
సాక్షి, న్యూఢిల్లీ: స్వీడన్‌కు చెందిన లగ్జరీ కార్ మేకర్ వోల్వో కార్స్ సరికొత్త ఎస్‌యూవీకార్‌ను లాంచ్ చేసింది. ఎస్‌యూవీ ఎక్స్ సి 60 కొత్త వెర్షన్‌ను మంగళవారం విడుదల చేసింది. రూ. 55.9 (ఎక్స్ ఫోరూం. ఆల్ ఇండియా) లక్షలకు దీన్ని అందుబాటులోకి తెచ్చింది. అత్యాధునిక భద్రతా లక్షణాలతో, ముఖ్యంగా పాదచారులను, సైక్లిస్టలను గుర్తించగలిగే టెక్సాలజీతో లాంచ్ చేసింది. స్టీర్ అసిస్ట్, ఎయిర్ సస్పెన్షన్, ఫోర్ జోన్ క్లైమేట్ కంట్రోల్, ఫ్రంట్, సీట్ వెంటిలేషన్ తదితర ఇతర ముఖ్య ఫీచర్లుగా ఉన్నాయి.
తమ లగ్జరీ మోడరన్ స్కాండినేవియన్ డిజైన్ కారు వినియోగదారులను ఆకట్టుకుంటుందనే విశ్వాసాన్ని వోల్వో ఆటో ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ చార్లెస్ ఫ్రంప్ వ్యకర్తం చేశారు. ఎక్స్ సి 60 కి ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా అమ్ముడుపోయే మోడల్ మాత్రమే కాదు, భారతదేశంలో కూడా మంచి ఆదరణ పొందిందన్నారు. అలాగే ఈ ఏడాది 2వేల యూనిట్లు విక్రయించాలని కంపెనీ భావిస్తోంది. గత ఏడాదితో పోలిస్తే 25 శాతం వృద్ధిని సాధించిన కంపెనీ అమ్మకాలలో మూడింట రెండు వంతులను ఇండియాలోనే సాధిస్తోంది. దేశవ్యాప్తంగా 19 డీలర్ షిప్‌లనును కలిగి ఉంది. దీనితోపాటు రాబోయే రెండేళ్లలో వీటిని రెండింతలు చేయాలని వోల్వో యోచిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment