అయితే ఈ బైక్ ప్రత్యేకమైన 'వింటర్ టెస్ట్' డిజైన్‌తో రానుంది. ఈ కొత్త డిజైన్ మోటోజీపీ, ఎస్బీకే మోటర్‌సైకిళ్ల ప్రేరణతో రూపొందించారు. ఫ్యూయల్ ట్యాంక్‌పై ఎరుపు రంగుతో, బ్రష్డ్-అల్యూమినియం ఫినిషింగ్‌తో రానుంది. డుకాటి పనిగలే ఇంజిన్ విషయానికి వస్తే... డెస్మోసెడిసి స్ట్రాడేల్ 1103 సీసీ ఇంజిన్‌తో రానుంది. ఇది 13000 ఆర్పీఎమ్ వద్ద 211 బీహెచ్పీ ఉత్పత్తి చేస్తోంది. 9500ఆర్పీఎమ్ వద్ద 124ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను విడుదల చేయనుంది. ఈ బైక్‌లో 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత చేశారు. ఈ బైక్ ఓపెన్ కార్బన్ ఫైబర్ క్లచ్ కవర్, లైసెన్స్ ప్లేట్ రిమూవల్ ప్లగ్, మెషిన్డ్ మిర్రర్ బ్లాక్-ఆఫ్ ప్లేట్లను కలిగి ఉంది. ఈ బైక్‌లో ప్రత్యేక ఆకర్షణగా డేటా ఎనలైజర్+జీపీఎస్ మాడ్యూల్‌ను ఏర్పాటుచేశారు. క్విక్‌షిఫ్టర్, రైడింగ్ పవర్ మోడ్లు, ట్రాక్షన్ కంట్రోల్, వీలీ కంట్రోల్, లాంచ్ కంట్రోల్ వంటి మరిన్నింటితో సహా అనేక ఎలక్ట్రానిక్ ఎయిడ్లతో రానుంది. చదవండి: అరె డాల్ఫిన్‌లా ఉందే, వరల్డ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ రికార్డ్లను తుడిచి పెట్టింది -
మరో మైలురాయి దాటిన క్విడ్.. ఆరేళ్లలోనే వశమైన రికార్డు
ఎంట్రీ లెవల్ కారుగా మార్కెట్లోకి వచ్చిన క్విడ్ మరో రికార్డును సొంతం చేసుకుంది. బడ్జెట్ కారుగా మార్కెట్లోకి వచ్చినా.. తర్వాత కాలంలో ప్రజలు ఇష్టమైన కారుగా ముద్ర పడిపోయింది. తాజాగా క్విడ్ మరో మైలు రాయిని దాటింది. 2015 నుంచి ఫ్రెంచ్ కారు తయారీ కంపెనీ రెనాల్ట్ లైనప్‌లో ఎంట్రీ లెవల్ కారుగా రెనాల్ట్ది ప్రత్యేక స్థానం. మొదటిసారిగా 2015లో ఈ కారుని ఇండియాలో లాంఛ్ చేయగా మిశ్రమ స్పందన వచ్చింది. కానీ వాటిని దాటుకుంటూ అనతి కాలంలోనే ఇండియాలో బెస్ట్ సెల్లింగ్ కార్లలో ఒకటిగా రికార్డు సృష్టించింది. ఆ తర్వాత 2019లో క్విడ్ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ని రెనాల్ట్ మార్కెట్లోకి తెచ్చింది. నాలుగు లక్షలు రెనాల్ట్ కారు ఇండియా మార్కెట్లోకి వచ్చి సుమారు ఆరేళ్లు అవుతోంది. ఈ కాలంలో దేశవ్యాప్తంగా సుమారు 4 లక్షల క్విడ్ కార్లను అమ్మినట్టు రెనాల్ట్ ప్రకటించింది. నాలుగో లక్ష కారును కొనుగోలు చేసిన యజమానికి రెనాల్ట్ ఇండియా సేల్స్ మార్కెటింగ్ వైస్ ప్రెసిడెంట్ సుధీర్ మల్హోత్ర స్వయంగా హ్యాండోవర్ చేశారు. 2022 సెప్టెంబరులో క్విడ్‌లో మరో వెర్షన్ రాబోతున్నట్టు కంపెనీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. బడ్జెట్ ఫ్రెండ్లీ అత్యాధునిక ఫీచర్లతో బడ్జెట్ ధరలో అందుబాటులో ఉండటం వల్ల క్విడ్ ఇండియా మార్కెట్లో సుస్థిర స్థానం దక్కించుకోగలిగింది. ఎంట్రీ లెవల్ క్విడ్ కారులో 800 సీసీ సామర్థ్యం కలిగిన ఇంజన్ 54 హెచ్‌పీ సామర్థ్యంతో 72 ఎన్ఎం టార్క్‌ని రిలీజ్ చేస్తుంది. హైఎండ్‌లో 91 ఎన్ఎం టార్క్ రిలీజ్ చేస్తుంది. 5 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో అందుబాటులో ఉంది. ఢిల్లీ ఎక్స్‌షోరూం ప్రకారం ఈ కారు ధర రూ.4.11 లక్షల నుంచి రూ. 5.59 లక్షల వరకు ఉంది. అధునాత ఫీచర్లు టచ్‌స్ర్కీన్ ఇన్ఫోంటైన్మెంట్, యాపిల్ కార్ ప్లే, డ్యూయల్ ఎయిర్ ఫ్రంట్ బ్యాగ్స్, ఏఈబీఎస్ విత్ ఈబీడీ, రివర్స్ పార్కింగ్ సెన్సార్ వంటి అధునాత ఫీచర్లు ఉన్నాయి. రెడిన్ డాట్సన్ గో, హ్యుందాయ్ సాంత్రో, మారుతి సూజుకి ఎస్ప్రెసో కార్లకు ధీటుగా క్విడ్ ఇక్కడి మార్కెట్లో పట్టు సాధించింది. చదవండి:2023లో మార్కెట్లోకి సోలార్ కారు.. ధర తక్కువ, రేంజ్ ఎక్కువ? -
అప్రీలియా ఎస్ఆర్ కొత్త వెర్షన్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీలో ఉన్న పియాజియో ఇండియా అప్రీలియా ఎస్ఆర్ 125, ఎస్ఆర్ 160 స్కూటర్స్ కొత్త వర్షన్స్ విడుదల చేసింది. పుణే ఎక్స్‌షోరూంలో ఎస్ఆర్ 160 ధర రూ.1.17 లక్షలు, ఎస్ఆర్ 125 ధర రూ.1.07 లక్షలు ఉంది. ఫీచర్స్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్, బ్లూటూత్, సింగిల్ చానెల్ ఏబీఎస్‌తో డిస్క్, డ్రమ్ బేక్స్, డ్యూయల్ సీట్స్, నకిల్ గార్డ్స్, అలాయ్ వీల్స్, వి–షేప్డ్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్, ఎక్స్–షేప్డ్ ఎల్ఈడీ టెయిల్‌లైట్ పొందుపరిచారు. ఎస్ఆర్ 160 స్కూటర్ 160 సీసీ 3వీ టెక్ ఈఎఫ్ఐ ఎయిర్‌కూల్డ్ ఇంజన్‌తో తయారైంది. -
జోరుమీదున్న బీఎమ్‌డబ్ల్యూ 5 సీరీస్
ముంబై: జర్మనకి చెందిన లగ్జరీ కార్ల సంస్థ బీఎమ్‌డబ్ల్యూ గురువారం 5 సిరీస్ సెడాన్ అప్డేటెడ్ వెర్షన్‌ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. బీఎమ్‌డబ్ల్యూ 530ఐ ఎం స్పోర్ట్స్, బీఎమ్‌డబ్ల్యూ 520డీ ఎం స్పోర్ట్స్, బీఎమ్‌డబ్ల్యూ 520డీ లగ్జరీ లైన్ అనే మూడు వేరియంట్లలో అందుబాటులోకి రానుంది. వీటి ధరలు వరుసగా రూ.62.90 లక్షలు, రూ.63.90 లక్షలు, 71.90 లక్షలుగా ఉన్నాయి. 6.1 సెకన్లలో 100 కి.మీ స్పీడ్ ఈ కార్లలో బీఎమ్‌డబ్ల్యూ 530ఐ ఎం స్పోర్ట్స్ వేరియంట్ 2 లీటర్ల పెట్రోల్ ఇంజిన్‌ను కలిగి ఉంది. ఈ ఇంజిన్ 5200 ఆర్పీఎం వద్ద గరిష్టంగా 252 హెచ్‌పీని, 4800 ఆర్పీఎం 350 ఎన్ఎమ్ల టార్క్‌ను విడుదల చేస్తుంది. 6.1 సెకన్లలో 100 కిలోమీటర్ల వేగం అందుకోగలదు. 5 సిరీస్‌కి చెందిన కార్లకు ఇండియాలో మంచి ఆధరణ లభిస్తుండటంతో బీఎండబ్ల్యూ వరుసగా వేరియంట్లను రిలీజ్ చేస్తోంది. చదవండి : లాక్డౌన్లు ఎత్తేస్తే.. టూర్లకు రెడీ -
బీఎండబ్ల్యూ 6 సిరీస్ కొత్త వెర్షన్
సాక్షి, ముంబై: జర్మనీ లగ్జరీ కార్ల తయారీ కంపెనీ బీఎండబ్ల్యూ తన 6 సిరీస్ సెడాన్ అప్డేటెడ్ వెర్షన్‌ను గురువారం భారత మార్కెట్లోకి విడుదల చేసింది. దీని ప్రారంభ ధర రూ.67.9 లక్షలుగా ఉంది. సరికొత్త వెర్షన్‌ను పెట్రోల్, రెండు డీజిల్‌తో సహా మొత్తం మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంచారు. పెట్రోల్ వేరియంట్లో లభ్యమయ్యే 630ఐ ఎమ్ స్పోర్ట్‌లో 2.0 లీటర్ ఇంజిన్‌ను అమర్చారు. ఇది 258 హెచ్‌పీ సామర్థ్యాన్ని ఉత్పత్తి చేస్తుంది. 6.5 సెకన్లలో 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు. దీని ధర రూ.67.9 లక్షలుగా ఉంది. డీజిల్ వేరియంట్లలో లభించే 620డీ కారులో 2.0 లీటర్ ఇంజిన్ ఉంది. ఇది 190 హెచ్‌పీ సామర్థ్యాన్ని కలిగి ఉంది. 7.9 సెకన్లలో 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు. దీని ధరను రూ.68.9 లక్షలుగా నిర్ణయించారు. అదేవిధంగా 630డీ కారులో అమర్చిన 3 లీటర్ల ఇంజిన్ 190 హెచ్‌పీ సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఇది కూడా కేవలం 6.5 సెకన్లలో 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు. ఈ వేరియంట్ ధర రూ.77.9 లక్షలుగా ఉంది. ఉన్నత స్థాయి వర్గాలను దృష్టిలో పెట్టుకొని 6 సిరీస్ సెడాన్‌లో కొత్త వెర్షన్ విడుదల చేసినట్లు కంపెనీ ఎండీ విక్రమ్ పావా తెలిపారు. -
సరికొత్తగా టీవీఎస్ అపాచీ బైక్ : ధర?
సాక్షి, ముంబై: టీవీఎస్ మోటార్ కొత్త అపాచీ బైక్‌ను మార్కెట్లో విడుదల చేసింది. 2021 టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 160 4వీ మోటార్‌సైకిల్‌ను బుధవారం విడుదల చేసినట్లు రెగ్యులేటరీ ఫైలింగ్‌లో కంపెనీ తెలిపింది. ఈ కొత్త బైక్ రెండు వేరియంట్లలో అందుబాటులో ఉండనుంది. డిస్క్ వేరియంట్ ధర రూ.1,10,320,డ్రమ్ వేరియంట్ ధర రూ.1,07,270 (ఎక్స్‌షోరూం, న్యూఢిల్లీ ధరలు) గా కంపెనీ నిర్ణయించింది. రేసింగ్ రెడ్, నైట్ బ్లాక్, మెటాలిక్ బ్లూ మొత్తం మూడు రంగుల్లో అందుబాటులో ఉండనున్నట్లు కంపెనీ వెల్లడించింది. టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 160 4వీ కొత్త బూక్‌లో 159.7 సీసీ సింగిల్ సిలిండర్, 4 వాల్వ్, ఆయిల్ కూల్డ్ అధునాతన ఇంజీన్ అమర్చినట్టు తెలిపింది. ఇది 9,250 ఆర్పీఎం వద్ద 17.38 హెచ్‌పీ శక్తిని, 7,250 ఆర్పీఎం వద్ద 14.73 ఎన్ఎం టార్క్‌ని ప్రొడ్యూస్ చేస్తుంది. కిల్ కార్బన్ ఫైబర్ నమూనాతో సరికొత్త డ్యూయల్ టోన్ సీటు,ఎ ల్ఈడీ హెడ్‌ల్యాంప్, క్లా స్టైల్డ్ పొజిషన్ ల్యాంప్‌లు ఇతర కీలక ఫీచర్లతో ప్రీమియం లుక్‌తో ఆకట్టుకోనుంది. ఫైవ్ స్పీడ్ సూపర్-స్లిక్ గేర్‌బాక్స్ కలిగిన ఈ బైక్ ఈ సెగ్మెంట్లో అత్యంత శక్తిమంతమైన రైడింగ్ అనుభూతినిస్తుందని టీవీఎస్ మోటార్ కంపెనీ హెడ్ (మార్కెటింగ్) ప్రీమియం మోటార్ సైకిల్స్ మేఘశ్యామ్ దిఘోలే వెల్లడించారు. అలాగే పాత అపాచీల వెర్షన్లతో పోలిస్తే ఈ కొత్త బైక్ రెండు కిలోల బరువు తక్కువ ఉంటుంది. డిస్క్ వేరియంట్ 147 కిలోల బరువు, డ్రమ్ వేరియంట్ 145 కిలోల బరువు ఉంటుంది. -
కొత్త బజాజ్ ప్లాటినా బైక్ : ధర ఎంతంటే?
సాక్షి, ముంబై: ప్రముఖ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ బజాజ్ ఆటో గురువారం దేశీయ మార్కెట్లోకి కొత్త బజాజ్ ప్లాటినా 110 ఏబీఎస్ బైక్‌ను విడుదల చేసింది. ఎక్స్ షోరూం ధర రూ.65,920 గా నిర్ణయించింది. ‘స్ప్రింగ్-ఆన్-స్ప్రింగ్’ నిట్రాక్స్ సస్పెన్షన్, యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఫీచర్లను కలిగిన ఈ బైక్‌లో ట్యూబ్‌లెస్ టైర్లను అమర్చారు. (టియాగో.. కొత్త వేరియంట్) బ్రేకింగ్ సెగ్మెంట్లో అత్యుత్తమ టెక్నాలజీని కలిగిన తమ కొత్త ప్లాటినా 110 లక్షలాది మంది భారతీయులను వారి గమ్యస్థానాలకు సురక్షితంగా చేరవేస్తుందని కంపెనీ మోటార్‌సైకిల్ విభాగం అధ్యక్షుడు సరంగ్ కనడే తెలిపారు. దేశవ్యాప్తంగా 7 మిలియన్ల మంది కస్టమర్ల అభిమాన్ని సొంతం చేసుకున్న ప్లాటినా బ్రాండ్ ఇప్పుడు ఏబీఎస్ చేరికతో తన పోటీదారుల కంటే మరింత ముందుకు దూసుకెళ్లిందని కనేడే తెలిపారు. (అత్యంత తక్కువ ధర: బజాజ్ ప్లాటినా 100 ఈఎస్) -
అత్యంత తక్కువ ధర: బజాజ్ ప్లాటినా 100 ఈఎస్
సాక్షి, ముంబై: దేశీయ ద్విచక్ర వాహన తయారీ సంస్థ బజాజ్ ఆటో తన 102 సీసీ బైక్ ‘ప్లాటినా 100 ఈఎస్’ కొత్త వెర్షన్‌ను మంగళవారం ఆవిష్కరించింది. ఈ ప్లాటినా 100 ఎలక్ట్రిక్ స్టార్ట్ (ఇఎస్) వేరియంట్‌ను ఎక్స్ షోరూం వద్ద ధరను రూ.53,920గా నిర్ణయించింది. ఇది భారత మార్కెట్లో లభించే అత్యంత సరసమైన ఎలక్ట్రిక్-స్టార్ట్ బైక్ అని సంస్థ వెల్లడించింది. ఈ కొత్త వెర్షన్లో అమర్చిన స్ప్రింగ్–ఇన్–స్ప్రింగ్ సస్పెషన్... రైడర్‌తో పాటు తోటి ప్రయాణికుడికి మెరుగైన సదుపాయాన్ని అందించనుంది. అలాగే సుదీర్ఘ ప్రయాణాలను మరింత సౌకర్యవంతం చేస్తుంది. స్ప్రింగ్-ఇన్-స్ప్రింగ్ సస్పెన్షన్ లాంటి కొత్త ఫీచర్లతో పాటు ఇబ్బందులు లేని, సురక్షితమైన ప్రయాణం కోసం ట్యూబ్‌లెస్ టైర్లను ఇందులో అమర్చారు. ప్లాటినా బ్రాండ్ తన సెగ్మెంట్లో విశిష్ట సేవలు అందిస్తూ 7 మిలియన్ల మంది కస్టమర్ల అభిమాన్ని సొంతం చేసుకుందని బజాజ్ మార్కెటింగ్ హెడ్ సుందరరామన్ ఈ సందర్భంగా తెలిపారు. కస్టమర్లను కొత్త వెర్షన్ ఆకర్షిస్తుందని సుందరరామన్ ఆశాభావం వ్యక్తం చేశారు. గత ఏడాది డిసెంబర్లో భారతదేశంలో ప్లాటినా 100 కిక్-స్టార్ట్ మోడల్‌ను, రూ.51,667 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) వద్ద తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. -
2021 రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ : ధర ఎంత?
సాక్షి, ముంబై: కొత్త రాయల్ ఎన్ఫీల్డ్ 2021 బైక్ వచ్చేసింది. కొత్తరంగులు, కొత్త డిజైన్‌తో కస్టమర్లను ఆకట్టుకునేలా 2021 రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ బైక్‌ను భారత మార్కెట్లో తీసుకొచ్చింది. కస్టమర్ ఫీడ్‌బ్యాక్ ఆధారంగా హిమాతయన్ బైక్‌ను అప్డేట్ చేసింది. ఈ అడ్వెంచర్ బైక్ ధరలు 2.01 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) నుండి ప్రారంభమవుతాయి. గూగుల్ మ్యాప్స్ ప్లాట్‌ఫాంపై ఆధారి ట్రిప్పర్ టర్న్-బై-టర్న్ నావిగేషన్‌తో సహా అనేక అప్డేట్స్ను జోడించింది. రాయల్ ఎన్ఫీల్డ్ యాప్ ద్వారా రైడర్ స్మార్ట్‌ఫోన్‌కు దీన్ని జత చేయవచ్చు. ఈ బైక్‌లో అప్డేటెడ్ సీట్, రియర్ క్యారియర్, ఫ్రంట్ ర్యాక్ కొత్త విండ్‌స్క్రీన్ కూడా అమర్చింది. అయితే ఈ బైక్ మునుపటిలాగే అదే సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. 24.3 బిహెచ్పి, 32 ఎన్ఎమ్లను ఉత్పత్తి చేస్తుంది. 5 స్పీడ్ గేర్‌బాక్స్, ముందు వెనుక భాగంలో వరుసగా 300 మిమీ 240 మిమీ డిస్క్ బ్రేక్‌లను కలిగి ఉంటుంది. డ్యూయల్-ఛానల్ ఏబీఎస్ అమర్చింది. లేదంటే వెనుక చక్రం కోసం ఏబిఎస్ స్విచ్ ఆఫ్ చేయవచ్చు. అలాగే లగేజ్ కోసం ఈసారి ఎక్కువ స్థలం ఉండేలా జాగ్రత్త పడింది. కావాలంటే దీన్ని నచ్చిన విధంగా డిజైన్ కస్టమైజ్ చేయించు కోవచ్చు. గ్రానైట్ బ్లాక్, మిరాజ్ సిల్వర్ పైన్ గ్రీన్ అనే మూడు కొత్త రంగుల్లో కొత్త రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ బైక్ లభిస్తుంది. 2021 రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ ధరలు మిరాజ్ సిల్వర్: రూ. 236286 గ్రావెల్ గ్రే: రూ. 236286 లేక్ బ్లూ: రూ. 240285 రాక్ రెడ్: రూ. 240285 గ్రానైట్ బ్లాక్: రూ. 240285 పైన్ గ్రీన్: రూ. 244284 -
హ్యుందాయ్ ఐ20 సరికొత్తగా వస్తోంది..
సాక్షి, హైదరాబాద్: దక్షిణ కొరియా కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ మోటార్స్ కంపెనీ తన ఆల్-న్యూ ఐ20 బుకింగ్స్‌ను బుధవారంనుంచి ప్రారంభించనుంది. ఈ మోడల్‌ను సొంతం చేసుకోవాలనుకునే కస్టమర్లు రూ.21,000 బుకింగ్ అడ్వాన్స్ చెల్లించి బుక్ చేసుకోవచ్చు. ఆన్లైన్ బుకింగ్స్ కోసం అధికార వెబ్‌సైట్‌ను, ఆఫ్‌లైన్ బుకింగ్స్‌కు హ్యుందాయ్ డీలర్‌షిప్‌ను సందర్శించాలని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ సందర్భంగా కంపెనీ సీఈవో ఎస్ఎస్ మాట్లాడూతూ... భారత్‌లో ప్రీమియం హాచ్బ్యాక్ ప్రమాణాలను మార్చే విధంగా ఈ మోడల్లో కొత్త టెక్నాలజీని వినియోగించామన్నారు. ఈ ఆల్-న్యూ ఐ20 నవంబర్ ఐదున భారత మార్కెట్లో విడుదల అవుతుంది. ఆల్-న్యూ హ్యుందాయ్ ఐ20 ధర 6 లక్షల నుండి 10 లక్షల రూపాయల మధ్య ఉండవచ్చని అంచనా. -
రెనో క్విడ్ నియోటెక్ ఎడిషన్ ఆవిష్కరణ
సాక్షి, ముంబై: రెనో ఇండియా క్విడ్ నియోటెక్ పేరుతో లిమిటెడ్ ఎడిషన్ లాంచ్ చేసింది. ఈ క్విడ్‌కు మంచి డిమాండ్ ఉంటుందని రెనో ఆశిస్తోంది. ఈ మోడల్ మూడు వేరియంట్లలో విడుదల కానుంది. 800 సీసీ, 1.0 లీటర్ మాన్యువల్, 1.0 లీటర్ ఏటీఎంల రూపంలో లభ్యమయ్యే ఈ వేరియంట్ల ధరలు వరుసగా రూ.4,29,800 రూ.4,51,800, రూ.4,83,800 గా ఉన్నాయి. ఈ స్పెషల్ ఎడిషన్ రెండు డ్యూయల్ టోన్ కలర్ ఆప్షన్లలో లభ్యం కానుంది. దీని ఇంజిన్ 0.80 లీటర్ యూనిట్, 1.0 లీటర్ యూనిట్ ఆప్షన్లలో ఉన్నాయి. ఇందులో 0.80 లీటర్ యూనిట్ 53 బీహెచ్పీ శక్తిని, 72 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేయనుంది. మరొకటి 1.0 లీటర్ యూనిట్ 67 బీహెచ్పీ శక్తిని, 91 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేయనుంది. వీటితో పాటు స్టాండర్డ్ 5–స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ ఇందులో ఉంది. అక్టోబర్ 1న బుకింగ్స్ మొదలయ్యాయి. డెలివరీలు తొందర్లోనే ప్రారంభమవుతాయి. పండుగ సీజన్ సందర్భంగా కంపెనీ బ్రాండ్ శ్రేణి ధరల్ని స్వల్పంగా పెంచింది. Slide into the driver’s seat of the New #RenaultKWID NEOTECH EDITION, and take control with the steering wheel that comes with stylish Zanskar Blue and Chrome accents. Know more: https://t.co/6wwDGiaKTr pic.twitter.com/TNWIP6PvS9 — Renault India (@RenaultIndia) October 2, 2020 -
సరికొత్తగా హ్యుందాయ్ వెన్యూ వెర్షన్లు
సాక్షి,న్యూఢిల్లీ: హ్యుందాయ్ మోటార్ ఇండియా తన కాంపాక్ట్ ఎస్యూవీ వెన్యూలో కొత్త వేరియంట్‌ను లాంచ్ చేసింది. ఇంటెలిజెంట్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ (ఐఎంటీ) అమర్చిన వెర్షన్‌ను బుధవారం విడుదల చేసింది. ఐఎంటీ వెర్షన్ వెన్యూ ఎస్యూవీ ప్రారంభ ధర 10.20లక్షలు (ఎక్స్ షోరూమ్, పాన్ ఇండియా). దీంతో పాటు స్పోర్ట్ ట్రిమ్ వేరియంట్‌ను కూడా పరిచయం చేసింది. దీని ధర 10-11.58 లక్షల రూపాయల మధ్య ఉంటుందని కంపెనీ ప్రకటించింది. ఐఎంటీ వెర్షన్ ఎస్యూవీ ద్వారా వినియోగదారులకు క్లచ్ పెడల్ ఫ్రీ డ్రైవ్‌ను అందిస్తున్నామని, అయితే సిక్స్-స్పీడ్ ట్రాన్స్మిషన్ మాన్యువల్ గేర్ షిఫ్ట్‌తో అందిస్తున్నట్లు కంపెనీ తెలిపింది. కప్పా 1.0 లీటర్ టీ-జీడీ బీఎస్-6 పెట్రోల్ ఇంజన్ అమర్చామని హ్యుందాయ్ మోటార్ ఇండియా సీఎండీ ఎస్ఎస్ కిమ్ ప్రకటించారు. ఇందులో ఎలక్ట్రోమెకానికల్ యాక్చుయేటెడ్ క్లచ్ ఉంటుందన్నారు. ఐఎంటీ వెన్యూ, స్పోర్ట్ ట్రిమ్కార్ల విడుదల ద్వారా మరోసారి కొత్త ప్రమాణాలను నిర్దేశిస్తున్నామన్నారు. హ్యుం ఇంటెండేషన్ సెన్సార్, హైడ్రాలిక్ యాక్యుయేటర్ , ట్రాన్స్మిషన్ కంట్రోల్ యూనిట్‌తో ట్రాన్స్మిషన్ గేర్ షిఫ్ట్ లివర్‌ను ఐఎంటీ టెక్నాలజీ ద్వారా కస్టమర్లకు స్మూత్ డ్రైవింగ్ అనుభవాన్ని అందిస్తున్నట్టు కంపెనీ వివరించింది. వివిధ భాగాల మధ్య సమైక్య తర్కాన్ని చేర్చడం ద్వారా అతుకులు లేని డ్రైవ్ అనుభవాన్ని అందించడానికి సిస్టమ్ రూపొందించబడింది. స్పోర్ట్ వేరియంట్లో 1.5 లీటర్ డీజిల్ బీఎస్-6 ఇంజిన్ (6 ఎమ్‌టి) తో పాటు కప్పా 1.0 లీటర్ టీ-జీబీ పెట్రోల్ బీఎస్-6 ఇంజిన్ ఇంజిన్‌పై ఐఎఎంటీ, 7-స్పీడ్ డ్యూయల్ క్లచ్ ట్రాన్స్మిషన్ ఆప్షన్లలో అందిస్తున్నట్లు కంపెనీ తెలిపింది. హ్యుందాయ్ వెన్యూ స్పోర్ట్ ట్రిమ్ రెండు డ్యూయల్-టోన్ కలర్ ఆప్షన్లలో లభ్యం కానుంది. -
గుడ్‌న్యూస్.. త్వరలో ఐఫోన్ 13
ముంబై: స్మార్ట్ ఫోన్ దిగ్గజం యాపిల్ సంస్థ ఐఫోన్ 12 సిరీస్‌ను త్వరలో మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు తీవ్రంగా కృషి చేస్తుంది. ఐఫోన్ 12సిరీస్ తర్వాత అంతే వేగంగా ఐఫోన్13 సిరీస్‌ను కూడా 2021సంవత్సరానికి అందుబాటులో ఉంచనుంది. జపనీస్ సైట్ మాకోతకారా ప్రకారం.. యాపిల్ సృష్టంచబోయే 13 సిరీస్‌లో 3డి ప్రింట్, 5.4 అంగుళాల అత్యాధునిక సాంకేతిక హంగులతో ఆకర్శించనున్నట్లు తెలిపింది. సరికొత్తగా యాపిల్ యూఎస్ బి టైప్‌ను ప్రవేశపెట్టనుంది. ఇందులో లిడార్ సెన్సార్‌తో క్వాడ్ కెమెరా సెటప్‌ను అమర్చనున్నారు. ఐపోన్ 13 సిరీస్ డిజైన్‌ను విభిన్నంగా రూపొందించనున్నారు. కాగా కస్టమర్లకు అత్యుత్తమ సేవలందించేందుకు సామ్ సంగ్ ప్యానల్ సెన్సార్ టెక్నాలజీని యాపిల్ అధ్యయనం చేస్తున్నట్లు సంస్థ వర్గాలు తెలిపాయి. యాపిల్ ప్రోటోటైప్‌ను వినుత్నంగా డిజైన్ చేయనుందని మాకోతకారా సైట్ తెలిపింది. మరోవైపు ఫడ్జ్ అనే సంస్థ నివేదిక ప్రకారం.. కెమరా ఆధునీకరణలో భాగంగా 5 సెన్సార్లతో అత్యాధునిక సాంకేతికతతో రూపొందించనున్నారు. ఐఫోన్ 13సిరీస్.. 64 మెగాపిక్సల్ వైడ్ లెన్స్‌తో 1ఎక్స్ ఆప్టికల్ జూమ్, 6ఎక్స్ డిజిటల్ జూమ్, కాగా 40 మెగా పిక్సల్ టెలిఫోటోలెన్స్తో 3 ఎక్స్ నుంచి 5ఎక్స్ ఆప్టిక్ జూమ్‌లను సరికొత్తగా రూపొందించనున్నారు. మరోవైపు 15 ఎక్స్ నుంచి 20 ఎక్స్ డిజిటల్ జూమ్ తదితర ఆకర్శనీయ ఫీచర్లతో ఐఫోన్ 13 అలరించనుందని ఫడ్జ్ పేర్కొంది. చదవండి: ‘హీరో’లు మాత్రమే ఐఫోన్లు వాడాలి! -
ఉచితంగా అందించలేం: జూమ్ సీఈఓ
ముంబై: ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్‌ను నియంత్రించేందుకు అన్ని దేశాలు లాక్‌డౌన్‌ను విధించాయి. లాక్డౌన్ వల్ల అందరు ఇంట్లో ఉంటూ సోషల్ మీడియాతో కాలక్షేపం చేస్తున్నారు. అత్యాధునిక వీడియో సెషన్స్‌కు పేరొందిన అమెరికాకు చెందిన జూమ్ యాప్ లాక్డౌన్ కారణంగా గత రెండు నెలలుగా అధిక లాభాలను అర్జించినట్లు జూమ్ సంస్థ తెలిపింది. అయితే టెక్నాలజీ, భద్రతకు ప్రాధాన్యతమిస్తు కొత్త అప్‌గ్రేడ్ వర్షన్‌ను ఇన్స్టాల్ చేశామని.. అయితే ఈ వెర్షన్‌ను ఫ్రీగా అందించడంలేదని, రీచార్జ్ చేసుకోవాలని జూమ్ సీఈఓ ఎరిక్ యాన్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. త్వరలో ఎఫ్‌బీఐ(ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్) అధికారులతో కలిసి తమ సంస్థ పనిచేయనుందని.. అందువలన ఉచితంగా యూజర్లకు అందించలేకపోతున్నామని ఆయన పేర్కొన్నారు. యాప్‌ను ఉచితంగా అందించడం వలన కొందరు దుర్వినియోగం చేసే అవకాశం ఉందని తెలిపారు. తాజా నివేదికల ప్రకారం జూమ్ యాప్ AES 256-bit జీసీఎమ్ అనే కొత్త వెర్షన్‌ను ఇన్స్టాల్ చేయనుందని సంస్థ అధికారులు పేర్కొన్నారు. ఈ కొత్త వర్షన్‌తో అనేక నూతన సాంకేతిక అంశాలను పొందుపరిచామని కంపెనీ తెలిపింది. ప్రస్తుతం కంపెనీ జూమ్ రూమ్స్, సిస్టమ్స్, వైర్లెస్ సేవలను యూజర్లకు అందిస్తోంది. సరికొత్త రీతిలో జూమ్ రూమ్స్‌ను నవీకరిస్తున్నందున వీడియో సెషన్స్ అద్భుతంగా కొనసాగుతాయని కంపెనీ స్పష్టం చేసింది. చదవండి: హైదరాబాద్: సిటీ బస్సులకూ ఇక రైట్ రైట్! సరికొత్త వెర్షన్లో జూమ్ యాప్.. -
సరికొత్త వెర్షన్లో జూమ్ యాప్..
అమెరికాకు చెందిన జూమ్ కంపెనీ కీలక ప్రకటన చేసింది. ఈ యాప్ యూజర్లకు అనుకూలంగా వీడియా సెషన్స్ అందిస్తోంది. ప్రస్తుతం జూమ్ యాప్ యూజర్లకు ఆన్లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో సేవలందిస్తోంది. తాజాగా జూమ్ యాప్‌పై కొన్ని ఆరోపణలు నేపథ్యంలో సరికొత్త రీతిలో యూజర్లను అలరించడానికి సిద్దమవుతోంది. ఈ క్రమంలో జూమ్ కంపెనీ మే 30, 2020లో ఇన్స్టాల్ అయ్యే నూతన వెర్షన్‌నే ఉపయోగించాలని కోరింది. ప్రస్తుతం కంపెనీ జూమ్ రూమ్స్, సిస్టమ్స్, వైర్లెస్ సేవలను యూజర్లకు అందిస్తోంది. సరికొత్త రీతిలో జూమ్ రూమ్స్‌ను నవీకరిస్తున్నందున వీడియో సెషన్స్ అద్భుతంగా కొనసాగుతాయని కంపెనీ స్పష్టం చేసింది. జూమ్ యాప్ తక్కువ ఖర్చుతో యూజర్లకు సేవలందిస్తున్నందున ఈ యాప్‌ను ఇన్స్టాల్ చేయడానికి ఎక్కువ స్థాయిలో యూజర్లు ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. యూజర్లకు అన్ని కొత్త వెర్షన్లు రావాలంటే అడ్మిన్ పోర్టల్‌కు లాగిన్ అయ్యి జూమ్ రూమ్స్ కంట్రోలర్ సాఫ్ట్‌వేర్‌ను ఇన్స్టాల్ చేసుకోవలని కంపెనీ సూచించింది. మరోవైపు భారతలో వినియోగదారుల గోప్యతకు జూమ్ వీడియో కాలింగ్ యాప్ భంగం కలిగిస్తుందని ఇటవల సుప్రీం కోర్టులో హర్ష్ చుగ్ అనే వ్యక్తి పిటిషన్ దాఖలు చేశారు. అలాగే ఈ యాప్ వినియోగిస్తున్న పలువురి నుంచి హ్యాకింగ్, సైబర్ నేరాలకు సంబంధించిన ఫిర్యాదులు వస్తున్నాయని ఫిర్యాదులో పిటిషన్‌దారుడు పేర్కొన్నారు. -
హ్యుందాయ్ క్రెటా @ రూ. 9.9 లక్షలు
న్యూఢిల్లీ: ప్రముఖ వాహన తయారీ కంపెనీ హ్యుందాయ్ మోటార్ ఇండియా (హెచ్ఎంఐఎల్) తాజాగా తన పాపులర్ ఎస్యూవీ ‘క్రెటా’ కారులో అధునాతన వెర్షన్‌ను సోమవారం మార్కెట్లో ప్రవేశపెట్టింది. పెట్రోల్, డీజిల్ వెర్షన్లలో అందుబాటులోకి వచ్చిన ఈ నూతన కారు ధరల శ్రేణి రూ. 9.9 లక్షలు – 17.2 లక్షలుగా కంపెనీ ప్రకటించింది. ఈ సందర్భంగా కంపెనీ ఇండియా ఎండీ, సీఈఓ ఎస్ ఎస్ కిమ్ మాట్లాడుతూ.. ‘ఈ విభాగంలోని లోపాలను అధిగమించి, అత్యాధునిక వాహనాన్ని మార్కెట్లోకి తీసుకుని రావడం కోసం చాలా జాగ్రత్తగా అధ్యయనం చేశాం. సాధ్యాసాధ్యాలను పరిశీలించి కొత్త మోడల్ అందుబాటులో ఉంచాం. ఇక మల్టీ–సీటర్ హై ఆక్యుపెన్సీ వెహికల్ తయారీలో పట్టు సాధించడంలో భాగంగా త్వరలోనే మల్టీ–పర్పస్ వెహికల్ (ఎంపీవీ)ని తీసుకురావాలని యోచిస్తున్నాం’ అని వెల్లడించారు. -
మార్కెట్లోకి టాటా ఆల్ట్రోజ్
ముంబై: టాటా మోటార్స్ ప్రీమియమ్ హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్లోకి ప్రవేశించింది. ఆల్ట్రోజ్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ కారులో ఐదు పెట్రోల్, ఐదు డీజిల్ వేరియంట్లను అందిస్తున్నామని టాటా మోటార్స్ సీఈఓ, ఎమ్డీ గుంటర్ బషెక్ చెప్పారు. పెట్రోల్ వేరియంట్ల ధరలు రూ.5.29–7.69 లక్షలు... డీజిల్ వేరియంట్ల ధరలు రూ.6.99–9.29 లక్షల రేంజ్లో ఉన్నాయని తెలిపారు. ఇది భారత్‌లో తొలి బీఎస్–6 డీజిల్ కారని పేర్కొన్నారు. ఆల్ఫా ప్లాట్ఫార్మ్పై తామందిస్తున్న తొలి వాహనం కూడా ఇదేనని వివరించారు. ఆల్ట్రోజ్తో పాటు నెక్సాన్, టియగో, టైగోర్ మోడళ్లలో బీఎస్ సిక్స్ వేరియంట్లను కూడా మార్కెట్లోకి విడుదల చేశామన్నారు. ఫీచర్లు...: ఈ కారులో క్రూయిజ్ కంట్రోల్, 7 అంగుళాల టీఎఫ్టీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, 7 అంగుళాల ఫ్లోటింగ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, రివర్స్ పార్కింగ్ సెన్సర్లు, తదితర ఫీచర్లున్నాయి. డ్యుయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లు, ఏబీఎస్ విత్ ఈబీడీ, రివర్స్ పార్కింగ్ సెన్సర్స్, హై స్పీడ్ అలర్ట్ సిస్టమ్ తదితర భద్రతా ఫీచర్లున్నాయి. కాగా, మారుతీ సుజుకీ బాలెనో, హ్యుందాయ్ ఎలీట్ ఐ20, హోండా జాజ్, టయోటా గ్లాంజా, ఫోక్స్‌వ్యాగన్ పోలోలకు ఈ ఆల్ట్రోజ్ కారు గట్టి పోటీనిస్తుందని పరిశ్రమల వర్గాల అంచనా. -
మోడ్రన్ ఫీచర్స్‌తో టీవీఎస్ స్కూటీ పెప్ ప్లస్
సాక్షి, న్యూఢిల్లీ: టీవీఎస్ మోటార్ తన పాపులర్ మోడల్ స్కూటీపెప్ లో కొత్త ఎడిషన్‌ను లాంచ్ చేసింది. తన స్కూటీ బ్రాండ్‌కు 25 సంవత్సరాల పూర్తైన సందర్భంగా కొత్త అపడేట్స్‌తో సరికొత్తగా టీవీఎస్ స్కూటీ పెప్ ప్లస్‌ను ఆవిష్కరించింది. దీని ధర రూ. 44,764 (ఎక్స్-షోరూమ్ న్యూఢిల్లీ) గా నిర్ణయించింది. మాటే ఎడిషన్‌ను రెండు రంగుల్లో అందుబాటులోకి తీసుకొచ్చింది. 3డీ ఎంబ్లం, ప్రెష్ గ్రాఫిక్స్, సీట్ల మార్పు తదితర రిఫ్రెష్ లుక్‌లో స్వల్ప మార్పులు తప్ప టీవీఎస్ స్కూటీ పెప్ ప్లస్‌లో యాంత్రికంగా పెద్ద మార్పులేవీ లేవు. 87.8 సీసీ ఎయిర్-కూల్డ్ సింగిల్ సిలిండర్ ఎకో థ్రస్ట్ ఇంజిన్, 4.8 బిహెచ్పి, 5.8 ఎన్ఎమ్ పీక్ టార్క్ కీలక ఫీచర్లుగా ఉన్నాయి. ఎగుడుదిగుడు రోడ్లపై కూడా సునాయాసంగా ప్రయాణించేందుకు టెలిస్కోపిక్ సస్పెన్షన్‌తోపాటు వెనుక భాగంలో సింగిల్ షాక్‌తో వస్తుంది. సీబీఎస్, డ్రమ్ బ్రేక్‌లను ఇరువైపులా అమర్చింది. టీవీఎస్ స్కూటీ పెప్ ప్లస్‌లో మొబైల్ ఛార్జర్ సాకెట్, సైడ్ స్టాండ్ అలారం, అండర్-సీట్ స్టోరేజ్ హుక్స్, ఓపెన్ గ్లోవ్ బాక్స్, బ్రాండ్ పేటెంట్ పొందిన 'ఈజీ' స్టాండ్ టెక్నాలజీ లాంటి అధునాతన ఫీచర్లు జోడించింది. అలాగే 30 శాతం స్కూటీ బరువు కూడా తగ్గించింది. కాగా పాతికేళ్ల క్రితం మహిళా రైడర్ల కోసం టీవీఎస్ స్కూటీ ఎంట్రీ లెవల్ స్కూటర్ విభాగంలోకి ఎంట్రీ ఇచ్చి ఒక ట్రెండ్ క్రియేట్ చేసింది. భారతదేశంలో ఎక్కువ జనాదరణ పొందిన స్కూటర్లలో ఒకటిగా స్కూటీ పెప్ కొనసాగుతోంది. -
వచ్చేస్తోంది కొత్త ఐఫోన్
శాన్ ఫ్రాన్సిస్కో: త్వరలో కొత్త ఐఫోన్ వెర్షన్‌ను ప్రవేశపెట్టనుందన్న వార్తలకు ఊతమిస్తూ టెక్ దిగ్గజం యాపిల్ వచ్చే నెల 10న సిలికాన్ వేలీలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు అధికారికంగా ఇన్విటేషన్లు పంపింది. సాధారణంగా ఏటా క్రిస్మస్ షాపింగ్ సీజన్‌కు ముందు.. ఇలాంటి కార్యక్రమంలోనే యాపిల్ కొత్త ఉత్పత్తులను ఆవిష్కరిస్తూ వస్తోంది. ఈసారీ సెప్టెంబర్ 10న జరిగే కార్యక్రమంలో ’ఐఫోన్ 11’ హ్యాండ్‌సెట్స్‌ను కూడా ఆవిష్కరించవచ్చని పరిశీలకులు భావిస్తున్నారు. మొత్తం మూడు ఐఫోన్ 11 మోడల్స్‌ను ప్రవేశపెట్టవచ్చని తెలుస్తోంది. ఐఫోన్ ఎక్స్ఎస్ మ్యాక్స్‌ని అప్‌గ్రేడ్ చేసి ఎక్స్ఎస్, ఎక్స్ఆర్ మోడల్స్‌ను కొత్త రూపంలో ఆవిష్కరించే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఐఫోన్ ఎక్స్ఎస్ సిరీస్ స్థానంలో వచ్చే కొత్త ఐఫోన్ 11 మోడల్లో ట్రిపుల్ రియర్ కెమెరా ఉండవచ్చన్న అంచనాలు ఉన్నాయి. -
మారుతి కొత్త ఇంట్రూడర్ లాంచ్
సాక్షి, న్యూఢిల్లీ: మారుతి సుజుకి మోటార్ సైకిల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఇంట్రూడర్‌లో కొత్త వెర్షన్‌ను లాంచ్ చేసింది. ఇంట్రూడర్ 2019 ఎడిషన్ బైక్‌ను భారతీయ మార్కెట్లొ విడుదల చేసింది. గేర్ షిప్ట్ డిజైన్, అధునాతన బ్రేక్ పెడల్ కొత్త డిజైన్‌తో న్యూ లుక్‌ని తీసుకొచ్చింది. దీని ధరను రూ. 1,08,162 (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ) గా నిర్ణయించింది. ఆధునిక డిజైన్, ప్రీమియమ్ అప్పీల్‌తో క్రూయిజర్ ప్రేమికులను ఆకట్టుకుంటుందని మారుతి వైస్ ప్రెసిడెంట్ దేవాషిష్ హాండా తెలిపారు. రోజు ప్రయాణంతో పాటు, వీకెండ్ రైడ్స్‌కు కూడా కొత్త మారుతి ఇంట్రూడర్ మంచి అనుభవాన్నిస్తుందని చెప్పారు. 155 సిసి ఇంజీన్, ప్రామాణికే ఏబీఎస్, పుల్లీ-డిజిటల్ ఇన్స్ట్రుమెంటేషన్ లాంటి కీలక ఫీచర్లు ఇందులో ఉన్నాయి. -
మార్కెట్లోకి సుజుకీ వి-స్ట్రామ్ బైక్
సాక్షి, న్యూఢిల్లీ: సుజుకీ మోటార్‌సైకిల్ ఇండియా కొత్త ప్రీమియం మోటార్ బైక్ మోడల్‌ను లాంచ్ చేసింది. అడ్వెంచర్ టూరర్ బైక్ వి-స్ట్రామ్ 650ఎక్స్‌టి ఏబీఎస్(2019) ను సోమవారం మార్కెట్లోకి విడుదల చేసింది. రెండు రంగుల్లో లభించనున్న ఈ బైక్ ధర రూ.7.46 లక్షలు (ఢిల్లీ ఎక్స్‌షోరూమ్). కొత్త గ్రాఫిక్స్, అదనపు ఫీచర్లతో వి-స్ట్రామ్ కొత్త వెర్షన్ భారతీయ వినియోగదారులకు అద్భుతమైన అడ్వెంచర్ అనుభూతిని అందిస్తుందని సుజుకీ మోటార్‌సైకిల్ ఇండియా ఎండీ సతోషి ఉచిడా వెల్లడించారు. గత ఏడాది లాంచ్ చేసిన ఈ వి- స్ట్రామ్ మోటార్ సైకిల్‌కు మంచి ఆదరణ లభించిందనీ, ఇపుడు కూడా అదే స్పందన లభిస్తుందని తాము ఆశిస్తున్నామన్నారు. లైట్ వెయిట్ యాంటీ లాక్ బ్రేక్ సిస్టమ్.. రహదారిపై పట్టును కోల్పోకుండా చేస్తుందని పేర్కొన్నారు. -
వన్‌ప్లస్ 6 కొత్త వెర్షన్.. ధర రెండు లక్షలపైనే!!
వన్‌ప్లస్ 6 ఇచ్చిన బూస్టప్‌తో మరింత దూకుడు పెంచిన కంపెనీ వన్‌ప్లస్ '6టీ' వేరియంట్‌ను మరింత గ్రాండ్ లుక్‌లో మార్కెట్లోకి తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. వన్‌ప్లస్ 6 కంపెనీ నుంచి వచ్చిన స్మార్ట్ఫోన్లలో అత్యంత సక్సస్ఫుల్ ఫోన్. మిడ్నైట్ బ్లాక్, మిర్రర్ బ్లాక్, సిల్క్ వైట్ రంగుల్లో వన్‌ప్లస్ 6 మార్కెట్లోకి వచ్చింది. అటు వన్‌ప్లస్ కంపెనీ వన్‌ప్లస్ 6టీని రూపొందిస్తుండగా.. ఇటు లగ్జరీ ఫ్రెంచ్ బ్రాండ్ హడోరో పారిస్ వన్‌ప్లస్ 6 కొత్త వెర్షన్‌ను విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ వెర్షన్ లిమిటెడ్ ఎడిషన్‌గా తీసుకు రాబోతుందట. స్టన్నింగ్ లుక్‌లో రాబోతున్న ఈ వెర్షన్ ధర వింటేనే మీరు షాక్‌కు గురవుతారు. దీని ధర రూ.2.26 లక్షలుగా నిర్ణయిస్తుందని తెలుస్తోంది. ఫ్రెంచ్కు చెందిన హడోరో పారిస్ లగ్జరీ డిజైనర్ కంపెనీ. ఈ కంపెనీ లెదర్స్, విలువైన మెటల్స్, జెమ్స్‌తో ఐఫోన్లను, ఐఫోన్ కేసులను, ఎయిర్‌పాడ్స్‌ను, స్మార్ట్ఫోన్లను, ఇతర యాక్ససరీస్‌ను తయారు చేస్తూ.. స్టన్నింగ్ లుక్‌లో మార్కెట్లోకి విడుదల చేస్తూ ఉంటుంది. ఈ సారి వన్‌ప్లస్ 6ను కస్టమైజ్ చేస్తోంది. హార్డ్‌వేర్ వన్‌ప్లస్ 6 ఫోన్ ఒరిజినల్‌దే ఉంచి, వెలుపల మాత్రం లెదర్స్, విలువైన మెటల్స్, జెమ్స్‌తో వన్‌ప్లస్ 6 ను అలకరించబోతుందట. హడోరో లాంచ్ చేసే కస్టమైజ్డ్ వెర్షన్ పేరును హడోరో వన్‌ప్లస్ 6 కార్బన్‌గా నామకరణం చేస్తోంది. కొత్త ఏరో కార్బన్‌తో ఈ వెర్షన్‌ను డిజైన్ చేస్తోంది. రెగ్యులర్ గ్లాస్ బ్లాక్‌కు బదులు ఫైబర్‌గ్లాస్ బ్లాక్ప్లేట్ను ఇది ఈ ఫోన్‌కు జత చేస్తుంది. ఈ వెర్షన్ కీ హైలెట్ బ్లాక్ కవర్‌కు మధ్యలో ప్రకాశించే వన్‌ప్లస్ లోగోను ఏర్పాటు చేయడం. స్క్రాచ్-ప్రూఫ్ సఫైర్ గ్లాస్‌తో ఈ లోగోను రూపొందిస్తోంది. సఫైర్ గ్లాస్ బ్యాటరీపై ఎలాంటి ప్రభావం చూపదని కంపెనీ హామీ ఇచ్చింది. ఈ పరిమిత వెర్షన్ బరువు బేస్ వన్‌ప్లస్ 6 కంటే కాస్త ఎక్కువగానే ఉంటుంది. 8జీబీ ర్యామ్, 256జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, సిమ్ ఫ్రీ, అన్లాక్డ్తో ఇది మార్కెట్లోకి వస్తోంది. ఈ ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్లను హడోరో అధికారిక వెబ్సైట్లో చేపట్టనుంది. 10 రోజుల్లో షిప్మెంట్ ప్రారంభించనుంది కంపెనీ. ఆసక్తి గల కస్టమర్లు ఫోన్‌పై తమ పేరును కూడా డిజైన్ చేయించుకోవచ్చు. -
శుభవార్త : ఐఓఎస్ 12 వచ్చేసింది...
కాలిఫోర్నియా : టెక్ దిగ్గజం ఆపిల్ తన అభిమానులకు శుభవార్త చెప్పేసింది. ఎంతో కాలంగా వేచిచూస్తున్న ఐఓఎస్ 12ను ఆపిల్ ఎట్టకేలకు విడుదల చేసింది. కాలిఫోర్నియాలోని శాన్‌జోస్‌లో జరుగుతున్న వరల్డ్ వైడ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్‌లో(డబ్ల్యూడబ్ల్యూడీసీ) ఈ అప్డేట్ను కంపెనీ ప్రవేశపెట్టింది. లక్షల కొద్దీ ఐఫోన్లు, ఐప్యాడ్లు మరింత సమర్థవంతంగా పనిచేయడం కోసం ఈ ఐఓఎస్ 12ను విడుదల చేయడంతో పాటు సరికొత్త ఫీచర్స్‌ను కూడా తీసుకొచ్చింది. ఈ ఐఓఎస్ 12 బగ్స్‌ను ఫిక్స్ చేయడంతోపాటు ఐఫోన్, ఐప్యాడ్ల పనితీరును మెరుగుపరుస్తుందని కంపెనీ చెప్పింది. ఐఓఎస్ 12తో ముందు అనుభవించలేని సరికొత్త అనుభూతిని అందించనున్నామని ఆపిల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ క్రైగ్ ఫెడెర్గి చెప్పారు. ఐఓఎస్ 12.. టాప్ 12 ఫీచర్లు.. మరింత వేగం, మరింత రెస్పాన్సివ్ : ఐఫోన్ 5ఎస్తో పాటు సిస్టమ్స్ అన్నింటిలోనూ మెరుగైన పనితీరుపై ఇది ఎక్కువగా ఫోకస్ చేసింది. ఐఓఎస్ 12తో కెమెరాను 70 శాతం వరకు, కీబోర్డ్ 50 శాతం వరకు వేగవంతం చేసింది. షేర్డ్ ఏఆర్ ఎక్స్పీరియన్స్ : ఐఓఎస్ 12తోపాటు ఏఆర్‌కిట్2ను ఆపిల్ ప్రవేశపెట్టింది. దీంతో మరింత మెరుగైన ఏఆర్ యాప్స్‌ను డెవలప్ చేసుకోవచ్చు. కొత్త ఓపెన్ ఫైల్ ఫార్మాట్, యూఎస్డీజెడ్ను ఆపిల్ డిజైన్ చేసింది. దీంతో ఐఓఎస్‌లో ఎక్కడైనా ఏఆర్ అనుభవాన్ని తేలికగా పొందవచ్చు. గ్రూప్ ఫేస్ టైమ్ : ఆపిల్లోఉండే ఫేస్‌టైమ్ వీడియో కాలింగ్ ఫీచర్‌ను మరింత మెరుగుపర్చారు. ఇది ప్రస్తుతం గ్రూప్ కాల్స్‌కు సపోర్టు చేయనుంది. ఈ కొత్త గ్రూప్ ఫేస్‌టైమ్ ఫీచర్‌తో ఒకేసారి అనేక మందితో చాట్ చేయొచ్చు. ఈ గ్రూప్ ఫేస్‌టైమ్ కాల్లో గ్రూప్ మెసేజ్ నుంచి కనెక్ట్ అవొచ్చు. ఏ సమయంలోనైనా అభ్యర్థులు జాయిన్ కావొచ్చు. సంభాషణ మధ్యలో ఉండగానే కూడా చేరవచ్చు. ఆపిల్ వాచ్ నుంచి కూడా ఫేస్‌టైమ్ ఆడియోలో పాలుపంచుకోవచ్చు. సిరి షాట్‌కట్స్ : సిరితో ఈ రంగంలో కొత్త సంచలనానికి తెరలేపిన ఆపిల్‌కు గూగుల్ అసిస్టెంట్, అమెజాన్ అలెక్సాల నుంచి పోటీ ఎదురైంది. ఇపుడు సిరి మరింత స్మార్ట్‌గా చేశారు. ఇప్పుడు అన్ని యాప్‌లు సిరితో కలిసి పనిచేస్తాయి. మరింత వేగవంతంగా.. సరియైన సమయానికి పని పూర్తి చేస్తాయి. ఇప్పటికే సిరి ఒక్క నెలలో 10 బిలియన్ అభ్యర్థలను పూర్తి చేస్తుంది. ఫోటో సెర్చ్ మెరుగుపరచడం : ఫోటోయాప్ అంతాకొత్తగా ‘ఫర్ యూ’ అనే ట్యాబ్‌ను కలిగి ఉంటుంది. ఇది మెమరీస్, ఐక్లౌడ్ షేర్డ్ అల్బామ్స్ నుంచి ఇష్టమైన క్షణాలన్నింటిన్నీ ఒకచోటికి చేరుస్తోంది. ఈ ఫీచర్‌తో స్నేహితులతో తేలికగా ఫోటోలను షేర్ చేసుకోవచ్చు. అదేవిధంగా స్నేహితులు అదే ఈవెంట్‌కు సంబంధించి తిరిగి వీడియోలను, ఫోటోలను షేర్ చేయవచ్చు. డు నాట్ డిస్టర్బ్ : నోటిఫికేషన్ బెడద లేకుండా హాయిగా నిద్రపోయేందుకు ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది. పైగా బెడ్ టైమ్ మోడ్‌ని ఆన్ చేస్తే డిస్ప్లే కూడా డిమ్ అయిపోతుంది. అంతేకాకుండా అన్ని నోటిఫికేషన్లను లాక్ స్క్రీన్ నుంచి హైడ్చేసుకోవచ్చు. అంతేకాక ఫోన్ యూజర్ చెప్పిన సమయానికి ఈ డీఎన్డీ బెడ్‌టైమ్ మోడ్ పూర్తయి నార్మల్లోకి వచ్చేస్తుంది. నోటిఫికేషన్లను డిస్ప్లే అవుతాయి. గ్రూప్డ్ నోటిఫికేషన్లు : పదేపదే వచ్చే నోటిఫికేషన్లతో ఎప్పుడూ తలనొప్పిగా ఉంటుంది. ఆ తలనొప్పి నుంచి బయటపడేందుకు గ్రూప్డ్ నోటిఫికేషన్ ఫీచర్‌ను తీసుకొచ్చారు. దీంతో ఎలాంటి సెట్టింగ్స్‌లోకి వెళ్లకుండానే నోటిఫికేషన్లను కంట్రోల్ చేసుకోవచ్చు. అనుకున్న నిర్ణీత సమయంలో వాటిని చూసుకునేలా ఇది ఉపయోగపడుతోంది. స్ర్కీన్ టైమ్ : అందరూ ఊహించినట్లే డిజిటల్ హెల్త్ ఫీచర్‌ను ఐఓఎస్12లో పొందుపర్చారు. దీనివల్ల యాప్స్, వెబ్‌సైట్స్‌పై మీరు వెచ్చించే సమయాన్ని ఈ ఫీచర్ కంట్రోల్ చేస్తుంది. ఒక్కో యాప్‌పై మీరు ఎంత సమయం వెచ్చించారో గంటవారీ, రోజువారీ, వారంవారీగా డేటా తెలుపుతుంది. ప్రైవసీ అండ్ సెక్యూరిటీ : ఆపిల్ సాఫ్ట్వేర్ అప్డేట్స్, మెరుగైన ప్రైవసీ అండ్ సెక్యూరిటీకి ఐఓఎస్ 12 అత్యధిక ప్రాధాన్యం ఇస్తుంది. సఫారీలో ఇంటెలిజెన్స్ ట్రాకింగ్ ప్రివెన్షన్ ఆప్షన్‌తో మీరు సోషల్ మీడియా లైక్ లేదా షేర్ బటన్స్‌ను బ్లాక్ చేయొచ్చు. మెమోజీ, ఫన్ కెమెరా ఎఫెక్ట్స్ : గత ఏడాది అనిమోజీని ప్రవేశపెట్టిన ఆపిల్ ఈసారి మెమోజీలను ప్రవేశపెట్టింది. ఇది అచ్చం శాంసంగ్ ఏఆర్ ఎమోజీలాగానే ఉంది. మెజర్ యాప్ : కొత్త యాప్ ఇది. వస్తువులు, గోడల కొలతలను ఈ ఫీచర్‌తో కొలవవచ్చు. ఐ బుక్స్‌ను ఆపిల్ బుక్స్‌గా రీడిజైన్ చేసింది. -
ఫోక్స్‌వ్యాగన్ కొత్త వెర్షన్ పోలో
సాక్షి, న్యూఢిల్లీ: జర్మన్ ఆటోమొబైల్ దిగ్గజం ఫోక్స్‌వాగన్ కొత్త వెర్షన్ కారును లాంచ్ చేసింది. తన ప్రముఖహ్యాచ్బ్యాక్ మోడల్ పోలోలో కొత్త వెర్షన్‌ను మార్కెట్లో ప్రవేశపెట్టింది. 1.0 లీటర్ల ఎంపీఐ ఇంజిన్‌తో తీసుకొస్తున్న ఈ కారుకు రూ. 5,41,800 (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరగా నిర్ణయించింది. అలాగే ఇండియాలో 1.2 ఎంపీఐ ఇంజిన్‌ను కొత్త 1.0 ఇంజిన్‌తో భర్తీ చేయనున్నట్లు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ఇక కొత్త పోలో లో 56 కిలోవాట్ల పపర్, 95 ఎన్ఎం టార్క్, లీటరుకు 18.78 కిలోమీటర్ల మైలేజీ ప్రధాన ఫీచర్లుగా ఉన్నాయి. తమ బ్రాండ్‌ను మరింత మెరుగుపరుచుకుంటూ, భారతీయ విలక్షణమైన కారు-కొనుగోలుదారులకు విభిన్న పోర్ట్‌ఫోలియోలను అందించడమే తమ లక్ష్యమని వోక్స్ వ్యాగన్ ప్యాసింజర్ కార్స్ ఇండియా డైరెక్టర్ స్టీఫెన్ నాప్ చెప్పారు. ఈ కొత్త వెర్షన్లో ఇంధన సామర్ధ్యాన్ని మెరుగుపరిచామన్నారు. కాగా ఫోక్స్‌వ్యాగన్ దేశీయ మార్కెట్లో పోలో, వెంటో, జెట్టా, పాసట్, టౌరేగ్ వంటి మోడల్ కార్లను విక్రయిస్తుంది. -
ఎయిర్టెల్ టీవీ యాప్‌లో కొత్త వెర్షన్
న్యూఢిల్లీ: దేశీ దిగ్గజ టెలికం కంపెనీ భారతీ ఎయిర్టెల్ తాజాగా తన ఎయిర్టెల్ టీవీ యాప్‌లో కొత్త వెర్షన్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. యూజర్ ఫ్రెండ్లీ ఇంటర్ఫేస్తో, ఎక్కువ కంటెంట్‌తో ఈ యాప్‌ను తీసుకువచ్చినట్లు కంపెనీ తెలిపింది. ఎయిర్టెల్ పోస్ట్‌పెయిడ్, ప్రి–పెయిడ్ కస్టమర్లు యాప్‌లోని కంటెంట్‌ను ఫ్రీ–సబ్స్క్రిప్షన్ విధానంలో 2018 జూన్ వరకు ఉచితంగా పొందొచ్చని పేర్కొంది. సంస్థ యూజర్లు ఎయిర్టెల్ టీవీ యాప్‌ను వారి స్మార్ట్ఫోన్లలో ఇన్స్టాల్ చేసుకోవాలని సూచించింది. ఇది ఐఓఎస్, ఆండ్రాయిడ్ ప్లాట్‌ఫామ్స్‌పై పనిచేస్తుంది. ‘ఎయిర్టెల్ టీవీ యాప్‌లో 29 హెచ్డీ చానళ్లు సహా 300లకు పైగా లైవ్ టీవీ చానళ్లు అందుబాటులో ఉన్నాయి. 6,000కు పైగా సినిమాలు, ప్రముఖ టీవీ షోలు చూడొచ్చు. ప్రాంతీయ వినియోగదారుల కోసం రీజినల్ కంటెంట్‌ను కూడా పొందుపరిచాం’ అని వివరించింది. ఎయిర్టెల్ టీవీ ప్రస్తుతం ఈరోస్ నౌ, సోనీ లైవ్ వంటి పలు సంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. కాగా ఎయిర్‌టెల్‌కు 28.2 కోట్లకుపైగా మొబైల్ సబ్స్క్రైబర్లు ఉన్నారు. -
వోల్వో కొత్త ఎస్యూవీ లాంచ్..
సాక్షి, న్యూఢిల్లీ: స్వీడన్‌కు చెందిన లగ్జరీ కార్ మేకర్ వోల్వో కార్స్ సరికొత్త ఎస్‌యూవీకార్‌ను లాంచ్ చేసింది. ఎస్యూవీ ఎక్స్ సి 60 కొత్త వెర్షన్‌ను మంగళవారం విడుదల చేసింది. రూ. 55.9 (ఎక్స్ ఫోరూం. ఆల్ ఇండియా) లక్షలకు దీన్ని అందుబాటులోకి తెచ్చింది. అత్యాధునిక భద్రతా లక్షణాలతో, ముఖ్యంగా పాదచారులను, సైక్లిస్టలను గుర్తించగలిగే టెక్సాలజీతో లాంచ్ చేసింది. స్టీర్ అసిస్ట్, ఎయిర్ సస్పెన్షన్, ఫోర్ జోన్ క్లైమేట్ కంట్రోల్, ఫ్రంట్, సీట్ వెంటిలేషన్ తదితర ఇతర ముఖ్య ఫీచర్లుగా ఉన్నాయి. తమ లగ్జరీ మోడరన్ స్కాండినేవియన్ డిజైన్ కారు వినియోగదారులను ఆకట్టుకుంటుందనే విశ్వాసాన్ని వోల్వో ఆటో ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ చార్లెస్ ఫ్రంప్ వ్యకర్తం చేశారు. ఎక్స్ సి 60 కి ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా అమ్ముడుపోయే మోడల్ మాత్రమే కాదు, భారతదేశంలో కూడా మంచి ఆదరణ పొందిందన్నారు. అలాగే ఈ ఏడాది 2వేల యూనిట్లు విక్రయించాలని కంపెనీ భావిస్తోంది. గత ఏడాదితో పోలిస్తే 25 శాతం వృద్ధిని సాధించిన కంపెనీ అమ్మకాలలో మూడింట రెండు వంతులను ఇండియాలోనే సాధిస్తోంది. దేశవ్యాప్తంగా 19 డీలర్ షిప్లనును కలిగి ఉంది. దీనితోపాటు రాబోయే రెండేళ్లలో వీటిని రెండింతలు చేయాలని వోల్వో యోచిస్తోంది. -
స్కోడా ‘ఆక్టావియా’లో కొత్త వెర్షన్
ప్రారంభ ధర రూ.15.49 లక్షలు న్యూఢిల్లీ: ప్రముఖ వాహన తయారీ కంపెనీ ‘స్కోడా’ తాజాగా తన బెస్ట్–సెల్లింగ్ సెడాన్ కారు ‘ఆక్టావియా ఫేస్‌లిఫ్ట్’లో కొత్త వెర్షన్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. దేశవ్యాప్తంగా దీని ప్రారంభ ధర (ఎక్స్ షోరూమ్) రూ.15.49 లక్షలు. ఈ కారు పెట్రోల్, డీజిల్ ఇంజిన్ ఆప్షన్లలో కస్టమర్లకు అందుబాటులో ఉంటుంది. పెట్రోల్ ఆప్షన్లో నాలుగు రకాల వేరియంట్లున్నాయి. ఇవి 1.4 లీటర్, 1.8 లీట ర్ రెండు రకాల ఇంజిన్ ఆప్షన్లతో మార్కెట్లోకి వస్తున్నాయి. వీటి ధరలు రూ.15.49 లక్షలు– 20.89 లక్షల శ్రేణిలో ఉన్నాయి. ఇక 2 లీటర్ డీజిల్ ఇంజిన్ ఆప్షన్లో కూడా నాలుగు రకాల వేరియంట్లున్నాయి. వీటి ధర 16.90 లక్షలు– రూ.22.89 లక్షల శ్రేణిలో ఉంది. కొత్త ఆక్టావియాలో హ్యాండ్స్–ఫ్రీ పార్కింగ్, ఎనిమిది సేఫ్టీ ఎయిర్‌బ్యాగ్స్ తదితర ప్రత్యేకతలున్నాయని కంపెనీ పేర్కొంది. -
విండోస్‌పై డిస్కౌంట్ ఇవ్వండి
మైక్రోసాఫ్ట్‌ను కోరిన కేంద్రం న్యూఢిల్లీ: భారత్‌లోని యూజర్ల కోసం విండోస్ ఆపరేటింగ్ సిస్టం (ఓఎస్) లేటెస్ట్ వెర్షన్‌ను కొంత డిస్కౌంటు ధరకు అందించాలని సాఫ్ట్వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ను కేంద్రం కోరింది. మాల్వేర్, రాన్సమ్వేర్ దాడులు పెరుగుతున్న నేపథ్యంలో యూజర్లు కొత్త వెర్షన్‌కు అప్‌గ్రేడ్ అయ్యేందుకు దీనివల్ల కాస్త వెసులుబాటు లభిస్తుందని పేర్కొంది. ‘భారత్‌లోని యూజర్లు పాత ఓఎస్ నుంచి లేటెస్ట్ ఓఎస్ (విండోస్ 10)కి అప్‌గ్రేడ్ అయ్యే వెసులుబాటు కల్పిస్తూ.. వన్ టైమ్ ప్రత్యేక డిస్కౌంటు రేటుపై ఓఎస్‌ను అందించాలని మైక్రోసాఫ్ట్‌ను కోరాం‘ అని నేషనల్ సైబర్ సెక్యూరిటీ అడ్వైజర్ గుల్షన్ రాయ్ తెలిపారు. దీనికి మైక్రోసాఫ్ట్ కూడా సుముఖంగానే ఉందని, సూత్రప్రాయంగా ఈ ప్రతిపాదనకు అంగీకరించిందని ఆయన వివరించారు. డిస్కౌంటు ఎంత ఉండాలనే దానిపై ఇంకా కసరత్తు జరుగుతూనే ఉండగా.. కనీసం రూ. 1,000 లేదా అంతకన్నా కొంత తక్కువగానైనా ఉండాలని కేంద్రం భావిస్తోంది. ప్రస్తుతం విండోస్ 10 హోమ్ ఓఎస్ ధర రూ. 8,000గాను, ప్రొఫెషనల్ వెర్షన్ రేటు రూ. 13,000గాను ఉంది. దేశీయంగా లక్షల కొద్దీ కంప్యూటర్స్ విండోస్ ఓఎస్‌పై పనిచేస్తున్నప్పటికీ.. విండోస్ 10కి అప్‌గ్రేడ్ అయిన వాటి సంఖ్య తక్కువే. -
ఫోక్స్‌వాగన్ పోలో కొత్త వెర్షన్ రివీల్
ఫ్రాంక్ఫర్ట్ : ఫోక్స్ వాగన్ తన పోలో సబ్ కాంపాక్ట్ కొత్త వెర్షన్ ను ఆవిష్కరించింది. జర్మన్ లోని తన ప్రధాన కార్యాలయం వోల్ఫ్స్ బర్గ్ లో దీన్ని రివీల్ చేసింది. 1975లో తొలిసారి ఈ కారును ఆవిష్కరించారు. ఈ కారును మార్కెట్లోకి తీసుకొచ్చినప్పటి నుంచి 1.4కోట్ల యూనిట్లు అమ్ముడుపోయాయి. ఈ కొత్త పోలో, ముందస్తు మోడల్ కంటే పెద్దదిగా ఉంది. కానీ రూఫ్ లైన్ మాత్రం ప్రస్తుతమున్న దానికంటే తక్కువగా ఉంది. సన్నటి గ్రిల్, పొడవైన ట్విన్-బ్యారెల్ హెడ్ ల్యాంప్స్ ను ఇది కలిగి ఉంది. డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్, కొత్త సేఫ్టీ ఫీచర్లను ఈ మోడల్ లో ఆఫర్ చేస్తున్నారు.కొత్త సేఫ్టీ ఫీచర్లతో వెనుకవైపు నుంచి జరిగే ప్రమాదాలను 45 శాతం తగ్గించవచ్చని కంపెనీ పేర్కొంది. రియర్ ట్రాఫిక్ అలర్ట్ ను ఇది కలిగి ఉంది. దీని ద్వారా కారును పార్క్ చేసేటప్పుడు వెనుక వైపున్న ట్రాఫిక్ ను తేలికగా గుర్తించవచ్చు. ఐదు డోర్ల హ్యాచ్ బ్యాక్ రూపంలో ఇది వస్తోంది. ఆరు గ్యాస్ ఓలైన్ ఇంజిన ఆప్షన్లు దీనిలో అందుబాటులో ఉన్నాయి. ఒకటి సహజవాయువుకి సంబంధించినది కాగ, మిగతా రెండు డీజిల్, మూడు పెట్రోల్ ఆప్షన్లు. హ్యుందాయ్ వారి క్రెటా ఎస్‌యువికి ఇది ప్రత్యక్ష పోటీగా నిలవనున్నట్టు తెలుస్తోంది.. ఈ ఏడాది చివరి నుంచి యూరోపియన్ మార్కెట్లోకి అందుబాటులోకి రానున్న ఈ కారు బేస్ ధర జర్మనీలో 12,975 యూరోలు అంటే రూ.9,35,057 వరకు ఉండొచ్చని అంచనా. అయితే ఈ వాహనం అమెరికా మార్కెట్ కు అందుబాటులోకి రావడం లేదు. -
స్కోడా కొత్త రాపిడ్-8.34 లక్షలు
ముంబై: ఫోక్స్‌వ్యాగన్ గ్రూప్‌కు చెందిన ‘స్కోడా ఆటో’ తాజాగా తన ప్రముఖ సెడాన్ ‘రాపిడ్’లో కొత్త వెర్షన్ మార్కెట్లోకి తీసుకొచ్చింది. దీని ధర రూ.8.34-రూ.12.78 లక్షల శ్రేణిలో (ఎక్స్‌షోరూమ్ ఢిల్లీ) ఉంది. ఈ కొత్త వెర్షన్ ఆటోమేటిక్, మాన్యువల్ ట్రాన్సమిషన్ రకాల్లో 1.6 లీటర్ పెట్రోల్, 1.5 లీటర్ డీజిల్ వేరియంట్లలో వినియోగదారులకు అందుబాటులో ఉంటుందని కంపెనీ పేర్కొంది. ఈ ఏడాది రాపిడ్ వాహన విక్రయాల్లో 30-40 శాతం వృద్ధిని అంచనా వేస్తున్నట్లు స్కోడా ఇండియా చైర్మన్ సుధీర్ రావు తెలిపారు. రాపిడ్ అమ్మకాలు గతేడాది 11,000 యూనిట్లు కాగా... ఈ ఏడాది 15,000 యూనిట్లుగా, వచ్చే ఏడాది 20,000 యూనిట్లుగా లక్ష్యం నిర్దేశించుకున్నట్లు చెప్పారాయన. వచ్చే ఏడాది కొత్తగా ఐదు ఔట్లెట్లను ఏర్పాటు చేస్తామని, దీంతో మొత్తం ఔట్లెట్ల సంఖ్య 70కి చేరుతుందని చెప్పారు. -
పాతాళ భైరవి న్యూ వెర్షన్
రాజకుమారిని చూడగానే ప్రేమలో పడ్డాడు తోటరాముడు. ‘కలవరమాయే’ అని పాటెత్తుకున్నాడు. చెవుల్లో ఇయర్‌ఫోన్స్ ఉండడం వల్ల ఆమెకి పాట వినపడలేదు. లాభం లేదని కోట గోడ ఎక్కడానికి తాడు వేసాడు. భటులు తాడుతో సహా రాముణ్ణి పైకి లాగి రాజుగారి ముందు పెట్టారు. ‘‘చుట్టూ సీసీ కెమెరాలు ఉన్నాయని తెలిసి కోటలోకి ప్రవేశించాలని ఎందుకనుకున్నావ్?’’ అడిగారు మహారాజు. ‘‘నిజం చెప్పమంటారా? అబద్ధం చెప్పమంటారా మహారాజా?’’ అన్నాడు తోటరాముడు. ‘‘నిజాన్ని అబద్ధం గానూ, అబద్ధాన్ని నిజంగానూ చూడగలిగితేనే నేను రాజుగా అర్హుణ్ణి. నేను లాగులు వేసుకునే కాలం నాటి డైలాగులు చెప్పకుండా, కొత్తవి ఉంటే చెప్పు’’. ‘‘రాకుమారిపై ప్యార్, ఇష్క్, కాదల్’’. ‘‘ఓస్ అంతేనా! నేనింకా నన్ను కిడ్నాప్ చేయడానికి వచ్చావనుకున్నా. మా అమ్మాయి సంగతి నీకింకా సరిగా తెలిసినట్టు లేదు. ఒకరోజు షాపింగ్‌కి తీసుకెళ్లిందంటే తోట మొత్తం అమ్మేసుకుని, తోటరాముడివి కాస్తా బికారి రాముడిగా మారిపోతావు. పూలమ్మిన చోట అనవసరంగా కట్టెలెందుకు అమ్ముతావు చెప్పు?’’ ‘‘ప్రేమ మహారాజా’’. ‘‘ప్రేమ దోమలాంటిది. ఆల్ అవుట్ వాడినా కుట్టడం మానదు. ఆ తరువాత జీవితం డెంగ్యూ జ్వరం లాంటిది. ట్రీట్మెంట్ కష్టం. వెళ్లి డబ్బులు సంపాదించుకురా. డబ్బుంటే తోటరాముణ్ణి శ్రీరాముడంటుంది లోకం’’. ‘‘నిజమైన ప్రేమ డబ్బుని కోరదు మహారాజా’’. ‘చూడు బాబూ. రాని మెట్రో రైలుని నమ్ముకోవడం కంటే ఉన్న సిటీ బస్సులో ప్రయాణించడం మంచిది. వెళ్లి ఎవరైనా పూలమ్మిని పెళ్లి చేసుకుని, తలా నాలుగు మూరలు పూలమ్ముకుని జీవించండి’’. తోటరాముడు రోషంగా వీధిలోకి వచ్చాడు. మాంత్రికుడు కనిపించి ‘సాహసం స్సేయరా డింబకా’’ అన్నాడు. ‘‘పదండి స్వామి. పాతాళభైరవి గుహకు’’ అన్నాడు రాముడు. ‘‘నాకు అర్థరైటిస్ రా. అందుకని సర్వీస్ ఆటోలో పోదాం’’. ‘‘మళ్లీ ఇంకో కొత్త బకరానా’’ అన్నాడు ఆటోవాడు. ‘‘రోజూ ఒకణ్ణి తీసుకెళుతున్నావా స్వామీ’’ ఆశ్చర్యంగా అడిగాడు రాముడు. ‘‘రోజూ ఒకణ్ణి తీసుకొస్తాడు. వచ్చేటప్పుడు వాడు కనపడడు. ఈయనొక్కడే గడ్డం గోక్కుంటూ వస్తాడు’’. ‘‘నేనేం చేసేది రా. కొలనులో స్నానం చేసి రమ్మంటే, ప్రతివాడూ మొసలితో సెల్ఫీ తీసుకోడానికి ప్రయత్నిస్తున్నాడు. శాప విమోచనం సంగతి మరిచిపోయి, అది తిని పడేస్తూ ఉంది’’ చెప్పాడు మాంత్రికుడు. ‘‘మీ గడ్డంలో మంత్రశక్తులున్నాయా?’’ అడిగాడు తోటరాముడు. ‘‘పేలున్నాయి. అందుకే ఎప్పుడూ గోక్కుంటూ ఉంటాడు’’ చెప్పాడు ఆటోవాడు. మాంత్రికుడు, రాముడు ఇద్దరూ కలిసి పాతాళభైరవి గుహలోకి వెళ్లారు. ‘‘స్నానం గీనం వద్దు స్వామి. ఆ నీళ్లకు గజ్జి తామర వస్తాయి. మళ్లీ జాలిమ్ లోషన్ కొనాలి. సాష్టాంగ నమస్కారం ఎలా చేయాలో చూపించండి చాలు’’ ‘‘తెలివైనవాడివే’’ అని మాంత్రికుడు నవ్వుకుని తన సెల్ఫోన్లో జాందేవ్ బాబా ఆసనాల్ని యూట్యూబ్‌లో ఓపెన్ చేసి సాష్టాంగం విజువల్స్ చూపించాడు. ‘‘నమ్మి నమస్కరించినవాడి గొంతు కోయడం కొత్తేమీ కాదు కానీ, ఇద్దరం ద్వైపాక్షిక ఒప్పందానికొద్దాం. నా ఫోన్లో ఆల్రెడీ నా తల నరికే గ్రాఫిక్ షాట్స్ తెచ్చాను. అది అమ్మవారికి చూపిద్దాం. ఓల్డ్ లేడీ నమ్మేస్తుంది’’ అన్నాడు రాముడు. గ్రాఫిక్స్ షాట్స్ చూసి సంతోషించి అమ్మవారు పాతాళభైరవి విగ్రహాన్నిచ్చింది. ‘‘రాజకీయాల్లో పదవులు పంచుకోడానికి ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు మనం కూడా ఒక అగ్రిమెంట్‌కి వద్దాం. ఈ విగ్రహంతో నేను మిద్దెలు, మేడలు సృష్టించి రాజుగారికి చూపించి రాకుమారిని పెళ్లి చేసుకుంటాను. రాజ్యమే నాది అయినప్పుడు ఈ తుప్పు పట్టిన విగ్రహం నాకెందుకు? నీకిచ్చేస్తా. నీ చావు నువ్వు చావు’’ అన్నాడు రాముడు. మాంత్రికుడు సరేనన్నాడు. విగ్రహం సాయంతో భవంతులు సృష్టించి రాజావారిని రమ్మన్నాడు. వచ్చారు. ‘‘చూడండి మహారాజా.. మణిమయ, రత్న వజ్ర వైఢూర్య సహిత భవంతులు’’అన్నాడు తోటరాముడు. ‘‘ప్రేమ పిచ్చెక్కి, నీకు చత్వారమొచ్చింది రాముడూ. గుడిసెను చూపించి భవంతులంటున్నావే’’. రాముడు కళ్లు నులుముకుని ‘‘నాకు కనిపిస్తున్నాయి కదా’’ అన్నాడు. ‘‘నాకు కనబడలేదు’’. విగ్రహాన్ని రుద్ది పాతాళభైరవిని రప్పించాడు రాముడు. ‘‘నాకు కనిపించే భవంతులు ఈయనకెందుకు కనిపించడం లేదు’’ అని అడిగాడు. ‘‘గ్రాఫిక్స్ నాయనా. నువ్వు నాకు గ్రాఫిక్స్ చూపిస్తే, నేను నీకు అదే గ్రాఫిక్స్ చూపించాను. కంప్యూటర్ పుట్టకముందే మాకు గ్రాఫిక్స్ తెలుసు. గుర్తుంచుకో’’ అంది పాతాళభైరవి. ‘టప్’ అని నాటకాల్లో పళ్లెం కొట్టిన సౌండొచ్చింది. - జి.ఆర్.మహర్షి -
ఆడి ‘ఏ4’లో కొత్త వెర్షన్..
న్యూఢిల్లీ: జర్మనీ లగ్జరీ కార్ల తయారీ కంపెనీ ‘ఆడి’ తాజాగా తన ప్రముఖ సెడాన్ ‘ఏ4’లో కొత్త వెర్షన్ (బి9)ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. దీని ధర రూ.38.1 లక్షల నుంచి రూ.41.2 లక్షల శ్రేణిలో (ఎక్స్‌షోరూమ్ ఢిల్లీ) ఉంది. వచ్చే పండుగ సీజన్ దృష్టిలో ఉంచుకొని కంపెనీ ఈ వెర్షన్‌ను మార్కెట్లోకి తెచ్చింది. ఇందులో 1.4 లీటర్ పెట్రోల్ ఇంజిన్, 7 స్పీడ్ ట్రాన్స్మిషన్ వంటి ప్రత్యేకతలు ఉన్నాయని కంపెనీ పేర్కొంది. దీని గరిష్ట వేగం గంటకు 210 కిలోమీటర్లు. ఇది ప్రీమియం ప్లస్, టెక్నాలజీ అనే రెండు వేరియంట్లలో అందుబాటులో ఉండనుంది. -
రోల్స్ రాయిస్ నుంచి డాన్
ధర రూ.6.25 కోట్లు ముంబై: బ్రిటన్‌కు చెందిన సూపర్ లగ్జరీ కార్ల తయారీ కంపెనీ ‘రోల్స్ రాయిస్’ తాజాగా తన ‘కన్వర్టిబుల్ డాన్’ మోడల్లో కొత్త వెర్షన్‌ను దేశీ మార్కెట్లోకి తీసుకొచ్చింది. దీని ముంబై ఎక్స్ షోరూమ్ ధర రూ.6.25 కోట్లు. ఇందులో 6.6 లీటర్ వీ 12 ఇంజిన్, 2ఁ2 సీటర్, జెడ్ఎఫ్ 8 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ గేర్ బాక్స్ వంటి ప్రత్యేకతలున్నాయని కంపెనీ తెలిపింది. ఇది 0-100 కిలోమీటర్ల వేగాన్ని కేవలం 5 సెకన్లలో అందుకుంటుందని పేర్కొంది. కారు రూఫ్.. గంటకు 50 కిలోమీటర్లు వేగం వద్ద 20 సెకన్లలో క్లోజ్ అవుతుందని తెలిపింది. కాగా కంపెనీకి అహ్మదాబాద్, ముంబై, హైదరాబాద్, న్యూఢిల్లీ, చండీగఢ్ ప్రాంతాల్లో షోరూమ్‌లు ఉన్నాయి. -
బుల్లెట్ వేగంతో బ్లూటూత్ 5
మొబైల్ ఫోన్లు, పర్సనల్ కంప్యూటర్స్, గేమింగ్ కన్ సోల్స్ లో డేటా షేరింగ్ కు ఎక్కువగా ప్రాచుర్యం పొందిన వైర్ లెస్ టెక్నాలజీ బ్లూటూత్ లో ఓ పెద్ద అప్ డేషన్ యూజర్ల ముందుకు రాబోతోంది. అప్ డేటెడ్ బ్లూటూత్ వెర్షన్-5 ను జూన్ 16న లండన్ లో ఆవిష్కరించనున్నట్టు బ్లూటూత్ స్ఫెషల్ ఇంటరెస్ట్ గ్రూప్(ఎస్ఐజీ) ప్రకటించింది. ప్రస్తుతమున్నపరిధి కంటే రెండింతలు ఎక్కువ పరిధిలో పనిచేసేలా ఈ వెర్షన్ అప్ గ్రేడ్ చేశారు. అలాగే డేటా ట్రాన్ ఫర్ కూడా ఈ వెర్షన్ తో నాలుగురెట్లు అధికంగా ఉండబోతోంది. ఐఓటీ(ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్) డివైజ్ లన్నింటికీ కూడా ఈ వెర్షన్ సపోర్టు చేసేలా దీన్ని రూపొందించారు. స్థాన సంబంధిత సమాచారం, నావిగేషన్ వంటి కనెక్షన్ సర్వీసులకు కొత్త కార్యచరణగా ఈ వెర్షన్ ఉపయోగపడనుంది. అడ్వర్ టైజింగ్ ట్రాన్సిమిషన్ లో ఎక్కువ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. స్మార్ట్ ఫోన్లు, ఇతర డివైజ్ లు ఈ కొత్త బ్లూటూత్ స్టాండర్డ్ ను ఎప్పుడు, ఎలా ఉపయోగించుకోవాలో లండన్ లో జరగబోయే ఈవెంట్ లో వివరిస్తామని ఎస్ఐజీ తెలిపింది. ఈ వెర్షన్ కు సంబంధించిన పూర్తి సమాచారం కంపెనీ లండన్ ఈవెంట్ లోనే వెల్లడించనుంది.